Posted on

Amazing beauty benefits of beetroot in Telugu – మీ చర్మ సౌదర్యానికి ‘బీట్ రూట్’

చక్కటి గులాబీ రంగులో నవనవలాడుతూ నన్ను తినండి మీ శరీరంలో రక్తమై ప్రవహిస్తా అంటూ సందేశం ఇచ్చే ఓ వక్తలా కనపడుతుంది బీట్రూట్. క్యారెట్, బీట్రూట్ రెండూ రక్త శాతాన్ని పెంచుతాయని వైద్యుల నుంచీ డాక్టర్ల వరకూ అంటూ ఉండటం మనకు తెలిసిందే. కాని కొందరు ఈ బీట్రూట్ ను వెలివేస్తున్నారనీ చెప్పవచ్చు. అయితే బీట్రూట్ ను తినవచ్చు, జ్యూస్ గ వాడుకోవచ్చు, కూరగా వండుకోవచ్చు.

కొందరి ఇళ్ళల్లో వండటం ఇప్పటికే జరుగుతుంది. జబ్బులోస్తే పెట్టే వంటకంగా, జ్యూస్ గా దీనిని వాడుతున్నారేగాని మరొకటి కాదు. దీని ఉపయోగాలు తెలియకపోవటమే ఇందుకు కారణం. చర్మా సౌందర్యానికి కూడా ఇది పని చేస్తుంది. అందుకే మా పాఠకులకు బీట్రూట్ చేసే మేళ్ళేంటో తెలియ చేసేందుకు ఈ శీర్షికలో ఇస్తున్నాం. బీట్రూట్ చేసే మేళ్ళేంటో తెలుసుకుందామా..!

1. గుప్పెడు ఓట్స్‌నీ, బీట్‌రూట్‌ ముక్కల్నీ తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని ముఖానికి రాసుకుని మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. తరవాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. రెండు నిమిషాలాగి నీళ్లను మరిగించి, ముఖానికి ఆవిరిపడితే సరి… చర్మం కాంతులీనుతుంది.

2. బీట్‌రూట్‌ ముక్కని మెత్తని పేస్ట్‌లా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ, చేతులకూ రాసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం బిగుతుగా మారి ముడతల సమస్య దూరమవుతుంది.

3. బీట్‌రూట్‌ రసానికి కొంచెం తేనె కలిపి, పెదాలకు రాసుకుని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు రాస్తే పెదాలు మృదువుగా మారతాయి.

4. బీట్‌ రూట్‌ రసంలో కొంచెం పెరుగూ, బాదం నూనె, చెంచా ఉసిరిక పొడి కలిపి పేస్ట్‌లా చేసుకుని, దాన్ని తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఎదుగుదుతుంది. అది కండిషనర్‌గానూ ఉపయోగపడుతుంది.

5. జుట్టు తెల్లబడిందనో, చక్కని రంగులో కనిపించాలనో భావించే వారు రసాయనాలు కలిపిన రంగుల్ని వాడే బదులు బీట్‌రూట్‌ రసాన్ని వారానికోసారి తలకు పట్టించి, అరగంట ఆగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు చక్కని రంగులో కనబడుతుంది.

Posted on

Homemade body lotions for the moisturized skin in Telugu – మీ ఇంట్లోనే బాడీ లోషన్స్..

చర్మం మృదువుగా ఉండాలని టీవీలలో కనిపించే అడ్వెర్టైస్మెంట్లు చూసి ఇష్టమొచ్చిన క్రీములను కొని రాత్రుళ్ళు రాస్తుంటారు. తీర అవి మన చర్మానికి పడక వికటిస్తే అప్పుడు చర్మ వ్యాధుల డాక్టర్ వద్దకు పరిగెడతారు. ఎందుకు? ఇవ్వనీ అవసరం లేకుండా మన ఇంట్లొని వాటితోనే మెరిసే చర్మాన్ని కాపాడుకోవచ్చు. అవెంటో చూద్దమా..!

1.ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పాల మీగడను ముఖానికి రాసుకుని తెల్లవారుజామున చల్లని నీటితో కడిగిస్తే మీ చర్మం మిలమిల మెరిసిస్తుంది.

2. అలాగే స్నానానికి ముందు నిమ్మరసంలో కాసింత పసుపును కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, నల్లటి మచ్చలకు చెక్‌ పెట్టవచ్చు.

3. అలాగే రోజా పువ్వులు చందనాన్ని పేస్ట్‌ చేసి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే కొన్ని వారాల్లో ముఖంలో నల్లని మచ్చలు, కంటి కిందటి వలయాలు కనుమరుగమైపోతాయి.

