Posted on

Tomato skin care tips in Telugu – ఆరోగ్యవంతమైన మరియు తేజోవంతమైన చర్మం కోసం టమటా చెప్పే చిట్కాలు

పార్టీకి వెళ్తున్నాం అందంగా, కనపడాలి అని ఎంతో మంది ఖరీదైన “క్రీంలు” మరియు “ఫేష్యల్స్” వాడతారు, చిత్రమేమిటంటే తెలిసీ తెలియక మన డబ్బుతో మనమే మన చర్మ సౌందర్యాన్ని ఎంతో ప్రమాదకరమైన “కేమికల్స్” కు  గురి చేసి పాడు చేసుకుంటున్నాము. సరిగా గమనిస్తే తాజా పండ్లు మన చర్మాన్ని ఎంతో అందంగా మరియు కాంతివంతంగా తయారు చేసి మంచి సం రక్షణను చేకూరుస్తాయి.  టమాటా మన అపురూపమైన చర్మాన్ని కాపాడు కోవడానికి, ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మన చర్మ రంద్రాలను శుద్ది చేస్తూ చర్మ రక్షణకై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.

 • సహజమైన, కాంతివంతమైన చర్మం కోసం టమాట “ఫేస్ ప్యాక్స్”……  . మీరు చేయవలసిందల్లా  ముందుగా కొన్ని టమాటాలు తీస్కొండి, గుజ్జుగా చేసి, కొంచెం ఓట్స్ (బియ్యపు పిండి), ఒక స్పూన్ పెరుగు కలిపి,  మీ ముఖమునకు, మెడకు పట్టించి కొన్ని నిమిషాల తర్వాత శుబ్రం చేసుకుంటే మీ చర్మాని నల్లగా చేసే పదార్దాలు తొలగిపొయి, చర్మం ఎంతో కాంతివంతంగాను మరియు మ్రుదువుగా తయారవుతుంది.
 • గుజ్జుగా చేసిన టమాటాలు, నిమ్మకాయలోని సగం తీసుకుని, నిమ్మరసాన్ని, టమాట గుజ్జుని కలిపి ముఖమునకు, మెడకు పట్టించుకొని అది పొడిగా అయ్యేవరకు వేచి ఉండాలి కొన్ని నిమిషాల తర్వాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మీ చర్మాని నల్లగా చేసే పదార్దాలు తొలగిపొయి మంచి ఉపసమనాన్ని పొందుతారు.
 • మి ముఖాన్ని నల్లమచ్చలు  ఇబ్బంది పెడుతుంటే “ముల్తానీ మట్టీ “, టమాటా గుజ్జు కలిపి ముఖానికి రాసుకుని మెల్లగా రుద్దాలి, ఎక్కువగ రుద్దినను ప్రమదమే, శరీరం ముడతలు పడిపొతుంది.15 నిమిషాల తరువాత గొరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని ఆస్వాదించవచ్చు.
 • మంచి అందమైన కాంతివంతమైన చర్మం కోసం గంధం పొడిని టమాట గుజ్జుతో కలిపి కొంచెం నిమ్మరసం వేసి ఆ పేస్ట్ ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ప్రభావం చూపిస్తుంది.
 • బిజీ సమయంలో, టైము లేదు అనుకుంటే టమాటాల గుజ్జుని 2 Tbsp పాలతో కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా, ప్రకాసిస్తుంది.
Posted on

Glowing skin tips in Telugu – మెరిసే చర్మం కోసం సహజ పద్దతులతో కూడిన జాగ్రత్తలు

ఈ ఆదునిక ప్రపంచంలో అందాన్ని కాడుకోవటం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, మార్కెట్లో దొరికే ఎన్నో వస్తువుల్ని కొనుగోలు చేసి వాడుట వల్ల మన అందానికి వచ్చే ఫలితం ఎమీ లేకపోగా మన జేబులు ఖాళీ ఔతున్నాయి. ఎందుకంత ఖర్చు పెట్టడం, మీరు సరిగ్గా గమనిస్తే , మన ఇంట్లోనే ఖర్చు లేకుండా మన అందాన్ని కాపాడుకునేవి ఎన్నో ఉన్నాయి, ఇవి ఎంతో సహజమైనవి మరియు ఆరోగ్యానికి, చెర్మానికి హాని కలిగించనివి. ఖర్చు లేకుండా మీ చర్మ రక్షణ కై ఈ 10 సూత్రాలు పాటించండి

