Posted on

Telugu tips for look for ever younger – ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే?

మన వయస్సు యుక్త వయస్సులో ఆగిపొతే ఎంత బాగుంటుందో..దేవతల వయస్సు ఆగి ఎప్పుడూ నవయవ్వనంతో ఉన్నట్లు మనమూ వాళ్ళు తాగిన అమృతం లాంటిదేదైనా దొరికితే ఎంత బాగుణ్ణో అనుకుంటాం.. ఇప్పుడు కొన్ని పౌష్టికాహార అలవాట్లు పాటించటం వల్ల ఏ అమృతం తాగకుండా ఎప్పుడూ యవ్వనం తో కంపడే అవకాశం ఉంది. ఎంటి అని ఆశ్చర్యపోతున్నారా..అవును ఇది నిజం అవేంటో చూద్దామా..

చర్మ సౌందర్యం కోసం

సాధారణం గా ఈనాడు ఆడవారు బాగా అందమైన చర్మాన్ని కోరుకుంటారు. అంతేకాక ప్రస్తుతం మగవారు కూడా మంచి చర్మ సౌందర్యం కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కల్చర్ మరి. ఇక దీనికోసం ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. రోజు రోజుకీ వయస్సు పెరిగిపోవటం వల్ల ఈ సమస్యను అధిగమించలేం. అయితే అహార అలవాట్లు, వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. దీని వల్ల మీరు ఆందోళనల నుంచీ దూరంగా ఉండవచ్చు. అయితే ఈనాడు చాలా వరకూ ఉన్న వర్క్ బర్డన్ల వల్ల ముఖ చర్మం నిర్జీవమైపోతొంది. నీరసం అలాగే చర్మం ముడతలకు లోను అవ్వటం జరుగుతుంది. కాబట్టి మృదువైన చర్మం అలగే ఉండాలంటే ఆహారం అలాగే వ్యాయామం, యోగా లాంటివి చేయాల్సిందే.

అవలంబించేప్పుడు నిజాలు

మనం కాస్త ఆందోళన చెందినప్పుడు మనలో నుంచీ అడ్రినలైన్ మరియు కొర్టిసోల్ విడుదలవుతాయి. ఎందుకంటే మనం ఆందోళన చెందినప్పుడు బ్లడ్ ప్రేజర్ అనగా రక్తప్రసరన పెరిగి పోయి ఇవి ఉత్పత్తి అవుతాయి.. అంతే కాక గుండె కొట్టుకోవటం అధికం అవుతుంది. ఈ అందోళనే ఎక్కువ అయితే జబ్బు పడటం ఖాయం. ఇలాంటి సమయంలో ఇన్సోమ్నియా అలాగే గుండెపోటు ఆవేశం ఎక్కువైమరిన్ని రోగాలకు తెరలేస్తుంది. ఇక ఈ కారణాలవల్ల రాను రానూ మీ చర్మం జీవం కోల్పోయి నిర్జీవమైపోతుంది. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం యోగా మెడిటేషన్ చేస్తే మాత్రం ఆందోళనలు పోయి వయస్సు తగ్గి  కనపడతారన్నది నిజం. మెదడుపై ఆ వత్తిడిని తీసే శక్తి మెడిటేషన్ కు ఉంది. అలాగే కొవ్వును తగ్గించుకునే అవకాశం ఉంది. కొవ్వు వల్ల వయస్సు కనపడే అవకాశం ఎక్కువ. సాల్మన్ అంద్ వాల్నుట్ లు ఒ- మేగా-3 ఫాటీ ని కలిగి ఉంటాయి. వీటి వల్ల వయస్సు కనపడక నిత్య యవ్వనం గా కనిపిస్తారు. ప్రేమ అనేది అనూహ్య భావం..ఒక చక్కటి అపురూపమైన కావ్యం లాంటిది. కాబట్టి మీరు ప్రేమించే మీ భాగస్వామి గనుక మీతో ఏ అరమరికలు లేకుందా అలాగే చుట్టు ఉన్న వాతావరణాన్నిప్రశాంతంగా ఉంచితే మీ చర్మ సౌందర్యం రోజు రోజుకీ ఇనుమడిస్తుంది. అంతేకాక ప్రేమపూరితమైన హస్తస్పర్శ ఒక ఆక్సిటాసిన్ ను విడుదల చేస్తుంది. అది ఆందోళనలను దరి చేరనివ్వదు.

వయస్సు రహస్యంగా మారిపోవటం

మీ వయస్సు రహస్యంగా మారిపోతుంది. రెడ్ వైన్ మీ వయస్సును కాపాడటంలో కీలక పాత్ర వహిస్తుంది. ఒక రీసెర్చ్ ద్వారా తేలిందేంటంటే రెడ్ వైన్ కొంత మోతాదు తాగటం వల్ల మీ వయస్సు అలాగే చర్మం ఎంతో కాంతివంతమయిపోతాయట. అలాగే అది గుండె పోటుల నుంచి మిమ్మల్ని దూరం పెడుతుంది. పండ్లు అనేవి మీ చర్మానికే కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రతీ పండులో ఎన్నో రకాల ప్రత్యేకతలున్నయి. పండ్లు తినటం వల్ల మీ చర్మం కంతివంతమై మరింత యవ్వనంగా కనిపిస్తారు. దానిమ్మ కొలెస్టరాల్ నీ అలాగే బ్లడ్ ప్రెజర్ని నియంత్రిస్తుంది. అలాగే కొన్ని రకాల కాన్సర్ లను కూడా నిరోధిస్తుంది. దానిమ్మా సూర్యుని ప్రమాదకరమైన అల్ట్రా వైలెట్ కిరణాల నుంచీ కూడా కాపాడుతుంది. గోజీ బెర్రీ అంటే తెలుగులో మృదు ఫలం అంటాం. దీనిలో చాల మంచి గుణాలున్నాయి. ఇది ఆంటీఅక్సిడెంట్ లను కలిగి ఉంటుంది. దీని వల్ల యవ్వనపు రూపును పెంచుతుంది. ఈ పండు మానవ నిద్రకు ఉపయోగపడే ప్రత్యేకతను కలిగి ఉంది. ఇక గ్రీన్ టీ అనేది చాలా మంచిది ఇది యవ్వనపు రూపును ఇనుమడింప చేస్తుంది. రోజుకు ఒకసారి లేక రెండుసార్లు గ్రీన్ టీ తాగటం మేలు. ఇది అంతేకాక బ్లాడర్ సమస్యలు అలాగే కొన్ని రకాల కాన్సర్లను రాకుండా చేస్తుంది. గ్రీన్ టీ చర్మ సౌందయాన్నే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.