Posted on

Benefits of breastfeeding to baby and mother in Telugu – తల్లి పాలల్లో..!

క్యార్.. క్యార్.. మని బిడ్డ ఏడ్చిందంటే ఆ బిడ్డ తల్లి పాల కోసం ఏడ్చిందనే అర్థం. తల్లి పాలు ఎంతో శ్రేష్టం. ఎంత శ్రేష్టమంటే బిడ్డ పుట్టిన అరగంటలోపే తల్లిపాలను తాగిస్తే ఆ బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పిల్లల్లో పెరుగుతుంది. బిడ్డకు దీర్ఘయుష్షునిచ్చే అమృతం. మన పెద్దలు ఇవే మాటల్ని వారి అనుభవపూర్వవకంగా చెబుతారు. ఎందుకంటే వారికి వాటి విలువ తెలుసు కాబట్టి. కాని నేటి తరం ఆడవారు మాత్రం వారి పాలను ఇవ్వకుండా పోత పాలకు అలవాటు చేస్తున్నారు. దీని వల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి తగ్గిపోతోంది. దీనిపై అవగాహనా రాహిత్యం, పని వత్తిడి, మారుతున్న కాలానుగుణం వస్తున్న మార్పులూ కారణాలు.

‘తల్లి ప్రసవించిన తరువాత వచ్చే పాలను ముర్రు పాలు’ అంటారు. దీనిని ‘కీలస్ట్రామ్‌’ అని కూడా అంటారు. ముర్రుపాల ను పిండి పారమేయకూడదు. బిడ్డ పుట్టిన అరగంట లోపలే ముర్రు పాలను శిశువుకు తాగిపిస్తే బిడ్డ దీర్ఘ్ఘకాలం, ఆరోగ్యం, అభివృద్ధికి తొర్పడుతుంది. ఇందులో పోషకాలు అధికంగా ఉండటమే గాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా కల్గి ఉంటంది ఆరోగ్యాభివృద్ధికి ప్రకృతి సిద్ధం. ఖర్చులేని పద్ధాతి కావడంతో తల్లిపాలు యివ్వడం వలన తల్లికి బిడ్డకి మంచి సంబంధం, ప్రేమ, అభిమానం అప్యాయత పెరుగుతుంది. శిశువుకి తన పాలు యివ్వడం వలన తల్లి శరీరంలో ‘ఆక్సిటిసిన్‌’ హార్మోను విడుదల వుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం చేసిన సర్వేల ప్రకారం తల్లిపాలకు మించినది ఏదీ లేదని తేల్చి చెప్పారు. తల్లిపాలు త్రాగించటం వలన శిశుమరణాలు చాలా వరకు తగ్గాయని వారు నివేదికలో పేర్కోన్నారు.గర్భాశయం ప్రసవం తరువాత తొందరగా సహజ పరిమాణానికి తగ్గడానికి ఈ హార్మోను సహయపడుతుంది. తరుచుగా శిశువుకు పాలు యివ్వడం వలన రొమ్ములు గడ్డ కట్టవు, నొప్పి ఉండవు, స్థూలకాయం ఏర్పాడటం తగ్గుతుంది.

ముఖ్యంగా ముర్రుపాలలో ఎక్కువ ఖనిజాలు, విటమిన్లు, ముఖ్యంగా ఎ,డి,బి12 విటమిన్లు, రోగకారక క్రమ నిరోధకలు ఉంటాయి. అంతే గాకుండా తల్లిపాల వలన మెదడు,నేత్రాల నిర్మాణం అభివృద్ధికి సహాయపడతాయి. ఊపిరితిత్తులకు సంబం ధిం చిన జబ్బులు అలర్జీలు, పేగుల్లో రుగ్మతలు, న్యూమోనియా, మూతసంబంధిత వ్యాధులనుంచి రక్షణ పొందవచ్చు. బిడ్డ పుట్టిన పటినుంచి ఆరునెలలకాలం తల్లిపాలు సంపూర్ణ ఆహారంగా పని చేస్తాయి.

