Posted on

Health benefits of potato in Telugu – ఆరోగ్యకరమైన పద్ధతిలో ఆలుని ఎలా తినాలి

భారతదేశ భోజనంలో ముఖ్యంగా కనిపించే వంటకం ఆలు. ఆలు తినాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆలూను ఎన్నో రకాలుగా వండవచ్చు. ఒక రకంగా చెప్పలంటే ఆలు అందరికీ ప్రియమైనదనే చెప్పవచ్చు. అంతేకాక సరైన పద్ధతిలో తింటే ఆలు వల్ల జరిగే మేలే ఎక్కువ” అంటున్నారు క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఇషి ఖోస్లా.

రోజూ ఆలు ఎంత తినాలంటే

“రోజుకి 40 గ్రాముల ఆలూని రెండో ఆలోచన లేకుండా తినొచ్చు. కాకపోతే తీసుకునే డైట్‌ని బట్టి ఈ కొలతలో కాస్త తేడా ఉంటుంది. బరువు పెరుగుతామని, డయాబెటిస్ ఉందని ఆలు తినకూడదనుకోవడం అపోహ మాత్రమే.

ఆలులో ఐదు

వంద గ్రాముల ఆలులో ఏమేమి ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. 97 కిలో కాలరీల శక్తి, 1.6 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి. కొవ్వు 0.1, కార్బొహైడ్రేట్‌లు – 22.6, ఐరన్ 0.48 మిల్లీగ్రాములు, విటమిన్ సి 17 మిల్లీగ్రాములు, పీచు 0.4 గ్రాములు ఉంటుంది.

ఆలు తినేందుకు ఐదు కారణాలు…

1.  ఆలులో తేలికగా శోషణమయ్యే కార్బొహైడ్రేట్‌లు ఉంటాయి. ఆలు అధిక పోషకాల్ని కలిగి ఉండడమే కాకుండా. సహజ శక్తిని అందిస్తుంది. సంక్లిష్ట కార్బొహైడ్రేట్‌ల (స్టార్చ్)ని అధికంగా కలిగి ఉంటుంది. ఒకే బరువు ఉన్న బ్రెడ్‌తో పోలిస్తే ఆలూలో కార్బొహైడ్రేట్ రెండింతలు తక్కువగా ఉంటుంది. మినరల్స్, బి గ్రూప్ విటమిన్లు, బీటాకెరోటిన్, విటమిన్-సిలతో పాటు నాణ్యమైన ప్రొటీన్లతో నిండి ఉంటుంది ఆలు. ఇందులో ప్రొటీన్ ఏడు శాతం ఉండడమే కాకుండా ప్రొటీన్ల నిర్మాణానికి అవసరమైన అమినో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి శరీరం తనంతట తానుగా తయారుచేసుకోలేనివి.

2.  ఆలూని నూనెలో వేగించినపుడు, గ్రేవీల్లో వేసి ఉడికించినపుడు లేదా వెన్న, మీగడ వంటి వాటితో కలిపినప్పుడు మాత్రమే కొవ్వు పదార్థాల్ని ఉత్పత్తి చేస్తుంది. అదే ఆలూని విడిగా ఉడికించుకుని తింటే కొవ్వు ఊసే ఉండదు.ఆలూని ఉడికించిన పద్ధతి బట్టే కొవ్వు తయారవుతుంది.

3.  అరటిపండ్లతో పోలిస్తే ఆలూలో పొటాషియం మెండుగా ఉంటుంది. సోడియం చాలా తక్కువ ఉంటుంది. బ్రెడ్, అన్నంలతో పోలిస్తే ఆలూలో రక్తంలో చక్కెర శాతాన్ని పెంచే గుణం చాలా తక్కువ. అందుకని మధుమేహులు కూడా ఆలూని చక్కగా లాగించేయొచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆలూని తినాలనుకున్నప్పుడు మీరు తీసుకునే ఆహారంలో తక్కువ కాలరీలు ఉండే ఇతర పదార్థాలు చూసుకోవాలి. ఆలూ తినడం వల్ల హైపర్‌టెన్షన్ (అధిక రక్త పీడన సమస్యల్ని) తగ్గుతుంది.

4. పచ్చి బంగాళాదుంప రసంలో ఔషధ విలువలు మెండుగా ఉన్నాయి. అజీర్ణం, అల్సర్లు, కాలేయ సంబంధిత వ్యాధులు, మూత్రాశయంలో రాళ్లు, మల బద్ధకం వంటి సమస్యలు దరిచేరవు.  ఈ రసం తాగితే జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తవు. ఆలు మంచి యాంటాసిడ్‌గా పనిచేస్తుంది.

5. విటమిన్ సి, బి6, ఐరన్, విటమిన్ల ప్యాకేజి ఆలు. ఇందులో యాంటాక్సిడెంట్‌లు కూడా బాగానే ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను మరమ్మత్తు చేయడమే కాకుండా నాశనం కాకుండా కాపాడతాయి కూడా” అని చెప్పారు ఇషి.

ఆలూని ఎందుకు తినాలంటే?

ఆరోగ్యకరమైన పద్ధతిలో ఆలుని ఎలా తినాలి?

1. ఆలుని నూనె, వెన్నల్లో వేసి లేదా వేరే కూరలతో కలిపి వండుకుని తినడాన్ని మానేయండి. నీళ్లలో లేదా ఆవిరికి ఉడికించో లేదా గ్రిల్, రోస్ట్, బేక్ చేసి తినండి.

2. కారంకారంగా తినడాన్ని ఇష్టపడే వాళ్లు ఆలుని మొదట మసాలా దినుసులతో కలిపి నూనె వేయకుండా వేగించి తరువాత కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకుని తినొచ్చు.

3. ఆలూని తొక్క తీయకుండా తినాలి. ఎందుకంటే తొక్కలో పీచు, ఫ్లేవనాయిడ్స్, ఇతర పోషకాలు ఉంటాయి. ఆలూ పైన టాపింగ్‌కి వాడే పదార్థాల్లో కొవ్వు, ఉప్పు, కాలరీలు తక్కువగా ఉండాలి.

ఇన్ని కాలరీలు, ఇన్ని పోషకాలున్న ఆలూని తిందామా..!

