Posted on

Telugu tips for mind stability mental peace – మీలో అస్థిరతను తొలగించేందుకు కొన్ని మార్గాలు

 

అస్థిరత, చాంచల్యము, డోలాయమానము ఇది ఎక్కువగా యువతలో కనపడుతున్న, వినపడుతున్న పదాలు. పదాలు కొత్తగా ఉన్నా దీనిని ఇప్పుడు ఆగ్లంలో పిలుస్తున్న పదమయితే ఫ్రక్చువేషన్ అని పిలుస్తున్నారు. అయితే దీని ప్రభావం మానవునిపై ఉండబట్టే ఈనాడు దీని కింత ప్రధాన్యత సంతరింన్చుకుంది. ఈ లక్షణం ఎక్కువ అయితే ఆ వ్యక్తి రాక్షసుడిగా మారతాడు. ఈ లక్షణం పెరిగి పెద్దదై చివరికి తనను తను బాధ పెట్టుకొవటమో లేక పక్కవారిని బాధపెట్టటమో చేస్తాడు.

ఈ హెచ్చు తగ్గులు ఈ మార్పులు మనకు తెలియకుండానే మన దరి చేరతాయి.దీని వల్ల తీవ్ర అనారోగ్యాల పాలుకాక తప్పదు.కాబట్టి వాటిని నియంత్రిచుకోవటం ఎలా అనేది ఈ కాలంలో తెలుసుకుందాం. సాధారణంగా ఈ అస్థిరత అనేది ఏర్పడే సమయంలో రక్తపోటు స్థాయి పెరిగిపోతుంది.నరాలు బాగా విపరీతమైన నొప్పికి గురవుతాయి. తలనొప్పి ఎక్కువగా వస్తుంది.ఆ సమయంలో ఏ పనీ, ఆలోచన కానీ చేయలేము.

ఈ సమస్యకు ఆడ మగ అన్న తేడాలయితే లేవు కానీ వారి రక్తపోటు స్థాయిలను బట్టి ఉంటుంది. మీ తల బరువుగా, భారంగా ఉండి, చేతులు లాగటం జరిగితే అది ఖచితంగా రక్తపోటు పెరిగినట్లే. అయితే ఒకనాడు ఉన్న పరిస్ఠితికి నేడు ఉన్న పరిస్థితికీ చాలా తేడాలున్నాయి. ఒకనాడు రక్తపోటంటే పెద్దలోనే వచ్చేది.కానీ ఈనాడు ఇది అన్ని వయస్సుల వారినీ ఇబ్బంది పెడుతోంది.

ఇలా అస్థిరత మీలో చోటు చేసుకున్నప్పుడు వెంటనే మీరు మీ చిటికిన వేలిని రెండు చెవుల్లోనూ లోపల ఉంచి అటూ ఇటూ కదుపుతూ ఉండాలి. ఈ ప్రక్రియను రెండు మూడు నిముషాలు ఉంచి తగ్గించుకోవాలి.తగాని పక్షంలో మరోసారి ఇలాగే చేయాలి.దీనినే యోగా పరిభాషలో అనులోమ్ విలోమ్ ప్రాణాయామా అని అంటారు.

శరీరంలో అస్థిరత చోటు చేసుకున్నప్పుడు ఎక్కువగా నీరు త్రాగాలి. ఇందువల్ల నరాల్లో రక్త ప్రసరణ జరిగి తగ్గుతుంది.
ఫ్రక్చువేట్ అవ్వటానికి కారణం మానవునిలో ఉన్న ఎలక్త్రో ఎన్సెఫలోగ్రం అని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాక హైపెర్ టెన్షన్ లో వచ్చే దానిని ఆర్థోస్టాటిక్ హైపర్ టెన్షన్ అని అంటారు.దీని కారణంగా తలనొప్పి, బూదరగా కనిపిచటమ్, నీరసంగా ఉండటం, తడబడటమ్ లాంటివి లక్షణాలు.

