Posted on

ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు ఉత్తమ చిట్కాలు – Telugu tips for Stress

జీవితంలో అన్ని సమయాల్లో ఒత్తిడికి లోనవటం చాలా బాధాకరం. ఒత్తిడి మనలో సహజ శక్తిని తగ్గిస్తుంది మరియు మానసిక వ్యాధులకు దారితీస్తుంది. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి వలన అన్ని వయసుల వారిలోను ఒత్తిడి అధికరిస్తోంది. మీరు ఒత్తిడితో భాధ పడుతున్నట్లయితే జీవితంలోని సహజ సమతుల్యతను కోల్పోతారు. ప్రతి విషయంలోనూ ఆసక్తిని కోల్పోతారు. ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు తినాలని మరియు నిద్రపోవాలని కూడా అనిపించదు. అయితే, మీరు జీవితాన్ని సాధారణంగా గడపాలని అనుకుంటే, క్రింద చెప్పినటువంటి మార్గాలను అనుసరించి ఒత్తిడిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి.

ధ్యానం

పునరావృత చర్యల వలన సడలింపు పొందుతారు. ప్రతి రోజు ధ్యానం చేయటం వలన మీ ఒత్తిడి తగ్గుతుంది. నేలపై కూర్చొని డీప్ బ్రీత్ తీసుకుంటూ ఓం అనే శబ్దాన్ని రిపీటెడ్ గా చెప్పండి. దీనికి తగిన శిక్షణను సరైన గురువు వద్ద పొందండి.

వ్యాయామాలు మరియు యోగా (Yoga for stress relief in Telugu)

స్ట్రెస్ నుండి రిలీఫ్‌ని పొందటానికి వ్యాయామాలు మరియు యోగా చాలా ఉపయోగపడతాయి. యోగా లోని కొన్ని విధానాలు శరీరానికి బలాన్ని ఇస్తాయి. మన శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా చేసి ప్రెషర్ ని తగ్గిస్తుంది. సరైన ట్రైనర్లు వద్ద శిక్షణ పొంది యోగాలు, వ్యాయామాలను ప్రతి రోజు కనీసం 15-30 నిమిషాల పాటు చేయండి.

కొన్ని స్ట్రెస్ రిలీవింగ్ యోగాలను చూద్దాం:

ఈగల్ పోస్ (గరుడాసనం)

Blend coriander leaves with two teaspoon of turmeric in a fine paste.

గ్రద్ద ఎలా నిలబడుతుందో అలా నిలబడటం అన్నమాట. ఈ భంగిమలో మనస్సును ఒక పాయింట్ పై కేంద్రీకరించడం అవసరం. గరుడాసనం వల్ల ఇన్నర్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది, శరీరంలోని ఒత్తిడి తగ్గుతుంది మరియు ఏకాగ్రత పెరుగుతుంది. మీ భావోద్వేగాలు అన్నీ కూడా ఈ గరుడాసనంతో నివారించుకోవచ్చు.

ఉత్తాసనం

uttanasanam

ఈ భంగిమ నాడీ వ్యవస్థ సమతుల్యం మరియు ప్రశాంతత మరియు శాంతి యొక్క భావాలను ప్రోత్సహిస్తుంది. తలపై భాగంలో ఉన్న చర్మంలో ప్రసరణను మెరుగుపరుస్తుంది. నీరసం మరియు అలసట తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బ్లడ్ ప్రెషర్‌ని కూడా తగ్గిస్తుంది, సాధారణంగా అధిక స్ట్రెస్ కలగటానికి బ్లడ్ ప్రెషర్ ఒక ముఖ్య కారణం. అంతేకాదు ఈ గొప్ప భంగిమ మెనోపాజ్ యొక్క లక్షణాల నుండి ఉపశమనం అందిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

బాలాసనం

balasana

పిల్లల భంగిమ అని సముచితంగా పిలవబడే ఈ ఆసనం ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇది నడుము, తొడలు, చీలమండలం లను స్ట్రెచ్ చేయడం ద్వారా మెదడును శాంత పరిచి, ఒత్తిడి మరియు అలసటను దూరం చేయడానికి సహాయపడుతుంది. ఈ భంగిమ నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

వజ్రాసనం

vajrasana

ఈ ఆసనంలో మోకాళ్ల మీద కూర్చోవడం వల్ల మీ వెన్ను మరియు కాళ్లు స్ట్రెచ్ అవుతాయి.  వజ్రాసన భంగిమ అన్ని రకాల ఒత్తిడినీ తగ్గిస్తుంది. జాయింట్స్ మరియు మజిల్స్ విశ్రాంతి చెంది, స్ట్రెస్ ఫ్రీ అవుతాయి. మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే మోకాళ్ల మీద కూర్చొని డీప్ బ్రీత్ తీసుకోవాలి. అలా చేసేటప్పుడు మీ కండరాలు రిలాక్స్ అవ్వడాన్ని మీరు గమనించవచ్చు. ఈ భంగిమలో కొద్ది సమయం కూర్చొంటే మీరు రిలాక్స్ గా భావిస్తారు మరియు రిఫ్రెష్ అవుతారు. దీనిని ఇతర ఆసనాల వలే కాకుండా భోజనం అయిన తర్వాత వేయవచ్చు. ఇది మీ ఒత్తిడిని తగ్గించటంతో పాటు జీర్ణక్రియను కూడా మెరుగుపరచటానికి సహాయపడుతుంది.

సుఖాసనం

ఒత్తిడి తగ్గించుకోవడంలో ఇది ఒక సులభమైనటువంటి యోగాసనం. పద్మాసనంలో కూర్చొని, శ్వాస నెమ్మదిగా పీల్చి వదలడం వల్ల మనస్సు ప్రశాంత పడుతుంది. అంతే కాదు, వెన్నెముక రిలాక్స్ అవుతుంది.

ప్రాణాయామం

pranayama

ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించుట. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు. శ్వాస ప్రశ్వాసల్ని క్రమబద్ధం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మ ప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు. ఈ ప్రక్రియ ఒత్తిడిని తగ్గించటం మాత్రమే కాదు, రెగ్యులర్గా చేయటం వలన సర్వరోగాలూ హరించి పోతాయి.

మార్జారి ఆసనం (పిల్లిలాగా సాగడం)

marjariasana

 

పిల్లిలాగా సాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది కండరాల ఒత్తిడిని పోగొట్టడానికి సహాయపడుతుంది.

బిటిలాసనం (కౌ ఫోజ్)

cow pose

ఆవులా నిలబడటం, ఇది కూడా పిల్లి నిలబడే భంగిమలానే ఉంటుంది. ఒత్తిడి తగ్గించడంలో ఈ రెండు భంగిమలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ముఖ్యంగా మీ వెన్నెముకకు మంచి వ్యాయామం. మీ మనస్సును ప్రశాంత పరిచి, ఒత్తిడిని తొలగిస్తుంది.

సిరసాసనం

sirsasana

 

తలక్రిందులుగా నిలబడటం. ఈ యోగా భంగిమ నిజంగా మీరు రిలాక్స్ అవ్వడానికి గొప్పగా సహాయపడుతుంది. ఈ ఆసనం చేయడం అంత సులభమైన పని కాదు. అయితే, ఈ ఆసనం వలన తలకు రక్త ప్రసరణ పెరిగి చాలా త్వరగా ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.

సేతుబంధాసనం (వంతెన భంగిమ)

bridge pose

ఈ ఆసనం మీ రక్తపోటును నియంత్రించి, మెదడుకు విశ్రాంతిని, ప్రశాంతతను ఇచ్చి ఆతృతను తగ్గిస్తుంది. మెడ యొక్క కండరాలు మరియు వీపు యొక్క కండరాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. వెన్నునొప్పిని కూడా చాలా సులభంగా తగ్గిస్తుంది.

శవాసనం

savasana

అవయవాలన్నింటినీ వదులు చేసి, వెల్లకిల పడుకుని, అర చేతులు రెండింటికి ఆకాశం వంక ఉంచి, చాచిన కాళ్ల పాదాలు రెండింటిని కొంచెం దూరంగా ఉంచి వేసే ఆసనం శవాసనం. ఈ ఆసనం వల్ల శరీర అవయవాలన్నింటికీ విశ్రాంతి లభిస్తుంది. అలసట పోతుంది. టెన్షన్‌ తగ్గుతుంది. డిప్రెషన్‌ను ఎదుర్కోవాలంటే శవాసనం ఉత్తమాసనం. శవాసనం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది మరియు నియంత్రించబడుతుంది.

డీప్ బ్రీత్

ఈ వేగవంతమైన జీవన శైలిలో మనం ఊపిరి తీసుకునే విధానం కూడా వేగవంతం అయిపోయింది. చిన్న పిల్లలు లేదా అప్పుడే పుట్టిన శిశువులను మీరు గమనించినట్లయితే వాళ్ళు ఊపిరి తీసుకొనేటప్పుడు వారి పొట్ట కూడా పెద్దగా(ఎక్సపండ్) మరియు చిన్నగా(కాంట్రాక్ట్) అవుతుంది. ఎందుకంటే వాళ్ళు శ్వాస పీల్చుకొనేటప్పుడు గాలి వాళ్ళ పొట్ట వరకు వెళ్తుంది. తరువాత శ్వాస వదిలేటప్పుడు పొట్ట కూడా చిన్నదిగా అవుతుంది. దీని వలన శరీరంలోని టాక్సిన్స్ తగ్గుతుంది మరియు బ్రెయిన్ కి కావల్సినంత ఆక్సిజన్ కూడా లభిస్తుంది. కనుక, వీలైనంత వరకు మెల్లగా డీప్ బ్రీత్ తీసుకోటానికి ప్రయత్నించండి. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది.

సైట్ సీఇంగ్

వీలైనంత వరకు బయటకి వెళ్లి కొంత సమయాన్ని గడపండి. మీకు నచ్చిన మాల్స్ లేదా షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్లి విండో షాపింగ్ చేయండి. సైట్ సీయింగ్ చోట్లకు వెళ్లి నేచర్ని ఆస్వాదించండి. మీరు ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న విషయాల్లో కాంసెంట్రేట్ చేయటం వలన మీ ఒత్తిడి తగ్గుతుంది.

సెల్ఫ్ మసాజ్

కండరాలలో స్ట్రెస్ ని తగ్గించే కొన్ని మసాజ్ మరియు ప్రెషర్ థెరపీలను ప్రయత్నించండి. చేతులకు, పాదాలకు, మెడ మరియు భుజాలకు, ముఖానికి చేసే కొన్ని మసాజ్లను నిపుణుల వద్ద సరైన రీతిలో నేర్చుకొని ప్రతిరోజు చేయండి.

మెలోడీ సాంగ్స్

ఇది చాలా మందికి సులభంగా ఉపశమనాన్ని ఇస్తుంది. ఇంట్లో పనులు చేసేటప్పుడు, లేదా పని తరువాత రిలాక్స్ అయ్యే సమయంలో, ప్రయాణం చేసేటప్పుడు మీకు నచ్చిన మెలోడీ ని వినండి.

రేపటి రోజుకు తయారవ్వండి

మనం ప్రతి రోజూ ఏదో పనిలో నిమగ్నమై ఉంటాము, ఆ బిజీలో రేపు చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి మర్చిపోతాము. దీని వలన తరువాతి రోజు ఉదయం నిద్ర లేవగానే టెన్షన్ మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితులను తొలగించేందుకు రేపటి పనులకు ఈ రోజు తీసుకోదగిన ముందు జాగ్రత్తలు ఏవైనా ఉంటే తప్పకుండా చేయాలి. ఉదాహరణకు : ముఖ్యమయిన పనులను ఒక నోట్ బుక్లో రాసుకోవటం, ఆఫీస్‌కి తీసుకోని వెళ్లాల్సిన ఫైల్స్ ని సిద్ధం చేసుకోవటం, రేపటి వంటకాలకు కావలసిన వెస్సెల్స్‌ ని సిద్ధం చేసుకోవటం, స్కూల్ కి వెళ్లే పిల్లల యూనిఫార్మ్స్ ని సిద్దంగా ఉంచుకోవటం వంటివి. వీటి వలన ఉదయాన్నే మనం పడే టెన్షన్స్ తగ్గుతాయి. మరియు రోజూ చాలా సాఫీగా మొదలవుతుంది.

ఆరోగ్యకరమైన స్నాక్స్

స్నాక్స్ అనగానే రెడీమేడ్ గా మార్కెట్లో లభించే బిస్కట్స్ మరియు చిరుతిండులు మాత్రమే గుర్తుకు వస్తాయి. ఇవి లభించటం వలన మనం మాములుగా ఇంట్లో చేసుకునే ఈజీ స్నాక్స్ ఐటెమ్స్ ని కూడా తయారుచేయటం మానేసాము. కానీ ఈ బిస్కట్స్ మరియు చిరుతిండులలో కేవలం మైదా మరియు అనేక ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి మన బీపీ, షుగర్‌ని పెంచి తీవ్రమైన ఒత్తిడికి కారణం అవుతాయి. కనుక వీలైనంత వరకు బయటి స్నాక్స్ ని మానేసి ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్నాక్స్ ని తయారు చేసుకునేందుకు ప్రయత్నించండి. వేరుశనగలు, ఫ్రైడ్ గ్రాంస్ లాంటి ప్రోటీన్స్, పండ్లు మరియు కాల్షియం ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులను ఉపయోగించి ఇంట్లోనే స్నాక్స్ ని తయారు చేసుకోండి.

ఫామిలీ లేదా ఫ్రెండ్స్

మీ కాళీ సమయంలో మీకు నచ్చిన ఫ్రెండ్స్ లేదా ఫామిలీ మెంబర్స్ తో గడపండి. ఇది మీకు స్ట్రెస్‌ని కలిగించే విషయాల నుండి డైవర్ట్ చేస్తుంది. కనుక ఎంతో ఉపశమనాన్ని పొందుతారు.

స్ట్రెస్ తో ఉన్నప్పుడు సరైన ఆహారాలను తీసుకోండి

స్ట్రెస్లో ఉన్నప్పుడు సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మనం తీసుకునే ఆహారం స్ట్రెస్‌ని తొలగించటంలో కీలక పాత్ర వహిస్తుంది. చాలా మంది ఒత్తిడి కారణంగా సరైన టైంలో తినకుండా లంచ్ లేదా బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తారు, ఆ తర్వాత ఆకలి ఎక్కువ కావటం వలన జంక్ ఫుడ్స్ ని తింటారు. ఇది మీ ఒత్తిడిని ఇంకా పెంచుతుంది మరియు అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. కనుక పండ్లు మరియు కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను సరైన సమయంలో తీసుకోండి.

రీడింగ్

మీకు చాలా ఒత్తిడిగా ఉన్నట్లు అనిపిస్తే మీకు నచ్చిన నావల్స్ లేదా కధల పుస్తకాన్ని చదవండి. ఇది ఒక మానసిక వ్యాయామం. ఈ ప్రక్రియలో చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది.

ఫిసికల్ వర్క్

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కంప్యూటర్ ముందు కూర్చొని చేసే పనులకే వెళుతున్నాము. గంటల కొద్ది సిస్టం ముందు కూర్చోవటం వలన మన శరీరానికి ఎటువంటి కదలికా లేకుండా నరాలన్నీ బిగుసుకుపోతాయి. కనుక వీలైనంత వరకు కొన్ని శారీరక పనులను కూడా చేయండి. వీటి వలన మీ నరాలు మరియు కండరాలలో ఒత్తిడి తగ్గి రిలాక్స్ అవుతారు.

కాఫీ ఒక తక్షణ ఎనర్జైజర్

మీరు ఒత్తిడి నుండి తక్షణ ఉపశమనాన్ని పొందాలనుకుంటే, వేడి కాఫీని తయారు చేసుకొని త్రాగండి. మీరు పని నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు చాలా ఒత్తిడిగా ఉన్నట్లయితే, ఒక కప్పు వేడి కాఫీ మేజిక్ లా పని చేస్తుంది మరియు ఇన్స్టంట్ గా ఎనర్జీని అందిస్తుంది.

ఆర్ట్ వర్క్స్

మీకు నచ్చిన ఏదైనా ఆర్ట్ వర్క్ ఉన్నట్లయితే కొంత సమయం వాటితో గడపండి. ఉదాహరణకు మీకు డ్రాయింగ్, పెయింటింగ్, బట్టల అల్లికలు, క్రాఫ్ట్స్ వర్క్స్ లాంటి పనులపై ఆసక్తి ఉన్నట్లయితే ప్రతి రాజు 15-30 నిమిషాల పాటు వీటి కోసం మీ సమయాన్ని కేటాయించండి. ఇది మీకు ఎంతో రిలీఫ్ ని మరియు ఆనందాన్ని ఇస్తుంది.

నవ్వటం

గట్టిగా నోరు తెరచి నవ్వటం వలన నరాలకు ఉపశమనం కలుగుతుంది. ఇది ఒక రకమైన స్ట్రెస్ రిలీవర్. దీని కోసం ఏదైనా లాఫింగ్ క్లబ్ లో చేరండి లేదా మీకు నచ్చిన కామెడీ మూవీస్ ని చూడండి. ఈ ప్రక్రియ తప్పకుండా మీకు గొప్ప రిలాక్సేషన్ని ఇస్తుంది.

సెల్ఫ్ కమ్యూనికేషన్

ఇది కొంత వింతగా ఉన్నప్పటికీ తప్పకుండా మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది ఒక రకమైన కాగ్నిటివ్ థెరపీ. దీనిని మీరు ప్రయత్నిస్తే తప్పకుండా ఒత్తిడి తగ్గి మీలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీకు నచ్చిన ఏదైనా ఒక టాపిక్ గురించి ఆలోచిస్తూ మీతో మీరు మాట్లాడుకోవటం వలన ఎన్నో విషయాలను గ్రహించవచ్చు. అలాగే మునుపటి మంచి విషయాలను రీకాల్ చేసుకోండి.

Posted on

Low back pain tips in Telugu – తుంటి నొప్పికి కారణాలు, లక్షణాలు మరియు నివారణ పద్ధతులు

తుంటి అనగా తొడ వెనుక భాగపు నరం. మానవ శరీరంలో గల నరాలలో ఇదే పొడవైనది. తుంటి నొప్పి అంటే మన లోయర్ బ్యాక్ నుండి కాళ్ల చివరి వరకు ఉండే నరంలో కలిగే నొప్పి. దీన్ని సియాటికా అని కూడా అంటారు. తుంటి నొప్పి మరియు వెన్నెముకలో నొప్పి కలిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఏ పనీ చేయలేకపోతాము. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ నొప్పులకు కారణాలు మరియు గృహ నివారణ పద్ధతుల గురించి ఈ వ్యాసంలో చూద్దాం.

తుంటి నొప్పికి కారణాలు ఏమిటి? (Telugu reasons for sciatica)

వెన్నెముకలో ఒక హెర్నియేటెడ్ డిస్క్ వలన వెన్నెముక మరియు కాళ్ల యొక్క నరాలలో ఏర్పడే నొప్పిని తుంటి నొప్పి అని అంటారు. ఈ నొప్పి లోయర్ బ్యాక్ నుండి ప్రారంభించి కాళ్ల చివరివరకు వ్యాపిస్తుంది. సాధారణంగా హెర్నియేటెడ్ డిస్క్ యొక్క స్థానాన్ని బట్టి ఏదైనా ఒక వైపు కళ్లలో మాత్రమే ఈ నొప్పి ఏర్పడుతుంది. వెన్నెముకలోని ఈ డిస్కులో క్రాక్ ఏర్పడినట్లయితే తుంటి నరాలపై ఒత్తిడిని పెంచి నొప్పిని ఇంకా తీవ్రం చేస్తుంది.

డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి?

క్రింద లక్షణాలలో ఏవైనా అభివృద్ధి చెందినట్లయితే, వెంటనే మీరు డాక్టర్ను సంప్రదించాలి:

 • మీ కాళ్ల మధ్య లేదా మీ పిరుదుల చుట్టూ తిమ్మిరి
 • పిత్తాశయం లేదా ప్రేగు నియంత్రణ లేకపోవటం
 • రెండు కాళ్లలోనూ నొప్పి మరియు జలదరింపు
 • కాళ్లలో బలహీనత
 • తీవ్ర వెన్నునొప్పి.

ఈ లక్షణాలు రెండు వారాల పాటు కొనసాగితే వెంటనే డాక్టర్ను సంప్రదించండి.

సియాటికా వైద్య చికిత్సలు (Telugu treatments for sciatica)

సియాటికా నొప్పితో బాధపడుతున్న చాలా మంది గృహ నివారణ పద్దతులను అనుసరించడం ద్వారా కొన్ని వారాలలో గుణమవుతారు. ఒకవేళ మీ నొప్పి చాలా రోజులు మైల్డ్ గా మరియు మీ రోజువారీ కార్యకలాపాలను చేసేందుకు ఇబ్బంది కలిగించేలా ఉన్నట్లయితే, మీ డాక్టర్ మొదట బేసిక్ పరిష్కారాలను ప్రయత్నించమని సూచించవచ్చు.

ఫిసికల్ థెరపీ

థెరపిస్ట్ మీ కోసం లోయర్ బ్యాక్ స్ట్రెచింగ్ మరియు వ్యాయామాలను నేర్పించి సియాటికా అనగా తొడ వెనుక భాగపు నరములపై ఒత్తిడిని తొలగించేటువంటి భంగిమలను సూచిస్తారు.

లిమిటెడ్ బెడ్ రెస్ట్

కొంతకాలం అనగా మూడు రోజుల వరకు బెడ్ రెస్ట్ తీసుకోవటం వలన కొంత ఉపశమనం పొందుతారు. కానీ ఆ తరువాత మీ నార్మల్ కార్యకలాపాలను అనుసరించవచ్చు. మీరు విశ్రాంతి తీసుకొనే రోజులలో ఫ్లాట్ మరియు ఫిర్మ్ బెడ్ ని ఉపయోగించాలి.

హాట్ మరియు కోల్డ్ ప్యాక్స్

రోజుకు కొన్నిసార్లు ఈ ప్యాక్స్ ని అప్‌లై చేయాలి. మొదట్లో కొన్ని రోజులు కోల్డ్ ప్యాక్స్ మరియు కొన్ని రోజులు హాట్ ప్యాక్స్.

ఆల్టర్నేటివ్ థెరపీ

యోగా, మసాజ్, బయో ఫీడ్ బ్యాక్ మరియు అక్కుపంచర్ వంటి ఆల్టర్నేటివ్‌ థెరపీలు తుంటి నొప్పిని తగ్గించటంలో సహాయపడతాయని చాలా మంది నమ్మకం.

