Posted on

Flax seeds in telugu – Health Benefits of flax seeds in telugu

Flaxseeds in Telugu

అవిసె గింజ‌ల‌తో ఎన్నో రకాల వంటకాలను మనం ప్రతి రోజు తయారు చేస్తూనే ఉంటాము. అవిసె గింజ‌ల‌ లడ్డు, అవిసె గింజ‌ల‌ పొడి, అవిసె గింజ‌ల‌ బర్ఫీ ఇంకా మరెన్నో… ఈ పదార్థాలు ఎంత రుచికరమో అంత ఆరోగ్యకరమైనవి కూడా.

ఆరోగ్యకరమైన కొవ్వు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ యొక్క గొప్ప మూలం అవిసె గింజెలు. ఈ గింజలలో ప్రోటీన్, లిగ్నన్ మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ ఆల్ఫా-లినోలెనిక్ ఉన్నాయి, దీనిని ALA లేదా ఒమేగా -3 అని కూడా పిలుస్తారు. ఈ గింజ‌లు జీర్ణ వ్యవస్థ మెరుగుదల, బ్లడ్ ప్రెషర్ తగ్గింపు, గుండె జబ్బులను నివారించడం వంటి ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తుంది. 

అవిసె గింజ‌ల‌లోని న్యూట్రిషన్ మరియు వాటి యొక్క ఆరోగ్య  ప్రయోజనాల గురించి మరింత వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

 

అవిసె గింజలలోని పోషకాలు:

ఒక టేబుల్ స్పూన్ అవిసెగింజలలో ఈ క్రింది పోషకాలు ఉంటాయి: 

 • కేలరీలు: 37
 • ప్రోటీన్: 1.3 గ్రాములు
 • కార్బ్స్ : 2 గ్రాములు
 • ఫైబర్: 1.9 గ్రాములు
 • మొత్తం కొవ్వు: 3 గ్రాములు
 • శాచురేటేడ్ కొవ్వు: 0.3 గ్రాములు
 • మోనోశాచురేటెడ్ కొవ్వు: 0.5 గ్రాములు
 • పాలీ-అన్‌-శాచురేటెడ్ కొవ్వు: 2.0 గ్రాములు
 • ఒమేగా –3 ఫ్యాటీ యాసిడ్: 1,597 మి.గ్రా
 • విటమిన్ బి 1: ఆర్డీఐలో 8%
 • విటమిన్ బి 6: ఆర్డీఐలో 2%
 • ఫోలేట్: ఆర్డీఐలో 2%
 • కాల్షియం: ఆర్డీఐలో 2%
 • ఐరన్ : ఆర్డీఐలో 2%
 • మెగ్నీషియం: ఆర్డీఐలో 7%
 • ఫాస్ఫరస్ : ఆర్డీఐలో 4%
 • పొటాషియం: ఆర్డీఐలో 2%

పై తెలిపిన విధంగా ఇందులోని ప్రధాన పోషకాలు “ఒమేగా –3 ఫ్యాటీ యాసిడ్”, “లిగ్నాన్ మరియు “ఫైబర్”.

ఒమేగా –3 ఫ్యాటీ యాసిడ్: మన శరీరంలో ఉత్పత్తి కాని అనగా మన శరీరం అదంతట అదే ఉత్పత్తి చేయలేని పోషకాలలో ఒకటి ఒమేగా –3 ఫ్యాటీ యాసిడ్. కనుక వీటి మోతాదు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన మోదాదులలో వీటిని పొందగలము.

అవిసె గింజలలోని ALAలు గుండె రక్తనాళాలలో కొవ్వు పదార్థాలు డిపాజిట్ కాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ధమనులలో మంటను తగ్గిస్తుంది మరియు కణితుల పెరుగుదలను తగ్గిస్తుంది.

ఇది గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

 

లిగ్నాన్ : లిగ్నాన్స్ లో యాంటీ ఆక్సిడెంట్ మరియు ఈస్ట్రోజెన్ అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. 

ఫైబర్ : తగిన మోతాదులో ఫైబర్ ని తీసుకోవడం వలన జీర్ణ ప్రక్రియ మృదువుగా మరియు నెమ్మదిగా జరుగుతుంది. తద్వారా బ్లడ్ షుగర్ మరియు కొలెస్ట్రాల్ స్థాయులు నియంత్రించబడతాయి.

అవిసె గింజలలోని ఆరోగ్య ప్రయోజనాలు(Health benefits of Flax seeds in Telugu)

గుండె జబ్బులు: ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యంతో చనిపోతున్న వారి సంఖ్యలో ఎక్కువ శాతం గుండె జబ్బులే ప్రధాన కారణం. ఇందుకు మూల కారణం శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు.

అధిక మోతాదులలో కొలెస్ట్రాల్ హృదయ నరాలలో పేరుకుపోవడం వలన ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. ఇలాంటి సమస్యకు చక్కటి పరిష్కారంగా అవిసె గింజలను (ఫ్లాక్స్ సీడ్స్) తినమని నిపుణుల సలహా.

అవిసె గింజల్లో అధికంగా ఉండే ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు గుండె నరాలలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది మరియు శోథ నిరోధక చర్య మరియు హృదయ స్పందనను సాధారణీకరించడం ద్వారా గుండె పోటు వంటి సమస్యలను నివారిస్తుంది.

అలసట :  అవిసె గింజలను ప్రతి రోజు ఉదయం పూట తీసుకోవడం వలన అలసటనుంచి ఉపశమనం పొందవచ్చు. రోజంతా చేయు పనులకు కావల్సినంత శక్తి శరీరానికి అందుతుంది.

ప్రతిరోజు రాత్రి పూట ఒక చెంచా అవిసె గింజలను ఒక గ్లాసులో నానబెట్టి ఉదయం నీళ్లను వడగట్టి గింజలను తినడం వల్ల అలసట మాత్రమే కాదు శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.

 

క్యాన్సర్: అవిసె గింజలను క్రమంగా తినడం వలన స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ (ముఖ్యంగా ఋతు క్రమం ఆగిపోయిన మహిళలలో) వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశీలనా అధ్యయనాలు చెబుతున్నాయి.

పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మరియు పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : ముందే తెలిపినట్టు అవిసె గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమ్యసలు ఉండవు.  

 

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు:

 • ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.
 • రోగ నిరోధక శక్తిని పెంచడంలో అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.
 • అవిసె గింజల్లో పలురకాల క్యాన్సర్‌లను తగ్గించే గుణాలున్నాయి. వెంట్రుకలు, చర్మ సమస్యలు కూడ దూరమవుతాయి.
 • అవిసె గింజలను ఉదయాన్నే తింటే శక్తి బాగా అందుతుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు అవిసె గింజలను రెగ్యులర్ గా తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు కూడా తగ్గిపోతాయి.
 • చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లుఅవిసె గింజలలో అత్యధికంగా ఉన్నందున, శాకాహారులు చేపలకు బదులుగా అవిసె గింజలను వారి ఆహారంలో చేర్చుకోవచ్చు.
 • అవిసె నూనె వాడితే ప్రొస్టేట్, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు. రేడియేషన్ ప్రభావానికి గురికాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది.
 • మహిళల్లో హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. మోనోపాజ్ దశలోని మహిళల సమస్యలకు చక్కని పరిష్కారంగా చెప్పవచ్చు.
 • ఇందులో ఫైబర్ అధికంగా ఉన్నందున బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
Posted on

Sabja Seeds in Telugu – Health Benefits of Basil seeds in telugu

sabja seeds in Telugu

సబ్జా గింజలు – శరీరానికి చలవే కాదు ఎంతో ఆరోగ్యం కూడా

వేసవి కాలం వచ్చిందంటే చాలు అధిక ఉష్ణోగ్రత గల వాతావరణంలో ప్రతి ఒక్కరి శరీరం కూడా వేడెక్కి ఎన్నో అసౌకర్యాలను ఎదుర్కుంటాము. ఎండలో బయటికి వెళ్లి వచ్చామంటే చాలు మాడు మాడిపోతుంది.

వేసవి తాపాన్ని తట్టుకోలేక మనం అనేక రకాల పానీయాలు త్రాగుతూ ఉంటాము. సాఫ్ట్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్లు, షరబత్లు ఇలా రోడ్డు మీద కనబడే ప్రతీది తాగాలని అనిపిస్తుంది.

అవి వేడినుండి తక్షణం ఉపశమనాన్ని అందించినా ఎంత వరకు ఆరోగ్యోకరమైనవి? అన్న ప్రశ్న మన మనసులో ఉంటూనే ఉంటుంది. ఆరోగ్యానికి ఎటువంటి హానీ కలిగించకుండా శరీరం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించ గల పానీయం ఏదైనా ఉందా అని అడిగితే అందుకు ఒక గొప్ప సమాధానం సబ్జా గింజల పానీయం.  

సబ్జా గింజలు అంటే మరేంటో కాదండి “తులసి విత్తనాలు”. ఇటీవల కాలంలో వీటి ప్రాముఖ్యత తెలియకుండా పోయిందే కానీ ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు, చాలా మంది సబ్జా గింజలను నానపెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. మరి ఈ సబ్జా గింజల పానీయం ఎలా చేయాలి, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న వివరాలను ఇప్పుడు చూద్దాం.

పానీయం తయారీ విధానం: 

గుప్పెడు సబ్జా గింజలను తీసుకొని వాటిలో చిన్న చిన్న రాళ్లు, బెడ్లు ఉంటే ఏరేయాలి. మంచి నీళ్లతో వాటిని చాలా సార్లు శుభ్రం చేసి ఓ కప్పులో తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి.

నీటిలో నానిన నల్లని గింజలు కొంత జెల్లీలా మారిపోతాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజలను నిమ్మకాయ నీటిలో కలుపుకుని కొంత పంచదార వేసుకొని త్రాగండి. ఈ నీళ్లు ఎంతో రుచికరంగా ఉంటుంది.

సబ్జా గింజల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:

ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస వంటి వ్యాధులకు కూడా ఇది మంచి మందుగా పనిచేస్తుంది.

మలబద్ధకం మరియు ఉబ్బరం నుండి ఉపశమనం : సబ్జా గింజల్లో పీచు (ఫైబర్) ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య తొలగిపితుంది మరియు మృదువైన ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది.

జీర్ణ వ్యవస్థలోని ప్రేగులలోని వాయువు నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడే వోలటైల్ నూనెలు ఈ గింజలో ఉంటాయి. అంతే కాదు, శరీరంలోని వ్యర్థాలు (టాక్సిన్స్) కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.

బరువు తగ్గడానికి మంచి ఔషధం : ఊబకాయంతో బాధపడే ఎంతో మందికి సబ్జా గింజల పానీయం మంచి ఔషధంలా పనిచేస్తుంది. ప్రతి రోజు ఆహారం తీసుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయాన్ని తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా తక్కువగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇది డైటింగ్ చేసే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నుంచి అందే కేలరీలు కూడా చాలా తక్కువే.

మధుమేహం నుంచి ఉపశమనం : చక్కెర వేయకుండా సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు తగ్గుతాయి. నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు పచ్చి పాలలో వేసుకొని, కొన్ని చుక్కల వెనిలా కలిపి తాగితే టైప్2 మధుమేహంతో బాధపడే వారిలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రించబడుతుంది.

ఆరోగ్యకరమైన చర్మం మరియు జుట్టు కోసం : సబ్జా విత్తనాలను కొబ్బరి నూనెలో చూర్ణం చేసి ప్రభావిత ప్రాంతాలపై పూయడం ద్వారా తామర మరియు సోరియాసిస్ వంటి అనేక చర్మ వ్యాధుల చికిత్సకు సహాయపడుతుంది. విత్తనాలను నానబెట్టకుండా, చూర్ణం చేసి ఒక కప్పు కొబ్బరి నూనెలో కలిపి కొన్ని క్షణాలు వేడి చేసి ఉపయోగించాలి.

తులసి విత్తనాలను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ శరీరం కొల్లాజెన్‌ను స్రవిస్తుంది. ఇది కొత్త చర్మ కణాల ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఈ విత్తనాలలో ఐరన్, విటమిన్ కె మరియు ప్రోటీన్ ఉన్నాయి.

పొడవాటి మరియు బలమైన జుట్టుకు ఈ ఖనిజాలు ఎంతో అవసరం. ప్రోటీన్ మరియు ఐరన్ కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు వాల్యూమ్‌ను పెంచుతుంది.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు :

 • తరచూ డీహైడ్రేషన్కు గురయ్యే వారు సబ్జా గింజల పానీయం తాగితే ఎంతో మంచిది. రెగ్యులర్ గా త్రాగడం వలన శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.
 • వికారంగా, వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం తాగడం ఉత్తమం.
 • గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
 • గ్లాసు సబ్జా గింజల పానీయాన్ని నిత్యం పిల్లలకు తాగిస్తే ఎంతో మంచిది. వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు దగ్గరకు రావు.
 • సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి కనుక ఈ పానీయం తాగితే మహిళలకు ఎంతగానో అవసరమైన ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి.
 • సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులను నివారించొచ్చు.
 • ఈ గింజలు దగ్గును నియంత్రించడంలో సహాయపడతుంది. ఇవి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులోని వైసెనిన్, ఓరింటిన్ మరియు బీటా కెరోటిన్ వంటి ఫ్లవనాయిడ్లు శరీరం యొక్క రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి.

