Posted on

Health benefits of sprouts in Telugu – మీ ఆరొగ్యానికి మొలకలు!!!

 

గజిబిజి పరుగులు, బిజీ బిజీ బ్రతుకులతో అనుక్షణం యాంత్రిక జీవితాన్ని అలవర్చుకుంటున్న తరుణంలో ఆరోగ్య సమస్యలూ ఎన్నో… ఇందులో ప్రధనంగా అసమతుల్య ఆహారపు అలవాట్లతో స్థూలకయ సమస్య ఏర్పదుతుంది. ఈ సమస్య ప్రతివారిలోనూ ఆందోళనను రేకెత్తిస్తుంది. దీనిని అధిగమించాలని మనసులో ఉన్నా ఆచరణలో పెట్టలేకపోతున్నారు. మనముందున్న తేలికైన మార్గం మొలకలని ఆహారంగా స్వీకరించడం. మరి మొలకలు అందించే ఆరోగ్య వరాలేమిటో తెలుసుకుందామా….. పాలు, పళ్లు, కూరగాయలు, వ్యాయామాలు… ఇలా ఎన్నో….

మొలకలతో వంటకాలు, మొలకలతో సలాడ్‌లు చేసుకోవడం, తినడం ఇటీవల పెరిగాయి. మొలకలు అన్నివిధాలా ఆరోగ్యానికి సోపానాలని అందరూ అంగీకరిస్తున్నారు. ఇవి కొద్దిగా తిన్నా కడుపు నిండుతాయి.  మొలకల వల్ల అత్యవసర వైద్యసంబంధ లాభాలు కూడా ఉన్నాయి. కేలరీలు పెరగవు. మొలకలు ఆరోగ్యానికి చాలా మంచిది. సన్నగా, నాజూకుగా మీ శరీరం మారాలనుకుంటే మొలకలే ఆరోగ్యం.

ముల్లంగి, ఆల్ఫాల్ఫా, క్లోవర్, సోయాగింజలు, బ్రకోలి అద్భుతమైన మాంసకృతులను కల్గి విస్తృత శ్రేణిలో వివిధ పోషకాహారాలతో చక్కటి ఆరోగ్యాన్ని కల్గించడానికి సహాయపడతాయి. మొలకలు మనల్ని కొన్ని రకాల వ్యాధుల నుండి కాపాడే సామర్థ్యం కలిగివున్నాయని నిపుణులు చెబుతున్నారు. మొలకలు తిన్నందు వలన కలిగే కొన్ని ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలుకొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము…

1. సమృద్ధిగా అత్యవసర పోషకాలు: మొలకలలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 6, విటమిన్ కె ఉన్నాయి. దీనితో బాటుగా ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాసియం, మాంగనీసు, కాల్షియం కూడా సమృద్ధిగా ఉన్నాయి. మొలకలలో పీచు, ఫోలేట్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. మొలకెత్తిన గింజలు, ధాన్యాలు, కాయ ధాన్యాలలో ఈ పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. మొలకెత్తిన గింజలలో విటమిన్ ఎ ఎనిమిది రెట్లు పెరుగుతుంది.

2. మొలకలలో మన శరీరానికి ఉపయోగమైన, ఆరోగ్యకర౦గా ఉంచే ఎంజైములు సమృద్ధిగా ఉన్నాయి. ఆహారాన్ని వండినప్పుడు వీటిలో కొన్ని ఎంజైములను నష్టపోతాము. అందువల్ల తాజా మొలకలను తిని శక్తివంతమైన ఎంజైములను పొందాలి.

3. అధిక మాంసకృతులు: మొలకలలో మాంసకృతులు అత్యంత ఎక్కువ స్థాయిలో ఉన్నాయన్న వాస్తవం చాలామందికి తెలియదు. నిజానికి వీటిలో 35 శాతంవరకు మాంసకృతులు ఉంటాయి. మీ ఆహారానికి మొలకలు జోడించడం వలన మీ శరీరానికి అవసరమైన మాంసకృతులను అందించడమే కాక జంతువుల మాంసాల వలన వచ్చే కొవ్వును, కొలెస్టరాల్‌ను, క్యాలరీలను తగ్గిస్తుంది.

