Posted on

బరువు పెరిగేందుకు చిట్కాలు – Weight gain tips in Telugu

బరువు పెరగాలని కొందరు చాలా రకాల ఫుడ్స్ తీసుకుని తెగ ప్రయత్నిస్తుంటారు. కానీ బరువు పెరగాలని జంక్ ఫుడ్స్ని బాగా వాడుతుంటారు. అయితే ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే చాలావరకూ ఇవి త్వరగా బరువు పెరిగేలా చేస్తాయి కానీ తర్వాత రాను రాను వయస్సు మీద పడేకొద్దీ అవి చాలా ఇబ్బన్దులు అంటే కొలెస్టరాల్, హార్ట్ ఎట్టాక్స్, డయాబెటీస్ ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అయితే ప్రతీ డైటీషియన్, జిం ఇన్స్ట్రక్టర్లు చాలా విధాలుగా ఉండే వ్యాయామాలని అలాగే ఫుడ్స్ ని చెబుతుంటారు. అంతేకాక బరువు తగ్గేందుకు కూడా ఇలాగే చాలా రకాల సూచనల్ల్ని వారు చెబుతుంటారు. కానీ బరువు తఅగ్గేందుకు ఎలా అయితే మీరు చేస్తున్నారో అలాగే బరువు పెరిగేందుకు కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బరువు పెరిగేందుకు ఒక తేలిక మార్గమేంటంటే ఫాస్ట్ ఫుడ్స్ తినటం. ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ తో త్వరగా మీరు బరువు పెరగవచ్చు. కానీ అన్నే ఇబ్బందులు తలెత్తేందుకు అవకాశాలున్నాయి. మీరు నిజంగా బరువు సహజంగా పెంచుకోవాలంటే మీరు ప్రొటీన్లు ఉన్న ఫుడ్ తీసుకుంటే మీకు ఎంతో మంచిది. దీని వల్ల మీకు సైడ్ ఎఫ్ఫెక్ట్లు వచ్చే అవకాశాలు ఉండవు.

బరువు పెరిగేందుకు ఆరోగ్యకరమైన మార్గాలు (Healthy ways to gain weight)

ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఎక్కువమంది బరువు తగ్గేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కొందరు బరువు తక్కువగా ఉండేవాళ్ళు వారి బరువు పెంచుకునేందుకు చాలా రకాల ప్రోడక్టుల్ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇవి చాలా ఎక్కువ ఖరీదు కావటం అంతేకాక భవిష్యత్ లో వీటి వల్ల వచ్చే సమస్యలు కూడా కలవరపెడుతున్నాయి. ఏది ఏమైనా సహజ సిధమైన బరువు పెరగాలంటే అదీ ఆరోగ్యకరంగా పెరగాలంటే కొన్ని మార్గాలున్నాయి.

బరువు తక్కువగా ఉండటానికి కారణాలు

బరువు తక్కువగా ఉండటానికి కారణాలు ఒకటి వంశపారంపర్యత, ఆరోగ్య సమస్యలు. అయితే చాలా రోజులు కొంతమంది డాక్టరును సందర్శిన్చకపోవటం, వారి ఆహార అలవాట్లలో తేడాలు, తీసుకునే ఆహారం లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం దీనికి గల కారణాలుగా చెప్పవచ్చు.

లావు పెరగాలంటే (Telugu tips to gain fat)

చాలామంది ఈ రోజుల్లో లావు నుంచీ సన్నబడేందుకు ఎన్నో రకాల వ్యాయామాలు లాంటివి చేస్తున్నారు. అయితే కొంత మంది లావు అయ్యేందుకు అన్నే విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఈ పెరుగుదల అనేది ప్రపోర్షనేట్ అంటే సమంగా పెరిగితే మంచిదే సరిగ్గా పెరగకపోతే అది ఆరోగ్యకరమైనది కాదు.

