Posted on

Telugu tips for skin care – చర్మ పరిరక్షణకు..

ప్రస్తుతం చిన్నవారి నుంచీ పెద్దల వరకు అందరూ డై వేసుకుంటున్నారు. అది తెల్ల జుట్టు అవుతుందని కావచ్చు. లేదా మరి వేరే స్టైల్ కోసం కావచ్చు. ఏది ఏమైనా డై వాడటం మాత్రం సహజమైపోయింది. చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్‌డై) వేసుకుంటూ ఉంటారు. కాని సరైన జాగ్రత్తలు పాటించ కపోతే చర్మసమస్యలు ఎదురవ్వవచ్చు.

అందుకని…చర్మ సమస్యలు రాకుండా ఉందేదుకు కొన్ని చిట్కాలను మీకందిస్తున్నాం.

1. జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు.

2. ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్ లేదా నూనె రాసుకొని తర్వాత డై వేసుకోవాలి.

3. తలంటుకునేటప్పుడు కూడా డై చర్మానికి తగలకుండా జాగ్రత్తపడాలి.

4. డై ఎంపికలో నాణ్యత విషయంలో రాజీ పడకూడదు.

5. జుట్టు మంచి స్మెల్ రావాలంటే హెయిర్ సీరమ్ లేదా హెయిర్ స్ప్రేలను వాడాలి. అయితే ఈ సీరమ్స్, స్ప్రేలు మాడుకు, జుట్టు కుదుళ్లకు తగలకుండా జాగ్రత్తపడాలి. లేదంటే వీటిలో ఉండే గాఢ రసాయనాలు వెంట్రుక కుదురును దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి.

అతి మృదువైన చర్మం ముఖం మీద ఉంటుంది. ముఖానికి ఆవిరి ఎంత సేపు పెట్టుకోవాలో తెలియాలి. ఆవిరి పెట్టడం మంచిదని చాలామంది ఎక్కువసేపు పదుతుంటారు.ఇద్ ప్రమాదమే. ఈ సమస్య నుంచీ అధిగమించటం కోసం ఆవిరి ఎంతసేపు పెట్టుకోవాలో తెలుసుకోవాలి.

1. బ్యూటీపార్లర్‌లలో ఫేసియల్ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో ముందు తెలుసుకుంటే మనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి.

2. ముఖచర్మానికి దగ్గరగా ఆవిరి వేడి తగలకూడదు. షవర్ బాత్ చేసేటప్పుడు నీరు ఎంత దూరం నుంచి పడుతున్నాయో అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి. లేదంటే చర్మం తన సహజత్వాన్ని కోల్పోవడానికి ఆవిరి ప్రధాన కారణం అవుతుంది.

3. ఐదు నిమిషాలకుమ ఇంచి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలను ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంధులు పొడిబారుతాయి. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది.

4. ఆవిరి పట్టిన తర్వాత క్లెన్సర్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల పోర్స్‌లో ఉన్న మలినాలు తొలగిపోతాయి.

5. ఆవిరిపట్టడం అనేది సున్నితమైన ప్రక్రియ. చర్మతత్వం తెలుసుకుని, దానికి తగిన విధంగా ట్రీట్‌మెంట్ ఇచ్చే నిపుణుల చేతనే ఫేసియల్ చేయించుకోవడం, స్టీమ్ పట్టడం చేయడం మేలు.

6. పొడిగా ఉన్న మెత్తని టవల్‌తో తర్వాత ముఖాన్ని తుడుచుకోవాలి. ఆవిరిపట్టిన తర్వాత కొంతమంది చర్మం మరీ పొడిబారినట్టుగా అనిపిస్తుంది. అందుకని ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి.

Posted on

How to get the beautiful skin at home in Telugu – చక్కని చర్మం పొందాలంటే

ఎంత చక్కటి కనుముక్కు తీరు ఉన్నా మచ్చలు, మెుటిమలు గల చర్మం ఉంటే వారి అందం కొంచెం మసకబారినట్టే ఉంటుంది. ఆరోగ్యవంతమైన చర్మం అందంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుేక ముఖ చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యవంతంగా కాపాడుకోవాలి. మెటిమలకు కారణమైన బ్లాక్‌హెడ్స్ వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీకు అందమైన చర్మం కావాలంటే కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. అవెంటో చూసేద్దమా..