4. ఎక్కువగా శాకాహారం ఇష్టపడే వారికి, శాకాహారులకు మొలకలు ఎంతగానో సిఫార్సు చేయబడ్డాయి.

5. మొలకలలో మీరు ఇష్టపడే మరొక విషయం అవి ఎంతో తేలికగా జీర్ణమౌతాయి. మొలకలను తినడం జీర్ణసంబంధ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇవి పిల్లలకు, పెద్దలకు కూడా ఉత్తమమైనవి.

6. మొలకలలో పీచు ఎక్కువ స్థాయిలో ఉండడంతో, క్యాలరీలు తక్కువగా ఉండి బరువు తగ్గించుకొనేందుకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. మొలకలను తినడం వలన ఎక్కువ క్యాలరీలను పొందకుండానే పోషకాలను పొందవచ్చు. మీరు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం మీ ఆహార ప్రణాళికలో మొలకలను జోడించండి.

7. మొలకలు ఆరోగ్యానికి మంచివే కాక అవి ఎంతో రుచికరమైనవి కూడా. మీ సలాడ్లకు, సూప్ లకు, మాంసపు వంటకాలకు, పాస్తాకు మరింత రుచిని జోడించి మీకు ఆకలిని పుట్టిస్తాయి. శెనగలు, పెసలు, సోయా,అలసందలు బఠానీ తదితర పప్పు దినుసులతో మొలకలు తయారుచేసుకోవచ్చు.

8. గర్భిణీ స్త్రీలు మొలకలు తింటే వారికే కాదు, పుట్టే బిడ్డకూ ఆరోగ్యం. మొలకలు జీర్ణమవడానికి పట్టే సమయం తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు మొలకల్లో అధికం. శరీర కణాలకు మొలకలు చాలా మేలు చేస్తాయి. కేన్సర్‌ను నిరోధించగల శక్తి మొలకల్లో ఉంది. మొలకల్లో లభ్యమయ్యే విటమిన్‌ బి, డి శరీరానికి చాలా అవసరం. ఇందులోని ఫాస్పరస్‌ పళ్లకు, ఎముకలకు ఉపయోగకరము. ఇక నేటినుంచే మొలకలు తిందామా….

Posted on

Okra health benefits in Telugu – ఆరోగ్యానికి బెండ. . .

 

సన్నగా అమ్మాయి చేతి వేళ్ళలా నాజూకుగా కనిపించే బెండకాయలంటే ఇష్టపడనివారుండరేమో. . . విందుభోజనాల నుంచీ సాధారణ భోజనం వరకూ అన్నింటా కనిపించి ముద్దుగా ఆంగ్లంలో లేడీస్ ఫింగర్ అనిపించుకుంది. దీనిలో పీచు, కాల్షియం, పొటాషియం. . . వంటి వాటితో పాటు పండ్లలో ఉన్నట్లే యాంటీ ఆక్సీడెంట్లు బెండలో అధికం. ఏంటీ ఇంత ఉపోధ్ఘాతం అనుకుంటున్నారా. . !

బెండ ఆరోగ్యానికి ఎంతో అండ. ఇందుగలదు అందుగలదో అన్న సందేహం వలదు. . . ఎందెందు చూసినా అందందే కలదు అన్న చందంలో బెండ అన్ని దేశాలలో ప్రాచుర్యంలో ఉంది. అందుకే దీనిని భూగోళం అంతా పండిస్తున్నారు. దీనిలో ఉన్న పోషక విలువలు ఎలా అరోగ్యానికి ఉపయోగపడతాయో తెలుసుకుందామా. . .

బెండ తింటే తెలివి తేటలు పెరుగుతాయ్ నాన్నా. . తిను అని మన పెద్దవాళ్ళు కొసరి కొసరి బెండను తినిపిస్తారు. దానికి కారణం ఇందులో బీటాకెరోటిన్,  బి-కాంప్లెక్స్,  విటమిన్-సి,  ఐరన్,  పొటాషియం,  సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు బెండలో ఎక్కువ. అవి శరీరంలోని ద్రవాలను సమతుల్యంగా ఉంచేలా చేస్తాయి. దీని వల్ల నాడీవ్యవస్థ పనితీరు బాగుంటుంది. అందుకే దీన్ని బ్రెయిన్ ఫుడ్ అని అంటారు. దీన్ని తినటం వల్ల దిప్రెషన్ తగ్గుతుంది.

గర్భిణులకు ఇది మంచి ఆరోగ్యం. శిశువు నాడీవ్యవస్ధ వృధ్ధి చెందుతుంది. ఇందులోని ఫోలిక్ ఆమ్లం చాలా ఉపయోగపడుతుంది.

అధికంగా ఉండే కాల్షియం , విటమిన్-సిల వల్ల బంధన కణజాలం,  ఎముకలు,  కీళ్ళు పనితీరు బాగుంటుంది.
కరగని పీచు ఎక్కువ. ఇది మలబధ్ధకానికి మన్చి మందు. చక్కెర వ్యాధి కూడా తగ్గుతుంది.

అధిక పీచు వల్ల దీని గ్లెయసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. అందువల్ల ఇది బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ఈ పీచులోని పెక్టిన్ రక్తంలోని కొలెస్టాల్ సాతాని తగ్గిస్తుంది. అందుకే ఇది రక్తనాళాల్లో కొవ్వును కరిగిస్తుంది. పొట్టలోని చక్కెర నిల్వల్ని పీల్చుకుంటుంది. ఇందువల్ల షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది.

అల్సర్లతో బాధపడేవారు బెండ తరచూ వాడటం వల్ల అందులోని జిగురు జీర్ణకోశానికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.
ఇక అందం విషయానికొస్తే బెండ చాలా మంచిది. దీనిని తినటం వల్ల చర్మం మృదువుగా ఉండటంతో పాటు మొహం మీద మొటిమలు రాకుండా చేస్తుంది. జ్వరం, డయేరియా, కడుపులోనొప్పికి బెండ రసం మంచిగా పనిచేస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్ గా కూడా పని చేస్తుంది. ఇలా గృహ వైద్యానికి బెండ అన్ని విధాలా పనిచేస్తుంది. ఇక ఆలస్యమెందుకు బెండ ను తినేద్దామా. . . మరి. . !

Posted on

Telugu tips for constipation – Malabaddakam – మలబద్దకం

మీ కడుపులో సరిగా లేకపోతే ఆరోజంతా నరకంగా అనిపిస్తుంది.ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు కాని, ఈ మలబద్దకం(constipation) వల్ల నలుగురిలో ఉన్నప్పుడు, మీకే కాకుండా అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కంగారుపడి,భయపడవలసిన అవసరం లేదు, మీరు తీసుకునే ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.

 • పీచు పదార్దములు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి,దీని వల్లమలబద్దకం సమస్యనుంచి విముక్తి లభిస్తుంది. సామన్యముగా మనం పౌశ్టికమైన ఆహారం తీసుకోవడం కన్నా “జంక్ ఫుడ్”నే ఎక్కువగా ఇష్టపడతాము, కానీ ప్రతీ రోజూ మనం తీసుకునే ఆహారంలో 26 గ్రాముల పీచు పదార్దంతో కూడిన ఆహరం ఉండాలి.
 •  సామన్యంగా ఈ మలబద్దకము(malabaddakam), సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల, మన తీసుకునే ఆహారంలో పీచు పదార్దం లేకపోవడం వల్ల,ఇంకా చాల కారణముల చేత వస్తుంది.దానికోసం మందులు వాడి మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం సరికాదు,  పీచు పదార్దం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది.
 • పండ్లు , కూరగాయలు , బీన్స్ మరియు ధాన్యాలు:ఇవి అన్నీ అధిక శాతంలో పీచు పదార్దం కలిగి ఉన్నవే, అయితే సరియైన పౌశ్టికమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది.ఆకులు, పండ్లు, పండ్ల యొక్క  పై తొక్క భాగములో ఎక్కువగా మీకు పీచు పదార్దం లభిస్తుంది.ఆపిల్ పండులోని తొక్కను తీయకుండా తీసుకుంటేనే మంచిది,పచ్చి కూరగాయలు, ఆకుకూరలలో పీచు పదార్దమే కాదు శరీరానికి కావలసిన మెగ్నీషియం కూడా లభిస్తుంది.
 •  ఎండు ద్రాక్ష: ఈ మల బద్దక సమస్యకు ఎండు ద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న లక్షణాలు మన కండరాలను ఉత్తేజపరచి, పెద్ద ప్రేగు ద్వారా వ్యర్ద పదార్దాలని పంపించేస్తుంది.5 ఎండు ద్రాక్షలో 3 గ్రా.ము పీచు పదార్దం ఉంటుంది.
 •  కాఫీ మరియు ఇతర వేడి ద్రవాలు: కాఫీ మన ఆరోగ్యానికి ఏ రకంగాను సహయపడక పొయిన మనలోని ఒత్తిడిని తగ్గించి, మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.అయితే ఈ మలబద్దక సమస్య నిర్మూలనలోను కాఫీ ఎంతగానో సహాయపడుతుంది, అంతే కాకుండా ఇతరత్రా వేడి పదార్దాలు తీసుకోవడంలోను ఈ సమస్య నుంచి మంచి ఫలితం లభిస్తుంది.
 •  నీరు: మనం పీచు పదార్దం ఎంత తీసుకున్నప్పటికీ, దానికి తోడు నీరు కూడా తీసుకోవాలి,లేదంటే కడుపులో ఉన్న వ్యర్ద పదార్దాలు శుబ్ర పడకుండా అధిక నొప్పితో మలబద్దకముకు దారి తీస్తుంది.పండ్ల ముక్కల్ని నీటితో కలిపి తీసుకుంటే  మంచి ప్రభావం చుపిస్తాయి.
 •  రాత్రి పూట పడుకునే ముందు 1 గ్లాసు వేడి పాలు తాగి పడుకుంటే మీ జీర్ణాశయం శుబ్రపడి, మంచి ప్రబావం చుపిస్తుంది.
 • మీరు భోజనం చేసిన తరువాత దానిలో భాగంగనే పీచు పదార్దం తీసుకున్నట్లు అయితే అహారం త్వరగా జీర్ణం అయ్యి ఈ మలబద్దక సమస్యనుండి విముక్తి లభిస్తుంది.
Posted on

Green tea health benefits in Telugu – గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రస్తుతం మనం రోజూ వారి జీవితంలో మన ఆరోగ్యన్ని రక్షించుకోవడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అందులో సహజమైన,పద్దతిలో, అందరికీ, అతి తక్కువ ఖర్చుతో లభించేది ఈ గ్రీన్ టీ, ఇది ఎప్పటినుంచో ఆరోగ్య సం రక్షణలో ఎంతోగానో ఉపయోగపడుతుంది,అధిక బరువుని తగ్గించడమే కాకుండా ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎన్నో అద్భుతాలు చేస్తుంది.అవి ఏంటో చుసేద్దామా:

 • క్యాన్సర్ పై పొరాడుతుంది:క్యాన్సర్ అనేది మన శరీరంలోని రక్త కణాలని,క్యాన్సర్ కణాలుగా మార్చుకుంటూ అధికమవుతుంది, ఈ గ్రీన్ టీ రక్త కణాలకు ఇబ్బంది కలగకుండా క్యాన్సర్ కణాలను తొలగిస్తూ,  పెద్దప్రేగు ,కడుపు భాగం, క్లోమము మరియు పిత్తాశయమును క్యాన్సర్  ప్రమాదము నుండి కాపాడుతుంది.

 • గుండె జబ్బులు నయం చేస్తుంది :ఈ గ్రీన్ టీ గుండెపోటు, రక్తపోటు, వంటి ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తుంది, దీని వల్ల మన మన గుండెలో కొవ్వు శాతం తగ్గి, గుండే,రంద్రాలు శుబ్రం అవుతాయి.

 • రక్తపోటును నియంత్రించడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

 • కీళ్ళ నొప్పి,కీళ్ళవాతం ఇలాంటి ఇబ్బందులనుండి కాపాడుతుంది.

 • మనలోని రోగ నిరోదక శక్తిని పెంచి, రక రకాల రోగములు, క్రిముల నుండి మనల్ని రక్షించడమే కాకుండా ఎటువంటి  వైరల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది.

 • కాలేయ రక్షణకై: మన శరీరంలోని కొన్ని విష పదార్దాల వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది, ఈ గ్రీన్ టీ వాటిని తొలగించి మీ కాలేయాన్ని కాపాడి మంచిగా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

 • ఇది మనలో పేరుకున్న కొవ్వుని తొలగించి, గుండె పోటుకి, అధికబరువుకి దూరంగా ఉంచుతుంది,

ఇంకెందుకు ఆలస్యం  రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తీసుకొండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి

Posted on

Tulasi benefits in Telugu – మీ ఆరోగ్యం – పవిత్రమైన “తులసి” తోనే సాద్యం

మానవుని ఆరోగ్యం కోసం,అందం కోసం, చర్మ సౌందర్యం కోసం ఎన్నో సహజ పద్దతులు ఉన్నాయి, అందులో తులసి ఎంతో ప్రముఖమైనది, గత 5000 సంవత్సరాలుగా సహజ పద్దతులలో మీ ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో తులసి ఎంతో ఉపయోగపడింది. ఎన్నో అద్భుతాలకు కారణం అయినది, అందుకే “తులసి”ని అందరూ “మూలికల రాణీ” అని వర్ణిస్తారు. దీనిని మందుల తయారిలో, ఎన్నో చికిత్సలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మన యొక్క మానసిక స్తితి పై మంచి ప్రభావాన్ని చూపించి, మంచి ఫలితాలను ఇస్తుంది.

ఎందరో ఈ తులసిని ఆయుర్వేదంలో “దోష నివారిణీగా” గుర్తించ్చారు,అంతే కాకుండా మంచి ఆరోగ్యం కోసం ఎంతో మంది దీని పచ్చి ఆకుల్ని నములుతారు.

తులసి వల్ల మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందామ :

దగ్గు మరియు శ్వాసకోశ సమస్యలు

మీరు జలుబు,దగ్గు,శ్వాసకి సంబందించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే తులసితో మంచి ఫలితాలు పొందవచ్చు.తులసి లోని ఔషధ లక్షణాల మిమ్మల్ని ఈ సమస్యల నుండి విముక్తుల్ని చేస్తుంది.అంతే కాకుండా ఇది ఉపయోగించడం వల్ల జ్వరము,తుమ్ములు, మరియు వైరల్ నుండి  మంచి విముక్తు లబిస్తుంది.

ఒక వేళ మీకు జలుబు చేస్తే కొంచెం తులసి ఆకులు, లవంగాలు, కొంచెం ఉప్పు కలిపి తీసుకుంటే, అన్నిటి నుండి మంచి ఉపసమనం కలుగుతుంది. ఆస్త్మా మరియు జలుబు నివారణకు మంచి ఔషదం.

కిడ్నీలో రాళ్ళ సమస్య

మీ కిడ్నీలో రాళ్ళు ఉంటే కొంచెం తులసి రసంలో, తేనె కలిపి తీసుకోండి, మీ కిడ్నీలో రాళ్ళ కరిగిపోయి మంచి ఫలితాలు లబిస్తాయి.

గుండె జబ్బులు

మీ గుండె సమస్యల్లో, మరియు, స్ట్రోక్ రాకుండా కాపాడడంలో తులసి ఎంతగానో ఉపయోగ పడుతుంది.

దీనిలో ఉన్న”విటమిన్ C” మీ గుండె జబ్బులని నయం చేసి, ఏ విదమైన ఇబ్బందులు కలగకుండా  కాపాడుతుంది.

మీ గొంతు కోసం

మీ గొంతు సమస్యలకు కూడ ఎంతో ఉపయోగపడుతుంది, జలుబు చేసి మీ గొంతు మూగబోయిన,ఎంతో ఇబ్బందిగా అనిపిస్తున్నా కొంచెం నీరు తీసుకుని అందులో తులసి ఆకులు వేసి మరిగించి ఆ నీటిని తాగితే మీ గొంతు ఏ సమస్యలు లేకుండా మంచిగా మారుతుంది.

పళ్ళ సమస్యలు

ఇది మీ పళ్ళ సమస్యల్లో ఎంతగానో ఉపయోగ పడుతుంది, దీనిని మీ పళ్ళు శుబ్రపరుచుకోవడానికి ఉపయోగిస్తారు.

పిల్లల సమస్యలు

తులసి చిన్న పిల్లలు యొక్క ఆరోగ్య సమస్యలలో ఎంతగానో ఉపయోగపడుతుంది, దగ్గు, జలుబు, విరేచనాలు, మరియు వాంతులు వంటి సాధారణ సమస్యల నుంచి విముక్తినిస్తుంది.ఆటలమ్మ, కడుపులో పురుగులు ఉన్నపుడు, గొంతు సరిగా లేనప్పుడు, ఇలా ప్రతీ సమస్యలో తులసి ఎంతో ఉపయోగపడుతుంది.

వీటితో పాటు, తులసితో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. చర్మం,జుట్టు, మదుమేహం, క్యాన్సర్ నుండి కాపాడటంలో కూడ ఎంతో ఉపయోగపడుతుంది.

Posted on

Health benefits of curd in Telugu – పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు

రాను రానూ పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలని ఇస్టపడుతున్న యువత ఆహారపు అలవాట్లకు కూడా పాశ్చాత్య ఆహార విధానాలనే ఇస్టపడుతున్నారు. చైనీస్,వెస్ట్రన్ దిషస్ నే ఇస్టపడుతున్నారు. మన భారతీయ ఆహారం లో ప్రముఖ పాత్రని పోషించే పెరుగు అనగానే యువత అమ్మో పెరుగా.. అని దూరం పారిపోతున్నారు.పొట్టకు మేలు చేసే ఈ పెరుగు గురిచి ఈ కాలం లో తెలుసుకుందాం.

మనకుండే విపరీత అలవాట్ల వల్ల మనమెన్నో ఇబ్బందులు పడుతుంటాం. జిహ్వ చాపల్యమే దీనికి కారణం. రకరకాల రుచుల కోసం కొందరు ఇస్టం వచినట్లు తింటుంటారు. ఈ అలవాటు వల్ల దాదాపు 40 శాతం మంది ఇర్రిటబుల్ బోవెన్ సిండ్రోం తో బాధపడుతున్నారని నిపుణుల అంచనా. ఈ సమస్య వల్ల విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది.పెరుగులో శరీరానికి మేలు చేసే లాక్టోబసిల్లస్ అడిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ అనే మేలు చేసే బ్యాక్టీరియా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉదర ఉబ్బరాని, కదుపు నొప్పిని తగ్గిచేందుకు ఈ బ్యాక్టీరియా కీలక పాత్రను వహిస్తుంది. ప్రతి రోజూ ఒక కప్పుకు తగ్గకుండా పెరుగు తినతం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.