బరువు పెరిగేందుకు 2 రకాలు

మీరు కనుక మరీ సన్నగా ఉన్నట్లయితే బరువు పెరిగేందుకు కొన్ని మార్గాలు అవలంబించవలసి ఉంటుంది.
మీ కండరాలని బలపరచుకోవాలి.
మీరు లావు పెరగాలంటే వ్యాయామం చక్కగా చేస్తే చాలు. అయితే ఆ వ్యాయామం బోడీ బిల్డర్లు వేరుగా చేస్తారు. అదే మీకు అలా చేయనవసరం లేదు. కానీ అంతే ఇదిగా బోడీ బిల్డర్లలా చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ పట్టుదల ఉండి మీరు త్వరగా ఆరోగ్యకరమైన కండరాల్ని పొందగలుగుతారు.

అంచలంచెలుగా శరీరంలొ కొవ్వు పెంచుకోవాలి

ఇంకొక మార్గంగా కొవ్వు పెంచుకునే విధానం. మీరు మీ శరీరంలో కొవ్వును పెంచుకోవచ్చు. అది ఎలాగంటే మీరు జిం ఇన్స్ట్రక్టర్ ని కలవండి. అరోగ్యంగా ఎలా బరువు పెరగవచ్చో ఆయన చేప్పే సూచనలు ఆహారం, వ్యాయమం అధారంగా చేసుకొని చెయ్యండి.

బరువు పెంచుకునేందుకు ఫుడ్స్ (foods to gain weight quickly)

మీరు చక్కగా ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు ప్రోటీన్ల తో కూడిన ఆహారాన్ని తీసుకుంటే చాలు. అదే విధంగా కొన్ని వ్యాయామాల్ని చేస్తే సరిపోతుంది. మీరు లావుగా ఉన్న వారిని చూసి నేర్చుకోవచ్చు. అది ఎలాగంటే వారు బరువు తగ్గేందుకు ఎంచేస్తున్నరో చూడండి. దానికి వ్యతిరేకంగా మీరు చేస్తే సరిపోతుంది. మీ ఫుడ్లో ప్రోటీన్లు, కార్బో హైడ్రేడ్లు, మినరల్స్, విటమిన్లు లాంటివి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా రోజుకి 2-3 సార్లు భోజనం చేస్తుంటారు. మీరు నిజంగా బరువు పెరగాలంటే రోజుకు 5-6 సార్లు ఆహారం తీసుకునేలా ప్రణాళీక వేసుకోవాలి.

ఆహార ప్రణాళిక

మగవారైతే రోజుకు 2-3 కోడి గ్రుడ్లని అదీ పచ్చి గుడ్లని త్రాగాలి. మధ్యాహ్నం 2-3 ఉడికించిన గ్రుడ్డ్లని తినాలి.

ఆడవారికి ఆహార ప్రణాళిక

అదే ఆడవారి శరీర తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. బరువు పెరగాలనుకునే ఆడవారు వారి ఫుడ్స్ లో క్యాలరీలు ఉండేలా చూసుకోవాలి. వెన్న, బంగాళాదుంప చిప్స్, పిజ్జాలు, ఆయిల్ శాతం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తింటే ఫ్యాట్ పెరుగుతారు.

బరువు పెరిగేందుకు చిట్కాలు (Telugu tips to gain weight)

మీరు లావు పెరగాలి అనుకుంటే కొన్చెం కొంచెం పెరిగేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారే అహారాన్ని పెంచటం అంంత మంచిది కాదు. అంతేకాక ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ ని ఎక్కువగా తినాలి. ఒక్కమాటలో చెప్పాలంటే మీ కడుపు ఖాళీగా ఉంచకూడదు. కానీ ఏది పడితే అది తినటం కూడా అంత శ్రేయస్సు కాదు సుమా!
కొంతమంది స్లిం అయ్యేందుకు చాలా రకాలుగా కష్టపడుతుంటారు. అలాగే అదే విధంగా మీరు లావు అయ్యేందుకు ఆహార నియమాలు అలాగే వ్యాయామాలు చేస్తే త్వరగా చక్కటి ఆరోగ్యమైన దేహాన్ని పొందవచ్చు.

