Posted on

Benefits of castor oil in Telugu – స్కిన్‌ మరియు హెయిర్ సంరక్షణ కోసం కాస్టర్ ఆయిల్‌ని ఎలా ఉపయోగించాలి

కాస్టర్ ఆయిల్ అనేది స్టికీగా ఉండే ఒక చమురు, ఇది ఆరోగ్యానికి మరియు సౌందర్యానికి సంబంధించిన అనేక చికిత్సలకు ఉపయోగిస్తారు. కాస్టర్ ఆయిల్ స్టికీగా ఉన్నపటికీ అది మీ చర్మం మరియు జుట్టుకు అనేక రకాలుగా పరిహారాలను అందిస్తుంది. జుట్టు రాలడం, జుట్టు పెరుగుదల, బట్ట తల మరియు చుండ్రు వంటి సమస్యలకు ఇది అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. చర్మం పొడిబారడం, పింపుల్స్ లాంటి అనేక చర్మ సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది.

కాస్టర్ యొక్క స్కిన్ బెనిఫిట్స్

క్లియర్ స్కిన్‌

ఇది స్కిన్‌ క్లెన్సెర్ గా పనిచేస్తుంది. స్నానానికి 15 నిమిషాల ముందు మీ శరీరంపై కాస్టర్ ఆయిల్ ను రాయండి. తరువాత వేడి నీటితో స్నానం చేయండి. ఇది శరీరంలోని చనిపోయిన కణాలను శుభ్రపరచి చర్మాన్ని స్పష్టంగా మరియు తాజాగా చేస్తుంది.

ఏజ్ స్పాట్స్

వయస్సు వలన కలిగే మచ్చలకు ఉత్తమమైన పరిహారం కాస్టర్ ఆయిల్. మీ మచ్చల మీద ఆముదాన్ని రాసి సున్నితంగా మసాజ్ చేయండి.

పాదాల పగుళ్లు

రాత్రి పడుకునే ముందు పాదాల పగుళ్లపై వేడి చేసిన కాస్టర్ నూనెని రాసి ఉదయాన్నే వేడి నీటితో కడగండి. ఇది పగుళ్ల వలన కలిగే నొప్పిని తొలగిస్తుంది మరియు క్రమంగా వాడటం వలన పగుళ్లను కూడా తొలగిస్తుంది.

ముడతలను తొలగిస్తుంది

ముడతలు ఉన్న చోట్ల పై కాస్టర్ నూనెని రాయండి. చర్మం నూనెని పూర్తిగా పీల్చుకున్న తరువాత వేడి నీటితో కడగండి. ఇలా క్రమంగా చేయటం వలన ముడతలు తొలగిపోతాయి.

మచ్చలను తొలగిస్తుంది

కాస్టర్ నూనెతో బేకింగ్ సోడాని కలుపుకొని చర్మ మచ్చలపై రాయండి. ఇలా క్రమంగా చేయటం వలన మచ్చలు తొలగిపోతాయి.

స్ట్రెచ్ మార్క్స్ చికిత్స

కాస్టర్ ఆయిల్ చర్మపు సాగిన గుర్తులను తొలగిస్తుంది. మీ స్ట్రెచ్ మార్క్స్‌పై ఆముదం నూనెని ఒక నెల పాటు వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

పగుళ్లు ఉన్న గోరులకు మంచిది

ఒక వారం పాటు రోజూ రాత్రి గోరులు మరియు వేళ్ల చివర కాస్టర్ ఆయిల్ రాయటం వలన గోరుపై పగుళ్లని నిరోధిస్తుంది.

మాయిశ్చరైజర్‌

కాస్టర్ ఆయిల్ చర్మంపై మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇందులో లభ్యమయ్యే విటమిన్ ఇ చర్మం యొక్క ఎలాస్టిసిటీని పెంపొందించేందుకు తోడ్పడుతుంది. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడం ద్వారా ముడతలు అలాగే ఫైన్ లైన్స్ సమస్య నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

సన్ బర్న్

వేసవి కాలంలో, సన్ బర్న్స్ అనేక మంది ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యల్లో ఒకటి. కాస్టర్ ఆయిల్ సన్ బర్న్ కొరకు ఒక అద్భుతమైన పరిష్కారం అందిస్తుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ కాస్టర్ ఆయిల్ మరియు కొబ్బరి నూనె తీసుకోండి. దీనిని మీ చర్మంపై ఒక వారం పాటు రాయండి.

మొటిమలు

జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమల సమస్యలు ఎక్కువగా ఉంటుంది. కాస్టర్ ఆయిల్ లో రిసినోలిక్ ఆమ్లం ఉన్నందున ఇది మొటిమల చికిత్సకు సహాయపడుతుంది. దీనిని మీ ముఖం మీద రాయటానికి ఒక విధానం ఉంది. ఈ ప్రక్రియను రాత్రి పడుకునే ముందు చేయాలి. ముందుగా వెచ్చని నీటితో ముఖాన్ని కడగండి, మీ చర్మపు రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇప్పుడు కొద్దిగా కాస్టర్ ఆయిల్ తీసుకొని మీ ముఖం మీద రాసి ఉదయం కడగండి. ఇలా రెగ్యులర్గా చేయటం వలన మొటిమలు తొలగిపోతాయి.

పులిపిర్లు

ఐ లిడ్స్, మెడ, మణికట్టు మరియు అంకల్ లాంటి చోట్లలో పులిపిర్లు సాధారణంగా వస్తుంది. ఇవి హానికరం కానప్పటికీ మన చర్మంపై అసహ్యంగా ఉంటుంది. మీరు ఒక సహజ పద్ధతిలో వీటిని వదిలించుకోవాలనుకుంటే రోజూ దానిపై కాస్టర్ నూనెని రాయండి.

స్కార్స్ ని లైటెన్ చేస్తుంది

కాస్టర్ ఆయిల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్ చర్మం యొక్క కణాల పునరుత్పత్తికి తోడ్పడుతుంది. ముఖంపై కట్స్ వలన అలాగే దెబ్బల వలన ఏర్పడిన మచ్చలను తొలగేందుకు క్యాస్టర్ ఆయిల్ ను ఉపయోగించుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ కాస్టర్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మరియు ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్‌ను ఒక పాత్రలో తీసుకుని బాగా కలపి ఒక మిశ్రమాన్ని తయారుచేయండి. రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ రెమెడీని ప్రతి రోజు పాటిస్తే మెరుగైన ఫలితాన్ని పొందుతారు.

డార్క్ సర్కిల్స్ ని తొలగిస్తుంది

ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్లలో అసమతుల్యం వంటివి డార్క్ సర్కిల్స్ సమస్యకు దారితీస్తుంది. కాస్టర్ ఆయిల్ ఈ సమస్యను నివారించేందుకు తోడ్పడుతుంది. ఒక టీస్పూన్ కాస్టర్ ఆయిల్ ను అలాగే ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్‌ను ఒక బౌల్ లో తీసుకోండి. ఈ మిశ్రమం గడ్డకట్టే వరకు ఫ్రీజ్ చేయండి. తరువాత ఒక క్యూబ్‌ను తీసుకుని కంటి కింద సున్నితంగా మసాజ్ చేయండి. ప్రతి రోజూ ఇలా చేయటం వలన  వేగవంతమైన అలాగే మెరుగైన ఫలితాలను పొందుతారు. కలబంద జెల్ చర్మాన్ని సూత్ చేస్తుంది మరియు చర్మాన్ని లోలోపల నుంచి హైడ్రేట్ చేస్తుంది.

కాస్టర్ యొక్క హెయిర్ బెనిఫిట్స్

జుట్టు మల్లీ పెరిగేందుకు

పాత రోజులలో ఆముదము హెయిర్ ఆయిల్గా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు కొబ్బరి నూనె ఆ స్థానాన్ని తీసుకుంది ఎందుకంటే కాస్టర్ ఆయిల్ ప్రకృతికంగా మందంగా ఉంటుంది మరియు సుగంధంగా ఉండదు. కానీ ఆముదము జుట్టు పెరుగుదలలో చాలా సహాయపడుతుంది. స్కాల్ప్ పై ఆముదాన్ని రాయండి. వేడి చేసిన కాస్టర్ నూనెని ఉపయోగించడం ఉత్తమం. ఒక గంట సేపు తరువాత తల స్నానం చేయండి.

హెయిర్ కండిషనింగ్

ఇది హెయిర్ కండిషనింగ్గా పనిచేస్తుంది. కాస్టర్ నూనెలలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మీ జుట్టును మృదువుగా చేస్తుంది.

స్ప్లిట్‌ ఎండ్స్ ను తొలగిస్తుంది

కురులకు సరైన పోషణ ఇవ్వకపోవటం వలన స్ప్లిట్ ఎండ్స్ సమస్య ఎదురవుతుంది. ఎన్నో జుట్టు సంరక్షణ ఉత్పత్తులు మరియు వివిధ రకాల షాంపులను ఉపయోగించినప్పటికీ ఈ సమస్య తొలగిపోకుండా ఉండొచ్చు. కాస్టర్ ఆయిల్ ఉపయోగించి చూడండి. తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు.

చుండ్రు

మీ జుట్టు చాలా పొడిగా ఉన్నప్పుడు చుండ్రు సమస్య ఏర్పడవచ్చు. దీని వలన మీ స్కాల్ప్ చాలా దురదగా ఉండొచ్చు మరియు చర్మపు రేకులు రాలవచ్చు. కొన్ని చుక్కల కాస్టర్ ఆయిల్‌ని మీ తలపై రాయండి. కాస్టర్ ఆయిల్ మీ చర్మం యొక్క పొడితనాన్ని తొలగిస్తుంది మరియు చర్మాన్ని మాయిశ్చరైస్ చేస్తుంది. మీరు ఒక టేబుల్ స్పూన్ కాస్టర్ ఆయిల్ మరియు నిమ్మరసాన్ని కలుపుకొని మీ జుట్టు మీద రాయటం వలన కూడా చుండ్రుని వదిలించుకోవచ్చు.

ప్రకాశవంతమైన జుట్టు

కాలుష్యం, ఆహారంలో కలుషితం మరియు రసాయనం ఎక్కువగా ఉండే షాంపులను ఉపయోగించడం వలన జుట్టు సహజ ప్రకాశాన్ని కోల్పోతుంది. మీరు మీ జుట్టు యొక్క సహజమైన ప్రకాశాన్ని తిరిగి పొందాలనుకుంటే, కాస్టర్ ఆయిల్ ఒక అద్భుతమైన పరిహారం. దీని కోసం కాస్టర్ ఆయిల్ ని ప్రత్యేకమైన మార్గంలో ఉపయోగించాలి. ఒక గిన్నెలో తగినంత ఆయిల్ ను తీసుకొని దానిని వేడి చేయండి. ఇప్పుడు మీ జుట్టు మరియు జుట్టు మూలాల మీద రాసుకోండి మరియు మీ జుట్టును ఒక టవెల్ తో చుట్టి రాత్రంతా అలాగే ఉంచండి. నిద్ర లేచిన తర్వాత, మీ జుట్టును ఒక మైల్డ్ షాంపుతో కడగండి. ఇది సులభంగా మీ జుట్టు లోపల తేమను లాక్ చేస్తుంది మరియు జుట్టు నిగనిగలాడేలా మరియు అందంగా చేస్తుంది.

హెయిర్ కలర్

మీరు జుట్టు రంగును ఉపయోగిస్తున్నట్లయితే, దానిని సరైన విధంగా నిర్వహించడం చాలా అవసరం. జుట్టుకు రంగును వేసిన తరువాత రెగ్యులర్ గా కాస్టర్ ఆయిల్‌ని రాయండి. ఇది మీ హెయిర్ కలర్ ని టోన్ చేస్తుంది మరియు జుట్టుని సురక్షితంగా ఉంచుతుంది.

కాస్టర్ యొక్క స్కిన్ మరియు హెయిర్ బెనిఫిట్స్

ఫంగల్ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది

చాలా మందికి చర్మం మరియు జుట్టు మీద ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. చుండ్రు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ యొక్క ఒక రూపం. మీ జుట్టు మూలాలు మరియు చర్మం మీద ఆముదాన్ని రాయటం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్ తొలగిపోతుంది.

Posted on

Hyper-pigmentation removal face packs in Telugu – హైపర్ పిగ్మెంటేషన్ తొలగించటానికి హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్

హైపర్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, ప్యాచీ స్కిన్‌, అన్ ఈవెన్ స్కిన్‌ టోన్ లాంటివి బాలికలకు ఎదురయ్యే సాధారణ సమస్యలు. వీటిని తొలగించేందుకు ఎన్నో రకాల చిట్కాలను మరియు ఫేస్ ప్యాకులను చాలా వెబ్‌సైట్లలో చూసే ఉంటాము. కానీ ఇంకా కొన్ని కొత్త చిట్కాల కోసం మనం వెతుకుతూ ఉంటాము. ఈ ఆర్టికల్లో వంటగదిలో ఉండే పదార్థాలను ఉపయోగించి హైపర్ పిగ్మెంటేషన్ సమస్యలను తొలగించే కొన్ని ఫేస్ ప్యాక్‌లను చూద్దాం.

హైపర్ పిగ్మెంటేషన్ తొలగించేందుకు ఫేస్ ప్యాకులు

క్రింద చెప్పిన ఫేస్ ప్యాకులలో మీ చర్మానికి ఏది సరిపోతుందో ఎంచుకొని కనీసం ఒక వారం ఆ ఫేస్ ప్యాకును వాడండి. అప్పుడే మంచి ఫలితాలను పొందుతారు.

పొటాటో ఫేస్ ప్యాక్

ఉర్లగడ్డలో విటమిన్లు, బి కాంప్లెక్స్ మరియు ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి మీ చర్మం లోతుల వరకూ వెళ్లి నల్లని మొటిమలను మరియు హైపర్ పిగ్మెంటేషన్ను తొలగిస్తుంది. ఇది హైపర్ పిగ్మెంటేషన్ పై మైల్డ్ ఆసిడ్లా పనిచేస్తుంది.

 • ప్యాక్ 1: ఉర్లగడ్డ రసాన్ని ముఖంపై రాసి 10 నిమిషాల తరువాత కడగండి.
 • ప్యాక్ 2: ఒక స్పూన్ ఉర్లగడ్డ రసాన్ని, ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ నిమ్మరసం మరియు ఒక స్పూన్ తేనెని కలుపుకొని ఒక పేస్ట్‌లా తయారు చేసుకోండి. దీనిని ముఖం మరియు మెడపై రాసి 15 నిమిషాల తరువాత కడగండి.

ఇందులోని ఉర్లగడ్డ రసం చర్మం యొక్క రంగును మెరుగు పరుస్తుంది, బియ్యం పిండి స్క్రబ్స్ లా పనిచేస్తుంది, నిమ్మరసం చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది మరియు తేనె మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.

నిమ్మరసం ఫేస్ ప్యాక్

నిమ్మరసం చాలా ప్రభావితమైన పదార్థం. ఇది పొడి చర్మాన్ని, చనిపోయిన చర్మపు కణాలను మరియు పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది.

 • ఒక స్పూన్ నిమ్మరసం, 5 స్పూన్ల తేనెని బాగా కలుపుకొని పిగ్మెంటేషన్ పై రాసి కొద్ది సేపు మర్దన చేయండి. 20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

పాలు మరియు తేనె

నాలుగు స్పూన్ల పాలు ఒక స్పూన్ తేనెని బాగా కలిపి ముఖం మరియు పిగ్మెంటేషన్ పై రాసి మర్దన చేయండి.10 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి. పాలు చనిపోయిన చర్మ కణాలను తొలగించగలదు.

పసుపు ఫేస్ ప్యాక్

ఎన్నో ఏళ్ళ నుండి చర్మం యొక్క సమస్యలను తొలగించేందుకు ఉపయోగించే ఒక మూలిక పసుపు. ఇది చర్మంపై ఉన్న పిగ్మెంటేషన్, బ్యాక్టీరియా మరియు నల్లని మచ్చలను తొలగిస్తుంది.

