Posted on

Hair growth tips in Telugu – Hair loss control tips

ప్రతి ఒక్కరి లోనూ తలపై వెంట్రుకలు ఒక అందమైన భాగం. ఎన్నో సందర్భాలలో మన అలంకరణకు తగిన విధంగా హెయిర్ స్టైల్ చేసుకోవటం వలన మన ముఖంలో అదనపు గ్లో కనిపిస్తుంది. గతంలో ఆడువారు మాత్రమే హెయిర్ స్టైల్ చేసుకునే వాళ్ళు.

కానీ కాలం మారే కొద్ది పురుషులు కూడా ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో మనకు తెలియకుండానే అనేక కెమికల్స్ మరియు అజాగ్రత్తల వలన అనేక హెయిర్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. అందులో ఒకటి ఈ హెయిర్ ఫాల్ సమస్య.

ఈ సమస్య యొక్క ప్రధాన కారణాలు మరియు నివారణ పద్ధతుల గురించి ఈ వ్యాసంలో చూద్దాం.

హెయిర్ గ్రోత్ యొక్క దశల

వెంట్రుకలు ఒక క్రమ పద్ధతిలో ఎదుగుతూ, ఆగుతూ, రాలిపోతూ ఉంటాయి. ఇది మూడు దశలుగా సాగుతుంది.

 • ఎదిగే (అనాజెన్) దశ : ఇది 3-6 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఇందులో వెంట్రుకల కుదుళ్లలోని కణాలు చాలా వేగంగా వృద్ధి చెందుతుంటాయి.
 • స్తబ్ధ (కెటాజెన్) దశ : సుమారు 2-3 వారాల పాటు సాగే ఈ దశలో వెంట్రుకలు పెరగటం ఆగిపోతుంది.
 • విశ్రాంతి (టిలోజెన్) దశ : ఇది దాదాపు 100 రోజుల వరకు కొనసాగుతుంది. వెంట్రుకలు రాలిపోయేది ఈ దశలోనే. సుమారు 6 నుండి 8% జుట్టు ఈ దశలో ఊడుతుంది.

ఇదంతా ఒక చక్రంలా అత్యంత సహజంగా, నిరంతరంగా సాగిపోయే ప్రక్రియ. మగవారికి సుమారు లక్ష, ఆడవారికి లక్షన్నర వెంట్రుకలు ఉంటాయి. వాటిలో రోజుకు 50-100 వరకు వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఒకవైపు రాలేవి రాలుతున్నా పెరిగేవి పెరుగుతుండటం వల్ల పెద్ద తేడా కనిపించదు. కొందరికి రోజూ కాకుండా వారానికి సరిపడా ఒకరోజే ఊడిపోవచ్చు.

దీంతో ఏదో అయిపోయిందని, బట్టతల వచ్చేస్తోందని భయపడిపోతుంటారు. అలాంటి భయాలేవీ అవసరం లేదు. విశ్రాంతి దశ తర్వాత ఊడిపోయిన వెంట్రుకలు తిరిగి మొలుస్తాయి. వెంట్రుకల ఎదుగుదల, విశ్రాంతి దశలు అస్తవ్యస్తమైతే మాత్రం జుట్టు ఎక్కువగా రాలిపోవటం మొదలెడుతుంది.

హెయిర్ ఫాల్ కారణాలు

మెడికల్ పరంగా హెయిర్ ఫాల్ సమస్యకు సోరియాసిస్, రింగ్ వార్మ్, క్యాన్సర్ చికిత్స, థైరాయిడ్, అలోపీసీయా వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఇటువంటి ఆరోగ్యపరమైన సమస్యల వలన కలిగే హెయిర్ ఫాల్ ని గుణపరిచేందుకు వైద్యుల సహాయం పొందుట మంచిది. మెడికల్ పరంగానే కాకుండా మన నిర్లక్ష్యం వలన కలిగే హెయిర్ ఫాల్ సమస్యలకు కారణాలు మరియు వాటి నివారణ పద్ధతుల గురించి కూడా చూద్దాం.

 • పోషకాల లోపం : మీ హెయిర్ ఫాల్ కి ప్రధాన కారణం సరైన పోషక ఆహారాలను తీసుకోక పోవటం. మనదేశంలో పోషకాల లోపం ముఖ్యంగా ఐరన్ లోపం ఎక్కువ. బి విటమిన్లు, విటమిన్ డి లోపాలు సైతం తరచూ కనిపిస్తుంటాయి. ఇందు కారణంగా కూడా వెంట్రుకలు పలుచబడొచ్చు. బరువు తగ్గటానికి ఆహార నియమాలు పాటించేవారిలో, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నవారిలోనూ పోషకాల లోపం వలన క్రమంగా జుట్టు ఊడిపోవచ్చు (క్రానిక్ టిలోజెన్ ఎఫ్లూవియమ్).
 • బిగువైన హెయిర్ స్టైల్స్గట్టిగా జడ బిగించటం (ట్రాక్షన్ అలోపీషియా): కొందరు జడను ఎంతో గట్టిగా బిగించి వేస్తుంటారు. అందువలన కూడా జుట్టు ఊడిపోవచ్చు.
 • స్ప్లిట్‌ ఎండ్స్ వలన కూడా హెయిర్ ఫాల్ సమస్య రావచ్చు.
 • డాండ్రఫ్ : డాండ్రఫ్ వలన తలపై నూనె ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వలన దురద తలెత్తుతుంది. అంతేకాదు ఫంగస్, బ్యాక్టీరియా వృద్ధి చెందొచ్చు. ఫలితంగా వెంట్రుకలు ఊడిపోవచ్చు.
 • వేడి నీటితో తల స్నానం కూడా కుదుళ్లు బలహీనం కావడానికి ఒక కారణం.
 • తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రభావం.
 • ఒత్తిడి: మానసిక ఒత్తిడి అధికంగా ఉన్న వారి యొక్క జుట్టు పలుచగా అవుతుంటుంది (డిఫ్యూజ్ హెయిర్లాస్). ఒకేచోట కాకుండా తలంతా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. జ్వరం, కాన్పు, సర్జరీల వంటివి శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తాయి. అందుకే కొందరికి జ్వరం తగ్గాక, మహిళల్లో కాన్పు అయ్యాక రెండు మూడు నెలల తర్వాత జుట్టు ఊడిపోతుంటుంది (అక్యూట్ టిలోజెన్ ఎఫ్లూవియమ్). ఈ కారణాల వలన రాలిన జుట్టు కొన్ని రోజుల తరువాత తిరిగి పెరిగే అవకాశం ఉంది. ఇందుకు ప్రత్యేకించి చికిత్స అవసరం లేదు.
 • మద్యపానం సేవించటం, ధూమపానం వంటి అలవాట్లు ఉన్న వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన కూడా జుట్టు అధికంగా రాలిపోయే అవకాశాలు ఉన్నాయి.
 • ఎక్కువగా ఎండలో తిరగటం వలన జుట్టు డ్రై గా మారి రాలిపోవచ్చును.
 • వైద్య పరిస్థితులుమందులు : కొన్ని రకాల మందుల కారణంగా కూడా జుట్టు రాలిపోవచ్చు. క్యాన్సర్తో మామూలుగానే జుట్టు ఊడిపోతుంటుంది. కీమోథెరపీ మందులతోనూ వెంట్రుకలు ఊడిపోవచ్చు. కొన్నిరకాల మానసిక సమస్యల వలన కలిగే నొప్పి మరియు అధిక రక్తపోటు తగ్గటానికి రోగనిరోధక శక్తిని అణచి పెట్టటానికి వేసుకునే మందుల కారణంగా కూడా జుట్టు రాలిపోవచ్చు.
 • వాతావరణ కాలుష్యం – ప్రస్తుత కాలంలో అధిక శాతం హెయిర్ ఫాల్ కు కారణం కాలుష్యం.
 • హెయిర్ స్టైల్ చేసుకునే సమయంలో ఉపయోగించే కెమికల్స్సౌందర్య సాధనాలు: కొందరు వెంట్రుకలను స్ట్రైటనింగ్ చేయటానికి వేడిని పుట్టించే పరికరాలతో ఐరన్ చేస్తుంటారు. దీంతో జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. కర్ల్స్ వంటివి చేయటం వలన కూడా వెంట్రుకలు ఊడిపోవచ్చు.
 • హార్మోన్ల మార్పులు : థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువైనా, తక్కువైనా వెంట్రుకలు పెరిగే ప్రక్రియ దెబ్బతిని, రాలిపోవచ్చు. ఆడవారిలో పీసీఓడీ సమస్య మూలంగా టెస్టోస్టీరాన్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది ఒకవైపు తల మీద జుట్టు రాలిపోయేలా చేస్తే మరోవైపు శరీరంలోని మిగతా భాగాల్లో వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది. పీసీఓడీకి చికిత్స తీసుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది. ఇటీవల జిమ్‌కు వెళ్లేవారు ప్రోటీన్ వంటివి వాడుకోవటం ఎక్కువైంది. దీంతో టెస్టోస్టీరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇందు కారణంగా కూడా హెయిర్ ఫాల్ కలగవచ్చు.
 • ఫంగస్ ఇన్‌ఫెక్షన్ : చిన్న పిల్లల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఇదే. పిల్లలు తరగతిలో దగ్గర దగ్గరగా కూర్చుంటారు. ఒకరినొకరు తాకుతుంటారు. ఇతరుల దువ్వెనలనూ వాడే అవకాశం వుంది. వారిలో ఎవరికైనా ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీంతో జుట్టు ఊడిపోవచ్చు (టీనియా క్యాపిటస్). యాంటీ ఫంగల్ మందులతో ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమైపోతుంది. జుట్టు తిరిగి వస్తుంది.
 • పేను కొరుకుడు (అలోపీషియా ఏరియేటా):  ఇందులో అక్కడక్కడా గుండ్రంగా జుట్టు ఊడిపోయి, నున్నగా అవుతుంది. పేలు కొరకటం వల్ల ఇది వస్తుందని భావిస్తుంటారు. కానీ నిజానికి పేలు వెంట్రుకలను కొరకవు. దీనికి మూలం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం. దీంతో వెంట్రుకల కుదుళ్లు దెబ్బతిని, రాలిపోతాయి. థైరాయిడ్ సమస్యలు, ఎండు గజ్జి, మధుమేహం, మానసిక ఒత్తిడి గలవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కొందరికి దీని మూలంగా పెద్ద మొత్తంలోనూ జుట్టు ఊడిపోవచ్చు (అలోపీషియా టోటాలిస్). ఇటువంటి వారిలో కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోతాయి. పేను కొరుకుడుతో రాలిపోయిన వెంట్రుకలు మూడు, నాలుగు నెలల తర్వాత తిరిగి మొలుస్తాయి.
 • జుట్టు లాగటం (ట్రైకో టిల్లోమేనియా): కొందరు పిల్లలు వెంట్రుకలను గట్టిగా పట్టుకొని లాగేస్తుంటారు. అలా చేయటం హెయిర్ ఫాల్ కి దారితీస్తుంది. దీనికి మూలం మానసిక సమస్యలు. అలా చేయటం వలన వెంట్రుకలు మధ్యలో తెగిపోతాయి. కొన్ని పొడుగ్గా, కొన్ని చిన్నగా కనిపిస్తాయి. అక్కడక్కడా వెంట్రుకలు ఊడి పోతాయి.
 • చర్మ సమస్యలు: చర్మం మీద మచ్చ (స్కార్) పడేలా చేసే చర్మ సమస్యల వలన కూడా జుట్టు ఊడిపోతుంది. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డిస్కాయిడ్ ల్యూపస్ ఎరీథెమటోసస్, లైకెన్ ప్లేనస్ పైలారిస్ మరియు సార్కాయిడోసిస్ జుట్టుకు వచ్చే దీర్ఘకాల ఇన్ఫెక్షన్లు. వీటి కారణంగా కుదుళ్లు మొత్తంగా ఊడిపోతాయి. అందువల్ల వెంట్రుకలు తిరిగి రావటమనేది జరగదు.

హెయిర్ ఫాల్ తగ్గించేందుకు గృహ నివారణ పద్ధతులు

హెయిర్ ఫాల్ సమస్యకు ఎన్నో వైద్య చికిత్సలు ఉన్నప్పటికీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యను తొలగించేందుకు ఉత్తమ మార్గం ఇంటి నివారణ పద్దతులను అనుసరించటం. కొన్ని సులభమైన మరియు ప్రభావితమైన హోమ్ రెమెడీలను చూద్దాం.

ఆమ్ల

ఆమ్లా తో అనేక రకాలైన ప్యాక్‌లను తయారు చేసి మీ కురులపై ఉపయోగించవచ్చు.

 • కొబ్బరి నూనెలో లేదా బాదాం నూనెలో కొన్ని ఆమ్లా ముక్కలను వేసి వేడి చేయండి. రెండు మూడు నిమిషాల తరువాత వెచ్చని నూనెని మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి ఒకటి లేదా రెండు గంటలు ఉంచి తల స్నానం చేయండి.
 • ఆమ్లా జ్యూస్ మరియు నిమ్మరసంను కలిపి షాంపూలాగా ఉపయోగించవచ్చు.
 • రెండు టేబుల్ స్పూన్ యూకలిప్టస్ నూనెలో ఆమ్లా ముక్కలను రాత్రంతా నానబెట్టండి. ఒక మందపాటి పేస్ట్ సిద్ధం చేయడానికి గుడ్డు మరియు పెరుగును ఈ మిశ్రమంలో కలుపుకోండి. ఈ పేస్ట్‌ని మీ స్కాల్ప్ మరియు జుట్టుపై పూర్తిగా అప్‌లై చేసి ఆరిపోయే వరకు వదిలివేయండి. ఆ తరువాత తేలిక పాటు షాంపూతో కడగాలి.

ఆవాల నూనె

ఆవాల నూనె మరియు హెన్నా ఆకులను కలిపి ఉడికించిన మిశ్రమం హెయిర్ ఫాల్ ని ఆపడానికి ఉపయోగపడుతుంది. 125 మి.లి ఆవాల నూనె మరియు 30 గ్రాముల గోరింటాకులను కలిపి బాగా వేడి చేయండి. చల్లారిన తరువాత నూనెని వడకట్టి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి.

ఈ నూనెతో రెగ్యులర్గా మసాజ్ చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది, అంతే కాదు మీ కురులు పెరుగుదలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

కలబంద

కలబంద హెయిర్ ఫాల్ ని తగ్గించి డాండ్రఫ్ ని తొలగిస్తుంది. మీ స్కాల్ప్ లో PH లెవెల్స్ ని కూడా రీస్టోర్ చేస్తుంది. కలబంద జెల్ ని డైరెక్ట్ గా మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి ఒక గంట సేపు తరువాత తల స్నానం చేయండి. ఇలా వారానికి 3 లేదా 4 సార్లు ఉపయోగించటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

కొబ్బరి పాలు

హెయిర్ ఫాల్ ని ఆపడానికి తలపై కొబ్బరి పాలను రాయడం ఒక ఉత్తమమైన హోమ్ రెమిడీ.

 • కొబ్బరి ముక్కలను బాగా రుబ్బి వాటి నుండి పాలను తీయండి. మీ స్కాల్ప్ మీద మరియు వెంట్రుకల మూలకాల పై అప్లై చేసి ఐదు నుండి పది నిమిషాలు మసాజ్ చేయండి. ఇది కేశాలకు పోషణ అందించి ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
 • నిమ్మరసంతో కలిపిన కొబ్బరి నూనెని స్కాల్ప్ మరియు కురులపై రాయటం వలన హెయిర్ ఫాల్ తగ్గి కురులు పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది.

కొత్తిమీర ఆకులు

కొత్తిమీర ఆకులను రుబ్బి వీటి రసాన్ని రెగ్యులర్గా స్కాల్ప్ పై రాయటం వలన హెయిర్ ఫాల్ తగ్గి మీ కేశాలు ఒత్తుగా పెరుగుతాయి. వారానికి మూడు సార్లు ఈ రసాన్ని ఉపయోగించవచ్చు.

ఆయిల్ మసాజ్

ఆరోగ్యకరమైన, బలమైన జుట్టుని పొందటానికి ఇది అత్యంత ప్రసిద్ధమైన గృహ నివారణలలో ఒకటి. సాధారణ కొబ్బరి నూనె, బాదం నూనె, ఆవాలు నూనె, లావెండర్ నూనె, రోజ్మేరీ వంటి అనేక చమురులు ఉన్నాయి.

ప్రతి నూనె కి దాని స్వంత ప్రయోజనం ఉంటుంది. మీ జుట్టుని ప్రతి రోజూ వీటిలో ఏదో ఒక నూనెతో మసాజ్ చేయండి. ఇది మీ కురులకు సంబంధించిన అనేక సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తుంది.

జీలకర్ర విత్తనాలు

జీలకర్ర పేస్ట్ తయారు చేయడానికి కొన్ని గింజలను రుబ్బి అందులో కొబ్బరి నూనెని కలపి ఒక పేస్ట్ ను తయారు చేసుకోండి. దానితో చక్కగా మీ స్కాల్ప్ పై మసాజ్ చేసుకోండి. సుమారు 15 నిమిషాల తరువాత, షాంపూతో తలస్నానం చేయండి.

ఎగ్ వైట్

గుడ్డు ప్రోటీన్ యొక్క ఉత్తమ మూలం. ఇది మీ జుట్టు యొక్క కోల్పోయిన షైన్ ని తిరిగి తెస్తుంది. పొడవాటి, బలమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం, మీ కురులపై గుడ్డు యొక్క తెల్ల సొనను పూసి కొద్ది సేపు తరువాత తల స్నానం చేయండి. వారానికి ఒకసారి ఈ ప్రక్రియను అనుసరించండి.

వేపాకు

మీ జుట్టుకు కావలసిన అన్ని పోషకాలు వేపాకులో ఉంటాయి. దీని లోని యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక లక్షణాలు మీ జుట్టులో స్ప్లిట్‌స్ ఏర్పడకుండా చేస్తుంది మరియు మీ స్కాల్ప్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొన్ని తాజా వేప ఆకులను నీటిలో వేసి బాగా ఉడికించండి.

నీరు సగానికి సగం ఇంకిపోయే వరకు ఉడికించండి. ఈ నీటిని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకొని మంచి ఫలితాల కోసం ప్రతి రోజూ మీ స్కాల్ప్ పై దరఖాస్తు చేయండి.

హెన్నా

హెన్నా యొక్క లక్షణాల గురించి అందరికీ తెలిసిందే. హెయిర్ ఫాల్, స్ప్లిట్‌ ఎండ్స్, డ్రైనెస్ వంటి అనేక హెయిర్ ప్రాబ్లమ్స్ ని తొలగించటంలో సహాయపడుతుంది. హెన్నా పేస్ట్ ని ప్రతి వారం వాడవచ్చు.

మీరు తాజా హెన్నా పేస్ట్ తో 2 టేబుల్ స్పూన్లు ఆమ్ల రసంను మరియు కొద్దిగా నీరు జోడించి అద్భుతమైన హెయిర్ ప్యాక్‌ని తయారుచేయవచ్చు.

ఒక బ్రష్‌ను ఉపయోగించి మీ జుట్టు మరియు స్కాల్ప్ పై ఈ పేస్ట్ ని దరఖాస్తు చేయండి. సుమారు ఒక గంట అలాగే ఉంచి మైల్డ్ షాంపూతో బాగా కడగాలి. ఈ పద్ధతిని వారానికి మూడుసార్లు ఫాలో చేయండి.

గమనిక : తెల్ల జుట్టు ఉన్నవారు హెన్నా పేస్ట్ ని వాడినట్లయితే మీ జుట్టు మెరూన్ రంగుకు మారుతుంది.

పెరుగు

పెరుగు జుట్టు రాలడాన్ని ఆపడం మాత్రమే కాదు మీ కేశాలను సిల్కీ, మెరిసే, మృదువైనవిగా కూడా చేస్తుంది. కర్డ్ ప్యాక్ తయారు చేయడానికి, పెరుగుని కొద్దిగా ఆవాల పేస్ట్‌తో కలపండి. పెరుగును హెన్నా ప్యాక్లలో కూడా ఉపయోగిస్తారు.

వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ ని ఉపయోగించవచ్చు. ఉపయోగించిన తర్వాత ఒక షాంపూతో తల స్నానం చేయటం మర్చిపోకండి.

ఆపిల్ సీడర్ వినిగర్

ఆపిల్ సీడర్ వినిగర్ ని కొద్దిగ నీలతో డైల్యూట్ చేసుకొని ప్రతి సారి మీరు తల స్నానం చేసే ముందు మీ కురులపై మరియు స్కాల్ప్ పై రాయండి. ఆపిల్ సీడర్ వినిగర్ యొక్క వాసనను తొలగించాలనుకుంటే కొద్దిగా రోజ్ మేరీ నూనెని కలుపుకోవచ్చు.

ద్రాక్ష గింజల నూనె

ఈ నూనె హెయిర్ ని కండీషన్, బలంగా చేస్తుంది. అంతే కాదు చుండ్రు, హెయిర్ ఫాల్ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. ద్రాక్ష విత్తనాల నూనెని తయారుచేయడానికి నీటిలో విత్తనాలను వేసి బాగా ఉడికించండి. ఇలా నీటిని మరిగించడం ద్వారా నూనెని సేకరించవచ్చు.

షికాకై

మార్కెట్లో షాపులు మరియు సబ్బులు అందుబాటులో లేని రోజుల్లో అందరూ షికాకైనే ఉపయోగించేవారు. వీటిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు పైగా కురులకు కావాలసిన అన్ని పోషకాలను అందిస్తుంది. దీని వలన మీ జుట్టు మందంగా పెరుగుతుంది. కనుక కెమికల్స్ తో కూడిన షాంపూలకు బదులుగా షికకైని ఉపయోగించటానికి ప్రయత్నించండి.