బిడ్డకు అవసరమైన అన్ని పోషక పదార్థాలు సమపాళ్లలో ఉం చటమేగాక వ్యాధి-నిరోధక శక్తిగా పని చేస్తాయి. ఈ ఆరు నెలల కాలం బిడ్డకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ఆహారం అవసరముండదని వైద్యుల చెబుతారు. ఇలా ఇవ్వటం తల్లికి బిడ్డకు ఎంతో మంచిదని చెబుతారు. పోతపాలకు అలవాటు చేస్తే శిశువు తల్లిపాలను పూర్తిగా తాగడం మానేస్తాదు. తల్లితన బిడ్డకు తన పాలు తాగిచటమనేది ఒక సహజమైన జీవ క్రియ. నాలుగు వందల పోషకాపదార్థాలు ఉండే తల్లిపాలకు ఏ మేక, గేదె పాలు ప్రత్యేమ్నాయం కావు.

1. తల్లిపాలు బిడ్డకు మొదటి వ్యాధినిరోధకటీకాగా ఉపయోగపడుతుంది.

2. బిడ్డల్ని వదిలి కూలి పనికి వెళ్లే తల్లులు తమ పాలను ఒక పరిశుభ్రమైన గ్లాసులో పిండి సురక్షిత ప్రాంతంలో ఉంచి 8గంటలలలోగా ఆపాలను శిశువువలకు చెంచాతోగానీ లేదా ఉగ్గుగిన్నెతోకాని పట్టవచ్చును

3. ఒక తల్లి మరో తల్లిబిడ్డలకు అత్య్యవసరమైన సమయాలలో పాలు పట్టించవచ్చును.

4. ధీర్ఘకాల వ్యాధులు ఉన్న తల్లులు వైద్యుల సలహామేరకు శిశువు పాలివ్వా లి.హెచ్‌.ఐవి. ఇన్‌ఫెక్షన్‌ ఉన్న తల్లులు పోతపాలు సుక్షితంగా ఇవ్వలే నప్పుడు కేవలం తమ పాలను 6నెలల వరకు శిశువు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం.

తల్లి పాల శ్రేష్టత తెలుసుకుని ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తల్లి పాలు పట్టడం ఎంతో మంచిది.

Posted on

Pregnancy care tips for women in Telugu – గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సృష్టిలో అపురూపమైనది, ఏమీ ఆశించని స్వచ్చమైన అసలు సిసలైన అనురాగం అప్యాయత కలగలిపి చూసేది అమ్మతత్వం.గర్భవతి అవ్వటం ఓ విసేషం అయితే గర్భధారణ కూడా అంతే కీలకమైనది.బిడ్డ పుట్టక ముందు నుంచి మొదలుపెట్టి… నెల తప్పడంతో మొదలైన గర్భధారణ నాటి నుంచి 40 వారాల వరకు క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. గర్భధారణ జరిగాక మొదటి ఏడునెలల్లో ప్రతినెలా క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఏడోనెల నుంచి తొమ్మిదో నెల వరకు ప్రతినెలలో రెండుసార్లు, తొమ్మిదోనెల నుంచి ప్రసవం వరకు ప్రతివారం డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండాలి.

డాక్టర్‌ను సంప్రదించిన ప్రతిసారీ గర్భధారణ సమయంలో పెరుగుతున్న బరువు (మెటర్నల్ వెయిట్ గెయిన్), బీపీ, శరీరంలోంచి కోల్పోయే ప్రోటీన్లను తెలుసుకునేందుకు మూత్రపరీక్షలు తప్పక చేయించాలి.గర్భవతికి హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు ఉంటే పైన పేర్కొన్న కాల వ్యవధిలోపే డాక్టర్ సలహా మేరకు వైద్యుని సంప్రదించాలి.ఇంతే కాక గర్భవతిలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ సూచించే ఇతర పరీక్షలు, బిడ్డ ఎదుగుదలను పరిశీలించేందుకు వీలుగా చేసే ‘యుటిరైన్ సైజ్’ పరీక్షను చేయించుకోవాలి.

