Posted on

French fries recipe in Telugu – ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ

బంగాళదుంపలతో తయారు చేసుకొనే టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్స్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి. వీటినే ‘గోల్డెన్ ఫ్రైస్’ లేదా ‘ఫింగర్ చిప్స్’ అని కూడా అంటారు. ఎంతో సులభంగా, తక్కువ సమయంలో అతితక్కువ పదార్థాలను ఉపయోగించి చేయగలిగే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని తయారు చేసే విధానం చూద్దామా మరి!

కావలసిన పదార్థాలు

  • బంగాళదుంపలు – 3
  • ఉప్పు
  • నూనె – డీప్ ఫ్రై కి తగినంత

తయారు చేసే విధానం

  • ముందుగా బంగాళదుంపలను బాగా శుభ్రం చేసి తోలుతీసి చిన్న నిలువు ముక్కలుగా కోసి నీటిలో వేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఉప్పు కరిగే వరకు 5 నిమిషాలు ఉడికించి తరిగిన బంగాళదుంపలను అందులో వేయాలి.
  • బంగాళదుంపలను 5 నిమిషాల పాటు బాగా ఉడికించి నీటిని వడగట్టాలి.
  • తడిగా ఉన్న ఉర్లగెడ్డ ముక్కలను ఒక క్లాత్ పై వేసి తడి ఆరాక కవర్లో వేసుకొని టైట్ గా ప్యాక్ చేసుకోవాలి.
  • ఆ తరువాత కవర్ తో పాటు బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో 30 నుండి 45 నిమిషాలపాటు ఉంచాలి.
  • పాన్ లో ఆయిల్ ని వేడి చేసి బంగాళదుంపలను లైట్ బ్రౌన్ రంగుకు మారే వరకు డీప్ ఫ్రై చేస్తే గోల్డెన్ క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ.
Posted on

Aloo pyaz paratha recipe in Telugu – ఆలూ ప్యాజ్ పరోటా రెసిపీ

నార్త్ ఇండియా లో ఎంతో ప్రసిద్ధమైన ఆలూ పరోటా ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో కూడా ప్రతి హోటల్ మరియు రెస్టారెంట్స్ లో లభిస్తోంది. ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఆలూ పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • బంగాళదుంపలు – 3
  • గోధుమ పిండి – 1 కప్పు
  • మైదా – 1 కప్పు
  • ఉప్పు – 1 టీ స్పూన్
  • నూనె
  • తరిగిన పచ్చి మిర్చిలు – 2
  • కస్తూరి మేతి – 1 టీ స్పూన్
  • సోంపు – 1 టీ స్పూన్
  • తరిగిన ఉల్లిపాయలు – 1
  • ఉప్పు – 1 టీ స్పూన్
  • వెన్న

తయారు చేసే విధానం

  • ముందుగా బంగాళదుంపలను ఉడికించి తోలు తీసి రెడీ గా ఉంచుకోవాలి.
  • ఒక పెద్ద బౌల్ లో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ నూనె వేసుకొని బాగా కలపాలి.
  • పిండికి తగినంత నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • మరో బౌల్ లో ఉడికించిన బంగాళదుంపలను బాగా మాష్ చేసి అందులో 2 తరిగిన పచ్చి మిర్చిలు, 1 టీ స్పూన్ కస్తూరి మేతి, 1 టీ స్పూన్ సోంపు, 1 తరిగిన ఉల్లిపాయ మరియు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటే ఆలూ స్టఫ్ రెడీ.
  • ఇప్పుడు చపాతీ పిండిని చపాతీ కర్రతో రౌండ్ షేప్ లో చేసుకొని మధ్యలో ఆలూ ని పెట్టి స్టఫ్ చేసి చిన్న పరోటా సైజుకి వచ్చేలా చేసుకోవాలి.
  • స్టవ్ పై చపాతీ తవా ఉంచి బటర్ రాసి పరోటాను రెండు వైపులా కుక్ చేసుకుంటే వేడి వేడి ఆలూ ప్యాజ్ పరోటా రెడీ!
Posted on

Chicken vada recipe in Telugu – చికెన్ వడ రెసిపీ

చికెన్ వడ! నాన్ వెజిటేరియన్ ఇష్టపడేవారికి ఇది ఒక పర్ఫెక్ట్ టీ టైం స్నాక్స్. ఎంతో రుచికరమైన ఈ స్నాక్స్ ప్రత్యేకంగా వానా కాలంలో నోరూరిస్తుంది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు మరియు చేసే విధానం తెలుసుకుందాం.