4. అలాగే కేశ సంరక్షణకు సెంబరుత్తి పువ్వు రసం, నువ్వుల నూనెను సమపాళ్లలో వేడిచేసి ఆ నూనెను రాసుకోవాలి. ఇంకా టెంకాయ నూనెలో వేప పువ్వు వేసి వేడి చేసి ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే చుండ్రుకు చెక్‌ పెట్టవచ్చు. జుట్టు ఇంకా దట్టంగా పెరుగుతాయి

  శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీలోషన్‌ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.దానిని ఇలా తయారు చేసుకోవచ్చు.

1.మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌కి, ఒక స్పూన్‌ గ్లిజరిన్‌, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.

2. కప్పు రోజ్‌వాటర్‌లో టీస్పూన్‌ బొరాక్స్‌ పొడిని, రెండు టీస్పూన్ల వేడిచేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు.

3. సబ్బుని చిన్నచిన్న ముక్కల్లా చెక్కుకుని మూడు టీస్పూన్ల నిండా దానిని తీసుకోవాలి. దానిని పావుకప్పు నీళ్లలో కలిపి వేడిచేసి, నాలుగు స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ని, టీస్పూన్‌ గ్లిజరిన్‌నీ దాన్లో వేసి బాగా కలపాలి.

ఇక మీ బాడీ లోషన్ తయారు. ఇక ప్రతి రోజు వాడి మెరిసే చర్మాన్ని పొందండి.

Posted on

Psoriasis and psoriasis prevention tips in Telugu – సోరియాసిస్ అంటే?

కొందరికి చర్మ వ్యాధులు మానసిక బాధకు గురిచేస్తాయి. ఈ వ్యాధులు హాని చేయకపోయినా న్యూనతా భావాన్ని కలిగించి అవి ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూపులు చూసేలా చేస్తాయి. అయితే ఇవి మెల్లగా శరీరలోనికి ప్రవేశించి మెల్ల మెల్లగా వాటి ప్రభావం పెంచుకుంటూ తమ ఉనికిని పెంచుకుంటాయి. మనలో ఉన్న అశ్రధ్ధ వల్ల వాటి స్వైర విహరం పెరుగుతుంది. అందులో ఒకటి సొరియాసిస్. ఇది ఎందుకు వస్తుందో చెప్పటం కష్టం. కానీ సోరియాసిస్ రావటానికి గల కారణాలు చికిత్సా మార్గాలను మీకోసం ఇస్తున్నాం.

సోరియాసిస్ ఎలా వస్తుందంటే

మానసిక ఉద్విగ్నత (స్ట్రెస్) అందులో ఒక ముఖ్య కారణం. అది కాక, వాతావరణం, అందులోని హెచ్చు తగ్గులు , కాలుష్యం మరొక కారణం. చర్మంలో తగినంత తేమ లేకపోవడం వొక ముఖ్య కారణం.అంటే డ్రై స్కిన్ కలిగి వుంటే ఈ వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం వుంటుంది. అంటే చలి కాలం,  ఏ.సీ లో ఎక్కువ గడపడం యివి కూడా ముఖ్య కారణాలే.

సోరియాసిస్ కు దూరంగా ఉండాలంటే

1. తెల్లవారి 5 గంటల సమయంలో సూర్యుడి కిరణాల్లో విటమిన్-ది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ కిరణాలు తగిలినప్పుడు చర్మానికి అనేక రకాలుగా మంచిది. చర్మ వ్యాధులు వచే అవకాశం ఉండదు.
2. అలాగే చర్మం పొడి కాకుండా చూసుకోవడం ముఖ్యం. అంటే అలోవేరా, ఈవియాన్ లాంటి ఆయింట్మెంట్లు ఎక్కువ గా వాడడం వల్ల చాలా ప్రయోజనం కనిపిస్తుంది . వీటిలో విటమిన్.డీ. కూడా వుండే ఆయింట్మెంట్లు యిప్పుడు ఎన్నో మార్కెట్లో వున్నాయి. వాటిని వాడటం మంచిది.
3. మరో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే పసుపు కలసిన మంచి  ఆయింట్మెంట్లు ఎన్నో మార్కెట్ లో లభిస్తున్నాయి. వీకో టర్మేరిక్ క్రీము ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ, చర్మ రోగాలకు, ముఖ్యంగా, సోరియాసిస్ కు బాగా పని చేయడం జరుగుతోంది. సోరియాసిస్ వున్న వారు ఈ క్రీములు వాడటం మంచిది.
4. సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు అతి ముఖ్య వైద్యము, వాటిని గురించి వర్రీ కాక పోవడమే. ముఖ్యంగా అది చర్మపు పైపొరకు మాత్రం వచ్చే వ్యాధి కనుక  చర్మం లోని రెండో  పొరని కూడా అది బాధించదు అనేది గుర్థుంచుకోవాల్సిన విషయం. లోపలి అన్ని అంగాలు బాగా పని చేస్తున్నాయి అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి.
5. మనలో వుండే భయము, సిగ్గు మాత్రమే ముఖ్య రోగం కాని అవి రెండూ వదిలేస్తే నిజమైన రోగం ఏమీ బాధించదు మనం గుర్తుంచుకోవాలి.
6. పక్కవారు ఏమనుకుంటారో అన్న భావన, ఎవరో ఏదో ఒక మాట అంటే దానిని తలుచుకునే బాధ పడటం తప్ప , నిజమైన  బాధ ఏమీ వుండదనే చెప్పవచ్చు. ఈ మనో వ్యధల / బాధల వల్లనే మోకాళ్ళ నొప్పులు , మరో నొప్పులు, మరో వ్యాధులు వస్తూ వుంటాయి.
7. ప్రాణాయామాలు, ధ్యానము నేర్చుకొని ప్రతి రోజూ ఎంత సేపు వీలైతే అంత సేపు చెయ్యటం శరీరానికే కాక మనసుకూ ఎంతో మంచిది. తగ్గుతుందన్న  నమ్మకంతో చెయ్యండి. తగ్గాలనే కౄత నిశ్చయంతో చెయ్యండి. నిరాశకు అసలు చోటు ఇవ్వకండి.
8. మనకు వచ్చే రోగాలన్నీ పోగలిగేవే. ప్రతి రోగానికీ మందు వుంది. సగం మందు మనలోనే  వుంది. మనో బలం పూర్తిగా పోవచ్చు కూడా. సగం మందు బయట వుంది.కాబట్టి చర్మ వ్యాధుల గురిచి దిగులు చెందకండి.
Posted on