విరివిగా తినటం

మీరు లావు పెరగాలి అనుకున్నప్పుడు స్నాక్స్ నుంచీ మీల్స్ వరకూ అన్ని విరివిగా తీసుకోవాలి. స్నాక్స్ రోజుకు ఒకసారే చేస్తే మీరు రోజుకు 2 సార్లు తినాలి. అలాగే మీరు మీల్స్ రోజుకు 2 సార్లు తింటే రోజుల్లో అదీ 2 గంటలకు ఒకసారే మినీ మీల్స్ తినాలి. ఇలా రోజుల్లో 6 సార్లు తీసుకునేలా ప్రణాళిక వేసుకోవాలి.

క్యాలరీ ఫుడ్ ను పెంచుకోవటం

క్యాలరీ ఫుడ్ ను తినటం ద్వారా మీ బరువును పెంచుకునే అవకాశం ఉంది. అది ఎలాగంటే క్యాలరీస్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఏమిటో చూసుకోవాలి. వాటిని తినటానికి ఆశక్తి చూపించాలి. పప్పులు, బీన్స్, మాంసం, చేపలు, మొదలైన వాటిల్లో క్యాలరీస్ ఎక్కువ కాబట్టి వాటిని తినటం ద్వారా బరువు పెరగవచ్చు. మీరు క్యాలరీ ఫుడ్స్ తింటున్నపుడు వాటిల్లో సుగర్ స్థాయిలు కూడా ఎక్కువే ఉంటాయి. అటువంటి అప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ ఐటంస్ ప్యాక్ చేసి ఉన్న వాటిల్లో ప్రొటీన్స్, మినరల్స్, ఆరోగ్యపరమైన నిజాల్ని క్షున్నంగా చూసుకున్నకే తీసుకోవాలి.

బెర్రీలను ఎక్కువగా తీసుకోవటం

మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు బెర్రీలను ఎక్కువగా తీసుకోవాలి. అలా తీసుకుంటే మీ శరీరం ఆరోగ్యకరంగా బరువు పెరుగుతుంది. ఎందుకంటే వీటిలో ప్రోటీనులు, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్రెడ్లు, క్రొవ్వు తో కూడిన పదార్ధ్ధాలనే తీసుకోవాలి.

పిండి పదార్ధాలలను కలుపుకుని తినాలి

సాధారణంగా పిండి పదార్ధ్ధాలని ఎక్కువగా వెన్న లేదా పాస్తా కలుపుకుని తినాలి. ఇలా తింటే దీనిలో ఉన్న కొవ్వు శాతం పెరిగి బరువు చాలా సునాయాసంగా పెరుగుతారు.

నిపుణుల సలహా మేరకు

మీరు బరువు చక్కగా ఆరోగ్యకరంగా పెరగాలి అనుకుంటే నిపుణుల సలహా మేరకే ప్రయత్నించండి. అలాగే ప్రోటీన్స్, కార్బో హైడ్రేడ్స్ ఉన్న వాటిల్నే తీసుకోవాలి. బోడీ బిల్డర్స్, అథ్లెట్స్ ఇలాగే చక్కటి ఫుడ్స్ తీసుకుని వ్యాయమం ద్వారా చక్కగా బరువు పెరుగుతారు.

పడుకునే ముందు తినాలి

మీరు బరువు చక్కగా పెరగాలి అనుకుంటే పడుకునే ముందు ఆహారం తీసుకుంటే మంచిది. ఎందుకంటే పడుకునేటప్పుడు తీసుకునే ఆహారం వల్ల చాలా బలం చేకూరుతుంది. ఎందుకంటే పని ఏమీ చేసి అలసిపోవటం మన శరీరం లోని క్యాలరీస్ కరిగిపోవటం జరగదు కాబట్టి ఇబ్బంది ఉండదు.