మందులు

మీ వైద్యుడు మొదట ఓవర్-ది-కౌంటర్ పెయిన్ రిలీవర్స్ ని ఇవ్వవచ్చు. ఒకవేళ ఇవి పనిచేయకపోతే, బలమైన కండరాల రిలాక్సన్ట్స్ లేదా యాంటీ-ఇన్ఫ్లమ్మెటరీలను సూచిస్తారు. ఈ మంధులను మీ వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. మన ఇష్టానుసారం తీసుకోకూడదు.

సర్జరీ

అన్ని ప్రయత్నాలూ విఫలమయినప్పుడు, చివరిగా 5% నుండి 10% వ్యక్తులకు సర్జరీ చేయటమే చివరి దారి. మీకు 3 నెలల పాటు తుంటి నొప్పి ఉన్నట్లయితే, కొన్ని సింప్టమ్స్ గురించి మీ వైద్యుడితో సంప్రదించి శస్త్ర చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది.

అరుదైన సందర్భాల్లో, సియాటికా సమస్య క్వాడా ఎక్వినా సిండ్రోమ్కు దారితీస్తుంది. క్వాడా ఎక్వినా సిండ్రోమ్ అంటే – మీ ప్రేగులు మరియు పిత్తాశయం నియంత్రణ కోల్పోతారు. ఈ పరిస్థితి ఏర్పడితే తప్పకుండా శస్త్ర చికిత్స చేయాల్సిందే.

తుంటి నొప్పి మరియు లోయర్ బ్యాక్ పెయిన్ నివారణ పద్ధతులు(Telugu tips for sciatica)

వెన్నునొప్పిని తగ్గించడానికి చాలా ప్రభావితమైన గృహ నివారణలు క్రింద చెప్పబడ్డాయి. ఈ చికిత్సలను అనుసరించడం చాలా సులభం మరియు ప్రభావితంగా నొప్పిని నయం చేస్తాయి.

వెల్లుల్లి పాలు

వెల్లుల్లి వివిధ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన ఒక శక్తివంతమైన హెర్బ్, ఇవి మంట మరియు నొప్పిని కూడా తగ్గించగలదు. ఒక కప్పు పాలు మరియు నీటిలో కొన్ని వెల్లుల్లి ముక్కలను వేసి బాగా ఉడికించండి. చల్లారిన తరువాత త్రాగండి.

అల్లం

సూతింగ్ మరియు అనెస్థిటిక్ లక్షణాల వలన సియాటికా సమస్యను తగ్గించడంలో అల్లం నూనె ఒక కీలక పాత్ర వహిస్తుంది. ఈ నూనెని ఏదైనా ఇతర మసాజ్ ఆయిల్తో కలుపుకొని నొప్పిగా ఉన్న ప్రాంతంపై రాయండి. ప్రతి రోజూ కొంత అల్లం టీని కూడా తీసుకోవచ్చు.

వైట్ విల్లో బార్క్

వెన్ను నొప్పి మరియు తుంటి నొప్పిని తగ్గించటానికి తయారుచేసే అనేక పెయిన్ కిల్లర్స్ లో వైట్ విల్లో బార్క్ ని ప్రధానంగా ఉపయోగిస్తారు. కనుక కొన్ని వైట్ విల్లో బార్క్స్ తో టీ తయారు చేసుకొని రెగ్యులర్గా త్రాగండి.

హీల్స్ ధరించకండి

మీకు కొంత కాలంగా వెన్ను నొప్పి ఉన్నట్లయితే, మీరు వాడే హీల్స్ చెప్పులను ఉపయోగించటం ఆపండి. హీల్స్ మీ లోయర్ స్పైన్ పై ఒత్తిడి పెంచి నొప్పిని ఇంకా తీవ్రం చేస్తుంది. కనుక హీల్స్ బదులుగా ఫ్లాట్ చెప్పులను ధరించండి.

గుర్రపు ముల్లంగి

గుర్రపు ముల్లంగిలో తుంటి నొప్పిని మరియు వెన్ను నొప్పిని తగ్గించే నాచురల్ హీలింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. కనుక మీ రోజూ ఆహారంలో గుర్రపుముల్లంగీలను చేర్చుకోండి లేదా గుర్రపుముల్లంగీలను బాగా రుబ్బి నొప్పిగా ఉన్న చోటుపై రాయండి.

చమోమిలే రసం

చమోమిలే, వాటి యొక్క ఔషధ లక్షణాల వలన ప్రసిద్ధి చెందిన పురాతన మూలిక. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనిని తుంటి నొప్పిని తగ్గించేందుకు కూడా ఉపయోగించవచ్చు. ఒక కప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ చమోమిలే హెర్బ్ కలపాలి. 15 నిమిషాల తరువాత వడగట్టి కొద్దిగా తేనె కలుపుకొని రోజుకు 3 సార్లు త్రాగండి.

కలబంద

కలబందలో పాలిసాచరైడ్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఈ సమ్మేళనాలు నొప్పిని నిరోధించడంలో సహాయపడతాయి కనుక వీటిని తుంటి నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. వీటిలో సూతింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి. తాజా కలబంద రసంను త్రాగవచ్చు లేదా నొప్పిగా ఉన్న చోటుపై రాయండి.

ఎల్డెర్బెర్రీస్ రసం

ఒక కప్పు వేడి నీటిలో ఒకటి టీస్పూన్ ఆర్గానిక్ ఎల్డెర్బెర్రీస్ ని కలిపి తీసుకోవటం వలన తొంటి నొప్పి సహజంగా తగ్గిపోతుంది. ఈ టీ రోజుకు కనీసం 2 నుండి 3 సార్లు త్రాగాలి.

పెప్పర్మిట్ నూనె

ఈ నూనెని నొప్పి నివారిణిగా ఉపయోగిస్తారు. పెప్పర్మిట్ యొక్క అనాల్జేసిక్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు సియాటికా అనగా తొడ వెనుక భాగపు నరాలకు సంబంధించిన నొప్పిని వేగంగా తగ్గిస్తుంది. పెప్పర్మిట్ నూనెని ఏదైనా ఒక మసాజ్ నూనెతో కలిపి ప్రభావిత ప్రాంతాల్లో రాయండి. వేగవంతమైన ఫలితాల కోసం రోజుకు 1-2 సార్లు వర్తించండి.

సెలెరీ రసం

తుంటి నొప్పిని తగ్గించేందుకు సెలెరీ జ్యూస్ని చిన్న కప్పులో రోజుకు రెండుసార్లు త్రాగండి. ఇందులో అద్భుతమైన నొప్పి నివారణ లక్షణాలు ఉన్నాయి. జ్యూస్ తయారు చేయడానికి, కొన్ని తాజా సెలెరీలను ముక్కలుగా కట్ చేసి తగినంత నీరు జోడించి బాగా రుబ్బి త్రాగండి. కొద్దిగా తేనె కూడా జోడించవచ్చు.

ఐస్ మరియు హీట్ ట్రీట్మెంట్

ఐస్ మరియు హీట్ ట్రీట్మెంట్ తో తుంటి నొప్పి మరియు లోయర్ బ్యాక్ పెయిన్ నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఇది తుంటిని పూర్తిగా గుణపరచలేకపోయినప్పటికీ నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ ట్రీట్మెంట్ ని రిపీట్ చేస్తుండటం వలన మంచి ఉపశమనం కలుగుతుంది.

మసాజ్

పిరిఫార్మ్ కండరాలు బిగుసుకుపోవడం వలన ఒత్తిడి పెరిగి తుంటి నరాలలో నొప్పి పుడుతుంది. కనుక పిరిఫార్మ్ కండరాలపై మృదువుగా మర్దన చేయటం వలన నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. కానీ హెర్నియేటెడ్ డిస్క్ పై ఎల్లాంటి ఒత్తిడిని కలిగించకుండా మసాజ్ చేయాలి. ఒక మంచి నిపుణులను సంప్రదించి సరైన మార్గంలో మసాజ్ చేయడాన్ని తెలుసుకోండి.

వ్యాయామాలు మరియు యోగా

సరైన వ్యాయామాలను చేయటం వలన బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ మరియు సియాటికా నొప్పి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు బలమైన లేదా భరువైన వ్యాయామాలను చేయకూడదు, ఎందుకంటే అది మీ హెర్నియేటెడ్ డిస్క్ పై ఒత్తిడిని పెంచుతుంది. తక్కువ ఇంపాక్ట్ ఉండేటువంటి వ్యాయామాలను చేయండి. రోజుకు 20 నిమిషాలు వాకింగ్ చేయటం, స్విమ్మింగ్ మరియు ఏరోబిక్స్ వంటివి. వీటి వలన బిగుసుకుపోయిన నరాలు ఉపశమనం పొందుతాయి. అలాగే వెన్ను నొప్పి తగ్గడానికి తగిన యోగాలను ప్రయత్నించండి. యోగా చేసే ముందు తగిన ట్రైనింగ్ తీసుకోండి.

పసుపు మరియు నిమ్మరసం

ఈ చికిత్సను మన భారత దేశంలో ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది నరాల నొప్పి, ఎముకల ఫ్రాక్చర్ మరియు కండరాల నొప్పులకు కూడా ఉపయోగిస్తారు. కొంత పసుపు మరియు నిమ్మరసాన్ని కలిపి తుంటి నొప్పి పుట్టిన ప్రాంతంలో ముద్దగా రాసి ఒక కాటన్ వస్త్రంతో చుట్టండి. ఈ పేస్ట్ పూర్తిగా ఆరే వరకు కట్టును విప్పకండి. ఇలా రోజుకు 2 లేదా 3 సార్లు చేయండి.

మెంతులు

కొన్ని మెంతులను నీటిలో నానపెట్టి, మృదువుగా పేస్ట్ లా రుబ్బండి. ఈ పేస్ట్ ని కాస్త వేడి చేసి నొప్పి పుట్టిన చోట ముద్దగా రాయండి. ఇలా రోజుకు 2-3 సార్లు చేయండి.

వాలెరియన్ రూట్

ఇది నరాలను రిలాక్స్ చేసి నొప్పిని తగ్గిస్తుంది. ఒక స్పూన్ ఎండిన వాలెరియన్ రూట్ ని వేడి నీటిలో వేసి ఉడికించి వడగట్టి త్రాగండి. రోజుకు 2-3 సార్లు ఒక వారం పాటు త్రాగితే మంచి ఫలితాలను పొందుతారు.

Posted on

Chikungunya tips in Telugu – చికున్ గున్యా లక్షణాలు, కారణాలు, మరియు నివారణ పద్ధతులు

మనుషులలో చికున్ గున్యా వైరస్(Chikungunya virus) వలన చికున్ గున్యా వ్యాధి వ్యాపిస్తుంది. ఈ చికున్ గున్యా వైరస్ ఆఫ్రికా, సౌత్-ఈస్ట్ ఆసియా, భారతీయ ఉపఖండం మరియు ఇండియన్ ఓషన్ ద్వీపాల ప్రదేశాలలో అధిక వ్యాప్తి చెందింది. ఈ వైరస్ మనుషులుకు ఎలా వ్యాపిస్తుంది, వీటి లక్షణాలు మరియు నివారణ పద్దతుల(treatments) గురించి వివరంగా ఈ వ్యాసంలో చూద్దాం.

చికున్ గున్యా ఎలా వ్యాపిస్తుంది?

చికున్ గున్యా వైరస్ సోకిన ఆడ ఆడేస్జాతికి చెందిన ఏడేస్ ఏజిప్టిదోమల ద్వారా మానవులకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇవి డెంగ్యూ వైరస్‌ను కలిగి ఉండే అదే ఉష్ణ మండల మరియు ఉప ఉష్ణ మండలపు దోమలు. ఇది జ్వరం మరియు కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. ఈ వ్యాధి అరుదుగా ప్రాణాంతకం అవుతుంది, కానీ లక్షణాలు తీవ్రమైన, దీర్ఘకాలం మరియు బలహీనపరిచేవిగా ఉంటాయి.

సాధారణంగా, ఇది అంటువ్యాధిగా పరిగణించబడదు; అయినప్పటికీ, అరుదైన సందర్భాలలో, వైరస్ సోకిన వ్యక్తి యొక్క రక్తాన్ని తాకడం ద్వారా వ్యాపించవచ్చు.

చికున్ గున్యా లక్షణాలు (Chikungunya symptoms in Telugu)

ఈ వైరస్ సోకిన తరువాత కొన్ని రోజులపాటు జ్వరం మరియు కొన్ని వారాలు లేదా నెలల పాటు జాయింట్ పెయిన్స్ ఉంటుంది. కొందరు వ్యక్తులు దీర్ఘకాలిక జాయింట్ పెయిన్స్ తో బాధపడతారు మరి కొందరు 7 నుంచి 10 రోజుల తర్వాత కోలుకుంటారు.

చికున్ గున్యా వైరస్ యొక్క లక్షణాలు డెంగ్యూ జ్వరము మాదిరిగానే ఉంటాయి. సాధారణంగా ఒక దోమ ఒక వ్యక్తిని కరిచిన కొద్ది రోజుల (3 నుండి 7 రోజుల) తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. అత్యంత సాధారణ లక్షణాలు:

 • తీవ్ర జ్వరం (కొన్నిసార్లు 104 ° F)
 • ప్రధానంగా చేతులు మరియు కాళ్లలో తీవ్ర జాయింట్ పైన్స్
 • తలనొప్పి
 • కండరాల నొప్పి
 • వెన్నునొప్పి
 • దద్దుర్లు (సుమారు 50% మందికి కలుగుతుందు).
 • వికారం మరియు వాంతులు అరుదుగా కొందరిలో కలగచ్చు.

చికున్ గున్యా వ్యాధిని కనుగొనుట ఎలా?

సంకేతాలు మరియు లక్షణాల ఆధారంగా రక్త పరీక్షలు చేసిన తరువాత వ్యాధిని నిర్ధారించవచ్చు. రక్త పరీక్ష చేయకుండా వైద్యులు ఈ వ్యాధిని నిర్ధారించలేరు.

చికున్ గున్యా వ్యాధికి తగిన చికిత్స ఏంటి? (Chikungunya treatments in Telugu)

ఈ వైరస్ అరుదుగా ప్రాణాంతకం, కానీ లక్షణాలు తీవ్రంగా మరియు భరించ లేనంతగా ఉంటాయి. చాలామంది రోగులు ఒక వారంలోనే జ్వరం నుంచి కోలుకుంటారు, కానీ కీళ్ల నొప్పులు నెలల పాటు కొనసాగుతుంటాయి. 20 శాతం మంది రోగులకు 1 సంవత్సరం తరువాత కూడా జాయింట్ పెయిన్స్ పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి.

చికున్ గున్యా(Chikungunya) కు టీకా లేదా యాంటీ వైరల్ లాంటి ప్రత్యేకమైన చికిత్స లేదు. నొప్పి మందులు మరియు విశ్రాంతి తీసుకోవటం ద్వారా కొన్ని లక్షణాలకు ఉపశమనం కలిగించవచ్చు. ఈ వ్యాధి ఉన్న వారిని ఎక్కువగా నీటి ఆహారాలను తీసుకోమని డాక్టర్లు సిఫారసు చేస్తారు.

చికున్ గున్యా వ్యాధి వలన కలిగే కాంప్లికేషన్స్

ఈ వ్యాధి సోకినప్పుడు కలిగే కొన్ని కాంప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం.

 • యువెటిస్ – కంటి పొర యొక్క లోపలి రెటీనా మరియు బయటి పీచు పొర మధ్యలో మంట  
 • రెటినిటిస్ – రెటీనాలో మంట.
 • మయోకార్డిటిస్ – గుండె కండరాల యొక్క మంట.
 • హెపటైటిస్ – కాలేయంలో మంట.
 • మూత్రపిండాలలో మంట.
 • రక్తస్రావం.
 • మెదడు యొక్క పొర మరియు మస్తిష్క కణజాలంలో మంట.
 • మైలీటిస్ – వెన్ను ఎముకలో మంట.
 • గిలియన్-బర్రె సిండ్రోమ్ – అరుదైన పరిధీయ నాడీ వ్యవస్థ వ్యాధి, ఇది కండరాలను  బలహీనం చేస్తుంది.
 • క్రానియల్ నర్వ్ పాల్సీస్ – కపాల నరాలు పనితీరును కోల్పోతుంది.

నివారణ పద్ధతులు (Chikungunya prevention tips in Telugu)

చికున్ గున్యా వ్యాపించడానికి ప్రధాన కారణం దోమలు, కనుక దోమలను నివారించటమే ఈ వ్యాధిని నివారించేందుకు ప్రధాన పద్దతి.

 • చర్మంపై మరియు దుస్తులపై మస్కిటో రిపెలెంట్స్ ని వాడండి.
 • మొత్తం శరీరం కవర్ అయ్యేలా దుస్తులను వేసుకోండి.
 • వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి, ముఖ్యంగా ఉదయం మరియు మధ్యాహ్నం సమయంలో.
 • రాత్రి పడుకొనేటప్పుడు  దోమతెరను ఉపయోగించండి.
 • ఇంట్లో ఉన్నప్పుడు, ఎయిర్ కండిషనింగ్‌ను వాడండి.
 • కిటికీ మరియు తలుపు తెరలు సురక్షితంగా మరియు రంధ్రాలు లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోండి.

చికున్ గున్యా తో బాధపడుతున్నప్పుడు చేయాల్సిన మరియు చేయకూడని పనులు

చేయాల్సినవి

 • నొప్పి మరియు మంట తగ్గించడానికి కొంత చల్లని కంప్రెస్ను దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసు ముక్కలను వాడుతున్నట్లయితే డైరెక్ట్ గా చర్మంపై వాడకుండా ఒక టవల్ లో చుట్టి దరఖాస్తు చేయండి.
 • పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ మొదటి 7 రోజుల తరువాత రోజుకు 10 నిమిషాల పాటు మైల్డ్ వ్యాయామాలు చేయటం వలన కొంత రిలాక్స్ గా ఉంటుంది.
 • సమయంలో దద్దుర్లు ఏర్పడటం వలన తగిన నూనెలను, క్రీములను రాస్తూ చర్మాన్ని ఎప్పుడు మోయిస్తూరైజ్డ్ గా ఉంచుకోవాలి.
 • చికున్ గున్యా రోగికి ఆహారంలో ప్రత్యేకమైన నిబంధనలు లేవు. ఈ సంక్రమణ జీర్ణవ్యవస్థను కలవరపెట్టవచ్చు, కనుక సాధారణ ఆహారం తీసుకోండి. సులభంగా జీర్ణమయ్యే పండ్లు, కూరగాయలు మరియు ప్రొటీన్లను తగిన మొత్తంలో తీసుకోండి. ఆహారంలో తక్కువ నూనె మరియు మసాలా దినుసులు వాడండి.
 • చికున్ గున్యా తో బాధపడుతున్నవారు తీవ్రమైన నిర్జలీకరణ సమస్యను ఎదుర్కుంటారు.  కనుక తరచూ నీరు త్రాగాలి, మీ ఆహారంలో తాజా పండ్ల రసాలను మరియు చారులను చేర్చుకోండి.
 • చికున్ గున్యా రోగులు ఈ పరిస్థితి నుండి పూర్తిగా ఉపశమనం పొందేంత వరకు ప్రతి రెండు రోజులకు ఒక సారి బ్లడ్ టెస్ట్ ని చేయించుకోవటం మంచిది.

చేయకూడనివి

 • చికిత్స ఆలస్యం చేయవద్దు. చికున్ గున్యా సంక్రమణ విషయంలో ఆలస్యం చేస్తే ప్రమాదకరంగా మారుతుంది.
 • బయట ఆహారాలు తినకూడదు. బయట అమ్మే ఆహారాలు రుచికరంగా ఉండేందుకు ఎక్కువ నూనెలు మరియు సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వాడుతారు. కనుక ఇంటి ఆహారాలను తింటూ మీ జీర్ణవ్యవస్థ యొక్క పనిని సులభతరం చేయడం ఉత్తమం.
 • ఈ వ్యాధి పూర్తిగా గుణమయ్యేంత వరకు నార్మల్ లైఫ్ స్టైల్ కి వెళ్ళకండి. తగిన విశ్రాంతి తీసుకోండి. లేదా మీ చుట్టూ ఉన్నవాళ్లకు ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంటుంది.

 

Posted on

Foods for regular periods in Telugu – నెలసరికి ఈ పదార్థాలు ‘సరి’..

నెలసరి సమయంలో స్త్రీలకు చాలా ఇబ్బందికరంగా మరియు అసౌకర్యంగా ఉంటుంది. ఆ సమయంలో నీరసంగా మరియు బలహీనంగా ఉంటారు. అంతే కాదు ఏమీ తినాలని తోచదు లేదా ఏమీ చేయడానికి తోచదు. కొందరిలో వికారం మరియు తిమ్మిరి లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇది మీ ఆరోగ్యం మరియు మీ శరీరానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. అలాగే ఋతు స్రావం సరైన సమయానికి రాకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇర్రెగులర్ పీరియడ్స్ కి కారణాలు ఏమైనా వాటిని సరి చేయడానికి మన ఆహారంలో మార్పులు తప్పకుండా చేసుకోవాలి. అలాగే పీరియడ్స్ సమయంలో కూడా సరైన ఆహారాలను తీసుకోవటం వలన మంచి శక్తిని పొందుతారు మరియు అవయవాల యొక్క మృదువైన కార్యాచరణకు సహాయపడుతుంది.

ఈ ఆర్టికల్లో పీరియడ్స్ సమయంలో మరియు ఇర్రెగులర్ పీరియడ్స్ ని సరిచేసేందుకు ఉత్తమ ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

నెలసరులు / ఋతుస్రావం సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు

కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు

చాలా ఉపయోగకరంగా ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను ఋతుస్రావం సమయంలో మీ డైట్ లో చేర్చుకోండి. పండ్లు, తృణధాన్యాలు, ఆకు పచ్చని కూరగాయలను జోడించండి. శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రించడానికి నారింజ, క్యారట్లు, రేగు పండ్లను కూడా చేర్చుకోండి.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్లు తినడానికి నెలసరుల సమయం ఖచ్చితమైనది. డార్క్ చాక్లెట్లు మీ మానసిక స్థితిని నియంత్రించే విధంగా పనిచేసే సెరోటోనిన్అనే హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

విటమిన్ ఆధారిత ఆహారాలు

విటమిన్లు లేని ఆహారాలతో రాజీపడకండి. వాస్తవానికి ప్రతి స్త్రీ వారి పీరియడ్స్ సమయంలో విటమిన్లు మరియు ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. సిట్రస్ పండ్లు, బెర్రీలు, ద్రాక్షాల నుండి విటమిన్ సి ను పొందండి, ఇవి రీప్రొడ్కటివ్ సిస్టమ్ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. గుడ్లు మరియు అవోకాడోల నుండి విటమిన్ ఇ లభిస్తుంది. విటమిన్ ఇ PMS సిండ్రోమ్ నుండి ఉపశమనం అందిస్తుంది. బంగాళదుంపలలో లభించే విటమిన్ బి6 ని కూడా తీసుకోండి.

ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్

పీరియడ్స్ సమయంలో అనేక మంది స్త్రీలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలలో ఒకటి కడుపులో తిమ్మిరి. ఈ తిమ్మిరికి కారణం హార్మోన్ల యొక్క హెచ్చుతగ్గులు. అవసరమైన ఫ్యాటీ ఆసిడ్స్ ని తీసుకోవడం ద్వారా వాటిని నియంత్రించవచ్చు. గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు మరియు పొద్దుతిరుగుడు విత్తనాలను మీ ఆహారంలో చేర్చుకోండి, వీటిలో అవసరమైన ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. వీటిలో గర్భాశయ కండరాలను రిలాక్స్ చేసేందుకు సహాయపడే లినోలెనిక్ఆసిడ్ కూడా ఉంటుంది.

ఐరన్ రిచ్ ఫుడ్

ఋతు స్రావం సమయంలో రక్తం కోల్పోవడం ఒక సాధారణ విషయం కనుక మహిళలు తగినంత ఐరన్ రిచ్ ఫుడ్స్ ని తీసుకోవాలి. అంతేకాదు ఐరన్ ఎక్కువగా తీసుకోవటం వలన మీ రక్తహీనత (అనీమియా) లక్షణాలతో కూడా పోరాడవచ్చు. బలహీనతని తగ్గించడానికి కూడా ఐరన్ సహాయపడుతుంది. కనుక ఎండిన బీన్స్, ఆకు కూరలు మరియు మొలాసిస్ వంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ ని తీసుకోండి.

నీళ్ళు

మీరు నీళ్ళు పుష్కలంగా తాగాల్సిన సమయం ఇది. నీరు శరీరంలోని అన్ని టాక్సిన్స్ ని తొలగిస్తుంది. శరీరాన్ని తాజాగా మరియు ఆక్టివ్ గా ఉంచుతుంది. ఋతుస్రావం సమయంలో నీటి వినియోగంతో చాలా సాధారణమైన అనుభూతి చెందుతారు. కనుక నీటిని ఎక్కువగా త్రాగండి.

చేప

సాల్మోన్ మరియు ట్యూనా వంటి ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలను మీ డైట్ లో చేర్చుకోండి. ఇవి మీ కండరాలను రిలాక్స్ చేస్తుంది మరియు క్రామ్ప్స్ రాకుండా ఉండేందుకు సహాయ పడుతుంది.

అరటి పండు

అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఋతుస్రావం సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో బి6 మరియు ఇతర రకాల విటమిన్లు ఉంటాయి. మలబద్ధకం లాంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. పీరియడ్స్ రోజులలో డయేరియా వంటి సమస్యలను తొలగిస్తుంది.

రాస్ బెర్రీస్

ఇందులో ఫైబర్ మరియు ఫైటో-కెమికల్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. పీరియడ్స్ సమయంలో తిమ్మిరి వంటి సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.

పీరియడ్స్ సమయంలో నివారించాల్సిన ఆహారాలు

కెఫిన్

పీరియడ్స్ సమయంలో మీరు నివారించాల్సిన ఆహారాల్లో ప్రధానమైనది కెఫిన్. కెఫిన్ వల్ల రక్తనాళాలు బిగుతుగా తయారవుతాయి. పీరియడ్స్ సమయంలో అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల మీ శరీరం డీహైడ్రేషన్ కు కూడా గురి అవుతుంది. ఇవి నొప్పిని కలిగించే ఆమ్లాలను కడుపులో ఎక్కువగా సెక్రీట్ అయ్యేలా చేస్తాయి. దీని వలన తలనొప్పి మరియు భయాందోళన పెరుగుతాయి. కాబట్టి పీరియడ్స్ సమయంలో కాఫీ, కెఫిన్ తో తయారుచేసిన డ్రింక్స్ మరియు చాక్లెట్స్ వంటివి నివారించాలి. కాఫీకి బదులుగా ఒక కప్పు టీ ప్రయత్నించండి.

అధికంగా షుగర్ తో తయారుచేసిన ఆహారాలు

పీరియడ్స్ సమయంలో పంచదారతో తయారుచేసిన క్యాండీ బార్స్, సోడా లేదా కన్ఫెక్షనరీస్ తీసుకోకూడదు. వీటివల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతుంది. దీని వలన మీ చికాకు పెరిగి మిమల్ని నీరసంగా చేస్తాయి.

ప్రాసెస్డ్ ఫుడ్స్

డబ్బాల్లో నిల్వ చేసిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలను మీ రుతుక్రమ సమయంలో నివారించాలి. ఎందుకంటే ఈ ఆహారాల్లో అధిక సోడియం ఉంటుంది. ఇది మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.

రెడ్ మీట్

రెడ్ మీట్ వంటి ఫుడ్స్ లో సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. లేదంటే, మొటిమలు, కడుపుబ్బరం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. మాంసాన్ని తినాలని మీకు అనిపిస్తే, ఫిష్ లేదా స్కిన్ లెస్ చికెన్ వంటి లీనర్ మీట్స్ ని ప్రయత్నించవచ్చు.

ఆల్కహాల్

నెలసరి సమయంలో ఆల్కహాల్ కి దూరంగా ఉండండి. కొద్ది మొత్తంలో తీసుకుంటే ఇబ్బంది లేదనుకుంటే మీ అభిప్రాయం తప్పు. పీరియడ్స్ సమయంలో ఆల్కహాల్ ని తీసుకుంటే నెలసరి సమస్యలు మరింత ఎక్కువవుతాయి.

డైరీ ప్రాడక్ట్స్

పాలు, వెన్న, జున్ను వంటి వాటిని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. ఇది మీకు ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. అయితే, వీటిని అవాయిడ్ చేయడమే మంచిది. వీటిలో ఉండే అరకిడోనిక్యాసిడ్ నెలసరి నొప్పులను పెంచుతుంది. వీటికి బదులుగా మజ్జిగను తీసుకుంటే నెలసరి నొప్పులు తగ్గుతుంది.

ఫ్యాటీ ఫుడ్స్

బర్గర్స్, చిప్స్, ఫ్రైస్ వంటి ఫుడ్స్ ని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. వీటిని తీసుకుంటే నెలసరి నొప్పులు అధికమవుతాయి. తద్వారా, మీకు చికాకు ఎక్కువవుతుంది. వీటి వలన డీహైడ్రేషన్ సమస్య కూడా ఎదురవుతుంది.

రిఫైన్డ్ గ్రైన్స్

బ్రెడ్, పిజ్జా, సెరల్స్, టోర్టిల్లా వంటి ఫుడ్స్ ని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. వీటి వలన బ్లోటింగ్ తో పాటు మలబద్దకం సమస్య తలెత్తుతుంది. వీటికి బదులు తృణధాన్యాలను తీసుకోవడం మేలు.

స్పైసీ ఫుడ్స్

నెలసరి సమయంలో స్పైసీ ఫుడ్స్ ని తీసుకోవడం వలన హాట్ ఫ్లాషెస్ సమస్య ఎదురవుతుంది. కొన్ని సార్లు నెలసరి వాయిదా పడటం జరుగుతుంది. అలాగే చర్మంపై మొటిమలతో పాటు రాషస్ కూడా వస్తాయి. స్పైసీ ఫుడ్స్ ని తీసుకోవడం వలన స్టమక్ లైనింగ్ తో పాటు ఇంటస్టైన్స్ దెబ్బతింటాయి. అందువలన, ఎసిడిటీతో పాటు నెలసరి సమస్యలు మరింత తీవ్రం అవుతాయి.

ఇర్రెగులర్ పీరియడ్స్ ని నియంత్రించడానికి సారైన ఆహారాలు

బెల్లం

బెల్లం యొక్క వార్మింగ్ ఎఫెక్ట్ ఋతుస్రావం నియంత్రించడంలో సహాయపడుతుంది. కొన్ని నువ్వుల విత్తనాలను వేయించి బెల్లంతో పాటు రుబ్బి ఒక స్పూన్ పొడిని ప్రతిరోజూ తీసుకోండి.

సోంపు/సోపు

రాత్రి పడుకునే ముందు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఫెన్నెల్ విత్తనాల నానపెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి త్రాగండి. మంచి ఫలితాలను పొందే వరకు ప్రతి రోజు త్రాగండి.

కలబంద

కలబంద కూడా మీ పీరియడ్స్ ని నియంత్రించడానికి సహాయపడుతుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ కలబంద జ్యూస్ త్రాగండి. లేదా కలబంద యొక్క జెల్ లో ఒక స్పూన్ తేనె కలుపుకొని ప్రతి రోజు అల్పాహారం తినడానికి ముందు తీసుకోండి. ఫలితాలను పొందే వరకు లేదా రెండు నెలల పాటు ఈ నివారణను అనుసరించండి. గమనిక : మీ ఋతుస్రావం సమయంలో ఈ చికిత్సను అనుసరించకూడదు.

ముల్లంగి విత్తనాలు

కొన్ని ముల్లంగి గింజలలో కొంత నీటిని జోడించి రుబ్బండి. ఈ పేస్ట్ ని మజ్జిగలో కలుపుకొని క్రమ పద్ధతిలో త్రాగండి. మీరు సానుకూల ఫలితాలను చూడాలనుకుంటే, ఈ రసాన్ని ప్రతి రోజూ త్రాగండి.

పసుపు

పసుపులో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇంఫ్లమ్మెటరి లక్షణాలు ఉన్నాయి. ఇది మీ ఋతుచక్రాన్ని నియంత్రించడంతో పాటు ఋతుస్రావం సమయంలో నొప్పిని తగ్గిస్తుంది. ఒక క్వార్టర్ టీస్పూన్ పసుపు, కొద్దిగా తేనె, బెల్లం మరియు పాలను కలుపుకొని ప్రతిరోజు తాగండి.

విటమిన్ సి

ఋతుచక్రాన్ని నియంత్రించేందుకు ఆపిల్, బెర్రీస్, నారింజ మరియు టమోటాల వంటి విటమిన్ సి అధికంగా ఉండే పళ్ళు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోండి.

బొప్పాయి

పండని బొప్పాయిని తినటం వలన మీ ఇర్రెగులర్ పీరియడ్స్ ని నయం చేస్తుంది. ఒక నెల రోజుల పాటు ప్రతి రోజూ ఒక గ్లాస్ బొప్పాయి రసంని తీసుకోడానికి ప్రయత్నించండి. ఇది మీ ఋతుస్రావం ని సులభంగా నియంత్రిస్తుంది.

బాదం

నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు శరీరానికి కావల్సిన పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. ఇంకా ఇందులో ఉండే ఫైబర్ మరియు ప్రోటీనులు హార్మోనులను బ్యాలెన్స్ చేసి పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి సహాయం చేస్తుంది.

గుడ్డు

బాగా ఉడికించిన గుడ్డులో అధిక శాతంలో ప్రోటీనులు, క్యాల్షియం మరియు విటమిన్స్ ఉంటాయి. గుడ్డులో ఉండే అధిక ప్రోటీనులు రుతు క్రమ సమస్యలను నివారించడానికి బాగా సహాయపడతాయి.

పుదీనా

సగం టేబుల్ స్పూన్ తేనె మరియు ఒక టేబుల్ స్పూన్ పుదీనా పౌడర్ ని కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోండి.

బ్రొకోలీ

రుతుక్రమాన్ని క్రమబద్ధం చేయడంలో ఈ గ్రీన్ వెజిటేబుల్ చాలా పవర్ ఫుల్. సరైన రుతుక్రమాన్ని మెయింటైన్ చేయడానికి ఈ బ్రొకోలీని మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

ఆపిల్ సీడర్ వినిగర్

1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్ ని ప్రతిరోజూ ఒక కప్పు నీటిలో కలుపుకొని భోజనం చేసే ముందు తాగండి.

నువ్వుల గింజలు

మీ ఇర్రేగులర్ పీరియడ్స్ ని సరిచేయడానికి ఒక మంచి మార్గం నువ్వుల గింజలను తినటం. మరింత పోషకాలను చేర్చడానికి తేనెతో కలుపుకొని సెసమి గింజలు మరియు జీలకర్ర విత్తనాలను తీసుకోవచ్చు.

పండ్లు మరియు కూరగాయలు

శరీరంలో పోషకాలు మరియు ప్రోటీన్ల స్థాయి తక్కువగా ఉండటం వలనే ఇర్రేగులర్ పీరియడ్స్ సమస్య ఏర్పడుతుంది. న్యూట్రిషన్ స్థాయులు పెంచడానికి తాజా పండ్ల రసాలను త్రాగండి. పండ్లతోపాటు కూరగాయలను కూడా మీ డైట్ లో చేర్చుకోండి. ద్రాక్షలు, ఫిగ్ మరియు క్యారట్ జ్యూస్ లను రోజు తీసుకోండి.

టీ మరియు మూలికలు

మీరు టీ తయారు చేసుకొనేటప్పుడు దాల్చిన చెక్క, అల్లం, కొత్తిమీర వంటి మూలికలను ఉపయోగించండి. మీ ఆహారాలలో కూడా వీటిని చేర్చుకోండి.

పార్స్లీ

మీ నెలసరుల సమస్యను సరిదిద్దడానికి పార్స్లీ ఒక సులభమైన పరిష్కారం. ఇర్రెగులర్ పీరియడ్స్ ని సరిచేయడానికి ప్రతి రోజూ ఒక గ్లాస్ పార్స్లీ రసాన్ని త్రాగండి.

కాకరకాయ

మీకు కాకరకాయ వేర్లు దొరికినట్లయితే, వాటిని ఐదు నుండి పది నిమిషాలు నీటిలో ఉడికించి, వెచ్చగా అయిన తరువాత వడగట్టి త్రాగండి. లేదా కాకరకాయ జ్యూస్ ని 2 నుండి 3 వారాల పాటు రోజుకు రెండుసార్లు త్రాగండి.

మర్రి చెట్టు వేర్లు

మర్రి చెట్టు వేర్లను పది నిమిషాలు నీటిలో ఉడికించి రెండు టేబుల్ స్పూన్ ఆవు పాలను జోడించండి. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఈ నీటిని త్రాగండి.

అత్తి చెట్టు వేర్లు

అత్తి చెట్టు వేర్లను పది నిమిషాలు నీటిలో ఉడికించి వడగట్టి త్రాగండి.

కొత్తిమీర

కొత్తిమీరను కొన్ని నిమిషాలు నీటిలో ఉడికించి వడగట్టి త్రాగండి. ఇర్రెగులర్ పీరియడ్స్ ని నియంత్రించేందుకు ప్రతి రోజూ మూడు సార్లు త్రాగండి.

చెరకు రసం

చెరకు రసం కూడా మీ నెలసరులను నియంత్రిస్తుంది. ఇది ఋతుస్రావం తొందరగా రావటానికి కూడా ఉపయోగపడుతుంది.

రెడ్ గ్రేప్ (ఎర్రని ద్రాక్ష)

సహజ పద్దతుల ద్వారా రుతుక్రమ సమస్యలను నివారించుకోగలిగే ఒక మంచి ఆహారం ద్రాక్ష. ప్రతి రోజూ ఎర్రని లేదా పచ్చని ద్రాక్ష రసం త్రాగడం చాలా ఆరోగ్యకరం.

టోఫు

పన్నీర్ కు ప్రత్యామ్నాయ ఆహారం టోఫు. ఇది ఆరోగ్యకరమే కాకుండా లోఫ్యాట్ కలిగి ఉంటుంది. టోఫు క్యాల్షియం రిచ్ ఫుడ్. ఇది పీరియడ్స్ క్రమంగా వచ్చేలా చేస్తుంది.

Posted on

మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకు కొన్ని చిట్కాలు – Telugu tips for joint pains

కీళ్ల నొప్పిని వైద్యపరంగా ఆర్థరైటిస్అని అంటారు. ఇది రెండు ఎముకలు కలుసుకునే ప్రాంతంలో ఏర్పడే నొప్పి. కీళ్ల నొప్పులు ఒకనాడు మన భామలకు లేదా మన తాతలో వస్తే వారి బాధను మనం చూసే వాళ్లం. వారి వయస్సు పెరిగి ఎముకలు అరగటం వల్ల ఈ సమస్య ఏర్పడేది. కాని నేటి జనరేషన్‌కి ఇది మామూలైపోయింది. ఇప్పుడు వయసు తేడా లేకుండా అన్ని వయస్సుల వారికీ నీస్ పైన్ వస్తోంది.

జానువు నొప్పులు అనగానే మందులు, మాత్రలు, ఆపరేషన్ లాంటివి ఉంటాయని మనకు భయం మొదలవుతుంది. ఆ భయంతోనే డాక్టర్ ని కూడా సంప్రదించము.

మోకాళ్లలో నొప్పుల వలన మీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేక పోతున్నారు? శస్త్రచికిత్స యొక్క ఖర్చు మరియు నొప్పి లేకుండా, మీ ఇంట్లోనే కీళ్ల నొప్పిని నయం చేయవచ్చు. కీళ్ల నొప్పుల కారణాలు మరియు నివారణ పద్ధతుల గురించి ఈ ఆర్టికల్లో చూద్దాం.

కీళ్ల నొప్పుల రకాలు

కీళ్ల నొప్పులు చాలా రకాలుగా ఉన్నా ఎక్కువ మందిని బాధించేవి కీళ్లవాతం మరియు సంధివాతం.

 • కీళ్లవాతాన్ని ఆమవాతం అని కూడా అంటారు. ఇది మోకాలిలోనే కాకుండా ఏ కీళ్లలోనైనా రావచ్చు. వ్యాధినిరోధక శక్తి తగ్గినప్పుడు వస్తుంది. కీళ్లలో వాపు, వేడిగా ఉండటం, కీళ్లు పట్టేసి సరిగ్గా కదల్చలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
 • కీళ్లను ఆవరించి ఉండే మృదులాస్థి అరిగిపోవడం వల్ల వచ్చేది సంధివాతం. విపరీతమైన మంట, పోట్లతో కూడిన నొప్పి దీని ప్రధాన లక్షణాలు. ఎక్కువ దూరం నడవలేకపోవటం, కింద కూర్చుని లేచేటప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది.

కీళ్ల నొప్పుల కారణాలు

కీళ్ల నొప్పి రావటానికి అనేక కారణాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ముఖ్యమైన కారణాలను చూద్దాం.

 • సామాన్యంగా వయసు పైబడటం వల్ల మోకాలి చిప్ప అరుగుదల ఉంటుంది. అందువల్ల మోకాలి నొప్పి రావచ్చు.
 • అధిక బరువు కలిగి వుండటం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్ల వలన కూడా మోకాలి నొప్పి రావచ్చు.
 • పోషక ఆహార లోపాలు, వ్యాయామాలు సరిగ్గా చేయకపోవటం వలన కీళ్ల నొప్పి రావచ్చు.

డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి?

తేలికపాటి జాయింట్ పైన్స్ చాలా సందర్భాలలో విజయవంతంగా ఇంట్లోనే నివారించవచ్చు. మీ కీళ్ల నొప్పి క్రింద చెప్పిన లక్షణాలను చూపుతున్నట్లయితే మీ డాక్టర్ ని సంప్రదించండి:

 • వాపు
 • ఎర్రగా మారటం
 • జాయింట్ చుట్టూ సున్నితత్వం మరియు వెచ్చదనం

నొప్పిని తొలగించేందుకు సులభమైన ఇంటి నివారణ పద్ధతులు

ఎముకలు మరియు కీళ్ళు మానవ శరీరాన్ని బలంగా ఉంచడానికి సహాయపడతాయి, కానీ ఎముకలు వయస్సు, సమయం మరియు భారీ శారీరక శ్రమ వలన దెబ్బతినచ్చు. వీటిని ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని పోషక ఆహారాలు మరియు హోమ్ రెమెడీలను చూద్దాం.

హోమ్ రెమెడీస్

అల్లం

ఇది వంటకాలలో సువాసనను చేర్చడం మాత్రమే కాదు, ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అన్ని రకాల కీళ్ల నొప్పులను తొలగించడంలో సహాయపడుతుంది.

 • పసుపు, మెంతులు మరియు ఎండిన అల్లం వేర్లను సమాన మొత్తాల్లో తీసుకొని పొడి చేసుకోవాలి. రోజుకు రెండుసార్లు వెచ్చని నీటిలో ఒక స్పూన్ పొడిని కలుపుకొని త్రాగండి.
 • అల్లం ని నీటిలో వేసి 10 నిమిషాలు బాగా ఉడికించి వెచ్చగా అయిన తరువాత తేనెని కలుపుకొని త్రాగండి.
 • అల్లం వేర్లు మరియు నీరు ఉపయోగించి ఒక పేస్ట్ తయారు చేయండి. నొప్పిగా ఉన్న ప్రాంతంలో ఈ పేస్ట్ తో మసాజ్ చేయండి.

ఆవాల నూనె మరియు వెలుల్లి

వెచ్చని నూనెతో కొన్ని నిమిషాలు మసాజ్ చేయటం వలన నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు వాపును తగ్గిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల ఆవాల నూనెని తీసుకొని, ఒకటి లేదా రెండు వెల్లుల్లి ముక్కలతోపాటు వేడి చేసి కీళ్లపై మసాజ్ చేయడానికి ఈ చమురును ఉపయోగించండి. ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రతి రోజు 20 నిముషాల పాటు మసాజ్ చేయటం వలన కీళ్ళ వాపు మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

పచ్చి ఆలివ్ నూనె

నాణ్యమైన ఆలివ్ల నుండి తయారు చేసిన పచ్చి ఆలివ్ నూనెలో ఓలోకాన్తల్అనే సమ్మేళనం ఉంటుంది. మోకాలు, కీళ్లలో వాపు మరియు బర్నింగ్ సంచలనాన్ని తగ్గించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

 • ప్రతిరోజు మీ ఆహారంలో 2 లేదా 3 స్పూన్ల ఆలివ్ నూనెని కలుపుకోండి.
 • మీకు నొప్పి కలిగినప్పుడు ఈ నూనెతో మసాజ్ చేయవచ్చు.

పసుపు

పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పిని తొలగించేందుకు సహాయపడుతుంది.

 • ఒక స్పూన్ పసుపు పొడిని మరియు కొద్దిగా తేనెని వేడి పాలలో కలుపుకొని ప్రతి రోజూ త్రాగండి.
 • నీటిలో పసుపు పొడిని కలుపుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని నొప్పిగా ఉన్న జాయింట్స్ పై రెగ్యులర్గా రాయండి. పసుపులోని సహజ వైద్యం లక్షణాలు నొప్పిని నెమ్మదిగా తగ్గిస్తుంది.