Telugu remedies for the skin and face care – మీ సౌందర్యానికి..

ఆడవారికి అందం అన్నా, నగలన్నా ఎంతో ఇష్టం. అదీ నేటి కాలం స్త్రీలకు సౌందర్యోపాసన ఎక్కువే. అందుకే ఒకనాడులేని బ్యూటీపార్లర్లు ఈనాడు ఎక్కువైనాయి. ఎన్ని వచ్చినా అవి కూడా మొదట మనం పరిరక్షించుకునే దాన్ని బట్టి అందం నిలుస్తుందని చెబుతాయి.

కనుముక్కు తీరు బాగుండటం, మంచి రంగు, చక్కటి జుట్టు, ఎత్తుకు తగ్గ లావుతో మంచి అంగసౌష్టవం ఇలా చాలానే కారణాలు చెప్తారు. ఫీచర్స్ తో వచ్చేది సహజసిధ్ధమైన సౌందర్యం. సహజసిధ్ధమైన అందాన్ని పెంచుకునేందుకు మీకోసం కొన్ని చిట్కాలను అందిస్తున్నాం.అవెంటో ఇప్పుడు చూద్దామా..!

1. నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించండి.

2. మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా అక్కడ మసాజ్‌ చేయాలి.

3. పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది

4. బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకోండి. అర్ధగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్‌ తగ్గుతుంది.

5. శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయతో కాంతి వంతంగా ఉంటుంది.

6. గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి.

7. ప్రతి రోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి.

8. స్నానం చేయడానికి పది పదిహేను నిమిషాల ముందు శరీరానికి శనగపిండి, పచ్చిపాలు పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. ఆ తర్వాత స్నానం చేయాలి.

9. బాదం పాలు ముఖానికి పట్టించండి. రాత్రంతా ఉంచుకుంటే ఇంకా మంచిది.

10. బక్కెట్‌ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీనిని కొన్ని నెలలవరకూ కొనసాగిచాలి.

11. నలుపు రంగు పుట్టుకతో వచ్చినా లేక తర్వాత కాలంలో ఏ కారణంగానైనా వచ్చినా పైన తెలిపిన చిట్కాల్ని ప్రయోగించాలి.

12. నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి.రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే ఇంకా మంచిది.

Posted on

Home remedies for the skin problems in winter in Telugu – శీతాకాలంలో చర్మ పరిరక్షణకు గృహ చిట్కాలు..

గజగజమనిపించే చలికాలం.. అదేనండీ శీతాకాలం మన చర్మం పై దాడికి త్వరలో సిధ్ధం కానుంది. శీతాకాలం వచ్చిందంటే చర్మం పొడిబారిపోయి అసహనానికి గురిచేస్తుంది. ఇక మహిళలు సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి శీతాకాలంలో చర్మం ఎదుర్కొనే ఇబ్బందులకు పార్లర్లనో, క్రీములనో అన్వేషిస్తుంటారు. ఎన్ని వాడినా చర్మం రసాయనాలకు అలవాటు పడి పాడైపోతుందే కానీ సహజసిధ్ధంగా ఉండదు. కాబట్టి శీతా కాలంలో అతివల చర్మ సౌందర్యానికి ఇంట్లో వాడే చిట్కాలను మీకందిస్తున్నం. అవేంటో ఒకసారి చూద్దామా..

