Posted on

Aloo methi paratha recipe in Telugu – ఆలూ మేతి పరాతా రెసిపీ

ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ టిఫన్ లేదా డిన్నర్ సమయంలోనైనా సరే ఎంతో సులువుగా తొందరగా ఆకలిని తీర్చే ఒక ఆహారం ‘ఆలూ మేతి పరాతా’. ఎంతో రుచికరమైన ఈ న్యుట్రీషియస్ పరాతాను పిల్లలు ఎంతో ఇష్టపడతారు. మరి దీనిని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • గోధుమ పిండి- 1 కప్పు
  • ఉప్పు – 1 టీ స్పూన్
  • నూనె
  • బంగాళదుంపలు – 3
  • తరిగిన పచ్చి మిర్చులు – 2
  • కసూరి మేతి – 1 టీ స్పూన్
  • చాట్ మసాలా – 1 టీ స్పూన్
  • తరిగిన ఉల్లిపాయలు – 1
  • జీరా – 1 టీ స్పూన్
  • మెంతి ఆకులు – 1 కప్పు
  • అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్
  • పసుపు పొడి – 1 టీ స్పూన్
  • ధనియాల పొడి – 1 టీ స్పూన్
  • గరం మసాలా -1 టీ స్పూన్
  • బట్టర్ – 2 టీ స్పూన్లు

తయారీ విధానం

  • ఒక బౌల్ లో 1 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి.
  • పరాతా యొక్క స్టఫింగ్ ని తయారుచేయడానికి ముందుగా 3 బంగాళదుంపలను కుక్కర్లో ఉడకబెట్టి తోలు తీసి బాగా మ్యాష్ చేసుకోవాలి.
  • ఆ తరువాత అందులో చిన్నగా తరిగిన 2 పచ్చి మిర్చులు, 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి.
  • స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి 2 టీ స్పూన్ నూనె పోసుకొని 1 టీ స్పూన్ జీరా, 1 కప్పు మేతి ఆకులు, వేసుకొని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి.
  • ఆ తరువాత అందులో 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించాలి.
  • ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి.
  • పై మిశ్రమంలో మ్యాష్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను కూడా వేసుకొని దోరగా వేయించి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు తయారు చేసి ఉంచుకున్న చపాతీ పిండిని తీసుకొని చపాతీ కర్రతో చిన్నగా తిక్కి మధ్యలో బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి అన్ని వైపులా పిండితో కవర్ చేసి పరాతా లా తిక్కుకోవాలి.
  • స్టవ్ పై ప్యాన్ ఉంచి బట్టర్ రాసి ప్యాన్ వేడెక్కిన తరువాత పరాతాను రెండు వైపులా బాగా ఎర్రగా అయ్యేలా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ మేతి పరాతా రెడీ!
Posted on

Egg kabab / Egg kebab recipe in Telugu – ఎగ్ కబాబ్ రెసిపీ

ఎగ్ కబాబ్ ఎంతో రుచికరమైన ఈవెనింగ్ స్నాక్స్. రుచి మాత్రమే కాదండి, ఇందులోని ముఖ్యమైన ఇంగ్రీడియంట్ గుడ్లలో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఎన్నో ఖనిజాలు కూడా ఉన్నాయి. ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి అటువంటి ఇంగ్రీడియంట్ తో ఎంతో రుచికరమైన ఎగ్ కబాబ్ ని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నూనె – 1/4 కప్పు
  • తరిగిన ఉల్లిపాయలు – 1
  • బంగాళదుంపలు – 3
  • ఉప్పు – 1 టేబుల్ స్పూన్
  • కొట్టిన గుడ్లు – 2
  • బ్రెడ్ క్రమ్బ్స్
  • ఉడికించిన గుడ్లు – 5
  • జీలకర్ర పొడి – 1 టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
  • పసుపు పొడి – 1 టేబుల్ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
  • గరం మసాలా – 1 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర – 1/2 కప్పు
  • తురిమిన మోజరెల్లా చీస్ – 1/4 కప్పు