 • ఈ సమస్య ఆల్కహాలు త్రాగటం, ధూమపానం చేయటం, అతిగా ఒక విషయాన్ని ఆలోచించటం, మానసిక శారీరక ఒత్తిళ్ళు వలన ఇలా శరీరం అస్థిరతకు గురవుతుంది.
 • ఈ సమస్య నుంచీ బయటపడాలంటే ప్రొద్దున్నే యోగా చేయాలి.
 • నెమ్మదిగా స్థిమితంగా అలోచించాలి.
 • ఏ విషయానికీ ఒత్తిడి తీసుకొనరాదు.
 • చక్కటి ఆహార అలవాట్లు రోజూ అలవరచుకోవాలి.
 • ఎక్కువగా విదాకులు పొందినవారిలో, ఒన్తరిగా జీవించే వారిలో, రిటైర్డ్ అయిన వారిలో, నిరుద్యోగులలో, అంగవైకల్యం ఉన్న వారిలో ఎక్కువగా ఈ సమస్య కనపడుతోంది.
 • ఈ సమస్య నుంచీ బయటపడేందుకు వ్యాయామాన్ని అలవరచుకోవాలి, జీవిత లక్షాలను నిర్దేశించుకోవాలి.
 • కుటుంబ సభ్యుల, స్నేహితుల నున్చి చేయూత తీసుకోవాలి.
 • ఏదైనా నచ్చిన వాటిని ఆటలు, క్రీడలు అలవాటు చేసుకోవాలి.
Posted on

Telugu tips for constipation – Malabaddakam – మలబద్దకం

మీ కడుపులో సరిగా లేకపోతే ఆరోజంతా నరకంగా అనిపిస్తుంది.ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు కాని, ఈ మలబద్దకం(constipation) వల్ల నలుగురిలో ఉన్నప్పుడు, మీకే కాకుండా అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కంగారుపడి,భయపడవలసిన అవసరం లేదు, మీరు తీసుకునే ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.

 • పీచు పదార్దములు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి,దీని వల్లమలబద్దకం సమస్యనుంచి విముక్తి లభిస్తుంది. సామన్యముగా మనం పౌశ్టికమైన ఆహారం తీసుకోవడం కన్నా “జంక్ ఫుడ్”నే ఎక్కువగా ఇష్టపడతాము, కానీ ప్రతీ రోజూ మనం తీసుకునే ఆహారంలో 26 గ్రాముల పీచు పదార్దంతో కూడిన ఆహరం ఉండాలి.
 •  సామన్యంగా ఈ మలబద్దకము(malabaddakam), సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల, మన తీసుకునే ఆహారంలో పీచు పదార్దం లేకపోవడం వల్ల,ఇంకా చాల కారణముల చేత వస్తుంది.దానికోసం మందులు వాడి మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం సరికాదు,  పీచు పదార్దం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది.
 • పండ్లు , కూరగాయలు , బీన్స్ మరియు ధాన్యాలు:ఇవి అన్నీ అధిక శాతంలో పీచు పదార్దం కలిగి ఉన్నవే, అయితే సరియైన పౌశ్టికమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది.ఆకులు, పండ్లు, పండ్ల యొక్క  పై తొక్క భాగములో ఎక్కువగా మీకు పీచు పదార్దం లభిస్తుంది.ఆపిల్ పండులోని తొక్కను తీయకుండా తీసుకుంటేనే మంచిది,పచ్చి కూరగాయలు, ఆకుకూరలలో పీచు పదార్దమే కాదు శరీరానికి కావలసిన మెగ్నీషియం కూడా లభిస్తుంది.
 •  ఎండు ద్రాక్ష: ఈ మల బద్దక సమస్యకు ఎండు ద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న లక్షణాలు మన కండరాలను ఉత్తేజపరచి, పెద్ద ప్రేగు ద్వారా వ్యర్ద పదార్దాలని పంపించేస్తుంది.5 ఎండు ద్రాక్షలో 3 గ్రా.ము పీచు పదార్దం ఉంటుంది.
 •  కాఫీ మరియు ఇతర వేడి ద్రవాలు: కాఫీ మన ఆరోగ్యానికి ఏ రకంగాను సహయపడక పొయిన మనలోని ఒత్తిడిని తగ్గించి, మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.అయితే ఈ మలబద్దక సమస్య నిర్మూలనలోను కాఫీ ఎంతగానో సహాయపడుతుంది, అంతే కాకుండా ఇతరత్రా వేడి పదార్దాలు తీసుకోవడంలోను ఈ సమస్య నుంచి మంచి ఫలితం లభిస్తుంది.
 •  నీరు: మనం పీచు పదార్దం ఎంత తీసుకున్నప్పటికీ, దానికి తోడు నీరు కూడా తీసుకోవాలి,లేదంటే కడుపులో ఉన్న వ్యర్ద పదార్దాలు శుబ్ర పడకుండా అధిక నొప్పితో మలబద్దకముకు దారి తీస్తుంది.పండ్ల ముక్కల్ని నీటితో కలిపి తీసుకుంటే  మంచి ప్రభావం చుపిస్తాయి.
 •  రాత్రి పూట పడుకునే ముందు 1 గ్లాసు వేడి పాలు తాగి పడుకుంటే మీ జీర్ణాశయం శుబ్రపడి, మంచి ప్రబావం చుపిస్తుంది.
 • మీరు భోజనం చేసిన తరువాత దానిలో భాగంగనే పీచు పదార్దం తీసుకున్నట్లు అయితే అహారం త్వరగా జీర్ణం అయ్యి ఈ మలబద్దక సమస్యనుండి విముక్తి లభిస్తుంది.
Posted on