 • ప్యాక్ 1: ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి, 2 టేబుల్ స్పూన్ పాలు మరియు ఒక స్పూన్ శనగ పిండిని కలుపుకొని పేస్ట్‌లా తయారు చేయండి. దీనిని ముఖం మరియు పిగ్మెంటేషన్ పై రాసి మర్దన చేయండి. బాగా ఆరిన తరువాత కడగండి.
 • ప్యాక్ 2: 2 స్పూన్ కొబ్బరి నూనె, 1/2 స్పూన్ పసుపు మరియు 1 స్పూన్ కలబంద జెల్ కలుపుకొని ఈ పేస్ట్‌ని పిగ్మెంటేషన్ పై రాసి 30 నిమిషాల తరువాత కడగండి. కొబ్బరి నూనె మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. కలబంద చర్మంపై టాన్ మరియు నల్లని మచ్చలను తొలగిస్తుంది.
 • ప్యాక్ 3: 2 టేబుల్ స్పూన్ పెరుగు మరియు ఒక స్పూన్ పసుపును కలుపుకొని పిగ్మెంటేషన్ వున్న చర్మంపై మరియు ముఖం, మెడా, చేతులు, కాళ్లపై రాసి ఆరిపోయిన తరువాత కడగండి. పెరుగు చనిపోయిన చర్మపు కణాలను తొలగించి చర్మం యొక్క రంగును మెరుగు పరుస్తుంది.

బొప్పాయి పండు

బొప్పాయి పండులోని అనేక లక్షణాలు చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇది హైపర్ పిగ్మెంటేషన్ కు కారణం అయిన మెలస్మాను తగ్గిస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మ రంధ్రాలను శుభ్ర పరుస్తుంది.

 • ఒక స్పూన్ పండిన బొప్పాయి పండు, ఒక స్పూన్ తేనెని పేస్ట్ లా కలుపుకొని ముఖంపై రాయండి. 30 నిమిషాల తరువాత నీటితో కడగండి.

బాదాం

చర్మం తెల్లబడేందుకు కావలసిన ప్రోటీన్లు మరియు విటమిన్ ఇ బాదాం లో ఎక్కువగా ఉన్నాయి.

 • ఐదు బాదాంలను రుబ్బి కొన్ని చుక్కల తేనెని అందులో కలుపుకొని గట్టి పేస్ట్‌లా చేసుకోండి. వీటిని ముఖంపై, పిగ్మెంటేషన్ పై రాసి 5 నిమిషాలు మర్దన చేసి 20 నిమిషాల తరువాత కడగండి.

కలబంద

కలబంద జెల్ లో హైడ్రాటింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని మృదువుగా చేసి, మంటను మరియు పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది. మీరు ఎన్నో క్రీములలో మరియు మాయిశ్చరైజర్ లో కలబంద ఒక ముఖ్య పదార్థంగా ఉపయోగించటం చూసి ఉంటారు. దీనికి కారణం ఇందులోని వైద్య లక్షణాలు.

 • కలబంద జెల్‌ను ముఖంపై రాసి 5 నిమిషాలు మర్దన చేయండి. 15 నిమిషాల పాటు చర్మంపై ఉంచి కడగండి.

వోట్మీల్

వోట్మీల్ చర్మం యొక్క చనిపోయిన కణాలను మరియు హైపర్ పిగ్మెంటేషన్ ను తొలగించడంలో సమర్ధవంతంగా పని చేస్తుంది.

 • ఒక టేబుల్ స్పూన్ వోట్మీల్ కొద్దిగా పాలు మరియు కొన్ని చుక్కల తేనెని కలుపుకొని చర్మంపై రాసి 2 నిమిషాలు మర్దన చేసి 20 నిమిషాల తరువాత కడగండి.

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ హైపర్ పిగ్మెంటేషన్ తొలగించటమే కాదు నల్లని మచ్చలను కూడా తొలగించి చర్మానికి పోషణ కలిగిస్తుంది.

 • ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని చర్మంపై రాసి 20 నిమిషాల తరువాత కడగండి.

దోసకాయ

ఇది అన్ని రకాల క్రీములు మరియు చర్మ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఇందులో చర్మం యొక్క రంగును మెరుగు పరిచే మరియు హైడ్రేటింగ్ లక్షణాలు ఉన్నాయి.

 • రెండు టేబుల్ స్పూన్ దోసకాయ పల్ప్, రెండు టేబుల్ స్పూన్ కలబంద జెల్ మరియు ఒక స్పూన్ గులాబీ నీళ్లను బాగా కలిపి ముఖంపై రాసి 30 నిమిషాల తరువాత కడగండి.

కాయధాన్యాలు మరియు శనగ పిండి

ఇవి చర్మంపై చనిపోయిన కణాలను మరియు హైపర్ పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది.

 • ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ శనగ పిండి ఒక స్పూన్ ఉర్లగడ్డ రసం మరియు కొద్దిగ తేనెని కలుపుకొని పేస్ట్ లా తయారుచేయండి. దీనిని ముఖంపై రాసి ఆరిన తరువాత నీటితో మర్దన చేస్తూ తొలగించండి.

వేపాకు

ఇది ఒక శక్తివంతమైన స్కిన్ లైటనింగ్ ఏజెంట్. ఒక టేబుల్ స్పూన్ వేపాకు రసం మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖంపై రాసి 30 నిమిషాల తరువాత కడగండి.

టమోటా

ఇందులోని యాంటీ టాన్ అంశాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చనిపోయిన చర్మ కణాలను తొలగించడం ద్వారా చర్మాన్ని శుభ్రపరచి పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది.

 • ప్యాక్ 1: ఒక టమోటా రసం మరియు ఒక స్పూన్ చక్కెరను కలుపుకొని ముఖంపై రాసి 5 నిమిషాలు మర్దన చేసి కడగండి.
 • ప్యాక్ 2: 3 స్పూన్ల టమోటా రసం, 5 స్పూన్ల పాలు, ఒక స్పూన్ నిమ్మరసం, 1/2 స్పూన్ పసుపు మరియు ఒక స్పూన్ కొత్తిమీర పేస్ట్ కలుపుకొని ముఖంపై రాసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి.

సన్‌స్క్రీన్ లోషన్

సూర్య కిరణాల వలన పిగ్మెంటేషన్ అధికరిస్తుంది. కావున సూర్య కిరాణాల నుండి చర్మాన్ని కాపాడేందుకు ఇంట్లోనే సన్‌స్క్రీన్ లోషన్‌ను తయారు చేయవచ్చు.

 • ప్యాక్ 1: ఒక కప్పు దోసకాయ రసం, కొద్దిగా గ్లిసరిన్, గులాబీ నీళ్లను కలిపి ఫ్రిజ్లో ఉంచండి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు దీనిని ముఖం మరియు చేతులపై రాసుకోండి.
 • ప్యాక్ 2: బయటికి వెళ్లే ముందు 2 లేదా 3 చుక్కల నెయ్యి లేదా కొబ్బరి నూనెని ముఖంపై, చేతులపై రాసుకోండి.

కొబ్బరి నూనె

రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెని ముఖంపై, కాళ్లపై రాసి 10 నిమిషాలు మర్దన చేయండి. ఈ నూనెని రాత్రంతా చర్మంపై ఉంచి ఉదయం శనగ పిండితో కడగండి. ఇది మీ చర్మంలోని జిడ్డును మరియు పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది.

Posted on

Telugu skin care tips for men – పురుషుల చర్మ సంరక్షణ చిట్కాలు

సాధారణంగా మహిళలు వారి అందాన్ని సంరక్షించుకోడానికి ఎన్నో ప్రయత్నాలను చేయటం చూసి ఉంటాము, అనేక పద్దతులను ప్రయత్నిస్తారు. కానీ, మహిళలే కాదు కొందరు పురుషులు కూడా వారి అందం పట్ల జాగ్రత్తలు మరియు మెరుగు పరిచే పద్దతులను అనుసరిస్తారు. పురుషుల యొక్క చర్మం వారి టెస్టోస్టిరాన్ హార్మోన్ మీద ఆధారపడి ఉంటుంది. వీరి చర్మం చాలా మందంగా, ఎక్కువ రంధ్రాలతో మరియు ఎక్కువ కొల్లాజెన్ ఫైబర్స్ కలిగి ఉంటుంది. పురుషుల చర్మంలోని సెబాషియస్ గ్లాండ్స్ మరింత చురుకుగా పనిచేయటం వలన వీరి చర్మం ఎక్కువ జిడ్డుగా ఉంటుంది.

పురుషులు వారికోసం ప్రత్యేకంగా రూపొందించిన చర్మ సంరక్షణ ఉత్పత్తులనే ఉపయోగించాలి. షేవింగ్ తరువాత తేలికపాటి మరియు సున్నితమైన క్లెన్సర్లనే వాడాలి. న్యూట్రల్గా మరియు కెమికల్స్ తక్కువగా ఉండే జెల్స్, ఫోమ్స్ ను ఉపయోగించే షేవింగ్ చెయ్యాలి. షేవింగ్ తర్వాత ఉపయోగించే లోషన్లు జిడ్డు లేకుండా, ఎటువంటి ఆల్కహాల్ లేకుండా మంటను తగ్గించే విధంగా ఉండాలి.

పురుషుల చర్మ సంరక్షణం కొరకు కొన్ని సూచనలు

సాధ్యమైనంత వరకూ సూర్య కిరణాలనుండి చర్మాన్ని రక్షించుకోండి

సూర్యుని కిరణాలనుండి రక్షణాత్మక చర్యలు తీసుకోండి. సన్ గ్లాసెస్ ఉపయోగించటం మరియు సరైన దుస్తులను ఎంచుకోవడం చాలా అవసరం.

సన్‌స్క్రీన్ లోషన్ ఉపయోగించండి

ఇది చాలా సాధారణ విషయం, కానీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు.SPF కలిగి ఉన్న సన్‌స్క్రీన్లను ప్రతిరోజూ ఉపయోగించండి. దీని వలన సూర్య కాంతుల్లోని అనవసరమైన రేడియేషన్స్ నుండి మీ చర్మం సంరక్షింపబడుతుంది.

టోనర్ ఉపయోగించండి

టోనర్ కేవలం మహిళలకు మాత్రమే కాదు; పురుషుల కోసం కూడా ప్రత్యేకంగా తయారు చేయబడుతోంది. మీ ముఖంపై టోనర్ ఉపయోగించటం వలన మీ చర్మం యొక్క రంగు మెరుగు పొందుతుంది. అంతే కాదు ఇది మీ చర్మపు రంధ్రాలను కూడా తొలగిస్తుంది. రోజూ వీటిని ఉపయోగించి మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు యవ్వనంగా ఉంచుకోండి.

మంచి క్వాలిటీ గల పేస్ వాష్‌ని ఉపయోగించండి

ఒక వేళా మీ చర్మం నల్లబడి ఉన్నట్లయితే సాధారణ సబ్బులను ఉపయోగించటం వలన మీ చర్మం యొక్క రంగును తిరిగి పొందలేరు. ఎందుకంటే పురుషుల చర్మంలో ఎక్కువ ఆమ్లాలు ఉంటుంది. కావున చర్మానికి తగిన పేస్ వాష్‌ని ఉపయోగించటం చాలా అవసరం.

విటమిన్ సి ఉత్పత్తులను ఉపయోగించండి

విటమిన్ సి లో సహజ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది మన చర్మాన్ని సూర్య కిరణాల లోని రాడికల్స్ వలన కలిగే హాని నుండి కాపాడుతుంది. విటమిన్ సి కలిగిన ఉత్పత్తులను వినియోగించండి.

ఎక్సఫాలియేట్

వేసవి కాలం వచ్చే సరికి చర్మం పొడిబారిపోతుంది. కావున ఎక్కువ నీటిని త్రాగి చర్మంలోని తేమను కాపాడుకోవాలి. హైడ్రేటింగ్ ఫేషియల్స్ కూడా చేసుకోవచ్చు.

చర్మం యొక్క పోషణ

చర్మానికి తగిన పోషకాలను అందించండి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఉత్పత్తులను ఉపయోగించండి. ఎండాకాలంలో చర్మం తొందరగా డీహైడ్రేట్ అవుతుంది, కావున హైడ్రేటింగ్ మరియు మాయిశ్చరైజింగ్ క్రీములను ఉపయోగించండి. వేసవి కాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు తేనె మరియు నిమ్మరసాన్ని నీటిలో కలుపుకొని రోజూ త్రాగండి.

ఏక్కువ నీటిని త్రాగండి

రోజుకు 8 గ్లాసుల నీటిని త్రాగటం వలన మీ చర్మం ఆరోగ్యంగా మరియు యవ్వనంగా ఉంటుంది.

సమతుల్య మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

మీ చర్మం యొక్క ఆరోగ్యం మీరు తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. చక్కెర, ఆల్కహాల్ మరియు ఫాటీ ఫుడ్స్ ను నివారించాలి.

చర్మం పై రోజూ శ్రద్ధ తీసుకోవాలి

క్రమ బద్దకంగా చర్మంపై శ్రద్ధ తీసుకోవటం చాలా అవసరం. మీ చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉండాలంటే మీరు రోజూ చర్మ సంరక్షణ నియమాలను, సూచనలను పాటించాలి. ఆడవాళ్ళు మాత్రమే కాదు పురుషులు కూడా ఈ జాగ్రత్తలను తీసుకోవాలి. కేవలం కాస్మెటిక్స్ ఉపయోగించటం వలన చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచలేము.

పురుషులకు చర్మ సంరక్షణ చిట్కాలు

 • ఎప్పుడూ వెచ్చని నీటితోనే స్నానం చేయండి ఎందుకంటే వేడి నీటి స్నానం లేదా ఎక్కువ సేపు స్నానం చేయటం వలన చర్మంలోని నూనె గ్రంధాలు పూర్తిగా తొలగిపోయి, చర్మం పొడిబారిపోతుంది.
 • కెమికల్స్ తక్కువగా ఉండే సోపులను మరియు క్లీన్సర్లను వాడండి. ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ కలిగిన సోపులు చర్మంలోని తేమను పూర్తిగా తొలగించి గరుకగా చేస్తుంది. మీ చర్మాన్ని బట్టి మీకు తగిన సబ్బులు, జెల్స్ మరియు షాంపులను ఉపయోగించండి.
 • రోజూ షేవింగ్ చేయటం మీ చర్మానికి మంచిది కాదు. షేవింగ్ చేయటానికి ముందు క్రీం, లోషన్ లేదా జెల్‌ను రాయాలి. శుభ్రమైన రేజర్ వాడాలి. షేవింగ్ తరువాత మాయిశ్చరైజర్ ఉపయోగించండి.
 • మీరు వాడే మాయిశ్చరైజర్ మీ చర్మానికి తగినదై ఉండాలి. మీకు డ్రై చర్మం ఉన్నట్లయితే క్రీమీ లోషన్‌లను వాడండి, జిడ్డు చర్మం అయితే ఆయిల్ లేని మాయిశ్చరైజర్ ను వాడండి.
 • రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే మరియు రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభంగా కడగాలి. ఇది మీ చర్మం లోతు వరకు శుభ్రం అవటానికి మరియు కొత్త కణాలు ఉత్పత్తి అవటానికి తోడ్పడుతుంది.
 • చర్మంలోని తేమ పదార్థాలను ఎప్పుడూ కాపాడుకోవాలి. ఇందుకొరకు క్రీమీ లోషన్‌లను వాడండి మరియు ఎక్కువ నీటిని త్రాగండి.
 • కెఫీన్ మరియు మద్యం సేవించటాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఇవి చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. 20 ఏళ్ళ వయసునుండే రెటినోల్ క్రీములను రోజూ వాడటం వలన చర్మంపై ముడతలు మరియు చిన్నటి గీతలు రాకుండా ఉంటాయి.
 • ఎక్కువ చక్కెర పదార్థాలను తినకూడదు, ఎందుకంటే ఇవి చర్మానికి ఇన్ఫ్లమేషన్ మరియు మొటిమల లాంటి సమస్యలను కలిగిస్తాయి.
 • చర్మం యొక్క శత్రువు సూర్య కిరణాలు. ఈ కిరణాల వలన చర్మంలో కొల్లాజెన్ యొక్క ఉత్పత్తి తగ్గిపోయి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అంతే కాదు స్థితిస్థాపకతను కూడా తగ్గిస్తుంది.
 • ఎక్కువ ఒత్తిడి వలన మీ చర్మానికి చాలా హాని కలుగుతుంది. కావును యోగా, ధ్యానం మరియు వ్యాయామాలను క్రమంగా చేసి మీ ఒత్తిడిని తొలగించండి.
 • సరైన నిద్ర అవసరం. సరైన నిద్రలేకపోతే ఒత్తిడి పెరుగుతుంది, దీని వలన చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది.

