Posted on

Sleeping position tips in Telugu – నిద్రించడానికి అనువైన మార్గాలు

ప్రశాంతమైన నిద్రను పొందడానికి మీ తలను తూర్పు వైపుగా ఉంచి నిద్రపోవడం చాలా మంచిది. నిద్రపోవడానికి ఉన్న మరొక మంచి దిశ పడమర. మీరు ఆ దిశగా మీ తలను ఉంచి పడుకున్నట్లయితే, మీరు లేచే సరికి అనుకూలమైన శక్తి కలుగుతుంది. సరైన దిశగా తల ఉంచి నిద్రపోవడం వలన రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. చేసే పని మీద దృష్టిని నిలపడానికి సంపూర్ణమైన నిద్ర చాలా అవసరం. ఒత్తిడి ఆందోళనల నుండి ఉపశమనానికి కూడా సరైన నిద్ర అవసరం.

నిద్ర స్థితి సరైన దిశగా లేనట్లయితే వ్యక్తులు వివిధ శారీరక మరియు మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ దిశగా పడుకోవడం వలన లేదా ఏ స్థితిలో పడుకోవడం వలన మానసిక, శారీరక ఆరోగ్యం పొందవచ్చునో సవివరంగా తెలుసుకుందాం.

పక్కకు లేదా వెల్లకిలా పడుకోవడం

మీరు తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నవారు అయితే అప్పుడు పక్కకు తిరిగి లేదా వెల్లకిలా తిరిగి పడుకోవడం ఉత్తమ మార్గం. నిద్రపోతున్నప్పుడు ఈ స్థితిలో పడుకుంటే మీ నొప్పి తగ్గిపోతుంది అలాగే ఇకపై నొప్పి రాకుండా ఉంటుంది. మీ మెడ వంపు దగ్గర నొప్పి తగ్గడానికి ఒక మెత్తని దిండు లేదా ఒక చుట్టిన టవల్ ను ఒత్తుగా ఉపయోగించడం చాలా ముఖ్యం. తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్న వారు పొట్టను ఆన్చి బొమ్మర్లా పడుకోవడం మంచి స్థితి కాదు. అందుకని పొట్టను ఆన్చి బొమ్మర్లా పడుకోవడం ఆపివేసి పక్కకు లేదా వెల్లకిలా పడుకునేలా ఖచ్చితంగా చూసుకోండి.

సవరించిన పక్క నిద్ర స్థితి

ఈ నిద్ర స్థితి భుజం నొప్పితో బాధపడుతున్న వారికి బాగా పనిచేస్తుంది. ఇది పడుకోవడానికి ఇంతకు ముందు చెప్పుకున్న పక్క నిద్ర స్థితికి కాస్త సవరించిన స్థితి. ఈ నిద్ర స్థితిలో మీరు పక్కకి తిరిగి కాస్త మీ వీపుని వంచి పడుకోవాలి. ఇలా పడుకోవడం వలన మీ భుజం నొప్పి తగ్గుతుంది. ఒకవేళ మీకు ఈ నిద్ర స్థితిలో పడుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే వీపుని ఆన్చుకుని వెల్లకిలా పడుకోండి. మీరు నడుం నొప్పితో బాధపడుతున్నవారు అయితే పక్కకి తిరిగి పడుకున్నపుడు ఒక మెత్తని దిండు పెట్టుకోవడం మర్చిపోవద్దు. లేదంటే మరింత నొప్పికి గురవుతారు.

మోకాళ్ళ క్రింద దిండు పెట్టుకోవడం

వయసు పెరిగే కొద్దీ మనలో చాలా మందికి దిగువ నడుం నొప్పి రావడం ప్రారంభమవుతుంది. ఇది చాలా సాధారణమైన విషయం. ఇలాంటి దిగువ నడుం నొప్పితో బాధపడుతున్నవారికి అన్ని రకాల నిద్రా భంగిమలు సరిపడకపోవచ్చు. అంతేకాకుండా అటువంటి నిద్రా భంగిమలు మరింత నొప్పులకు కుడా దారితీయవచ్చు. మీరు నొప్పుల నుండి ఉపశమనం కలిగించే నిద్రా భంగిమల కోసం చూస్తున్నట్లయితే మీ మోకాలి కింద దిండు ఉంచుకుని పడుకోవడం మంచి పద్ధతి. ఈ పద్ధతి మీ కింది నడుము భాగమునకు సపోర్టుగా నిలిచి క్రమంగా నొప్పులనుండి ఉపశమనం పొందవచ్చు. కింది నడుము నొప్పి ఉన్నవారు పడుకునే అత్యంత నాసిరకమైన నిద్రా భంగిన మీ పొట్టను నేలకు ఆన్చి నిద్రపోవడం అని చెప్పవచ్చు.

తుంటి (హిప్) నొప్పికి నిద్రా భంగిమ

ఈ రోజుల్లో నడుము నొప్పి మరియు తుంటి నొప్పి చాలా సాధారణమైన విషయం. ఒకవేళ మీరు తుంటి నొప్పితో బాధపడుతున్న వారిలో ఒకరైతే, సాధారణ నిద్రా భంగిమలు మీ నొప్పి తీవ్రతను నివారించాలేకపోవచ్చు. తుంటి నొప్పిని తగ్గించడానికి మీ మోకాలి కింద దిండుని ఉంచి పడుకోవడం ఒక మంచి పద్ధతి అని చెప్పవచ్చు. కానీ మీరు పక్కకి తిరిగి పడుకుని దిండుని మీ మోకాలి మధ్యలో ఉండేటట్లు చూసుకోండి. మీరు ఇలా పడుకున్నట్లయితే సహజ మార్గంలో మరియు అత్యంత త్వరగా మీ నొప్పులనుండి ఉపశమనం పొందగలరని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఉత్తర, దక్షిణ వైపుగా శిరస్సు ఉంచి నిద్రించడం

భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఉత్తర దక్షిణ దిశలో ఉంటుంది కనుక నిద్రిస్తున్నప్పుడు మీరు శిరస్సును ఉత్తర దిశలో ఎన్నటికీ ఉంచకూడదు. ఈ దిశలో నిద్రించడం ఎంతో హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మీ నిద్రను భంగం చేయడమే కాకుండా చెడు స్వప్నాలను కూడా కలిగిస్తుంది.

నైరుతి విభాగం

నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాస్తు శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన విభాగం నైరుతీ రంగం. సానుకూల శక్తి నిల్వ ఉండే ప్రాంతంగా దీనిని పేర్కొంటారు.

దక్షిణ శిరస్సుగా నిద్రా పోవడం

భారతీయ పురాణ గాథల ప్రకారం నిద్రపోయే దిశలు కొన్ని ముఖ్యమైన అంశాలను విశదీకరిస్తున్నాయి. వాటి ప్రకారం దక్షిణ దిశకు అధిపతి యమధర్మరాజు.అతను సాధారణంగా జీవుల మరణాలకు సంబంధించిన దేవుడిగా ప్రసిద్ధుడు. అందువల్ల ఉత్తర దిశగా శిరస్సు ఉంచి కాళ్లను దక్షిణ దిశగా పెట్టుకోవడం వలన మీరు మృత్యు దేవుడిని ఆహ్వానించినట్లే.

భారతీయ పురాణ గాధలలో భాగంగా పడుకునే సమయంలో కాళ్లు మరియు శిరస్సు ఉంచే స్థానాలను బట్టి కొన్ని శాస్త్రీయమైన వివరాలు కూడా ఉన్నాయి.భౌతిక శాస్త్రంలో అయస్కాంత ధర్మాలు చెప్పేది ఏంటంటే, ఉత్తర దృవం నెగిటివ్ ఎనర్జీకి మరియు దక్షిణ దృవం పాజిటివ్ ఎనర్జీకి మూలాలుగా చెప్పబడతాయి. మీ పాదాలు దక్షిణ దిశగా పెట్టుకొని నిద్రించినట్లయితే, అయస్కాంత ధ్రువాల ఆకర్షణ వికర్షణల వలన మీ పూర్తి రోజు విసుగుగా, చిరాకుగా గడుస్తుంది.

నిద్రపోవడానికి మంచి దిశ

నిద్రపోవడానికి శిరస్సు ఉంచుకొనే దిశలను గురించి భారతీయ మరియు చైనీస్ గ్రంధాలు సవివరంగా తెలియజేస్తున్నాయి. దానికి సంబంధించిన శాస్త్రీయ దృక్పథంతో తెలుపుతున్నాయి. ఒక వ్యక్తికి అనుకూలమైనది తన శిరస్సును దక్షిణ దిశగా లేదా తూర్పు దిశగా ఉంచుకోవడం ఉత్తమమైనదిగా చాలా మంది పూర్వీకుల విశ్వాసం. నేటి శాస్త్రీయ పరిశోధనలు కూడా వాటిని రుజువు చేస్తున్నాయి. ఉత్తర దక్షిణ దిశలుగా శిరస్సువంచి నిద్రపోకుండా ఉండటం వలన మీరు ప్రతికూల శక్తులనుండి ప్రభావితం కాకుండా ఉంటారు.

ఉత్తరం వైపుగా నిద్రా దిశ వాస్తవాలు

మీరు నిద్రించేటప్పుడు ఉత్తర దిశగా మీ శిరసుని ఉంచుతున్నారా? ఇది పూర్తిగా విరుద్దమైన విధానం. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రం సైతం దీనిని ఖండిస్తోంది. ఎందుకంటే భూమి యొక్క అయస్కాంత శక్తి ఉత్తర దక్షిణ దిశలుగా ఉంటుంది. అందువల్ల ఈ రకమైన దిశా నిద్ర ఎన్నో ప్రతికూల ప్రభావాలను కలిగించవచ్చు.

వంకరగా నిద్రించడం

నిద్రా దిశలతో పాటుగా నిద్రా భంగిమ కుడా ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మీరు మీ శారీరాన్ని వంచిన స్థితిలో ఏ దిశలో అయినా నిద్రించినట్లయితే, మీరు తిర్యక్ తరంగాల చేత తీవ్ర ఒత్తిడికి గురికావచ్చు. దీనివల్ల నిద్రపోతున్నప్పుడు అవసరం లేని శరీర కదలికలు నిద్రలేని రాత్రి, విశ్రాంతి ఉండకపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. అందువలన మీరు నిద్రించేటప్పుడు మీ శరీరం నిటారుగా ఉండేలా చూసుకోవడం చాలా మంచిది.

తూర్పు పడమర దిశలు

ప్రతీవ్యక్తి ఆరోగ్యకరమైన నిద్రపొందాలంటే తూర్పు మరియు పడమర దిశలుగా శిరస్సును ఉంచి నిద్రించడం మంచిదని నిపుణులు చెప్తూ ఉంటారు. ఈ దిశలుగా ప్రయాణించే తరంగాలు అనుకూల శక్తిని మీ శరీరానికి అందిస్తాయి. పురాతన గ్రంధాలు కుడా ఈ దిశలులో దేవతలు కొలువై ఉంటారని పేర్కొంటున్నాయి. ఈ దిశలో క్రియా శక్తి లేదా శక్తి చర్యలు నిగూడమై ఉంటాయి. అవి ఖచ్చితంగా ప్రశాంతమైన నిద్రని మరియు ఆరోగ్యాన్ని మీకు అందిస్తాయి.