Posted on

సహజంగా మొటిమలను తొలగించడానికి ఇంటి చిట్కాలు – Telugu tips to remove pimples

మొటిమలు చాలా మందికి ఒక సాధారణ సమస్య. ఇవి సహజంగా జిడ్డు చర్మం కలిగిన వాళ్లని ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కొంత మంది సాధారణ చర్మ స్వరూపాన్ని కలిగి ఉన్నప్పటికీ వాళ్ళు తీవ్రమైన మొటిమల సమస్యను కలిగి ఉంటారు. ఇది కౌమార దశలోఇది కాస్త సహజమైన లక్షణమనే చెప్పాలి. అయితే ఈ దశ దాటి వచ్చినప్పటికీ మొటిమలు వాళ్ళ ముఖాల మీద మిగిలిపోతూ ఉంటాయి. దీనివల్ల  కాలేజీలో చదువుకునే అమ్మాయిలు అబ్బాయిలు తమ మొటిమలు చూపించడానికి సిగ్గుపడుతూ స్నేహితుల మధ్య గడపడానికి, నలుగురిలో కలవడానికి సంకోచిస్తూ ఉంటారు. క్రొవ్వు గ్రంధులు బాక్టీరియా బారినపడినప్పుడు చర్మం మీద మొటిమలు పుడతాయి. ఈ సమస్యకు మరొక ప్రాథమిక కారణం క్రొవ్వు గ్రంధుల చేత అదనపు శ్లేషపటలాల స్రావం అని చెప్పవచ్చు. ఇప్పుడు మొటిమలు కోసం కొన్ని సులభమైన గృహ చిట్కాలను మీరు ఇక్కడ తెలుసుకుంటారు.

మొటిమలకు కారణాలు

క్రొవ్వు గ్రంథులు స్రవించే అదనపు క్రొవ్వులు చర్మం మీద రంధ్రాలను మూసివేసి మొటిమలకు కారణం అవుతాయి. చనిపోయిన కణాలను శుభ్రం చేయనప్పుడు కూడా అవి చర్మ రంధ్రాల మీద పూడికలు ఏర్పరుస్తాయి. అంతేకాకుండా కౌమార దశలో ఉన్నవారి శారీరక మరియు హార్మోన్ల ప్రభావం క్రొవ్వు గ్రంధులను ఉత్తేజపరిచి అదనపు క్రొవ్వుల ఉత్పత్తికి దారితీస్తాయి. ఎవరైతే ఎక్కువగా టెస్టోస్టెరాన్  హార్మోన్ ఉత్పత్తిని కలిగి ఉంటారో వాళ్ళు క్రొవ్వు గ్రంథుల నుండి అదనపు కొవ్వుల స్రావాన్ని కలిగి ఉంటారు. కొన్ని పాల పదార్థాలు అధిక మోతాదులో కాల్షియం మరియు చక్కెర స్థాయిని కలిగి ఉండటం వలన అవి  కొంతమంది శరీరాలకి పడక మొటిమల అభివృద్ధిని ప్రేరేపించవచ్చు. రసాయన పదార్ధాలతో కూడిన సౌందర్య లేపనాలు ఉపయోగించి సరిగా శుభ్రం చేసుకోకపోవడం వలన అవి మొటిమలకు కారణం అవుతాయి.  అన్ని రకాల మేకప్ లేపనాలను తప్పనిసరిగా రాత్రి పడుకునే సమయంలో శుభ్రపరుచుకోవాలి.

మొటిమల్ని నివారించడానికి గృహ చిట్కాలు

ఐస్ ముక్క

కొన్ని ఐస్ ముక్కలను ఒక కాటన్ వస్త్రంలో తీసుకుని మొటిమ ఉన్న చోట నెమ్మదిగా అద్దండి. ఇది మొటిమల బారిన పడిన ప్రదేశంలో రక్తప్రసరణని మెరుగుపరచడానికి మంచి ఉపకారిణిగా ఉంటుంది.

తేనె

తేనె మొటిమల నుండి త్వరగా ఉపశమనం పొందడానికి ఒక అద్భుతమైన వనరు. ఒక పత్తి బంతిని తేనెలో ముంచి మొటిమలు ఉన్న చోట రాసి ఒక అరగంట పాటూ ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

నిమ్మకాయ

నిమ్మరసంలో ఉండే విటమిన్ సి మొటిమల్ని త్వరగా తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనికొరకు మీరు తాజా నిమ్మరసం మాత్రమే ఉపయోగించాలి. బాటిల్స్ లో లభించే కృత్రిమ నిమ్మరసం మీ చర్మానికి హాని కలిగించవచ్చు.

ఆవిరి పట్టడం

ముఖానికి ఆవిరి పట్టడం వలన మూసివేయబడిన రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇది చర్మం మరింత మెరుగ్గా శ్వాశించడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా చర్మానికి పట్టిన మురికి మరియు జిడ్డును తొలగించడానికి ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇందుకోసం ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో నీటిని బాగా మరిగించండి. ముఖానికి కాసేపు ఆవిరి పట్టి గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి. తరువాత మోయిశ్చరైజర్ ని రాసుకోండి. క్రమంగా దీనిని పాటించండి.

జిడ్డు ముఖంపై మొటిమలు నయం చేయడం ఎలా?

 • నల్ల మచ్చలతో కూడిన మొటిమలను నిమ్మరసం మరియు వేరుశనగ నూనెతో వాటి మీద రుద్దడం ద్వారా తొలగించవచ్చు.
 • వేపాకుల పొడి మరియు పసుపు మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవడం వలన మొటిమల బాధ నుండి బయటపడవచ్చు.
 • వెల్లుల్లి రెబ్బలను చిదిమి మొటిమలు ఉన్న స్థలంలో వాటిని రుద్దడం అనేది మంచి పరిష్కారంగా పనిచేస్తుంది.
 • అదనపు నూనె మరియు దుమ్ముతో కూడిన చర్మం నుండి మొటిమలను తొలగించడంలో బేకింగ్ సోడా సహాయపడుతుంది. బేకింగ్ సోడా మరియు నిమ్మ రసాన్ని పేస్టులా చేసి మొటిమలకు రాసి రెండు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
 • ఆపిల్ సైడర్ వెనిగర్ ని నీటిలో లేదా నిమ్మరసంలో కలిపిన తర్వాత మొటిమలపై వాడాలి. దీనిని ఒకటి లేదా రెండు సార్లు రాసిన తరువాత మొటిమలు మాయమవడం మీరు గమనించగలరు.
 • ఆవ నూనె మొటిమలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆవ నూనెలో చర్మానికి అవసరమయ్యే విటమిన్ సి, ఒమేగా 3 మరియు 6 కొవ్వు ఆమ్లాలు, సెలిసిలిక్ ఆసిడ్ మరియు జింక్ సంవృద్ధిగా ఉన్నాయి. వంటలలో ఉపయోగించే ఆవాల పొడి లేదా ఆవాల ముద్ద కూడా మొటిమలకు వాడవచ్చు. ఆవాల పొడిలో కాస్తంత తేనెని కలిపి మొటిమలకు రాయండి.
 • టమోటో గుజ్జుని రోజుకి రెండు మూడు సార్లు రాయడం ద్వారా మొటిమలకు స్వస్తి చెప్పవచ్చు.
 • సహజ సిద్ధమైన రోజ్ వాటర్ లేదా నిమ్మ రసంతో మొహాన్ని శుభ్రపరుచుకుని తర్వాత కాలమైన్ లోషన్ మొటిమలకు రాసుకోవడం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
 • ఆస్పిరిన్ టాబ్లెట్ మొటిమలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఆస్పిరిన్ టాబ్లెట్ ను చిదిమి ఆ పొడిని నీటిలో కలిపి ముద్దలా చేసుకుని మొటిమలకు రాసి రాత్రంతా వదిలేయండి.
 • కలబంద గుజ్జు మొటిమలను తొలగించడంలో ఉత్తమమైనదని చెప్పవచ్చు. దీనిలో ఉన్న శోథ నిరోధక మరియు ఆంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమల నివారణకు సహకరిస్తాయి.

మొటిమల్ని తొలగించడానికి ఇంటి చిట్కాలు

తేనె మరియు దాల్చినచెక్క పొడి

సహజ పద్ధతిలో మీ మొహం మీద మొటిమల్ని తోలగించుకొనుటకు ఇంటి వద్దే తేనె మరియు దాల్చినచెక్క పొడి మిశ్రమాన్ని తయారుచేసుకోండి.  దాల్చినచెక్క పొడి బయట మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఒక చెంచా తేనెకు రెండు చెంచాల దాల్చినచెక్క పొడిని తీసుకుని వాటిని కలపాలి. ఆ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న దగ్గర రాసుకుని 15 నిమిషాల పాటు ఉంచుకోండి. తరువాత నీటితో కడిగేయండి.

గుడ్డులో తెల్ల సొన

గుడ్డులోని తెల్ల సొనతో మొటిమలు నివారించుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక పచ్చి గుడ్డుని పగలగొట్టి అందులోని తెల్ల సొనని తీసుకోవాలి. ఇప్పుడు దానిని నురగలా వచ్చే వరకూ బాగా గిలక్కొట్టి మొహానికి రాసుకోండి. అది ఆరిన తరువాత మరలా అలానే రెండు మూడు సార్లు మొహానికి రాసుకోండి. 20 నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో మొహం కడుక్కోండి.

ముగ్గిన బొప్పాయిపండు

మీ మొహం మీద మొటిమలు ఎక్కువగా ఉంటే, ముగ్గిన బొప్పాయిపండు వాటిని తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. చిన్న ముగ్గిన బొప్పాయిపండు ముక్కని తీసుకుని గుజ్జులా తయారు చేయండి. మొహాన్ని బాగా శుభ్రం చేసుకుని ఆపై ఆ గుజ్జుని మొటిమలకి పట్టించండి. 20 నిమిషాల పాటు ఉంచి మంచి నీటితో కడిగేయండి. ఆరిన తరువాత మొహం పొడిబారకుండా మోయిశ్చరైజర్ రాసుకోండి.

టీ ట్రీ నూనె

టీ  ట్రీ నూనె అందానికే కాకుండా ఆరోగ్య అవసారాలకు కూడా చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. కానీ తాజాగా తెలిసినది ఏమిటంటే అది మొటిమలను తొలిగించుటకు కూడా ఉపయోగపడుతుంది. చిన్న పత్తి బంతిని తీసుకుని టీ ట్రీ నూనెలో నానబెట్టి మొటిమలు ఉన్న చోట అద్దండి. రాత్రంతా అలానే వదిలేసి ఉదయాన్నే శుభ్రపరుచుకోండి.

Posted on

అందమైన చర్మం కోసం – Skin glow & fairness tips in Telugu

ప్రతీ అమ్మాయికి ఉండే కల అందమైన మచ్చలు లేని చర్మం కలిగి ఉండటం. అందమైన ముఖము పొందటానికి అనేక రకముల స్కిన్ క్రీమ్స్ వాడి ఉంటారు. కాని మీకు ఎటువంటి ఫలితం కనిపించలేదా? అయితే గృహ చిట్కాలను వాడటం మొదలు పెట్టండి. కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం చర్మానికి హానికరం. శరీరంలో ఆక్సిజన్ మరియు రక్తం తక్కువగా ఉండటం మరియు ఎక్కువగా ఎండలో తిరగటం ద్వారా మీ చర్మం రంగు మారుతుంది. వాతావరణ కాలుష్యం వలన మీ చర్మం రంగు మారి మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. మీ చర్మానికి పోషకాలు అందకపోవడం మరియు ఒత్తిడి ఎక్కువగా ఫీల్ అవడం వలన కూడా చర్మం కాంతిని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది.

చర్మం నున్నగా ఉండట మరియు చర్మ రంగు మన అందానికి కారణం. అంతే కాకుండా మంచి శరీర రంగు కలిగి ఉంటే అన్ని రంగుల దుస్తులు ధరించవచ్చు. డార్క్ చర్మం కలిగిన ఉన్న వారికి అన్ని రంగుల దుస్తులు సెట్ అవ్వవు. అందరూ పుట్టుకతోనే మంచి రంగుతో పుట్టారు. కొన్ని సూచనలను పాటించడం వలన మీరు అందమైన చర్మాన్ని పొందగలరు. గృహ చిట్కాలను పాటించి అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.

కాస్మటిక్ ప్రొడక్ట్స్ చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి అని వినీ వినీ అలసిపోయారా? అవి వాడటం వలన మీకు ఎటువంటి ఫలితం కనిపించలేదా? అయితే మీరు ఇంటి చిట్కాలను వాడటం మొదలుపెట్టాలి. సహజమైన పేస్ ప్యాక్ వలన మీకు మంచి ఫలితం లభిస్తుంది. గృహ చిట్కాలను పాటించడం వలన మీ చర్మం మీద మొటిమలు, మచ్చలు తొలగించడమే కాకుండా మీ చర్మానికి మెరుపును అందిస్తాయి .

మీరు పార్లర్ మరియు సలూన్లకి పరుగుతీయ వలసిన అవసరం లేదు. మీరు మీ ఇంట్లోనే సులువుగా పేస్ ప్యాక్ వేసుకోవచ్చు. మేము అందమైన చర్మం కోసం చిట్కాలను అందిస్తున్నాం. అవి ఏంటో చూదాం.

మీ కోసం గృహ చిట్కాలు

పేస్ ప్యాక్

సగం టేబుల్ స్పూన్ తేనే, ఒక కప్పు టీ వాటర్ మరియు 2 టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండిని తీసుకొని బాగా కలిపి పేస్టు తయారైన తరువాత ముఖానికి మసాజ్ చేస్తూ అప్లై చేయండి.15-20 నిమిషములపాటు అలానే ఉంచి రుద్దుతూ పేస్ ప్యాక్ని తొలగించాలి. రుద్దుతూ తొలగించడం చాలా ముఖ్యమైన పని ఎందుకంటే అలా చేయడం వలన చర్మ కణాలు ఉత్తేజంచెంది, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

పసుపు

బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ పాలు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ నిమ్మరసం, సగం టేబుల్ స్పూన్ పసుపు మరియు 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకోవాలి. అన్నింటిని బాగా కలిపి పేస్టు చేసి ముఖానికి అప్లై చేయాలి, 15 నిమిషముల తరువాత ప్యాక్ ఆరిపోతే మంచి నీటితో కడిగి టవల్తో తుడవాలి.

పాలు మరియు తేనే

ఒక టేబుల్ స్పూన్ పాలు లేక పాల పొడి, ఒక టేబుల్ స్పూన్ తేనే మరియు నిమ్మరసం తీసుకోవాలి. మూడింటిని బాగా కలిపి శుభ్రంగా ఉన్న మీ ముఖానికి వేసుకోవాలి. 15 నిమిషముల తరువాత మంచి నీటితో కడగండి.

పెరుగు మరియు వోట్మీల్

ఒక టేబుల్ స్పూన్ పెరుగు, టమాటో మరియు ఒక టేబుల్ స్పూన్ వోట్మీల్ కలిపి పేస్టు చేయండి. ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషములు ఆరే వరకు ఉంచండి. పేస్ ప్యాక్ని కడుగుతూ రుద్దండి. రుద్దడం వలన చర్మ కణాలు ఉత్తేజం చెంది చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

బంగాళదుంప గుజ్జు

బంగాళదుంప చర్మ సంరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనిలో విటమిన్-సి ఎక్కువగా ఉండటం వలన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బంగాళదుంప సహజంగా చర్మాన్ని తెల్లగా చేస్తుంది. బంగాళదుంప గుజ్జుని ముఖానికి అప్లై చేసి, 30 నిమిషముల తరువాత నీటితో కడగండి. ఇలా రోజూ చేయడం వలన మీ చర్మం కాంతివంతంగా, మృధువుగా తయారు అవుతుంది. మీరు బంగాళదుంప గుజ్జుతో నిమ్మరసాన్ని కూడా కలిపి ముఖానికి అప్లై చేయవచ్చు. నిమ్మలో బ్లీచింగ్ కారకం ఉండటం వలన మీకు తక్కువ సమయంలో ఫలితం కనిపిస్తుంది.

