Posted on

Telugu tips for black spots on face – ముఖంపై నల్లని మచ్చలు పోవాలంటే?

మీరు సహజ మార్గంలో నల్లని మచ్చలను తొలగించుకోవాలి అనుకుంటున్నారా? తెల్లని ఛాయ కలిగిన స్త్రీల అందమైన మొహంలో నల్ల మచ్చలు చాలా స్పష్టంగా ఇబ్బందికరంగా కనిపిస్తాయి. అయితే ముఖం మీద కనిపించే ఈ నల్లని మచ్చలు మీద ప్రభావంతంగా పనిచేసే ఎన్నో రకాల కాస్మొటిక్ ఉత్పత్తులు సులభంగా నేడు లభిస్తున్నాయి. కానీ చాలామంది మార్కెట్ లో లభించే ఈ క్రీములని అధిక మొత్తంలో ఉపయోంచడం వలన చర్మ సమస్యలు ఏర్పడి ఎంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి మీరు కొన్ని గృహ నివారణలు పాటించడం వలన ఎంతో సులభంగా ముఖం మీద నల్లని మచ్చలను తొలగించడానికి చికిత్స చేయవచ్చు. చర్మపు పొరల మీదగా నల్ల మచ్చల వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. కొంతమంది చర్మములో అదనపు మెలానిన్ స్రావాలను కలిగి ఉండటం వలన, మరి కొందరు సూర్య రశ్మిలో ఎక్కువసేపు గడపడం వలన చర్మం ప్రభావితం కాబడినప్పుడు ఇదే సమస్యని పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ ముఖం మీద నల్లని మచ్చలను తొలగించడానికి గొప్ప సహజమైన చిట్కాలను అందిస్తున్నాం. గర్భం దాల్చిన స్త్రీలు అలాగే కొన్ని ప్రత్యేకమైన మందులు వాడుతున్న ప్రజలు కూడా చర్మం మీదగా నల్లని మచ్చలు ఏర్పడి ఇబ్బంది పడుతూ ఉంటారు.

ముఖం మీద నల్లని మచ్చల చికిత్సకు అద్భుతమైన గృహ చిట్కాలు

నిమ్మకాయ మరియు తేనెలతో ఫేస్ ప్యాక్

సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయ పుష్కలమైన విటమిన్ సి మూలకాలను కలిగి తేనెతో అది కలిసినప్పుడు ముఖ చర్మం మీద మొటిమలు, మచ్చలు, కురుపులు వంటి అన్ని రకాల సమస్యలకు అద్భుతమైన నివారిణిగా పనిచేస్తుంది. దీనికోసం మీరు కొన్ని తాజా నిమ్మ చెక్కలను గ్రైండ్ చేసి దానికి ఒక చెంచా తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి రాసుకోండి. దానిని కాసేపు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో కడిగేసుకోండి. ఈ చిట్కాని రోజు తప్పించి రోజు అనుసరించండి.

వేప ఫేస్ ప్యాక్

పురాతన ఆయుర్వేదం వేప యొక్క చర్మ సంరక్షిత అద్భుత లక్షణాలను విశదీకరిస్తుంది. వేప ఆకులు ముఖం మీద మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను అధిగమించడానికి ఎంతో గొప్ప ఉపకరణాలు అని చెప్పవచ్చు. దీనికోసం చేతి నిండా తాజా వేప ఆకులని తీసుకుని దానికి చూర్ణం ఏర్పడడానికి సరిపడా రోజ్ వాటర్ కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి ఒక 15 నిముషాలపాటు ఆరనివ్వాలి. ప్యాక్ పూర్తిగా ఎండిన తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోండి.

కలబంద మరియు మజ్జిగ ఫేస్ ప్యాక్

కలబంద అద్భుతమైన శోథ నిరోధక మరియు క్రిమినాశక మూలికగా పేరుగాంచింది. మజ్జిక చర్మానికి సంభందించిన ఎన్నో లాభాలను తీసుకువస్తుంది. దీనికి మీకు కావాల్సింది ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ , కొన్ని చుక్కల రోజ్ వాటర్, మరియు కలబంద గుజ్జులను కలిపి ఒక చూర్ణంగా తయారు చేసుకోండి. ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకుని దానిని పూర్తిగా రానివ్వండి. తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకోండి.