గమనిక : పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు సబ్జా విత్తనాలను తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఈ విత్తనాలను నీటితో బాగా కలపకపోతే చిన్నపిల్లలు వాటిని త్రాగే సమయంలో గొంతులో అడ్డుపడి వారిని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు.

గర్భిణీ స్త్రీల విషయంలో, ఈ విత్తనాలు శరీరంలోని ఈస్ట్రోజెన్ స్థాయులను తగ్గిస్తాయి. కనుక గర్భిణీ స్త్రీలు లేదా ఇతర రోగాలతో బాధపడే వారు మీ ఆహారంలో సబ్జా విత్తనాలను చేర్చుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Posted on

Spirulina in Telugu – Spirulina Benefits – స్పిరులినా

స్పిరులినా అనేది నాచు జాతికి చెందిన ఒక నీటి మొక్క. దీనిని భూమిపై మొక్కల ఆవిర్భావానికి తొలి రూపంగా భావిస్తారు. ఆది మానవుల యొక్క ఆహారంలో ఇది ఒక భాగంగా ఉండేది. చారిత్రకంగా వేల సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్న ఈ నాచు మొక్క ఇప్పటికీ ఆహార వనరుగా ఉపయోగపడుతూనే ఉంది.

ఇప్పటికీ అనేక దేశాల ప్రజలు వారి ఆహారంలో భాగంగా దీనిని చేర్చుకుంటున్నారు. ఆఫ్రికాలో కరువు కాటకాలు నెలకొన్న సందర్భాల్లో కొన్ని దేశాల ప్రజలు వారికి అవసరమయ్యే పోషకాల కోసం ప్రధానంగా స్పిరులినా పైనే ఆధారపడ్డాలు.

స్పిరులినా అనేక రకాల ప్రజలకు ఎంటువంటి దుష్ప్రభావాలనూ చూపకుండా మంచి ఫలితాలను అందించే నీటి మొక్క. ఈ మొక్క యొక్క ఆకులను ఎండబెట్టి పొడి చేసి, నిత్యం కొద్ది మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఇతర ఏ పోషకాహారం తీసుకోవాల్సిన పనిలేదు. తల్లి పాలలో ఉన్న పోషకాలు కూడా ఈ మొక్కలో ఉంటాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని తల్లి పాల తర్వాత అత్యంత పోషకాలు కలిగిన ఆహారంగా 1975లోనే తేల్చి చెప్పింది.

ఈ మొక్క యొక్క ఉత్పత్తి మన దేశంలోనే చాలా ఎక్కువ. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే దీని గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ నీటి ముక్క గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం

స్పిరులినా పోషకాల వివరాలు:

ఒకే టేబుల్ స్పూన్ (7 గ్రాములు) ఎండిన స్పిరులినా పొడిలో గల పోషకాల వివరాలు:

 • ప్రోటీన్: 4 గ్రాములు
 • విటమిన్ బి 1 (థియామిన్): ఆర్‌డిఎలో 11%
 • విటమిన్ బి 2 (రిబోఫ్లేవిన్): ఆర్‌డిఎలో 15%
 • విటమిన్ బి 3 (నియాసిన్): ఆర్‌డిఎలో 4%
 • రాగి : RDA లో 21%
 • ఐరన్ : RDA లో 11%
 • కార్బోహైడ్రేట్ : 1.67 గ్రాములు
 • అదనంగా కేలరీలు: 20 మరియు డైజెస్టిబుల్ కార్బ్స్ : 1.7 గ్రాములు

ఇది మంచి మొత్తంలో మెగ్నీషియం, పొటాషియం మరియు మాంగనీస్ మరియు మీకు అవసరమైన ప్రతి ఇతర పోషకాల యొక్క చిన్న మొత్తాలను కలిగి ఉంటుంది.

 • కొవ్వు : 0.54 గ్రాముల
 • కాల్షియం : 8 మిల్లీ గ్రాములు (స్పిరులినా పొడిలో కాల్షియం సాధారణ పాలలో కన్నా 26 రెట్లు అధికంగా ఉంటుంది. దీంతో ఎముకలు పటిష్టంగా ఉంటాయి.)
 • మెగ్నీషియం : 14 మిల్లీ గ్రాములు
 • ఫాస్పరస్ : 8 మిల్లీ గ్రాములు
 • పొటాషియం : 95 మిల్లీ గ్రాములు
 • సోడియం : 73 మిల్లీ గ్రాములు
 • విటమిన్ సి  : 0.7 మిల్లీ గ్రాములు

స్పిరులినాలోని ప్రోటీన్ యొక్క నాణ్యత అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని గుడ్లతో పోల్చవచ్చు. ఇది మీకు అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను అందిస్తుంది.

ఇందులో ఫోలేట్ కూడా ఉంటుంది.

కనుకఈ భూ గ్రహంలో అత్యంత పోషకాలతో కూడిన ఆహారం స్పిరులినా అని చెప్పవచ్చు.  

స్పిరులినా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు(Health benefits of  Spirulina in Telugu):

 • దేహ నిర్మాణానికి, కణజాల మరమ్మత్తుకు, కొత్త కణాల ఉత్పత్తికి ప్రోటీన్లు ఎంతో అవసరం. స్పిరులినా పొడిలో దాదాపు 60 శాతం వరకు ప్రోటీన్లు ఉంటాయి. మనం తీసుకునే అన్ని ఆహార పదార్థాల్లోకెల్లా అధికంగా ప్రోటీన్లు కలిగి ఉన్నది ఇదే. శాకాహారులు ఈ పొడిని తీసుకుంటే వారికి ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.
 • పిల్లల పెరుగుదలకు అవసరమయ్యే అమైనో ఆమ్లాలు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ సమృద్ధిగా ఉన్నందున రక్తాన్ని శుభ్రపరచడంలో, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో క్లోరోఫిల్ బాగా పనిచేస్తుంది.
 • పలు రకాల క్యాన్సర్లు దూరం చేసి, నరాల బలహీనతను పోగొడుతుంది. 
 • కాలేయాన్ని శుభ్ర పరుస్తుంది. మధుమేహులకు మేలు చేస్తుంది. 
 • రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.
 • రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 
 • రక్తపోటును తగ్గిస్తుంది.
 • గుండె సంబంధ వ్యాధులను, వాపులు, నొప్పులను నివారిస్తుంది. అధిక రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ స్థాయుల వల్ల కలుగు గుండె జబ్బులను నివారిస్తుంది.
 • జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. 
 • శరీరంలోని హార్మోన్ల పనితీరును సక్రమంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
 • అధిక కొవ్వును కరిగించి, బరువు తగ్గాలనుకునే వారికి ఔషధంగా పనిచేస్తుంది. 
 • శరీరంలోని వ్యర్థాలన్నింటినీ బయటకు పంపుతుంది.
 • స్పిరులినా తీసుకోవడం వలన జీవక్రియను వేగవంతం చేస్తుంది.
 • క్యారెట్ కన్నా 2800 శాతం ఎక్కువ బీటా కెరోటీన్, పాలకూరలో కన్నా 3900 శాతం ఎక్కువ ఐరన్, బ్లూబెర్రీలలో కన్నా 280 శాతం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు స్పిరులినాలో ఉన్నాయి. కనుక మహిళల ఆరోగ్యానికి ఆవశ్యకమైన ఆహారం ఇది
 • కలుషితమైన నీరు త్రాగడం లేదా ఇతర కాలుష్యాల వలన శరీరంలో ఏర్పడు టాక్సిన్స్ ని నిరోధించగల లక్షణాలు స్పిరులినాలో ఉన్నాయి.
 • నిరాశ మరియు ఆందోళన వంటి కొన్ని మానసిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులలో సెరోటోనిన్ స్థాయి తక్కువగా ఉండవచ్చు. స్పిరులినా ట్రిప్టోఫాన్ యొక్క మూలం. ట్రిప్టోఫాన్ ఒక అమైనో ఆమ్లం, ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 • అలెర్జీ లక్షణాలను తగ్గించడం : ఒక వ్యక్తికి పుప్పొడి, దుమ్ము లేదా పెంపుడు జంతువులు అంటే అలెర్జీ ఉన్నప్పుడు, వారి ముక్కు లోపలి భాగం ఉబ్బుతుంది. ఈ ప్రతిచర్యను అలెర్జీ రినిటిస్ అని అంటారు. ఈ పరిస్థితి యొక్క లక్షణాలను మెరుగుపరచడానికి స్పిరులినా సహాయపడుతుందని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి.

ఇది క్రింద తెలిపిన అలెర్జీ రినిటిస్ లక్షణాలను తగ్గిస్తుంది:

 • చలితో చీము కారుతున్న ముక్కు
 • తుమ్ము
 • ముక్కు దిబ్బడ మరియు
 • దురద
Posted on

Hormonal imbalance tips in Telugu – హార్మోనుల అసమతుల్యత కొరకు హోం రెమిడీస్

హార్మోన్లు మానసిక శారీరక ఎదుగుదలకు ఉపయోగపడతాయి ఉదాహరణకు – జీవ ప్రక్రియ, శరీర నియంత్రణ, సంతానోత్పత్తి, వయసుకు తగిన మార్పులు మొదలైనవి. మన శరీరంలోని వివిధ హార్మోన్లు సరైన లెవెల్స్ లో ఉత్పత్తి కాకపోవటం మరియు తక్కువగా లేదా అధిక పరిమాణంలో ఉత్పత్తి అవ్వటం వలన అసమతుల్యతకు దారి తీస్తుంది. హార్మోన్ల యొక్క అసమతుల్యత అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఉదాహరణకు – వంద్యత్వం, నిరాశ, కండరాల బలహీనత, ఏకాగ్రత లేకపోవడం మొదలైనవి.

మరి ముఖ్యమైన వివిధ రకాల హార్మోన్లు, వాటి అసమతుల్యత వలన కలిగే నష్టాలు మరియు వాటిని బాలన్స్ చేయటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరంగా ఈ వ్యాసంలో చూద్దాం.

వివిధ హార్మోన్లు, వాటి అసమతుల్యత వల్ల కలిగే వ్యాధులు

 1. థైరాయిడ్‌ హార్మోన్లు (టీ3, టీ4) : థైరాయిడ్‌ గ్రంథి ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ హార్మోన్ల ప్రభావం 90 శాతం మానవ జీవకియ్రలపై ఉంటుంది. వీటి అసమతుల్యత వల్ల హైపోథైరాయిడ్‌, హైపర్‌ థైరాయిడ్‌, గాయిటర్‌ వంటి జబ్బులు కలుగుతాయి.
 2. స్త్రీలలో హార్మోన్లు : ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌, ప్రొలాక్టిన్‌, ఆక్సిటోసిన్‌ హార్మోన్లు స్త్రీలలో రజస్వల, రుతు చక్రం, ద్వితీయ లైంగిక లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవంలో ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల రుతు చక్ర సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతాన లేమి వంటి సమస్యలు తలెత్తుతాయి.
 3. పురుషులలో ఉండే హార్మోన్లు: టీఎస్ హెచ్‌, ఎల్‌హెచ్‌, టెస్టోస్టిరాన్‌ హార్మోన్లు పురుషులలో శుక్రకణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ అసమతుల్యత వల్ల శీఘ్రస్కలనం, అంగస్తంభన సమస్యలు, శుక్రకణాల సమస్యలు తలెత్తుతాయి.
 4. డయాబెటిస్‌ : ఏడీహెచ్‌ (యాంటీ డైయూరెటిక్‌ హార్మోన్‌) లోపం వల్ల తలెత్తే ఈ సమస్యను అతి మూత్ర వ్యాధి అని కూడా అంటారు. డయాబెటిస్‌ మెల్లిటస్‌.. ఇది క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సూలిన్‌ లోపం వలన కలుగుతుంది.
  • డయాబెటిస్‌- టైప్‌ 1 : ఇది ఇన్సూలిన్‌ ఉత్పత్తి కాకపోవడం వల్ల ఏర్పడుతుంది. దీనిని జువెనైల్‌ డయాబెటిస్‌ అంటారు. ఈ వ్యాధిగ్రస్తులు పూర్తిగా ఇన్సూలిన్‌ ఇంజెక్షన్లపై ఆధారపడాల్సి వస్తుంది.
  • టైప్‌ 2 డయాబెటిస్‌ : ఇది ఇన్సూలిన్‌ ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఎక్కువగా 30 ఏళ్లు పైబడిన వారిలో వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిస్‌ బాధితులు వ్యాధిని నియంత్రించలేకపోతే దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలకు గురికావాల్సి రావొచ్చు.

హార్మోన్ల ఇంబ్యాలెన్స్ యొక్క కారణాలు

హార్మోన్ల అసమతుల్యత యొక్క సాధారణ కారణాలు సరైన పోషక ఆహారం లేకపోవటం, సరైన వ్యాయామం చేయకపోవటం, వృధాప్యం, అడ్రినల్ శోషణం, నిద్ర లేకపోవడం, టాక్సిన్స్, ఒత్తిడి, బర్త్ కంట్రోల్ పిల్స్ మరియు రసాయనాలు.

