Posted on

How to make pan fried noodles in Telugu – ప్యాన్ ఫ్రైడ్ నూడుల్స్ రెసిపీ

ప్యాన్ ఫ్రైడ్ నూడుల్స్ ఏంతో రుచికరమైన ఆసియా వంట. రుచికరమైన కూరగాయలను ఉడకబెట్టిన సూప్ లో నానబెట్టిన ఫ్రైడ్ నూడుల్స్ యొక్క క్రంచీ రుచి తప్పక మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఫేవరైట్ డిష్ గా మారుతుంది.

పార్టీలు, పుట్టినరోజు సెలబ్రేషన్ లేదా బర్తడే వంటి సందర్భాల్లో ఈ నోరూరించే ప్యాన్ ఫ్రైడ్ నూడుల్స్ సూప్ ని తయారు చేసి ప్రతి ఒక్కరి ప్రశంసలను పొందండి.

కావలసిన పదార్థాలు

  • నూనె – 1 కప్పు
  • ఉప్పు – 2 టేబుల్ స్పూన్లు
  • నూడుల్స్
  • కార్న్ ఫ్లార్ – 1/2 కప్పు
  • సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
  • గ్రీన్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
  • రెడ్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
  • టొమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్
  • తరిగిన క్యారట్ – 1/2 కప్పు
  • తరిగిన రెడ్ క్యాప్సికం – 1/2 కప్పు
  • తరిగిన ఎల్లో క్యాప్సికం – 1 కప్పు
  • తరిగిన క్యాబేజి – 1 కప్పు
  • వెలుల్లి ముక్కలు
  • తరిగిన బేబీ కార్న్

తయారీ విధానం

  • ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి అందులో 1 కప్పు నీళ్లు పోసి అందులో నూడుల్స్, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి.
  • నూడుల్స్ బాగా ఉడికిన తరువాత నీటిని వడగట్టి నూడుల్స్ ని ఒక ప్లేట్ లో తీసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై మరో ప్యాన్ ని ఉంచి అందులో 1 కప్పు నూనె పోసి, ఉడికించి ఉంచుకున్న నూడుల్స్ ని వేసి ఫ్రై చేసుకోవాలి.
  • మరో ప్యాన్ లో 2 టీ స్పూన్ నూనెలో తరిగిన క్యారట్ మరియు రెడ్ క్యాప్సికం, 1 కప్పు ఎల్లో క్యాప్సికం, కొన్ని వెలుల్లి ముక్కలు, తరిగిన బేబీ కార్న్, 1 కప్పు తరిగిన క్యాబేజీలను వేసి దోరగా వేయించుకోవాలి.
  • ఆ తరువాత 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ టొమాటో సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకోవాలి.
  • ఒక కప్పులో కార్న్ ఫ్లార్ లో కొద్దిగా నీళ్లు పోసి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి.
  • అలా కలిపిన కార్న్ ఫ్లార్ ని వేయించిన కూరగాయలలో పోయాలి.
  • ఆ తరువాత కొద్దిగా నీళ్ల, 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఉడికించాలి.
  • బాగా ఉడికిన తరువాత ఒక బౌల్ లోకి తీసుకొని ఫ్రై చేసి ఉంచుకున్న నూడుల్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో వేడి వేడి రుచికరమైన ఆరోగ్యకరమైన ‘సూప్ విత్ ఫ్రైడ్ నూడుల్స్’ రెడీ!
Posted on

Baby corn soup recipe in Telugu – బేబీ కార్న్ సూప్ రెసిపీ

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా దిగుమతి చేయబడే ఆరోగ్యకరమైన కూరగాయలలో బేబీ కార్న్ ఒకటి. ఆసియా మరియు ఓరియంటల్ వంటలలో విస్తృతంగా ఉపయోగించబడుతున్న బేబీ కార్న్ ని ఫ్రైస్ మరియు సలాడ్లకు జోడించుకుంటే ఎంతో రుచిరమైన క్రిస్పీ ఫుడ్ తయారవుతుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారికి బేబీ కార్న్ ఒక మంచి ఆహార పదార్థం. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ మరియు న్యూట్రియెంట్స్ గల ఆరోగ్యకరమైన ‘బేబీ కార్న్ సూప్’ని ఎలా తయారు చేయాలో చూద్దాం.

 కావలసిన పదార్థాలు

  • నూనె – 1 కప్పు
  • ఉప్పు – 2 టేబుల్ స్పూన్
  • కార్న్ ఫ్లోర్ – 1/2 కప్పు
  • సొయా సాస్ – 1 టేబుల్ స్పూన్
  • గ్రీన్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
  • రెడ్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
  • కట్ చేసుకున్న బేబీ కార్న్
  • టమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్
  • కట్ చేసుకున్న క్యారట్ – 1/2 కప్పు
  • కట్ చేసుకున్న రెడ్ కాప్సికం – 1/2 కప్పు
  • కట్ చేసుకున్న ఎల్లో కాప్సికం – 1 కప్పు
  • కట్ చేసుకున్న క్యాబేజి – 1 కప్పు
  • వెలుల్లి ముక్కలు

తయారు చేసే విధానం

  • ఒక ఫ్యాన్ లో 2 టీ స్పూన్ ల నూనె అందులో కట్ చేసుకున్న క్యారట్, రెడ్ కాప్సికం, 1 కప్పు ఎల్లో కాప్సికం వేసుకొని బాగా ఫ్రై చేయాలి.
  • ఆ తరువాత అందులో ఒక స్పూన్ వెలుల్లి ముక్కలను వేసుకోవాలి.
  • వెలుల్లి కుక్ అయిన తరువాత కట్ చేసి ఉంచుకున్న బేబీ కార్న్ ముక్కలను వేసి ఫ్రై చేయాలి.
  • తరువాత 1 కప్పు క్యాబేజి వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ సొయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ టమాటో సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఫ్రై చేయాలి.
  • ఆ తరువాత అందులో కార్న్ ఫ్లోర్ నీటిని (కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి) మరియు తగినంత నీటిని, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఉడికించాలి.
  • మిశ్రమం బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేయండి.
  • ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ‘బేబీ కార్న్ సూప్’ రెడీ. దీనిని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేయండి.
Posted on

Chicken soup recipe in Telugu – చికెన్ సూప్ రెసిపీ

చలి కాలంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ‘చికెన్’. అందులోనూ సూప్ ని డిన్నర్ స్పెషల్ గా తీసుకుంటారు. మరి కొన్ని వెజిటేబుల్స్ ని జోడించి ఎంతో యమ్మీ మరియు ఆరోగ్యకరమైన చికెన్ క్లియర్ సూప్ ఎలా చేయాలో తెలుసుకుందామా?

కావలసిన పదార్థాలు

  • బే లీఫ్ – 1
  • లవంగాలు – 5  లేదా 6
  • ఏలకులు- 3
  • మిరియాలు – కొన్ని  (1 స్పూన్)
  • ధనియాలు – కొన్ని (1 స్పూన్)
  • వెలుల్లి – 5 ముక్కలు
  • అల్లం – 3 లేదా 4 చిన్న ముక్కలు
  • కట్ చేసుకున్న పచ్చి మిరపకాయలు – 2
  • కట్ చేసుకున్న క్యారట్ – 1
  • కట్ చేసుకున్న క్యాబేజీ – 1/2 కప్పు
  • కట్ చేసుకున్న ఉల్లిపాయ – 1
  • చికెన్ బోన్స్ – 1 బౌల్
  • నీరు – 1 లీటర్
  • ఉప్పు
  • బోన్ లెస్ చికెన్ – 1 కప్పు
  • కొత్తిమీర
  • నిమ్మరసం – 1 స్పూన్

తయారు చేసే విధానం

  • స్టవ్ పై ప్రెషర్ కుక్కర్ ఉంచి అందులో బే లీఫ్, లవంగాలు, ఏలకులు, మిరియాలు, ధనియాలు, వెలుల్లి, అల్లం, కట్ చేసుకున్న పచ్చి మిరపకాయలు, కట్ చేసుకున్న క్యారట్, కట్ చేసుకున్న క్యాబేజీ, కట్ చేసుకున్న ఉల్లిపాయ, చికెన్ బోన్స్, 1 లీటర్ నీరు మరియు 1 టీ స్పూన్ ఉప్పు వేసి 10 నిమిషాల పాటు ప్రెషర్ కుక్ చేయండి.
  • ఆ తరువాత నీటిని వడగట్టి అందులో 1 టీ స్పూన్ ఉప్పు, బోన్ లెస్ చికెన్ వేసి 15 నిమిషాల పాటు కుక్ చేయండి.
  • బాగా ఉడికిన తరువాత కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ నిమ్మరసం పిండి స్టవ్ ఆఫ్ చేయండి. ఇందులో ఇదివరకే ఉడికించిన వెజిటేబుల్స్ ని జోడించుకోవచ్చు.
  • ఎంతో రుచికరమైన ‘చికెన్ సూప్’ రెడీ.