ఉల్లిపాయ రసం

మనలో చాలా మందికి ఇప్పటికీ ఉల్లిపాయ యొక్క ప్రయోజనాల గురించి తెలియదు. ఉల్లిపాయ నుండి రసంను తీసి, మీ జుట్టు మీద దరఖాస్తు చేసుకోవచ్చు. రాసిన 30 నిమిషాల తరువాత తల స్నానం చేయండి. ఇది మీ జుట్టు, స్కాల్ప్ మరియు జుట్టు వేర్లపై కూడా రాయండి.

ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి వెంట్రుకల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది చాలా ప్రభావితమైన ఒక రెమిడీ.

గ్రీన్ టీ

గ్రీన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందని అందరికీ తెలుసు. అలాగే హెయిర్ ఫాల్ ని తగ్గించడానికి గ్రీన్ టీ ని మీ జుట్టు మీద దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ మూలికా టీ జుట్టు యొక్క పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉత్తమమైన పదార్ధాలను కలిగి ఉంటుంది. మీరు గ్రీన్ టీ ఉపయోగించి జుట్టుని కడగవచ్చు లేదా ఈ టీ ని మీ జుట్టుకు మాస్క్ లాగా వాడవచ్చు.

ఆమ్లా, కలబంద, వేప

ఈ పదార్థాలు మీ హెయిర్ ఫాల్ ని తగ్గించడం మాత్రమే కాదు చుండ్రులను కూడా తొలగిస్తుంది. స్కాల్ప్ పై చికాకు మరియు దురదను కూడా తగ్గిస్తుంది.

అన్ని పదార్ధాలనూ సమాన భాగాలుగా తీసుకొని బాగా రుబ్బుకోవాలి. ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని తలపై రాసి ఒక గంట సేపు తరువాత తల స్నానం చేయండి. సమర్థవంతమైన ఫలితాల కోసం నెలకు రెండుసార్లు ఉపయోగించండి.

మెంతులు

మెంతులలో నికోటినిక్ ఆమ్లం మరియు జుట్టు పెరుగుదలకు కావలసిన ప్రోటీన్లు ఉంటాయి. మీ వెంట్రుకలను మృదువుగా చేయడానికి రాత్రిపూట విత్తనాలను నీటిలో నానబెట్టి ఉదయం పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ని మీ జుట్టు మీద రాసి ఒక గంటసేపు తర్వాత నీటితో కడగండి. సమర్ధమైన ఫలితాలకు వారానికి రెండుసార్లు ఉపయోగించండి.

లైకోరైస్ వేర్లు

ఇది హెయిర్ ఫాల్ ని తగ్గించడంతో పాటు స్కాల్ప్ ని మృదువుగా చేస్తుంది. పాలు లో లైకోరైస్ వేర్లను రాత్రంతా నానపెట్టి ఉదయం ఒక పేస్ట్ లా తయారు చేసుకొని మీ తలపై రాసి గంట తరువాత తలస్నానం చేయండి. ఈ పేస్ట్ ని రాత్రంతా తలపై ఉంచి ఉదయం కూడా కడగవచ్చు, లేదా మీరు మార్కెట్ లో దొరికే లికోరైస్ root టాబ్లెట్స్ ను కూడా ఉపయోగించవచ్చు.

మందార ఆకులు మరియు పువ్వులు

హైబ్బిస్కస్ ఆకులు హెయిర్ ఫాల్ ని నివారించడానికి మరియు జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. ఇది స్ప్లిట్‌ ఎండ్స్ మరియు చుండ్రుని కూడా నివారిస్తుంది.

 • కొంచం కొబ్బరి నూనెలో 12-15 మందార పువ్వులను వేసి బాగా వేడి చేయండి. చల్లారిన తరువాత ఈ నూనెని వడకట్టి రాత్రి  పడుకునే ముందు తలపై రాసి ఉదయం కడగాలి.
 • మందార ఆకులను రుబ్బి తల స్నానం చేసే ఒక గంట ముందు స్కాల్ప్ మరియు కురులపై రాయండి.

హెయిర్ ఫాల్ తగ్గడానికి తప్పకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

జుట్టు యొక్క ఆరోగ్యం కేవలం బాహ్య అనువర్తనాలపై ఆధారపడి ఉండదు, సరైన ఆహారం చాలా అవసరం. పోషకాలు, ప్రోటీన్లు మరియు విటమిన్లు కలిగి ఉన్న ఆహారాన్ని మీ డైట్ లో జోడించండి. విత్తనాలు, గింజలు, పండ్లు మరియు కూరగాయలు నుండి తయారు చేసిన ఆహారం జుట్టు పెరుగుదలకు ముఖ్యమైన పోషకాలు మరియు ప్రోటీన్లను అందిస్తుంది.

పాలు, ఈస్ట్, కాలేయం, తేనె, కూరగాయల నూనెలు, గోధుమ బీజాలు మరియు గుడ్లు వంటివి జుట్టు పెరుగుదలను పెంచుతాయి.

అవిసె గింజలు

ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇది మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు హెయిర్ ఫాల్ ని ఆపుతుంది. ఒక గ్లాసు నీటితో ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ ని తీసుకోండి. సూప్, స్మూతీస్ మరియు సలాడ్లలో కూడా దీన్ని చేర్చుకోవచ్చు.

బీట్ రూటు రసం

ఇందులో ఫాస్ఫరస్, కాల్షియం, ప్రోటీన్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు మరియు విటమిన్ బి మరియు సి సమృద్ధిగా ఉంటుంది. ఈ పోషకాలు జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. మీరు ప్రతిరోజూ బీట్ రూటు జ్యూస్ని త్రాగవచ్చు మరియు ఈ కూరగాయని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు

ఐరన్ రిచ్ ఆహారాలు హెయిర్ ఫాల్ ని తగ్గించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. శరీరంలో ఐరన్ లేకపోవడం అధిక హెయిర్ ఫాల్ కు కారణమవుతుంది. మీ రోజువారీ ఆహారంలో నల్లజాతి ముల్లంగి, ఆకుకూరలు, జీడి, డ్రై ఫ్రూట్స్, అత్తి పండ్లను మరియు బెర్రీలను చేర్చుకోండి. మాంసం మరియు పౌల్ట్రీ లో కూడా ఐరన్ ఉంటుంది.

పాలకూర

పాలకూరని ఉపయోగించి జుట్టు రాలడాన్ని నిరోధించవచ్చు. బచ్చలి కూర మరియు పాలకూర నుండి ఒక అర లీటర్ జ్యూస్ ని తయారు చేసి ప్రతి రోజూ త్రాగండి. ఇది మీ కురుల పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

ఒతైన కురుల కొరకు కొన్ని టిప్స్

 • చాలా సందర్భాలలో మన కురులలో స్ప్లిట్‌ ఎండ్స్ ఉండటం గమనించి ఉంటాము. కనుక ప్రతి 6 నుండి 8 వారాలకు ఒకసారి, మీ జుట్టు యొక్క టిప్స్ భాగాలను కత్తిరించాలి (ట్రిమ్ చేయాలి). స్ప్లిట్‌ ఎండ్స్ ని తొలగించటం ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది.
 • వేడి నీటి స్నానం వలన మీ జుట్టు యొక్క తంతువులు డీహైడ్రేట్ కావచ్చు. ఇది మీ స్కాల్ప్ నుండి సహజ నూనెలను తొలగిస్తుంది, మరియు మీ జుట్టు పొడిగా అవుతుంది. జుట్టుని శుభ్రపరచడానికి వెచ్చని నీటిని లేదా సాధారణ నీటిని ఉపయోగించండి.
 • తడిగా ఉన్నప్పుడు మీ జుట్టుని ఎప్పుడూ దువ్వ కూడదు. జుట్టు ఆరే వరకు ఆగి ఆ తరువాత మీకు కావలసిన హెయిర్ స్టైల్ చేసుకోండి.
 • ఈ రోజుల్లో మనం జుట్టు మీద సాధారణ నూనె రాయటం గురించి పూర్తిగా మర్చిపోయాము. కానీ జుట్టుకు నూనె రాయటం అవసరం. మనము జీవించటానికి ఆహారాన్ని తినే విధంగా;
 • మన జుట్టు మనుగడకు కూడా ఆహారం అవసరం. ఈ నూనె ప్రతి జుట్టు యొక్క మూలాలు లోకి వెళ్లి పోషణను అందిస్తుంది. కొబ్బరి, బాదం లేదా ఆలివ్ నూనెలు వంటి సహజ నూనెలను ఉపయోగించవచ్చు.
 • వారానికి రెండు సార్లు తప్పకుండా తల స్నానం చేయండి. ముఖ్యంగా ఎండా కాలంలో.
 • మీ హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ను సందర్శించండి.
 • యోగా మరియు మెడిటేషన్ చేయటం వలన హెయిర్ ఫాల్ కి కారణమైన మీ ఒత్తిడి తగ్గుతుంది.

హెయిర్ ఫాల్ సమస్యను నివారించే యోగాసనాలు

శరీరాన్ని ముందుకు వంచి చేసే యోగాసనాలు తల భాగానికి రక్తప్రసరణను అధికరిస్తుంది. దీని వలన జుట్టు కుదుళ్లు క్రమంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ క్రింది ఆసనాలు తప్పక ప్రయత్నించండి:

అదోముఖ శవాసనం

తలకు, రక్తప్రసరణను బాగా పెంచే ఈ ఆసనం సైనస్ వ్యాధికి, జలుబుకు కూడా మంచిది. హెయిర్ ఫాల్ సమస్యకు ముఖ్య కారణం అయిన మానసిక అలసట, వ్యాకులత, నిద్ర లేమిని తగ్గించటంలో కూడా సహాయపడుతుంది.

ఉత్థానాసనం

ఈ ఆసనం అలసటను తగ్గించటంలో సహాయపడుతుంది. స్త్రీలకు మెనోపాజ్ సమస్యలను తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

వజ్రాసనం

మిగిలిన ఆసనాలకు భిన్నంగా ఈ వజ్రాసనాన్ని భోజనం చేసిన తరువాత కూడా వేయవచ్చు. ఈ ఆసనం హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయటంతో పాటు మూత్రాశయంలో సమస్యలను పరిష్కరిస్తుంది. బరువు తగ్గటంలో సహాయపడటంతోపాటు జీర్ణవ్యవస్థను మెరుగు పరిచి కడుపులో గ్యాస్ ను తగ్గిస్తుంది.

అపానాసనం

జీర్ణవ్యవస్థలో ఉండే ప్రాణశక్తికి అపానం అని పేరు. అపానాసనం మన శరీరంలోని విషాలను తొలగించటంలో సహాయపడుతుంది. బుద్ధికి స్పష్టత చేకూరుస్తుంది. మలబద్ధకంనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

పవనముక్తాసనం

కడుపులో వాయువును (గ్యాస్ ను) తగ్గిస్తుంది, జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వెన్నెముక క్రిందిభాగంలోని కండరాలు శక్తివంతం అవుతాయి. ఉదర భాగంలో, పిరుదులలోని కొవ్వును తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగు పరిచి హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తుంది.

సర్వాంగాసనం

థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా ఊపిరితిత్తులు, అన్నవాహిక, జననేంద్రియాలు, నాడీ వ్యవస్థలు ఆరోగ్యంగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.

కపాలభాతి ప్రాణాయామం

కపాలభాతి ద్వారా మెదడులోని కణాలకు మరింత ప్రాణవాయువు అందుతుంది. ఆ విధంగా ఇది నాడీ వ్యవస్థకు చాలా మంచిది. శరీరంలోని విషపదార్థాలను నిర్మూలించి, స్థూలకాయం, మధుమేహాలను తగ్గించటంలో సహాయపడుతుంది.

భస్త్రిక ప్రాణాయామం

శరీరంలో అధికంగా ఉన్న వాత, పిత్త, శ్లేష్మాలను తొలగించటం ద్వారా నాడీవ్యవస్థను శుద్ధి చేస్తుంది. తద్వారా అనేక వ్యాధులను నివారిస్తుంది.

నాడీశోధన ప్రాణాయామం

గుండె సంబంధిత వ్యాధులను, ఆస్త్మా, కీళ్ల నొప్పులు, కుంగుబాటు, మైగ్రెయిన్, మానసిక ఒత్తిడి, కంటి, చెవులకు సంబంధించిన వ్యాధులను తగ్గించటంలో సహాయపడుతుంది.

Posted on

Onion juice for hair growth in Telugu – బట్ట తల పై జుట్టు పెరుగుటకు ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలి?

జుట్టు పాపడి వద్ద పలుచబడుతోందా? మీ మాడు పై బట్టతల ప్యాచెస్ ఏర్పడుతున్నాయా? ఒక వయసు తరువాత (వృధాప్యంలో) ఇలాంటి సమస్యలు ఏర్పడితే పెద్ద సమస్యగా అనిపించదు కానీ యవ్వనంలోనే ఇలాంటి సమస్యలు ఎదురైతే! వీటితో పాటు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. పబ్లిక్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

బాల్డ్ ప్యాచెస్ కనపడకుండా ఉండేందుకు మరియు పలుచబడిన జుట్టు ఒత్తుగా కనిపించేలా చేసేందుకు ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ ని ట్రై చేస్తాము. అంతేకాదు, ఈ సమస్యను ట్రీట్ చేసేందుకు ఎన్నో ఖరీదైన నూనెలను మరియు ట్రీట్‌మెంట్లను ట్రై చేసి ఉంటాము.

కానీ ఎక్కువ ఖర్చు లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొన్ని ఉత్తమ హోమ్ రెమిడీస్ ని ఉపయోగించి ఈ సమస్యను క్యూర్ చేయవచ్చు. మరి ఈ సమస్యలకు కారణాలు ఏంటి? ఈ సమస్యలను ట్రీట్ చేసేందుకు ఉల్లిపాయతో తయారు చేసుకొనే ఉత్తమ హోమ్ రెమిడీస్ గురించి తెలుసుకుందాం. మరియు బట్టతల యొక్క  వైద్య చికిత్సల గురించి కూడా ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

బట్టతల

బట్టతల వంశపారంపర్యంగా వచ్చే సమస్య. జన్యు ప్రభావాలతో హార్మోన్లు అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. అందుకే దీన్ని ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అని అంటారు. ఒకప్పుడు 40 ఏళ్ల తర్వాత మొదలయ్యే బట్టతల సమస్య ప్రస్తుత కాలంలో 20 ఏళ్లలోనే మొదలవుతోంది. జన్యువులు త్వరగా వ్యక్తీకరణ కావటం ఇందుకు దోహదం చేస్తోంది.

మన ఆహార అలవాట్లు మారటం, పెరుగుతున్న కాలుష్యం లాంటి విషయాలు దీనికి పురికొల్పుతున్నాయి. తండ్రి, తాతలకు బట్టతల ఉంటేనే తర్వాతి తరానికి వస్తుందని కొందరు భావిస్తుంటారు. తల్లి, అమ్మమ్మలకు బట్టతల ఉన్నా వారి వంశావళిలోని వారసులకు రావొచ్చు.

తండ్రికి, తల్లికి ఇద్దరికీ బట్టతల ఉంటే మరింత త్వరగా వచ్చే అవకాశముంది. సాధారణంగా బట్టతల మగవారికే వస్తుందని భావిస్తుంటారు, కానీ ఆడవారికి కూడా వస్తుంది. కాకపోతే వేరుగా ఉంటుంది. మగవారిలో ఆయా భాగాల్లో జుట్టు మొత్తం ఊడిపోతే, ఆడవారిలో మధ్యమధ్యలో వెంట్రుకలు ఊడిపోయి, జుట్టు పలుచగా అవుతుంది.

మగవారిలో కణతల దగ్గర్నుంచి వెంట్రుకలు ఊడిపోవటం మొదలై క్రమంగా నుదురు మీది వరకు ‘ఎం’ ఆకారంలో వెంట్రుకలు రాలిపోతుంటాయి. కొందరికి కేవలం మాడు మధ్యలో గుండ్రంగా జుట్టు మొత్తం పోవచ్చు. తల వెనక భాగంలోని వెంట్రుకలు బలంగా ఉంటాయి. ఇవి త్వరగా ఊడిపోవు. అందుకే చాలామందిలో తల వెనక గుర్రపు నాడా ఆకారంలో జుట్టు రాలిపోకుండా ఉంటుంది.

బాల్డ్ ప్యాచెస్ మరియు థిన్ హెయిర్ సమస్య యొక్క కారణాలు

 • వీటికి ముఖ్య కారణం ఐరన్, సల్ఫర్ మరియు విటమిన్ ల యొక్క లోపం.
 • ఇన్ఫెక్షన్ లేదా జన్యు కారణాల వాళ్ళ కూడా కావచ్చు.
 • ప్రస్తుత కాలంలో అధికరిస్తున్న కాలుష్యం కూడా ఒక ముఖ్య కారణం. కాలుష్యం మరియు చెమట వలన స్కాల్ప్ పై మురికి పేరుకుపోయి హెయిర్ ఫాల్ కి దారి తీస్తుంది.
 • అధిక ఒత్తిడి మరియు మారిపోయిన జీవనశైలి.

హెయిర్ గ్రోత్ మరియు బాల్డ్ హెడ్ చికిత్సకు ఉల్లిపాయలు ఎలా ఉపయోగపడతాయి?

మనకు ఇష్టమైన వంటకాల్లో ఉల్లిపాయలను చేర్చుకుంటాం. ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు గురించి మన అందరికీ బాగా తెలుసు. కానీ ఉల్లిపాయలు జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుందన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకు కారణం ఉల్లిపాయ యొక్క వాసన. ఉల్లిపాయల యొక్క వాసన నచ్చనందున బ్యూటీ టిప్స్ కి దీన్ని చాలా అరుదుగా ఉపయోగిస్తారు.

2002 లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ లో ప్రచురించబడిన ఒక పత్రికలో ‘అలోపీశియా ఏరియేట’ అనే ఒక రకమైన బట్ట తలను పోగొట్టడంలో ఉల్లిపాయ యొక్క సామర్థ్యం రుజువైంది. దీనిపై తదుపరి పరిశోధనలు కూడా ఉన్నాయి, అన్ని పరిశోధనలూ దీని ప్రభావాన్ని గుర్తించాయి.

ఉల్లిపాయ ఒక యాంటీ బాక్టీరియల్, యాంటీ పారాసిటిక్ మరియు యాంటీ ఫంగల్ ఏజెంట్. ఇది స్కాల్ప్ పై ఎలాంటి సంక్రమణం కూడా ఏర్పడకుండా శుభ్రంగా ఉంచడానికి అత్యంత ప్రభావితంగా పనిచేస్తుంది. చుండ్రుని కూడా తొలగిస్తుంది. వాటితో పాటు జుట్టు మూలాలను శుభ్రపరచి మాడును ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.

మన శరీరంలో ముఖ్యమైన ఆధార మూలకాల్లో ఒకటి సల్ఫర్. వెంట్రుకలు, గోర్లు మరియు చర్మంలో సల్ఫర్ ప్రధానంగా ఉంటాయి. ఉల్లిపాయలలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది స్కాల్ప్ పై వాపు మరియు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది మరియు జుట్టు ఫోలికల్స్ ని ఉత్తేజ పరుస్తుంది.

జుట్టు మూలాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ చేరడం ద్వారా సంభవించే ఆక్సిడేటివ్ ఒత్తిడి తరచుగా జుట్టు సన్నబడటానికి కారణమవుతుంది మరియు సహజమైన యాంటీ ఆక్సిడెంట్లను తగ్గించి అకాలంలో తెల్ల జుట్టు వచ్చేలా చేస్తుంది. ఉల్లిపాయ రసం స్కాల్ప్ పై కెటలాస్ (ఒక రకమైన ఎంజైమ్) స్థాయిని పెంచుతుంది, ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ సన్నాహాన్ని నియంత్రిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఉల్లిపాయలు హెయిర్ ఫోలికల్స్ కు పోషణను అందించగలుగుతుంది కనుక పురుషులలో జన్యుపరమైన కారణాల వలన ఏర్పడిన బాల్డ్ ప్యాచెస్ ని కూడా ట్రీట్ చేసేందుకు సహాయపడుతుంది.

జుట్టు సమస్యలను నివారించడంలో ఉల్లిపాయల యొక్క ఉపయోగాలను తెలుసున్నారు కదా! మరి ఎలా ఉపయోగించాలి అన్న వివరాలను తెలుసుకుందాం రండి.

ఉల్లిపాయ రసం ని తయారు చేసే విధానం

మీ కురులకు సరిపడేన్ని ఉల్లిపాయలను తీసుకొని తోలు తీసి శుభ్రమైన నీళ్లతో కడగాలి. ఆ తరువాత ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్ లో వేసి 2 నిమిషాల పాటు రుబ్బాలి. కావల్సినంత నీళ్లను చేర్చుకొని రుబ్బుకోవచ్చు.

రుబ్బిన ఉల్లిపాయలను ఫిల్టర్ లో లేదా శుభ్రమైన కాటన్ వస్త్రంలో గాని వేసి పిండితే ఉల్లిపాయ రసం రెడీ అవుతుంది. లేదా ఉల్లిపాయను గ్రేట్ చేసి వాటిని పిండి కూడా రసం తయారు చేసుకోవచ్చు. జుట్టుపై వాడేటప్పుడు ఎల్లప్పుడూ తాజా ఉల్లిపాయ రసం ని మాత్రమే ఉపయోగించాలి.

ఉల్లిపాయ రసం తయారు చేసుకున్న తరువాత హెయిర్ ఫాల్ మరియు బాల్డ్ ప్యాచెస్ ని తొలగించేందుకు క్రింద చెప్పిన అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.

