Posted on

ఇలా చేస్తే పంటి నొప్పి నుంచి ఉపశమనం – Telugu tips for Teeth Pain

పళ్ళు మరియు దవడల చుట్టూ ఉన్న నొప్పిని పంటి నొప్పి అంటారు. దంతక్షయం, ఇన్ఫెక్షన్, దంతాలు వదులుగా మారడం, విరగడం లేదా చిగుళ్ళవాపు పంటినొప్పికి గల ప్రధాన కారణాలు. 2 రోజులకు మించి పంటినొప్పితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టర్ ని కలవాల్సిందే ..

మన ఇంట్లో ఉన్న వస్తువులతో సహజంగానే ఈ పంటినొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్ :

కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్ దంత నొప్పిని తగ్గిస్తుందని చెప్తారు . ముఖ్యంగా పంటి నొప్పి, ఏదైనా గాయం, చిగుర్ల వాపు ఉన్నపుడు ఈ టిప్ బాగా పనిచేస్తుంది.

ఐస్ ప్యాక్ లేదా ఫ్రిజ్‌లో చల్లబరిచిన బఠానీల ప్యాక్ ని వాడి కోల్డ్ కంప్రెస్ ట్రై చెయ్యొచ్చు . చెక్కిళ్ళకు బయట భాగాన పన్ను నొప్పి ఉన్న ప్రాంతంలో కొంత సమయం అలా అదిమి పట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

ఈ చికిత్సను ప్రయత్నించటం ద్వారా, ఇది రక్త నాళాలను నిర్బంధిస్తుంది, నెమ్మదిగా ప్రభావిత ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది. తద్వారా నొప్పిని , వాపుని మరియు మంటని తగ్గించడానికి సహాయం చేస్తుంది .

2. సాల్ట్ వాటర్ తో పుక్కిలించడం (మౌత్ వాష్) :

వేడి సాల్ట్ వాటర్ తో నోరు శుభ్రం చేసుకోవటం ద్వారా, దంతాల మధ్య పేరుకొన్న అవశేషాలను తొలగించడంలో ఉపయోగపడుతుంది . సాల్ట్ వాటర్ వాపును తగ్గించడమే కాక, వైద్యాన్ని సులభతరం చేస్తుంది. సాల్ట్ వాటర్ టిప్ గొంతు నొప్పి నుండి కూడా రిలీఫ్ కలిగిస్తుందని మనకు తెలుసు.

1 టీస్పూన్ సాల్ట్ ని 1 గ్లాసు వెచ్చని నీటిలో కరిగించి , ఉమ్మటానికి ముందు 1 నిమిషం పాటు నోటిలోనే ఉంచి పుక్కిలించండి. ఈ ప్రక్రియను అవసరమైనంతమేర పునరావృతం చేయండి.

3. నొప్పి నివారణ మందులు :

ఎసిటమినోఫెన్ మరియు ఇబుప్రోఫెన్ వంటి మందులు పంటి నొప్పికి తాత్కాలిక నొప్పి నివారణను అందిస్తాయి. అయితే, 16 ఏళ్లలోపు పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆస్పిరిన్ ఇవ్వకూడదని గుర్తుంచుకోండి. అదేవిధంగా వైద్యుని సూచనల మేరకే అనుసరించడం ఉత్తమం.

4. గార్లిక్ / వెల్లుల్లి / చిన్నుల్లి :

వెల్లుల్లి ఔషధ ప్రయోజనాల దృష్ట్యా తరతరాలుగా విస్తృతంగా ఉపయోగించబడుతున్న అద్భుతమైన వంటింటి పదార్ధం. వెల్లుల్లి, అల్లిసిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఈ అల్లిసిన్ శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది.

మొదటగా, తాజా గార్లిక్ రెబ్బలను చూర్ణం చేసి, ఆపై కొద్దిగా సాల్ట్ కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట రాయాలి. కాసేపటికే మీరు కొంత ఉపశమనం పొందగలుగుతారు .

5. పుదీనా Tea :

లవంగాల లాగానే, పుదీనాకు కూడా పంటి బాధ నుండి ఉపశమనం కలిగించే లక్షణాలు ఉన్నాయి. పుదీనా సువాసనను ఇచ్చే మెంతోల్, ప్రధానంగా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

ఒక టీస్పూన్ ఎండిన పుదీనా ఆకులను ఒక కప్పు వేడినీటిలో వేసి 20 నిమిషాలు అలాగే ఉంచి, కాస్త చల్లబడిన తరువాత, వాటితో పుక్కిలించొచ్చు. లేదా టీ లా తాగేసేయొచ్చు. తడి టీ-బ్యాగ్ ను కూడా నొప్పి తగ్గే వరకూ నొప్పి ఉన్న భాగంలో అదిమిపెట్టుకోవచ్చు..

ఒక కాటన్-బాల్ మీద కొన్ని చుక్కల పిప్పరమెంట్ నూనె వేసి, తాత్కాలిక నివారణిగా ప్రభావిత పంటిమీద ఉంచాలి. ఇది మీకు ఎంతగానో సహాయపడుతుంది.

6. థైమ్ :

థైమ్ దాని ఔషధ ప్రయోజనాల పరంగా ప్రసిద్ది చెందిన మొక్కగా అందరికీ సుపరిచితం. అంతేకాకుండా కోరింతదగ్గు, ధనుర్వాతం వంటి ఛాతీ సంబంధిత ఇన్ఫెక్షన్లకు సమర్థవంతమైన నివారణగా చెప్పబడుతుంది కూడా. ఈ థైమ్ ఎసెన్షియల్ నూనెలో ప్రధానంగా ఉండే థైమోల్, క్రిమినాశక మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది.

ఒక చుక్క థైమ్ ఎసెన్షియల్ నూనెను ఒక గ్లాసు నీటిలో కలిపి మౌత్ వాష్ చేయడానికి వినియోగించవచ్చు.

మరో పద్ధతి ఏమిటంటే, కొన్ని చుక్కల థైమ్ ఎసెన్షియల్ నూనె, మరియు నీళ్ళను ఒక కాటన్-బాల్ పై చల్లుకుని, నొప్పిగా ఉన్న పంటి అపసవ్య దిశలో అదిమినట్లుగా ఉంచండి. తక్కువ సమయంలోనే మంచి ఉపశమనం ఉంటుంది.

7. అలోవెరా :

అలోవెరా గుజ్జు(జెల్ వంటి పదార్ధం), కాలిన గాయాలు మరియు చిన్న చిన్న కోతలను నయం చేస్తుంది. కొంతమంది చిగుళ్ళను శుభ్రం చేయడానికి మరియు బాధ నుంచి ఉపశమనం పొందడానికి కూడా అలోవెరా జెల్‌ని వాడతారు.

అలోవెరాలో ఉండే సహజ సిద్దమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, దంత క్షయం కలిగించే బాక్టీరియాను నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

అలోవెరా జెల్‌తో నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి.

8. హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో శుభ్రం చేయడం :

సమర్థవంతమైన యాంటీ బాక్టీరియల్ అయిన హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణంతో పుక్కిలించడం (మౌత్ వాష్) ఎంతో ఉత్తమం. ముఖ్యంగా పంటి నొప్పి ఇన్ఫెక్షన్ కారణంగా వస్తే ఆ సమస్య మొత్తం తీరిపోతుంది. అయితే, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని మింగకూడదు. దీని వల్ల నష్టాలుంటాయి. కాబట్టి, పుక్కిలించేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్  తీసుకుని, దీనికి సమానంగా నీటిని కలిపి 30 సెకన్ల పాటు నోటిలో ఉంచి పుక్కిలించాలి. దాన్ని ఉమ్మిన తరువాత, నోటిని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.  చిన్నపిల్లలకు మాత్రం ముఖ్యంగా ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చిట్కా వాడొద్దు.

9. లవంగాలు :

లవంగాలు ఇండోనేషియాలోని మలుకు దీవులకు చెందిన మసాలా దినుసులు. వాటిలో సహజసిద్దమైన మత్తు మందుగా పనిచేసే యూజీనాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది.

లవంగాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి దంతాలు మరియు చిగుళ్ళ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అత్యుత్తమంగా సహాయపడతాయి.

లవంగాల నూనెలో ఒక చిన్న కాటన్- బాల్ ని నానబెట్టి, ప్రభావితమైన దంతాల భాగంలో ఉంచడం ద్వారా ఉపశమనం పొందొచ్చు.

లవంగాలను నొప్పి ఉన్న భాగంలో పెట్టి.. ఆ రసాన్ని మింగుతూ ఉండండి.. ఇలా రోజూ 30 నిమిషాలు చేయండి..