కొన్ని ఇంటి చిట్కాలు

 • పచ్చి పాలను ముఖం, చేతులు మరియు కాళ్లపై రాసి 10 నిమిషాల తరువాత కడగవచ్చు.
 • షేవింగ్ చేసే 5 నిమిషాల ముందు ఆలివ్ లేదా బాదాం నూనెని రాసుకోవటం వలన చర్మం యొక్క తడితనం తగ్గకుండా ఉంటుంది.
 • 30ml కలబంద జెల్, 2 చుక్కల ద్రాక్ష పండు విత్తనాల రసం, 30ml గులాబీ నీళ్లు, 50ml ఆలివ్ నూనె మరియు 4 చుక్కల ఎస్సెంటిల్ ఆయిల్‌ను కలుపుకొని రోజూ మీ చర్మంపై రాసి కొద్దీ సేపు తరువాత కడగండి.
 • చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి వోట్మీల్ చాలా ప్రభావితంగా పని చేస్తుంది. కొద్దిగా చల్లని చమోమిలే టీ, వోట్మీల్, ఒక స్పూన్ తేనె మరియు 2 చుక్కల బాదాం నూనెని కలిపి ఒక స్క్రబ్ ను తయారు చేయండి. ఈ స్క్రబ్ ని ముఖం మరియు మెడపై రాసి కొద్ది సేపు మర్దన చేయండి.
 • అవోకాడో, తేనె మరియు వినిగర్‌ని కలిపి ఒక పేస్ట్‌లా చేసుకొని షేవింగ్ చేసిన తరువాత దీనిని రాయటం వలన మంట నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

తీర్మానం: పై చెప్పిన గృహ చర్మ సంరక్షణ చిట్కాలు పురుషుల కొరకు. ఎందుకంటే వారి చర్మ రంధ్రాలు పెద్దగా ఉంటాయి మరియు రోజూ లోతైన శుద్ది అవసరం. ఈ సహజ పదార్థాలను ఉపయోగించటం వలన ఎటువంటి హానీ కలగదు.

Posted on

Telugu tips for skin open pores – చర్మం యొక్క రంధ్రాలను(ఓపెన్ పోర్స్) తొలగించటం ఎలా?

చర్మ రంధ్రాలు మామూలుగా చాలా చిన్నగా ఉంటాయి, వీటిని సూక్ష్మంగా తనిఖీ చేస్తే గమనించవచ్చు. కొద్దిమందిలో అవి పెద్దగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జిడ్డు చర్మం(ఆయిలీ స్కిన్) ఉండే వాళ్లకు ఈ రంధ్రాలు పెద్దగా అయ్యే అవకాశాలు ఎక్కువ, వాటివలన మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ లాంటి సమస్యలు రావచ్చు.

ముఖ్య గమనిక, ఈ రంధ్రాలను తొలగించటానికి శాశ్వత చికిత్సలు లేవు. కానీ కొన్ని ఇంటి నివారణ పద్ధతుల ద్వారా వాటియొక్క పరిమాణంను తగ్గించవచ్చు.

చర్మ రంధ్రాల చికిత్సకు కొన్ని సహజమైన నివారణలు

గుడ్లు

ఒక కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకొని, కొద్ది సేపు బాగా చిలికి ఫ్రిజ్లో 5 నిమిషాలు ఉంచండి. ఆ తరువాత అందులో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి ముఖంపై రాయండి. కొన్ని నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ముఖంపై ఉంచి కడగండి. ఇలా ఒక నెల రోజులు చేయటం వలన రంధ్రాల యొక్క పరిమాణంలో మార్పులను చూడవచ్చు. జిడ్డు చర్మం ఉండే వారు ఈ మిశ్రమం వాడటం వలన రంధ్రాలు చిన్నగా అవ్వటం మాత్రమే కాదు చర్మం కూడా ధృఢంగా మరియు బిగువుగా అవుతుంది.

ముల్లంగి

ఒక టేబుల్ స్పూన్ వినిగర్, నిమ్మరసం, తేనె మరియు రెండు టేబుల్ స్పూన్ల తాజా ముల్లంగి రసాన్ని ఒక గిన్నెలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఒక జార్లో స్టోర్ చేయండి. పత్తిని ఉపయోగించి ఈ నీటిని రోజూ చర్మంపై రాయండి. ఎలాంటి రకమైన చర్మం ఉన్న వారైనా ఈ మిశ్రమాన్ని వాడవచ్చు.

దోసకాయ

రెండు టేబుల్ స్పూన్ల దోసకాయ రసాన్ని ఒక టేబుల్ స్పూన్ గులాబీ నీలల్లో కలిపి ఒక పత్తితో ముఖంపై రాయండి.

శనగ పిండి

ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి మరియు రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కలిపి ఒక నున్నటి పిండి ముద్దలా తయారు చేసుకోండి. దీనిని ముఖంపై రాసి 15-20 నిముషాలు ఉంచండి. ఆ తరువాత చల్లని నీటితో కడగండి. ఇలా వారానికి రెండు సార్లు చేయటం వలన చర్మ రంధ్రాల పరిమాణం తగ్గుతుంది. ఇది పొడి బారిన చర్మంపై ప్రభావితంగా పని చేస్తుంది.

ముల్తాని మట్టి

రెండు టేబుల్ స్పూన్ల ముల్తాని మట్టిని రెండు టేబుల్ స్పూన్ల గులాబి నీటిలో(రోజ్ వాటర్) కలిపి చర్మంపై రాయండి. జిడ్డు చర్మం ఉండే వారికి ఇది మంచి పరిష్కారం. ఈ మిశ్రమాన్ని తరచూ వాడవద్దు, ఎందుకంటే చర్మం పొడిగా అవుతుంది.

బొప్పాయి పండు

పండిన బొప్పాయి పండును బాగా మెత్తగా చేసి ముఖంపై సమానంగా రాయండి. రంధ్రాలు ఎక్కువగా ఉన్న చోట్లలో రాసి 30 నిమిషాల తరువాత వెచ్చని నీళ్లతో కడగండి. ఇది రంధ్రాలను తొలగించటమే కాకుండా ముఖంలోని నరాలలో స్థితిస్థాపకతని(ఎలాస్టిసిటీ) పెంచుతుంది. బొప్పాయి పండులోని యాంటీ-యాక్సిడెంట్ లక్షణాలు మీ చర్మాన్ని బాగు చేసి మెరుగుపరుస్తుంది.

ఆపిల్ సీడర్ వినిగర్

ఇది ఒక ప్రాకృతిక రక్తస్రావ నివారిణి మరియు చర్మం యొక్క రంగును పెంచుతుంది. వినిగర్‌ను నీళ్లలో కలిపి ఒక పత్తితో ముఖంపై రాయండి. 20 నిమిషాల తరువాత కడగండి. ఇందులోని యాంటీ-మైక్రోబియల్ లక్షణాలు మీ మొటిమలను మరియు బాక్టీరియా దాడులను కూడా తగ్గిస్తుంది. ఇది మీ చర్మ రంధ్రాలను తగ్గించి చర్మం యొక్క PH స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా మీ చర్మానికి చాలా మంచిది. ఇది వాడటం వలన మీ చర్మంలోని జిడ్డు మరియు దుమ్మును తొలగించి, రంధ్రాలను తగ్గిస్తుంది. బేకింగ్ సోడాను నీటిలో కలిపి ఒక ముద్దలా చేయండి. దీన్ని మీ ముఖంపై మసాజ్ చేసి నీళ్లతో కడగండి. ఇలా ఒక వారం పాటు రోజూ వాడి తేడాను చూడండి.

తేనె

తేనె కూడా మీ చర్మానికి చాలా మంచిది. ఇది ఒక మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. ఇందులో చాలా వైద్య లక్షణాలు ఉన్నందున చర్మాన్ని శుభ్రం చేస్తుంది. తేనెని మీ ముఖంపై రాసి చూడండి, మీ చర్మ రంధ్రాలు చిన్నగా మరియు చర్మం మెరుస్తూ అందంగా అవుతుంది.

పెరుగు

ఇందులో లాక్టిక్ ఆమ్లాలు(ఆసిడ్స్) ఉంటాయి, ఇవి మీ చర్మంలోని జిడ్డును మరియు సన్నటి గీతలను(ఫైన్ లైన్స్) తొలగించి రంధ్రాలను తగ్గిస్తుంది. పెరుగును ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత నీళ్లతో కడగండి. మీకు ఆయిలీ స్కిన్ ఉన్నట్లయితే పెరుగులో కోడిగుడ్డు యొక్క తెల్లసొనను కలుపుకొని ముఖంపై రాయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

చక్కెర

చక్కెరతో మీ ముఖాన్ని క్రమం తప్పకుండా రుద్దండి (స్క్రబ్ చేయండి). ఇది చర్మం యొక్క పోర్స్ ను సహజంగా శుభ్ర పరుస్తుంది.

కలబంద గుజ్జు

ఇది చర్మానికి తేమను అందించి, శుభ్రపరచడమే కాకుండా, పోషకాలను కూడా అందిస్తుంది. దీనిని పూయటం వలన చర్మంపై పేరుకున్న మురికి మరియు జిడ్డును తొలగించి, రంధ్రాల పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆలివ్ నూనె

ఇందులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు చర్మం యొక్క పొడి దనాన్ని, నిస్తేజాన్ని మరియు పెద్దగా ఉండే చర్మం యొక్క పోర్స్ ను సరి చేయడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ నూనెతో మీ చర్మంపై 3-4 నిమిషాల పాటు మర్దన చేసి, నీటితో శుభ్రం చేసుకోండి.

చర్మంపై పెద్ద రంధ్రాల చికిత్సకు చిట్కాలు

 • యాంటీ-యేజింగ్ లేదా పోర్-మినిమైజింగ్ క్రీములను కొని క్రమం తప్పకుండా వాడండి. ట్రెటినోయిన్ లేదా రెటినోనిక్ యాసిడ్ మరియు విటమిన్ ఎ పదార్థాలు ఉండే క్రీములను ఎంపిక చేసుకోండి.
 • జిడ్డు గల చర్మంకోసం ఉద్దేశించబడిన ఒక మెడికల్ కోర్సును అనుసరించండి. ఇది మీ చర్మాన్ని తక్కువ నూనెని ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతుంది మరియు పోర్స్ ను తొలగిస్తుంది.
 • మీ దగ్గర ఎప్పుడూ బ్లాట్టింగ్ పేపర్స్ ను ఉంచుకోండి. ఇవి చర్మంలోని జిడ్డును తొలగిస్తుంది. మీ చర్మం ఎక్కువ జిడ్డుగా అనిపించినప్పుడు వీటిని వాడండి.
 • మీరు మీ ముఖం మీద పిండిని(పౌడరు) రాసేటప్పుడు, T- జోన్ల పై (నెత్తి, ముక్కు మరియు గడ్డం) దృష్టి పెట్టండి. పౌడర్ నూనెని గ్రహిస్తుంది, అందువలన చర్మం తక్కువ మెరుస్తూ మరియు జిడ్డుగా కనిపిస్తుంది.
 • ఆయిలీ పదార్ధాలతో తయారు చేసిన అలంకరణ వస్తువులను వాడవద్దు. వాటిని వాడటం వలన చర్మం పై పోర్స్ మూసుకుపోతాయి మరియు వాటి పరిమాణం పెరుగుతుంది. అలంకరణకు ఆయిల్ తక్కువగా ఉండే ఉత్పత్తులనే వాడండి. వీలయినంత వరకు తక్కువ మేకప్ చేసుకోండి.
 • ముఖంపై పెద్ద రంధ్రాలు మరియు ముడతలు రాకుండా ఉండేందుకు సన్ స్క్రీన్‌ను ఉపయోగించండి. ఇందులోని SPF వీటిని అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది.
 • ఆల్కహాల్ ఎక్కువగా ఉన్న ప్రాడక్ట్స్ ను చర్మంపై వాడవద్దు. అవి మీ చర్మాన్ని పొడిగా చేస్తాయి.
Posted on

Telugu tips for oily skin – జిడ్డు చర్మానికి అద్భుతమైన చిట్కాలు

పొడి చర్మం ఉన్న వారికి ఎటువంటి సమస్యలు ఉంటాయో, అలానే జిడ్డు చర్మం ఉన్న వారు కూడా చాలా రకాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇటువంటి జిడ్డు చర్మాన్ని ఉంచుకుని బయటకి జనాల మధ్యలో తిరగడం వలన అందరూ చూసి హేళన చేస్తారేమో అని భావన అందరిలోనూ ఉంటుంది. చర్మం నుండి అధిక జిడ్డు స్రవించడం వలన వివిధ రకాల దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ అందులో ముఖ్యంగా మనల్ని బాధపెట్టే సమస్య మొటిమలు అనే చెప్పవచ్చు.

ఇలా అధిక మొత్తంలో స్రవించే జిడ్డుని కాస్త తక్కువ స్థాయికి తగ్గించి సమతుల్యంగా ఉంచడానికి, ప్రజలు జిడ్డుని నియంత్రించే క్రీములను, మోయిస్చరైజర్‌లను మరియు ఇతర సౌందర్య క్రీములను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు.

కానీ అటువంటి క్రీములను ఉపయోగించడం వలన మరిన్ని సమస్యలు తలెత్తవచ్చు. కనుక ఎటువంటి దుష్ప్రభావాలు లేనటువంటి సహజ మార్గాలలో జిడ్డు వలన ఏర్పడే మొటిమలు వంటి సమస్యలను నిరోధించడం ఉత్తమం.

ఇంటి వద్ద సహజ చిట్కాలను ఉపయోగించి ఫలితాను పొందడానికి కాస్త సమయం పట్టవచ్చు, కానీ దానివల్ల చాలా ప్రయోజనాలను మనం పొందుతాము. ఇప్పుడు మనం జిడ్డు చర్మానికి కొన్ని సమర్ధవంతమైన గృహ నివారణలను చూద్దాం.   

