
భారతదేశం అనేక రుచికరమైన తీపి పదార్థాలకు నిలయం. ఇంట్లోనే తయారు చేసుకోగలిగే అనేక సాంప్రదాయక తీపి పదార్థాలలో ప్రసిద్ధి చెందిన గులాబ్ జామున్, కాజు బర్ఫీ మరియు మిల్క్ కేక్ వంటివి ప్రత్యేక సందర్భాలలో మరియు పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ ఇష్టపడ్తారు. పటిష్టమైన మరియు తియ్యటి పాలతో తయారు చేసే మిల్క్ కేక్ ని ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. మరి ఎంతో సులభంగా తయారు చేసుకోగలిగే మిల్క్ కేక్ యొక్క తయారీ విధానాన్ని చూద్దాం.
కావలసిన పదార్థాలు
- పాలు – 1 ½ లీటర్లు
- పంచదార – 1 కప్పు
- నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
- నెయ్యి – 2 టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం
- ఒక పాత్రలో 1.5 లీటర్ల పాలు పోసి సన్నటి మంటలో పాలు బాగా మరిగే వరకు వేడి చేయాలి.
- పాలు అడుగంటకుండా ఉండేందుకు గెరిటతో పాలను కలుపుతూ ఉండాలి.
- పాలు బాగా మరిగి అందులోని నీటి పదార్థం పూర్తిగా పోయి కోవా లాగ అయిన తరువాత అందులో 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి.
- అలాగే 1 కప్పు చక్కెర వేసుకొని చక్కెర బాగా కరిగే వరకు కలుపుతూ వేడి చేయాలి.
- చక్కెర కోవలో బాగా కలిసిపోయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఒక చిన్న పాత్రలో నెయ్యి రాసి ఈ కోవకు అందులో వేసుకోవాలి.
- కోవా కేక్ లాగా అవ్వడానికి ఒక రోజుపాటు ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ చేయాలి.
- అంతేనండి, బాగా ఫ్రీజ్ అయిన కోవాను మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తియ్యనైన మిల్క్ కేక్ రెడీ!