దంతవైద్యుడిని ఎప్పుడు సంప్రదించవలసి ఉంటుంది :

ఈ గృహ చిట్కాలు తాత్కాలిక ఉపశమనానికి మాత్రమేనని గుర్తుంచుకోండి. పంటి నొప్పి ఒకటి లేదా రెండు రోజులకు మించి ఉంటే డెంటల్ డాక్టర్‌ని కవలవడం తప్పనిసరి.

పంటి నొప్పికి త్వరితగతిన చికిత్స చేయని ఎడల, ఇది చిగుళ్ళ వ్యాధి, కణితి లేదా వాపు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. దంతాల దగ్గర కణితిగా ఏర్పడితే, అది బాక్టీరియాతో కూడిన చీమును కలిగి ఉంటుంది.

జాగ్రత్తలు :

పంటి నొప్పి మరియు దంతాల వద్ద కణుతులు లేదా గడ్డలను నివారించడానికి ఉత్తమ మార్గం, పళ్ళు మరియు చిగుళ్ళను వీలైనంత ఆరోగ్యంగా ఉంచడం. క్రమంగా కింది దశలను అనుసరించడం ద్వారా, అది సాధ్యపడుతుంది :

• ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో రోజుకు రెండుసార్లు, కనీసం 2 నిమిషాలపాటు పళ్ళు తోముకోవడం
• చక్కెర ఆహారాలు, పానీయాలను తగ్గించడం
• దంతాల మధ్య మరియు “గమ్ లైన్” కింద శుభ్రం చేయడానికి క్రమం తప్పకుండా “ఇంటర్‌డెంటల్” బ్రష్‌ను ఉపయోగించడం
• ధూమపానం ఆరోగ్యానికే కాదు దంతాలకు కూడా హానికరం, ఎందుకంటే ఇది దంత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది
• క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం.

ముందుగా చెప్పినట్లుగా, రెండు రోజుల కన్నా ఎక్కువ కాలం పంటి నొప్పి ఉంటే, వారు ఖచ్చితంగా సలహా, చికిత్స కోసం వారి డెంటల్ డాక్టర్‌ని సంప్రదించాలి.

Posted on

Telugu tips to stop bleeding gums – చిగుళ్లలో బ్లీడింగ్ తగ్గేందుకు హోమ్ రెమెడీస్

పంటి చిగుళ్ల రక్తస్రావం అనేది పంటి చిగుళ్ల అనారోగ్యం లేదా వ్యాధికి సంబంధించిన ఒక సంకేతము. ఇది ఒక తీవ్రమైన నోటి సమస్య మరియు అసాధారణమైన పరిస్థితి. ఈ సమస్యకు వీలైనంత తొందరగా చికిత్స చేయటం చాలా ముఖ్యం. ప్రారంభంలోనే ఈ సమస్యను పరిష్కరించటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రారంభ దశలోని చిగుళ్ల రక్తస్రావంను ‘గింజివిటిస్’ అని అంటారు. ఈ దశలో సమస్యను సులభంగా నియంత్రించవచ్చు. ఈ సమస్యపై శ్రద్ధ చూపకపోతే మరింత తీవ్రం అవుతుంది.

చిగుళ్ల రక్తస్రావానికి దారితీసే వివిధ కారణాలు

 • సరైన పద్దతిలో బ్రష్ చెయ్యకపోవటం లేదా గట్టి బ్రష్‌ను ఉపయోగించడం
 • దంత పరిశుభ్రత లేకపోవడం
 • చిగుళ్లు మరియు దంతాల మధ్య ఫలకం ఏర్పడటం వలన వచ్చే ఇన్ఫెక్షన్
 • గర్భధారణ సమయంలో హార్మోన్లలో మార్పులు
 • విటమిన్ సి మరియు విటమిన్ కె యొక్క లోపం
 • రక్తస్రావ రుగ్మతలు
 • రక్తం పల్చబడటానికి ఉపయోగించే మందులు
 • లుకేమియా వంటి రక్త క్యాన్సర్
 • సక్రమం లేని కట్టుడు పళ్ళు
 • మధుమేహం
 • ధూమపానం
 • ఎయిడ్స్ వంటి రోగ నిరోధక సమస్యలు

చిగుళ్ల రక్తస్రావం యొక్క లక్షణాలు

చిగుళ్ల రక్తస్రావం ప్రారంభం అయ్యే ముందు, అవి వాచి (ఎరుపు మరియు వాపు) బ్రష్ చేస్తున్నప్పుడు సులభంగా రక్తస్రావానికి గురి అవుతాయి. రక్తస్రావం యొక్క ఫలితంగా మంట ఏర్పడుతుంది, ఇందుకు ముఖ్య కారణం సరైన పద్దతిలో బ్రష్ చెయ్యకపోవటం. వాపు తీవ్రమై మరియు దవడ ఎముకకు విస్తరించినప్పుడు రక్తస్రావం పెరుగుతుంది. వ్యాధి ముదిరే కొద్ది వివిధ లక్షణాలు కనిపిస్తాయి :

 • చెడు శ్వాస
 • నములుతున్నప్పుడు నొప్పి మరియు కష్టం
 • చిగుళ్లను లాగినప్పుడు పళ్ళు బయటపడతాయి
 • దంతాల సున్నితత్వం పెరగడంతో దంతాలు లూజ్ అవుతాయి
 • చిగుళ్లలో చీము చేరడం
 • నోటిలో తుప్పుపట్టినటువంటి లోహ రుచి, ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు నోటిలో లాలాజల స్రావం పెరుగుతుంది మరియు జ్వరం సంభవిస్తుంది

ఇటువంటి లక్షణాలను గమనించిన వెంటనే తగిన గృహ చికిత్సలను పాటించండి. వాటి వలన 1-2 రోజులలో  పరిస్థితి మెరుగు పడకపోతే వైద్యుడిని సంప్రదించటం మంచిది. ఈ వ్యాసంలో కొన్ని హోమ్ రెమెడీస్ మరియు ఈ సమస్యను త్వరగా పరిష్కరించటానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి చూద్దాం.