1. మేకప్‌ వేసుకునే అలవాటు ఉన్న వారు జిడ్డుగా ఉండే కాస్మొటిక్స్‌ను దూరంగా ఉంచడం మంచిది.

2. జిడ్డుగా ఉండే కాస్మొటిక్స్‌ చర్మ రంధ్రాలలో చిక్కుకుని బ్లాక్‌హెడ్స్‌ అనంతరం మొటిమలు రావడానికి కారణమవుతుంది.

3. ఒకవేళ జిడ్డు చర్మం ఉన్నట్టు అయితే సున్నితమైన క్లెన్సర్‌ను ఉపయోగించడం మంచిది.

4. పదే పదే సబ్బును ఉపయోగించి ముఖం కడగడం కన్నా క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుని నీళ్ళతో కడిగేసుకుంటే ముఖం శుభ్రంగా ఉంటుంది. పదే పదే సబ్బును ఉపయోగిస్తే చర్మ కణాలు పాడయ్యే అవకాశముంటుంది.

5. మృత చర్మ కణాలను తొలగించేందుకు ఎక్స్‌ఫోలియేషన్‌ మంచిది. చర్మ రంధ్రాలలో వృద్ధి చెందే మృతకణాలను ఎక్స్‌ఫోలియేట్‌ చేయ డం ద్వారా తొలగిస్తే బ్లాక్‌హెడ్స్‌ సమస్య చాలా వరకూ తీరిపోతుంది.

6. బాగా జిడ్డు చర్మం ఉన్నవారు ఆ జిడ్డును తొలగించుకునేందుకు క్లే మాస్క్‌ ఉపయోగించడం మంచిది. పుదీనా, పిప్పర్‌మెంట్‌ లేదా చికాకు చేసే పదార్ధాలు లేని క్లే మాస్క్‌ను వాడడం మంచిది.

7. నిమ్మరసం, బాదం నూనె, గ్లిసరిన్‌ను సమపాళ్ళలో కలిపి ముఖానికి పట్టించుకోవాలి. ఇది బ్లాక్‌హెడ్స్‌ తగ్గేందుకు ఉపకరించడమే కాక ముఖంపై ఉండే ఇతర మచ్చలను కూడా తగ్గిస్తుంది.

8. ప్రతిరోజూ సాయంత్రం గోరువెచ్చటి నీళ్ళలో ముంచిన బట్టతో ముఖాన్ని తుడుచుకోవడం ఎంతో మంచిది. గోరువెచ్చటి నీళ్ళలో టవల్‌ లేదా నాప్కిన్‌ను ముంచి దానిని పావుగంట పాటు ముఖం మీద ఉంచుకోవడం ద్వారా చర్మ రంధ్రాలలో చిక్కుకుపోయిన మురికి, మృతకణాలు వంటివి బయటకు వచ్చేస్తాయి. అనంతరం ఆ నాప్కిన్‌ను వేడి నీటిలో ఉతకడం మరువకండి.

9. బ్లాక్‌హెడ్స్‌ ఎక్కువగా ఉంటే కొంచెం తేనె తీసుకుని దానిని వేడి చేసి అవి ఉన్న ప్రాంతంలో రాసి పది నిమిషాల తర్వాత కడిగి వేయాలి. ఇది సహజమైన పీల్‌లా ఉపయోగపడి బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోయేందుకు దోహదం చేస్తుంది.

Posted on

Telugu home remedies for skin problems – చర్మ రోగాలకు సహజసిద్ధమైన నివారణ

మన శరీరంలో అత్యంత పెద్ద అంగం చర్మం. ఏ అంగానికి వ్యాధులు ఏర్పడినా కాస్త త్వరగా తగ్గుతాయేమోగాని చర్మానికి వ్యాధులోస్తే ఆట్టే తగ్గనే తగ్గవు. అయితే చర్మ వ్యాధుల బారిన పడినప్పుడు వాటిని తగ్గించుకునే దిశగా కొన్ని సహజసిధ్ధమైన నివారణా మార్గాలున్నాయి. అవేంటో చూద్దామా..

