
మీ ఇంట్లో ఏదైనా సడన్ పార్టీ ప్లాన్ చేసినా, లేదా అనుకోకుండా ఎవరైనా గెస్ట్స్ వచ్చినట్లయితే వారికి వెల్కమ్ డ్రింక్ ఇవ్వడానికి సరైనది ఈ కూల్ బ్లూ. కేవలం మూడే ఇంగ్రీడియంట్స్ తో ఈ వెల్కమ్ డ్రింక్ ని చిటికలో తయారు చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు
- మోనిన్ – 2 టేబుల్ స్పూన్
- నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
- స్ప్రైట్ లేదా 7అప్
తయారీ విధానం
ఒక గ్లాస్ లో 2 టీ స్పూన్ల మోనిన్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు స్ప్రైట్ ని పోసుకుంటే చల్లని కూల్ బ్లూ రెడీ!