బాదం నూనె

తెల్లని చర్మం పొందాలి అంటే బాదం నూనెతో మీ ముఖానికి మద్దన చేయాలి. కొంచెం వేడి చేసిన నూనెను ఉపయోగించాలి. ఇది రక్త ప్రసరణ బాగా జరిగేటట్లు చేసి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. బాదంని మనం ఇంకో విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. రాత్రి అంతా బాదంని నానపెట్టి ఉదయాన్నే పేస్టు చేయండి. పేస్టులో కొంచెం మజ్జిగ కలిపి ముఖానికి వేసుకొని 15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగండి. ఇలా చేయటం వలన చర్మంలోని మృత కణాలు తొలగుతాయి.

పుదీనా ఆకులు

పుదీనా ఆకులకు తాజాతనాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నవి. పుదీనా ఆకులతో మీరు తెల్లని చర్మాన్ని పొందగలరు. అలానే ఇది రక్తాన్ని శుద్ది పరిచే గుణములను కలిగి ఉంది. పుదీనా ఆకుల పేస్టుని ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగండి. ఇది చర్మ రంధ్రాలలోకి వెళ్లి సన్ టాన్ని తొలగిస్తుంది.

అరటిపండు

మీ చర్మానికి తెల్లదనం ఇవ్వడంలో అరటిపండు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అరటిపండును ఫేసు ప్యాక్గా ఉపయోగించడం వలన మీరు తొందరగా ఫలితాన్ని పొందగలరు. పసుపుగా పండిన అరటిపండు గుజ్జును తీసుకొని దానిలోకి టేబుల్ స్పూన్ తేనే మరియు పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషముల తరువాత నీటితో కడగండి. ఇలా చేయడం వలన మీరు ప్రకాశించే చర్మాన్ని పొందటమే కాకుండా సన్ టాన్ నుంచి విముఖ్తి చెందగలరు.

ఎండిన నారింజ తొక్క

మీరు నారింజ తొక్కను ఎండలో ఎండపెట్టి పొడి చేసుకోవచ్చు, లేకుంటే మార్కెట్లో మీకు నారింజ తొక్కుల పొడి లభిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ నారింజ తొక్కుల పొడిలో పెరుగు కలిపి పేస్టు చేసి, ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగండి. ఇలా చేయడం వలన మీకు తెల్లని మరియు ప్రకాశవంతమైన చర్మం లభిస్తుంది.

గంధపు చెక్క

మీరు ఆయిలీ చర్మాన్ని కలిగి ఉన్నారా? మీరు తెల్లని చర్మం కావాలి అని ఆశ పడుతున్నారా? అయితే ఇది మీకు అద్భుతమైన చిట్కా. గంధపు పొడిని నీటితో కలిపి ముఖానికి అప్లై చేసి, ప్యాక్ ఆరిపోయిన తరువాత చల్లని నీటితో కడగండి. మీరు ఫలితాన్ని చాల తొందరగా గమనించవచ్చు.

తెల్లని మరియు ప్రకాశించే చర్మం కోసం సహజమైన పద్ధతులు – Tips for fairness and skin glow

ఇంట్లో తయారు చేసిన పేస్ పాక్స్ ఎక్కువగా పాలు, తేనే, పెరుగు మరియు పండ్ల రసాలతో చేస్తారు. ఇవి చర్మానికి చాల మంచిది.

 • కుంకుమపువ్వు మరియు పాలతో చేసిన ప్యాక్ వాడటం వలన మీ చర్మం కాంతివంతంగా అవుతుంది. ఇది ఎక్కువగా డ్రై స్కిన్ కలిగిన వారికి ఉపయోగకరం. ఇది మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేయుటకు సహకరిస్తుంది. పచ్చిపాలు మీ చర్మాన్ని శుభ్ర పరచి ప్రకాశవంతంగా చేస్తాయి. పచ్చి పాలల్లో ఒక స్పూన్ కుంకుమపువ్వుని కలిపి 2 నిమిషముల పాటు చేతులతో మద్దన చేస్తూ ముఖానికి అప్లై చేసి, 15 నిమిషముల తరువాత నీటితో కడగండి.
 • పెరుగు మరియు వోట్స్ ప్యాక్ వలన మీ చర్మానికి వచ్చిన సన్ టాన్ మచ్చలను తొలగించవచ్చు. వోట్స్ చర్మంలోని మృత కణాలను తొలగించి, మొటిమలను చర్మంలో నుంచి బయటకు రాకుండా చేస్తుంది. వోట్స్ మరియు పెరుగుతో పేస్టు తయారు చేసి ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత చేతులతో మద్దన చేస్తూ చల్లని నీటితో కడగాలి.
 • నారింజ తొక్క మరియు గంధపు చెక్క, నారింజలో ఎక్కువగా కాల్షియమ్ మరియు విటమిన్ C ఉండటం వలన చర్మం మీద మచ్చలను మరియు దెబ్బలను నయం చేస్తుంది. ఈ రెండిటిని కలిపి వాడటం వలన చర్మ సమస్యల నుంచి విముక్తి చెందవచ్చు. అంతే కాకుండా ఇది మీ చర్మాన్ని మరింత కాంతివంతంగా చేస్తుంది. ఒక స్పూన్ గంధపు పొడి మరియు నారింజతొక్క పొడి తీసుకొని తగినంత నీరు కలిపి పేస్టు చేయండి. 5 నిమిషముల పాటు పేస్టుతో ముఖానికి మసాజ్ చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగండి.
 • స్ట్రాబెర్రి మరియు తేనేతో చేసిన ప్యాక్ వాడటం వలన మీ చర్మం మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. ఈ ప్యాక్ ఏ వయస్సులో ఉన్న వారికైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. రెండు స్ట్రాబెర్రి పండ్లను తీసుకొని పేస్టు చేసి పాలు మరియు తేనే కలిపి ముఖానికి వేసుకొని 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగండి.
 • నిమ్మరసం మరియు పాలపొడి ప్యాక్ని వాడటం వలన మీ చర్మం మీద మచ్చలను పోగొట్టి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అంతే కాకుండా చర్మం మీద వచ్చే మంటను పోగొడుతుంది. పాల పొడి, తేనే మరియు నిమ్మరసం కలిపి పేస్టు తయారు చేసి, ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత గోరువెచ్చని నీటితో మసాజ్ చేస్తూ కడగండి.
 • వాల్నట్ మరియు పాల మీగడతో ప్యాక్, వాల్నట్లో ఎక్కువగా యాంటిఅక్సిడేన్త్స్, విటమిన్-ఇ, విటమిన్-బి ఎక్కువగా ఉండటం వలన మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మృత కణాలను తొలగిస్తుంది. ఇది వయస్సు పెరిగేకొద్ది వచ్చే ముడతలను తగ్గిస్తుంది. పాల మీగడ మీ చర్మం మంచి రంగులోకి తెస్తుంది.

మెరిసే చర్మం కోసం ఇంటి చిట్కాలు – Tips for skin glow

అలోవేర

అలోవేర ఎక్కువగా మన ఇంటి పరిసరాలలో లభిస్తుంది, మన చర్మం అందంగా కనపడాలి అనే ఆశను నెరవేరుస్తుంది. హైపర్ పిగ్మెన్టేషన్ వలన మీ చర్మం రంగు మారుతుంది. అలోవేర మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.

అలోవేర ఆకుల గుజ్జును తీసుకొని చర్మానికి అప్లై చేసి 30 నిమిషముల తరువాత నీటితో కడగండి.

బొప్పాయి

పండిన బొప్పాయి మీ చర్మాన్ని మెరిసేలా చేయుటకు ఉపయోగపడుతున్నది. మీరు బొప్పాయిలో చాలా రకాలను చూసి ఉంటారు. కాని సహజంగా వచ్చిన బొప్పాయిపండులో బ్లీచ్ చేసే కారకాలు మరియు ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నవి. మీరు రెండు రోజులకి ఒకసారి బొప్పాయి తినడం వలన చర్మ మలినాలను తొలగించవచ్చు.

అంతే కాకుండా మీరు ఒక బొప్పాయి ముక్క తీసుకొని చర్మానికి మద్దన చేసి, 15-20 నిమిషముల తరువాత ప్యాక్ ఆరితే చల్లని నీటితో కడగండి. ఫలితాన్ని మీరు గమనించవచ్చు.

దోసకాయ

దోసకాయలో కొల్లజేన్ ఎక్కువగా ఉండటం వలన చర్మ కాంతిని పెంచుతుంది. దోసకాయను ఎక్కువగా తినడం వలన మీ చర్మం లోపల నుంచి మలినాలను తొలగించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

మీరు రెండు విధములుగా దోసకాయను ఉపయోగించవచ్చు. దోసకాయని వృత్తాకారంగా కట్ చేసి ఆ ముక్కలను ముఖానికి రుద్దుతూ ఉండాలి, ఒకసారి ఉపయోగించిన ముక్కని మరల ఉపయోగించరాదు. ఇలా చేయడం వలన దోసకాయ యొక్క రసం చర్మం లోపలకి వెలుతుంది. దీని వలన మీ చర్మం కాంతివంతంగా అవుతుంది. అలానే మిక్సర్ సహాయంతో దోసకాయని పేస్టు చేసి, ముఖానికి అప్లై చేసి ఆ ప్యాక్ ఆరే వరకు విశ్రాంతి తీసుకోవాలి. తరువాత చల్లని నీటితో కడగండి

గులాభి రేకులు మరియు పాలు

గులాభి నీరు చర్మానికి చాలా మంచిది అని మీరు విని ఉంటారు, అలానే గులాభి ఆకులు కూడా చర్మాన్ని అందంగా చేస్తాయి. మీరు చేయవలసినది ఏమిటి అంటే? గులాభి రేకుల్ని బోయిల్ చేసి ముఖానికి అప్లై చేయండి.

గులాభి రేకులను ఎండపెట్టి పొడి చేయండి. పొడిలో పాలు కలిపి పేస్టు చేసి, ముఖానికి అప్లై చేయండి. ఇలా చేయడం వలన మీకు మంచి ఫలితం కలుగుతుంది.

బాదం మరియు అరటి పండు

మీరు బాదం మరియు అరటిపండు యొక్క గుణములు విని ఉంటారు. కాని రెండిటిని కలపడం వలన అద్భుతమైన పరిష్కారాన్ని పొందవచ్చు. అరటిపండు చర్మంలోని స్థితిస్తాపకతను పెంచుతుంది. దీనిలో కొల్లజేన్ ఉండటం వలన చర్మ రంగును పెంచుతుంది. అరటిపండు గుజ్జుని తీసుకొని ఒక స్పూన్ బాదం ఆయిల్ కలిపి, ముఖానికి అప్లై చేయండి.

నిమ్మకాయ మరియు అలోవేర

అలోవేర ఆకుల నుంచి గుజ్జు తీసుకొని నిమ్మరసంతో కలపి ముఖానికి అప్లై చేయండి. తరువాత మెల్లిగా మీ చర్మానికి మద్దన చేయండి. అది మీ చర్మం లోపలకు వ్యాపిస్తుంది. కొంచెం సమయం తరువాత మంచి నీటితో కడగండి. తరువాత మీ చర్మం మృధువుగా అవ్వడం మీరు గమనిస్తారు.

తెల్లని చర్మం పొందుటకు ఈ చిట్కాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సహజ చిట్కాల వలన చర్మ సమస్యలను పరిష్కరించవచ్చు.

Posted on

Home remedies for darken bikini line area in Telugu – బికినీ ధరించే ప్రాంతంలో నల్లని వలయాలను తొలగించుటకు సహజమైన టిప్స్

బికినీ ధరించడం వలన సూపర్ హాట్ మరియు సెక్సీగా కన్పిస్తారు. బికినీ ధరించే ప్రాంతంలో నల్లని వలయాలు ఏర్పడతాయి. ఇవి చెమట, దద్దుర్లు మొదలగు వాటి వలన వస్తాయి. వాటిని తొలగించడానికి అనేక చిట్కాలు ఉన్నవి. కావున దుస్తులను ధరించే విషయంలో మీరు నిరాశ చెందవలసిన అవసరం లేదు. కొన్ని సహజ నివారణల ద్వారా మీరు బికినీ నల్లని వలయాల నుంచి విముఖ్తి పొందవచ్చు.

బికినీ నల్లని వలయాలు ఏర్పడటం చాలా మంది మహిళలకు ఒక సమస్య. కొన్ని గృహ చిట్కాల వలన వీటిని తొలగించవచ్చు.

పాలియెస్టర్ దుస్తులు

పాలియెస్టర్ దుస్తులు ధరించడం వలన చమట ఎక్కువగా వస్తుంది. దీని వలన బికినీ ప్రదేశంలో ఎపిడేర్మిస్ (చర్మ పొర) దెబ్బతింటుంది. మీరు భారీ శరీరాన్ని కలిగి ఉంటే పాలియెస్టర్ దుస్తులు ధరించడం మంచిది కాదు. అంతే కాకుండా ఈ దుస్తులు ధరించడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.

జుట్టు తొలగింపు

బికినీ ప్రదేశంలో జుట్టును తొలగించే క్రీములు వాడటం వలన మీకు శాశ్వత నల్లని వలయాలు వస్తాయి. రసాయనాలు లేని ప్రొడక్ట్స్ వాడటం వలన బికినీ నల్లని వలయాలు రాకుండా చేయవచ్చు. మీరు సహజ గృహ చిట్కాలను వాడి ఫలితాన్ని చూడండి.

బికినీ నల్లని వలయాలను తొలగించుటకు ఇంటి చిట్కాలు

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్తో బికినీ ప్రదేశంలో మసాజ్ చేసి, రాత్రి అంతా అలానే ఉంచాలి. ఈ చిట్కా నల్లని వలయాలను తగ్గించుటకే  కాకుండా చర్మాన్ని మృధువుగా చేసి ఎపిడేర్మిస్ మీద దద్దుర్లని తొలగిస్తుంది.

పసుపు

ఇది సహజంగా చర్మాన్ని రక్షిస్తుంది. నల్లటి మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఒక  టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం మరియు ఒక టేబుల్ స్పూన్ పెరుగును కలిపి పేస్టు చేసి, బికినీ నల్లని వలయాల వద్ద అప్లై చేయాలి. 10–15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. ఈ చిట్కాని వారానికి 3 సార్లు స్నానానికి ముందు చేయడం మంచిది.

నిమ్మకాయ

చర్మానికి చెమట రావడం వలన వాసన వస్తుంది. నిమ్మకాయ రసాన్ని బికినీ నల్లని వలయాల వద్ద రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వలన నల్లని వలయాలను పోగొట్టి మృత కణాలను తొలగిస్తుంది. అంతే కాకుండా భవిష్యత్తులో ఇలా రాకుండా చేస్తుంది.

టమాటో

దీనిని బికినీ ప్రదేశంలోనే కాకుండా ఇతర శరీర భాగాలలో ఎక్కడ నల్లటి వలయాలు ఉంటే అక్కడ వాడవచ్చు. టమాటో గుజ్జుతో నల్లని వలయాలు ఉన్న దగ్గర రుద్దుతూ అప్లై చేసి, 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా రోజు చేయడం వలన నల్లని వలయాలు తొలగుతాయి.

బొప్పాయి

బొప్పాయిని ఉపయోగించడం వలన నల్లని వలయాలను తొలగించవచ్చు. బికినీ నల్లని వలయాల వద్ద బొప్పాయి గుజ్జును అప్లై చేసి బాగా రుద్దాలి, 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉండటం వలన చర్మం మీద నల్లని వలయాలను పోగొడుతుంది.

పుదీనా ఆకులు

దీనిని ఎక్కువగా చర్మానికి ఉపయోగించే క్రీములలో వాడతారు. ఈ చిట్కా చాల మంచి ఫలితాన్ని ఇస్తుంది. గుప్పెడు పుదీనా ఆకులను తీసుకొని మిక్సర్ సహాయంతో నీటిని కలుపుతూ పేస్టు చేసి, ఒక స్పూన్ పేస్టులో తేనెను కలిపి బికినీ నల్లని వలయాల వద్ద రాయాలి. కొన్ని రోజులలో మీరు తేడాని గమనించగలరు.

