Posted on

Lemon juice for beauty care in Telugu – మీ అందం, చర్మం, జుట్టు మరియు గోళ్ళ సంరక్షణకు నిమ్మరసం చెప్పే చిట్కాలు

నిమ్మకాయని అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు,ఇది “సిట్రస్ పండ్ల”రకమునకు చెందినది, దీనిలో “విటమిన్ సి”ఉంటుంది, ఈ విటమిన్ మన చర్మంలోనికి చొచ్చుకుపోయి, దుమ్ము, ధూళి, మలినాలతో మూసుకుపొయిన రంద్రాలను శుబ్రం చేసి చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది.

చర్మం మరియు జుట్టు సంరక్షణకి నిమ్మరసం ఎలా పని చేస్తుందో చుద్దామా….

కాంతివంతమైన చర్మం కోసం నిమ్మరసం ఎల ఉపయోగపడుతుందంటే:

కొంచెం నిమ్మరం తీసుకుని, మీరు స్నానం చేసే నీటిలో కలపాలి,దీనివల్ల మీ చర్మంలో ఉన్న మలినాలు అన్ని పొయి, మీ చర్మంపై రంద్రాలు శుబ్రముగా అవుతాయి,

మీ కాళ్ళను నీటిలో ముంచి 10-15 నిమిషాల తరువాత తీస్తే, మీ చర్మం పై ఉన్న చనిపొయిన, పనికిరాని కణాలు తొలగిపొయి, మీ చర్మం కాంతివంతముగా ప్రకాశిస్తుంది.

దీనిలోని  సిట్రిక్ యాసిడ్ లక్షణము మీ ముఖం పై ఉన్న నల్ల మచ్చలను తొలగించుటలో ఎంతగానో సహయపడుతుంది.

కాంతివంతమైన చర్మం కోసం:

2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్లు వైన్, 2 టేబుల్ స్పూన్లు నీరు తీసుకుని, బాగా కలిపి మీ ముఖానికి పట్టించాలి, కాసేపటి తరువాత మీ ముఖాన్ని శుబ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

చెడు చర్మ నిర్మూలనకు:

మీ చర్మం పై ఉన్న మలినాన్ని శుబ్రం చేసుకోవాలంటే నిమ్మ కాయ ముక్కని తీసుకుని చక్కెరలో ముంచి దానిని మీ ముఖం పై రుద్దాలి, ఒకవేళ చక్కెర తరిగిపోతే మళ్ళీ  ముంచి రుద్దడం వల్ల, మీ చర్మం పై మంచి మెరుగు వచ్చి, కాంతివంతంగా ప్రకాశిస్తుంది.

నిమ్మ “మాయిశ్చురైజర్”(తేమను కలిగించే పదార్దం)”లా ఎలా ఉపయోగపడుతుంది.

సాదారణంగా మీ చర్మం పొడిబారిపోతే,  1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకొని బాగా కలపండి, ఈ మిశ్రమాన్ని పొడి బారిన చర్మంపై పట్టించి 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో   శుబ్రం చేసుకోండి, ఇది మీ చర్మంలో తేమను పుట్టించి మంచి ఫలితాలను ఇస్తుంది.

నల్లని మచ్చల నిర్ములనలో:

మీ అందమైన చర్మం పై నల్ల మచ్చలు బాధిస్తుంటే,వాటిపై కొంచెం నిమ్మ రసాన్ని రుద్దండి,10-15 నిమిషాల తరువాత శుబ్రం చేసుకోండి, ఇది మీ చర్మం పై ఉన్న నల్ల మచ్చలకు కారణమైన మీ చర్మ రంధ్రాలని శుబ్రం చేసి, మీ చర్మాన్ని మచ్చలు లేకుండా చేస్తుంది.

మీ జుట్టు సంరక్షణ కోసం నిమ్మకాయ ఎలా ఉపయోగపడుతుంది:

నిమ్మరసం మీ జుట్టు సంరక్షణకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది, ఇది మీ జుట్టుకోని చుండ్రుని తగ్గించి మంచి “జుట్టు కండీషనర్”గా పనిచేస్తుంది.1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్,1 టేబుల్ స్పూన్ తేనె, 3టేబుల్ స్పూన్లు నిమ్మ రసం,బాగా కలిపి మీ జుట్టుకి పట్టించండి, 30 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే మంచి మార్పు వస్తుంది.

మీ గోళ్ళు సంరక్షణ కోసం నిమ్మరసం ఎలా పనిచేస్తుంది:

నిమ్మరసాన్ని ఒక గిన్నెలోకి పిండి, మీ గోళ్ళని 10 నిమిషాలు అందులో ఉంచండి, తరువాత బయటకు తీసి బ్రష్ తో శుబ్రముచేసుకోవాలి.మంచి ఫలితాల కోసం నిమ్మరసం కు వెనిగర్ను జోడించండి.ఇది మీ గోళ్ళను అందంగా,గట్టిగా చేస్తుంది.

Posted on

Telugu tips for dry skin – “గ్లిసరిన్” వల్ల చర్మ రక్షణ మరియు జుట్టు సంరక్షణ ఎలా సాద్యమంటే??

గ్లిసరిన్ అనేది కార్బన్ మిశ్రమాలలో ఒకటి. దీనిని రసాయనిక శాస్త్రంలో “C3H8O3” లేదా గ్లిసరాల్ అని పిలుస్తారు. ఈ గ్లిసరాల్ అనేది చుట్టుపక్కల ఉండే నీటిని గ్రహిస్తుంది.దీనిని మనం ఉపయోగించినట్లయితే మన చర్మాన్ని తేమగా ఉంచేటందుకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇది ప్రముఖమైన ఫార్మసీ దుకాణాలలో లభిస్తుంది. దీనిని తయారుచేసిన తరువాత 2 సంవత్సరాల వరకు ఉపయోగించవచ్చు, ఐతే కొనుగోలు ముందు లేబుల్ని చూసి తీసుకోండి.

అందం కోసం “గ్లిసరిన్”  చెప్పే అందమైన చిట్కాలు చూద్దామా

“చర్మం యొక్క మాయిశ్చరైజర్ గా”

ఒక వేళ మీ చర్మం పొడిగా ఉంటే , కొంచెం గ్లిసరిన్, మరి కొంచెం తేనె కలిపి,ఈ మిశ్రమాన్ని పొడిగా ఉన్న చర్మానికి,లేదా చేతులకి, లేదా కాళ్ళకి పట్టించి 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే పొడిగా ఉన్న మీ చర్మము యొక్క సమస్య పోయి తేమగా మారుతుంది.