గర్భవతి తీసుకోవలసిన ఆహార అలవాట్లు

గర్భధారణ సమయంలో కొన్ని విటమిన్లు, మినరల్స్ అదనంగా అవసరమవుతాయి. అయితే ఈ విటమిన్లు, మినరల్స్ స్వాభావికంగానే లభ్యమైతే అది మేలు. ఒకవేళ అలా జరగకపోతే కాబోయే తల్లికి విటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.అన్ని సూక్ష్మపోషకాలూ, విటమిన్లు, మినరల్స్ అందేలా పోషకాహారంలో తాజాపండ్లు, ఆకుకూరలు, పాల ఉత్పాదనలు తీసుకోవాలి.తల్లి తన బిడ్డకు పుష్కలంగా పాలు పట్టాలంటే ప్రతిరోజూ 10 మైక్రోగ్రాముల విటమిన్ డి అందాలి.

మొదటి మూడు నెలలూ ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. దీనివల్ల పుట్టబోయే బిడ్డలో వెన్నెముకకు సంబంధించిన లోపాలను నివారించవచ్చు. ఫోలిక్ యాసిడ్ అందకపోవడం వల్ల వచ్చే వెన్నె ముక సంబంధ లోపాలు ఉన్న కండిషన్‌ను ‘స్పైనా బైఫిడా’ అంటారు. ఈ కండిషన్ వల్ల బిడ్డ పురిట్లోనే చనిపోయే అవకాశం ఉంది. ఒకవేళ బతికితే శారీరక వైకల్యాలు వచ్చే ప్రమాదం ఉంది. ఫోలిక్ యాసిడ్ అన్నది ఆకుకూరలు, దంపుడు బియ్యం వంటి వాటితో సమకూరతాయి.

‘విటమిన్-ఏ’ సప్లిమెంట్లు వద్దు: గర్భధారణ సమయంలో విటమిన్-ఏ సప్లిమెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవటం మంచిది కాదు.

Posted on

Best food tips for the infants in Telugu – మీ పిల్లల ఆరోగ్యము,ఆహార నియమాలు(పద్దతులు)

చిట్టి పొట్టి చిన్నారులనుంచి, తప్పటడుగులు వేస్తూ చాక్లెట్ తినే పిల్లలవరకూ వారి తల్లిదండ్రులలో ఉండే ఒకే ఒక్క ఆవేదన పిల్లల ఆహారము,వారి సం రక్షణ, అయితే,పిల్లలు ఎదిగే వయస్సులో ఉన్నప్పుడు వారి అహారం పొషకపదార్దాలతో సరి సమానంగా ఉండాలి, తక్కువ కాకుండా, అలా అని ఎక్కువ కాకుండా సరిచూసుకోవాలి. సాద్యమైనంత వరకూ తల్లి పాలు తగ్గించి, పొషకపదార్దాలు నిండిన ఆహారం అందించడం ఎంతో అవసరం, అయితే ఇక్కడ సూచించిన నియమాలు మీ పిల్లల ఎదుగుదలకు, అరోగ్య సం రక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి.

మొదటి 4 నెలలు,ఆహార నియమాలు:

పుట్టిన వెంటనే మొదటి 3 వారాలు పాలు 1/2 నుంచి 1oz,4 ఒజ్ వరకు ఇవ్వవచ్చు, ఇలా 2-3 గంటలకు ఒకసారి అలా రోజుకి 8 సార్లు ఇవ్వవచ్చు .
మొదటీ 3 వారాల నుంచి 4 నెలలు వరకు:
4-6 oz పాలను ఇవ్వాలి అలా 4 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 6 సార్లు ఇవ్వాలి.
ఈ వయస్సులో వారి జీర్ణ అవయవాలు ఎదిగే సమ్యయం కాబట్టి,తల్లి పాలు, లేదా పోత పాలు మత్రమే ఇవ్వాలి.