లంచ్ కి ముందు స్నాక్స్

రోజూ లంచ్ చేసే ముందు రెండు సార్లు స్నాక్స్ తీసుకోవాలి. అయితే స్నాక్స్ ఇబ్బంది పెట్టేవిగా ఉండకుండా జాగ్రత్త పడాలి. లడ్డూ, డ్రై ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా స్నాక్స్ గా తీసుకోవాలి. రోజులో లంచ్ కి ముందు 3 ముఖ్యమైన ఆహారాలు 3 పెద్ద ఆహారాల ముందు తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవటం

రోజూ మీరు బలమైన ఆహారపదార్ధ్ధాలనే తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల మీ శరీరానికి మంచిది. అవేంటంటే
పానీయాలు: సోడా డ్రింక్ మానేయాలి. అలాగే మామూలు డ్రింక్స్ మానేయాలి. పాలు, మిల్క్ షేక్స్ బాగా తీసుకోవాలి.
వెజిటేబుల్స్: వెజిటేబుల్ అంటే క్యారెట్, బీట్రూట్, దోస, బ్రోకోయి, బీన్స్, కాలీ ఫ్లవర్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
ఆయిల్ ను కలుపుకోవాలి: మీరు వంట చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ ఆయిల్ ను ఎక్కువగా వేసుకునేలా చూసుకోవాలి. ఆలివ్ ఆయిల్, పాం ఆయిల్, కనోలా ఆయిల్స్ ని వాడితే మంచిది. మీరు ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ ను వాడటం మంచిది.

సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం

ముందు చెప్పినట్ట్లుగానే ప్రోటీన్లు, మినరల్స్, కార్బో హైడ్రేడ్స్ ఉండేవాటిల్నే ఎక్కువగా తీసుకోవాలి. అయితే మాంసం ఉత్పత్తులు, చేపలు లాంటివి తీసుకోవాలి. మీ వంట సమయంలో వనస్పతి ను మాసంతో వేసుకుంటే అదనపు సమస్య్హల్ని నుంచీ కూడా దూరం గా ఉండవచ్చు.

మరీ ఎక్కువగా తినవద్దు

మీరు మరీ స్థాయిని మించి మాత్రం ఆహారం తీసుకోవటం అంత మంచిది కాదు. ఎందుకంటే మరీ ఎక్కువ ఆహారం తీసుకున్నా అది మనల్ని సోమరితనానికి గురిచేస్తుంది.

అనారోగ్యకరమైన ఫుడ్స్ కి దూరంగా

అనారోగ్యకరమైన ఫుడ్స్ తినకపోవటం మంచిది .ఉదాహరణకు పిజ్జా, బర్గర్లు అలాగే ఫాస్ట్ ఫుడ్స్ తినటం మంచిది కాదు.

ఎప్పటికప్పుడు శరీరాన్ని క్రమబద్దీకరించుకోవటం

ఎప్పటికప్పుడు శరీర తాపాన్ని క్రమబద్దీకరించుకోవాలి. ఎలాగంటే పాలు, పండ్ల రసాలు, నీరు లాంటివి విరివిగా తీసుకోవాలి. మంచి నీరు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. రోజుకు 8-10 గ్లాసుల నీరు త్రాగటం ఎంతో మంచిది.

బరువు పెరగటంలో మంచినీటి పాత్ర

ఇదేంటి బరువు పెరగటానికీ నీటికీ సంబధం యేమిటా అని చూస్తున్నారా! అవునండీ మీరు ఆరోగ్యకరం గా బరువు పెరగాలంటే అదీ మీరు తీసుకున్న ఫుడ్ చక్కగా కడుపులో అరగాలంటే తగినంత మంచి నీరు తీసుకోవాలి. అంతేకాదు శరీరం తిన్నా ఆహారం పరంగా ఏదైనా డీ హైడ్రేట్ అయితే మీరు తీసుకునే నీరే మిమ్మల్ని కాపాడుతుంది.

లక్ష్యాన్ని పెట్టుకోవాలి

మీరు అతి త్వరగా ఒక ఖచ్చితమైన సమయానికి బరువు పెరగాలంటే మీరు ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. లక్ష్యం లేనిదే ఏదైనా సాధించటం కల్ల.. అయితే లక్ష్య సాధనకు ఓ మంచి ప్రణాళిక ఉంటే ఎంతో మంచిది. అలా ఓ ప్రణాళిక వేసుకుని ఆహార నియమాలు, వ్యాయామం, నీరు ఎక్కువగా తీసుకోవటం చేస్తే మీరు ఆనతి కాలం లోనే చక్కగా లావు అవుతారు.