ఉల్లిపాయ రసంను ఉపయోగించే సులభమైన పద్ధతులు

వట్టి ఉల్లిపాయ రసం

అవును, వట్టి ఉల్లిపాయ రసాన్ని మీ స్కాల్ప్ పై డైరెక్ట్ గా అప్‌లై చేయవచ్చు. మీ చేతి వేలతో స్కాల్ప్ పై రాసి ఆ తరువాత జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పూర్తిగా రాయండి. బాల్డ్ ప్యాచెస్ మరియు థిన్ హెయిర్ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో గ్యాప్ లేకుండా రాయాలి. బాగా రాసిన తరువాత గంట సేపు ఉంచి నీటితో లేదా మైల్డ్ షాంపూ తో కడగాలి.

గమనిక : ఉల్లిపాయ రసం ఉపయోగించిన తర్వాత కెమికల్స్ అధికంగా ఉండే షాంపూ ను ఉపయోగించకండి. మైల్డ్ లేదా హెర్బల్ షాంపూ ను ఉపయోగిస్తే మంచిది.

ఉల్లిపాయ రసం మరియు తేనె

తేనెలో అనేక ఔషధ గుణాలున్నాయని మన అందరికీ తెలిసిందే. ఇది చర్మం మరియు కేశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించటానికి కూడా సహాయపడుతుంది.

ఒక కప్పు ఉల్లిపాయ రసం లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి స్కాల్ప్ మరియు కురుల పై రాయండి. రాసిన తరువాత స్కాల్ప్ పై 10 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి మంచి నీటితో లేదా మైల్డ్ షాంపూ తో తల స్నానం చేయండి.

ఉల్లిపాయ రసం మరియు కలబంద

జుట్టు పెరుగుదలను ప్రేరేపించేందుకు మరియు జుట్టు రాలడాన్ని నియంత్రించేందుకు కలబంద ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తాజాగా తయారు చేసిన ఒక కప్పు ఉల్లిపాయ రసం లో ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జుని కలిపి స్కాల్ప్ మరియు కురులపై రాయండి. బాగా అప్‌లై చేసినట్టు నిర్ధారించుకోండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి మంచి నీటితో లేదా తేలిక పాటు షాంపూ తో తల స్నానం చేయండి.

ఉల్లిపాయ రసం మరియు ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ ని జోడించడం వలన ఉల్లిపాయ రసం యొక్క ప్రభావాన్ని అధికరిస్తుంది. ఒక కప్పు ఉల్లిపాయ రసం లో రెండు టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెని కలిపి స్కాల్ప్ మరియు కురుల పై రాయండి. రాసిన తరువాత మాడు పై 10 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి నీటితో లేదా తేలిక పాటు షాంపూ తో తల స్నానం చేయండి.

ఉల్లిపాయ రసం మరియు రోస్ మేరీ ఆయిల్

రోస్ మేరీ ఆయిల్ హెయిర్ ఫాల్ ని నియంత్రించి కురులు ధృఢంగా పెరిగేందుకు సహాయపడుతుంది. మీకు ఉల్లిపాయల వాసన నచ్చకపోతే ఈ రెమిడీ ని ఫాలో అవ్వండి. ఒక కప్పు ఉల్లిపాయ రసం లో 10-15 చుక్కల రోస్ మేరీ నూనెని వేసి బాగా కలపండి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై రాసి బాగా మర్దన చేయండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి నీటితో లేదా తేలిక పాటు షాంపూ తో తల స్నానం చేయండి. రోస్ మేరీ ఆయిల్ ఉల్లిపాయల యొక్క వాసనను తగ్గిస్తుంది.

ఉల్లిపాయ మరియు రమ్

ఉల్లిపాయ యొక్క వాసన నచ్చని వారికి ఈ రెమిడీ ఎంతో ఉత్తమంగా ఉంటుంది. ఒక ఉల్లిపాయ తోలు వొలిచి చిన్న ముక్కలుగా చేసుకొని ఒక కప్పు రమ్ము లో నానబెట్టండి. ఈ మిశ్రమాన్ని ఒక గట్టి కంటైనర్ లో మూసి ఒక రోజంతా రూమ్ టెంపరేచర్ లో నానబెట్టండి. ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.

ఒక రోజు తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టి స్కాల్ప్ పై రాసి మసాజ్ చేసి గంట తరువాత తల స్నానం చేయండి. ఉల్లిపాయల యొక్క శాతం ఇందులో తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మిశ్రమాన్ని ఉపయోగించటం వలన హెయిర్ సమస్యలపై ప్రభావం తక్కువగానే ఉంటుంది.

హెయిర్ ఫాల్‌ను నియంత్రించడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉల్లిపాయ రసం యొక్క సామర్ధ్యం మన అందరికీ బాగా తెలిసిందే. జుట్టు సమస్యల నుండి మీరు బాధ పడుతున్నట్లయితే పై చెప్పిన రెమిడీస్ ని ప్రయత్నించండి.

అయితే, వాటి యొక్క ఫలితాలు వ్యక్తిగత శారీరక స్వభావాన్ని బట్టి ఉంటుంది. కనుక రెగ్యులర్ గా ఆనియన్ రెమిడీస్ ని ఉపయోగించినప్పటికీ వెంటనే ఫలితాలు కనిపించకపోతే నిరాశ చెందకండి. ఈ రెమిడీలను కనీసం వారానికి 3 సార్లు 2 నెలల పాటు ఉపయోగిస్తే తప్పుకుంటా మీ జుట్టు పెరుగుదలలో మార్పులను చూడవచ్చు.

బట్టతల సమస్యకు చికిత్సలు

బట్టతల సమస్య కారణాలను తెలుసుకునేందుకు ముందుగా జుట్టు తీరు తెన్నులను, ఇతరత్రా సమస్యలను విశ్లేషించి సమస్యలను గుర్తిస్తారు. అవసరమైతే టైక్రోగ్రామ్ పరీక్ష చేస్తారు. చిన్న చర్మం ముక్క తీసి పరీక్షిస్తారు (బయాప్సీ). ఫంగస్ ఆనవాళ్లను తెలుసుకోవటానికి స్క్రేపింగ్ చేస్తారు. సమస్యను గ్రహించిన తరువాత సమస్యను బట్టి క్రింది చికిత్సలలో ఒక దానిని చేస్తారు.

మందులు

మామూలు సమస్యలతో  జుట్టు ఊడుతున్న వారికి సమస్యకు తగిన లోషన్లతో పాటు ఐరన్, బి విటమిన్లు, విటమిన్ డి3 ని అందిస్తారు. ఈ చికిత్స కొరకు తీసుకునే మందులను డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి.

ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ

ఇందులో ఆయా వ్యక్తుల రక్తాన్ని తీసి, ప్లేట్లెట్లు అధికంగా ఉండే ప్లాస్మా ద్రవాన్ని వేరు చేసి, ఇంజెక్షన్ సాయంతో మాడుపై ఎక్కిస్తారు. ప్లేట్లెట్లలోని వృద్ధి కారకాలు వెంట్రుకలు పెరిగేలా చేస్తాయి.

మూలకణ చికిత్స

ఇందులో వెంట్రుకల కుదుళ్లను ప్రయోగశాలలో వృద్ధి చేసి మూలకణాలను సేకరిస్తారు. ఆ తరువాత వీటిని తలపై ప్రవేశపెడతారు. దీంతో వెంట్రుకలు వృద్ధి చెందుతాయి.

స్వల్ప లేజర్ కాంతి చికిత్స

లేజర్ కాంతితో వెంట్రుకల వృద్ధి కారకాలు ఉత్తేజితం అవుతాయి. దీంతో వెంట్రుకలు పెరుగుతాయి.

బట్ట తలకు శాశ్వత పరిష్కారం – జుట్టు మార్పిడి!

బట్టతలకు ఇతరత్రా చికిత్సలు, పద్ధతులేవైనా తాత్కాలికమే. ఉత్తమమైన, శాశ్వతమైన పరిష్కారం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఇందులో తలలో ఒక చోట ఉన్న వెంట్రుకలను తీసి బట్టతల ఉన్న భాగంలో నాటుతారు. సాధారణంగా తల వెనక ఉన్న వెంట్రుకలను నాటుతారు.

అవసరమైతే గడ్డం, ఛాతీ వంటి భాగాల నుంచి తీసి తలపై అమర్చొచ్చు. బట్టతల మామూలుగా ఉన్నట్టయితే ఒక రోజులోనే ప్రక్రియ పూర్తవుతుంది. మరీ ఎక్కువగా ఉంటే నెల తర్వాత మరోసారి నాటాల్సి ఉంటుంది. మన వెంట్రుకలు ఒక వైపునకు వాలి ఉంటాయి.

నాటేటప్పుడూ అలాగే అమర్చుతారు. దీంతో సహజంగా కనిపిస్తుంది. తల వెనుక భాగంలో జుట్టు ఎంతో బలంగా ఉంటుంది కనుక అక్కడ నుండి తీసి నాటిన చోట కూడా జుట్టు బలంగా పెరుగుతుంది. చికిత్స అనంతరం జుట్టు త్వరగా, మందంగా పెరగటానికి మందులను ఉపయోగించాల్సి ఉంటుంది.

ట్రాన్స్‌ప్లాంటేషన్ యొక్క పద్ధతులు

స్ట్రిప్ (ఎఫ్యూటీ) పద్ధతి

ఇందులో ఒక్కొక్క వెంట్రుకను తీసి బట్టతల మీద నాటుతారు. తల వెనక ఆక్సిపిటల్ భాగంలో వెంట్రుకలు ఉన్నచోట సుమారు 5-15 సెంటీమీటర్ల చర్మం ముక్కను కత్తిరించి, పక్కన పెడతారు. కుట్లు వేసి కోతను మూసేస్తారు. తర్వాత పక్కన పెట్టిన చర్మంలోని వెంట్రుకలను ఒక్కొక్కటిగా తీసుకొని బట్టతల ఉన్న చోట నాటుతారు.

ఎఫ్యూఈ (ఫాలిక్యులార్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్) పద్ధతి

వెంట్రుకల కుదుళ్లను విడివిడిగా నాటడం దీని ప్రత్యేకత. మన వెంట్రుకల కుదుళ్లలో 2-5 వెంట్రుకలు గుంపుగా ఉంటాయి. ఇలాంటి గుంపులను అక్కడక్కడ్నుంచి తీసి, ప్రత్యేక ద్రవంలో భద్రపరుస్తారు. అనంతరం బట్టతల ఉన్న చోట అమరుస్తారు.

ఇందులో చర్మాన్ని కత్తిరించటమనేది ఉండదు. అందువల్ల మచ్చ పడదు. నొప్పి తక్కువ. ప్రస్తుతం రోబోటిక్ పద్ధతిలోనూ దీన్ని చేస్తున్నారు. అవసరమైతే కొందరికి ఈ రెండు పద్ధతులతోనూ వెంట్రుకలను నాటుతారు.

Posted on

Benefits of neem oil in Telugu – అందం కోసం వేప నూనె ని ఎలా ఉపయోగించాలి?

ప్రతి ఒక్కరూ అందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. అందం మరియు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి వ్యక్తిగత సంరక్షణ చాలా అవసరం. రోజువారీ సంరక్షణ అనగానే మనకు తోచే మొదటి విషయం ఆయుర్వేదం. మన భారతదేశం ఆయుర్వేదం లో ఎంతో ప్రఖ్యాతి చెందిన దేశం. ఎన్నో మూలికలు లభించే దేశమిది. ప్రతి చెట్టు, వాటి యొక్క ఆకులూ మరియు కొమ్మల్లో ఉండే ఔషధ గుణాలు తెలిసిన వాళ్ళు ఎందరో ఉండే వారు. ఇంగ్లీష్ మందులు సులభంగా లభించటం వలన కాలం మారే కొద్ది ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. కానీ అటువంటి పరిస్థితులు మారి ప్రస్తుత జనరేషన్ లోని యువతీ యువకులు మన ప్రాచీన పద్ధతులను అనుసరించటం మల్లీ మొదలు పెట్టారు.

మన ఆయుర్వేదంలో ఆరోగ్యం కొరకు అలాగే సౌందర్యం కొరకు ప్రసిద్ధి చెందిన మూలికల్లో ఒకటి ‘వేప’. అమ్మమ్మలు తాతయ్యలు ఉన్న కాలంలో వేప చెట్టు లేని వీధి ఉండేది కాదు. ప్రస్తుత కాలంలో కూడా ఎన్నో గ్రామాలలో వీధికి కనీసం ఒక వేప చెట్టుని చూస్తూనే ఉంటాము. మన తెలుగు సంప్రదాయంలో వేపాకు చెట్టు అనగానే గుర్తొచ్చేది ఉగాది. ఉగాది పచ్చడి చేసేందుకు వేప పూలను ఉపయోగిస్తాం. మన పూర్వీకులు వేప పూలనే కాదు వేప ఆకులూ మరియు చిన్న చిన్న వేప కాడలను కూడా ఉపయోగించేవారు. వీటిని ఉపయోగించటం వలన ఎంతో ధృఢంగా ఆరోగ్యంగా మరియు అందంగా ఉండేవారు. వేపాకులను ఇన్ఫెక్షన్, అమ్మోరు వంటి అనేక వైద్యాలకు ఉపయోగిస్తారన్న విషయం మన అందరికీ తెలిసిందే. వేప నుండి తయారు చేసిన నూనె ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తోంది. మరి మన ఆరోగ్యం మరియు అందం యొక్క సంరక్షణ కొరకు వేప చమురు ఎలా ఉపయోగపడుతుందో ఈ వ్యాసం లో వివరంగా తెలుసుకుందాం.

అందం సంరక్షణ కోసం వేప నూనె

 1. బ్లాక్ హెడ్స్ తొలగించేందుకు : వేప నూనె ని రెగ్యులర్ గా ఉపయోగిస్తే బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ను తొలగించి, తిరిగి రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
  ప్రక్రియ : కొంత నీటిలో కొన్ని చుక్కల వేప నూనె ని కలిపి డైల్యూట్ చేసుకోవాలి. మృదువైన చర్మం పొందేందుకు రోజుకు ఒకసారి బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ పై రాయండి.
 2. వేప నూనె తో మొటిమలు తగ్గించండి : వేప నూనె లో ఫ్యాటీ ఆసిడ్స్ మరియు ఆస్పిరిన్ సమ్మేళనాలు ఉంటాయి. అవి మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి.
  ప్రక్రియ : మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకొని కొన్ని చుక్కల వేప నూనెని మీ ముఖంపై దరఖాస్తు చేసుకోండి. మొటిమలను తగ్గించడానికి రోజుకు రెండు సార్లు రాసుకోవచ్చు.
 3. హైపర్-పిగ్మెంటేషన్ ని తగ్గించేందుకు వేప నూనె : చర్మంలో నలుపు రంగును ఉత్పత్తి చేసే మెలనిన్ యొక్క ఉత్పత్తిని వేప నూనె ఆపుతుంది. తద్వారా హైపర్-పిగ్మెంటేషన్ ని తొలగిస్తుంది.
  ప్రక్రియ : ముఖాన్ని శుభ్రం చేసుకుని వేప నూనెని క్రమం తప్పకుండా రాయటం వలన హైపర్-పిగ్మెంటేషన్ పై మెరుగైన ప్రభావం చూపుతుంది.
 4. ముడతలను వదిలించుకోడానికి వేప : చర్మం పై ఏర్పడే ముడతలను తొలగించటానికి వేప నూనె సహాయ పడుతుంది. ఇది చర్మం యొక్క రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
  ప్రక్రియ : ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు వేప నూనెని ముడతలపై రాయటం మర్చిపోకండి.
 5. యాంటీ ఏజింగ్ సీరం : చర్మం యొక్క సౌందర్యాన్ని కాపాడి మడతలు మొదలైన ఏజింగ్ లక్షణాలను తగ్గించేందుకు అవసరమైన సమ్మేళనాలు వేప నూనె లో ఉంటాయి.
  ప్రక్రియ : మీరు ఉత్తమ ఫలితాన్ని పొందేందుకు ప్రతి రోజు వేప నూనెని నైట్ క్రీం వలే ఉపయోగించండి.

చర్మ సంరక్షణ కోసం వేప నూనె

 1. రింగ్ వార్మ్ చికిత్స : వేప నూనె లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ వల్ల సంభవించే తమర చికిత్సకు ఒక అద్భుతమైన పరిహారం. ఈ చికిత్స కొరకు వేప నూనెతో పాటు వేప గింజలు మరియు ఆకుల సారాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు.
  ప్రక్రియ : కొన్ని చుక్కల వేప నూనె లేదా ఆకులు మరియు విత్తనాల యొక్క సారం ని పత్తి సాయంతో ప్రభావిత ప్రాంతంపై రోజుకు 2-3 సార్లు దరఖాస్తు చేయండి.
 2. ఇన్ఫెక్షన్ గల గోరులను క్యూర్ చేసేందుకు : ఒరేగానో నూనెతో పాటు వేప నూనెని ఉపయోగించటం వలన ఇన్ఫెక్షన్ సోకిన గోర్లు లేదా దురదగా ఉండే కాలి వేళ్ళు నయం అవుతాయి.
  ప్రక్రియ : వేప నూనె మరియు ఒరేగానో నూనె ని సమాన భాగాలుగా కలుపుకోండి. బాగా కలిపిన తరువాత ఇన్ఫెక్షన్ సోకిన చర్మం మరియు గొర్ల పై దరఖాస్తు చేసుకోవాలి. ఇలా రోజుకు 2-3 సార్లు రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
 3. ఫైన్ లైన్స్ తగ్గించేందుకు వేప నూనె : చర్మం పై ఫైన్ లైన్స్ ని తగ్గించి, మృదువైన, ఆకర్షణీయమైన చర్మాన్ని పొందటానికి వేప నూనెని ఉపయోగించవచ్చు.
  ప్రక్రియ : రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల వేప నూనెని చర్మం పై రాసి మసాజ్ చేయండి. ప్రతి రోజు ఈ నూనెని రాయటం వలన మంచి ఫలితం ఉంటుంది.
 4. చర్మ వ్యాధుల చికిత్స కొరకు వేప నూనె : వేప నూనె లో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి కనుక ఇది దాదాపు అన్ని రకాల చర్మ సమస్యలతో పోరాడుతుంది.
  ప్రక్రియ : ఎలాంటి చర్మ సమస్యనైనా గుణ పరిచేందుకు ప్రతి రోజు వేప నూనెని రాయండి. పూర్తిగా నయం అయ్యే వరకు రోజుకు కనీసం 2 సార్లు రాయండి.
 5. గజ్జిని తగ్గించేందుకు వేప నూనె : వేప నూనె సహాయంతో మీ గజ్జి సమస్యను తగ్గించగలరు.
  ప్రక్రియ : గజ్జి ఉన్న ప్రాతంపై వేప నూనెని రోజుకు కనీసం 2-3 సార్లు రాయండి.
 6. చర్మం యొక్క ఎలాస్టిసిటీ ని మెరుగుపర్చేందుకు వేప నూనె :  విటమిన్ ఇ మరియు ఫ్యాటీ ఆసిడ్స్ అనే రెండు ప్రధాన పదార్ధాలు నీమ్ ఆయిల్ లో ఉన్నాయి. ఇది చర్మం యొక్క ఎలాస్టిసిటీ ని పెంచి మాయిశ్చర్ ని రీటైన్ చేస్తుంది.
  ప్రక్రియ : మంచి ఫలితాలను చూడడానికి వేప నూనె లేదా వేపాకు యొక్క సారం ని రోజుకు రెండు సార్లు రాయండి.
 7. చర్మం పై చిన్న గాయాలకు చికిత్స చేయడానికి : వేప నూనెలో లభించే క్రిమినాశక మరియు శోథనిరోధక లక్షణాలు చర్మ గాయాలను చికిత్స చేయడానికి సహాయపడుతుంది.
  ప్రక్రియ : గాయమైన చర్మంపై వేప నూనె లేదా నున్నటి వేపాకు పేస్ట్ ని అప్‌లై చేయండి. రోజుకు రెండుసార్లు రాయటం వలన మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు సంరక్షణ కోసం వేప నూనె

ప్రతి ఒక్కరూ అందమైన, ఆరోగ్యమైన మెరిసే కురులు పొందాలని ఆరాటపడతారు. అలాంటి అందమైన కేశాలను పొందేందుకు వేప నూనె ఎంతో సహాయ పడుతుంది. మరి వేప నూనెని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

 1. అకాలంలో వెంట్రుకలు నెరవడాన్ని ఆపుతుంది : హార్మోన్ల మార్పుల వలన ఏర్పడే తెల్ల జుట్టుని గమనిస్తే వేప నూనెని ఉపయోగించి ఉపశమనం పొందగలరు.
  ప్రక్రియ : ప్రతి రోజు వేప నూనెని రాయటం అలవాటు చేసుకోండి. ఈ నూనెని రాయటం వలన తెల్ల జుట్టుని నివారించి పోషణ అందిస్తుంది.
 2. స్కాల్ప్ కి పోషణ అందించేందుకు వేప నూనె : నీమ్ ఆయిల్ లో మీ స్కాల్ప్ కి పోషణ అందించి కురులు ఆరోగ్యంగా మరియు మృదువుగా పెరగటానికి సహాయపడే ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి.
  ప్రక్రియ : వేప నూనెతో మీ స్కాల్ప్ ని మసాజ్ చేయండి మరియు జుట్టు మొత్తం రాసి రాత్రంతా వదిలేయండి. ఉదయం తేలికపాటు షాంపూతో తల స్నానం చేయండి.
 3. దురద నుండి ఉపశమనం కొరకు వేప నూనె : డాండ్రఫ్ వలన స్కాల్ప్ పై దురద మరియు మంట ఏర్పడుతుంది. వేప నూనెని ఉపయోగించి దురద చర్మాన్ని వ్యవహరించడం మంచిది.
  ప్రక్రియ : వేప చమురును మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి తల స్నానం చేయొచ్చు. లేదా వారానికి రెండు సార్లు రాత్రి పడుకునే ముందు తలపై రాసి ఉదయం తల స్నానం చేయండి. వేపాకుతో తయారు చేసుకునే హెయిర్ ప్యాక్ ని కూడా స్కాల్ప్ మరియు జుట్టు పై రాసి గంట సేపు తరువాత తల స్నానం చేయొచ్చు.