వాడిన\మాడిన\ఎండిన జుట్టు సం రక్షణకై:

ఎంతో మంది వారి జుట్టు ఎండిపొయినట్లుంది అని ఎంతగానో బాధపడుతూ ఉంటారు, ఈ సమస్య జుట్టులోని తడితనం అంటే తేమ లేకపొవడం వల్లనే, అయితే మీ జుట్టుకి గ్లిసరిన్ పట్టిస్తే మంచి మార్పును మీరు గమనించి అందమైన,మృదువైన జుట్టుని మీ సొంతం చేసుకోవచ్చు.

హెయిర్ స్ప్రే:

కొంచెం గ్లిసరిన్ , నీరు కలిపి, ఒక  స్ప్రే బాటిల్లో పోసి మీ జుట్టుకి పట్టిస్తే మీ గిరజాల జుట్టును కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది జుట్టుకి మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది.

చర్మాన్ని శుబ్రపరచడంలో “గ్లిసరిన్” పాత్ర:

1 టేబుల్ స్పూన్ గ్లిసరిన్, 2 టేబుల్ స్పూన్లు తేనె, 2 టేబుల్ స్పూన్లు పాలు తీసుకోండి.ఈ మూడు పదార్థాలు కలపండి,ఈ మిశ్రమాన్ని వోట్మీల్ జోడించండి, ఒక పేస్ట్ లాగా చేసి ముఖానికి పట్టించండి,గ్లిసరిన్ ను తక్కువ శాతంలో వాడటం మంచిది, ఇలా రాసుకున్న మిశ్రమము మీ చర్మంలోని దుమ్ము, ధూళి,వల్ల మూసుకుపొయిన చర్మ రంద్రాలను శుబ్రం చేసి, మీ ముఖానికి అందమైన,మరియు ప్రకాశవంతమైన సౌందర్యన్ని తెస్తుంది.

ఇంకెందుకు ఆలస్యం, పైన చెప్పినవన్నీ పాటించండి, తళ తళ లాడే అందాన్ని మీ సొంతం చేసుకోండి.

Posted on

Telugu tips for glowing skin – మిల మిల మేరిసే సహజ చర్మ సౌందర్యం కోసం 5 చిట్కాలు

ఎన్నో ఏళ్ళుగా మనకు వినిపిస్తున్న మాట “అందంగా ఉండడం అంటే మరింత అందమైన చర్మం కలిగి ఉండడమె” అప్పట్లో స్త్రీలు మాత్రమే వారి అందం గురించి ఆలోచించేవారు, చర్మం, జుట్టూ, ఇలా ప్రతీది వారికెంతో గొప్పవి. ప్రస్తుత సమాజంలో స్త్రీలతో పాటు మగవారు కూడా వారికి వారు అందంగా ఉండాలి అని ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. ప్రతీ విషయంలోను, అందంగా, సమర్దవంతంగా, ఉండేలా చూసుకుంటున్నారు.

మీ అందాన్ని కాపాడే విధానంలో, మీకోసం మేము మీకు అందించే చిట్కాలు.

మంచినీరు ఎక్కువగా తాగండి

ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది ఉపయోగిస్తున్న ఒకే ఒక చిట్కా ఏమిటి అంటే. నిస్సందేహంగా

రోజుకి 8-10 గ్లాసులు నీళ్ళు తాగడమే అని చెప్పవచ్చు.అంతే కాకుండా అన్ని చిట్కాల కన్నా ఎంతో  చౌకైన చిట్కా ఇది.నీరు ఎక్కువగా తాగడం వల్ల మీ శరీరానికి,  వ్యాధి సోకడానికి క్రిములు పుట్టించే విషము బయటకు పోయి,మీ శరీరాన్ని కాపాడుతుంది.

కలబంద తీసుకుని, దానిని ముఖానికి పట్టించాలి, ఒకవేళ మీ ఇంట్లో కలబంద లేకపోతే దగ్గర్లో ఉన్న మందుల షాపులో దొరికే కలబంద జల్ లేదా జూస్ ని కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇవి సహజమైన కలబంద లాగానే ఉపయోగపడతాయి,వీటితో పాటు ఐస్ ముక్కలు తీసుకుని ముఖానికి పట్టించి, కాసేపటి తరువాత శుబ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

మీ రోజువారీ ఆహారంలో వెల్లుల్లి తీసుకోండి,పరిశోధకులు ప్రకారం వెల్లుల్లి  మన చర్మంలోని కణాల కాలాన్ని పెంచి, చర్మాన్ని ఎంతో తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది.

నిమ్మరసం, తేనె మన చర్మ సౌందర్యానికి ఎంతో మంచిది,2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె ఈ రెంటిని కలిపి, ముఖానికి పట్టించి, ఒక 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకోవాలి, ఇలా రోజు చేస్తే మెరుగైన చర్మం పొందుతారు.

రోజు లేత కొబ్బరి కాయ నీరు తాగితే మీ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగ పడుతుంది.

రోజు నారింజ రసం తాగడం ఎంతో మంచిది,వీటిలో “C” విటమిన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల, అవి మీ చర్మాన్ని ఎంతో కాంతివంతంగా, మరియు యవ్వనంగా ఉంచుతాయి.

పైన సూచించిన వాటితో మరికొన్ని జతచేద్దామా:

రోజూ మీ ముఖాన్ని 2-3 సార్లు ఒక మంచి ” ఫేస్ వాష్” తో శుబ్రం చేసుకోండి, ఎక్కువగా చేసుకోవడం మంచిది కాదు.

సహజమైన స్క్రబ్స్  ఉపయోగించి మీ చర్మాన్ని వారానికి 2-3 సార్లు ” Exfoliate ” చేయండి. దాని వల్ల చనిపొయిన చర్మ కణాలు తొలగిపొయి, కొత్త కణాలు వస్తాయి.

వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదు, దాని వల్ల చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఎక్కువ.

