Posted on

గర్భిణీ స్త్రీలలో నిద్రలేమి సమస్యకి చిట్కాలు – Telugu tips for pregnant women

గర్భిణీగా ఉన్నప్పుడు హార్మోన్ల మార్పు, శారీరక అసమానతలు వల్ల గర్భిణీ స్త్రీలలో నిద్ర లేమి సమస్య మొదలవుతుంది. ప్రెగ్నెన్సీలో ప్రతీ త్రైమాసికానికీ నిద్ర లేమి సవాళ్ళను గర్భిణుల ముందు నిలుస్తాయి. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం ప్రతీ త్రైమాసికానికి కొన్ని నిద్రలేమి మార్పులు వస్తాయని చెప్పటం జరిగింది. అంతేకాక 78 శాతం గర్భిణీ స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించింది. వాటిని ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల కోసం మీ తెలుగు టిప్స్ అందిస్తోంది. అవేంటో చూద్దామా..!
గర్భిణీ స్త్రీలలో నిద్రలేమి అనేది సహజమైన సమస్య. గర్భము దాల్చాక ఎంతో కొంత నీరసము అతినిద్ర ఉండడము సహజమే కాని ఎక్కువ అలసట , మరీ నిద్రపోవడము మంచిది కాదు. ఉదయం నిద్ర లేవటం అనేది మీకు తరచూ ఎదురయ్యే సవాలు. ఉల్లాసంగా విశ్రాంతిగా మరునాడు మేల్కోవాలంటే మీరు ఒక దినచర్య అలవాటు చేసుకోవాలి.

మొదటి త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య

1. తరచుగా నడుస్తుండటం వల్ల ఎక్కువగా బాత్ రూం కి వెళ్ళాల్సివస్తుంది.
2. ప్రెగ్నెన్సీలో నిద్రించే సమయంలో అంతరాయాలు ఏర్పడటం వల్ల శారీరకంగా, మానసికంగా స్ట్రెస్ ఏర్పడటం జరుగుతుంది.
3. పగటి పూట ఎక్కువగా నిద్రించటం.

రెండవ త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య

1.రెండవ త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య దాదాపూ చాలా మంది గర్భిణీ స్త్రీలలో ఒకటేలా ఉంటుంది. రాత్రి సమయాల్లో మూత్రం ఎక్కువ రాకపోవటం దీనికి కారణం పిండం రోజు రోజుకీ వృధ్ధి చెందటం. పిండం పెరగటం వల్ల ఇది బ్లాడెర్ పై ఎక్కువ ఒత్తిడి ని కలిగించనివ్వకపోవటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్తితిలో మానసిక ఒత్తిడి ఎక్కువై నిద్రలేమి సమస్యను పెంచుతుంది.

మూడవ త్రైమాసికంలో నిద్రలేమి సమస్య

ఈ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలు చాలా నిద్రలేమి సమస్యల్ని ఎదుర్కొంటారు.
1. క్రమక్రమంగా బొడ్డు పెరుగుదల వల్ల అసౌకర్యంగా ఉండటం.
2. గుండెల్లో మంట, కాళ్ళ తిమ్మిర్లు, సైనుస్ రద్దీ.
3. రాత్రిళ్ళు మూత్రం ఎక్కువగా రావటం ఎందుకంటే బిడ్డ కదలికల వల్ల ఆ ఒత్తిడి బ్లాడెర్ పై పడి తరచుగా మూత్రం వస్తుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర పట్టేందుకు కొన్ని టిప్స్

కొన్ని టిప్స్ వల్ల మీ ప్రెగ్నెన్సీలో చక్కని నిద్ర మీ సొంతం అవుతుంది. కాని మరీ మీ నిద్రలేమి సమస్య ఎక్కువ ఉంటే మీ డాక్టరుని సంప్రదించటం మంచిది.

అదనంగా పిల్లోస్ వాడటం

ప్రెగ్నెన్సి సమయంలో మీరు వాడే పిల్లోస్ అంటే తలగడ దిండ్లు అదనంగా వాడటం మంచిది. పడుకునేటప్పుడు మీ కడుపుకీ, వెనుక భాగంలో అంటే పిరుదుల దగ్గర పిల్లోస్ వేస్కోవాలి. దీని వల్ల మీ కడుపుకీ ఎంతో సపోర్ట్ దొరుకుతుంది. అంతేకాక మీ రెండు కాళ్ళ మధ్య ఒక పిల్లో వేసుకోవాలి. దీనివల్ల మీ కింది భాగంలో సపోర్ట్ దొరుకుతుంది. కొన్ని పిల్లోలు ఆకారంలో ఇరుకుగా ఉండేవి, అలాగే పూర్తిగా బోడీ కి సరిపడే పిల్లోలని వాడటం మంచిది.

పొష్టికాహారం

ఒక గ్లాస్ పాలు త్రాగటం వల్ల మీకు మంచి నిద్ర వస్తుంది. కార్బోహైడ్రేడ్లు ఉన్న పదార్ధాలను తీసుకోవటం మంచిది. బ్రెడ్, క్రాకర్లు మీ నిద్రను పెంచుతాయి. అంతేకాక కొన్ని ఎక్కువ ప్రోటీన్లు ఉన్న స్నాక్స్ తీసుకోవటం వల్ల మీ బ్లడ్ షుగర్ ను పెంచటమే కాక మీకు చెడు కలలు రాకుండా, తలనొప్పులు రాకుండా చేస్తాయి.

ఆయాసం

కొంతమంది గర్భిణీ స్త్రీలు ఆస్త్మ లేదా హైపెర్థైరాయిడిజం సమస్యతో సతమతమవుతుంటారు.

గురక పెట్టడం

గర్భిణీ స్తీలకు సహజంగా ముక్కులోని రంద్రాలు ఉబ్బటం వల్ల ఎక్కువగా బిగ్గరగా గురక తీస్తుంటారు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం 30 శాతం ఈ సమస్యకు గురి అవుతున్నారు.

విశ్రాంతి పొందే మార్గాలు

విశ్రాంతి తీసుకోవటం వల్ల మీ మనస్సు కి, కండరాలకూ విశ్రాంతి పొందుతాయి. ఈ మార్గాల్లేమిటంటే యోగ, మస్సాజ్, స్ట్రెచింగ్ లాంటివి. ఎక్కువగా శ్వాస తీసుకోవటం, వేడి నీళ్ళతో స్నానం, పడుకునే ముందు ఖచ్చితంగా స్నానం చేయాలి.

వ్యాయామం

ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు వ్యాయామం చేయటం ఎంతో మంచిది. వ్యాయామం చేయటం వల్ల మీ శరీరానికి, మనస్సుకి ఉల్లసం, ఉత్తేజం వస్తాయి. అంతేకాక ఒత్తిడి తొలగుతుంది. ఆరోగ్యకరంగ మాత్రమే వ్యాయామం చేయాలి. అధిక వ్యాయామం చెయకూడదు. డాక్టరు సలహా మేరకే ఈ వ్యాయమం చేయటం మంచిది. ముఖ్యంగా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు అంటే 4 గంటల ముందు మాత్రం వ్యాయామం అసలు చేయరాదు.

నిద్ర

మొత్తానికి గర్భిణి స్త్రీలకు, నిద్రలేమి తప్పదు. నిద్రకు ఉపక్రమించే ముందు వేడిపాలు త్రాగాలి. పగలు కొంచెం వ్యాయామం చేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది. రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి. నిద్రించే సమయంలో ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి.

వేరే మందుల వాడకం

ప్రెగ్నెన్సీ సమయంలో వేరే మందులు వాడటం మంచిది కాదు. ఇవి మీ బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. అంతేకాక కొన్ని మందులు అంటే యాంటీ బయాటిక్స్, హెర్బల్ ప్రాడక్ట్లు వాడటం అంత మంచిది కాదు. మీరు ఏ మందులు వేసుకోవాలన్నా మీ డాక్టరుని సంప్రదించి మాత్రమే వేసుకోవాలి.