గమ్ బ్లీడింగ్ చికిత్సకు హోం రెమెడీస్

 1. కోల్డ్ కంప్రెస్ : గమ్ బ్లీడింగ్ ని తక్షణమే ఆపుటకు మంచి పద్దతి కోల్డ్ కంప్రెస్. కొన్ని ఐస్ ముక్కలను ఒక శుభ్రమైన క్లోత్ లో చుట్టి బ్లీడింగ్ అవుతున్న గమ్స్ పై ఉంచండి. 10 నిమిషాలలో బ్లీడింగ్ ఆగిపోతుంది. ఆ తరువాత దీర్ఘకాలిక ఉపశమనం కోసం మరియు చికిత్స కోసం క్రింద చెప్పినటువంటి పద్దతులను అనుసరించండి.
 2. ఉప్పు నీళ్ళు : ఉప్పు నోరు ఇన్ఫెక్షన్లని తగ్గిస్తుంది. ఉప్పులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇది బ్యాక్టీరియాను వెంటనే నాశనం చేస్తుంది. చిగుళ్ల వాపు మరియు రక్తస్రావం, నొప్పిని వెంటనే తగ్గిస్తుంది. ఒక టీ స్పూన్ ఉప్పుని ఒక గ్లాసు వెచ్చని నీటిలో వేసి బాగా కలిపి నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయటం వలన చిగుళ్ల రక్తస్రావం నుండి దీర్ఘకాలిక ఉపశమనం పొందుతారు.
 3. పసుపు : పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మరియు హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది రక్తస్రావాన్ని తక్షణమే ఆపేందుకు సహాయపడుతుంది. ఒక స్పూన్ పసుపు పొడిని ఒక స్పూన్ నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకొని మీ చిగుళ్లపై మృదువుగా 5-6 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తరువాత పసుపు రంగు పోయే వరకు ఎక్కువ నీటితో పంటిని శుభ్రం చేయండి.
 4. పటిక : పటిక కూడా బ్లీడింగ్ ని తగ్గించి చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక గ్లాస్ నేతిలో 1/2 స్పూన్ పటిక పొడిని కలిపి నోటితో పుక్కిలించండి. రోజుకు రెండు సార్లు 5-6 నిమిషాల పాటు పుక్కిలించడం వలన మంచి ఫలితం ఉంటుంది.
 5. బేకింగ్ సోడా : బేకింగ్ సోడా లేదా సోడియం బి కార్బోనేట్ ని ఉపయోగించి చిగుళ్లలో బ్లీడింగ్ సమస్యను నివారించవచ్చు. మీరు బ్రష్ చేసుకొనేటప్పుడు టూత్ పేస్ట్ తో సహా బేకింగ్ సోడా ను వాడండి. లేదా బేకింగ్ సోడా ని నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకొని టూత్ పేస్ట్ బదులుగా ఉపయోగించండి.
 6. సలైన్ సొల్యూషన్ : గమ్ బ్లీడింగ్ ని నివారించటానికి సలైన్ సొల్యూషన్ ఒక మంచి ఎంపిక. ఇది నోటిలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది మరియు స్వెల్లింగ్ ను తగ్గిస్తుంది. కనుక రాజుకు రెండు సార్లు సలైన్ సొల్యూషన్ తో నోటిని పుక్కిలించండి.
 7. మింట్ ఆయిల్ : చిగుళ్ల సమస్యలను నివారించడానికి పుదీనా ఆయిల్ సహాయపడుతుంది. ఇది నోటిలోని చెడు బ్యాక్టీరియాను ఎఫెక్టివ్ గా నాశనం చేసి చిగుళ్ల వాపును కూడా తగ్గిస్తుంది. నోటిలో ఉండే చెడు శ్వాసను తొలగిస్తుంది. కొన్ని చుక్కల మింట్ ఆయిల్ ను తీసుకొని నేరుగా చిగుళ్ల మీద అప్‌లై చేస్తే నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.
 8. దాల్చిన చెక్క : దాల్చిన చెక్కలో స్ట్రాంగ్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చిగుళ్ల వాపును తగ్గిస్తుంది. అంతే కాదు, తాజా శ్వాసను కూడా అందిస్తుంది. దాల్చిన చెక్కను మెత్తగా పేస్ట్ చేసి, దాన్ని చిగుళ్ల మీద అప్‌లై చేసి 2 నిముషాలు అలాగే వదిలి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 9. ల్యావెండర్ ఆయిల్ : ల్యావెండర్ ఆయిల్ లో మంచి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలదు. చిగుళ్లపై ల్యావెండర్ ఆయిల్ తో మసాజ్ చేయాలి. ఇది బ్లడ్ సర్క్యులేషన్‌ ను పెంచుతుంది. చిగుళ్ల వాపును, నొప్పిని తగ్గిస్తుంది. ఇది దంతాలను మరియు చిగుళ్ల గ్యాప్ ను పూడ్చుతుంది. క్రిములు నోట్లో వ్యాపించకుండా నివారిస్తుంది. కొన్ని చుక్కల ల్యావెండర్ ఆయిల్ ను ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలిపి నోట్లో పోసుకొని గార్గిలింగ్ చేయాలి.
 10. బంతి పువ్వు మరియు క్యాలెండ్యులా : క్యాలెండ్యులా లో హీలింగ్ బెనిఫిట్స్ చాలా దాగున్నాయి. ఇది ఒక మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ గుణాలు కలిగినది. ఇది దంతాల మద్య పాచిని తొలగిస్తుంది. ఈ హెర్బ్ న్యాచురల్ డిటాక్సిఫైర్. ఇది బ్లడ్ సర్క్యులేషన్‌ పెంచుతుంది. చిగుళ్లకు సంబంధించిన కణాలను స్ట్రాంగ్ చేస్తుంది. దాంతో దంతాలు స్ట్రాంగ్ గా మారుతాయి. కొన్ని ఫ్రెష్ గా ఉండే మ్యారిగోల్డ్ లేదా  క్యాలెండ్యులా ఫ్లవర్ పెటల్స్ తీసుకుని, ఒక గ్లాసు వెచ్చని నీటిలో వేయాలి. ఈ నీటిని వడగట్టి నోటి శుభ్రతకు ఉపయోగించుకోవాలి.
 11. ఆయిల్ పుల్లింగ్ : ఆయిల్ పుల్లింగ్ ఒక పురాతన హోం రెమెడీ.
  • ఈ నూనెని కొద్దిగా నీట్లో వేసుకుని మింగకుండా, 10 -15నిముషాలు నోట్లో పుల్ చేయాలి. 15 నిముషాల తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఓరల్ హైజీన్ మెరుగవుతుంది.
  • అర టీ స్పూన్ నువ్వుల నూనె తీసుకుని అందులో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని నోట్లో పోసుకుని పుల్ చేసి 10 నిముషాల తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

చిగుళ్ల రక్త స్రావం తగ్గేందుకు సరైన ఆహార పదార్థాలు

 1. విటమిన్ సి : విటమిన్ సి యొక్క డెఫీషియన్సీ వలన చిగుళ్లలో రక్త స్రావం కలుగుతుంది. కనుక విటమిన్ సి అధికంగా ఉండే లెమన్, ఆరంజ్, క్యాబేజు మరియు బ్రోకలీ వంటి కూరగాయలు మరియు ఫ్రూట్‌స్ ని అధికంగా తీసుకోండి.
 2. పాలు : మీకు లాక్టోస్ సమస్య లేనట్లయితే ప్రతి రోజు పాలు త్రాగటం చాలా మంచిది. పాలలో అధికమైన కాల్షియం ఉంటుంది. శరీరం తగిన మోతాదులలో కాల్షియము పొందినట్లయితే చిగుళ్లు మరియు బోన్స్ ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటాయి.
 3. విటమిన్ : మంచి ఆరోగ్యం కొరకు శరీరానికి తగిన విటమిన్ అవసరం. అధిక మోతాదులో విటమిన్లు ఉండే పచ్చి కూరగాయలను వీలైనంత ఎక్కువగా తీసుకోండి. ఇది మీ చిగుళ్లలో బ్లడ్ సర్క్యులేషన్‌ ని మెరుగుపరుస్తుంది మరియు గమ్ బ్లీడింగ్ ని తగ్గిస్తుంది.
 4. క్రేన్ బెర్రీ జ్యూస్ : క్రేన్ బెర్రీ లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి కనుక చిగుళ్ల సమస్యతో పోరాడేందుకు ఇది ఒక మంచి ఎంపిక. ఇది చిగుళ్లలో బ్లీడింగ్ తో పాటు చిగుళ్లకు సంబంధించిన అనేక సమస్యను తొలగిస్తుంది. ఈ జ్యూస్ మార్కెట్ లో కూడా లభిస్తుంది కానీ మార్కెట్ లో అమ్మే జ్యూస్ లో అధిక చక్కెర మరియు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. కనుక వాటివలన ఫలితం ఉండదు. వీలైనంత వరకు ఇంట్లోనే జ్యూస్ తయారు చేసుకోవాలి లేదా ఫ్రూట్స్  ని అలాగే తినటం మరింత మంచిది.

చిగుళ్లలో సమస్యను నివారించేందుకు తీసుకోవాల్సిన మరి కొన్ని జాగ్రత్తలు

 1. ప్రతి సారి ఆహారం తీసుకున్న తరువాత కొన్ని కొవ్వు పదార్థాలు పంటిపై అతుక్కు పోతాయి. ఇవి వేర్ల వరకు వెళ్లి చిగుళ్లను మరియు పంటిని బలహీనం చేస్తాయి. కనుక ప్రతి సారి ఫాట్ ఐటెమ్స్ ని తిన్న వెంటనే పళ్ళను తోమాలి. కుదరకపోతే, రోజుకు కనీసం రెండు సార్లు, ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయాలి.
 2. బ్రష్ చేసే పద్దతిని మార్చాలి, పంటిపై అధిక ఒత్తిడి కూడదు. అలాగే పంటి చిగుళ్లపై కఠినంగా ఉండే బ్రష్ ని మర్చి సాఫ్ట్ బ్రష్ ని ఉపయోగించండి.
 3. మీరు ఉపయోగించే మౌత్ వాష్ లో ఆల్కహాల్ ఉండకూడదు. ఆల్కహాల్ చిగుళ్ల సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.
 4. శరీరానికి కావలసిన విటమిన్ మరియు మినరల్స్ ని తీసుకోండి.
 5. పొగ త్రాగటం లేదా ధూమపానం అలవాటును మానుకోవాలి.
Posted on

Telugu remedies for mouth ulcers – నోటి అల్సర్ కు బెస్ట్ నేచురల్ హోమ్ రెమెడీస్

నోటి పుండ్లు తెల్ల రంగులో ఉంటాయి, చాలా నొప్పిని కలిగిస్తాయి. ఈ పుండు యొక్క అంచులు ఎర్రగా ఉంటాయి. ఇది నోటిలోపల చెంప భాగంలో, నాలుక క్రింద లేదా పెదాలపై ఏర్పడుతుంది. నోటి అల్సర్ తీవ్రమైనది కాదు, కానీ గుణం అయ్యేందుకు 7 నుండి 10 రోజులు పడుతుంది. మలబద్ధకం, హార్మోన్ల మార్పులు లాంటి అనేక కారణాల వలన ఇది ఏర్పడవచ్చు. మరి కొన్ని కారణాలు:

 • అనుకోకుండా చెంప లోపలి భాగంలో కొరికినప్పుడు
 • విటమిన్ బి కాంప్లెక్స్ యొక్క లోపాలు
 • ఐరన్ లోపాలు
 • ఆహార ప్రభావం
 • వారసత్వ కారకాలు
 • అధిక అసిడిటీ
 • ఒత్తిడి
 • విటమిన్ సి లోపం
 • పోషకాల లోపాలు

మౌత్ అల్సర్ ఒక సాధారణ సమస్య. ఆహారాన్ని తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు స్వల్ప మంటను మరియు నొప్పిని కలిగిస్తుంది. కొన్ని సులభమైన ఇంటి నివారణ పద్ధతుల ద్వారా వీటిని గుణపరచొచ్చు.

