Posted on

ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు ఉత్తమ చిట్కాలు – Telugu tips for Stress

జీవితంలో అన్ని సమయాల్లో ఒత్తిడికి లోనవటం చాలా బాధాకరం. ఒత్తిడి మనలో సహజ శక్తిని తగ్గిస్తుంది మరియు మానసిక వ్యాధులకు దారితీస్తుంది. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి వలన అన్ని వయసుల వారిలోను ఒత్తిడి అధికరిస్తోంది. మీరు ఒత్తిడితో భాధ పడుతున్నట్లయితే జీవితంలోని సహజ సమతుల్యతను కోల్పోతారు. ప్రతి విషయంలోనూ ఆసక్తిని కోల్పోతారు. ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు తినాలని మరియు నిద్రపోవాలని కూడా అనిపించదు. అయితే, మీరు జీవితాన్ని సాధారణంగా గడపాలని అనుకుంటే, క్రింద చెప్పినటువంటి మార్గాలను అనుసరించి ఒత్తిడిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి.

ధ్యానం

పునరావృత చర్యల వలన సడలింపు పొందుతారు. ప్రతి రోజు ధ్యానం చేయటం వలన మీ ఒత్తిడి తగ్గుతుంది. నేలపై కూర్చొని డీప్ బ్రీత్ తీసుకుంటూ ఓం అనే శబ్దాన్ని రిపీటెడ్ గా చెప్పండి. దీనికి తగిన శిక్షణను సరైన గురువు వద్ద పొందండి.

వ్యాయామాలు మరియు యోగా (Yoga for stress relief in Telugu)

స్ట్రెస్ నుండి రిలీఫ్‌ని పొందటానికి వ్యాయామాలు మరియు యోగా చాలా ఉపయోగపడతాయి. యోగా లోని కొన్ని విధానాలు శరీరానికి బలాన్ని ఇస్తాయి. మన శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా చేసి ప్రెషర్ ని తగ్గిస్తుంది. సరైన ట్రైనర్లు వద్ద శిక్షణ పొంది యోగాలు, వ్యాయామాలను ప్రతి రోజు కనీసం 15-30 నిమిషాల పాటు చేయండి.

కొన్ని స్ట్రెస్ రిలీవింగ్ యోగాలను చూద్దాం:

ఈగల్ పోస్ (గరుడాసనం)

Blend coriander leaves with two teaspoon of turmeric in a fine paste.

గ్రద్ద ఎలా నిలబడుతుందో అలా నిలబడటం అన్నమాట. ఈ భంగిమలో మనస్సును ఒక పాయింట్ పై కేంద్రీకరించడం అవసరం. గరుడాసనం వల్ల ఇన్నర్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది, శరీరంలోని ఒత్తిడి తగ్గుతుంది మరియు ఏకాగ్రత పెరుగుతుంది. మీ భావోద్వేగాలు అన్నీ కూడా ఈ గరుడాసనంతో నివారించుకోవచ్చు.

ఉత్తాసనం

uttanasanam

ఈ భంగిమ నాడీ వ్యవస్థ సమతుల్యం మరియు ప్రశాంతత మరియు శాంతి యొక్క భావాలను ప్రోత్సహిస్తుంది. తలపై భాగంలో ఉన్న చర్మంలో ప్రసరణను మెరుగుపరుస్తుంది. నీరసం మరియు అలసట తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బ్లడ్ ప్రెషర్‌ని కూడా తగ్గిస్తుంది, సాధారణంగా అధిక స్ట్రెస్ కలగటానికి బ్లడ్ ప్రెషర్ ఒక ముఖ్య కారణం. అంతేకాదు ఈ గొప్ప భంగిమ మెనోపాజ్ యొక్క లక్షణాల నుండి ఉపశమనం అందిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

బాలాసనం

balasana

పిల్లల భంగిమ అని సముచితంగా పిలవబడే ఈ ఆసనం ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇది నడుము, తొడలు, చీలమండలం లను స్ట్రెచ్ చేయడం ద్వారా మెదడును శాంత పరిచి, ఒత్తిడి మరియు అలసటను దూరం చేయడానికి సహాయపడుతుంది. ఈ భంగిమ నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

వజ్రాసనం

vajrasana

ఈ ఆసనంలో మోకాళ్ల మీద కూర్చోవడం వల్ల మీ వెన్ను మరియు కాళ్లు స్ట్రెచ్ అవుతాయి.  వజ్రాసన భంగిమ అన్ని రకాల ఒత్తిడినీ తగ్గిస్తుంది. జాయింట్స్ మరియు మజిల్స్ విశ్రాంతి చెంది, స్ట్రెస్ ఫ్రీ అవుతాయి. మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే మోకాళ్ల మీద కూర్చొని డీప్ బ్రీత్ తీసుకోవాలి. అలా చేసేటప్పుడు మీ కండరాలు రిలాక్స్ అవ్వడాన్ని మీరు గమనించవచ్చు. ఈ భంగిమలో కొద్ది సమయం కూర్చొంటే మీరు రిలాక్స్ గా భావిస్తారు మరియు రిఫ్రెష్ అవుతారు. దీనిని ఇతర ఆసనాల వలే కాకుండా భోజనం అయిన తర్వాత వేయవచ్చు. ఇది మీ ఒత్తిడిని తగ్గించటంతో పాటు జీర్ణక్రియను కూడా మెరుగుపరచటానికి సహాయపడుతుంది.

సుఖాసనం

ఒత్తిడి తగ్గించుకోవడంలో ఇది ఒక సులభమైనటువంటి యోగాసనం. పద్మాసనంలో కూర్చొని, శ్వాస నెమ్మదిగా పీల్చి వదలడం వల్ల మనస్సు ప్రశాంత పడుతుంది. అంతే కాదు, వెన్నెముక రిలాక్స్ అవుతుంది.

ప్రాణాయామం

pranayama

ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించుట. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు. శ్వాస ప్రశ్వాసల్ని క్రమబద్ధం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మ ప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు. ఈ ప్రక్రియ ఒత్తిడిని తగ్గించటం మాత్రమే కాదు, రెగ్యులర్గా చేయటం వలన సర్వరోగాలూ హరించి పోతాయి.

మార్జారి ఆసనం (పిల్లిలాగా సాగడం)

marjariasana

 

పిల్లిలాగా సాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది కండరాల ఒత్తిడిని పోగొట్టడానికి సహాయపడుతుంది.

బిటిలాసనం (కౌ ఫోజ్)

cow pose

ఆవులా నిలబడటం, ఇది కూడా పిల్లి నిలబడే భంగిమలానే ఉంటుంది. ఒత్తిడి తగ్గించడంలో ఈ రెండు భంగిమలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ముఖ్యంగా మీ వెన్నెముకకు మంచి వ్యాయామం. మీ మనస్సును ప్రశాంత పరిచి, ఒత్తిడిని తొలగిస్తుంది.

సిరసాసనం

sirsasana

 

తలక్రిందులుగా నిలబడటం. ఈ యోగా భంగిమ నిజంగా మీరు రిలాక్స్ అవ్వడానికి గొప్పగా సహాయపడుతుంది. ఈ ఆసనం చేయడం అంత సులభమైన పని కాదు. అయితే, ఈ ఆసనం వలన తలకు రక్త ప్రసరణ పెరిగి చాలా త్వరగా ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.

సేతుబంధాసనం (వంతెన భంగిమ)

bridge pose

ఈ ఆసనం మీ రక్తపోటును నియంత్రించి, మెదడుకు విశ్రాంతిని, ప్రశాంతతను ఇచ్చి ఆతృతను తగ్గిస్తుంది. మెడ యొక్క కండరాలు మరియు వీపు యొక్క కండరాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. వెన్నునొప్పిని కూడా చాలా సులభంగా తగ్గిస్తుంది.

శవాసనం

savasana

అవయవాలన్నింటినీ వదులు చేసి, వెల్లకిల పడుకుని, అర చేతులు రెండింటికి ఆకాశం వంక ఉంచి, చాచిన కాళ్ల పాదాలు రెండింటిని కొంచెం దూరంగా ఉంచి వేసే ఆసనం శవాసనం. ఈ ఆసనం వల్ల శరీర అవయవాలన్నింటికీ విశ్రాంతి లభిస్తుంది. అలసట పోతుంది. టెన్షన్‌ తగ్గుతుంది. డిప్రెషన్‌ను ఎదుర్కోవాలంటే శవాసనం ఉత్తమాసనం. శవాసనం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది మరియు నియంత్రించబడుతుంది.

