Posted on

Telugu tips to calculate the most fertile days in women – మహిళల్లో అత్యంత ఫర్టిలిటీ రోజులను లెక్కించే విధానాలు

మీరు గర్భవతి అవ్వటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే మీరు ఉత్తమ సంతానోత్పత్తి సమయం ఎప్పుడని తెలుసుకోవడం చాలా అవసరం. మీరు అండోత్సర్గం క్యాలెండర్‌ను మరియు గర్భధారణ అవకాశాలు పెంచడానికి లైంగిక సంబంధాలకు మంచి సమయాలను లెక్కించాలి. మీరు చేయవలసిందల్లా మీ ఋతు చక్రంను సరిగ్గా ట్రాక్ చేయాలి.

మీ పీరియడ్స్ యొక్క అత్యంత ఫర్టిలిటీ రోజులను తెలుసుకోండి

మీకు మీ ఋతు చక్రం సరిగ్గా ఉన్నప్పటికీ గర్భవతి కాలేకపోతున్నారా! సరైన సమయంలో నెలసరులు వస్తున్నప్పటికీ ప్రెగ్నెన్సీ సమస్యను ఎదుర్కొనుట సహజమయిన విషయమే. ఋతు స్రావం సమయంలో మహిళలు గర్భవతి అవుతారని ప్రజలు నమ్ముతుంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఋతు చక్రాల రోజులలో సంతానోత్పత్తి ప్రక్రియ జరగదు. అండోత్సర్గం సంభవిస్తేనే మీరు గర్భవతి కాగలుగుతారు. అండోత్సర్గము జరిగే ముందు కూడా గర్భం ధరించవచ్చు. అండోత్సర్గము అంటే ఒక పరిపక్వ గుడ్డు మీ అండాశయం లోనికి ప్రవేశిస్తుంది మరియు ఆ గుడ్డు స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చేయబడుతుంది. ఇప్పుడు, మీ ఫర్టిలిటీ రోజులు ఏమిటో అది మీరు ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం.

మందమైన లైనింగ్ యొక్క తొలగింపు

మీ గర్భాశయం నుండి మీ యోని ద్వారా బయటకి వచ్చిన మందమైన లైనింగ్‌ని మీరు గమనిస్తునట్లయితే అది మీ ఫర్టిలిటీకి ఉత్తమ సమయం అని తెలుసుకోవచ్చు. మరియు ఇది మీ ఋతు స్రావ సమయంలో 3 నుండి7 రోజులు రక్తస్రావానికి కారణమవుతుంది. ఫొలికల్స్ లో గుడ్డు ఉంటుంది మరియు దాని పెరుగుదల 13 నుండి 14 రోజుల ఫోలిక్యులర్ ఫేస్లో జరుగుతుంది.

లూటినీజింగ్ హార్మోన్

లూటినీజింగ్ హార్మోన్ స్థాయి పెరుగినప్పుడు అండోత్సర్గము ఏర్పడుతుంది. ఇది చాలా చిన్న దశ, కేవలం 16 నుండి 32 గంటలు మాత్రమే కొనసాగుతుంది. శరీరం నుండి ఒక గుడ్డును విడుదల చేయడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది.

మితవాద (లుటీల్) పరిస్థితి

ఇది అండోత్సర్గము తర్వాత ప్రారంభమవుతుంది మరియు మీ తరువాతి పీరియడ్స్ వరకు కొనసాగుతుంది. ఇది గుడ్డు ఫలదీకరణం చేయబడినప్పుడు మరియు గర్భాశయ గోడలో అమర్చబడే సమయంలో గర్భాశయంను సిద్ధం చేయడానికి బాగా సహాయపడుతుంది.

గర్భం ధరించడానికి ఉత్తమ సమయం తెలుసుకోండి

మీరు ప్రెగ్నెన్ట్ కావడానికి మీ భాగస్వామితో సంపర్కం కలిగి ఉండేందుకు ఉత్తమ సమయం తెలుసుకోవాలి. మీ భాగస్వామితో సెక్స్ చేయడం ద్వారా గర్భవతి అవ్వడానికి ఋతు చక్రం సమయంలో చాలా అవకాశాలు ఉంటాయి. చాలామంది మహిళలకు ఆరు రోజులు చాలా సాధారణ సంతానోత్పత్తి రోజులు.