1. మినుములు చర్మానికి మంచి ఔషధంగా పని చేస్తాయి. మినుములను నీటితో నూరి పట్టిస్తుంటే క్రమంగా తెల్లబోల్లి మచ్చలు పోతాయి.

2. కిరోసినాయిల్ చర్మ వ్యాధులకు మచి మందు. ఎంటి కిరోసినాయిలా అనుకుంటున్నారా.. అవును ఇది చర్మంపైన కిరోసినాయిల్ మాటిమాటికీ రాస్తే గజ్జి, తామర వంటి చర్మరోగాలు హరించిపోతాయి.

3. తులసి ఆకు ఒక సహజసిధ్ధమైన మంచి ఔషధం. తులశాకు రసంలో హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి శోభిమచ్చలపై రుద్ది ఆరినతరువాత స్నానం చేస్తుంటే శోభి త్వరగా తగ్గుతుంది.

4. స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా ఉప్పు, నిమ్మ పండు రసం కలిపి స్నానం చేస్తుంటే దురదలు, దద్దుర్లు హరించి శరీరం కాంతివంతంగా మారుతుంది.

5. తులసి, నిమ్మరసం కలిపి నూరి పట్టిస్తుంటే గజ్జి, తామర, దురద, దద్దుర్లు త్వరగా హరించిపోతాయి.

6. తెల్ల గన్నేరు ఆకులు నూరి తెల్ల మచ్చల మీద లేపనం చేయాలి. అతి త్వరగా మచ్చలు పోతాయి.

7. జిల్లేడు పాలు, ఆముదం సమంగా కలిపి రుద్దుతూ వుంటే కాలి ఆనెకాయలు హరించిపోతాయి.

8. తేనె 5 గ్రాములు. నెయ్యి 8 గ్రాములు కలిపి పూస్తుంటే తీవ్రమైన వ్రణాలు కూడా తగ్గిపోతాయి.

9. వామును నిప్పులపై వేసి ఆ పొగను వంటికి తగిలే్టట్లు చేస్తే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి.

10. పసుపుపొడి 3 గ్రాములు, ఉసిరిక పొడి 6 గ్రాములు కలిపి మంచినీటీతో సేవిస్తుంటే రక్తశుద్ధి, చర్మశుద్ధి. మారేడు ఆకు ముద్దగా నూరి కడుతుంటే శరీ్రంలో ఇరుక్కున్న ముళ్ళు, మేకులు బయటకొస్తాయి.

11. తెల్లని శోభి మచ్చలతో బాధపడేవారు తులసి ఆకులు, హారతి కర్పూరం కలిపి మెత్తగానూరి నిద్రించేముందు శోభి మచ్చలపైన పట్టించి ఉదయం స్నానం చేసేటప్పుడు కడుగుతుండాలి. రోజూ క్రమం తప్పకుండా రెండు మూడు వారాలు ఈ విధానాన్ని ఆచరిస్తే శోభిమచ్చలు శరీరంలో కలిసిపోతాయి.

Posted on

Best winter skin care tips in Telugu – శీతాకాలంలో చర్మానికి తీసుకోవలసిన జాగ్రత్తలు

శీతాకాలం వచ్చిందంటే చాలు చర్మం తెల్లగా పొడిబారిపోతుంది. అంతేకాక చాలా అసహనానికి గురిచేస్తుంది. శీతాకాలంలో చర్మాన్ని పర్యవేక్షించుకోవటం చాలా కష్టమైన విషయమే. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదో ఒక చోట లోటు ఏర్పడటం మాత్రం సహజమే. ఈ శీతాకాలలో చర్మం పడే ఇబ్బంది నుండీ కాపాడుకునేందుకు మీ కోసం కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. అవేంటో చూద్దామా..!

1. ఏదైనా బేబీ పౌడర్ లు వాడడం మంచిది . నువ్వుల నూనె చలికాలం లో చక్క గా పనిచాస్తుంది . శరీరానికి నూనె పట్టించి సున్ని పిండితో వేడి నీరు స్నానం చేస్తే చర్మం సున్నితమవుతుంది .

2. వేజలిన్ బాడీలోషన్ లేదా ఏ ఇతర బాడీ లోషన్ అయినా రాసుకొని గోరు వెచ్చని నీటి స్నానం చేస్తే శరీరం మృదువుగా ఉంటుంది.