Teeth care mouth care tips in Telugu – నోటిని, పళ్ళను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి

నోటినీ,పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవటం వల్ల వయస్సు మీద పడేటప్పుడు వచ్చే సమస్యలకు  దూరంగా ఉండవచ్చు. నోటినీ శుభ్రంగా ఉంచుకోవటం అంటే రోజూ పళ్ళను శుభ్రంగా  ఉంచుకోవటం,వాటిని ఎప్పుడూ కడుక్కోవటం. నోటిని శుబ్రంగా ఉంచుకోవటం ఎలా అనేది ఏ వయస్సు వారు ఎలా జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్నపిల్లలు:

పుట్టుకతోనే పిల్లల్లో పళ్ళు నిర్మాణం జరిగిపోతుంది కాని అవి చిగుళ్ళ క్రింద ఉండిపోతాయి.ఒకసారి పళ్ళు వచ్చాక ఆ నిర్మాణం జీవితాంతం ఉండిపోతుంది. కాబట్టి ఒకసారి పళ్ళు వచ్చాక వాటిని ఎలా ఉంచుకోవాలో తల్లిదండ్రులు తెలియజేయాలి. పుట్టుకతో వచ్చిన పళ్ళను సమ్రక్షించుకుంటే అవి వాళ్ళు పెద్ద అయ్యేవరకూ ఆ స్థానాలను పదిలంగా ఉంచుకుంటాయి. కాబట్టి మీ పిల్లలు చక్కగా ఆహారం నమలాలంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవటం ఒక్కటే మార్గం.