వేప మరియు పసుపుల ఫేస్ ప్యాక్

పసుపు పొడి మరియు వేప ల మిశ్రమంతో ముఖం మీద మచ్చలు, మొటిమలు వంటి సమస్యలకు మరొక అందమైన నివారిణి అని చెప్పవచ్చు. చేతి నిండా సరిపడే వేప ఆకులను గ్రైండ్ చేసిన తర్వాత దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ లేదా బదులుగా కలబంద గుజ్జుని మరియు ఒక టీ స్పూన్ పసుపు పొడిని కలిపి ఆ ప్యాక్ ని మీ ముఖానికి రాసుకోండి.పూర్తిగా ఆరనిచ్చిన తర్వాత నీళ్లతో శుభ్రపరుచుకోండి. ఈ చిట్కాని వారంలో 2/3 సార్లు అప్లై చేయండి.

కీర దోసకాయ మరియు రోజ్ వాటర్ ప్యాక్

కొన్ని దోస ముక్కలని గ్రైండ్ చేయండి మరియు చూర్ణం కోసం దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ ని కలపండి. ఆ చూర్ణాన్ని ముఖమంతా రాసుకోండి. దానిని బాగా ఆరనివ్వండి. బాగా ఎండిన తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోండి. మీరు ప్రతీ రోజు ఈ చిట్కాని అనుసరించినట్లయితే మీ ముఖంలో కనిపించే చూడముచ్చట మార్పులకు ఎంతగానో సంతోషపడతారు.

మొటిమల మచ్చలకు బొప్పాయి చికిత్స

తొక్క తీసిన బొప్పాయిని తీసుకోండి. దానిని ముక్కలుగా కోయండి. అప్పుడు బొప్పాయిని ఒక చూర్ణం లాగ చేయండి. ఆ చూర్ణాన్ని మీ ముఖానికి రాసుకుని 10-15 నిముషాలపాటు ఆరనివ్వండి. తర్వాత నీళ్లతో కడిగేసుకోండి. బొప్పాయి పాపెయిన్ అనే ఎంజైమ్ ను కలిగి ఉంటుంది. ఇది ముఖం మీద నల్లని మచ్చలను సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది.

నిమ్మ రసం

నిమ్మరసం తీసుకుని నల్లని మచ్చల మీద అప్లై చేయండి. నిమ్మరసం లో ఉండే విటమిన్ సి నల్లని మచ్చలను రంగు మార్చి చర్మం మీద మలినాలను తొలగిస్తుంది. ఒక కాటన్ బంతిని నిమ్మరసంలో ముంచి దానిని నల్ల మచ్చలు కలిగిన ప్రదేశంలో మృదువుగా రుద్దండి. ఒకవేళ మీరు సున్నితమైన చర్మ స్వభావులు అయితే నిమ్మరసానికి కొన్ని నీళ్లు జోడించి ఫలితాలను పొందేవరకు ఉపయోగించండి.

నల్లని మచ్చల నుండి ఉపశమనానికి గంధపు ఫేస్ ప్యాక్

ఒక గంధపు చెక్కను తీసుకుని దాన్ని చూర్ణంగాచేసి మీ ముఖానికి రాయండి. గంధం కూడా ముఖం మీద నల్లని మచ్చలను మరియు మొటిమలను నివారించే లక్షణాలను కలిగి ఉంది.

మొటిమలు మరియు మచ్చలకు కలబంద

కలబంద గుజ్జు నల్లని మచ్చలను తగ్గించే అతి ముఖ్యమైన వాటిలో కలబంద గుజ్జు ప్రధానమైనది. కలబంద గుజ్జుని తీసుకుని నల్ల మచ్చల మీద పూయండి. 20 నిముషాల తర్వాత నీళ్లతో కడిగేసుకోండి.