తయారీ విధానం

  • స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి అందులో 1 కప్పు నూనె పోసుకొని, నూనె వేడయ్యాక 1 కప్పు తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.
  • ఆ తరువాత ఉడికించి మ్యాష్ చేసుకున్న 3 బంగాళదుంపలను, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2  టీ స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి.
  • ఆ తరువాత అందులో 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు 1/2 కప్పు తరిగిన కొత్తిమీర, 1/4 కప్పు తరిగిన మోజరెల్లా చీస్ వేసి 5 నిమిషాల పాటు దోరగా వేయించుకుంటే కబాబ్ కి కావలసిన మిశ్రమం తయారవుతుంది.
  • ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని అందులో ఉడికించిన గుడ్డుని ఉంచి చుట్టూ ఈ మిశ్రమం కవర్ అయ్యేలా స్టఫ్ చేసుకోవాలి.
  • అలా 5 స్టఫ్ చేసుకున్న కబాబ్ లను సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఆ కబాబ్లను కొట్టిన గుడ్లలో ముంచి ఆ తరువాత బ్రెడ్ క్రమ్స్ లో ముంచి ఫ్రై చేయడానికి సిద్ధంగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రై చేసేందుకు ఒక ప్యాన్ ని ఉంచి 1 కప్పు నూనెని అందులో పోయాలి.
  • నూనె బాగా వేడెక్కిన తరువాత సిద్ధంగా ఉంచుకున్న కబాబ్ లను అందులో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన వేడి వేడి ఎగ్ కబాబ్ రెడీ!
Posted on

Aloo ka bartha / Aloo ka bharta recipe in Telugu – ఆలూ కా భర్తా రెసిపీ

చపాతీ లేదా పూరికి ఎన్నో రకాల సైడ్ డిషెస్ ని తయారు చేసుకోవచ్చు. అందులోను బంగాళదుంపలతో చేసే సైడ్ డిషెస్ నార్త్ ఇండియా లో ఎంతో ప్రసిద్ధం.

బంగాళదుంపలు వర్షం పొడుగునా అందుబాటులో ఉంటాయి కనుక వాటితో ఎన్నో రకాల వంటలను ఏ సీజన్‌లోనైనా తయారు చేసుకోవచ్చు. మరి వాటితో ఎంతో సులువైన, రుచికరమైన ‘ఆలూ కా భర్తా’ సైడ్ డిష్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • బంగాళదుంపలు – 3
  • నూనె – 2 టేబుల్ స్పూన్
  • ఆవాలు – 1/2 టేబుల్ స్పూన్
  • జీలకర్ర – 1/2 టేబుల్ స్పూన్
  • ఉప్పు – 1/2 టేబుల్ స్పూన్
  • తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు
  • ఎండు మిరపకాయలు – 1
  • తరిగిన వెల్లుల్లి ముక్కలు – 1 టేబుల్ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర – 1/2 కప్పు

తయారీ విధానం

  • ముందుగా మూడు బంగాళదుంపలను ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకొని తోలు తీసి బాగా మ్యాష్ చేసుకోవాలి.
  • స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి 2 టీ స్పూన్ల నూనె, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులో 1 కప్పు తరిగిన ఉల్లిపాయలను వేసి 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి.
  • ఆ తరువాత అందులో 1 ఎండు మిరపకాయ, 1/2 టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి ముక్కలు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి.
  • తరిగిన కొత్తిమీర కూడ వేసి కలుపుకోవాలి.
  • అన్ని పదార్థాలనూ దోరగా వేయించిన తరువాత మ్యాష్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను వేసి బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు వేయించుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ కా భర్తా రెడీ!
Posted on

Vegetable fried rice recipe in Telugu – వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ

డిన్నర్‌కి హోటల్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం ఆర్డర్ చేసే డిష్ ‘ఫ్రైడ్ రైస్’. అది ఎంతో కష్టమైన డిష్ మరియు ఇంట్లో చేసుకోడం కుదరదని చాలా మంది అభిప్రాయం. కానీ నిజానికి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో డిన్నర్ పార్టీ సమయంలో ఎంతమందికైనా తొందరగా చేయగల డిషస్ లో ఇది కూడా ఒకటి. మరి ‘వెజ్ ఫ్రైడ్ రైస్’ని సులభంగా ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నెయ్యి – 3 స్పూన్
  • వెల్లుల్లి ముక్కలు – 6
  • తరిగిన ఉల్లిపాయలు – 1
  • పచ్చి బఠానీలు – 1/2 కప్పు
  • తరిగిన ఎల్లో కాప్సికం – 1/2 కప్పు
  • తరిగిన బీన్స్ – 1/2 కప్పు
  • తరిగిన రెడ్ కాప్సికం – 1/2 కప్పు
  • తరిగిన గ్రీన్ కాప్సికం – 1/2 కప్పు
  • తరిగిన క్యారట్  – 1/2 కప్పు
  • ఉప్పు
  • అన్నం
  • బ్లాక్ పెప్పర్ పౌడర్ – 1 స్పూన్
  • సొయా సాస్ – 1 స్పూన్

తయారీ విధానం

  • ముందుగా ఒక ప్యాన్ లో 3 స్పూన్ల నెయ్యి వేసికొని, నెయ్యి బాగా కరిగిన తరువాత 6 వెల్లుల్లి ముక్కలను, 1 తరిగిన ఉల్లిపాయలు, 1/2 కప్పు పచ్చి బఠానీలు, 1/2 కప్పు తరిగిన ఎల్లో కాప్సికం, 1/2 కప్పు తరిగిన బీన్స్, 1/2 కప్పు తరిగిన రెడ్ కాప్సికం, 1/2 కప్పు తరిగిన గ్రీన్ కాప్సికం, 1/2 కప్పు తరిగిన క్యారట్ వేసుకొని 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి.
  • ఆ తరువాత అందులో 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుతూ 2 నిముషాలు ఫ్రై చేయాలి.
  • మూత వేసి 1 నిమిషం పాటు ఉడికించాలి.
  • ఆ తరువాత ఉడికించిన బియ్యం అనగా అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ సొయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి.
  • అవసరమైతే కావల్సినంత ఉప్పుని కూడా చేర్చుకొని బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేస్తే ఎంతో రుచికరమైన ‘వెజ్ ఫ్రైడ్ రైస్’ తయారు!
Posted on

Aloo egg curry recipe in Telugu – ఆలూ ఎగ్ కరీ రెసిపీ

ప్రతి ఒక్కరికి సులువుగా లభించే బంగాళదుంపలు మరియు గుడ్లను ఉపయోగించి ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు. వీటితో తయారు చేసే గ్రేవీ రుచితోపాటు పూర్తి న్యూట్రిషన్ ని కూడా అందిస్తుంది. చపాతీ, పూరి, రోటి లేదా పరోటాకు సైడ్ డిష్ కొరకు ఎంతో రుచికరమైన ‘ఆలూ ఎగ్ కరీని’ ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నూనె
  • గుడ్లు – 3
  • ఉప్పు
  • జీరా – 1 టీ స్పూన్
  • తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు
  • గరం మసాలా – 1 టీ స్పూన్
  • పసుపు పొడి – 2 చిటికెలు
  • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టీ స్పూన్
  • ధనియాల పొడి – 1 టీ స్పూన్
  • తరిగిన టమోటాలు – 1 కప్పు
  • బంగాళదుంపలు
  • అల్లం మరియు వెల్లుల్లి
  • మిరపకాయ – 1
  • కొత్తిమీర