ఎక్కువగా మీ ముఖమును, చేతులతో తాకవద్దు, ఎందుకంటే మీ చేతులకు ఉన్న మురికి వల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది.

సాద్యమైనంతవరకు సహజంగానే ఉండండి, “కాస్మటిక్స్” వాడకం తగ్గించడం ఎంతో అవసరం.

మీ చర్మము జిడ్డుగల చర్మం అయితే ఎక్కువగా పౌడర్ రాయడం మంచిది.

కాలనికి అనుగుణంగా మీ క్రీంలు, సబ్బులు మర్చడం ఎంతో అవసరం.

ఈ పై చెప్పినవన్నీ పాటిస్తే మీ చర్మము అందంగా, యవ్వనంతో కాంతివంతంగా ఉంటుంది అనడంలో సందేహంలేదు.

Posted on

Telugu tips with Baking soda – వంట సోడా తో సౌందర్య చిట్కాలు

బేకింగ్ సోడాను అందరూ  వంటగదిలో ఉపయోగించడం సహజమే, కాని ఎంతో మందికి తెలియని విషయం ఏమిటంటే  బేకింగ్ సోడా మన చర్మ సౌందర్యాన్ని రక్షించడంలో కూడ ఎంతో ఉపయోగపడుతుంది.

బేకింగ్ సోడాని “సోడియం కార్బోనేట్ ” అని పిలుస్తారు, దీని రసాయన లక్షణాలు మన చర్మాన్ని వ్యాధులభారీనుండి రక్షించడంలో ఎంతో సహాయపడుతుంది.

మన చర్మ సం రక్షణ కోసం బేకింగ్ సోడా చెప్పే చిట్కాలు తెలుసుకుందామా

చర్మ సంరక్షణ కోసం బేకింగ్ సోడా దాని ప్రయోజనాలు

బేకింగ్ సోడాని,నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత  గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే  కాంతి వంతమైన  చర్మం మీ సొంతం అవుతుంది.

మీ చర్మం లోని అందం దూరమైతే, కాంతివంతం కోసం చిట్కా కావాలంటే, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మరియు 2 టేబుల్ స్పూన్లు ఓట్స్(oats) తీసుకుని నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి కాసేపటి తరువాత శుబ్రం చేసుకుంటే, బేకింగ్ సోడా,  మలినాలతో పూడిపొయిన మీ చర్మ రంద్రాలని శుబ్రం చేసి సహజత్వం లేని మీ చర్మాన్ని  ఎంతో కాతివంతంగా, మరియు మృదువుగా చేస్తుంది.

మీరు అరికాళ్లు పగుళ్ళతో బాధపడుతుంటే, కొంచెం బేకింగ్ సోడాని గోరు వెచ్చని నీటీతో కలిపి ఒక 30 నిమిషాలు మీ కాళ్లని  నీటిలో ఉంచి, తరువాత శుబ్రం చేసుకోవాలి, ఈ పద్దతి వల్ల కొత్త చర్మ కణాలు పుడతాయి అందువల్ల మీకు అరికాళ్ళ పగుళ్ళనుండి విముక్తి లబిస్తుంది.

బేకింగ్ సోడాని మీరు స్నానం చేసే తొట్టెలో కాని, నీటిలో కాని వేసి ఒక 30 నిమిషాలు పాటు  ఆ తొట్టెలో స్నానం చేస్తే మీ శరీరంలోని చనిపొయిన కణాలు తొలగిపోయి, కొత్త కణాలు వస్తాయి, అవి మీ శరీరంలో దుర్వాసనను నశింపజేసి ,శరీరాన్ని తాజాగా ఉంచ్చుతుంది.

సూర్యుని కాంతి వల్ల, కందిపొయిన, దురద వస్తున్న, చిరాకు కలిగిస్తున్న శరీర సం రక్షణ కోసం, ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడాని కొంచెం నీటితో  కలిపి చర్మానికి రాస్తే శరీరం చల్లబడుతుంది.

మీ చేతి గోళ్ళు మరియు వాటి చిగుళ్ళ సం రక్షణలో కూడా ఈ  బేకింగ్ సోడాని ఉపయోగించుకోవచ్చు, ఎలా అంటే,  బేకింగ్ సోడాని, నీటిని 2:1 నిష్పత్తిలో కలిపి, కాటన్, లేదా బ్రష్ తో మీ గోళ్ళ పై, వాటి చిగుళ్లపై రాయండి, 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మిల మిల మేరిసే గోళ్ళతో పాటు మృదువైన చిగుళ్ళు లబిస్తాయి.

నల్ల మచ్చలు, మొటిమల వల్ల బాదపడేవారికి, కొంచెం  బేకింగ్ సోడాని నీటితో కలిపి ముఖానికి పట్టిస్తే మంచి కాంతివంతమైన చర్మంతో పాటు, నల్ల మచ్చలు, మోటిమలు తోలగిపోతాయి.

ఇలా వారానికి ఒక్క సారి చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

Posted on

Telugu tips for pimples and black spots – మొటిమలు, నల్ల మచ్చల నిర్మూలన కోసం సహజమైన పద్దతులు

పసుపు – చర్మాన్ని సం రక్షించే పదార్దాలలో, పసుపు ఎంతో ముఖ్యమైనది. ఇది మన చర్మంలోని జిడ్డు తనాన్ని తొలగించి, దద్దుర్లు, మొటిమల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది మన చర్మాన్ని నిగారింపచేసి ఎంతో అందంగా మరియు మృదువుగా మారుస్తుంది.

పసుపులోని గుణాలు చర్మాన్ని శుబ్రపరిచి, పనికిరాని అంటే సరిగా లేని చర్మాన్ని తోలగించి కొత్తగా, అందమైన మరియు, ఎంతో మృదువైన చర్మాన్ని ఇస్తుంది.

ఈ పసుపుతో చేసిన “ఫేస్ ప్యాక్” మొటిమల్ని నిర్మూలించి, చర్మాన్ని ఎంతో కాంతివంతంగా చేస్తుంది. ఇది మీ శరీరంలోని మలినాలని, దుమ్ము, ధూళిని, మరియు బ్యాక్టీరియా ని తొలగించి యాంటీ బాక్టీరియల్ గా  పనిచేస్తుంది.