విటమిన్ ఇ

నల్లని మచ్చలు మరియు మొటిమల మచ్చలు విటమిన్ల లోపం వలన ఏర్పడతాయి. ప్రధాన ప్రత్యక్ష నివారణగా విటమిన్ ఇ మాత్రలను తీసుకోండి. ఆల్మండ్ ఆయిల్ వంటి విటమిన్ ఇ ఆయిల్స్ మొదలైన వాటిని అప్లై చేయండి. అలాగే మీ ఆహారంలో విటమిన్ ఇ ఉండేలా చూసుకోండి.

నల్లని మచ్చల చికిత్సకు పాలు

ఒక కప్పులో పాలను తీసుకోండి. ఒక కాటన్ బాల్ తీసుకుంది అందులో ముంచండి. అప్పుడు కాటన్ బాల్ ను నల్లని మచ్చల ప్రాంతంలో వృత్తాకారంగా రుద్దండి. ప్రతీ రోజు ప్రతీ రోజు 5 నిముషాలపాటు అనుకున్న ఫలితాన్ని పొందేవరకు ఇలా చేయండి. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ ముఖ భాగంలో చర్మ పొరల్ని శుభ్రం చేసి నల్లని మచ్చలేని మీరు చర్మపు రంగులోకి మారుస్తుంది.

ముఖంపై నల్ల మచ్చలు కొరకు బంగాళాదుంపలు

మీరు సహజ మార్గంలో నల్ల మచ్చలు తొలగించుకోవాలని ఆశిస్తున్నట్లయితే అప్పుడు ఒక బంగాళా దుంపని తీసుకుని చక్రాల వలె కోయండి. ఆ చక్రాలను రిఫ్రిజిరేటర్ లో 2-3 గంటల పాటు ఉంచండి. తర్వాత ఈ చక్రాలను తీసుకుని నల్ల మచ్చలమీద రుద్దండి. 5 నిముషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. మరొక మార్గంలో బంగాళా దుంపని చూర్ణం లా చేసి దానికి తేనె కలిపి ఈ చూర్ణాన్ని ఫేస్ మాస్కులాగా అప్లై చేసుకోండి.

ముఖం మీద నల్ల మచ్చల చికిత్సకు ఆముదం

ఒక కప్పులో తాజా ఆముదం నూనెను తీసుకోండి. ఒక కాటన్ బాల్ తీసుకుని అందులో ముంచండి. అప్పుడు కాటన్ బాల్ ను నల్లని మచ్చల ప్రాంతంలో వృత్తాకారంగా రుద్దండి. ఆముదంలో ఉండే ఆమ్లజనక, శోథ నిరోధక లక్షణాలు ముఖ భాగంలో నల్ల మచ్చల్ని తొలగిస్తాయి.

ముఖంలో నల్లని చర్మ భాగాల కొరకు ఉల్లి రసం

మీరు నల్లని మచ్చల నుండి ఉపశమనం పొందాలని చూస్తున్నారా? అయితే ఉల్లిపాయల్ని తీసుకుని బాగా గ్రైండ్ చేయండి. ఆ మిశ్రమాన్ని తీసుకుని ఒక కాటన్ గుడ్డలో వేసి ఒక కప్పులోకి దాని రసాన్ని పిండండి. ఇప్పుడు ఒక కాటన్ బాల్ ను ఆ రసంలో ముంచి నేరుగా నల్లని మచ్చల మీద రాయండి. 5 నిముషాలపాటు వదిలేసి గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోండి.

పైన పేర్కొన్న నివారణోపాయాలు మీరు సహజ పద్దతిలో గృహ చిట్కాలుగా మీ ముఖం మీద నల్లని మచ్చల నివారణకు సహాయపడతాయి. ఒకవేళ మీరు 100% సంపూర్ణ ఫలితాలు పొందలేనట్లయితే 100% ఫలితాలను పొందేందుకు దగ్గరలోని డెర్మటాలజిస్ట్ ను సంప్రదించగలరు.