3. స్నానము చేసే నీటిలో కొద్దిగ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసి వేడినీల్లస్నానము చేయాలి .ఇది శరీరం మొత్తానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది .

4. ఉదయం గోరువెచ్చని నీటితో స్నానము చేసిన తర్వాత తప్పనిసరిగా ముఖానికి క్రీమ్‌ రాసుకొవాలి . విటమిన్‌ ఇ ఉన్న క్రీములు వాడడం మంచిది .

5. శీతాకాలము పగుళ్ళకు వేసలైన్‌ వాడాలి, లైట్ మాయిశ్చరైజర్ కి బదులు థిఖ్ క్రీమ్‌ ను ఉపయోగించాలి.

6. సాదారణ సబ్బుకు బదులు గ్లిజరిన్‌ సబ్బులు వాడాలి.

7. రాత్రి పడుకునే ముందు చేతులకు , కాళ్ళకు వేజలైన్‌ రాసుకోవాలి.

8. వారానికు ఒకసారైన హాట్ ఆయిల్ తో మసాజ్ చే్సుకోవాలి ,పాదాలు పగల కుండా ‘సాక్స్ ‘ వేసుకుంటే మంచిది.

9. చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవిలోలా నీరు పదే పదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. చలికాలంలో మహిళలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఎన్ని క్రీములు రాసుకున్నా, పేషియల్స్ వాడినా తగిన మోతాదులో నీరు తాగకపోతే మాత్రం చర్మానికి ప్రమాదమేనని ఫిట్‌‌నెస్ నిపుణులు చెబుతున్నారు.

Posted on

Telugu tips for face & skin care with natural ingredients – మీ చర్మ సౌందార్యానికి

చర్మ సౌందర్యానికి మనం అష్టకష్టాలు పడుతుంటాం. ఆ క్రీమనీ, ఆ బ్యూటీ పార్లర్ అని ఎక్కడెక్కడికో వెళ్ళి చర్మ సౌందర్యం ఇనుమడింపచేసుకునేలా ప్రయత్నిస్తాం. కానీ ఫలితాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. అయితే మన చేతిలోనే మన చర్మ సౌందర్యాన్ని కాపాడే సహజసిధ్ధ క్రీములున్నాయి. వాటిని వాడితే మీ చర్మం మునుపటికంటే ఎంతో నాచురల్ గా సౌందర్యవంతంగా తయారవుతుంది. అవేంటో చూద్దామా..

1. పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది.

2. మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా అక్కడ మసాజ్‌ చేయాలి.

3. నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించండి.

4. బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకోండి. అర్ధగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్‌ తగ్గుతుంది.

5. శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన 6. చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయతో కాంతి వంతంగా ఉంటుంది.

7. ప్రతి రోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి.

8. స్నానం చేయడానికి పది పదిహేను నిమిషాల ముందు శరీరానికి శనగపిండి, పచ్చిపాలు పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. ఆ తర్వాత స్నానం చేయాలి.

9. గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి.

10. బాదం పాలు ముఖానికి పట్టించండి. రాత్రంతా ఉంచుకుంటే ఇంకా మంచిది.

11. నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి.రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే ఇంకా మంచిది.

12. బక్కెట్‌ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీనిని కొన్ని నెలలవరకూ కొనసాగిచాలి.

13. నలుపు రంగు పుట్టుకతో వచ్చినా లేక తర్వాత కాలంలో ఏ కారణంగానైనా వచ్చినా పైన తెలిపిన చిట్కాల్ని ప్రయోగించవచ్చు.

Posted on

How to remove wrinkles in Telugu – ముడుతలు రాకుండా ఉండాలంటే?

వయసు పెరిగేకొద్దీ మన చర్మం ముదుతలు పడటం సహజం. డార్క్ సర్కిల్స్,ఫైన్ లైన్లు వంటి వాటికీ కూడా ముఖ్య కారణం ఇదే అవుతుంది. ముడుతలు, కర్లింగ్ చర్మం మరియు ఫైన్ లైన్లు తగ్గించేందుకు అనేక క్రీములు ఉన్నాయి. ఏ చర్మ రకానికి అయిన రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు సమర్థవంతమైనవి కాదు. ఎందుకంటే అంటువ్యాధులు,దద్దుర్లు మరియు మచ్చల వంటి ప్రతికూల ప్రభావాలకు కారణం కావచ్చు.