 

కావలసిన పదార్థాలు

  • బోన్ లెస్ చికెన్
  • శనగ పిండి – 1/3 కప్పు
  • ఉల్లిపాయలు – 1 కప్పు
  • పచ్చి మిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్
  • కొత్తిమీర – 1/2 గుత్తి
  • ఊరబెట్టిన శనగలు – 2 టీ స్పూన్
  • రెడ్ చిల్లీ పొడి – 1 టీ స్పూన్
  • గరం మసాలా – 1 టీ స్పూన్
  • బ్లాక్ పెప్పర్ – 1 టీ స్పూన్
  • పసుపు పొడి – 1/4 టీ స్పూన్
  • ఉప్పు
  • నూనె – డీప్ ఫ్రై కి తగినంత

తయారు చేసే విధానం

  • ముందుగా బోన్ లెస్ చికెన్ ని బాగా శుభ్రం చేసి గ్రైండర్ లో వేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి.
  • 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ చికెన్ పేస్ట్‌ను ఒక బౌల్ లో తీసుకొని అందులో 1/3 కప్పు శనగ పిండి, 2 టీ స్పూన్ ఊరబెట్టిన శనగలు, 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చి మిర్చి, 1/2 గుత్తి తరిగిన కొత్తిమీర, 1/4 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఉప్పు మరియు 1 టీ స్పూన్ పచ్చి మిర్చి పేస్ట్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • కలిపి ముద్దలా చేసుకున్న తరువాత అందులో రెండు స్పూన్ నూనెని వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత పిండి చేతికి అంటకుండా ఉండేందుకు నూనె రాసుకొని చిన్న చిన్న కట్లెట్స్ లాగా రౌండ్స్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై పాత్రలో నూనెని వేడి చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
  • బ్రౌన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే వేడి వేడి చికెన్ వడలు తయారు!
Posted on

Rava chilla / Suji ka cheela recipe in Telugu – రవ చిల్ల / సుజి కా చీలే రెసిపీ

చీలా అంటే రవ లేదా శనగ పిండితో చేసేటువంటి ఫ్యాన్ కేక్స్. వీటిని బ్రేక్ ఫాస్ట్ గా లేదా స్నాక్స్ గా తీసుకుంటారు. ఎంతో సులువైన మరియు రుచికరమైన రెసిపి. మరి ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

  • రవ – 2 కప్పులు
  • పెరుగు – 1 కప్పు
  • ఉప్పు – 2 టీ స్పూన్
  • తరిగిన ఉల్లిపాయలు – 2
  • తరిగిన టమోటాలు – 2
  • తురిమిన పన్నీర్ – 1 కప్పు లేదా 100 గ్రాములు
  • తరిగిన పచ్చి మిర్చి – 1
  • నెయ్యి – 50 గ్రాములు

తయారు చేసే విధానం

  • ఒక పెద్ద బౌల్ లో 2 కప్పుల రవ, 1 కప్పు పెరుగు, 2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • అందులో తగినన్ని(3 లేదా 4 స్పూన్) నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులో 2 తరిగిన ఉల్లిపాయలు, 2 తరిగిన టమోటాలు, 1 కప్పు లేదా 100 గ్రాములు తురిమిన పన్నీర్ మరియు 1 తరిగిన పచ్చి మిరపకాయ వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని పిండిని సిద్ధం చేసుకోవాలి. పిండి మరీ నీళ్ళుగా లేదా గట్టిగా ఉండకూడదు.
  • ఇప్పుడు స్టవ్ పై ఒక తవా లేదా ఫ్యాన్ ని ఉంచి నెయ్యి రాసి తయారు చేసుకున్న పిండిని దోసలా పోయాలి.
  • చుట్టూ నెయ్యి రాసి బాగా కుక్ అయిన తరువాత మరో వైపు నెయ్యి రాసి వేడి చేయాలి.
  • అంతేనండి వేడి వేడి ‘సుజి కా చీలే’ రెడీ!
Posted on

Aloo / Potato chips recipe in Telugu – పొటాటో చిప్స్ రెసిపీ

పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో చిప్స్ ని ఇంట్లోనే చేసుకోవడం ఎంతో సులభం మరియు టేస్టీ కూడా. ఈవినింగ్ స్నాక్స్ గానే కాదు లంచ్ లో నంచుకుని తినడానికి కూడా ఇవి ఎంతో బాగుంటాయి. చిప్స్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, బంగాళదుంపలను బాగా తిన్ గా కట్ చేసుకోవాలి మరియు క్రిస్పీ గా అయ్యేంతవరకు ఫ్రై చేయాలి. మరి చేసే విధానం చూద్దామా?