బాదం

బాదంను తీసుకొని ఒక రాత్రి అంత నానాపెట్టాలి. బాదంలో పాలు కలిపి పేస్టు తయారు చేసి, మిశ్రమాన్ని బికినీ ప్రాంతంలో రాసి రాత్రి అంతా అలానే ఉంచి, ఉదయాన్నే శుభ్రం పరచాలి. దీనిని 2 వారలు చేయడం వలన మీరు మార్పును గమనించగలరు.

పంచదార, తేనే మరియు నిమ్మరసం

ఒక టేబుల్ స్పూన్ తేనే, సగం నిమ్మరసం, పంచదారను కలిపి అప్లై చేస్తూ మసాజ్ చేయాలి. 10 నిమిషముల తరువాత నీటితో కడగాలి. తేనే మరియు పంచదార శరీరాన్ని మృదువుగా తయారు చేస్తాయి. నిమ్మరసం నల్లని వలయాలను పోగొట్టుటకు సహాయపడుతుంది.

బాదం నూనె, పాలు, నిమ్మరసం మరియు తేనే

3 స్పూనుల పాలు, ఒక టేబుల్ స్పూన్ తేనే మరియు నిమ్మ రసాన్ని ఒక టేబుల్ స్పూన్ బాదం నూనెలో కలిపి పేస్టు చేసి, నల్లని వలయాల వద్ద అప్లై చేయాలి. ఇది నల్లని వలయాలను తొలగించుటకు ఉపయోగపడుతుంది.

పచ్చి పాలు

బికినీ నల్లని వలయాలను తొలగించుటకు పచ్చి పాలు ఒక అద్భుతమైన చిట్కాగా పని చేస్తాయి. పచ్చి పాలను దూది సహాయంతో బికినీ నల్లని వలయాలు ఉన్న దగ్గర అప్లై చేయాలి. ఇది సహజంగా చర్మాన్ని తెల్లగా చేస్తుంది.

గంధం

గంధం యొక్క ఉపయోగాల గురించి మీరు వినే ఉంటారు. చర్మ సమస్యలకు గంధం ఒక అద్భుతమైన చిట్కా. మీకు బికినీ నల్లని వలయాలు ఉంటే గంధం పొడి పేస్టుని రాసి అద్భుతమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.

నారింజ తొక్క మరియు పెరుగు

తాజా నారింజ పండు యొక్క తొక్కను తీసుకొని ఎండలో ఎండపెట్టాలి. బాగా ఎండిన తరువాత గ్రైండర్ సహాయంతో పొడి చేయాలి. దీనిలోకి 2 స్పూనుల పెరుగు మరియు ఒక స్పూన్ తేనే కలిపి పేస్టు తయారు చేసి బికినీ నల్లని వలయాలు ఉన్న దగ్గర అప్లై చేసి, నీటితో కడగాలి.

దోస మరియు తేనే

దోస ముక్కను నల్లని వలయాలు ఉన్న దగ్గర రుద్దాలి. రుద్దిన తరువాత 1 టేబుల్ స్పూన్ తేనే అప్లై చేయాలి. తరువాత తేడాను మీరు గమనించగలరు. అలానే దోసకాయ గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ తేనే కలిపి పేస్టు తయారు చేసి బికినీ నల్లని వలయాల వద్ద అప్లై చేసి, నీటితో కడగాలి.

బికినీ నల్లని వలయాలను దూరం చేయడం ఎలా?

సహజమైన కాటన్ అండర్ వేర్ వాడటం

మీరు కాటన్ అండర్ వేర్ వాడటం వలన చర్మం మీద ఎటువంటి నల్లని వలయాలు మరియు దద్దుర్లు రాకుండా చేస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం

తాజా కూరగాయలు మరియు పండ్లు తీసుకోవడం వలన మీ చర్మానికి ఉపయోగకరం. అన్ని రకముల ధాన్యపు గింజలు కూడా చర్మానికి మంచిదే. నూనెను తక్కువగా కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకోవడం మీ చర్మానికి ఆరోగ్యకరం.

నీరు

ఎక్కువగా నీటిని తీసుకోవడం వలన మీ శరీరం లోపలి భాగాలలో ఉండే విష కణాలు బయటకు వస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. రోజుకి 8 గ్లాసుల నీటిని త్రాగటం చాల మంచిది.

అలోవేర

అలోవేర గుజ్జు తీసుకొని బికినీ నల్లని వలయాల వద్ద అప్లై చేసి, నీటితో కడగాలి.

బంగాళదుంప

బంగాళదుంప చర్మం మీద నల్లని వలయాలను తొలగించుటకు ఒక అద్భుతమైన చిట్కాగా పనిచేస్తుంది. బంగాళదుంప ముక్కతో రుద్దుతూ నల్లని వలయాలను దూరం చేయవచ్చు. అంతే కాకుండా బంగాళదుంప గుజ్జును కూడా వాడవచ్చు.

బేకింగ్ సోడా

బికినీ ప్రదేశంలో మరియు మీ శరీరం మీద ఎక్కడైనా నల్లని వలయాలు ఉంటే అక్కడ మీరు బేకింగ్ సోడా వాడటం వలన ఒకటి రెండు వారాలలో ఫలితాన్ని పొందగలరు. బేకింగ్ సోడాని నీటిలో కలిపి పేస్టు తయారు చేసి నల్లని వలయాలు ఉన్న దగ్గర అప్లై చేయాలి. 5 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇది ఒక అద్భుతమైన చిట్కా. దీనిని వారానికి 2 సార్లు చేయాలి.

Posted on

మొటిమలు పోవాలంటే – Telugu tips for pimple marks, dark spots, acne scars

మొటిమలు వాటి మచ్చలతో మీరు బాధపడుతున్నారా? ఎదుటి వారికి మీరు మీ ముఖము చూపించలేకున్నరా? అయితే మీరు బాధ పడవలసిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి మీరు మీ మొటిమలను వాటి మచ్చలను దూరం చేయవచ్చు.

మొటిమలు రావడం వలన మీ ముఖముపై నల్ల మచ్చలు ఏర్పడుతున్నవి. సూర్యరశ్మి మీ చర్మం మీద ఎక్కువగా పడటం వలన కూడా నల్ల మచ్చలు ఏర్పడతాయి. బయటకు వెళ్ళేటప్పుడు మీ చర్మానికి సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేయడం ఎంతైనా అవసరం, బయటకు వెళ్ళేటప్పుడు క్రింద ఇవ్వబడిన గృహ చిట్కాలను పాటించడం వలన మొటిమలు వాటివల్ల కలిగే మచ్చల నుంచి విముక్తి చెందవచ్చు.

కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం కన్నా మీరు గృహ చిట్కాలను వాడటం మంచిది. దీని ద్వారా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాకుండా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. మీ చర్మం మొటిమలు మరియు మచ్చలు లేకుండా అందంగా కనిపిస్తుంది.

టమాటో

ఒక టమాటోని తీసుకొని పేస్టు చేసి టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత వేడి నీటితో కడగాలి.

కలబంద (Alovera)

కలబంద ఆకుల నుంచి గుజ్జుని తీసి 5 నిమిషముల పాటు ఎండలో ఎండపెట్టాలి. తరువాత దానిలో ఎండిన నిమ్మపండు రసాన్ని 5-6 చుక్కులు కలపవలెను. ఆ పేస్టు ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.

ఉల్లిపాయ

ఉల్లిపాయలో సూక్ష్మజీవ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉన్నవి, అందువలన ఇది మొటిమలను వాటి మచ్చలను తొలగించుటకు ఉపయోగపడుతుంది. ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి, మిక్సర్ సహాయంతో పేస్టు చేయాలి. తరువాత ఆ పేస్టు నుంచి నీటిని వడపోసి పిప్పిని మాత్రమే ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషముల తరువాత ముఖాన్ని నీటితో కడగాలి.

గంధపు చెక్క

రెండు టేబుల్ స్పూనుల గంధపు పొడిని తీసుకొని సరిపడే గులాబీ నీటిని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఎండిన తరువాత నీటితో కడగాలి.

పసుపు మరియు నిమ్మరసం

చిటికెడు పసుపు తీసుకుని దానిలోకి నిమ్మరసాన్ని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా తొందరగా మీ ముఖముపై మచ్చలు తొలగిపోతాయి. ఇలా రోజు చేయడం వలన మీరు ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు.

బంగాళదుంప రసం మరియు తేనే

బంగాళదుంప పేస్టు చేసి దానిలోకి కొంచెం తేనెని కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత మంచి నీటితో కడగవలెను. ఇలా చేయడం ద్వారా మీ ముఖము మీద ఉన్న నల్ల మచ్చలు దూరం అవుతాయి. అలానే కాకుండా బంగాళదుంప ముక్కతో మచ్చలు ఉన్న దగ్గర 5 నిమిషముల పాటు రుద్దుతూ ఉండాలి, 15 నిమిషములు అలానే ఉంచి మంచి నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వలన కూడా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.

ఒక సులభమైన ఇంటి చిట్కా

ఈ పేస్టు తయారు చేయడం చాల సులభం. ఒక టేబుల్ స్పూన్ ఉల్లి రసం, ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం మరియు ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ తీసుకొని బాగా కలపాలి. ఆ పేస్టును ముఖానికి అప్లై చేసి కొంచెం సేపు నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఉంచి 20 నిమిషముల తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఇది తొందరగా నల్ల మచ్చలు పోవుటకు సహాయ పడుతున్నది. ఉల్లిపాయలో సల్ఫర్ మరియు విటమిన్లు ఎక్కువగా ఉండటం వలన మరియు అల్లంలో అల్లిసిన్ అనే కారకం ఉండటం వలన యాంటీఫంగల్ మరియు యాంటీఏజింగ్ లక్షణాన్ని కలిగి ఉంటుంది మరియు చర్మానికి చాల మంచిది.

నిమ్మరసం

నిమ్మరసంలో విటమిన్ C ఎక్కువగా ఉండటం వలన ఇది చర్మంలోని విషపు కణాలను దూరం చేస్తుంది. అలానే మొటిమల వలన వచ్చిన నల్ల మచ్చలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. నిమ్మరసాన్ని మచ్చలు ఉన్న దగ్గర అప్లై చేయడం వలన మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. ఇలా రోజుకి రెండుసార్లు చేయడం ఇంకా మంచిది.

దోసకాయ మరియు పాలు

దోసకాయ పేస్టుని మరియు పాలను కలపాలి  దానిలో కొంచెం నిమ్మరసం కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ  పేస్టుని ముఖానికి అప్లై చేసి 10 నిమిషముల తరువాత మంచి నీటితో కడగవలెను. ఇలా  చేయడం ద్వారా మీ ముఖము పైన మచ్చలుపోయి ప్రకాశవంతంగా తయారు అవుతుంది.

బొప్పాయి

బొప్పాయిలో అనేక రకముల ఎంజైములు ఉన్నవి. ఇవి మచ్చలను దూరం చేయుటకు ఉపయోగపడతాయి. బొప్పాయి గుజ్జుని తీసుకొని ముఖము మీద అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

మజ్జిగ

మజ్జిగలో లాక్టిక్ ఆసిడ్ మరియు హైడ్రాక్సిల్ ఆసిడ్స్ ఉన్నవి, ఇవి నెచురల్ ఆసిడ్స్. ఇవి చర్మానికి చాలా మంచివి. మజ్జిగ చర్మ కణాలను ఉత్తేజ పరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహకరిస్తుంది. మజ్జిగను ముఖానికి అప్లై చేయడం వలన నల్ల మచ్చలు పోయి కొత్త చర్మం ఏర్పడుతుంది. మజ్జిగలో నిమ్మరసం కలిపి కూడా మీరు ముఖానికి అప్లై చేయవచ్చు. దీని వలన కూడా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.

విటమిన్ A ఆయిల్

విటమిన్ A లో యాంటిఆక్సిడెంట్ ఉండటం వలన గాయాలను నయం చేయడానికి ఉపయోగపడుతున్నది. కనుక విటమిన్ A ఆయిల్లో కొంచెం ఆముదం కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత నీటిలో  కడగవలెను.

ఓట్స్

ఓట్స్ మంచి బలమైన ఆహారమే కాకుండా ఇది మొటిమలను వాటి మచ్చలును తొలగించడానికి ఉపయోగపడుతున్నది. మీరు రోజు ఓట్మీల్ని ముఖానికి అప్లై చేయడం వలన మీ ముఖము పైన ఉన్న మచ్చలు దూరం అవుతాయి. ఓట్మీల్ మరియు నిమ్మరసం కలిపి పేస్టు తయారు చేసి తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం చాల మంచిది.

ఎక్కువగా నీరు తీసుకోవడం

ఎక్కువగా నీరు త్రాగటం వలన మీ ముఖము మీద మచ్చలను తొలగించుటకు సహాయపడుతుంది. కనీసం రోజుకి 6-8 గ్లాసుల నీటిని త్రాగాలి. ఇలా ఎక్కువ నీటిని త్రాగటం వలన మీ చర్మకాంతి పెరగటమే కాకుండా శరీరం లోపల ఉన్న విష కణాలను బయటకు పంపుతుంది.

పచ్చి పాలు

పాలల్లో లాక్టిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండటం వలన ఇది మచ్చలు పోగొట్టి చర్మాన్ని మృధువుగా చేస్తుంది. పచ్చి పాలను ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే చేయడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.

కందిపప్పు మరియు పాలు

మొటిమల మచ్చలను తొలగించడానికి ఇది ఒక మంచి ఉపాయం. ఒక టేబుల్ స్పూన్ కందిపప్పుని తీసుకొని రాత్రి అంత నానపెట్టాలి. ఉదయాన్నే నానిన కందిపప్పులో పాలు కలుపుతూ పేస్టు తయారు చేయాలి. ఈ  పేస్టుని ముఖానికి రాసి 20 నిమిషముల పాటు అలానే ఉంచాలి.  తరువాత చేతితో రుద్దుతూ గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. ఇలా చేయడం వలన 15 రోజుల్లో మీరు తేడాని గమనించవచ్చు.

పెరుగు మరియు తేనే

పెరుగులో అనేక రకముల ఎంజైమ్స్ ఉన్నవి. ఇవి నల్ల మచ్చలు తొలగించుటకు సహాయ పడుతుంది. తేనే సహజంగా బ్లీచింగ్ తత్వాన్ని కలిగి ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ పెరుగు మరియు 2 టేబుల్ స్పూనుల తేనెని కలిపి పేస్టు తయారు చేసి ముఖానికి అప్లై చేసి 20 నిమిషములు ఉంచాలి. తరువాత చేతులతో రుద్దుతూ గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా ప్రతిరోజు చేయడం వలన మంచి ఫలితాన్ని పొందగలరు.

ఆముదం

ఆముదంలో గొప్ప వైద్య లక్షణాలు ఉన్నవి ఇవి మొటిమలను వాటి మచ్చలను దూరం చేయుటకు సహాయ పడుతున్నవి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసి తరువాత ఆముదంతో 5 నిమిషముల పాటు మసాజ్ చేసి 20 నిమిషముల తరువాత ఒక కాటన్ క్లోత్ సహాయంతో ముఖాన్ని తుడవాలి. తరువాత మళ్ళి 5 నిమిషముల పాటు మసాజ్ చేసి నీటితో కడగాలి. ఇలా రోజుకి రెండు సార్లు ఒక నెల పాటు చేయాలి. ఇలా చేయడం వలన మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.

ముల్లంగి

మొటిమలు, మచ్చలు మాత్రమే కాకుండా చర్మ సమస్యలను కూడా ముల్లంగి దూరం చేస్తుంది. ఒక ముల్లంగిని తీసుకొని పేస్టు చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి. ఇలా చేయడం వలన మీరు ఒక నెలలోనే మీ చర్మంలో వచ్చిన కాంతిని గమనిస్తారు.

ఎర్రని ఎండుద్రాక్ష మరియు తేనే

ఎర్రని ఎండుద్రాక్ష పండ్ల జాతికి చెందినది. దీనిలో మెలనిన్ ఉండటం వలన ఇది నల్ల మచ్చలను దూరం చేయుటకు సహాయ పడుతున్నది. తేనెలో బ్లేచింగ్ చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నవి. కొన్ని ఎర్రని ఎండుద్రాక్ష తీసుకొని పేస్టు చేసి దానిలో ఒక స్పూన్ తేనే కలపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇలా రోజూ చేయడం వలన మంచి ఫలితాన్ని పొందగలుగుతారు.