పసుపు మీ చర్మంలోని జీవం కోల్పోయిన కణాలని తొలగించి, శుబ్రపరిచి, ఎంతో కాంతివంతమైన, మరియు తేజోవంతమైన చర్మాన్ని ఇస్తుంది. మన చర్మం లోని రంద్రాలని దుమ్ము మరియు మలినాల నుండి శుబ్రపరిచి, సహజత్వంతో కూడిన చర్మాన్ని ఇస్తుంది.

పసుపు మరియు ఓట్స్ పిండితో తయారు చేసిన “ఫేస్ ప్యాక్”

కావలసినవి :

పసుపు: 2 చిటికెలు (కొద్దిగా),

ఓట్స్ పిండి: 4-5 స్పూన్లు,

తేనె: 3-4 స్పూన్లు,

పచ్చి పాలు: 4-5 స్పూన్లు

తయారుచేసుకునే విధానం :

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి రాసుకుని  15-20 నిమిషాల తరువాత  గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, పాలు తేనే మన ముఖంలోని తేమను కాపాడతాయి, పసుపు మన ముఖం పై ఉన్న మచ్చలు, మోటిమలను శుబ్రం చేసి, ఎంతో కాంతివంతమైన చర్మాన్ని ఇస్తుంది.

ఈ చిట్కా పొడిగల చర్మం ఉండి మొటిమలతో బాధపడేవారికి ఎంతో మంచి ఫలితాలని ఇస్తుంది.

పసుపు & పెరుగుతో తయారు చేసిన “ఫేస్ ప్యాక్”

కావలసినవి :

పసుపు: 3-4 చిటికెలు (కొద్దిగా),

పెరుగు: 1\2 కప్పు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి రాసుకుని  15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే,సుర్యుని వేడి వల్ల మాడిన, లేదా రంగు మారిన చర్మం అందంగా మారుతుంది, ఈ మిశ్రమాన్ని ముఖానికే కాకుండా కాళ్ళు, చేతులకు కూడా రాసుకుని 15-20 నిమిషాల తర్వాత శుబ్రపరుచుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

పసుపు మరియు గంధముతో (sandal) తయారు చేసిన “ఫేస్ ప్యాక్”

కావలసినవి :

పసుపు: 3-4 చిటికెలు (కొద్దిగా),

గంధపు పొడి (sandal wood powder) 1-2 టేబుల్ స్పూన్లు,

పాలు: 1-2 స్పూన్లు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి రాసుకుని  10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే,మీ చర్మంలోని నల్లదనం మొత్తం పోయి ఎంతో కాంతివంతమైన, మృదువైన చర్మం  మీ సొంతం అవుతుంది.

పసుపు మరియు తేనెతో తయారు చేసిన “ఫేస్ ప్యాక్”

కావలసినవి :

పసుపు: 2 చిటికెలు (కొద్దిగా),

తేనె 2-3 టేబుల్ స్పూన్లు

పన్నీరు 1-2 టేబుల్ స్పూన్లు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి, మెడకి రాసుకుని  10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మీ ముఖం పై ఉన్న ముడతలు పోయి మృదువైన చర్మాన్ని పొందుతారు.

పసుపు మరియు నిమ్మరసంతో తయారు చేసిన “ఫేస్ ప్యాక్”

కావలసినవి:

పసుపు 1 టేబుల్ స్పూన్

నిమ్మరసం 1-2 టేబుల్ స్పూన్లు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి, మెడకి రాసుకుని  10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, ఈ మిశ్రమం ఒక  బ్లీచింగ్ లా ఉపయోగపడి మీ ముఖానికి  కాంతినిస్తుంది.

పైన సూచించినవి అన్నీ మీ చర్మ సౌందర్యాన్ని కాపడటానికి  ఎంతో ఉపయోగపడతాయి, అందమైన చర్మం పొందాలంటే పైన సూచించిన పాటించండి, మెరుగైన ఫలితాలు పొందుతారు.

Posted on

Beauty benefits of rosewater / panneeru in Telugu – మీ చర్మ సౌందర్య సంరక్షణలో పన్నీరు ఎలా ఉపయోగపడుతుంది.

స్త్రీలు వారి అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు, ఇప్పుడు ఎన్నో రకముల, చర్మ సౌందర్యాన్ని రక్షించే వస్తువులు మార్కెట్లో లభిస్తున్నాయి. కాని తర తరాలుగా, స్త్రీ యొక్క సౌందర్య సం రక్షణలో పన్నీరు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఈ పన్నీరు, మరియు “రోజ్ ఆయిల్ ” మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కలుపుకుంటే మీ మృదువైన చర్మాన్ని, చర్మ వ్యాధులు నుంచి కాపడుకోవచ్చు.

ఒకప్పటి కాలంలో పన్నీరుని ఎక్కువగా అన్నింటిలో ఉపయొగించేవారు, కానీ ఇప్పుడు కొన్ని కొన్ని ఉత్పత్తులలో మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారు.

మీ చర్మం పై పన్నీరు చేసే అద్భుతాలు తెలుసుకుందాం రండి:

1. ఈ పన్నీరు మీ చర్మంలో ఉన్న రంద్రాలని శుబ్రం చేసి, చర్మంలోని జిడ్డుని తీసేస్తుంది, అంతే కాకుండా నల్ల మచ్చలు, మొటిమలను దూరం చేసి, మీ ముఖం పై ఉన్న దుమ్ము, ధూళిని తొలగిస్తుంది .

2.మన ముఖంలో ఉన్న మంటపుట్టించే చర్మం, దద్దుర్లు, ముడతలు, మొటిమలు, వీటన్నిటిపై పోరాడే తత్వం కలిగి ఉండడం వల్ల, వీటి యొక్క నివారణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

3. దీనిని మీరు మీ “ఫేష్యల్” తర్వాత ఉపయోగిస్తే మీ చర్మంలోని ఓపెన్ రంధ్రాలను మూసివేసి, కణాలని ఆరొగ్యంగా ఉంచుతుంది, అంతే కాకుండా, దద్దుర్లూ, ఎర్రబడిన ప్రదేశాన్ని తగ్గించి, మంచి ప్రభావాన్ని  చూపిస్తుంది.