చర్మం, జుట్టు, అందం మరియు ఆరోగ్యం వంటి పలు సమస్యలను నివారించగల సామర్ధ్యం వేపలో ఉంటుంది. అన్ని రకాల సమస్యలను తొలగించేందుకు వేప యొక్క సారాన్ని ఉపయోగించి తయారు చేసే ఉత్పత్తులను కూడా మీరు ఉపయోగించవచ్చు. పై చెప్పినటువంటి ప్రయోగాలకు వేప నూనె లేదా వేపాకు సారాన్ని లేదా వేప ఉత్పత్తులను ఉపయోగించి మంచి ఫలితాలను పొందండి.

Posted on

Vinegar Beauty Benefits in Telugu – వినిగర్ యొక్క బ్యూటీ బెనిఫిట్స్

కారమైన వంటల్లో మరియు సలాడ్లలో ఉపయోగించే వినిగర్ ని చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మం మరియు కురుల పై ప్రభావితంగా పనిచేస్తుంది. వినిగర్ అసిడిక్ స్వభావం కలిగి ఉంటుంది. సరైన మార్గంలో ఉపయోగించినప్పుడు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. మార్కెట్లో వివిధ రకాలైన వినిగర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంచుమించు అన్నీ ఒకే రకమైన ఫలితాలను అందిస్తాయి. కానీ చర్మం, జుట్టు మరియు శరీర సంరక్షణ విషయానికి వస్తే ప్రత్యేకించి ఆపిల్ సీడర్ వినిగర్ ను ఎంచుకోవటం మంచిది. ఎందుకంటే ఆపిల్ సీడర్ వినిగర్ లో ఎసిటిక్ ఆసిడ్ యొక్క గాఢత సమతుల్యంగా ఉంటుంది కనుక అధిక ప్రయోజనాలను అందిస్తుంది. వినిగర్ యొక్క అద్భుతమైన సౌందర్య లాభాల గురించి మరియు మీ రోజువారీ సౌందర్య సంరక్షణంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోడానికి ఈ వ్యాసం ని పూర్తిగా చదవండి.

 1. స్కిన్ టోనింగ్ కొరకు వినిగర్ : చర్మాన్ని శుద్ది చేయటానికి, టోన్ చేయటానికి మరియు మాయిశ్చరైజ్ చేయటానికి ప్రతిరోజు టోనర్ ని ఉపయోగిస్తూ ఉంటాము. మీ రెగ్యులర్ టోనర్ కి బదులు వినిగర్ ని ఉపయోగించటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. కానీ ముఖ్యమైన విషయం – సరైన శాతంలో దీన్ని డైల్యూట్ చేయటం మరచిపోవద్దు.
  ఒక టేబుల్ స్పూన్ వినిగర్ ని 3 టేబుల్ స్పూన్లు తాజా నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని పత్తిని ఉపయోగించి మీ ముఖం మీద రాయండి. ఒక టోనర్ లాగా మీ చర్మంపై ఈ నీటిని మృదువుగా అప్‌లై చేయండి. మీకు వాసన నచ్చకపోతే 5 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవచ్చు.
 2. చర్మం పై మరకలు మచ్చలను (ఫ్రికల్స్) తొలగించేందుకు వినిగర్ : కొన్ని మచ్చలు శాశ్వతమని, తొలగించటం కష్టమని అంటారు. కానీ వాటిని తొలగించడంలో వినిగర్ సమర్థవంతంగా పని చేస్తుంది. చిన్న చిన్నగా ఉండే మచ్చలను తొలగించేందుకు అల్పా హైడ్రాక్సీ ఆసిడ్ పుష్కలంగా ఉండే ఆపిల్ సీడర్ వినిగర్‌ను ఉపయోగించండి. ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మ సౌందర్య ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఇది ఏజ్ స్పాట్స్ మరియు మచ్చల చికిత్సకు చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. ఈ ప్రయోజనం కోసం వినిగర్ ని డైల్యూట్ చేయకుండానే ఉపయోగించవచ్చు. ఒక ఇయర్ బడ్ సహాయంతో మచ్చలపై వినిగర్ ని రాయండి. మంచి ఫలితాల కోసం 4 నెలల పాటు ప్రతిరోజూ వినిగర్ ని రాయండి.
 3. స్కిన్ సూతింగ్ కొరకు వినిగర్ : వినిగర్ లో ఆసిడ్ స్వభావం ఉంటుంది మరియు మన చర్మం కూడా కొద్దిగా యాసిడ్ pH కలిగి ఉంటుంది. కనుక, ఎర్రబడిన మరియు దురద చర్మం నుండి వినిగర్ చాలా సమర్థవంతంగా ఉపశమనాన్ని అందిస్తుంది. మీ శరీరం మీద సన్ బర్న్ ఉన్నట్లయితే మీరు స్నానం చేసే నీటిలో ఒక కప్పు వినిగర్ ని కలిపి 10-15 నిమిషాల పాటు ఆ నీటిలో శరీరాన్ని నానపెట్టండి. ఇది చర్మం యొక్క సహజ PH స్థాయులను తిరిగి పొందేందుకు సహాయపడుతుంది మరియు శరీరానికి ఉపశమనాన్ని అందిస్తుంది.
 4. మొటిమలను తొలగించేందుకు వినిగర్ : ఆపిల్ సీడర్ వినిగర్ మాలిక్ యాసిడ్ కలిగి ఉంటుంది మరియు ఇది వినిగర్ కి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను ఇస్తుంది. అందుకే మొటిమల చికిత్సలో వినిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం నుండి అదనపు జిడ్డును కూడా వినిగర్ తొలగిస్తుంది. రంధ్రాలను శుభ్ర పరుస్తుంది మరియు చర్మం యొక్క ph స్థాయులను బాలన్స్ చేస్తుంది. తద్వారా మొటిమల చికిత్సకు చాలా ప్రభావితంగా పనిచేస్తుంది.
 5. రేజర్ గడ్డలకు వినిగర్ తో ఉత్తమ చికిత్స : మీరు రేజర్ ని ఉపయోగించిన తరువాత వాటి వలన కలిగిన గాయాలనుండి ఉపశమనం పొందేందుకు వినిగర్ ని ఉపయోగించవచ్చు. వినిగర్ లో యాంటీ ఇంఫ్లమ్మెటరి లక్షణాలు ఉన్నందున చర్మంపై కలిగిన రేజర్ గాయాలనుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది చర్మం యొక్క ph స్థాయులను బాలన్స్ చేసి రేజర్ బంప్స్ ని పూర్తిగా క్యూర్ చేస్తుంది. వినిగర్ లో అసిడిక్ నేచర్ ఉన్నందున ఇన్ గ్రోన్ హెయిర్ ని తొలగించటంలో కూడా సహాయపడుతుంది.
 6. డాండ్రఫ్ చికిత్స కోసం వినిగర్ : డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆపిల్ సీడర్ వినిగర్ ని ఉపయోగించండి. ఇందులో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నందున డాండ్రఫ్ ని పూర్తిగా తొలగిస్తుంది. వినిగర్ ని నీటిని సమాన మొత్తాల్లో కలిపి మాడు పై రాసి మసాజ్ చేయండి. మృదువుగా మసాజ్ చేసిన తరువాత 2 నిమిషాలు ఉంచి నీటితో కడగండి.
 7. మాడు పై దురదను క్యూర్ చేసేందుకు వినిగర్ : స్కాల్ప్ పై దురద ఎంతో ఇబ్బంది పెడుతుంది. అంతే కాదు ఇది హెయిర్ ఫాల్ కి దారి తీస్తుంది. వినిగర్ యొక్క అసిడిక్ ph స్కాల్ప్ కు సహజ ph స్థాయులను అందించి ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. వినిగర్ ని డైల్యూట్ చేసి మాడు పై రాసి మసాజ్ చేయండి. ఆ తరువాత షాంపూ తో తల స్నానం చేయండి. ఇలా మొదట్లో వారానికి రెండు సార్లు ఆ తరువాత వారానికి ఒక సారి చేస్తూ ఉంటే మంచి ఫలితాలను పొందుతారు. దురద తగ్గుతుంది మరియు స్కాల్ప్ కూడా శుభ్రం అవుతుంది.
 8. మృదువైన జుట్టు కొరకు వినిగర్ : మృదువైన మెరిసే జుట్టుని పొందేందుకు వినిగర్ ఒక ఉత్తమమైన సహజ పదార్థం. తల స్నానం చేసిన తరువాత ఒక టేబుల్ స్పూన్ వినిగర్ ని ఒక మగ్గు నీటిలో కలిపి ఆ నీటితో జుట్టుని కడగాలి. ఆ తరువాత తుడిచి ఆరపెట్టాలి. జుట్టు బాగా ఆరిపోయిన తరువాత వినిగర్ యొక్క వాసన కూడా పోతుంది మరియు జుట్టు మృదువుగా మెరుస్తూ అందంగా అవుతుంది.
 9. పాదాల దుర్వాసనను తొలగించేందుకు వినిగర్ : ఎక్కువ గంటలు బూట్‌లను వేసుకునే అలవాటు ఉన్న వారి పాదాలు దుర్వాసన కలిగి ఉంటాయి. పాదాలలో ఏర్పడే చెమట చర్మపు రంధ్రాలలో పేరుకుపోవడమే ఇందుకు కారణం. మరి ఈ దుర్వాసనను తొలగించడానికి వినిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కప్పు వినిగర్ లో నాలుగు కప్పులు వెచ్చని నీరు కలిపి ఆ నీటిలో 15 నిమిషాల పాటు మీ పాదాలను నానపెట్టండి. రెగ్యులర్ గా ఇలా చేయటం వలన పాదాలలో దుర్వాసన పూర్తిగా పోతుంది.
 10. ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ ని క్యూర్ చేసేందుకు వినిగర్ : కొంత పత్తి తీసుకుని డైల్యూట్ చేసిన ఆపిల్ సీడర్ వినిగర్ లో ముంచి ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ ఉన్న చోట అప్‌లై చేయండి. ఆపిల్ సీడర్ వినిగర్ లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది.
 11. బరువు తగ్గడానికి వినిగర్ : మీ బరువు తగ్గడానికి కూడా వినిగర్ సహాయపడుతుంది, ముఖ్యంగా ఆపిల్ సీడర్ వినిగర్. ఆపిల్ సీడర్ వినిగర్ లో అధిక మొత్తంలో పెక్టిన్ ఉంటుంది. ఇది మీ ఆకలిని సమర్థవంతంగా అణిచి వేస్తుంది. ఇందులో అసిడిక్ నేచర్ ఉండటం వలన జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది మరియు అదనపు కొవ్వును కరిగిస్తుంది.
  రెండు టేబుల్ స్పూన్ వినిగర్ ని ఒక గ్లాస్ నీటిలో కలిపి ప్రతి పూట భోజనం ముందు త్రాగండి. ఇలా రోజుకు 3 సార్లు త్రాగటం వలన నెల రోజుల్లో మంచి ఫలితాలను పొందుతారు.

చర్మం, జుట్టు మరియు శరీర సంరక్షణ కోసం వినిగర్ ని ఉపయోగించేందుకు ముఖ్యమైన చిట్కాలు

 • చర్మం మరియు జుట్టు సంరక్షణ కోసం సింథటిక్ వినిగర్ కి బదులుగా ఆపిల్ సీడర్ వినిగర్ ని ఉపయోగించండి. ఆపిల్ సీడర్ వినిగర్ ని ఆపిల్ పండు యొక్క ఎక్సట్రాక్ట్స్ తో తయారు చేస్తారు కాబట్టి పండులోని పోషకాలు అందులో ఉంటాయి. సింథటిక్ వినిగర్ లతో పోల్చుకుంటే ఇందులో ఆసిడ్ నేచర్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి చర్మానికి ఎంతో సురక్షితమైనది.
 • అసిడిక్ నేచర్ తక్కువే అయినప్పటికీ మీ చర్మం, జుట్టు మరియు మాడు పై ఉపయోగించేటప్పుడు 50% నీటిలో డైల్యూట్ చేసి ఉపయోగించాలి. ఉపయోగానికి తగినట్టు టీ డికాషన్ లో కూడా డైల్యూట్ చేసుకోవచ్చు. వినిగర్ ని ఉపయోగించే ముందు డైల్యూట్ చేయటం చాలా ముఖ్యం.

మీకు సెన్సిటివ్ స్కిన్‌ ఉన్నట్లయితే వినిగర్ ని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి. ముఖం పై రాసే ముందు చేతి పై ఒక చిన్న భాగంలో ఉపయోగించి చూడండి. ఎటువంటి మంటా, రెడ్నెస్ మరియు దురద కలగకపోతే ముఖంపై మరియు మాడు పై ఉపయోగించండి.

Posted on

Yogurt face packs & masks – చర్మ సౌందర్యానికి పెరుగు తో ఫేస్ మాస్క్ మరియు ఫేస్ ప్యాక్

భారత దేశంలో ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఆరోగ్యమైన ఆహార పదార్థాలలో పెరుగు కూడా ఒకటి. పెరుగు ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఆహార పదార్థం. మార్కెట్ లో లభించే తియ్యని పెరుగు కంటే ఇంట్లో తయారు చేసుకునే పుల్లని పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వంద గ్రాముల పెరుగు లో 2000 కేలరీల ఎనర్జీ ఉంటుంది. అంతే కాదు పెరుగుని చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగించవచ్చు. మరి పెరుగును ఉపయోగించటం వలన చర్మానికి కలిగే మేలు మరియు ఈ పదార్థాన్ని ఉపయోగించి మనం ఇంట్లోనే తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ మరియు మాస్క్ వివరాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

పెరుగు యొక్క స్కిన్ కేర్ బెనిఫిట్స్

పెరుగు అనేక చర్మ సమస్యలను తొలగించేందుకు సహాయపడుతుంది. ఇది జిడ్డు చర్మం, పొడి చర్మం, సెన్సిటివ్ చర్మం, అన్ని రకాల చర్మం కల వారికీ ఉపయోగపడుతుంది. ఇందులో ప్రోటీన్, జింక్, విటమిన్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నందున ఇది చర్మం మీద ఎన్నో అద్భుతాలను చేస్తుంది.

 • చర్మం పై ఉన్న టాన్ ని తొలగిస్తుంది. చర్మం యొక్క రంగుని మెరుగు పరుస్తుంది.
 • చర్మ రంధ్రాలను శుభ్రపరచి ఆక్టివేట్ చేస్తుంది.
 • ముఖంపై ఉండే ఏజ్ స్పాట్స్ ని తొలగిస్తుంది కనుక ఇది ఒక యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియెంట్.
 • చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
 • ఇది చర్మాన్ని అద్భుతంగా కాంతివంతంగా మరియు ప్రకాశవంతంగా చేస్తుంది.
 • ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది.
 • పెరుగు గ్రేట్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. పెరుగు లో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్‌ సెల్స్ ను తొలగిస్తుంది.
 • పెరుగు ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అయ్యేందుకు సహాయ పడుతుంది.
 • చర్మ సమస్యలకు మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను పెరుగు నాశనం చేస్తుంది.
 • జిడ్డు చర్మం ఉన్న వారిలో ఆయిల్ ప్రొడక్షన్ ను నియంత్రిస్తుంది.
 • పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్, ప్యాథోజెనిక్, బ్యాక్టీరియా ను నాశనం చేసి చర్మం కాంతివంతంగా మెరుస్తుండేట్లు చేసి రేడియంట్ స్కిన్‌ ని అందిస్తుంది.
 • పెరుగు కళ్ల క్రింద డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది.
 • ఎండ వేడికి కమిలిన చర్మాన్ని క్యూర్ చేసి స్మూత్ గా చేస్తుంది. అంతే కాదు చర్మం పై ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది మరియు చర్మంలో నేచురల్ ఆయిల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

ఇంట్లోనే తయారు చేసుకునే పెరుగు ఫేస్ ప్యాక్ మరియు ఫేస్ మాస్క్

పెరుగు వళ్ళ కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నాం కదా. మరి పెరుగుని ఉపయోగించి మన ఇంట్లో సులభంగా లభించే పదార్థాలను జోడించి తయారు చేసుకునే కొన్ని ఫేస్ మాస్క్ మరియు ప్యాక్స్ ని చూద్దాం.

 1. పెరుగు – శనగ పిండి ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో 3 టేబుల్ స్పూన్ పెరుగు 3 టేబుల్ స్పూన్ శనగ పిండి ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ను ముఖం పై అప్‌లై చేసి 15-20 నిముషాలు అలాగే ఉంచాలి. 20 నిముషాల తర్వాత చల్లని నీటితో వాష్ చేసుకోండి. ఇది పొడి చర్మం ఉన్న వారికి ఉత్తమమైన ప్యాక్. ఈ ప్యాక్ చర్మానికి ఇన్స్టంట్ గ్లో ని అందిస్తుంది. అంతే కాదు క్రమంగా రాసుకుంటే నల్లని మచ్చలను కూడా తొలగిస్తుంది.
 2. ఆలివ్ ఆయిల్ – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో 3 టేబుల్ స్పూన్ పెరుగు 2-3 టేబుల్ ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ను ముఖం పై అప్‌లై చేసి 10 నిముషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లని నీటితో వాష్ చేసుకోండి. పెరుగు లోని లాక్టిక్ ఆసిడ్ చర్మంపై ఉండే ముడతల్ని మొటిమల్ని తొలగిస్తుంది.
 3. ఆరంజ్ పీల్ పొడి – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో 4 టేబుల్ స్పూన్ పెరుగు 2 టేబుల్ స్పూన్ ఆరంజ్ పీల్ పొడి లేదా లెమన్ పీల్ పొడి వేసి కావల్సినంత నీటిని కలిపి ఒక పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత నీటితో కడగండి. పెరుగు మరియు ఆరంజ్ యొక్క మిశ్రమం చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. క్రమంగా ఈ ప్యాక్ ని వాడటం వలన చర్మం యొక్క రంగు మెరుగవుతుంది.
 4. ముల్తానీ మట్టి – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో 3 టేబుల్ స్పూన్ పెరుగు 2 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి 1 స్పూన్ నిమ్మరసం కలిపి ఒక పేస్ట్ లా చేసుకోండి. ఈ పేస్ట్ ని ముఖం పై రాసి 10 నిమిషాల తరువాత నీటితో కడగండి. ముల్తానీ మట్టి స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. ఇది చర్మం యొక్క జిడ్డు మరియు డెడ్ సెల్స్ ని తొలగించి మచ్చలను తగ్గిస్తుంది.
 5. నిమ్మ – తేనె – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో 3 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ తేనె మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలిపి ముఖం మరియు మెడ పై రాయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని శుభ్రపరచి ఇన్స్టంట్ గ్లో ని అందిస్తుంది.
 6. గోధుమ ఊక – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో 2 స్పూన్ పెరుగు 1 స్పూన్ గోధుమ ఊక కలిపి ముఖం పై రాసి 20 నిమిషాల తరువాత స్క్రబ్ చేస్తూ నీటితో శుభ్రం చేయాలి. గోధుమ ఊక ఒక అద్బుతమైన ఎక్స్ ఫ్లోయేటర్. ఈ ప్యాక్ ని రెగ్యులర్ గా వాడటం వలన డెడ్ స్కిన్‌ ని మరియు పిగ్మెంటేషన్ ని క్యూర్ చేస్తుంది. పొడి చర్మం ఉన్న వారికి ఇది ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్.
 7. దాల్చిన చెక్క – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో ఒక స్పూన్ దాల్చిన చెక్క 2 స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి. దాల్చిన చెక్క చర్మానికి ఎన్నో మంచి ఫలితాలను అందిస్తుంది. ఫైన్ లైన్ ని నివారిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మొటిమలను తొలగిస్తుంది. పెరుగుతో కలిపి వాడినట్లయితే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
 8. పెరుగు – తేనె ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో పెరుగు మరియు తేనె ని సమాన మోతాదులలో కలిపి ముఖం పై రాసి 10 నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో కడగండి. ఇది అన్ని రకాల చర్మానికి తగిన ఫేస్ ప్యాక్. ఈ ప్యాక్ ని వేసుకోవటం వలన చర్మం యవ్వనంగా గ్లో అవుతుంది.
 9. పసుపు – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక టీ స్పూన్ పెరుగులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. రెండూ మిక్స్ అయిన తర్వాత ముఖానికి అప్‌లై చేసి 10 నిముషాలు అలాగే ఉంచి ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇదే విధంగా వారంలో రెండు మూడు సార్లు రిపీట్ చేస్తే డార్క్ స్పాట్స్ పూర్తిగా తొలగిపోతాయి.
 10. పెరుగు – టమోటా ఫేస్ ప్యాక్ : రెండు స్పూన్ పెరుగు మరియు 2 స్పూన్ టమోటా జ్యూస్ ని కలిపి ముఖంపై రాసి 10 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని వారాలు చేయటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మం యొక్క రంగు మెరుగవుతుంది. పెరుగు లో కలిపిన టమోటా నేచురల్ బ్లీచ్ లా పని చేస్తుంది.
 11. బియ్యం పిండి – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక టీ స్పూన్ పెరుగు ఒక టీ స్పూన్ తేనె ని ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 15-20 నిముషాలు ఫేస్ ప్యాక్ ను అలాగే ఉంచి 20 నిముషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మంలో మొటిమల సమస్య తగ్గుతుంది.
 12. గంధపు పొడి – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక బౌల్ లో 1 స్పూన్ గంధపు పొడి 2 స్పూన్ పెరుగు కలిపి ముఖంపై రాసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇది అన్ని రకాల చర్మానికి అనుకూలమైన ఫేస్ ప్యాక్. ఈ ప్యాక్ ని వాడటం వలన చర్మం ప్రకాశవంతంగా అవుతుంది.
 13. తులసి ఆకులు – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక పిడికెడు తులసి ఆకులను బాగా నూరి పేస్ట్ చేసుకొని అందులో కొంత పెరుగుని కలిపి ముఖం పై రాయాలి. రాసిన 15 నిమిషాల తరువాత నీటితో కడగాలి. తులసి చర్మం పై ఉండే మొటిమలను తొలగిస్తుంది. ఇది మొటిమలను కలిగించే బాక్టీరియాతో పోరాడుతుంది. తులసి యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది.
 14. దోసకాయ – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక టీ స్పూన్ పెరుగును ఒక టీ స్పూన్ దోసకాయ పేస్ట్ లో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్‌లై చేసి 15 నిముషాలు ఉంచి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మంలో డెడ్ సెల్స్ తగ్గిస్తుంది.
 15. పెరుగు – కలబంద ఫేస్ ప్యాక్ : ఒక టీ స్పూన్ పెరుగులో రెండు టీ స్పూన్ల అలోవెర జెల్ వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్‌లై చేయాలి. 10 నిముషాలు ఫేస్ ప్యాక్ ను అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇదే విధంగా వారంలో రెండు మూడు సార్లు రిపీట్ చేయండి. ఇది చర్మం పై ఉండే డెడ్ సెల్స్ ని తొలగించి ఇన్ స్టంట్ గ్లో ని అందిస్తుంది.
 16. పెరుగు – ఫ్లాక్ సీడ్స్ ఫేస్ ప్యాక్ : ఒక బౌల్లో నీళ్ళు పోసి అందులో ఫ్లాక్ సీడ్స్ ను (అవిసె గింజలను) 6-7 గంటలు నానబెట్టాలి. మరుసటి రోజున వీటిని మెత్తగా పేస్ట్ చేసి, అందులో రెండు స్పూన్ల పెరుగు మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకొని 10-15 నిముషాలు ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఈ ప్యాక్ ను వేసుకుంటే పిగ్మెంటేషన్ ని తొలగిస్తుంది.
 17. ఓట్ మీల్ – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక టీ స్పూన్ పెరుగులో ఒక టీ స్పూన్ ఓట్ మీల్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్‌లై చేసి 5 నిమిషాలు మసాజ్ చేయాలి. ఆ తరువాత 20 నిముషాలు ఉంచి మంచి ఫేషియల్ క్లెన్సర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకసారి ట్రై చేస్తే బ్లాక్ హెడ్స్ సమస్య ఉండదు.
 18. పెరుగు – ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్ : ఒక గుడ్డులోని వైట్ ను బౌల్లో తీసుకుని అందులో ఒక టీ స్పూన్ ఫ్రెష్ పెరుగు మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేషియల్ ప్యాక్ లా వేసుకోవాలి. 15 నిముషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒక సారి ఈ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల యంగర్ లుక్ ను మీ సొంతం చేసుకుంటారు.
 19. కోకనట్ మిల్క్ – పెరుగు ఫేస్ ప్యాక్ : ఒక టీ స్పూన్ పెరుగులో ఒక టీ స్పూన్ కొబ్బరి పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంలోని డార్క్ స్పాట్స్ మీద అప్‌లై చేయాలి. 15-20 నిముషాలు అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను రోజూ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి.
Posted on