ఫుల్లర్ ఎర్త్ పొడి మరియు నిమ్మరసం

ఫుల్లర్ ఎర్త్ పొడిలో ఎక్కువ మోతాదులో సహజ ఖనిజాలు ఉన్నవి ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి ఉపయోగపడుతున్నవి. ఫుల్లర్ ఎర్త్ పొడితో పేస్టు తయారు చేసి దానిలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేయలి. ప్యాక్ ఎండిపోయిన తరువాత చేతితో రుద్దుతూ నీటితో కడగాలి.

ద్రాక్ష మరియు ఆపిల్

ద్రాక్ష మరియు ఆపిల్ రెండిటిలోనూ సహజంగానే విటమిన్లు, ఆసిడ్స్ ఉన్నవి. ఇవి శరీరానికి కాంతివంతంగా చేయుటకు ఉపయోగపడుతున్నవి. ఒక ఆపిల్ ముక్క తీసుకొని రెండు ద్రాక్షలు కలిపి పేస్టు తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ పేస్టుతో ముఖానికి మసాజ్ కూడా చేసుకోవచ్చు.10 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇలా ఒక నెల రోజులపాటు చేస్తే మీరు మీ ముఖములో మార్పుని గమనించవచ్చు.

చర్మం మీద మచ్చలను తోలగుంచడానికి కొన్ని చిట్కాలు

 • ఎటువంటి మచ్చలు, మొటిమలైన కొన్ని మంచి ఇంటి చిట్కాలను వాడటం వలన వాటిని దూరం చేయవచ్చు. అలాంటి కొన్ని చిట్కాలు  పైన ఇవ్వబడినవి. వీటివి పాటించడం ద్వారా మీరు ఒక వారం రోజుల్లోనే ఫలితాన్ని చూడగలరు.
 • గంధపుచెక్క మరియు పసుపు లాంటి చిట్కాలు మీరు నెల రోజులపాటు పాటించవలసి ఉంటుంది. అప్పుడే మీరు మంచి అందమైన చర్మాన్ని పొందగలరు.
 • కొన్ని చిట్కాలు వయస్సుని బట్టి వాడాలి అని అంటూ ఉంటారు కానీ ఈ చిట్కాలను ఏ వయస్సు కలిగిన వారైన వాడవచ్చు.
 • ఇంటి చిట్కాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వీటిని ఉపయోగించడం వలన చాల కాలం వరకు మీ చర్మం కాంతివంతంగా ఉంటుంది.
 • ఒక గొప్ప విషయం ఏమిటి అంటే గృహ చిట్కాలను వాడటం వలన మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
 • ఒక గొప్ప సూచన ఏంటి అంటే గృహ చిట్కాల వలన చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది. అలానే మీరు తాజా పదార్ధాలు వాడటం వలన మంచి ఫలితం ఉంటుంది.
 • ఈ చిట్కాలను ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఉపయోగించడం వలన సూర్యరశ్మి నుంచి విముక్తి చెందవచ్చు.
Posted on

ఇంటి ఛిట్కాల ద్వారా మొటిమలు వాటి వలన కలిగే నల్లటి మచ్చలను రూపుమాపటం – Telugu home remedies to remove pimple marks, scars & pimple spots

మొటిమలు ఎక్కువగా ముఖము, మెడ మరియు బూజముల పైన కనిపిస్తాయి. మొటిమలు బ్యాక్టీరియ మరియు పస్ ని కలిగి ఉంటవి. చర్మం లో ఉండే సెబసియస్ అనే గ్రంధి ద్వారా మొటిమలు వ్యాపిస్తాయి. మొటిమలు మన శెరీరానికి ఎటువంటి హానిని కల్పించవు. ఇవి చర్మం పైన వచ్చే చిన్న పొక్కులు ఇవి గులాబీ రంగును కలిగి వుంటాయి. మొటిమలు చాల తక్కువ రోజులలో తొలగిపోతాయి. కానీ వాటి వలన ఏర్పడే మచ్చలు మాత్రం చాల కాలం వరకు అలానే నిలిచి ఉంటాయి. వీటిని తగ్గించు కొనుటకు చాల రకాల క్రీమ్స్ లభిస్తున్నవి. కాని ఇవి చాల హాని కరమైన రసాయనములతో తయారు చేస్తారు. కనుక ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా మన శారీరానికి ఎటువంటి హాని కలుగకుండ ఉంటుంది.

సహజ సిద్ధంగా మొటిమల మచ్చలను తొలగించుట

యుక్త వయసు గల వారు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొనవలసి వస్తుంది. మొటిమలు ఎక్కువగా ఉండటం వలన వీరు అనేక రకముల కస్మటిక్స్ ఉపయోగించుచున్నారు. ఒకసారి  కస్మటిక్స్ వాడటం మొదలు పెట్టిన తరువాత మధ్యలో వాటిని మనివేయడానికి కుదరదు. దీనికన్నా మన ఇంటి చిట్కాల వలన మనం ఎక్కువ ఫలితాన్ని పొందగలము. ఇవి సహజ సిధంగా మొటిమలను వాటి మచ్చలను తొలగించడానికి ఉపయోగకరం. మొటిమలు వాటి వనల కలిగే మచ్చలు మరియు రంధ్రాలను తొలగించవచ్చు.

పంచదార ద్వారా మొటిమలను తొలగించుట

ఇది చాల సులువు అయిన విధానం, దీని ద్వారా చర్మం మీద మొటిమలు పోవడమే కాకుండా శరీర కాంతిని కూడా పెంచుతుంది. దీనివలన ఎక్కవ సౌందర్యంగా మన ముఖం కన్పిస్తుంది. దీని పేస్టు తయారు చేయుటకు ఒక టేబుల్ స్పూన్ చెక్కెర, ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ మరియు ఒక టేబుల్ స్పూన్ తేనేని తీస్కోని వాటిని మంచిగా అన్ని కలిసేట్లు కలపాలి. ఆ పేస్ట్ని మొఖముఫై మాస్క్ వేసుకోవాలి. 15 నిమిషముల తర్వాత నీటితో కడిగివేయాలి.

గుడ్డు తెల్ల పోర ద్వారా మొటిమలను తొలగించుట

గుడ్డు తెల్లని పోర మొటిమలను తగ్గించడాని ఉపయోగపడుతుంది. ఒక తాజా గుడ్డుని తీసుకొని దానిని పగల కొట్టి, దానిలోని పసుపు సోనని వేరు చేసి తెల్లని పోరని మాత్రమే తీసుకోవాలి. ఆ తెల్లని పోరని ముఖానికి అప్లై చేయాలి. 10-15 నిమిషముల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడగవలెను. గుడ్డు తెల్లని పొరలో ఎక్కువగా ప్రోటీన్లు మరియు విటమిన్లు ఎక్కువగా ఉండటం వలన శరీర కణాలని కొత్తగా పునరుత్పత్తి చేసి మొటిమలను పోగొడుతుంది.

బేకింగ్ సోడా మొటిమల మచ్చలను తొలగించుటకు

మీకు తెలుస బేకింగ్ సోడా ఉపయోగించి మొటిమలను ఎలా అరికట్టలో? ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని దానిలో తగిన్నన్ని నీరు పోసి కలపవలెను. బేకింగ్ సోడా మచ్చలను తొలగించి శరీర కాంతిని పెంచుతుంది. మాస్క్ 5 నిమిషముల కన్నా ఎక్కువ సేపు ఉంచుకొని చల్లని నీటితో కడగవలెను.

టమాటో ద్వారా మొటిమలు వాటి మచ్చలను తొలగించుట

టమాటోలలో ఎక్కువగా విటమిన్ A ఉండుట వలన శరీర కాంతిని ఇస్తుంది. చర్మం మీద మచ్చలను తొలగించి కొత్త చర్మ కణములను వృద్ది చేస్తుంది. ఒక తాజా టమాటో గుజ్జు మొఖము పైన అప్లయ్ చేసి 20 నిమిషముల తర్వాత చల్లని నీటితో కడగవలెను.

మీరు టమాటోతో పాటుగా దానిలో అవకాడ లేక దోసకాయ వేసి పేస్టు తయారు చేసి ముఖానికి అప్లై చేయవచ్చు. ౩౦ నిమిషముల తరువాత నీటితో కడగవలెను. ఇలా వారానికి రెండుసార్లు చేయవలెను. దీని వలన మీ మొఖము ఎక్కువ కాంతిని పొందుతుంది.

కలబంద మరియు పసుపు ద్వారా మొటిమల మచ్చలను తొలగించుట

కలబంద లో పోషకాలు, ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటవి. ఇది అంటి బాక్టీరియల్ మరియు అంటి ఫంగల్ అజేంట్ గా పనిచేస్తుంది. అలానే శరీరం మీద విషపు కణాలని తొలగించి సహజ చర్మాన్ని ఇస్తుంది. అలాగే పసుపు కూడా అంటి ఇంఫ్లోమేటరి ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. టేబుల్ స్పూన్ పసుపు మరియు కలబంద గుజ్జు కలిపి పేస్టు తయారు చేయవలెను. దానిని మచ్చలు ఉన్న దగ్గర అప్లై చేసి 20 నిముషముల తరువాత కడగవలెను.

టీ ట్రీ ఆయిల్ ద్వారా మొటిమల మచ్చలను తొలగించుట

మొటిమల మచ్చలను టీ ట్రీ ఆయిల్ అనేది ఒక ఉత్తమమైన ఎంపిక, ఇది అంటి బాక్టీరియల్ అజేంట్ గా పనిచేసి మచ్చలను తొలగించుటకు ఉపయోగపడుతుంది. 2-3 డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్ని తీసుకొని దానిలో కొన్ని డ్రాప్స్ క్యారియర్ ఆయిల్ని కలపవలెను. దానిని ముఖానికి అప్లై చేసి కొన్ని గంటల తరువాత కాటన్ క్లోత్ తో తుదవవలెను. టీ ట్రీ ఆయిల్ మొటిమలను వాటి మచ్చలను తొలగించి తిరిగి రాకుండా కాపాడుతుంది.

నిమ్మకాయ ద్వారా మొటిమల మచ్చలను తొలగించుట

మొటిమల మచ్చలను తొలగించుటకు నిమ్మకాయలో ఎక్కువ లక్షణములు ఉన్నవి. దీనిలో విటమిన్ చ ఎక్కువగా ఉండటం వలన అది చర్మ కాంతి ని పెంచుటకు ఉపయోగపడుతుంది. సగం కట్ చేసిన నిమ్మకయ రసాన్ని తీసుకొని దానిలో ఏదైన తియ్యని రసాన్ని కలపవలెను. ఆ ద్రవాన్ని ముఖానికి మాస్క్ వేసి 20 నిమిషముల తరువాత కడగవలెను. ఇలా రోజుకి రెండు సార్లు చేయవలెను. కొన్ని రోజులలోనే మీ మొఖంలో కొత్త కాంతి ని మీరు గమనిస్తారు.

గంధపు చెక్క ద్వారా శరీరం మీద మచ్చలను తొలగించుట

గంధపు చెట్టు అనేది మన భూమి మీద ఒక అధ్బుతమైన చెట్టు. గంధపు చెక్కని నూరి పేస్టు తయారు చేయవలెను. దీనిని నూరుటకు మాములు నీటికన్న గులాబీ నీటిని వాడటం మంచింది. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి అది ఎండి పోయిన తరువాత మంచి నీటితో మొఖాన్ని కడగవలెను. ఇలా రోజుకు రెండు సార్లు చేయడం ద్వారా ఒక వారం రోజులలో మీరు మీ ముఖ కాంతిని పొందగలరు.

తేనే, పసుపు మరియు పాలు పేస్ ప్యాక్ ద్వారా మొటిమలను వాటి మచ్చలను తొలగించుట

ఒక బౌల్ తీసుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్స్ తేనే, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ పాలు మరియు ఫ్యూ డ్రాప్స్ గులాబీ నీటిని కలపవలెను. కలిపిన పేస్టుని ముఖము పైన అప్లై చేసి 20 నిమిషముల తరువాత నీటితో కడగవలెను. మీరు మీ ముఖము పైన మచ్చాలు తగ్గుట గమనిస్తారు.

సిట్రస్ పేస్ ప్యాక్ ద్వారా మొటిమలను వాటి మచ్చలను తొలగించుట

సిట్రస్ అనగా బత్తాయి, నారింజ, నిమ్మ మొదలుగునవి. అన్ని సిట్రస్ ఫలాలలో రక్తస్రావాన్ని తగ్గించే గుణం ఉంటుంది, ఇవి మచ్చలను తొలగించుటకు ఉపయొగపడతాయి. రెండు టేబుల్ స్పూన్స్ ముల్తాని మిట్టిని తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ సిట్రస్ రసాన్ని మరియు తగినంత నీటిని కలపవలెను. ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత కడగవలెను.

జాజికాయ ద్వారా కాంతివంతమైన చర్మం

మీరు మీ మొటిమల వలన చింతిస్తున్నారా ఐతే మీరు ఈ ప్యాక్ ని ఉపయోగించి ఫలితం పొందవచ్చు. ఒక టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వుని రాత్రి అంతా పాలల్లో నానపెట్టవలెను ఉదయాన్నే దానిలో ఒక టేబుల్ స్పూన్ జాజికాయ పొడిని కలపవను. బాగా కలిపిన పేస్టుని పేస్ మీద అప్లై చేయాలి 20 నిమిషముల తరువాత నీటితో కడగవలెను. ఇలా రోజు చేయడ్డం ద్వారా మీ శరీరం కాంతిని పొందుతుంది.

నారింజ తొక్క ద్వారా మొటిమలను వాటి మచ్చలను తొలగించుట

నారింజ తొక్క ద్వారా మొటిమల మచ్చలను చాల తొందరగా తొలగించవచ్చు. తాజా నారింజ తొక్కను రాత్రి అంత పాలల్లో నానపెట్టవలెను. ఉదయాన్నే పేస్టు తయారు చేసి మొఖానికి ప్యాక్ వేయవలెను. 30 నిమిషముల తరువాత మంచి నీటితో కడగవలెను. ఇలా రోజు చేయడం వలన మంచి ఫలితాన్ని పొందగలరు.

బంగాళదుంప రసం ద్వారా మొటిమల మచ్చలను తొలగించుట

చర్మ రంగులో వచ్చిన మార్పులను మాయం చేయడానికి బంగాళదుంప రసం ఉపయోగపడుతుంది. అలానే మీరు మొటిమల ద్వారా వచ్చిన మచ్చలతో బాధ పడుతున్నారా దానికి ఈ బంగాళదుంప రసం బాగా పనిచేస్తుంది. బంగాళదుంప జూస్ చేసి దానిని మచ్చలు ఉన్న చర్మం మీద అప్లై చేయండి. అలానే మీరు పేస్టు కూడా తయారు చేసి ముఖానికి అప్లై చేయవచ్చు. పేస్ ప్యాక్ నల్ల రంగు వచ్చే వరకు ఉంచవలెను. మొదట పొడి చేతితో ప్యాక్ ని రబ్ చేయాలి, తరువాత నీటితో కడగవలెను.

కోకో వెన్న ద్వారా మొటిమల మచ్చలను తొందరగా తొలగించుట

ఈ చిట్కా డ్రై స్కిన్ ఉన్న వారికి మాత్రమే, కోకో వెన్న ఎక్కువగా తేమ లక్షణాలను కలిగి ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు ముఖాన్ని మంచిగా శుభ్రం చేసుకొని కోకో వెన్నని అప్లై చేయండి. ఉదయాన్నే నీటితో కడగవలెను. ఇలా ప్రతిరోజూ చేయవలెను, మీరు 15 రోజుల్లో మీ చర్మ కాంతిని చూడగలరు.

