Protein rich foods in Telugu – ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు

0
1057

మన శరీరంయొక్క అభివృద్ధికి ప్రోటీన్స్ స్థూల పోషక పదార్థం. ఎక్కువ ప్రోటీన్స్ శరీరానికి బలాన్ని ఇస్తుంది. ప్రోటీన్ లోపిస్తే కండరాలు క్షీణిస్తాయి. ప్రోటీన్స్ మొత్తం 20 అమైనో ఆమ్లాల(అమైనో ఆసిడ్స్) సేకరణను కలిగి ఉంటుంది. ఇందులోని 8 ముఖ్యమైన (ఎస్సెంషియల్) అమైనో ఆసిడ్స్ ను మనం రోజూ తినే ఆహారం ద్వారా శరీరానికి లభిస్తుంది. మిగిలిన 12 నాన్- ఎస్సెంషియల్ ఆసిడ్స్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. గుడ్లు మరియు మాంసాహారం లాంటి ఆహారాలలో కండరాల నిర్మాణంకు కావలసిన అమైనో ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

కొన్ని ఆహారాలలోని అమైనో ఆసిడ్స్ తొందరగా జీర్ణం అవుతాయి మరికొన్ని నిదానంగా జీర్ణించుకొని శరీరంలో శోషించబడతాయి. ఉదాహరణకు గుడ్లు, ఇది ప్రోటీన్ ఆహారాలలో రాజువంటిది. ఇందులో అన్ని (20) అమైనో ఆసిడ్స్ లు ఉన్నాయి, ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. మరోపక్క పాలు, ఇందులో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇందులోని ప్రోటీన్స్ కొన్ని వేగంగా మరి కొన్ని నిదానంగా అమైనో ఆసిడ్స్ ను విడుదల చేస్తాయి. పాల్లలో ప్రోటీన్స్ మాత్రమే కాదు ఎముకలకు బలాన్ని పెంచే కాల్షియము కూడా ఉంటుంది.

శరీరంయొక్క ప్రతి పనికి ప్రోటీన్స్ చాలా అవసరం. పెద్దలు కానీ పిల్లలు కానీ ప్రోటీన్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండలేరు. ఎన్నో రకాల ఆహారాలలో ప్రోటీన్స్ ఉన్నాయి. వాటిలో మీకు నచ్చినవి ఎంపిక చేసుకొని రోజూ తీసుకోండి.

శాకాహారులకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు

ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలలో కొన్ని పాల్లు, పెరుగు, జున్ను(చీస్), గింజలు (బీన్స్) , కాయధాన్యాలు (లెంటిల్స్) మరియు విత్తనాలు. మరికొన్ని తక్కువ కొవ్వు ఉన్న పదార్థాలు కాటేజ్ చీజ్, గ్రీక్ చీజ్, తెల్లటి పుట్టగొడుగులు, వెన్నతీసిన పాలు ( స్కిమ్డ్ మిల్క్) మరియు నాటో (పులియబెట్టిన సోయాబీన్స్). పాల్ల ఉత్పత్తులే కాకుండా పళ్ళలో మరియు గింజలలో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.

ధాన్యాలు

ధాన్యాలు ప్రధానమైన పోషక ఆహార పదార్థం. ఇది శరీరానికి కావలసిన కేలరీలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు మరియు ప్రొటీన్లను అందిస్తుంది. ఇతర ధాన్యాలకన్నా బఠానీలు, రాజ్మా మరియు పెసర పప్పులు లాంటి తృణధాన్యాలలో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. రిఫైన్డ్ (సుద్దిచేసిన గింజలు) గింజలను పాస్తాలు, పాన్ కేక్లు, స్మూతీస్ మరియు బ్రెడ్లు చేసేటప్పుడు వాడవచ్చు. గోధుమ బీజ, వండిన ఓట్స్ తవుడు, బియ్యం తవుడు మరియు ఓట్స్ లో కూడా ప్రోటీన్స్ ఎక్కువుగా ఉంటుంది.

కూరగాయలు

కూరగాయలు ఉత్తమ ప్రోటీన్ ఆహారాలు. మొలకెత్తిన బీన్స్, బటానీలు మరియు కాయధాన్యాలు (లెంటిల్స్) ప్రోటీన్లకు మూల పదార్థాలు. మరికొన్ని-వండిన లిమా బీన్స్, ఆకుపచ్చ బటానీలు, మొక్కజొన్న, బ్రొక్కొలి మరియు పుట్టగొడుగులు.