ముడుతలు మరియు వయస్సు మీద పడిన ఇతర చిహ్నాల కొరకు ఇంట్లో తయారు చేసిన క్రీములు ఉపయోగించటం అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇంట్లో తయారుచేసే క్రీములు సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి తయారుచేయుట వలన ఏ విధంగానూ హానికరం కాదు. అవి శాశ్వత ప్రభావం కలిగి ఉంటాయి. ఏ చర్మ రకానికి అయిన ముడుతల కొరకు సహజమైన మరియు ఇంట్లో తయారుచేసే క్రీములు అందుబాటులో ఉన్నాయి.

1. గుడ్డులో చర్మం బిగించి, ముడుతలను తగ్గించే బోయోటిన్,ప్రోటీన్లు మరియు విటమిన్లు వంటివి ఉన్నాయి. పచ్చసొన యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. క్రీమ్ చర్మంను మృదువుగా మరియు ప్రకాశవంతమైన తయారుచేస్తుంది. ఈ మాస్క్ తయారుచేయటానికి ఒక గుడ్డును అర కప్పు క్రీమ్ లో కలపాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించండి. మాస్క్ వేసుకొని 15 నిమిషాలు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ క్రమంగా ఉపయోగిస్తే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

2. అరటిపండు మరియు క్యారట్ మాస్క్ ఇది బాగా పని చేసే ప్యాక్. చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. అరటిపండు మరియు క్యారట్ రెండు కూడా చర్మంను బిగించి ముడుతలను తగ్గించేందుకు అవసరమైన ఖనిజాలను కలిగి ఉన్నాయి. ఈ ప్యాక్ తయారుచేయటానికి ఒక అరటిపండు మరియు ఒక క్యారట్ ను తీసుకోని పేస్ట్ గా చేయాలి. బాగా కలిపి ముఖం మీద రాయాలి. ఈ మాస్క్ ను 15 నిమిషాలు ఉంచి తర్వాత వెచ్చని నీటితో కడగాలి.

3. రోజ్ వాటర్తో చర్మం శుబ్రం చేసుకుంటే చర్మం మీద మలినాలు మరియు ధూళి ఎక్కువగా ఉండుట వలన ముడుతలు మరియు ఫైన్ లైన్లు వస్తాయి. ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు రోజ్ వాటర్ తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ చర్మం పునరుత్పత్తి మరియు కళ్ళు కింద వాపు మరియు డార్క్ సర్కిల్స్ వంటి వాటిని తగ్గిస్తుంది. ఒక కాటన్ బాల్ తీసుకోని రోజ్ వాటర్ లో ముంచి వలయాకార కదలికలతో ముఖాన్ని శుభ్రం చేయాలి. మర్దన చేయుట వలన చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది.

4. బంగాళాదుంప అద్భుతమైన బ్లీచింగ్ మరియు యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. ప్రతి రోజు మీ ముఖాన్ని బంగాళాదుంప స్క్రబ్ తో శుభ్రం చేస్తే చర్మం లేత గోధుమ రంగులోకి మారటం తగ్గుట,ముడుతలు మరియు ఫైన్ లైన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. ఒక బంగాళదుంప గుజ్జు మరియు దానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించి, ముఖం మీద రాసి 5-10 నిమిషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. మంచి ఫలితాలోస్తాయి.

5. పెరుగు చర్మం కణజాలాలు,కణాల రిపేరు మరియు పునర్నిర్మాణానికి అవసరమైన విటమిన్లు కలిగి ఉంటుంది. పెరుగును రోజూ తింటే చర్మం కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగు మాస్క్ తయారుచేయటానికి ఒక కప్పు పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. నిమ్మరసం ముఖాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే పెరుగు ముడుతలను తగ్గిస్తుంది. ఈ ప్యాక్ వేసుకొని 20 నిమిషాలు ఉంచండి. తర్వాత వెచ్చని నీటితో కడగాలి.

Posted on

Main cause for allergy in Telugu – అసలు ఎలర్జీ ఎలా వస్తుందంటే?

నాకు ఆ వంకాయ కూర వద్దు..గోంగూర తినను నాకు పడదు. అమ్మో.. దుమ్ము వాసన, సోపు వాసన పడదు తుమ్ములోస్తాయ్ అని ఇలా చాలామంది చెబుతుంటారు. సాధారణార్థంలో శరీరం ఏదైనా పదార్థాన్ని స్వీకరించలేకపోవటం, సహించలేక పోవడాన్నే ఎలర్జీగా పిలుస్తున్నారు. వైద్య పరిభాషలో కొన్ని పదార్థాల పట్ల శరీరంలోని కణాలు భిన్న రీతిలో వ్యవహరించి అవలక్షణాలను వ్యక్తపరచటాన్ని ఎలర్జీగా చెబుతున్నారు. ఎలర్గీ కారకాల గురించి తెలుసుకుందామా!

శరీర కణాలు భిన్నరీతిలో వ్యవహరించటానికి ఎలర్జిన్‌ అనే మాంసకృత్తి కారణం. ఇది నీటిలో , గాలిలో, ఆహారంలో, ఇలా ప్రతి చోటా వుంటుంది. ఈ ఎలర్జిన్‌ కలిగి వున్న పదార్థం శరీరాన్ని తాకినా, లోపలికి ప్రవేశించినా కణాలు దాన్ని సరిగా స్వీకరించవు. శరీర కణాల ఈ అసాధారణ ప్రతిస్పందననే ఎలర్జీ అంటున్నారు వైద్యులు.

ఎలర్జీ కారకాలు

చిన్న పాటి ప్రభావాలు కలిగించే రకంనుంచి మొదలుకుని తీవ్ర పరిణామాలు కలిగించే వరకు ఎలర్జీ కారకాలు వైవిధ్య పూరితంగా ఉంటున్నాయి. ముఖ్యంగా పసి పిల్లల్లోను, చిన్న పిల్లల్లోనూ ఎలర్జీ సులువుగా ప్రభావం చూపుతూ వుంటుంది.

పిల్లలకు గుడ్లు, పాలు, గోధుమ వంటి పదార్ధాలు కూడా పట్టక పోవచ్చు. ఈ సమస్య ఐదేళ్ల పిల్లల వరకే వుంటుంది. అటు తర్వాత గాలిలో వుండే పుప్పొడి, దుము్మ, ధూళి, జంతువుల రోమాలు మొదలైనవి ఎలర్జీని కల్గిస్తాయి. ఇంకా చేపలు, వివిధ రకాల మాంసం, గింజలు, టమోటాలు, నిమ్మ, నారింజ, చాక్లెట్లు వంటివి సైతం ఎలర్జీని కలిగిస్తాయి.

Posted on

Telugu remedies for heat boils on face – ముఖంపై బుడిపెలోస్తున్నాయా?

ముఖం పై మొటిమలొస్తేనే ఎంతో చింతించే అతివలకు ముఖం పై బుడిపెలొస్తే ఇక చెప్పేదేముంది తట్టుకోలేనత అసహనం వస్తుంది. ఎందుకంటే ముఖంలో ఉబ్బురూపంలో కనిపించే ఇవి మహిళలకు చికాకు కల్గిస్తుంటాయి. ముఖానికంతటికీ ప్యాక్ చేసుకోవడం, బొడిపెలమీద మాత్రమే అప్లయ్ చేసుకునే ప్యాక్‌లను ఉపయోగించడం ద్వారా వీటిని పొగొట్టుకోవచ్చు. అవి ఎంతో తెలుసుకుందామా..!

1. ముఖంలో బొడిపెలు ఉంటున్నట్లయితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చిదపకూడదు. ముఖం కడుక్కునేటప్పుడు కూడా గట్టిగా రుద్దకుండా జాగ్రత్తగా శుభ్రం చేయాలి.

2. తాజా నిమ్మరసంతో ముఖం కడుక్కోవాలి. లేదా రోజుకు నాలుగైదు సార్లు నిమ్మరసాన్ని బంప్ మీద రాసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

3. రెండు టీ స్పూన్ల తాజా తులసి రసాన్ని మరుగుతున్న నీటిలో కలిపి చల్లారిన తర్వాత ఆ నీటితో ముఖం కడుక్కోవాలి. లేదా ఆ మిశ్రమాన్ని నాలుగైదు సార్లు బొడిపెపై రాయాలి.