Posted on

Reasons for Malnutrition in today’s women in Telugu – నేటి స్త్రీకి పోషకాహార లోపాలు

కార్యేషు దాసి, కరనేషు మంత్రి, భోజ్యేషు మాత, షయనేషు రంభ అని స్త్రీని పురాణాలు పొగిడాయి.అంతేకాక సహనం అంటే ఏమిటి అని ప్రశ్నిచినప్పుడు కనిపించే నిలువెత్తు నిదర్శనం స్త్రీ.కాని ఇన్ని పనులు, ఇన్ని బాధ్యతలూ ఒంటి చేతితో చేసే స్త్రీ పోషకాహార లోపానికి గురవుతోంది. ఇటీవల అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

ఓ వైపు సామాజికంగా అసమానతలకు గురయ్యే మహిళలు పోషకాహార విషయంలోనూ వివక్షకు గురవుతున్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలలో నెలకొనే సామాజిక జీవన ప్రమాణాలే ఇందుకు నిదర్శనం. చాలామంది మహిళలు పోషకాహార లేమితో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పిల్లల్లో ఎదుగుదల లోపం, మహిళలు పోషకాహారలేమితో బాధపడుతన్నట్లు, ఈ సమస్య ముఖ్యంగా ఆసియా దేశాల్లో అధికంగా కనిపిస్తున్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంత ఉమ్మడి కుటుంబాలలో మగపిల్లలు, ఆడపిల్లల ఎదుగుదలలో తీవ్రమైన వ్యత్యాసం ఉన్నట్లు, పోషకాహారం అందించే విషయంలో ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

1. ఇళ్లలో ముందుగా మగపిల్లలకు భోజనం పెట్టిన తరువాతే ఆడపిల్లలకు పెట్టే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఫలితంగా మన దేశంలో మహిళలు, బాలికలు పోషకాహార లేమితో బాధపడుతున్నట్లు వెల్లడైంది.

2. వేళకు తినకపోవటం వల్ల, సరైన పోషకాలు అందక వీరు పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎత్తు, బరువు తదితర విషయాల్లో సమతుల్యత లోపిస్తున్నట్లు కొలంబియా యూనివర్శిటీ ఆర్థిక శాస్తవ్రేత్త అరవింద్ పన్‌గారియా అంటున్నారు.

3. గ్రామీణ ప్రాంతాల్లో అత్తారింటికి వచ్చే కొత్తకోడళ్లు, వారి పిల్లలు పొట్టిగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రపంచం మొత్తమీద రక్తహీనతతో బాధపడే మహిళలు మనదేశంలోనే అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంత మహిళలు, బాలికల్లో 60 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు వెల్లడైంది.

4. అయితే, రక్తంలో ఇనుము తదితరాల కోసం ఐరన్ మాత్రలు తీసుకునే బదులు ఇనుము ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడమే మంచిది. కానీ, ఇలాంటి నాణ్యమైన పోషకాహారమే వారికి లభించడం లేదు.

5. ప్రభుత్వాలు ఆహారభద్రత చట్టం లాంటివి ఎన్ని తెచ్చినా ప్రయోజనం అంతంత మాత్రమే. పోషకాలు ఉండే ఆహార పదార్థాలన్నీ కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటున్నాయి. అందుకే ధర తక్కువగా ఉండే చిరుధాన్యాలు తదితర ఆహార పదార్థాలను తీసుకుంటే ఎంతో మంచిది.

సుమారు యాభై ఏళ్ల క్రితం గ్రామీణ ప్రాంతాలలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలలో చిన్నా, పెద్ద మొదలు అందరూ జొన్న,సజ్జలు,రాగులు లాంటి తృణధాన్యాలను ఆ హారంగా తీసుకునేవారు. వీరు కఠినమైన పనులు అధికంగా చేసేవారు కాబట్టి ధృడంగా, ఆరోగ్యంగా ఉండేవారు. రానురానూ జీవనశైలిలో వచ్చిన మార్పుతో పాటు ఆర్థికలేమి వారిని చౌకగా లభించే పోషకాహారం నుంచి దూరం చే స్తోంది. ఒకే కుటుంబంలో ఉండే ఆడ, మగపిల్లల శారీరక ఎదుగుదలను గనుక పరిశీలిస్తే ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది.  కనీసం గంటసేపు కూడా పరుగెత్తలేని పరిస్థితిలో గ్రామీణ ప్రాంత పిల్లలు ఉన్నారు. ఎత్తు, లావు, చురుకుదనం తదితర విషయాల్లో విపరీతమైన తేడా ఉంటోంది. అలాగే, పిల్లల్లో శారీరక సామర్థ్యం కూడా చాలా తక్కువ ఉన్నట్లు వెల్లడైంది. టీవీలకు, ఇంటర్నెట్ గేమ్స్‌కు అతుక్కుపోతూ చిన్నారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.

క్రీడలతో శారీరక, మానసిక ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. చిన్నతనంలో ఆటల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆటల వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఫలితంగా పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ పేదరికం పిల్లలకు పెను శాపంగా మారి వారి ఎదుగుదలను కుంగదీస్తోంది. వాస్తవానికి మగపిల్లల్లో ఎదుగుదల జీవితంలో మూడుసార్లు జరుగుతుంది. ఆ సమయంలో సరైన పోషకాహారం తీసుకుంటే వారు ఎత్తు పెరుగుతారని ప్రిన్స్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అంగ్స్ డీటన్ అంటున్నారు. సరైన పోషకాహారం తీసుకోకపోతే ఎన్నో పెరుగుదల లోపాలు ఏర్పడి రాను రానూ మరిన్ని ఇబ్బందులు తలెత్తే పరిస్తితి ఉంది.కాబట్టి సరైన పోషకాహారం తీసుకోవటం మంచిది

Posted on

Foods should not taken when you are sick in Telugu – జబ్బు పడినప్పుడు తీసుకోకూడని ఆహార పదార్థాలు

మన ఆరోగ్యంలో మార్పులు జరగటం సహజం. ఆరోగ్యం ఒకేలా ఉండటం మాత్రం జరుగదు.అయితే  వాతావరణ మార్పులతో పాటు మన శరీరంలో కూడా అనేక మార్పులకు చోటు చేసుకుంటుంది. కాలాన్ని బట్టి వ్యాధులూ మనల్ని ముసురుతాయి. వేసవికాలంలో శరీరం మీద ఎండవేడమి ప్రభావం, శరీరం వేడెక్కడం, చెమటలు, డీహైడ్రేషన్, డయోరీయా ఇలా అనేక జబ్బులు చుట్టుముడుతాయి. అలాగే శీతాకాలం మరియు వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ జబ్బులు ఎక్కువగా ఉంటాయి.