మెంతిపొడి మరియు పాలు ద్వారా మొటిమల మచ్చలను తొలగించుట

మెంతిపోడిలో కొన్ని ఎంజైమ్స్ కలిగి ఉండటం వలన ఇది చర్మ సౌందర్యానికి తోడ్పడుతుంది. ఒక టేబుల్ స్పూన్ మెంతిపోడిని పాలల్లో ఒక రాత్రి అంతా నానపెట్టవలెను. ఉదయాన్నే దాన్ని పేస్టుల చేసి ముఖానికి మరియు మెడకి అప్లయ్ చేయాలి. 20-30 నిమిషముల తరువాత నీటితో కడగవలెను.

పెరుగు మరియు దోసకాయ ద్వారా మొటిమల మచ్చలను తొలగించుట

పెరుగు గొప్ప తేమ లక్షణాన్ని కలిగి ఉంది అలానే ఇది ఎంజైమ్స్ కలిగి ఉంది. కావున పెరుగు చర్మ సౌదర్యానికి చాల బాగా ఉపయోగపడుతుంది. దోసకాయలో చర్మాన్ని మృధువుగా మరియు చర్మ కణాలను ఉత్తేజ పరిచే శక్తి ఉంది. కొంత దోసకాయ తీసుకొని పేస్టు చేయవలెను దానిలోకి ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలపవలెను. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత నీటితో కడగవలెను. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన 15 రోజుల్లో మీ చర్మ కాంతిని మీరు గమనిస్తారు.

కొబ్బరి నూనె ద్వారా మొటిమల మచ్చలను తొలగించుట

కొబ్బరి నూనె లో చర్మాన్ని తేమగా ఉంచే లక్షణాలు ఉన్నవి. కొబ్బరి నూనెను రోజు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఒక స్పూన్ పచ్చి కొబ్బరి నూనెను తీసుకొని దానితో మొటిమల మచ్చలు ఉన్న దగ్గర బాగా రుద్దవలెను. రాత్రి అంతా అలానే ఉంచేసి, ఉదయాన్నే కాటన్ క్లోత్ తో శుభ్రం చేయాలి. తరువాత ఎక్కువ నీటితో కడగవలెను.

రోజ్-హిప్ ఆయిల్ తో మచ్చలను తొలగించుట

రోజ్-హిప్ ఆయిల్ లో ట్రాన్స్-రేటియోనిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండటంవలన చర్మం మీద ఉన్న మచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. రోజ్-హిప్ ఆయిల్ని అయిలి స్కిన్ వాళ్ళు కూడా ఉపయోగించవచ్చు. ఒక డ్రాప్ రోజ్-హిప్ ఆయిల్ మొటిమల మచ్చల దగ్గర మసాజ్ చేసి ఒక రాత్రి అంత అలానే ఉంచి ఉదయాన్నే ఎక్కవ నీటితో కడగవలెను.

బొప్పాయి తో మొటిమల మచ్చలను తొలగించుట

బొప్పాయి సహజంగా బ్లీచింగ్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. దీనిలో ఉన్న ఎంజైమ్స్ మొటిమల మచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఒక పండిన బొప్పాయి ముక్క తీసుకొని దానిని మొటిమల మచ్చలు ఉన్న దగ్గర రుద్దుతూ ఉండాలి. 5-10 నిమిషములు రిద్దిన తరువాత, 15-20 నిమిషముల అలానే ఉంచి చల్లని నీటితో కడగాలి. ఇలా ఒక వారం రోజు రెండు సార్లు చేసిన తరువాత మీ ముఖములోని కాంతిని మీరు గమనిచవచ్చు.

లేత కొబ్బరి నీటి ద్వారా మొటిమల మచ్చలు తొలగించుట

ఇది చాల సులువు అయిన పద్ధతి మొటిమలను వాటి మచ్చలనలు తొలగించుటకు, మొటిమలు వాటి మచ్చలు ఉన్న దగ్గర మీకు ఎన్ని సార్లు కుదిరితే అన్నిసార్లు లేత కొబ్బరి నీటితో కడగాలి. లేత కొబ్బరి నీటితో కడిగిన వెంటనే నీటితో కడగకూడదు. అది డ్రై అయిన తరువాత మాత్రమే మంచి నీటితో కడగవలెను.

మొటిమలు మచ్చల పైన శ్రద్ధ వహించాదంకి కొన్ని చిట్కాలు

 • కొత్తగా మొటిమలు వచ్చే అప్పుడు మరియు వచ్చిన తరువాత వాటిని రుద్దడం లాంటివి ఏమి చేయకూడదు. అల చేస్తే చర్మం పాడు అవడం మరియు మచ్చలు రావడం జరుగుతుంది.
 • ఒకసారి మొటిమలు వచ్చి పోయిన తరువాత అక్కడ మళ్ళి కొత్త చర్మం ఏర్పడుతుంది.
 • ఎక్కువగా నీరు త్రాగటం మరియు తాజా పండ్లను తినడం ద్వారా మొటిమలు రాకుండా చూడవచ్చు.
 • మీరు మొటిమలు వచ్చిన్నప్పుడు వాటిని గిల్లటం కానీ రుద్దటం కాని చేయకూడదు. అలా చేస్తే చర్మం పాడుఅవుతుంది.

మీరు ఈ పైన ఇచ్చిన ఇంటి చిట్కాలను ఏవైనా పాటించవచ్చు. మొటిమలను వాటి మచ్చలను తొలగించుటకు మీకు ఉపయోగకరము.

Posted on

మీ చర్మం పై టాన్ ను తొలగించాలంటే? – Tan removal tips in Telugu

సూర్యుని కాంతికి చర్మం కందిపోయి పాడయిపోవటం చాలా మందికి కలిగే సమస్య. ఇది చర్మాన్ని డార్క్ గా చేయటమే కాకుండా అనేక సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వాటిలో ముఖ్యంగా చర్మంపై ప్యాచులు పడటం, ర్యాషెస్ రావటం, చర్మం సాగుదలకు గురి అవ్వటం లాంటివి జరుగుతాయి. అంతేకాక ఇది మీ చర్మాన్ని డార్క్ గానూ, మీ చర్మం నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి. ఈ రోజుల్లో సన్ టాన్(Sun tan) నుండి రక్షణ పొందుటకు అనేక కాస్మటిక్ ప్రొడక్ట్స్ మరియు బ్లీచింగ్ విధానాలు వచ్చినవి. కాని అవి వాడటం వలన చర్మానికి చాల హానికరం. సహజమైన చిట్కాలను వాడటం వలన శరీరానికి ఎటువంటి హాని కలుగకుండా సన్ టాన్(Sun tan) ని తొలగించవచ్చు.

సన్ టాన్ రావడానికి గల కారణాలు (Telugu causes for sun tan)

సన్ టాన్(Sun tan) రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. రసాయనాలను ఎక్కువగా వాడటం వలన లేక రసాయనాల దగ్గర పని చేయడం వలన కూడా సన్ టాన్ వస్తుంది. UV కిరణాలు శరీరం మీద పడటం వలన కూడా సన్ టాన్ వస్తుంది. ఎక్కువగా ఆటలు ఆడేవారికి మరియు కలుషిత వాతావరణంలో తిరిగేవారికి సన్ టాన్(Sun tan) సంభవిస్తుంది. బయటనుండి వచ్చిన తరువాత స్నానం చేయకుండా శరీరం మీద అశ్రద్ధ చేస్తే సన్ టాన్ వచ్చే అవకాశం ఉంది.

మహిళలందరికీ ఒక శుభవార్త మీరు గృహ చిట్కాలను పాటించడం ద్వారా మీ సన్ టాన్(Sun tan) ను తొలగించవచ్చు. కొన్ని చిట్కాలు సూచనలు క్రింద ఇవ్వబడినవి.

సన్ టాన్ ను తొలగించుటకు ఇంటి చిట్కాలు (Telugu remedies for sun tan)

బెకింగ్ సోడా

బెకింగ్ సోడాని ఉపయోగించి సన్ టాన్(Sun tan) ని ఎలా తొలగించాలి అంటే? దీనిని నీటితో కలిపి పేస్టు తయారు చేసి మీ చేతులకి మరియు ఎక్కడైతే సన్ టాన్ ఉందో అక్కడ రాయడం వలన మీకు సన్ టాన్ పోయి మీ సహజ చర్మం మీకు లభిస్తుంది. ఇలా రోజు విడిచి రోజు చేయడం వలన మీకు మంచి ఫలితం ఉంటుంది.

వెనిగర్

ఉత్తమమైన చిట్కాను ఉపయోగించి సన్ టాన్(Sun tan) ను తొలగించడం ఎలానో మీకు తెలుసా? సమాన పరిణామాలలో వెనిగర్ని మరియు నీటిని ఒక బౌల్లోకి తీసుకొని కలపాలి. మీ చేతులను ఆ బౌల్లో 5 నుంచి 10 నిమిషములు ఉంచి తీసిన తరువాత చల్లని నీటితో చేతులను కడగాలి. మీకు మంచి ఫలితం వచ్చేవరకు ఇలా రోజు చేయడం మంచిది.

పెరుగు మరియు శనగపిండి

పెరుగు, శనగపిండి మరియు నిమ్మరసం కలిపి పేస్టు తయారు చేయాలి. ప్రతీ పదార్ధం యొక్క పరిమాణాలు ఒక్కటేలా ఉండాలి. ఈ పేస్టుని సన్ టాన్ ఉన్న చోట అప్లై చేయాలి. 10 నిమిషముల తరువాత పేస్టు ఎండిపోతే దానిని గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది సన్ టాన్ ని తొలగించి చర్మం కాంతివంతంగా ఉండేటట్లు చేస్తుంది.

పసుపు మరియు పచ్చి పాలు

పాలల్లో పసుపు మరియు నిమ్మరసం కలిపి టాన్ ఉన్నచోట అప్లై చేయాలి. 10 నిమిషముల తరువాత పేస్టు ఎండిపోతే చల్లని నీటితో కడగాలి. ఇలా ముఖానికి అప్లై చేయటం వలన మంచి ఫలితం కనిపిస్తుంది.

అలానే మీరు సన్ టాన్(Sun tan) ఉన్నచోట కొబ్బరి నీటిని అప్లై చేసి ఆరిన తరువాత నీటితో కడగాలి. ఇలా రోజూ చేయడం వలన మీకు మంచి ఫలితం ఉంటుంది.

బొప్పాయి

మీకు బొప్పాయితో టాన్(Tan) చర్మాన్ని వదిలించుకోవడం ఏంటి అని ఆశ్చర్యం కలిగిందా? బొప్పాయి గుజ్జు కూడా సన్ టాన్ ను పోగొట్టుటలో సహకరిస్తుంది. బొప్పాయి గిజ్జుని తీసుకొని ఎక్కడైతే టాన్ స్కిన్ ఉందో అక్కడ 10-15 నిమిషములపాటు మసాజ్ చేసి, 10-15 నిమిషముల తరువాత ఆరిన ఫీలింగ్ కలిగితే చల్లని నీటితో కడగాలి.

ముల్తాని మట్టి మరియు సొరకాయ

మనకు సొరకాయ మార్కెట్లో చాల సులువుగా లభిస్తుంది. సొరకాయ గుజ్జుని తీసుకొని దానిలోకి ముల్తాని మట్టిని కలిపి పేస్టు తయారు చేసి దానిని సన్ టాన్(Sun tan) ఉన్నచోట ముఖము, మెడ మరియు చేతులకు అప్లై చేయాలి. చల్లని నీటితో కడిగిన తరువాత ఫలితాన్ని మీరు గమనించవచ్చు.

ఇలానే కాకుండా సూర్యరశ్మి మీ మీద పడకుండా జాగ్రత్త తీసుకోవడం వలన కూడా మీకు టాన్ స్కిన్ రాకుండా ఉంటుంది. 10.00 నుంచి 4.00 గంటల మధ్యలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ ఆ సమయంలో బయటకు వెళ్ళవలసి వస్తే మీరు SRF గుర్తు ఉన్న సన్ స్క్రీన్ లోషన్ని వాడవచ్చు. అలనే మీ మీద సూర్యరశ్మి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులకు గ్లౌస్ మరియు ముఖానికి మాస్క్ వేసుకోవడం మంచిది.

పైన్ఆపిల్ మరియు బొప్పాయి

పైన్ఆపిల్ మరియు బొప్పాయిని పేస్టులా చేసి ముఖము మరియు నుదిటిపై అప్లై చేయాలి. 10 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. మార్కెట్లో లభించే టాన్ క్రీమ్స్ వాడటం కన్నా ఈ పేస్టు వాడటం చాల ఉత్తమం. ఇది వాడటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మీ ముఖము మరియు నుదిటి మీద ఉండే టాన్ ని తొలగించడానికి ఉపయోగపడుతున్నది.

అలోవేర, టమాటో మరియు కందిపప్పు

ఇది ఒక ఉత్తమమైన పేస్ ప్యాక్, దీని వలన మీరు మీ శరీరం మీద వచ్చిన సన్ టాన్ ను తొలగించవచ్చు. మన ఇంట్లో ఉండే కందిపప్పు సన్ టాన్ ని తొలగించే ఒక ఉత్తమమైన పదార్ధం. కందిపప్పుని 15 నిమిషములపాటు నానపెట్టి మిక్సర్ సహాయంతో పేస్టు తయారు చేయాలి. ఈ పేస్టులో అలోవేర గుజ్జును మరియు టమాటో గుజ్జును కలపాలి. పేస్టును ముఖానికి మరియు మెడకి మసాజ్ చేస్తూ రాయాలి. 15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.

వోట్ మీల్ మరియు మజ్జిగ

వోట్ మీల్ చర్మం మీద బ్లాక్ హెడ్స్ని తొలగించడానికి మరియు మజ్జిగ చర్మాన్ని మృదువుగా చేయడానికి ఉపయోగపడుతున్నవి. 2 టేబుల్ స్పూనుల వోట్ మీల్స్ మరియు 3 టేబుల్ స్పూనుల మజ్జిగను తీసుకొని పేస్టు తయారు చేయాలి. ఈ పేస్టును ముఖానికి మరియు శరీరానికి అప్లై చేసి చేతులను వృత్తాకారంగా తిప్పుతూ మసాజ్ చేయాలి. 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

నారింజ రసం మరియు పెరుగు

నారింజలో C విటమిన్ ఎక్కువగా ఉండటం వలన చర్మం మీద టాన్ ను తొలగించి వృధ్ధాప్య చాయలను తొందరగా రాకుండా చేస్తుంది. పెరుగు సహజంగా బ్లీచింగ్ గుణాలను కలిగి ఉంది. ఒక స్పూన్ నారింజ రసం మరియు ఒక స్పూన్ పెరుగు తీసుకొని ముఖానికి అప్లై చేయాలి. 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

నిమ్మరసం మరియు పంచదార

నిమ్మరసం తీసి దానిలోకి పంచదార కలపవలెను. దీనిని ముఖానికి రాస్తూ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన టాన్ చర్మం పోయి మంచి చర్మం ఏర్పడుతుంది. కొన్ని వారాలలో ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనిని ఉపయోగించడం వలన మీ చర్మం ప్రకాశవంతంగా అవుతుంది. టాన్ ని తొలగించడానికి ఇది ఒక సాధారణమైన పరిహారం.

బంగాళదుంప మరియు నిమ్మరసం

బంగాలదుంపను ఆహారంగా తీసుకోవడం చర్మానికి లాభదాయకం. దీనిలో అనేక రకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉండటమే కాకుండా పీచు తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచి చర్మ మీద వచ్చే మంటను పోగొడుతుంది. అలానే చర్మాన్ని నున్నగా చేస్తుంది. బంగాళదుంప మరియు నిమ్మరసంతో పేస్టు తయారు చేసి ముఖానికి అప్లై చేసి 40 నిమిషముల తరువాత నీటితో కడగవలెను.