Best pedicure tips in Telugu – మహిళలకు ఉత్తమ పెడిక్యూర్ చిట్కాలు

స్త్రీలు అందంగా కనపడేందుకు ఎన్నో రకాల బ్యూటీ కేర్ తీసుకుంటారు. కురులు కొరకు, ముఖం కొరకు, చర్మం పై మచ్చల కొరకు, పింపుల్స్ ఇంకా మానిక్యూర్ మరియు పెడిక్యూర్ వంటివి. ఇది ఒక రకంగా మంచిదే. అందంతో పాటు ఈ జాగ్రత్తల వలన శరీరం శుభ్రంగా విషపదార్థాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. కాకపోతే ఎక్కువ కెమికల్స్ ఉండే ప్రాడక్ట్స్ కాకుండా నేచురల్ గా లభించే పదార్థాలతో జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

ఇక ఈ ఆర్టికల్ లో మనం పెడిక్యూర్ గురించి కొన్ని విషయాలను తెలుసుకోబోతున్నాము. మనం చేతి వేళ్ళు, గోర్లు మాత్రమే కాకుండా పాదాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి రోజూ మనం మన పాదాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. మరి అటువంటప్పుడు కళ్లలో తొందరగా మురికి, దుమ్ము, ధూళి పేరుకు పోతుంది. మరి షూస్ వేసుకునే అలవాటు ఉన్నట్లయితే ఎక్కువ గంటలు షూస్ వేసుకోవటం వలన పాదాలలో చెమట పుట్టి దుర్వాసన కలుగుతుంది. పెడిక్యూర్ చేయటం వలన పాదాలు శుభ్రంగా అందంగా అవుతుంది. చలికాలంలో పెడిక్యూర్ చేసుకోవటం చాలా ముఖ్యం. చలికాలంలో మనం ఎక్కువగా షూస్ ని ఉపయోగిస్తాము, అంతే కాదు చర్మం కూడా పొడిబారిపోతుంది. పెడిక్యూర్ చేయటం వలన చర్మం లోని మాయిశ్చర్ లెవెల్స్ బాలన్స్ అవుతాయి. కొన్ని బేసిక్ పెడిక్యూర్ టిప్స్ ని తెలుసుకుని వాటిని పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

పెడిక్యూర్ అంటే ఏమిటి?

పెడిక్యూర్ అనేది ఒక లాటిన్ పదం. పెడి అంటే పాదం అని, క్యూర్ అంటే జాగ్రత్తలు తీసుకోవటం అని అర్థం. ఇది మీ పాదాలకు మరియు గొర్లకు తీసుకునే జాగ్రత్తలు. పెడిక్యూర్ పాదాలకు మరియు గొర్లకు ఎలాంటి సమస్యా రాకుండా కాపాడుతుంది. గోర్లను కత్తిరించటం, చనిపోయిన చర్మ కణాలను తొలగించటం మరియు పాదాలను మసాజ్ చేయటం ఇందులోని ప్రాసెస్.

పెడిక్యూర్ రకాలు

పెడిక్యూర్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. మీరు పార్లర్ కి వెళ్లినట్లయితే ప్రతి ఒక్క పార్లర్ లో అనేక రకాల పెడిక్యూర్ చేస్తారు. కానీ పెడిక్యూర్ చేసే పద్దతిని బట్టి మూడు రకాలు:

 1. మినీ పెడిక్యూర్ : ఈ పెడిక్యూర్ లో పాదాలను నానపెట్టాల్సిన అవసరం లేదు. కేవలం గోర్లను కత్తిరించి షేప్ చేసి నైల్ పాలిష్ ని రాసుకోవాలి.
 2. రెగ్యులర్ పెడిక్యూర్ : ఈ పద్దతిలో పాదాలను నానపెట్టి, స్క్రబ్ చేసి, గోర్లను కత్తిరించి షేప్ చేసి పాలిష్ వేయాలి.
 3. ఫ్రెంచ్ పెడిక్యూర్ : రెగ్యులర్ పెడిక్యూర్ చేసిన తరువాత నైల్ పాలిష్ వేసేటప్పుడు ముందుగా పింక్ రంగు పాలిష్ వేసి టిప్స్ లో వైట్ నైల్ పాలిష్ వేయాలి. ఇలా వేయటం వలన పాదాలు మరింత అందంగా కనబడతాయి.
 4. మరి కొన్ని రకాల పెడిక్యూర్ : ఐస్ క్రీం పెడిక్యూర్, స్టోన్ పెడిక్యూర్, పారాఫిన్ పెడిక్యూర్, చాకొలేట్ పెడిక్యూర్ ఇంకా ఎన్నో…

ఉత్తమ పెడిక్యూర్ చేసుకొనే పద్దతి

 1. కావలసిన పదార్థాలు : పెడిక్యూర్ చేసేందుకు క్రింద చెప్పినటువంటి వస్తువులను రెడీ గా ఉంచుకోవాలి. నైల్ పాలిష్ రిమూవర్, క్యూటికల్ ఆయిల్, టవల్, పెద్ద గిన్నె, ఫుట్ స్క్రబ్, నెయిల్ క్లిప్పర్, హ్యాండ్ టవెల్, బేస్ కోట్, ఫుట్ లోషన్ మొదలైనవి.
 2. నైల్ పోలిష్ రిమూవర్ : నెయిల్ పాలిష్ ని వేసుకున్న తరువాత దాన్ని తొలగించటం చాలా మంది మర్చిపోతారు. కొన్ని రోజుల తరువాత అక్కడక్కడ నైల్ పోలిష్ ఉండిపోతుంది. వాటిని తొలగించేందుకు ఒక పత్తిని రిమూవర్ లో ముంచి గోర్లపై రుద్దండి. నాన్ అసిటోన్ రిమూవర్ కి బదులుగా అసిటోన్ రిమూవర్ ని ఉపయోగించటం వలన గోరులకు ఎలాంటి హానీ కలగదు.
 3. పాదాలను నానపెట్టడం : ఒక పెద్ద గిన్నెలో వెచ్చని నీటిని పోసి కొంత ఉప్పుని కలిపి ఆ నీటిలో మీ పాదాలను నానపెట్టండి. ఇలా చేయటం వలన మీ పాదాలలోని నొప్పి తగ్గుతుంది. అలా 20-30 నిమిషాలు నానపెట్టిన తరువాత టవల్ తో పాదాలను మృదువుగా తుడవాలి.
 4. క్యూటికల్ ఆయిల్ : పాదాలను వెచ్చని నీటి నుండి తీసిన వెంటనే మీరు చేయాల్సిన తదుపరి విషయం క్యూటికల్ ఆయిల్ ని రాయటం. పాదాలపై ముఖ్యంగా గోరులపై రాసి ఒక వుడెన్ స్టిక్ తో మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయటం వలన గోరు చుట్టూ ఉండే చనిపోయిన చర్మ కణాలను తొలగించవచ్చు.
 5. స్క్రబ్ : ఆయిల్ తో గోరులపై ఉన్న డెడ్ సెల్స్ ని తొలగించిన తరువాత స్క్రబ్ ని ఉపయోగించి పాదాలు మరియు కాళ్లను మసాజ్ చేయాలి. గ్రానులర్ ఫుట్ స్క్రబ్ ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మోకాలి నుండి పాదాల వరకు స్క్రబ్ ని రాసి మసాజ్ చేయండి. ఇలా చేయటం వలన కాళ్లు మరియు పాదాలలో మాయిశ్చర్ బాలన్స్ అవుతుంది. చర్మం పొడిగా ఉండే ప్రాతంలో అధిక ఒత్తిడితో మసాజ్ చేయండి.
 6. నెయిల్స్ ని ఫైల్ చేయటం మరియు హైడ్రేట్ చేయటం : ఫైలింగ్ అంటే గోర్లను కత్తిరించి షేప్ చేయటం. స్క్రబ్ చేసిన తరువాత పాదాలను వెచ్చని నీటితో కడిగి టవల్ తో తుడవాలి. పాదాలలో మాయిశ్చర్ ఇంకా ఉండగానే గోర్లను కత్తిరించి షేప్ చేసుకోవాలి. షేప్ చేసేటప్పుడు గోరుల సైడ్స్ నుంచి ప్రారంభించండి. ఫైలింగ్ చేసిన తరువాత కొన్ని చుక్కల పెప్పర్ మింట్ ఆయిల్ ని గోరులపై అప్‌లై చేయండి. ఇలా చేయటంవలన గోరులు మృదువుగా హైడ్రాటెడ్ గా ఉంటాయి. ఆ తరువాత కావాలంటే నైల్ పాలిష్ ని వేసుకోవచ్చు లేదా అలాగే వదిలేయొచ్చు.

బేసిక్ పెడిక్యూర్ కోసం టిప్స్

 • పెడిక్యూర్ ప్రారంభించే ముందు, ఇదివరకే ఉన్న నైల్ పాలిష్ ని రిమూవర్ తో పూర్తిగా తొలగించాలి.
 • మంచి క్వాలిటీ ఉన్న రిమూవర్ ని ఉపయోగించండి. లేకపోతే నెయిల్స్ పొడిబారిపోతాయి. పైన చెప్పినట్లు అసిటోన్ రిమూవర్ ని ఉపయోగించండి.
 • పాదాలను నీటిలో నానబెట్టేటప్పుడు ఎక్కువ వేడిగా ఉండే నీటిని ఉపయోగించ కూడదు. గోరు వెచ్చని నీటిలోనే నానపెట్టాలి. పాదాలు మృదువుగా అయ్యాయని మీకు అనిపించే వరకు అనగా 4-5 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు నానపెట్టవచ్చు. మీ పాదాల యొక్క చర్మాన్ని బట్టి ఎంతసేపు నీటిలో వుంచాలో మీరే డిసైడ్ చేసుకోండి.
 • బాగా నానిన తరువాత ముఖ్యమైన భాగం డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించటం. గోర్ల చుట్టూ ఉన్న డెడ్ సెల్స్ మాత్రమే కాదు అరి పాదాలలో ఉండే కఠినమైన డెడ్ సెల్స్ ని కూడా తొలగించాలి. ఇందుకు మీరు ప్యూమిస్ స్టోన్ ని ఉపయోగించటం మంచిది. నీటిలో నానపెట్టడం వలన చర్మం మృదువుగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో డెడ్ సెల్స్ ని తొలగించటం చాలా సులభం. అంతే కాదు ప్యూమిస్ స్టోన్ తో రుద్దటం వలన మురికి మరియు మలినాలు కూడా తొలగిపోతాయి.
 • మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్లయితే సెపెరేట్ గా ఒక పర్సనల్ ప్యూమిస్ స్టోన్ ని ఉపయోగించండి.
 • స్క్రబ్ చేసిన తరువాత రోస్ వాటర్ మరియు ముల్తాని మట్టిని కలిపి పాదాల పై పూర్తిగా రాసి 10-15 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. పేస్ ప్యాక్ లానే పాదాలకు గ్లో అందించే ప్యాక్ ఇది.
 • ఆ తరువాత మీ చర్మాన్ని మాయిశ్చర్ చేయటానికి మైల్డ్ మాయిశ్చరైజర్ ని ఉపయోగించండి.
 • చివరిగా నైల్ పాలిష్ రాసిన తరువాత గోరులను చల్లని నీటిలో ముంచటం వలన పాలిష్ తొందరగా ఆరిపోతుంది.
 • చలి కాలంలో పాదాలను మొయిశ్చరైస్ చేయడానికి ఆలివ్ ఆయిల్ ని తరచూ రాస్తూ ఉండండి.
Posted on

Telugu tips for cracked heels – పాదాల పగుళ్లు తొలగించటానికి ఉత్తమ హోమ్ రెమెడీస్

అందమైన పాదం అంటే ఎలాంటి పగుళ్లు మరియు నల్లని మచ్చలు లేని పాదమే. కానీ అలాంటి పాదం సులభంగా సాధ్యపడదు. ఎందుకంటే ప్రతి రోజు మనం మన పాదాలను అధికంగా ఉపయోగిస్తూ ఉంటాము కానీ వాటి పై ఎలాంటి జాగ్రత్తలు లేదా కేర్ తీసుకోము. పాదాల విషయంలో మనకు ఎక్కువ బాధ కలిగించేదే పగుళ్లు. ఇవి ప్రారంభంలో చూసేందుకు వికారంగా ఉంటుంది మరి వీటి యొక్క తీవ్రత పెరిగే కొద్ది నొప్పి కూడా పెరుగుతుంది. పాదాలలో పగుళ్లు రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి వీటి యొక్క కారణాలు వీటిని నివారించే పద్దతులను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

పాదాలలో పగుళ్లు రావటానికి కారణాలు

కాళ్ల వెనుక మడమ భాగంలో పగుళ్లు రావటానికి అనేక కారణాలు ఉన్నాయి.

 • పొడి గాలి, సరైన కేర్ తీసుకోక పోవటం, సమతుల్యమైన ఆహారం లేకపోవటం, వృద్ధాప్యం, దీర్ఘకాలం పాటు నిలబడి ఉండటం మరియు సరైన బూట్‌లను ధరించక పోవటం.
 • తామర, ఆనికాయ, థైరాయిడ్ మరియు డయాబెటీస్ వంటి కొన్ని వ్యాధుల వలన కూడా పగుళ్లు ఏర్పడతాయి.
 • స్థూలకాయం వలన పాదాలపై ఒత్తిడి పెరిగి పగుళ్లు ఏర్పడతాయి.
 • చలి కాలంలో తగిన తేమ పదార్థాలు చర్మంలో లేకపోవటం వలన కూడా పగుళ్లు ఏర్పడవచ్చు.
 • వృధాప్యంలో శరీరంలోని నేచురల్ ఆయిల్స్ తగ్గిపోవటం వలన పగుళ్లు ఏర్పడవచ్చు.
 • ఎక్కువ సమయం పాదాలను నీటిలో ఉంచటం వలన కూడా పగుళ్లు ఏర్పడవచ్చు.

పగుళ్ల యొక్క లక్షణాలు

 • చర్మం దురదగా ఉండటం, రెడ్నెస్, వాపు మరియు పీలింగ్.
 • మడమ చుట్టూ చర్మం రఫ్ గా కఠినంగా ఉంటుంది.
 • మొదటి దశలోనే చికిత్స చేయకపోతే ఈ పరిస్థితి లోతైన పగుళ్లు, రక్తస్రావం మరియు తీవ్ర నొప్పికి దారితీస్తుంది.

పగుళ్లు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు

పగుళ్ల యొక్క కారణాలు తెలుసుకుంటే సులభంగా వాటిని అవాయిడ్ చేయవచ్చు.

 • డ్రై స్కిన్ ఉన్నవారికి ఉదాహరణకు, వారి పాదాలను తేమగా ఉంచడానికి వేర్వేరు చర్యలను ప్రయత్నించాలి. సహజ నూనెలు మరియు క్రీం తో పాదాలను మాయిశ్చర్ చేసుకోవాలి. ఈ ఉత్పత్తులలో ఆల్కహాల్ మరియు చికాకు కలిగించే రసాయనాలు లేకుండా ఉండాలి.
 • పాదాలను తేలికపాటి సబ్బుతో మాత్రమే కడగాలి, తడిగా ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ వాడాలి.
 • నీరు పుష్కలంగా త్రాగటం వలన చర్మం యొక్క మాయిశ్చర్ లెవెల్స్ బాలన్స్ అవుతుంది మరియు పగుళ్లు ఏర్పడకుండా సున్నితంగా ఉంటుంది.

పాదాల పగుళ్లను తొలగించేందుకు హోం రెమెడీస్

 1. కూరగాయల నూనెలతో మసాజ్ : ఆలివ్ నూనె, సెసెమ్ ఆయిల్, ఆముదం నూనె లేదా కొబ్బరి నూనె వంటి నూనెలను ఉపయోగించవచ్చు. ముందుగా వెచ్చని సబ్బు నీటిలో పాదాలను సోక్ చేసిన తరువాత ప్యూమిస్ స్టోన్ తో బాగా స్క్రబ్ చేసి శుభ్రం చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక నూనెని అప్‌లై చేసి కొంత సేపు బాగా మసాజ్ చేయాలి. ఆ తరువాత సాక్స్ ని తొడుక్కోవాలి. ఇలా ప్రతిరోజూ రెగ్యులర్గా చేయటం వలన పగుళ్లు నయమవుతాయి.
 2. నిమ్మకాయ, ఉప్పు, గ్లిసరిన్, రోజ్ వాటర్ ఫుట్ మాస్క్ : మొదటి దశలో ఉన్న పగుళ్లను క్యూర్ చేసేందుకు ఇది ఒక ఉత్తమ రెమెడీ. ముందుగా వెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం, గ్లిసరిన్ మరియు రోజ్ వాటర్ ని వేసి బాగా కలపాలి. పాదాలను ఈ వెచ్చని నీటిలో కొంత సేపు సోక్ చేయాలి. పాదాలను బాగా స్క్రబ్ చేసి డ్రై స్కిన్ ని తొలగించాలి. ఇప్పుడు థిక్ గ్లిసరిన్ మరియు నిమ్మరసం ని కలిపి పాదాలపై రాసి సాక్స్ వేసుకొని రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం చల్లని నీటితో పాదాలను కడగాలి.
 3. పండ్లతో మసాజ్ : బాగా మాగిన అరటి పండు లేదా బొప్పాయి పండును మాష్ చేసి పగిలిన పాదాలపై రాసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తరువాత 15 నిమిషాలు ఉంచి చల్లని నీటితో కడగాలి. ఇలా క్రమంగా చేయటం వలన పాదాలకు కావలసిన తేమ పదార్థం అందుతుంది మరియు పగుళ్లు తగ్గుతాయి.
 4. బియ్యం పిండి : ఎక్స్‌ఫోలియేటింగ్‌ స్క్రబ్‌గా బియ్యం పిండి బాగా ఉపయోగపడుతుంది. ఇది పొడిబారి, పగిలిన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి క్రాక్స్ ని సరిచేస్తుంది. బియ్యం పిండికి కొన్ని చుక్కల తేనె, ఆపిల్ సీడర్ వినిగర్‌ ని చేర్చి పేస్ట్‌లా తయారుచేయాలి. పాదాల మీద పగుళ్లు ఎక్కువగా ఉంటే బాదం లేదా ఆలివ్‌ ఆయిల్‌ చేర్చాలి. గోరు వెచ్చని నీటిలో 10 నిమిషాలపాటు పాదాలను నానబెట్టి ఈ పేస్ట్‌తో రుద్ది శుభ్రంగా కడగాలి. తడి లేకుండా తుడిచి నూనె రాసి సాక్స్‌ వేసుకుని పడుకోవాలి. ఇలా ప్రతి రోజు క్రమం తప్పకుండా చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
 5. ప్యారాఫిన్‌ వ్యాక్స్‌ మరియు ఆవాల నూనె : పగుళ్లు పెద్దవై బాధపెడుతూ ఉంటే ప్యారాఫిన్‌ వ్యాక్స్‌తో తక్షణ ఉపశమనం లభిస్తుంది. పారాఫిన్‌ వ్యాక్స్‌కు ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె కలిపి వేడి చేయాలి. వ్యాక్స్‌ పూర్తిగా కరిగేవరకు వేడి చేసి పూర్తిగా చల్లార్చాలి. రాత్రి పడుకునేముందు పాదాలను వెచ్చని నీటిలో కొంత సేపు నానపెట్టి ఆ తరువాత పగుళ్ల లోపలికి వెళ్లే విధంగా ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్‌లై చేసి సాక్స్ వేసుకొని రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే నీటితో కడగాలి. ఇలా రెండు వారాలు చేయటం వలన పగుళ్ల నుండి ఉపశమనం పొందుతారు.
 6. వేపాకుతో : యాంటీ ఫంగల్‌ లక్షణాలుండే వేప పాదాల పగుళ్లను కూడా వదిలిస్తుంది. గుప్పెడు వేపాకుకు ఒక స్పూన్ పసుపు కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ పేస్ట్‌ను పాదాల పగుళ్లకు అప్‌లై చేసి అరగంట తర్వాత శుభ్రంగా కడగాలి. తడి ఆరాక నూనెతో మర్దించాలి.
 7. గోరింటాకు : గోరింటాకును బాగా రుబ్బుకొని పగుళ్లు ఉన్న చోట రాసి ఎండిన తర్వాత కడిగితే పగుళ్లకు చెక్‌ పెట్టవచ్చు.
 8. ఆలోవీరా జెల్ : పాదాల మడమ భాగంలోని పగుళ్లను తగించడంలో కలబంద జెల్ బాగా పనిచేస్తుంది. పాదాలను చల్లని నీటితో శుభ్రంగా కడుక్కొని ఆలోవీరా జెల్ ను పాదాలకు పట్టించడం ద్వార కాళ్ల పగుళ్లను తగ్గించడమే కాకుండా మృదువైన పాదాలను పొందవచ్చు.
Posted on