జబ్బు పడినప్పుడు ఆహారాల మీద ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల ఖచ్చితంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో పాటు చాలా త్వరగా జబ్బునుండి తేరుకోవడానికి సహాయపడుతాయి. ఆరోగ్యం చెడినప్పుడు ఏ ఆహార పదార్ధలను తీసుకోకూడదో ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందామా..

1.మిఠాయిలు

సాధారణంగా తీపి అంటే ఇష్టపడనివారుండరు. అదీకాక ఆరోగ్యం చెడినప్పుడు నాలుక చేదుగా ఉండటం వల్ల తీపి తినాలనిపించటం సహజం. అటువంటి సమయంలో మీరు ఖచ్చింతా అదనపు క్యాండీ(స్వీట్స్)లేదా కుకీస్ ను తినకూడదు. ఎందుకంటే స్వీట్స్ లో సాచురేటెడ్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణం అవ్వడానికి చాలా కష్టతరం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని డిజర్ట్స్ కూడా మీరు జబ్బుపడేలా చేస్తాయి.

2.ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్య పునరుద్ధరించడం కోసం బాగా సహాయడపుతుందని ఒక రహస్యం చిన్న బిట్ గా ఉంది. ఎందుకంటే నారింజలో విటమిన్ సి , ఫైబర్ , మరియు సూక్ష్మ పోషకాలకు ఖచ్చితంగా పూర్తిగా ఉన్నాయి, అయితే ఇటీవలే ఒక పరిశోధన జరిగింది.దీని ప్రకారం ఆరెంజ్ నుండి జ్యూస్ ను వేరు చేసినప్పుడు, అదే ఆరోగ్యకరమైన జ్యూస్ ఎక్కువ షుగర్స్ మరియు సోడా కలిగి ఉన్నాయని నిరూపించాయని నిపుణులు తెలిపారు. అలాగే ఇవన్నీ కూడా మీ జీర్ణ వ్యవస్థ పాడయ్యేలా తయారయ్యేందుకు దారితీస్తాయి.

3.రెడ్ మీట్

రెడ్ మీట్ కూడా నట్స్ లాగే మీ శరీరంను ప్రభావితం చేస్తుంది. మీరు జలుబుతో బాధపడుతున్నప్పుడు బర్గర్ తినాలని కోరిక కలిగినప్పుడు, ఆ అదనపు ద్రవాలన్నీ కూడా మీ ముక్కు మరియు ఛాతీలో చేరి ఇబ్బందికి గురి చేస్తాయి.ఎందుకంటే మాంసాహార పదార్థాలన్నింటిలోనూ కాంప్లెక్స్ ఫ్యాట్స్( క్లిష్టమైన కొవ్వులు). మీరు జబ్బుపడిన ఉన్నప్పుడు ఇవి మీ శరీరంపై ప్రబవితం చేస్తాయి.

4.ఆల్కహాల్

ఇక అలవాట్లు అనగానే గుర్తుకొచేది ఆల్కహాల్. అరోగ్యం బాగున్నా, లేకున్నా ఈ అలవాటుకు మాత్రం దూరం గా ఉండటం జరుగదు. అయితే ఆల్కహాల్ కెమికల్స్ తో నిండి ఉంటుంది. వ్యాధినిరోధకతకోసం మీరు తీసుకొనే మందుల మీద ఈ రసాయనాలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. అంతే కాదు, ఆల్కహాల్లో భయంకరమైన అసిడిక్ ఆమ్లం ఉండటం వల్ల మీ కడుపు మీద ఎక్కువ వత్తిడి కలిగిస్తాయి. దీని వల్ల అరోగ్యం బాగా చెదే అవకాశ్.

5.కెఫ్ఫిన్

మన శరీరం త్వరగా అనారోగ్యం పాలు చేయడంలో కెఫిన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. తక్కువ సోడా, చాలా తక్కువ మోతాదులో కాఫీ మరియు చాక్లెట్ వంటివి తీసుకోవడం వల్ల శరీరం త్వరగా కోలుకోవడానికి సహాయపడుతాయి. కానీ కెఫినేటెడ్ ఫుడ్స్ మరియు డ్రింక్స్ పంచదారతో నిండి ఉంటాయి, కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.

6. పచ్చికూరలు

చాల మంది అనారోగ్యంగా ఉన్నప్పుడు పచ్చికూరలు తినడం వల్ల త్వరగా కోలుకుంటామనుకుంటారు. కానీ వాటిని ఖచ్చితంగా ఉడికించి తీసుకోవాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు పచ్చి కూరలు కడుపులో గ్యాస్, పొట్ట ఉబ్బరంకు దారితీస్తుంది మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ను కూడా పెంచుతుంది.

7. స్పైసి

మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు కారంగా ఉండే ఆహారాలు తిన్నాకూడా రుచిగా అనిపించదు. కానీ, మీ జలుబును నుండి తక్షణ ఉపశమనం పొందడానికి కొన్ని మసాలా దినుసులు (మిరియం, అల్లం) వంటివి బాగా ఉపయోగపడుతాయి. అయితే మీకు గ్యాస్ సమస్య లేదా స్టొమక్ అప్ సెట్ వంటి సమస్యలు లేకుంటేనే తీసుకోవచ్చు. అధికంగా కారంగా ఉన్న ఆహారాలు, చీజ్ మరియు బీన్స్ వంటి ఆహారాలకు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దూరంగా ఉండాలి.

8. మాంసాహారం

మాంసాహారాన్ని చూడగానే నోరూరుతుంది. అదీకాక అరోగ్యం బాగాలేనప్పుడు ఈ మసాలాలు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. మాంసాహారాలు ముఖ్యంగా బేక్ చేసిన(కాల్చిన) వాటిలో అదనపు చెక్కరలు లేదా ఉప్పు స్థాయిలు ఉంటాయి. మాంసాన్ని బేక్ చేయడం లేదా సరిగా వండకపోవడం వల్ల మాంసాహారంలోని నైట్రేట్స్, నైట్రైట్స్ గా మారుతాయి, ఇటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ కు దారితీస్తుంది. అనారోగ్యం కారణం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల, నైట్రేట్లు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

9. నట్స్

మీరు జబ్బుపడిన ఉన్నప్పుడు నట్స్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వేరుశెనగ ఎక్కువ శ్లేష్మం (పైత్యాన్ని) సృష్టిస్తుంది. ఇది మీరు జలుబుతో పోరాడుతున్నప్పుడు మరింత ఇబ్బందికి గురిచేస్తుంది. అలాగే నట్స్ తినడం వల్ల మలబద్దకఅం మొదలవుతుంది.

10. పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులలో చాలా వరకూ ఫ్యాట్ కంటెంట్ మరియు కాంప్లిసిటిలు ఎక్కువగా ఉంతాయి. కొంత మందిలో అనారోగ్యంగా ఉన్నప్పుడు మిల్క్ అలర్జీ కూడా ఉంటుంది. అందుకే అనారోగ్యంగా ఉన్నప్పుడు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

Posted on

Best food tips for the infants in Telugu – మీ పిల్లల ఆరోగ్యము,ఆహార నియమాలు(పద్దతులు)

చిట్టి పొట్టి చిన్నారులనుంచి, తప్పటడుగులు వేస్తూ చాక్లెట్ తినే పిల్లలవరకూ వారి తల్లిదండ్రులలో ఉండే ఒకే ఒక్క ఆవేదన పిల్లల ఆహారము,వారి సం రక్షణ, అయితే,పిల్లలు ఎదిగే వయస్సులో ఉన్నప్పుడు వారి అహారం పొషకపదార్దాలతో సరి సమానంగా ఉండాలి, తక్కువ కాకుండా, అలా అని ఎక్కువ కాకుండా సరిచూసుకోవాలి. సాద్యమైనంత వరకూ తల్లి పాలు తగ్గించి, పొషకపదార్దాలు నిండిన ఆహారం అందించడం ఎంతో అవసరం, అయితే ఇక్కడ సూచించిన నియమాలు మీ పిల్లల ఎదుగుదలకు, అరోగ్య సం రక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి.

మొదటి 4 నెలలు,ఆహార నియమాలు:

పుట్టిన వెంటనే మొదటి 3 వారాలు పాలు 1/2 నుంచి 1oz,4 ఒజ్ వరకు ఇవ్వవచ్చు, ఇలా 2-3 గంటలకు ఒకసారి అలా రోజుకి 8 సార్లు ఇవ్వవచ్చు .
మొదటీ 3 వారాల నుంచి 4 నెలలు వరకు:
4-6 oz పాలను ఇవ్వాలి అలా 4 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 6 సార్లు ఇవ్వాలి.
ఈ వయస్సులో వారి జీర్ణ అవయవాలు ఎదిగే సమ్యయం కాబట్టి,తల్లి పాలు, లేదా పోత పాలు మత్రమే ఇవ్వాలి.

4 నెలలు నుంచి 6 నెలల వరకు,ఆహార నియమాలు:

తల్లి పాలు లేదా స్వచ్చమైన పోత పాలు ఇవ్వడం మంచిది.
5-7oz, పాలను ఇవ్వాలి అలా 5 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 5 సార్లు ఇవ్వాలి.
ఈ వయస్సులో కొద్ది కొద్దిగా ద్రవం రూపంలో బలాన్ని చేకూర్చే ఆహారం, అంటే మెత్తగా కలిపి, లేదా నీటిలో నానబెట్టి,స్పూనుతో పట్టించాలి,

6 నెలలు నుంచి 9 నెలల వరకు,ఆహార నియమాలు:

తల్లి పాలు లేదా స్వచ్చమైన పోత పాలు ఇవ్వడం మంచిది.
7-8 oz, పాలను ఇవ్వాలి అలా 6 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 4 సార్లు ఇవ్వాలి.
చిన్నారులు తింటున్నారు కదా అని ఎక్కువశాతం పెట్టకుండా కొంచెం, కొంచెం గా పప్పు,పండ్లు,మెత్తగా ముక్కలు చేసి తినిపించాలి.
ఇలా రోజుకి 2-3 సార్లు,3-9 స్పూన్లు తినిపించవచ్చు.
ముందుగా, మెల్లగా ఒక స్పూన్ పండ్లు, లేదా పండ్ల రసం పట్టించాలి, అలా అలా మెల్లగా1\4 కాప్పు,1\2కప్పు పెంచుతూ రోజుకు 2-3 సార్లు ఇవ్వడం మంచిది.
పండ్లలో అరటి పండు,ఆపిల్,అవకాడో పండు, దానిమ్మ,ఉడికించిన క్యారెట్,ఇలా తినిపించవచ్చు.

9 నెలలు నుంచి 12 నెలల వరకు,ఆహార నియమాలు:

7-8 oz పాలను ఇవ్వాలి అలా 6 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 4 సార్లు ఇవ్వాలి.
ఈ వయస్సులో మరికొన్ని పదార్దాలను అలవాటు చేయాలి, అవి ఏమిటంటే,వెన్న,”ప్రొటీన్లు కలిగిన ఆహారం” ,పండ్లు,చిన్న చిన్న కూరగాయలు ,ఇలా తినిపించడం మంచిది.
ఒక కప్పుతో పండ్ల రసములు ఇవ్వడం ఎంతో మంచిది.
Posted on

Health benefits of eating apples in Telugu – ఆపిల్ వల్ల కలిగే ఉపయోగాలెన్నో???

అందరికీ సుపరిచితం అయిన ఈ పండు గురించి ఎక్కువగా వర్ణించవలసిన అవసరం లేదు, కాని ఈ ఆపిల్ తీసుకోవడంవల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది,ఇది మీకు మంచి పోషకాలు సమకూర్చి మిమ్మల్ని ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అయితే శాస్త్రవేత్తలు దీని పై అనేక ప్రయోజనాలపై అద్యయనం చేస్తున్నారు,ఇది రోజు తీసుకుంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని డాక్టార్లు సూచిస్తున్నారు, అయితే మన అరోగ్యానికి ఆపిల్ వేసే మంత్రం ఏమిటో చుసేద్దామ.

