Posted on

Telugu tips to reduce stomach bloating – ఉబ్బిన పొట్టను తగ్గించడం ఎలా? – కడుపు ఉబ్బరాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు

కాలేయం లేదా గుండె జబ్బులు వలనే కడుపు ఉబ్బుతుంది. దీనికి ముఖ్య కారణం ప్రేగులోని వాయువు లేదా కణజాలంలో అదనపు ద్రవాలు చేరడం. దీని వలన మీ కడుపు యొక్క పరిమాణం పెరిగి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనిని కడుపు వాపు అని కూడా అంటారు. ఇది ఆహారపు అలవాట్లు లేదా జీవనశైలి మొదలైన కారణాల వలన కలిగే సమస్య. క్రింద చెప్పిన కొన్ని విధానాలను అనుసరించి ఈ సమస్యను సులభంగా తొలగించండి.

ఉబ్బిన కడుపు తగ్గించే ఇంటి చిట్కాలు

పొటాషియం

పొటాషియం శరీరంలోని ద్రవాలను సంతులనంగా ఉంచుతుంది. అరటి పండు, టమోటాలు, బచ్చలి కూర, మామిడి పండు మరియు గింజలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వలన శరీరంలోని అదనపు నీటిని తొలగించి ఉబ్బిన కడుపు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.

అరటి పండ్లు

అరటి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కావున మలబద్ధకం రావటానికి కారణం అయిన వాయువు సమస్యలను తొలగిస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మీ శరీరంలోని ద్రవాల స్థాయులను నియంత్రించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా అరటి పండ్లను తినడం ద్వారా పొట్ట ఉబ్బరం తొలగిపోతుంది.

గాలిని మింగకూడదు

మనం తెలిసో తెలియకనో గాలిని ఎక్కువగా మింగుతాము, దీని మూలంగా కడుపు ఉబ్బుతుంది. ధూమపానం, పళ్ళ రసాలను త్రాగటం, బబుల్ గమ్ నమలడం లాంటి కొన్ని అలవాట్లపై దృష్టి పెట్టండి. తినేటప్పుడు తక్కువ మాట్లాడండి.

సోపు గింజలు

ఇందులోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కడుపు ఉబ్బటం వలన కలిగే మూత్ర విసర్జన నొప్పిని తొలగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థలో కండరాలను సడలిస్తుంది. భోజనం చేసిన తరువాత కొన్ని సోపు గింజలను నమలండి లేదా, ఒక స్పూన్ సోపు గింజలను ఒక కప్పు వేడి నీటిలో వేసి 5-10 నిమిషాల పాటు ఉంచండి. ఈ నీటిని వడి గట్టి రోజుకు 2 లేదా 3 సార్లు త్రాగండి.

స్టార్చ్ ఆహారాలను నివారించండి

పొట్ట ఉబ్బటానికి ముఖ్య కారణం స్టార్చ్ ఆహార పదార్థాలు. కావున వీటిని నివారించండి లేదా తక్కువగా తినండి. నూడుల్స్, వైట్ బ్రెడ్, పాస్టరీస్, కేకులు, పాస్తాలు మొదలైన వాటిలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది.

శారీరక పనులను అనుసరించండి

రోజువారీ శారీరక పనులను చేయడం వలన మీ జీర్ణ శక్తి మెరుగు పొందుతుంది. ఆరోగ్యకరమైన శరీరం కోసం ఎనిమిది గంటలు నిద్ర కూడా అవసరం.

అల్లం

అల్లం శరీరంలోని వాయువును తొలగించి ఉబ్బిన పొట్టను తొలగిస్తుంది. ఇది ప్రేగులలో వాపును మరియు మంటను తగ్గించి ప్రేగు కండరాలను సడలిస్తుంది.5 లేదా 6 ముక్కల అల్లంను ఒక కప్పు ఉడుకు నీటిలో వేసి 10 నిమిషాల పాటు మూసి పెట్టండి. ఆ తరువాత వడి గట్టి కొద్దిగా తేనె మరియు నిమ్మరసం కలిపి రోజుకు 3 సార్లు త్రాగండి.