డీప్ బ్రీత్

ఈ వేగవంతమైన జీవన శైలిలో మనం ఊపిరి తీసుకునే విధానం కూడా వేగవంతం అయిపోయింది. చిన్న పిల్లలు లేదా అప్పుడే పుట్టిన శిశువులను మీరు గమనించినట్లయితే వాళ్ళు ఊపిరి తీసుకొనేటప్పుడు వారి పొట్ట కూడా పెద్దగా(ఎక్సపండ్) మరియు చిన్నగా(కాంట్రాక్ట్) అవుతుంది. ఎందుకంటే వాళ్ళు శ్వాస పీల్చుకొనేటప్పుడు గాలి వాళ్ళ పొట్ట వరకు వెళ్తుంది. తరువాత శ్వాస వదిలేటప్పుడు పొట్ట కూడా చిన్నదిగా అవుతుంది. దీని వలన శరీరంలోని టాక్సిన్స్ తగ్గుతుంది మరియు బ్రెయిన్ కి కావల్సినంత ఆక్సిజన్ కూడా లభిస్తుంది. కనుక, వీలైనంత వరకు మెల్లగా డీప్ బ్రీత్ తీసుకోటానికి ప్రయత్నించండి. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది.

సైట్ సీఇంగ్

వీలైనంత వరకు బయటకి వెళ్లి కొంత సమయాన్ని గడపండి. మీకు నచ్చిన మాల్స్ లేదా షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్లి విండో షాపింగ్ చేయండి. సైట్ సీయింగ్ చోట్లకు వెళ్లి నేచర్ని ఆస్వాదించండి. మీరు ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న విషయాల్లో కాంసెంట్రేట్ చేయటం వలన మీ ఒత్తిడి తగ్గుతుంది.

సెల్ఫ్ మసాజ్

కండరాలలో స్ట్రెస్ ని తగ్గించే కొన్ని మసాజ్ మరియు ప్రెషర్ థెరపీలను ప్రయత్నించండి. చేతులకు, పాదాలకు, మెడ మరియు భుజాలకు, ముఖానికి చేసే కొన్ని మసాజ్లను నిపుణుల వద్ద సరైన రీతిలో నేర్చుకొని ప్రతిరోజు చేయండి.

మెలోడీ సాంగ్స్

ఇది చాలా మందికి సులభంగా ఉపశమనాన్ని ఇస్తుంది. ఇంట్లో పనులు చేసేటప్పుడు, లేదా పని తరువాత రిలాక్స్ అయ్యే సమయంలో, ప్రయాణం చేసేటప్పుడు మీకు నచ్చిన మెలోడీ ని వినండి.

రేపటి రోజుకు తయారవ్వండి

మనం ప్రతి రోజూ ఏదో పనిలో నిమగ్నమై ఉంటాము, ఆ బిజీలో రేపు చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి మర్చిపోతాము. దీని వలన తరువాతి రోజు ఉదయం నిద్ర లేవగానే టెన్షన్ మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితులను తొలగించేందుకు రేపటి పనులకు ఈ రోజు తీసుకోదగిన ముందు జాగ్రత్తలు ఏవైనా ఉంటే తప్పకుండా చేయాలి. ఉదాహరణకు : ముఖ్యమయిన పనులను ఒక నోట్ బుక్లో రాసుకోవటం, ఆఫీస్‌కి తీసుకోని వెళ్లాల్సిన ఫైల్స్ ని సిద్ధం చేసుకోవటం, రేపటి వంటకాలకు కావలసిన వెస్సెల్స్‌ ని సిద్ధం చేసుకోవటం, స్కూల్ కి వెళ్లే పిల్లల యూనిఫార్మ్స్ ని సిద్దంగా ఉంచుకోవటం వంటివి. వీటి వలన ఉదయాన్నే మనం పడే టెన్షన్స్ తగ్గుతాయి. మరియు రోజూ చాలా సాఫీగా మొదలవుతుంది.

ఆరోగ్యకరమైన స్నాక్స్

స్నాక్స్ అనగానే రెడీమేడ్ గా మార్కెట్లో లభించే బిస్కట్స్ మరియు చిరుతిండులు మాత్రమే గుర్తుకు వస్తాయి. ఇవి లభించటం వలన మనం మాములుగా ఇంట్లో చేసుకునే ఈజీ స్నాక్స్ ఐటెమ్స్ ని కూడా తయారుచేయటం మానేసాము. కానీ ఈ బిస్కట్స్ మరియు చిరుతిండులలో కేవలం మైదా మరియు అనేక ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి మన బీపీ, షుగర్‌ని పెంచి తీవ్రమైన ఒత్తిడికి కారణం అవుతాయి. కనుక వీలైనంత వరకు బయటి స్నాక్స్ ని మానేసి ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్నాక్స్ ని తయారు చేసుకునేందుకు ప్రయత్నించండి. వేరుశనగలు, ఫ్రైడ్ గ్రాంస్ లాంటి ప్రోటీన్స్, పండ్లు మరియు కాల్షియం ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులను ఉపయోగించి ఇంట్లోనే స్నాక్స్ ని తయారు చేసుకోండి.

ఫామిలీ లేదా ఫ్రెండ్స్

మీ కాళీ సమయంలో మీకు నచ్చిన ఫ్రెండ్స్ లేదా ఫామిలీ మెంబర్స్ తో గడపండి. ఇది మీకు స్ట్రెస్‌ని కలిగించే విషయాల నుండి డైవర్ట్ చేస్తుంది. కనుక ఎంతో ఉపశమనాన్ని పొందుతారు.

స్ట్రెస్ తో ఉన్నప్పుడు సరైన ఆహారాలను తీసుకోండి

స్ట్రెస్లో ఉన్నప్పుడు సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మనం తీసుకునే ఆహారం స్ట్రెస్‌ని తొలగించటంలో కీలక పాత్ర వహిస్తుంది. చాలా మంది ఒత్తిడి కారణంగా సరైన టైంలో తినకుండా లంచ్ లేదా బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తారు, ఆ తర్వాత ఆకలి ఎక్కువ కావటం వలన జంక్ ఫుడ్స్ ని తింటారు. ఇది మీ ఒత్తిడిని ఇంకా పెంచుతుంది మరియు అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. కనుక పండ్లు మరియు కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను సరైన సమయంలో తీసుకోండి.

రీడింగ్

మీకు చాలా ఒత్తిడిగా ఉన్నట్లు అనిపిస్తే మీకు నచ్చిన నావల్స్ లేదా కధల పుస్తకాన్ని చదవండి. ఇది ఒక మానసిక వ్యాయామం. ఈ ప్రక్రియలో చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది.

ఫిసికల్ వర్క్

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కంప్యూటర్ ముందు కూర్చొని చేసే పనులకే వెళుతున్నాము. గంటల కొద్ది సిస్టం ముందు కూర్చోవటం వలన మన శరీరానికి ఎటువంటి కదలికా లేకుండా నరాలన్నీ బిగుసుకుపోతాయి. కనుక వీలైనంత వరకు కొన్ని శారీరక పనులను కూడా చేయండి. వీటి వలన మీ నరాలు మరియు కండరాలలో ఒత్తిడి తగ్గి రిలాక్స్ అవుతారు.

కాఫీ ఒక తక్షణ ఎనర్జైజర్

మీరు ఒత్తిడి నుండి తక్షణ ఉపశమనాన్ని పొందాలనుకుంటే, వేడి కాఫీని తయారు చేసుకొని త్రాగండి. మీరు పని నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు చాలా ఒత్తిడిగా ఉన్నట్లయితే, ఒక కప్పు వేడి కాఫీ మేజిక్ లా పని చేస్తుంది మరియు ఇన్స్టంట్ గా ఎనర్జీని అందిస్తుంది.

ఆర్ట్ వర్క్స్

మీకు నచ్చిన ఏదైనా ఆర్ట్ వర్క్ ఉన్నట్లయితే కొంత సమయం వాటితో గడపండి. ఉదాహరణకు మీకు డ్రాయింగ్, పెయింటింగ్, బట్టల అల్లికలు, క్రాఫ్ట్స్ వర్క్స్ లాంటి పనులపై ఆసక్తి ఉన్నట్లయితే ప్రతి రాజు 15-30 నిమిషాల పాటు వీటి కోసం మీ సమయాన్ని కేటాయించండి. ఇది మీకు ఎంతో రిలీఫ్ ని మరియు ఆనందాన్ని ఇస్తుంది.

నవ్వటం

గట్టిగా నోరు తెరచి నవ్వటం వలన నరాలకు ఉపశమనం కలుగుతుంది. ఇది ఒక రకమైన స్ట్రెస్ రిలీవర్. దీని కోసం ఏదైనా లాఫింగ్ క్లబ్ లో చేరండి లేదా మీకు నచ్చిన కామెడీ మూవీస్ ని చూడండి. ఈ ప్రక్రియ తప్పకుండా మీకు గొప్ప రిలాక్సేషన్ని ఇస్తుంది.

సెల్ఫ్ కమ్యూనికేషన్

ఇది కొంత వింతగా ఉన్నప్పటికీ తప్పకుండా మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది ఒక రకమైన కాగ్నిటివ్ థెరపీ. దీనిని మీరు ప్రయత్నిస్తే తప్పకుండా ఒత్తిడి తగ్గి మీలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీకు నచ్చిన ఏదైనా ఒక టాపిక్ గురించి ఆలోచిస్తూ మీతో మీరు మాట్లాడుకోవటం వలన ఎన్నో విషయాలను గ్రహించవచ్చు. అలాగే మునుపటి మంచి విషయాలను రీకాల్ చేసుకోండి.