1.కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

ఆపిల్ ను క్రమంతప్పకుండా తీసుకుంటే, మీ ఒంట్లోని కొవ్వు శాతాన్ని తగ్గించడమే కాకుండా, గుండెకు హాని కలగకుండా కాపాడుతుంది, ముఖ్యంగా ఈ ఆపిల్ లో ” పెక్టిన్”అనే పదార్దం పుష్కలంగా కలిగి ఉంది, ఇది మన శరీరంలోని కొవ్వు పదార్దాలను నిర్మూలించడంలో
సహయపడడమే కాకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

2అధిక రక్త పోటును తగ్గిస్తుంది:

మీరు సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే గుండె వ్యాధులు మరియు రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ, అయితే రోజుకో ఆపిల్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే “మినరల్స్”,”పొటాషియం”,మీ రక్త పోటును తగ్గించుటలో సహాయపడుతుంది.

3.మెదడుకు సంబందించి వ్యాదులను తగ్గిస్తుంది:

ఒక అధ్యయనంలో ఈ ఆపిల్ జ్యూస్ రోజు తీసుకోవడం వల్ల మీ మెదడుకు సంబందించిన వ్యాదులను అరికట్టడమే కాకుండా మీ మెడదును సం రక్షించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, ఈ అధ్యయనంలో దీనిని ఒక “ఎలుక”పై ప్రయోగించారు,రోజూ ఎలుకకి ఆపిల్ జ్యూస్
పట్టించడం ద్వారా సాదరణ ఆహారం కన్నా ఈ ఆపిల్ లో “న్యూరోట్రాన్స్మిటర్ ఎసిటైల్” అధిక స్థాయిలలో ఉంది అని నిరూపించబడింది.

4.పెద్దప్రేగు కాన్సర్ నివారణలో:

మన కడుపులో ఉండే పేగులు సరిగా లేకపోతే అది మనకు “జీవన్మరణ” సమస్యే అవుతుంది, అయితే ఈ ఆపిల్ ని రోజు తీసుకోవడం ద్వారా, ఈ సమస్యలో మారణాన్ని జయించి జీవాన్ని కొనసాగిస్తారు,ఆపిల్ లోని “ఫైబర్”లక్షణాలు మీ కడుపులో ఉండే క్యాన్సర్ తో పోరాడి మిమ్మల్ని
దాని బారి నుండి రక్షిస్తుంది.

5.మీ గుండెను రక్షిస్తుంది:

సామాన్యంగా మన రక్త కణాలు, రక్త ప్రసరణ సరిగా లేదంటే దానికి సాకులు(కారణాలు) వెతుక్కోనవసరం లేదు, అందుకంటే దానికి కారణం సరియైన, పొషకమైన ఆహారం తీసుకోకపోవడమే. అయితే వీటన్నిటికి ఈ ఆపిల్ తో సమాధానం ఇవ్వండి, రోజు ఆపిల్ తీసుకోండి, మీ గుండె
జబ్బులను నయం చేసుకోండి.

6.ఆస్తమాని తగ్గిస్తుంది:

ఆపిల్లో ఉన్న “ఫైటో కెమికల్స్” పదార్దాలు “ఫ్లవనోయిడ్స్”,”ఫినోలిక్ యాసిడ్” మీ శ్వాస సంబందిత వ్యాదులనుండి రక్షించడంలో ఎంతగానో సహాయ పడుతుంది,అంతే కాకుండా ఈ దీనిని(ఆపిల్) రోజూ తీసుకుంటే “ఆస్తమాని” జయించవచ్చు.

7.ఎముక రక్షణకు సహాయపడుతుంది:

మీ యముకల రక్షణలో కూడ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది,దీనిలో ఉన్న “ఫోలోరిడ్జిన్”మీ ఎముకల సమస్యను తరిమికొడుతుంది,అంతే కాకుండా మీ ఎముకలను గట్టిగా, దృడంగా చేస్తుంది. ఇది పెద్దవారు, చిన్నవారనే కాదు,అందరు తీసుకోవచ్చు.
అందుకే పాతదే అయిన మళ్ళీ చెప్పేది ఒక్కటే “రోజుకో యాపిల్ తినండి, డాక్టర్ కి దూరంగా ఉండండి”
Posted on

Best food to control the diabetes in Telugu – మదుమేహం మిమ్మల్ని బాధిస్తుందా? ఆహార నియమాలు చూసేద్డామా

మన ప్రస్తుత జీవన శైలిలో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అతిచిన్నవయస్సులో వాచ్చే ప్రమాదం ఏమిటంటే “షుగరు వ్యాది”దీనికి వయస్సుతో సంబందంలేదు, 25 యేళ్ళ నుంచి 70 యేళ్ళ వృద్దుల వరకూ ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అయితే ఇది ఎందువల్ల వస్తుంది అంటే,ఈ గజిబిజి గందగోళంలో, బిజీగా ఉండే జీవనశైలిలో,ఆహార నియమాలు పాటించడం మర్చిపోవడం వల్ల,అస్తవ్యస్తంగా ఆహారం తీసుకోవడం వల్ల.
అయితే ఒక్కసారి ఈ వ్యాది వచ్చిందంటే నిర్మూలన లేదూ, మనం చెయ్యవల్సిందల్లా సరియైన ఆహారం తీసుకుంటూ  మీ రక్తంలో చక్కెర స్థాయిలను కాపాడుకుంటూ ఉండడమే.

ఈ వ్యాది నిర్మూలనకి కొన్ని ఆహార నియమాలు చూసేద్డామా:

వోట్మీల్:

వోట్మీల్ అనేది మీ షుగర్ వ్యాదిని నిర్మూలించడంలో ఎంతగానో సహాయ పడుతుంది, ఇందులో ఉన్న “ఫైబర్”పదార్దం మిమ్మల్ని ఈ వ్యాది నుండి రక్షిస్తుంది. అంతే కాకుండా ఈ వోట్మీల్ ని రోజూ అల్పాహారంతో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.

యాపిల్స్ :

ఎవరో చెప్పినట్లు “రోజుకో యాపిల్ తినండి, డాక్టర్ కి దూరంగా ఉండండి”అనే నానుడి, అక్షరాలా సత్యమైనది, ఎందుకంటే యాపిల్ తినడంవల్ల అందులో ఉన్న అతి తక్కువ క్యాలరీలు కలిగిన “ఫైబర్”మీ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా,  చెడు కొలెస్ట్రాల్ ను నిర్మూలిన్స్తుంది. అయితే యాపిల్ ను తొక్కతో సహా తీసుకుంటే దానిలో ఉండే “యాంటీ ఆక్సిడంట్స్”మిమ్మల్ని ఈ వ్యాదినుంచి రక్షిస్తుంది.

