Posted on

Do’s and don’t of gargle in Telugu – పుక్కిలించేప్పుడు చేయవలసినవి చేయకూడనివేంటంటే?

పుక్కిలించటమంటే నోటిలో నీరు పోసుకుని..బుగ్గల్ని కదపటమే అనుకుంటాం..కానీ.. మనం చూసే పుక్కిలింతలు కొన్ని రకాలు ఇప్పటికే చూసే ఉంటాం.. బ్రష్ చేసేప్పుడు కొందరు ఆ..ఆ..అలహా .. అంటూ విచిత్రంగా తల పైకెత్తీ అరుస్తుంటారు.. కొందరు.. బ్రష్ ముందు ఆయిల్ పుల్లింగ్ అంటూ తెగ పుక్కిలిస్తుంటారు. మరి ఈ పుక్కిలించటం కరక్టుగా ఎలా అనేది ఉందని మనలో చాలామందికి తెలియదు. అవును నిజమే..పుక్కిలించటంలో రకాలున్నాయ్..  ఎలా పుక్కిలించాలి ఎలా పుక్కిలించకూడదు అనేవి కూడా ఉన్నాయి.. వాటిని మీకోసం అందిస్తున్నాం.. అవేంటో చూద్దమా..
పుక్కిలించేప్పుడు నోటిలో మౌత్ ఫ్రెష్ వేసుకోండి..ఆ తర్వాత బాగా పుక్కిలించంది..దీని వల్ల బ్యాక్తీరియా, క్రిములూ చచ్చిపోతాయి. ఈ సమయంలో అవాంచిత వ్యాధుల్ని అరికట్టవచ్చు. కాబట్టి మీరు పుక్కిలించేప్పుడు మీరు ఏ విధంగా సరిగ్గా ఎలా చేయాలో మీరు చూసుకోవాలి.

లిక్విడ్ తక్కువగా తీసుకోవటం

మౌత్ వాష్ లిక్విడ్ తీసుకోవటం మరీ ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువగా తీసుకుంటే చాలా  ఇబ్బందులుంటాయ్. ఎక్కువగా తీసుకుంటే బాగా పని చేస్తుందనుకుంటారు కానీ..ఇలా చేయటం వల్ల నోరు పొక్కిపోతుంది. అంతేకాక తక్కువగా వేసుకుని తగినంతసేపు పుక్కిలిస్తే మంచిది. ఓ కప్పు మాత్రమే వేసుకుని పుక్కిలిస్తే మంచిది.

మూలమూలలా లిక్విడ్

పుక్కిలించేప్పుడు లిక్విడ్ వేసుకునీ నోటి లో నలు మూలలా వేళ్ళేలా చూసుకోవాలి. తరువాత పుక్కిలించేప్పుడు ముందుకీ..వెనక్కీ బుగ్గల సాయంతో పుక్కిలించాలి అప్పుడే సరిగ్గా పుక్కిలించవచ్చు. కొందరు వేడి నీటితో పుక్కిలిస్తుంటారు. కానీ దీని కంటే చల్లటి నీటితో చేస్తే మంచిది. ఎందుకంటే మౌత్వాష్ సరిగ్గా పని చేస్తుంది. అంతేకాక పుక్కిలించేప్పుడు సరియైన పద్దతిలోనే పుక్కిలించాలి.

పుక్కిలించే పద్దతి

మీరు పుక్కిలించేప్పుడు మీ తలను వెనక్కు వాల్చి ఆ తరువాత పుక్కిలించాలి దీని వల్ల మీ నోటిలో నలు మూలలా లిక్విడ్ వెళ్ళి బ్వ్యాక్టీరియా ను చంపేస్తుంది. ఇక పుక్కిలించేప్పుడు తలను బాగా పైకెత్తి గొంతు అంటే అంగిట్లోకి పోయేంతగా ‘ఆహ్’ అనే శబ్ధం వచ్చేలా చేస్తే చాలా చక్కగా పూర్తిగా శుభ్రపడుతుంది. ఇలా చేయటం కేవలం రోజూ పయత్నిస్తేనే అవుతుంది . మామూలుగా పుక్కిలించటం వల్ల కేవలం నోటి ముందు భాగమే శుభ్రం అవ్తుంది. కాని లోపలి భాగం అనగా కొండనాలుక వరకూ శుభ్రం కాదు. ఈ పధ్ధతి ద్వారా లోపలి వరకూ పుక్కిలించటం వల్ల లోన దాగిన బ్యాక్టీరియాని శుభ్రపరచవచ్చు.