స్ట్రాబెర్రి మరియు పాల మీగడ

స్ట్రాబెర్రి చర్మ సౌందర్యాన్ని పెంచి నల్ల మచ్చలను మరియు సన్ టాన్ ని తొలగించడానికి సహకరిస్తుంది. 4 స్ట్రాబెర్రిల చూర్ణాన్ని మరియు 2 టేబుల్ స్పూనుల పాల మీగడను తీసుకొని ముఖము మీద అప్లై చేసి 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

పాల పొడి, తేనే మరియు బాదం ఆయిల్

పాల పొడి సన్ టాన్ ని తగ్గించి, చర్మాన్ని శుభ్రపరచి, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. 2 టేబుల్ స్పూనుల పాల పొడి, ఒక టేబుల్ స్పూన్ తేనే మరియు కొంచెం బాదం ఆయిల్ తీసుకొని పేస్టు తయారు చేయాలి. పేస్టుని ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

కుంకుమ పువ్వు మరియు తాజా మీగడ

కుంకుమ పువ్వుతో పేస్ ప్యాక్ తయారు చేయడం చాలా పురాతన పద్ధతి. ఇది చర్మాన్ని కాంతివంతంగా ప్రకాశించేటట్లు చేసి మొటిమలను, మచ్చలను, సన్ టాన్ ను తొలగించుటకు ఉపయోగపడుతున్నది. చిటికెడు కుంకుమపువ్వు మరియు 2 టేబుల్ స్పూనుల మీగడ తీసుకొని పేస్టు చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషముల తరువాత ప్యాక్ ఆరితే నీటితో కడగాలి.

వోట్ మీల్ మరియు అలోవేర

ఇంట్లో వండుకునే ఆరోగ్యకరమైన వంటకాలలో వోట్ మీల్ వంటకం ఒకటి. వోట్ మీల్ని ఉపయోగించి ఒక అధ్బుతమైన ఫేస్ ప్యాక్ ని తయారు చేయవచ్చు. అలోవేర కూడా టాన్ ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. 3 టేబుల్ స్పూన్స్ అలోవేర జెల్ మరియు 2 టేబుల్ స్పూనుల వోట్ మీల్ తీసుకొని పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని కొంచెం సేపు అలానే ఉంచి తరువాత ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేస్తుంటే మీకు మృదువైన స్పర్శ కలుగుతుంది. ఇది చర్మ కణాలను ఉత్తేజ పరుచుటకు తోడ్పడుతుంది.

క్యాబేజి ఆకు

క్యాబేజి ఆకులు సన్ టాన్ ని తొలగిస్తాయి అని చాలా తక్కువ మంది విని ఉంటారు. ఇది చాల అరుదుగా చేసే చిట్కా, కాని ఒకసారి వాడటం మొదలుపెట్టక ఫలితాన్ని మీరు గమనించ గలరు. రెండు క్యాబేజి పెద్ద ఆకులను తీసుకొని రిఫ్రిజిరేటర్లో ఉంచి బాగా చల్లగా అయిన తరువాత తీసి ముఖము పైన పెట్టుకొని 20 నిమిషములపాటు రిలాక్సగా పడుకోవాలి. మళ్ళి ఇలానే రెండు ఆకులను తీసుకొని చేయండి. ఇలా చేయడం వలన సన్ టాన్ నుంచి తొందరగా విముఖ్తి కలుగుతుంది.

బాదం మరియు పాలు

బాదం ఒక ఆరోగ్యకరమైన గింజ, అలానే ఇది చర్మానికి చాలా మంచిది. బాదం మరియు పాల కలయిక చాల అధ్బుతమైన కలయిక. ఇది చర్మం మీద నల్ల మచ్చలను పోగొట్టి, చర్మం ప్రకశవంతంగా ఉండేటట్లు చేస్తుంది. 4-5 బాదం తీసుకొని రాత్రి అంత నీటిలో నానపెట్టాలి. ఉదయాన్నే బాదంలో 2 టేబుల్ స్పూనుల పాలు పోసి పేస్టు తయారు చేయాలి. వృత్తాకారంగా చేతులతో మసాజ్ చేస్తూ పేస్టుని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.

పైన్ఆపిల్ మరియు తేనే

పైన్ఆపిల్ చాల మంచి రుచికరమైన ఆహరం, చాల మందికి ఇది ఇష్టమైన పండు. ఇప్పడు మీరు పైన్ఆపిల్ చర్మానికి ఎంత ఉపయోగాపడుతుందో తెలుసుకుంటున్నారు. ఇది చర్మం మీద మచ్చలను దూరం చేసి, చర్మం కాంతివంతంగా ఉండేటట్లు చేస్తుంది. పైన్ఆపిల్లో ఎక్కువ శాతం విటమిన్ C ఉండటం వలన చర్మం మీద ముడతలు రాకుండా చేసి యవ్వనమైన చర్మాన్ని మీకు ఇస్తుంది. పైన్ఆపిల్ గుజ్జును తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనే కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి. మీరు మీ చర్మంలో వచ్చిన కాంతిని గమనించవచ్చు.

నిమ్మ, గులాబీ, దోస

నిమ్మ, గులాబీ, దోస ఇవి మీ చర్మం పై టాన్ ను చాలా చక్కగా తొలగిస్తాయి. ఈ మూడింటినీ సమ పాళ్ళల్లో ఒక బౌల్ లో కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకోవాలి. మీ ముఖానికే కాక మీ మెడ వరకూ పెట్టుకోండి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. నిమ్మ రసం సన్ టాన్ ను తొలగిస్తుంది. ఇక రోజ్ వాటర్, దోస చర్మం మృదువుగా మారేలా చేస్తాయి.

తేనె, నిమ్మ ఫేస్ ప్యాక్

తేనె, నిమ్మ ఫేస్ ప్యాక్ మీ చర్మంపై టాన్ తొలగించేందుకు ఉపయోగపడుతుంది. 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి పేస్ట్ గా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకూ వేసుకోవాలి. ప్రత్యేకంగా చర్మం కంది మచ్చలు ఏర్పడిన చోట తప్పకుండా వేసుకోవాలి. 20 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి. నిమ్మ ఒక సహజసిధ్ధ బ్లీచింగ్ అయితే, తేనె చర్మాన్నిమృదువుగా చేస్తుంది. చర్మం చక్కగా ఉండేలా చేస్తుంది.

కొబ్బరి నీళ్ళు

కొబ్బరి నీళ్ళు కేవలం మీ దాహాన్ని తీర్చటమే కాదు మీ ముఖంపై ఉన్న టాన్ మచ్చల్ని తొలగిస్తుంది. మీ చర్మాన్ని సూర్య కాంతి నుంచీ కందిపోకుండా చూస్తుంది. మీరు రోజూ కనక మీ ముఖానికి కొబ్బరి నీళ్ళు రాసుకోవటం వల్ల ఎంతో మంచిది. దీని వల్ల మీరు రోజు రోజుకీ చక్కగా ఫైర్ గా తయారవుతారు.

టొమాటో, నిమ్మ రసం, పెరుగు ఫేస్ ప్యాక్

2 టేబుల్ స్పూన్స్ టొమాటో గుజ్జు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలుపుకోవాలి. వీటిని చక్కగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ చర్మం ఎక్కడైతే బాగా కంది మచ్చలు ఏర్పడ్డాయో అక్కడ రాసుకోండి. 25-30 నిముషాలు ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల మీ చర్మం చక్కగా తయారవ్వటమేకాక మీ చర్మం పిగ్మెంటేషన్ కు గురి కాకుండా చేస్తుంది. ఇంకో ముఖ్య విషయమేమిటంటే దీనిలో టొమాటో ఉండటం వల్ల కాస్త దురద గా అనిపిస్తుంది. కాసేపటికి మామూలు అవుతుంది.

పసుపు, నిమ్మ రసం

4 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ పసుపు ఒక బౌల్ వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై దెబ్బతిన్న ప్రదేశాలపై రాసుకోవాలి. 30 నిముషాలు ఆరాక వాష్ చేసుకోవాలి. మీ చర్మం చక్కగా తెల్లగా చేస్తుంది. నిమ్మ బ్లీచ్ గా ఉపయోగపడితే, పసుపు యాంటీబయటిక్ గా ఉపయోగపడుతుంది.

గింజలు మరియు ఆయిల్స్ మిశ్రమం

4 టెబుల్ స్పూన్స్ నువ్వుల గింజల నూనె, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను కలిపి ముఖానికి రాసుకోవాలి. తర్వాత స్క్రబ్ గా శనగపిండిని వాడాలి. ఇది మీ చర్మంపై అద్భుతాన్నిచేస్తుంది. మృత చర్మాన్ని తొలగిస్తుంది. దీనిని రోజూ వాడితే మీ చర్మం పై చక్కగా పని చేస్తుంది.

బొప్పాయి, పాలు

బొప్పాయి గుజ్జును, పాలు కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై దెబ్బతిన్న ప్రదేశాలలో రాసుకోవాలి. పూర్తిగా ఆరేంత వరకూ ఆగి తర్వాత వాష్ చేసుకుని చూడండి. ఎంతో అద్భుతమైన ఫలితాల్ని చూస్తారు.

బంగాళదుంపల్ని వాడండి

బంగాళాదుంప చర్మంపై చక్కగా పని చేస్తుంది. స్లైసెస్ గా కోసుకుని ముఖంపై రాసుకోవటం వల్ల టాన్ అయిన చోట మళ్ళి చర్మం సరి అవుతుంది. కొద్ది నిముషాలు ఉండి తర్వాత వాష్ చేసుకోండి. తర్వాత మీరే చుసుకోండి తేడాని. మీరు బంగాళాదుంప జ్యూస్ ని కూడా రాసుకోవచ్చు. ఈ రసానికి నిమ్మ రసం కాస్త కలుపుకుని రాసుకుంటే మంచిది. మంచి ఫలితాలుంటాయి.

పాలు, కుంకుమ పువ్వు

ఈ ప్యాక్ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది మెలనిన్ సింథెసిస్ ను తగ్గిస్తుంది. మెలనిన్ సింథెసిస్ వల్ల టాన్ ఎక్కువగా అవుతుంది. 4-5 తంతువుల కేసర్ ను పాలల్లో 30 నిముషాలపాటూ నానపెట్టుకోవాలి. ఈ సొల్యూషన్ ని 5 నిముషాలపాటు ముఖం పై ఉంచుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడుగుకోవాలి.

పాలు, దోస, నిమ్మ

మీకు కనక ఈ సమస్య ఎక్కువగా ఉంటే వీటి వాడకం వల్ల చక్కగా తగ్గిపోతుంది. ఫ్రెష్ దోస జ్యూస్ ను తీసుకుని 1 టేబుల్ స్పూన్ దోస జ్యూస్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పాలు, 3-4 నిమ్మ రసం చుక్కల్ని కలుపుకోవాలి. 5 నిముషాల పాటు ఉంచుకుని తర్వాత చల్లని వాటర్ తో వాష్ చేసుకోవాలి.

ముల్తాని మట్టి, రోజ్ వాటర్

ముల్తాని మట్టి సహజసిధ్ధమైన మూలికలతో నిండి ఉంటుంది. ఇది మీ ముఖం మీద ఉన్న టాన్ ను సమర్ధవంతంగా తొలగిస్తుంది. రోజ్ వాటర్ మీ ముఖం చక్కగా ప్రకాశవంతంగా జీవంతో కూడి ఉండేలా చేస్తుంది. ఒకవేల మీది పొడి చర్మం అయితే మీ చర్మం చక్కగా ఆయిలీ తత్వాన్ని చక్కగా అలవడేలా చేస్తుంది. 3 టేబుల్ స్పూన్స్ ముల్తాని మట్టిని రోజ్ వాటర్ లో నానపెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్నిముఖానికి రాసుకోవాలి. 15 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి. ఇది చక్కని ఫలితాల్ని ఇస్తుంది.

సన్ టాన్ వలన హానికరమైన ప్రభావం

సూర్యరశ్మి ఎక్కువగా మీ శరీరానికి తగలటం, దాని వలన UV కిరణాలు మీ చర్మం మీద పడటం ద్వారా సన్ టాన్ ఏర్పడుతుంది. సన్ టాన్ ఎక్కువగా ముఖానికి, మెడకు, చేతులకు మరియు కాళ్ళకు వస్తుంది. దీనివలన మీ చర్మం మీద మొటిమలు, మచ్చలు, ముడతలు ఏర్పడి అనేక రకముల చర్మ వ్యాధులకు దారి తీస్తుంది. ఇది చివరకు కాన్సర్ కు కారణం అవుతుంది.

మెడ మీద సన్ టాన్ ని తొలగించుట (Telugu tips to remove sun tan from neck)

మీకు నల్లటి మెడ ఉండటం వలన ఇబ్బంది పడుతున్నారా? మెడ మీద నల్ల రంగు రావడానికి గల కారణం సూర్యరశ్మి మరియు కాలుష్యం. సన్ టాన్ ఎక్కువగా బయటకు కనిపించే శరీరం దగ్గర వస్తుంది మొఖము, మెడ, కాళ్లు మరియు చేతులు మొదలగువాటి మీద వస్తుంది. క్రింద మెడ మీద వచ్చే టాన్ ని తొలగించడానికి చిట్కాలు ఇవ్వబడినవి.

దోసకాయ రసం, పసుపు మరియు నిమ్మరసం

ఇది ఒక ప్రత్యేకమైన ప్యాక్ ఎందుకంటే పసుపులో యాంటిసెప్టిక్ లక్షణాలు ఉన్నవి. అలానే దోసకాయలో క్లీనింగ్ ఏజెంట్ మరియు నిమ్మలో సిట్రిక్ ఆసిడ్ గుణములను కలిగి ఉన్నవి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, దోసకాయ రసం మరియు నిమ్మరసం తీసుకొని ప్యాక్ తయారు చేసి, టాన్ ఉన్న మెడకు అప్లై చేయాలి. 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా రోజు చేయడం వలన మంచి ఫలితాన్ని పొందగలరు.

నిమ్మకాయ

నిమ్మకాయ సహజంగా బ్లీచ్ గా పనిచేస్తుంది అలానే దీనిలో కొత్త చర్మ కణాలను ఉత్తేజపరిచే శక్తి ఉంది. నిమ్మకాయ ముక్కతో మెడ మీద రుద్దుతూ ఉండాలి. లేకుంటే నిమ్మరసాన్ని గులాబీ నీటిని కలిపి అప్లై చేయాలి. ఇలా చేయడం వలన మెడ మీద టాన్ తొలగుతుంది. ఇలా రోజూ చేయడం వలన మంచి ఫలితాన్ని పొందగలరు.

కొబ్బరినూనె

మనం మన పూర్వికులు చెప్పే మాటలను పట్టించుకోవడం లేదు, వారు ఆయిల్ని రోజూ జుట్టుకు మరియు తలకు అప్లై చేయమని చెప్తుంటారు. ఈ ఆయిల్ టాన్ ని తొలగించడంలో అలానే చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి చాలా బాగా పని చేస్తుంది. టాన్ స్కిన్ని పోగొట్టడానికి రోజు మెడ మీద కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. సహజంగా వచ్చిన కొబ్బరి నూనెను వాడటం వలన మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు ఎటువంటి ఎలర్జీలు రావు. మీరు రోజు మీ శరీరం మీద కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వలన సన్ టాన్ తగ్గటమే కాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

పంచదార మరియు ఆయిల్

దీనిని మీరు మీ సొంతగా తయారు చేసుకోవచ్చు. చాల సులువైన పదార్ధాలతో దీనిని తయారు చేయవచ్చు. ఒక స్పూన్ పంచదార, 3 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ తీస్కోవాలి, అవసరం అనుకుంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా కలపవచ్చు. దీనిని మీ మెడకు మరియు ముఖానికి చేతులతో అప్లై చేస్తూ మసాజ్ చేయాలి. 2-3 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన టాన్ స్కిన్ పోయి చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది.

Posted on

Homemade skin glowing whitening tips in Telugu – మీ చర్మసౌందర్యానికి గృహ చిట్కాలు

చాలామంది తమ చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేసుకోవాలని తెగ ఆరాటపడతారు..ఇది సహజం..అదీ కాక ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా తమ చర్మ సౌందర్యం పెరగాలని ఆలోచిస్తారు. అయితే మీకు మీ ఇంట్లో మీ బామ్మ చేప్పే చిట్కాల కంటే వేరే వాటికి కూడా వెళ్ళలి అనిపిస్తే..వెళ్ళండి..అదే మన ఆయుర్వేద నిపుణులు గృహ సంబంధ మూలికలు, పదార్ధాలను వాడటం వల్ల ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా మీ చర్మ సౌందర్యం పెరుగుతుందట. కాస్మెటిక్ ఎఫ్ఫెక్ట్స్ అయితే ఎన్నో రకాల సమస్యలొస్తాయి. కానీ ఈ రకమైన సహజసిధ్ధమైనవి వాడటం చర్మానికి కూడా ఎంతో శ్రేయస్కరం. కొన్ని గృహ సంబంధమైన సహజసిధ్ధమైన చిట్కాలను తెలుసుకుందాం.