హార్మోన్ల అసమతుల్యత యొక్క లక్షణాలు

ఈ లక్షణాలు మెటబాలిజం ఫంక్షన్ పై హార్మోన్ల ప్రభావం వలన ఏర్పడతాయి.

 1. హార్మోన్ల అసమతుల్యత యొక్క కొన్ని లక్షణాలు – చిరాకు, నిద్రలేమి, బరువు సమస్యలు, ఆందోళన, మూడ్ స్వింగ్ మరియు అలసట.
 2. మరికొన్ని లక్షణాలు –  మైగ్రేన్ తల నొప్పి, జిడ్డు లేదా పొడి చర్మం, ఎక్కువ ఆకలి వేయటం, వంధ్యత్వం, హెయిర్ ఫాల్, లో సెక్స్ డ్రైవ్, మొటిమలు మరియు ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్.

హార్మోన్ల అసమతుల్యతకు హోం రెమెడీస్

పై చెప్పినటువంటి లక్షణాలను నివారించడానికి మరియు మీ హార్మోన్ల సమతుల్యతను పునరుద్ధరించడానికి సహజ నివారణలు మరియు మూలికలను ఉపయోగించండి. హార్మోన్ల సమస్యల యొక్క ప్రారంభ లక్షణాలను తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు మరియు లైఫ్ స్టైల్ మార్పుల గురించి క్రింద వివరించబడి ఉన్నాయి.

 1. డైట్ లో చేయాల్సిన కొన్ని మార్పులు : మీ హార్మోన్ల సమస్యలు తొలగించడానికి ఫలవంతమైన ఆహారం ఎంచుకోండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు మరియు తాజా ఆకుకూరలను మీ డైట్ లో చేర్చుకోండి. ఎల్లప్పుడూ పెస్టిసైడ్స్ మరియు హెర్బిసైడ్లు లేని ఆహారంను తీసుకోండి.
 2. పుష్కలంగా నీరు త్రాగాలి : ప్రతి ఒక్కరు అనుసరించాల్సిన రెమిడీ ఇది. నీరు పుష్కలంగా త్రాగటం వలన శరీరం హైడ్రాటెడ్ గా ఉంటుంది. ఇది జీవక్రియ ప్రక్రియను పెంచుతుంది మరియు శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను బయటకు ఫ్లష్ చేయడానికి సహాయపడుతుంది. ప్రతి రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి. నీరు త్రాగటం వలన జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 3. మంచి ఆహార పద్దతులను ఎంచుకోండి : సరైన సమయానికి సరైన మోతాదులలో ఆహారాన్ని తీసుకోవటం చాలా ముఖ్యం. మీ బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయకండి. ఒకే సారి అధిక మోతాదులలో ఆహారాన్ని తీసుకోకూడదు, మీల్స్ ని 5 లేదా 6 భాగాలుగా స్ప్లిట్‌ చేసి తీసుకోవాలి. రాత్రి వేళలో జీర్ణ వ్యవస్థ చాలా మెల్లగా పనిచేస్తుంది కాబట్టి తక్కువగా తినాలి.
 4. ప్రాసెస్ చేయబడిన ఆహారాలను మానుకోండి : ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి మరియు ఎండోక్రైన్ వ్యవస్థ సమస్యకు దారితీస్తుంది. కనుక, ప్రాసెస్ చేసిన స్నాక్స్, ప్రాసెస్ చేసిన మాంసం, తెల్ల రొట్టె, పేస్ట్రీలు, తీపి పదార్థాలు మరియు ఇతర బేకరీ పదార్థాలను నివారించండి. జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే వాటిలో ఎక్కువ కేలరీలు ఉంటాయి కనుక మీ బరువు పెరిగి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
 5. చెడు అలవాట్లను మానుకోవాలి : ప్రధానమైన అనారోగ్యకరమైన అలవాట్లు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఉదాహరణకు – మద్యపానం, ధూమపానం, తగని సమయానికి ఆహారాన్ని తీసుకోవడం మరియు రాత్రులు ఆలస్యంగా నిద్రపోవటం వంటివి. అనారోగ్యకరమైన ఈ అలవాట్లు మీ ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి కాబట్టి వీటిని వెంటనే మానుకోవాలి.
 6. విటమిన్ మరియు ప్రోటీన్ : మీరు తీసుకొనే ఆహారంలో సరైన పోషకాలున్నాయని నిర్ధారించుకోండి. విటమిన్ మరియు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోండి. అవి కూడా సరైన మోతాదులలో సరైన సమయంలో తీసుకోవాలి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదు.
 7. సరైన నిద్ర : మన శారీరక వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, నిద్ర ప్రధాన కారకం. ఇది హార్మోన్ల చక్రాలను పునరుద్ధరిస్తుంది మరియు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. కాబట్టి రోజుకు 8 గంటలు నిద్రించడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ పూర్తి నిద్రను పొందాలి లేకపోతే అది ఒత్తిడి, దురద, తలనొప్పి మొదలైన వాటికి దారి తీస్తుంది.
 8. వ్యాయామం : హార్మోన్ల సమతుల్యం కొరకు శారీరక కార్యకలాపాలు ఉపయోగపడతాయి. శారీరక పనులు చేయటం వలన మీ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది మరియు కర్టిసోల్ స్థాయులను తగ్గిస్తుంది, కర్టిసోల్ అనేవి ఒత్తిడి హార్మోన్‌ను, అవి ఈస్ట్రోజన్‌ని అడ్డుకొని ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం చేయటం వలన మీ మానసిక స్థితిని మెరుగు పరిచే రసాయనాన్ని మెదడు విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. కాబట్టి, రెగ్యులర్ వ్యాయామాలను చేయండి కానీ 40 నిముషాలకంటే ఎక్కువ చేయకండి, ఎందుకంటే అదికంగా వ్యాయామం చేయటం వలన కార్టిసోల్ స్థాయులు అధికరించవచ్చు. స్విమింగ్, వాకింగ్, జాగింగ్ మరియు ఇతర సులభమైన వ్యాయామాలను ప్రతి రోజు 20 – 30 నిమిషాలు చేయండి. హార్మోన్ విధులను స్టిములేట్ చేసి ఒత్తిడిని తగ్గించడానికి యోగా మరియు రిలాక్సేషన్ వ్యాయామాలను ప్రయత్నించండి.
 9. కెఫీన్ : కెఫీన్ అధికంగా తీసుకోవటం వలన ఎండోక్రిన్ వ్యవస్థ సమస్యలకు దారి తీస్తుంది. కనుక వీలైనంత వరకు తక్కువ కాఫీ మరియు కెఫీన్ పదార్థాలను తీసుకోండి.
 10. పంచదార : ఎక్కువ పంచదార తినడం వల్ల శరీరంను నాశనం చేస్తుంది. పంచదార ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది బరువు పెంచడం మాత్రమే కాకుండా శరీరంలో ఈస్ట్రోజన్ లెవల్స్ పెరిగేలా చేస్తుంది. కనుక పంచదారను వీలైనంత వరకు నివారించండి.

హార్మోన్లను సమతుల్యం చేయడానికి తగిన ఆహారాలు

హార్మోన్లను సమతుల్యం చేయడానికి కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఈ ఆహారాలు మీ మూడ్‌ని మార్చడంతో పాటు, ఎనర్జీని అందిస్తాయి. వాటి వివరాలను చూద్దాం.

 1. ఫైబర్ ఫుడ్స్ : హార్మోనులను సమంగా ఉంచడంలో ఫైబర్ ఫుడ్స్ సహాయపడతాయి. గోధుమలు, బ్రెడ్, బ్రౌన్ రైస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు హార్మోనులను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి, కనుక వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.
 2. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ : గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ప్రోటీనులు మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి హార్మోనులను బ్యాలెన్స్ మరియు కంట్రోల్ చేస్తాయి.
 3. కొబ్బరి నూనె : హార్మోనులను బ్యాలెన్స్ చేయడానికి కొబ్బరి నూనె సహాయపడుతుంది. ఈ నూనెలో ఎక్కువగా శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.
 4. పండ్లు : హార్మోనుల అసమతుల్యంతో బాధపడే మహిళలు తాజా పండ్లను తీసుకోవడం ఒక అలవాటుగా చేసుకోవాలి. ముఖ్యంగా ప్లెవనాయిడ్స్ అధికంగా ఉన్న పండ్లను తీసుకోవాలి. ఇవి శరీరంలో హార్మోనులను సమతుల్యం చేస్తాయి.
 5. ఆర్గానిక్ ఫుడ్ : ఆర్గానిక్ ఫుడ్స్ లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇవి నేచురల్గా న్యూట్రీషియన్స్ కలిగి ఉండటం వల్ల శరీరంలో హార్మోనులను ట్రాక్ లో ఉంచుతుంది.
 6. ఒమేగా –3 ఫ్యాటీ ఆసిడ్స్ : హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ ముఖ్య పాత్రను పోషిస్తుంది. హార్మోన్ల బాలన్స్ మహిళలో చాలా అవసరం ఎందుకంటే రుతుస్రావం సమయంలో ఋతు తిమ్మిరి మరియు మెనోపాజ్ వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇంఫ్లమ్మెటరీ లక్షణాలు ఉంటాయి. ఇది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సహజంగా హార్మోన్లను సమతుల్యం చేసేందుకు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ని మీ డైట్ లో చేర్చుకోండి.
  ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవటం వలన ఎండోక్రైన్ వ్యవస్థ యొక్క సరైన పనితీరును సమకూర్చుతుంది. ట్యూనా మరియు సాల్మన్ వంటి చేపలలో ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే  అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు మరియు పొద్దుతిరుగుడు విత్తనాలను డైట్ లో చేర్చుకోవటం వలన కూడా ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ ని పొందవచ్చు.
 7. క్యాబేజ్ : బ్రొకోలీ, కాలీఫ్లవర్ మరియు క్యాబేజ్ శరీరంలో హార్మోనులను బ్యాలెన్స్ చేస్తాయి. కాబట్టి, వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
 8. బెర్రీస్ : బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. సిట్రస్ ఫ్రూట్‌స్, గ్రేప్స్ మరియు రెడ్ బెర్రీలు హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడతాయి.
Posted on

Telugu tips to get instant energy – తక్షణ శక్తి ని పొందటం ఎలా?

పెరుగుతున్న బిజీ జీవితంలో చాలా మంది తరచుగా అలసటతో బాధపడుతూ ఉంటారు. అయితే, మీరు ఎదుర్కొంటున్న అలసటలు జీవనశైలికి సంబంధించి ఉంటే, మీ శక్తి స్థాయులను పెంచడానికి మీరు చేయగలిగిన అనేక విషయాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో సహజ పద్దతిలో మీ ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోవటం ఎలా అని చూద్దాం.

తక్షణ బలాన్ని ఇచ్చే పండ్లు (Telugu energy boosting fruits)

శరీరానికి సంబంధించిన ఎటువంటి సమస్యైనా మనం తీసుకునే ఆహారాలతో తొలగించవచ్చు. అందులో ముఖ్యమైనవి పండ్లు.

బొప్పాయిలు

అదనపు శక్తిని కలిగి ఉన్న ఉష్ణ మండలపు పండు బొప్పాయి. ఇందులోని విటమిన్లు జలుబుకి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. మీ బలాన్ని పెంచడంతో పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుండి కూడా రక్షణ కలిగిస్తుంది.

స్ట్రాబెర్రీలు

మీరు అలసటతో బాధ పడుతున్నట్లయితే, మీ అలసటను తొలగించేందుకు స్ట్రాబెర్రీలు అద్భుతమైన మార్గం. ఇందులో విటమిన్ సి స్థాయులు అధికంగా ఉండటం వలన మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు కంటి చూపును కూడా అభివృద్ధి చేస్తుంది.

బేరి / పియర్స్

బేరిలు శక్తి యొక్క గొప్ప మూలం. తాజా బేరిలను తీసుకోవటం వలన తక్షణ బలము పొందుతారు. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవటం వలన రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు.

అరటి పండు

తక్షణ బలమును అందించేందుకు అరటి పండు చాలా ఆరోగ్యకరమైనది. మలబద్ధకం లాంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వలన మీ నరాల అలాగే కండరాల ఆరోగ్యం నిర్వహించబడుతుంది. ఇందులో ఐరన్ కూడా ఉండటం వలన గర్భిణి స్త్రీలకు చాలా మంచిది.

ఆరెంజ్

మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఉదయం తీసుకునే కాఫీకి బదులుగా ఒక గ్లాస్ ఆరంజ్ జ్యూస్ త్రాగండి. లేదా మీ బ్రేక్ ఫాస్ట్ లో ఆరంజ్ పండును చేర్చుకోండి. ఇందులో నాచురల్ షుగర్ ఉండటం వలన ఈ పండుని తిన్న వెంటనే శక్తిని మరియు ఉత్సాహాన్ని పొందుతారు. జలుబు మరియు ఫ్లూ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

అనాస పండు

ఇది ఒక రుచికరమైన పండు. ఇందులో విటమిన్ బి6, సి, బి1, మాంగనీస్, కాపర్ మరియు ఫైబర్ ఉంటాయి. ఈ పండు చాలా జూసీగా ఉంటుంది మరియు తిన్న వెంటనే తక్షణ ఎనర్జీ ని అందిస్తుంది.