ఆ రోజులలో లైంగిక సంబంధం కలిగి ఉండటం వలన గర్భవతి అవుతారని భరోసా ఉండదు, కానీ గర్భవతి కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

మీరు ఒక విషయాన్ని మర్చిపోకూడదు, ఏమిటంటే అండోత్సర్గము ముందు లేదా అండోత్సర్గము జరిగిన 24 గంటల తరువాత గర్భవతి అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి.

మీ పీరియడ్స్ యొక్క క్రమబద్ధతను తెలుసుకోండి

ప్రతి మహిళకు ఋతు చక్రం వేరుగా ఉంటుంది, అది ఒత్తిడి వంటి కొన్ని కారణాల వలన కూడా మార్పు చెందుతుంది. మీరు మూడు నుండి నాలుగు నెలల పాటు మీ ఋతు స్రావం ఎంతకాలం కొనసాగుతోంది మరియు ప్రతి నెలా అదే సమయంలో సంభవిస్తోందా అని గమనించాలి.

మీ నెలసరులు సంభవించినప్పుడు తేదీని ప్రారంభించి మీ తదుపరి నెలసరి సంభవించే వరకు రోజులను లెక్కించండి. ఋతు చక్రం యొక్క సాధారణ వ్యవధి 28 రోజులు లేదా 21 నుండి 35 రోజుల వరకు ఉంటుంది.

ఇర్రెగులర్ పీరియడ్స్ సమస్య ఉందా?

మీరు మీ నెలసరులను మూడు నుండి నాలుగు నెలలు ట్రాక్ చేయాలి. ఒకవేళ క్రమంగా లేనట్టు కనుగొంటే, మీకు ఇర్రేగులర్ పీరియడ్స్ ఉన్నట్టు. ఎక్కువ శారీరక కార్యకలాపాలు, వైద్య సమస్యలు, ఒత్తిడి మరియు బరువు తగ్గటం వంటి కారణాల వలన ఇర్రెగులర్ పీరియడ్స్ కలుగుతాయి. ఇటువంటప్పుడు తీవ్రమైన వైద్య సమస్యలను నివారించడానికి మీ డాక్టర్ను సంప్రదించండి. క్రమరహిత నెలసరులలో గర్భధారణ కలగవచ్చు, అయితే దీనికి కొద్దిగా సమయం పడుతుంది మరియు కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.

మీకు మూడు నెలల వరకు పీరియడ్స్ రాకపోయినా మరియు మీరు కన్సీవ్ కాకపోయినా మీకు వైద్య సహాయం అవసరం. హార్మోన్ల రుగ్మత క్రమరాహిత్యమైన ఋతు స్రావానికి కారణమవుతుంది. మీ పునరుత్పత్తి అవయవాలలో ఇన్ఫెక్షన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యల వలన కూడా ఇర్రేగులర్ పీరియడ్స్ కలగవచ్చు.

మీ ఫర్టిలిటీ కాలాన్ని తెలుసుకోండి

మీకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నట్లయితే గర్భవతి కావటం చాలా సులభం. మీరు మీ నెలసరుల ఆధారంగా మీ సంతానోత్పత్తికి తగిన కాలాన్ని తెలుసుకోవచ్చు. మీ అండోత్సర్గము ప్రారంభం అయినప్పటి నుండి మీ సంతానోత్పత్తి విండో ప్రారంభమవుతుందిఅండోత్సర్గము జరిగిన రోజుతో సహా మొత్తం ఆరు రోజులు. మీ ఋతు చక్రం కాలాన్ని ఉపయోగించి మీ ఫర్టిలిటీ రోజులను తెలుసుకోవచ్చు. ఋతు చక్రం యొక్క సమయం నుండి 14 రోజులు తీసివేయాలి.

  • మీ ఋతు చక్రం 28 రోజుల పాటు కొనసాగినట్లయితే ఋతు చక్రం యొక్క 14వ రోజు అండోత్సర్గము జరుగుతుంది. 14వ రోజు మీకు అత్యంత సారవంతమైనది మరియు 12, 13 రోజులు కూడా సారవంతమైనవి.
  • మీ ఋతు చక్రం 21 రోజుల పాటు ఉన్నట్లయితే అండోత్సర్గము 7వ రోజు జరుగుతుంది. 7వ రోజుతో పాటు, 5 మరియు 6 వ రోజులు కూడా మరింత సారవంతమైనవి.
  • మీ ఋతుచక్రం 35 రోజుల పాటు కొనసాగినట్లయితే, మీ ఋతు చక్రం యొక్క 21 వ రోజున అండోత్సర్గము జరుగుతుంది. 21 అలాగే 19 మరియు 20వ రోజు కూడా సారవంతమైన రోజులు.