Posted on

Telugu tips to stop bleeding gums – చిగుళ్లలో బ్లీడింగ్ తగ్గేందుకు హోమ్ రెమెడీస్

పంటి చిగుళ్ల రక్తస్రావం అనేది పంటి చిగుళ్ల అనారోగ్యం లేదా వ్యాధికి సంబంధించిన ఒక సంకేతము. ఇది ఒక తీవ్రమైన నోటి సమస్య మరియు అసాధారణమైన పరిస్థితి. ఈ సమస్యకు వీలైనంత తొందరగా చికిత్స చేయటం చాలా ముఖ్యం. ప్రారంభంలోనే ఈ సమస్యను పరిష్కరించటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రారంభ దశలోని చిగుళ్ల రక్తస్రావంను ‘గింజివిటిస్’ అని అంటారు. ఈ దశలో సమస్యను సులభంగా నియంత్రించవచ్చు. ఈ సమస్యపై శ్రద్ధ చూపకపోతే మరింత తీవ్రం అవుతుంది.

చిగుళ్ల రక్తస్రావానికి దారితీసే వివిధ కారణాలు

 • సరైన పద్దతిలో బ్రష్ చెయ్యకపోవటం లేదా గట్టి బ్రష్‌ను ఉపయోగించడం
 • దంత పరిశుభ్రత లేకపోవడం
 • చిగుళ్లు మరియు దంతాల మధ్య ఫలకం ఏర్పడటం వలన వచ్చే ఇన్ఫెక్షన్
 • గర్భధారణ సమయంలో హార్మోన్లలో మార్పులు
 • విటమిన్ సి మరియు విటమిన్ కె యొక్క లోపం
 • రక్తస్రావ రుగ్మతలు
 • రక్తం పల్చబడటానికి ఉపయోగించే మందులు
 • లుకేమియా వంటి రక్త క్యాన్సర్
 • సక్రమం లేని కట్టుడు పళ్ళు
 • మధుమేహం
 • ధూమపానం
 • ఎయిడ్స్ వంటి రోగ నిరోధక సమస్యలు

చిగుళ్ల రక్తస్రావం యొక్క లక్షణాలు

చిగుళ్ల రక్తస్రావం ప్రారంభం అయ్యే ముందు, అవి వాచి (ఎరుపు మరియు వాపు) బ్రష్ చేస్తున్నప్పుడు సులభంగా రక్తస్రావానికి గురి అవుతాయి. రక్తస్రావం యొక్క ఫలితంగా మంట ఏర్పడుతుంది, ఇందుకు ముఖ్య కారణం సరైన పద్దతిలో బ్రష్ చెయ్యకపోవటం. వాపు తీవ్రమై మరియు దవడ ఎముకకు విస్తరించినప్పుడు రక్తస్రావం పెరుగుతుంది. వ్యాధి ముదిరే కొద్ది వివిధ లక్షణాలు కనిపిస్తాయి :

 • చెడు శ్వాస
 • నములుతున్నప్పుడు నొప్పి మరియు కష్టం
 • చిగుళ్లను లాగినప్పుడు పళ్ళు బయటపడతాయి
 • దంతాల సున్నితత్వం పెరగడంతో దంతాలు లూజ్ అవుతాయి
 • చిగుళ్లలో చీము చేరడం
 • నోటిలో తుప్పుపట్టినటువంటి లోహ రుచి, ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు నోటిలో లాలాజల స్రావం పెరుగుతుంది మరియు జ్వరం సంభవిస్తుంది

ఇటువంటి లక్షణాలను గమనించిన వెంటనే తగిన గృహ చికిత్సలను పాటించండి. వాటి వలన 1-2 రోజులలో  పరిస్థితి మెరుగు పడకపోతే వైద్యుడిని సంప్రదించటం మంచిది. ఈ వ్యాసంలో కొన్ని హోమ్ రెమెడీస్ మరియు ఈ సమస్యను త్వరగా పరిష్కరించటానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి చూద్దాం.