పిళ్ళల పళ్ళ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

1.అప్పుడే పళ్ళు వస్తున్న పిల్లలకు రోజూ పళ్ళను శుభ్రంగ తోమాలి.అంతేకాక అప్పుడే వచ్చే పళ్ళను ఒక గుడ్డ సాయంతో సున్నితంగ పళ్ళను తోమాలి.2 సంవత్సరలు లోపు పిల్లలకు బ్రష్ వాడకూడదు.కేవలం తడిగుడ్డతో మాత్రమే తోమాలి.
2.పిల్లల్ని నోటిలో సీసా పెట్టుకుని పడుకోనివ్వరాదు.ఎందుకంతే ఆ సీసాలో ఉన్న పాలు లేదా  మరేదైన తాగేవస్తువు పళ్ళలో చేరి పళ్ళను పాడు చేస్తాయి.
3.కొంచెం వయసు కలిగిన పిల్లలకు తక్కువా చక్కెర శాతం ఉన్న పదార్థాలైన పళ్ళు,కూరగాయలూ తినేలా అలవాటు చెయ్యాలి.అంతే కానీ చూయింగ్ గంలు,కాండీలు తిననివ్వకండి.
4.పిల్లలకు నోటి పరిశుభ్రత,పళ్ళ విషయం లో తీసుకొవలసిన జాగ్రత్తలునీర్పాలి.పళ్ళు శుభ్రపరచుకునే విధానాని వారికి తెలపాలి.
5.అలాగే పిల్లల్ని డెంటిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళలి.అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ఏడాది నిండిన పిల్లలకు చెక్ అప్ అవసరమని సూచిస్తోంది.

టీన్స్:

పళ్ళను శుబ్రంగా ఉంచుకోవటం వల్ల మీ చిరునవ్వు ఫ్రెష్గాను స్వాస మంచి ఫ్రెష్ గా ఉంటుంది.
1.మీ పళ్ళను రోజూ రెండు సార్లు ఫ్లూరైడె బ్రుష్ తో కడుకుంతే మంచిది.
2.రోజుకొకసారి పళ్ళను పుక్కిలించటం ఎంతో మంచిది.
3.చూయింగ్ గం తినకూడదు,పొగ త్రాగరాదు.ఎందుకంటే పొగ త్రాగటం వల్ల మీ పళ్ళు గారలు పడతాయి.ఫలితంగా నోరు దుర్వాసన వస్తుంది,అంతేకాక కాన్సర్ వస్తుంది.
4క్రికెట్ మొదలైన క్రీదల్లో తలకు ధరించె హెల్మెత్ను వాడలి.
5.ప్రతీ ఆరు నెలలకొకసారి మీ డెంటిస్ట్ ను కలవండి.చెక్ అప్ చేయించుకోండి.

పెద్దలు:

పళ్ళ సమ్రక్షణ చక్కగా చేసుకోవటం వల్ల చిగుల్ల సమస్యలకు, పళ్ళు ఊడిపోవటం సమస్యలు తలత్తకుండా ఉంటాయి.
1.రోజూ 2 సార్లు బ్రష్ చెసుకోవాలి.ఫ్లూరైడ్ బ్రష్ తో తోముకోవాలి.రోజుకొకసారి పళ్ళను పుక్కిలించుకోవాలి.
2.చూయింగ్ గం వాడవద్దు,పొగ త్రాగవద్దు.
కొన్ని మందులు వాడినప్పుదు పళ్ళపై వాటి ప్రభావం ఉంటుంది.కాబట్టి మీ డెంటిస్ట్ ను సంప్రదించాకే వాటిని వాడండి.
3.మీ నోతిని, పళ్ళను నిత్యం పరీక్షించి చూసుకోండి.ఎందుకంతే బలహీనపడిన పళ్ళు,చిగుళ్ళ సమస్యా తెలిసేందుకు అవకాశముంది.
4.ప్రతి ఆరు నెలలకొకసారీ మీ దంత వైదుని వద్దకు వెళ్ళండి.
Posted on

Telugu tips to follow for the good health – చక్కటి ఆరోగ్యానికి పాటించవలసిన పధ్ధతులు

మీకు మీ ఆరోగ్యం అంటే శ్రధ్ధ వుందా? మీ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యమని ఏనాడైన ఆలోచించారా?అవును మన ఆరోగ్యం బాగుంటేనే కొంతకాలం జీవిత లక్ష్యాలు సాధించవచ్చు.అంతే కాక మన ఆరోగ్యాన్ని చూసి మరికొందరు మారే అవకాశముంది.మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని అదీ మన అలవాట్లలోనె ఉందని ఇప్పుడు తెలుసుకుందాం:
ఆహారంలో ఎక్కువగా పళ్లు, కూరగాయలు ఉంటే అది ఆరోగ్యకరమైన ఆహారం అన్నమాట.అధిక బరువు తగ్గితే, దాంతో పాటు ఉప్పు వాడకం తగ్గిస్తే రక్తపోటు తగ్గుతుంది. పక్షవాతం రావడానికి ముఖ్య కారణం అధిక రక్తపోటే. సగం గుండెపోటు, పక్షవాతాలకు కారణం అధిక రక్తపోటు. రక్తపోటు, కొలెస్ట్రాల్, షుగర్ ఏ స్థ్తాయిలో ఉన్నయో,ఏ స్థ్థాయిలో ఉండాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
అదేవిధంగా గుండె బాగా పని చేసేందుకు ఓ కార్యచరణను రూపొందించుకోవలి. ఎక్కువగా మధ్యపానం చేసే వారిలో గుండె జబ్బులు,లివర్  పాడవటం,రక్ట పోటు పెరిగి పోవటం లాంటివి వస్తాయి. అంతేకాక మధ్యపానం చేసే వారిలో రక్తపోటు కూడా పెరుగుతుంది. సరైన ఆరోగ్యం కొరకు మధ్యపానం ఆపేయాలి.ఇక ధూమ పానం విషయానికొస్తే రోజూ తక్కువ తక్కువగ మనేయ్యాలి. అంతేకాక ధూమపానం మానటానికి ఎన్నో మందులు ఈ రోజు వచ్చాయి. అంతే కాక ధూమ పానం చేయలి అనుకున్నప్పుడు పనిమీదే శ్రధ్ధ పెడితే దానిపై ధ్యాస పోతుంది.
రోజూ అరగంట పాటు నడక, లేదా ఏ ఇతర సులభమైనటువంటి వ్యాయామం చేస్తే గుండెపోటు, పక్షవాతం రాకుండా నిరోధించవచ్చు.ఒక సంవత్సరం పాటు పొగతాగడం మానేస్తే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సగం తగ్గుతుంది. కొన్నేళ్ళు పొగతాగకుండా ఉంటే ఆ రిస్క్ పూర్తిగా పోతుంది.మీరు తాగకపోయినా పక్కవారు తాగి పీల్చే పొగ వల్ల వారికంటే ముందు మీరు జబ్బుపడతారు. అంటే మీరు ప్రతి రోజూ చేసే పనిలో శారీరక శ్రమనుఉందేలా చూసుకోవాలి.
వీలైనప్పుడంతా నడవడం చేయాలి. శుభ్రమైన గాలి పీల్చడానికి కాసేపు నడవాల్సి వస్తే నడవండి. రోజుకు రెండు సార్లు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు ఐదు నిమిషాలపాటు చేయొచ్చు. బయట తినేటప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. క్యాంటీన్ లో, హోటళ్లలో ఏది పడితే అది తినటం మంచిది కాదు.మానసిక ఒత్తిళ్ళ వల్లే కాక  పొగతాగడం, ఆల్కహాలు తీసుకోవడం, ఏ ఆహారం పడితే ఆ ఆహారం తినడం వల్ల జరుగుతుంది.కొవ్వు తక్కువగా వుండే పద్దార్థాలు తినటం ఎంతో మంచిది. పండ్లు, తాజా కూరగాయలు తినటం శరీరానికి ఎంతో మంచిది.
Posted on

Green tea health benefits in Telugu – గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రస్తుతం మనం రోజూ వారి జీవితంలో మన ఆరోగ్యన్ని రక్షించుకోవడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అందులో సహజమైన,పద్దతిలో, అందరికీ, అతి తక్కువ ఖర్చుతో లభించేది ఈ గ్రీన్ టీ, ఇది ఎప్పటినుంచో ఆరోగ్య సం రక్షణలో ఎంతోగానో ఉపయోగపడుతుంది,అధిక బరువుని తగ్గించడమే కాకుండా ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎన్నో అద్భుతాలు చేస్తుంది.అవి ఏంటో చుసేద్దామా:

 • క్యాన్సర్ పై పొరాడుతుంది:క్యాన్సర్ అనేది మన శరీరంలోని రక్త కణాలని,క్యాన్సర్ కణాలుగా మార్చుకుంటూ అధికమవుతుంది, ఈ గ్రీన్ టీ రక్త కణాలకు ఇబ్బంది కలగకుండా క్యాన్సర్ కణాలను తొలగిస్తూ,  పెద్దప్రేగు ,కడుపు భాగం, క్లోమము మరియు పిత్తాశయమును క్యాన్సర్  ప్రమాదము నుండి కాపాడుతుంది.

 • గుండె జబ్బులు నయం చేస్తుంది :ఈ గ్రీన్ టీ గుండెపోటు, రక్తపోటు, వంటి ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తుంది, దీని వల్ల మన మన గుండెలో కొవ్వు శాతం తగ్గి, గుండే,రంద్రాలు శుబ్రం అవుతాయి.

 • రక్తపోటును నియంత్రించడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

 • కీళ్ళ నొప్పి,కీళ్ళవాతం ఇలాంటి ఇబ్బందులనుండి కాపాడుతుంది.

 • మనలోని రోగ నిరోదక శక్తిని పెంచి, రక రకాల రోగములు, క్రిముల నుండి మనల్ని రక్షించడమే కాకుండా ఎటువంటి  వైరల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది.

 • కాలేయ రక్షణకై: మన శరీరంలోని కొన్ని విష పదార్దాల వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది, ఈ గ్రీన్ టీ వాటిని తొలగించి మీ కాలేయాన్ని కాపాడి మంచిగా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

 • ఇది మనలో పేరుకున్న కొవ్వుని తొలగించి, గుండె పోటుకి, అధికబరువుకి దూరంగా ఉంచుతుంది,

ఇంకెందుకు ఆలస్యం  రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తీసుకొండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి

Posted on

Tulasi benefits in Telugu – మీ ఆరోగ్యం – పవిత్రమైన “తులసి” తోనే సాద్యం

మానవుని ఆరోగ్యం కోసం,అందం కోసం, చర్మ సౌందర్యం కోసం ఎన్నో సహజ పద్దతులు ఉన్నాయి, అందులో తులసి ఎంతో ప్రముఖమైనది, గత 5000 సంవత్సరాలుగా సహజ పద్దతులలో మీ ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో తులసి ఎంతో ఉపయోగపడింది. ఎన్నో అద్భుతాలకు కారణం అయినది, అందుకే “తులసి”ని అందరూ “మూలికల రాణీ” అని వర్ణిస్తారు. దీనిని మందుల తయారిలో, ఎన్నో చికిత్సలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మన యొక్క మానసిక స్తితి పై మంచి ప్రభావాన్ని చూపించి, మంచి ఫలితాలను ఇస్తుంది.

ఎందరో ఈ తులసిని ఆయుర్వేదంలో “దోష నివారిణీగా” గుర్తించ్చారు,అంతే కాకుండా మంచి ఆరోగ్యం కోసం ఎంతో మంది దీని పచ్చి ఆకుల్ని నములుతారు.

తులసి వల్ల మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందామ :

దగ్గు మరియు శ్వాసకోశ సమస్యలు

మీరు జలుబు,దగ్గు,శ్వాసకి సంబందించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే తులసితో మంచి ఫలితాలు పొందవచ్చు.తులసి లోని ఔషధ లక్షణాల మిమ్మల్ని ఈ సమస్యల నుండి విముక్తుల్ని చేస్తుంది.అంతే కాకుండా ఇది ఉపయోగించడం వల్ల జ్వరము,తుమ్ములు, మరియు వైరల్ నుండి  మంచి విముక్తు లబిస్తుంది.

ఒక వేళ మీకు జలుబు చేస్తే కొంచెం తులసి ఆకులు, లవంగాలు, కొంచెం ఉప్పు కలిపి తీసుకుంటే, అన్నిటి నుండి మంచి ఉపసమనం కలుగుతుంది. ఆస్త్మా మరియు జలుబు నివారణకు మంచి ఔషదం.

కిడ్నీలో రాళ్ళ సమస్య

మీ కిడ్నీలో రాళ్ళు ఉంటే కొంచెం తులసి రసంలో, తేనె కలిపి తీసుకోండి, మీ కిడ్నీలో రాళ్ళ కరిగిపోయి మంచి ఫలితాలు లబిస్తాయి.

గుండె జబ్బులు

మీ గుండె సమస్యల్లో, మరియు, స్ట్రోక్ రాకుండా కాపాడడంలో తులసి ఎంతగానో ఉపయోగ పడుతుంది.

దీనిలో ఉన్న”విటమిన్ C” మీ గుండె జబ్బులని నయం చేసి, ఏ విదమైన ఇబ్బందులు కలగకుండా  కాపాడుతుంది.

మీ గొంతు కోసం

మీ గొంతు సమస్యలకు కూడ ఎంతో ఉపయోగపడుతుంది, జలుబు చేసి మీ గొంతు మూగబోయిన,ఎంతో ఇబ్బందిగా అనిపిస్తున్నా కొంచెం నీరు తీసుకుని అందులో తులసి ఆకులు వేసి మరిగించి ఆ నీటిని తాగితే మీ గొంతు ఏ సమస్యలు లేకుండా మంచిగా మారుతుంది.

పళ్ళ సమస్యలు

ఇది మీ పళ్ళ సమస్యల్లో ఎంతగానో ఉపయోగ పడుతుంది, దీనిని మీ పళ్ళు శుబ్రపరుచుకోవడానికి ఉపయోగిస్తారు.

పిల్లల సమస్యలు

తులసి చిన్న పిల్లలు యొక్క ఆరోగ్య సమస్యలలో ఎంతగానో ఉపయోగపడుతుంది, దగ్గు, జలుబు, విరేచనాలు, మరియు వాంతులు వంటి సాధారణ సమస్యల నుంచి విముక్తినిస్తుంది.ఆటలమ్మ, కడుపులో పురుగులు ఉన్నపుడు, గొంతు సరిగా లేనప్పుడు, ఇలా ప్రతీ సమస్యలో తులసి ఎంతో ఉపయోగపడుతుంది.

వీటితో పాటు, తులసితో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. చర్మం,జుట్టు, మదుమేహం, క్యాన్సర్ నుండి కాపాడటంలో కూడ ఎంతో ఉపయోగపడుతుంది.

Posted on

Eye care tips in Telugu – మెరుగైన కళ్ళ కోసం 10 చిట్కాలు

నేడు చాలా వరకూ కంప్యూటర్ వాడేవారున్నారు. గంటల తరబడి కంప్యూటర్ ముందుండటం వల్ల అలసట ఏర్పడి వారి కళ్ళు ఇబ్బందులకు గురవుతాయి. కళ్ళు అలసటకు గురైనప్పుడు కళ్ళ క్రింద నల్లని వలయాలు ఏర్పడటం, విపరీతమైన తలనొప్పి రావటం జరుగుతుంది.యువతకు ఓ వైపు చదువు భారంగా తయారైంది. ఏ ప్రాజెక్ట్ చేయాలన్న వారు కంప్యూటర్ పైనే గంటల తరబడి గడపల్సి వస్తోంది.
ఇంతేకాక జాబ్స్ లోనూ కంప్యూటర్ ముఖ్యమైన పాత్రను పోషించటం వల్ల గంటల తరబడి దృష్టిని కేంద్రీకరించటం వల్ల ఒత్తిడికి లోనై కళ్ళ క్రింద నల్లని వలయాలు, కళ్ళు జీవం లెకుండాపోవటం జరుగుతోంది. శారీరికంగా, మానసికంగా అలసట, ఒత్తిడికి గురవుతున్నరు. కళ్ళకు సంబంధించిన నరాలు విపరీతమైన ఒత్తిదికి లోనై వారిని అసహనానికి గురిచేస్తుంది. అంతేకాక ఈ నరాలకు ఒత్తిడి కలిగినప్పుడు తీవ్రమైన తలనొప్పి మొదలవుతుంది.
అంతేకాకుండా కళ్ళు మండటం,కళ్ళు పొడిబారిపోవటం, కంతి నుంచీ నీరు రావటం, బూదరగా కనిపించటం, మెద,భుజాలు నొప్పులు రావటం జరుగుతుంది.ఇకనైన ఆలస్యం చేయకుండా అలసిపోయిన మీ కళ్ళకు జాగ్రత్తలు తీసుకొండి.కళ్ళకు విశ్రాంతి ఇవ్వటం వల్ల నేటి నుంచీ మీరు ఆహ్లాదంగా ఉండగలరు.

ఈ సమస్యను అధిగమించేందుకు పది చిట్కాలను తెలుసుకుందాం.

 • మొదట మీరు పని చేసే స్థానానికి మార్పులు చేయండి.అంతేకాక కుర్చీని వీలుగా సరైన ఎత్తులో అమర్చండి.
 • కంప్యూటర్ స్క్రీన్ ,బ్రైట్నెస్ ,కాంట్రాస్టులను సరిచేయాలి.బాక్ గ్రౌండ్,స్క్రీన్ పదాలకు కాంట్రాస్ట్ ను సరిచేయాలి.
 • గ్లార్ ను తగ్గించాలి.కిటికి నుంచీ కాస్త వెలుతురు వచేలా చూసుకోవాలి.రంగులు గుర్థించలేనంతగా  కాక సూర్య కాంతి వచ్చేలా చూసుకోవాలి.
 • అంతేకాక కొట్టొచిన్నట్లు కనిపించే గ్లార్ ను తగ్గించేందుకు యాంటి గ్లార్ ను కంప్యూటర్ కు అమర్చాలి.
 • చిన్న చిన్న విరామాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది.
 • కంప్యూటర్ పూర్థి స్థాయిలో వాడేవారు గంటకోసారి పది నిముషాలు విరామం ఖచ్చితంగా తీసుకోవాలి.
Posted on

Health benefits of curd in Telugu – పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు

రాను రానూ పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలని ఇస్టపడుతున్న యువత ఆహారపు అలవాట్లకు కూడా పాశ్చాత్య ఆహార విధానాలనే ఇస్టపడుతున్నారు. చైనీస్,వెస్ట్రన్ దిషస్ నే ఇస్టపడుతున్నారు. మన భారతీయ ఆహారం లో ప్రముఖ పాత్రని పోషించే పెరుగు అనగానే యువత అమ్మో పెరుగా.. అని దూరం పారిపోతున్నారు.పొట్టకు మేలు చేసే ఈ పెరుగు గురిచి ఈ కాలం లో తెలుసుకుందాం.

మనకుండే విపరీత అలవాట్ల వల్ల మనమెన్నో ఇబ్బందులు పడుతుంటాం. జిహ్వ చాపల్యమే దీనికి కారణం. రకరకాల రుచుల కోసం కొందరు ఇస్టం వచినట్లు తింటుంటారు. ఈ అలవాటు వల్ల దాదాపు 40 శాతం మంది ఇర్రిటబుల్ బోవెన్ సిండ్రోం తో బాధపడుతున్నారని నిపుణుల అంచనా. ఈ సమస్య వల్ల విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది.పెరుగులో శరీరానికి మేలు చేసే లాక్టోబసిల్లస్ అడిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ అనే మేలు చేసే బ్యాక్టీరియా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉదర ఉబ్బరాని, కదుపు నొప్పిని తగ్గిచేందుకు ఈ బ్యాక్టీరియా కీలక పాత్రను వహిస్తుంది. ప్రతి రోజూ ఒక కప్పుకు తగ్గకుండా పెరుగు తినతం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.