తయారీ విధానం

  • ముందుగా 3 గుడ్లను బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్ పై ఫ్యాన్ ని ఉంచి 4 టీ స్పూన్ల నూనె, 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.
  • ఆ తరువాత అందులో కొద్దిగా తరిగిన అల్లం మరియు వెల్లుల్లి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలపాటు దోరగా వేయించుకోవాలి.
  • అందులో 2 చిటికెల పసుపు పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి.
  • తరువాత 1 కప్పు తరిగిన టమోటాలు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి.
  • టమోటాలు బాగా కుక్ అయ్యాక అందులో 100 మిల్లీ లీటర్ల నీళ్లు పోసి బాగా ఉడికించాలి.
  • ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా వేసి బాగా కలుపుకోవాలి.
  • పై మిశ్రమం బాగా ఉడుకుతున్న సమయంలో కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను వేసి బాగా కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి.
  • మరోసారి 100 మిల్లీ లీటర్ల నీటిని పోసి మూత పెట్టి 10 నిమిషాలు ఉరికించాలి.
  • ఆ తరువాత అందులో 1 తరిగిన మిరపకాయలు, కొత్తిమీర, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపి 2 నిమిషాలు వేయించుకోవాలి.
  • ఇప్పుడు అందులో ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేడుకొని బాగా కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి.
  • మరోసారి తగినన్ని నీళ్లు (50 మిల్లి లీటర్లు) పోసి 2 నిమిషాలు వేయించి, మూత పెట్టి 5 నిమిషాలు ఉడికిస్తే ఎంతో రుచికరమైన ‘ఆలూ ఎగ్ కరీ’ రెడీ!
Posted on

How to make potato tawa in Telugu – పొటాటో తవా / ఆలూ కే నాన్ రెసిపీ

బంగాళదుంపలతో ఎన్నో రకాల వంటకాలను చేసుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఇంకా డిన్నర్, ఏ సమయంలోనైనా బంగాళదుంపలతో ఎన్నో రుచికరమైన వంటలను చేసుకోవచ్చు. సడన్ గా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు, లేదా మీ కొరకు తొందరగా ఏదైనా స్నాక్స్ ని చేసుకోవాలని అనుకున్నప్పుడు ఈ ఈజీ అండ్ క్విక్ పొటాటో తవా రెసిపీ ని ట్రై చేయండి.

కావలసిన పదార్థాలు

  • బంగాళదుంపలు – 2
  • నిమ్మరసం – 1 టేబుల్స్ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్
  • ఉప్పు – 1 టేబుల్ స్పూన్
  • అల్లం వెలుల్లి పేస్ట్ – 1 టేబుల్స్ స్పూన్
  • నూనె
  • పసుపు పొడి – 1 టేబుల్స్ స్పూన్

తయారీ విధానం

  • ముందుగా బంగాళదుంపలను బాగా కడిగి తోలు తీసి, చిన్న చిన్న రౌండ్ స్లైసస్ గా కట్ చేసుకోవాలి.
  • ఆ తరువాత స్టవ్ పై ప్యాన్ ని ఉంచి 1 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి.
  • నీళ్లు బాగా ఉడుకుతుండగా కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను వేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించాలి.
  • ఆ తరువాత నీటిని వడగట్టి బంగాళదుంపలను ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ అల్లం వెలుల్లి పేస్ట్ వేసి అన్ని స్లైసస్ పై సమానంగా స్ప్రెడ్ అయ్యేటట్లు కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై ఒక తవా ఉంచి 4 స్పూన్ల నూనెని రాసి బంగాళదుంప స్లైసస్ ని రెండు వైపులా రోస్ట్ చేసుకుంటే, ఎంతో రుచికరమైన పొటాటో తవా రెడీ!
Posted on

How to make chicken fry in Telugu – చికెన్ ఫ్రై రెసిపీ

ఎన్ని సార్లు తిన్నా చాలు అని అస్సలు అనిపించని డిషస్ లో చికెన్ ఫ్రై కూడా ఒకటి. ఎంతో రుచికరమైన క్రిస్పీ స్నాక్స్. దీనిని లంచ్ సమయంలో గాని లేడా బిరియాని కూడా సైడ్ డిష్ గా తీసుకోవచ్చు. బైట ఎంతో క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్ మరియు జ్యూసీ గా ఉండేటువంటి చికెన్ ఫ్రై ని సులభంగా ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • చికెన్ ముక్కలు
  • పసుపు పొడి – 1 టేబుల్ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు – 1 టేబుల్ స్పూన్
  • గరం మసాలా – 1 టేబుల్ స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  • నిమ్మపండు – 1
  • కార్న్ ఫ్లార్
  • నూనె – డీప్ ఫ్రై కి తగినంత