4 నెలలు నుంచి 6 నెలల వరకు,ఆహార నియమాలు:

తల్లి పాలు లేదా స్వచ్చమైన పోత పాలు ఇవ్వడం మంచిది.
5-7oz, పాలను ఇవ్వాలి అలా 5 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 5 సార్లు ఇవ్వాలి.
ఈ వయస్సులో కొద్ది కొద్దిగా ద్రవం రూపంలో బలాన్ని చేకూర్చే ఆహారం, అంటే మెత్తగా కలిపి, లేదా నీటిలో నానబెట్టి,స్పూనుతో పట్టించాలి,

6 నెలలు నుంచి 9 నెలల వరకు,ఆహార నియమాలు:

తల్లి పాలు లేదా స్వచ్చమైన పోత పాలు ఇవ్వడం మంచిది.
7-8 oz, పాలను ఇవ్వాలి అలా 6 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 4 సార్లు ఇవ్వాలి.
చిన్నారులు తింటున్నారు కదా అని ఎక్కువశాతం పెట్టకుండా కొంచెం, కొంచెం గా పప్పు,పండ్లు,మెత్తగా ముక్కలు చేసి తినిపించాలి.
ఇలా రోజుకి 2-3 సార్లు,3-9 స్పూన్లు తినిపించవచ్చు.
ముందుగా, మెల్లగా ఒక స్పూన్ పండ్లు, లేదా పండ్ల రసం పట్టించాలి, అలా అలా మెల్లగా1\4 కాప్పు,1\2కప్పు పెంచుతూ రోజుకు 2-3 సార్లు ఇవ్వడం మంచిది.
పండ్లలో అరటి పండు,ఆపిల్,అవకాడో పండు, దానిమ్మ,ఉడికించిన క్యారెట్,ఇలా తినిపించవచ్చు.

9 నెలలు నుంచి 12 నెలల వరకు,ఆహార నియమాలు:

7-8 oz పాలను ఇవ్వాలి అలా 6 గంటలకు ఒకసారి ఇస్తూ రోజుకు 4 సార్లు ఇవ్వాలి.
ఈ వయస్సులో మరికొన్ని పదార్దాలను అలవాటు చేయాలి, అవి ఏమిటంటే,వెన్న,”ప్రొటీన్లు కలిగిన ఆహారం” ,పండ్లు,చిన్న చిన్న కూరగాయలు ,ఇలా తినిపించడం మంచిది.
ఒక కప్పుతో పండ్ల రసములు ఇవ్వడం ఎంతో మంచిది.
Posted on

Telugu food feeding tips to 1-2 years kids – ముద్దులోలికించే పసి పిల్లలకు(1-2 ఏళ్ళు) ఆహార జాగ్రత్తలు