జిడ్డు చర్మం నుండి ఉపశమనం పొందడానికి 10 అద్భుతమైన మార్గాలు

 1. జిడ్డు చర్మం నుండి ఉపశమనం పొందడానికి పండ్లతో పోల్చి చూస్తే ఏ ఇతర ఉత్పత్తులు సాటిరావు. యాపిల్ జ్యూస్ లో కొద్దిగా నిమ్మ రసాన్ని కలిపి, ముఖానికి రాసుకోండి. అది ఆరిన తరువాత నీటితో కడిగేసుకోండి. ఇది మీ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.
 2. జిడ్డు చర్మం సమస్య నుండి బయట పడటానికి పాలు మంచిగా పనిచేస్తాయి. ముఖాన్ని పాలతో కడగటం లేదా మెత్తని దూదితో చర్మం మీద రుద్దుకుని శుభ్రపరుచుకోవడం వలన ముఖం మీద ఉన్న అధిక జిడ్డు తొలగిపోతుంది.
 3. జిడ్డు చర్మాన్ని ఇంటి వద్దనే సులువైన మార్గంలో తేనె ని ఉపయోగించి నిర్మూలించవచ్చు. ముఖానికి మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా తేనెని రాసుకుని, ఆరిన తరువాత కడిగేసుకుంటే చక్కని ఫలితాన్ని గమనించవచ్చు.
 4. పెరుగు లాక్టిక్ ఆసిడ్ ని కలిగి ఉంటుంది. ఇది కూడా పాలు లాగానే చర్మాన్ని శుభ్రపరుస్తుంది. పెరుగు మన చర్మంలో ఉన్న సహజ జిడ్డుని తొలగించకుండా చర్మంలో ఉన్న అధిక జిడ్డుని నివారిస్తుంది.
 5. ఐస్ మనం చర్మంలో ఉన్న అధిక జిడ్డు సమస్యను పరిష్కరించగలదు. ఐస్ ముక్కని నేరుగా కాకుండా ఒక మెత్తటి కాటన్ వస్త్రంలో ఉంచి ముఖం మీద రుద్దడం వలన జిడ్డు సమస్య నుండి బయట పడవచ్చు.
 6. గుడ్డు తెల్లసొన, ద్రాక్ష పండ్ల రసం మరియు నిమ్మరసం ని కలిపి ముఖానికి రాసుకోండి. 15 నుండి 20 నిముషాల వరకు ఉంచుకుని ఆరిన తరువాత శుభ్రపరుచుకోండి. ఇది రాయడం వలన మీ ముఖంలో కొత్త వెలుగుని మీరు గమనించవచ్చు. నిమ్మరసం చర్మాన్ని శుభ్రపరుస్తుంది, గుడ్డు తెల్లసొన చర్మాన్ని బిగుతుగా చేస్తుంది, అలానే ద్రాక్ష పండ్ల రసం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఇవన్నీ కలిపి ముఖాన్ని ఆకర్షనీయంగా మారుస్తాయి.  
 7. వివిధ రకాల ఖనిజాలను కలిగి ఉన్న కొబ్బరి పాలను ముఖం మీద ఉపయోగించి చూడండి. కొబ్బరి పాలు మీ చర్మానికి మోయిస్చరైజర్ గా పనిచేసి మీ చర్మంలో ఉన్న జిడ్డుని తొలగిస్తుంది. తద్వారా మీ చర్మం జిడ్డుగా కనిపించదు.
 8. ముఖానికి వాడే ఖటినమైన మేకప్ వస్తువుల వలన కూడా చర్మం నుండి అధికంగా జిడ్డు స్రవిస్తుంది. ఇది మేకప్ కిట్ల ఉపయోగం ద్వారా కొత్తగా తలెత్తిన సమస్య.
 9. చాలా మంది వారి ముఖాన్ని ఎక్కువగా కడుగుతుంటారు. కానీ మూడు సార్లు కంటే ఎక్కువగా ముఖాన్ని కడగటం వలన మరొక కొత్త సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది.  
 10. చివరిగా పోషకాలు ఉన్న పండ్లు మరియు కూరగాయలతో ఒక సాధారణ ఆహార ప్రణాళిక వేసుకుని జిడ్డు చర్మం ద్వారా తలెత్తిన సమస్యలను తొలగించడానికి ప్రయత్నించండి.

నిమ్మ రసం

నిమ్మకాయ సహజమైన సిట్రస్ ఆసిడ్ ను కలిగి ఉంటుంది, కనుక అది చర్మం యొక్క PH స్తాయులని ఒక మోస్తరుగా ఉండేలా చూస్తుంది. జిడ్డు నుండి స్రవించే కొవ్వును తొలగించడానికి నిమ్మకాయ ఒక మూల పదార్ధంగా ఉపయోగపడుతంది.

అందువలన నిమ్మ రసాన్ని చర్మానికి ఉపయోగించడం వలన అధిక జిడ్డుని సులువుగా తొలగిస్తుంది. ఇందుకోసం ఒక చెంచా నిమ్మ రసంలో అదే పరిమాణంతో పరిశుద్ధమైన నీటిని కలిపి ఒక కాటన్ బాల్ ని అందులో ముంచి మీ ముఖం మీద అప్లై చేసుకోండి. కానీ నిమ్మ రసం చర్మం మీద ఉండే అధిక జిడ్డుని తొలగిస్తుంది కాబట్టి ఇది ఉపయోగించిన తరువాత ఆయిల్ ఫ్రీ మోయిస్చరైజర్ ని చర్మానికి రాసుకోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.

టమాటాలు

ఈరోజుల్లో దాదాపుగా అందరూ వారి వంటకాల్లో మంచి రుచి కోసం టమాటాలను ఉపయోగిస్తున్నారు. ఈ టమాటాలు వంటల్లోనే కాదు సౌందర్యానికి కూడా ఉపయోగించవచ్చు అని చాలా మందికి తెలుసు.

ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారు ఒక టమాటాని కోసి ఆ రసాన్ని ముఖానికి రాసి అలా కాసేపు మసాజ్ చేయండి. ఇలా రుద్దిన తరువాత 15 నిముషాల పాటు ఉంచి ఆరిన తరువాత కడిగేసుకోండి. ఇది మీ ముఖంలో జిడ్డుని క్రమేపీ తొలగిస్తుంది, అలాగే మీ చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది.

కీరదోసకాయ

సంవత్సరాలుగా కీరదోసలను ఉపశమనం పొందడానికి ఉపయోగిస్తూ ఉన్నాం. ఇది శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. ఈ కీరదోసలో పొటాషియం, విటమిన్ ఎ అలాగే విటమిన్ ఈ అధికంగా ఉండటం వలన జిడ్డు చర్మం సమస్యతో బాధపడుతున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

దీనిని చాలా సులువుగా అప్లై చేసుకోవచ్చు. ఒక కీరదోసని తీసుకుని దానిని చక్రాలులా కోసి వాటితో ముఖ చర్మం మీద వలయాకారంలో కాసేపు రుద్దండి. లేదా కేరదోస గుజ్జుని తీసుకుని కాస్త నిమ్మ రసంతో కలిపి ముఖానికి ప్యాక్ లా రాసుకోండి. 20 నిముషాలు ఉంచి ఆరిన తరువాత నీటితో కడిగేసుకోండి. ఇది మీ చర్మంలో సహజ జిడ్డుని ఉంచి అధిక జిడ్డుని తొలగిస్తుంది.

వేప

వేప ఆకులు ముఖం మీద మొటిమలను చికిత్స చేయటానికి చాలా ప్రయోజనకారిగా పనిచేస్తాయి. ఇప్పుడు అన్ని కాస్మెటిక్ సంస్థలు వేప నుండి వచ్చే రసాయనాన్ని ఉపయోగించి సౌందర్య లేపనాలను తయారు చేస్తున్నాయి. కానీ ఇంటి వద్దనే తాజా వేప ఆకులను సహజ పద్ధతిలో ఉపయోగించి ముఖం మీద మొటిమలు మరియు జిడ్డుని తొలగించుకోవచ్చు.

ఇందుకోసం కొన్ని తాజా వేప ఆకులను తీసుకుని నీటిలో వేసి మరగబెట్టండి. నీరు పచ్చ రంగు మారేంత వరకు మరిగించి ఆ నీటిని వడకట్టి చల్లార్చండి. ఇప్పుడు అందులో ఒక కాటన్ బాల్ ని ముంచి ముఖం అంతటా అప్లై చేసుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉండటం వలన మీ ముఖం మీద మొటిమలు మరియు జిడ్డు తొలగిపోతుంది.

ఉప్పుతో పిచికారీ

ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల ఉప్పు వేసుకుని ఆ ఉప్పు కరిగేంత వరకు కలపండి. ఇప్పుడు ఆ ఉప్పు నీటిని ఒక పిచికారీ చేసే బాటిల్ లో వేసి మీ ముఖం మీద ఆ నీటిని పిచికారీ చేసుకోండి. ఇలా చేసినప్పుడు కళ్ళు మూసుకోవడం మర్చిపోకండి లేదంటే ఆ ఉప్పు నీటికి కళ్ళు మంట పెట్టవచ్చు.

ఈ చికిత్సని అనుసరిస్తున్నవారు వారి చర్మం మీద మొటిమలు, జిడ్డు వంటివి తొలగిపోయి, గొప్ప మెరుగుదల కనిపిస్తున్నట్లు గమనించారు.

వెనిగర్ మరియు గులాబి

మార్కెట్ లో దొరికే హానికరమైన కెమికల్స్ కలిపిన క్లెన్సర్లను ఉపయోగించడం మానేసి ఇంటి వద్దనే అద్భుతంగా పనిచేసే సహజమైన టోనర్ ని తయారు చేసుకోండి. ఇందుకోసం రెండు చెంచాల వెనిగర్ ని రెండు చెంచాల రోజ్ వాటర్ లో కలిపి ఒక కాటన్ బాల్ ని ఉపయోగించి ముఖానికి రాసుకోండి.

ఇలా చేయడం వలన ముఖం మీద ఉన్న రంధ్రాలు తెరుచుకుంటాయి అలానే జిడ్డు సమస్య తగ్గుతుంది. మీ ముఖం నుండి ఎంత జిడ్డు స్రవిస్తుందో తెలుసుకోవాలని ఉంటే బ్లాటింగ్ పేపర్ ను ఉపయోగించి తెలుసుకోండి. అప్పుడు మీకే అర్ధమవుతుంది. ఒక సహజమైన టోనర్ ని తయారు చేసుకోవాలి అనుకుంటే గ్రీన్ టీ ని కూడా ఉపయోగించుకోవాచ్చు.

Posted on

Oily skin care tips in Telugu – చర్మం మీద జిడ్డును తొలగించడానికి చిట్కాలు

జిడ్డు చర్మం కలవారికి వేసవి కాలంలో చెమటకు స్రవించే అదనపు జిడ్డు ఎంతో చికాకు కలిగిస్తుంది. కొందరు వారి అరచేతులు చెమట పట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు. నేటి కార్పోరేట్ ప్రపంచంలో ఏ సమయంలోనైనా తమ చేతులను వేరొకరితో కలపాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఈ విధమైన సమస్య మీకు ఎంతో ఇబ్బంది కలిగించవచ్చు. ఈ విషయంలో చెమటతో నిండిన చేతులు ఎదుట వ్యక్తికి కూడా ఇబ్బందిని కలిగించవచ్చు. ముఖ్యంగా ముఖంలో జిడ్డు వలన మీ రూపం ఎంతో నిరాసని కలిగిస్తుంది. మీరు మీ అందానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ సమస్య ఉన్నట్లయితే అవన్నీ వృధా అన్న భావన మీకు కలుగుతుంది. కాని ఇప్పుడు మీరు కొన్ని సరళమైన సహజ ఉపాయాలతో  జిడ్డు చర్మం నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

జిడ్డు చర్మం నుండి ఉపశమనానికి ముఖానికి సంబంధించిన ప్యాక్‌లు

జిడ్డు చర్మం చూడటానికి నిస్తేజంగా మరియు ఆకర్షణ లేమితో ఉండి ప్రత్యేక పోషణ మరియు శ్రద్ధ అవసరాన్ని కలిగి ఉంటుంది. జిడ్డు చర్మానికి సరిపడే సరియైన చర్మ సంరక్షనలను పాటించండి. జిడ్డు చర్మం పరిసరాలలోని దుమ్ము, ధూళిని సులభంగా ఆకర్షిస్తుంది. ఇది చర్మాన్ని నిస్తేజంగా మరియు జీవరహితంగా తయారుచేస్తుంది.  

కలబంద

జిడ్డు చర్మం అదనపు కొవ్వులను చర్మ ఉపరితలం మీద కలిగి ఉండటం వలన మొటిమలు, కురుపులు వంటి చర్మ హానికర సమస్యలకు కారణం అవుతుంది. ఈ అదనపు జిడ్డు సమస్య నుండి ఉపశమనం పొందడానికి కలబందని లేదా కలబంద గుజ్జుని ఉపయోగించి నిలిచి ఉన్న జిడ్డును చికిత్స చేయడం ద్వారా మొటిమలు, కురుపులు, మచ్చలు వంటి సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. కలబంద ఆకుల నుండి జాగ్రత్తగా గుజ్జుని సేకరించి దానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపడం ద్వారా జిడ్డు చర్మ సమస్యలకు ఒక ప్రభావవంతమైన గృహ ఔషదం మీ దగ్గర ఉన్నట్లే.     

టమాటో

కీలకమైన విటమిన్లు, పోషణలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన టమాటో రసం యొక్క ఆవశ్యకతను, చర్మం మీద దాని అద్భుతమైన ప్రభావాన్ని చాలా మంది అవగాహన చేసుకోలేకపోతున్నారు. మీరు కూడా ఈ విధమైన సమస్యని ఎదుర్కొంటున్నట్లు అయితే ఇంకేమీ ఆలోచించకుండా బాగా పండిన ఒక టమాటో చక్రాన్ని తీసుకుని మీ ముఖం మరియు మెడ భాగ చర్మం పీల్చుకునే వరకు దాని రసంతో రుద్దండి. ఇప్పుడు దానిని 15-20 నిముషాల పాటు వదిలేసి కడిగేసుకోండి. కాంతివంతమైన మీ ముఖాన్ని గమనించండి

పెరుగు, తేనె మరియు ఓట్స్

ఈ ఆశ్చర్యకరమైన చిక్కని సమ్మేళనం చర్మానికి ఒక మెరుపు వలె పనిచేస్తుంది. పెరుగు యొక్క మంచి ప్రభావం మీ చర్మం పొరలలో జిడ్డుపై మాత్రమే కాకుండా సమస్యపై కూడా మరింత పోరాడుతుంది. మరోవైపు తేనె మీ చర్మాన్ని బిగుతుగా చేసి తదుపరిగా మొటిమలు మరియు పగుళ్లు రాకుండా రక్షణ కల్పిస్తుంది. దీని యొక్క యాంటీ బాక్టీరియా మరియు యాంటీ ఫంగల్ ధర్మాలు ప్రభావం లోనికి వస్తాయి. మీరు దీనికోసం ముడి తేనె ఉండేలా చూసుకోండి. ఓట్స్ మీ చర్మ ఛాయకు వెలుతురు కలిగించి చర్మాన్ని మృదువుగా చేస్తాయి.   

ఆపిల్ ముక్కలు

రోజుకు ఒక ఆపిల్ అయినా తినాలని డాక్టర్లు ఎందుకు సిఫార్సు చేస్తారో తెలుసా? ఎందుకంటే ఆపిల్స్ వలన కొన్ని టన్నుల ప్రయోజనాలు మనకి లభిస్తున్నాయి. ఆపిల్స్ లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆపిల్స్ యొక్క ధర్మాలు జిడ్డు చర్మం కలిగిన వారికి మంచి ఫలితాలను ఇస్తాయి.  మీరు ఆపిల్ ను చక్రాలుగా కట్ చేసి వాటితో మీ చర్మం మీద జిడ్డు పోయేంత వరకు రుద్దండి. వారంలో దీనిని తరుచుగా చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.

మజ్జిగ

ఈ జాబితాలో దీనిని చూసి ఆశ్చర్యపోయారా? అయితే మజ్జిగ మీ చర్మానికి చేసే మేలుని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మజ్జిగ చర్మంలోని అంతర్గత పొరలను ఎంతో అనుకూల ప్రభావితం చేస్తున్నట్లు రికార్డు చేయబడింది. మజ్జిగ చర్మం మీద జిడ్డుని తొలగించడం మాత్రమే కాదు, అది చర్మానికి సహజమైన కాంతిని కుడా అందిస్తుంది.     ఇది మొదట్లో జిడ్డుగా అనిపించవచ్చు, కానీ దీర్ఘ కాలిక ప్రయోజనాల దృష్ట్యా చూస్తే అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది.

అరటిపండు ఫేస్ ప్యాక్

ఒక బాగా పండిన అరటి పండుని తీసుకోండి. దానిని గుజ్జుగా చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి మరియు మెడకు పట్టించి 20 నిముషాల పాటు వదిలేసి గోరు వెచ్చని నీటితో కడిగేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన జిడ్డు చర్మం తొలగిపోయి మొటిమలను కుడా నివారించవచ్చు.  

స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్

స్ట్రాబెర్రీస్ కూడా జిడ్డు చర్మాన్ని బాగా చికిత్స చేస్తాయి. కొన్ని స్ట్రాబెర్రీస్ తీసుకుని గుజ్జు లాగా చేయండి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపండి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి ఆరనివ్వండి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోండి. ఇది జిడ్డు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతే కాకుండా వయస్సు మల్లుతున్న వారిలో సంబంధిత లక్షణాలను ముఖంలో రాకుండా చాలా వరకు నిరోధిస్తుంది.   

నారింజ ఫేస్ ప్యాక్

నారింజలో విటమిన్ C సమృద్దిగా ఉంటుంది. అది చర్మం యొక్క వృద్ధ లక్షణాలని పోరాడి తొలగించడంలో సహాయం చేస్తుంది. అంతే కాకుండా చర్మ కణాలను అభివృద్ధి కూడా చేస్తుంది. నారింజలు తేజోవంతమైన యవ్వనపు చర్మాన్ని ప్రసాదిస్తాయి. నారింజ రసాన్ని నేరుగా మీ చర్మానికి పట్టించవచ్చు లేదా ఇతర సహజ పదార్ధాలని కలిపి కూడా ఉపయోగించవచ్చు.

నిమ్మ ఫేస్ ప్యాక్

నిమ్మ ఒక సహజమైన బ్లీచింగ్ ఉపకరణము. దీనిని ఫేస్ ప్యాకులలో ప్రధాన పదార్ధంగా ఉపయోగిస్తూ ఉంటారు. నిమ్మలోని సిట్రస్ ధర్మాలు చర్మాన్ని లోతుగా శుభ్రపరచి జిడ్డు స్రావాలను తగ్గిస్తాయి. నిమ్మరసానికి పసుపు లేదా ఇతర సహజ పదార్ధాలను కలిపి ఉపయోగించడం వలన చనిపోయిన కణాలు తొలగించబడి చర్మం నూతన తేజస్సుతో మెరిసిపోతుంది.

దోసకాయ ఫేస్ ప్యాక్

కీరదోస జిడ్డుని తొలగించడంతో పాటుగా మొటిమలు, మచ్చలు మరియు నల్ల మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మానికి మెరిసే కాంతిని అందిస్తుంది. కీరదోసని గ్రైండ్ చేసి రసం తీసి దానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. కావాలనుకుంటే చిటికెడు పసుపు కూడా అందులో కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని మీ చర్మానికి పట్టించి ఆరనివ్వండి. తర్వాత నీళ్ళతో కడిగేసుకోండి.   

ముల్తానీ మట్టి

ముల్తానీ మట్టి జిడ్డు చర్మం కొరకు ఖచ్చితంగా సరిపడే ఫేస్ ప్యాక్ అని చెప్పవచ్చు. ఇది మొటిమల చేత పీడించబడే చర్మానికి మంచి ఉపశమనకరిణిగా పనిచేస్తుంది. సరిపడా రోజ్ వాటర్ కలపడం ద్వారా ముల్తానీ మట్టిని పేస్టు లాగా సిద్ధపరచుకోండి. దీనికి ఒక చిటికెడు పసుపు కూడా కావాలంటే జోడించవచ్చు. ఈ ద్రావణాన్ని చర్మానికి రాసుకుని ఆరిపోయే వరకు ఉంచి తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేసుకోండి.

జిడ్డు చర్మానికి కారణాలు మరియు చికిత్సకు చిట్కాలు  

జిడ్డు చర్మానికి కింది సహజ చిట్కాలను పాటించండి. దానితో పాటుగా మృదువైన చర్మాన్ని పొందండి.

 • రోజుకు కనీసం రెండుసార్లు మీ ముఖ చర్మాన్ని మంచి ఫేస్ వాష్ చేత జిడ్డును తొలగించుకోవడానికి  శుభ్రపరుచుకోండి. ఇలా చేయడం వలన మీ చర్మపు రంద్రాలు తెరుచుకుని చర్మం మృదువుగా ఉంటుంది.
 • నిద్రపోయే ముందు అన్ని మేకప్ క్రీములను తొలగించుకోండి.
 • రోజూవారి ఆహారంలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేలా చూసుకోండి.
 • ఆకు కూరలు మరియు పండ్లు మీ రోజూవారి ఆహారంలో భాగమయ్యేలా చూసుకోండి.
 • పంచదార మరియు కొవ్వులను తగ్గించుకోండి.
 • చాక్లెట్లు, బాగా వేపిన ఆహారాలు, మత్తు పదార్ధాలపై మక్కువను తగ్గించుకోండి.
 • వంశపారంపర్య కారణాల వలన కూడా జిడ్డు చర్మం ఉండవచ్చు. జిడ్డు చర్మం వలన చర్మ రంద్రాలు మూసుకుపోయి పగుళ్ళు వచ్చే అవకాశం ఉంది.
 • వాతావరణ మార్పులు – వేసవిలో వేడి మరియు తేమ పెరగడం వలన చర్మంలో జిడ్డుల స్రావం పెరుగుతూ ఉంటుంది. శీతాకాలంలో చర్మం పొడిగా మారినప్పుడు డీహైడ్రేషన్ వలన సమతుల్యత కొరకు అదనపు జిడ్డు స్రవించబడుతుంది.
 • హార్మోనుల మార్పులు – మహిళల గర్భధారణ సమయంలో మొదటి లేదా తర్వాతి మోనోపాజ్ దశలు సెబాసియాస్ గ్రంధులను ప్రేరేపించడం వలన జిడ్డు అదనంగా కనిపించవచ్చు.
Posted on

Besan face packs for glowing skin in Telugu – మెరిసే చర్మం కోసం ఫేస్ ప్యాక్స్

శనగ పిండి మీ చర్మాన్ని సులభంగా శుభ్రపరచి మృదువుగా మార్చుకునేందుకు ఒక అద్భుతమైన గృహోపకరణం అని చెప్పవచ్చు. శనగ పిండితో చేసిన ఫేస్ ప్యాక్ ను మీ ముఖం మీద అప్లై చేసినపుడు మీ ముఖములో ప్రకాశవంతమైన వెలుగును గమనించవచ్చు. మీరు పొడి చర్మం లేదా జిడ్డు చర్మం కలిగి ఉన్నా, దానిని సరైన పద్ధతిలో నిర్వహించుకోకపోతే సహజమైన సౌందర్యాన్ని కోల్పోతారు. శనగ పిండి వివిధ రకాల ప్రయోజనాలను కలిగి ఉంది. చర్మ చికిత్సలో శనగ పిండిని ఉengపయోగించడం కొత్త పధ్ధతి ఏమీ కాదు. మన పెద్దలు ముఖ్యంగా పూర్వీకులు వారి చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి ఈ శనగ పిండిని ఉపయోగించేవారు.

మీ చర్మపు రకాన్ని బట్టి ఈ క్రింద చెప్పిన వివిధ ఫేస్ ప్యాక్ ల గురించి తెలుసుకోండి.

ప్రకాశవంతమైన చర్మం కోసం ఇంటి నివారణలు

అరటి పండు మరియు శనగ పిండి

3-4 ముగ్గిన అరటి పళ్ళు మరియు 2 టీ స్పూన్ల శనగ పిండిని తీసుకోండి.  ఆ రెండింటినీ కాస్త పాలు లేదా రోజ్ వాటర్ తో కలిపి ఒక పేస్టులా తయారు చేయండి. తరువాత ఈ పేస్టుని ఒక గ్రైండర్ లో వేసి దానికి 2 టేబుల్ స్పూన్ల శనగ పిండిని జోడించి మిక్సీ పట్టండి. అప్పుడు ఆ పేస్టుని ముఖానికి రాసుకుని 15 నిమిషాలు ఉంచుకోండి. ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

గుడ్డు తెల్లసొన మరియు శనగ పిండి

ఒక గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగ పిండి, 1 గుడ్డు తెల్లసొన వేసి కలపండి. దానిలో అర చెంచా తేనె వేసి మరలా బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి.  

గ్రీన్ టీ మరియు శనగ పిండి

ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని గ్రీన్ టీ బాగ్ ని వేయండి. గ్రీన్ టీ నుండి వచ్చే కషాయాన్ని చల్లార్చండి. ఇప్పుడు అందులో కొంత శనగ పిండి వేసి కలపండి. ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటూ ఉంచుకోండి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోండి. ఇది వాడిన తరువాత కొద్ది రోజులలోనే మీరు మార్పుని గమనిస్తారు.  

వేప మరియు శనగ పిండి

ఒక గిన్నెలో కాస్త వేప పొడి, కాస్త శనగ పిండిని తీసుకుని రోజ్ వాటర్ వేసి వాటిని బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి. ఈ ప్యాక్ వేసుకున్న తరువాత మీరు మీ చర్మం మీద మృదుత్వాన్ని గమనిస్తారు.  

బంగాళదుంప మరియు శనగ పిండి

కొన్ని బంగాళదుంపలు తీసుకుని వాటిని గ్రేట్ చేసి దాని నుండి వచ్చే రసాన్ని సేకరించండి. ఇప్పుడు అందులో శనగ పిండి మరియు నిమ్మ రసం వేసి ప్యాక్ లా చేసుకోండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరి వెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి. ఈ ప్యాక్ ఉపయోగించటం వలన కొద్ది వారాల లోనే మీరు మార్పుని గమనిస్తారు.

శనగ పిండి ఉబ్టన్

ఒక గిన్నె తీసుకుని అందులో కాస్త శనగ పిండి, తాజా మీగడ, పచ్చి పాలు, తేనె మరియు పసుపు వేసి కలపండి. ఈ పదార్ధాలు అన్నిటితో ఉబ్టన్ అనే ఒక సంప్రదాయకమైన ఫేస్ ప్యాక్ తయారవుతుంది. దీనిని రోజూ రాసుకోవడం వలన మెరిసే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20-30 నిమిషాల పాటూ ఉంచి ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది.

బొప్పాయి, శనగ పిండి మరియు నారింజ రసం

శనగ పిండి, బొప్పాయి మరియు నారింజ రసం యొక్క కలయిక సమాన చర్మ ఛాయని కలిగి ఉండేలా ఉపయోగపడుతుంది. ఒక బొప్పాయి తీసుకుని దాని తొక్క తీసి గుజ్జులా చేసి పక్కన పెట్టండి. దానికి సుమారు రెండు టేబుల్ స్పూన్ల నారింజ రసం మరియు ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి వేసి బాగా కలపండి. అయితే, ఆ మిశ్రమం మరీ చిక్కగా కాకుండా ఉండేలా చూసుకోండి.

ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకుని 30 నిమిషాల పాటూ ఉంచుకోండి. అది ఆరిన తరువాత ముఖాన్ని శుభ్రపరుచుకోండి. ఈ ప్యాక్ మీ చర్మం మీద పేరుకుపోయిన ట్యాన్ ని తొలగించి మీ ముఖాన్ని కాంతివంతంగా మరియు సమాన మేని ఛాయ కలిగి ఉండేలా చేస్తుంది.

శనగ పిండి మరియు కలబంద

శనగ పిండి మరియు కలబంద తో చేసిన ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా తేమగా ఉంచుతుంది. ఇందుకోసం ఒక టమాటా తీసుకుని గుజ్జులా చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు మరియు 1 టేబుల్ స్పూన్ శనగ పిండి వేసి బాగా కలపండి. ఆ ప్యాక్ ని ముఖానికి రాసుకుని 30 నిమిషాల పాటూ ఉంచి గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వలన ముఖం మీద మచ్చలు, సూర్యరశ్మి కి కందిపోయిన చర్మం మరియు పిగ్మెన్టేషన్ వంటివి తొలగిపోతాయి.

శనగ పిండి, రోజ్ వాటర్ మరియు ఫుల్లర్స్ ఎర్త్ (ముల్తాని మిట్టి)

ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మిట్టి, 2 టేబుల్ స్పూన్ల శనగ పిండి మరియు రోజ్ వాటర్ తీసుకుని పేస్టులా కలపండి. ఈ మిశ్రమం మరీ చిక్కగా లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ని మీ ముఖానికి పట్టించి సరిగ్గా 40 నిముషాలు ఉంచుకోండి. ఆరిన తరువాత వలయాకారంలో రబ్ చేస్తూ గోరు వెచ్చని నీటితో కడిగేసుకోండి. ఇలా వలయాకారంలో మసాజ్ చేస్తూ ఫేస్ ప్యాక్ ని కడుగుతున్నప్పుడు మీ ముఖ చర్మం మీద పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్ మరియు మురికి వంటివి తొలగించబడతాయి. ఈ ఫేస్ ప్యాక్ ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేసుకోవాలి.  

జిడ్డు చర్మానికి శనగ పిండితో ప్యాక్

శనగ పిండి చర్మపు రంధ్రాలలో పేరుకుపోయిన అధిక జిడ్డుని తొలగించే లక్షణాన్ని కలిగి ఉంది. కాబట్టి ఇది వివిధ రకాల ఫేస్ ప్యాక్ లలో ఉపయోగించబడుతుంది.

కావలసిన పదార్ధాలు మరియు తయారు చేయు విధానం

 • రెండు టేబుల్ స్పూన్ల శనగ పిండి
 • కొన్ని చుక్కల రోజ్ వాటర్

రోజ్ వాటర్ ని శనగ పిండిలో వేసి ప్యాక్ లాగా తాయారు చేయండి, దానిని మీ ముఖానికి మరియు మెడకి రాసుకోండి. 15 నిమిషాలు ఉంచుకుని ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి. మీకు కావాలి అనుకుంటే ఆ పేస్టులో పెరుగుని కూడా కలుపుకోవచ్చు. ఈ సులభమైన ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని శుభ్రపరచి తాజా అనుభూతిని ఇస్తుంది.

పొడి చర్మానికి శనగ పిండితో ప్యాక్

శనగ పిండితో ఇంటి వద్దనే అందుబాటులో ఉండే సులభమైన పదార్ధాలను ఉపయోగించి జిడ్డు చర్మాన్ని మాత్రమే కాకుండా పొడి చర్మాన్ని కూడా చికిత్స చేయవచ్చు.

కావలసిన పదార్ధాలు మరియు తయారు చేయు విధానం

 • ఒక టేబుల్ స్పూన్ పాలు
 • ఒక టేబుల్ స్పూన్ తేనె
 • అర టేబుల్ స్పూన్ పసుపు

శనగ పిండి, పాలు, తేనె మరియు పసుపుని తీసుకుని పేస్టులా కలపండి. ఈ ప్యాక్ ని ముఖానికి రాసుకుని 15 నిమిషాలు ఉంచి మామూలు నీటితో కడిగేసుకోండి. ఈ మిశ్రమం లో మోయిశ్చరైజర్ లా పనిచేసే తేనె మరియు పాలు ఉండటం వలన పొడి చర్మం ఉన్న వారికి ఒక అద్భుతమైన ప్యాక్ అని చెప్పవచ్చు.  ఈ ఫేస్ ప్యాక్ ని రోజూ ఉపయోగిస్తే చర్మం పొడిబారకుండా ఉండి మృదువుగా మరియు కాంతివంతంగా మారుతుంది.

మొటిమల చర్మానికి శనగ పిండితో ప్యాక్

శనగ పిండి మొటిమలను సహజంగా తొలగించడానికి పోరాడుతుంది. మీరు మొటిమలతో బాధపడుతున్నట్లైతే మొటిమలు నివారణా శనగ పిండి మాస్క్ ని ఉపయోగించవచ్చు. ఈ పేస్టుని తయారు చేయు విధానం క్రింద ఇవ్వబడినది.

కావలసిన పదార్ధాలు మరియు తయారు చేయు విధానం

 • రెండు టేబుల్ స్పూన్ల శనగ పిండి
 • ఒక టేబుల్ స్పూన్ తేనె
 • ఒక టేబుల్ స్పూన్ చందనం పొడి
 • కొన్ని చుక్కల రోజ్ వాటర్
 • చిటికెడు పసుపు

పైన చెప్పిన పదార్ధాలు అన్నీ ఒక గిన్నెలో తీసుకుని పేస్టులా కలపండి. ఈ ప్యాక్ ని వేసుకునే ముందు ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకుని అప్పుడు రాసుకోండి. 15 నిమిషాల పాటూ ఉంచుకుని ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోండి. మొటిమల బారి నుండి బయట పడటానికి ఈ ప్యాక్ ని తరచుగా ఉపయోగించండి. ఈ ప్యాక్ ని వారానికి కనీసం మూడు సార్లు వాడండి.    

మచ్చలు మరియు తెరిచివున్న రంధ్రాలకు శనగ పిండితో ప్యాక్

మహిళలలో వయసు పెరిగే కొద్దీ మచ్చలు మరియు తెరిచివున్న రంధ్రాలు సర్వసాధారణ సమస్యలు. ఇవి మీ చర్మాన్ని నిస్తేజంగా మార్చడం వలన వయసు పైబడిన వారిలా కనపడతారు. కాబట్టి మచ్చలు మరియు రంధ్రాల సమస్య నివారణకు ఈ క్రింది ఉన్న ప్యాక్ ని ఉపయోగించండి.  

కావలసిన పదార్ధాలు మరియు తయారు చేయు విధానం

 • మూడు టేబుల్ స్పూన్ల శనగ పిండి
 • మూడు టేబుల్ స్పూన్ల కీరదోస పేస్టు

శనగ పిండిని కీరదోస గుజ్జు తో కలిపి పేస్టులా తయారు చేయండి. దీనిని ఒక ఫేస్ మాస్క్ లా వేసుకుని 20 నిమిషాలు ఉంచుకోండి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుని కాటన్ వస్త్రం తో తుడుచుకోండి. ఈ ప్యాక్ ని తరచుగా వాడుతూ ఉండండి. ఇది మీ ముఖంలో రంధ్రాలను మూసుకునేలా చేసి క్రమంగా మొటిమలను కూడా తొలగిస్తుంది.

సూర్యరశ్మి కి నిస్తేజంగా మారిన చర్మానికి శనగ పిండితో ప్యాక్

ఎక్కువ సేపు సూర్యరశ్మి లో ఉండేవారికి ఈ ట్యానింగ్ సమస్య ఎదురవుతుంది. ఫేస్ వాష్ వాడి బయటకి వెళ్ళినప్పటికీ కూడా ఈ సమస్యకు లోనవుతారు. శనగ పిండి ఇందుకు చక్కగా ఉపయోగపడుతుందని రుజువయ్యింది. ఈ గృహ చిట్కా ఉపయోగించి మీ నిస్తేజమైన చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోండి.  

కావలసిన పదార్ధాలు మరియు తయారు చేయు విధానం

 • రెండు టేబుల్ స్పూన్ల శనగ పిండి
 • చిటికెడు పసుపు
 • 4-5 చుక్కల రోజ్ వాటర్
 • కొన్ని చుక్కలు నిమ్మరసం

పైన చెప్పిన పదార్ధాలను ఒక గిన్నెలో తీసుకుని పేస్టులా తయారుచేసి ముఖానికి మరియు మెడకి రాసుకోండి. 20 నిమిషాల పాటూ ఉంచి గోరు వెచ్చని నీటితో కడిగేసుకోండి. ఈ ప్యాక్ ట్యానింగ్ ని తొలగించడమే కాకుండా చర్మాన్ని తెలుపుగా మారుస్తుంది.   

ఇలా వివిధ రకాల పదార్ధాలతో ఇంటి వద్దనే శనగ పిండిని మన సౌందర్యం కోసం కొన్ని పద్ధతులలో ఉపయోగించవచ్చు. ఇది సహజ సిద్ధమైన పదార్ధం కనుక ఎటువంటి చెడు ప్రభావాలు కలగకుండా మన చర్మాన్ని మొటిమలు, మచ్చలు, ట్యానింగ్, జిడ్డు చర్మం, పొడి చర్మం వంటి అన్ని రకాల సమస్యలకు చక్కగా పనిచేస్తుంది.

Posted on

Fairness tips in Telugu – అందమైన చర్మాన్ని పొందడం ఎలా?

తెల్లని మేనిఛాయ పొందడం ప్రపంచంలో ప్రతి ఒక్కరి కోరిక. కానీ, దురదృష్టవశాత్తు కొందరు ప్రజలు పుట్టుక తోనే నల్లని వర్ణాన్ని కలిగి ఉంటారు. మరి కొందరు అధికమైన సూర్య కాంతి ప్రభావం చేత వారి చర్మం నల్లబడి, ఉన్న ఛాయను కూడా కోల్పోతుంటారు. ప్రజల జీవన విధానం కూడా వారి మేని ఛాయ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రజలు ఎండలోకి ఎక్కువగా వెళ్తూ ఉండటం వలన సూర్య కిరణాల ఒత్తిడికి చర్మం నల్లగా మారిపోతుంది.

మీ చర్మాన్ని కాంతివంతం చేసి అందంగా మార్చే ఎన్నో క్రీములు మీకు అందుబాటులో ఉండవచ్చు. కానీ అన్ని ఫెయిర్‌నెస్ క్రీములు మీ చర్మానికి మంచి చేయ లేకపోవచ్చు. మరి కొన్ని మీ చర్మాన్ని హానికరమైన నష్టాలకు గురిచేయవచ్చు కూడా. అయితే కొన్ని చిట్కాలతో వాటిలో మీ చర్మానికి స్నేహపూర్వక మైన వాటిని సులభంగా గుర్తించవచ్చు.

నల్లని మేని ఛాయతో ఎంతో మంది టీనేజర్లు ముఖ్యంగా అమ్మాయిలు తెల్లని చర్మాన్ని పొందడానికి తీవ్రమైన కోరికతో ఉన్నారు. వాళ్ళంతా చర్మాన్ని తెల్లగా మార్చుకోవడానికి మార్గాల కోసం ఎదురు చూస్తున్నారు. తెల్లని ఛాయని పొందడానికి అందానికి సంబంధించిన చిట్కాలు రెండు రకాలు అందులో ఒకటి సహజమైనవి, మరొకటి కాస్మేటిక్ విధానాలు. కాస్మేటిక్ విధానంతో చర్మాన్ని తెల్లగా మార్చుటకు మార్కెట్లో చాలా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

ఈ క్రీములు, లోషన్లు మరియు సబ్బులు కొన్ని రకాల చర్మాలకు హాని కలిగించే అవకాశాలు మెండుగా కలిగి ఉండవచ్చు. మరో వైపు సహజ చిట్కాలు పూర్తిగా గృహంలో అందుబాటులో లభించే పండ్లు, కూరగాయలు, మరియు ఇతర తినదగిన పదార్ధాలను కలిగి ఉంటాయి. ఈ సహజ చిట్కాలు చర్మ లక్షణాలతో సంబంధం లేకుండా అన్ని రకాల చర్మాలకు సరిపడుతుంది. ఇది ఏ విధమైన దుష్ప్రభాలు లేకుండా సహజ పద్ధతిలో లభించే చికిత్స. మొటిమలు సురక్షితంగా తొలగించడానికి మరియు చర్మ కాంతిని మెరుగు పరచడానికి చౌకగా లభించేవి సహజ చిట్కాలు.

ముఖ ఛాయని తెల్లగా మార్చుటకు చిట్కాలు

 • మీరు బయటకెళ్ళి వచ్చాక తప్పనిసరిగా మీ ముఖాన్ని వెంటనే కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మీ చర్మపు పొరలలోని దుమ్ము, ధూళి అంతా తొలగించబడుతుంది.
 • యాదృచ్చికంగా ఎంపిక చేయబడిన నాణ్యత లేని ఫేష్ వాష్ లకు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి మీ చర్మానికి సంబంధించిన చికాకులను కలిగించి హాని తలపెట్టగలవు.
 • మీరు మీ చర్మపు ఛాయను కోల్పోయినప్పుడు, చనిపోయిన చర్మ కణాలు మీ చర్మ పొరల్లో స్థావరాలని కలిగి ఉంటాయి. అందువలన మీ చర్మం నిస్తేజంగా మారి ఆకర్షణ రహితంగా మారుతుంది. దీనికి పరిష్కారంగా అటువంటి చనిపోయిన చర్మ పొరలను తొలగించడానికి వారానికి ఒకసారి ముఖానికి స్క్రబ్ లను ఉపయోగించడం మంచిది.
 • మీరు ఆకర్షనీయమైన చర్మం కోసం ఎదురు చూస్తున్న వారు అయితే మీరు ప్రతీ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు వేడి లేదా చల్లని పాలను తాగండి. ఇది మీ చర్మ శుద్ధికి మాత్రమే కాకుండా చర్మాన్ని కాంతి వంతంగా మరియు ఆకర్షనీయంగా చేస్తుంది. పాలు ఒక సహజమైన చర్మ సంరక్షిత మరియు చర్మాన్ని కాంతివంతం చేయు ద్రావణం అని మనందరికీ తెలుసు.
 • అంతేకాకుండా మీరు స్వల్ప మొత్తంలో కొన్ని పాలను ఒక కప్పులో తీసుకుని ఒక కాటన్ బంతి తో నెమ్మదిగా మీ ముఖానికి రాసుకోండి. కాటన్ బంతిని పిండుతూ మీరు మీ ముఖం మీద రుద్దుతున్నప్పుడు తెల్లని పాలు నల్లగా మారి కిందకి జారుతూ ఉండటం మీరు గమనిస్తారు. దీని అర్ధం వాతావరణం లోని దుమ్ము, ధూళి మీ చర్మపు పొరల్ని ప్రభావితం చేసిందని తెలుస్తోంది. మీ చర్మాన్ని శుభ్ర పరచడంలో ఇది ఒక అద్భుతమైన మార్గం అని చెప్పవచ్చు.
 • మీ అర చేతిలోకి ఒక గ్రాము శనగ పిండి తీసుకుని కొన్ని చుక్కల నీటిని అందులో వేయండి. పేస్టు లాగా దానిని కలపండి. ఈ ప్రత్యేకమైన పేస్టుని మీ తడి చర్మం మీద అప్లై చేయండి. కొన్ని నిముషాల పాటు వదిలేసి చల్లని నీటితో కడిగేసుకోండి.
 • చర్మాన్ని తెల్లగా మార్చుకునే తరుణంలో మరొక సహజ మార్గంగా బార్లీని ఉపయోగించండి. కొంత బార్లీ పిండిని తీసుకుని అందులో పేస్టుగా చేసేందుకు సరిపడా రోజ్ వాటర్ మరియు నిమ్మరసం ను కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరడానికి కొంత సమయం ఇవ్వండి. ఆరిపోయాక చల్లని నీటితో కడిగేసుకోండి.
 • మీ ఇంటిలో బాదం అందుబాటులో ఉన్నట్లయితే వాటిని ఒక రాత్రంతా నీటిలో నానబెట్టండి. వాటిని గుండ చేసి అందులో 4 చెంచాల తాజా పాలను కలపండి. పొడిగా ఉన్న ముఖం మీద ఈ పేస్టుని రాసి ఆరనివ్వండి. చల్లని నీటితో దీనిని కడిగేసుకోండి.

కాంతివంతమైన చర్మ అందానికి గృహ చిట్కాలు

 • తేనె తెల్లని చర్మ కాంతిని అందించే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది. తేనె తీసుకుని వృత్తాకార కదలికలో మీ ముఖం మీద రోజుకి రెండు సార్లు నేరుగా రుద్దడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
 • కీరదోస అనేది తెల్లని చర్మ ఛాయని పొందడంలో పేరొందిన ఒక కూరగాయ. చర్మ ఛాయాని కాంతివంతంగా మార్చుకోవడానికి కీరదోస తీసుకోవడం లేదా కీరదోస గుజ్జు అప్లై చేసుకోవడం వంటివి రెండూ బాగా ఉపయోగపడతాయి. కీరదోస చర్మాన్ని చల్లబర్చడమే కాకుండా ముఖం మీద ఉన్న బ్లాక్‌హెడ్స్ ని తొలగిస్తుంది. కీరదోస ముక్కలను అలసిన కళ్ళ మీద ఉంచుకోవడం వలన ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తొలగించడంలో కూడా కీరదోస ఉపయోగపడుతుంది.
 • నిమ్మకాయ ఒక సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ గా చెప్పవచ్చు. మీరు ఆరు వారాలపాటు నిమ్మకాయ రసాన్ని ముఖానికి రుద్దడం ద్వారా సంతృప్తికరమైన ఫలితాలు సాధించవచ్చు.
 • బొప్పాయి చర్మంకు తేజస్సును తేవడానికి ఉపయోగించే ఒక సాధారణ సమయోచిత ఔషధం. ముఖం మరియు చేతుల మీద పండిన బొప్పాయి పేస్ట్ ను పట్టించండి. దానిని ఒక గంట పాటు వదిలేసి ఆపై కడిగేయండి.
 • తులసి సూర్యరశ్మి నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి మరియు చక్కని చర్మ రంగుని పునరుద్ధరించడానికి ఉత్తమ పరిష్కారంగా గుర్తించబడింది. తులసి ఆకులను ఒక చూర్ణం లాగా గ్రైండ్ చేసుకుని ముఖానికి పట్టించండి. కొన్ని నిమిషాలు తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి.
 • గులాబీల నీళ్ళు చాలా తక్కువ వ్యవధిలో చర్మంకు గులాబీ రంగును ఇవ్వగలవని చెప్పబడింది. గులాబీ రేకులను 24 గంటలు నీటిలో నానబెట్టి ఆ నీటితో రోజుకు రెండు నుండి మూడు సార్లు ముఖాన్ని కడగాలి.
 • పసుపు చాలా మంది దక్షిణ భారత మహిళలు వారి చర్మ కాంతిని మెరుగు పరుచుచుకోవడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన గృహ పదార్ధము. ముఖం, చేతులు మరియు పాదాలకు ఒక పక్ష కాలము పాటు రోజుకి రెండుసార్లు ఉపయోగించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
 • టమాటో రసం చర్మానికి వెలుగు ప్రసాదించడంతో పాటుగా చర్మానికి తాజా అనుభూతిని కలిగిస్తుంది. టమాటో గుజ్జుని ముఖానికి పట్టించడం వలన సులభంగా కాంతి వంతమైన చర్మాన్ని పొందవచ్చు.
 • గుడ్డు పచ్చసొన చర్మానికి ఉత్తమమైన పదార్థంగా పరిగణించబడుతుంది. ఒక గిన్నె లో గుడ్డు పచ్చసొన, తేనె మరియు పెరుగు మిశ్రమం సిద్ధం చేసుకుని ముఖానికి ప్యాక్ గా అప్లై చేసి ఆరనివ్వండి. తదుపరి చల్లటి నీటితో కడిగేయండి.
 • పాలు మరియు కుంకుమ పువ్వు పురాతన మహారాణులు తెల్లని చర్మం పొందడానికి ఉపయోగించే ఒక ఔషధ నివారణగా చెప్పవచ్చు. ఒక కప్పు పాలలో కుంకుమ పువ్వుని కలపండి. దానిని వలయాకారంలో ముఖం మీద మృదువుగా రుద్దండి.
 • నిమ్మరసం మరియు చక్కెర మిశ్రమం కొన్ని వారాలలో మృదువైన మరియు కాంతి వంతమైన చర్మాన్ని పొందడానికి ఒక సరియైన స్క్రబ్ అని చెప్పవచ్చు. నిమ్మరసం మరియు చక్కెర మిశ్రమాన్ని చక్కెర కరిగేవరకు ముఖానికి మృదువుగా రుద్దండి.
 • ఎరుపు పప్పు మరియు బియ్యం కూడా తెల్లని ఛాయని పొందడానికి ఉపయోగించబడతాయి. ఎరుపు పప్పు మరియు బియ్యం లను సమ భాగాలుగా తీసుకుని నానబెట్టి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి.
Posted on

Telugu tips for dark circles – కళ్ళ కింద నల్లని వలయాలను తగ్గించే చిట్కాలు

మన కళ్ళకింద ఏర్పడే నల్లటి వలయాలను సహజ పద్దతిలో వదిలించుకోవడానికి కొన్ని సమర్ధవంతమైన చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ చిట్కాల ద్వారా క్రమంగా చక్కటి ఫలితాలను పొందుతారు. కళ్ళకింద ఉండే చర్మం నల్లగా ఉండటాన్ని నల్లటి వలయాలు అని పిలుస్తారు. ఇది అన్ని వయసుల పురుషులను మరియు స్త్రీ లను ప్రభావితం చేస్తుంది. మొదటిగా నల్లటి వలయాలు రావడానికి గల సాధారణ కారణాలు తెలుసుకుందాం.

ఏ కారణం వల్ల కళ్ళకింద నల్లటి వలయాలు వస్తాయి?

సాధారణంగా కళ్ళ చుట్టూ ఉండే ఈ నల్లటి వలయాలు ఉదయం లేవగానే మరింత ఎక్కువ నీలం రంగులో కనిపిస్తాయి మరియు దీని వల్ల కళ్ళకింద చర్మం పలుచగా ఉండటంతో పాటు రక్త వాహక నాళాలు శరీరంలో మిగతా చోటుకంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ, చర్మం దాని పునరుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతుంది మరియు చర్మం మరింత పలుచగా అవుతుంది. ఫలితంగా నల్లటి వలయాలు మరింత నీలంగా మారుతాయి.

అయితే, ఆసియా ప్రజల చర్మ వర్ణం లో సాధారణంగా నీలం వలయాలు చాలా అరుదు. ఇది గోధుమ రంగులో ఉన్నట్లయితే జీవితం చాల దుర్భలంగా అనిపిస్తుంది. ఈ పరిస్థితినే హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు, దీనికి కారణం కళ్ళ క్రింద ఎక్కువ మెలానిన్ ఉత్పత్తి అవ్వడం. ఒక్కోసారి ఈ నల్లటి వలయాలు వంశపారంపర్యంగా వస్తాయి మరియు ఈ సందర్భంలో చర్మం రంగు మార్చడానికి సరైన చికిత్స తప్ప వేరే మార్గం లేదు.

శరీరం యొక్క ఇతర భాగాలలో చర్మం 2 మిల్లీ మీటర్ల మందంతో ఉంటే కళ్ళు చుట్టూ ఉండే చర్మం 0.5 మిల్లీ మీటర్ల మందంగా మాత్రమే ఉంటుంది, అందుకే మీరు సుదీర్ఘ కాలం పనిచేసినా, మీరు సన్ గ్లాస్ లేకుండా సూర్యుడు కింద కొన్ని గంటలు గడిపినా, ఒక నిద్రలేని రాత్రి గడిపినా, ఈ ప్రాంతం యొక్క చర్మం చాలా ప్రభావితం అవుతుంది.

ఈ వ్యాసం యొక్క తరువాతి భాగంలో మీ అలవాట్లు మరియు జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడం వలన అవి ఈ నల్లటి వలయాలను వదిలించుకోవడానికి ఎలా సహాయపడతాయో వివరించడం జరిగింది. చదవండి.

సరిగా నిద్ర పోండి

సరైన నిద్ర లేకపోవడం వలన ఈ కంటి క్రింద నల్లటి వలయాలు వచ్చే ప్రమాదం ఉంది. అలసటతో కూడిన జీవనశైలితో పాటు సరిగా విశ్రాంతి తీసుకోకపోవడం మరియు ఒత్తిడి వంటివి అన్ని వయస్సుల వారికి ఈ నల్లటి వలయాలు రావడానికి గల ప్రధాన కారణాలు. మానసికంగా మరియు శారీరకంగా అధిక పని ఒత్తిడి కూడా దీనికి కారణమవుతుంది.

సూర్యరశ్మి నుండి మీ చర్మంను రక్షించుకోండి

ముందు చెప్పినట్లుగా, మీరు సన్ స్కిన్ లోషన్ రాసుకోకుండా బయటికి వెళ్లినప్పుడు హానికరమైన అల్ట్రా వైలెట్ కిరణాలు మీ చర్మంపై ప్రభావం చూపుతాయి, కళ్ళు చుట్టూ ఉండే చర్మం చాలా పలుచగా మరియు సున్నితమైనదిగా ఉంటుంది, దీని వలన మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని ఫలితంగా నల్లటి వలయాలు ఏర్పడుతాయి.

మంచి నాణ్యమైన మేక్-అప్ ఉత్పత్తులను సరైన పద్ధతిలో వాడండి
మీది సున్నితమైన చర్మం అయితే, మేకప్ ఉత్పత్తులను సరైన పద్ధతిలో ఉపయోగించక పోవడం వలన నల్లటి వలయాలు పొందే అవకాశం అధికంగా ఉంటుంది. మేకప్ ఉత్పత్తులను ఉపయోగించే ముందు మీరు వాటిని పరీక్షించి మీ చర్మం సున్నితమైనది కానటువంటి నాణ్యమైన సౌందర్యాలను మాత్రమే ఎంచుకోండి. అలాగే నిద్రించడానికి ముందు పూర్తిగా మేక్-అప్ ను తొలగించండి.

వ్యాధికి సరైన చికిత్స తీసుకోండి

రక్తహీనత మరియు మూత్రపిండాల సమస్యలు వంటి కొన్ని వ్యాధులు మీ కళ్ళు కింద నల్లటి వలయాలకు కారణం కావచ్చు. మీరు అలాంటి సమస్యలతో బాధపడుతుంటే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. అనారోగ్యానికి గురైన తర్వాత నల్లటి వలయాలు రావడం చాలా సాధారణం కానీ సరైన జాగ్రత్త తీసుకుంటే సాధారణంగా సమయంతో పాటు అవి తొలగిపోతాయి.

ద్రుష్టి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోండి

మీకు దృష్టి సమస్యలు ఉన్నా, కానీ మీరు కళ్ళజోళ్ళు లేదా లెన్సులు ధరించకపోతే, అది కూడా నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణం కావచ్చు. దృష్టి సమస్యలున్నప్పుడు కళ్ళజోళ్ళు లేదా లెన్సులు ఉపయోగించని వ్యక్తులు స్పష్టంగా చూడటం కోసం వారి కళ్ళను నొక్కిచూస్తారు, ఇలా చేయడం వలన నల్లటి వలయాలు ఏర్పడతాయి. కాబట్టి మీకు దృష్టి లోపం ఉందో లేదో ఈ రోజే తెలుసుకోండి.

మీ జీవన శైలిని మార్చుకోండి

ఉత్తమమైన ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. అధిక ధూమపానం మరియు మద్యం వినియోగం చేయడం ద్వారా కూడా కళ్ళు చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడవచ్చు. కాబట్టి ఈ అలవాట్లనుండి దూరంగా ఉండండి. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ మరియు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

డీ హైడ్రేషన్ ను నివారించండి

డీ హైడ్రేషన్, శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణం కావచ్చు. డీ హైడ్రేషన్ శరీరంపై ఒత్తిడిని కలిగిస్తుంది, దీని వల్ల చర్మం పొడిగా ఉంటుంది, ఇది కంటి ప్రాంతం యొక్క సున్నితమైన చర్మాన్ని మరింత ప్రభావితం చేస్తుంది, ఇది నల్లటి వలయాలను పెంచుతుంది. కాబట్టి, మీ శరీరం మరియు చర్మం హై డ్రేట్ అవ్వకుండా క్రమం తప్పకుండా తగినంత నీరు త్రాగడం అలవాటు చేసుకోండి.

ఏ కారణం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తాయో మరియు వాటిని ఎలా నివారించవచ్చో తెలుసుకున్నాం. ఇప్పుడు నల్లటి వలయాలను వదిలించుకోవడానికి కొన్ని సులభమైన గృహ చిట్కాలను మీరు ఇక్కడ తెలుసుకుంటారు. క్రింద చెప్పిన వాటిలో ఏదైనా ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తూ ఆహారపు అలవాట్లను మరియు పైన చెప్పిన జీవనశైలిలో మార్పులు అనుసరిస్తే నల్లటి వలయాలు తగ్గడం మీరు గమనిస్తారు.

కళ్ళ కింద నల్లటి వలయాలను వదిలించుకోవడానికి కొన్ని గృహ చిట్కాలు

పసుపు మరియు పైనాపిల్ జ్యూస్

పసుపు చర్మం ఉపశమనానికి మరియు కాంతిని పొందటం వంటి సహజ లక్షణాలను కలిగి ఉంది. పైనాపిల్ జ్యూస్ చర్మానికి పోషణను అందించగలదు, కళ్ళు చుట్టూ ఉండే నల్లటి వలయాలను వదిలించి కాంతివంతం చేస్తుంది. పైనాపిల్ జ్యూస్ 1 చెంచా తో పాటు 1 టేబుల్ స్పూన్ పసుపు పేస్ట్ కలపండి. ఈ మిశ్రమాన్ని మీ కళ్ళ చుట్టూ ఉండే చర్మంపై ఒక ప్యాక్ లా వేసుకోండి. 5 నిముషాల పాటు అలానే వదిలివేసి తరువాత నీటితో కడగండి.

కీర దోసకాయ

దోసకాయతో కళ్ళ కింద నల్లటి వలయాలను వదిలించే ఒక ప్రసిద్ధి చెందిన గృహ చికిత్స. దోసకాయలో నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడే కాణ జాలాలకు సహజ చర్మపు సౌమ్యత లక్షణాలను కలిగి ఉంటుంది. రిఫ్రిజిరేటెడ్ దోసకాయలను ముక్కలుగా చేసి, నేరుగా మీ కళ్ళ కింద నల్లటి వలయాలను కప్పే విధంగా 10 నిమిషాల పాటు ఉంచాలి. త్వరిత ప్రభావం కోసం దోసకాయ రసంలో దూదిని నానబెట్టి 20 నిమిషాలు మీ కళ్ళ కింద నల్లటి వలయాలపై పెట్టండి. ఆ తరువాత, మామూలు నీటితో కడగండి. ఈ చిట్కా వలన చర్మపు సౌమ్యత మరియు రిఫ్రెష్ ప్రభావాన్ని పొందుతారు.

కీర దోస మరియు నిమ్మ రసం

మీరు శీఘ్ర ఫలితాలను పొందడం కోసం నిమ్మరసంతో పాటు దోసకాయ రసంని కూడా ఉపయోగించవచ్చు . 2 స్పూన్లు దోసకాయ రసం తో పాటు కొన్ని చుక్కల నిమ్మ రసంను కలపండి ఈ మిశ్రమాన్ని కన్ను కింద నల్లటి వలయాలపై రాయండి. 10 నుంచి 15 నిముషాల వరకు అలానే వదిలేసి తరువాత మామూలు నీటితో శుభ్రం చేసుకోవాలి. మెరుగుదలను చూడడానికి ఒక వారం లేదా పది రోజులు ఈ పరిష్కరణా విధానాన్ని ప్రయత్నించండి.

కళ్ళ కింద నల్లటి వలయాలను వదిలించుకోవడానికి బంగాళదుంప జ్యూస్

తొక్క తీసి చిన్నగా ముక్కలు చేసిన బంగాళ దుంపలను మెత్తగా గ్రైండ్ చేసి వచ్చిన గుజ్జు నుండి రసం సేకరించాలి. తర్వాత కాటన్ బాల్ లను తీసుకుని వాటిని ఆ రసంలో ముంచి నల్లని వలయాలను కప్పి ఉంచేలా కళ్ళ మీదగా పెట్టుకోవాలి . అలా ఒక 20 నిముషాలు ఉంచి కడిగేసుకోవాలి. ప్రత్యామ్నాయంగా ప్రతీ రోజు బంగాళా దుంపలను చక్రాలుగా కోసి కళ్ళ మీద పెట్టుకుని 15-20 నిముషాలు పాటు ఉంచగలిగినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

రోజ్ వాటర్

మొండి నల్లటి వలయాలను వదిలించుకోవడానికి రోజ్ వాటర్ మీకు సహాయం చేస్తుంది. రెండు దూది ముక్కలను తీసుకుని రోజ్ వాటర్లో నానబెట్టి, వాటిని మీ మూసి ఉన్న కళ్ళపై ఉంచి, 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. తడిగా ఉండేలా చూసుకోండి. ఈ చిట్కా వలన చర్మపు సౌమ్యత మరియు రిఫ్రెష్ ప్రభావాన్ని పొందుతారు. ఈ పరిహారంను కొన్ని వారాలపాటు రోజుకి రెండు సార్లు చెయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

ఆల్మాండ్ మరియు మిల్క్

బాదం మరియు పాలు కంటి కింద నల్లటి వలయాల కోసం చాలా సమర్థవంతమైన పరిష్కారం. రాత్రిపూట 4-5 బాదం గింజలను పాలతో పాటు నానబెట్టి, ఉదయం ఈ మిశ్రమాన్ని పేస్టు లా చేసుకోవాలి. ఇప్పుడు స్వచ్ఛమైన గిన్నెలో 1 స్పూన్ తాజా పాలు మరియు 1 స్పూన్ బాదం పేస్ట్ తీసుకుని, రెండు పదార్ధాలను కలపాలి మరియు నేరుగా కళ్ళ కింద నల్లటి వలయాలపై ఈ పేస్ట్ ను రాయాలి. 15 నిముషాల పాటు అలానే వదిలివేసి మామూలు నీటితో కడగాలి. మరిన్నివివరాలను తెలుసుకోవడానికి తదుపరి వీడియోని చూడండి.

రోజ్ వాటర్ మరియు నిమ్మ రసం

ఒక శుభ్రమైన గిన్నెలో 2 స్పూన్లు రోజ్ వాటర్ తో పాటు 2 స్పూన్లు నిమ్మ రసంను కలపండి. ఇప్పుడు, ఈ మిశ్రమంలో దూదిని నానబెట్టి, కళ్ళ కింద మొండి నల్లటి వలయాలపై నేరుగా ఈ రసంని రాయండి. 10 నిముషాల పాటు అలానే వదిలివేసి మామూలు నీటితో కడగాలి. ఈ గృహ చిట్కాల కోసం మరిన్నివివరాలను తెలుసుకోవడానికి తదుపరి వీడియోని చూడండి.

ఆల్మాండ్ ఆయిల్

కళ్ళు చుట్టూ ఉండే సున్నితమైన చర్మంకు చికిత్స కోసం, బాదం నూనె ఉత్తమంగా పనిచేస్తుంది. నల్లటి వలయాలపై కొద్దిగా బాదం నూనెను రాయండి మరియు పడుకునేముందు వేళ్లతో వృత్తాకార దిశలో నెమ్మదిగా రుద్దండి. మరుసటి రోజు ఉదయం మంచి నీటితో శుభ్రం చేసుకోండి.

పుదీనా ఆకులు మరియు నిమ్మ రసం

నిమ్మరసంతో పాటు మింట్ ఆకులు నల్లటి వలయాలను తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి. కొన్ని తాజా పుదీనా ఆకులను క్రష్ చేసి పేస్టు లా చేయండి. 1 స్పూన్ పుదీనా పేస్ట్ కు 1 స్పూన్ నిమ్మకాయ రసంను కలపండి మరియు ఈ మిశ్రమాన్ని నల్లటి వలయాలపై రాయండి. మరిన్ని వివరాలకోసం ఈ వీడియో చూడండి.

నిమ్మ రసం మరియు పెరుగు

నిమ్మకాయలో సహజ రక్తస్రావ లక్షణములు మరియు పెరుగు లో తేమ వంటి లక్షణాలు కలిగి ఉండటం వలన మీ కళ్ళకి ఉపశమనంతో పాటు నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్స్ పెరుగుతో పాటు ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసంను తీసుకుని రెండింటినీ కలపండి. బాగా కలపాలి మరియు ఈ మిశ్రమాన్ని నల్లటి వలయాలపై రాయండి. ప్యాక్ ఆరిపోయిన తర్వాత, రెండో కోటింగ్ వేసుకుని మరొక కొద్ది నిమిషాలు ఉండాలి. చివరిగా మామూలు నీటితో కడగండి.

కార్న్ ఫ్లోర్ మరియు పెరుగు

మొక్కజొన్న పిండి మరియు పెరుగుతో తయారుచేసిన పేస్ట్ మొండి నల్లటి వలయాలను తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కు 1 టేబుల్ స్పూన్ పెరుగుని కలపి ఒక పేస్ట్ లా తయారు చేయండి. కళ్ళు చుట్టూ ఈ పేస్ట్ ను రాయండి మరియు 10-15 నిమిషాలు అలానే వదిలేయండి. సాధారణ నీటితో కడగండి.

చల్లటి టీ సంచులు

చల్లని టీ సంచులను ఉపయోగించడం ద్వారా కళ్ళకి ఉపశమనంతో పాటు నల్లటి వలయాలను తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. 2 నిమిషాలు గోరు వెచ్చని నీటిలో రెండు టీ సంచులు వేసి, వాటిని చల్లబరచడానికి ఫ్రిజ్లో ఉంచండి. కళ్ళపై ఈ చల్లని టీ సంచులను 10 నిముషాలు లేదా ఎక్కువసేపు ఉంచండి. సాధారణ తేయాకుకు బదులుగా గ్రీన్ టీ సంచులను ఉపయోగించడం వలన ప్రభావం ఎక్కువ ఉంటుంది.

ఆల్మాండ్ ఆయిల్ మరియు హనీ

ఆల్మాండ్ ఆయిల్ మరియు తేనె నల్లటి వలయాలను తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక చెంచా తేనెతో బాదం నూనెను 1 స్పూన్ కలపండి మరియు కళ్ళు కింద నల్లటి వలయాలపై ఈ మిశ్రమాన్ని రాయండి. తేనె మరియు బాదం రెండూ పోషక లక్షణాలను కలిగి ఉంటాయి మరియు అవి సహజంగా చర్మంపై ఉన్న నల్లటి వలయాలను సహజంగా తగ్గిస్తుంది. ఈ ప్యాక్ 10 నిముషాలు ఉంచి ఆపై నీటితో కడగాలి.

పసుపు మరియు పైనాపిల్

పసుపులో యాంటి-ఆక్షిడెంట్ మరియు సహజ చర్మ సౌందర్య లక్షణాలతో నిండి ఉంటుంది. మరోవైపు పైనాపిల్ లో అధిక విటమిన్ సి మరియు E కంటెంట్ ఉంటాయి, ఇది సున్నితమైన చర్మంను పోషించడంలో సహాయపడుతుంది. తాజాగా తయారు చేసిన పైనాపిల్ జ్యూస్తో 1 చెంచా పసుపు ను కలిపి పేస్ట్ లా కలపాలి. కళ్ళు చుట్టూ ఈ మిశ్రమాన్ని రాయాలి. 10 నిముషాల పాటు అలానే వదిలి, తరువాత నీటితో కడగాలి.

టమాటో మరియు నిమ్మ రసం

టమోటో మరియు నిమ్మరసంలో సహజ చర్మపు కాంతిని ఇచ్చే లక్షణాలు ఉంటాయి మరియు అవి చర్మంలో యాంటీ-ఆక్సిడెంట్స్ ను ఎక్కువగా పెంచుతాయి. తాజాగా తయారు చేసిన 2 స్పూన్ల టమాటో రసంకు 1/2 స్పూన్ నిమ్మ రసంను కలపండి మరియు కళ్ళ చుట్టూ ఉన్న చర్మంపై ఈ మిశ్రమాన్ని రాయండి. ఇది 10 నిముషాల ఉంచి, ఎక్కువ నీటితో కడగాలి.

కాస్టర్ ఆయిల్ మరియు మిల్క్

కాస్టర్ ఆయిల్ మరియు మిల్క్ నల్లటి వలయాలను తగ్గించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది తాజా పాలతో కలిపినప్పుడు, ప్రభావం మరింత బాగుంటుంది. 1 చెంచా ఆముదం నూనె 1 స్పూన్ పాలతో కలపండి మరియు కళ్ళు చుట్టూ ఈ మిశ్రమాన్ని రాయండి. 10 నిముషాల పాటు అలానే వదిలి, తరువాత నీటితో కడగాలి.

గులాబీ రేకులు మరియు మిల్క్

గులాబీ రేకులు మరియు పాలు కళ్ళు చుట్టూ ఉండే చర్మం రంగు పాలిపోకుండా ప్రభావవంతంగా ఉంటుంది. కొన్ని తాజా గులాబీ రేకులను మృదువైన పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ లో 1 చెంచా పాలు కలపండి మరియు కళ్ళు చుట్టూ నల్లటి వలయాలపై రాయండి. 10-15 నిమిషాల పాటు అలానే వదిలివేసి తరువాత నీటితో కడగాలి.

అలో వెరా మరియు ఆల్మాండ్ ఆయిల్

అలో వెరాలో చర్మం పోషణ మరియు ఉపశమనం వంటి లక్షణాలు ఉంటాయి. బాదం నూనె లో విటమిన్ ‘ఇ’ సమృద్ధిగా ఉంటుంది, ఇది కంటి ప్రాంతం యొక్క చర్మంను కాంతివంతం చేయుటకు సహాయపడుతుంది. అలో వెరా చర్మంను గట్టితరం చేస్తుంది. ఇది కళ్ళు కింద చారలను తగ్గించడంలో సహాయపడుతుంది.

తాజా అలో వెరా పల్ప్ ను 1 అలో వెరా ఆకు నుండి సేకరించండి మరియు ఒక క్లీన్ మందపాటి జెల్ను కంటైనర్లోకి తీసుకుని 1 చెంచా బాదం నూనెను వేసి బాగా కలపాలి. మీరు ఈ మిశ్రమాన్ని ప్రభావితమైన చర్మంపై నేరుగా రాయండి. రాసిన తరువాత, మీ కళ్ళను 20 నిమిషాలు మూసివేయండి, తడిగా ఉన్న మరియు మృదువైన దూదితో ప్యాక్ని తీసివేయండి. నీటితో చేయవద్దు.

పసుపు మరియు క్యారెట్ సీడ్ ఆయిల్

పసుపు సహజమైన చర్మ సౌందర్య లక్షణాలను కలిగి ఉంటుంది, అయితే క్యారట్ విత్తనాల నూనెలో విటమిన్ ఎ మరియు ఇతర యాంటీ-ఆక్షిడెంట్ లు అధిక మోతాదులో ఉండటం వలన మృదువైన మరియు ప్రకాశవంతమైన చర్మంను పొందవచ్చు. దీన్ని తయారు చేయడం కోసం, వంటగదిలో ఉపయోగించే పసుపు పొడికి బదులు, పచ్చి తాజా పసుపు కొమ్ములను ఉపయోగించండి.

కొన్ని పసుపు కొమ్ములను మెత్తగా రుబ్బి రసంను తీయండి. ఒక స్వచ్ఛమైన గిన్నెలో ఈ పసుపు రసంను 2 స్పూన్లు మరియు ఈ మిశ్రమంలో 2-3 చుక్కల క్యారట్ సీడ్ ఆయిల్ ను కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక కొత్త దూది సహాయంతో మీ చర్మంకు రాయండి. ఏమైనప్పటికీ, ఈ మిశ్రమం మీ కళ్ళల్లోకి వెళ్ళకుండా చూసుకోండి. 10 నిముషాల పాటు ఉండనివ్వండి, ఆపై మామూలు నీటిని చల్లుతూ తొలగించండి. మీరు ఈ చికిత్సను తీసుకునే ముందు మీరు క్యారట్ సీడ్ ఆయిల్ నుండి ఏ అలెర్జీలు పొందరని నిర్ధారించడానికి ప్యాచ్ పరీక్షకు వెళ్ళడం చాలా ముఖ్యం.

Posted on

Bio oil in Telugu – బయో ఆయిల్‌ని ఎలా ఉపయోగించాలి

మీరు మచ్చలు, సాగిన గుర్తులు మరియు అసమాన చర్మ ఛాయతో బాధపడుతున్నారా? వాటిని నివారించడానికి ఉత్తమ పరిష్కారం బయో ఆయిల్. బయో ఆయిల్ స్పెషలిస్ట్ చేత సూచించబడిన చర్మ సంరక్షణా ఉత్పత్తిగా పేర్కొనబడింది. బయో ఆయిల్ లో ఉండే ప్రధాన పదార్ధం పర్సెల్లిన్ ఆయిల్, ఇది చర్మ సమస్యలకు, పొడిబారిన చర్మానికి మరియు ముడతల చర్మానికి సమర్థవంతంగా పనిచేస్తుంది.

విటమిన్ ఎ, కలేన్డ్యులా నూనె, రోజ్మేరీ నూనె, విటమిన్ ఇ, లావెండర్ నూనె మరియు చామోమైల్ నూనె వంటి కొన్ని సహజ మూలకాలు బయో ఆయిల్ లో ఉంటాయి. బయో ఆయిల్ అన్ని చర్మ రకాలకు అనుకూలంగా ఉంటుంది.

బయో ఆయిల్ని ఎలా ఉపయోగించాలి?

బయో ఆయిల్ ను కనీసం 3 నెలల వరకు మచ్చలు ఉన్న చోట రోజుకి రెండుసార్లు వాడాలి. మచ్చల మీద బయో ఆయిల్ ని చేతి వ్రేళ్ళతో వలయాకారంలో మసాజ్ చేయాలి. బయో ఆయిల్ లో సూర్యరశ్మి సంరక్షణా కారకం లేనందువల్ల, బయో ఆయిల్ రాసుకుని అది పూర్తిగా ఇంకిన తర్వాత సన్‌స్క్రీన్ లోషన్ ను రాసుకోవాలి. బయో-ఆయిల్ ని వేరే ఉత్పత్తులతో కలపకండి, ఎందుకంటే ఇది రెండు ఉత్పత్తుల సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. పగిలిన చర్మంపై బయో ఆయిల్ ని ఉపయోగించకండి.

బయో ఆయిల్ని ఉపయోగించటం వలన మనం ఎంతకాలానికి ఫలితాలను చూడగలం?

పాత మచ్చలతో పోలిస్తే క్రొత్త మచ్చలు తక్కువ సమయంలోనే నయమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, అన్ని చర్మ రకాలు భిన్నంగా ఉండటం వలన ఫలితాలు కూడా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. ఇది ఎక్కువగా చర్మం మీద ఆధారపడి ఉంటుంది. ముఖం మీద మచ్చలు లేదా అసమాన చర్మ ఛాయ ఉండేవాళ్ళు కనీసం 4 వారాలపాటు బయో ఆయిల్‌ని ప్రయత్నించాలి.

గర్భధారణ మరియు తల్లి పాలిచ్చే సమయంలో బయోఆయిల్ని ఉపయోగించడం సురక్షితమేనా?

అవును, గర్భధారణ సమయంలో కూడా బయో ఆయిల్ ని ఉపయోగించవచ్చు. గర్భధారణ సమయంలో రెండవ త్రైమాసికం ప్రారంభం నుండి సాగిన చారలకు బయో ఆయిల్ ని వాడాలి. తల్లిపాలు ఇచ్చే సమయంలో కూడా మీ శరీరం మీద బయో-ఆయిల్ ని ఉపయోగించడం 100% సురక్షితమే కానీ చనుమొనల మీద మాత్రం వాడకూడదు. బయో ఆయిల్ విషపూరితం కానప్పటికీ చంటిపిల్లలు చాలా సున్నితమైన వారు కనుక ఆ ప్రదేశంలో దీనిని ఉపయోగించకండి.

ఎవరు బయో ఆయిల్ ని ఉపయోగించకూడదు?

బయో ఆయిల్ ని రెండు సంవత్సరాల వయస్సు లోపు పసిపిల్లలకు ఉపయోగించరాదు. పసి పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి వారికి బయో-ఆయిల్ ని ఉపయోగించడం మంచిది కాదు.

బయో ఆయిల్ (Bio oil)

Bio-Oil Specialist Skincare Oil[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

బయోఆయిల్ ని ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు

స్నానం

ఇది అన్ని చర్మ రకాలకు అనుకూలమైనది. స్నానం చేసిన తర్వాత, శుభ్రం చేసుకున్న మీ చర్మం మరియు శరీరం మీద ప్రతిరోజూ కాస్త బయో-ఆయిల్ ని రాసుకోండి. బయో ఆయిల్ సులభంగా మీ చర్మంలో ఇంకిపోతుంది. ఇది జిడ్డుగా ఉండదు, మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

పెదవులకు

మృదువుగా, తేమగా ఉండే పెదవుల కోసం రోజుకి రెండుసార్లు బయో ఆయిల్ ని పెదవులకు రాయండి.

కేశాలకి

పగిలిన మీ జుట్టు చివర్లని నిరోధించడానికి బయో-ఆయిల్ ని రాయండి. పొడిగా ఉన్న మీ పై భాగ చర్మానికి ఉపశమనం కలిగించటానికి కాస్త బయో ఆయిల్ ని తీసుకుని జుట్టు మొదల్లకి మసాజ్ చేయండి.

మేకప్ లో

మీ ముఖానికి కాస్త బయో ఆయిల్ ని రాసుకుని అది ఆరిన తర్వాత ఫౌండేషన్ రాసుకోండి. బయో ఆయిల్ అసమాన చర్మం ఛాయ మరియు పొడి చర్మం ఉన్నవారికి చక్కగా పనిచేస్తుంది.

ముఖానికి

ఒక గిన్నెలో 5 చుక్కల బయో ఆయిల్ ని తీసుకుని దానికి గోరు వెచ్చని నీటిని జోడించండి. ఆ నీటిలో ఒక వస్త్రాన్ని నానబెట్టి ఒక 5 నిమిషాలు ముఖం మీద పెట్టి ఉంచండి.

కళ్ళకి ఉన్న మేకప్ తొలగించటానికి

ఒక పత్తి బంతి మీద కాస్తంత బయో ఆయిల్ ను తీసుకొని మీ కళ్ళ మీద ఉన్న మేకప్ ను తొలగించటానికి ఉపయోగించండి. ఇలా కళ్ళ మీద ఉన్న మేకప్ ను తొలగించడానికి చేసే ప్రక్రియ సమయంలో కను రెప్పలకు కండీషనర్ లా సహాయపడుతుంది.

షేవింగ్ చేసుకునే సమయంలో

షేవింగ్ చేసుకునే ముందు బయో ఆయిల్ ను రాసుకోండి. దీనివల్ల షేవింగ్ సులువుగా అయి చర్మం మృదువుగా ఉంటుంది.

ఆరోగ్యవంతమైన గోర్లు

ఆరోగ్యవంతమైన గోర్లు పొందడానికి మీ గోర్లకు బయో-ఆయిల్ ని రాయండి.

పగిలిన మోచేతులకు

మీరు పొడిబారిన, పగిలిన మోచేతులతో బాధపడుతున్నట్లయితే బయో ఆయిల్ ని తీసుకొని మీ మోచేతులకి రాయండి. వాటిని మృదువుగా మరియు తేమగా మార్చుకోండి.

సరైన మార్గంలో బయోఆయిల్ ను ఉపయోగించడం కోసం చిట్కాలు

బయో ఆయిల్ ఒక సహజ చర్మ సంరక్షణా ఉత్పత్తి. సరైన మార్గంలో ఉపయోగించినప్పుడు ఇది మీ చర్మంపై అద్భుత ప్రభావాలను చూపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ బయో-ఆయిల్ వల్ల మంచి ఫలితాలను పొందడానికి మీరు కొన్ని చిట్కాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. బయో ఆయిల్ ని చాలా సమర్థవంతంగా ఉపయోగించడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

 • బయో ఆయిల్ ఒక సహజ సిద్ధమైన ఉత్పత్తి. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించకపోతే దాని వల్ల వచ్చే మార్పులను పెద్దగా మనము గమనించలేము. అందువల్ల ఉత్తమ ప్రభావాలను పొందడానికి ఈ బయో-ఆయిల్ ను ఒక అలవాటుగా చేసుకుని శ్రద్ధ వహించడం అవసరం.
 • బయో-ఆయిల్ మొటిమలను మరియు తరచుగా జరిగే చర్మ పగుల్లను నివారించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ మనం గుర్తుంచుకోవలసినది ఏంటంటే, మొటిమలు విభిన్న రకాలు ఉండవచ్చు కాబట్టి వాటన్నిటినీ నివారించడానికి బయో- ఆయిల్ సరైనదనిని ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి మీకు ఒకటి లేదా రెండు మొటిమలు ఉన్న చోట బయో-ఆయిల్ ని ఉపయోగించవచ్చు. కానీ మొటిమలు తీవ్రంగా ఉన్న చోట ఇది అంత మంచి ఫలితాలను చూపించదు.
 • బయో-ఆయిల్ ని ఉపయోగించి మంచి ఫలితాలను పొందాలి అనుకుంటే ముందుగా చర్మాన్ని బాగా శుభ్రపరుచుకుని అప్పుడు బయో-ఆయిల్ ని ప్రభావిత ప్రాంతంలో వాడాలి.
 • బయో-ఆయిల్ ని రాసుకుని ఎట్టి పరిస్తుతులలో ఎండలోకి వెళ్ళకండి, దీని వల్ల మీ చర్మం రంగు మారే అవకాశం ఉంది. కాబట్టి బయో-ఆయిల్ ని రాసుకునే ముందు సన్ స్క్రీన్ లోషన్ ని ఉపయోగించండి.