నోటి పుండు కోసం ఉత్తమ సహజ నివారణలు మరియు వాటిని నిరోధించే పద్ధతులు

తేనె

తేనె ఒక ఉత్తమమైన యాంటీ సెప్టిక్ నివారిణి. ఇది నిర్జలీకరణము నుండి రక్షిస్తుంది, మచ్చలను తొలగిస్తుంది మరియు మాయిశ్చర్‌ను నిల్వ చేస్తుంది. ఇది కొత్త కణజాల పెరుగుదలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. తేనెలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటుంది మరియు ఇది నోటి పుండు వేగంగా నయం అవ్వటానికి సహాయపడుతుంది. కొద్దిగా తాజా తేనె తీసుకొని నెమ్మదిగా నోటి పుండు మీద రాయండి. లేదా తేనెలో కొద్దిగా పసుపును కలుపుకొని ఒక మందపాటి పేస్ట్‌లా తయారు చేసుకొని పుండుపై వాడండి.

ఐస్

నోటి అల్సర్‌ను నయం చేయటానికి ఐస్ ఉత్తమమైన మరియు అత్యంత ప్రభావితమైన గృహ చికిత్స. ఇది జలదరింపు మరియు దహన సంచలనాన్ని తొలగిస్తుంది. ఇది ఇంట్లో సులభంగా లభిస్తుంది మరియు తరచూ వాడటం వలన తొందరగా ఫలితాలను అందిస్తుంది.

పెరుగు

బ్యాక్టీరియా ఫెర్మెన్టేషన్ ప్రక్రియ ద్వారా పెరుగు తయారు అవుతుంది. ఈ బాక్టీరియా లేదా ఈస్ట్ ఆర్గానిక్ ఆసిడ్స్ వంటి కార్బోహైడ్రేట్లుగా మార్చబడుతుంది. మంచి ఆరోగ్యం కొరకు రోజూ పెరుగు తినండి. ఇది మీ నోటిలో బ్యాక్టీరియాను సమతుల్యం చేసేందుకు సహాయపడే ఒక ఆహార పదార్థం. నోటి అల్సర్‌ పుండులను తొలగించేందుకు రోజుకు 3 సార్లు 1 టేబుల్ స్పూన్ పెరుగును తినండి. వేగంగా గుణం అయ్యేందుకు పెరుగులో కొద్దిగా తేనెని జోడించవచ్చు.

వెచ్చని ఉప్పు నీరు

ఉప్పు నీరు నోటి పుండులోని అధిక ద్రవాన్ని తొలగిస్తుంది. గొంతు లోపల భాగంలో శ్లేష్మ పొరలోని కణాల వాపును తగ్గించడానికి ఇది చాలా సహాయపడుతుంది. వెచ్చని నీరు ఉపశమనాన్ని కలిగించి ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడంలో తోడ్పడుతుంది. 1/4 కప్పు వెచ్చని ఉప్పు నీటితో రోజుకు మూడు సార్లు మీ నోటిని పుక్కిలించండి.

గసగసాలు

శరీరంలోని వేడి తగ్గించడంలో గసగసాలు ప్రభావితంగా పనిచేస్తాయి. నోట్లో అల్సర్లు ఇబ్బంది పెట్టడానికి కారణం అధిక వేడే. కనుక ఒక టేబుల్ స్పూన్ పొడిచేసిన గసగసాలకు అంతే పరిమాణంలో పంచదారను జతచేసి, సమస్య తగ్గే వరకూ రోజకు 2 లేదా 3 సార్లు తినండి.

లవంగాలు

అల్సర్ బాధిస్తున్నప్పుడు తరచూ లవంగాలు నమిలితే, ఆ ఘాటుకు సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. అయితే ఇలా చేసేటప్పుడు కాస్త మంటను భరించాల్సి ఉంటుంది.

నెయ్యి

నోటి అల్సర్‌ను నివారించే మరో నేచురల్ రెమెడీ నెయ్యి. అల్సర్ ఉన్న చోట నెయ్యిని రాయండి.

విటమిన్ బి12

సాధారణంగా శరీరంలో విటమిన్ బి12 శాతం తగ్గిపోతే నోటి అల్సర్లు వంటి సమస్య ఎక్కువగా ఎదురవుతాయి. వైద్యుల సలహా మేరకు విటమిన్ బి12 మందులు వాడితే అల్సర్ తగ్గిపోతుంది.

విటమిన్ సి

విటమిన్ సి అధికంగా ఉండే కమలా పండ్లను తీసుకోవటం వలన కూడా నోటి అల్సర్లను తొలగించవచ్చు.

పచ్చి ఉల్లిపాయలు

ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువగా పచ్చి ఉల్లిపాయలను చేర్చుకోండి. వీలైతే వీటిని సలాడ్లలో కూడా చేర్చుకొని తినడం వలన నోటి అల్సర్ల సమస్య త్వరగా తొలగిపోతుంది.

కొబ్బరి నూనె

ఎండు కొబ్బరిని నమిలి కొద్ది సేపు అలాగే నోట్లో పెట్టుకోవాలి. లేదా కొబ్బరి నూనెని 5 నుండి 10 నిమిషాలపాటు పుక్కిలించాలి.

నోటి అల్సర్ వదిలించుకోవటానికి సహజమైన గృహ నివారణ చిట్కాలు

 • కొబ్బరి పాలు మౌత్ అల్సర్ చికిత్సకు బాగా పనిచేస్తుంది. సమర్థవంతమైన ఫలితాల కోసం రోజుకు 3 లేదా 4 సార్లు కొబ్బరి పాలతో నోటిని పుక్కిలించండి.
 • ఉదయం లేచిన వెంటనే కొన్ని తులసి ఆకులను నీటితో పాటు నమలండి. ఇందులో యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలను ఉన్నందున ఇది అంటువ్యాధులు రాకుండా కాపాడటం ద్వారా మీ నోరు ఆరోగ్యంగా ఉంటుంది.
 • ఒక టేబుల్ స్పూన్ గ్లిసరిన్ మరియు ఒక చిటికె పసుపును కలిపి నోటి పుండుపై రాయండి. ఇది మంట నుండి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.
 • చల్లని నీటితో మీ నోరును పుక్కిలించిన తక్షణమే వేడి నీటితో పుక్కిలించండి. ఇది అల్సర్‌ను గుణపరిచేందుకు ఒక సమర్థవంతమైన పద్ధతి.
 • నీటిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా ఉడికించండి. చల్లబడిన తరువాత ఈ నీటితో నోరు పుక్కిలించండి.
 • రోజుకు రెండు సార్లు టమోటా జ్యూస్ ని త్రాగండి లేదా జ్యూస్ తో నోటిని పుక్కిలించండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ కాన్సర్ లక్షణాలు ఉంటాయి.
 • కొత్తిమీర ఆకులను బాగా నలిపి నీటిలో వేసి ఉడికించండి. చల్లబడిన తరువాత ఈ నీటితో నోరును పుక్కిలించండి, ఇలా రోజుకు 3 లేదా 4 సార్లు చేయండి.
 • మెంతాకులు కూడా నోటి అల్సర్‌ను తొలగించేందుకు బాగా పనిచేస్తుంది. రెండు కప్పుల నీటిలో ఒక కప్పు మెంతాకులను వేసి బాగా ఉడికించండి. చల్లారిన తరువాత వడగట్టి ఈ నీటితో నోరును పుక్కిలించండి.
 • కలబంద యొక్క జెల్‌ని రోజుకు 3 సార్లు తినండి. ఇందులోని యాంటీ ఇంఫ్లమేటరి, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బయోటిక్ లక్షణాలు నోటి పుండులను మరియు ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది.
 • కర్పూరం మరియు చెక్కరని బాగా కలుపుకొని ఒక మందపాటి పేస్ట్‌లా చేసుకోండి. దీనిని నోటి పుండుపై కొన్ని నిమిషాల పాటు ఉంచి తరువాత తొలగించండి.
 • ఉసిరి కాయల పేస్ట్‌ను తయారు చేసి పుండుపై రాయండి. రోజుకు రెండు సార్లు రాయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
 • నోటి అల్సర్ చుట్టూ ఉన్న ఎరుపు రంగును మరియు మంటను తొలగించేందుకు టీ ట్రీ ఆయిల్‌ని రాయండి.
 • ప్లైన్ సోడా బైకార్బొనేట్కని రాయటం వలన నొప్పినుండి వెంటనే ఉపశమనాన్ని పొందుతారు.
 • గోరు వెచ్చని నీటితో నోటిని వీలైనన్ని ఎక్కువసార్లు పుక్కిలించాలి. ఇలా చేస్తే అల్సర్లు కారణంగా ఎదురయ్యే మంట మరియు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
 • చల్లని మజ్జిగను ఎక్కువగా త్రాగటం వలన అల్సర్ సులభంగా తగ్గిపోతుంది.
 • ప్రతి రోజూ 3 లేదా 4 సార్లు కొబ్బరి నీళ్ళతో నోటిని పుక్కిలించండి.
Posted on