పూర్తిగా లిక్విడ్ ను ఉమ్మటం

ఒకసారి పుక్కిలించిన తర్వాత నోటిలోని ఆ లిక్విడ్ ను పూర్తిగా వాష్ బేసిన్ లొనికి ఉమ్మివేయాలి. ఇలా చేయటం వల్ల నోటిలోని బ్యాక్తీరియా అలాగే క్రిములు చచ్చిపోయి అవి ఉమ్మివేయబడతాయి. ఇలా చేయటం వల్ల నోరు ఫ్రెష్ గా అలాగే శుభ్రపడుతుంది. నోటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఇలా చేయటం తప్పనిసరి.

లిక్విడ్ ను ఎంచుకోవటం

మీ లిక్విడ్ ను ఎంచుకోవటం మీ అంటే ఎలా వాడాలో ఎన్నిసార్లు వాడాలనేది మీపై ఆధారపడి ఉంటుంది. ఇక కొంచెం ఉప్పు వేసుకుని పుక్కిలించటం అనేది మీ ఇష్టం. సాధారణంగా ఒక సగం టీస్పూన్ ఉప్పును తీసుకుని దానికి వేడి నీటిని కలుపుకుని చేయవచ్చు. రోజుకు మూడు సార్లు కనుక మీరు చేస్తే గొంతు సంబంధిత సమస్యల నుంచీ బయటపడవచ్చు. మీ గొంతును కాపడుకోవచ్చు.

నోటి శుభ్రతలో రకాలు

మీరు మౌత్ వాష్ లు కమ్మెర్సియల్ వి వాడుకోవచ్చు. లేదా మీ సొంతంగా ఇంటిలోనే సహజసిధ్ధ మౌత్ వాష్ తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఈ మధ్య చాలా మంది అల్కహాల్ కలిగిన మౌత్ వాష్ లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటి వల్ల నోటికి సంభధిత వ్యాధులు దూరమవుతాయి. అంతేకాక ఎన్నో గంటలు అలాగే నోరు ఫ్రెష్ గా ఉండేలా చేస్తాయి. అంతేకాక ఇవి నోటిలో వచ్చే అల్సర్లను పోగొడతాయి. అంతేకాక కాన్సర్ రాకుండా చేస్తాయి. ఒకవేళా మీకు మీరే మౌత్వాష్ చేసుకుంటానంటే తయారు చేసుకోవచ్చు. మీరు పిప్పర్మింట్ అలాగే టీ ట్రీ మౌత్ వాష్, ఏంగెలికా మౌత్వాష్ ఇలా సాధారణ సునాయాసంగా మీకు మీరుగా తయారు చేసుకునే మౌత్వాష్ లు ఎన్నో ఉన్నాయ్.

వంటసోడా తో పుక్కిలించటం

మీరు వంట సోడాతో మౌత్వాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికోసం మీరు పొటాషియం బైకార్బోనేట్ సేకరించాల్సి ఉంటుంది. వంట సోడా మంచి మౌత్వాష్గా ఉపయోగపడుతుంది. ఇది చేసుకునేందుకు ఒక టీస్పూన్ వంట సోడ వేసుకుని దానికి 8 ఔవ్న్స్  నీటిని కలపాలి. తరువాత దీనికి పిప్పర్మింట్ ను కలుపుకోవాలి యాంటి మైకోబయాటిక్స్ కోసం ఇది ఖచ్చితంగా వేయాలి. ఇలా చేసుకున్న మౌత్వాష్ వల్ల మీ నోరు చక్కగా ఎన్నో గంటలు ఫ్రెష్ గా ఉంటుంది.

తేనె నిమ్మతో పుక్కిలించటం

మీరు తేనె నిమ్మతో మౌత్వాష్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇబ్బందిలేని అదేవిధంగా ఎంతో శక్తివంతమైన మౌత్వాష్. దీనికి కొన్ని టేబుల్ స్పూన్స్ తేనె అలాగే 6 ఒవున్స్ నీరు అలాగే నిమ్మరసాన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మౌత్వాష్ గా వాడుకోవచ్చు. మీరు మౌత్వాష్ చేసుకున్న తర్వాత దీనినే తాగినా ఇబ్బంది ఉండదు. ఇలా చేయటం వల్ల గొంతు నొప్పి గాని, గొంతు సంబంధిత వ్యాధులు గాని రావు.