కావలసిన పదార్థాలు

  • బంగాళదుంపలు – 3
  • ఉప్పు – 1 చిటికెడు
  • కరం పొడి – 2 చిటికెలు
  • నూనె – డీప్ ఫ్రై కి తగినంత

తయారు చేసే విధానం

  • ముందుగా బంగాళదుంపలను బాగా కడిగి తోలు తీసి నీటిలో వేసుకోవాలి.
  • ఆ తరువాత వాటిని స్లైసర్ తో రౌండ్ షాప్స్ లో గ్రేట్ చేసుకోవాలి.
  • 30 నుండి 45 నిమిషాలు ఫ్రిడ్జ్ లో ఉంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  • బాగా ఎర్రగా వేంచిన తరువాత 1 చిటికెడు ఉప్పు, 2 చిటికెల కారం పొడిని చల్లితే స్పైసీ అండ్ టేస్టీ ఈవెనింగ్ స్నాక్స్ రెడీ!
Posted on

Pizza veg pockets recipe in Telugu – పిజ్జా పాకెట్స్ రెసిపీ

ఇటాలియన్ ఆరిజిన్ అయిన పిజ్జా ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎంతో మందికి ఫేవరెట్ ఫుడ్ అనిపించుకుంది. పిజ్జాలో రుచిని చేర్చే ప్రధాన పదార్థాలు చీస్, టమోటా మరియు గోధుమ పిండితో చేసే బేస్. మరి పిజ్జాలాంటి రుచిని అందించే మరియు ఎంతో సులభంగా చేసుకోగలిగే ‘పిజ్జా పాకెట్స్’ ని ముఖ్యమైన ఈ ఇంగ్రిడియెంట్స్ ఇంకా కొన్ని కూరగాయలు మరియు స్పైసెస్ ని ఉపయోగించి ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • వెన్న – 2 టేబుల్ స్పూన్
  • బ్రెడ్ స్లైసెస్ – 3
  • ఉల్లిపాయలు
  • టమాటాలు
  • క్యారట్
  • కాప్సికం
  • టమాటో కెచప్
  • సొయా సాస్
  • రెడ్ చిల్లీ సాస్
  • ఉప్పు
  • రెడ్ చిల్లీ పౌడర్
  • పెప్పర్ పౌడర్
  • మాంగో పౌడర్
  • కొత్తిమీర
  • మోజెరెల్లా చీస్
  • పసుపు పొడి
  • నూనె – డీప్ ఫ్రై కి తగినంత

తయారు చేసే విధానం

  • స్టవ్ పై ఒక ప్యాన్ ఉంచి 2 టీ స్పూన్ బట్టర్ వేసి, బట్టర్ బాగా కరిగిన తరువాత అందులో తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన కాప్సికం 2, తరిగిన క్యారట్ 1, తరిగిన పచ్చి మిర్చీలు 2 వేసుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి.
  • తరువాత అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మాంగో పౌడర్ మరియు 1 టీ స్పూన్ పెప్పర్ పొడి వేసి 2 నిమిషాల పాటు వేయించాలి.
  • 2 నిమిషాల తరువాత అందులో 2 తరిగిన టమాటాలు వేసి మరో 2 నిమిషాల పాటు వేయించాలి.
  • ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ టమాటో కెచప్, 1 టీ స్పూన్ సొయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాలు వేయించాలి.
  • ఆ తరువాత అందులో రెడ్ చిల్లీ పౌడర్, కొత్తిమీర వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేయాలి.
  • 2 క్యూబ్స్ మోజెరెల్లా చీస్ వేసుకుని 2 నిమిషాలు వేయించాలి.
  • చీస్ కరిగిన తరువాత కొంత కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే శాండ్విచ్ స్టఫ్ రెడీ.
  • రెడీ అయిన స్టఫ్ ని పక్కకు పెట్టి, 4 బ్రెడ్ ముక్కలను తీసుకొని వాటి ఎడ్జెస్ ని కట్ చేయాలి.
  • ఆ తరువాత చపాతి కర్రతో వాటిని ఫ్లాట్ గా తిక్కాలి.
  • ఇప్పుడు ఆ బ్రెడ్ మధ్యలో స్టఫ్ ని ఉంచి ప్యాక్ చేసుకోవాలి.
  • ప్యాక్ చేయడానికి నీటిని లేదా పాలను ఉపయోగించవచ్చు.
  • అలా ప్యాక్ చేసి ఉంచుకున్న స్టఫ్స్ యొక్క ఎడ్జెస్ ని ట్రిమ్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేస్తే వేడి వేడి పిజ్జా పాకెట్స్ రెడీ!
  • వీటిని టమాటో సాస్ తో సర్వ్ చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది.
Posted on

Aloo kachori recipe in Telugu – ఆలూ కచోరి రెసిపీ

కచోరి ఒక కారమైన స్నాక్స్. చలి కాలంలో ముఖ్యంగా వానా కాలంలో ప్రతి ఒక్కరికి తినాలనిపించే స్నాక్స్ లో ఇది ఒకటి. ఇది నేపాల్, రాజస్థాన్ మరియు ఉత్తర్ ప్రదేష్ లో ఎంతో ప్రసిద్ధం. దీనిని అనేక ప్రాంతాలలో వేరువేరు పేర్లతో పిలుస్తారు.

ఇందులో ఎన్నో రకాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మొగర్ కచోరి, రాజ్ కచోరి, ప్యాజ్ కచోరి, నాగోరి కచోరి, మావా కచోరి, లిల్వా కచోరి ఇంకా ఎన్నో. మరి ఇన్ని రకాల కచోరిలలో ఒకటి అయిన ఆలూ కచోరి ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

  • బంగాళదుంపలు -4
  • గోధుమ పిండి – 400 గ్రాములు
  • ఉప్పు – 2 టేబుల్ స్పూన్
  • ఓమం – 1 టేబుల్ స్పూన్
  • చిల్లీ పౌడర్ – 2 టేబుల్ స్పూన్
  • నూనె – డీప్ ఫ్రై చేయడానికి తగినంత

తయారు చేసే విధానం

  • ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టి తొక్క తీసేసి గ్రేట్ చేసుకోవాలి.
  • గ్రేట్ చేసుకున్న బంగాళదుంపలో 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం పొడి, 1 టీ స్పూన్ ఓమం వేసి బాగా కలపాలి.
  • ఒక బౌల్లో 400 గ్రాముల గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ సాల్ట్ మరియు తగినంత నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి.
  • ఇప్పుడు మనం తయారుచేసుకున్న గోధుమ పిండిని కొంచం తీసుకొని దానికి నూనె రాసి చపాతీ కర్రతో చిన్న రౌండ్స్ చేసుకోవాలి.
  • అందులో బంగాళదుంప మిశ్రమాన్ని స్టఫ్ఫ్ చేసి పూరి లాగా రుద్దుకోవాలి.
  • వీటిని బాగా కాగిన నూనె లో డీప్ ఫ్రై చేసుకుంటే నోరూరించే ఆలు కచోరి తయారు!!!
  • దీనిని టొమాటో సౌస్ తో నంజుకుని తింటే రుచి అమోఘంగా ఉంటుంది!!! పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
Posted on

Kajjikayalu / Gujiya recipe in Telugu – కజ్జికాయలు / గుజియా రెసిపీ

మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఎంతో ప్రసిద్ధమైన స్వీట్స్ లో కజ్జికాయలు ఒకటి. ఈవెనింగ్ స్నాక్స్ గా గాని లంచ్ తరువాత డెసర్ట్ గా గాని ఎంతో రుచిని చేరుస్తుంది. వీటిని గుజరాతి లో ‘గుగ్ర’, మహారాష్ట్రలో ‘కరంజి’ మరియు తమిళనాడులో ‘సోమాస్’ అని అంటారు.