Telugu remedies for yellow teeth – పసుపు దంతాల చికిత్స కోసం ఇంటి చిట్కాలు

శరీరంలో దంతాలు ఒక ముఖ్యమైన భాగం. ఇవి తెల్లగా ఉంటే మనం మాట్లాడేటప్పుడు నవ్వేటప్పుడు మన ముఖం అందంగా మరియు ఆకర్షణీయంగా కనపడుతుంది. పసుపు రంగు పళ్ళు చాలా వికారంగా ఉంటుంది మరియు తోటి వారికి మన పై చెడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది.

పళ్ళను సరిగ్గా బ్రష్ చేయకపోవటం, వయసు అవటం, వంశానుగత కారణాలు, సరైన దంత పరిశుభ్రత లేఖ పోవటం, టీ మరియు కాఫీ ఎక్కువగా త్రాగటం, పొగాకు మరియు సిగరెట్ అధికంగా వినియోగించటం వలన మీ పళ్ళు పసుపు రంగు కావచ్చు. చాలా మంది దంతాల యొక్క తెలుపు రంగును తిరిగి పొందేందుకు ఎన్నో ఖరీదైన చికిత్సలను చేస్తారు. కానీ ఇంటిలోని పదార్థాలను ఉపయోగించి ఈ పసుపు రంగుని సులభంగా తొలగించవచ్చు.

పళ్ళపై పసుపు మరకలు తొలగించేందుకు ఇంటి నివారణలు

బేకింగ్ సోడా

బేకింగ్ పొడిని ఉపయోగించి పళ్ళ రంగును తెల్లగా మార్చే ఒక మౌత్ వాష్‌ని తయారు చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని 1/2 కప్పు చల్లని నీటిలో కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని రోజుకు 2 లేదా 3 సార్లు మౌత్ వాష్‌లా ఉపయోగించండి.

స్ట్రాబెర్రీలు

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి పళ్ళ యొక్క పసుపు రంగును తొలగించేందుకు తోడ్పడుతుంది.3 స్ట్రాబెర్రీలను బాగా రుబ్బి మీ పళ్ళపై ఒక నిమిషం పాటు రుద్దండి. ఇలా వారానికి 3 సార్లు ఉపయోగించండి.

నిమ్మరసం

కొన్ని చుక్కల నిమ్మరసంలో ఒక చిటికె ఉప్పుని కలుపుకొని మీ పళ్ళపై రుద్దండి. లేదా నిమ్మపండు యొక్క తొక్కని పళ్ళపై రుద్ది నీటితో నోరు పుక్కిలించండి. నిమ్మపండులో బ్లీచింగ్ లక్షణాలు ఉన్నందున మంచి ఫలితాలను ఇస్తుంది.

ఆపిల్ పండు

మీరు ఆపిల్ పండును తినేటప్పుడు బాగా నమిలి తినాలి. ఎందుకంటే ఇందులోని అసిడిక్ లక్షణాలు మరియు ఇందులోని ఫైబర్ పళ్ళ యొక్క పసుపు రంగును తొలగించేందుకు తోడ్పడుతుంది. మీ రోజూ డైట్లో ఆపిల్ పండును చేర్చుకొండి. ఇది మీ పళ్ళకు మరియు ఆరోగ్యానికి చాలా మంచిది.

ఉప్పు

ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మీ నోటిలో ఉన్న బాక్టీరియాలను తొలగించి పళ్ళను తెల్లగా చేస్తుంది. అంతే కాదు మీ పళ్ళకు కావలసిన మినరల్స్ ని కూడా అందిస్తుంది. ఉప్పుని వాడేటప్పుడు జాగ్రత్తను వహించాలి, వీటిని ఎక్కువ కఠినంగా పళ్ళపై వాడటం వలన మీ చిగురు మరియు ఎనామెల్ని బాధించవచ్చు.

చార్కోల్

మీరు రోజూ ఉపయోగించే టూత్పేస్ట్ పై కొద్దిగా చార్కోల్ పౌడర్ చేర్చుకొని మృదువుగా బ్రష్ చేయండి. మీ పళ్ళు తెల్లగా అయ్యే వరకు రోజుకు రెండు సార్లు చార్కోల్ తో బ్రష్ చేయండి.

నారింజ తొక్క

రాత్రి పడుకునే ముందు నారింజ తొక్కతో మీ పళ్ళను బాగా రుద్దండి. దీనిని కడగకుండా రాత్రంతా అలాగే ఉంచి ఉదయం నీటితో కడగండి. ఇది మీ పళ్ళకు తెలుపు రంగు ఇవ్వటమే కాదు క్రిములతో పోరాడి మీ దంతాలను ధృఢంగా చేస్తుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్

ఇందులోని బ్లీచింగ్ ఏజెంట్స్ పళ్ళ యొక్క పసుపు రంగును తొలగిస్తుంది. మీరు మౌత్ వాష్ కొనేటప్పుడు అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉండేలా చూసి కొనండి.

తులసి

మన భారత దేశంలో ప్రతి ఇంటిలోనూ తులసి చెట్టును పూజిస్తాము. ఇందులో ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి. ఇది మన పళ్ళ పసుపు రంగును మరియు అనేక నోటి సమస్యలను తొలగించేందుకు ఉపయోగ పడుతుంది. కొన్ని తులసి ఆకులను కొన్ని గంటలు ఎండలో ఉంచండి. ఆకులు బాగా ఎండిన తరువాత రుబ్బి పొడిలా చేసుకోండి. ఈ పొడిని మీ టూత్ పేస్ట్ తో పాటు పళ్ళను బ్రష్ చేసేటప్పుడు ఉపయోగించండి. లేదా, ఈ పొడిని ఆవాల నూనెలో కలుపుకొని పళ్ళపై మర్దన చేయండి.

వేపాకు

మన పురాతన రోజులలో పళ్ళను బ్రష్ చేసేందుకు వేపాకు చెట్టు యొక్క కొమ్మలను ఉపయోగించే వారు. ఇందులోని యాంటీ సెప్టిక్ మరియు క్రిమినాశక లక్షణాలు పళ్ళను తెల్లగా చేస్తుంది. మరియు చెడు వాసనను తొలగిస్తుంది. మీ పెరటిలో ఈ చెట్టు ఉన్నట్లయితే వీటి యొక్క కొమ్మలను ఉపయోగించి మీ పళ్ళను రోజూ రుద్దండి. ఇది చేదుగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలను ఇస్తుంది.

అరటి పండు తోలు

అరటి పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు. కానీ అరటి తొక్క వలన కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం మరియు మాంగనీస్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇది పళ్ళ యొక్క పసుపు రంగును తొలగించి తెల్లగా చేస్తుంది. అరటి తోలును పళ్ళపై 2-3 నిమిషాలు రుద్ది 15 నిమిషాల తరువాత సాధారణ టూత్ పేస్ట్ తో బ్రష్ చేయండి. ఇలా వారానికి 2 లేదా 3 రోజులు చేయండి.

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షను ఎన్నో రకాల తీపి వంటకాలలో వాడుతాము. వీటిలో కొన్ని మీ దంతాలపై పసుపు మరకలను తొలగించేందుకు ఉపయోగించండి. మీరు ఖాళీగా ఉన్న సమయంలో కొన్ని ఎండుద్రాక్షలను నోటిలో వేసుకొని నమలండి. ఇది మీ నోటి లోపల లాలాజలమును అధికంగా ఉత్పత్తి చేసి పసుపు రంగును తొలగిస్తుంది.

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లలో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయని మన అందరికీ తెలుసు. ఇది మీ పళ్ళ యొక్క పసుపు రంగును తొలగించడంలో ప్రభావితంగా పనిచేస్తుంది. నారింజ, నిమ్మ, పైనాపిల్  లాంటి పండ్లలో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక సిట్రస్ పండులోని చిన్న ముక్కను తీసుకొని మీ పళ్ళపై రుద్దండి.

ఆయిల్ పుల్లింగ్

ఈ పద్దతిని మన అమ్మమ్మ మరియు తాత చెప్పి ఉంటారు. కానీ మనలో కొందరు నిర్లక్ష్యం చేసి ఉంటాము. ఆయిల్ పుల్లింగ్ మీ పళ్ళను తెల్లగా చేయటం మాత్రమే కాదు మీ నోటిలోని బాక్టీరియాలను కూడా తొలగిస్తుంది.

పాలు మరియు పెరుగు

పళ్ళకు ముఖ్యమైన పోషకాలు కాల్షియం మరియు ఫాస్పరస్. పాలు మరియు పెరుగు మీ పళ్ళ యొక్క పసుపు రంగును తొలగించి పంటి ఎనామెల్ యొక్క ఖనిజాలను తిరిగి పొందేందుకు సహాయపడుతుంది. కావిటీస్ ను కూడా తొలగిస్తుంది.

మర్రి చెట్టు మూలాలు

మీ పంటి సమస్యలను తొలగించేందుకు మర్రి చెట్టు యొక్క మూలాలను కూడా ఉపయోగించవచ్చు. మీరు టూత్ బ్రష్ లాగా వీటి వేర్లను ఉపయోగించవచ్చు. ఇది మీ పళ్ళపై పసుపు రంగును తొలగించి తెల్లగా చేస్తుంది.

పచ్చికూరలు

కీరదోస వంటి పచ్చికూరగాలయను బాగా నమిలి తినడం వలన పసుపు రంగు దంతాలు తెల్లగా మారుతాయి .

ఆపిల్ సీడర్ వెనిగర్

ఆపిల్ సీడర్ వెనిగర్ తో మీ పసుపు రంగు పళ్ళను తెల్లగా మార్చుకోవచ్చు. రాత్రి పడుకొనే ముందు ఆపిల్ సీడర్ వెనిగర్ తో నోరు పుక్కిలించి కడగండి. ఇది నోటి దుర్వాసనను కూడా తొలగిస్తుంది.

క్యారట్

పళ్ళపై పసుపు రంగును తొలగించేందుకు క్యారట్ లోని ఫైబర్ సహాయపడుతుంది. అంతే కాదు ఇది దంతాలను దృఢంగా చేస్తుంది.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క, కొద్దిగా ఉప్పు నమిలి నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలించాలి. లేదా దాల్చిన చెక్క పొడితో బ్రష్ చేయండి.

Posted on

Telugu remedies for blisters- నాలుకపై బొబ్బలను(బ్లిస్టర్స్) తొలగించేందుకు ప్రాకృతిక నివారణలు

బొబ్బలు విటమిన్ల లోపం వళ్ళ ఏర్పడే ఒక ఆరోగ్య పరిస్థితి. కొన్నిసార్లు అనుకోకుండా మనం నాలుకను కొరికినప్పుడు కూడా రావచ్చు. నాలుక మంట వలన, ఆహార అలర్జీలు, నోటి పుండు మరియు వైరల్ సంక్రమణ వలన కూడా బ్లిస్టర్స్ రావచ్చు. విటమిన్ సి లోపం వలన కూడా కావచ్చు. కొంత మందికి ప్రస్తుతం వేరే ఆరోగ్య సమస్యల కోసం తీసుకుంటున్న మందుల వలన కూడా రావచ్చు.

బొబ్బలు చాలా రకాలు, కొన్ని చర్మం రంగులలో, కొన్ని పసుపు మరియు ఎరుపు రంగులలో ఉంటాయి. ఇది ఆహారాలను భుజించేటప్పుడు చాలా చిరాకును పుట్టిస్తుంది. వీటిని గుణపరిచేటందుకు కొన్ని సహజ విధానాలను చూద్దాం.

నాలుక మీద బొబ్బలు నయం చేయటం ఎలా?

ఇది చాలా నొప్పిని కలిగించే ఒక సంక్రమణ. మీ నోటిలో బ్లిస్టర్స్ ఉన్నప్పుడు సరిగ్గా మాట్లాడటానికి కూడా వీలు కాదు. ఇది పిల్లలకు లేదా పెద్దలకు పెదాలపై, నోటి లోపల భాగాలలో లేదా నాలుక పైన రావచ్చు. ఇవి బాగా నొప్పిగా ఉండేందువలన సరిగ్గా తినడానికి కూడా వీలు కాదు. వీటిని నివారించేందుకు కొన్ని గృహ నివారణ పద్ధతులను చూద్దాం. ఇవి తప్పకుండా మీ నొప్పిని మరియు బ్లిస్టర్స్ ను తొలగిస్తుంది.

గృహ నివారణలు

బేకింగ్ సోడా

ఇది చాలా సాధారణమైన మరియు సమర్థవంతమైన పరిష్కారం. ఒక కప్పు వెచ్చని నీళ్లలో ఒక చెంచా బేకింగ్ సోడాను కలుపుకొని నోట్లో 3 నిమిషాల పాటు ఉంచండి. ఇలా కొన్ని సార్లు చేసినట్లయితే బొబ్బలు తగ్గిపోతాయి.

కలబంద

కలబంద గురించి మీరు వినే ఉంటారు, ఇది చాలా ఉపయోగకరమైన చెట్టు. దీనిని బ్లిస్టర్స్ ను తొలగించేందుకు కూడా వాడవచ్చు. ఇందులోని జెల్‌ను నోటి బొబ్బలపై రాసి 5 నిమిషాలు ఉంచి వెచ్చని నీటితో కడగండి.

మంచు గెడ్డ (ఐస్)

ఇది చర్మాన్ని మొద్దుబారేలా చేయటంవలన నొప్పిని తగ్గిస్తుంది. మంచు గెడల్ని మీ నోటి బొబ్బల పై మెల్లగా రుద్దండి . ఇది మీకు వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.

పసుపు

ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులోని యాంటీ సెప్టిక్ గుణాలు నోట్లో లేదా పెదాలపై ఉన్న కురుపులను తగ్గించేందుకు తోడ్పడుతుంది. వెంటనే ఉపశమనాన్ని పొందేందుకు ఒక టీస్పూన్ తేనెలో పసుపును కలిపి కురుపులపై రాసి 3 నిమిషాల తరువాత కడగండి. ఇలా రోజుకు మూడు సార్లు చేయటంవలన తొందరగా ప్రభావం చూపిస్తుంది.

ఉప్పు

ఉప్పుని ఉపయోగించటం వలన బొబ్బలవల్ల కలిగే మంటను మరియు నొప్పిని తగ్గిస్తుంది. ఒక కప్పు వెచ్చని నీళ్లలో ఒక చెంచా ఉప్పుని కలిపి కనీసం 30 సెకండ్లు పుక్కిలించాలి. ఆ తరువాత ఉప్పుని బొబ్బలపై రాసి ఒక నిమిషం ఉంచి వెచ్చని నీటితో కడగండి. బొబ్బలు తగ్గేవరకూ ఇలా రోజుకు 45 సార్లు చేయండి.

హైడ్రోజన్ పెరాక్సైడ్

ఇందులో యాంటీ-బాక్టీరియల్  మరియు క్రిమిసంహారక లక్షణాలు ఉన్నందున ఇది సంక్రమణాలను తగ్గిస్తుంది.3% హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను మాత్రమే వాడాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు నీటిని సమంగా కలిపి ఒక పత్తిని ఈ ద్రవంలో తడిపి బ్లిస్టర్స్ పై రాయాలి. రెండు నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజుకు కొన్ని సార్లు చేయండి.

గమనిక : హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని తక్కువ మోతాదులలో వాడాలి. ఎక్కువ వాడకూడదు.