ముద్దులోలికించే పసి పిల్లలంటే ఇష్టపడని వారుండరేమో,ఎన్ని కష్టాలు అనుభవిస్తే మాతృత్వం లభిస్తుందో, అంతే ఆనందం ఆ చిట్టి పొట్టి పిల్లలు అడుగులు వేస్తుంటే కలుగుతుంది,అయితే వారి పట్ల తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి,తల్లినుంచి లబించే ఆహారం,సరిపోయినప్పటికీ,వాళ్ళ ఎదుగుదలకు ఎన్నో రకములైన పోషక పదార్దాలు అవసరం.సమాన్యంగా పిల్లలు సంవత్సర కాలంలో 3-5inch మాత్రమే పెరుగుతారు, అయితే వారివారి వయస్సు,చురుకుతనం, బరువుని దృష్టిలో ఉంచుకుని రోజుకి 1,000-1,400 క్యాలరీలు ఉండే ఆహారం ఇవ్వాలి.అదేవిధంగా క్రమం తప్పకుండా, డాక్టర్ ని సంప్రదిస్తే మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించనవసరం లేదు.
 తప్పటడుగులు వేసే మీ చిన్నారులకు ఆహార నియమాలు ఇవే:
ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చే ఆహారం:
మీ పిల్లలు తినేటప్పుడూ ఎక్కువగా అల్లరి చేస్తూ, ఒక్కొక్కటే తింటూన్నారా,అయితే ఆ ఒక్క వాటిలోనే అన్ని రకముల పోషక పదార్దాలు ఉండేలా చూసుకోవాలి,కొంచెం కొంచెం పెడుతూ తినిపిస్తూ ఉండాలి, అంతే కాకుండా వెన్న, బన్ను,వేరుసనగ వెన్న, ఇలా తినిపిస్తూ ఉంటే మంచిది.
 మీ బుజ్జి పాపకి లేదా బాబుకి “డ్రింక్స్” తయారుచేయండి:
అందమైన మీ చిన్నారులకి ద్రవం రూపంలోనే ఎక్కువ పొషకాలు పట్టించండి, అయితే ఎక్కడ “జ్యూస్” లను కాకుండా పాలు, నీరు, కొంచెం పండ్ల రసము కలిపిన నీరు కలిపి పట్టిస్తే ఎంతో మంచిది .
 చిరు తిండి:
ఎప్పుడూ అల్లరి చేస్తూ ఆడుతూ మనల్ని నవ్వించే మన పసిపిల్లలు ఆడీ ఆడీ, అలసిపోతారు, అందుకే కొంచెం సమయం తరువాత కొద్ది కొద్దిగా చిరుతిండి తినిపిస్తే ఎంతో మంచిది, చిరుతిండి అనగానే మనం తినేవి కాకుండా, పొషక పదార్దాలతో కూడినవి,”యాపిల్ సాస్, వెన్న,కేక్,క్యారెట్”ఇలా.
 తిండిలోని మార్పులో:
ఆ చిన్నవయస్సులో, ఏమి తెలియని పసిపిల్లలకు రోజు ఒకే రకమైన ఆహారం పెట్టడం మంచిది కాదు, బోర్ కొట్టి తినడం మానేస్తారు, మనమైనా అంతేకదా, రోజూ ఒకే రకమైన కూర తింటే మనకైనా బోర్ కొడుతుంది.
అందుకే రోజుకోరకంగా రంగు, రుచి,వాసన, మరియూ పొషక పదార్దాలు,మారుస్తూ, పెట్టడం మంచిది,మరియూ మీ పిల్లలకు అరటి పండు, యాపిల్ ని ముక్కలుగా చేసి తినిపించడం, లేదా వాటిలో పెరుగు కలిపి పట్టించడం మంచిది.
 అధికంగా తినిపించే కన్నా పౌష్టికమైన ఆహారం కొంచెమైనా చాలు:
ఒకవేళ మీ పిల్లలు ఎక్కూవగా తినకపోయినా,  తినిపించేది తక్కువైన పౌష్టికమైన ఆహారం ఇవ్వడం ఎంతో అవసరం.అంటే ఎక్కువగా తినిపించనవసరం లేదు, కొద్దిగా అయినా బలాన్ని చేకూర్చే ఆహారం పెట్టడం మంచిది.
 వాళ్ళు తినడం లేదు అని ఎక్కువగా అలోచించి కంగారు పడనవసరం లేదు, మీరు చెయ్యవలసిందల్లా, వాళ్ళు తినే కొంచెం ఆహారంలో అయినా పొషక పదార్దాలు నిండుగా ఉండేలా చుసుకుంటే సరిపోతుంది,
ప్రోటీన్లు, కాల్షియం, మినరల్స్, Vitamin C,పండ్లు, తృణధాన్యాలు, కొవ్వులు, సమృద్ధిగా ఉండే ఆహారాలు మీ పిల్లలకు ఇవ్వండి.
 పైనవన్ని పాటించి మీ చిట్టి పొట్టి పిల్లలకు సరైన ఆరోగ్యంతో పాటు,వయస్సుతో సరిసమానమైన ఎదుగుదల కావాలంటే వారిని ఆటలు ఎక్కువగా ఆడించండి.