Telugu remedies for muscle cramps – కండరాల నొప్పిని నివారించే హోం రెమెడీస్

ప్రస్తుత కాలంలో కండరాల నొప్పి ప్రతి ఒక్కరికి వచ్చే ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది ప్రధానంగా యువకులలో లేదా వృద్ధులలో అధికంగా సంభవిస్తుంది. కొన్నిసార్లు కండరాల నొప్పి భారీ వ్యాయామం వలన కలగచ్చు లేదా అధిక సమయం ఒకే పొజిషన్ లో కూర్చొని ఉండటం లేదా నిలబడి ఉండటం వలన కాళ్లు, చేతులు లేదా వెన్నెముక కండరాలలో నొప్పి పుట్టవచ్చు. దాదాపు ప్రతి ఒక్కరూ జీవితంలో కండరాల నొప్పిని అనుభవించే ఉంటారు. ముఖ్యంగా రన్నర్, అథ్లెట్లు లేదా సైక్లిస్టుల వంటి క్రీడాకారులకు ఇది ఒక సాధారణ సమస్య. వారి చేతి, కాళ్లు, వీపు, కడుపు మరియు ఇతర భాగాలలో కండరాల నొప్పి ఏర్పడుతుంది. ఇది కాకుండా ఒత్తిడి లేదా చిన్న దెబ్బల వలన కూడా కండరాలలో నొప్పి పుడుతుంది.

కండరాలలో తిమ్మిరి

కండరాల క్రామ్ప్స్ అనగా తిమ్మిరి అకస్మాత్తుగా వివిధ కండరాలలో సంభవించే అసంకల్పిత సంకోచాలు. ఈ సంకోచాలు చాలా బాధాకరమైనవి మరియు వివిధ కండరాల సమూహాలను ప్రభావితం చేయవచ్చు. సాధారణంగా కాళ్ల వెనుక భాగంలో, తొడ వెనుక భాగం మరియు ముందు భాగాలలో క్రామ్ప్స్ ఏర్పడవచ్చు. అంతేకాదు ఉదరం, చేతులు, మరియు పాదాలలో కూడా తిమ్మిరి ఏర్పడవచ్చు.

నిద్రలో ఉన్నప్పుడు తిమ్మిరి ఏర్పడితే వాటి యొక్క తీవ్రమైన నొప్పి వలన మీరు నడవలేక పోతారు. ఆకస్మిక మరియు పదునైన క్రామ్ప్స్ యొక్క ప్రభావం కొన్ని సెకండ్స్ నుండి 15 నిమిషాల వరకు ఉంటుంది. ఇది కండరాల నొప్పి యొక్క అత్యంత సాధారణ లక్షణం. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో కండరాలు ఉబ్బడం కూడా జరుగుతుంది.

కండరాలలో తిమ్మిరి ఏర్పడటానికి కారణాలు

కండరాల తిమ్మిరికి అనేక కారణాలున్నాయి. కొన్ని తిమ్మిరి మీ కండరాల మితిమీరిన వాడుక వలన వస్తుంది. మీరు వ్యాయామం చేసేటప్పుడు ఇది అధికంగా సంభవిస్తుంది.

కండరాలలో గాయాలు మరియు నిర్జలీకరణ కూడా తిమ్మిరిని ప్రేరేపించగలవు. కాల్షియం, పొటాషియం, సోడియం మరియు మెగ్నీషియం వంటి కండరాల ఆరోగ్యానికి కావలసిన ఖనిజాలు తక్కువ స్థాయిలో ఉండటం వలన కూడా తిమ్మిరి ఏర్పడుతుంది.

మీ కాళ్లు మరియు పాదాలకు తక్కువ రక్త సరఫరా అవ్వటం వలన మీరు వ్యాయామం లేదా భౌతిక పనులు చేసేటప్పుడు క్రామ్ప్స్ ఏర్పడవచ్చు.

కొన్ని సందర్భాల్లో వైద్య పరిస్థితులు కూడా కండరాల తిమ్మిరికి కారణమవుతుంది. ఉదాహరణకు: మద్యం సేవించటం, గర్భిణిగా ఉన్నప్పుడు, మూత్రపిండ వైఫల్యం మరియు హైపో థైరాయిడిజం.

కండరాలలో నొప్పి మరియు తిమ్మిరికి గృహ చికిత్స

మజిల్స్ లో కలిగే నొప్పి మరియు క్రామ్ప్స్ ని తగ్గించేందుకు కొన్ని ఉత్తమ హోమ్ రెమెడీస్ ఉన్నాయి. వీటిని అనుసరించటం వలన నొప్పి నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు. కొన్ని తీవ్రమైన పరిస్థితులలో వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. తరచూ నొప్పి పుట్టడం, క్రామ్ప్స్ యొక్క వాపు తగ్గక పోవడం, దీర్ఘకాలిక నొప్పి వంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించటం మంచిది. కానీ ఇటు వంటి సందర్భాల్లో కూడా ఈ హోమ్ రెమెడీస్ ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. మరి వాటి వివరాలను చూద్దాం.

 1. ఎప్సోమ్ సాల్ట్స్ : కండరాల నొప్పి మరియు క్రామ్ప్స్ నుండి ఉపశమనం పొందేందుకు ఎప్సోమ్ సాల్ట్స్ ఒక మంచి రెమెడీ. వెచ్చని నీటిలో ఒక కప్పు ఎప్సోమ్ సాల్ట్స్ ని వేసుకొని బాగా కలపాలి. ఈ నీటిలో ఒక నాప్‌కిన్ లేదా టవల్ ని ముంచి నొప్పిగా ఉన్న ప్రాంతంపై కంప్రెస్ చేయండి. ఇలా రోజుకు 2-3 సార్లు చేయటం వలన క్రమంగా నొప్పి తగ్గుతుంది. గమనిక : ఈ ప్రక్రియకు వెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. చాలా వేడిగా ఉన్న నీటిని ఉపయోగిస్తే చర్మం పొడిబారుతుంది. మీకు గుండె వ్యాధి, బిపి లేదా డయాబెటిస్ వండి వ్యాధులు ఉన్నట్లయితే ఈ ట్రీట్‌మెంట్ చేయ కూడదు. వేరే మార్గాలను ప్రయత్నించండి.
 2. చల్లని లేదా వేడి కంప్రెస్ : వెచ్చని నీటితో స్నానం చేయటం వలన మీ కండరాలు రిలాక్స్ అవ్వటంతో నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. వెచ్చని నీటి వలన మీకు మంట కలుగుతున్నట్లయితే చల్లని నీటితో లేదా ఐస్ ప్యాక్ తో నొప్పిగా ఉన్న చోటు పై కంప్రెస్ చేయండి. ఐస్ కంప్రెస్ చేసేటప్పుడు ఐస్ ముక్కలను డైరెక్ట్ గా ఉపయోగించకుండా ఒక క్లాత్ లో చుట్టి ఒత్తిడిని పెట్టవచ్చు. ఐస్ ముక్కలను డైరెక్ట్ గా ఉపయోగించినట్లయితే నొప్పి ప్రభావం అధికరించవచ్చు. ఈ పద్దతులను రెగ్యులర్గా పాటించటం వలన క్రమంగా నొప్పి తగ్గటం మీరు గమనించవచ్చు.
 3. ఆపిల్ సీడర్ వినిగర్ : కండరాల నొప్పి మరియు క్రామ్ప్స్ నుండి ఉపశమనం పొందేందుకు వినిగర్ ఒక ఉత్తమమైన మందు. ఒక గ్లాస్ నీటిలో 1-2 స్పూన్ ల వినిగర్ ని కలుపుకొని త్రాగండి. లేదా వినిగర్ ని డైరెక్ట్ గా నొప్పిగా ఉన్న ప్రాంతాలపై రాసి మసాజ్ చేయండి. ఇది కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.
 4. ఎసెన్షియల్ ఆయిల్ : కండరాల నొప్పిని తొలగించడంలో ఎసెన్షియల్ ఆయిల్ చాలా ప్రభావితమైన నూనె. వీటి యొక్క సమ్మేళనం కండరాల నొప్పిని తగ్గించటంలో చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. లెమన్ గ్రాస్, మార్జోరం, డీప్ బ్లూ, బేసిల్, రోమన్ వంటి సమ్మేళనాలు ఉపయోగించండి. ఈ నూనెలను నొప్పిగా ఉన్న ప్రాంతాలపై రాసి కొంత సేపు మర్దన చేయండి. ఇలా ప్రతి రోజూ 2-3 వారాల పాటు రాయటం వలన మంచి ఉపశమనం పొందుతారు.
 5. పసుపు పేస్ట్ : పసుపులో నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించే గుణగణాలు పుష్కలంగా ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. పసుపులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి వాపు, నొప్పి ఉన్న ప్రదేశంలో అప్‌లై చేస్తే వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
 6. బాదం ఆయిల్ మరియు గార్లిక్ ఆయిల్ : ఇక టీస్పూన్ గార్లిక్ మరియు ఒక టీస్పూన్ బాదం ఆయిల్ ను ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా వేడి చేయాలి. నొప్పి ఉన్న మరియు సలుపు వున్న కండరల ప్రాంతంలో అప్‌లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. మజిల్ పెయిన్ నివారించడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.
 7. ఆముదం : ఆముదం నూనెని వేడి చేసి కాటన్ ప్యాడ్ మీద వేసి నొప్పి ఉన్న కండరాల మీద అప్‌లై చేస్తూ సున్నితమైన మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తక్షణ ఉపశమనం పొందుతారు.
 8. యూకలిప్టస్ ఆయిల్ మరియు రోజ్మెరీ ఆయిల్ : కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ మరియు కొద్దిగా రోజ్మెరీ ఆయిల్ మిక్స్ చేసి సలుపు వున్న కండరాల మీద మసాజ్ చేయాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
 9. హార్స్ చెస్ట్ నట్ : కండరాల యొక్క నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ నుండి ఉపశమనం కలిగించడంలో మరియు కండరాల గాయాలను మాన్పడంలో ఈ మూలిక సహాయపడుతుంది. వీటిలో ఎసిన్ అనే నయం చేసే గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల వీటితో తయారు చేసిన జ్యూస్ ని అప్‌లై చేస్తే వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందుతారు.
 10. లైమ్ లీవ్స్ పౌడర్ మరియు తేనె : నిమ్మ ఆకులను పేస్ట్ లేదా పౌడర్ చేసి దీనికి కొద్దిగా తేనె మిక్స్ చేసి నొప్పి మరియు సలుపు ఉన్న కండరాల మీద అప్‌లై చేస్తే తక్షణం వాపు మరియు నొప్పి తగ్గిస్తుంది.
 11. ఉల్లిపాయ పేస్ట్ : ఉల్లిపాయను పేస్ట్ చేసి మందపాటి కాటన్ క్లాత్ లో వేసి నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టులా కట్టుకోవడం వల్ల త్వరగా వాపు మరియు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 12. పార్ల్సీ : పార్ల్సేను పేస్ట్ గా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో నేరుగా అప్‌లై చేస్తే తక్షణం ఉపశమనం కలుగుతుంది. కండరాల వాపు మరియు నొప్పిని నివారించడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.
 13. థైమ్ ఆయిల్ : కొన్ని చుక్కల థైమ్ ఆయిల్ ను నీటిలో వేసి మిక్స్ చేసి ఈ నీటితో కండరాల నొప్పి ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయడం వల్ల నొప్పి మరియు వాపు నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. థైమ్ ఆయిల్ కు కొద్దిగా బాదం ఆయిల్ మిక్స్ చేసి కూడా మసాజ్ చేసుకోవచ్చు.
 14. కొంత ఎత్తులో ఉంచాలి : గాయం అయిన లేదా కండరాల పట్టివేతకు గురైనప్పుడు ఆ భాగం కొంత ఎత్తులో ఉండే విధంగా కాళ్ల క్రింద పిల్లో(దిండు)ను అమర్చు కోవడం ఉత్తమం.

కండరాలలో నొప్పి మరియు తిమ్మిరిని నివారించేందుకు ఉత్తమ ఆహారం

కండరాల నొప్పిని క్రమంగా తగ్గించేందుకు కొన్ని ఉత్తమమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని రెగ్యులర్ గా మీ డైట్ లో చేర్చుకోవటం వలన కండరాల నొప్పిని అవాయిడ్ చేయవచ్చు మరియు ఇదివరకే నొప్పి ఉన్నట్లయితే క్రమంగా నొప్పి తగ్గటానికి కూడా సహాయ పడుతుంది.

 1. దాల్చిన చెక్క : దాల్చిన చెక్కలు బాగా ప్రసిద్ధి చెందిన మసాలా దినుసులు. ఇందులో అనాల్జేసిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు హీలింగ్ లక్షణాలు ఉండటం వలన ఇది కండరాల నొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది. ఒక గ్లాస్ వెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి మరియు ఒక స్పూన్ తేనె కలిపి త్రాగటం వలన నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. అంతే కాదు ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
 2. అరటి పండ్లు : అరటి పండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. కండరాలు మరియు నాడీ వ్యవస్థ యొక్క సరైన పనితీరుకు పొటాషియం చాలా అవసరం. పొటాషియం యొక్క లోపం వలన కూడా కండరాలలో నొప్పి పుట్టవచ్చు. ప్రతిరోజూ 3-4 అరటి పండ్లను తినటం వలన మీ శరీరానికి కావలసిన పొటాషియం ని అందించగలుగుతారు. ఇది క్రమంగా నొప్పి మరియు క్రామ్ప్స్ ని పూర్తిగా తొలగిస్తుంది.
 3. విటమిన్లు : శరీరం ఫిట్ గా ఉంచేందుకు విటమిన్లు కీలక పాత్రను వహిస్తాయి. విటమిన్ బి1, ఇ మరియు డి యొక్క లోపం వలన కండరాలు డామేజ్ అవటం, బలహీనం కావటం మరియు నొప్పి ఏర్పడుతుంది. మీ కడుపు నొప్పి మరియు క్రామ్ప్స్ ని నిరోధించడానికి మీ రోజువారీ ఆహారంలో అన్ని ముఖ్యమైన పోషకాలనూ చేర్చుకోవడం చాలా అవసరం. మీ ఆహారంలో అవసరమైన అన్ని పోషకాలను అందించే పదార్థాలను ముఖ్యంగా విటమిన్లను చేర్చుకున్నారని నిర్ధారించుకోండి.
 4. మెగ్నీషియం : మీ శరీరం లో మెగ్నీషియం స్థాయి తక్కువగా ఉంటే కండరాల నొప్పి లేదా క్రామ్ప్స్ కలగచ్చు. ఇందుకొరకు చాలామంది మెగ్నీషియం సప్లిమెంట్స్ ను తీసుకుంటారు. కానీ మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ మార్గం. అవిసె గింజలు, పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, నల్ల బీన్స్, కోకో పౌడర్, జీడి పప్పులు మరియు స్విస్ ఛార్డ్ వంటి మార్కెట్లో లభించే అనేక పదార్థాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. కనుక వీటిని మీ డైట్లో చేర్చుకోండి.
  • బీన్స్ మరియు పప్పు ధాన్యాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు వండిన పప్పు ధాన్యాలలో, 71 mg మెగ్నీషియం కలిగి ఉంటే, ఒక కప్పు వండిన బ్లాక్ బీన్స్ లో అంతకు రెట్టింపు (120 mg) మెగ్నీషియం ఉంటుంది. అంతేకాక, వాటిలో ఋతు స్రావ సమయంలో కలిగే నొప్పులను తగ్గించడానికి సహాయపడే పీచుపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి.
  • పప్పు ధాన్యాల వలే, గింజలు మరియు విత్తనాలలో కూడా మెగ్నీషియం నిలువలు అధికంగా ఉంటాయి. 1 ఔన్స్ (28.3 g) కాల్చిన పొద్దుతిరుగుడు విత్తనాలలో 37 mg మెగ్నీషియం ఉంటుంది. 1 ఔన్స్ కాల్చిన బాదం గింజలలో మెగ్నీషియం పరిమాణం రెట్టింపుగా ఉంటుంది. ఇతర గింజలలో కూడా కాల్షియం మరియు మెగ్నీషియం ఉంటాయి. కనుక మీ ఆహారంలో వీటిని తప్పకుండా భాగంగా చేసుకోండి.
  • పాలకూర మరియు బ్రోకలీ వంటి ఆకుకూరలలో, కాల్షియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మీ ఆహారంలో వాటిని భాగం చేరుకోవడం వలన కండరాల నొప్పిని నిరోధించడానికి సహాయపడతాయి. ఈ ఆకుకూరలు ఋతు క్రమ సమయంలో కలిగే నొప్పులను కూడా తగ్గించడానికి సహాయపడతాయి.
 5. బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ : చాలా కొంత మందికి మాత్రమే మొలాసిస్ గురించి తెలుసు. ఇందులో మెగ్నీషియం స్థాయి చాలా అధికంగా ఉంటుంది. కండరాల నొప్పికి ఇది ఒక గొప్ప నివారిణి. ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ ని ఒక కప్పు కాఫీ లో కలిపి ప్రతి రోజు ఉదయం త్రాగండి. రెండు వారాలలో నొప్పిలోని మార్పుని మీరు చూడగలుగుతారు.
 6. కొబ్బరి నూనె : కొబ్బరి ఒక న్యూట్రిషన్ ఆహారం. దీని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నూనె కండరాల నొప్పిని తగ్గించటంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజు వంటలో 2-3 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెని ఉపయోగించటం వలన మజిల్ పెయిన్‌ క్రమంగా తగ్గుతుంది.
 7. అల్లం : మజిల్ పెయిన్ నివారించు కోవడంలో అల్లం సహాయపడుతుంది. ఇది సోర్ మజిల్స్ ను నివారించడానికి కూడా సహాయపడుతుంది. అల్లంలో జింజరోల్స్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ నొప్పిని తగ్గిస్తుంది. కనుక కండరాల నొప్పితో బాధపడుతున్న వారు అల్లం టీ ని రెగ్యులర్గా త్రాగండి. మీ ఆహారంలో కూడా అల్లం ను చేర్చుకోండి.
 8. దానిమ్మ : దానిమ్మలో వివిధ రకాల హీలింగ్ పవర్స్ ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మజిల్ డ్యామేజ్ ను నివారిస్తాయి. ఇంకా రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దాంతో కండరాల నొప్పి తగ్గించుకోవచ్చు.
 9. బ్లూ బెర్రీస్ : బ్లూ బెర్రీస్ లో ఉండే ఫైటో కెమికల్స్ మజిల్స్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తాయి. బ్లూ బెర్రీస్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ మరియు ఎలాజిక్ యాసిడ్స్ కండరాల సలుపును తగ్గిస్తాయి. బ్లూ బెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేక వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతాయి.
 10. పైనాపిల్ జ్యూస్ : పైనాపిల్లో బ్రొమోలిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. త్వరగా నొప్పులను నివారించుకోవాలంటే పైనాపిల్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి. కండరాల లో క్రామ్ప్స్ కి కూడా తక్షణ ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
 11. చెర్రీస్ : చెర్రీ జ్యూస్ తాగడం వల్ల మీ కండరాలు పునరుత్తేజం పొందుతాయి. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక ఒక గ్లాసు చెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల కండరాల నెప్పి మరియు ఇన్ఫ్లమేషన్ ని నివారించవచ్చు.
 12. బొప్పాయి : తక్షణ శక్తి పొందటానికి బొప్పాయి సహాయపడుతుంది. కేవలం ఒక్క బొప్పాయిలో పొటాషియం 16% అనగా 781 mg ఉంటుంది. తక్కువ కొవ్వు ఉన్న పెరుగు వంటి ప్రోటీన్ సహిత పదార్ధంతో పాటుగా తీసుకున్నప్పుడు ఇది ఎలెక్ట్రోలైట్స్ ను భర్తీ చేస్తూ కండరాలలో కలిగే ఇబ్బందులను సరిచేస్తుంది.
 13. గుడ్లు : ప్రోటీన్లు పుష్కలంగా లభించే గుడ్డులో కండరాల నిర్మాణానికి అవసరమైన ల్యూసిన్అనే అమైనో ఆమ్లం కూడా అధిక మొత్తంలో ఉంటుంది. సెలీనియం మరియు ల్యూటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నందున గుడ్లు శరీరంలో వాపు మరియు నొప్పిని తగ్గించడంలో తోడ్పడతాయి.
 14. పాలు : తక్కువ కొవ్వు కలిగిన పాలు, పెరుగు మరియు ఇతర పాల ఉత్పత్తులలో ఎముకల యొక్క ఆరోగ్యానికి చాలా అవసరమైన కాల్షియం నిల్వలు అధికంగా ఉంటాయి. కండరాల సంకోచ వ్యాకోచాలకు కాల్షియం అత్యవసరం. ఇది కనుక లోపిస్తే కండరాలలో నొప్పులు అధికంగా కలుగుతాయి. అందువలన, మీరు సహజ పద్ధతులలో కండరాల నొప్పిని తగ్గించాలనుకుంటే పాలు మరియు పెరుగును తీసుకోండి.
 15. పైనాపిల్ జ్యూస్ : పైనాపిల్లో బ్రొమోలిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. త్వరగా నొప్పులను నివారించుకోవాలంటే పైనాపిల్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి. కండరాల క్రామ్ప్స్ నుండి కూడా తక్షణ ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
Posted on

Telugu tips to get black hair – సహజమైన నల్లని వెంట్రుకల కొరకు హోం రెమెడీస్

కురులు అనగానే మనకు గుర్తుకు వచ్చే రంగు నలుపు. నల్లని కురులు ఒక ప్రత్యేకమైన అందం కలిగి ఉంటుంది. నల్లని రంగుతో పాటు మీ జుట్టు సిల్కీగా ఉంటే ఇక ఏమాత్రం సందేహం లేదా మీ జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉన్నట్లే. ప్రతి ఒక్కరి కళ్లూ మీ కేశాలపైనే.

కొందరికి బ్రౌన్ లేదా తెలుపు అని వివిధ రంగులలో జుట్టు ఉంటుంది. అలాంటి వారు కూడా నల్లని రంగు జుట్టు కోసం వివిధ రకాల డై ని ఉపయోగిస్తూ ఉంటారు. మీరు డై ని ఉపయోగిస్తున్నట్లయితే ఒక విషయం మీరు గ్రహించాలి. ఎలాంటి బ్రాండ్ డై ని మీరు ఉపయోగించినా అది మీ కురులలోని నేచురల్ పిగ్మెంట్స్ ని నాశనం చేస్తుంది. అంతే కాదు మీ కురులలో ఉన్న కొద్దిపాటి నల్లధనాన్ని కూడా పూర్తిగా పోగొడుతుంది. అవి మీ చర్మానికి మరియు కంటికి కూడా మంచిది కాదు.

మరి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజమైన నలుపు రంగును పొందలేమా? సహజ పదార్థాలను ఉపయోగించి సహజమైన పద్ధతుల ద్వారా నల్లని కురులను పొందవచ్చు. కానీ, కొన్ని విషయాలను మీరు గుర్తుంచుకోవాలి.

 • మీకు గోధుమ రంగు కురులు ఉన్నట్లయితే నేచురల్ రెమెడీస్ ద్వారా సులభంగా నల్లని రంగును పొందవచ్చు.
 • మీకు ఇప్పుడిప్పుడే తెల్లగా మారుతున్న కురులు ఉన్నట్లయితే మరియు మీరు ఇదివరకు డై ని ఉపయోగించనట్లయితే నేచురల్ రెమెడీస్ ద్వారా సులభంగా నల్లని రంగును తిరిగి పొందవచ్చు.
 • మీరు ఇప్పటికే డై ని అధికంగా ఉపయోగించి ఉన్నట్లయితే, మీ కురుల యొక్క నేచురల్ పిగ్మెంట్స్ 90% డామేజ్ అయ్యుంటాయి. కనుక వాటిని సహజ పద్ధతుల ద్వారా తిరిగి నల్లగా అయ్యేటట్లు చేయటం సాధ్యపడక పోవచ్చు.

తెల్లని జుట్టు యొక్క కారణాలు

మన తాతలు అమ్మమ్మలు తెల్లని జుట్టుతో ఉండటం మనం చూసే ఉంటాము. నెరసిన జుట్టు ఉన్నప్పటికీ వాళ్ళు అందంగానే ఉండేవారు. అందుకు కారణం వారి వయసు. ఒక ఏజ్ తరువాత నెరసిన జుట్టయినా అందంగానే ఉంటుంది. కానీ మరి చిన్న వయసులోనే అనగా యవ్వనంలోనే తెల్లని వెంట్రుకలు వస్తే? ఎంతో ఆందోళనగా ఉంటుంది. పబ్లిక్ లోకి వెళ్లలేము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, ఎంతో అవమానంగా ఉంటుంది. మరి యవ్వనంలోనే తెల్ల వెంట్రుకలు రావటానికి కారణం ఏమిటి? ఇందుకు ముఖ్య కారణాలు :

 • పొల్యూషన్
 • ఒత్తిడి
 • మనం వాడే బ్యూటీ ప్రాడక్ట్స్ లోని కెమికల్స్
 • అన్నింటికంటే ముఖ్యమైన కారణం మనం తీసుకునే ఆహారాలలో పోషక లోపాలు. లైఫ్ స్టైల్ మారే కొద్ది ఆహార పద్ధతులు కూడా మారుతున్నాయి. అందు వలనే ముఖ్యంగా యవ్వనంలోనే జుట్టు నెరవడం మొదలవుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లోనే ఎంతో మంది ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి డై వేసుకోవటం ప్రారంభిస్తారు. పైన చెప్పిన విధంగా ఇవి వాడటం వలన మీ కేశాల యొక్క సహజమైన తత్వాలను కోల్పోతారు. ఒక్క సారి డై వాడటం మొదలు పెడితే చివరి వరకు వాడాల్సిందే. ఎందుకంటే అవి మీ నల్లని జుట్టుని కూడా తెల్లగా మార్చేస్తుంది.

మరి మీరు మీ సహజ నల్లని వెంట్రుకలను తిరిగి పొందాలనుకుంటే ఇలాంటి ప్రాడక్ట్స్ ను ప్రారంభ దశలోనే వదిలేసి సహజ పద్ధతులకు మారండి. ఈ పద్ధతుల ద్వారా మీరు నల్లని కురులను పొందేందుకు కొంత సమయం పడుతుంది. కానీ ఇది సహజమైన నలుపు మరియు మృదువైన కురులను మీ సొంతం చేస్తుంది. మీకు కావలసిందల్లా ఓపిక మాత్రమే.

మరి సహజమైన నల్లని కురులను పొందేందుకు కొన్ని నేచురల్ రెమెడీస్ ని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

సహజమైన నల్లని జుట్టు కొరకు హోం రెమెడీస్

 1. హెన్నా, సోప్ నట్ మరియు షికాకై హెయిర్ ప్యాక్: ఇది ఒక హెర్బల్ హెన్నా డై. ఒక బౌల్ లో ఒక కప్పు హెన్నా రెండు టేబుల్ స్పూన్ ఉసిరి పొడి ఒక టేబుల్ స్పూన్ షికాకై ఒక టేబుల్ స్పూన్ సోప్ నట్ పొడి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్ పెరుగు 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మరియు 1/2 స్పూన్ వినిగర్ ని వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ ప్యాక్ ని మీ కురులపై వేర్ల నుండి మొనల దాకా రాసి 1-2 గంటలు ఉంచాలి. ఆ తరువాత మాములు నీటితో కడగాలి. ఇలా నెలకు 2-3 సార్లు చేయటం వలన సహజమైన నల్లని కురులు మీ సొంతం అవుతాయి.
 2. ఉసిరి మరియు మందార పువ్వు హెయిర్ ప్యాక్: మందార పువ్వు ఒక ముఖ్యమైన పువ్వు మరియు మలేషియా లో ఇది నేషనల్ ఫ్లవర్. ఈ పువ్వులను అందమైన కేశాలను పొందేందుకు ఉపయోగిస్తారు. అంతే కాదు ఈ చెట్టు యొక్క ఆకులను కూడా సోప్ నట్స్ తో కలిపి వెంట్రుకలకు అప్‌లై చేసుకుంటారు. ఇలా చేయటం వలన మీ కురులు బలంగా మరియు షైనీ గా అవుతుంది. ఇది మీ డాండ్రఫ్ ని తొలగించి కురులను నల్లగా చేస్తుంది.
  మారో విధానం – ఒక ఉసిరి కాయను తీసుకొని బాగా మాష్ చేసి పల్ప్ లాగా చేసుకోవాలి. ఇందులో మందార పువ్వు యొక్క రసాన్ని కలిపి కురులపై బాగా అప్‌లై చేయాలి. పూర్తిగా రాసిన తరువాత 30 నిమిషాలు ఉంచి నార్మల్ వాటర్ తో కడిగితే కురులు నల్లగా అందంగా మారుతాయి.
 3. బ్లాక్ టీ స్ప్రే : కొత్తగా వస్తున్న తెల్లని వెంట్రుకలను నల్లగా మార్చే పదార్థాలలో ప్రసిద్ధి చెందినది బ్లాక్ టీ. బ్లాక్ టీ ని వాడటం వలన ఎలాంటి సందేహం లేకుండా మీ కురులు కచ్చితంగా నల్లగా అవుతాయి. కొన్ని బ్లాక్ టీ బాగ్స్ ని నీటిలో వేసి నీటిని బాగా ఉడికించండి. ఆ నీటిని వడగట్టి జుట్టు మరియు స్కాల్ప్ పై రాయండి. 20-30 నిమిషాల తరువాత చల్లని నీటితో తలస్నానం చేయండి. ఈ నీటిలోని యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పెళుసైన జుట్టు గ్రీవములను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియను కనీసం వారానికి రెండు సార్లు రిపీట్ చేయాలి.
 4. సేజ్ ఆకుల హెయిర్ ప్యాక్ : చేతి నిండుగా సేజ్ ఆకులను తీసుకొని నీటిలో నానపెట్టాలి. ఆ తరువాత ఆకులతో కూడిన ఈ నీటిని బాగా ఉడికించి వడగట్టండి. సేజ్ ఆకులతో పాటు రోజ్ మేరీ ఆకులను కూడా జోడించవచ్చు. ఈ నీటిని ఒక స్ప్రే బాటిల్ లో స్టోర్ చేసుకొని మీ కురులపై స్ప్రే చేయండి. 10-15 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ ఆకులలో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది హెయిర్ ఫాల్ ని మరియు జుట్టు నెరవడాన్ని తగ్గించి ఆరోగ్యమైన కురులు పెరగటానికి సహాయపడుతుంది.
 5. హెన్నా మరియు కాఫీ పొడి హెయిర్ ప్యాక్ : ఇది ఒక పురాతన పద్దతి. ఇది మీకు నల్లని మరియు పొడుగైన జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. హెన్నా మరియు కాఫీ పొడిని ఉపయోగించి హెయిర్ ప్యాక్ ని తయారు చేయవచ్చు. ఒక స్టీల్ బౌల్ లో ఒక స్పూన్ హెన్నా పొడి, రెండు స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం, ఒక స్పూన్ కటేచు(catechu) పొడి మరియు ఒక స్పూన్ ఉసిరి పొడి ని వేసి బాగా కలపాలి. ఒక చిక్కని పేస్ట్ లా చేసుకొని వెంట్రుకలపై రాయాలి. బాగా ఆరిన తరువాత 30-60 నిమిషాల తరువాత తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
 6. ఎర్త్ వాటర్ హెయిర్ ట్రీట్‌మెంట్ : వినటానికి వింతగా ఉండవచ్చు. కానీ ఈ పద్దతి కూడా ప్రీ మెచ్యూర్ వైట్ హెయిర్ ని నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. మీ గార్డెన్ లో ఏదైనా ఒక ప్రదేశంలో మట్టిని తవ్వి ఒక బౌల్ లో తీసుకోండి. ఈ మట్టిని నీటితో లేదా జెల్లడను ఉపయోగించి చిన్న పురుగు లేదా మురికిని శుభ్రపరచండి. ఆ తరువాత ఈ మృదువైన మట్టిని కొంత నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకొని కురులపై అప్‌లై చేయండి. 15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో తల స్నానం చేయండి. ఈ పద్దతిని క్రమంగా పాటించటం వలన నల్లని జుట్టు పొందటం మాత్రమే కాదు, నిద్ర లేమి మరియు తలనొప్పి వంటి అనారోగ్యాలను కూడా సరిచేస్తుంది.
 7. నువ్వు గింజలు హెయిర్ ప్యాక్ : మార్కెట్ లో నల్లని నువ్వు గింజలు లభించినట్లయితే వాటిని ఉపయోగించి నల్లని కురులను మీ సొంతం చేసుకోవచ్చు. తెల్ల నువ్వు గింజలు కూడా ఉపయోగించవచ్చు కానీ నల్ల నువ్వు గింజలలో అధిక పోషకాలు మరియు విటమిన్లు ఉంటాయి. కనుక ఫలితాలను తొందరగా ఇస్తుంది. ఒక కప్పు నువ్వు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి మిక్సీలో వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ ని మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి 30 నిమిషాల తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ ని క్రమంగా ఉపయోగించటం వలన బలమైన మరియు నల్లని జుట్టుని పొందుతారు.
 8. నెయ్యి మరియు ములెతి1 KG కాచిన నెయ్యి, 250 గ్రాముల ములెతి మరియు 1 లీటరు ఉసిరి రసం ను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాలని వేడి చేసి బాగా మరిగించాలి. బాగా మరిగిన తరువాత ఒక సీసాలో స్టోర్ చేసుకోవాలి. ప్రతి సారి తలస్నానం చేసే 15-20 నిమిషాల ముందు మీ తలకు రాసుకోవాలి. ఇలా క్రమంగా చేయటం వలన నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.
 9. మామిడి పండు మరియు మామిడి ఆకుల హెయిర్ ప్యాక్ : కొన్ని మామిడి ఆకులు మరియు పచ్చి మామిడి పైన పచ్చని తొక్కను తీసుకుని మిక్సీలో రుబ్బి పేస్ట్ లాగా చేసుకోవాలి. నీటికి బదులుగా ఈ పేస్ట్ కొరకు ఏదైనా నూనెని వాడాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చాలా సమయం ఎండలో ఎండబెట్టాలి. అలా బాగా ఎండిన మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి శుభ్రం చేసుకుంటే జుట్టు ఊడిపోయే సమస్య తగ్గి అందంగా సహజమైన నల్లని జుట్టు పొందవచ్చు.
 10. మామిడి నూనె : నల్లని వెంట్రుకల కొరకు మామిడి ఆయిల్ ని కూడా ఉపయోగించవచ్చు. ఈ నూనెని క్రమంగా వాడటం వలన తెల్ల వెంట్రుకలు పూర్తిగా నల్లబడతాయి మరియు డాండ్రఫ్ సమస్య కూడా తొలగిపోతుంది.
 11. నారింజ పీల్ హెయిర్ ప్యాక్ : ఒక నారింజ పండు యొక్క తోలుని బాగా మాష్ చేసి పల్ప్ లాగా చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ ఆమ్లా పొడిని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుపై రాసి 20-30 నిమిషాల తరువాత తల స్నానం చేయండి.
 12. కొబ్బరి నూనె మరియు నిమ్మరసం : మీ కురులకు సరిపడే కొబ్బరి నూనెని ఒక బౌల్ లో తీసుకొని వేడి చేయండి. నూనె వెచ్చగా అయిన తరువాత అందులో సగం నిమ్మపండు లోని రసాన్ని పిండాలి. ఇప్పుడు ఈ వెచ్చని ఆయిల్ ని మీ స్కాల్ప్ మరియు వెంట్రుకలపై రాసి కొంత సేపు మసాజ్ చేయండి. 20-30 నిమిషాల తరువాత తల స్నానం చేయండి. ఈ పద్దతిని రెగ్యులర్గా ఫాలో చేయటం వలన నల్లని జుట్టుని పొందటంతో పాటు డాండ్రఫ్ సమస్య కూడా తొలగిపోతుంది.
 13. ఉసిరి మరియు నిమ్మరసం హెయిర్ ప్యాక్ : ఒక బౌల్ నీటిలో రెండు చెంచాల ఉసిరి పొడి మరియు నిమ్మకాయని సగంగా కోసి ఒక ముక్కలోని రసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని కురులు మరియు స్కాల్ప్ పై రాసి మృదువుగా మసాజ్ చేయాలి. కొంత సమయం మసాజ్ చేసిన తరువాత 20-30 నిమిషాలు ఉంచి తలస్నానం చేయండి. ఇలా రెగ్యులర్గా వీలైతే ప్రతి రోజూ చేస్తే అతి తక్కువ సమయంలో అందమైన నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.
 14. ఉల్లిపాయ హెయిర్ ప్యాక్ : సహజమైన నల్లని కురులను పొందేందుకు ఉల్లిపాయ ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉల్లిపాయను సగంగా కట్ చేసి డైరెక్ట్ గా స్కాల్ప్ పై మసాజ్ చేయొచ్చు. లేదా ఉల్లిపాయను కోసి మిక్సీలో వేసి జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ ని వెంట్రుకలు మరియు స్కాల్ప్ పై పూర్తిగా రాయాలి. రాసిన 30 నిమిషాల తరువాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మంచి ఫలితాలను పొందుతారు.
 15. బ్లాక్ టీ, బ్రింగారాజ్ పొడి మరియు గుడ్డు హెయిర్ ప్యాక్ : ఒక బౌల్ లో బ్రింగారాజ్ పొడి, బ్లాక్ టీ, హెన్నా పౌడర్ మరియు నిమ్మరసం ను సమాన మోతాదుల్లో వేసుకొని ఒక గుడ్డు ను కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి చిక్కని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంత వెచ్చని నీటిని కలిపి మృదువైన పేస్ట్ లా చేసి కురులు మరియు స్కాల్ప్ పై రాయాలి. రాసిన 2 గంటల తరువాత చల్లని నీటితో తల స్నానం చేయాలి.
 16. నిమ్మ మరియు ఆల్మండ్ ఆయిల్ : ఆల్మండ్ ఆయిల్ లో అధిక విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన తెల్ల జుట్టుని తొందరగా నివారిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ మరియు కొంత నిమ్మరసం ని కలిపి స్కాల్ప్ మరియు జుట్టుకు అప్‌లై చేసి 30 నిమిషాల తరువాత తలస్నానం చేయండి.
 17. కరివేపాకు మరియు కొబ్బరి నూనె హెయిర్ ప్యాక్ : ఒక కప్పు కొబ్బరినూనెలో ఒక చేతి నిండు కరివేపాకులను వేసి స్టవ్ మీద ఉంచి 10 నిమిషాలు వేడి చేయాలి. ఆకులు నల్లగా మారిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ నూనెని రాత్రి పడుకునే ముందు మీ కురులపై మరియు స్కాల్ప్ పై రాసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయండి. కరివేపాకులో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇది కురులు నల్లగా కావటానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనె జుట్టుకు పోషకాలను అందిస్తుంది. వారానికి 2-3 సార్లు ఈ నూనెని ఉపయోగించేందుకు ప్రయత్నించండి.
 18. బీరకాయ థెరఫీ : వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా బీరకాయలు కేశాలకు ఎంతో మేలు చేస్తుంది. అర కప్పు బీరకాయ ముక్కలు తీసుకొని సన్నగా కట్ చేసి ఎండబెట్టాలి. తర్వాత వాటిని అర కప్పు కొబ్బరి నూనెలో వేసి 4-5 రోజులు బాగా నానబెట్టాలి. ఆ తర్వాత ముక్కలతో పాటు నూనెని మరిగించాలి. బీరకాయ ముక్కలు నల్లగా మారే వరకూ మరిగించి వడగట్టుకోవాలి. గోరు వెచ్చగా మారిన తర్వాత తలకు అప్‌లై చేసి 30 నిమిషాల తరువాత తల స్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
 19. నువ్వులు మరియు కాస్టర్ నూనె : మీ కురుల యొక్క పొడుగును బట్టి మీకు కావాల్సినంత నువ్వుల నూనె మరియు కాస్టర్ ఆయిల్ ని సమాన మోతాదుల్లో ఒక బౌల్ లో కలుపుకొని ఆ బౌల్ ని వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత వెచ్చని నూనెని రాత్రి పడుకునే ముందు తలంతా అప్‌లై చేసుకోవాలి. ఉదయం వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్గా చేయటం వలన అందమైన నల్లని కురులు మీ సొంతం అవుతాయి.
 20. ఆముదం : ఆముదం నూనెలో యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ప్రీ మెచ్యుర్ గ్రే హెయిర్ ను నివారిస్తాయి మరియు బట్టతల రాకుండా సహాయపడుతుంది. ఆముదం నూనెని స్కాల్ప్ మరియు వెంట్రుకలకు పట్టించి మసాజ్ చేయాలి. మీకు వీలైనంత సమయం కనీసం 30 నిమిషాల వరకు ఉంచుకొని ఆ తరువాత తల స్నానం చేయాలి. దీన్ని వారంలో కనీసం రెండు సార్లు ఉపయోగిస్తే మంచిది.
 21. మెంతులు : రాత్రిపూట కొన్ని మెంతుల్ని నీటిలో నానబెట్టి ఉదయం పేస్టు చేసి జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మృదువుగా కూడా అవుతుంది.
 22. క్యారెట్ మరియు నువ్వుల నూనె థెరఫీ : అర టీస్పూన్ క్యారెట్ ఆయిల్ ను 4 చెంచాల నువ్వుల నూనెలో మిక్స్ చేసి స్కాల్ప్ మరియు కురులపై అప్‌లై చేసి మసాజ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు రాదు మరియు హెయిర్ కు నేచురల్ బ్లాక్ కలర్ వస్తుంది.
Posted on

Telugu tips to make hips smaller – హిప్ సైజ్ ని తగ్గించటం ఎలా? – వ్యాయామాలు మరియు హోమ్ రెమెడీస్

స్త్రీలు అందంగా కనపడాలంటే ఆకర్షణీయమైన ముఖ సౌందర్యంతో పాటు అందమైన ఆకారం కూడా ఉండాలి. ఇటీవల కాలంలో జీరో సైజ్ అని వినే ఉంటాము. అలాంటి ఆకారం పొందేందుకు ఎన్నో ప్రయత్నాలను కూడా చేస్తూ ఉంటాము. అందులో ఒక భాగమే ఈ హిప్ సైజుని తగ్గించటం.