తులసి

తులసిలో యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఇంఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నందున ఇది మంటను మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

తులసి ఆకులను బాగా కడిగి, కొన్నింటిని బాగా నమిలి తినాలి. ఇలా 3 లేదా 4 రోజులు తినటం వలన బొబ్బలు తగ్గిపోతాయి.

తేయాకు చెట్టు నూనె

ఇందులోని యాంటీ సెప్టిక్ మరియు యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు బ్లిస్టర్స్ ను తొలగిస్తాయి. ఒక కప్ నీళ్లలో కొన్ని చుక్కల తేయాకు చెట్టు నూనెని వేసుకొని రోజుకు రెండు సార్లు మౌత్ వాష్ లాగా వాడండి.

కొత్తిమీర/ధనియాలు

ఇందులోని యాంటీ-ఇంఫ్లమేషన్ మరియు యాంటీ సెప్టిక్ గుణాల వలన మంటను మరియు నొప్పిని తగ్గించి బ్లిస్టర్స్ ను చాలా సమర్థవంతంగా నివారిస్తుంది.

ఒక కప్పు నీటిలో ధనియాలు లేదా కొత్తిమీరను వేసి బాగా ఉడకబెట్టండి. ఈ నీటితో నోటిని బాగా కడగండి. ఇలా రోజుకు 3-4 సార్లు చేయటం వలన బొబ్బలు తొలగిపోతాయి.

విటమిన్ బి

విటమిన్ బి లోపం వలన కూడా ఈ బ్లిస్టర్స్ రావచ్చు. విటమిన్ బి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినటం వలన ఇవి తొలగిపోతాయి.

పాలు, పెరుగు, చీస్ మరియు తృణధాన్యాలు, గుడ్లు, సాల్మన్ చేప, ఓట్స్, ఊక, అవకాడొలు, అరటి పండ్లు, టర్కీ( సీమ కోడి) మరియు కాలేయం, వీటన్నిటి లో విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులు విటమిన్ బి మందులను కూడా తీసుకోవచ్చు.

బొబ్బలు ఉన్నప్పుడు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు

 • మీ పళ్ళతో బ్లిస్టర్స్ ను గోక వద్దు. ఇది మంటను పెంచుతుంది. ఇందువలన వీటిని నివారించేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
 • ఎక్కువ నీరు త్రాగటం చాలా అవసరం. నీరు త్రాగటం వలన బొబ్బలు ఎక్కువ కాకుండా ఉంటుంది. నాలుక తడిగా ఉండటం వలన నొప్పి తగ్గుతుంది.
 • చల్లని నీళ్లలో ఉప్పుని కలుపి నోరును పుక్కిలించండి. ఇది నోటిని శుభ్రం చేసి బాక్టీరియాలను తొలగిస్తుంది. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు చేయటం వలన గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.  అంతే కాదు ఇది మీ నోటిని తాజాగా ఉంచుతుంది.
 • తరచూ పళ్ళను తోమి బాక్టీరియాలను తొలగించండి.
 • మీ నోట్లో బ్లిస్టర్స్ ఉన్నప్పుడు చల్లని పదార్థాలను తినండి. ఉదాహరణకు చల్లని నీళ్ళు, చల్లని పాలు, ఐస్ క్రీమ్స్, ఫల రసాలు లాంటివి. ఇది మీ నాలుకను తడిగా ఉంచేందుకు తోడ్పడుతుంది.
 • కాఫీ, టీ లాంటి వేడి మరియు కార మైన పదార్థాలను తినకండి. ఇవి నొప్పిని పెంచుతుంది.
 • మీరు ఏదైనా మౌత్ వాష్లను వాడుతునట్లయితే, సంక్రమణం వ్యాపించకుండా ఉండేందుకు కొద్ది రోజులు వాడడం మానండి. వీటికి బదులుగా తేయాకు నూనెని వాడండి.
 • మీరు రోజు తినే ఆహారంలో అల్లం మరియు వెల్లుల్లిని ఎక్కువగా చేర్చుకోండి. రోజూ తినడం వలన ఇది బ్లిస్టర్స్ ఎక్కువ కాకుండా ఆపుతుంది.
 • ఎక్కువ కారం ఉండే పదార్థాలను మరియు ఎక్కువ ఆసిడ్స్ ఉండే పదార్థాలను తీసుకోవద్దు. ఎక్కువ తీపును కూడా తినవద్దు.
 • మెత్తగా ఉండే ఆహార పదార్థాలను తినండి. ఎందుకంటే ఇవి నమలటానికి సులువుగా ఉంటాయి.
 • మీకు తరచూ ఈ బ్లిస్టర్స్ వస్తున్నట్లయితే, సోడియం లరిల్ సల్ఫేట్(SLS ) ఉండే పేస్టులను వాడవద్దు.

బ్లిస్టర్స్ తగ్గటానికి మరియు రాకుండా ఉండేందుకు కొన్ని ముందు జాగ్రత్తలు

 • రోజుకు రెండు సార్లు పళ్ళు తోమండి.
 • విటమిన్స్ మరియు పోషక ఆహారాలను తినండి.
 • పెప్సీ, కోక్ లాంటి అసిడిటీ కలిగించే పానీయాలు త్రాగకుండా నివారించండి.

మీ బ్లిస్టర్స్ రెండు వారాలకంటే ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే ఒక వైద్యుడిని సంప్రదించి కారణాలను తెలుసుకొని తగిన మందులను వాడండి.

Posted on

Telugu tips for toothache relief – పంటినొప్పి నుండి ఉపశమనం పొందటానికి గృహ చిట్కాలు

మనం మాములుగా తినే చెక్కర లేదా పిండి పదార్థాలు పళ్ళపై ఉండిపోయినప్పుడు ఇవి బాక్టీరియా రావటానికి కారణం అవుతాయి, దీని వలన కావిటీస్ ఏర్పడతాయి. ఈ కావిటీస్ వలనే పంటి నొప్పి వస్తుంది. ఈ బాక్టీరియాలు ఆమ్లాలను(ఆసిడ్స్) ఉత్పత్తి చేస్తాయి, ఇది పంటికి చాలా హానికరం. ఈ ఆసిడ్స్ నరాలను చేరుకున్నప్పుడు నొప్పి ప్రారంభమవుతుంది.

నోటిలోని చిగుళ్లు ముడుచుకుపోయినప్పుడు పంటి దంతి క్రింద ఉన్న ధాతువు బయటకి రావటం వలన పళ్ళు చాలా సున్నితం అవుతాయి. వేడీ లేదా చల్లని పదార్థాలను తినేటప్పుడు సున్నితమైన పళ్ళలో నొప్పి పుడుతుంది.

పంటి చిగురు గట్టిగా లేనప్పుడు లేదా పంటిపై చీలికలు ఏర్పడినప్పుడు కూడా పంటి నొప్పి రావచ్చు. ఏ ఒక్క సంక్రమణమైన పంటి చిగురు వరకూ వెళ్లినప్పుడు నొప్పి ఏర్పడుతుంది. ఒక దంత వైద్యుడు మాత్రమే నొప్పి యొక్క అసలైన కారణం కనిపెట్టగలరు. అయినప్పటికీ, కొన్ని గృహ నివారణ పద్ధతుల ద్వారా నొప్పిని తగ్గించడం ఎలా గని తెలుసుకుందాం.

నిద్రలేచిన వెంటనే పంటి నొప్పి రావటం చాలా చిరాకు పుట్టిస్తుంది. కొంత మందికి తక్కువ నొప్పి ఉండొచ్చు మరి కొంత మందికి తీవ్రమైన నొప్పి కలగొచ్చు. ఎటువంటి నొప్పి అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవటం మొదలు పెట్టండి.

పంటి నరాలు నుదుటి నరాలకు జత పడి ఉన్నందున కొన్ని సార్లు పంటి నొప్పి ఎక్కువ అయినప్పుడు మీ నుదురు కూడా నొప్పిగా ఉంటుంది. ఒక నియమం ప్రకారం పంటి వైద్యుల్ని సంప్రదించడం చాలా మంచిది.

పంటినొప్పిని తగ్గించటానికి గృహ చిట్కాలు

 • అన్నం తిన్న తరువాత లేదా పొద్దున, రాత్రి పళ్ళు తోమిన తరువాత వెచ్చని నీళ్లతో లేదా ఉప్పుని కలిపిన వెచ్చని నీళ్లతో పుక్కిలించండి.
 • మద్యం లేదా లవంగం నూనె లేదా జాజికాయ నూనెని గాయపడిన పంటిపై రాయండి.
 • మీకు అపారమైన నొప్పి ఏర్పడినప్పుడు మంచు గడ్డలను దంతాలు మరియు బుగ్గలు మధ్య 15 నిమిషాలు ఉంచండి. ఇలా రోజుకు నాలుగు సార్లు చేయండి.
 • పాలు మరియు ఆకుకూరలు ఎక్కువగా తినండి, వీటిలో కాల్షియము ఎక్కువగా ఉంటుంది. చెక్కర మరియు చల్లని ఆహార పదార్థాలను తినడం మానుకోండి, వాటివలన పళ్ళు కుళ్లిపోతాయి.
 • నొప్పిగా ఉన్నప్పుడు వేడిని తగలనివ్వద్దు , ఇది నొప్పిని ఇంకా పెంచుతుంది.

సాధారణంగా పంటి నొప్పి కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది, ఆస్పిరిన్ లాంటి మందులు లేదా నొప్పిని తగ్గించే జెల్‌ని పూయటం వలన మరియు క్రింద చెప్పిన ప్రాకృతిక నివారణలను అనుసరించటం వలన కూడా నొప్పి తగ్గుతుంది.

ప్రాకృతిక నివారణలు

 • లవంగ నూనె – లవంగ నూనెలో బాక్టీరియాను చంపే లక్షణాలు ఉన్నాయి. ఇది పళ్లకు మత్తు కలిగించుతుంది. ఇది చాలా ప్రాచీనమైన నివారణ పద్దతి. ఈ నూనెని నొప్పిగా ఉన్న పంటిపై పూసుకోవడంవలన వెంటనే ఉపశమనం కలుగుతుంది.
 • లవంగం – కొన్ని లవంగాలను నోటిలో వేసుకొని మెత్తగా అయిన తరువాత నమలండి. నొప్పిగా ఉన్న పళ్ళపై పెట్టి నొక్కండి. ఇలా ఒక అరగంట చేయటం వలన నొప్పి తగ్గుతుంది. పంటి నొప్పి, పళ్ళ సంక్రమణం లేదా పంటి గడ్డలను నివారించటానికి  లవంగం ఉపయోగపడుతుంది.
 • అల్లం మరియు ఎరుపు మిరియాలు – అల్లం పొడి మరియు మిరియాల పొడిని నీటిలో కలిపి ఒక పేస్ట్ లాగా చేసి నొప్పిగా ఉన్న పంటిపై రాయండి.
 • సాంబ్రాణి – సాంబ్రాణి మంటని తగ్గించి బాక్టీరియాలను చంపుతుంది. ఒక చెంచా సాంబ్రాణి పొడిని రెండు కప్పుల నీటిలో వేసి 30 నిమిషాల పాటు తక్కువ మంటపై పెట్టి వేడి చేయాలి. ఆరిన తరువాత వడగట్టి రోజుకు 4 లేదా 6 సార్లు ఈ నీటితో నోటిని పుక్కిలించండి.
 • మిరియాలు – ఇందులో మంచి సువాసన మరియు మత్తు కలిగించే గుణాలు ఉన్నాయి. మిరియాల ఆకులను వేడి నీటిలో వేసి 20 నిమిషాల పాటు నానపెట్టండి. ఆ తరువాత ఆ నీటితో నోటిని పుక్కిలించండి.
 • ఒక గ్లాసు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి, 30 సెకండ్ల పాటు పుక్కిలించండి.
 • వెల్లుల్లి – చూర్ణం చేసిన వెల్లుల్లి లేదా వెల్లుల్లి పొడిని నొప్పిగా ఉన్న పంటిపై రాయండి. ఇది చాలా ప్రాచీనమైన నివారణ పద్దతి.
 • మంచు గడ్డలు – మంచు గడ్డలు నరాలకు మత్తు కలిగిస్తుంది. నొప్పిగా ఉన్న నరాల పై 15 నిమిషాల పాటు ఉంచండి. వీటికి బదులుగా మంచు పాక్లను బుగ్గలపై ఉంచవచ్చు.
 • బ్లాక్ టీ – ఇందులో రక్తస్రావాన్ని నివారించే గుణాలు ఉన్నాయి. ఇది వాపును తగ్గించి తాత్కాలిక నివారణని ఇస్తుంది.
 • జిగురు కణజాలంను సంరక్షించడానికి, మరింత ముడుచుకొని పోకుండా ఉండటానికి మృదువైన బ్రష్లు ఉపయోగించాలి.
 • పంటి నొప్పిని తగ్గించటానికి పసుపును వాడవచ్చు. దీనికి నొప్పిని తగ్గించే సామర్థ్యం కలదు. బాక్టీరియా మరియు క్రిమి నాసిక లక్షణాలు ఉన్నాయి. పసుపును నీటిలో కలిపి ముద్దగా చేసి దూదితో నొప్పిగా ఉన్న చోటులో రాయండి.
 • హైడ్రోజన్ పెరాక్సైడ్ – పంటి నొప్పిని తగ్గించేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా మందికి ఉపయోగ పడింది. అర చెంచా 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ ని నోటిలో కొన్ని నిమిషాలు ఉంచాలి లేదా ఒక దూదిని ఈ ద్రవంలో తడిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచండి.
 • జాజికాయ నూనె – ఒక దూదిని ఈ నూనెలో తడిపి నొప్పిగా ఉన్న పంటిపై రాయండి.
 • అరటి ఆకులు, జామ ఆకులు మరియు తోటకూర ఆకులు – ఇవన్నీ పంటినొప్పిని తగ్గించే ప్రాకృతిక పదార్థాలు. ఈ ఆకులను నోటిలో వేసుకొని నమలచ్చు, లేదా వీటిని నలిపి నొప్పిగా ఉన్న చోట్లో పూయండి. జామ ఆకులను నీళ్లలో ఉడకబెట్టి ఉప్పుని కలిపి ఈ నీటితో పుక్కిలించవచ్చు.
 • దోసకాయ – తాజా దోసకాయ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై కొంచం సేపు ఉంచండి. చల్లని దోసకాయ ముక్క భరించలేని నొప్పినుంచి కూడా వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ ఇది సున్నితమైన పళ్ళపై వాడకూడదు, దానికి బదులుగా దోసకాయను బాగా దంచి అందులో ఉప్పు కలిపి నొప్పిగా ఉన్న పంటిపై రాయవచ్చు.
 • బేకింగ్ సోడా – బేకింగ్ సోడా ను నీటిలో కలిపి నొప్పిగా ఉన్న పంటిపై రాయండి. లేదా వెచ్చని నీటిలో బేకింగ్ సోడాని కలిపి పుక్కిలించటం వలన కూడా నొప్పి తగ్గుతుంది.

పంటినొప్పి ఉపశమనం కోసం ప్రాకృతిక గృహ చిట్కాలు

ఉప్పు మరియు మిరియాలు

ఉప్పు మరియు మిరియాలు మీ వంటింట్లో చాల కావలసిన పదార్థాలు. ఈ పదార్థాలను వాడి మీ పంటినొప్పిని కూడా తగ్గించవచ్చు. వీటి రెండింటి లోను బాక్టీరియా మరియు వేడిని తగ్గించే గుణాలు ఉన్నాయి. నీటిలో అర చెంచా ఉప్పు మరియు అర చెంచా మిరియాల పొడిని కలిపి ముద్దలా చేసుకొని నొప్పిగా ఉన్న పళ్ళపై రాయండి.

ఉల్లిపాయ

మీరు రోజు తినే ఆహారాలలో ఉల్లిపాయలను వాడుతారు . కానీ ఇది పల్ల సమస్యలను తొలగిస్తుందని కొంత మందికి తెలియక పోవచ్చు. ఇందులో మైక్రోబియల్ ( బాక్టీరియా)ని తొలగించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయలతో మీ పంటిలోని క్రిములను నిర్మూలించవచ్చు. పళ్ళు నొప్పిగా ఉన్నప్పుడు పచ్చ ఉల్లిపాయలను నమలండి.

గోధుమ గడ్డి సారం

మీరు తరచూ గోధుమ గడ్డి యొక్క సారంతో నోటిని కడిగితే పంటి నొప్పి నుంచి గొప్ప ఉపశమనాన్ని పొందుతారు. ఈ సారాన్ని మీరు క్రమం తప్పకుండా వాడాలి. ఇది మీ పళ్ళు మరియు దంతాలపై విష పదార్థాలను తొలగిస్తుంది. బాక్టీరియా మరియు ఎలాంటి సంక్రమణము జరగకుండా కాపాడుతుంది.