స్ట్రెంగ్థ్ ట్రైనింగ్

ఇది చాలా ముఖ్యమైనది. స్ట్రెంగ్థ్ ట్రైనింగ్ అంటే చక్కగా వ్యాయామం చేయాలి. కండరాల బలం పెంచుకోవాలి. బరువు పెరిగితే కాదు దానికి తగ్గట్టుగా చక్కటి శరీర ఆకృతి ఉండేలా చూసుకోవాలి. అదనపు ఫ్యాట్ ఏదైతే వస్తుందో దానిని చక్కగా కరిగించుకోవాలి.

పప్పు ధాన్యాలతో బరువు పెరగటం

సాధారణంగా పప్పుల్లో అంటే పిండి పదార్ధం ఎక్కువగా ఉంటుంది. అంతేకాక వీటిల్లో ప్రోటీన్స్ బాగా ఉంటాయి. కందిపప్పు, పెసర పప్పు, వేరుశనగ, అలాగే జొన్న, మొక్కజొన్న లాంటివి చక్కటి ప్రోటీన్స్ ను కలిగి ఉంటాయి.

మాంసం

మీరు బరువు పెరగాలంటే అదీ త్వరితగతిన పెరగాలంటే మాంసం ఎంతో తోడ్పడుతుంది. మాసం తినటం వల్ల ఎంతో చక్కగా మాంసకృత్తులు పెరిగి బరువు పెరుగుతారు. అంతేకాక మంసంలో కొవ్వు పదార్ధాల శాతం చాలా ఎక్కువ. వారానికి 3-4 సార్లు మాంసం తినేలా చూసుకోవాలి.

డైరీ ప్రాడక్టుల్లో కొవ్వు

డైరీ ప్రాడక్టుల్లో కొవ్వు శాతం ఎక్కువ. అందుచేత పాలు, వెన్న, నెయ్యి,లస్సి, పెరుగు లన్టివి ఎక్కువ కొవ్వును కలిగి ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

రాత్రి భోజనం ఆలస్యంగా

రాత్రి భోజనం ఆలస్యంగా చేయటం మంచిది. అదే బరువు తగ్గాలి అనుకునేవారైతే ఇందుకు వ్యతిరేకంగా చేయాలి. మీరు అప్పుడే పడుకుంటారు అనుకున్నప్పుడే రాత్రి భోజనం చేయాలి. ఎందుకంటే రాత్రి పడుకున్నాక మీరు ఏ పని చేయరు కాబట్టి క్యాలరీలు వృధా అయ్యే అవకాశం ఉండదు.

తినే ముందు

మీరు భోజనం చేసే ముందు ఏరకమైన ఫ్లూఇడ్స్ తీసుకోరాదు. భోజనానికి అరగంట అంటే 30 నిముషాలకు ముందు ఏమీ తీసుకోరాదు. ఎందుకంటే తినే భోజనం కడుపు ఖాళీ లేకా సరిగ్గా తినటం కష్టం అవుతుంది.

సుగర్ ను వాడరాదు

రోజూ నిత్యం ప్రతీ పానీయంలో లేదా స్వీట్లలోనో మరేదైన దానిలోనో రోజుకు సుగర్ వేసుకోక మానము. దాదాపూ ప్రతీ దానిలో ఉంటుందీ ఈ సుగర్. ఇది అంత మంచిది కాదు. కాబట్టి చాలా తక్కువగా వాడాలి. దీని వాడకం వల్ల డైయాబెటీస్, హార్ట్ సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగె క్యాండీలు ,చాకోలెట్స్ లాంటివి మానేయాలి.

చివరిగా ఆరోగ్యకరం గానే మీరు మీ బరువును పెంచుకోండి. ఆయిల్ ఫుడ్స్ ని, స్పైసీ ఫుడ్స్ ని మానివేయండి.