నిమ్మరసం

ప్రతి రోజు ఒక గ్లాస్ వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకొని త్రాగటం వలన కీళ్ల నొప్పి నుండి ఉపశమనాన్ని పొందుతారు. మరో పద్దతి – నిమ్మపండు ముక్కలని ఒక వస్త్రంలో చుట్టి వెచ్చని నువ్వుల నూనెలో ముంచి నొప్పి ఉన్న కీళ్లపై మసాజ్ చేయండి.

చమోమిలే టీ

చమోమిలే టీ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది కీళ్ల నొప్పిని సులభంగా తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక బలమైన ఇన్ఫ్యూషన్ కోసం, నాలుగు చమోమిలే టీ బాగ్స్ ను ఒక కప్పు వేడి నీటిలో వేసి 20 నిముషాల పాటు కప్‌ను కప్పి ఉంచండి. టీ బాగ్స్ ను తీసివేసి ఒక గుడ్డను ఈ ద్రవములో ముంచి కీళ్లపై వర్తించండి. వేగవంతమైన ఫలితాల కోసం రోజుకు రెండుసార్లు ఇలా చేయండి.

స్విమ్మింగ్

స్విమ్మింగ్ మీ కీళ్ల కోసం ఉత్తమ వ్యాయామంగా పరిగణించబడుతుంది. నీటిలో మన శరీరపు బరువు తక్కువగా ఉండటం వలన మోకాళ్ల మీద ప్రభావం తగ్గుతుంది, కనుక ఇది మోకాలు మరియు నడుము యొక్క ఫ్లెక్సిబిలిటీని (వశ్యతను) మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ప్రత్యేకంగా ఆర్థరైటిస్ ప్రజల కొరకు రూపొందించిన స్విమింగ్ తరగతులలో చేరండి.

హాట్ వాటర్ బ్యాగ్స్ థెరపీ

హాట్ వాటర్ బ్యాగ్స్ జాయింట్ల నొప్పులను తగ్గించటంలో సహాయపడుతుంది మరియు కండరాలకు ఉపశమనాన్ని అందిస్తుంది. సరైన జాగ్రత్త తీసుకోకపోతే ఆర్థరైటిస్ నొప్పి పెద్ద సమస్యగా మారుతుంది. కనుక ప్రతి రోజు 15 నిమిషాల పాటు హాట్ బాడ్ కంప్రెజర్ ని ఉపయోగించండి. మరో పద్దతి – నొప్పి ఉన్న కీళ్లపై ఆయింట్మెంట్ లేదా పెయిన్ బామ్స్ ను రాసి తరువాత అదనపు ప్రయోజనాలకు వేడి నీటి చికిత్స తీసుకోవచ్చు.

ఎప్సోమ్ ఉప్పు

మీరు స్నానం చేసే తొట్టిలో వేడి నీటిని నింపి ఎప్సోమ్ ఉప్పుని జోడించండి. స్నానం చేసే ముందు కొద్ది సేపు ఈ నీటిలో మీ శరీరాన్ని నానపెట్టండి. ఎప్సోమ్ ఉప్పులోని మాగ్నమ్ సల్ఫేట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున కీళ్ల నొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుంది. వేడి నీటి స్నానం కీళ్లలోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

హైడ్రో థెరపీ కోసం కోల్డ్ కంప్రెస్

మీ మోకాళ్లలో జలదరింపు వేదన నుండి ఉపశమనం పొందడం కోసం ఈ చికిత్స చాలా ప్రభావితంగా ఉంటుంది. ఇది వాపును తగ్గిస్తుంది మరియు తక్షణ ఉపశమనం అందిస్తుంది.

ఆపిల్ సీడర్ వినిగర్

కీళ్ల మధ్య ఉన్న విషాన్ని తొలగించటం ద్వారా ఆపిల్ సీడర్ వినిగర్ కీళ్ల నొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం మరియు ఫాస్ఫర్స్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి.

 • ఒక కప్పు వెచ్చని నీటిలో ఒకటి లేదా మూడు స్పూన్ల ఆపిల్ సీడర్ వినిగర్ ని మరియు కొద్దిగా తేనెని కలుపుకొని భోజనం చేసే ముందు త్రాగండి.
 • ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్ మరియు కొద్దిగా ఆలివ్ నూనెని కలిపి నొప్పిగా ఉన్న జాయింట్లపై మసాజ్ చేయండి.

కైయేన్

కైయేన్ మిరియాలలో నొప్పి ఉపశమనం కలిగించే లక్షణాలను ఉంటాయి.

 • సగం కప్పు కొబ్బరి నూనెని వేడి చేసి రెండు టేబుల్ స్పూన్ల పొడిచేసి కైయేన్ ని జోడించండి. నొప్పిగా ఉన్న చోటుపై ఈ చమురుని రాసి 20 నిమిషాల పాటు వదిలేయండి, ఆపై దానిని కడగండి. నొప్పి పూర్తిగా తొలగిపోయే వరకు ఇలా ప్రతి రోజూ చేయండి.
 • నొప్పితో బాధపడుతున్న ప్రాంతంలో మీరు క్యాప్సైసిన్ క్రీమ్ను కూడా ఉపయోగించవచ్చు.

నిమ్మ తొక్క

నిమ్మరసం మాత్రమే కాదు నిమ్మ తొక్కను ఉపయోగించి కూడా మోకాళ్ల నొప్పులను తొలగించవచ్చు.

 • కొన్ని నిమ్మకాయలు తీసుకోని తొక్కను మాత్రమే తురుముకోవాలి. ఈ తొక్కను కీళ్ల నొప్పులు ఉన్న ప్రాంతంలో రాసుకుని బ్యాండేజ్ కట్టుకోవాలి. ఇలా 2 నుంచి 3 గంటలు అలాగే పెట్టుకుంటే కీళ్ల నొప్పి తగ్గిపోతుంది.
 • కొన్ని నిమ్మ తొక్కలను ఒక గాజు డబ్బాలో వేయాలి. ఇందులో కొన్ని యూకలిప్టస్ ఆకులు, ఆలివ్ ఆయిల్ ని బాగా కలిపి మూతపెట్టండి. రెండు వారాల తర్వాత కీళ్లనొప్పులపై అప్లై చేసుకోవాలి. మొదట్లో కాస్త నొప్పిగా ఉంటుంది, కానీ రాత్రంతా అలానే పెట్టుకోవాలి. క్రమంగా ఇది నొప్పిని తగ్గిస్తుంది.
 • టీ రూపంలో నిమ్మతొక్కను తీసుకోవడం వల్ల కూడా కీళ్ల నొప్పులను ఎఫెక్టివ్ గా తగ్గించవచ్చు. కొన్ని నిమ్మతొక్కలను వేడి నీటిలో ఉడికించి, నీటిని వడగట్టి కొద్దిగా తేనె కలుపుకొని త్రాగాలి.

పోషక ఆహారాలు

ఎక్కువ నీరు త్రాగండి

ఎక్కువ నీటిని త్రాగటం వలన మృదులాస్థిని మృదువుగా చేస్తుంది మరియు హైడ్రాటెడ్ గా ఉండేందుకు సహాయపడుతుంది. నీరు రక్తం యొక్క పరిమాణంను నిర్వహించడంలో సహాయపడుతుంది, తద్వారా పోషకాలు మీ కీళ్లలోకి చేరుతుంది. ఇది కీళ్ల నుండి టాక్సిన్ను కూడా తగ్గించటం ద్వారా నొప్పి ఏర్పడే అవకాశాలని తగ్గుతుంది.

చేపలు

చేపల్లో ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది, ఇది మెదడు యొక్క పనితీరులో సహాయపడుతుంది మరియు కీళ్ల నొప్పులకు సంబంధించిన వాపు మరియు నొప్పిని తగ్గిస్తుంది. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియంను ఎక్కువగా శోషించడానికి కూడా ఇది సహాయపడుతుంది. మీరు కాల్షియం యొక్క మంచి మొత్తాన్ని పొందడానికి సార్డినెస్, ట్యూనా మరియు సాల్మన్‌ వంటి చేపలను తీసుకోండి.

తక్కువ కొవ్వు – డైరీ ప్రొడక్ట్స్

తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులలో మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్ డి మరియు కాల్షియం ఉంటాయి. మీ ఎముకల శక్తిని పెంచడానికి మరియు ఎముకల వ్యాధిని మరియు పగుళ్లను నివారించడానికి ఈ పోషకాలు చాలా ముఖ్యం. కనుక మీ డైట్లో లో ఫాట్ తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులను చేర్చుకోండి. మీకు లాక్టోస్ ఇన్ టాలరెన్స్ ఉన్నట్లయితే తక్కువ కొవ్వు ఉన్న సోయ ఉత్పత్తులను ఉపయోగించండి.

ఫ్లాక్స్ సీడ్

అవిసె గింజలలో ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అవిసె గింజలతో మీరు బరువు తగ్గించవచ్చు. మీ స్మూతీస్లో లేదా బేకరీ ఆహార పదార్థాలలో ఫ్లాక్స్ సీడ్‌లను జోడించండి. ఇది మీ కీళ్ల యొక్క వాపును తగ్గిస్తుంది మరియు అనేక రకాలుగా సహాయపడుతుంది. క్రమంగా అవిసె గింజలను ఉపయోగించడం వలన కీళ్ల సమస్య తొలగిపోతుంది.

తృణధాన్యాలు

బలమైన ఎముకలను అందించే ఉత్తమ ఆహారాలలో ఇది ఒకటి. తృణధాన్యాలు పూర్తీ పోషకాలను అందిస్తాయి. ధాన్యపు రొట్టె, పాస్తా, గోధుమ బియ్యం మరియు పాప్కార్న్ వంటివి మీ కీళ్ల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థను సంరక్షిస్తుంది మరియు గుండెకు కూడా మంచిది.

ఆకుపచ్చ కూరగాయలు

ఆకుపచ్చ కూరగాయలలో కాల్షియం ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి మరియు సెలీనియం కూడా అధికంగా ఉంటాయి. శరీరంలోని మృదులాస్థి యొక్క పనితీరు మరియు రక్షణలో విటమిన్ సి సహాయపడుతుంది. సెలీనియం లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎముకలు మరియు కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఎడామామె

ఈ ఆసియా సోయా గింజలలో కాల్షియం అత్యధికంగా ఉంటుంది. ఎడామామె అనేక కిరాణా దుకాణాల్లో లభిస్తున్నాయి. వీటిని నీటిలో ఉడకబెట్టి కొద్దిగా ఉప్పు మరియు నువ్వుల నూనెని చేర్చుకొని తినండి.

ప్రోటీన్

ఎముకల ఆరోగ్యానికి తగినంత ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం. చర్మం లేని పౌల్ట్రీ, చేపలు, బీన్స్, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు మరియు గింజలను మీ డైట్ లో చేర్చుకోండి. ఎర్ర మాంసం, పౌల్ట్రీ చర్మం, పందికొవ్వు, వెన్న, క్రీమ్ మరియు ఉష్ణమండల నూనెలను నివారించండి.

మెంతులు

కీళ్ల నొప్పులు నయం చేయడానికి మరొక ఇంటి నివారణ పదార్థం మెంతులు. ఇవి వెచ్చదనాన్ని కలిగించటం ద్వారా కీళ్లను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇవి నొప్పిని కూడా నయం చేస్తాయి. ఒక టేబుల్ స్పూన్ మెంతులను ఒక కప్పు నీటిలో రాత్రంతా నానపెట్టి, మరుసటి రోజు ఉదయం వాటిని నమలండి.

పండ్లు మరియు కూరగాయలు

ఎముకల ఆరోగ్యానికి నారింజ, దోసకాయ, క్యారట్, స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు వంటి పళ్ళను తీసుకోండి. ప్రతి ఒక్క పండులో వివిధ పోషకాలు ఉంటాయి. కొన్ని పండ్లు మరియు కూరగాయలు మరియు వాటి పోషక పదార్ధాలు –

మెగ్నీషియం

బచ్చలి కూర, ఓక్రా, ఆర్టిచోకెస్, అరటిలు, బీట్ గ్రీన్స్, కొల్లాడ్ గ్రీన్స్ మరియు ఎండుద్రాక్ష.

పొటాషియం

ఎండుద్రాక్ష, బంగాళదుంపలు, టమోటా ఉత్పత్తులు, పాలకూర, తియ్యని బంగాళదుంపలు, బొప్పాయి, నారింజ, అరటి పండ్లు మరియు ప్రూనే.

విటమిన్ సి

ఎరుపు మరియు ఆకుపచ్చ మిరపకాయలు, పైనాఫిళ్లు, ద్రాక్ష పండ్లు, స్ట్రాబెర్రీలు, బ్రస్సెల్స్ మొలకలు, బ్రోకలీ, బొప్పాయి, పుచ్చకాయ మరియు నారింజ.

విటమిన్ కె

కాలే, బ్రస్సెల్స్ మొలకలు, కొల్లాడ్ గ్రీన్స్, మస్టర్డ్ గ్రీన్స్, టర్నిప్ గ్రీన్స్ మరియు స్పినాచ్ వంటి కొన్ని ఆకు కూరలు.

గ్రీన్ టీ

ప్రతి రోజు గ్రీన్ టీ త్రాగటం వలన కీళ్ల నొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయని రీసెర్చ్ చెబుతోంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన పాలీఫెనోల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచి మృదులాస్థిని రక్షిస్తుంది.

లవంగం

లవణాలలో యూజినోల్అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనం కీళ్లనొప్పుల అవకాశాలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. వీటిని ప్రతిరోజూ తీసుకోవటం వలన ఎముకల డామేజ్ను తగ్గిస్తుంది.

క్యారట్లు

కీళ్ల సమస్యను తగ్గించడంలో క్యారట్లు చాలా ఉపయోగపడతాయి. కొన్ని ముక్కల క్యారట్‌ను గ్రైండ్ చేసి రసంను తయారు చేయండి. ఈ రసాన్ని అలాగే త్రాగవచ్చు లేదా ఆవిరిలో వండి త్రాగండి. క్యారట్లు మీ లిగమెంట్ను రక్షిస్తాయి మరియు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి. కీళ్లనొప్పులు తొలగించటానికి చైనీస్ ఔషధాలలో కూడా క్యారట్లు ఉపయోగిస్తారు.

ఉల్లిపాయ

రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో ఫైటో న్యూట్రిఎంట్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువ. ఉల్లిపాయలో ఈ న్యూట్రిఎంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు నొప్పిని ప్రేరేపించే ఎంజైమ్లను నియంత్రిస్తాయి. ఉల్లిపాయలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు, లేదా పచ్చిగా కూడా తినవచ్చు.

వెల్లుల్లి

వెలుల్లిలో సల్ఫర్ మరియు సెలీనియం ఉన్నందున కీళ్ల నొప్పి రోగులకు చాలా మంచిది. సల్ఫర్ మరియు సెలీనియం ద్వారా జాయింట్ పెయిన్ మరియు వాపు నుండి ఉపశమనం పొందవచ్చు.

 • వెల్లుల్లిని మీ వంటకాల్లో చేర్చుకోండి.
 • రెండు వెల్లుల్లి ముక్కలను ఆవాల నూనె లేదా నువ్వుల నూనెలో వేయించాలి ఆ నూనెతో నొప్పిగా ఉన్న జాయింట్ల పై మసాజ్ చేయండి. మూడు గంటల తరువాత కడగండి. రోజుకు రెండు సార్లు ఇలా చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

ఆవాలు

ఆవాలలో సెలీనియం, మెగ్నీషియం ఉంటుంది. ఇవి యాంటీ ఇన్ల్ఫమేటరీ ఏజెంట్స్ లా పనిచేస్తాయి. ఆవ పిండి ఉపయోగించి చాలా సింపుల్గా ఆర్థరైటిస్ కి ఆయింట్మెంట్ మీరే తయారు చేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ ఆవాల పేస్ట్ తీసుకోవాలి. దీన్ని తాజాగా తయారు చేసి ఉండాలి. ఇందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ ఉప్పు మరియు ఒక టీ స్పూన్ సోడియం బైకార్బొనేట్ వేసి బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసుకొని కీళ్ల నొప్పులు ఉన్న భాగాల్లో అప్‌లై చేయండి.

మోకాళ్ల నొప్పి మరియు కీళ్ల నొప్పి ఉన్నవారు తినకూడని పదార్థాలు

ఆర్టిఫిషియల్ షుగర్స్

కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్లు ఆర్టిఫిషియల్, ప్రాసెస్డ్ షుగర్స్ తీసుకోకూడదు. ఇలాంటివి బరువు పెరగడానికి కారణమై జాయింట్స్ పై ఒత్తిడి పెంచుతాయి.

కొవ్వు ఎక్కువగా ఉన్న డైరీ ప్రాడక్ట్స్

కొవ్వు ఎక్కువగా ఉన్న డైరీ ప్రాడక్ట్స్ లో ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఎక్కువ మొత్తంలో ప్రొటీన్స్ తీసుకోవడం వల్ల కండరాలపై దుష్ప్రభావం చూపి, ఇన్‌ఫ్లమేషన్, నొప్పికి కారణమవుతాయి. అలాగే బరువు పెరగడానికి కూడా కారణం అవచ్చు.

రెడ్ మీట్

ప్రాసెస్ చేసిన మీట్ లేదా రెడ్ మీట్ లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. నైట్రిట్స్, ప్యూరిన్స్ ఇన్‌ఫ్లమేషన్ని పెంచుతాయి. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లకు ఇది మరింత దుష్ప్రభావం చూపుతాయి.

షెల్ ఫిష్

షెల్ ఫిష్ లో కూడా ప్యూరిన్స్ ఉంటాయి. ఇవి యురిక్ యాసిడ్ లా మారుతాయి. దీని వలన ఇన్‌ఫ్లమేషన్ మరియు నొప్పి పెరుగుతాయి.

టమోటాలు

టమోటాల్లో ఎక్కువ యురిక్ యాసిడ్ ఉంటుంది. జాయింట్స్ పెయిన్ పెరగడానికి, ఇన్‌ఫ్లమేషన్ కి కారణమవుతాయి. కాబట్టి వీటిని తీసుకోకూడదు.

వెజిటబుల్ ఆయిల్

సన్ ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, కార్న్ ఆయిల్ వంటి వెజిటబుల్ ఆయిల్స్ లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మీ బరువు పెరగడానికి, కీళ్ల నొప్పులు, ఇన్‌ఫ్లమేషన్కి కారణమవుతాయి.

ఎగ్స్

రోజూ ఎగ్స్ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. గుడ్డులోని పచ్చసొనలో అరచిడోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఇన్‌ఫ్లమేషన్ కి కారణమవుతుంది.

ఆల్కహాల్

ఆల్కహాల్ కి సంబంధించిన బీర్ వంటి వాటిలో యురిక్ యాసిడ్ ఉంటుంది. అది ఇన్‌ఫ్లమేషన్ మరియు జాయింట్స్ పెయిన్ కి కారణమవుతుంది. శరీరంలో నొప్పికి కారణమవ్వడమే కాకుండా నొప్పి నుంచి ఉపశమనం పొందే సత్తా కోల్పోయేలా చేస్తుంది.

రిఫైన్డ్ సాల్ట్

సిలికాన్ రిఫైన్డ్ సాల్ట్ లో ఫాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రత కోల్పోవడానికి కారణమవుతాయి. దీనివల్ల ఎముకలు మరింత బలహీనమవటం వలన కీళ్ల నొప్పులకు కారణమవుతాయి. కాబట్టి రిఫైన్డ్ సాల్ట్ కి దూరంగా ఉండాలి.

మోకాళ్ల నొప్పులను నివారించేందుకు కొన్ని చిట్కాలు

 1. వ్యాయామం శరీరాన్ని ఫిట్గా మరియు ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. జాయింట్ ఫైన్లను తగ్గించటానికి సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్ లాంటి తేలిక పాటు వ్యాయామాలను రోజూ చేయండి.
 2. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గే మార్గం ఆలోచించాలి. అదనపు బరువు మీ మోకాలు మీద కొంత ప్రభావాన్ని చూపుతుంది. మీరు నడిచేటప్పుడు మీ బరువు మొత్తం మీ కీళ్లపై పడటం వలన ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఖచ్చితమైన ఆహార ప్రణాళిక మరియు సాధారణ వ్యాయామాల ద్వారా మీ బరువును తగ్గించండి.
 3. మరింత హాని నుండి కీళ్లను కాపాడటానికి నొప్పి ఉన్న ప్రాంతాల చుట్టూ బ్యాండేజ్ ని ఉపయోగించండి. మీకు సరైన బ్యాండ్ పొందడానికి వైద్యుల సహాయం తీసుకోండి.
 4. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలను మరియు శుద్ధి చేసిన చక్కెరను నివారించండి.
 5. ఎక్కువ సోడియం తీసుకోవటం వలన పెళుసైన ఎముకలు ఏర్పడవచ్చు. కనుక ఉప్పు తీసుకోవడం తగ్గించండి. ఇంట్లో చేసిన వంటలను తినటం ద్వారా మరియు సాస్లు, ఫ్రోజెన్, క్యాన్డ్ ఆహారాలను నివారించటం ద్వారా అదనపు ఉప్పుని తగ్గించవచ్చు.
 6. ఆల్కహాల్, కోలా మరియు ఇతర ఫిజి పానీయాలను తీసుకోవడం తగ్గించండి. ఇవి శరీరంలోని కాల్షియం మొత్తాన్ని తగ్గిస్తాయి మరియు ఎముకలను నిర్వీర్యం చేస్తాయి.
 7. పాదరక్షలు లేకుండా నడవటం కీళ్ల నొప్పులను తగ్గించడంలో సమర్థవంతమైన వ్యాయామం అని మీకు తెలుసా? ఇది ఆస్టియో ఆర్థరైటిస్ వలన కలిగే నొప్పులను 12% తగ్గిస్తుంది.
 8. నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడి నీళ్ళతో కంప్రెస్ చేయండి. లేకుంటే మెత్తని టవల్‌ని వేడి నీటిలో ముంచి బాగా పిండిన తర్వాత నొప్పులున్న చోట పెట్టాలి.
 9. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి. జామపండు, కమలాపండు మొదలైనవి.
 10. ముఖ్యంగా నీస్ పెయిన్ కిల్లర్స్ ని తీసుకోకూడదు.
Posted on

Migraine tips in Telugu – మైగ్రేన్ లక్షణాలు, కారణాలు, నివారణా మార్గాలు

పల్లెల్లో ఒంటి చెంపపోటు అనే మాట వింటుంటాం, దానినే పార్శ్వపు తలనొప్పి అని కూడా అంటాం. ఇది తలలో తీవ్రమైన నొప్పిని కలిగించి అనేక ఇతర లక్షణాలను చూపుతుంది. ఇంగ్లీష్లో మైగ్రేన్ అని పిలువబడే ఈ పార్శ్వపు తలనొప్పి మనకు కొత్త కాదు. ఈ సమస్య ప్రతి నలుగురు ఆడవారిలో ఒకరికి, మరియు 12 మంది పురుషులలో ఒకరికి కలుగుతుంది. ఈ తలనొప్పి యొక్క కారణాలు మరియు నివారణ పద్ధతుల గురించి వివరంగా చూద్దాం.

మైగ్రేన్ అంటే ఎమిటి? వాటి లక్షణాలు

రక్తనాళాలు, నరాలు మరియు మెదడుకు చెందిన జీవరసాయన పదార్థాల్లో మార్పుల వలన మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. ఇది దీర్ఘకాలిక నరాల వ్యాధి, ఇది తరచూ తలనొప్పికి దారితీస్తుంది. ఈ తలనొప్పి 2 గంటల నుండి 72 గంటల వరకు ఉంటుంది. కొందరిలో మైగ్రేన్ సమస్య బాల్యంనుండే ఏర్పడవచ్చు, మరి కొందరిలో వయోజనంలో ఏర్పడవచ్చు. మైగ్రెయిన్ రెండు రకాలు :

 • కామన్ మైగ్రేన్
 • క్లాసిక్ మైగ్రేన్

కామన్ మైగ్రేన్ లో, తలనొప్పి ఒక వైపున మొదలవుతుంది మరియు మొత్తం తలంతా వ్యాపిస్తుంది. కొన్నిసార్లు, ఇది రెండు వైపులా మొదలవుతుంది. వికారం, వాంతులు, అనారోగ్యం మొదలైన ఇతర లక్షణాలను చూపుతుంది. అధిక శాతం ప్రజలు కామన్ మైగ్రేన్‌తో బాధపడుతుంటారు.

క్లాసిక్ పార్శ్వపు నొప్పి ప్రతి నలుగురిలో ఒకరికి కలుగుతుంది. ఈ మైగ్రెయిన్ దృశ్య సౌరభం కలిగిస్తుంది. పై చెప్పిన క్లాసిక్ పార్శ్వపు తలనొప్పి లానే ఇతర లక్షణాలను కూడా చూపుతుంది.

మైగ్రేన్ లక్షణాలు

 • సాధారణంగా మైగ్రేన్ వలన ప్రాణహానీ ఉండదు, అయినప్పటికీ ఇది రావటం వలన కాంతి మరియు శబ్ద సున్నితత్వం పెరుగటం, కడుపులో వికారంగా ఉండటం, వాంతులు అవటం మరియు ఆకలి లేకపోవటం లాంటి ఇబ్బందులు కలగచ్చు.
 • నొప్పి యొక్క వ్యవధి 2 నుండి 3 రోజులు వరకు ఉంటుంది.
 • తలనొప్పి యొక్క ఒత్తిడి తేలికపాటి నుండి మాడరేట్ మరియు తీవ్రంగా పెరుగుతుంది.

మైగ్రేన్ యొక్క కారణాలు?

మైగ్రేన్ సమస్యకు దారితీసే కారణాలు అనేకం ఉంటాయి. ఇవి వ్యక్తి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. కొన్ని సహజ కారణాలను చూద్దాం.

 • ఆహారపు అలవాట్లలో మార్పులు , నిద్ర సమస్యలు మైగ్రేన్ కు ప్రధాన కారణాలు.
 • ఎండలో తిరగడం కూడా మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది. అదే కాకుండా, భారోమెట్రిక్ ప్రెజర్, అధిక ఉష్ణోగ్రత మరియు ఇతర వాతావరణ మార్పులు కూడా ఈ తలనొప్పికి దారితీస్తుంది.
 • మహిళల్లో హార్మోన్ల మార్పుల వలన వారి ఋతు చక్రం సమయంలో మైగ్రెయిన్ తలనొప్పి వస్తుంది.
 • ఆఫీసుల్లో ఎక్కువ గంటలు పనిచేయడం వలన కలిగే ఒత్తిడి, ఆందోళన, షాక్ మరియు ఉద్రిక్తత పార్శ్వపు తలనొప్పిని ప్రేరేపించడానికి ప్రధాన కారణాలు.
 • సరైన నిద్ర లేకపోవడం లేదా రోజులో తొమ్మిది గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది.
 • నిర్జలీకరణం, మద్యం సేవించటం వలన కూడా మైగ్రేన్ తలనొప్పి వస్తుంది.
 • ధూమపానం, బిగ్గరగా శబ్దాలు, శబ్దంతో కూడిన వాతావరణం, బలమైన వాసనలు, కొన్ని పర్యావరణ కారణాలు మైగ్రెయిన్ను ప్రేరేపించవచ్చు.
 • ఎక్కువ కెఫిన్ తీసుకోవటం వలన కూడా కొందరిలో మైగ్రేన్ హెడ్ఏక్ వస్తుందని నమ్మకం. కెఫిన్ తీసుకొన్న కొన్ని గంటల తర్వాత మైగ్రేన్ తలనొప్పి సంభవించవచ్చు.
 • ఎక్కువ సౌండు పెట్టుకొని హెడ్ ఫోన్స్ లో మ్యూజిక్ వినడం వలన దీర్ఘకాలంలో ఇది మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది.
 • పాస్తా వంటి ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ తలనొప్పి వస్తుంది.
 • రక్తంలో చక్కెర పెరుగుదల మరియు తగ్గుట కారణంగా తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది
 • కొన్ని గంటల వరకూ ఏమీ తినపోవటం వల్ల మైగ్రేన్ తలనొప్పి రావచ్చు. బ్రేక్ ఫాస్ట్‌ను తినకపోవడం ఒక చెడు అలవాటు. ఎక్కువ మంది ప్రజలు ఈ కారణం వలనే అనేక అనారోగ్యాలకు గురి అవుతున్నారు.

డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి?

క్రింద చెప్పిన తలనొప్పి లక్షణాలు కనపడిన వెంటనే మీరు వైద్య సహాయం పొందాలి.

తీవ్రమైన తలనొప్పితో పాటు:

 • బలహీనత, మైకము లేదా కళ్ళు తిరిగి పడిపోవడం, తిమ్మిరి లేదా జలదరించటం, లేదా మీ శరీరాన్ని కదిలించలేక పోవటం
 • మాట్లాడలేక పోవటం, గందరగోళంగా ఉండటం, వ్యక్తిత్వ మార్పులు, లేదా ప్రవర్తనలో మార్పులు
 • మసక చూపు, డబుల్ విజన్ లేదా బ్లైండ్ స్పాట్స్
 • ఫీవర్, శ్వాస తగ్గిపోవటం, మెడ గట్టిగా కావటం లేదా దద్దుర్లు రావటం
 • రాత్రిలో నిద్ర లేపేటువంటి తలనొప్పి
 • వికారం మరియు వాంతులు
 • ఆక్సిడెంట్ లేదా హెడ్ ఇంజురీ తరువాత కలిగే తలనొప్పి

మైగ్రేన్ సమస్యను తొలగించేందుకు హోమ్ రెమెడీస్

మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు కొన్ని ఇంటి నివారణ పద్దతులను చూద్దాం.

లెవెండర్ నూనె

లెవెండర్ యొక్క వాసన చాలా బాగుంటుంది, అంతే కాదు ఇది మైగ్రేన్ తలనొప్పిని కూడా తొలగిస్తుంది. మీరు ఈ నూనెని తలపై రాయవచ్చు లేదా రెండు లేదా మూడు చుక్కల లెవెండర్ నూనెని ఒక బౌల్ వేడి నీటిలో వేసుకొని ఆవిరిని పీల్చండి.

ఆపిల్ సీడర్ వినిగర్

వినిగర్లో శరీరంలోని విషపదార్థాలను తొలగించటం, రక్తపోటును నియంత్రించటం, రక్తంలోని చక్కెర స్థాయులను కంట్రోల్ చేయటం, బరువు తగ్గించటం, ఎముకల నొప్పిని తగ్గించటం మరియు మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగించటం లాంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా ఇది మైగ్రేన్ తల నొప్పిని కూడా తొలగిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్‌ని మరియు ఒక టేబుల్ స్పూన్ తేనెని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని రోజూ త్రాగండి.

కైయేన్ పెప్పర్

మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు ఇది చాలా గొప్ప ఇంటి నివారిణి. ఇది మీ రక్త ప్రసరణను ప్రేరేపించి మెరుగుపరుస్తుంది. ఇందులోని క్యాప్సైసిన్సహజంగా నొప్పిని తగ్గిస్తుంది. ఒక కప్పు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ కైయేన్ పెప్పర్‌ని కలుపుకొని ఇందులో కొద్దిగా తేనె మరియు నిమ్మరసాన్ని చేర్చి త్రాగండి.

చమోమిలే టీ

చేమంతిలో యాంటీ-పాస్మోడిక్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ మరియు సూతింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు తోడ్పడుతుంది. మీరు జర్మన్ చమోమిలే టీని ఉపయోగించినట్లైతే వెంటనే ఉపశమనాన్ని పొందవచ్చు. మీకు ఎప్పుడు తల నొప్పిగా అనిపించినా ఒక కప్పు చమోమిలే టీని త్రాగండి.

అల్లం

అల్లంలోని ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనం ఇన్ఫ్లమేషన్ను తగ్గించి హార్మోనులపై ప్రభావాన్ని చూపుతుంది. ఇది కండరాలను సంకోచ పరిచి మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తుంది. అనేక నాన్ స్టెరాయిడ్ ఇన్‌ఫ్లమేటరీ మందులు ఇలాగే పనిచేస్తాయి. మైగ్రేన్ తలనొప్పినుండి నివారణ పొందేందుకు పచ్చి అల్లం రసాన్ని లేదా అల్లం టీ త్రాగండి.

ఫివర్ ఫ్యూ

ఫివర్ ఫ్యూ అనే మొక్కలో పార్థేనాలిడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కండరాల నొప్పులను తొలగించి, మంటను తొలగించటమే కాకుండా ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లను న్యూట్రలైజ్ చేసి నొప్పిని తొలగిస్తుంది. ఒక స్పూన్ ఫివర్ ఫ్యూ ఆకులను మరియు ఒక స్పూన్ పుదీనా ఆకులను ఒక కప్పు నీటిలో వేసి అరగంట తరువాత వడగట్టి ఈ నీటిని రోజంతా త్రాగండి.

ఆపిల్

మీకు మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు ఆపిల్ తినటం వలన వెంటనే ఉపశమనం కలుగుతుంది. పచ్చ ఆపిల్ యొక్క వాసన పీల్చడం వలన కూడా నొప్పి యొక్క ప్రభావం తగ్గుతుంది.

కాఫీ

కాఫీ త్రాగటం వలన మీ మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. ఇందులోని కెఫిన్ నొప్పిని కలిగించే రిసెప్టర్లను నిరోధించి రక్తనాళాలను నియంత్రిస్తుంది. ఇందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోని త్రాగితే ఇంకా ప్రభావితంగా ఉంటుంది.

అవిసె గింజలు

మైగ్రేన్ తలనొప్పి ఇన్ఫ్లమేషన్ వలన కలుగుతుంది. ఒమేగా-3 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వలన ఈ నొప్పి తగ్గుతుంది. మైగ్రేన్ చికిత్సకు అవిసె గింజలను తినవచ్చు లేదా వీటి నూనెని ఉపయోగించవచ్చు.

బక్వీట్

ఇందులోని ఫైటోకెమికల్స్ లో యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది మైగ్రేన్ హెడ్ఏక్ ని తొలగించేందుకు తోడ్పడుతుంది.

బాదాం

మైగ్రేన్ నొప్పి వచ్చినప్పుడు మందులకు బదులుగా బాదాం తినండి. ఎందుకంటే తలనొప్పిని తగ్గించేందుకు మందులలో వాడే సాలిసిన్ అనే రసాయనం బాదాం లో ప్రాకృతికంగా లభిస్తుంది. ఇది నొప్పిని తగ్గించి మైగ్రేన్ రాకుండా నిరోధిస్తుంది.

ఫిష్ ఆయిల్

ఫిష్ ఆయిల్‌ని తీసుకోవటం వలన ఇన్ఫ్లమేషన్ తగ్గటమే కాదు, మీ రక్తపోటును తగ్గిస్తుంది, మీ హృదయం యొక్క లయలను స్థిర పరుస్తుంది. ఈ చర్యలు చివరికి మైగ్రేన్ తలనొప్పిని నిరోధించడానికి సహాయపడుతుంది.

బట్టర్ బర్

మాములు తలనొప్పి మరియు మైగ్రేన్ తలనొప్పులను తొలగించేందుకు అమెరికాలో బట్టర్ బర్ అనేది సాంప్రదాయంగా ఉపయోగించే ఒక ఔషధం. ఈ ఆధునిక కాలంలో ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది నొప్పిని తగ్గించటమే కాదు, శరీరంలో ఈ నొప్పికి కారణం అయిన కొన్ని రసాయనాలను కూడా తగ్గిస్తుంది. దీనిని కేవలం సప్లిమెంట్ రూపంలోనే తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఇతర రూపంలో విషపూరితం.

మెగ్నీషియం

పరిశోధకులను బట్టి తరచుగా మైగ్రేన్ హెడ్ఏక్ తో బాధపడే వారు మెగ్నీషియం టాబ్లెట్స్ ను ఎప్పుడూ దగ్గర ఉంచుకోవటం మంచిది. ఎందుకంటే మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు వారి మెదడులో తక్కువ స్థాయి మెగ్నీషియం ఉంటుంది. కొందరిలో మామూలుగానే తక్కువ స్థాయి మెగ్నీషియం ఉండే అవకాశం ఉంటాయి.

చల్లని లేదా వేడి ఒత్తిడి

చల్లని మంచు ముక్కలను గుడ్డలో చుట్టి తలపై ఒత్తండి, లేదా హాట్ బాగ్ ఉపయోగించండి. చాలా మందికి తెలియక పోయినప్పటికీ ఇది మైగ్రేన్ ని తొలగించేందుకు మంచి నివారణ పద్దతి.

5-HTP

శరీరం 5-HTPని ఉత్పత్తి చేయడానికి ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాన్ని ఉపయోగిస్తుంది. ఇది మైగ్రేన్ తలనొప్పి తరచూ రాకుండా మరియు దాని యొక్క తీవ్రతను తక్కువ చేస్తుంది.5-HTP ‘సెరోటోనిన్స్థాయులను సంతులనం చేయడం ద్వారా ఈ తలనొప్పిని తొలగిస్తుంది. అయినప్పటికీ, మీరు 5-HTP తీసుకోవడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించాలి.

కోఎంజైమ్ Q10

ఇది ఒక యాంటీఆక్సిడెంట్. శరీరంలో దీని యొక్క స్థాయిని బట్టి రక్తనాళాల యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ యాంటీ-ఆక్సిడెంట్ మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అంతే కాదు ఆక్సిడేషన్ వలన కలిగే నష్టాలనుండి రక్త కణాలను కాపాడుతుంది, రక్తంలో చక్కెర స్థాయులను స్థిరీకరిస్తుంది. ఈ యాంటీ-ఆక్సిడెంట్ చాలా ఆహార పదార్థాలలో లభిస్తుంది. మీరు మాత్రల రూపంలో తీసుకోవాలని అనుకుంటే, ముందుగా మీ వైద్యుడిని సంప్రదించటం మంచిది.

విల్లో బెరడు

ఇందులోని సాలిసిన్ఒక నొప్పి నివారణ సమ్మేళనం. మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు ఇది ఒక ఉత్తమ సహజ నివారిణి.

ద్రాక్ష

ద్రాక్ష ఫల రసం మైగ్రేన్ నొప్పి తొలగించేందుకు సమర్థవంతమైన నివారిణి. మీరు మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందాలనుకుంటే, ప్రతి రోజూ కనీసం రెండు సార్లు ద్రాక్ష ఫల రసాన్ని త్రాగాలి. దీనిని రుచికరంగా చేయాలనుకుంటే అందులో నీరు లేదా తేనె చేర్చవచ్చు.

క్యాబేజ్ ఆకులు

క్యాబేజీ ఆకులు మైగ్రేన్ తలనొప్పికి ఒక మంచి గృహ నివారిణి. మీరు కొన్ని క్యాబేజీ ఆకులను బాగా దంచి వాటిని ఒక వస్త్రంలో ఉంచాలి. పడుకునేముందు మీ తల చుట్టూ ఈ వస్త్రాన్ని కట్టుకోండి. తల నొప్పి నుండి పూర్తి ఉపశమనం పొందే వరకూ ఇలా చేయాలి.

ప్రింరోజ్ ఆయిల్

దీని యొక్క యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వలన ఇది మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు ప్రభావితమైన నివారిణి. ఇది మెదడులో బిగువుగా ఉండే కణాలనుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. ఈ నూనెని మీరు ఇంట్లోనే తయారుచేయవచ్చు లేదా దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ నూనెని నుదిటిపై రాయవచ్చు లేదా నీళ్ళు మరియు తేనెతో కలిపి త్రాగవచ్చు.

గంధపు చెక్క పేస్ట్

మీరు రోజూ రాత్రి పడుకునే ముందు గంధపు చెక్క పేస్ట్‌ని తలపై రాయండి. మీ నొప్పి తగ్గిన తరువాతే దీనిని కడగవచ్చు.

గోరింటాకు పేస్ట్

మీకు ఎప్పుడు తలనొప్పిగా అనిపించినా గోరింటాకు చెట్టు పువ్వులను వినిగర్తో కలిపి ఒక పేస్ట్‌లా చేసుకొని రాత్రి పడుకునేముందు తలపై రాసుకోండి.

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉండటం వలన, ఇది మైగ్రేన్ తలనొప్పికి మంచి నివారిణి. మీరు వెల్లుల్లి పేస్ట్‌ను సిద్ధం చేసి తలపై రాయండి లేదా కొన్ని వెల్లుల్లిని నమలండి. నిరంతరం మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వలన మైగ్రేన్ తలనొప్పిని నివారించవచ్చు.

ఆవాల నూనె

తలలో నొప్పి ఉన్న వైపు ఈ నూనెని రాయండి. ఇది మీ మైగ్రేన్ తలనొప్పిని తక్షణమే తొలగిస్తుంది. ఒక వారం పాటు రెండు నుండి మూడు సార్లు ఈ విధానాన్ని అనుసరించండి.

హైడ్రోజన్ పెరాక్సైడ్ తో స్నానం

కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను వెచ్చని నీటిలో కలుపుకొని స్నానం చేయండి లేదా స్పాంజుతో శరీరంపై రాయండి. ఇది తక్షణమే మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.

రాస్ప్బెర్రీ లీఫ్ టీ

ఋతు స్రావం సమయంలో మహిళలకు ఇది ఒక ఉత్తమమైన మందు. ఎరుపు రాస్ప్బెర్రీ లీఫ్ టీ త్రాగితే మీ మైగ్రేన్ తలనొప్పిని తగ్గించటమే కాదు ఇతర రోగ లక్షణాలను కూడా తొలగిస్తుంది.

తులసి

మైగ్రేన్ తలనొప్పిని తొలగించేందుకు తులసి యొక్క వాసన లేదా తులసి నూనె యొక్క వాసన మాత్రమే చాలు. ఇది శరీరం యొక్క కండరాలను శాంతి పరచటమే కాదు ఒంటి నొప్పులను కూడా తొలగిస్తుంది. మీకు ఎప్పుడు తలనొప్పిగా ఉన్నా తులసి ఆకులను నమలండి లేదా తులసి నూనెని తలపై రాయండి.

పుదీనా

పుదీనా ఆకుల్లో ఉండే మెంథాల్ మైగ్రేన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. కొన్ని పుదీనా ఆకులను రుబ్బి రసం తీయాలి. ఈ రసాన్ని మీ నుదురుపై పూసుకోవాలి. అలాగే ఒక కప్పు వేడి బ్లాక్ టీ లో కొన్ని పుదీనా ఆకులను వేసి 10 నిముషాలు నానబెట్టిన తర్వాత త్రాగితే మీకు మైగ్రేన్ నుంచి విముక్తి లభిస్తుంది మరియు త్వరిత ఉపశమనం పొందొచ్చు. పుదీనా ఆకులలో ఉండే వాసన రక్త నాళాలకు ప్రశాంతంతను చేకూరుస్తుంది. ఒక టేబుల్ స్పూన్ వాటర్ లేదా బాదం నూనెలో మూడు టేబుల్ స్పూన్ల పిప్పర్ మింట్ ఆయిల్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న భాగంలో అప్‌లై చేయండి. అలాగే పుదీనా ఆకులతో నేరుగా కూడా మర్దన చేసుకోవచ్చు. దీంతో తక్షణ ఉపశమనం కలుగుతుంది.

వలేరియన్

ఇది మీ శరీరానికి ఉపశమనాన్ని అందించి, మైగ్రేన్ తలనొప్పి యొక్క తీవ్రతను తగ్గిస్తుంది.

ధనియాలు

వేడి నీటిలో ధనియాలను వేసి బాగా ఉడికించి ఈ నీటి ఆవిరిని పీల్చండి. ఇది మైగ్రేన్ నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. లేదా వట్టి ధనియాలను నోటిలో వేసుకొని నమలండి లేదా వంటలో ఎక్కువగా వాడండి.

మెగ్నిషియం అధికంగా ఉండే ఆహారం

మెగ్నీషియం అధిక స్థాయిలో ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అన్ని రకాల పార్శ్వపు నొప్పులూ తగ్గిపోతాయి. అలాగే రుతుక్రమం సరిగ్గా లేకపోవడంతో వచ్చే మైగ్రేన్ కూడా ఈ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా తగ్గిపోతుంది. పాలకూర, చిలకడదుంపకు, క్వినోవా, పొద్దుతిరుగుడు విత్తనాలు, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు వంటి వాటిలో మెగ్నిషియం అధికస్థాయిలో ఉంటుంది.

విటమిన్ బీ2

విటమిన్ బీ2 కలిగి వున్న ఆహారాలు ఎక్కువ తీసుకోవడం వల్ల మైగ్రేన్ను ఈజీగా తగ్గించుకోవచ్చు. మీరు రోజుకు 400 మిగ్రా విటమిన్ B2 సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అయితే ఇది మైగ్రేన్ వచ్చినప్పుడు తీసుకుంటే ఫలితం కొంత వరకే ఉంటుంది. ఈ సప్లిమెంట్స్ మరియు విటమిన్ ఆహారాలను దీర్ఘకాలం తీసుకోవాలి. మీరు కనీసం మూడు నెలల పాటు విటమిన్ బీ2 ఉన్న ఆహారాలు తీసుకుంటూ ఉంటే మీకు మైగ్రేన్ వచ్చే అవకాశాలు తగ్గిపోతుంది.