రసాయనాలకు స్వస్తి పలకండి

తెల్లటి చర్మాన్ని పొందాలని ప్రతి అతివకూ ఉంటుంది. ఎవరికి మాత్రం తెల్లటి చర్మం ఉంటే చక్కగా ఆకర్షించవచ్చని ఎంతో ఆశపడతారు. అయితే మంచి నిగారింపు గల తెల్లటి చర్మం అంత తొందరగా దొరకదు. ఇందుకోసం ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు వెనుకాడరు. అయితే ఖర్చు మాట పక్కన పెడితే రసాయనాల దెబ్బకు మీ చర్మం సహజస్తితిని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే రసాయనాలను వాడటం స్వస్తి పలకండి.

సహజసిధ్ధమైన మూలికల్ని వాడటం

మీకు సహజంగా సూర్యుని తాకిడి వల్ల మీ చర్మం చాలా ఇబ్బందులకు గురి అవుతుంది. అదీకాక ప్రత్యేకంగా ఎండాకాలంలో మరింత వేడి తాకిడికి మీ చర్మం బాగా పాడైపోతుంది. అందుకే చాలా మంది అనేక రకాలైన క్రీముల్ని ఆశ్రయించి రాస్తుంటారు. అదీకాక ఎక్కువగా తూర్పు భాగాన ఎక్కువగా వీటిని  వినియోగిస్తున్నారని తెలుస్తోంది. వీటి వల్ల మీ చర్మం మెలనిన్ కోల్పోతుంది. ఎందుకంటే వీటిలో బ్లీచ్, అలోవెరా ఎక్స్ట్రాక్టులు , నిమ్మ ఎక్స్ట్రాక్టులు ఉండటమే కారణం. ఇందువల్ల మీ చర్మానికి చాలా హాని కలుగుతుంది. అందుకే సహజసిధ్ధ మూలికల్ని, పదార్ధ్ధాలని వాడటం ఎంతైనా మంచిది.

కొన్ని సహజసిధ్ధ గృహ చిట్కాలు మీకోసం

తేనె, ఆల్మండ్

చర్మం నిగారింపుకు తేనె, ఆల్మండ్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇవి చర్మం మిల మిలా మెరిసేలా చేసి జీవం ఉట్టిపడేలా చేస్తాయి. ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పవ్డర్ తీసుకుని, దానికి 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/2 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి చక్కగా పేస్ట్ లా చేసుకుని దానిని ముఖానికి వేసుకోవాలి. ఇలా ముఖానికి చక్కగా 10-15 చక్కగా మర్ధనా చేసుకోవాలి.

టొమోటో, ఓట్మీల్

టొమోటో చర్మ సౌందర్యాన్ని పెంచే ఏజెంట్ గా పని చేస్తుంది. టొమోటోలో ఉన్న సహజ సిధ్ధ ప్రత్యేక లక్షణాలు చక్కటి చర్మాన్ని పొందేలా చేస్తాయి. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఓట్మీల్ ను తీసుకుని తర్వాత ఒక టొమోటో రసాన్ని మాత్రమే వేసి దానిని బాగా కలపాలి. ఓట్మీల్ బాగా మెత్తగా గుజ్జుగా అయ్యేవరకు పేస్ట్ గా చేసుకోవాలి. తర్వాత దానిని ముఖానికి వేసుకోవాలి. 10 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పాలు, నిమ్మ రసం

చర్మం నిగారింపును పెంచటంలో ఈ పధ్ధతి ఎంతో ఉపయోగకరమైనది. ముందుగా 1 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుని దానికి 2 టేబుల్ స్పూన్స్ పాలు, 2-3 చుక్కలు నిమ్మరసాన్ని వేసుకుని పేస్ట్ గా చేసుకుని తర్వాత దానిని ముఖానికి పట్టించుకోవాలి. 15 నిముషాల తర్వాత ముఖాన్ని చక్కగా శుభ్రం  చేసుకోవాలి. ఇలాగే కొన్ని వారాల పాటు చేస్తే మీరే ఫలితాల్ని చూడవచ్చు.

బంగాళాదుంప ముక్కలు

బంగాళా దుంప ముక్కలు స్లైసెస్ గా కోసుకుని వాటిని ముఖానికి పెట్టుకుంటే ఎంతో ఫలితముంటుంది. ఎందుకంటే మీ చర్మంపై ఉన్న డార్క్ సర్కిల్స్ ని తీసివేస్తుంది. బంగాళా దుంపను స్లైసెస్ గా కట్ చేసుకుని ముఖానికి రాస్తూ ఉండాలి. అలా రాస్తూ ఉన్నప్పుడు ఆ రసం చక్కగా ముఖానికి పట్టి ఎండిపోతుంది. అలా ఎండినప్పుడు మల్లీ చక్కటి కాన్తివంతమైన చర్మం వస్తుంది. ఎండిపోయిన తర్వాత ముఖాన్ని చక్కగా వేడి నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీరు ఎన్నో ఫలితాలను పొందుతారు.

పెరుగు

ఇది చక్కటి ప్రాడక్టు. పాలతో తయారైన పదార్ధ్ధం కాబట్టి ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్లను చూపించదు. దీనిని ముఖానికి పెట్టుకుని కాస్సేపు అయ్యక వాష్ చేసుకోవాలి. చక్కటి నిగారింపు, మృదుత్వం మీ ముఖం లో మీరే చూడవచ్చు. అంతేకాక రోజుకు రెండు సార్లు వేసుకుంటే ఎంతో మంచిది.

ఆరెంజ్

ఆరెంజ్ మీ చర్మ సౌందర్యాన్ని ఇనుమడించటంలో మంచి పాత్రని పోషించగలదు. దీనిలో విటమిన్ సి ఉండటం వల్ల మీ చర్మాన్ని చక్కగా మృదువుగా నిగారింపుగా చేస్తుంది. ముందుగా ఆరెంజ్ ని తీసుకుని రసాని తీసి తర్వాత కొంచెం పసుపు వేసుకుని కలపాలి. తర్వాత ముఖానికి వేసుకుని రాత్రంతా ఉంచుకుని పొద్దున్నే వాష్ చేసుకోవాలి. అంతేకాక తొక్కల మిశ్రమాన్ని అంటే పవ్డర్ ని తీసుకుని దానికి పెరుగుని కలుపుకుని దానిని శరీరమంతా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే మీ చర్మం మంచిగా తయారవుతుంది.

అలోవేరా జెల్

అలోవేరా హైపెర్ పిగ్మెంటేషన్ ను పెరిగేలా చేస్తుంది. ముందుగా అలోవేరా ఆకుని తీసుకుని దానిలోని జెల్ ను తీసి దానిని శరీరానికి రాసుకోవాలి. అలా 30 నిముషాల పాటు ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మీ చర్మాని ఆరోగ్యవంతంగా చేస్తుంది.

చర్మానికి బ్లీచింగ్ టిప్స్

ఈ బ్లీచింగ్ ఏజెంట్లు మీ చర్మాన్ని చక్కగా తయారు చేయగలవు. కానీ వీటిని కళ్ళకు తగలకుండా రాసుకోవాలి. అంతేకాక వీటిని తగినంతా మోతాదులోనే వాడుకోవాలి. అధిక మోతాదులో వాడటం వల్ల మీ చర్మం బర్న్ అయ్యే ప్రమాదముంది. అంతేకాక వీటిని అప్లై చేసెప్పుడు చక్కటి సన్ స్క్రీన్ లోషన్ ను మాత్రం ఎంచుకోవాలి.

కొన్ని సహజ సిధ్ధ బ్లీచింగ్ ఏజెంట్లు ఏవంటే

దోస మరియు నిమ్మ

దోస మరియు నిమ్మ చర్మ సౌందర్యం ఇనుమడించేందుకు చాలా చక్కగా పనిచేస్తాయి. దోసకాయి గుజ్జుని తీసుకుని 2 టేబుల్ స్పూన్ తీసుకుని దానికి 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసాని వేసి కలుపుకుని దానిని చర్మానికి రాసుకోవాలి. ఇందువల్ల నల్లగా మారిన మీ చర్మం ఎర్ర రంగులోనికి వస్తుంది.

టొమోటో మరియు గంధం పొడి

ముందుగా మీరు 1 టేబుల్ స్పూన్ గంధం పొడి ని తీసుకుని దానికి దోస రసాన్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ టొమోటో జ్యూస్ ను అలాగే నిమ్మ రసాన్ని వేసుకోవాలి. తర్వాత ముఖానికి వేసుకోవాలి. మీ చర్మం ఎక్కడైతే నల్లగా అవుతోందో అక్కడ చక్కగా వేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు వేసుకుంటే చాలా ఉపయోగం.

పాలు మరియు ఆరెంజ్ తొక్కలు

ముందుగా ఆరెంజ్ తొక్కల్ని తీసుకుని తర్వాత వాటిని ఎండలో 3-4 రోజుల పాటు ఎండబెట్టాలి. తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పవ్డర్ ను తీసుకుని ఒక బౌల్ లోనికి వేసుకోవాలి. దానికి కొంచెం పాలు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకోవాలి. ఇలా 15 నిముషాల పాటు ఉంచుకుని తర్వాతా వాష్ చేసుకోవాలి. ఇది చక్కగా పని చేస్తుంది, మీ చర్మం చక్కగా మారుతుంది.

పైనాపిల్ మరియు పాలు

పైనాపిల్ ముక్కలుగా కోసుకుని తర్వాత దానిని గుజ్జుగా చేసుకుని తర్వాత గ్రైండ్ చేసుకుని జ్యూస్ గా చేసుకోవాలి. దీనికి కొంచేం పాలని వేసుకుని తర్వాత బాగుగా కలుపుకుని తర్వాత ముఖానికి వేసుకోవాలి. తర్వత 10 నిముషాలకు వాష్ చేసుకోవాలి.

ఆల్మండ్ మరియు తేనె

ఆల్మండ్ గింజల్ని రాత్రంతా నానపెట్టుకోవాలి. తర్వాత వాటిని తేనె తో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి వేసుకోవాలి. తర్వాత కాసేపటికి వాష్ చేసుకోవాలి.

సహజసిధ్ధమైన బ్లీచ్ వల్ల ఉపయోగాలు

మీ చర్మం చక్కగా మారాలంటే సహజసిధ్ధమైన బ్లీచ్ లను వాడటం ఎంతో మంచిది. వీటి వల్ల ఏ రకమైన సైడ్ ఎఫ్ఫెక్ట్లు ఉండవు. అంతేకాక మార్కెట్లో దొరికే ప్రాడక్ట్ల వల్ల మీ చర్మమే కాక మీ జేబుకూ భారమే . కాబట్టి చాలా వరకూ సహజసిధ్ధమైన వాటిల్ని వాడటం వల్ల ఏ ఇబ్బందులూ రావు. దీనికి తోడు సూర్యుని వేడిమిని నుంచీ జాగ్రత్తలు వహించాలి. ఎక్కువగా మంచి నీటిని తీసుకోవాలి. ఆహార నియమాలలో భాగంగా ఎక్కువగా ఫ్రూట్స్ తినటం వల్ల మీ చర్మం మంచి నిగారింపుగా తయారవుతుంది.

దీర్ఘకాలిక చర్మ సౌందర్యానికి కొన్ని గృహ చిట్కాలు

పాలు మరియు తేనె ఫేస్ప్యాక్

మీ చర్మం నల్లగా మరి ఉంటే దానిని తొలగించటంలోనూ, అలాగే చర్మం చక్కటి నిగారింపుకూ ఈ ప్యాక్ చక్కగా ఉంటుంది. ఈ మిశ్రమం చక్కగా పని చేసి చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. దీనికి గానూ 1 టేబుల్ స్పూన్ పాలు అలాగే దీనికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ఒక మిశ్రమంగా చేసి ఫేస్ కి వేసుకోవాలి. తర్వాత 2 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.

అరటి మరియు ఆల్మండ్ ఆయిల్ ప్యాక్

అరటిపండులో విటమిన్ బి-6, విటమిన్-సి ఉండటం వల్ల ఇది చాలా చక్కగా పని చేస్తుంది. అంతెకాక దీనిలో ఉన్న సహజ సిధ్ధమైన లక్షణాలు చర్మ సౌందర్యాన్ని పెంచేలా చేస్తాయి. అంతేకాక ఆల్మండ్ ఆయిల్ చక్కగా ముఖాన్ని ఆరోగ్యవంతంగా పనిచేసేలా చేస్తుంది. దీనిలో యాంటీ ఇంఫ్లామాటరి ప్రాపెర్టీస్ ఉండటం వల్ల చర్మాన్ని పరిరక్షిస్తుంది. ఒక అరటిపండును తీసుకుని గుజ్జుగా చేసి దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ను కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది చక్కగా పని చేస్తుంది.

శనగపిండి మరియు పసుపు

శనగపిండి చర్మంపై ఉన్న నల్ల మచ్చల్ని తొలగించటంలో ప్రధాన పాత్రని పోషిస్తుంది. అలాగే పసుపు కూడా చాలా రకాల గుణాల్ని కలిగి ఉండటమే కాక ఇది మంచి యాంటీ సెప్టిక్ గా కూడా పనిచేస్తుంది. పసుపు మన కిచెన్ లో అదీ ప్రతీ రెసిపీలో వాడేదే. హిందూ వివాహాలలో, వేడుకల్లో దీనిని బాగా వాడతారు. పెళ్ళిళ్ళలో దీనిని శరీరానికి రాస్తారు. ఎందుకంటే చర్మం పై ఉన్న చెడు ప్రభావాన్ని ఇది ఇట్టే పోగొడుతుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకోవాలి. ఇది చక్కటి చర్మం పొందేలా చేస్తుంది.

క్రీం మరియు వాల్నట్ ఫేస్ప్యాక్

వాల్నట్లో విటమిన్ బి,విటమిని సి అలాగే యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటుంది. ఇది చర్మంపై చక్కగా పనిచేస్తుంది. వాల్నట్ మరియు క్రీం తీసుకుని ఫేస్ప్యాక్ గా చేసుకుని ముఖానికి వేసుకుంటే మంచిది. 4-5 వాల్నుట్స్ తీసుకుని వాటితో పాటు ఒక టేబుల్ స్పూన్ క్రీం ను కలిపి ఫేస్ప్యాక్ గా వేసుకుంటే మంచి ఫలితాలొస్తాయి.

బొప్పాయి

బొప్పాయి ఫేస్ప్యాక్ అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే బొప్పాయిలో ఉన్న సహజసిధ్ధ గుణాలు ఎన్నో..బొప్పాయి చర్మం లోని మృత కణాల్ని తీసివేస్తుంది. చర్మం మరింత జీవం గా కనిపించేలా చేస్తుంది. దీనిలో విటమిన్ ఏ, విటమిన్-సి, విటమిన్-ఇ ఉండటం వల్ల చక్కగా పనిచేస్తుంది. ఒక బొప్పాయిని తీసుకుని గుజ్జుగా చేసి దానికి తేనె కలుపుకుని దానిని ఫేస్ప్యాక్ గా పెట్టుకుంటే ఎంతో మంచిది. దీనిని మీ ముఖం నుంచీ మెడ వరకూ పెట్టుకోవాలి. దీనిని 20 నిముషాల పాటూ ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.

చమోమిలే టీ ఫేస్ప్యాక్

చమోమిలే చాలా చక్కటి రెమెడీ. దీనిని 1 టేబుల్ స్పూన్ తీసుకుని, ఒక 2 చుక్కలు ఆల్మండ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ ఓట్మీల్, 2 టేబుల్ స్పూన్స్ తేనె వెసుకుని ఒక కంటేనర్ లో కలిపి ముఖానికి పెట్టుకోవాలి. ఇలా చేస్తే మంచి నిగారింపు,జీవం ఉట్టిపడుతుంది.