మన ముందు జనరేషన్లో మన అమ్మ మరియు అమ్మమ్మ పనులు ఎక్కువ చేసేవారు కాబట్టి ఎలాంటి వ్యాయామాలు చేయకపోయినా ఆరోగ్యంగా మరియు మంచి శారీరక ఆకారంతో ఉండేవారు. కానీ కాలం మారే కొద్ది జీవన శైలిలో మార్పులు ఏర్పడటం వలన ఆరోగ్యము మరియు శారీరక ఫిట్‌నెస్ కూడా తగ్గిపోయింది.

ప్రస్తుత కాలంలో ముఖ్యంగా అమ్మాయిలు మోడ్రన్ దుస్తులు వేసుకోవాలని ఆశపడతారు. కానీ సరైన ఫిట్‌నెస్ లేకపోతే కొన్ని దుస్తులను ధరించ లేరు. ముఖ్యంగా సన్నటి నడుము ఉండాల్సిందే. మరి సన్నటి నడుమును పొందటం ఎలా? ఆహార పద్దతులను మార్చుకుంటే సరిపోతుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఆహారంలో మార్పులు అవసరమే, కానీ కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. అప్పుడే మంచి ఆకారంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది.

శరీరంలో ఎలాంటి మార్పులను పొందాలన్నా సరైన ఆహారం అనగా సరైన డైట్, వ్యాయామం, జీవనశైలిలో కొన్ని మార్పులు మరియు కొన్ని హోమ్ రెమెడీస్ ని పాటించక తప్పదు. మరి నాజూకైన నడుమును పొందేందుకు మీరు చేయాల్సిన వ్యాయామాలు మరియు హోమ్ రెమెడీస్ ని ఈ ఆర్టికల్ లో చూద్దాం.

నాజూకైన నడుమును పొందేందుకు వ్యాయామాలు

 1. స్క్వాట్స్ : సరైన ఆకృతి గల నడుమును పొందేందుకు స్క్వాట్స్ ఒక మంచి వ్యాయామం. మీ పాదాలను భుజాల వెడల్పు దూరంలో ఉంచి మోకాళ్లను వంచండి. ఇలా చేసేటప్పుడు మీ చేతులను జోడించి ఛాతికి దగ్గరగా ఉంచండి. ఈ పొజిషన్లో 2 సెకండ్లు ఉండి నార్మల్ పొజిషన్‌కి రావాలి. ఇలా 5 సార్లు చేసి కొంత గ్యాప్ తీసుకొని మల్లి చేయాలి. ఇలా 3 సెట్స్ గా చేయాలి.
 2. వన్ లెగ్ స్క్వాట్స్ : పిస్తోల్ స్క్వాట్స్ అని కూడా పిలువబడే వన్ లెగ్ స్క్వాట్స్ హిప్ కండరాలను టోన్ చేయడానికి చాలా ప్రభావితమైనది. అయితే కొత్తగా వ్యాయామం చేయటం ప్రారంభించిన వారికి ఇది సాధ్యం కాదు. కనుక కొన్ని రోజుల తరువాత ఈ వ్యాయామాన్ని ప్రయత్నించండి. నేరుగా మీ కాళ్లపై నిలబడి మీ చేతులు ముందుకు చాచి ఒక కాలిని నేరుగా చెప్పండి. ఇప్పుడు మీరు నిలబడి వున్న కాలిని వీలైనంత వరకు వంచండి మరియు నడుమును కొద్దిగా వెనక్కు నెట్టేందుకు ప్రయత్నించండి. ఇలా కొన్ని సెకండ్స్ బాలన్స్ చేయండి. తిరిగి స్ట్రెయిట్ పొజిషన్‌కి  వచ్చి ఇదే పద్దతిని మరో కాలుతో ప్రయత్నించండి. ఇలా మూడు సార్లు చేసి గ్యాప్ తీసుకొని మల్లీ రిపీట్ చేయాలి. మొదట్లో కనీసం 3 సెట్లు, ప్రతి సెట్లో 3 సార్లు చేయండి. క్రమంగా నంబర్ ఆఫ్ సెట్స్ ని పెంచుకోండి.
 3. ఫార్వర్డ్ లంగ్స్ : మీ తొడ మరియు నడుము లోని కండరాలను టోన్ చేసేందుకు ఇది ఒక మంచి వ్యాయామం. మీ కాళ్లపై నేరుగా నిలబడి ఒక పాదంను ముందుకు పెట్టి మోకాలు రెండింటినీ నెమ్మదిగా వంచాలి. మీ వెన్నెముకను నేరుగా ఉంచి అలా 5 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నార్మల్ పొజిషన్‌కి రావాలి. ఇదే విధంగా మరో కాలును కూడా ముందుకు పెట్టి ప్రాసెస్ ని రిపీట్ చేయాలి. ఇలా 5 సార్లు చేసి గ్యాప్ తీసుకొని మరో 5 సార్లు చేయాలి. మొత్తం 4 సెట్లుగా చేయటం ప్రారంభించి క్రమంగా అధికరించండి.
 4. సైడ్ లంగ్స్ : ఈ వ్యాయామం కూడా మీ నడుము మరియు తొడ కండరాలను టోన్ చేసి కొవ్వును తగ్గిస్తుంది. కాళ్లను వెడల్పుగా ఉంచి నేరుగా నిలబడండి. ఇప్పుడు ఒక మోకాలిని వంచి ఒక వైపు శరీరాన్ని మొత్తం వీలైనంతగా స్ట్రెచ్ చేయాలి. ఈ పొజిషన్లో కొన్ని సెకండ్స్ బాలన్స్ చేసి ఆ తరువాత మరో వైపు కూడా ఇలాగే చేయాలి. ఇలా 5 సార్లు 4 సెట్స్ గా ప్రారంభించి క్రమంగా అధికరించండి.
 5. సైడ్ స్టెప్ అప్ : ఈ వ్యాయామం చేయటానికి ఒక ఎతైన మరియు బరువైన బెంచ్ కావాలి. బెంచు యొక్క ఎత్తు మీకు తగట్టుగా అమర్చుకోవచ్చు. మీకు ఎడమ వైపు బెంచ్ ని ఉంచి వ్యాయామం ప్రారంభించండి. ఎడమ కాలిని బెంచ్ మీద ఉంచి శరీరాన్ని పైకి లేపి మరో కాలిని గాలిలో ఉంచి 2 సెకండ్స్ బాలన్స్ చేయండి. ఆ తరువాత తిరిగి నార్మల్ పొజిషన్‌కి రండి. ఇప్పుడు ఇలాగే కుడి కాలితో కూడా చేయాలి.
 6. సైడ్ ప్లాంక్ : సైడ్ ప్లాంక్ పొజిషన్లో పడుకొని ఒక కాలిని మాత్రం మెల్లగా పైకి లేపి 2 సెకండ్స్ తరువాత స్టార్టింగ్ పొజిషన్ కి రావాలి. ఇలా 6-8 సార్లు చేసిన తరువాత మరో వైపు తిరిగి ఇదే ప్రాసెస్ ని రిపీట్ చేయాలి.
 7. కార్డియో వ్యాయామాలు : కార్డియో వ్యాయామాలు చేయటం వలన మంచి ఆకారం మరియు సరైన రూపంను పొందుతారు. ఇది స్వయంచాలకంగా మీ నడుము ట్రిమ్ అవటానికి సహాయం చేస్తుంది. ప్రతి రోజు 20-30 నిమిషాల వరకు కార్డియో వ్యాయామాలను చేయండి.
 8. రన్నింగ్ : రన్నింగ్ కూడా ఒక మంచి వ్యాయామం. ఈ వ్యాయామం మీ శరీరం మొత్తం ఉన్న కొవ్వును తగ్గించి కాళ్లు మరియు నడుము కండరాలను టోన్ చేస్తుంది.
 9. సైక్లింగ్ : మీ హిప్ లోని అదనపు కొవ్వును కరగించటానికి మరియు కండరాలను టోన్ చేయడానికి సైక్లింగ్ చాలా ప్రభావితమైన వ్యాయామం.

మరి కొన్ని వ్యాయామాలు

 • నిటారుగా నిలబడి రెండు కిలోల వెయిట్స్‌ ని చేతుల్లోకి తీసుకొని, కుడి మరియు ఎడమ వైపుకి శరీరాన్ని వంచాలి. ఇలా రెండు వైపులా 20 సార్లు చేయాలి.
 • వెల్లకిలా పడుకొని రెండు కాళ్లనూ వంచి పైకి లేపాలి. పొట్టను లోపలికి పీల్చి చేతులు రెండు గాల్లోకి లేపి 20 అంకెలు లెక్కపెట్టి రిలాక్స్‌ అవ్వాలి.
 • ముందు చెప్పిన భంగిమలోనే ఉండి కాళ్లని, చేతుల్ని మడిచి కుడి మోచేయి, ఎడమ మోకాలిని తాకేలా వంగాలి. ఇలా రెండో వైపు కూడా చేయాలి.
 • ట్విస్టర్‌ మీద నిలబడి సాధ్యమైనంత మేరకు శరీరాన్ని అటూ, ఇటూ తిప్పాలి. ఇలా తిప్పేటప్పుడు శరీర కిందిభాగం మాత్రమే కదిలేలా చూసుకోవాలి. ఇలా 50 రిపిటిషన్స్‌ చేయాలి.

గమనిక : వ్యాయామాలను మొదటి సారి ప్రయత్నించే వారు తగిన గైడెన్స్ తో ప్రారంభించాలి. ప్రతి వ్యాయామం యొక్క పొజిషన్స్ మరియు విధానాలను పూర్తిగా అర్థం చేసుకొన్న తరువాతే చేయాలి.

సన్కని నడుము కొరకు హోమ్ రెమెడీస్

 1. ఆపిల్ సీడర్ వినిగర్ : ఆపిల్ సీడర్ వినిగర్ స్మూత్ మరియు సిల్కీ హెయిర్ కోసం ఉపయోగిస్తారని అందరికి తెలుసు. కానీ ఇది శరీరంలోని కొవ్వును తగ్గించటానికి కూడా ఉపయోగపడుతుంది. ఆపిల్ సీడర్ వినిగర్ తో 20 నుంచి 30 నిముషాల పాటు మీ నడుముపై మసాజ్ చేయండి. వట్టి ఆపిల్ సీడర్ వినిగర్ కాకుండా కొంత ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెతో 1 స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్‌ను కలిపి ఉపయోగించవచ్చు. మసాజ్ చేసిన తరువాత ఒక హాట్ ప్యాక్ ని అప్‌లై చేసి శుభ్రం చేసుకోండి. ఇలా రోజుకు రెండు సార్లు చేయండి.
 2. బ్రౌన్ షుగర్ తో కాఫీ : కాఫీ శరీరంలోని కొవ్వుని తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్‌ ని మెరుగు పరుస్తుంది. తద్వారా ఇది నడుము సన్నగా అవ్వటానికి సహాయపడుతుంది. రెండు స్పూన్ కాఫీ ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ మరియు ఒక స్పూన్ తేనెని కలిపి ఒక స్క్రబ్ ని తయారు చేయాలి. ఈ స్క్రబ్ తో మీ నడుం భాగంపై 6-8 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తరువాత 10 నిమిషాలు అలాగే ఉంచి నీటితో కడగండి. ఇలా వారానికి 4-5 సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
 3. సీ సాల్ట్ మరియు కొబ్బరి నూనె : సీ సాల్ట్ లో అనేక ఖనిజాలు ఉన్నాయి. ఉప్పుని కొబ్బరి నూనెతో కలిపి ఉపయోగించినప్పుడు ఇది కొవ్వును కరిగించి కండరాలను టోన్ చేస్తుంది. రెండు స్పూన్ కొబ్బరి నూనె మరియు 1 టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి ఈ మిశ్రమంతో చర్మంపై 15 నిముషాల పాటు మసాజ్ చేయండి. తరువాత వేడి నీటి టవల్‌తో హాట్ కంప్రెస్ చేయండి. మరొక 10 నిముషాల తరువాత నీటితో కడిగి శుభ్రం చేయండి.

నడుము చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్ కరిగించటానికి బెస్ట్ ఫుడ్స్ / విస్ట్ స్లిమ్మింగ్ ఫుడ్స్

 1. నిమ్మ మరియు తేనె : ఒక గ్లాస్ వెచ్చని నీటిలో ఒక నిమ్మరసం మరియు రెండు స్పూన్ తేనె వేసి బాగా కలిపి త్రాగాలి. ఇది ఉదయం వట్టి కడుపుతో త్రాగితే మంచి ఫలితాలను ఇస్తుంది.
 2. అల్లం : అల్లంలో ఉన్న ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. అనారోగ్య సమస్యలనే కాదు, అధిక ఫ్యాట్ ని కరిగించడంలో కూడా అల్లం బాగా పనిచేస్తుంది. అల్లంలో ఉండే జింజరాల్ అనే పదార్థం శరీరంలో ఉన్న అధిక నీటిని బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే పొట్టలో పిహెచ్ లెవెల్స్ పెంచడంలోనూ అల్లం సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు మెటబాలిక్ రేట్ ని పెంచడానికి సహాయపడుతుంది. ఒక గ్లాస్ నీటిని తీసుకొని ఉడికించాలి. ఒక ముక్క అల్లం తీసుకొని శుభ్రం చేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మరుగుతున్న నీటిలో కలపాలి. మరో 5 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. ఆ నీటిని చల్లార్చి వడకట్టి తాగాలి.
 3. ఓట్స్ బ్రాన్ : ఓట్స్ బ్రాన్ లో 18 గ్రాముల ఫైబర్, 20 గ్రాముల ప్రోటీన్స్ ఉన్నాయి. లోఫ్యాట్ మిల్క్ లో ఓట్స్ బ్రాన్ కలిపి ఉదయం అల్పాహారంలో తీసుకోవచ్చు. ఇది చెడు కొవ్వును తొలగిస్తుంది.
 4. స్వీట్ పొటాటో : స్వీట్ పొటాటోలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఆలస్యంగా జీర్ణమవుతాయి. దాంతో ఎక్కువ సమయం ఆకలి లేకుండా చేస్తుంది. కనుక దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా చేర్చుకోండి.
 5. గోధుమ : నడుము చుట్టు పేరుకున్న కొవ్వును కరిగించుకోడానికి గోధుమ సహాయపడుతుంది. తృణధాన్యాలతో తయారుచేసే ఆహారాలు తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఫైబర్ కొవ్వుని కరిగించడానికి సహాయపడతాయి.
 6. బ్లాక్ రైస్ : బ్లాక్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ ఇ ఎక్కువగా మరియు షుగర్స్ తక్కువగా ఉంటుంది. కనుక ఫ్యాట్ ని కరిగించటానికి సహాయపడుతుంది.
 7. వైట్ టీ : వైట్ టీ లిపోలిసిస్ ను పెంచుతుంది. ఇది ఫ్యాట్ ను కరిగిస్తుంది. కొవ్వు చేరడానికి కారణమయ్యే ఫ్యాట్ సెల్స్ ని కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది కొవ్వును శక్తిగా మార్చడంతో కాలేయం పనితీరును వేగవంతం చేస్తుంది.
 8. బ్లాక్ బీన్స్ : బ్లాక్ బీన్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వుని కరిగించడంలో కూడా సహాయపడుతుంది.
 9. అవొకాడో : అవొకాడోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవొకాడో ని సలాడ్స్ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
 10. చిక్ పీస్ : ఇందులో ప్రోటీన్స్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. పాస్తాలో కంటే ఇందులో ఫైబర్ నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. కొవ్వును తగ్గించి కండరాలను బిల్డ్ చేయడంలో ఇది ఒక బెస్ట్ డైట్ గా పనిచేస్తుంది.
 11. పచ్చి బఠానీలు : ఇవి క్రంచీ స్నాక్స్. ఒక కప్పు పచ్చి బఠానీలలో 7 గ్రాముల ప్రోటీన్స్, 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. స్నాక్స్ గా దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిస్తుంది.
 12. డార్క్ చాక్లెట్ : డార్క్ చాక్లెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బరువుని తగ్గిస్తుంది. ఇందులో ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఎక్కువ.
 13. బాదంలు : బాదంలలో డైటరీ ఫైబర్ ఎక్కువ. ఒక కప్పు బాదంలో 20 మిల్లీగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. ఇంకా వీటిలో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్స్ అధికం.
 14. గ్రేప్ ఫ్రూట్ : గ్రేప్ ఫ్రూట్ బాడీ ఫ్యాట్ ని బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఇందులో్ ఫైటో కెమికల్స్ అధికంగా ఉన్నాయి.
 15. చియా సీడ్స్ : చియా సీడ్స్ లో ఉండే ప్రోటీన్ ఎక్కువ సమయం ఆకలి కాకుండా పొట్ట ఫుల్ గా ఉండే ఫీలింగ్ ను కలిగిస్తుంది. దాంతో వేరే ఇతర ఆహారాలు తినకుండా కంట్రోల్ చేస్తుంది.
 16. హాట్ పెప్పర్ : హాట్ పెప్పర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల 25 శాతం మెటబాలిజం రేటు పంచుతుంది ఇది శరీరంలో క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది. తక్కువ ఆకలిని కలిగిస్తుంది.
 17. సెలరీ : ఫ్యాట్ టమ్మీని కరిగించి నడుము నాజూగ్గా మార్చే ఆహారాల్లో సెలరీ ఒకటి. దీన్ని తప్పనిసరిగా ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాల్సిందే. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్లో క్యాలరీలు తక్కువ. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని స్లిమ్ గా మార్చడంతో పాటు ఫిట్ గా చేస్తుంది. ఇది ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.
 18. పెరుగు : మీరు విస్ట్ స్లిమ్మింగ్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవాల్సిన వాటిలో మరో హెల్తీ ఫుడ్ పెరుగు. దీన్ని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని, రెగ్యులర్ గా తినాలి. ఫ్లేవర్డ్ యోగర్ట్ ను నివారించి, నేచురల్ గా ఇంట్లో తయారు చేసుకొన్న పెరుగును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల విస్ట్ లైన్ తగ్గుతుంది.

ఆహారం మరియు జీవన శైలిలో చేయాల్సిన కొన్ని మార్పులు

 • కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే బంగాళదుంపలు, తీపి పదార్ధాలు, తెల్లటి పిండి తో చేసిన లేదా రిఫైన్ చేసిన బ్రెడ్, పాస్తా వంటివి తినకండి.
 • ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచేందుకు వీలైనంతవరకు రైస్ వంటి కార్బోహైడ్రేట్లను బాగా తగ్గించండి. కార్బోహైడ్రేట్లు ఆరోగ్యమైన బరువు వున్నంతవరకు మంచివే. కాని పొట్ట భాగంలో అధిక కొవ్వు పేరుకుపోయినప్పుడు తగ్గించాల్సిందే.
 • తాజా కూరగాయలు అధికంగా తినండి.
 • పండ్లు, బెర్రీల వంటివి తినండి. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లే మీకు సరిపోతాయి.
 • గుడ్లు, పప్పులు, లీన్ మీట్, చేప, చికెన్ వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాలను తినండి.
 • ఆరోగ్యకరమైన ఆలివ్ నూనె తో వేయించిన కూరలు, చికెన్, ఫిష్ వంటివి తినండి.
 • కొబ్బరి నూనె, ఒమేగా 3 ఉండే చేప నూనె ఉపయోగించండి.
 • ఆఫీస్ లో లేదా అపార్ట్‌మెంట్లలో ఉన్నట్లయితే లిఫ్ట్ కి బదులుగా స్టైర్ కేస్ ని ఉపయోగించండి.
 • మీరు తీసుకునే కేలరీల మొత్తం కనిష్ట స్థాయిలో ఉండాలి. కనుక ఎంత మోతాదులలో తింటున్నారని గమనించండి. అధిక కేలరీలను తీసుకున్నట్లయితే వ్యాయామాల ద్వారా వాటిని కరిగించాలి.
 • ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవటం చాలా ముఖ్యం. నట్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి. అలాగే తక్కువ కేలరీలు ఉన్న పదార్థాలు మరియు ఫైబర్ ఎక్కువగా ఉన్న వాటిని ఎంచుకోవాలి.
 • మీ శరీరం నుండి టాక్సిన్స్ మరియు కొవ్వును ఫ్లష్ చేయటానికి ప్రతి రోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని త్రాగాలి.
 • రోజుకు 2-3 సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుందని డైటీషియన్లు అంటున్నారు.
 • కొవ్వు నియంత్రణలో విటమిన్ డి పాత్ర  చాలా కీలకం. విటమిన్ డి తగ్గితే కొవ్వు కరగడం జరగని పని. కాబట్టి ఉదయాన్నే కొంత సేపు సూర్యరశ్మి తగిలే విధంగా వాకింగ్, సైక్లింగ్, యోగా, బ్రీతింగ్ వంటి వ్యాయామాలు చేయటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
 • నిద్రలేమి వల్ల కూడా కొవ్వు పెరిగే అవకాశాలున్నందున రాత్రి పూట వీలైనంత త్వరగా నిద్ర పోవాలి.