4. ఈ పన్నీరులోని సుగంధ పరిమళాలు మీ యొక్క మనసిక స్థితిని పెంచి, భావోద్వేగంతో కూడిన ఆలోచనలని తగ్గించి ప్రశాంతత ఇస్తాయి. ఇది మీకు నిద్ర సరిగా పట్టడానికి మరియు లేచిన వెంటనే మనసంతా ఎంతో ప్రశాంతంగా, ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

5. చాల సులువైన, మార్గం ఏమిటంటే మీరు రాత్రి పూట నిదురించే ముందు ఇది రాసుకుని పడుకుంటే, మీ ముఖం లోని మలినాలను శుద్ది చేసి, మరుసటి రోజు ఎంతో కాంతివంతంగా మెరిసే చర్మాన్ని ఇస్తుంది.

Posted on

Telugu fairness tips for men – పురుషులకు ఫెయిర్‌నెస్ టిప్స్

వినడానికి వింతగా అనిపించినా కొన్ని నిజాలు నమ్మక తప్పదు, అందరు మనల్ని, కళ్ళు ఆర్పకుండా చూస్తూ,మనం ఎంతో గొప్ప వాళ్ళం అని మన అందాన్ని ఆధారంగా  చేసుకునే నిర్ణయించుకుంటారు.

మనం ఎంత ధనవంతులమైన, గొప్పవారిమైన అందంగా లేకపొతే దాని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కునే ప్రమాదం ఉంది.ఎంతోమంది అనుకుంటారు అందం, దాని సం రక్షణ, కేవలం ఆడవారికే అని, అది చాల తప్పు, మగవారు కూడ అందంగా ఉండాలి, అప్పుడే ఎదుటివారు గౌరవిస్తారు.

మీ అందం గురించి దాని రక్షణ గురించి తెలుసుకునే ముందు అసలు మీ చర్మం ఏ రకం,జిడ్డుగల చర్మమా, పొడి గల చర్మమా, లేదా సాదారణ చర్మమా,సుర్యకాంతి వల్ల ఇబ్బంది కలిగే రకమా, ఇలా ముందుగా మీ చర్మం యొక్క రకాన్ని తెలుసుకుని దానికి తగిన పద్దతులలో,అందంగా చేసుకోవాలి.

మిమ్మల్ని అందంగా చేసి,అందరూ కళ్ళు ఆర్పకుండా చుసేలా ఏమి చేయాలో  తెలుసుకుందామా:

ముఖాన్ని శుబ్రపరుచుకోవాలి:

మీరు బాగా బద్దకం కలిగి ఉండి, చర్మ సౌందర్యం కోసం అంతగా ఆలోచించని వారైననూ, రోజూ మీ ముఖాన్ని “ఫేస్ వాష్” తో కాని, ఏదైన “క్రీం” తో కాని శుబ్రం చేసుకోవడం ఎంతోఅవసరం.ముందుగా మీ చర్మం యొక్క తత్వాన్న్ని తెలుసుకుని, తగిన క్రీం ని మాత్రమే ఉపయోగించాలి.సబ్బుని వాడకపోవడం ఎంతో మంచిది, ఎందుకంటే ఒక ఫ్రాన్స్ రచయిత్రి రచించిన “బ్యూటీ” అనే పుస్తకంలో సబ్బు గురించి ఇలా వర్ణించారు,”సబ్బు యొక్క ప్రభావం మెడ కింది బాగం లో ఉన్న చర్మానికే ఉపయోగ పడుతుంది” అని,

అందుకే సబ్బు కన్నా  రోజూ మీ ముఖాన్ని “ఫేస్ వాష్” తో కాని, ఏదైన “క్రీం” తో కాని శుబ్రం చేసుకోవడం ఎంతోఅవసరం.

చర్మంలోని మార్పు ఎంతో అవసరం:

మన చర్మంలోని కణాలు ఎప్పటికప్పుడు మారుతూ, చనిపొయిన చర్మ కణాలను తొలగిస్తూ ఉండాలి.దీని వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది.

ఇటీవల ఒక అధ్యయనంలో ఆడవారి కన్నా మగవారు అధిక శాతం యవ్వనంగా కనిపిస్తారు, ఎందుకంటే దానికి కారణం మగవారు షేవ్ చేసుకునే ప్రతీసారి వారి చర్మంలోని కణాలలో మార్పు వస్తూ, కొత్త కణాలు పుడతాయి.

సన్ స్క్రీన్

ప్రముఖ చర్మ సం రక్షణ నిపుణులు, చర్మ రోగ నిపుణులతో ” Oprah Winfrey’s publication ‘O’” వారు ఒక ప్రముఖ టాక్ షో నిర్వహించారు.అందులో ప్రతీ ఒక్కరు మన చర్మానికి సన్ స్క్రీన్ ఎంతో ఉపయోగకరం అని సూచించారు.

అయితే మనం బయటకు వెళ్ళే 30 నిమిషాల ముందు “సన్ స్క్రీన్ SPF 15” ఉపయోగించుట అవసరం, చాలా జగ్రత్తగా వాడాలి.

ఎక్కువసేపు బయట ఉండేవారు  SPF 30 ఉపయోగించుట మంచిది.

షేవ్ లేదా కత్తిరించండి

మగవారిలో జుట్టు పెరుగుదల సాధారణంగా ఉంటుంది, ఎక్కువగా షేవ్ చేసుకోవలసిన అవసరం లేదు, కాని మీరు చేసుకునే అప్పుడు మాత్రం ఒక్కసారి అన్నీ సరిచూసుకోండి. మంచి “రేజర్”, క్రిములను నాశనం చేసి మృదువుగా చేసే జల్ కాని క్రీం కాని ఉపయోగించండి. ఆల్కహాల్ లక్షణాలు ఉన్న వాటిని దూరంగా ఉంచండి, ఎందుకంటే ఇవి మన చర్మంలో ఉన్న సహజ నూనెలను కరిగించేసి మన ముఖాన్ని పొడిగా,నిర్జీవంగా, అందవికారంగా తయారు చేస్తాయి.

మీ చర్మాన్ని ఎప్పటికప్పుడు తేమగా ఉంచండి

సాధారణంగా మగవారి చర్మం స్త్రీల కన్నా ఎక్కువ జిడ్డు కలిగి ఉంటుంది, అందువల్ల ఎక్కువ శాతం ముడతలు వచ్చే ప్రమాదం ఉంది. మన చర్మాన్ని ఎప్పటికప్పుడు తేమగా ఉంచే “మాయిశ్చరైజర్ లేదా క్రీమ్” ని వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. షేవింగ్ మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తే, షేవ్ చేసుకున్న తరువాత, లేదా పడుకునే ముందు మాయిశ్చరైజర్ లేదా క్రీమ్ ఉపయోగిస్తే ఎంతో మంచిది. మనం పైన అనుకున్న విదంగా చేయడం కోసం,ఖరీదైనవి వాడవల్సిన పని లేదు, మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం అనేదే, మంచిదే,అలోచించి, ఆచరించండి.

Posted on

Beauty secrets with egg in Telugu – అందానికి, ఆరోగ్యానికి, కోడి గుడ్డు చెప్పే సూత్రాలు

ప్రపంచంలోని ప్రతీ ఒక్కరు, తమ చర్మ సౌందర్యం కోసం, జుట్టు సం రక్షణ కోసం ఎంతగానో అలోచిస్తారు. అయితే మీరు కూడా మీ జుట్టు పొడవుగా, అందంగా, ఉండాలని కోరుకుంటు న్నారా, లేదా, మృదువైన చర్మం కోసం ఏమిచేయాలి అని సతమతమవుతున్నారా, అయితే తక్కువ ఖర్చుతో మీ ఇంట్లోనే మీ ప్రశ్నలకు సమాధానం  లబిస్తుంది. అది ఏమిటంటే,

ఈ ప్రశ్నలన్నింటికి కోడి గుడ్డ్లు చెప్పే చిట్కాలు చూద్దామ.

కోడి గుడ్డ్లలోని “లూటిన్” మీ చర్మాన్ని  “ఎలాస్టిక్” గా చేయడానికి,  మరియు “హైడ్రేట్” చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మీ చర్మ కణాలని సుద్దిచేసి, మీ చర్మాన్ని గట్టిగా  చేస్తాయి. అంతేకాకుండా మీ జుట్టుకి బలంతో పాటు , మెరుపుని ఇస్తాయి. వీటిలోని “ప్రొటీన్లు” మనలోని జుట్టు మరియు గోళ్ళు పెరుగుటలో ఎంతో సహాయ పడతాయి.  మీరు అందమైన చర్మం,  సహజమైన జుట్టు పొందాలంటే,  మీరు రోజూ తినే ఆహారంలో కోడి గుడ్డుని కూడా కలిపి తీసుకోండి.  మీ అందం పైన, మీ జుట్టు పైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

మీ చర్మ సౌందర్యం కోసం కోడి గుడ్డ్లు వాటి ప్రయోజనాలు

మీ మెరుగైన చర్మం కోసం:

ఒక గుడ్డు తీసుకుని,దానిలోని సోనని ముఖానికి పట్టించి అది గట్టి పడిన తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, చర్మం గట్టిపడడమే కాకుండా, మంచి కాంతివంతముగా మెరుస్తుంది.

 మీ చర్మం యొక్క గట్టిదనం కోసం:

ఒక గుడ్డు తీసుకుని, దానిలోని పచ్చ సొన, తెల్ల సొన రెండింటిని వేరు చేసి,తెల్లసొనని ఒక గిన్నెలో బాగా కలిపి ముఖానికి పట్టించాలి,  అది గట్టి పడిన తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే అది మన చర్మ కణాలని గట్టి పరచడమే కాకుండా, మొటిమలును తగ్గించేందుకు సహాయపడుతుంది

కళ్ళ కింద సహజత్వం కోల్పోయిన, లేదా ఉబ్బిన చర్మం కోసం:  

మీరు మీ కంటి కింద చర్మం వాపుతోటి బాధపడుతున్నారా,ఎంతో అలసటగా అనిపిస్తుందా అయితే ఒక గుడ్డు తీసుకుని, దానిలోని తెల్ల సొనని ఆ వాచిన ప్రదేశం పై రాసి ఒక 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రపరుచుకుంటే, ఆ వాపులు తగ్గి మంచి సత్ఫలితాన్నిస్తుంది.

కోడి గుడ్లతో తయారు చేసుకునే “ఫేస్ ప్యాక్స్”, వాటి ప్రయోజనాలు:

మీ జిడ్డుగల చర్మం కోసం కోడి గుడ్డు-బియ్యపు పిండి మిశ్రమము:

గుడ్డులోని తెల్ల సొనని తీసుకుని,కొంచెం కొబ్బరి నూనె కలిపి ,బాగా మిక్స్ చేసి మీ ముఖానికి , మెడకి పట్టించాలి, తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి, ఇలా చేస్తే మీ చర్మము జిడ్డు లేకుండా కాంతివంతంగా అవుతుంది, ఈ పద్దతి మీ జిడ్డుని పొగొట్టుకోవడానికి ఎంతో సులభమైనది.

 మీ పొడిబారిన చర్మం కోసం:

గుడ్డులోని పచ్చ సొన, ఆలీవ్ నూనె మిశ్రమం:

గుడ్డులోని పచ్చ సొన తీసి, కొంచెం నిమ్మ రసం,కొంచెం పచ్చి ఆలివ్ నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి,  కాసేపటి తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే,మీ పొడి చర్మం ఎంతో అందంగా మారుతుంది, ఈ పద్దతి పొడి చర్మంతో బాదపడే వారికి ఎంతో ఉపయోగకరం.

మీ మృదువైన, తేజోవంతమైన, మెరిసే చర్మం కోసం:

గుడ్డు, తేనే, రోజ్ వాటర్ మిశ్రమము:

గుడ్డు,ఒక స్పూన్ తేనే, కొంచెం ఆలీవ్ నూనే, 2 స్పూన్లు రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి,20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే, మృదువైన, ఎంతో కాంతివంతమైన చర్మంతో పాటు, నల్ల మచ్చలు సైతం తొలగిపోతాయి.

 మీ మెరిసే చర్మం కోసం:

గుడ్డు, పెరుగు మిశ్రమము:

గుడ్డులోని పచ్చ సొనలో కొంచెం తేనే, పెరుగు కలిపి మీ ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే, మెరిసే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.

మీ చర్మం యొక్క మెరుగైన చాయ కోసం:

గుడ్డు, తేనే  మిశ్రమము :

గుడ్డులోని తెల్ల సొనని తీసుకుని ఒక స్పూన్ తేనె కలిపి మీ ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, నల్ల మచ్చలు పోయి, మీ చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.

అందమైన జుట్టు కోసం కోడి గుడ్డు చిట్కాలు :

గుడ్డు, పెరుగు హయిర్ కండీషనర్:

ఒక గుడ్డు, పెరుగు, 1 స్పూన్ పచ్చి ఆలీవ్ నూనె, కొంచెం బాదం నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని  మీ ముఖానికి పట్టించి 45 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, మిల మిల మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది.

గుడ్డు, నిమ్మరసం హయిర్ కండీషనర్:

కొంచెం నిమ్మరసం తీసుకుని, గుడ్డుని కలిపి మీ జుట్టుకి పూర్తిగా పట్టించాలి, ఒక అరగంట తరువాత మీ షాంపూతో తలస్నానం చేయాలి,ఈ పద్దతి వల్ల మీ జుట్టు బాగ పెరగడమే కాకుండా, ఎంతో మృదువుగా కూడా అవుతుంది.

 అందం కోసం కోడి గుడ్డు చిట్కాలు:

జిడ్డుగల జుట్టు కోసం గుడ్డులోని తెల్ల సొన:

మీ జుట్టు పొడిగా,జిడ్డుగా, నిర్జీవంగా ఉంటుందా, అయితే ఈ చిట్కా మీ కోసమే, గుడ్డులోని తెల్ల సొన తీసుకుని మీ జుట్టుకి పట్టించి, అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో  శుబ్రం చేస్తే, మంచి ఫలితం లబిస్తుంది.

పొడి జుట్టు కొసం గుడ్డు,  వెన్న తీసిన పాల మిశ్రమము: ఒక కప్పు వెన్న తీసేసిన పాలలో గుడ్డు కలిపి, మీ జుట్టికి పట్టించి 30 నిమిషాల తరువాత షాంపూతో స్నానం చేస్తే ఎండిపొయినట్లు, జీవం కోల్పోయినట్లు ఉన్న జుట్టుకి మంచి మెరుపు లభిస్తుంది.

Posted on

Telugu tips for pimples and pimple marks – మొటిమ‌లు పోవాలంటే

మిమ్మల్ని మొటిమలు వేదిస్తున్నాయ, ఎన్ని రకములుగా ప్రయత్నించినా ఫలితం లేక ఇబ్బంది పడుతున్నరా, మీ చర్మం మొటిమ రహితంగా కావాలంటే ఈ సహజ పద్దతులు పాటించండి మంచి ఫలితాలతో పాటు అందమైన, సొగసైన చర్మాన్ని పొందుతారు. సహజ పద్దతులంటే పండ్లు, మూలికలతో మీ సమస్యని  దూరం చేసి మీ శరీరం పై మంచి ప్రభావాన్ని చూపించి మీ ముఖం పై మచ్చలు లేకుండా అందంగా మారుస్తుంది. ఈ పద్దతులు శరీరం పై ఏ దుష్ప్రబావం లేకుండా మొటిమలపై పోరాట పటిమను ప్రదర్శిస్తాయి, మొటిమల నిర్మూలన కోసం చర్మ వైద్య నిపుణులు సూచించిన కొన్ని సహజ పద్దతులు మీకోసం

“కలబంద మరియు పసుపు” ప్యాక్:

కలబందలోని ఎంజయ్మ్స్(enzymes) అయిన పోలీసచ్చరిడ్స్(Polysaccharides) మరియూ న్యూట్రీన్లు,  యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ (antibacterial & antifungal) గా పోరాడి ప్రతిభను ప్రదర్శిస్తాయి. ఇది సహజ టాక్సిన్స్ వ్యతిరేకంగా పోరాడి చర్మాన్ని మృదువుగా, కోమలంగా ఉంచుటలో సహాయపడుతుంది .

పసుపు మహాద్బుతంగా చర్మాన్ని కాపాడే ప్రక్రియలొ సహాయపడుతుంది. మీ చర్మానికి మంట కలిగే ప్రదేశాలని చల్లగా చేసి, మచ్చలని తొలగించి, వాపు వచ్చిన ప్రదేశాలలో వాపుని కరిగించుటలో సహాయ పడుతుంది. మీ చర్మ చాయని పెంచి కోమలంగా మరియూ తేజోవంతంగా చేస్తుంది.

“ఫసుపు, తేనే, పాల”  ప్యాక్:

1 1 చెంచ పసుపు, తేనె, పన్నిరు, మరియు కలబంద కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే, మచ్చ మరియు మొటిమ రహితమైన చర్మం పొందుతారు.

“సిట్రస్ పండ్లు” ప్యాక్ :

సిట్రస్ పండ్లు నిమ్మ, నారింజ, అనేవి రక్త స్రావ లక్షణాలు కలిగి, చర్మంలోని “బ్యాక్టీరియ”ను తుడిచేసి చర్మాన్ని తేజోవంతంగా, మరియు అందంగా ఉంచుతుంది.

ఈ పండ్ల యొక్క గుజ్జుని ముఖమునకు రాసుకుని, 15 నిమిషాలు అలాగే ఉంచాలి, అంతేకాకుండా నిమ్మరసాన్ని ముల్తాని మట్టీ,నీరు కలిపి కూడా ఉపయోగించుకోవచ్చు, ముల్తాని మట్టి వల్ల మొటిమల పెరుగుదలని అణచి వేస్తుంది, ఈ విధముగా ముఖమునకు రాసుకుని కాసేపటి తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రపరచాలి.

ముందు మీ చర్మం యొక్క తత్వాన్ని అర్దం చేసుకోండి :

ఈ సహజ పద్దతులు అన్నీ ఎంతో మంచి ఫలితాలని ఇచ్చేవే, కాకపోతే మీ శరీర యొక్క తత్వాన్ని అర్దం చేసుకుని వాడుట ఎంతో శ్రేయస్కరం.

సాదారణ చర్మం :

ఒకవేళ మీ చర్మం సాధారణ రకం అయితే మీ చర్మం యొక్క కణాలు అ విదమైన జిడ్డుని విడువవు. సాధారణ చర్మం అతి స్వల్ప సమస్యాత్మక శరీరం.