పుచ్చకాయి మరియు దోస

పుచ్చకాయ జ్యూస్ 2 టేబుల్ స్పూన్స్, దోస,పెరుగు-1 టేబుల్ స్పూన్, మిల్క్ పవ్డర్- 1 టేబుల్ స్పూన్ వేసి చక్కగా పేస్ట్ చేసుకుని ముఖానికి వేసుకోవాలి. పుచ, దోస రెండిటిలో చాలా రకాలైన మంచి గుణాలున్నాయి. ఇవి చక్కటి చర్మాని పొందేలా చేస్తాయి.

సంఫ్లవర్ ప్యాక్

సంఫ్లవర్ లేదా చిరొంగి. దీనిని ఫేస్ప్యాక్ గా చేసుకోవాలంటే రెండు కావాలి. అవేంటంటే ఒకటి సగం కప్పు పాలు, రెండవది సంఫ్లవర్ గింజలు, వీటిని రాత్రి అంతా నానపెట్టి ప్రొద్దున్నే పేస్ట్ గా చేసుకుని ముఖానికి వేసుకోవాలి. 5 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.

బియ్యం తో ప్యాక్

ఏంటీ రైస్ తో ఫేస్ ప్యాకా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..దీనికి ముందుగా 2 స్పూన్స్ రైస్ ను పాలల్లో నానపెట్టాలి. దీనికి మాత్రం తాజా పాలు మాత్రమే అదీ 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో మరలా 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసుకుని పేస్ట్గా చేసుకోవాలి. తర్వాత దానికి కాస్త నిమ్మరసాన్ని వేసుకోవాలి. ముఖానికి వేసుకోవాలి.

జాస్మిన్ ఫ్లవర్ ఫేస్ ప్యాక్

మీరు ఈ ఫేస్ ప్యాక్ చేసుకోవాలంటే ముందు ఒక జాస్మిన్ ఫ్లవర్ ను తీసుకుని దానిని గుజ్జుగా చేసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ పంచదార, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కలిపి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దానిని ముఖానికి వేసుకోవాలి. 15 నిముషాల పాటు ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.

Posted on

How to moisture skin winter in Telugu – పొడి చర్మానికి గృహసహజసిధ్ధ ఫేస్ప్యాక్స్

చలి కాలం వచ్చిందంటే చర్మం పొడి ఆరిపోయి తెల్లతెల్లగా ఇబ్బందిగా కనపడుతుంది. గాలిలో తేమలేకపోవడం వల్ల,వాతావరణ ప్రభావం వల్ల ముఖంలో తేమ శాతం తగ్గిపోతుంది. దీనితో చర్మం పొడిగా మారుతుంది. చర్మంలో ఉత్పత్తి అయ్యే సహజమైన ఆయిల్ చర్మాన్ని తేమగా ఉంచడానికి తగినంత సరిపోవు. దీంటో చలి వాతావరణం వల్ల చర్మం మీద ప్రభావాన్ని చూపుతుంది.

చలి కాలంలో మృత చర్మం తొలగించే సాధారణ చిట్కాలు

మృత చర్మం చలికాలంలో ఏర్పడుతుంది. ఈ సమస్య వల్ల చాలా మంది పొడి చర్మం సమస్యతో బాధపడుతుంటారు . పొడి చర్మం వల్ల చర్మంపై రాషెస్ మరియు చర్మ పగుళ్లు ఏర్పడుతాయి. దీని వల్ల బధపడకుండా, ఏజింగ్ వల్ల మరియు చలికాలంలో చలికి పొడి స్కిన్ వల్ల చర్మంలో వచ్చే చర్మ సమస్యలు, ముడుతలను నివారించడానికి వివిధ రకాల ఫేస్ మాస్కులు అందుబాటులో ఉన్నాయి.
పొడి చర్మం వల్ల బాధపడేవారికోసం మేం కొన్ని ఫేస్ప్యాక్లను అందిస్తున్నం.

గృహ సంబంధ సహజసిద్ధ ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ మాస్క్ లు చర్మాన్ని మృదువుగా మరియు ప్రకాశవంతంగా మరియు తాజగా ఉంచుతాయి . ఈ ఫేస్ మాస్క్ లను ఇంట్లో తయారుచేయడం చాలా సులభం మరియు వీటిని రెగ్యులర్ గా వాడటం వల్ల కొన్ని వారాల్లోనూ మెరిసేటి చర్మ కాంతిని పొందవచ్చు . చలికాలంలో పొడి చర్మం , ముడుతలను మాయం చేసే గృహ సంబంధ సహజసిద్ధ ఫేస్ ప్యాక్ చూద్దామా..

యాంటీఆక్సిడెంట్ మాస్క్

ఈ ఫేస్ మాస్క్ వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాక అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది . 1/2బొప్పాయి, 1/4చెంచా నిమ్మరసం, 1/2చెంచా తేనె గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ ఫేస్ మాస్క్ ను ముఖం మెడకు పట్టించిన తర్వాత 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కీరదోసకాయ మరియు పెరుగు ఫేస్ మాస్క్

తొక్క తీసిన కీరదోసకాయను మెత్తగా గ్రైండ్ చేసి అందులో 1చెంచా పెరుగు మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10-15నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అవొకాడో, తేనె మాస్క్

ఒక అవొకాడో పండులోని సగాన్ని మెత్తగా మ్యాష్ చేసి, ఈ పేస్ట్ కు 2 చెంచాల తేనె, మరియు అరచెంచా కొబ్బరి నూనె మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 5నిముషాలు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఓట్ మీల్ మరియు పెరుగు మాస్క్

ఇది చర్మాన్ని మృదువుగా మార్చి మొటిమలు, మచ్చలను మాయం చేస్తుంది . ఇది ముడతలను కూడా నివారిస్తుంది . 2 చెంచాల ప్లెయిన్ పెరుగు, 1 చెంచా తేనె, 1/3 కప్పు ఓట్ మీల్ పౌడర్, 1/2 హాట్ వాటర్ మిక్స్ చేసి మెత్తగా చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్ట్రాబెర్రీ మరియు లెమన్ ఫేస్ మాస్క్

అరకప్పు స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి అందులో 1 చెంచా తేనె, ఒక చెంచా పెరుగు, 2చెంచాలా లెమన్ జ్యూస్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేసి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పాల క్రీమ్ మరియు తేనె

పొడి అలాగే గరుకు చర్మం ఉన్నవారు ప్రధానంగా చలికాలంలో ఈ ఫేస్ మాస్క్ మీ చర్మానికి బాగా ఉపయోగపడుతుంది . ఒక చెంచా పాలమీగడలో మరియు 1 చెంచా తేనె మిక్స్ చేసి, దీన్ని ముఖానికి అప్లై చేసి 20నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు గ్రీన్ టీ మాస్క్

3 చెంచాల గ్రీన్ టీ లో 1 చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్, 2 చెంచాలు పెరుగు, 1 చెంచా ఓట్ మీల్ పౌడర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

Posted on

Telugu remedies to remove the acne scars – మొటిమ మచ్చలు తొలగించుకునేందుకు గృహ చిట్కాలు

సాధారణంగా మొటిమలు ముఖం మీద మెడ, వీపుపై, భుజాలపై వస్తాయి. మొటిమలు అనేవి మన చర్మం పై చీముతో కూడిన వాపు వలే వస్తాయి. ఖచ్చితంగా చెప్పలంటే ఈ సమస్యకు కారణం అధికంగా శ్లేషపటలము క్షయము కలిసిన మిశ్రమము స్రావంగా సెబాషియస్ గ్రంధుల వల్ల ఈ విధంగా చర్మం పై వస్తాయి. ఇది అంతా పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ ఆకర్షణారహితంగా కనిపించటం ఒక్కటే ఇబ్బందికర విషయం. మొటిమలు సాధారణంగా ఒక లేత గులాబీ రంగులోనూ మచ్చతిత్తి వలే కనిపిస్తాయి.

కొందరిలో మాత్రం తీవ్రంగా ఈ సమస్య ఉంటే అవి మాత్రం తెల్లటి చీము స్రావం వాటి ద్వార కారటం కూడా చూస్తాం. సాధారణంగా మొటిమలు కొన్ని రోజులకే ఎండిపోయి తగ్గిపోతాయి కానీ ఆ మొటిమలకు సంబంధించినా ఆ మచ్చలు మాత్రం మాత్రం పోవు. కానీ  వాటిని తొలగించుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మచ్చల్ని తొలగించుకునేందుకు ఈ రోజు మార్కెట్లో చాలా క్రీములు వచ్చాయి. కానీ ఏ ఇబ్బంది లేకుండా సైడ్ ఎఫ్ఫెక్ట్లు లేకుండా త్వరగా తగ్గలంటే కొన్ని గృహ చిట్కాలున్నాయి. ఇవి చాలా చక్కగా పని చేస్తాయి.

ఇవి తొలగించుకునేందుకు గృహ చిట్కాలు

సాధారణంగా మొటిమల మచ్చలను తొలగించుకునేందుకు బయట దొరికే కాస్మెటిక్స్ అలాగే వివిధ రకాల ప్రాడక్ట్స్ వెతికి మరీ వాడతారు. అయితే ఇవి చర్మంపై ఎలాగ పనిచేస్తాయో మాత్రం చెప్పటం మాత్రం కష్టం. అదీ టీనేజర్లపై ఎలాంటి ప్రభావముంటుందో చెప్పటం కష్టం ఎందుకంటే వీరిది చర్మం లేతగా ఉండటం కూడా ఓ కారణం. ఇలాంటి సమస్యలు తలెత్తటం అనేది సహజం. అందుకే మంచి గృహ చిట్కాలను అవలంభించటం మంచిది.  

సుగర్ స్క్రబ్

మొఖంపై మొటిమల మచ్చలు తొలగించుకునేందుకు సుగర్ స్క్రబ్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది చర్మం మెరుగుగా మృదువుగా ఉండేలా చేస్తుంది. 3 టీస్పూన్లు పంచదార, 1 టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ తేనె ను తీసుకుని ఆ మిశ్రమాన్ని తీసుకుని చక్కగా ముఖానికి పట్టించుకుని 15 నిముషాల తర్వాత శుబ్రంగా కడుగుకుంటే చాలు.

గుడ్డు

గుడ్డులో చాలా రకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయ్. అందుచేత గుడ్డు తెల్ల సొన చాలా అద్భుతంగా మొటిమల మచ్చలపై పని చేస్తుంది. ఒక గుడ్డును తీసుకుని దాన్ని పగల కొట్టి దానిలో నుంచీ తెల్ల సొనను వేరు చేయాలి. దానిని రాసుకోవటం వల్ల చాలా చక్కగా మచ్చలు పోతాయి. అంతేకాక గుడ్డు చర్మం లోనీ సెల్స్ లోకి వెల్లి మరీ పనిచేసి మచ్చల్ని పోగొడుతుంది.  

వంటసోడ

వంటసోడ మొటిమమచ్చలు తొలగించేందుకు చాలా దోహదపడుతోంది. 1 టేబుల్ స్పూన్ వంటసోడ తీసుకుని  అందులో కొన్ని చుక్కలు నీరు కలిపి రాసుకుంటే చక్కగా మచ్చలు పోతాయి. ఈ మిశ్రమం చర్మం లోలోపలి వరకూ పని చేస్తుంది. ఈ పేస్ట్ ని కనీసం 5 నిముషాలు ఉంచిన తర్వాత చల్లని నీటితో కడుగుకోవాలి.

టొమొటొ

టొమొటొ విటమిన్ ఏ, లైకొపిన్ లను కలిగి ఉంటుంది. దీనివల్ల చర్మం మృదువుగా ఉంటుంది. విటమిన్ ఏ చర్మాన్ని అరోగ్యంగా తయారు చేయటమేకాక మచ్చలను తెలగించేందుకు సాయపడుతుంది. టొమోటో ని తీసుకుని ఆ గుజ్జుని చర్మంపై రాసి 20 నిముషాలు అయ్యాక కడుగుకోవాలి. అంతేకాక టొమోటో తోపాటు అవకాడోలు లేదా దోసకాయను కూడ కులుపుకుని రాసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. అరగంటపాటు ఉంచుకుని తర్వాత చల్లని నీటితో కడుగుకోవాలి. ఇలా ప్రతి రెండు రోజులూ వేసుకోవాలి. ప్రతి వారానికి ఇకా రెండు రోజులు వేసుకుంటే మీరే ఆ తేడాని గమనించవచ్చు. ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది. 

అలోవేరా, పసుపు

అలోవేరా చాలా పోషకాలు, ఎంజైములు పాలీసాకరైడ్స్ కలిగి ఉంటుంది. ఇది యంటీ ఫంగల్, యాంటీబ్యాక్టీరియా గా చర్మంపై పనిచేసి చర్మాన్ని జీవం గా ఉంచటమే కాక చర్మ మృదుత్వాన్ని అలాగే నిలుపుతుంది. ఇక పసుపు ఓ మంచి సహజ ఓషధం. ఇది వ్యతిరేకసోధ గుణాన్ని కలిగి ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే దానిలో అలోవేరా గుజ్జును కలుపుకుని పేస్ట్ లా తయారు చేసుకుని వేసుకోవాలి. 

టీ ట్రీ ఆయిల్

తేయాకు నూనె యాంటి బ్యాక్టీరియా గానే కాక మచ్చల్ని తొలగిస్తుంది. తేయాకు నూనె ను 2-3 చుక్కలు మమ్ములు నూనెతో కలిపి దానిని ఆయా ప్రదేశాలలో రాసుకోవాలి. కొన్ని గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత పల్చటి దూదితో చక్కగా శుభ్రపరచుకోవాలి.

నిమ్మ

నుమ్మ ఓ మంచి యాంటిసెప్టిక్. నిమ్మ మొటిమ మచ్చలపై చాల ప్రభావవంతం గా పని చేస్తుంది. నిమ్మలో విటమిన్ ఛ్ ఉంటుంది. ఈ విటమిన్ చర్మ సౌదర్యాన్ని చాలా ఇనుమడింపచేస్తుంది. ఒక నిమ్మకాయను సగానికి కోసి సగం చెక్కను పిండి తర్వాత దానికి రెండింతలు ఎక్కువ గ్లిసరిన్ వేసి మిశ్రమంగా చేసుకుని రాసుకోవాలి. 10 నిముషాల తర్వాత కడుగుకోవాలి.ఇలా రెండ్రోజులకొకసారి చేయటం వల్ల చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది.

Posted on

How to remove the skin warts in Telugu – చిన్నపిల్లల్లో పులిపిరుల సమస్యా?

చాలామంది పిల్లలకి పులిపిరి కాయల సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఈ సమస్య ఎందుకు తలెత్తుతుందో తెలియని పరిస్తితి ఉంటుంది. పులిపిరులు ఎందుకు వస్తాయి? వాటిని నివారించుకోవటం ఎలా అని చాలా సతమతమవుతుంటారు. ఏదిఏమైనా వాటి రాకకు మాత్రం కారణాలు ఉండవు. చర్మంపై వచ్చి కాస్త ఇబ్బందిని కలిగిస్తూ నానాటికి వ్యాప్తి చెందే పులిపిరుల గురించి అవగాహన ఎంతైనా అవసరం. అవి ఎందుకు వస్తాయో తెలుసుకుందామా..

ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి.  ముఖ్యంగా రెండు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో దీన్ని చాలా ఎక్కువగా చూస్తుంటాం.

ఈ వ్యాధి వ్యాప్తి జరిగే తీరు :

1. చర్మానికి చర్మం తగలడం వల్ల, తువ్వాళ్ల వంటి వాటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల నుంచి వాళ్లకే వ్యాపించడం కూడా ఉంటుంది. దీన్నే సెల్ఫ్  ఇనాక్యులేషన్ అంటారు.

2. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ  లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే… బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు.

చికిత్స విధానం :

1. ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయించుకోవచ్చు.

2. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్ మెడిసిన్స్‌తోనూ వీటికి చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు ఇమిక్యుమాడ్ అనే క్రీమ్‌ను లీజన్స్ ఉన్న ప్రాంతంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.

3. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్ వాడటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి చికిత్సను కొనసాగించండి.