బీన్స్:

బీన్స్ ని ఉడకపెట్టి,ఎండబెట్టి, లేదా నీటిలో నానబెట్టి,ఏరకంగా అయినా సరే తీసుకోవడం వల్ల మీ ఈ వ్యాదిని అరికట్టి, రక్త కణాలలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.అయితే ఈ బీన్స్ లో ఉన్న “ప్రొటీన్లు” శాకాహారులకు మంచి బలాన్ని ఇస్తాయి.

టీ:

ఈ వ్యాదినుండి రక్షించే వాటిలో టీ కూడ ఒకటీ,సామన్యంగా చాలమంది యొక్క దినచర్య ప్రొద్దున్నే ఒక కప్పు టీ తోనే మొదలవుతుంది, అయితే టీలో ఉన్న “ఫైటో న్యూట్రీన్లు” మిమ్మల్ని ఈ సమస్య నుంచి రక్షిస్తాయి.అందుకే ప్రతిరోజూ టీ తాగితే ఈ సమస్యని దూరం చేయవచ్చు .

కాయగూరలు మరియూ గింజలు:

ఈ సమస్య ఉన్న వాళ్ళు కాయగూరలు మరియూ గింజలు ఎక్కువగా తినాలి,అలా తింటే రక్తం లోని  చక్కెర స్థాయిలను నియంత్రించి మిమ్మల్ని గుండె జబ్బులకు దూరంగా కూడా ఉంచుతుంది,ఇందులో ఉండే ప్రొటీన్లు, ఫైబర్, మీ ఆరోగ్య సం రక్షణలో,ఎంతగానో సహాయపడుతుంది .

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల  అందులో ఉన్న పీచు పదార్దము, “విటమిన్ C” మీ చక్కెర స్థాయిలను నియంత్రించి, బలమైన పోషక పదార్దాలను మీకు అందిస్తుంది, ఇందులో కొవ్వు శాతం కూడా అతితక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది మిమ్మల్ని షుగరు వ్యాది నుంచి రక్షిస్తుంది.

బియ్యపు బ్రెడ్:

ఇది కూడా మిమ్మల్ని మదుమేహం నుండి రక్షిస్తుంది.ఇందులో ఉన్న “ఫైబర్”పొషకాలు  మీ చక్కెర స్థాయిలను నియంత్రించి,మీ శరీరంలోని  ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది

ఆలీవ్ నూనె:

ఆలీవ్ నూనె మీ చర్మ సం రక్షణలో ఎలా ఉపయోగ పడుతుందో అలానే మీ ఈ వ్యాది నిర్మూలనలో కూడా అలానే సహాయపడుతుంది. దీని వల్ల,గుండె జబ్బులు కూడా నయం అవుతాయి.అలానే ఈ మదుమేహ సమస్యను తరిమేయడంలో ఎంతో సహాయ పడుతుంది.ఆహారం అరుగుదలకు కూడా ఎంతో ఉపయోగ పడుతుంది.

 చేప :

ఈ మదుమేహం గుండె జబ్బుకు దారి తీసే ప్రమాదం ఉంది అందు వల్ల చేపలు ఎక్కువగా తింటే, ఈ సమస్యనుండి ఉపశమనం లబించడమే కాకుండా 40% వరకు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. చేపలో ఉన్న Omega 3 కొవ్వు ఆమ్లాలు  మిమ్మల్ని ఈ సమస్య నుంచి రక్షిస్తాయి.

క్యారెట్:

క్యారెట్ ఆరోగ్యానికే కాదు మీ మదుమేహ నిర్మూలనకూ ఎంతగానో ఉపయోగపడుతుంది.రోజు క్యారెట్ తింటే మీ ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా కంటి చూపు బాగా ఉంటుంది,అలాగే మీ చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
Posted on

Health benefits of coconut milk in Telugu – కొబ్బరి పాలు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎలా సహాయ పడతాయి ?

రోజూ ఒక గ్లాసు పాలు తాగితే మంచిది అని అందరూ సూచిస్తారు, కాని ఆవుపాలకన్నా కొబ్బరిపాలు ఎంతో ఆరోగ్యకరమైనవి అని ఎంత మందికి తెలుసు?

కొబ్బరి పాల ప్రత్యేకత ఏమిటంటే:

 • ఇవి ఆవుపాలకన్నా  ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తాయి,అంతేకాకుండా ఆవు పాలతో పోలిస్తె,అతి సులభంగా జీర్ణం అవుతాయి.

 • దీనిలో “Omega”అను ఆమ్లాలు 3, 6 మరియు 9 శాతం అధికస్తాయిలో ఉండి,ఈ ” Omega “లో అమైనో ఆమ్లాలు మరింత అదికంగా ఉన్నాయి, వీటన్నిటి కలయికతో కూడిన ఈ కొబ్బరి పాలు ఒక సంపూర్ణ భోజనముగా అనిపిస్తుంది.

 • ఈ పాల మన జీర్ణ సమస్యలు తొలగించడమే కాకుండా,జీర్ణాశయంకు కలిగిన నస్టాన్ని తొలగించటలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

 • ” IBS “,” Crohn’s ” వంటి వ్యాదుల నుండి రక్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

 • ఎంతో మందికి “పాల ఉత్పత్తులు”వాడకం ఇష్టం ఉండదు, అయితే అలాంటివారు ఈ కొబ్బరిపాలను తీసుకుంటే ఎంతో మంచిది.

 •  ఇందులో భాస్వరం మరియు కాల్షియం వంటి పొషక పదార్దాలు ఉండడంవల్ల,మీ యముకలని భలంగా ఉంచుతుంది,సామాన్యంగా భాస్వరం వల్ల మీ యముకలకు బలం వస్తుంది.యముకకు సంబందించిన ఏవైన ఇబ్బందులు ఉన్ననూ వాటిని తొలగించి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

 •  దీనిలోని “గ్లూకోజ్”,రక్తములో చక్కెర నిల్వలు తక్కువగా ఉన్న వారికి ఎంతోగానో సహాయ పడతాయి.