గమ్ బ్లీడింగ్ చికిత్సకు హోం రెమెడీస్

 1. కోల్డ్ కంప్రెస్ : గమ్ బ్లీడింగ్ ని తక్షణమే ఆపుటకు మంచి పద్దతి కోల్డ్ కంప్రెస్. కొన్ని ఐస్ ముక్కలను ఒక శుభ్రమైన క్లోత్ లో చుట్టి బ్లీడింగ్ అవుతున్న గమ్స్ పై ఉంచండి. 10 నిమిషాలలో బ్లీడింగ్ ఆగిపోతుంది. ఆ తరువాత దీర్ఘకాలిక ఉపశమనం కోసం మరియు చికిత్స కోసం క్రింద చెప్పినటువంటి పద్దతులను అనుసరించండి.
 2. ఉప్పు నీళ్ళు : ఉప్పు నోరు ఇన్ఫెక్షన్లని తగ్గిస్తుంది. ఉప్పులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇది బ్యాక్టీరియాను వెంటనే నాశనం చేస్తుంది. చిగుళ్ల వాపు మరియు రక్తస్రావం, నొప్పిని వెంటనే తగ్గిస్తుంది. ఒక టీ స్పూన్ ఉప్పుని ఒక గ్లాసు వెచ్చని నీటిలో వేసి బాగా కలిపి నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయటం వలన చిగుళ్ల రక్తస్రావం నుండి దీర్ఘకాలిక ఉపశమనం పొందుతారు.
 3. పసుపు : పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మరియు హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది రక్తస్రావాన్ని తక్షణమే ఆపేందుకు సహాయపడుతుంది. ఒక స్పూన్ పసుపు పొడిని ఒక స్పూన్ నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకొని మీ చిగుళ్లపై మృదువుగా 5-6 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తరువాత పసుపు రంగు పోయే వరకు ఎక్కువ నీటితో పంటిని శుభ్రం చేయండి.
 4. పటిక : పటిక కూడా బ్లీడింగ్ ని తగ్గించి చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక గ్లాస్ నేతిలో 1/2 స్పూన్ పటిక పొడిని కలిపి నోటితో పుక్కిలించండి. రోజుకు రెండు సార్లు 5-6 నిమిషాల పాటు పుక్కిలించడం వలన మంచి ఫలితం ఉంటుంది.
 5. బేకింగ్ సోడా : బేకింగ్ సోడా లేదా సోడియం బి కార్బోనేట్ ని ఉపయోగించి చిగుళ్లలో బ్లీడింగ్ సమస్యను నివారించవచ్చు. మీరు బ్రష్ చేసుకొనేటప్పుడు టూత్ పేస్ట్ తో సహా బేకింగ్ సోడా ను వాడండి. లేదా బేకింగ్ సోడా ని నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకొని టూత్ పేస్ట్ బదులుగా ఉపయోగించండి.
 6. సలైన్ సొల్యూషన్ : గమ్ బ్లీడింగ్ ని నివారించటానికి సలైన్ సొల్యూషన్ ఒక మంచి ఎంపిక. ఇది నోటిలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది మరియు స్వెల్లింగ్ ను తగ్గిస్తుంది. కనుక రాజుకు రెండు సార్లు సలైన్ సొల్యూషన్ తో నోటిని పుక్కిలించండి.
 7. మింట్ ఆయిల్ : చిగుళ్ల సమస్యలను నివారించడానికి పుదీనా ఆయిల్ సహాయపడుతుంది. ఇది నోటిలోని చెడు బ్యాక్టీరియాను ఎఫెక్టివ్ గా నాశనం చేసి చిగుళ్ల వాపును కూడా తగ్గిస్తుంది. నోటిలో ఉండే చెడు శ్వాసను తొలగిస్తుంది. కొన్ని చుక్కల మింట్ ఆయిల్ ను తీసుకొని నేరుగా చిగుళ్ల మీద అప్‌లై చేస్తే నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.
 8. దాల్చిన చెక్క : దాల్చిన చెక్కలో స్ట్రాంగ్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చిగుళ్ల వాపును తగ్గిస్తుంది. అంతే కాదు, తాజా శ్వాసను కూడా అందిస్తుంది. దాల్చిన చెక్కను మెత్తగా పేస్ట్ చేసి, దాన్ని చిగుళ్ల మీద అప్‌లై చేసి 2 నిముషాలు అలాగే వదిలి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 9. ల్యావెండర్ ఆయిల్ : ల్యావెండర్ ఆయిల్ లో మంచి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలదు. చిగుళ్లపై ల్యావెండర్ ఆయిల్ తో మసాజ్ చేయాలి. ఇది బ్లడ్ సర్క్యులేషన్‌ ను పెంచుతుంది. చిగుళ్ల వాపును, నొప్పిని తగ్గిస్తుంది. ఇది దంతాలను మరియు చిగుళ్ల గ్యాప్ ను పూడ్చుతుంది. క్రిములు నోట్లో వ్యాపించకుండా నివారిస్తుంది. కొన్ని చుక్కల ల్యావెండర్ ఆయిల్ ను ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలిపి నోట్లో పోసుకొని గార్గిలింగ్ చేయాలి.
 10. బంతి పువ్వు మరియు క్యాలెండ్యులా : క్యాలెండ్యులా లో హీలింగ్ బెనిఫిట్స్ చాలా దాగున్నాయి. ఇది ఒక మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ గుణాలు కలిగినది. ఇది దంతాల మద్య పాచిని తొలగిస్తుంది. ఈ హెర్బ్ న్యాచురల్ డిటాక్సిఫైర్. ఇది బ్లడ్ సర్క్యులేషన్‌ పెంచుతుంది. చిగుళ్లకు సంబంధించిన కణాలను స్ట్రాంగ్ చేస్తుంది. దాంతో దంతాలు స్ట్రాంగ్ గా మారుతాయి. కొన్ని ఫ్రెష్ గా ఉండే మ్యారిగోల్డ్ లేదా  క్యాలెండ్యులా ఫ్లవర్ పెటల్స్ తీసుకుని, ఒక గ్లాసు వెచ్చని నీటిలో వేయాలి. ఈ నీటిని వడగట్టి నోటి శుభ్రతకు ఉపయోగించుకోవాలి.
 11. ఆయిల్ పుల్లింగ్ : ఆయిల్ పుల్లింగ్ ఒక పురాతన హోం రెమెడీ.
  • ఈ నూనెని కొద్దిగా నీట్లో వేసుకుని మింగకుండా, 10 -15నిముషాలు నోట్లో పుల్ చేయాలి. 15 నిముషాల తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఓరల్ హైజీన్ మెరుగవుతుంది.
  • అర టీ స్పూన్ నువ్వుల నూనె తీసుకుని అందులో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని నోట్లో పోసుకుని పుల్ చేసి 10 నిముషాల తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