మామిడి పండు

దీనిలో పుష్కలమైన పోషకాలున్నాయి. విటమిన్‌ ఎ, బిటాకెరోటిన్‌, బి కాంప్లెక్స్‌, విటమిన్‌ సి, ఐరన్‌, కాల్షియం, పొటాషియం, రోగనిరోధక శక్తిని అధికరించే యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. నిస్సత్తువం, బలహీనాన్ని వెంటనే తగ్గించే గ్లూకోజ్‌ ఇందులో వుంది కనుక శక్తిని వెంటనే అందజేస్తుంది. దీనిలో పీచు (ఫైబర్‌) ఉండడం వల్ల రక్త ప్రసరణ మరియు విరేచనం సాఫీగా కావడానికి తోడ్పడుతుంది.

ఆపిల్

రోజూ ఒక ఆపిల్‌ పండు తింటే డాక్టరుకు దూరం అనే మాట సరైనది. దీనిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. పీచుపదార్థాలు కూడా ఎక్కువే. దీనిలో శక్తినిచ్చే పదార్థమే కాకుండా పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి.

తక్షణ శక్తి కోసం రసాల జాబితా (Juices for quick energy instantly in Telugu)

చక్కెర నీళ్లు

మీ ఎనర్జీ లెవెల్ అకస్మాత్తుగా తగ్గిపోయినట్లయితే ఈ సొల్యూషన్ ని త్రాగటం వలన తక్షణ శక్తిని పొందుతారు. ఒక గ్లాస్ నీటిలో 2 టేబుల్ స్పూన్ చక్కెర మరియు ఒక చిటిక ఉప్పుని కలుపుకొని త్రాగండి. ఇది వెంటనే మీ రక్త ప్రవాహంలో చేరి తక్షణ బలం ఇస్తుంది.

బీట్ రూట్ జ్యూస్

ఈ కూరగాయని మాములుగా వంటకాల్లో మరియు సలాడ్స్ లో ఉపయోగిస్తాము. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. స్కిన్టోన్ ని మెరుగుపరుస్తుంది, బ్లడ్ లోని హిమోగ్లోబిన్ ని అధికరిస్తుంది. దీన్ని జ్యూస్ చేసుకొని  త్రాగటం వలన మీకు తక్షణ ఎనర్జీ లభిస్తుంది.

 • ఒక బీట్రూట్, 3 కేరట్ లు, 1 అల్లం ముక్క, ఒక వెల్లుల్లి ముక్క, ఒక ఆర్గానిక్ లెమన్. వీటన్నిటినీ కలిపి గ్రైండర్ లో వేసి జ్యూస్ తయారు చేయండి. ఇందులో 2 స్పూన్ తేనెని కలుపుకొని త్రాగండి.
 • ఒకటి లేదా 2 బీట్ రూట్, ఒక యాపిల్, 1 అల్లం ముక్క కట్ చేసి బ్లెండ్ చేయాలి. తర్వాత వడకట్టి మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని తీసుకోవచ్చు.

నిమ్మపండు మరియు తేనె

సాధారణంగా చాలా మంది వ్యాయామం చేసే ముందు ఎనర్జీ డ్రింక్స్ ని తీసుకోవాలని అనుకుంటారు. అటువంటి వారికి ఇది ఒక అద్భుతమైన మిశ్రమం. ఒక గ్లాస్ నీటిలో ఒక నిమ్మరసం జ్యూస్ ని వేసుకొని, ఒక స్పూన్ తేనె మరియు ఒక చిటిక ఉప్పు కలుపుకొని త్రాగండి. తక్షణమే శక్తిని పొందుతారు.

పార్స్లీ రసం

ఈ రసం చేయడానికి అవసరమయ్యే పదార్ధాలు – చేతి నిండా పార్స్లీ  ఆకులు, 3-4 క్యారట్లు మరియు 1 ఆర్గానిక్ నిమ్మకాయ. ఇప్పుడు వీటనింటినీ కలిపి గ్రైండ్ చేసి రసంను తీసి తక్షణ శక్తిని పొందడానికి ఒక గ్లాస్ త్రాగండి. ఈ రసం మెగ్నీషియం యొక్క మంచి మూలం.

కొబ్బరి నీటితో క్యారట్ రసం

ఈ జ్యూస్ ని తయారు చేయడానికి, 6 మీడియం సైజు క్యారట్లు, 1 టొమాటో, కొత్తిమీర, ఒక నిమ్మపండు జ్యూస్ మరియు ½ కప్పు కొబ్బరి నీరు కావాలి. వీటన్నిటినీ బాగా కలిపి తాగితే తక్షణమే శక్తిని పొందుతారు.

చెరుకు రసం

చెరుకు రసంలో నాచురల్ షుగర్ ఉండటం వలన దీన్ని త్రాగిన వెంటనే ఎనర్జీ ని పొందుతారు. ముఖ్యంగా వేసవి కాలంలో బయట పనులకోసం అధికంగా తిరిగే వాళ్లకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేసి తక్షణ శక్తిని అందిస్తుంది.

తక్షణ బలాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు (Telugu energy boosting foods)

ష్రిమ్ప్

ష్రిమ్ప్ లో విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది. మీ మెటబాలిజం ను సరిచేసి శక్తిని పెంపొందించేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ జలచరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. మీ శక్తిని అలాగే మానసిక స్థితిని మెరుగు పరిచేందుకు ఇవి ఉపయోగపడతాయి.

నట్స్

జీడిపప్పు, బాదాం, వాల్నట్ మరియు హేజెల్ నట్స్ లో మెగ్నీషియం అధిక మోతాదులో లభిస్తుంది. చక్కెరను శక్తిగా మార్చడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాక, నట్స్ లో ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తుంది. కనుక, బ్లడ్ షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి.

హుమ్మ్యూస్

నువ్వుల గింజల పేస్ట్, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం అలాగే ముద్ద చేయబడిన శనగలతో హుమ్మ్యూస్ ని తయారుచేయవచ్చు. శనగలని మెయిన్ ఇంగ్రిడియెంట్ గా వాడతారు. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ మరియు ఫ్యాట్ ఉంటాయి. కనుక, ఈ పదార్థాన్ని తీసుకోవడం వలన తక్షణ శక్తి లభిస్తుంది.

పెరుగు

పెరుగును తీసుకోవడం వలన తక్షణ శక్తిని పొందవచ్చు. ఇందులో లభించే లాక్టోస్ శక్తిని పెంపొందిస్తుంది. అలాగే, పెరుగులో ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. ఇది లాక్టోస్ గ్రహింపుని నెమ్మది చేయడం ద్వారా ఎనర్జీ ఎక్కువ సేపు ఉండేలా చేస్తుంది.

ఎగ్స్

చాలా మందికి బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్స్ ని తీసుకోవటమంటే ఇష్టం. వీటిలో ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. అలాగే ఇందులో లభించే హెల్తీ మోనో అన్ సాట్యురేటెడ్ మరియు పోలీ అన్ సాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మీ ఆకలిని తీరుస్తాయి. తద్వారా, తక్షణ శక్తిని అందిస్తాయి.

చియా సీడ్స్

చియా సీడ్స్ లో ప్రోటీన్స్, ఫ్యాట్స్ మరియు ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఈ సీడ్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నియంత్రిస్తాయి. స్మూతీస్ లో వీటిని వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. ఇవి మీకు కడుపు నిండిన భావనని కలిగిస్తాయి.

గుమ్మడికాయ గింజలు

ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఫైబర్ మరియు ప్రోటీన్లు గుమ్మడికాయ గింజలలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ ఆకలిని తీర్చి మీకు తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే, వీటిలో లభించే మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు జింక్ అదనపు శక్తిని అందించేందుకు తోడ్పడతాయి.

డార్క్ చాకొలేట్

డార్క్ చాకొలేట్ ని తీసుకోవడం ద్వారా తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో లభించే థియోబ్రొమైన్ అనే సహజ సిద్ధమైన స్టిములంట్ వలన మీకు తక్షణ శక్తి అందుతుంది. మీ మానసిక స్థితి కూడా మెరుగవుతుంది. చాకోలెట్ లో 60 శాతం కోకో కలిగి ఉంటుంది. చురుకుదనంతో పాటు ఏకాగ్రతను పెంపొందించేందుకు డార్క్ చాకొలేట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఓట్ మీల్

శరీరానికి తక్షణ శక్తిని అందించే కాంప్లెక్ కార్బోహైడ్రేట్స్ ఓట్ మీల్ లో పుష్కలంగా లభిస్తాయి. దీనిని తీసుకోవటం ద్వారా ఎక్కువ సేపు ఎనర్జీ తో ఉంటారు. ఇందులో లభించే థియామైన్, ఫోలేట్, నియాసిన్ అనే బి విటమిన్స్ కలిసి కట్టుగా పనిచేసి మీ శరీరంలో మెటబాలిజం వ్యవస్థను పటిష్టం చేస్తాయి.

క్వినో

ప్రోటీన్లతో పాటు అమినో యాసిడ్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అందువలన, రోజు మధ్యలో శక్తిని పెంపొందించే ఆహారంగా వీటిని పరిగణించవచ్చు. ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు మాంగనీస్ అనేవి క్వినోలో సమృద్ధిగా లభిస్తాయి.

శక్తిని పెంచే యోగాసనాలు (Yoga poses for instant energy in Telugu)

చిన్న పాటి యోగాసనాల వల్ల మీ శరీరంలో దాగి ఉన్న ఎనర్జీ లెవల్స్ బయటకు విడుదల అవుతుంది. కాబట్టి, అలసటగా, నీరసంగా, బలహీనంగా ఉన్నప్పుడు, తక్షణ ఎనర్జీ పొందడానికి ఈ క్రింద సూచించిన చిన్న యోగాసనాలను ప్రయత్నించండి.

మౌంటైన్ భంగిమ

mountain pose

మీ శరీరం ఫర్ ఫెక్ట్ బ్యాలెన్స్ తో మరియు నిటారుగా ఉండాలని భావిస్తే, మీ వర్కౌట్ ను మౌంటైన్ ఫోజ్ తో ప్రారంభించండి. మీ రెండు కాళ్ల మీద నిటారుగా నిలబడి, రెండు చేతులను పైకి ఎత్తి, నిధానంగా శ్వాస తీసుకోవాలి.

ట్రీ భంగిమ

tree pose

రెండు చేతులను పైకి చాచి నమస్తే భంగిమలో ఒంటి కాలిమీద నిలబడాలి. ఈ యోగా భంగిమ మీ కండరాలకు బలాన్ని అందిస్తుంది మరియు తక్షణం ఎనర్జిని పెంచుతుంది.

వారియర్ భంగిమ

warrior pose

మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేయగలిగినప్పుడు, మీ శరీరం ఒక శక్తివంతమైన ఆయుధంగా తయారవుతుంది. చేతులను మరియు కాళ్లను స్ట్రెచ్ చేసి యుద్ధంలో ఒక వారియర్ కత్తిని పట్టుకునే విధంగా నిలబడాలి. ఇలా చేయటం వల్ల శరీరంలోని కండరాలు స్ట్రెచ్ అవుతాయి.

ట్రయాంగిల్ భంగిమ

triangle pose

మీరు గోల్డెన్ ట్రయాంగిల్ భంగిమలో నిలబడినట్లైతే తక్షణ ఎనర్జీని పొందగలరు. కాళ్లను రెండింటిని దూరంగా చాచి, ఒక్క వైపు బెండ్ అవ్వాలి. ఒక చేయిని పైకి మరో చేయిని క్రిందికి 90 డిగ్రీ ట్రైయాంగిల్ షేప్ లో చాచాలి.

కూర్చొని ట్విస్ట్ చేయడం

Sitting twist pose

ఇది ఒక బేసిక్ యోగా భంగిమ. మీ శరీరంలో కదలికలను కంట్రోల్ చేస్తుంది. నిటారుగా కూర్చొని ఎడమ కాళ్లు మీదుగా కుడి కాలిని వేసి, పూర్తిగా సైడ్ కు తిరగాలి. ఈ భంగిమలో తీసుకునే శ్వాస వల్ల మీరు మరింత ఎక్కువ ఎనర్జిటిక్ గా అవుతారు.

డౌన్ వార్డ్ డాగ్ ఫోజ్

downward dog pose

ఈ భంగిమలో మీ శరీరం రెండు సమాన భాగాలుగా బెండ్ అవుతుంది. ఈ భంగిమ మీ శరీరంలో బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది. మీ బ్రెయిన్ కు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. ఆటోమెటిక్ గా మీరు ఎక్కువ ఎనర్జిటిచ్ గా భావిస్తారు.

క్యాట్ ఫోజ్

cat pose

కొన్ని సందర్భాల్లో, స్ట్రెస్ క్రాప్స్ మీ కండరాల మీద బలంగా ఉంటుంది మరియు మీ శరీరం బలహీనంగా అవుతుంది. మరి స్ట్రెస్ తగ్గించుకొని యాక్టివ్ గా ఉండాలంటే, క్యాట్ ఫోజ్ ను ట్రై చేయండి.

కోబ్రా ఫోజ్

cobra pose

స్నేక్ లా యోగా భంగిమ, ఇది కేవలం మీ బ్యాక్ మజిల్స్ స్ట్రెచ్ అవ్వడం మాత్రమే కాదు , చెస్ట్ ఫ్రీ అవ్వడంతో సులభంగా శ్వాస తీసుకోగలుగుతారు. ఎంత ఎక్కువ గాలి మీరు పీల్చుకోగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈ యోగా మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.

చైల్డ్ ఫోజ్

Child’s pose

బాలాసన లేదా ఫీటల్ ఫోజ్ అని పిలిచే ఈ భంగిమ కొన్ని సార్లు మీరు ఎక్కువ టెన్షన్ తో ఉన్నప్పుడు, మీ మనస్సును ప్రశాంత పరుస్తుంది. ఈ భంగిమ చాలా సౌకర్యంగా ఉంటుంది. అలసటను తొలగించి ఉత్సాహాన్ని ఇస్తుంది.

శరీరంలోని శక్తిని ఆదా చేసే చిట్కాలు

 • ధూమపానం హానికరం. ఇది తెలిసి కూడా చాలా మంది ఈ అలవాటును మానుకోరు. ఇది అనేక అనారోగ్యాలకు ధారి తెస్తుంది అని అందరికీ తెలుసు, వాటితో పాటు ఇది మన శరీరంలోని ఎనర్జీ లెవెల్స్ ని క్రమంగా తగ్గిస్తుంది. కనుక మంచి ఆరోగ్యము మరియు బలం కొరకు ధూమపానం అలవాటుని మానుకోండి.
 • ధూమపానం లానే మద్యం కూడా మీ ఎనర్జీ లెవెల్స్ ని తగ్గిస్తుంది. కనుక మద్యం అలవాటును కూడా మానుకోవాలి.
 • మనం రోజూ తీసుకునే ఆహారాలు మన లీఫ్ స్టైల్ ని డిసైడ్ చేస్తాయి. మంచి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే బలంగా రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కేవలం కొవ్వు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలను మాత్రమే తీసుకోవటం వలన ఎటువంటి పోషకాలు శరీరానికి లభించవు. అలాగే సరైన సమయంలో సరైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
 • డయాబెటిస్ వంటి హెల్త్ ప్రాబ్లెమ్ ఉన్నవారు అదనపు చక్కెరను నివారించండి. ఇది తక్షణ ఎనర్జీ ని అందించినప్పటికీ, మీ రక్తంలోని చక్కెర స్థాయిని పెంచగలదు.
 • ఎప్పుడూ హైడ్రేటడ్ గా ఉండాలి. శరీరం తొందరగా అలసట చెందటానికి ముఖ్య కారణం డిహైడ్రేషన్. కనుక మీరు బయటికి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా చేతిలో నీటి బాటిల్ ని తీసుకోండి.
 • మీలో ఏర్పడిన అధిక స్ట్రెస్ మరియు ప్రెషర్ వలన కూడా మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవచ్చు. అటువంటప్పుడు స్ట్రెస్ ను తగ్గించేందుకు 2 నిమిషాలు మీ స్కాల్ప్ ని మసాజ్ చేసి చూడండి. తప్పకుండా కొంత వరకు స్ట్రెస్ రిలీఫ్ పొంది కొంత ఎనర్జీ లెవెల్ అధికరిస్తుంది.
 • అధిక స్ట్రెస్ లో ఉన్నవారికి లాఫింగ్ థెరపీ చాలా ఉపయోకరంగా ఉంటుంది. లాఫింగ్ థెరపీ శరీరంలో మంచి కెమికల్స్ ని రిలీజ్ చేస్తాయి. మీరు చాలా తాజా మరియు శక్తివంతమైన అనుభూతిని పొందుతారు.
 • మీ పనుల మధ్య 5-10 నిమిషాల స్వల్ప విరామాన్ని తీసుకోవటం వలన తక్షణ శక్తిని అందించి అలసటను తొలగిస్తుంది. ఇది మీ అలసటతో పోరాడటానికి మరియు పని నాణ్యతను మెరుగు పరిచేందుకు ఉత్తమమైన మార్గం.
 • మెదడు మరియు శరీరం యొక్క ప్రశాంతత కొరకు కొంత సమయం ధ్యానం చేయండి. ఇది శక్తిని సృష్టించడంలో సహాయపడుతుంది.
Posted on

గ్యాస్ ప్రోబ్లమా? – Telugu tips for gastric trouble

ప్రజలు ఎదుర్కొనే సామాన్య ఆరోగ్య సమస్యలలో ఒకటి గ్యాస్ట్రిక్ సమస్య. ప్రస్తుత కాలంలోని ఉరుకు పరుగుల జీవితంలో ఉదరంలో గ్యాస్ మరియు పొట్ట ఉబ్బరింపు లాంటి సమస్యలు అన్ని వయస్సుల వారినీ పీడిస్తోంది. ఇది ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ చాలా ఇబ్బంది కలిగించే ఒక సమస్య. ముఖ్యంగా మనం పబ్లిక్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమస్య యొక్క కారణాలు మరియు నివారించే పద్దతులను చూద్దాం.

గ్యాస్ట్రిక్ సమస్య అంటే ఏమిటి?

ప్రతి మనిషి యొక్క జీర్ణాశయంలో గ్యాస్ ఏర్పడుతుంది. ఇది తేపు వచ్చినప్పుడు మీ నోటి ద్వారా లేదా మీ ఆనస్ ద్వారా విడుదల అవుతుంది. ఈ గ్యాస్ మీ శరీరం నుండి విడుదల కాకుండా జీర్ణాశయంలో లేదా కడుపులో పేరుకుపోయినప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య ఎదురవుతుంది.

గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలు?

ఆహారాన్ని, ద్రవ పదార్ధాలను, కొన్ని నిర్దిష్ట ఆహార పదార్ధాలను తీసుకొనేటప్పుడు గాలిని ఎక్కువగా మింగడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడవచ్చు. ఇది ప్రేగులోపల చిక్కుకున్నప్పుడు నొప్పిని కలిగిస్తుంది. ఉబ్బిన పొట్ట మరియు గ్యాస్ సమస్యలు ఇతర జీర్ణ పరిస్థితుల వల్ల కూడా సంభవిస్తాయి. అతిగా తినడం వల్ల ఏర్పడే ఉబ్బరం, పొత్తికడుపు పరిమాణం పెరగడానికి కారణమవుతుంది మరియు తిమ్మిరి వలన కలిగే బిగుతు మరియు నొప్పి లాంటి భావనను కలిగించవచ్చు.

గ్యాస్ యొక్క సాధారణ కారణాలు

 • చాలా వేగంగా మరియు చాలా ఎక్కువగా తినడం – చాలా ఎక్కువ ఆహారం లేదా పానీయంను సరిగ్గా నమలకుండా మింగటం వలన ఆహారంతో పాటు ఎక్కువ గాలి కూడా శరీరంలోనికి వెళ్లి గ్యాస్ సమస్యను కలిగిస్తుంది.
 • ఎయిరేటేడ్ పానీయాలను త్రాగటం వలన.
 • ఎక్కువగా చీవింగ్ గం తినటం వలన.
 • పొగ త్రాగటం వలన.

గ్యాస్ట్రిక్ సమస్య యొక్క లక్షణాలు?

అతి సాధారణ గ్యాస్ లక్షణాలు బర్పింగ్ (త్రేన్పు), ఆనస్ ద్వారా గ్యాస్ విడుదల చేయటం, పొట్ట ఉబ్బరం మరియు నొప్పి లేదా అసౌకర్యంగా అనిపించటం. గ్యాస్ లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంటాయి.

బర్పింగ్

భోజనం తర్వాత తేపు రావడం సాధారణం. కానీ మీకు చాలా సార్లు త్రేన్పు వస్తున్నట్లయితే, మీరు ఎక్కువ గాలిని మింగి ఉంటారు మరియు ఆ గాలి మీ కడుపులోకి ప్రవేశించే ముందే విడుదల అవుతోందని అర్థం.

ఆనస్ ద్వారా గ్యాస్ విడుదల చేయటం

రోజుకు 13 నుండి 21 సార్లు గ్యాస్ విడుదల చేయటం సాధారణం. కానీ అంతకన్నా ఎక్కువ సార్లు చేస్తున్నట్లయితే మీకు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్లు.

పొట్ట ఉబ్బరం

ఉబ్బరం అనేది మీ పొత్తికడుపులో వాపు. ఇది తరచుగా భోజనం తర్వాత ఏర్పడుతుంది. కానీ చాలా సేపు మీ కడుపు ఉబ్బినట్లు అనిపిస్తే మీ పొట్టలో గ్యాస్ పేరుకు పోయినట్లు.

మీ ఉదరంలో నొప్పి లేదా అసౌకర్యం

సాధారణంగా మీ ప్రేగులు ద్వారా గ్యాస్ తరలించనప్పుడు మీకు మీ ఉదరం లో నొప్పిగా లేదా అసౌకర్యంగా అనిపిస్తుంది.

ఈ సమస్య గురించి డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి?

ఈ క్రింది లక్షణాలను గమనించినప్పుడు మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి:

 • వాయువు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినప్పుడు.
 • మీ లక్షణాలు హఠాత్తుగా మారినప్పుడు.
 • మీకు గ్యాస్ సమస్యతో పాటు మలబద్ధకం, అతిసారం లేదా బరువు తగ్గడం వంటి ఇతర లక్షణాలు కలిగి ఉన్నప్పుడు.

గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్లయితే మీరు చేయకూడని పనులు మరియు తినకూడని ఆహార పదార్థాలు

మద్యం సేవించకూడదు

మద్యం సేవించిన తదుపరి రోజు వీటి యొక్క ప్రభావాలను అనుభవిస్తారు. తలనొప్పి, కడుపులో వికారం లేదా హ్యాంగోవర్. రోజూ మద్యం సేవించడం మరియు ఎక్కువ మొత్తంలో తీసుకోవటం వలన పొట్టలో పుండ్లు ఏర్పడవచ్చు. ఇది కడుపు యొక్క లైనింగ్లో అధిక మంటను పుట్టించి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. మీరు అధికంగా మద్యపానం త్రాగితే పొట్టలోని పుండ్లు మన శరీరానికి కావలసిన ఆమ్లాలు మరియు ఎంజైములను ఉత్పత్తి చేయడాన్ని తగ్గించవచ్చు. దీని ప్రభావంగా గ్యాస్ట్రిక్ సమస్య ఎదురవుతుంది.

స్పైసి ఫుడ్

కారం ఎక్కువగా ఉండే ఆహారాల రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇవి మీ కడుపు యొక్క లైనింగ్‌ను ప్రేరేపిస్తాయి మరియు మీ కడుపులో మంటను పుట్టిస్తాయి. ఎక్కువ మసాలా ఉన్న ఆహారాన్ని తినటం వలన పొట్టలో పుండ్ల యొక్క లక్షణాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి.

కొవ్వు పదార్ధాలు

మంచి రుచి ఉన్న ఆహారాలలో అధిక కొవ్వు ఉంటుంది, ఉదాహరణకు చిప్స్, ఫ్రైస్, పిజ్జాలు, బర్గర్స్ మరియు మొదలైనవి. ఈ ఆహారాలు మీ కడుపు యొక్క లైనింగ్‌ను అప్‌సెట్ చేస్తుంది. వాటిలో ట్రాన్స్ మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆహారాలు ఉంటాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు మరింత ప్రమాదకరం. బేక్ చేసినవి లేదా వనస్పతి కలిగి ఉన్న ఆహారం ఏదైనా సరే నివారించాలి.

సిగరెట్స్

ఇది కడుపులో అసౌకర్యాన్ని కలిగించటంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను వరుసగా కలిగిస్తుంది. ఇది కడుపు గోడల లైనింగ్లో ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. ధూమపానం యొక్క ప్రధాన దుష్ప్రభావాలలో గ్యాస్ట్రిక్ సమస్య ఒకటి. మీ కడుపులో అసౌకర్యాన్ని తొలగించుకోవాలంటే ధూమపానం మానేయాలి.

గ్యాస్ట్రిక్ సమస్యని నివారించే పద్ధతులు

కొన్ని ఆహార అలవాట్లను మరియు జీవనశైలిని మార్చుకోవటం ద్వారా ఈ సమస్యను సులభంగా నివారించవచ్చు.

పండ్లు తినడం

పండ్లలో ఫైబర్ మరియు ph స్థాయులు సరైన మొత్తాల్లో ఉంటాయి. ఇవి పొట్టలో పుండ్లను తొలగించేందుకు సహాయపడుతుంది. ప్రత్యేకంగా సిట్రస్ పండ్లు మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడానికి మరియు గ్యాస్ట్రిక్ ఆమ్లాలను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. నారింజ రసం లేదా నిమ్మరసం వంటి సిట్రస్ పండ్ల రసాలను తరచుగా త్రాగండి.

బేకింగ్ సోడా

కొన్నిసార్లు గ్యాస్ట్రిటిస్ సమస్య భరించలేనంత తీవ్రంగా మారుతుంది. కడుపు నొప్పి మొదలవుతున్నప్పుడు, తల భారీగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు త్రేన్పులు కూడా ఆగవు, రెస్ట్ లెస్ గా అనిపిస్తుంది. అటువంటి సమయంలో బేకింగ్ సోడా ఒక తక్షణ ఉపశమనం. కడుపు యొక్క PH సంతులనాన్ని పునరుద్ధరించడానికి మరియు తక్షణ ఉపశమనం పొందటానికి ఒక గ్లాసు నీటిలో ½ స్పూన్ బేకింగ్ సోడా కలుపుకొని త్రాగండి.

వాకింగ్

ఈ ప్రక్రియ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది మరియు కడుపు యొక్క ఆరోగ్యకరమైన కార్యాచరణను ప్రోత్సహిస్తుంది. మీరు పొట్టలో గాస్ట్రిక్ సమస్య వలన బాధపడుతుంటే, భోజనం చేసిన తరువాత 15-20 నిముషాలు వాకింగ్ చేయండి.

యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు

విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి. విటమిన్ ఎ మరియు సి కడుపు యొక్క లైనింగ్లో వాపు మరియు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణ లోపాలను కూడా సరిచేస్తుంది. బెర్రీస్ లో విటమిన్లు మరియు ఫ్లేవానాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. పండ్లు మరియు కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు లైనింగ్‌కు సంబంధించిన ఏ వ్యాధినైనా నయం చేస్తుంది. తాజా మూలికలు, స్క్వాష్, ఆకు కూరలు, ఆపిల్, సెలెరీ, క్రాన్బెర్రీస్, ఆస్పరాగస్, ఆర్టిచోకెస్, ఉల్లిపాయలు, పసుపు, వెల్లుల్లి, బెర్రీలు. ఈ పండ్లను మరియు కూరగాయలను మీకు నచ్చినంత ఎక్కువగా తీసుకోండి.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు

కడుపులోని ఆహారాన్ని జీర్ణాశయంలోనికి సులభంగా కదిలించడంలో ఫైబర్స్ సహాయపడుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు గ్యాస్ట్రిటిస్ సమస్యలు ఉన్నట్లయితే అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను తినండి. ఆరెంజ్, ఆపిల్స్, అరటి మరియు రాస్ప్బెర్రీస్ లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దుంపలు, క్యారట్లు, కాలే, బ్రోకలీ మరియు బచ్చలికూర వంటి కూరగాయలలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది.

ప్రోబయోటిక్ ఫుడ్స్

ప్రోబయోటిక్స్ కడుపు లైనింగ్స్ యొక్క వాపును తగ్గిస్తుంది మరియు మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ ఎదుర్కొంటున్న వివిధ రకాలైన ఇన్ఫెక్షన్లను కూడా ఇవి తొలగిస్తాయి. ఇవి మన శరీరంలో బ్యాక్టీరియా స్థాయిని నిర్వహిస్తాయి. సౌర్క్క్రాట్, కించి, కంబుచా, నట్టో, పెరుగు  మరియు మజ్జిగలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి.

నీరు

జీర్ణ కోశ ప్రాంతంను ఆరోగ్యవంతంగా ఉంచుకోవటానికి నీటిని అధికంగా త్రాగండి.  నొప్పి మరియు వాపును కలిగించే హానికరమైన టాక్సిన్స్ ని శరీరం నుండి తొలగించటానికి నీరు సహాయపడుతుంది. మీ కడుపు లోపలి లైనింగ్‌ను వాపు మరియు మంట నుండి కాపాడటానికి ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీటిని త్రాగాలి.

అల్లం

అల్లం గ్యాస్ట్రిక్ చికిత్స కోసం అత్యంత ఉపయోగకరమైన పదార్ధం మరియు ప్రతి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటుంది. అల్లంను సన్నటి ముక్కలుగా కోసుకొని, ఒక కప్పు వేడి నీటిలో వేసి 10 నిమిషాలు మూసిపెట్టండి. ఆ తరువాత, అల్లం నీటిని వడగట్టి ఒక టేబుల్ స్పూన్ తేనెతో పాటు కొన్ని చుక్కల నిమ్మరసం పిండి త్రాగండి. ఇది మీ జీర్ణవ్యవస్థకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది.

సోంపు

ఎక్కువ భోజనం తిన్నప్పుడు త్రేన్పులు సహజం, అందుకే తిన్న వెంటనే కొన్ని సోంపు గింజలు నోట్లో వేసుకొని నమలడం వల్ల సమస్య కొంత వరకు తగ్గుతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్ మరియు ట్యూమర్ ని గుణపరిచేందుకు కూడా సహాయపడుతుంది. ఇందులో యాంటి వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ట్యూమర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి.

మార్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు

 • మీరు భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా తినడం అలవాటును చేసుకోండి. మీ ఆహారాన్ని సరిగ్గా నమలి తినండి.
 • భోజనం తరచుగా మరియు తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. అలా తినటం వలన మన శరీరం ఆహారాన్ని మరింత సులభంగా జీర్ణం చేయగలదు మరియు పొట్టలో పుండ్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటుంది.
 • మీరు తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు తగిన సమయాన్ని ఇవ్వండి. తిన్న వెంటనే పడుకోకూడదు.
 • వీటన్నిటితో పాటు మెదడు యొక్క ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మీ ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి పెరగటం వలన కూడా కడుపులో ఎక్కువ ఆమ్లాలు ఉత్పత్తి అయ్యి మంటను పెంచుతాయి.
Posted on

Calcium rich foods in Telugu – కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు – కాల్షియం రిచ్ ఫుడ్స్

మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన ఖనిజాలలో కాల్షియం చాలా ముఖ్యమైనది. కాల్షియం ఒక అద్భుతమైన పదార్ధం, దీని వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కాల్షియం యొక్క ప్రయోజనాలను చూద్దాం

 • బలమైన ఎముకలు మరియు దంతాల నిర్వహణకు కాల్షియం చాలా ముఖ్యమైన ఖనిజము.
 • నెర్వస్ సిస్టమ్ యొక్క పనితీరుకు సహాయపడుతుంది.
 • మెదడు నుండి ఇతర శరీర భాగాలకు మెసేజ్‌ని తీసుకువెళ్లే నరాలకు సహాయపడుతుంది.
 • ఎక్కువ ఫాట్ బర్నింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా బరువు నిర్వహణలో తోడ్పడుతుంది.
 • ప్రీమెన్స్ట్రుల్ సిండ్రోమ్ సమయంలో కలిగే అసౌకర్యాన్ని తొలగిస్తుంది.
 • కొలరెక్టల్, ఒవేరియన్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్‌లను నివారించటానికి శరీరంలో సరైన కాల్షియం స్థాయిలు సహాయపడుతాయి.
 • శరీరం మొత్తం రక్త ప్రసరణకు సహాయం చేయడంలో కాల్షియం కీలక పాత్ర వహిస్తుంది.

కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు

పాలు, జున్ను మరియు పాల ఉత్పత్తులు ప్రధాన కాల్షియం ప్రొవైడర్స్. పాల ఉత్పత్తులలో మాత్రమే కాదు ఆకుకూరలు, సీ ఫుడ్స్, లెగ్యూమ్ మరియు పండ్లలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్రింద చెప్పిన కాల్షియం రిచ్ ఆహారాలతో పాటు అన్ని రకాల పోషకాలనూ తీసుకోవడం చాలా ముఖ్యం.

పాలు

పాలలో అత్యధికంగా కాల్షియం ఉంటుందన్న విషయం మన అందరికీ తెలుసు. కనుక ప్రతి రోజూ కనీసం ఒక గ్లాసు పాలలో ఏదైనా ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి తీసుకుంటే చాలా మంచిది.

వైట్ బీన్స్

వైట్ బీన్స్ లో కాల్షియం మరియు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని వివిధ వంటకాల్లో జోడించుకోవచ్చు. ఒక కప్పు వైట్ బీన్స్ తినడం వల్ల 100 మీ గ్రా కాల్షియం శరీరానికి అందుతుంది.

క్యాన్డ్ సాల్మన్

క్యాన్డ్ సాల్మన్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులోని ఎముకలు క్యానింగ్ ప్రక్రియ ద్వారా మృదువుగా చేయబడతాయి. కనుక మాంసంతో సహా ఎముకలను కూడా సులభంగా చూర్ణం చేయవచ్చు. కాల్షియం మరియు ఒమేగా 3 ఫాటీ యాసిడ్‌ను అధికంగా అందించే సాల్మన్ కేకులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

సార్డినెస్

సార్డినెస్ వంటి ఆరోగ్యవంతమైన చేపల్లో కాల్షియం, ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ మరియు విటమిన్ డి ఉంటుంది. మార్కెట్లో సులభంగా లభించే ఈ సముద్రపు చేపలో ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ చేపల ద్వారా మీకు రోజుకు కావాల్సిన 33% యూనిట్ల కాల్షియం లభిస్తుంది.

ఎండిన అత్తి పండ్లు

ఎండిన అంజీర పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ఐరన్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువలన వీటిని రెగ్యులర్గా తినండి.

బోక్ చోయ్

బోక్ చోయ్ అనేది ఒక చైనీస్ క్యాబేజీ. ఇందులో విటమిన్ ఏ మరియు సి, కాల్షియం మరియు ఫైబర్లు అధికంగా ఉంటాయి. దీనిని వెల్లుల్లి మరియు ఆలివ్ నూనె తో వేయించి ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటను తయారు చేయవచ్చు.

మొలాసిస్

నల్లని మొలాసిస్ లో కాల్షియం, ఐరన్ మరియు ఇతర విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది తియ్యగా ఉంటుంది, కనుక అనేక డెసెర్ట్స్ లో మరియు పాన్ కేక్స్ పై చేర్చుకోవచ్చు. మొలాసిస్ ని ఉపయోగించి బ్రౌన్ షుగర్ ను కూడా తయారు చేయవచ్చు.

కేల్

కేల్ లో కాల్షియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిని అన్ని రకాల సలాడ్స్ లో ఉపయోగించవచ్చు.

బాదాం

కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలలో బాదాం ఒకటి. ఇందులో ఫాట్స్, విటమిన్ ఇ మరియు ప్రోటీన్లు కూడా ఉంటాయి. అంతేకాదు ఇది ఒక సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది మరియు హార్ట్ అట్టాక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పచ్చని ఆకుకూరలు

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఎన్నో ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి. బచ్చలికూర, మెంతాకులు, లెటుస్, తోటకూర, పాలకూర మొదలైన ఆకుకూరలను మీ డైట్లో చేర్చుకోండి. వీటిని సూప్ లేదా జ్యూస్ మరియు స్మూతీస్ లలో కూడా చేర్చుకోవచ్చు.

క్యాబేజీ, బ్రోకలీ

100 గ్రాముల బ్రోకలీలో 47 మి గ్రా కాల్షియం ఉంటుంది. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవటం వలన శరీరానికి అధిక మోతాదులలో కాల్షియంను అందిస్తాయి. ఈ కూరగాయలు నాడీ వ్యవస్థకు మంచిది. రక్తపోటు స్థాయిని నిర్వహించడం మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

ఓక్రా (బెండకాయ)

దీనిలో కాల్షియం మరియు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక గిన్నె బెండకాయలో 175 మి గ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే వంద గ్రాముల బెండకాయలో కాల్షియం 82 మి గ్రా కాల్షియం ఉంటుంది.

నువ్వుల గింజలు

నువ్వుల గింజలు చాలా ఆరోగ్యకరమైనది. వీటిలో ఫోలిక్ ఆసిడ్స్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటును మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించటంలో సహాయపడుతుంది. వీటిని అనేక వంటలలో మరియు రొట్టెలలో చేర్చుకొని తినండి.

అరటి పండు

అరటి పండ్లలో కాల్షియంతో సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉదయాన్నే లేదా వ్యాయామాలను చేసే ముందు తినటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

నారింజ పండు

ఆరెంజ్ లో కాల్షియం మరియు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ ని ఉదయం అల్పాహారంతో పాటు తీసుకోవచ్చు.

కాల్షియంతో బలపరచిన ఆహారాలు

ఇటీవల కాలంలో కాల్షియంతో కూడిన ఆహారాలు (ఫోర్టిఫైడ్ ఫుడ్స్) మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ రకమైన ఆహారాలను మరియు ఫల రసాలను మీ డైట్ లో చేర్చుకోండి.

ఇన్స్టెంట్ వోట్మీల్

ఈ రోజుల్లో కాల్షియంతో కూడిన అనేక ధాన్యాలు మరియు గింజలు లభిస్తున్నాయి. బ్రేక్ ఫాస్ట్ సిరీల్స్ లాంటి తృణధాన్యాలలో ఫైబర్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కనుక మీ రోజూ డైట్ లో వోట్మీల్ ను చేర్చుకోండి.

సోయా పాలు

లాక్టోస్ ఇన్టాలరెన్స్ ఉన్న వారు ఆవు పాలకు బదులుగా సోయా పాలను తీసుకోండి. సాధారణ పాలతో పోల్చితే ఇందులో ఎక్కువ ప్రోటీన్ మరియు కాల్షియం ఉంటుంది. ఒక ఔన్స్ సోయా పాలలో 300 మి గ్రా కాల్షియం ఉంటుంది. దీనిని తృణధాన్యాలు, టీ మరియు కాఫీ తయారీలో ఉపయోగించవచ్చు.

క్యాబేజి ఆకుకూరలు

చాలా ఆరోగ్యకరమైన ఆకుపచ్చ కూరగాయలలో ఇది కూడా ఒకటి. వండిన ప్రతి 1 కప్పు క్యాబేజి ఆకులలో 268 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంతే కాదు ఇందులో విటమిన్ ఏ ఉండటం వలన మీ కంటి చూపుకు కూడా చాలా మంచిది. సగం ఉడికించిన ఆకులను సలాడ్లలో కలుపుకొని కూడా తినవచ్చు.

ఎడామామె

ఈ కూరగాయలు భారతదేశంలో సులభంగా అందుబాటులో లేకపోవచ్చు, ఇవి ఎక్కువగా చైనాలో పెరుగుతుంది. ఒక కప్ ఉడికించిన ఎడామామెలో 98 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.

టోఫు

సోయాబీన్స్ తో తయారు చేసే చీజ్ లాంటి పదార్థాన్నే టోఫు అని అంటారు. ఇందులో సమృద్ధిగా ఉన్న కాల్షియం అన్ని వయసుల వారికీ ముఖ్యంగా పెరిగే పిల్లకు చాలా అవసరం. అర కప్పు టోఫు లో 434 mg కాల్షియం ఉంటుంది.

అలసందలు

అధిక కాల్షియం తో కూడిన ఈ బటానీలను సులభంగా మార్కెట్లో పొందవచ్చు. వీటిని విడిగా లేదా ఇతర కూరగాయలతో చేర్చుకొని ఉడికించి తినండి.

పెరుగు

మనం ఇళ్లలో పాల ద్వారా తయారు చేసుకునే పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో లభించే యోగార్ట్ అంత మంచిది కాదు. అందువలన రోజూ ఇంట్లో పెరుగు తయారు చేసుకొని తినండి. పాలలో లాగే పెరుగులో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే లాక్టోజ్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

చీజ్

చీజ్ కూడా మనకు సులభంగా మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా పాల ఉత్పత్తికి సంబంధించిందే. ఇందులోనూ కాల్షియం నిండుగా ఉంటుంది. పర్మెసాన్ చీజ్ లో అత్యధిక శాతం కాల్షియం ఉంటుంది.

ప్రాన్స్

రొయ్యలలో అధిక శాతంలో కాల్షియం ఉంటుంది. అయితే వీటిని ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉన్న కాల్షియం మోతాదు తగ్గిపోతుంది. అందువలన వీటిని ఎక్కువగా వేయించకుండా తింటే మంచిది.

క్రాబ్స్

పీత మాంసంలో అనేక పోషకాలు మరియు మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఒక కప్పు పీత మాసంలో 123 మి గ్రా కాల్షియం ఉంటుంది. కనుక క్రాబ్స్ ను కూడా మీ డైట్ లో చేర్చుకోండి.

ఉడికించిన గుడ్లు

ఒక ఉడికించిన గుడ్డులో 50 మి గ్రా కాల్షియం ఉంటుంది. అంతేకాదు ఇందులో ప్రోటీన్లు మరియు విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి. కనుక రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డును తినండి.

చింతపండు

పైన పేర్కొన్న ఆహార పదార్థాలతో పోల్చుకుంటే చింతపండులో అంతగా కాల్షియం ఉండదు. కానీ ఇందులో పొటాషియం, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి.

డేట్స్

ఖర్జూరంలో కాల్షియం మరియు ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.

సీతాఫలం

కస్టర్డ్ ఆపిల్ లేదా సీతాఫలం తినడానికి కాస్త టైం పడుతుంది. కానీ ఇందులో కూడా కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. కనుక వీటిని కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

సోయాబీన్స్

పైన ఇచ్చిన వాటిలో సోయాబీన్ ఉత్పత్తులయిన సోయా పాలు, టోఫు గురించి మనం తెలుసుకున్నాం. అయితే వీటికన్నా సోయాబీన్స్ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.

బ్రాజిల్ నట్స్

6 బ్రాజిల్ నట్స్ తింటే చాలు, అది మీకు 45 మీ గ్రా కాల్షియంను అందిస్తుంది. ఈ ఆరోగ్యకరమైన నట్స్ లో ప్రోటీనులు కూడా అధికంగా ఉంటాయి.

డ్రైడ్ హెర్బ్స్

వివిధ రకాల మూలికలు, థైమ్ మరియు రోస్ మెర్రీ వంటి వాటిలో అధికంగా కాల్షియం ఉంటుంది. వీటిని సూపులు లేదా కర్రీస్ లో వాడుకోవచ్చు.

అరుగుల

ఇది గ్రీన్ వెజిటేబుల్స్ కు సంబంధించిన ఒక స్పెషల్ ఆకుకూర. దీన్ని సాధారణంగా సలాడ్స్ లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇది మీకు కావల్సిన కాల్షియం అందిస్తుంది. కాబట్టి దీన్ని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

Posted on

Best diet for Psoriasis sufferers in Telugu – సోరియాసిస్ బాధితులకు ఉత్తమ ఆహారాలు

సోరియాసిస్తో బాధపడుతున్న వ్యక్తులకు హృదయ వ్యాధి మరియు మధుమేహం వంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఈ వ్యాధిని నివారించేందుకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాలను తీసుకోవాలి. ఇవి సోరియాసిస్ మరియు సోరియాటిక్ ఆర్థరైటిస్ వలన కలిగే ఇన్‌ఫ్లమేషన్ను తొలగిస్తుంది.

సోరియాసిస్ బాధితులకు ఉత్తమ ఆహారాలు

పండ్లు మరియు కూరగాయలు

పండ్లు మరియు కూరగాయలు తినడం వలన ఆరోగ్యం మెరుగు పొందుతుంది. క్యారట్లు, పుచ్చకాయ వంటి కాయకూరలు మరియు బ్లూబెర్రీలు, నారింజ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ , సి ఎక్కువగా ఉంటుంది. సోరియాసిస్ రోగులకు ఇది ఉత్తమ డైట్ ఎందుకంటే ఈ విటమిన్లు చర్మంలోని తేమను కాపాడి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.

విటమిన్ సప్లిమెంట్స్

విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలతో పాటు విటమిన్ సప్లిమెంట్లను కూడా తీసుకోండి. మాత్రలు, గుళికలు, మృదువైన జెల్, జెల్ క్యాప్స్, ద్రవాలు లేదా పొడుల రూపంలో విటమిన్ సప్లిమెంట్లను తీసుకోండి.

చేపలు

చేపలలో ఒమేగా –3 ఫాటీ ఆసిడ్స్ అధిక మొత్తాలలో ఉంటాయి. సోరియాసిస్తో బాధపడుతున్న రోగులకు ఈ ఫాటీ ఆసిడ్స్ చాలా అవసరం. సాల్మొన్, ట్యూనా, మేకెరెల్, ట్రౌట్, హెర్రింగ్, ఆంకోవీస్ వంటి కోల్డ్ చేపలను మీ డైట్లో చేర్చుకోండి. హృదయ వ్యాధుల ప్రమాదాన్ని నివారించడానికి ఈ చేపలను వారానికి రెండుసార్లు తినండి.

ఆకుకూరలు

బీఫ్, చేపలు లాంటి మాంసాహారాలను తినని వారు ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ కొరకు ఆకుకూరలు మరియు అవిసె గింజలను తినవచ్చు. ఇవి మీ శరీరం యొక్క బరువును కూడా నియంత్రిస్తుంది. అంతే కాదు శరీరంలోని టాక్సిన్స్ ని తొలగించి అవసరమైన పోషకాలను అందించడం ద్వారా సోరియాసిస్ ని తగ్గిస్తుంది.

విటమిన్ డి

సోరియాసిస్ని గుణపరిచేందుకు విటమిన్ డిని ఉపయోగిస్తారు. ఈ చికిత్సకు వైద్యులు సూచించే వర్టికల్ మరియు డావెనెక్స్ అనే రెండు మందులలో విటమిన్ డి ప్రధాన మూలవస్తువు. ఈ మందులను చర్మంపై రాసినప్పుడు సోరియాసిస్ వలన అధిక వేగంగా పెరిగే చర్మపు కణాలను పెరగకుండా ఆపి ఉపశమనాన్ని ఇస్తుంది.

వెల్లుల్లి

మీ రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోండి. ఇందులోని యాంటీ బయాటిక్ లక్షణాలు సోరియాసిస్ వలన కలిగే మంటను తగ్గిస్తుంది. వీటిని సూప్, సలాడ్స్ మరియు ఇతర ఆహారాలలో చేర్చుకోండి. ఇది సోరియాసిస్ ని గుణపరచటంతోపాటు మీ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.

ఆపిల్ సీడర్ వినిగర్

వినిగర్ సోరియాసిస్ నుండి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. దీనిని మీ ఆహారంలో చేర్చుకోండి లేదా మీరు స్నానం చేసే నీటిలో ఒక కప్పు వినిగర్‌ని కలుపుకొని స్నానం చేయండి.

ఒమేగా – 3 ఫాటీ ఆసిడ్స్

ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు సోరియాసిస్ వలన ఏర్పడే మంటను తగ్గిస్తుంది. ఇది శరీరం యొక్క రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు మూడు రకాలు –  ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం, ఎకోసపెంటెనాయిక్ ఆమ్లం మరియు డోకోసాహెక్సానియోక్ ఆమ్లం. ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ కొన్ని కూరగాయల నూనెలు, గింజలు, విత్తనాలు మరియు సోయాలో కనబడుతుంది. ఎకోసపెంటెనాయిక్ ఆమ్లం మరియు డోకోసాహెక్సానియోక్ ఆమ్లం చేపలు, చేప నూనె మరియు ఆల్గేలలో కనబడుతుంది.

ధాన్యాలు

తృణధాన్యాలు, వోట్మీల్, గోధుమతో చేసిన బ్రెడ్స్ లాంటి ఆహారాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువ ఫైబర్ ఉండే ధాన్యాలను తీసుకోవటం వలన మీ శరీరంలోని మంట మరియు మీ రక్తంలోని చక్కెర స్థాయులు కూడా తగ్గుతుంది.

నట్స్ మరియు అవోకాడో

పాలీఅన్శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు సోరియాసిస్ ని తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతుంది. కూరగాయల నూనెలు, సోయాబీన్ నూనె, అవిసె గింజలు, వాల్నట్ మరియు అవోకాడోలలో ఈ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువ కేలరీలను కూడా అందిస్తుంది కనుక తగిన మోతాదులలో తీసుకోండి.

సోరియాసిస్ తో బాధపడుతున్న వారు తినకూడని ఆహారాలు

ఆల్కహాల్ నివారించండి

తెల్లని రక్త కణాలతో కూడిన T కణాలు మరియు వ్యాకోచం చెందిన రక్త కణాలు సోరియాసిస్ రావటానికి కారణాలు. ఆల్కహాల్ తీసుకోవటం వలన చర్మంపై T కణాలు అధికరిస్తాయి, ఇందువలన సోరియాసిస్ ఎక్కువ అవుతుంది కనుక సోరియాసిస్ ని తగ్గించేందుకు ఆల్కహాల్ నివారించండి.

జంక్ ఫుడ్స్

సోరియాసిస్ మంటను పుట్టించే ఒక వ్యాధి. జంక్ ఫుడ్స్ లో ఎక్కువగా సాచ్యురేటెడ్ మరియు ట్రాన్స్ ఫ్యాట్స్, రిఫైన్ చేసిన స్టార్చ్ మరియు చక్కెర ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై మంటను అధికరిస్తుంది. కనుక ఎక్కువ కేలరీలు మరియు తక్కువ పోషక విలువలు ఉండే జంక్ ఫుడ్స్ ని నివారించండి.

గ్లూటెన్

గ్లూటెన్  సోరియాసిస్ ని అధికరించే ఒక ఆహార పదార్థం. ఇది ఎక్కువగా బ్రెడ్స్ మరియు కొన్ని పాస్తాలలో వాడుతారు. కనుక వీటిని నివారించండి.

ఆహార నియమాలతోపాటు వేలకు భోజనం చేయటం మరియు వ్యాయామాలను చేయటం కూడా చాలా అవసరం. ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొవ్వు మరియు నూనె ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా నిరోధించండి.

టమోటాలు

పెప్పర్, టమోటాలు మరియు బంగాళదుంపలు మీ చర్మం యొక్క మంటను అధికరించే అవకాశాలు ఉన్నాయి. ఇవి సోరియాసిస్ ని అధికరిస్తుంది. కనుక వీలైనంత వరకు వీటిని నివారించండి.

పాల ఉత్పత్తులు

కొవ్వు ఎక్కువగా ఉండే అన్ని పదార్థాలనూ మీరు నివారించాలి. ఫాట్ ఫ్రీ ఉత్పత్తులను మాత్రమే తీసుకోవాలి. ఇవి మీ హృదయ ఆరోగ్యానికి కూడా మంచిది. ఆవు పాలకు బదులుగా మీరు సొయా పాలను తీసుకోండి.

మాంసం

ఎరుపు మాంసాన్ని నివారించండి ఎందుకంటే ఇది హృదయ వ్యాధులకు దారితీస్తుంది. వీటికి బదులుగా తక్కువ కొవ్వు ఉండే లీన్ బీఫ్ ను తినండి. గుండె యొక్క ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు చికెన్ మరియు టర్కీ వంటి మాంసాలను కూడా తినవచ్చు.

Posted on

Fiber rich foods in Telugu – ఫైబర్ రిచ్ ఫుడ్స్ – మంచి ఆరోగ్యం కోసం ఫైబర్ రిచ్ ఆహారాలు

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు ప్రతి ఒక్కరికి చాలా అవసరం. కొందరు మంచి ఆరోగ్యం కోసం మరికొందరు బాడీ ఫిట్‌నెస్ కోసం ఈ ఆహారాలను తీసుకుంటారు. మంచి ఆరోగ్యం కొరకు వ్యాయామాలు, శారీరక పనులు మరియు క్రీడలలో పాల్గొంటూ ఫైబర్ ఆహారాలను కూడా మీ డైట్ లో చేర్చుకోవటం చాలా అవసరం. ఈ ఆహారాలు మీ పనులకు కావలసిన శక్తిని అందించి మీ శరీరం యొక్క వ్యవస్థ సరిగ్గా పనిచేయటానికి తోడ్పడుతుంది.

ఫైబర్ యొక్క లోపం వలన మలబద్ధకం, మొలలు మరియు రక్తంలో అధిక కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఫైబర్ అవసరానికి మించి ఎక్కువగా తీసుకుంటే అతిసారం, ప్రేగు అవరోధం లేదా నిర్జలీకరణం లాంటి సమస్యలు ఎదురవుతాయి. కనుక మన శరీరానికి కావల్సినంత ఫైబర్ పదార్థాలను మనం చేసే పనుల బట్టి తీసుకోవాలి.

ఫైబర్ ఎందుకు ముఖ్యమైనది?

ఫైబర్ ఆహారాలు మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్లు మరియు ఫైటోకెమికల్స్ ఉంటాయి. అందువలన గుండెపోటు,క్యాన్సర్ మరియు మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తొలగిస్తుంది. ఇవి మన జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది.

ఫైబర్ రెండు రకాలు

కరిగే ఫైబర్ (సాల్యుబుల్) మరియు కరగని ఫైబర్ (ఇన్ సాల్యుబుల్). సాల్యుబుల్ ఫైబర్ శరీరంలో ఒక జెల్ లా మారి మెల్లగా డైజెస్ట్ అవుతుంది. ఇన్ సాల్యుబుల్ ఫైబర్ డైజెస్ట్ అవ్వకుండానే శరీరం నుండి మలం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది.

ఫైబర్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు

ఊక (మొక్కజొన్న, గోధుమ, బియ్యం మరియు ఓట్స్)

బ్రాన్ సర్వసాధారణంగా ధాన్యపు రొట్టెలలో ఉపయోగిస్తాము. ఇందులో విటమిన్ బి6 మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మీ రోజూ అల్పాహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్ మరియు గోధుమలను చేర్చుకోండి.

ఎండిన మూలికలు, మసాలా దినుసులు మరియు మిరియాలు

మీ వంటకాల్లో మిరపకాయాలు, పప్రికా వంటి మరింత ఎండిన స్పైసెస్ ని జోడించడం వలన ఇవి విటమిన్లు మరియు ఖనిజాలను ఎక్కువగా అందిస్తుంది. ఎండిన మూలికలు మరియు మసాలా దినుసులు అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. పొడి చేసిన దాల్చిన చెక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

కోకో పౌడర్ మరియు డార్క్ చాక్లెట్

కోకో పౌడర్ లో ఐరన్ మరియు పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల కోకో పౌడర్ లో 32 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

అవిసె గింజలు, నువ్వులు గింజలు మరియు నువ్వులు వెన్న

అవిసె గింజలు మరియు నువ్వుల గింజలలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల అవిసె గింజలలో సుమారు 27.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. టోస్ట్ చేసిన 100 గ్రాముల నువ్వుల గింజలు 14 గ్రాముల ఫైబర్ అందిస్తుంది.

డ్రై రోస్టెడ్ సోయబీన్స్

కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు సోయబీన్స్ సహాయపడుతుంది. ఇది ఎప్పుడైనా తినగలిగే ఒక ఆరోగ్యకరమైన స్నాక్స్.

ఎండబెట్టిన టమోటాలు

ఎండబెట్టిన టమోటాలలో ఐరన్ మరియు పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి సాస్, పిజ్జా మరియు సలాడ్లలో గొప్ప రుచిని మరియు ఆకర్షణీయమైన ఎరుపు రంగుని పెంచుతుంది.

నట్స్ (బాదాం, పిస్తా పప్పులు, పెకాన్స్)

గింజల యొక్క ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. బాదాం గింజలలో రాజు ‍వంటిది మరియు గొప్ప ఆరోగ్య విలువ కలిగి ఉంటుంది. వీటిని సలాడ్లలో చేర్చవచ్చు లేదా స్నాక్స్ లా తినవచ్చు. ఒక 100 గ్రాముల బాదాం దాదాపు 12.2 గ్రాముల ఫైబర్ ని అందిస్తుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్

ఈ విత్తనాలను చిరుతిండిగా లేదా అనేక సలాడ్లలో ఒక మూల వస్తువుగా ఉపయోగించవచ్చు. సన్ ఫ్లవర్ విత్తనాలలో విటమిన్ ఇ, విటమిన్ బి1, బి6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం మరియు రాగి యొక్క గొప్ప లక్షణాలు ఉన్నాయి.

బీన్స్ (బేబీ, తెలుపు, ఫ్రెంచ్, కిడ్నీ)

బీన్స్ లో అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని ఉడికించి తినటం వలన ఎక్కువ ఫైబర్ ని అందిస్తుంది.100 గ్రాముల నేవీ బీన్స్ 10.5 గ్రాముల ఫైబర్ ని అందిస్తుంది.

పాషన్ పండు (గ్రానాడిల్లా)

ఇవి మరింత ప్రాచుర్యాన్ని పొందుతున్న ఉష్ణ మండల పండ్లు.100 గ్రాముల పండ్లలో 10.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

ఆర్టిచోకెస్

ఆర్టిచోక్ ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క మీడియం సైజు పండులో 10.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

బ్రోకలీ

బ్రోకలీలో ప్రోటీన్ మరియు ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన ఒక కప్పు బ్రోకలీలో 5.1 గ్రాముల ఫైబర్ ఉంటుంది. బ్రోకలీని ఉపయోగించి ఎన్నో రకాల వంటకాలను సులభంగా చేయవచ్చు.

బ్లాక్బెర్రీస్

బ్లాక్బెర్రీస్ ఒక కాలానుగుణ పండు, ఇందులో ఎక్కువ ఫైబర్ మరియు ఇతర ముఖ్యమైన పదార్ధాలు ఉన్నాయి. ఒక కప్పు బ్లాక్బెర్రీస్ లో 7.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. మీరు ఫ్రూట్ సలాడ్ చేయడానికి ఇతర పండ్లతో వీటిని కలుపుకొని తినవచ్చు.

బటానీలు

బటానీలు చాలా సులభంగా మార్కెట్ లో లభిస్తుంది మరియు ఇందులో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఒక కప్పు ఉడికించిన బటానీలలో 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

లెంటిల్స్ (కాయధాన్యాలు)

వీటినే పప్పులు, త్రుణ ధాన్యాలు అనికూడా అంటారు. వీటిలో ఫైబర్ తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. వీటిని రోజూ ఆహారాలలో చేర్చుకోవడం వలన ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుంది. వీటిని సలాడ్స్ లో కూడా చేర్చుకొని తినవచ్చు.

అవొకాడో

అవొకాడోని మీ డైట్ లో చేర్చుకోవటం వలన గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చాలా విటమిన్లను మరియు పోషకాలను అందించి మీ బరువు తగ్గటంలో సహాయపడుతుంది.

మష్రుమ్

మష్రుమ్ చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ఫైబర్ మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. కనుక వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

సెలరీ

సెలరీలో ఫైబర్ అధికంగా మరియు క్యాలరీలు తక్కువగా ఉంటుంది. కేవలం ఒక కప్పు సెలరీలో 6 శాతం డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

జామకాయ

జామకాయను అధిక న్యూట్రీషియన్స్ ఉన్న ఫ్రూట్స్ అని అంటారు. ఒక్క జామ కాయలో 9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇంకా ఇందులో విటమిన్ కె మరియు విటమిన్ సి కూడా ఉన్నాయి. అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వలన డయాబెటిస్ ను కూడా నివారిస్తుంది.

కివి ఫ్రూట్

కివి ఫ్రూట్ లో 1.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇందులోని సాల్యుబుల్ కంటెంట్ గుండె ప్రమాదాల్ని తగ్గిస్తుంది.

డేట్స్

ఖర్జూరంలో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఇన్ సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. ఇందులో మెగ్నీషియం, క్యాల్షియం మరియు విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. ప్రతి ఒక్క ఖర్జూరంలో 1.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

ఆపిల్స్

రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అనే విషయాన్ని వినే ఉంటారు. ఇది కేవలం ఒక సామెత మాత్రమే కాదు. నిజానికి దీనిలో ఫైబర్ మరియు ప్రయోజకరమైన ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఒక సాధారణ పరిమాణం గల యాపిల్ లో 4.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

రాస్బెర్రీస్

రాస్బెర్రీస్ లో విటమిన్ సి, మ్యాంగనీస్ మరియు డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు రాస్బెర్రీస్ లో 8 గ్రాములు డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది ఒబేసిటీ మరియు గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గిస్తుంది.

అరటి పండ్లు

అరటి పండ్లలో ఎక్కువ ఫైబర్ మరియు న్యూట్రిషన్స్ ఉంటాయి. అరటి పండ్లలోని ఫైబర్ క్రోనిక్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

Posted on

Post pregnancy Diet in Telugu – డెలివరీ తర్వాత తినకూడని ఆహార పదార్థాలు

శిశువు పుట్టిన తరువాత చాలా మంది బాలింతలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవటం మానేస్తారు. సరైన పోషక ఆహారం తినకపోవడం వలన ఎక్కువ బీపీ మరియు డయాబెటిస్స్ లాంటి సమస్యలు ఎదురవుతాయి. అంతే కాదు బాలింతలు తినకూడని కొన్ని ఆహారపదార్థాలు కూడా ఉన్నాయి. వాటి వివరాలను చూద్దాం.

నివారించవలసిన ఆహారాలు

వేయించిన పదార్థాలు

నూనెలో బాగా వేయించిన పదార్థాలలో ఎక్కువ కేలరీలు ఉంటాయి ఇవి కొవ్వును పెంచి శరీరం లావు అయ్యేందుకు కారణం అవుతాయి.

ప్రాసెస్స్ చేయబడిన ఆహార పదార్థాలు

మనం మార్కెట్లో ఎన్నో ఆహార పదార్థాలను ప్రాసెస్స్ చేసి ప్యాక్ చేసి అమ్మడం చూసే ఉంటాము, ముఖ్యంగా మాసం మరియు చేపలు. ఇవి తొందరగా చెడిపోకుండా ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ ని మరియు సోడియంను ఎక్కువగా కలుపుతారు. ఇవి చాలా హానికరమైనవి, వీటిని తినడం వలన బీపీ అధికరిస్తుంది మరియు మీ శరీరం యొక్క హోమియోస్టాసిస్ పై ప్రభావం చూపుతుంది.

ఆల్కహాల్

బాలింతలు మద్యం సేవించకూడదు. ఇది మీ శరీరానికి హాని కలిగించటమే కాకుండా శిశువుకు మీరు ఇచ్చే పాలలో చేరి వారి పెరుగుదలపై ప్రభావం చూపుతుంది.

పాలు

పాలు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ బాలింతలు తక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది మీరు శిశువుకు ఇచ్చే పాలలో చేరి మీ శిశువు యొక్క శరీరంలో లాక్టోజ్ అసహనాన్ని పెంచగలదు. పాలకు బదులుగా తక్కువ కొవ్వు కలిగిన పెరుగును తీసుకోండి.

కెఫీన్

కెఫీన్ మీకే కాదు మీ శిశువు యొక్క నిద్రను కూడా భంగ పరుస్తుంది, అంతే కాదు శిశువుకు చిరాకు మరియు ఒత్తిడిని కలిగిస్తుంది.

కారమైన ఆహార పదార్థాలు

బాలింతల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో కారమైన మరియు క్యాప్సైసిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణం అవటం చాలా కష్టం. ఇది మీ శరీరం యొక్క ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. అంతే కాదు మీరు ఇచ్చే పాల ద్వారా ఈ సమస్యలు శిశువుకు కూడా కలగచ్చు. వారికి అనేక కడుపు నొప్పి సమస్యలు కూడా రావచ్చు.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

 • బాలింతలు రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు త్రాగాలి.
 • శిశువు పుట్టిన తరువాత శరీరం యొక్క బరువు మెల్లగా తగ్గుతుంది, కావున సహనంతో ఉండాలి. తొందరగా తగ్గాలని ఎక్కువ శ్రమకరమైన వ్యాయామాలను చేయకూడదు.
 • కొద్దిగా వ్యాయామాలతో పాటు సరైన డైట్ ని కూడా పాటించండి.
 • ఎక్కువగా పచ్చని కూరగాయలు మరియు ఆకు కూరలను తినండి. కానీ కాలీఫ్లవర్ లాంటి వాయువును పంచే ఆహారాలను నిరోధించండి.