4. కోడి గుడ్డులోని తెల్ల సొనను బొడిపె మీద రాసి ఆరిన తర్వాత కడిగితే ఫలితం ఉంటుంది.

5. ఒకటిన్నర టేబుల్ స్పూన్ల తేనెలో అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, వేస్టులా చేసుకోవాలి. దీనిని రాత్రి పూట పేస్టులా చేసుకుని పడుకోబోయే ముందుగా బొడిపెపై రాసుకుని ఉదయం గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

6. రాత్రి పూట నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి, ఆపిల్ సైడర్ వెనిగర్‌ను బంప్ మీద రాయాలి.

Posted on

Telugu tips and face packs for the winter skin care – శీతాకాలలో చర్మ సౌందర్యానికి.!

శీతాకాలం వచ్చేసింది. ఇక ప్రతి మగువ తమ చర్మాన్ని కాపాడుకోవటానికి ఎన్నో క్రీముల్ని అన్వేషిస్తుంది. పొడిబారి పగుళ్ళు ఏర్పడే సమస్య ప్రస్తుతం మగువలు ఎదుర్కొనే సమస్య. ఈ సమస్యలకు మన ఇంట్లొనే చిట్కాలు దాగి వున్నాయ్. వాటిని ఉపయోగించుకుంటే సరి. అవేంటో చూద్దామా మరి!

1.పొడిచర్మం కలిగినవారు చర్మాన్ని శుభ్రపరచుకునేటప్పుడు.. పాలల్లో వెజిటబుల్ ఆయిల్‌ను వేసి బాగా కలిపి కాటన్‌తో చర్మంపై రుద్దుకోవాలి.

2.మృదువైన చర్మం అయితే ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇంకో పద్ధతిలో… పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

మాస్క్ వేసుకునేటప్పుడు

1.పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు. ఇంకా… అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది.

2.మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే… చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది. కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

3.ఇక కాళ్లూ, చేతులకు

గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్‌, తేనె కలిపి… ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేతులకు, కాళ్ళకు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి. పైన చెప్పుకున్న చిన్న, చిన్న చిట్కాలను పాటించినట్లయితే… చలికాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకున్నవారవుతారు.

Posted on

Homemade packs and masks for foot care in Telugu – ‘క్యా’రెట్ ప్యాక్

మనం తరచూ ఏదో ఓ ప్యాక్ వేసుకుని ఫ్రెష్ అవుతుంటాం. పార్లర్ కు వెళ్ళినా ఫ్రూట్ ప్యాక్ను వేయటానికే బ్యుటీషియన్ వాళ్ళు ముందుకొస్తారు. అందుకు కారణం ఫ్రూట్ ప్యాక్ ఎన్నో రకాలుగా పని చేస్తుంది. శరీర తత్వాన్ని మారుస్తుంది, రంగును ఇనుమడింప చేతుంది. అందుకే ఈ ప్యాక్ కు అంత ప్రాధాన్యం ఇస్తారు. అయితే పాదాలకు ఏ ప్యాక్ వేస్తే బాగుంటుందో తెలియక, ఎవైనా వేసుకున్నా సంతృప్తి కలుగక మనం బాధపడుతుంతాం. అటువంటి సమస్యకు సొల్యూషన్ క్యారెట్ పాదాలకు ప్యాక్ గా వేస్తే ఎన్నో సహజ సిధ్ధ గుణాలతో మన పాదాలకు మంచి చేస్తోందట. అంతేకాక పాదాల రంగునూ ఇనుమడింప చేస్తుందట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

1 . క్యారెట్‌ తురుమునకు రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్‌ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

2 . అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.

3 . మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్‌ లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి.

4 . కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్‌గా వేసుకుంటే కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి.

5 . కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుంది.

6 . టేబుల్‌స్పూన్‌ శనగపిండి పుల్లపెరుగు తీసుకుని కలిపి మిశ్రమంలా చేసి దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి కాస్త ఆరిన తర్వాత గట్టిగా రుద్ది కడిగేస్తే మృతకణాలు తొలగిపోతాయి.