తయారీ విధానం

  • ముందుగా చికెన్ పీసెస్ ని బాగా శుభ్రం చేసి ఒక బౌల్ లో వేసుకోవాలి.
  • అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మపండు రసం వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులో కొద్దిగా కార్న్ ఫ్లార్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • కావాలంటే ఫుడ్ కలర్ ని కూడా వేసి కలుపుకోవచ్చు.
  • అలా బాగా కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని 1 గంట సేపు ఊరనివ్వాలి.
  • ఆ తరువాత స్టవ్ పై ప్యాన్ ని ఉంచి డీప్ ఫ్రై కి కావల్సినంత నూనెని పోసి చికెన్ ని 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన వేడి వేడి ‘చికెన్ ఫ్రై’ రెడీ!
Posted on

Egg masala bread bites in Telugu – ఎగ్ మసాలా బ్రెడ్ బైట్స్ రెసిపీ

ఈవినింగ్ స్నాక్స్ లేదా డిన్నర్‌కి ఏదైనా డిఫెరెంట్ అండ్ ట్రేస్టీ రెసిపీని ట్రై చేయాలని అనుకుంటున్నారా! అయితే ఈ ‘ఎగ్ మసాలా బ్రెడ్ బైట్స్’ ని ట్రై చేయండి. ఎంతో రుచి, ఎంతో ఆరోగ్యం. గుడ్ల యొక్క పూర్తి న్యూట్రిషన్స్ తో పాటు బ్రెడ్ టేస్ట్‌ని కూడా అందించే ఈ డిష్ మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తప్పకుండా ఫేవరెట్ డిష్ గా మారుతుంది.

కావలసిన పదార్థాలు

  • నూనె – 2 టేబుల్ స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  • తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు
  • తరిగిన రెడ్ కాప్సికం – 1 కప్పు
  • తరిగిన ఎల్లో కాప్సికం – 1 కప్పు
  • తరిగిన టమోటాలు – 1 కప్పు
  • బ్రెడ్
  • ఉప్పు – 1 టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
  • పసుపు పొడి – 1 టీ స్పూన్
  • గరం మసాలా -1 టేబుల్ స్పూన్
  • గుడ్లు – 4
  • బ్లాక్ పెప్పర్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం

  • ముందుగా స్టవ్ పై ఒక ఫ్యాన్ ని ఉంచి 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  1 కప్పు తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి.
  • ఇప్పుడు అందులో 1 కప్పు తరిగిన రెడ్ కాప్సికం, 1 కాపు తరిగిన ఎల్లో కాప్సికం వేసి బాగా కలుపుతూ ఫ్రై చేయాలి.
  • ఆ తరువాత 1 స్పూన్ ఉప్పు, 1 కప్పు తరిగిన టమోటాలు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు 1 ధనియాల పొడి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి.
  • పై మిశ్రమం బాగా కుక్ అయిన తరువాత ప్యాన్ లో ఒక వైపుగా ఉంచి పక్కనే 4 గుడ్లను కొట్టి 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ని చల్లుకోవాలి.
  • గుడ్లలో పెప్పర్ పౌడర్ బాగా కలుపుకున్న తరువాత అన్ని పదార్థాలనూ ఒకటిగా చేసి బాగా కలుపుకోవాలి.
  • చివరిగా అందులో తరిగిన బ్రెడ్ ముక్కలను వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన ‘ఎగ్ మసాలా బ్రెడ్ బైట్స్’ రెడీ!
Posted on

How to make Nutella biscuits in Telugu – నూటెల్లా బిస్కట్స్ రెసిపీ

రోజూ ఒకే రకమైన బిస్కట్స్ ని తిని బోర్ కొడుతోందా! పిల్లలకు ఎంతో ఇష్టమైన బిస్కట్స్ ని మరింత రుచికరంగా ఆరోగ్యకరంగా మార్చాలనుకుంటున్నారా! అయితే ఈ రెసిపీని ట్రై చేయండి. బిస్కట్స్ కి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా జోడించేందుకు నూటెల్లా క్రీం ని ఉపయోగించి నూటెల్లా బిస్కట్స్ ని తయారు చేసుకోండి.

కావలసిన పదార్థాలు

  • పాలు
  • నూటెల్లా క్రీం
  • పైన్ ఆపిల్ (అనాస పండు) ఎస్సెన్స్
  • వైట్ బట్టర్ – 200 గ్రాములు
  • ఏలకుల పొడి – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం

  • ఒక బౌల్ లో 200 గ్రాముల వైట్ బటర్ ని బాగా చూర్ణం చేసుకోవాలి.
  • ఆ తరువాత అందులో కొద్దిగా నూటెల్లా క్రీం వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • అందులో 1 స్పూన్ ఏలకుల పొడి, కొద్దిగా పైన్ ఆపిల్ ఎస్సెన్స్ వేసుకొని బాగా కలుపుకొని సిద్ధంగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు మీకు నచ్చిన బిస్కట్‌లను పాలలో ముంచి ముందుగా సిద్ధం చేసుకున్న నూటెల్లా మిశ్రమాన్ని రెండు వైపులా రాసి, ఒకదానిపై ఒకటి ఉంచుకోవాలి.
  • ఇప్పుడు ఈ బిస్కట్‌లను 1 గంట సేపు ఫ్రీజర్ లో ఫ్రీజ్ చేసి కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నూటెల్ల బిస్కట్స్ రెడీ!
Posted on

Basundi sweet recipe in Telugu – బాసుంది రెసిపీ

గుజరాత్ మరియు మహారాష్ట్రలో ఎంతో ప్రసిద్థమైన స్వీట్ బాసుంది. పాలలో అధిక ప్రోటీన్, కాల్షియం, మరియు ఎన్నో విటమిన్లు ఉన్నందున ఎముకలకు ఎంతో బలాన్ని ఇస్తుంది. పాలతో ఎన్నో రకాల తీపి వంటకాలను చేసుకోవచ్చు. అందులో ఎంతో సులభమైనది రుచికరమైనది బాసుంది.

కావలసిన పదార్థాలు

  • పాలు – 1 లీటర్
  • మిల్క్ పౌడర్ – 1/2 కప్పు
  • చక్కెర – 1/2 కప్పు
  • కుంకుమ పువ్వు
  • ఏలకుల పొడి – 1 టేబుల్ స్పూన్
  • తరిగిన బాదాం
  • తరిగిన కాజు
  • తరిగిన పిస్తా

తయారీ విధానం

  • ముందుగా కొన్ని కుంకుమ పువ్వులను పాలలో వేసి నానబెట్టుకోవాలి.
  • ఒక మందమైన వెడల్పైన ప్యాన్ లో 1 లీటర్ పాలను పోసి బాగా మరిగించాలి.
  • పాలు బాగా మరిగిన తరువాత అందులో తరిగిన కాజు, బాదాం, పిస్తా మరియు ఏలకుల పొడిని వేసి కొద్ది సేపు మరిగించాలి.
  • ఆ తరువాత నానబెట్టిన కుంకుమ పువ్వులను పాలతో పాటు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు 1/2 కప్పు మిల్క్ పౌడర్ ని కూడా వేసుకొని 10 నిమిషాలు ఉడికించాలి.
  • ఆ తరువాత 1/2 కప్పు చక్కెర వేసి 2 నిమిషాలు ఉడికిస్తే ఎంతో తియ్యని బాసుంది స్వీట్ రెడీ!