మీ చర్మ రక్షణకై ఉత్తమమైన 10 సూత్రాలు ఇవే:

 • కొంచెం వెనిగర్, కొంచెం నీరు తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడ భాగానికి పట్టించి కాసేపటి తరువాత మెత్తని గుడతో కాని, లేదా కాటన్ తో తుడిస్తె మంచి ఫలితాన్నిస్తుంది
 • రోజ్ వాటర్ లో కర్పూరాన్ని కలిపి మెత్తని గుడ్డతో ముఖాన్ని రోజుకి 3-4 సార్లు తుడుచుకుంటే మంచి ఉపయోగం ఉంతుంది
 • ఇంకా తేలికైన చిట్కా ఎమిటంటే  నిమ్మ రసాన్ని మీ ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.
 • 4 Tbsp రోజ్ వాటర్ లో 1\3 Tbsp పటికను, 100గ్రాం గ్లిసరిన్, బాగా కలిపి ముఖానికి పట్టించి  10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం  చేసుకోవాలి.
 • కీరా దోసకాయని  తీసుకుని అర కప్పు పెరుగులో కలిపి 5-10 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.
 • ఆపిల్ ని ఒక 1 Tbsp తేనె తో కలిపి మీ ముఖానికి పట్టించి 5-10 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మము ఎంతో తాజాగా మరియూ కాంతివంతమవుతుంది.
 • చమోమిలే టీ బ్యాగ్ ని 100మి నీటిలో వేడి చేసి ముఖంపై ఆ నీటిని రాసుకుని 20 నిమిషాల తరువాత చలని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మము ఎంతో తాజాగా ఉంటుంది.
 • మీ ముఖాన్ని ముందుగా శుబ్రం చేసుకుని  కోడి గుడ్డు లోని తెల్ల సొనని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకోవాలి
 • 1\4 Tbsp నూనెలో 1\4 XXX నిమ్మ రసం, 1 Tbsp తేనె  కలిపి మీ ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి వెచ్చనినీటితో శుబ్రం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.
 • 1 Tbsp పాలు, 1 Tbsp తేనె, 1 కోడి గుడ్డు కలిపి మీ ముఖానికి పట్టించి 10-15 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మము ఎంతో తాజాగా మరియూ కాంతివంతమవుతుంది.
Posted on

Wrinkles skin care tips in Telugu – ముడతలు పడిన మరియు ఒడిలి పోయిన చర్మ సంరక్షణకై టిప్స్

 

ఎవరో చెప్పినట్లు “మానవుడు ఎది తినాలనిపిస్తే అదే తినొచ్చు” పెద్దలు చెప్పినట్లు మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొవడం ఎంతో అవసరం.దే విధంగా మనం తీసుకునే ఆహారం మన శరీరంలో అనేక మార్పులకు కారణం కావచ్చు, ఈ మార్పులు తిరగ దోడటానికి వీలులేనవిగా ఉండవచ్చును, ముఖ్యంగా బాహ్య ప్రపంచానికి వచ్చేసరికి చుట్టుపక్కల వాతావరణము, సూర్య కాంతి, కాలుష్యము ఇలాంటి ఎన్నో వాటి నుండి మనల్ని రక్షించే మన శరీర బాహ్య భాగము అయిన మన చర్మం వీటి వల్ల తిరగ దోడటానికి వీలులేని ఇబ్బందులని ఎదుర్కునే ప్రమాదం ఉంది.

మన శరీర ఆక్రుతిలోని మార్పులకు శరీరంలోని తేమ శాతం తక్కువగా ఉండటం ఒక కారణం అందువలన  మన చర్మ సం రక్షణ కై ఎంతో జాగ్రత్త వహించాలి.  మంచి ఆహారం తెసుకోవడమే  కాకుండా  అది మన శరీర తత్వానికి సరియైనదో  కాదో తెలుసుకోవాలి. అయితే , బదులుగా ఖరీదైన చికిత్సలు మునిగిపోవడం కంటే  కొన్ని సాధారణ గృహ చిట్కాలు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. మీ చర్మం యొక్క భద్రత కోసం ఈ సాధారణ మరియు సులభంగా ఇంట్లో తయారు చేసుకునే “ఫేస్ మాస్క్” ల గురించి తెలుసుకుందాం.

ముడతలు పడిన మరియు ఒడిలి పోయిన చర్మం కోసం ఇంట్లో తయారు చేసుకునే “ఫేస్ మాస్క్ “

 • 2 టేబుల్ స్పూన్ ల పాలు , 1\2 టేబుల్ స్పూన్ తేనెని విటమిన్ ఏ నూనెను కలిపి మీ ముఖం మరియు మెడ మీద  పట్టించాలి. 10 నిమిషాలు తర్వాత చల్లటి  నీటితో కడగండి.  విటమిన్  ‘ ఏ’  చర్మంలో ఉన్న మచ్చలను మరియు ముడతలను  తగ్గించుటలో  సహాయపడుతుంది
 • అరటి పండుని గుజ్జుగా చేసి ఈ పేస్ట్ ని మీ ముఖం మరియు మెడ మీద  పట్టించాలి.10 నిమిషాలు తర్వాత చల్లని నీటితో కడగండి.అరటి పండు మన చర్మాన్ని గట్టిపరచి మ్రుదువైన కోమలత్వాన్ని ఇస్తుంది.రెండు  టేబుల్ స్పూన్ ల పెరుగుని నిమ్మ రసంతో కలిపి మంచి ఫలితాల కోసం రోజూ చేయండి. 
 • తాజా కలబంద వేరా జెల్ / రసం తో మీ ముఖాన్ని మర్దనా చేసినచో కలబందలో ఉన్న ఔషద లక్షణాలవల్ల చెర్మం గట్టిపడి ఏ విధమైన చర్మ వ్యాదులు వ్యాపించకుండా సహాయ పడుతుంది.
 • ఒక గిన్నె లో ఒక అవెకాడో పండు గుజ్జు తీసుకుని దానికి అదనపు పచ్చి ఆలివ్ నూనె 2 స్పూన్స్ జోడించండి. ఈ పేస్ట్ ని మీ ముఖం మరియు మెడ మీద  పట్టించాలి. 30 నిమిషాలు తర్వాత చల్లని నీటితో కడగండి.
 • గులాబి నీటిలో గంధం పొడిని కలిపి, ఈ పైన సూచించినవన్నీ చేయడం వల్ల  మీరు మంచి తేజోవంతమైన, మ్రుదువైన చర్మాన్ని పొందుతారు,
 • దీనితో పాటు రోజుకి 8 గ్లాసులు నీరు తాగితే చెర్మంలొ తేమ తత్వం పెరిగి చర్మం పొడిబారకుండా చెర్మ వ్యాదులకు దూరంగా పటుత్వంతో  ఉంటుంది.

ముందుగా మీ చెర్మానికి క్రీం లేదా లోషన్ ని పట్టించి క్రమం తప్పకుండా ఈ చిట్కాలు  పాటిస్తే మంచి సత్ఫలితాలు పొందవచ్చును 

Posted on

Skin care tips in Telugu – చక్కటి చర్మం కోసం సహజమైన పద్ధతులు

మనం తీసుకునే రోజూ వారి జాగ్రత్తలలో స్కిన్ టోనింగ్ అనేది ఎంతో ముఖ్యమైనది, మన శరీర ఆక్రుతిని, సహజత్వాన్ని కాపడుకోవడానికి  ఈ పద్దతి ఎంతో అవసరం.

ఇది మన శరీరంలో ఉన్న అధిక జిడ్డు, దుమ్ము, ధూలిని తగ్గించి చర్మాన్ని ఎంతో కాంతివంతంగా ఉంచుతుంది.

మనం మన ముఖసౌందర్యం కోసం,ఎంతో ఖర్చుపెడుతూ, మార్కెట్లో దొరికే ఎన్నో ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నాము, మన జేబులు ఖాళీ అవడం తప్పితే, వీటి వల్ల ఇబ్బందులే తప్ప ఉపయోగం ఉండదు.

అలా అని చింతించనవసరం ఏ మాత్రమూ లేదు,  మీ ఇంట్లొనే సహజ పద్దతులతో,ఎన్నో అద్బుతాలు చేయవచ్చు. ఏ దుష్ఫలితాలు లేని ప్రభావాన్ని పొందవచ్చు.