 

1. పొడిచర్మం కలిగినవారు చర్మాన్ని శుభ్రపరచుకునేటప్పుడు పాలల్లో వెజిటబుల్ ఆయిల్‌ను వేసి బాగా కలిపి కాటన్‌తో చర్మంపై రుద్దుకోవాలి.
2. మృదువైన చర్మం కలిగినవారైతే, ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి.
3. పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
4. ఒకవేళ మీరు మాస్క్ వేసుకుంటే పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు.
5. అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది.
6.మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది.
7.కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
8.కాళ్లూ, చేతులకు గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్‌, తేనె కలిపి… ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేతులకు, కాళ్ళకు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి.
Posted on

Skin care tips in Telugu – మీ చర్మం గురించి మీకు తెలుసా?

మన శరీరంలో ఏ అంగనికైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ వద్దకు పరిగెడతాం. అయితే చర్మానికి సమస్య వస్తే కాసింత ఆలస్యంగా వెళతాం. ఆ సమయానికి సమస్య కాస్తా ఎక్కువైపోతుంది.ఫలితంగా ఎన్నో డబ్బులు ధారపోస్తాం. కానీ మార్పు రావటం మాట అలా ఉంచినా ఫలితం మాత్రం సూన్యం. ఎందుకంటే చర్మ సమస్య మొదలైతే అది తొందరగా తీరదు. ఈ మాట నూటికి నూరుపాళ్ళు నిజం. పుట్టడం తోనే చక్కని చర్మంపొందడం కుదరని విష యం. జన్యు పరమైన మార్పుల కారణంగా చర్మం అనేక మార్పులు చెంది మనకు చుట్టుకుని ఉంటుంది.  చర్మం యొక్క రంగు వారసత్వంపై కూడా ఆధారపడవచ్చు.

ఎవరికైనా కూడా పూర్తి ఆరోగ్యవంతమైన చర్మం ఉందని చెప్పటం కష్టం. ప్రస్తుతం చాలా మంది శుభ్రతను పాటిస్తూనే మరింత ఆకర్షణీయంగా ఉండడం కోసం అనేక రకాల క్రీములను వాడుతూ ఉంటారు. చర్మంలో కూడా కొన్ని రకాలు ఉం టాయి. వాటికి తగిన మందులను ఎంచు కోవడంలోనే చాలా మంది విఫలమవుతున్నారు. క్రీముల ద్వారా కొందరు లాభపడుతుంటే మరికొందరు అదే క్రీముల వలన నష్టపోతున్నారు. ఏ చర్మానికి ఏ క్రీములు వాడాలో తెలియక ఏదో ఒక క్రీము తీసుకుని వాడటం వల్ల పూర్తిగా నష్టపోతున్నారు. చివరికి కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంలా తయారవుతుంది వారి పరిస్థితి. అసలు చర్మం గురించీ అది ఎందుకు ఇబ్బందికి గురి అవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని సార్లు జన్యుపరమైన విషయాలను కూడా మన అలవాట్లు మార్చుతాయి. ముఖ్యంగా ఎండలో తిరిగే సమయం, ఎండ తీవ్రత, సిగరెట్‌, ఒత్తిడి, నిద్ర వంటి విషయాలే ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటి వల్లనే మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడుతాయి.

సూర్యుని నుండి వచ్చే ప్రమాదకర కిరణాలను అతినీలలోహిత (ultra violet) కిరణాలు అంటారు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఖహూ కిరణాలు (UVA) చర్మం వదులుగా అయ్యేలా చేస్తాయి. ఖవ్దీ కిరణాలు చర్మంలో ఉండే కణాలను కాల్చివేస్తాయి. సాధారణంగా అన్ని సన్‌లోషన్లూ ఖవ్దీ కిరణాలను మాత్రమే అడ్డుకుంటాయి. అలాగే సన్ స్క్రీన్  లోషన్ స్థాయి ఖవ్దీ కిరణాలను(UVB) ఆపగల గరిష్టస్థాయిని మాత్రమే వివరిస్తుంది. అందువల్లనే ఎంతో మంది ఖరీదైన సన్‌లోషన్‌ వాడుతున్నప్పటికీ చర్మం వదులుగా అవుతుంది. సన్‌లోషన్‌ను వాడదలిచిన వారు ఖవ్దీ కిరణాలను మాత్రమేగాక ఖహూ కిరణాలను అడ్డుకొనగల క్రీములను ఎంచుకోవాలి. జింక్‌, అవెబెన్‌ జోన్‌ వంటి పదార్థాలు ఖహూ కిరణాలను అడ్డుకొనగలుగుతాయి. అందువలన సన్‌లోషన్లలో జింక్‌ మరియు అవెబెన్‌జోన్‌ (avobenzone) కూడా ఉండే క్రీములను ఎంచుకోవాలి.