నివారించవలసిన ఆహార పదార్థాలు

నల్ల మిరియాలు, వెనిగర్, మిరపకాయ, ఆవాలు, ముల్లంగి, ఉల్లిపాయలు, వెల్లుల్లి లాంటి కరమైన ఆహార పదార్థాలను నివారించండి. ఎందుకంటే ఇవి కడుపులో మంటను పుట్టించవచ్చు.

మసాజ్ చేయటం

మీ ఉబ్బిన కడుపులోనీ వాయువును తొలగించేందుకు జీర్ణ వాహిక దిశలో మసాజ్ చేయండి. మీ వేళ్లను నడుము నుండి మొదలు పెట్టి పెద్ద ప్రేగు వరకు నొక్కండి.

కారవే విత్తనాలు

ఇందులో యాంటీ మోక్రోబియాల్, యాంటీ స్పస్మోడిక్ మరియు కర్మినేటివ్ లక్షణాలు ఉన్నాయి. ఇందులోని కార్వోల్ మరియు కార్వెనే అనే రెండు రసాయనాలు జీర్ణ వ్యవస్థ యొక్క కండరాల కణజాలను సున్నితంగా మార్చేందుకు సహాయపడుతుంది. ఈ విత్తనాలు మీ శరీరంలోని వాయువును బహిష్కరించి వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. మీకు తరచూ పొట్ట ఉబ్బే సమస్య ఉన్నట్లయితే ఒక చిటిక కారవే విత్తనాలను రోజంతా నమలండి. లేదా ఈ విత్తనాలను బాగా దంచి నీటిలో వేసి ఉడకబెట్టి టీ లా త్రాగండి.

ఆహారాన్ని నమిలేటప్పుడు జాగ్రత్త వహించండి

సరైన ఆహారాన్ని తీసుకోవటమే కాదు వాటిని తినేటప్పుడు ఎక్కువ సార్లు నమిలి తినాలి. ఆహారాన్ని వేగంగా మరియు సరిగ్గా నమలకుండా తినటం వలన పొట్ట ఉబ్బుతుంది. జీర్ణం కానీ ఆహారం పెద్ద ప్రేగులోనికి ప్రవేశిస్తున్నప్పుడు బాక్టీరియాలు వీటి ద్వారా వాయువును విడుదల చేస్తాయి, ఇది ఉబ్బిన కడుపుకు దారితీస్తుంది.

ఫైబర్

ఫైబర్ ఎక్కువగా తీసుకోవటం లేదా తక్కువగా తీసుకోవటం వలన కూడా కడుపు ఉబ్బుతుంది. కావున ఫైబర్ ఉన్న ఆహారాలను సరైన మోతాదులలో తీసుకోవాలి.

మలబద్ధకం

పొట్ట ఉబ్బటానికి ముఖ్య కారణం మలబద్దకం. సరైన ఫైబర్ ఆహారాలను తీసుకోవటం వలన మీ జీర్ణ వ్యవస్థను నియంత్రిస్తుంది. దీని వలన మలబద్దకం సమస్య తొలగిపోతుంది. తృణధాన్యాలు, చిక్కుళ్ళు, బీన్స్, మొక్కజొన్న, గోధుమ బియ్యం, అవోకాడో, గోధుమ పాస్తా, బటానీలు, ఆర్టిచోకెస్, గోధుమ బ్రెడ్, బ్రోకలీ, ఆపిల్ పండు, బఠానీలు, కోరిందకాయలు మరియు బాదాంలలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఒక వేళా మీకు మలబద్ధకం సమస్య లేనట్లయితే ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువ తినకూడదు, ఎందుకంటే మీ సమస్య మరింత అధికం కావచ్చు. మీకు వాయువు సమస్య ఉన్నట్లయితే ఫైబర్ ఆహారాలను తగ్గించండి.

ఉడికించిన కాయకూరలు

కాయకూరలను ఉడికించేటప్పుడు కడుపు ఉబ్బరం సమస్య కలిగించే కొన్ని ఫైబర్లు మరియు ఎంజైములు తొలగిపోతాయి. అంతే కాదు ఉడికించిన కాయకూరలు సులభంగా జీర్ణం అవుతాయి.