Posted on

Bleeding during pregnancy in Telugu – గర్భధారణ సమయంలో రక్తస్రావం యొక్క కారణాలు

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు రక్తస్రావం ఏర్పడితే మీకు భయం కలగచ్చు. కానీ గర్భం ధరించిన మొదటి మూడు త్రైమాసికంలో ఇది చాలా సాధారణం మరియు ఎలాంటి అపాయము కలిగించదు. పరిశోధన ప్రకారం 25% గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయంలో మొదటి త్రైమాసికంలో రక్తస్రావం సాధారణంగా ఏర్పడుతుంది, వీరిలో కొందరికి మాత్రమే భారీ రక్తస్రావం మరియు అపాయం కలుగుతుంది. ఇది కేవలం మూడు రోజులు లేదా అంతకంటే తక్కువ రోజులు ఉంటుంది.

రక్తస్రావం యొక్క కారణాలు

ఎగ్ ఇంప్లాంటేషన్

గుడ్డు ఫలదీకరణ గర్భాశయం యొక్క పొరల్లో జరిగినప్పుడు రక్తస్రావం ఏర్పడుతుంది. చాలామంది మహిళలు ఈ రక్తస్రావాన్ని తమయొక్క సాధారణ ఋతు స్రావం అని అనుకుంటారు.

హార్మోన్ల ప్రభావాలు

మీరు గర్భిణిగా ఉన్నప్పుడు రక్తస్రావాన్ని ఆప గలిగే హార్మోన్ల అసమతుల్యత వలన బ్రేక్‌త్రూ రక్తస్రావం కలుగుతుంది. ఇది మీకు ఎలాంటి హానీ కలిగించదు ఎందుకంటే మీ అండాశయం నుండి ప్లాసెంటా ఈ హార్మోన్లను ఉత్పత్తి చేసి రక్తస్రావాన్ని ఆపుతుంది. కొందరికి ఈ రక్తస్రావం గర్భధారణ సమయం మొత్తం ఉండొచ్చు. వీటి యొక్క లక్షణాలు మీ మామూలు ఋతు స్రావం సమయంలో కలిగేటువంటి తిమ్మిరి మరియు వెన్నునొప్పి లాంటివి. దీని వలన చాలా మంది మహిళలు మొదటి త్రైమాసికంలో దీనిని నెలసరి ఋతు స్రావం అని అనుకుంటారు.

సెక్స్

గర్భం ధరించిన తరువాత సెక్స్ వలన రుతుస్రావం ఏర్పడుతుంది. ఇది ఎలాంటి హాని కలిగించదు. సెక్స్ తరువాత మీ గర్భాశయమునకు ఎక్కువ రక్తం సరఫరా అవటం వలన మరియు మీ గర్భాశయం మృదువుగా అవటం వలన ఈ రక్తస్రావం ఏర్పడుతుంది. మీ వైద్యులతో ఈ విషయం గురించి చెప్పండి, మీరు సెక్స్ ఆపవలసిన అవసరం ఉన్నట్లయితే వారు తెలియచేస్తారు. మీకు ఏదైనా ఆరోగ్య సమయాలు లేదా గర్భస్రావం లాంటి సమస్యలు ఉన్నట్లయితే సెక్స్‌ను తాత్కాలికంగా ఆపడం మంచిది.

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ

గుడ్డు యొక్క ఫలదీకరణ గర్భాశయం బయట అనగా ఫెలోపియన్ ట్యూబ్ (అండాశయము నుండి గర్భకోశమునకు గల నాళ మార్గము) లో జరిగినప్పుడు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కలుగుతుంది. వీటి యొక్క లక్షణాలు : కడుపులో వికారం అనిపించటం, మీ ఉదరంలో క్రామ్ప్స్ రావటం, నొప్పి మరియు మైకము. ఈ నొప్పి తగ్గిపోయినట్టు అనిపించినప్పటికీ ట్యూబ్ లో చీలికలు ఏర్పడితే మల్లి నొప్పి పుట్టవచ్చు. ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఇది ఫెలోపియన్ ట్యూబ్ చీల్చి అంతర్గత రక్తస్రావానికి(ఇంటర్నల్ బ్లీడింగ్) దారితీస్తుంది. ఇటువంటి ఎమర్జెనీ సమయంలో మీకు తరచుగా వైద్య సంరక్షణ అవసరం. మీ గర్భంతో పాటు చీలిపోయిన మీ ఫెలోపియన్ ట్యూబ్‌ని కూడా తీసివేయవలసి ఉంటుంది.

అసాధారణమైన ప్లాసెంటా

గర్భాశయంలోని ప్లాసెంటాలు తక్కువగా ఉన్నప్పుడు ఈ రక్తస్రావం ఏర్పడుతుంది. కొన్ని సార్లు స్వయంచాలకంగా ప్లాసెంటాలు సెట్ రైట్ అవుతాయి. దీనిని ప్లాసెంటా ప్రైవియ అని అంటారు. ఇది చాలా అరుదైన పరిస్థితి. ఈ ప్లాసెంటా ప్రైవియ మీ రెండవ త్రైమాసికంలో రక్తస్రావాన్ని కలిగించవచ్చు. దీనిని కనుకొనేందుకు వైద్యులను సంప్రదించండి. ఈ పరిస్థితి ఉన్నట్లయితే శిశువుకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు మీకు చాలా విశ్రాంతి అవసరం.

ప్లాసెంటాల్ విభజన

ప్లాసెంటాల్ అబ్రప్షన్ అనగా మీ గర్భాశయం గోడలపై ఉన్న ప్లాసెంటా వేరు చేయబడటం. గర్భధారణ సమయంలో రక్తస్రావం కలగటానికి ఇది కూడా ఒక కారణం. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. వీటి యొక్క లక్షణాలు: ఎక్కువ రక్తస్రావం మరియు విపరీతమైన నొప్పి.

దీని యొక్క కారణాలు: ధూమపానం, రక్తపోటు, మూత్రపిండం సమస్యలు, లేదా ప్రీ-ఎక్లంప్సియా. ఈ పరిస్థితికి వైద్య సంరక్షణ వెంటనే అవసరం.

గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లు

ఫైబ్రాయిడ్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఇవి నార వంటి కండరాలు. ఇవి గర్భాశయ గోడల వెలుపల మరియు బయట కనిపిస్తాయి. ఇవి సమస్యాత్మకమైనది కావచ్చు లేదా సమస్య కలిగించక పోవచ్చు. వీటి యొక్క పెరుగుదల, అది పెరిగే స్థానాన్ని బట్టి ఉంటుంది. గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లు ఎక్టోపిక్ గర్భానికి దారి తీయవచ్చు, భారీ రక్తస్రావం, గర్భస్రావం కూడా కలిగించవచ్చు. కొన్నిసార్లు ఎటువంటి సమస్యలూ కలిగించవు, కానీ ముందు జాగ్రత్త కోసం ఒక వైద్యుడిని సంప్రదించటం మంచిది.

గర్భస్రావం

గర్భస్రావం అనేకమంది మహిళలకు గర్భవతి అని కూడా గుర్తించని మొదటి త్రైమాసికంలో జరుగుతుంది. ఇలా జరగటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. గర్భంలోని శిశువుకు హాని కలగడం: స్త్రీ యొక్క శరీరానికి గర్భాన్ని ధరించే శక్తి లేనప్పుడు గర్భస్రావం కలుగుతుంది. మీ మొదటి త్రైమాసికం పూర్తి అయిన తరువాతే మీరు గర్భవతి అని ఖచ్చితంగా నిర్ణయించవచ్చు.

వీటి యొక్క లక్షణాలు: రక్త స్రావం, వెన్నునొప్పి, క్రామ్ప్స్ మరియు కడుపు నొప్పి.