ఇందులో ఒక రకం బొంబాయి రవతో చేస్తే ఇంకోటి కోవా తో చేస్తారు. ఇవి ఎంతో లైట్ వెయిట్ గా క్రిస్పీ గా ఉంటాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన స్వీట్ కూడా. మరి వీటిని బొంబాయి రవ్వ తో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

  • మైదా-500 గ్రాములు
  • నెయ్యి- 5 టేబుల్ స్పూన్లు
  • సాల్ట్ – 1 టేబుల్ స్పూన్
  • మిల్క్ మేడ్- 400 గ్రాములు
  • పంచదార పొడి- 200 గ్రాములు
  • బొంబాయి రవ్వ – 100 గ్రాములు
  • తురుమిన కొబ్బరి – 2-3 టేబుల్ స్పూన్లు
  • డ్రై ఫ్రూట్స్
  • రిఫైన్డ్ ఆయిల్ – డీప్ ఫ్రై చేయడానికి తగినంత

తయారు చేసే విధానం

  • ముందుగా స్టవ్ పై పాన్ లో 100 గ్రాముల బొంబాయి రవ వేసి ఎర్రగా వచ్చే వరకూ వేయించుకోవాలి.
  • తర్వాత అందులో 400 గ్రాముల మిల్క్ మేడ్ వేసి బాగా కలుపుతూ కుక్ చేయాలి.
  • అందులో కట్ చేసిన డ్రై ఫ్రూట్స్, 2 లేదా 3 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి.
  • ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి అందులో 200 గ్రాముల పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి.
  • ఒక బౌల్ లో 500 గ్రాముల మైదా, 5 టీ స్పూన్లు నెయ్యి, 1 టీ స్పూన్ ఉప్పు మరియు తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా చేసుకోవాలి.
  • కొంత పిండిని తీసుకొని దానికి నెయ్యి రాసి చపాతీ కర్రతో చిన్న రౌండ్స్ చేసుకోవాలి.
  • అందులో బొంబాయి రవ్వ మిశ్రమాన్ని ఉంచి సెమీ సర్కిల్ షేప్ లో స్టఫ్ చేసి పిండిని తయారు చేసుకోవాలి.
  • వీటిని బాగా కాగిన నూనె లో డీప్ ఫ్రై చేసుకుంటే తియ్యని కజ్జికాయలు రెడీ!
Posted on

Tasty snack samosa recipe in Telugu – ఆనియన్ సమోసా రెసిపీ

భారతీయులకు ఎల్లప్పుడూ ఇష్టమైన మరియు విస్తృతంగా లభించే స్నాక్స్ సమోసా. ఒకప్పుడు ఇది రాయల్ ఫుడ్ అని చెప్పబడేది. మొగల్ రాజులు పనివారితో అడిగి మరీ చేయించుకొని తినేవారట. మరి ఎంతో రుచికరమైన ఆనియన్ సమోసాని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • మైదా – 1 కప్పు
  • గోధుమ పిండి – 1 కప్పు
  • ఉప్పు -2 టేబుల్ స్పూన్
  • కార్న్ ఫ్లోర్
  • చాట్ మసాలా – 1 చిటికెడు
  • అటుకులు/పోహా – 1 కప్పు
  • కారం పొడి – 1 టేబుల్ స్పూన్
  • తరిగిన ఆనియన్స్ – 1 కప్పు
  • తరిగిన పచ్చిమిర్చి
  • తరిగిన కొత్తిమీర
  • ధనియాల పొడి -1 టేబుల్ స్పూన్
  • నూనె – డీప్ ఫ్రై చేయడానికి తగినంత

తయారు చేసే విధానం

  • ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మైదా,ఒక కప్పు గోధుమ పిండి, ఒక టీ స్పూన్ సాల్ట్, రెండు టీ స్పూన్ల నూనె తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి చపాతీ పిండిలా కలుపుకొని మూత మూసి ఒక గంట పక్కన పెట్టుకోవాలి.
  • మరో బౌల్లో తరిగిన ఉల్లిపాయలు, ఒక కప్పు పోహా/అటుకులు, ఒక టీ స్పూన్ కారం పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, తరిగిన పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ సాల్ట్ మరియు తరిగిన కొత్తిమీర వేసి కలిపుకోవాలి.
  • ఇప్పుడు మనం తయారు చేసుకున్న గోధుమ పిండి నుండి కొంత పిండిని తీసుకొని చపాతీ లాగా చేసుకోవాలి.
  • చపాతీ లాగా చేసుకున్న పిండి యొక్క అంచులను కట్ చేసి స్క్వేర్ షేప్ చేసుకోండి.
  • ఆ తరువాత తవా పై వేసి రెండు వైపులా సుమారు 30 సెకండ్ల పాటు హీట్ చేయాలి.
  • ఇప్పుడు దానిని మూడు దీర్ఘ చతురస్ర (rectangle) భాగాలుగా చాకుతో కోసి ఒక్కొక్క భాగాన్ని ఒక ట్రయాంగిల్ ఆకారంలో మడిచి ఆనియన్ మిశ్రమాన్ని స్టఫ్ఫ్ చేసుకోవాలి.
  • కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్ళు కలిపి ఆ తడితో సమోసా యొక్క అన్ని అంచులను గ్యాప్ లేకుండా మూయాలి.
  • వీటిని బాగా కాగిన నూనె లో డీప్ ఫ్రై చేసుకుంటే నోరూరించే ఆనియన్ సమోసా తయారు!!!
Posted on

How to make veg fish – Best Indian snack recipe – వెజ్ ఫిష్ రెసిపీ

వెజిటేరియన్ ఇంగ్రీడియెంట్స్ ని ఉపయోగించి ఫిష్ ఆకారంలో ఒక వంటకాన్ని మనం ఇప్పుడు తయారు చేయబోతున్నాము. ఇది ఎంతో రుచికరమైన, క్రిస్పీ గా ఉండే ఒక వెజిటేరియన్ ఈవినింగ్ స్నాక్స్. మరి పిల్లలు ఎంతో ఇష్టపడే ‘వెజ్ ఫిష్’ ని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • మైదా – 1 కప్పు
  • ఉప్పు – 4 టేబుల్ స్పూన్
  • బంగాళదుంప – 3
  • చాట్ మసాలా – 1 టేబుల్ స్పూన్
  • సోంపు – 1 టేబుల్ స్పూన్
  • మిరియాల పొడి – 1 టేబుల్ స్పూన్
  • మ్యాంగో పొడి – 1 టేబుల్ స్పూన్
  • రెడ్ చిల్లీ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
  • కిచెన్ కింగ్ మసాలా – 1 టేబుల్ స్పూన్
  • నెయ్యి
  • లవంగాలు
  • నూనె – డీప్ ఫ్రై చేయడానికి

తయారు చేసే విధానం

  • 3 బంగాళదుంపలను బాగా ఉడికించి తోలు వొలిచి ఉంచుకోవాలి.
  • ఒక బౌల్ లో 1 కప్పు మైదా, 2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కావలసినంత నీటిని చేర్చి చపాతి పిండి ముద్దలా చేసుకోవాలి.
  • అందులో కొంత నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత ఒక క్లోత్ తో కవర్ చేసి 30 నిమిషాల పాటు ఉంచాలి.
  • ఆ సమయంలో ఉడికించుకున్న బంగాళదుంపలను మాష్ చేసుకొని 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ కిచెన్ కింగ్ మసాలా, 2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి మరియు 1 టీ స్పూన్ మ్యాంగో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, సోంపు వేసి కలుపుకుంటే స్టఫ్ చేయడానికి కావలసిన బంగాళదుంప రెడీ.
  • 30 నిమిషాల పాటు క్లోత్ వేసి ఉంచిన పిండిని తీసుకొని 9 రౌండ్స్ లా చేసుకొని చపాతి కర్రను ఉపయోగించి ఫిష్ ఆకారంలోకి చేసుకోవాలి.
  • మధ్యలో స్టఫ్ ని ఉంచి సైడ్స్ లో ఉన్న పిండిని చిన్న చిన్న రెక్కలుగా కట్ చేసుకొని జిగ్ జాగ్ స్టైల్ లో స్టఫ్ పై కవర్ చేసుకొని ఫిష్ ఆకారంలో రెడీ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక ఫ్యాన్ లో డీప్ ఫ్రై చేయడానికి కావలసినంత నూనె పోసుకొని, నూనె వేడెక్కిన తరువాత రెడీ గా ఉంచుకున్న ఫిష్ ని అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  • రెండు వైపులా బాగా ఫ్రై అయిన తరువాత ప్లేట్ లో ఉంచి ఆనియన్స్ మరియు కొత్తిమీరను చల్లి డెకరేట్ చేసి సర్వ్ చేయండి.
  • అంతే ఎంతో రుచికరమైన ‘చికెన్ సూప్’ రెడీ.