మనకు ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో, కూడిన ఈ పద్దతి ఎంతో సులభంగా మరియు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాల్ని ఇస్తుంది.

 • 1.5 లీటర్ల వేడి నీటిని పుదీనా ఆకుతొ కలపాలి, 10 నిమిషాల తరువాత, రెండింటిని  వీరుచేసి చూస్తే చక్కటి పుదీనా మిస్రమము మిగులుతుంది, కాటన్ ప్యాడ్ ని ఉపయోగించి  మొహాన్ని శుబ్రపరుచుకోవలి.
 • దొసకాయని చల్లటి పెరుగుతో కలిపి ముఖమునకు పట్టించి 5-10 నిమిషాలు ఉంచితె మంచి సత్ఫలితాల్ని ఇస్తుంది, ఇది జిడ్డు ఎక్కువగా వ్యాపించే చర్మానికి ఎంతో శ్రేయస్కరం.
 • గులాబీ నీరు సీసా లో కర్పూరం ఒక చిటికెడు ఉంచండి, రోజుకి 3-5 సార్లు మొహానికి పట్టించండి, మంచి ఫలితాలు పొందవచ్చు.మోటిమలతొ భాధపడేవారికి ఇది  మంచిగా ఉపయోగపడుతుంది
 • వెనిగర్ ని గులాబీ నీటిని సమ పాళ్ళలొ కలిపి ముఖానికి పట్టిస్తే చర్మం పై ఉన్న క్రిములు అన్ని నశించి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
 • ఛమొమిలె టీ బ్యాగ్ ని 5 నిమిషాలు వేడి నీటిలో ఉడికించి ఉపయొగిస్తే మంచి ఫలితాల్ని ఇస్తుంది.
 • నిమ్మ రసం కూడా మన చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో ఎంతో ఉపయొగపడుతుంది,
 • 10 నిమిషాలు నిమరసాన్ని పట్టించి మసాజ్ చేసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా prakaasistundi.
 • ఇంట్లో లబించే ఏ నివారణి అయిన రాసుకుని తరువాత ముఖం పైన కోడి గుడ్డులోని తెల్ల సొన మాస్క్ వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఆద్భుతమైన ఫలితాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.
Posted on

Control body odor tips in Telugu – శరీర దుర్వాసన నియంత్రణకు చిట్కాలు

శరీర దుర్వాసన, చెమట మరియు ఇతర చర్మ స్రవాలు నుంచి తలెత్తు చెడు వాసన.ఈ దుర్వాసనను భరించడం ఎంతో కష్టం, ఇది మిమ్మల్ని స్నేహితుల లేదా ఇతర సమావేశాల నుంచి దూరం చేస్తుంది.మీరు ఎలాంటి కోవకు చెందిన వారైనను, ఈ చెడు వాసన మితో ఉన్నవారినే కాదు మిమల్ని కూడా ఎంతో ఇబ్బందికి  గురిచేసి అసౌకర్యాన్ని కలిపిస్తుంది.

 • ఇది ప్రతి మనిషిలొ ఉండే సమస్య అయినప్పటికి ప్రతీ వ్యక్తి వివిధ రకముల శరీరం కలిగి ఉండటం వల్ల, మనిషికి ఒకరికీ మరొకరికీ మద్య మార్పు ఉంటుంది.
 • ఈ దుర్వాసన మన శరీరంలో  “eccrine” మరియు “apocrine” అనే  గ్రంధుల వల్ల వ్యాపిస్తుంది.
 • మొదటిగా శరీరం అంతటా వ్యాపించి ఉన్ననూ ముఖ్యంగా చేతులు పై, చేతుల కింది భాగము, చంకలు, అరికాళ్ళు, నుదురు పై ప్రభావం చూపిస్తాయి. తరువాత తొడల మధ్య చేరి ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి.
 • మార్కెట్లో ఎన్నో రకముల వివిధ ఉత్పత్తులు ఉన్నను అవి  తాత్కాలిక రక్షణ మాత్రమే ఇస్తాయి, కానీ ఈ సమస్యకు శాస్వత పరిష్కారం ఎంతో అవసరం.
 • Deodorants, perfumes ఈ దుర్వాసనను కొంతవరకు తగ్గించినా శాస్వత పరిష్కారం ఎంతో అవసరం. వ్యక్తి యొక్క మానసిక మరియు భావోద్వేగ  ఒత్తిడి వల్ల కూడా ఈ దుర్వాసన వ్యాపిస్తుంది

చెడు వాసనకు కారణం:

పరిశుభ్రత సమస్య: మనం నివసించే ప్రదేశం శుబ్రంగా లేకపోయినా,స్నానము సరిగా  చెయకపొయినా, పరిశుభ్రమైన బట్టలు వేసుకోకపోయిన, ఎంతో  చిన్నవిగా అనిపించే ఇవి

మన శరీర దుర్వాసనకు కారణం అవుతాయి

చర్మం సమస్య: చెడు వాసనకు కారణములలొ మరొకటి చర్మ సమస్యలు, మీకు “eczema” లేదా “psoriasis” అనే  అలెర్జీలు ఉంటే నిర్దారించుకుని డాక్టరు ని సంప్రదించడం ఎంతో అవసరం.

నివారణ మార్గములు :

ప్రతీ రోజు స్నానం లొ  క్రిమి సం హారిక సబ్బును ఉపయొగించాలి 

కాటన్ దుస్తులు ధరించాలి, ముఖ్యముగా  undergarments, ఇవి మీ చర్మానికి గాలి తగిలేలా చేసి దుర్గందాన్ని దూరం చేస్తాయి.

ఎప్పటికప్పుడు 80% చెమట పట్టిన, మరియు దుర్వాసన కలిగించే ప్రదేశాలని సబ్బుతొ శుబ్రముగా కడుక్కోవాలి.

నేరుగా నాడీ వ్యవస్థను ప్రభావితం మరియు మరింత చెమట ఉత్పత్తికి దారి తీసే టీ,కాఫీలను తీసుకోవద్దు 

రక్త కణాల పై ప్రభావితం చూపి చెమటకు మరియు శరీర దుర్గందానికి కారణం అయ్యే మద్యం కి దూరంగ ఉండటం ఎంతో అవసరం 

మీ రోజు వారి మందులు అనగా గర్భ మాత్రలు, స్టెరాయిడ్ ఆస్త్మా మందులు వల్ల కూడా చెమట వ్యాపించే అవకాశం ఎక్కువ, వీటి పై శ్రద్ద చూపించి సరైన మోతాదులో తీస్కోవాలి.

చెడు వాసనతో పోరాడేందుకు సహజ నివారణలు:

 • మీ స్నానం తర్వాత చివరిగా ఒక టేబుల్ స్పూన్ తేనెను నీటిలో కలిపి స్నానం చేస్తే  ఇది మీ శరీర దుర్వాసనని నియంత్రిస్తుంది
 • మీ స్నానం నీటిలో ఒక టేబుల్ స్పూన్  పటికను జోడించి తీసుకుంటే, ఎంతో తాజా, దుర్వాసన రహితమైన చర్మాన్ని పొందవచ్చు.
 • పొడి రూపంలో ఉన్న బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల అది రసాయనాలను గ్రహించి శరీర దుర్గందాన్ని తగ్గిస్తుంది
 • ఉడికించిన పుదీనా ఆకులు స్నానపు నీటిలొ కలిపి చేస్తే రోజంతా చర్మం ఎంతో తాజాగా ఉంటుంది.
 • సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడ శరీర దుర్వాసనను తగ్గించటానికి ఎంతో సహయపడుతుంది,
 • ముఖ్యముగా మీ ఆహారం 20% మాంసకృత్తులు, 20% నూనెలు మరియు కొవ్వులు కలిగి ఉండి పండ్లు మరియు కూరగాయలు తో  తీసుకొవడం ఎంతో అవసరం 
 • మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకొవడం వలన కూడ ఎంతో అవసరం.
 • ఒక టేబుల్ స్పూన్  సొంపుగింజలను తీసుకొవడం ద్వారా మీ శరీర తాజాతనమునకు ఎంతో ఉపయోగ పడుతుంది .
 • మన జీవన శైలి మన చేతుల్లోనె ఉంటుంది,అదనపు అలసట మరియు ఒత్తిడి  మన మానసిక స్తితిని పాడుచేస్తుంది  అందుకే
 • దుర్వాసన అనేది మి వ్యక్తిత్వానికి మంచిది కాదు, దీని నియంత్రణకు

పైన సూచించిన విధముగా పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.