చిగుళ్ల రక్త స్రావం తగ్గేందుకు సరైన ఆహార పదార్థాలు

 1. విటమిన్ సి : విటమిన్ సి యొక్క డెఫీషియన్సీ వలన చిగుళ్లలో రక్త స్రావం కలుగుతుంది. కనుక విటమిన్ సి అధికంగా ఉండే లెమన్, ఆరంజ్, క్యాబేజు మరియు బ్రోకలీ వంటి కూరగాయలు మరియు ఫ్రూట్‌స్ ని అధికంగా తీసుకోండి.
 2. పాలు : మీకు లాక్టోస్ సమస్య లేనట్లయితే ప్రతి రోజు పాలు త్రాగటం చాలా మంచిది. పాలలో అధికమైన కాల్షియం ఉంటుంది. శరీరం తగిన మోతాదులలో కాల్షియము పొందినట్లయితే చిగుళ్లు మరియు బోన్స్ ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటాయి.
 3. విటమిన్ : మంచి ఆరోగ్యం కొరకు శరీరానికి తగిన విటమిన్ అవసరం. అధిక మోతాదులో విటమిన్లు ఉండే పచ్చి కూరగాయలను వీలైనంత ఎక్కువగా తీసుకోండి. ఇది మీ చిగుళ్లలో బ్లడ్ సర్క్యులేషన్‌ ని మెరుగుపరుస్తుంది మరియు గమ్ బ్లీడింగ్ ని తగ్గిస్తుంది.
 4. క్రేన్ బెర్రీ జ్యూస్ : క్రేన్ బెర్రీ లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి కనుక చిగుళ్ల సమస్యతో పోరాడేందుకు ఇది ఒక మంచి ఎంపిక. ఇది చిగుళ్లలో బ్లీడింగ్ తో పాటు చిగుళ్లకు సంబంధించిన అనేక సమస్యను తొలగిస్తుంది. ఈ జ్యూస్ మార్కెట్ లో కూడా లభిస్తుంది కానీ మార్కెట్ లో అమ్మే జ్యూస్ లో అధిక చక్కెర మరియు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. కనుక వాటివలన ఫలితం ఉండదు. వీలైనంత వరకు ఇంట్లోనే జ్యూస్ తయారు చేసుకోవాలి లేదా ఫ్రూట్స్  ని అలాగే తినటం మరింత మంచిది.

చిగుళ్లలో సమస్యను నివారించేందుకు తీసుకోవాల్సిన మరి కొన్ని జాగ్రత్తలు

 1. ప్రతి సారి ఆహారం తీసుకున్న తరువాత కొన్ని కొవ్వు పదార్థాలు పంటిపై అతుక్కు పోతాయి. ఇవి వేర్ల వరకు వెళ్లి చిగుళ్లను మరియు పంటిని బలహీనం చేస్తాయి. కనుక ప్రతి సారి ఫాట్ ఐటెమ్స్ ని తిన్న వెంటనే పళ్ళను తోమాలి. కుదరకపోతే, రోజుకు కనీసం రెండు సార్లు, ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయాలి.
 2. బ్రష్ చేసే పద్దతిని మార్చాలి, పంటిపై అధిక ఒత్తిడి కూడదు. అలాగే పంటి చిగుళ్లపై కఠినంగా ఉండే బ్రష్ ని మర్చి సాఫ్ట్ బ్రష్ ని ఉపయోగించండి.
 3. మీరు ఉపయోగించే మౌత్ వాష్ లో ఆల్కహాల్ ఉండకూడదు. ఆల్కహాల్ చిగుళ్ల సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.
 4. శరీరానికి కావలసిన విటమిన్ మరియు మినరల్స్ ని తీసుకోండి.
 5. పొగ త్రాగటం లేదా ధూమపానం అలవాటును మానుకోవాలి.