ప్రస్తుతకాలంలో ఏ సన్‌స్క్రీన్‌ లోషన్‌ అయినా చర్మానికి తేమ అందించే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. కనుక జిడ్డుగా ఉండే చర్మం కలవారు మళ్లీ మాయిశ్చరైజర్‌ వాడడం వల్ల నిగారింపును కొల్పోతారు. అందువలన అందరికీ మాయిశ్చరైజర్‌ అవసరం ఉండదు. ఒక వేళ రెండూ వాడాలని అనుకుంటే ముందుగా మాయిశ్చరైజర్‌ను వాడి నీటితో శుభ్రపరిచి, ఆరిన తరువాత మాత్రమే సన్‌స్క్రీన్‌ లోషన్‌ను వాడాలి.

ఇప్పటి వరకూ జరిపిన సర్వేల ప్రకారం 18ఏళ్ల వయస్సు వరకూ కేవలం 18 నుండీ 23 శాతం వరకూ మాత్రమే చర్మంలో సౌరశక్తి వల్ల సమస్యలు ఉత్పన్న మవుతాయి. కనుక ఒక వేళ ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోనంత మాత్రాన జీవితాంతం బాధపడాలి అన్న మాట అవాస్తవం.

 

Posted on

Best fruits for glowing skin in Telugu – మెరిసే చర్మ సౌదర్యానికి కొన్ని పండ్లు..!

ఆహా.. ఏం తేజస్సు, ఏం రంగు అని మనం కొందర్ని చూసి ఆశ్చర్యపోతుంటాం. మరి కొందరిని చూస్తే ఇందుకు భిన్నం గా ఉంటుంది. ఆలా ఉండేందుకు మనమూ ప్రయత్నిస్థాం. దాని కోసం ఏవేవో శరీరానికి రాస్తూ ఉంటాం. కారణం ఏదో తెలియక ఫేస్ ప్యాకులు ,మానిక్యూర్లు చేయించుకుంటాం కాని సమస్య మనకు తెలియదు.ఫలితం మాత్రం శూన్యమే. ఎన్ని చిట్కాలు పాటించినా కూడా ఫలితం రాకపోగా మరిన్ని సమస్యలు కొనితెచ్చుకోవడం ఖాయం.

దీనికి కారణం బయటి సమస్య మాత్రమే కాదు.. శరీరంలోనిది కూడా..! కాబట్టి పైపై రంగులు, మేకప్‌ మాత్రమే కాకుండా అంతర్గతంగా కూడా కాస్త జాగ్రత్త వహించాలి. మన చర్మం మెరిసేందుకు కొన్ని జ్యూసులను సేవించాలి. మనకు అందుబాటులో ఉండే పండ్లతో మన ఆరోగ్యం, అందం రెండూ ఇనుమడిస్తాయి. అవేంటో చూసేద్దామా ఒకసారి..!

జామకాయ 

పండ్లలో అతి చవకగా అందరి ఇంట్లో కనపడుతూ నేను మీ ఇంట్లో ఉన్నానంటూ కనిపించేది జామకాయ. జామకాయలో వుండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తా యి. ఆరోగ్య సంబంధిత వ్యాధులు నయమవుతాయి. క్రమంగా చర్మం నిగారింపు సం తరించుకుంటుంది.

ఆపిల్‌

కోసే కత్తికి కూడా శ్రమపడకుండా అతి సుతిమెత్తగా ఉండే పండు ఆపిల్. యాపిల్‌లోని గుణాలు చర్మానికి మృదుత్వాన్ని ఇచ్చి మెరిసేలా చేస్తాయి. రోజూ ఒక ఆపిల్‌ తీసుకోవడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే వాటిని చాలా వరకు దూరం చేసుకోవచ్చు.

టమాటా

ఇది రక్తా న్ని శుద్ధి చేస్తుంది. విటమిన్స్‌ కూడా లభి స్తాయి. టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది.  ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

క్యారెట్‌

క్యారెట్ను చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. తినడానికి ఎంతో రుచిగా వుండే క్యారెట్‌లో పోషకాలు కూడా ఎక్కువే.ఇందులో వుండే విటమిన్‌ ఏ, సిలు చ ర్మానికి తేజస్సును ఇస్తాయి. కళ్లకు కూడా ఎంతో మంచిది. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.

బీట్‌రూట్‌

బీట్రూట్ రసం ఎంతో మంచి విలువల్ని కలిగి ఉంటుండి. రక్తంలోని మలి నాలను తొలగిస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యని పెంచుతుంది. లివర్‌కు మంచిది. కిడ్నీ లను శుద్ధి చేస్తుంది.  చర్మాన్ని మెరి సేలా చేస్తుంది.

పుచ్చకాయ

దాహార్తిని తీర్చడం తోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ. శరీరానికి చలువను ఇస్తుంది. అందాన్ని ఇనుమడింపజేస్తుంది. పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది.