పండ్లు

ప్రోటీన్ పదార్థాలలో మరో ముఖ్యమైన ఆహారం తాజా పండ్లు. కూరగాయలతో పోల్చుకుంటే పండ్లలో తక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. రైసిన్లు, అక్రోట్లు, జీడిపప్పులు లాంటి ఎండిన పండ్లలో(డ్రై ఫ్రూట్‌స్) ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. జల్దారు, జామ పండ్లు, బొంత పళ్ళు(మల్బెర్రీస్) , బ్లాక్బెర్రీస్, స్టార్ ఫ్రూట్‌, కుంక్వాట్స్, పీచ్ పండు, దానిమ్మ పండ్లు మరియు ద్రాక్ష పండ్లలో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.

గింజలు

బాదాం, పిస్తా పప్పులు, అక్రోట్, జీడిపప్పులు మరియు బఠానీలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు ఇందులో సోడియం మరియు పొటాషియం కూడా ఉన్నందున వీటిని తిన్న వెంటనే మనకు కావలసిన బలాన్ని తక్షణమే ఇస్తుంది మరియు చెమట వలన శరీరం నుండి తొలగిపోయిన ఎలెక్ట్రోలైట్స్ ను సరఫరా చేస్తుంది. చాలా గింజలలో విటమిన్ ఇ, మాంగనీస్, మెగ్నీషియం మరియు ఇతర ముఖ్యమైన పోషక పదార్థాలు ఉన్నాయి.

ఓట్స్

ఓట్స్ అన్నింటికంటే ఆరోగ్యవంతమైన ధాన్యాలు. ఇందులో అనేక పౌష్టిక పదార్థాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం మరియు విటమిన్ B1 ఎక్కువగా ఉంటాయి. వీటిని తెల్లవారు జామున అల్పాహారంగా భుజించడం మంచిది.

కాటేజ్ చీజ్

ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటమే కాకుండా తక్కువ కొవ్వు మరియు తక్కువ కేలరీలు ఉన్నందున చాలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. కాల్షియం, ఫాస్ఫరస్(భాస్వరం), సెలీనియం మరియు విటమిన్ బి12 ఇందులోని ఇతర పోషక పదార్థాలు.

బ్రొక్కొలి

ఇతర కూరగాయలకన్నా ఇందులో ఎక్కువ ప్రోటీన్లు తక్కువ కేలరీలు ఉన్నాయి. అంతే కాదు ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ మరియు పొటాషియం కూడా ఎక్కువగా ఉన్నాయి.

క్వినోవ

సమీప కాలంలో చాలా ప్రముఖమైన ఒక ఆహార పదార్థం క్వినోవ విత్తనాలు. వీటిలో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఇందులో యాంటి-ఆక్సిడెంట్ ఉన్నందున ఆరోగ్యానికి చాల మంచిది.

గ్రీక్ పెరుగు

ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. ఇందులో చాలా పోషక పదార్థాలు ఉన్నాయి. ఇది మిఠాయి దుకాణాలలో కూడా దొరుకుతుంది. దీనిని విడిగానే తినవచ్చు, చాలా రుచిగా ఉంటుంది.

యెహెజ్కేల్ బ్రెడ్

ఇది మొలకెత్తిన తృణధాన్యాలతో తయారు చేయబడినది. వీటిని సోయాబీన్స్, బార్లీ, చిరు ధాన్యాలు మరియు గోధుమతో కూడా తయారు చేస్తారు. ఈ బ్రెడ్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది.

గుమ్మడికాయ గింజలు

మనం రోజూ వంటలో గుమ్మడికాయను ఉపయోగిస్తూ ఉంటాము. కానీ వీటి గింజలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని మనకు తెలియదు. ఇందులో ప్రోటీన్స్ మాత్రమే కాదు, జింక్, ఐరన్ మరియు మెగ్నీషియం లాంటి పోషక పదార్థాలు కూడా ఉన్నాయి.

మాంసాహారుల కోసం ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు

మాంసం మరియు చేపలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. తూర చేప(ట్యూనా), సాల్మోనాండ్ హాలిబుట్ చేప, స్నాపర్, పెర్చ్ లాంటి చేపలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది. మాంసంలో కోడిమాంసం, ఆవు మాంసం మరియు పంది మాంసాలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది.

కోడిమాంసం లోని రొమ్ములు

ఇందులో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని రుచికరమైన ఆహారంగా వండుట చాలా సులభం.

చిన్నరొయ్యలు

ఇందులో ఎక్కువ ప్రోటీన్స్ మరియు తక్కువ కేలరీలు ఉన్నందున చాలా ఆరోగ్యకరమైన ఆహారం.