బటర్బర్గ్ హెర్బ్

బటర్బర్గ్ దీర్ఘకాలంగా మైగ్రెన్ నివారణకు బాగా ఉపయోగపడుతుంది. బటర్ ఆకులు మైగ్రేన్ తగ్గించడంలో ఎంతో ప్రభావితంగా పని చేస్తాయి.

గ్లూటెన్ ఫ్రీ డైట్

గ్లూటెన్ ఫ్రీ ఆహారాలను తినటం వల్ల మైగ్రేన్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. గోధుమ, బార్లీ, వోట్స్, జొన్న వంటి ఆహారాలు ఈ కోవకు చెందినవి. అందువల్ల వీలైనంత వరకు గ్లూటెన్ ఫ్రీ ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నించండి.

హైడ్రేటెడ్ గా ఉండండి

డీహైడ్రేషన్ అనేది మైగ్రేన్ రావడానికి ఒక ముఖ్య కారణం. శరీర వ్యవస్థ సక్రమంగా పని చేయాలంటే నీరు చాలా అవసరం. అందువల్ల మీరు వీలైనంత వరకు నీరు ఎక్కువగా తాగండి. అలాగే నీరు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోండి. దీంతో మీరు మైగ్రేన్కు దూరంగా ఉండొచ్చు.

డిటాక్స్ బాత్

డిటాక్స్ అంటే నిర్విషీకరణ (విషాలను తొలగించటం లేదా విషాలకు గురికాకుండా చేయటం). డిటాక్స్ బాత్ మీరు మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు స్నానం చేసే నీటిలో కొన్ని ఆయిల్స్ కలుపు కోవడం వల్ల ఈ ప్రయోజనాన్ని పొందుతారు. ఆపిల్ సీడర్ వినిగర్‌ను మీరు స్నానం చేసే నీటిలో కలుపుకోండి. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన ఆయిల్స్ ను కూడా స్నానం చేసే వాటర్ లో కలుపు కోవటం వలన మంచి ఫలితాలుంటాయి.

డోంగ్ క్వాయ్

వీటి యొక్క వేర్లు మైగ్రేన్ తలనొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుంది. మీరు చేయవలసిందల్లా మీ నుదుటిపై డాంగ్ క్వాయ్ కలిగి ఉన్న క్రీమ్‌ను రాయండి. లేదా వేర్లను నీటిలో వేసి బాగా ఉడికించి ఈ నీటిని వడి గట్టి కొద్దిగా తేనెని కలిపి త్రాగండి.

ఐస్ ప్యాక్

మైగ్రేన్ తగ్గించడంలో ఐస్ సహాయపడుతుంది. మీరు మీ మెడపై ఐస్ ప్యాక్ ఉంచుకోవడం ద్వారా మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే చల్లని ఐస్ నీటిలో గుడ్డను ముంచి, కొన్ని నిమిషాలపాటు మీ తలపై ఉంచుకోవాలి. మెడ, భుజాలు, నుదుటి మీద ఐస్ ప్యాక్ తో మసాజ్ చేసుకోవడం వల్ల మైగ్రేన్ ఈజీగా తగ్గుతుంది.

ఆక్యుపంక్చర్

ఆక్యుపంక్చర్ కూడా మందుల్లానే పనిచేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి కోసం మీరు చేసుకునే ఆక్యుపంక్చర్ వలన దీర్ఘ కాలపు దుష్ప్రభావాలు ఉండవు.

ధ్యానం

ధ్యానం ఒత్తిడిని తగ్గించే ఒక మార్గం మాత్రమే కాక, తలనొప్పిని ఎదుర్కోవటానికి ఒక ఉత్తమమైన పద్దతి. రోజూ ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి.

లోతైన శ్వాస తీసుకోండి

ప్రతీ ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా లోతైన శ్వాసలను తీసుకోవాలి. మీకు మైగ్రేన్ హెడ్ఏక్ రాబోతుందని అనిపిస్తే మెల్లగా లోతైన శ్వాసలను తీసుకోండి, ఇది మీకు ఉపసమానాన్ని ఇస్తుంది. అంతే కాదు కొన్నిసార్లు నొప్పి రాకుండా నివారించగలదు.

చీకటి గదిలో విశ్రాంతి తీసుకోండి

మైగ్రేన్ తలనొప్పి వచ్చిన సమయంలో ఒక ప్రశాంతమైన, చీకటి గదిలో కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిది. నిద్ర పోతే ఇంకా మేలు. దీంతో నొప్పి తగ్గుతుంది. కొంత మందికి కడుపులో వికారంగా అనిపించి వాంతి చేసుకుంటారు. అలా వాంతి అయిన తరువాత, వారి తలనొప్పి కూడా తగ్గిపోతుంది.

పై చెప్పిన ఇంటి నివారణలు మీకు ఉపశమనాన్ని కలిగించకపోతే చిరోప్రాక్టర్ని సంప్రదించండి. వీరి సూచనలు మరియు వైద్యం ద్వారా నొప్పియొక్క ప్రభావాన్ని మరియు ఆవృతిని తగ్గించవచ్చు.

మైగ్రేన్ సమయంలో తినకూడని ఆహారాలు

ఒక వ్యాధిని నివారించాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవటంతో పాటు ఆ వ్యాధిని ప్రేరేపించే ఆహారాలు ఏమిటని తెలుసుకొని వాటికి దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం.

చాక్లెట్

చాక్లెట్ తినటం వలన కొందరిలో ఎటువంటి రియాక్షన్ చూపనప్పటికీ మరి కొందరిలో తలనోప్పిని అధికరిస్తుందని నమ్మకం. కనుక వీటిని నివారించటం మంచిది.

బీర్ మరియు రెడ్ వైన్

ఇవి ఆల్కహాల్ పదార్థాలు. దీనిని ఎక్కువగా తీసుకోవటం వలన కొన్ని గంటల తరువాత మీ తలనొప్పి ఇంకా తీవ్రమవుతుంది.

సలామీ

కాంటినెంటల్ వంటకాల్లో చేర్చబడి ఈ సలామీ వలన కొందరిలో తలనొప్పి పుట్టవచ్చు. ఇది ప్రతి ఒక్కరినీ బాధించినప్పటికీ కొందరిలో తీవ్రమైన నొప్పికి కారణం అవుతుంది. కనుక ఈ పదార్థాన్ని నివారించటం మంచిది.

Posted on

పైల్స్(మొలలు)తో బాధపడుతున్నారా? – Telugu tips for piles

హెమోరాయిడ్స్‌ని సామాన్య పరిభాషలో పైల్స్ అని అంటారు. తెలుగు భాషలో వీటిని మొలలు / మూలశంక అని అంటారు. కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారికి తరచుగా వచ్చే సమస్య పైల్స్‌. సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి కారణాల వలనే ఈ సమస్య ఏర్పడుతుంది.

బాగా కోపం తెచ్చుకునే వారిని చూసి సాధారణంగా మనం అడిగే ప్రశ్న ఏంటీ? నీకు పైల్స్ ఉన్నాయా’! పైల్స్ అనగానే గుర్తొచ్చేది బాత్‌రూము, అక్కడ పడే బాధలు. అవును ఇది నిజమే. ఉదయం మల విసర్జనకు బాత్‌రూముకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నట్లయితే వారికి పైల్స్(మొలలు) ఉన్నాయని అర్థం. పైల్స్ అంటే ఏమిటి, వీటి కారణాలు మరియు నివారణ పద్దతులను ఈ ఆర్టికల్లో వివరంగా తెలుసుకుందాం.

మొలలు అంటే ఏమిటి?

పురీషనాళం మరియు పాయువు లోపల లేదా చుట్టూ కలిగే వాపుని పైల్స్ అని అంటారు. పురీషనాళం మరియు పాయువు లోని రక్త నాళాలు ఎన్ లార్జ్ అవటం వలన ఈ వాపు ఏర్పడుతుంది.

వాపు యొక్క పరిమాణం మరియు తీవ్రత ఆధారంగా హేమోరాయిడ్లను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు

మొదటి డిగ్రీ/స్థాయి: పాయువు లోపలి లైనింగ్ భాగంలో అభివృద్ధి చెందుతున్న చిన్న వాపు. ఇవి పాయువు వెలుపల కనిపించవు.

రెండో డిగ్రీ/స్థాయి: పాయువులో పెద్ద వాపు. ఇది మీరు టాయిలెట్కు వెళ్ళినప్పుడు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్లిపోతుంది.

మూడవ డిగ్రీ/స్థాయి: ఒకటి లేదా అనేక చిన్న మృదువైన గడ్డలు పాయువు నుండి క్రిందకి వ్రేలాడుతుంటాయి. వీటిని లోపలికి తోయవచ్చు.

నాలుగో డిగ్రీ/స్థాయి: పాయువు నుండి పెద్ద గడ్డలు బయటికి వ్రేలాడుతాయి. వీటిని తిరిగి లోపలికి తోయలేము.

మూలశంక రావటానికి కారణాలు

ప్రస్తుత కాలంలో పైల్స్ ఒక పెద్ద సమస్యగా మారినప్పటికీ దీని యొక్క ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంది, కానీ అవి మీ పాయువు చుట్టూ ఉన్న రక్త నాళాలలో పెరిగే ఒత్తిడితో సంబంధం కలిగి ఉంటాయి. ఒత్తిడి మీ వెనుక భాగంలోని రక్తనాళాలలో వాపు మరియు మంటకు కారణమవుతుంది.

సుదీర్ఘకాలం మలబద్ధకం కారణం చేత టాయిలెట్లో చాలా ఒత్తిడికి గురవడం వలన ఇలాంటి సమస్య సంభవిస్తుంది. మనం తినే ఆహారంలో ఫైబర్ లేకపోవడం వలన ఇది తరచూ సంభవిస్తుంది.

దీర్ఘకాలిక అతిసారం (డయేరియా) కూడా హేమోరాయిడ్ సమస్యకు కారణం అవుతుంది.

ఇతర కారణాలు

 • అధిక బరువు లేదా ఊబకాయం.
 • ప్రెగ్నెన్సీ – మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ పెల్విక్ రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది, దీని వలన అవి ఎన్లార్జ్ అవుతాయి.
 • వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి రావచ్చు.
 • ప్రస్తుతం మారుతున్న జీవన శైలి మరియు ఆహారపు అలవాట్లు.
 • తక్కువ ఫైబర్ ఆహారం – తగినంత పీచు తినకపోవడం వలన మీ కండరాలు గెట్టిగా మారి, మీరు టాయిలెట్ వెళ్ళేటప్పుడు ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. చివరికి ఇది పైల్స్ కి దారి తీస్తుంది.
 • క్రమంగా భారీ వస్తువులను ఎత్తడం వలన మీ పెల్విక్ మరియు రెక్టల్ ప్రాంతంలో ఒత్తిడి పెరిగి మొలలు ఏర్పడవచ్చు.
 • నీరు తక్కువగా త్రాగడం, మద్యం అతిగా సేవించటం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు అతిగా తినడం, మాంసాహారం తరచుగా తినటం వంటివి పైల్స్ రావటానికి ముఖ్య కారణాలు.
 • వయస్సు – మీకు వయసు అయ్యే కొద్ది మీ శరీరం యొక్క కణజాలాలు బలహీనం అవుతాయి. ఈ కారణం వలన కూడా మీకు పైల్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
 • నిరంతర దగ్గు లేదా వాంతులు.
 • దీర్ఘకాలం కూర్చొని ఉండటం.

మూలశంక వచ్చిన వారిలో ఉండే లక్షణాలు

అనేక సందర్భాల్లో, ఇవి ఎటువంటి లక్షణాలనూ చూపవు మరియు కొంత మంది పైల్స్ ఉందన్న విషయాన్ని కూడా గుర్తించలేరు. కానీ సింటమ్స్ చూపినట్లయితే క్రింద చెప్పిన లక్షణాలను గమనించవచ్చు.

 • మల విసర్జన సాఫీగా జరుగదు.
 • విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, మంట కలుగుతుంది.
 • మల విసర్జన సమయంలో అప్పుడప్పుడు రక్తం పడుతుంది (రక్తస్రావం).
 • విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి మరియు మంట రెండు గంటల వరకు ఉంటుంది.
 • మీ క్రింది భాగం ఎప్పుడూ దురదగా ఉంటుంది.
 • మల విసర్జన తరువాత శ్లేష్మం కనపడవచ్చు.
 • విరోచనం కాకపోవడం బాధను కలిగిస్తుంది.
 • సుఖ విరోచనం కాకపోవడంతో చిరాకుగా కోపంగా ఉంటారు.
 • మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్‌) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.
 • ఈ సమస్య ఉన్నవారు చురుకుగా ఉండలేరు. ఎక్కువ ప్రయాణాలు చేయలేరు.

ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి?

ఎక్కువ నొప్పి కలిగినట్లయితే, విసర్జన సమయంలో రక్తస్రావం లేదా మీ పాయువులో దీర్ఘ కాలం గడ్డలు ఉన్నట్లయితే ఒక వైద్యుడిని వెంటనే సంప్రదించండి. గమనిక : మూత్ర విసర్జన సమయంలో మెరూన్ రంగులో విసర్జన అవుతున్నట్లయితే, ఇది రక్తస్రావం యొక్క సూచన.

పైల్స్ ని నివారించేందుకు తినాల్సిన ఆహార పదార్థాలు?

పైల్స్ చికిత్సలో ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సరైన ఆహారం తీసుకోవటం వలన ఈ సమస్యను సులభంగా వదిలించుకోవచ్చు.

ఆకుపచ్చ కూరగాయలు

బ్రోకలీ, ఉల్లిపాయలు, దోసకాయలు, క్యారెట్లు, కాలీఫ్లవర్, పుట్టగొడుగు వంటి విటమిన్లు మరియు ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆకుపచ్చ కూరగాయలను అధికంగా తీసుకోండి.

బొప్పాయి

వీలైతే, బొప్పాయిని రోజూ తీసుకోండి. ఈ పండులో ఫైబర్, విటమిన్ సి, మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కనుక, మీరు ప్రతి రోజూ 1 లేదా 2 ముక్కలను తినటం వలన పైల్స్ యొక్క సమస్య తగ్గుతుంది మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అరటి పండు

ఇందులోని విటమిన్లు మలబద్ధకం సమస్యను నివారిస్తుంది మరియు క్రమంగా పైల్స్ ని తొలగించటంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం లేదా ప్రతి భోజనం తర్వాత అరటిపండును తినండి.

బ్రౌన్ రైస్

పైల్స్ తో బాధపడుతున్న రోగులకు బ్రౌన్ రైస్ చాలా ముఖ్యమైన ఒక ఆహార పదార్థం. పాలిష్డ్ బియ్యంకు బదులుగా ఇటువంటి ఆరోగ్యకరమైన బియ్యంను ఉపయోగించటం ఉత్తమం.

నీరు

మీరు నిజంగా పైల్స్ వదిలించుకోవాలని కోరుకుంటే నీటిని ఎక్కువగా త్రాగండి. నీరు త్రాగడం వల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ అధికరించి పైల్స్ సమస్యను తొలగిస్తుంది.

ఫైబర్ ఆహారాలు

పైల్స్ ని నివారించేందుకు కచ్చితంగా తీసుకోవలసినవి ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఇవి మీ జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి నొప్పిని తగ్గించి క్రమంగా పైల్స్ ని తొలగిస్తుంది.

 • రిఫైన్ చేయని గోధుమ ఆహారాలు, ఉదాహరణకు గోధుమ బియ్యం, ఎండబెట్టిన బీన్, బార్లీ మరియు కాయధాన్యాలు వంటివి.
 • ఆపిల్, పాలకూర, నారింజ, పీచ్, పుట్టగొడుగులు, ఓక్రా, తీపి బంగాళదుంపలు మరియు రాస్ప్బెర్రీస్ వంటి పండ్లు మరియు కూరగాయలు. పండ్ల రసాలకంటే ఎక్కువ ఫైబర్ కలిగి ఉన్న పండ్లు తినటం చాలా మంచిది.
 • బఠాణీ జాతికి చెందిన బీన్స్, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్, బ్లాక్ బీన్స్ లో పీచు అధికంగా ఉంటుంది. ఇవి తేలికగా జీర్ణమై ప్రేగులు శుభ్రపడేలా చేస్తాయి.
 • నట్స్, సీడ్స్, మరియు హుమ్మస్ లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఫిగ్ (అంజీర పండు)

అంజీర పండుని రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే మలబద్ధకం మరియు పైల్స్ వ్యాధి నయమవుతుంది. ఆ నీటిలో సగభాగం ఉదయం, సగభాగం సాయంత్రం తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

దానిమ్మ

హెమోరాయిడ్కు మరో చక్కటి హోం రెమిడీ ఎర్రని పండ్ల తొక్క. కొన్ని నీళ్ళలో దానిమ్మ తొక్కను వేసి బాగా ఉడికించి, వడగట్టి రోజుకు ఒకటి రెండు సార్లు త్రాగుతుండాలి.

అల్లం మరియు నిమ్మరసం జ్యూస్

డీహైడ్రేషన్ కూడా పైల్స్ కు ఒక ప్రధానకారణం. అందువల్ల అల్లం, నిమ్మరసం, తేనె కలిపిన జ్యూస్ చేసుకొని ప్రతి రోజూ రెండు సార్లు తాగాలి.

ముల్లంగి రసం

పైల్స్ నివారించడానికి ఒక గ్లాసు ముల్లంగి రసం చాలా అద్భుతంగా పని చేస్తుంది. ముందుగా ¼ కప్పుతో ప్రారంభించి, రోజు రోజుకూ అర కప్పు రసంను పెంచుకుంటూ పోవాలి.

పచ్చి ఉల్లిపాయ

మలంలో రక్తం పడటం వంటి సమస్యలను నివారించడానికి పచ్చి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను తినడం లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల రక్తస్రావాన్ని తగ్గించి పాయువు నొప్పిని తగ్గిస్తుంది.

పసుపు

పసుపులో అనేక వైద్య లక్షణాలు ఉంటాయి. మీరు సహజంగా పైల్స్ ను నివారించాలనుకుంటే పసుపు కొమ్ము లేదా పసుపును నీటిలో వేసి ఆ నీటిని తాగండి.

పైల్స్ తో బాధపడుతున్నప్పుడు తిన కూడని ఆహారాలు?

రెడ్ మీట్

ఎరుపు మాంసం చాలా హానికరమైన ఆహారం, ప్రత్యేకంగా మీరు పైల్స్ వలన బాధపడుతున్నప్పుడు తినకూడని ఆహారం ఇది. అలాగే ప్రాసెస్ చేయబడిన మాంసం కూడా తినకూడదు.

బేకరీ ఫుడ్స్

పీస్, పఫ్స్, కేకులు, పాస్ట్రీస్, పిండి రొట్టె మొదలైన బేకరీ ఆహార పదార్థాలను తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి.

స్పైసి ఫుడ్

ఎర్ర మిరప, ఘాటైన మిరియాలు మరియు ఇతర స్పైసెస్తో కూడిన మసాలా ఆహార పదార్థాలను నివారించాలి. ఇటువంటి మసాలా ఆహారాలను తినకూడదని వైద్యులు కూడా సిఫార్సు చేస్తారు. ఇవి మీ కడుపులో మంటని పుట్టించి జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన మరియు ఉడికించిన ఆహారాన్ని తినడం మంచిది. ఎక్కువ నూనె మరియు మసాలా దినుసులు లేకుండా కూరగాయలు, పండ్లు మరియు ఇతర తృణధాన్యాలు తీసుకోండి.

లిక్విడ్ వేస్

కాఫీ మరియు ఆల్కహాల్ వంటి కెఫిన్ పానీయాలు హెమోర్రాయిడ్లను మరింత తీవ్రం చేస్తాయి.

కొవ్వు ఆహార పదార్థాలు

కొవ్వు పదార్ధాలు జీర్ణ వ్యవస్థకు పనిని పెంచుతాయి మరియు కడుపు నొప్పి, గుండెల్లో మంట అలాగే హెమరాయిడ్ ప్రమాదాన్ని పెంచుతాయి. డీప్ ఫ్రై చేసిన ఆహారాన్ని నివారించండి. తక్కువ వెన్నని ఉపయోగించడం మరియు తక్కువ కొవ్వు లేదా కొవ్వు లేని పాల ఉత్పత్తులకు మారండి.

పాలిష్డ్ రైస్

పాలిష్ చేయబడిన తెల్లటి రైస్ లో న్యూట్రిషన్స్ మరియు ఫైబర్ తొలగించబడి ఉంటాయి. వీటిలో కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటుంది.

పైల్స్ ని తగ్గేందుకు కొన్ని చిట్కాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • వ్యాయామం : మలబద్దకం నివారించడానికి మరియు శరరంలో క్రమంగా రక్త ప్రసరణ జరగడానికి రెగ్యులర్ వ్యాయామం బాగా సహాయపడుతుంది. గమనిక : అతిగా వ్యాయామం చేయడం లేదా ఎక్కువ బరువులను మోయడం వల్ల కూడా హెమరాయిడ్స్ అధికం కావచ్చు. కాబట్టి వెయిట్ లిఫ్టింగ్ లాంటివి కాకుండా యోగా, స్విమ్మింగ్, వాకింగ్ వంటి సాధారణ వ్యాయామాలను చేయండి.
 • టాయిలెట్ పొజిషన్ : టాయిలెట్ పొజిషన్ సరిగ్గా ఉండాలి. కూర్చొనే విధానం కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇబ్బంది పడనవసరం లేదు. టాయిలెట్ స్టెప్ మీద కరెక్ట్ గా కాలు పెట్టి కూర్చొని ముందుగా వంగడం వల్ల రెక్టమ్ మీద ప్రెషర్ తగ్గుతుంది.
 • మీరు అర్జంట్గా విసర్జనకు వెళ్ళవలసి ఉన్న సమయంలో కంట్రోల్ చేసుకోకుండా వెంటనే టాయిలెట్కు వెళ్ళండి. వాటిని ఆపాలని ప్రయత్నించటం వలన అనేక సమస్యలు ఎదురవుతాయి.
 • మల విసర్జన సమయంలో మీ పురీషనాళంపై ఎక్కువ ఒత్తిడిని పెట్టకూడదు. ఒత్తిడి నొప్పి మరియు పైల్స్ రక్తస్రావంకు దారి తీస్తుంది.
 • పీచు (ఫైబర్) పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4 నుండి 5 లీటర్లు).
 • రోజూ మల విసర్జన సాఫీగా జరిగేట్టు చూసుకోవాలి.
 • మద్యం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, మాంసాహరం, చిరుతిళ్లు మానేయాలి. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు బాగా విశ్రాంతి తీసుకోవాలి, నిత్యం యోగా, మెడిటేషన్‌ చేయాలి.
 • సరైన సమయంలో డాక్టర్ ను సంప్రదించి సరైన చికిత్సని తీసుకోండి.
Posted on

గ్యాస్ ప్రోబ్లమా? – Telugu tips for gastric trouble

ప్రజలు ఎదుర్కొనే సామాన్య ఆరోగ్య సమస్యలలో ఒకటి గ్యాస్ట్రిక్ సమస్య. ప్రస్తుత కాలంలోని ఉరుకు పరుగుల జీవితంలో ఉదరంలో గ్యాస్ మరియు పొట్ట ఉబ్బరింపు లాంటి సమస్యలు అన్ని వయస్సుల వారినీ పీడిస్తోంది. ఇది ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ చాలా ఇబ్బంది కలిగించే ఒక సమస్య. ముఖ్యంగా మనం పబ్లిక్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమస్య యొక్క కారణాలు మరియు నివారించే పద్దతులను చూద్దాం.