Posted on

Winter skincare tips to get smooth and soft skin in Telugu – శీతాకాలంలో అందమైన మరియు మృదువైన చర్మం కోసం తగు జాగ్రత్తలు తీసుకుందామా

చల్లని చలి కాలంలో మీ అందమైన చర్మంకు ఎన్నో ఇబ్బందులు,మిగిలిన కాలాల కన్నా కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది, ఎందుకంటే ఈ కాలంలో ఉష్ణోగ్రతల శాతం మరీ తక్కువగా ఉండటం వల్ల మీ చర్మం పొడిబారి పోయి, ఒక్కో సారి పగిలిపోవడం,లేదా చిన్న చిన్న పొరలుగా ఊడిపోవడం జరుగుతుంది. కంగారుపడవలసిన అవసరం లేదు, మీరు చేయవలసిందల్లా మీ చర్మాన్ని ఎప్పటికప్పుడు పొడిబారకుండా తేమగా ఉండేలా చూసుకోవాలి.

  • హైడ్రేషన్ మీ చర్మాన్ని ఎంతో కోమలంగా,మృదువుగా మరియూ యవ్వనంగా ఉంచుతుంది,చలికాలంలో ఉష్ణోగ్రతల శాతం మరీ తక్కువగా ఉండటం వల్ల మీ చర్మం పొడిబారి పోతుంది, దీనిని అదిగమించడానికి, మీ శరీరంలో నీరు, మరియూ నూనె శాతాన్ని పెంచుకుని,అవి ఇచ్చే పదార్దాలని వాడటం మంచిది.
  • మీ శరీరాన్ని తేమగా ఉంచుకోవడం అనేది సహజంగా ప్రతీ కాలంలోను ఉండేదే, అయితే ఈ శీతాకాలంలో మరింత జాగ్రత్త అవసరం ఎందుకంటే, చర్మం మిగిలిన కాలాల కన్నా ఎక్కువగా పొడిబారిపోతుంది, అందుకే మాయిశ్చరైజర్ అనేది ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎంతగానో సహకరిస్తుంది.
  • ఒకవేళ మీకు మాయిశ్చరైజర్ ను ఉదయం సమయాల్లో రాయడం కుదరకపొయినా,లేదా ఇష్టం లేక పోయినా రాత్రుళ్ళు రాసుకోవడం మంచిది, దీనిని కొన్ని చుక్కలు చేతిలోకి తీసుకుని ముఖానికి, కాళ్ళు, చేతులకు పట్టిస్తే, అది మీ చర్మంలోకి చొచ్చుకుపోయి, మంచి ప్రబావాన్ని చూపిస్తుంది.
  • మీ వంటి సబ్బులో క్రిమిసం హారిక లక్షణాలు ఉన్న, లేదా మీరు తీసుకునే మాయిశ్చరైజర్ లో ఆల్కహాల్ కలిగి ఉన్నా,వాటిని వాడటం మంచిది కాదు.
  • వేడి నీళ్ళతో స్నానాలు చేయరాదు,ఎందుకంటే ఈ వేడి నీటి వల్ల మీ చర్మం ఇంకా పొడిబారిపోయే ప్రమాదం ఉంది.
  • గోరు వెచ్చని నీటితో చేయడం మంచిది అంతేకాకుండా ఎక్కువసేపు స్నానం చేయడం అంత మంచిది కాదు.

ఈ చలి కాలంలో వేసుకోవాల్సిన దుస్తులు

మీరు దరించే బట్టలలో కూడా మీ ఆరోగ్యం దాగి ఉంటుంది,అందుకే ముఖ్యంగా కాటన్ తో, ఉన్నితో తయారు చేసిన బట్టలు,మీ శరీరం అంతా వ్యాపించి మిమ్మల్ని ఈ సమస్య నుండి రక్షించేవే వేసుకోవడం మంచిది.

ఈ చలి తీవ్రతను తట్టుకోలేక చాలా మంది,వెచ్చదనం కోసం ఎండలో నిలబడతారు,దాని వల్ల చర్మం మరింత పొడి బారిపొయే ప్రమాదం ఉంది.

ఈ చలిలో తగినంతవరకూ బయటకు వెళ్ళకపోవడం ఎంతో మంచిది,ఒకవేళ వెళ్ళ వలసి వస్తే స్వెటర్ లేదా జాకెట్ ను వేసుకుని వెళ్ళడం శ్రేయస్కరం.

చలికాలంలో ఆహార నియమాలు

మీరు వేసుకునే దుస్తులే కాదు, తీసుకునే ఆహారం కూడా మిమ్మల్ని ఈ సమస్య నుంచి కాపాడడంలో ఎంతగానో సహకరిస్తుంది, ముఖ్యంగా విటమిన్లు A, C మరియు E సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది.

సెలీనియం మరియు జింక్ వంటి మినరల్స్ తీసుకుంటే మీ చర్మం యొక్క్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.

మీ శరీరన్ని చలి తీవ్రతనుండి,పొడి బారకుండా కాపాడడానికి ముఖ్యమైన కొవ్వు పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి.

అవిసె గింజలు, అక్రోట్లను, సాల్మొన్, లవంగాలు, సోయాబీన్స్, ఆకుకూరలు వంటి ముఖ్యమైన కొవ్వు పదార్ధాలు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

Posted on

Banana face packs & masks for all skin tones in Telugu – మీ చర్మ సౌందర్యం కోసం అరటి పండ్లు చెప్పే తీపి కబుర్లు(బనానా ఫేస్ ప్యాక్స్)

ఆరోగ్యాన్ని ఇచ్చే అరటి పండు అంటే ఎంతో మందికి ఇష్టం, అయితే ఇదే అరటి పండు, మీ చర్మ రక్షణలో కూడా ఉపయోగపడుతుంది అంటే నమ్మగలరా, ఇంకెందుకు సందేహం, రండి ఆ ఉపయోగాలు,వాటి ప్రయోగాలు తెలుసుకుందాం:
వివిధ రకముల “బనానా ఫేస్ ప్యాక్స్”:

1.అవకాడో, బనానా ఫేస్ ప్యాక్:

కావాల్సినవి: 1 / 2 అవెకాడో పండు గుజ్జు , 1 / 2 అరటిగుజ్జు
ఈ మిశ్రమాన్ని కలిపి, ఒక పేస్ట్ లాగా అయిన తరువాత దానిని మీ ముఖానికి పట్టించి, 15 నిమిషాల తరువాత మీ ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకోవాలి.

2.బనానా ఫేస్ ప్యాక్:

కావాల్సినవి: 1 / 2 అరటిగుజ్జు
మీ ముఖాన్ని శుబ్రంగా కడిగి, పొడి బట్టతో శుబ్రం చేసుకోండి,తరువాత ఈ అరటి పండు మిశ్రమాన్ని మీ ముఖం పై రాయండి,15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రంచేసుకోండి.ఎలా చేస్తే మీ ముఖం అందంగా,మృదువుగా, ఎంతో కోమలంగా
మారుతుంది.

3.బనానా,తేనె ఫేస్ ప్యాక్:

కావలసినవి: 1/2 అరటి గుజ్జు , 1 టేబుల్ స్పూన్ తేనె
ఈ పై మిశ్రమాన్ని మీ ముఖానికి, మెడకి పట్టించి ఒక 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకోవాలి,తరువాత ఒక మెత్తటి గుడ్డతో మీ ముఖాన్ని తుడుచుకుంటే మంచి కోమలమైన చర్మం మీ సొంతం అవుతుంది.

4.మోటిమలు యొక్క చికిత్సకు బనానా ఫేస్ ప్యాక్:

కావలసినవి: 1 అరటి, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మచ్చ రహితమైన, మొటిమ రహితమైన చర్మం మీ సోంతం అవుతుంది.

5.పొడి చర్మం కోసం బనానా ఫేస్ ప్యాక్:

కావలసినవి: 1/2 అరటి గుజ్జు,1/2 గిన్నె ఉడికించిన ఓట్మీల్,1 స్పూన్ చక్కెర,1 గుడ్డు(గ్రుడ్డులో ఉండే పచ్చ సొన)
ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మంచి ప్రబావాన్ని చూపిస్తుంది.

6.జిడ్డుగల చర్మం కోసం బనానా ఫేస్ ప్యాక్:

కావలసినవి: గుజ్జు 1/2 అరటి, 1 స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ పెరుగు.
ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మంచి ప్రబావాన్ని చూపిస్తుంది

7.ముడతలు పడ్డ మీ చర్మాన్ని రక్షించుకునేందుకు బనానా ఫేస్ ప్యాక్:

కావలసినవి:1/2 అరటి గుజ్జు, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 గుడ్డు( గ్రుడ్డులో ఉండే పచ్చ సొన)
ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకోవాలి,ఎలా వారానికి 2 రోజులు చేస్తే మంచి ప్రాభావం చూపిస్తుంది.

8.బనానా,పాలు ఫేస్ ప్యాక్:

కావలసినవి: 1/2 అరటి గుజ్జు , 1 స్పూన్ తేనె, 1స్పూన్ పాలు:
ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది

9.బనానా,ఓట్మీల్ ఫేస్ ప్యాక్:

1\2 గిన్నెలో ఓట్మీల్ , 1 స్పూన్ తేనె, 1/2 అరటి గుజ్జు, 1 గుడ్డు( గ్రుడ్డులో ఉండే పచ్చ సొన)
ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.
Posted on

Beauty benefits of Jasmine oil in Telugu – మీ చర్మ రక్షణలో “మల్లెల తైలం” చేసే మంత్రాన్ని చూద్దామా

మల్లెపువ్వు,మగువల అందాన్ని వర్ణించడానికి,ఎందరో కవులు ఉపయోగించినది,అందానికి చిరునామ “మల్లెపువ్వు”అని చెబితే అతిసయోక్తి కాదేమో.అయితే ఈ మల్లెపువ్వు తియ్యదనంతో పాటు సువాసనకు మారుపేరుగా నిలుస్తుంది.ఈ పరిమళాన్ని ఇప్పటికీ జపాన్ మరియు ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
గమ్మత్తు ఏమిటంటే, కాలనుగుణంగా పూచే పూలలో ఈ మల్లె పువ్వుకి ఒక ప్రత్యేకత ఉంది, అది ఏమిటంటే ఈ మల్లె రాత్రి పూట మత్రమే పూస్తుంది,అందుకే దీనిని చీకటి పడిన సమయాల్లో కోస్తారు.అయితే దీనితో తయారు చేసిన ఆయిల్ ఎంతో సువాసనబరితమైనది, దీనిని తయారు చేయుటకు ఎన్నో మాల్లె పూల రేకులను ఉపయోగిస్తారు.ఇది చాలా అరుదుగా దోరికేది అయినప్పటికి ఎంతో ప్రఖ్యాతిగాంచినది.
 మల్లెపువ్వు మనలోని నిస్సహాయతను దూరం చేసి, విశ్వాసాన్ని పెంచుతుంది, అంతే కాకుండా ఇది మన శరీరంపై “యాంటి డిప్రెసంట్”, “యాఫ్రొడిసియాక్”గా పనిచేసి మనలోని ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.
గాలీ, వెలుతురు, ఇలా ఏమీలేకుండా నిశబ్దం అల్లుకున్న గదులలో, తన సుగంధ పరిమళాలతో మళ్ళీ జీవాన్ని తెచ్చి సువాసన పరిమళంగా మారుస్తుంది.
ఈజిప్షియన్లు ఈ మల్లెపువ్వుని వారి “నరము వ్యాదులకు” చికిత్సగా ఉపయోగిస్తారు, అంతే కాకుండా తలనొప్పికీ, నిద్రలేమికి కుడా ఉపయోగిస్తారు.
 దీని ప్రయోజనాన్ని అనేక పద్దతులు,సంస్కృతులు, కార్యక్రమాలలో అనేక విధాలుగా ఉపయోగిస్తారు, అంతే కాకుండా దీని యొక్క “యాఫ్రొడిసియాక్” తత్వం మీ మానసిక స్తితిని మార్చడంలో ఎంతగానో సహాయ పడుతుంది.మీరు అధిక ఒత్తిడికి లోనైనప్పుడు, మల్లె ఆయిల్ తో మసాజు చేయించుకుంటే మీ ఒత్తిడి తగ్గి,మనసిక స్తితి మెరుగుపడుతుంది.
 ఈ ఆయిల్ కొంచెం అధిక దర ఉన్నప్పటికీ మీ శరీర సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రత్యేకముగా మీ చర్మం యొక్క రంగుని,కోమలత్వాన్ని,కాపాడి మీలోని అలసత్వాన్ని తరిమికొడుతుంది.మీ చర్మం పై కాలిన గాయాలకు ఒక ఔషదంలా ఉపయోగపడుతుంది.
 దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి, అవి ఏమిటంటే ఇది ఒక క్రిమినాశక ఏజంట్ గా,జుట్టు ఎదుగుదలకు,దెబ్బలకు,కాలిన గాయాలకు ఒక మంచి చికిత్సగా,ఉపయోగించుకోవచ్చు.
అయితే దీనిని మూలికల మిశ్రమాలతో  అంటే “రోజ్ వుడ్”,గంధము,నిమ్మతో కలిపితే శరీరం యొక్క సహజ తత్వాన్ని ప్రోత్సహించి మంచి ఫలితాన్నిస్తుంది.
 ఈ ఆయిల్ ని మీ ఉదరం(పొట్ట)పై రాసుకుంటే మీ గర్భాశయ సంకోచాలలోని(Inner Parts)ఏవైన  ఇబ్బంది ఉంటే దానిని తొలగించి మంచి ఉపసమనాన్ని అందిస్తుంది.
 ఆరోగ్యకరమైన, ఉల్లసభరితమైన స్నానం చేయాలంటే కొంచెం 1\2గ్లాసు సోయా ఆయిల్, 5 చుక్కలు మల్లె ఆయిల్, 3 చుక్కలు జునిపెర్ ఆయిన్, తీసుకుని VitaminE ని కూడా కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.
ఆరోగ్యకరమైన మసాజ్ కోసం, 8 స్పూన్లు ద్రాక్ష రసం,6 చుక్కలు మల్లె ఆయిల్,2 చుక్కలు “టీ పైన్” ఆయిల్,”నిరోలి ఆయిల్”, కలిపి చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.
అందమైన, కోమలమైన జుట్టు కోసం, ఈ మల్లె నూనెని 2 చుక్కలు తీసుకుని, దీనిలో 2 చుక్కలు “రొజ్ మేరి”ఆయిల్, 2 చుక్కలు”క్లారి సేజ్”,1\2ఔన్స్ బేస్ ఆయిల్ కలపి జుట్టుకి పట్టించాలి .