Posted on

Bronchitis Causes, Symptoms, Home Remedies in Telugu – బ్రాంకైటిస్‌ను నివారించుకోండిలా..!

ఖంగు..ఖంగ్..ఖంగు..ఖంగ్..అని దగ్గు వస్తుంటే చెప్పలేనంత ఇబ్బందిగా ఉంటుంది.అమ్మో..ఈ దగ్గు మనల్ని ఎప్పుడు వదులుతుందో అన్న బాధ నిలువెల్లా కలచివేస్తుంది. అంతేకక ఈ దగ్గు వల్ల ఊపిరితిత్తులే కాక గొంతు మంటా,గొంతులో గరగర ఇలా ఎన్నో మనల్ని వేధిస్తాయి.అయితే ఈ దగ్గులోఎన్ని రకాలున్నాయి అని ప్రశ్నిచుకుంటే సమాధానాలు చాలా వస్తాయి.దీనినే బ్రాంకైటిస్‌ అని అంటారు.ఈ రుగ్మత మనిషిని ఎంతో బాధిస్తుంది.ప్రాధమికంగా దీని నుంచి బయటపడే కొన్ని చిట్కాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

  •  మొదటిదైన అక్యూట్ బ్రాంకైటిస్ అనేది జలుబు, దగ్గు తీవ్రంగా ఉండడం వల్ల వస్తుంది. ఒళ్ళునొప్పులు, నీరసం, జ్వరం, తలపోటు వంటివి ఈ వ్యాధి లక్షణాలు.  ఒకవేళ దీనికి సరైన చికిత్సను తీసుకోకుంటే అది న్యూమోనియాకు దారితీసే అవకాశాలున్నాయి.

  • క్రోనిక్ బ్రాంకైటిస్ అనేది తరచూ ధూమపానం చేయడం, పొగాకు ఉత్పత్తులను సేవించడం ద్వారా సోకుతుంది.ఊపిరితిత్తుల్లో శ్వాసకోశ సమస్యలను కూడా పెంచుతుంది. బ్యాక్టీరితో సోకిన బ్రాంకైటిస్‌కు యాంటీబయాటిక్స్ అవసరముంటాయి కానీ వైరస్‌తో సోకిన వ్యాధికి తప్పనిసరిగా చికిత్స చేయాల్సి ఉంటుంది. వ్యాధి ప్రాథమిక దశలో ఉండగా, ఈ చిట్కాలను పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.

  • శీతలపానీయాల జోలికి వెళ్ళకుండా ఆరోగ్యకరమైన పళ్ళ రసాలను సేవించాలి. మనకు ఇబ్బంది పెడుతున్న అనుకునే ఫలాలను మినహాయించాలి.

  • వీలైనంతవరకు మంచినీటిని ఎక్కువగా సేవించాలి  కాచి వడబోసిన నీరైతే మరింత శ్రేష్టం.గోరువెచ్చని హెర్బల్ తేనీరు సేవించడం వల్ల ముక్కు, గొంతు సమస్యలకు ఉపశమనం ఉంటుంది.

  • చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడేవారు ఆల్కాహాల్, సోడాను పూర్తిగా తగ్గించాలి. వీటి వల్ల డీహైడ్రేషన్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

  • థైమ్ టీ సహజ ఔషధం, క్యామోమైల్ టీని గొంతులో గరగరకు, పెప్పర్‌మెంట్‌కు టీ ముక్కుదిబ్బడను తగ్గించడానికి, అనీసీడ్, హోలీ బేసిల్‌ను దగ్గు తగ్గించడానికి  ఉపయోగపడుతుంది. గోరువెచ్చటి నీటిని సగం టీస్పూన్ఉప్పుతో కలిపి నోరు పుక్కిలిస్తే గొంతు సమస్య తగ్గిస్తుంది. నిమ్మ, నారింజలు ఈ ద్రవంతో కలిపితే అది యాంటీబ్యాక్టీరియల్‌గా కూడా పనిచేస్తుంది.

  • కొన్ని సందర్భాల్లో చికెన్ సూప్‌ను కూడా జలుబు తగ్గడానికి ఉపయోగిస్తారు. మ్యూకస్‌ను పనితీరును మెరుగుపరిచి సమస్యను తగ్గించడానికి ఇది దోహదపడుతుంది.

  • పడక గది వాతావరణంలో కాస్త తేమను ఉండేలా చూసుకోవాలి. సహజంగా లభించే యాంటీవైరల్ ఉత్పత్తులైన ఆర్గానో ఆయిల్, అల్లం మిశ్రమాలను ఉపయోగించవచ్చు

  • మనకు రోజూ కనిపించే అల్లంలో ఎన్నో పోషక విలువలుంటాయి. యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉన్న అల్లం చెవి, ముక్కు, గొంతు సమస్యలను నివారించడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

  • సైనస్ ఉన్నవారు అరోమాథెరపీ స్టీమ్‌ను దీర్ఘంగా పీల్చితే కాస్త ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు వైద్యుల సూచన ప్రకారం కొన్ని తైలాలు ఈ థెరపీకి ఉపయోగిస్తే శ్వాస సాధారణంగా మారడానికి తోడ్పతుంది. పుదీనా, శొంఠివి వంటిని మితంగా కలపడం కూడా మంచిది.