పొడి చర్మం:

ఒకవేళ మీది పొడి చర్మం అయితే కాగితం చాల పొడిగా ఉండి తీసినవెంటనే మీ చర్మం గట్టిగా, పొడిగా, పొరలుగా అనిపిస్తుంది.

జిడ్డు చర్మం:

మీది జిడ్డు చర్మం అయితే కాగితం, మీ ముఖ భాగంలోని  బుగ్గలు, ముక్కు, మరియు నుదురు సంబంధిత ప్రదేశాలలో, జిడ్డుని గ్రహిస్తుంది. ఈ చర్మం, ఎంతో సమస్యాత్మకమైనది, ఇది పేలగ, మందముగా కనిపిస్తుంది.అందువల్ల మోటిమలు పెరిగే అవకాసం ఎక్కువ.

కలయిక చర్మం:

చాల మంది స్త్రీలలో ఈ కలయిక చర్మం ఎక్కువగా ఉంటుంది. ఈ చర్మం పై కాగితం ముక్కు, నుదురు పై తప్పితే బుగ్గలపై జిడ్డు గ్రహించదు.

సున్నితమైన చర్మం:

సున్నితమైన చర్మం సాధారణంగా చాలా పొడి ఉండి గట్టి అనుభూతినిస్తుంది. ఎక్కువగా వాపు రావడం, చిరాకు కలగడం,దురద పుట్టడం, చర్మం ఎర్రగ అవడం,చివరకు ముఖం పై చిన్న చిన్న మచ్చలకు దారితీస్తుంది

పాలు: పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల, ఇది పొడి చర్మానికి చాలా ఉపయోగపడుతుంది, జిడ్డు చర్మాన్ని పాలకు దూరంగా ఉంచడం చాల అవసరం ఎందుకంటే పాలలో ఉన్న కొవ్వు వల్ల జిడ్డు చర్మం మరింత జిడ్డుగా మారే ప్రమాదం ఉంది.

సిట్రస్ పండ్లు: ఇది పొడి చర్మం పై ఉపయోగిస్తే, తేమని తొలగించి మరింత పొడిగా మారుస్తుంది.అందుకే జిడ్డు చర్మం పై ఉపయోగిస్తే జిడ్డుని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. సాదారణ చర్మం కలవారు బాగా సాంద్రత తగ్గిన నిమ్మ రసాన్ని కూడా ఉపయోగించవచ్చు

తేనె: ఇది సాదారణంగా తేమను తగ్గించేదిగా పని చేస్తుంది, అందువల్ల అన్ని రకముల చర్మాలకు ఉపయోగించుకోవచ్చు .

Posted on

Orange face packs in Telugu – అందానికి, చర్మ సౌందర్యానికి “ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్”

మన చర్మ సౌందర్యానికి పండ్ల ఫదార్దములు ఎంతో మేలు చేకూరుస్తున్నయి,అందువల్లనే ఇప్పటికీ ఎంతో మంది ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మం కోసం “కాస్మొటిక్ ప్యాక్స్” కన్నా “ఫ్రూట్ ప్యాక్స్” ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉపయోగిస్తూ ఉంటారు. చర్మ సౌందర్య సం రక్షణను పెంపొందించే పండ్లలో నారింజ ఎంతో ఉపయోగకరమైనది.

నారింజలొ “కాల్షియం” మరియు “విటమిన్ భ్” పుష్కలంగా ఉన్నయీ అనడంలో సందేహం లేదు,ఇవి మనలోని ఎముకల్ని ధ్రుడంగా చేయడంలో ఎంతో సహయపడతాయి.మన శరీర సం రక్షణలో నారింజది ఒక అద్భుతమైన పాత్ర అని చెబితే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఫ్రూట్ జూస్ రూపంలో, గుజ్జు చేసుకుని, పండు పై భాగము అనగ తొక్కని పొడి చెస్కుని ఎలా ఎన్నొ రకాలుగా ఉపయోగపడుతుంది.

“ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్””, వాటి ఉపయోగాలు తెలుసుకుందాం

ఆరెంజ్ ఫేస్ ప్యాక్1:

నారింజని 2 ముక్కలుగా కోసి ఒక ముక్కలోని రసాన్ని పిండి, అందులో 2 Tbsp పెరుగు కలిపి ముఖమునకు పట్టించి 15-20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడిగితే, ముఖమంతా చల్లగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, అంతే కాకుండా జిడ్డుతనం పోయి మ్రుదువుగా మరియు కాంతివంతంగా కూడా అవుతుంది.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్2:

నిమ్మరసాన్ని ఒక గ్రాము పిండిలో కలిపి పేస్ట్ గా మారిన తరువాతా ముఖానికి పట్టించి 20 నిమిషాల అరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే చాలా మ్రుదువైనా, కాంతివంతమైన, కోమలమైన చర్మం లభిస్తుంది.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్3:

2 Tbsp నారింజ రసంలో, 1 Tbsp తేనె, 1 Tbsp నిమ రసం కలిపి ముఖమునకు రాస్తే మొటిమలని నివారించడమే కాకుండా, మచ్చ రహితమైన, అంటే మచ్చలు లేని పరిశుబ్రమైన, తేజోవంతమైన చర్మం లభిస్తుంది

ఆరెంజ్ ఫేస్ప్యాక్4:

నారింజ రసంలో బంక మట్టి, లేదా ముల్తాని మట్టి+పాలు కలిపి ఒక అరగంట సేపు తరువాత ముఖానికి రాసి మరొక 20 నిమిషముల తరువాత గొరు వెచ్చని నేటితో శుబ్రపరుచుకోవాలి.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్5:

నిమ్మ కాయ బయట ఉండే తొక్కని పొడిగా చేసి  అందులో, గంధం పొడిని జతపరిచి, పాలు\నీళ్ళూ\రోజ్ వాటర్ ని కలిపి పేస్ట్ గా అయిన తరువాత  ముఖానికి  పట్టించి పొడిగా మారిన తరువాత అంటే ఒక 30 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి మెత్తటి టవల్ తో శుబ్రం  చెసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.

ఒక వేళ మీది మొటిమలకు గురైన చర్మం అయితే పైన సూచించిన విదానంలో పాలకు బదులు \నీళ్ళూ\రోజ్ వాటర్ ఉపయోగించితే మంచిది