 •  మీ కీళ్ళ నొప్పులను తగ్గించడంలో ఎంతో మంచి మందులా మీరు ఉపయోగించుకోవచ్చు.

 • ఇందులో “పొటాషియం” కలిగి ఉండడం వల్ల అది మీ శరీరంలోని ఒత్తిడిని తగ్గించి మంచి ప్రబావాన్ని చూపిస్తుంది.

 • దీనిలోని “Vitamin C” మీ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

 • రోజుకో కప్పు కొబ్బరి పాలు తీసుకుంటే మీలోని రక్త హీనతను తొలగించవచ్చు.

 • మీ యముకలలోని నొప్పి, వాపు, ఇలాంటి వాటిని దూరం చేసి మీకు మంచి ఫలితాలను అందిస్తుంది.

 •  దీనిలోని ఖనిజాలు మిమ్మల్ని క్యాన్సర్ బారి నుండి రక్షిస్తాయి .

 •  మీరు అధిక బరువుతో బాదపడుతంటే ఈ కొబ్బరినీరు మీకు ఎంతో మంచిది.

Posted on

Telugu food feeding tips to 1-2 years kids – ముద్దులోలికించే పసి పిల్లలకు(1-2 ఏళ్ళు) ఆహార జాగ్రత్తలు

ముద్దులోలికించే పసి పిల్లలంటే ఇష్టపడని వారుండరేమో,ఎన్ని కష్టాలు అనుభవిస్తే మాతృత్వం లభిస్తుందో, అంతే ఆనందం ఆ చిట్టి పొట్టి పిల్లలు అడుగులు వేస్తుంటే కలుగుతుంది,అయితే వారి పట్ల తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి,తల్లినుంచి లబించే ఆహారం,సరిపోయినప్పటికీ,వాళ్ళ ఎదుగుదలకు ఎన్నో రకములైన పోషక పదార్దాలు అవసరం.సమాన్యంగా పిల్లలు సంవత్సర కాలంలో 3-5inch మాత్రమే పెరుగుతారు, అయితే వారివారి వయస్సు,చురుకుతనం, బరువుని దృష్టిలో ఉంచుకుని రోజుకి 1,000-1,400 క్యాలరీలు ఉండే ఆహారం ఇవ్వాలి.అదేవిధంగా క్రమం తప్పకుండా, డాక్టర్ ని సంప్రదిస్తే మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించనవసరం లేదు.
 తప్పటడుగులు వేసే మీ చిన్నారులకు ఆహార నియమాలు ఇవే:
ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చే ఆహారం:
మీ పిల్లలు తినేటప్పుడూ ఎక్కువగా అల్లరి చేస్తూ, ఒక్కొక్కటే తింటూన్నారా,అయితే ఆ ఒక్క వాటిలోనే అన్ని రకముల పోషక పదార్దాలు ఉండేలా చూసుకోవాలి,కొంచెం కొంచెం పెడుతూ తినిపిస్తూ ఉండాలి, అంతే కాకుండా వెన్న, బన్ను,వేరుసనగ వెన్న, ఇలా తినిపిస్తూ ఉంటే మంచిది.
 మీ బుజ్జి పాపకి లేదా బాబుకి “డ్రింక్స్” తయారుచేయండి:
అందమైన మీ చిన్నారులకి ద్రవం రూపంలోనే ఎక్కువ పొషకాలు పట్టించండి, అయితే ఎక్కడ “జ్యూస్” లను కాకుండా పాలు, నీరు, కొంచెం పండ్ల రసము కలిపిన నీరు కలిపి పట్టిస్తే ఎంతో మంచిది .
 చిరు తిండి:
ఎప్పుడూ అల్లరి చేస్తూ ఆడుతూ మనల్ని నవ్వించే మన పసిపిల్లలు ఆడీ ఆడీ, అలసిపోతారు, అందుకే కొంచెం సమయం తరువాత కొద్ది కొద్దిగా చిరుతిండి తినిపిస్తే ఎంతో మంచిది, చిరుతిండి అనగానే మనం తినేవి కాకుండా, పొషక పదార్దాలతో కూడినవి,”యాపిల్ సాస్, వెన్న,కేక్,క్యారెట్”ఇలా.
 తిండిలోని మార్పులో:
ఆ చిన్నవయస్సులో, ఏమి తెలియని పసిపిల్లలకు రోజు ఒకే రకమైన ఆహారం పెట్టడం మంచిది కాదు, బోర్ కొట్టి తినడం మానేస్తారు, మనమైనా అంతేకదా, రోజూ ఒకే రకమైన కూర తింటే మనకైనా బోర్ కొడుతుంది.
అందుకే రోజుకోరకంగా రంగు, రుచి,వాసన, మరియూ పొషక పదార్దాలు,మారుస్తూ, పెట్టడం మంచిది,మరియూ మీ పిల్లలకు అరటి పండు, యాపిల్ ని ముక్కలుగా చేసి తినిపించడం, లేదా వాటిలో పెరుగు కలిపి పట్టించడం మంచిది.
 అధికంగా తినిపించే కన్నా పౌష్టికమైన ఆహారం కొంచెమైనా చాలు:
ఒకవేళ మీ పిల్లలు ఎక్కూవగా తినకపోయినా,  తినిపించేది తక్కువైన పౌష్టికమైన ఆహారం ఇవ్వడం ఎంతో అవసరం.అంటే ఎక్కువగా తినిపించనవసరం లేదు, కొద్దిగా అయినా బలాన్ని చేకూర్చే ఆహారం పెట్టడం మంచిది.
 వాళ్ళు తినడం లేదు అని ఎక్కువగా అలోచించి కంగారు పడనవసరం లేదు, మీరు చెయ్యవలసిందల్లా, వాళ్ళు తినే కొంచెం ఆహారంలో అయినా పొషక పదార్దాలు నిండుగా ఉండేలా చుసుకుంటే సరిపోతుంది,
ప్రోటీన్లు, కాల్షియం, మినరల్స్, Vitamin C,పండ్లు, తృణధాన్యాలు, కొవ్వులు, సమృద్ధిగా ఉండే ఆహారాలు మీ పిల్లలకు ఇవ్వండి.
 పైనవన్ని పాటించి మీ చిట్టి పొట్టి పిల్లలకు సరైన ఆరోగ్యంతో పాటు,వయస్సుతో సరిసమానమైన ఎదుగుదల కావాలంటే వారిని ఆటలు ఎక్కువగా ఆడించండి.
Posted on

Health benefits of capsicum in Telugu – మీ ఆరోగ్యం గురించి బెంగుళూరు మిరపకాయ(కాప్సికమ్) చెప్పే కబుర్లు

సామాన్యంగా ఘాటునిచ్చే మిరపకాయ అంటే తెలియని వాళ్ళుండరు,అదేవిధంగా అందరికీ కాకపొయినా ఎక్కువమందికి తెలిసినదే ఈ “కాప్సికమ్”,దీనిని ముద్దుగా “బెంగుళూరు మిరపకాయ”,బెల్ పెప్పర్”,” చిల్లీ” అని కూడా పిలుస్తారు.
దీనిని ఎన్నో సంవత్సరాల నుంచి పెద్ద సంఖ్యలో పండిస్తున్నారు, ఇది 2 రకముల రంగులలో పండుతుంది, ఆకుపచ్చ రంగు, ఏరుపు రంగు, అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఇది అధిక విటమిన్లు, మరియూ ఎన్నో ఔషద లక్షణాలు కలిగి,  ఎన్నో వ్యాదులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.

ఈ మిరపకాయ వల్ల కలిగే లాభాలు ఇవే:

 క్యాన్సర్ నివారణ:

క్యాప్సికం క్యాన్సర్ నివారణలో ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న కాంపౌండ్స్ “Capsaicins “మన రక్త కణాలతో కలిసి క్యాన్సర్ బారినుండి రక్షిస్తాయి.

జుట్టు:

దీని వల్ల జుట్టు ఉత్పత్తి బాగా అవ్వడమే కాకుండా,జుట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది.అంతే కాకుండా, మీరు ఎక్కువ జుట్టు కలిగి ఉండడానికి ఎంతో సహాయ పడుతుంది.

 కళ్ళు మరియు చర్మము:

ఇది తినడం వల్ల మీ చర్మం ఎంతో తాజాగ, మొటిమలు లేకుండా,అందంగా ఉండడమే కాకుండా, దీనిలో ఉన్న “Vitamin A” మీ కళ్ళకు సం రక్షణగా  ఉపయోగ పడుతుంది.

 క్యాలరీలను తగ్గించుట:

ఇది మీ శరీరంలోని అనవసరమైన కాలరీలు తగ్గించు, మీరు అధిక బరువుతో బాదపడుతుంటే, దానిని తగ్గించి మిమ్మల్ని విముక్తుల్న్ని చేస్తుంది, అంతే కాకుండా ఇది మీ గుండెకు ఇబ్బంది కలిగించే మలినాలు అంటే కొవ్వు పదార్దాలను కరిగించి ఏ విదమైన ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని రక్షిస్తుంది.

 నొప్పి నిర్మూలన:

ఇది తీసుకోవడం వల్ల మీ చర్మంలోని నొప్పిని మీ శరీర అంతర్బాగాలకు సోకకుండా,పుండ్లు పడకుండా ఎంతగానో రక్షిస్తుంది.నొప్పిని తగ్గించి మీకు మంచి ప్రబావాన్ని చూపిస్తుంది.
Posted on

Telugu home kitchen ingredients like medicines – వంటింట్లో దాగి ఉన్న ఔషధాలు

రోజూ మాటిమాటికీ వంటింట్లోకి వెళ్ళందే ఆడవారికి పని జరగదు.అయితే మనకు శరీరంలో ఏర్పడే వ్యాధులకు చక్కని ఔషధ లక్షణాలు మన పోపుల పెత్తేలోనే దాగున్నాయి తెలుసా..! ప్రతివారి ఇంట్లోను సాధారణంగా వంటింట్లో కనిపించే వస్తువు పోపుల పెట్టి.పోపుల పెట్టిలో దినుసులు లేకుండా ఏ పనీ ఏ వంటా జరగదు.అదే పోపుల పెట్టెలో మన అరోగ్యం దాగి ఉందని మనలో చాలా మందికి తెలియదు.ఆ పోపుల పెట్టెలో ఉన్న ఆరోగ్య సూత్రాలను ఇప్పుడు తెలుసుకుందాం.
 •  అల్లం అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుందని, ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం ఘోషిస్తోంది. వికారం, వాంతులు, విరోచనాలను నివారిస్తుంది. . గర్భవతులలో ఉదయం పూట వికారాన్నికడుపునొప్పిని అల్లం నివారిస్తుంది.
 •  దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ, కొలెస్ట్రాల్, ట్రెగ్లీసెరైడ్ స్థాయిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
 •  కుంకుంపువ్వు  చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దేశ విదేశాలలో ఆహార పదార్థాలలో రుచి, రంగు, సువాసన కోసం వాడే కుంకుమపువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు వున్నాయి.
 • వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి.పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో అధికంగా వున్నాయి.
 • జీలకర్ర జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని క్యూమిక్ డీహైర్ అనే పరిమళం లాలాజల గ్రంధులను క్రీయాశీలం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా వుంచుతుంది.
 • ఫెన్నల్ ఇది మరువంలాంటి మొక్క. దీన్ని కూరల్లో వాడుతారు. ఫెన్నెల్స్ డైయూరిటిక్ గుణం కలిగి ఉంది. ఇది ఋతుస్రావ సమయంలోని ఇబ్బందుల్ని తొలగిస్తుంది. పొత్తికడుపులకు ఉపశమనాన్నిచ్చే శక్తి ఫెన్నల్ తైలానికి ఉంది. పాలిచ్చే తల్లులలో పాలు సమృద్ధిగా వుండడానికి ఎంతో తోడ్పడుతుంది
 •  లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు దంత రక్షణనిస్తాయి. నోటిని, శ్వాసను తాజాగా వుంచుతాయి. హృదయానికి ఆరోగ్యాన్నిస్తాయి. యాంటిసెప్టిక్, యాంటీబయోటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు.
 • ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది.
 •  మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. బ్లాక్ కాఫీలో మిరియాలపొడి వేసుకుని తాగితే ఋతుక్రమ సమయంలో ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇస్తుంది.
 • పచ్చి ఏలకులు శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు ఏలకులు వేసిన పాలను తాగించాలి. ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి, శ్లేష్మాన్ని తొలగించే శక్తి ఏలకులకు ఉంది.ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది.