Posted on

Telugu tips to improve eyesight – సహజంగా కంటి చూపును మెరుగుపరచటం ఎలా?

మీ శరీరం యొక్క అత్యంత అందమైన భాగాలలో మీ కళ్ళు కూడా ఒకటి కావచ్చు. ఇవి ఆరోగ్యంగా మరియు ఎల్లప్పుడూ తాజాగా ఉండాలి. మీ కళ్లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీకు తెలుసా – మీ కంటి కండరాలు మీ శరీరంలో అత్యంత చురుకైనవి.

మీ కంటి కండరాలు రోజుకు సుమారు 100,000 సార్లు లేదా అంతకంటే ఎక్కువ కదలికలు కలిగి ఉంటాయి. ఎక్కువ ఆక్టివిటీస్ చేయటం వలన మీ కంటి నరాలు మరింత అలసట చెందుతాయి, కనుక ఎక్కువ రక్షణ తీసుకోవాలి. ప్రతి మనిషికీ మంచి కంటి చూపు ఉండాలి. అయినప్పటికి, వంశపారంపర్యం, తక్కువ పోషకాహారం మరియు ఒత్తిడి వంటి కారణాల వలన కంటి చూపు సమస్య ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది.

అంటువ్యాధులు మరియు ఇతర కంటి అనారోగ్యాలను నివారించడానికి ధూళి మరియు దుమ్ము నుండి మీ కళ్లను రక్షించుకోవటంతో పాటు, కంటిచూపును మెరుగుపరచడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇంట్లో సహజంగా మీ కంటి చూపును అభివృద్ధి చేయటానికి కొన్ని చర్యలను చూద్దాం.

సహజంగా కంటి చూపును మెరుగు పరిచే విధానాలు

రోజూ మీ కళ్లను కడగండి

కళ్లను మెరుగుపర్చడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే మరియు రాత్రి పడుకునే ముందు నీటితో మీ కళ్లను కడగండి.

బాదాం

బాదాంలోని ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ కంటి చూపును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఇందులో మంచి కొలెస్ట్రాల్, విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటుంది. నీటిలో రాత్రంతా నానబెట్టిన 4 లేదా 5 బాదాంలను రోజూ తినటం వలన మీ కళ్లకు మరియు మెదడులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇంట్లో తయారు చేసిన కాటుక

మీ కళ్లను అందంగా ఉంచుకోవడానికి చమురు మరియు అగ్నితో చేయబడిన సాంప్రదాయక కాటుకను వాడండి. ఎస్సెంటిల్ నూనె, బొగ్గు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉన్న కాటుకను ఉపయోగించండి. ఆవాల నూనెలో ముంచిన పత్తిని వెలిగించి వాటి నుంచి వచ్చే నలుపు ఆవిరిని ఒక ఇనుప స్పూన్ తో సేకరించండి. ఈ అవశేషాన్ని కాజల్ అని అంటారు. బాదాంను నిప్పులో కాల్చి కూడా ఈ కాటుకను తయారు చేయవచ్చు. ఇలా సేకరించిన కాటుకను అలాగే లేదా కొద్దిగా ఎస్సెంటిల్ ఆయిల్‌ను కలిపి రోజూ వాడవచ్చు. ఇది మెరుగైన కంటి చూపు, పెద్ద కళ్ళు మరియు అందమైన కనురెప్పలను అందిస్తుంది!

పాలలో వండిన క్యారట్లను తినండి

కంటిచూపును మెరుగుపరిచేందుకు పాలలో వండిన క్యారట్లను తినండి. పాలలో అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా, క్యారట్లో విటమిన్ ఎ మరియు సి ఉంటుంది. కంటి చూపు సమస్యలకు ప్రధాన కారణాలు పోషకాహార మరియు విటమిన్ ఎ యొక్క లోపం. వీటిని మీ రోజూ డైట్లో చేర్చుకోవటం వలన మీకు అవసరమైన పోషకాలను మరియు విటమిన్లను పొందుతారు. మీకు కంటిచూపు సమస్య లేనప్పటికీ, వీటిని మీ ఆహారంలో చేర్చుకోవటం వలన కంటి సమస్యలను నివారించవచ్చు.

బ్లాక్ మైరోబాలన్ మరియు ఉసిరికాయ

ఈ పండ్లు బలహీనమైన కంటిచూపు చికిత్సకు మంచి ఫలితాలను అందించగలవు. మీరు రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్ళలో ఈ పండ్లను నానబెట్టి, ఉదయం ఈ నీటిని ఖాళీ కడుపుతో త్రాగాలి. లేదా, పొడిచేసిన బ్లాక్ మైరోబాలన్ ను ఒక గ్లాసు పాలలో కలుపుకొని అల్పాహారం తీసుకునే ముందు త్రాగాలి.

అవొకాడో

దీనిలో ఉన్న బీటాకెరోటిన్, విటమిన్ సి, విటమిన్ బి మరియు విటమిన్ ఇ పోషక పదార్ధాలు కంటి చూపుకు చాలా మంచిది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్స్ లో కోకో అధికంగా ఉండటం వలన కంటి చుట్టూ ఉండే కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక అన్ స్వీటెడ్ డార్క్ చాక్లెట్‌ను రెగ్యులర్గా తీసుకోవడం కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. డార్క్ చాక్లెట్ ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కార్నియాను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

బీట్ దుంపలు

బీట్ రూట్, క్యారట్ వంటి వాటిలో కెరోటిన్ అధికంగా ఉండటం వలన కాటరాక్ట్స్ ను తొలగిస్తుంది. అంతే కాదు ఇందులో ఉన్న ఐరన్ కంటెంట్ సాధారణ కంటి చూపును మెరుగుపరిచి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బెల్ పెప్పర్

పసుపు మరియు ఆరెంజ్ బెల్ పెప్పర్స్ లో విటమిన్ ఏ, సి లో లూటిన్ ఉండటం మూలంగా కాటరాక్ట్స్, మస్కులర్ డిజనరేషన్, రేచీకటి మొదలగు కంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.

రెడ్ మీట్

రెడ్ మీట్ లో అధిక శాతంలో జింక్ మరియు ఎసెన్షియల్ కాంపోనెట్స్ ఉండటం వలన కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ మినరల్స్ ఎంజైమ్లను అధికంగా ఉత్పత్తి చేయడానికి సహాయపడి, రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతుంది.

సోయా

సోయా మిల్క్ మరియు సోయా సాస్ లో అత్యంత శక్తివంతమైన యాంటి ఆక్సిండెంట్స్ కళ్ళు పొడిబారకుండా మరియు కాటరాక్ట్స్ రాకుండా కాపాడుతాయి.

ద్రాక్ష

ద్రాక్షలు రాత్రి పూట మీ కంటి చూపును స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. కనుక మీకు వీలు దొరికినప్పుడుల్లా ద్రాక్ష పండ్లను తినండి.

గుమ్మడికాయ

గుమ్మడికాయలో ఉండే పోషకాలు మీ ఆప్టికల్ ఆరోగ్యానికి చాలా మంచిది.

బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించండి

అధిక రక్తపోటు, కంటి కణజాలాలకు (టిష్యూస్) మరియు నరాలకు హాని కలిగిస్తుంది. కనుక బిపి సమస్యను నియంత్రించడానికి ప్రతి చర్యా తీసుకోవాలి.

ఆరోగ్యకరమయిన ఆహారం

రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉండటం వలన కంటి చూపును దెబ్బతీసే ప్రమాదాలు ఉన్నాయి. కనుక, సరైన ఆహార పద్దతులను అనుసరించి చక్కెర స్థాయిని నియంత్రించడం ద్వారా కంటి చుపును మెరుగుపరుచవచ్చు.

కళ్లకు తగిన విశ్రాంతి ఇవ్వండి

ఇతర శరీర భాగాల్లానే మీ కళ్లు కూడా నిరంతరంగా పని చేస్తాయి, అందువలన, పనుల కళ్లకు కూడా తగిన విశ్రాంతిని ఇవ్వాలి.

కొన్ని కంటి వ్యాయామాలు

పెన్సిల్ పుష్-అప్స్: మీరు మంచి ఆరోగ్యం కొరకు “పుష్-అప్స్” వ్యాయామం గురించి వినే ఉంటారు. ఇప్పుడు కంటి చూపు కొరకు పెన్సిల్ పుష్అప్‌లను చూద్దాం. క్రింద చెప్పిన విధానాన్ని పాటించండి.

 • ఒక పెన్సిల్ తీసుకొని దాని మధ్య భాగంలో ఒక మార్క్ చేసుకోండి.
 • పెన్సిల్‌ని ముందుకు తరువాత వెనక్కు కదిలించటం ద్వారా పెన్సిల్ పుష్అప్‌ని చేయాలి.
 • చేతి యొక్క తరువాత దూరం వద్ద పెన్సిల్‌ను నిలువుగా పట్టుకొని మీరు చేసిన మార్క్ మీద దృష్టి పెట్టండి. మీరు చేసిన మార్కుపై సరిగ్గా దృష్టి పెట్టే వరకు క్రింద స్టెప్‌కు వెళ్ళకూడదు.
 • అదే మార్క్ మీద దృష్టి పెట్టి, ఇప్పుడు మీ ముక్కుకు నేరుగా పెన్సిల్‌ను దగ్గరగా తేవాలి.
 • పెన్సిల్‌ని దగ్గరకు తీసుకొని వచ్చేటప్పుడు మార్క్ పై దృష్టి పెట్టేందుకు కంటి చూపును అడ్జెస్ట్ చేసుకోవాలి.
 • మీకు పెన్సిల్ రెండుగా కనిపించినప్పుడు దగ్గరికి తేవటం ఆపండి. ఇప్పుడు కొన్ని సెకండ్లు మీ కళ్లను మూసుకొని కొద్దిగా విశ్రాంతి ఇవ్వాలి.
 • ఇప్పుడు అదే మార్క్‌పై దృష్టి పెట్టి పెన్సిల్‌ను ముక్కు నుండి దూరంగా మీ చేతి యొక్క పొడవు దూరానికి తీసుకు వెళ్ళండి. తరువాత కొద్దిగా విశ్రాంతి ఇవ్వాలి.
 • మీ కళ్ళు రిఫ్రెష్ అయిన తరువాత పై చెప్పిన ప్రక్రియను తిరిగి చేయండి.
 • ప్రతి రోజూ ఈ వ్యాయామాన్ని 5 నుండి 10 నిమిషాలు చేయండి.
 • ఈ వ్యాయామం, క్రమంగా చేసినట్లయితే మీ కంటిచూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది క్రాస్డ్ అయిస్ మరియు డబుల్ విషన్ సమస్యను తొలగించేందుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఉత్తమ విషయం ఏమిటంటే, ఇది నొప్పి లేనిది మరియు సులభమైన వ్యాయామం.

ఐ రోలింగ్

మీరు విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ వ్యాయామం చేయటానికి ప్రయత్నించండి. 10 సార్లు క్లాక్ వైస్ దిశలో మీ కళ్లను రోల్ చేయండి. తరువాత కళ్లను మూసుకొని 2 నిమిషాలు విరామం తీసుకోండి. కళ్లు తెరిచిన తరువాత 10 సార్లు ఆంటీ క్లాక్ దిశలో రోల్ చేయండి. ఈ వ్యాయామం మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

టెంపుల్ మసాజ్

మీ బొటనవేలుతో కంటి చుట్టూ క్లాక్ వైస్ మరియు యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్లో 20 సార్లు మసాజ్ చేయండి. ఆ తరువాత ఉత్తమ ఫలితాల కోసం మీ నుదిటి మధ్య లేదా మీ కనుబొమ్మల మధ్యభాగంలో మసాజ్ చేయాలి.

కనురెప్పలను వెచ్చగా చేయటం

ఒక చేతితో మరొక చేతిని రుద్దడం ద్వారా చేతులను వెచ్చగా చేసి మీ కనురెప్పల మీద 5 సెకన్లు ఉంచండి. ఇలా 3 సార్లు చేయండి.

అల్ప నిద్ర

మీకు విలైనప్పుడల్లా మీ కళ్లను మూసుకొని 3 నిమిషాలు కండరాలను రిలాక్స్ చేయండి. ఇలా చేయటం వలన మీ కళ్లలో చైతన్యం తిరిగి నింపబడుతుంది.

రోజూ ఆహార డైట్ మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • మీ జీవనశైలి మరియు మీరు తినే ఆహారం మీ కంటిచూపుపై గొప్ప ప్రభావం చూపుతుంది. మీ కళ్లకు తగినంత పోషకాలు మరియు విటమిన్లను అందించే ఆహారాన్ని తీసుకోండి.
 • ఆకుపచ్చ ఆకు కూరలు, సాల్మన్ మరియు ట్యూనా వంటి చేపలు, నారింజ మరియు నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్ల రసాలు, అరటి మరియు నట్స్ వంటి పండ్లు మీ కళ్లకు తగిన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.
 • విటమిన్ ఇ, సి మరియు ఎ పుష్కలంగా ఉన్న క్యారట్లు, కివీ, స్క్వాష్, చీజ్, పాలు, కాంటాలోప్, స్పినాచ్, క్రాన్బెర్రీస్, బొప్పాయి, ఆలివ్, గోధుమ బీజ, కూరగాయల నూనెలు వంటి ఆహారాలను తినండి.
 • ఆంటీ ఆక్సిడెంట్స్ మీ కళ్లకు చాలా మంచిది. బీటా కెరోటిన్, లూటీన్ లేదా జియాక్సంతిన్ లాంటి ఆంటీ ఆక్సిడెంట్స్ మీ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇవి సూర్య కాంతి వలన కలిగే డిహైడ్రేషన్ ను తగ్గించటానికి సహాయపడుతుంది. ఆకు కూరలు, మిరియాలు, గుడ్డు, తియ్యటి బంగాళాదుంప మరియు గుమ్మడికాయలలో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటుంది.
 • ద్రాక్ష, బ్లూబెర్రీలు మరియు గోజీ బెర్రీలలో కూడా కంటి చూపును మెరుగుపరిచే ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటాయి.
 • లెసిథిన్, సిస్టీన్ మరియు సల్ఫర్ కలిగి ఉన్న ఆహారాలు క్యాటరాక్ట్ ఏర్పడకుండా నివారించడంలో సహాయపడుతుంది. ఈ ప్రయోజనాల కోసం వెల్లుల్లి, కేపెర్స్, ఉల్లిపాయలు మరియు షల్లాట్స్ ను తినండి.
 • నీటిని ఎక్కువగా తాగడం వలన మీ శరీరం హైడ్రేటడ్గా ఉంటుంది మరియు కళ్ళు పొడిబారకుండా నిరోధిస్తుంది.
 • ధూమపానం మీ కంటి చూపును ప్రభావితం చేస్తుంది మరియు క్యాటరాక్టులను కలిగించవచ్చు, కాబట్టి ధూమపానం నివారించండి. మీ కళ్లను, దాని పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
 • మీరు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు లేదా దుమ్ము మరియు ధూళి నుండి మీ కళ్లను దూరంగా ఉంచడానికి ఎల్లప్పుడూ సన్ గ్లాసెస్ను ఉపయోగించండి. మీ సన్ గ్లాసెస్ UV- సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.
 • ల్యాప్ టాప్ల మరియు మొబైల్ల నిరంతర వినియోగం, టీవీ చూడటం కూడా మీ కంటి చూపు స్థాయిని తగ్గిస్తుంది, కాబట్టి ల్యాప్ టాప్లు లేదా టీవీని ఉపయోగించినప్పుడు మీ కళ్లను కొన్ని నిమిషాలు మూసుకొని విరామం ఇవ్వండి. మీ కళ్లపై కొన్ని దోసకాయలు లేదా ఐస్ క్యూబ్స్ ఉంచండి.
 • మీరు ప్రమాదకర వాతావరణంలో పని చేస్తున్నట్లయితే భద్రతా దుస్తులు తప్పనిసరిగా వేసుకోవాలి. అలాగే పని చేస్తున్నప్పుడు భద్రతా గ్లాసెస్ లేదా గాగుల్స్ ధరించండి. రాకెట్ బాల్, ఐస్ హాకీ మరియు లక్రోస్ వంటి ఆటలు క్రీడాకారుల దృష్టిని గాయ పరిచే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ క్రీడలలో పాల్గొనటానికి తప్పకుండా హెల్మెట్‌ను ఉపయోగించాలి.
 • తగినంత నిద్ర మీ కళ్లకు మరియు మీ శరీరానికి చాలా విశ్రాంతిని ఇస్తుంది.

ఈ చిట్కాలను అనుసరించి మీరు మీ కంటిచూపును మెరుగుపరుచవచ్చు. ఏమైనప్పటికీ, ఒక వైద్యుడిని కనీసం 3 నెలలకు ఒకసారి సంప్రదించటం చాలా మంచిది.

Posted on

Telugu tips to treat pink eye – కండ్ల కలకను నివారించడం ఎలా?

కండ్ల కలక వలన మీ కళ్ళు వాపుతో పాటు కణజాల పొర ఎర్రగా మారుతుంది. అది కంటి యొక్క తెల్లని భాగాన్ని కప్పివేస్తుంది. ఇది కనురెప్పల లోపలి భాగంలో పొరలాగా ఉంటుంది. ఈ కణజాల పొరలు వైరస్, బ్యాక్టీరియా, విష పదార్ధాలు, అలెర్జీ-ప్రేరేపించే కారకాలు మరియు చికాకు కలిగించే కొన్ని లక్షణాలతో పాటు శరీరం లోపల అంతర్లీన వ్యాధులకు ఇవి విస్తృతంగా ప్రభావితమవుతాయి. కండ్లకలక అనేది పిల్లలతో పాటుగా పెద్దల్లో కూడా సర్వసాధారణమైంది. దీనికి వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి సమానంగా వ్యాపిస్తుంది.

లక్షణాలు

 1. ఇది మీకు దురదను మంటను చికాకును కలిగిస్తుంది.
 2. కంటి కణజాల పొరలో ( కంజెక్టివియా) వాపు ఉండవచ్చు. అది కంటిరెప్పల లోపలి భాగం మీద పొరవలె ఉంటుంది.
 3. కంటి నుండి కన్నీళ్లు ఎక్కువగా వస్తుంటాయి.
 4. చీము కూడా ఉండవచ్చు.
 5. కాంటాక్ట్ లెన్స్ లు కంటిమీద వాటి స్థానంలో ఉండవు. ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
 6.  కంటి మీద తెల్లని భాగం ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది.

కండ్లకలక రకాలు మరియు లక్షణాలు

బ్యాక్టీరియా సంబంధిత కండ్లకలక

 • చాలా ఎక్కువ సందర్భాలలో చీము ఉండవచ్చు.
 • కొన్నిసార్లు చెవి ఇన్ఫెక్షన్లు కూడా ఉంటాయి.

తీవ్రమైన సున్నితత్వ కండ్లకలక

 • అధిక శాతం ఇది రెండు కళ్లలోనూ సంభవిస్తుంది.
 • దీని ప్రభావంగా కంటి నుండి నీరు కారడం, వాపు, తీవ్రమైన దురద మొదలైన లక్షణాలు ఉంటాయి.

చికాకు కలిగించే కండ్లకలక

 • ఈ రకమైన కండ్లకలకలో కంటి నుండి ధారగా నీరు కారుతూ, చీము కూడా స్రవించడం జరుగుతుంది.

వ్యాప్తి చెందే కండ్లకలక

 • ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్, అలాగే జలుబు మరియు జ్వరం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.
 • ఇది ఒక కంటిలో ప్రారంభమై మరొక కంటికి వ్యాపిస్తుంది.
 • కంటి నుండి నీరు కారడం ఉంటుంది కానీ అంత చిక్కగా ఉండదు.

కండ్లకలక ఎలా వ్యాపిస్తుంది?

వివిధ రకాలైన బ్యాక్టీరియా, వైరస్ లు కండ్ల కలకకు ప్రధాన కారణాలని చెప్పవచ్చు. వైరస్ వలన గాని బ్యాక్టీరియా వలన గాని సంభవించే కండ్ల కలకలు వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఎన్నో మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ప్రభావిత వ్యక్తి దగ్గడం వలన గాని తాకిన వస్తువులను లేదా ఉపరితలాలను ఇతర వ్యక్తులు తాకడం లేదా చేతులను కలపడం వంటి చర్యలు వలన క్రిములు ఒకరి నుండి ఒకరికి సులభంగా వ్యాప్తి చెందుతాయి.

నిర్ధారణ

హైపర్సెన్సిటివ్ కనెక్టివిటీ

“తీవ్రమైన సున్నితత్వం కలిగిన కండ్లకలక” ఇది ప్రత్యక్షంగా కళ్ళలో భయంకరమైన సెన్సిటివిటీని కలిగి ఉంటుంది. అసంకల్పిత తుమ్ములు, చీదడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది.

కళ్ళలో తీవ్రమైన సున్నితత్వం ఎక్కువగా వసంత కాలంలో అత్యధిక పుప్పొడి పతనం ఉన్నప్పుడు లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు కుక్క, పిల్లి పెంపుడు జంతువుల చర్మపు పోగులు వలన అలర్జీ సంభవించి ఈ విధమైన లక్షణాలు కనిపిస్తాయి.

అలర్జీ కలిగించే విషయాలపై పరిశీలన

మీరు హానికరమైన రసాయనాలు నుండి రక్షణ ప్రాంతంలో లేనట్లయితే అది వాయు కాలుష్యానికి కూడా కారణమవుతుంది. ఈ కాలుష్యం మీకు ఒక కారణం కావచ్చు. అలాగే మీ కంటి దురదకు కూడా కారణం కావచ్చు. కానీ ఇటువంటి అలర్జీలు 12 నుండి 36 గంటలలో తగ్గిపోతుంది. ఒకవేళ అలర్జీ కారకాలు ఏవైనా రసాయనాలు లేదా మీరు ఉపయోగించే క్లీనర్లు వలన సంభవించినట్లయితే కనీసం పది నిమిషాల పాటు మీ కళ్ళను అసెప్టిక్ సొల్యూషన్ తో కనుగుడ్లను తిప్పుతూ కడగండి.

డాక్టరును సంప్రదించండి

మీకు కండ్ల కలక సంభవించిందని నిర్ధారణ అయినట్లైతే దానిపై ఖచ్చితమైన నిర్ధారణకు మీ డాక్టరును వెంటనే సంప్రదించండి. ఎందుకంటే కండ్ల కలక యొక్క లక్షణాలను బట్టి వైరస్ మరియు బ్యాక్టీరియా సంబంధిత కండ్ల కలకలకు తగ్గట్లుగా వేర్వేరు చికిత్సలు చేయడం జరుగుతుంది.

ఖచ్చితమైన నిర్ధారణ కొరకు పరీక్షలు

డాక్టర్ సిఫార్సు మేరకు లక్షణాలపై ఖచ్చితమైన నిర్ధారణ కొరకు మరియు బాక్టీరియా, వైరస్ యొక్క ప్రభావ తీవ్రతను అనుసరించి ఒక నిర్ధిష్టమైన మెడికేషన్స్ పొందడానికి సూచించిన పరీక్షలు చేయించుకోవడం అవసరం.

మీకు సంభవించిన కండ్ల కలకకు కారణం గనేరియా లేదా ఇతర లైంగిక సంక్రమణ వ్యాధులు అయి ఉండవచ్చనే సందేహం ఉన్నట్లైతే, మీ డాక్టరు దానికి సంబంధించిన పరీక్షలను సిఫార్సు చేస్తారు.

సంభవించిన కండ్ల కలకకు కారణం అలెర్జీ అని డాక్టరు నిర్ధారించినట్లయితే మరియు మీకు ఆ అలర్జీ దేనికి సంబంధించినదో తెలియనట్లైతే, అతను వాటిని నిర్ధారించడానికి అలర్జీ పరీక్షలను కూడా చేయించుకోమని కోరవచ్చు.

గృహ చిట్కాలు

తులసి

తులసిలో ఉండే శోథ నిరోధక లక్షణాలు కంటిలోని ఫంగల్, బ్యాక్టీరియా మరియు వైరస్ లతో పోరాడడానికి శక్తిని కలిగి ఉంటాయి.

తులసి ఆకులను ఉపయోగించడానికి ముందు వాటిని 15 నిమిషాల పాటు నీళ్ళలో ఉడికించండి. తర్వాత గోరు వెచ్చని నీటితో మీ కళ్ళను దానితో కడిగేసుకోండి లేదా కాటన్ ప్యాడ్ ను ఉపయోగించి వెచ్చని ఒత్తిడి కలిగించండి.

కలబంద గుజ్జు

కలబంద గుజ్జు అమోడిన్ మరియు అల్యోయిన్ లను కలిగి ఉంటుంది. అవి యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి.

కలబంద గుజ్జును కనురెప్పల మీద మరియు కంటి మీద అప్లై చేయండి.

పసుపు

పసుపు చికిత్స లక్షణాలతో పాటుగా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అవి మీ కళ్ళను నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

ఒక కప్పు మరిగించిన నీటిని తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పసుపుని వేసి బాగా కలపండి. ఒక కాటన్ ప్యాడ్ ను తీసుకొని అందులో ముంచి మీ కళ్ళకు వేడి ఒత్తిడిని అందించండి.

గ్రీన్ టీ

కండ్లకలకకు గ్రీన్ టీ ఒక అద్భుతమైన గృహ వైద్యంగా చెప్పబడింది.

ఒక టీ బ్యాగును తీసుకొని మరిగించిన నీటిలో ఒకసారి ముంచి తీయండి. కాస్త చల్లారాక దానిని ప్రభావిత కంటి మీద ఉంచండి. దీనికి బదులుగా మీరు కాటన్ ప్యాడ్ తీసుకొని ఒక కప్పు గ్రీన్ టీ లో నానబెట్టి తగినంత వేడితో కళ్ళను ఒత్తండి.

వేప నూనె

వేప నూనెలో ఉండే మూలకాలు అలర్జీలను అలాగే యాంటీ బ్యాక్టీరియా మరియు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.

కండ్లకలకకు వేప నూనెను తీసుకొని నిద్ర పోవడానికి ముందు కంటి చుట్టూ మృదువుగా మర్దనా చేయండి.

రొమ్ము పాలు

చాలా తరాల వారు రొమ్ము పాలను కండ్లకలక కు చికిత్సగా వారి పిల్లలకు ఉపయోగిస్తూ ఉంటారు. రొమ్ము పాలు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉన్నట్లు నిర్ధారణ జరిగినది.