గ్యాస్ట్రిక్ సమస్య అంటే ఏమిటి?

ప్రతి మనిషి యొక్క జీర్ణాశయంలో గ్యాస్ ఏర్పడుతుంది. ఇది తేపు వచ్చినప్పుడు మీ నోటి ద్వారా లేదా మీ ఆనస్ ద్వారా విడుదల అవుతుంది. ఈ గ్యాస్ మీ శరీరం నుండి విడుదల కాకుండా జీర్ణాశయంలో లేదా కడుపులో పేరుకుపోయినప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య ఎదురవుతుంది.

గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలు?

ఆహారాన్ని, ద్రవ పదార్ధాలను, కొన్ని నిర్దిష్ట ఆహార పదార్ధాలను తీసుకొనేటప్పుడు గాలిని ఎక్కువగా మింగడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడవచ్చు. ఇది ప్రేగులోపల చిక్కుకున్నప్పుడు నొప్పిని కలిగిస్తుంది. ఉబ్బిన పొట్ట మరియు గ్యాస్ సమస్యలు ఇతర జీర్ణ పరిస్థితుల వల్ల కూడా సంభవిస్తాయి. అతిగా తినడం వల్ల ఏర్పడే ఉబ్బరం, పొత్తికడుపు పరిమాణం పెరగడానికి కారణమవుతుంది మరియు తిమ్మిరి వలన కలిగే బిగుతు మరియు నొప్పి లాంటి భావనను కలిగించవచ్చు.

గ్యాస్ యొక్క సాధారణ కారణాలు

 • చాలా వేగంగా మరియు చాలా ఎక్కువగా తినడం – చాలా ఎక్కువ ఆహారం లేదా పానీయంను సరిగ్గా నమలకుండా మింగటం వలన ఆహారంతో పాటు ఎక్కువ గాలి కూడా శరీరంలోనికి వెళ్లి గ్యాస్ సమస్యను కలిగిస్తుంది.
 • ఎయిరేటేడ్ పానీయాలను త్రాగటం వలన.
 • ఎక్కువగా చీవింగ్ గం తినటం వలన.
 • పొగ త్రాగటం వలన.

గ్యాస్ట్రిక్ సమస్య యొక్క లక్షణాలు?

అతి సాధారణ గ్యాస్ లక్షణాలు బర్పింగ్ (త్రేన్పు), ఆనస్ ద్వారా గ్యాస్ విడుదల చేయటం, పొట్ట ఉబ్బరం మరియు నొప్పి లేదా అసౌకర్యంగా అనిపించటం. గ్యాస్ లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంటాయి.

బర్పింగ్

భోజనం తర్వాత తేపు రావడం సాధారణం. కానీ మీకు చాలా సార్లు త్రేన్పు వస్తున్నట్లయితే, మీరు ఎక్కువ గాలిని మింగి ఉంటారు మరియు ఆ గాలి మీ కడుపులోకి ప్రవేశించే ముందే విడుదల అవుతోందని అర్థం.

ఆనస్ ద్వారా గ్యాస్ విడుదల చేయటం

రోజుకు 13 నుండి 21 సార్లు గ్యాస్ విడుదల చేయటం సాధారణం. కానీ అంతకన్నా ఎక్కువ సార్లు చేస్తున్నట్లయితే మీకు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్లు.

పొట్ట ఉబ్బరం

ఉబ్బరం అనేది మీ పొత్తికడుపులో వాపు. ఇది తరచుగా భోజనం తర్వాత ఏర్పడుతుంది. కానీ చాలా సేపు మీ కడుపు ఉబ్బినట్లు అనిపిస్తే మీ పొట్టలో గ్యాస్ పేరుకు పోయినట్లు.

మీ ఉదరంలో నొప్పి లేదా అసౌకర్యం

సాధారణంగా మీ ప్రేగులు ద్వారా గ్యాస్ తరలించనప్పుడు మీకు మీ ఉదరం లో నొప్పిగా లేదా అసౌకర్యంగా అనిపిస్తుంది.

ఈ సమస్య గురించి డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి?

ఈ క్రింది లక్షణాలను గమనించినప్పుడు మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి:

 • వాయువు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినప్పుడు.
 • మీ లక్షణాలు హఠాత్తుగా మారినప్పుడు.
 • మీకు గ్యాస్ సమస్యతో పాటు మలబద్ధకం, అతిసారం లేదా బరువు తగ్గడం వంటి ఇతర లక్షణాలు కలిగి ఉన్నప్పుడు.

గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్లయితే మీరు చేయకూడని పనులు మరియు తినకూడని ఆహార పదార్థాలు

మద్యం సేవించకూడదు

మద్యం సేవించిన తదుపరి రోజు వీటి యొక్క ప్రభావాలను అనుభవిస్తారు. తలనొప్పి, కడుపులో వికారం లేదా హ్యాంగోవర్. రోజూ మద్యం సేవించడం మరియు ఎక్కువ మొత్తంలో తీసుకోవటం వలన పొట్టలో పుండ్లు ఏర్పడవచ్చు. ఇది కడుపు యొక్క లైనింగ్లో అధిక మంటను పుట్టించి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. మీరు అధికంగా మద్యపానం త్రాగితే పొట్టలోని పుండ్లు మన శరీరానికి కావలసిన ఆమ్లాలు మరియు ఎంజైములను ఉత్పత్తి చేయడాన్ని తగ్గించవచ్చు. దీని ప్రభావంగా గ్యాస్ట్రిక్ సమస్య ఎదురవుతుంది.

స్పైసి ఫుడ్

కారం ఎక్కువగా ఉండే ఆహారాల రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇవి మీ కడుపు యొక్క లైనింగ్‌ను ప్రేరేపిస్తాయి మరియు మీ కడుపులో మంటను పుట్టిస్తాయి. ఎక్కువ మసాలా ఉన్న ఆహారాన్ని తినటం వలన పొట్టలో పుండ్ల యొక్క లక్షణాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి.

కొవ్వు పదార్ధాలు

మంచి రుచి ఉన్న ఆహారాలలో అధిక కొవ్వు ఉంటుంది, ఉదాహరణకు చిప్స్, ఫ్రైస్, పిజ్జాలు, బర్గర్స్ మరియు మొదలైనవి. ఈ ఆహారాలు మీ కడుపు యొక్క లైనింగ్‌ను అప్‌సెట్ చేస్తుంది. వాటిలో ట్రాన్స్ మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆహారాలు ఉంటాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు మరింత ప్రమాదకరం. బేక్ చేసినవి లేదా వనస్పతి కలిగి ఉన్న ఆహారం ఏదైనా సరే నివారించాలి.

సిగరెట్స్

ఇది కడుపులో అసౌకర్యాన్ని కలిగించటంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను వరుసగా కలిగిస్తుంది. ఇది కడుపు గోడల లైనింగ్లో ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. ధూమపానం యొక్క ప్రధాన దుష్ప్రభావాలలో గ్యాస్ట్రిక్ సమస్య ఒకటి. మీ కడుపులో అసౌకర్యాన్ని తొలగించుకోవాలంటే ధూమపానం మానేయాలి.

గ్యాస్ట్రిక్ సమస్యని నివారించే పద్ధతులు

కొన్ని ఆహార అలవాట్లను మరియు జీవనశైలిని మార్చుకోవటం ద్వారా ఈ సమస్యను సులభంగా నివారించవచ్చు.

పండ్లు తినడం

పండ్లలో ఫైబర్ మరియు ph స్థాయులు సరైన మొత్తాల్లో ఉంటాయి. ఇవి పొట్టలో పుండ్లను తొలగించేందుకు సహాయపడుతుంది. ప్రత్యేకంగా సిట్రస్ పండ్లు మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడానికి మరియు గ్యాస్ట్రిక్ ఆమ్లాలను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. నారింజ రసం లేదా నిమ్మరసం వంటి సిట్రస్ పండ్ల రసాలను తరచుగా త్రాగండి.

బేకింగ్ సోడా

కొన్నిసార్లు గ్యాస్ట్రిటిస్ సమస్య భరించలేనంత తీవ్రంగా మారుతుంది. కడుపు నొప్పి మొదలవుతున్నప్పుడు, తల భారీగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు త్రేన్పులు కూడా ఆగవు, రెస్ట్ లెస్ గా అనిపిస్తుంది. అటువంటి సమయంలో బేకింగ్ సోడా ఒక తక్షణ ఉపశమనం. కడుపు యొక్క PH సంతులనాన్ని పునరుద్ధరించడానికి మరియు తక్షణ ఉపశమనం పొందటానికి ఒక గ్లాసు నీటిలో ½ స్పూన్ బేకింగ్ సోడా కలుపుకొని త్రాగండి.

వాకింగ్

ఈ ప్రక్రియ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది మరియు కడుపు యొక్క ఆరోగ్యకరమైన కార్యాచరణను ప్రోత్సహిస్తుంది. మీరు పొట్టలో గాస్ట్రిక్ సమస్య వలన బాధపడుతుంటే, భోజనం చేసిన తరువాత 15-20 నిముషాలు వాకింగ్ చేయండి.

యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు

విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి. విటమిన్ ఎ మరియు సి కడుపు యొక్క లైనింగ్లో వాపు మరియు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణ లోపాలను కూడా సరిచేస్తుంది. బెర్రీస్ లో విటమిన్లు మరియు ఫ్లేవానాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. పండ్లు మరియు కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు లైనింగ్‌కు సంబంధించిన ఏ వ్యాధినైనా నయం చేస్తుంది. తాజా మూలికలు, స్క్వాష్, ఆకు కూరలు, ఆపిల్, సెలెరీ, క్రాన్బెర్రీస్, ఆస్పరాగస్, ఆర్టిచోకెస్, ఉల్లిపాయలు, పసుపు, వెల్లుల్లి, బెర్రీలు. ఈ పండ్లను మరియు కూరగాయలను మీకు నచ్చినంత ఎక్కువగా తీసుకోండి.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు

కడుపులోని ఆహారాన్ని జీర్ణాశయంలోనికి సులభంగా కదిలించడంలో ఫైబర్స్ సహాయపడుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు గ్యాస్ట్రిటిస్ సమస్యలు ఉన్నట్లయితే అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను తినండి. ఆరెంజ్, ఆపిల్స్, అరటి మరియు రాస్ప్బెర్రీస్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దుంపలు, క్యారట్లు, కాలే, బ్రోకలీ మరియు బచ్చలికూర వంటి కూరగాయలలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది.

ప్రోబయోటిక్ ఫుడ్స్

ప్రోబయోటిక్స్ కడుపు లైనింగ్స్ యొక్క వాపును తగ్గిస్తుంది మరియు మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ ఎదుర్కొంటున్న వివిధ రకాలైన ఇన్ఫెక్షన్లను కూడా ఇవి తొలగిస్తాయి. ఇవి మన శరీరంలో బ్యాక్టీరియా స్థాయిని నిర్వహిస్తాయి. సౌర్క్క్రాట్, కించి, కంబుచా, నట్టో, పెరుగు  మరియు మజ్జిగలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి.

నీరు

జీర్ణ కోశ ప్రాంతంను ఆరోగ్యవంతంగా ఉంచుకోవటానికి నీటిని అధికంగా త్రాగండి.  నొప్పి మరియు వాపును కలిగించే హానికరమైన టాక్సిన్స్ ని శరీరం నుండి తొలగించటానికి నీరు సహాయపడుతుంది. మీ కడుపు లోపలి లైనింగ్‌ను వాపు మరియు మంట నుండి కాపాడటానికి ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీటిని త్రాగాలి.

అల్లం

అల్లం గ్యాస్ట్రిక్ చికిత్స కోసం అత్యంత ఉపయోగకరమైన పదార్ధం మరియు ప్రతి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటుంది. అల్లంను సన్నటి ముక్కలుగా కోసుకొని, ఒక కప్పు వేడి నీటిలో వేసి 10 నిమిషాలు మూసిపెట్టండి. ఆ తరువాత, అల్లం నీటిని వడగట్టి ఒక టేబుల్ స్పూన్ తేనెతో పాటు కొన్ని చుక్కల నిమ్మరసం పిండి త్రాగండి. ఇది మీ జీర్ణవ్యవస్థకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది.

సోంపు

ఎక్కువ భోజనం తిన్నప్పుడు త్రేన్పులు సహజం, అందుకే తిన్న వెంటనే కొన్ని సోంపు గింజలు నోట్లో వేసుకొని నమలడం వల్ల సమస్య కొంత వరకు తగ్గుతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్ మరియు ట్యూమర్ ని గుణపరిచేందుకు కూడా సహాయపడుతుంది. ఇందులో యాంటి వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ట్యూమర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి.

మార్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు

 • మీరు భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా తినడం అలవాటును చేసుకోండి. మీ ఆహారాన్ని సరిగ్గా నమలి తినండి.
 • భోజనం తరచుగా మరియు తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. అలా తినటం వలన మన శరీరం ఆహారాన్ని మరింత సులభంగా జీర్ణం చేయగలదు మరియు పొట్టలో పుండ్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటుంది.
 • మీరు తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు తగిన సమయాన్ని ఇవ్వండి. తిన్న వెంటనే పడుకోకూడదు.
 • వీటన్నిటితో పాటు మెదడు యొక్క ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మీ ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి పెరగటం వలన కూడా కడుపులో ఎక్కువ ఆమ్లాలు ఉత్పత్తి అయ్యి మంటను పెంచుతాయి.
Posted on

Remedies to cure chickenpox in Telugu – చికెన్ పాక్స్ నివారణకు గృహ చిట్కాలు

చికెన్ పాక్స్ ని ఆటలమ్మ, అమ్మోరు లేదా తట్టు అని అంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేక భాగాలలో ఉన్న ప్రజల్లో ఏర్పడే ఒక సాధారణ వైరల్ వ్యాధి. ఇది ఒక అంటు వ్యాధి. ఈ సంక్రమణం ఒకసారి కంటే ఎక్కువగా రావటం చాలా అరుదు. ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం చర్మంపై దురద బొబ్బలు ఏర్పడటం. జ్వరము, తలనొప్పి, అలసట వంటివి దీని యొక్క ఇతర లక్షణాలు.

ఇది సుమారు రెండు వారాల పాటు ఉంటుంది. ఈ వ్యాధి భౌతిక సంబంధాల వలన కూడా వ్యాపిస్తుంది. ఈ సంక్రమణ బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులకు మరింత తీవ్రంగా ఉంటుంది.

వ్యాక్సినేషన్ కనుగొన్న తర్వాత టీకాలు వేయడం ద్వారా చికెన్ పాక్స్ నుండి పిల్లలకు రక్షణ కల్పించబడింది. ఈ వ్యాధి యొక్క కారణాలు మరియు లక్షణాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

చికెన్ పాక్స్ యొక్క కారణాలు

చికెన్ పాక్స్ వరిసెల్లా జోస్టర్ వైరస్ వలన కలుగుతుంది. ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఫిసికల్ కాంటాక్ట్ ద్వారా, లేదా జలుబు, ఫ్లూ మరియు దగ్గు వలన వ్యాపించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ వలన చర్మంపై బొబ్బలు ఏర్పడుతాయి. బొబ్బలలోని ద్రవంతో కాంటాక్ట్ వలన కూడా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. చికెన్ పాక్స్ సంక్రమణ రోగనిరోధక వ్యవస్థ యొక్క ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ రెండోసారి రాదు.

వాక్సినేషన్ చేసుకోని వారికి మరియు ఇదివరకు ఈ ఇన్ఫెక్షన్ రాని వారికి ఈ వైరస్ తొందరగా అంటుకునే ప్రమాదం ఉంది. కలుషితమైన వస్తువులను మరియు ఉపరితలాలను తాకడం ద్వారా ఈ వైరస్ మీలో ప్రవేశించవచ్చు.

చికెన్ పాక్స్ యొక్క లక్షణాలు

వైరస్‌కు గురైన 10 నుండి 21 రోజుల తర్వాత చికెన్ పాక్స్ పైకి కనిపిస్తుంది. ఇది సాధారణంగా 5 నుండి 10 రోజుల వరకు ఉంటుంది. చికెన్ పాక్స్ యొక్క ముఖ్య సూచన దద్దుర్లు. క్రింద చెప్పిన ఇతర సంకేతాలు మరియు లక్షణాలు దద్దుర్లు వచ్చే ఒకటి రెండు రోజుల ముందు కనిపించవచ్చు:

 • జ్వరం
 • ఆకలి లేకపోవటం
 • తలనొప్పి
 • అలసట మరియు అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించటం (ఆయాసం)

చికెన్ పాక్స్ వచ్చిన తరువాత మీకు నయం అయ్యే ముందు దద్దుర్లు మూడు దశల వరకు వెళ్తాయి

 • మీ శరీరంపై ఎరుపు గడ్డలు అభివృద్ధి చెందుతాయి.
 • గడ్డలు స్రావంతో నిండిన బొబ్బలుగా అవుతాయి.
 • ఆ బొబ్బలు తిరిగి గరుకుగా మారి, గడ్డకట్టి ఆ తరువాత నయం అవ్వటానికి ప్రారంభమవుతుంది.

ఈ సంక్రమణ ఎక్కువగా ఎవరికి వ్యాపిస్తుంది

ఇదివరకే ఈ వైరస్ సంక్రమణ కలిగి ఉంటే లేదా టీకా వేసుకొని ఉంటే చికెన్ పాక్స్ ప్రమాదం ఉండదు. వైరస్ నుండి ఇమ్యూనిటీ ఒక తల్లి నుంచి శిశువుకు పంపబడుతుంది. పుట్టిన శిశువుకు సుమారు మూడు నెలల వరకు ఈ ఇమ్యూనిటీ ఉంటుంది.

ఇదివరకు ఈ ఇన్ఫెక్షన్ కలగని వారికి క్రింద చెప్పిన సందర్భాలలో చికెన్ పాక్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి:

 • చికెన్ పాక్స్ సోకిన వ్యక్తితో మీకు ఇటీవల ఫిసికల్ కాంటాక్ట్ కలిగి ఉన్నప్పుడు.
 • మీకు 12 ఏళ్ల లోపు ఉన్నట్లయితే.
 • అనారోగ్యం లేదా మందుల కారణంగా మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు.

చికెన్ పాక్స్ వచ్చినప్పుడు వాటి నుండి ఉపశమనం పొందేందుకు క్రింద చెప్పిన కొన్ని ఇంటి నివారణ పద్దతులను అనుసరించండి.

చికెన్ పాక్స్ ను నివారించడానికి హోం రెమెడీలు

ఆపిల్ సీడర్ వినిగర్

దురద మరియు వాపును అరికట్టడానికి ప్రసిద్ధి చెందిన ఉత్తమ పదార్ధాలలో ఆపిల్ సీడర్ వినిగర్ ఒకటి. మీరు చేయాల్సిందల్లా, ఒక గ్లాసు నీటిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్ ని కలుపుకొని ఒక పత్తి లేదా శుభ్రమైన వస్త్రాన్ని ముంచి చర్మంపై రాయాలి. లేదా స్నానానికి ఉపయోగించే నీటిలో కొన్ని చుక్కల వినిగర్‌ని కలుపుకొని ఆ నీటితో స్నానం చేయవచ్చు.

కలేమైన్ లోషన్

చర్మంపై చికెన్ పాక్స్ ఏర్పడినప్పుడు కలేమైన్ లోషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది దురదను తగ్గిస్తుంది. ఒక పత్తిని ఉపయోగించి మృదువుగా కలేమైన్ లోషన్‌ని చర్మంపై రాయండి.

చమోమిలే టీ

చికెన్ పాక్స్ ని క్యూర్ చేసేందుకు చమోమిల్ టీ ఒక మంచి పరిష్కారం. కొద్దిగా చమోమిలే టీ ని సిద్ధం చేసి, దానిలో పత్తిని ముంచి చర్మంపై రాయండి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు క్రిమినాశక లక్షణాలు ఉన్నందున, చర్మంపై దురదను తగ్గిస్తుంది.

విటమిన్ డి

చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఇది అంటువ్యాధి అయినందున మనం ఇంటిలోనే ఉంటాము. కానీ అటువంటి సమయంలో సూర్య కిరణాలు మన శరీరంపై పడటం చాలా మంచిది. సూర్య కిరణాలలోని విటమిన్ డి చికెన్ పాక్స్ తొందరగా తగ్గేందుకు సహాయపడుతుంది. కనుక ప్రతిరోజూ కొద్ది సమయం సూర్య కిరణాలలో కూర్చోండి.

లావెండర్ ఎస్సెంటిల్ ఆయిల్

చికెన్ పాక్స్ ని గుణపరిచేందుకు మరొక ఉత్తమ పరిష్కారం లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్. చికెన్ పాక్స్ వలన కలిగే వాపు, దురద, మరియు చికాకు లావెండర్ ఆయిల్ ని ఉపయోగించటం ద్వారా తొలగిపోతుంది. ఒక గిన్నెలో లావెండర్ ఆయిల్తోపాటు కొబ్బరి నూనె లేదా బాదం నూనెని సమాన భాగాలుగా కలుపుకోండి. చికెన్ పాక్స్ ప్రభావితం అయిన చర్మంపై రాసి ఆరే వరకు ఆగండి. ఇలా రోజుకు రెండుసార్లు చేయండి.

మరొక పద్దతి: మీరు స్నానం చేసే వెచ్చని నీటిలో చమోమిలే ఎస్సెంటిల్ నూనె మరియు లావెండర్ నూనెని సమాన భాగాలలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి.

సాండెల్ వుడ్ ఆయిల్

సాండెల్ వుడ్ ఆయిల్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇది చికెన్ పాక్స్ వలన ఏర్పడే స్కార్స్ ని తొలగించేందుకు సహాయపడుతుంది. ఒక స్పూన్ బాదాం నూనె మరియు మూడు చుక్కల సాండెల్ వుడ్ ఆయిల్ ని కలుపుకొని చర్మంపై రాయండి. ప్రతి రోజూ రెండుసార్లు ఇలా చేయడం వలన స్కార్స్ తొందరగా తొలగిపోతాయి.

విచ్ హాజెల్

చికెన్ పాక్స్ వలన ఏర్పడే దద్దుర్లు, చికాకు, దురద మరియు మంటని తగ్గించేందుకు విచ్ హాజెల్ సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ విచ్ హాజెల్ మరియు రెండు స్పూన్ కాలెందుల పువ్వులను వేసి కవర్ చేసి రాత్రంతా ఉంచండి. ఉదయం దీనిని ఒక మృదువైన పేస్ట్‌లా రుబ్బి చికెన్ పాక్స్ ప్రభావితం అయిన చర్మంపై రాయండి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజుకు ఒక సరి చేసి మంచి ఫలితాలను పొందండి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా చికెన్ పాక్స్ వలన కలిగే బొబ్బలపై చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని కలిపి చర్మంపై రాయండి. ఈ పద్ధతిని తరచూ ఉపయోగించవచ్చు. లేదా మీరు స్నానం చేసే నీటిలో బేకింగ్ సోడాని కలుపుకొని ఆ నీటితో స్నానం చేయవచ్చు. ఈ పద్దతులను చాలా సార్లు రిపీట్ చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

తేనె

చికెన్ పాక్స్ వలన కలిగే అసౌకర్యం నుండి ఉపశమనాన్ని పొందేందుకు తేనె ఉపయోగపడుతుంది. ఇందులో యాంటి బ్యాక్టీరియల్ లాంటి లక్షణాలు ఉన్నాయి. తేనెని డైరెక్ట్ గా దద్దుర్లపై రాసి కొంత సమయం ఉంచి కడగండి.

వేప ఆకులు

ఇది ఎన్నో సంవత్సరాలుగా చికెన్ పాక్స్ ని క్యూర్ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. వేప ఆకులో యాంటీ వైరన్, మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పెద్దలకు చికెన్ పాక్స్ వచ్చినట్లయితే వేపాకు పేస్ట్‌ని డైరెక్ట్ గా చర్మంపై రాయటం వలన అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉండటం వలన వేపాకులను డైరెక్ట్ గా చర్మంపై రాయకుండా నీటిలో నానబెట్టి ఆ నీటితో స్నానం చేయించండి.

బ్రౌన్ వినిగర్

వినిగర్‌లోని ఎసిటిక్ ఆమ్లం బ్యాక్టీరియాను తొలగిస్తుంది. చికెన్ పాక్స్ బాధితుల విషయంలో బొబ్బలను త్వరగా పొడిగా చేయడానికి మరియు చర్మంపై శాశ్వత మచ్చలను నివారించడానికి వినిగర్‌ని ఉపయోగిస్తారు. సగం కప్పు వినిగర్‌ని స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఈ వ్యాధి పూర్తిగా నయం అయ్యే వరకు ఈ పద్దతిని కొనసాగించండి.

వోట్మీల్ మరియు ఎస్సెంటిల్ ఆయిల్స్

వోట్మీల్ కూడా చికెన్ పాక్స్ వలన ఏర్పడే చికాకుని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వోట్మీల్ను పొడి చేసి, స్నానం చేసే నీటిలో కలపండి. దీనికి ఉత్తమ మార్గం ఒక వస్త్రంతో చేసిన బ్యాగ్లో వోట్మీల్ పొడిని వేసుకొని స్నానపు తొట్టె నీటిలో బ్యాగ్‌ని ముంచి బాగా కలపండి. నీరు నెమ్మదిగా పాల రంగుకు మారుతుంది. ఇలా 15 నిముషాల పాటు నానబెట్టి ఆ నీటితో స్నానం చేయండి.

వోట్మీల్ బాత్ యొక్క ప్రభావాన్ని మరింత పెంచుటకు, టీ ట్రీ ఆయిల్, లావెండర్ ఆయిల్, రోమన్ చమోమిలే ఆయిల్, లవంగ నూనె, రోజ్మేరీ ఆయిల్ మరియు నౌలోయి ఆయిల్ లాంటి ఎస్సెంటిల్ ఆయిల్‌ను చేర్చుకోండి. లావెండర్ మరియు చమోమిల నూనెను వాడుతున్నట్లయితే 4 చుక్కలు వేసుకోవచ్చు, మిగిలిన నూనెల్ని 2 చుక్కలు వేసుకోవచ్చు. ఈ నూనెలు చర్మ కణాల పునరుజ్జీవనంలో తోడ్పడుతుంది మరియు మచ్చలు ఏర్పడకుండా సహాయపడతాయి.

ఎప్సోమ్ సాల్ట్

ఎప్సోమ్ సాల్ట్ యొక్క ఔషధ లక్షణాల వలన దీనిని వివిధ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఎప్సోమ్ ఉప్పు యొక్క బేసిక్ కాంపొనెంట్మెగ్నీషియం సల్ఫేట్. ఇది శరీరంలోని ఒత్తిడిని మరియు నొప్పిని తగ్గిస్తుంది. రెండు కప్పుల ఎప్సోమ్ ఉప్పుని నీటిలో కలుపుకొని స్నానం చేయటం వలన దురదను తగ్గించి సౌకర్యమైన అనుభూతిని అందిస్తుంది.

కూరగాయలు మరియు అల్లం

బాహ్య చికిత్సలు మాత్రమే కాకుండా, కొన్ని పదార్ధాలను తినటం వలన కూడా చికెన్ పాక్స్ యొక్క లక్షణాలను తొలగించవచ్చు. క్యారట్ మరియు కొత్తిమీర ఆకులు శరీరాన్ని చల్లబరుస్తాయి, వీటితో సూప్ తయారు చేసుకొని తీసుకోవచ్చు. చికెన్ పాక్స్ వలన కలిగే దురదను తగ్గించడానికి గ్రీన్ పీస్‌ని ఉపయోగించవచ్చు. ఒక కప్పు ఉడికించిన బఠానీలను చూర్ణం చేసి చర్మంపై రాయటం వలన ఉపశమనాన్ని ఇస్తుంది.

అల్లం కూడా శరీర వ్యవస్థపై వివిధ సానుకూల ప్రభావాలను చూపుతుంది. నీటిలో అల్లం వేసి బాగా ఉడికింది అందులో తేనె మరియు నిమ్మరసం కలుపుకొని త్రాగటం వలన చికెన్ పాక్స్ బాధితులకు చాలా ఉపశమనంగా ఉంటుంది. అల్లంను పొడి చేసి స్నానం చేసే నీటిలో కలుపుకొని ఉపయోగించటం వలన కూడా ఉపశమనాన్ని పొందుతారు.

ఔషధ పుష్పాలు

జాస్మిన్ మరియు మ్యారిగోల్డ్ వంటి పువ్వులలో వివిధ ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి చికెన్ పాక్స్ కి వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుంది. రోజుకు 3 నుండి 4 సార్లు జాస్మిన్ టీ త్రాగండి మరియు ఎండబెట్టిన జాస్మిన్ పొడిని స్నానపు నీటిలో చేర్చుకోండి. మ్యారిగోల్డ్ పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఒక టీస్పూన్ విచ్ హాజెల్ ఆకుల మరియు కొన్ని మ్యారిగోల్డ్ పువ్వులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పేస్ట్‌లా రుబ్బు కొని చర్మంపై రాయండి. బాగా ఎండిన తరువాత నీటితో కడగండి.

చికెన్ పాక్స్ సమయంలో చక్కని చిట్కాలు

 • చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అత్తి పండ్లను తినవచ్చు.
 • తాజా కూరగాయలు మరియు పండ్లతో తయారు చేసిన ఫల రసాలను ఎక్కువగా తీసుకోండి.
 • స్కార్స్ ని తొలగించడానికి, విటమిన్ ఇ నూనెని ఉపయోగించండి.
 • ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
 • ఎక్కువ నీటిని త్రాగాలి.
 • విటమిన్ ఏ, సి మరియు డి సప్లిమెంట్స్ ని తీసుకోవచ్చు.
 • మాంసం వంటివి ఘన ఆహారాన్ని తగ్గించండి.

ఈ గృహ నివారణలు చికెన్ పాక్స్ తో బాధపడుతున్న వారికి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. వీటితో పాటు బాధితులు సరైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు కాన్డ్ పానీయాలను నివారించాలి. వీటన్నిటితో పాటు చికెన్ పాక్స్ బాధితులు అధిక విశ్రాంతి తీసుకోవాలి.

Posted on

థైరాయిడ్ సమస్యా..? – Thyroid tips in Telugu

మన శరీరంలో అనేక గ్రంథులు (గ్లాండ్స్) ఉంటాయి. చాలా ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ ఒకటి. దీనిని అవటుగ్రంథిమరియు కాకళగ్రంథి అని అంటారు. మన శరీరం యొక్క జీవక్రియ ఈ గ్రంథుల పై ఆధారపడి ఉంటుంది. ఈ గ్రంథుల యొక్క వివరాలు, వీటి వలన కలిగే సమస్యలు, నివారణ పద్దతులు మరియు చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం.

థైరాయిడ్ అంటే ఏమిటి?

థైరాయిడ్ ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది మీ మెడ యొక్క బేస్ వద్ద, ఆడమ్’s ఆపిల్ క్రింద ఉంటుంది. ఈ గ్రంథి మనం తినే ఆహారంలోని అయోడిన్ ని గ్రహించడం ద్వారా థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు రక్తంద్వారా మీ శరీరంలోని అన్ని భాగాలకు చేరుతాయి. థైరాయిడ్ హార్మోన్లు మీ శరీరం యొక్క జీవక్రియను అనేక విధాలుగా నియంత్రిస్తాయి.

థైరాయిడ్ సమస్యలు

ఈ గ్రంథులు హార్మోన్లను ఉత్పత్తి చేయటం ద్వారా మీ శరీరంలో అనేక కార్యకలాపాలను నియంత్రిస్తాయి. ఈ హార్మోన్లను చాలా ఎక్కువ లేదా చాలా తక్కువగా ఉత్పత్తి చేయడం వలన థైరాయిడ్ సమస్యలు ఎదురవుతాయి. మీ థైరాయిడ్ ఎంత ఎక్కువగా లేదా ఎంత తక్కువగా హార్మోన్లను ఉత్పత్తి చేస్తుందన్నదానిబట్టి మీరు తరచుగా రెస్ట్ లెస్ లేదా అలసటతో బాధపడవచ్చు, బరువు కోల్పోవచ్చు లేదా బరువు పెరగచ్చు.

థైరాయిడ్ రుగ్మతల యొక్క రకాలు

 1. హైపో థైరాయిడిజం
 2. హైపర్ థైరాయిడిజం
 3. గొయిటెర్
 4. థైరాయిడ్ నోడ్యూల్స్
 5. థైరాయిడ్ క్యాన్సర్

1. హైపో థైరాయిడిజం

థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయకపోవటం వలన హైపో థైరాయిడిజం ఏర్పడుతుంది. దీనిని అండర్ఆక్టివ్ థైరాయిడ్ అని కూడా పిలుస్తారు. ఇది మీ శరీరం యొక్క అనేక ఫంక్షన్స్ ను తగ్గిస్తుంది, ఉదాహరణకు మీ జీవక్రియ తగ్గిపోతుంది.

ఇతర లక్షణాలు

 • అలసట
 • ఏకాగ్రత తగ్గిపోవటం
 • పొడి బారిన చర్మం
 • మలబద్ధకం
 • ఎక్కువ చలిగా అనిపించటం
 • ఫ్లూయిడ్ రిటెన్షన్
 • కండరాల మరియు కీళ్ల నొప్పులు
 • డిప్రెషన్
 • మహిళల్లో దీర్ఘకాలం లేదా అధిక ఋతుస్రావం
 • మీరు ఎక్కువ ఆహారం తినకపోయినప్పటికీ బరువు పెరుగుట
 • జుట్టు పలచబడుట
 • స్లో హార్ట్ బీట్ మరియు
 • తక్కువ స్వెట్టింగ్

హైపో థైరాయిడిజం యొక్క కారణాలు

 • హషిమోటో థైరాయిడిటిస్ (థైరాయిడ్ గ్రంథిలో వాపును కలిగించే ఒక ఆటో ఇమ్యూన్ స్థితి)
 • థైరాయిడ్ హార్మోన్ రెసిస్టన్స్
 • తీవ్రమైన థైరాయిడిటిస్ మరియు ప్రసవానంతర థైరాయిడిటిస్
 • కొన్ని క్యాన్సర్ల కొరకు రేడియేషన్ చికిత్స తీసుకోవటం వలన కూడా హైపో థైరాయిడిజం రావచ్చు.

2. హైపర్ థైరాయిడిజం 

థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను అధికంగా ఉత్పత్తి చేయటం వలన హైపర్ థైరాయిడిజం ఏర్పడుతుంది. దీనిని ఓవర్ఆక్టివ్ థైరాయిడ్ అని కూడా అంటారు. ఇది మీ శరీరం యొక్క అనేక ఫంక్షన్స్ ను వేగవంతం చేస్తుంది, ఉదాహరణకు మీ జీవక్రియ పెరుగుతుంది.

ఇతర లక్షణాలు

 • బరువు తగ్గటం.
 • ఎక్కువ తినాలని అనిపించడం
 • క్రమరహిత హార్ట్ బీట్
 • నెర్వస్గా ఉండటం
 • నిద్రపట్టక పోవటం
 • మీ చేతులు మరియు వేళ్ళు వణుకుతుండటం
 • ఎక్కువ చెమట పుట్టడం
 • ఎక్కువ వేడిగా ఉన్నట్లు అనిపించటం
 • కండరాల బలహీనత
 • విరోచనాలు
 • పీరియడ్స్ సమస్యలు మరియు
 • కంట్లో రెడ్నెస్ లేదా ఉబ్బినట్లు ఉండటం.

హైపర్ థైరాయిడిజం యొక్క కారణాలు

 • అధిక అయోడిన్ తీసుకోవటం
 • గ్రేవ్స్ వ్యాధి
 • టాక్సిక్ మల్టీనోడలర్ గొయిటెర్
 • థైరాయిడ్ నోడ్యూల్స్

3. గొయిటెర్

థైరాయిడ్ గ్రంథి యొక్క విస్తరణను (ఎన్లార్జ్మెంట్) గొయిటెర్ అని అంటారు. ఇది ఒక నిర్దిష్ట వ్యాధి కాదు. హైపో థైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలు వచ్చినప్పుడు వాటితోపాటు ఈ వాపు కూడా కలగచ్చు.

లక్షణాలు

సాధారణంగా, గొయిటెర్ యొక్క ఏకైక లక్షణం మీ మెడలో వాపు ఉంటుంది. ఇది మీరు చూడగలిగే అంత పెద్ద కావచ్చు.

గొయిటెర్ యొక్క కారణాలు

 • హాషిమోతో వ్యాధి
 • గ్రేవ్స్ వ్యాధి
 • థైరాయిడ్ నోడ్యూల్స్
 • థైరోయిడిటిస్
 • థైరాయిడ్ క్యాన్సర్

4. థైరాయిడ్ నోడ్యూల్స్

థైరాయిడ్ గ్రంథి యొక్క ఒక విభాగంలో వాపుని థైరాయిడ్ నోడ్యూల్ అని అంటారు. నోడ్యూల్ ఘనంగా ఉండొచ్చు లేదా ద్రవం మరియు రక్తంతో నిండి ఉండొచ్చు. ఈ సమస్య కలిగినప్పుడు మేడలో ఒక థైరాయిడ్ నోడ్యూల్ మాత్రమే రావచ్చు లేదా అనేక నోడ్యూల్స్ ఏర్పడవచ్చు.

లక్షణాలు

చాలా థైరాయిడ్ నోడ్యూల్స్ ఎటువంటి లక్షణాలనూ చూపవు. మీ మేడలో ఆడమ్ ఆపిల్ క్రింద విండ్ పైప్ యొక్క ఇరు వైపులలో వాపు ఉన్నట్లయితే మరియు మీరు మింగేటప్పుడు అవి కదులుతూ ఉంటే, అది ఒక థైరాయిడ్ నూడ్యూల్ కావచ్చు.

5. థైరాయిడ్ క్యాన్సర్

థైరాయిడ్ గ్రంథి యొక్క కణజాలం నుండి క్యాన్సర్ కణాలు ఏర్పడినప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ సంభవిస్తుంది.

థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న చాలా మందికి థైరాయిడ్ నోడ్యూల్ ఉంటుంది, పై చెప్పినట్లు అవి ఏ లక్షణాలనూ చూపించవు. మీ మేడలో వాపు ఉండవచ్చు. మీ వాయిస్ చాలా గరుకుగా మారవచ్చు.

నోడ్యూల్ క్యాన్సర్ ఉన్నట్లు తెలుసుకోడానికి, మీ డాక్టర్‌ని సంప్రదించి వారు ఆదేశించిన కొన్ని పరీక్షలను చేయించుకోండి. చాలా థైరాయిడ్ నోడ్యూల్ క్యాన్సర్ కాదు.

థైరాయిడ్ వ్యాధి ఎవరికి ఎక్కువగా వస్తుంది?

పురుషుల కన్నా స్త్రీలలో ఈ థైరాయిడ్ వ్యాధులు అధికంగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి గర్భధారణ తర్వాత మరియు మెనోపాజ్ తరువాత. గతంలో థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే మీకు మల్లీ వచ్చే అవకాశాలు ఉంటుంది. థైరాయిడ్ గ్రంథులను ప్రభావితం చేసే శస్త్రచికిత్స లేదా రేడియో థెరపీ చేసుకున్నట్లయితే మరియు రక్తహీనత (అనీమియా) లేదా టైప్ 1 డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నట్లయితే మీకు థైరాయిడ్ సమస్య ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

థైరాయిడ్ను కనుగొనడానికి చేయాల్సిన పరీక్షలు

ఈ వ్యాధి యొక్క లక్షణాల బట్టి, భౌతిక పరీక్షల బట్టి మరియు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లు (TSH), థైరాయిడ్ హార్మోన్లు T4 మరియు హైపర్ థైరాయిడిజం T3 లను కనుకొనే కొన్ని రక్త పరీక్షలను బట్టి మీ థైరాయిడ్ సమస్యను సులభంగా నిర్ధారించవచ్చు.

ఈ పరీక్షా ఫలితాలను బట్టి వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్సలను తీసుకోవాలి. కొన్ని తీవ్రమైన సందర్భాలలో, శస్త్రచికిత్సలు సహాయపడతాయి.

థైరాయిడ్ సమస్యను నివారించేందుకు కొన్ని మార్గాలు

వాపును తగ్గించేందుకు

తాజా పసుపును మరిగించిన పాలలో లేదా మీ స్మూతీలలో జత చేసుకోవచ్చు. పాలకూర, నిమ్మ, దోస, కొత్తిమీరలతో తయారుచేసిన ఆకుపచ్చని స్మూతీని తాగవచ్చు.

విటమిన్ డి ఎక్కువగా తీసుకోండి

విటమిన్ డి సరైన స్థాయిలలో తీసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే విటమిన్ డి తక్కువగా ఉండటం వలన థైరాయిడ్ రావచ్చు. విటమిన్ డి వాపుకి వ్యతిరేకంగా పనిచేస్తుంది మరియు ఆటో ఇమ్యూన్ వ్యాధి రాకుండా చేస్తుంది. పెరుగులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.

అయోడిన్ సరిగా తీసుకోవాలి

థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు అయోడిన్ని క్రమబద్ధంగా తీసుకోవటం అవసరం. అయోడిన్ థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి కావటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయోడిన్ ఎక్కువగా ఉన్న చేపలు, రొయ్యలు, పాలకూర, వెల్లుల్లి, నువ్వులు వంటి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. గమనిక : ఎక్కువ అయోడిన్ తీసుకోవద్దు ఎందుకంటే ఇది హైపర్ థైరాయిడిజంకి దారితీస్తుంది.

ప్రొటీన్ సరిగ్గా తీసుకోవాలి

థైరాయిడ్ గ్రంథులు సరిగ్గా పనిచేయటానికి ప్రొటీన్ చాలా ముఖ్యమైనది. ఇది థైరాయిడ్ హార్మోన్లను అన్ని కణజాలాలకూ రవాణా చేస్తుంది. దీని వలన థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేస్తుంది. మీ డైట్లో ప్రొటీన్ ఎక్కువ ఉండే పదార్థాలైన గుడ్లు, సీడ్స్, నట్స్, చేపలు, పీచుపదార్థాలు చేర్చుకోవచ్చు. సోయా ఉత్పత్తులైన టోఫూ, సోయా పాలు, సోయా గింజలలో కూడా ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి.

చేపలు

చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర మెటబాలిజంను క్రమబద్ధీకరిస్తాయి. దీంతో థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్‌లో మన శరీరానికి కావల్సిన డైటరీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియలను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. దీంతో మెటబాలిజం క్రమబద్ధీకరించబడుతుంది. అలా థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు.

కోడి గుడ్లు

మన శరీర మెటబాలిజంను రెగ్యులరైజ్ చేసే ప్రోటీన్లు, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్లు కోడి గుడ్లలో ఉంటాయి. కనుక కోడి గుడ్లను తరచూ తినటం వలన కూడా మెటబాలిజంను సరైన స్థాయిలో ఉంచుకోవచ్చు. దీంతో థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా పనిచేస్తుంది.

సెలీనియం, జింక్

పుట్ట గొడుగులు, మాంసం, పొద్దు తిరుగుడు విత్తనాలు, సోయా బీన్, పచ్చి బటానీలు, వాల్‌నట్స్, గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు, బాదం పప్పులను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వల్ల సెలీనియం, జింక్ మన శరీరానికి అందుతాయి. తద్వారా థైరాయిడ్ హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి.

పొగతాగడం ఆపేయండి

సిగరెట్ పొగలో థైరాయిడ్ గ్రంథులకి అపాయకరమైన వివిధ విషాలుంటాయని మీకు తెలిసుండకపోవచ్చు. అవి థైరాయిడ్ వ్యాధిని వచ్చేలా చేయగలవు. తరచుగా పొగ తాగేవారు గ్రేవ్స్ వ్యాధికి చెందిన థైరాయిడ్ సమస్యలు పొందుతారు.

మానసిక వత్తిడి తగ్గించుకోవాలి

మానసిక వత్తిడి వలన హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. వత్తిడి థైరాయిడ్ గ్రంథులను పాడుచేస్తుంది. కనుక స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు.