Posted on

Potassium rich foods in Telugu – పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు

శరీరం యొక్క పెరుగుదలకు మరియు ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని విటమిన్లు మరియు మినరల్స్ చాలా అవసరం. మన శరీరంలో తగిన మోతాదులలో ఉండవలసిన మినరల్స్ లో పొటాషియం ముఖ్యమైనది. కొంత మంది పొటాషియం లాంటి అవసరమైన మినరల్స్ కన్నా సోడియం ఎక్కువగా తీసుకుంటారు. దాని వలన మీ బీపీ పెరుగుతుంది. సోడియంను తక్కువగా తీసుకుంటే గుండె ప్రమాదాలు రాకుండా ఉంటుంది. పొటాషియం ఒక అద్భుతమైన మినరల్. ఇది మీ శరీరంలోని రక్త కణాలను ఆక్సిడేషన్ వలన కలిగే నష్టాలనుండి కాపాడుతుంది. ఏ ఒక్క మినరల్స్ ని అయినా కావల్సినంత మోతాదులోనే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవటం మంచిదికాదు.

పొటాషియం వలన లాభాలు, లోపం యొక్క లక్షణాలు మరియు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఈ వ్యాసంలో చూద్దాం.

మనకు పొటాషియం ఎందుకు అవసరం?

మన శరీరానికి ప్రతిరోజూ 2500 మిల్లీగ్రాముల పొటాషియం అవసరం. ఇది రక్తపోటు(బీపీ), ఎముకల బలం, గుండె కార్యాచరణ మరియు కండరాల యొక్క కార్యాచరణలలో ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. దీని లోపం వలన పై చెప్పిన విషయాలలో మీరు ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు.

పొటాషియం లోపాల లక్షణాలు

 • నిర్జలీకరణముతో(డీహైడ్రేషన్) పాటు అధిక చెమట పుట్టడం.
 • చేతులు, కాళ్లు తిమ్మిరి ఎక్కడం మరియు దురదగా ఉండటం.
 • హృదయ స్పందన ఇర్రెగులర్ గా ఉండటం.
 • తరచుగా శరీరంలో అలసట మరియు బలహీనత కలగటం.
 • భ్రాంతి( హాలుసినేషన్) లేదా ఊహాత్మక సంకేతాలు.
 • వాంతులు లేదా వికారం కలగటం.
 • తరచూ దప్పికగా ఉండటం.
 • తరచుగా మూత్ర విసర్జన రావటం.
 • తక్కువ రక్తపోటు(లో బీపీ).
 • మూర్ఛపోవటం.
 • సుదీర్ఘ కాలపు డిప్రెషన్.
 • ఈటింగ్ డిసార్డర్, లిబిడో, డీహెడ్రల్, కండరాలలో సమస్యలు మరియు ఇతర ప్రమాదాలు కలగచ్చు.

పొటాషియం రిచ్ ఫుడ్స్

పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. టమోటా, హనీడ్యూ పుచ్చకాయ, పాలు,  నారింజపండు, పాలకూర, బీన్స్, ఖర్జూరం, బంగాళదుంప, నేరేడుపండు మరియు కర్బూజాలలో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

బీట్ రూట్ ఆకులు

మనం సాధారణంగా బీట్ రూట్ దుంపలను తిని వీటి ఆకులను విసిరేస్తారు. కానీ, ఈ బీట్ రూట్ ఆకులలో పొటాషియం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇవి కొంచెం చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ప్రయోజనకరమైనది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి.

పెరుగు

పెరుగును ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు లేదా దుకాణాలలో కొనుగోలు చేయవచ్చు. దీనిని మీ రోజూ ఆహారాలలో చేర్చుకోవటం వలన కావల్సినంత పొటాషియం శరీరానికి లభిస్తుంది. పెరుగు రెండు రుచులలో ఉంటుంది, పుల్లని పెరుగు మరియు తీపి పెరుగు. తియ్యని పెరుగులో పొటాషియం తక్కువగా మరియు పుల్లని పెరుగులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

పండ్లు

ఈ పళ్ళను రోజూ తినడం వలన మీ ఎముకలు ధృఢంగా మరియు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉన్నందున ఇది మీ పళ్ళకు కూడా బలాన్ని ఇస్తుంది.

మొలాసిస్

మొలాసిస్ రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఒక ఆహార పదార్థం. ఇది చూసేందుకు తేనెలా ఉంటుంది, దీనిని చక్కెరకు బదులుగా వాడుతారు. ఇది చక్కెరకంటే ఆరోగ్యకరమైనది మరియు ఇందులో ఎక్కువ పొటాషియం ఉంటుంది. కాల్షియం మరియు ఐరన్ యొక్క లోపాలు ఉన్నవారు కూడా మొలాసిస్ తీసుకోవటం చాలా మంచిది.

సోయ్ బీన్స్

ఇవి రెండు రకాలుగా మార్కెట్లో లభిస్తాయి, ఒకటి ప్రాసెస్ చేయకుండా పచ్చి సోయ్ బీన్స్, ఇంకో రకం ప్రాసెస్ చేసి ప్యాక్ చేసిన సోయ్ బీన్స్. రెండూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, ప్రాసెస్ చేయని సోయ్ బీన్స్ మరింత ప్రయోజనకరమైనది. అర కప్పు ఉడకబెట్టిన సోయ్ బీన్స్లో 500 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది.

వైట్ బీన్స్

తెల్లని బీన్స్ అరుదైనవి అయినప్పటికీ, ప్రస్తుతం సూపర్ మాల్స్ మరియు పెద్ద కూరగాయల మార్కెట్లో లభిస్తాయి. వీటిని బాగా ఉడికించి ఉప్పు కలుపుకొని తినవచ్చు, లేదా మీరు తయారు చేసే కూరగాయల కూరల్లో వీటిని జోడించవచ్చు.

పొటాషియం యొక్క ప్రయోజనాలు

బ్రెయిన్ హెల్త్

పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అన్ని వయస్సుల వారూ తినాలి. మీ మెదడుకు ఇది చాలా అవసరం. మెదడు చురుకుగా ఉండేందుకు మరియు దృష్టి దీర్ఘంగా మరియు స్థిరంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.

శరీరంలో ద్రవం సంతులన

మన శరీరానికి కావలసిన ద్రవాలు లభించకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. పొటాషియం ఉన్న ఆహారాలను రోజూ తినడం వలన ఈ సమస్య రాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

ఒత్తిడి

ఈ కాలంలో ఎక్కువ పనుల వలన మరియు ఎక్కువ ఉద్రిక్తత వలన ఒత్తిడి పెరుగుతుంది. పొటాషియం ఒత్తిడిని తగ్గిస్తుంది.

శరీర జీవక్రియ

మనం ఆరోగ్యంగా ఉండటానికి శరీరం యొక్క జీవక్రియను అధికరించటం చాలా అవసరం లేకపోతే నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. పొటాషియం జీవక్రియను అధికరించి శరీరం యొక్క శక్తిని అధికరిస్తుంది.

Posted on

Protein rich foods in Telugu – ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు

మన శరీరంయొక్క అభివృద్ధికి ప్రోటీన్స్ స్థూల పోషక పదార్థం. ఎక్కువ ప్రోటీన్స్ శరీరానికి బలాన్ని ఇస్తుంది. ప్రోటీన్ లోపిస్తే కండరాలు క్షీణిస్తాయి. ప్రోటీన్స్ మొత్తం 20 అమైనో ఆమ్లాల(అమైనో ఆసిడ్స్) సేకరణను కలిగి ఉంటుంది. ఇందులోని 8 ముఖ్యమైన (ఎస్సెంషియల్) అమైనో ఆసిడ్స్ ను మనం రోజూ తినే ఆహారం ద్వారా శరీరానికి లభిస్తుంది. మిగిలిన 12 నాన్- ఎస్సెంషియల్ ఆసిడ్స్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. గుడ్లు మరియు మాంసాహారం లాంటి ఆహారాలలో కండరాల నిర్మాణంకు కావలసిన అమైనో ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

కొన్ని ఆహారాలలోని అమైనో ఆసిడ్స్ తొందరగా జీర్ణం అవుతాయి మరికొన్ని నిదానంగా జీర్ణించుకొని శరీరంలో శోషించబడతాయి. ఉదాహరణకు గుడ్లు, ఇది ప్రోటీన్ ఆహారాలలో రాజువంటిది. ఇందులో అన్ని (20) అమైనో ఆసిడ్స్ లు ఉన్నాయి, ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. మరోపక్క పాలు, ఇందులో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇందులోని ప్రోటీన్స్ కొన్ని వేగంగా మరి కొన్ని నిదానంగా అమైనో ఆసిడ్స్ ను విడుదల చేస్తాయి. పాల్లలో ప్రోటీన్స్ మాత్రమే కాదు ఎముకలకు బలాన్ని పెంచే కాల్షియము కూడా ఉంటుంది.

శరీరంయొక్క ప్రతి పనికి ప్రోటీన్స్ చాలా అవసరం. పెద్దలు కానీ పిల్లలు కానీ ప్రోటీన్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండలేరు. ఎన్నో రకాల ఆహారాలలో ప్రోటీన్స్ ఉన్నాయి. వాటిలో మీకు నచ్చినవి ఎంపిక చేసుకొని రోజూ తీసుకోండి.

శాకాహారులకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు

ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలలో కొన్ని పాల్లు, పెరుగు, జున్ను(చీస్), గింజలు (బీన్స్) , కాయధాన్యాలు (లెంటిల్స్) మరియు విత్తనాలు. మరికొన్ని తక్కువ కొవ్వు ఉన్న పదార్థాలు కాటేజ్ చీజ్, గ్రీక్ చీజ్, తెల్లటి పుట్టగొడుగులు, వెన్నతీసిన పాలు ( స్కిమ్డ్ మిల్క్) మరియు నాటో (పులియబెట్టిన సోయాబీన్స్). పాల్ల ఉత్పత్తులే కాకుండా పళ్ళలో మరియు గింజలలో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.

ధాన్యాలు

ధాన్యాలు ప్రధానమైన పోషక ఆహార పదార్థం. ఇది శరీరానికి కావలసిన కేలరీలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు మరియు ప్రొటీన్లను అందిస్తుంది. ఇతర ధాన్యాలకన్నా బఠానీలు, రాజ్మా మరియు పెసర పప్పులు లాంటి తృణధాన్యాలలో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. రిఫైన్డ్ (సుద్దిచేసిన గింజలు) గింజలను పాస్తాలు, పాన్ కేక్లు, స్మూతీస్ మరియు బ్రెడ్లు చేసేటప్పుడు వాడవచ్చు. గోధుమ బీజ, వండిన ఓట్స్ తవుడు, బియ్యం తవుడు మరియు ఓట్స్ లో కూడా ప్రోటీన్స్ ఎక్కువుగా ఉంటుంది.

కూరగాయలు

కూరగాయలు ఉత్తమ ప్రోటీన్ ఆహారాలు. మొలకెత్తిన బీన్స్, బటానీలు మరియు కాయధాన్యాలు (లెంటిల్స్) ప్రోటీన్లకు మూల పదార్థాలు. మరికొన్ని-వండిన లిమా బీన్స్, ఆకుపచ్చ బటానీలు, మొక్కజొన్న, బ్రొక్కొలి మరియు పుట్టగొడుగులు.

పండ్లు

ప్రోటీన్ పదార్థాలలో మరో ముఖ్యమైన ఆహారం తాజా పండ్లు. కూరగాయలతో పోల్చుకుంటే పండ్లలో తక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. రైసిన్లు, అక్రోట్లు, జీడిపప్పులు లాంటి ఎండిన పండ్లలో(డ్రై ఫ్రూట్‌స్) ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. జల్దారు, జామ పండ్లు, బొంత పళ్ళు(మల్బెర్రీస్) , బ్లాక్బెర్రీస్, స్టార్ ఫ్రూట్‌, కుంక్వాట్స్, పీచ్ పండు, దానిమ్మ పండ్లు మరియు ద్రాక్ష పండ్లలో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.

గింజలు

బాదాం, పిస్తా పప్పులు, అక్రోట్, జీడిపప్పులు మరియు బఠానీలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు ఇందులో సోడియం మరియు పొటాషియం కూడా ఉన్నందున వీటిని తిన్న వెంటనే మనకు కావలసిన బలాన్ని తక్షణమే ఇస్తుంది మరియు చెమట వలన శరీరం నుండి తొలగిపోయిన ఎలెక్ట్రోలైట్స్ ను సరఫరా చేస్తుంది. చాలా గింజలలో విటమిన్ ఇ, మాంగనీస్, మెగ్నీషియం మరియు ఇతర ముఖ్యమైన పోషక పదార్థాలు ఉన్నాయి.

ఓట్స్

ఓట్స్ అన్నింటికంటే ఆరోగ్యవంతమైన ధాన్యాలు. ఇందులో అనేక పౌష్టిక పదార్థాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం మరియు విటమిన్ B1 ఎక్కువగా ఉంటాయి. వీటిని తెల్లవారు జామున అల్పాహారంగా భుజించడం మంచిది.

కాటేజ్ చీజ్

ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటమే కాకుండా తక్కువ కొవ్వు మరియు తక్కువ కేలరీలు ఉన్నందున చాలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. కాల్షియం, ఫాస్ఫరస్(భాస్వరం), సెలీనియం మరియు విటమిన్ బి12 ఇందులోని ఇతర పోషక పదార్థాలు.

బ్రొక్కొలి

ఇతర కూరగాయలకన్నా ఇందులో ఎక్కువ ప్రోటీన్లు తక్కువ కేలరీలు ఉన్నాయి. అంతే కాదు ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ మరియు పొటాషియం కూడా ఎక్కువగా ఉన్నాయి.

క్వినోవ

సమీప కాలంలో చాలా ప్రముఖమైన ఒక ఆహార పదార్థం క్వినోవ విత్తనాలు. వీటిలో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఇందులో యాంటి-ఆక్సిడెంట్ ఉన్నందున ఆరోగ్యానికి చాల మంచిది.

గ్రీక్ పెరుగు

ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. ఇందులో చాలా పోషక పదార్థాలు ఉన్నాయి. ఇది మిఠాయి దుకాణాలలో కూడా దొరుకుతుంది. దీనిని విడిగానే తినవచ్చు, చాలా రుచిగా ఉంటుంది.

యెహెజ్కేల్ బ్రెడ్

ఇది మొలకెత్తిన తృణధాన్యాలతో తయారు చేయబడినది. వీటిని సోయాబీన్స్, బార్లీ, చిరు ధాన్యాలు మరియు గోధుమతో కూడా తయారు చేస్తారు. ఈ బ్రెడ్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది.

గుమ్మడికాయ గింజలు

మనం రోజూ వంటలో గుమ్మడికాయను ఉపయోగిస్తూ ఉంటాము. కానీ వీటి గింజలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని మనకు తెలియదు. ఇందులో ప్రోటీన్స్ మాత్రమే కాదు, జింక్, ఐరన్ మరియు మెగ్నీషియం లాంటి పోషక పదార్థాలు కూడా ఉన్నాయి.

మాంసాహారుల కోసం ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు

మాంసం మరియు చేపలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. తూర చేప(ట్యూనా), సాల్మోనాండ్ హాలిబుట్ చేప, స్నాపర్, పెర్చ్ లాంటి చేపలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది. మాంసంలో కోడిమాంసం, ఆవు మాంసం మరియు పంది మాంసాలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది.

కోడిమాంసం లోని రొమ్ములు

ఇందులో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని రుచికరమైన ఆహారంగా వండుట చాలా సులభం.

చిన్నరొయ్యలు

ఇందులో ఎక్కువ ప్రోటీన్స్ మరియు తక్కువ కేలరీలు ఉన్నందున చాలా ఆరోగ్యకరమైన ఆహారం.

Posted on

వక్షోజాల పరిమాణం పెరగాలంటే – Breast enhancement tips in Telugu

చాలా మంది ఆడవాళ్ళు ప్రత్యేకంగా యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలు వారి వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయని తమ వక్షోజ సంపద వృధ్ధి జరగాలంటే ఏం చేయాలి అని సతమతమవుతుంటారు. దీనికి కారణం వారిలో ఈస్ట్రోజన్ శాతం తక్కువగా ఉందని అర్ధం. యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిలకు వక్షోజాలు చక్కగా వృధ్ధి చెందాలంటే ఈ ఈస్ట్రోజన్ చాలా  ముఖ్యం. చాలా మంది ఆడవాళ్ళల్లో సెక్స్ కోరికలు చాలా తక్కువగా ఉంటాయి. దీని వల్ల వారి సెక్స్ జీవితం చాలా అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఇందుకు కారణం ఆడవారిలో ఉందే ఈస్టోజన్ శాతం తక్కువగా ఉండటమే..!  అస్సలు ఈస్టోజన్ మోతాదు ఎందుకు తగ్గిపోతుంది? ఈస్టోజన్ కొన్ని హార్మోన్ల సముదాయం. ఇది సెక్సువల్ హార్మోన్స్ అభివృధ్ధి అయ్యేలా చేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ అండాశయంలో ఉత్పత్తి అవ్వటమే కాక అడ్రెనల్ గ్రంధులు, కొవ్వు సెల్ల్స్ లో కూడా ఉత్పత్తి అవుతుంది. మెన్స్ట్రువల్ సైకిల్ లో ఈస్టోజన్ గర్భాశయ లైనింగ్ ను అభివృధిని నియంత్రిస్తుంది. ఒకవేల ఆడవారిలో అండం ఉత్పత్తి కాకపోతే ఈస్ట్రోజన్ క్రమక్రమంగా తగ్గిపోయి మెన్స్ట్రువల్ సైకల్ మొదలవుతుంది. ఈస్ట్రోజన్ ఎముకల అభివృధ్ధికి తోడ్పడుతుంది. ఇది విటమిన్-డి, కాల్షియం, ఇతరాల తో పని చేస్తుంది. ఇవి శరీర అభివృధ్ధిలో భగంగా ఎముకల విరుగుదల అలాగే పునర్ణిర్మానం అయ్యేలా చేస్తాయి. ఈస్ట్రోజన్ ఆడవారిలో మొత్తం రక్తప్రసరణ లో ఉంటుంది. ఇది అభివృధ్ధిపై మాత్రమే కాదు అలాగే జీవక్రియపై, సెక్సువల్ ఫంక్షన్, అత్యవసర చర్యలు, కణజాల ప్రక్రియ, పునరుత్పత్తి, ఆహర ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. ఈస్ట్రోజన్ కొవ్వు స్థాయిలను, ఎముకల అభివృధ్ధిని సంతులనాన్ని పర్యవేక్షితుంది. ఇది ప్రెగ్నెన్సీ సమయంలో ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. పిందం పెరుగుదల సమయాలలో పరిపక్వతను, అలాగే మాయ అంటే ప్లసంటా ప్రక్రియను సరి చేస్తుంది. ఈ సమయంలో వక్షోజాలలో కూడా మార్పు వస్తుంది. ఈ గర్భిణీ సమయంలో అదీ మొనోపాజ్లో ఈస్ట్రోజన్ తగ్గిపోయి బాగా ఆడవారిలో సమస్యలు ఏర్పడతాయి. దీనివల్ల ఆడవారిలో మూర్త సంబంధ సమస్యలు, వక్షోజాలలో నొప్పి మొదలైనవి ఏర్పడతాయి.

కాయగూరలు మరియు చిక్కుళ్ళు లో ఈస్ట్రోజన్ పుష్కలం

బీట్రూట్, క్యారెట్, దోస, బఠాణీలు, పీప్పెర్, బంగాళాదుంపలు, గుమ్మడికాయ, స్క్వాష్, వెల్లుల్లి, చిలగడదుంప, రెడ్ బీన్స్, సోయా బీన్స్ మొదలగునవి.

ఈరన్ స్థాయిలు సోయ బీన్స్ లో అధిక శాతంలో ఉంటాయి. సోడియం, పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సోయాబీన్స్ ను ఒక స్నాక్ లా వాడాలి. మీరు అలా తినలేకపోతే సలాడ్లోనో, సూప్లోనూ తినండి.

పండ్లు, మూలికలు

ఈస్టోజన్ పండ్లలో ఎక్కువగా ఉంటుంది. టొమాటోస్, యాపిల్, చెర్రీస్, రేగు, దానిమ్మ, బొప్పాయి, రెవల్చిని.
మూలికల్లో ఫెన్నెల్ విత్తనాలు, సొంపు, పార్స్లే మొదలగునవి.

విత్తనాలు మరియు దెయిరీ

నువ్వుల గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్, గుడ్డ్లు.
నువ్వుల గింజలో మినరల్స్, ఫైబర్ బాగా ఉంటాయి. నువ్వుల గింజలు, నువ్వుల నూనె రెండింటిలో ఫైటోఈస్ట్రోజన్లు బాగా ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్ లో ఈస్ట్రోజన్ పుష్కలం

డ్రై ఫ్రూట్స్ లో చాలా ఎక్కువగా ఈస్ట్రోజన్ స్థాయిలు ఎక్కువ. వీటిలో డేట్స్, ప్రూన్స్, అప్రికోట్స్. డ్రై ఫ్రూట్స్ లో ఫైటో ఈస్ట్రోజన్స్ బాగా ఉండటం వల్ల ఈస్ట్రోజన్ స్థాయిల్ని పెంచుతుంది.

సోయా ఫుడ్స్

సోయా బీన్స్ లో పూర్తిస్థాయిలో ఈస్ట్రోజన్ స్థాయిలు చాలా ఎక్కువ. ఆడవాళ్ళు తీసుకోవాల్సిన ఆహారంలో ఇవి ఎక్కువగా ఉంటే చాలా మంచిది. సోయా బీన్స్ లో నుంచీ సోయా నూనె, సోయా నూడిల్స్, సోయా వెచ్చని కోర, సోయా పాలు, సోయా గోధుమ పిండి, సోయ పెరుగు, సోయా డైరి చీజ్.

టోఫు

దీనినే బీన్ పెరుగు అని కూడా అంటారు. దీనిలో సోయ పాలు ఉండటం వల్ల చక్కగా పోషకాలు ఉంటాయి. వీటిలో ఫైటో ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రతీ ద్రవ ఆహారంలో ఈ టోఫును వేసుకోవాలి. ఇది శరీరం లో హార్మోన్స్ ను అభివృధ్ధి చేస్తుంది.

అవిసె గింజలు

అవిసె గింజల్లో ఈస్ట్రోజన్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది కాలేయం పనితీరుని సంరక్షిస్తాయి. పొడి చర్మాన్ని నివారిస్తుంది. సోరియాసిస్ ను నివారిస్తాయి. ఎక్జెమాని నివారిస్తాయి. రకరకాల కాన్సర్ లను, గుండె పోటును రాకుండా చేస్తాయి. అవిసె గింజల్లో ఇంకో ప్రత్యేకత ఎంటంటే ఆస్థమాని నివారిస్తుంది.

అల్ఫాల్ఫా

మీరు మీ ఈస్ట్రోజన్ స్థాయిల్ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు మీ ఆహారంలో ఖచ్చితంగా ఈ ఆల్ఫాల్ఫా ని కూడా కలిపి వాడాలి. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్ మీ హార్మోన్ల పెరుగుదలని పెంచుతాయి. వీటిలో చాలా ఎక్కువ శాతంలో ఈస్ట్రోజన్ ఉంటుంది. అంతేకాక సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఎమీ ఉండవు. కొలెస్టరాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది.

హ్యూమస్

దీనిని తెలుగులో క్రుళ్ళిపోయిన స్థావరపు గుజ్జు అని అంటారు. మరిగించిన లేదా ముద్ద చేసిన శనగలు అంటే వీటినే చిక్పీస్ అంటారు. వీటిలో ఈస్ట్రోజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల హ్యూమస్ లో దాదాపు 993 ఎం.సి.గి ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి.

టెంపే

ఇది సోయా బీన్స్ నుంచీ వచ్చినది. దీనిలో ఎవైతే ప్రోటీన్స్ , మినరల్స్ కలిగి ఉంటాయో ఆ ఐరన్,మెగ్నీషియం దీనిలో పుష్కలంగా ఉంటాయి. దీనిని వారం లో కొన్ని సార్లు తినండి. మీ ఈస్ట్రోజన్ స్థాయి పెరుగుతుంది.

ఊక ధాన్యం

దీని వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయి. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే దీనిలో పుష్కలంగా ఫైటో ఈస్ట్రోజన్ విలువలు ఎక్కువ. అంతేకాక ఇది శరీరం లోని హార్మోన్లను అభివృధ్ధి చేయటమేకాక ఫైబర్ కంటెంట్ ని పెంచుతుంది.
సహజసిధ్ధంగా ఈస్టోజన్ స్థాయిల్ని సోయా, బార్లీ, శనగలు, మెంతులు ఇలా ఎక్కువగా పెంచుతాయి. అలాగే కొన్ని ఆహారపదార్ధాలైన పుట్టగొడుగులు, యాపిల్స్, క్యారెట్, కాలిఫ్లవర్, దోస, సన్ ఫ్లవర్ సీడ్స్, ఓట్స్, బీన్స్, రెడ్ బీన్స్, టొమాటో, ఆలివ్స్, పసుపు, నేవీ బీన్స్, మొదలగునవి. వీటిని ఒక క్రమ పధ్ధతిలో చక్కగా తీసుకోవాలి.

మీ ఆహారంలో ఈస్ట్రోజన్ స్థాయిల్ని పెంచుకునే దిశగా

మీ ఆహార నియమాలలో ఈస్ట్రోజన్ స్థాయిల్ని పెంచుకునే దిశగా ప్రయత్నించాలి. రోజూ 50 నుంచీ 60 మిల్లి గ్రాముల ఈస్ట్రోజన్ అందే ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. రోజూ మీ ఆహార దినచర్య లో ఒక టేబుల్ స్పూన్ సోయా పెరుగు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

ఎప్పుడు ఈస్ట్రోజన్ ఆహరం తినకూడదంటే

ఆడవాళ్ళు మెనోపాజ్ లో ఉన్నపుడు, ప్రీ మెన్శ్త్రువల్ సిండ్రోం(పీ.ఎం.ఎస్)వల్ల నొప్పి వచ్చినప్పుడు, లేదా రొమ్ము క్యాన్సర్ బయటపడినప్పుడు, అండాశయ తిత్తి, కంతి సమయాల్లో మత్రం ఈస్ట్రోజన్ ఫుడ్ మానాలి. ఎందుకంటే దీని వల్ల అవి ఎక్కువయ్యే అవకాశం ఉంది. కొన్ని పదార్ధాలు ఈస్ట్రోజన్ స్థాయిల్ని నివారిస్తాయి. అవేంటంటే క్యాబేజీ, బ్రోకోలి, చెర్రీస్, గ్రీన్ బీన్స్, పుచ్చకాయ, ఉల్లి, బేరి, పైన్ ఆపిల్, తెల్ల అన్నం, తెల్ల గోధుమ పిండి, కర్రపెండలం.

estrogen_rich_foods

Posted on

గర్భిణీ స్త్రీలకు..మెరుగైన ఆహారపదార్ధాలు – Healthy foods for pregnant women

మాతృత్వం ఆడ జన్మకు ఓ వరం. అయితే ఈ మాతృత్వం పొందేందుకు స్త్రీలు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవలసివస్తోంది. ప్రత్యేకంగా గర్భం దాల్చిన దగ్గర నుంచీ గర్భధారణ అయ్యేంతవరకూ తీసుకునే ఆహారమే చక్కని శిశువు జన్మినిచ్చేలా చేస్తుంది. అయితే చాలా మంది స్త్రీలకు ఏం ఏం తినాలో అంటే పోఉష్టికాహారం ఏం తీసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకే మీ తెలుగు టిప్స్ అందిస్తోంది గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన ఆహార పదార్ధాలను.. అవేంటో చూద్దామా..!
ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదీ ఆహారం అంటే ఈ సమయంలో తీసుకునే పౌష్టికాహరమే గర్భధారణ సమయంలో మిమ్మల్ని కాపాడుతుంది. గర్భంతో ఉన్నప్పుడు కాల్షియం, ప్రోటీన్లతో కూడిన ఆహారం ఉండాలి. అప్పుడే శిశువు ఎముకలు, కణజాలాలు బాగా వృధ్ధి చెందుతాయి. బిడ్డ చక్కని పెరుగుదలకు ఫోలిక్ యాసిడ్ కూడా అధిక మోతాదులో అవసరం. ఇది అధికంగా ఉండటం వల్ల జన్మించాక ఎదురయ్యే సమస్యలను నివారించవచ్చు. అంతేకాక ఎర్రరక్తకణాలు గర్భానికి అవసరమయ్యే ఆక్సీజన్ ను తీసుకెళ్ళటానికి ఐరన్ చాలా అవసరం. ఇందుకు మీకు మీరే మీ ఆహారంపై శ్రధ్ధ తీసుకోవాలి. ఎందుకంటే మీరు తీసుకునే పౌష్ఠికాహారమే మీ బిడ్డ ఆరోగ్యానికి బాటలు వేస్తాయి. ఉదాహరణకు ప్రోటీన్స్, కాల్సియం రెండూ మీ బిడ్డ కణజాల అభివృధ్ధికి, ఎముకల అభివృధ్ధికి దోహదం చేస్తాయి. ఇక ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల మీ బిడ్డ నరాలకు సమబంధించిన సమస్యలు రాకుండా చేస్తుంది.

గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకోవలసిన ముఖ్య ఆహార పదార్ధాలు

బీన్స్

మీ ఆహారంలో ఎక్కువగా బీన్స్ ఉండేలా చూసుకోవాలి. బ్లాక్ బీన్స్, సోయా బీన్స్, పింటో బీన్స్, కాయ ధాన్యాలు, బొబ్బర్లు లాంటివి ఎక్కువగా వీటిని రసం తో అలాగే మిరపతో, కూరలుగా, సలాడ్లతో తీసుకోవాలి. వీటి వల్ల పౌష్టికాలు, కాల్షియం, ఫోలాట్, ఖనిజాలు, జింక్ లభిస్తాయి.

బలవర్ధకమైన ధాన్యాలతో కూడిన అల్పాహారం

మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమేమంటే మీరు గర్భం దాల్చిన దగ్గర నుంచీ మీకు ఫోలేట్ చాలా అవసరం. దీని వల్ల మీ గర్భంలోని శిశువు చాలా బలంగా ఆరోగ్యవంతం పెరుగుతుంది. దీని అవసరం మొత్తం 9 నెలలు అవసరమే. ఇక ఈ ఫోలేట్ మీకు బాగా ఉండాలంటే రోజూ మీరు తీసుకునే ఆహారంలో బలవర్ధకమైన ధాన్యాలలో 400 గ్రాములు ఉండేలా చూసుకోవాలి. అంతేకాక మీ సాధారణ ఆహారంలో రోజూ 200 గ్రాములు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయాలంటే ఈ ఫోలేట్ ఎక్కువగా అస్పరాగస్ అనే పదార్ధం దీనినే పిల్లి పిసర అని కూడా అంటారు. దీనిలో ఎక్కువగా ఫోలేట్ ఉంటుంది. అంతేకాక బొబ్బర్లలో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది.

ధాన్యం

ధాన్యం అంటే రొట్టెలు, ధాన్యాలతో కూడినవి. ఇవి చాలా బలవర్ధకమైనవి. వీటిలో ఫోలిక్ యాసిడ్, ఖనిజాలు అత్యధికంగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా వీటిని తీసుకోవటం మంచిది. ఉదయాన్నే ఆహారంగా ఓట్మీల్, అదేవిధంగా ధాన్యంతో కూడిన సాండ్విచ్ మధ్యాహ్న ఆహరాంగా, మొత్తం గోధుమ తో కూడిన పాస్త లేక కృష్ణ వరి రాత్రికి ఆహారంగా తీసుకోవాలి.

గుడ్డు

వీటిలో మీకు కావల్సినంతా ప్రోటీన్లు, అమినో యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శిశువు పెరుగుదలకి చాలా ముఖ్యం. గుడ్డ్లలో డజనుకు పైగా విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. కాని మీరు ఉడికించని అలాగే పచ్చిగుడ్లు మాత్రం తీసుకోవద్దు.

బెర్రీలు

బెర్రిలలో చాలా గుణాలున్నాయి. బ్లూ బెర్రీలు అంటే ఫాల్సా, రాస్ బెర్రీలు, బ్లాక్ బెర్రీలు వంటివి చాలా రుచికరంగా కూడా ఉంటాయి. వీటిలో ఉండే పొటాషియం, ఫోలేట్, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.

అరటి

అరటి చాలా త్వరగా శక్తినిచ్చే పండు. మీకు చక్కటి బలం అందాలంటే మీ అల్పాహారంలో ముక్కలుగా కోసి చక్కగా తినవచ్చు. లేదా ఆరెంజ్ జ్యూస్ తో పాటూ తీసుకోవచ్చు. పెరుగుతో, బెర్రిలతో, ఐస్ తోనైనా తీసుకోవచ్చు.

చేప

దీనిలో ఒమేగా-3 క్రొవ్వు పదార్ధ్ధాలు ఉంటాయి. దీనిని తీసుకోవటం వల్ల క్రొవ్వు పదార్ధ్ధాలు పెరగటమే కాక విటమిన్- బీ చక్కగా లభిస్తుంది. సాల్మన్ చేప దీనినే పండుగప్ప అంటారు. ఇది చక్కగా పాదరస, కాల్చినా, ఉడికించినా, సలాద్ రూపంలోనైనా తినవచ్చు. మీరు వారానికి 12 ఔన్స్లు పండుగప్ప చేపను తీసుకుంటే చాలా మంచిది.

పెరుగు

పెరుగు చాలా రకాల ప్రోటీన్లను కలిగి ఉంటుంది. దీనిని కొవ్వు శాతం ఎక్కువగా లేకుండా అంటే చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. లేదా చక్కగా పండ్లతో పాటూ తీసుకుంటే మంచిది. పెరుగు మీ శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. అంతేకాక ఈ పెరుగు వల్ల మీ శిశువు ఎముకలు నరాలు చక్కగా ఎదుగుతాయి. అంతేకాక మీ జీర్ణవ్యవస్థ ఖరాబు కాకుండా చేసి జీర్ణ ప్రక్రియని సరిచేస్తుంది.

చిలగడ దుంప

వీటినే ఆంగ్లంలో స్వీట్ పొటాటోస్ అంటారు. ఇవి ఆరెంజ్ రంగులో ఉండటానికి కారణం దీనిలో ఉండే క్యారోటొనాయిడ్స్. ఇవి చాలా బలవర్ధకమైనవి. ఇవి మీకు విటమిన్ ఎ ను పుష్కలంగా ఇస్తాయి. అంతేకాక వీటిలో విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. దీనిని స్నాక్ గా వాడవచ్చు.

అవకాడోలు

అవకాడోలలో విటమిన్-సి, పొటాషియం, విటమిన్ బి-6 ఉండటం వల్ల మీ బిడ్డ పెరుగుదల అంటే ఎముకల ఎదుగుదల, మెదడు పెరుగుదల పెంచుతాయి. ఇవి చక్కగా మీ అభివృధ్ధికి కృషి చేస్తాయి. అవకాడోలలో క్రొవ్వు పదార్ధాలే కాక కాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి తినటానికి చాలా రుచికరంగా ఉంటాయి. ఇవి బరువు పెరిగేందుకు చక్కగా ఉపయోగపడతాయి.

ఆకుకూరలు

ఆకుకూరల్లో చాలా విటమిన్లు ఉంటాయి. ప్రధానంగా బచ్చలకూర, కాలే వంటి వాటిల్లో పౌష్టికాలు ఉదాహరణకు విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-కె బాగా దొరుకుతాయి.

గింజలు

గింజలు విటమిన్-ఇ, ఖనిజాలని కలిగి ఉంటాయి. వీటిలో అక్రోట్లు ప్రోటీన్లను, ఫైబర్ ను కలిగి ఉండి మీ బిడ్డ ఎదుగుదలకు దోహదం చేస్తాయి.

ఓట్స్

ఓట్స్ లో ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్-బి, ఐరన్, ఖనిజాలు ఉంటాయి. అందువల్ల రోజూ ఉదయాన్నే అల్పాహారంగా వీటిని తీసుకోవాలి. ఒక బౌల్ లో వేసి పాలతో వీటిని తీసుకోవాలి.

క్యారెట్స్

క్యారెట్స్ లో విటమింప్-ఎ ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల మీ బిడ్డ కళ్ళు, పళ్ళు, ఎముకల ఎదుగుదల చక్కగా ఎదుగుతాయి. వీటిలో విటమిన్-సి, విటమిన్- బి-6 కూడా ఉంటాయి.

మామిడి

మామిడిలో అధికంగా విటమిన్-ఎ, విటమిన్-సి ఉంటాయి. దీనిలో అధికంగా పొటాషియం ఉంటుంది. మామిడిని సూప్ గా చేసుకుని తింటే ఆ రుచిని మీరు ఆస్వాదించవచ్చు.

బ్రోకలీ

ఇది అమెరికన్ వెజెటెబుల్. దీనిలో విటమిన్-ఎ, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇది బిడ్డ ఎముకుల ఎదుగుదల దోహదం చేయటమే కాక ఫోలిక్ యాసిడ్ ను కూడా ఇస్తుంది. దీనిని ఏదైనా రెసిపీలో కలపవచ్చు. మీ కిచెన్ లో పాస్తా లో కలిపి చేసుకోవచ్చు.

పాల పదార్ధాలు

పాల పదార్ధాలు ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంచివి. పాలు, వెన్న, పెరుగు మొదలైనవి ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంచిది. కాబట్టి వీటిని విరివిగా వాడితే కాల్షియం, పౌష్టికాలు లభిస్తాయి.

ఆహర పదార్ధాలు తీసుకునేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆహారం తీసుకునేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క ఆహార విషయంలోనే కాదు. తీసుకునే ఆహార పదార్ధాల శుభ్రత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాల పరిశుభ్రత లేకపోతే మీకు ఎంతో ప్రమాదం. అలాగే మీరు తీసుకునే ఆహారం అంటే పండ్లు, కూరగాయలు మొదలైన వాటిని శుభ్రంగా కడిగి మాత్రమే తినాలి. అంతేకాక మాంసం కనుక వండుకున్నట్లయితే మాంసాన్ని చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఏరకమైన క్రిములూ లేకుండా ఉండాలంటే ఇలా చేస్తే ఉత్తమం.

ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పోషకాలు

1. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేడ్స్, క్రొవ్వు పదార్ధాలు, ఐరన్, విటమిన్-సి తో కూడిన పదార్ధాలని ఎక్కువగా తీసుకోవాలి. ఇలా తీసుకోవటం తల్లికీ, బిడ్డకీ క్షేమం.
2. ధాన్యాలు అంటే పప్పులు, పప్పు ధాన్యాలు, గింజలు చక్కని శక్తిని ఇచ్చే పదార్ధాలు. మాంసం తినని వారు వీటిల్ని తినటం వల్ల ఆ శక్తి చేకూరుతుంది.
3. కూరగాయలు ఫైబర్, విటమిన్స్, కాల్షియం, మినరల్స్ ని ఇస్తాయి. వీటిని తినటం మంచిది.
4. మాంసం, చేపలు చాలా ప్రోటీన్లను ఇస్తాయి.
5. మంచి నీరు, పండ్ల రసాలు శరీరానికి కావల్సిన శక్తినివ్వటమే కాక గర్భిణీ స్త్రీకి కావాల్సినంత బలాన్నిస్తాయి.
6. ఒక మంచి క్రొవ్వు లేని నూనెలంటే అవి శాఖాహార నూనెలే. ఎందుకంటే వీటిలో ఎక్కువ క్రొవ్వు ఉండదు కాబట్టి.
7. చేప అదీ పండుగప్ప అంటే సాల్మన్ చేప ఇది ఒమేగా-3 క్రొవ్వు పదార్ధాలను ఇస్తుంది. ఇది గర్భస్థ శిశువుకు చాలా శక్తినిస్తుంది.
8. బీన్స్-ఇవి చాలా రకాలుగా ప్రెగ్నెన్సీలో ఉపకరిస్తాయి. వీటిలో ఫోలేట్, ఐరన్, కాల్షియం, జింక్ ఉంటాయి.
9. చిలగడదుంపల్లో విటమి-సి, ఫోలేట్, ఫైబర్ ఉంటాయి.
10. పాప్ కార్న్, ధాన్యాలు చాలా చక్కని పోషకాలని కలిగి ఉంటాయి. వీటిల్లో ఉండే విటమిన్-ఇ, సెలీనియం, ఫైటోన్యూట్రియెంట్స్ సెల్స్ ని కాపాడతాయి. అదేవిధంగా మరో ధాన్య రకమైన ఓట్మీల్ లో చాలా రకాలైన పోషకాలు అత్యధికంగా ఉంటాయి.
11. వాల్నట్స్ ఒమేగా-3 చెట్టు ఆధారితమైన సహజసిధ్ధలక్షణాలున్న పోషకాలు.
12. పెరుగు ప్రెగ్నెన్సీ సమయంలో తల్లికి చాలా చక్కగా ఏ రకమైన సమస్యలు రాకుండా చేస్తుంది. దీనిలో కాల్షియం తల్లిని కాపాడటమే కాక బిడ్డ ఎముకల ఎదుగుదలని ప్రేరేపిస్తుంది.
13. చాలా పచ్చని కూరగాయల్లో చలా చక్కని పౌష్టికాలు, విటమిన్లు, విటమిన్,ఎ,సి,కె ఉంటాయి.
14. మాంసం-దీనిలో చాలా రకాలైన మాంసకృత్తులూ, క్రొవ్వు పదార్ధాలు ఉంటాయి. మాంసం తినటం వల్ల బిడ్డ ఎదుగుదల చక్కగా ఉంటుంది.
15. పండ్లు తినటం ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంచిది. లేదా జ్యూస్లు త్రాగటం కూడా చాలా మంచిది. ఎందుకంటే వీటిలో చాలారకాలైన విటమిన్లు ఉంటాయి. ఆరెంజ్, యాపిల్, మామిడి మొదలగునవి తినటం చాలా మంచిది.

16. అరటిపందు పొటాషియం ను కలిగి ఉంటుంది. అంతేకాక త్వరగా శక్తి పొందాలంటే అరటి పండే తినాలి. ముఖ్యంగా బిడ్డ కు ఎప్పటికప్పుడు శక్తి అందాలంటే ఇది తినాలి. దీనిని స్లైసెస్ గా చేసుకుని పెరుగులోనూ, బెర్రీలలోను, ఐస్ లోనూ, ఆరెంజ్ జ్యూస్ లోనూ వాడాలి.
17. డ్రైడ్ ఫ్రూట్స్ అంటే ఎండు పండ్లు ఉదాహరణకు కిస్మిస్, ఖర్జూరం లాంటివి తినటం చాలా చాలా మంచిది.
18. అవకాడోలు తింటే ఎంతో చక్కగా బిడ్డ ఎదుగుతుంది. దీనిలో ఫోలిక్ యాసిడ్, పొటాషియం, విటమిన్-బీ-6 ఉంటాయి. ఇవి బిడ్డ నాడీవ్యవస్తకూ, మెదడు ఎదుగుదలకూ దోహదం చేస్తాయి.
19. మామిడి పండ్లు విటమిన్ ఎ,సి,బి-6 ని కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని తింటే మంచిది.
20. ఎర్ర మిరియాలల్లో విటమిన్ ఎ, సి, బి- 6 పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు తినే డిషెస్ లో దీన్ని వేసుకుని తింటే చాలా మంచిది.
పైన తెలిపిన ఆహారపదార్ధాలన్ని చాలా పోషకాలతో కూడినవి. వీటిని ప్రెగ్నెన్సీ సమయంలో తినటం చాలా మంచిది.

Posted on

Best benefits involved in organic food in Telugu – మీ ఆరోగ్యానికి సహజసిధ్ధ ఆహారం

రాను రానూ ఆరోగ్యంపై వస్తున్న ప్రత్యేక శ్రధ్ధే ఈనాడు సహజసిధ్ధ సేంద్రీయ ఆహారాన్ని తినేందుకూ ఆశక్తి చూపటం. గత కొంతకాలంగా సహజసిధ్ధమైన ఆహారంపై చూపుతున్న ఆశక్తి వల్లే ఈ రోజు మార్కెట్లో ఈ ఆహారానికి డిమాండ్ పెరిగిందనటం అతిశయోక్తి కాదు. ఇది ఆరోగ్యానికేకాదు అలాగే వాతావరణం మీద కూడా ప్రభావం చూపిస్తుందనేది వెల్లడయింది.అయితే కొందరు నిపుణులు ఈ విషయాన్ని ఖచ్చితంగా చెబుతున్నారు. కొన్ని సహజసిధ్ధ సేంద్రీయ ఆహారపదార్ధ్ధాలు చాలా అకార్బనిక పదార్ధాల కంటే ఉత్తమమని తేల్చి చెబుతున్నారు. వీటిలో ఉన్నా లాభాలేంటంటే

ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు  ఉండటం

ఈ ఆంటీ ఆక్సిడెంట్ ల వల్ల ఆరోగ్యమే కాదు శరీరం వయస్సు పెరిగినా ఇంకా యవ్వన శోభను మెరుగుగా ఉంచుతాయి. అంతేకాక వ్యాధుల నుంచీ కాపాడుతాయి. కాలిఫోర్నియాలో జరిపిన  పరిశోధనల్లో మామూలు సహజసిధ్ధంగా పెరిగిన టొమోటోలలోనే 79% క్వెర్సిటిన్ అలాగే 97% కెంఫెరాల్ ఉన్నాయనీ, అంతేకాక హైబ్రీడ్ టొమోటో లలో ఇలా ఉండవనీ తేల్చి చెప్పారు. ఈ సహజసిధ్ధ టొమోటోల వల్ల గుండె సంబంధిత  వ్యాధులు దూరం ఉండటమే కాకుండా కాన్సర్ వ్యాధి బారిన పడే అవకాశాన్ని నిరోధిస్తాయి.

పురుగు మందులు వాడని కారణంగా

సాధారణంగా సహజసిధ్ధమైన ఆహర పదార్ధాలకు పురుగు మందులు చల్లరు. పురుగుమందుల వాడకం వల్ల అవి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అవి ఆహార వ్యవస్థ మీదా తీవ్ర ప్రభావాన్ని చూపి ఆకలిని మందగించేలా చేస్తాయి. అంతేకాక అవాంచిత వ్యాధుల బారిన పడేలా చేస్తాయి.

యాంటిబయాటిక్స్ ఉండవు

ఈ సహజసిధ్ధాహార పదార్ధ్ధాలల్లో యాంటీబయాటిక్స్ ఉండవు. ఎంచేతంటే మానవ శరీర  వ్యవస్థపై ఇవి చాలా ప్రభావాన్నే చూపుతాయి. ముఖ్యంగా ఈ యాంటీబయాటిక్స్ పదార్ధాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల మానవ శరీరం   నిర్జీవమైపోతుంది. అంతేకాక వీటి ప్రభావం వల్ల చికిత్సకు కూడా శరీరం సహకరించదు. కాబట్టి వీటి వాడకం ఉండటం వల్ల చాల నష్టాలుంటాయి కాబట్టి వీటి వాడకం ఉండదు.

జన్యుపరంగా చివరిమార్పు పంటలు

వీటిపై సుధీర్ఘమైన చర్చే ఎన్నో సంవత్సరాలుగా సాగుతోంది. కానీ ఈ రకం పంటలు మానవ  శరీరానికి అంత మంచిది కావు. ఇవి అప్పటికప్పుడు కృత్రిమంగా లభించే రెడీమేడ్ పంటలేకానీ సహజంగా ఉపయోగకరమైనవి కావు. అంతేకాక ఇవి ఆహార సమస్యను దూరం చేసేవే కానీ ఆరోగ్యాన్ని పెంచేవి మాత్రం కావనే చెప్పాలి. వీటివల్ల వచ్చే పౌష్టికాహారం మాత్రం ఏమీ ఉండదు.

చక్కటి రుచిని కలిగి ఉండటం

ఇలా పెంచిన సహజసిధ్ధమైన ఆహారపదార్ధాలు చాలా రుచిని కలిగి ఉంటాయి. ఇవి వాతావరణానికేకాక జంతుజాలానికి కూడా కీడు తలపెట్టవు. అదే కృత్రిమ ఆహార పంటల్లో ఈ పరిస్తితి వ్యతిరేకంగా ఉంటుంది. సహజసిధ్ధ ఆహారపదార్ధ్ధాలు సహజసిధ్ధంగా పెంచటం జరుగుతుంది. అందుకే మానవ శరీర ఆరోగ్యానికి  ఇవి దోహదం చేస్తాయి.

వాతావరణానికి కలిగే లాభాలు

కృత్రిమమైన ఆహారపదార్ధాల పెంపకం వాతావరణానికేకాదు భూమికీ అలాగే నేలలోని లవణాలకూ ఎంతో ప్రమాదం. ఇలా కృత్రిమంగా పెంచటం వల్ల భూమిలోని సహజసిధ్ధ గుణాలు అలాగే మరికొన్ని మంచి లక్షణాలను కోల్పోయేలా చేస్తాయ్. ఈ కృత్రిమ ఆహార పదార్ధాల  పెంపకానికి వాడిన నీళ్ళను నది నుండో లేదా కాలువ చెరువు నుండో తీసుకుంటే ఈ పంటల వల్ల అవి కలుషితమవుతాయి. అలాగే పురుగుమందులు, ఫెర్టిలైజర్ల వల్ల ఆ రసాయనాలు గాలిలో చేరి గాలి కాలుష్యాన్ని కలిగిస్తాయి. వీటి వల్ల చిన్న చిన్న ప్రాణులు అలాగే భూసారం క్షీణించటం జరుగుతుంది.
సహజసిధ్ధ పంటలు అలాగే ఆహారపదార్ధాలు ఆరోగ్యాన్నేకాక చిన్న చిన్న ప్రాణుల్ని భూసారాన్ని అలాగే మాతృభూమినీ కాపాడతాయి.
Posted on

మీ శృంగార జీవితం మెరుగుపడాలంటే – Telugu tips to increase sexual stamina

మన జీవితంలో శృంగారానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అదీ జీవిత భాగస్వామితో రోజూ చక్కగా శృంగారంలో పాల్గొనాలంటే దానికి చాలా జాగ్రత్తలువహించాలి..జాగ్రత్తలని ఎందుకంటున్నామంటే రాను రాను ఉన్న ఈ ఫాస్ట్ లైఫ్ లో చాలా ఇబ్బందులు, బాధ్యతలు, టెన్షన్స్ ఇలా ఎన్నో..ఇవన్ని ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా, వ్యాపార రీత్యా కావచ్చు, లేక మన స్వవిషయాలు కావచ్చు. ఏది ఏమైనా మన దాంపత్య జీవితం సుఖంగా చేయటం మనకు ముఖ్యం. కొన్నిసార్లు మనలో అసమర్ధత పేరుకోవచ్చు. అదే సమయంలో మన భాగస్వామి నొచ్చుకోవచ్చు. కాబట్టి దీనిలో మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పొషిస్తుంది. కాబట్టి మీ భాగస్వామితో శృంగార జీవితాన్ని సుఖంగా అనుభవించాలంటే మీకు కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను సూచిస్తున్నాం. అవేంటో చూద్దామా..

జీవితంలో సెక్స్ సామర్ధ్యాన్ని పెంచే పదార్ధ్ధాలు

మాంసం

మాంసం తింటే చాలావరకూ సెక్స్ సామర్ధ్యం పెరుగుతుంది. ఎందుకంటే దీనిలో ఉన్న మాంసకృత్తుల కారణంగా ఆ సామర్ధ్యం పెరుగుతుంది. అంతేకాక వేటమాంసం, ఫోర్క్, బీఫ్ ఇలంటి మాంసాహారాల్లో చాలావరకూ మాంసకృత్తులూ ఉంటాయ్. తద్వారా సెక్స్ సామ్రధ్యం పెరుగుతుంది. అంతేకాక ఈ మాంసాహారాల్లొ సెక్స్ సామర్ధ్యాన్ని పెంచే జింక్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది లోపిస్తే సెక్స్ సామర్ధ్ధ్యం తగ్గుతుంది.

సాల్మన్

సాల్మన్ చేప అదే మన తెలుగులో పండుగప్ప అని కూడా అంటారు. ఈ చేపలో 3 లక్షణాలు గల యాసిడ్లు ఉంటాయ్. దీని వల్ల రక్తప్రసరనా వృద్ధి చెందుతుంది. సాల్మన్, తూరా చేపా, హాలిబుట్ చేపా అంటే మన పరిభాషలో పెద్ద చేప ఈఎ చేపలు సెక్స్ సామర్ధ్యాన్ని పెంచేవిగా చెప్పుకోవచ్చు.

కాయలు మరియు విత్తనాలు

ఇక కాయలు మరియు విత్తనాల్లో చాలా వరకూ జింక్ ఉంటుంది. దీనివల్ల మీ సెక్స్ సామర్ధ్యం పెరుగుతుంది. అంతేకాక జీడి బాదం మీ భాగస్వామికి పెట్టడం వల్ల వాటిలో ఉండే జింక్ శాతం ఎక్కువ కాబట్టి సెక్స్ సామర్ధ్యం బాగా పెరుగుతుంది. ఆక్రోట్లు, వేరుశనగ, గుమ్మడికాయ విత్తనాలు ఇవన్ని మానవునిలో వాంచలు అభివృధ్ధికి దోహదం చేస్తాయి.

ఆపిల్స్

యాపిల్ కాయలు ఆరోగ్యాన్ని వృధ్ధి చేయటమే కాదు సెక్స్ లైఫ్ ను కూడా పెంచేందుకు దోహదం చేస్తాయి. యాపిల్స్ ఒక యాంటీ ఆక్సిడెంట్ ను కలిగి ఉంటాయి. అంతేకాక యాపిల్స్ మన శరీరంలో రక్తప్రసరణ వృధ్ధి చేస్తాయి. అంతేకాక బ్లాడర్ సమస్యల్ని ప్రొస్టాటిటిస్ మరియు సిస్టిసిస్ కూడా యాపిల్స్ తగ్గిస్తాయి. అంతేకాక శృగార వాచలేకా వచ్చే లోపలి కలయిక సమయంలో నొప్పిని ఇవి అరికడతాయి.

రెడ్ వైన్

రెడ్ వైన్ శృంగారాన్ని పెంచేది. దీని వల్ల ఆడవారిలో శృగార వాంచా పెరుగుతుంది. ఒక గ్లాస్ వైన్ శృగార కాంక్షను రేపుతుంది. రెడ్ వైన్ లో క్వెర్సిటిన్ ఉండటం వల్ల మగవారిలో అలాగే ఆడవారిలో శృంగార వాంచ్చను అధికం చేస్తుంది.

అరటి

అరటికాయ తినటం వల్ల కూడా శృంగార వాంచ్చ పెరుగుతుంది. దీనిలో ఉన్న మినరల్స్, విటమిన్స్ శృంగార శక్తిని పెంచుతుంది.

పుచ్చకాయ

పుచ్చకాయ మంచి శృంగార జీవితం ఉండేలా చుస్తుంది. దీనివల్ల సెక్స్ సామర్ధ్యం పెరుగుతుంది.

దానిమ్మ

దానిమ్మ సెక్స్ సామధ్యమేకాక సెక్స్ హార్మోన్స్ పెంచుతుంది.

మాచా రూట్

ఇది శృంగార జీవితం పరిమళించేలా చేస్తుంది. దీనిని పెరువియన్ గిన్సెన్ అని కూడా పిలుస్తారు. ఇది స్త్రీల లోనూ, పురుషులలోను శృంగార వాంచ్చల్ని పెంచుతుంది. ఇది కాప్సుల్స్ రూపం లొనూ దొరుకుతున్నాయి.

సోయా ఆహారాలు

ఇవి యోనిలో ద్రవాలు ఊరేలా చేస్తాయి. ఆడవారిలో మోనోపాజ్ సమయం లో అంటే బిడ్డను కనే సమయంలో పాలు పట్టడానికీ అంతేకాక యోని గోడలు గట్టి పడటానికీ దోహదం చేస్తాయ్. ఈ పదార్ధాలు సోయా పాలు, సోయా చీజ్, టోఫ్ఫు వీటిల్లో శృంగార సామర్ధ్ధ్యాన్ని పెంచుతాయి.

ఆకుకూరలు

ఆకుకూరలు అలసటను నిద్రలేమినీ లేకుండా చేస్తాయి. అలాగే ఆందోళన, ఉద్రిక్తతను దూరం చేస్తాయి. ఇవి బాగుంటే సెక్స్ జీవితం బాగుంటుంది. బచ్చలికూర, కాలే, బీటురూట్ దుంపల్లో మెగ్నీషియం ఉండి స్త్రీ మెన్సస్ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.
Posted on

Importance of drinking water for health care in Telugu – నీరు – మీరూ..

నీటిని గంగా జలంతో పోలుస్తారు. అంతేకాక నీటిని ప్రాణ ధారగానూ భావిస్తారు. నీటి గురించి తెలియనివారే దానిని అశ్రధ్ధ చేస్తారేకానీ నీటి విలువ తెలిసిన వాళ్ళు అంటూ ఉంటే ఖచ్చితంగా దాని విలువ గుర్తించాల్సిందే! నీరు ఎక్కువా త్రాగితే ఎంతో ప్రయోజనం, అదే తక్కువ నీరు త్రాగడం వల్ల కలిగే అనారోగ్యాలు అజీర్ణం, మలబద్దకం, తలనొప్పి, కిడ్నీలో రాళ్ళు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ సమస్యలను అధిగమించాలంటే ప్రతి రోజూ తగుమోతాదులో నీరు సేవించాలి. అన్నింటి కి దివ్య ఔషధం నీరు. శరీరములో జరిగే మెటబాలిక్ చర్యల్కు నీరు అతిముఖ్యము. చాలా మందికి తెలియకునా నీరు, నీటి శాతం ఎక్కువగా ఉన్న పానీయాలు సేవించడం వల్ల ఎన్నో జబ్బులు దరి చేరవు.

శరీరము లొ రక్తంకి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి అంతే విలువ ఉన్నది. మానవ శరీరములోని ద్రవ పదార్ధాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలము సరఫరా చేయడంలో నీరు భూమిక వహిస్తుంది. నీటిలో క్లోరిన్‌, ఇయోడి్న్‌, ఆక్సిజన్ వంటి వాయువులు సమపాళ్ళ లో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యం గానే ఉంటాడు. నీరు త్రాగే వారు కోసం అనేక అభిప్రాయాలు మా దగ్గరున్నాయి. ఉదాహరణకు భోజనం సమయంలో నీరు త్రాగడం వల్ల అజీర్ణం సమస్య తొలగిపోతుంది. ఎక్కువ నీరును సేవించడం ఆరోగ్యానికి చాలా మేలు. ఇటువంటి అభిప్రాయాలు చాలానే ఉన్నాయి. నీరు నుండి పొందే ప్రయోజనాలు ఎంటో మనం తెలుసుకుందామా..!

1. మనిషికి రోజుకు 2.5-3.0 లీటర్ల నీరు అవసరము మరియు ఆరోగ్యము. కొంత నీరు మనము తినే ఘన పదార్డ ఆహారము నుండి లభిస్తుంది… మిగతాది త్రగావలసిందే. ఒక మనిషి రోజుకి ఎంత నీరు త్రాగాలి అంటే: సుమారుగా మనిషి బరువు కిలోగ్రాములలో/30= లీటర్లలో. ఉదా: మనిషి బరువు=60 కి.గ్రా. రోజూ త్రాగవలసిన నీరు= 60/30= 2.0 లీటర్లు). (సుమారు అటు.. ఇటు గా)

2. ఈ అభిప్రాయం చాలా రోజుల నుండి మన మధ్య ఉంది. అయితే అధి నిజం కాదు. భోజనం మధ్యలో కొద్దిగా నీరు త్రాగడం వల్ల జీర్ణ సమస్యలు తొలగి, జీర్ణ వ్యవస్థ యొక్క జీవక్రియలు సాఫీగా జరుగుతాయి. మీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు అంటే భోజనానికి ముందు నీళ్ళు తాగకూడదు. నీళ్ళు తాగితే జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. అలాగే భోజనానంతరం కడుపారా నీటిని సేవించడం వలన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది.

3. రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల.. చక్కటి ఆరోగ్యం సొంతమవుతుంది, శరీరంలోని వ్యర్థాలు దూరమవుతాయి. అవి మంచి నీళ్లయితే అంతా మంచిదే! కానప్పుడు! కాలుష్య కారకాలతో నిండినవైనప్పుడు? అనారోగ్యాలు కమ్ముకొంటాయి. ప్రాణాంతక వ్యాధుల్లో అధిక శాతం అపరిశుభ్రమైన జలాల కారణంగానే వ్యాపిస్తాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. మరి ఈ సమస్యని నియంత్రణలో ఉంచడానికి మార్గమేదీ అంటే.. అత్యధిక మందికి అందుబాటులో ఉన్నవి నీటి శుద్ధి పరికరాలు (వాటర్‌ ప్యూరిఫైయర్లు). వీటి పనితీరుపై చక్కటి అవగాహన కలిగి, ఎంపికలో తగు జాగ్రత్తలు పాటిస్తే వందశాతం స్వచ్ఛమైన జలాన్ని స్వీకరించడం ఈ రోజుల్లో సాధ్యమనే చెప్పొచ్చు.

4. కొన్ని పరిశోధన ప్రకారం ఎక్కువ నీరు త్రాగడం వల్ల ఆరోగ్యానికి అపాయమే అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ నీరు శరీరం గ్రహించడం వల్ల శరీరంలో ఉండే రక్తంలో ఉన్న సోడియం అంశాలను తక్కువ చేస్తుంది. కిడ్ని ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది.దాంతో అనారోగ్య బారీన పడాల్సి వస్తుంది. కాబట్టి అధిక నీరు అంటే పది గ్లాసుల కంటే ఎక్కువ నీరు త్రాగకపోవడమే ఆరోగ్యానికి మంచిది. ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు. దఫ దఫాలు గా కొంచెం కొంచం గా తాగుతూ ఉండాలి.

5. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రకరకాల జబ్బులు చోటుచేసుకుంటాయి. నీరు తక్కువగా తీసుకోవడంతో డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమౌతుంది. డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా ఉండాలంటే సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. నీళ్లకు జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉంది. శరీరంలోని మలినాలను విసర్జింపజేసి, శరీరంలో అనేక జీవక్రియలు సమర్థంగా తమ విధులు నిర్వర్తించాలంటే శరీరానికి సరిపడా నీరు త్రాగాలి.

5. ఆకలిని చంపేయగల శక్తి నీటికి ఉంది. నీరు బాగా తాగితే భోజనం తక్కువగా తింటారు. ఫలితంగా లావెక్కే అవకాశం తగ్గుతుంది. ప్రతిరోజూ ఉదయం రెండు గ్లాసులు నీరు తాగండి. అలాగే పడుకునే ముందు రాత్రి వేళ మరో మూడు నాలుగు గ్లాసుల నీరు తాగండి. శరీరం నుండి మలినాలు విసర్జించడంలోను నీరు ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. శరీరం నీటిని చెమట, మూత్రాల రూపంలో నష్టపోతుంది. ఈ నష్టాన్ని ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని త్రాగి భర్తీ చేయాలి.

6. నీరు సేవించడం వలన శరీరంలోని విషపూరితమైన పదార్థాలు బయటకు విసర్జించడమే కాకుండా చర్మం, ఉదరం, మూత్రపిండాలలోనున్న పలురకాల విషపదార్థాలు బయటకు విసర్జించబడతాయి.

7. నీరు తాగడం అన్నది ఆరోగ్యానికే కాదు, అందానికీ కూడా అత్యవసరం. వ్యాయామం చేయడానికి ముందు, ఆ తర్వాత కూడా తప్పనిసరిగా నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

8. చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలంటే శరీరంలో నీటిశాతం సక్రమంగా ఉండాలి. మన శరీరంలో నీటిశాతం సరిగ్గా లేకపోతే.. చర్మం ముడతలు పడటం, చర్మ సమస్యలు, వంటివి ఏర్పడతాయి. అందుకే మన శరీరంలో 75 నుంచి 80 శాతం నీరు ఉండాలి. ఇందుకు ప్రతిరోజూ ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు సేవించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

9. శరీరంలో తగిన మోతాదులో నీరు ఉంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. రక్త పోటు ను తగ్గించును.

10.గాయాలను మానే (హీలింగ్ ప్రొచెస్స్) పక్రియను ఉత్తేజ పరచును.

Posted on

Benefits of drinking peppermint herb tea in Telugu – గరం.. గరం.. పుదీనా టీ తో ఆరోగ్యం

ఏ కూరైనా మంచి సువాసనతో మరింత రుచికరంగా ఉండాలంటే పుదీనా ఆకు పడాల్సిందే. పుదీనా అన్ని కూరల్లో వెయ్యంగా! దీనికి అంత ప్రాముఖ్యత ఏంటి? అని అనుకుంటున్నారా! కాదండి ఇది మెదడుని ప్రభావితం చేయాలంటే చాలా ఉపయోగపడుతుంది. అయితే ఆరోగ్యానికి పుదీనా చేసే మేళ్ళేన్నో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా..

1. పుదీనా ఆకుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచే విన్తమిన్ ఎ , విటమిన్ సి  గుణాలు అధికం .

2. ఉదయాన్నే  కప్ఫుడు  పుదీనా తీ ని తాగితే దాని నించి శరీర పనితీరుకి అవసరం అయిన రాగి , పీచు , క్యలిష్యంతో పాటు మాంగనీసు ,పొటాషియం కూడా అందుతాయి .

3. గర్భిణులకు అవసరం అయిన ఫోలికామ్లం , ఒమేగా  త్రీ లు కావాల్సినంత .

4. పెరిగే కణుతుల పెరుగుదల కు అడ్డుకట్ట వేయాలంటే రోజువారీ ఆహారంలో ఆకులని గ్రీన్ చట్ని రూపంలో కానీ , టీగా కానీ తీసుకోవచ్చంటున్నారు నిపుణులు .

 

పుదీనా టీ తయారు చేసుకోండిలా:

1. రెండు కప్ఫుల  నీటికి పది నుంచి పన్నెండు  ఆకులని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి .

2. నీరు మరిగిన తర్వాత  ఈ ఆకులని వేసి ముతపెట్టేయాలి .కాసేపటికి కప్ఫు పాలు , ఒక యాలక్కాయ , ఇష్టముంటే  దాల్చినచెక్క వేసి తేనె కలిపితే పుదీనా టీ సిద్దం .

3. ఈ టీ శరీరానికి కొత్త శక్తిని ,మనసుకి ఉత్సాహవంతమైన ఆలోచనలని అందిస్తుంది .

4. పొడి దగ్గు విసిగిస్తున్నప్ఫుడు ……….గొంతులో గరగర  వంటి ఇబ్బందులకు  లోనయినప్ఫుడు   కప్ఫు  పుదీనా చాయ్ తాగండి .

5. పుదీనా పోషకాలని వీలైనంతగా అందుకోవాలంటే ఆ ఆకులతో చేసిన పరోటాలే మేలైన మార్గం అంటున్నారు  పోషకాహార  నిపుణులు . ఎండిన లేదా పచ్చి  పుదీనా ఆకులని అర కప్ఫు తీసుకొని చపాతీ పిండిలో కలుపు కోవాలి . తర్వాత మమూలు చపాతీల్లా కాల్చుకొంటే కమ్మని పోషకాల రోటీలు సిద్దం .

Posted on

Home remedies for health problems – కూరౌషధాగారం

వెల్లుల్లి

వెల్లుల్లి రక్తపోటును తగ్గిస్తుంది. రోజూ వెల్లుల్లి వాడేవారికి రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతో గుండెపోటు వచ్చే అవకాశాలను, పక్షవాతాన్ని సమర్థంగా నివారించినట్లు అవుతుంది. దాని ఘాటువాసనకు క్యాన్సర్ పరార్. ప్రత్యేకంగా చెప్పాలంటే అది నడయాడే చోటైన జీర్ణకోశం వంక క్యాన్సర్ కన్నెత్తి చూడటానిక్కూడా సాహసించదు. అంటే వెల్లుల్లి వాడేవారిలో గ్యాస్ట్రో ఇంటస్టినల్ క్యాన్సర్‌కు అవకాశాలు చాలా చాలా తక్కువ. ఇన్ని సుగుణాలు ఉండటం వల్ల న్యూట్రిషనిస్టులు కనీసం రోజుకు 5 – 6 వెల్లుల్లి రెబ్బలను సిఫార్సు చేస్తుంటారు.

క్యారట్

ఎర్రటి క్యారట్ రంగు చూడాలంటే కళ్లు కావాలి. ఆ కళ్లకు ఆరోగ్యం కల్పించాలంటే మళ్లీ క్యారట్ కావాలి. కంటిచూపును మెరుగుపరచే విటమిన్-ఎ పుట్టడానికి అవసరమైన బీటా-కెరోటిన్ క్యారట్‌లో పుష్కలంగా ఉంటుంది. క్యారట్ రేచీకటిని నివారిస్తుంది. ఒకవేళ ఆ సమస్య అప్పటికే ఉంటే దానికి చికిత్స చేస్తుంది. క్యారట్ గుండెపోటును, పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. ఎందుకంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అందుకే క్యారట్ ఓ క్యాన్సర్ పోరాటయోధుడు. ఉత్తమ యాంటీ-క్యాన్సర్ కారకంగా ఉంటుంది. రోజూ ఒక చిన్న కప్పు క్యారట్స్ తింటే మనలోని కొలెస్ట్రాల్ 11% తగ్గుతుంది.

పాలకూర

పాలకూరలో పాలు చూపించమంటే సాధ్యం కాదు. కానీ దానిలోని స్నేహంపాళ్లు చూపించడం సాధ్యమే. ఏ కూరతో కలిపి వండినా అందులోని పోషకాలను మన శరీరం గ్రహించేందుకు అనువుగా చేయడంలో పాలు పంచుకుంటుంది పాలకూర. ఇక గర్భవతికి అయితే రోజూ తినిపించడం మంచిది. ఎందుకంటే  దానిలో విటమిన్-సి, బి6, రైబోఫ్లేవిన్, ఐరన్, క్యాల్షియమ్… ఇవన్నీ ఉంటాయి. గర్భవతికి రాసే పోషకాహార సప్లిమెంట్ మాత్రల్లో ఉండాల్సినవన్నీ దాంట్లోనే ఉంటాయి. కాబట్టి వాటన్నింటి బదులు స్వాభావికంగా పాలకూర వాడటమే మంచిది కదా!

లెట్యూస్

బరువు తగ్గాలనుకుని అనుకునే వారు ఎక్కడికో పరుగు తీయాల్సిన అవసరంలేదు.. ఆకులు చాలు. అవే.. లెట్యూస్. శరీరానికి శ్రమ కలిగించని తేలికపాటి వ్యాయామం… దానితో పాటు లెట్యూస్ చాలు, తగ్గుతుంది ఒళ్లు. ఎందుకంటే ఇది లో క్యాలరీ డైట్. క్యాలరీలకే కొరత గానీ… విటమిన్-సి, ఫోలేట్, క్యాల్షియమ్, పొటాషియమ్ వీటికి కొదవ లేదు. రోజూ సాఫీగా విరేచనం కావాలంటే వేరే మందులు అక్కర్లేదు. రోజూ రాత్రిపూట తినే ఆహారంతో లెట్యూస్ తీసుకుంటే రాత్రికి తృప్తి. ఉదయాన సుఖ విరేచన సంతృప్తి.

నిమ్మకాయ

నిమ్మ మాత్రం ఎప్పుడూ జలుబును కా(ర)నివ్వదు. అందులోని విటమిన్-సి కారణంగా సంక్రమించే వ్యాధినిరోధకతతో జలుబును మాత్రమే కాదు, ఏ ఇన్ఫెక్షన్‌నూ తాకనివ్వదు. డాక్టర్లు మిమ్మల్ని ఉప్పు లేకుండా కూరల్ని తినమన్నారా? ఉప్పు లేని చప్పిడిదనాన్ని తప్పించి రుచి తెచ్చి మెప్పించేది నిమ్మ. ఇందులోని లిమోలిన్ అనే పోషకం క్యాన్సర్‌కు బద్ధశత్రువు. అందుకే అది క్యాన్సర్ సమరవీర… పోరాటశూర… నిమ్మధార. అందుకే అది నిమ్మ కాదు – నివురుగప్పిన నిప్పులాంటి నిమ్మ.

ఉల్లి

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది ఔషధాలు కనిపెట్టకముందునుంచీ వాడుకలో ఉన్న సామెత. ఉల్లి ముందా! మందు ముందా! అంటే… ఉల్లే ముందు. అనేక ఔషధులకు మాతృక ఉల్లి. ఉల్లి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టే రక్తాన్ని పలచబారుస్తుంది. బ్లడ్‌క్లాట్స్‌ను వడపోసి బయటకు పంపిస్తుంది. రియల్ యాంటీబ్యాక్టీరియల్ ఎఫెక్ట్‌తో సూపర్‌ఫీషియల్ ఇన్ఫెక్షన్స్‌ను నివారిస్తుంది. తనలోని ఘాటెత్తే గంధకంతో క్యాన్సర్ పాలిటి మందుగుండు ఉల్లి.

మిరియాలు

గొంతు పెగలాలంటే మిరియంతో ఎల్లకాలాలూ నోరు కాలాలి. అందుకే హరికథకులు పాలతో పాటు మిరియాలు తీసుకుంటారు. గొంతుకే కాదు సుమా.. కళ్లకూ మిరియాలు మంచివే. ఎందుకంటే ట్యూటిన్, జియాగ్జాంథిన్, యాంటీఆక్సిడెంట్స్ ఉండి వాటితో కళ్లకు సంబంధించిన సమస్యలైన మాక్యులార్ డీజనరేషన్‌తో వచ్చే చూపు కోల్పోయే ప్రమాదాన్ని నివారిస్తుంటాయి. ఇలా అంధత్వ సమస్యలపై ఎప్పుడూ కారాలు నూరుతుంటాయి మిరియాలు. పైగా అందులోని ఫినోలిక్ యాసిడ్స్ క్యాన్సర్‌కు కారణమయ్యే నైట్రోసోయమైన్స్‌ను కరిగించివేస్తాయి. ఇలా చూస్తే క్యాన్సర్‌కు కవచం… మన మిరియం.

బంగాళదుంప

ఇవి తింటే లావెక్కుతారనేది పాక్షిక సత్యం మాత్రమే. ఇందులో విటమిన్-సి, బి6, పొటాషియం, మినరల్స్ ఉంటాయి. లావొక్కింతయు లేదు అంటూ నీరసంగా ఉండేవారిని హుషారుచేస్తాయి. అందుకే మోతాదుకు మించకుండా తినాలి. మరీ తప్పకపోతే తప్ప తొక్క తియ్యకుండా వండి తింటేనే మంచిది. ఎందుకంటే పొట్టులోని పీచు పొట్టను శుభ్రం చేస్తుంది. మలబద్దకం లేకుండా చూస్తుంది. వేపుళ్ల రూపంలో తింటేనే ఆరోగ్యాన్ని వేపుకు తింటాయి తప్ప… ఉడికించి తింటే ఉత్తమమే. ఇందుకు తార్కాణం ఒక్కటే… ఒక కప్పు అంత పెద్ద సైజు ఆలుగడ్డను ఉడికిస్తే అందులో 120-150 క్యాలరీలు ఉంటాయి. అదే వేపడం గానీ, ఫ్రెంచ్ ఫ్రైస్‌లా నూనెలో ఫ్రై చేయడం గానీ చేస్తే అందులో 355 క్యాలరీలు ఉంటాయి.

Posted on

Health benefits of finger millets in Telugu – మంచి ఆరోగ్యానికి రాగులు..!

రాగులు బలవర్దకమయిన ధాన్యం. రాగి సంగటి అనగానే గుర్తొచ్చేది రాయలసీమ. ఆ జిల్లాల్లో ఇప్పటికీ దానినే ఆహారంగా తీసుకుంటుంటారు. ఇక ఒకప్పుడు దీనిని పొద్దున్నే జావగా చేసి పాలల్లో,  మజ్జిగలో కలుపుకుని తాగేవారు మన పెద్దవాళ్ళు. అయితే ఇంకా చెప్పాలంటే మన ఇళ్ళల్లో కోళ్ళకు వీటినే బలమైన ఆహారంగా పెట్టేవారు ఒకప్పటి తరం వారు.

ఎందుకంటే దీనిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. రాగి జావకు, రాగి సంగటికీ రాగులతో చేసిన ఇతర ఆహార పదార్థాల వల్ల శరీరానికి అంత బలం చేకూరుతుంది. రాగుల వల్ల మన శరీరానికి కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందామా..!

1. రాగుల వల్ల జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది.

2. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

3. రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్థకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.

4. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది.

5. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుం ది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది.

6. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.

7. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.

8. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది.