Posted on

Telugu sandalwood face packs – అందం కోసం “చందనం(గంధం)”తో చేసే ఫేస్ ప్యాక్స్,ఫేస్ మాస్క్స్

అందం, దీనికోసం అందరూ ఏమిచేయడానికైన సిద్దపడతారు,దీన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూంటారు, అయితే అందమైన చర్మం కోసం చందనం చెప్పే మరింత అందమైన చిట్కాలు చుసేద్దామ. చందనం, గులాబీలు, ఈ రెండిటి కలియక అనేక సత్ఫలితాలను ఇస్తుంది, ఈ రెండింటిని కలిపి ముఖానికి పట్టించుకుంటే మీ చర్మం ఎంతో తాజాగా, అందంగా, మరియు యవ్వనంగా కనిపించడమే కాకుండా, మీ ముఖం పై ఉన్న మొటిమలు, నల్ల మచ్చలు తొలగిపోయి, మీ ముఖం మృదువుగా మారి ,ఎంతో కాతివంతంగా మెరుస్తుంది.
 అందమైన చర్మానికి చందనం ఇలా అంటుంది..

చందనం(గంధం)ఫేస్ ప్యాక్స్  1:

చందనం మన చర్మానికి ఎంతో మంచిది, ఇది మన చర్మంలోని నల్ల మచ్చలు, మొటిమములు,ముడతలు, ఇలా అన్నింటినీ తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.అయితే దీనిని జిడ్డు మరియు పొడి చర్మం కోసం ఉపయోగించుకోవచ్చు,
జిడ్డు గల చర్మం అయితే కొన్ని  క్రీము పదార్థాలతో కలిపి ఉపయోగించండి,పొడి చర్మం అయితే పన్నీరుతో కలిపి ఉపయొగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
 కావలసినవి:
2 టేబుల్ స్పూన్లు చందనం పొడి
పన్నీరు
 తయారుచేసుకునే పద్దతి:
 2 టేబుల్ స్పూన్లు చందనం పొడి, కొంచెం పన్నీరు తీసుకుని పేస్ట్ లా చేయండి.మీ ముఖాన్ని శుబ్రంగా చల్లని నీటితో శుబ్రం చేసుకుని,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించండి,
20 నిమిషాల తరువాత మెల్లగా చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి సత్ఫలితాలు పొందుతారు.
 ఈ పన్నీరులోని సువాసన పరిమళం మీ మనసుని,మెదడుని ప్రశాంతంగా ఉంచి మీ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.
ఈ పన్నీరు వల్ల మన చర్మంలోని మలినాలు అన్నీ పొయి, మీ చర్మంలోని చర్మ కణాలు తెరుచుకుని, మీ చర్మం ఎంతో అందంగా, కాంతివంతంగా మారుతుంది.
అధిక వేడివల్ల మీ ముఖం పై వచ్చే ఎర్రని కందిన మచ్చలను దూరం చేసి మంచి మచ్చ రహితమైన చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.

చందనం(గంధం)ఫేస్ ప్యాక్స్  2:

కావలసినవి:
రోజ్ రేకుల
నూరిన వోట్స్
తాయారుచేసుకునే విధానం:
 2 రోజా పూల రేకులు తీసుకుని, 2  టేబుల్ స్పూన్లు నూరిన వోట్స్ తీసుకుని,కొంచెం నీరు కలిపి, పేస్ట్ లాగా చేసి 5 నిమిషాల్లో మీ ఫేస్ ప్యాక్ రెడీ అయిపోతుంది.
మీ చర్మం పొడిగా ఉంది అనిపించిన ప్రదేశంలో కొంచెం నీరుతో శుబ్రం చేసి ఈ మిశ్రమాన్ని పట్టించి 20 నిమిషాల తరువాత చూసుకుంటే, మీరు ఊహించని అందమైన, కోమలమైన,యవ్వనమైన చర్మం మీ సొంతం అవుతుంది.

 చందనం(గంధం)ఫేస్ ప్యాక్స్ 3:

ఈ ఫేస్ ప్యాక్ మన చర్మంలోని మొటిమలను, మచ్చలను తొలగించి యవ్వనమైన చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది, అయితే ఈ మిశ్రమంలో పసుపుని కూడా కలిపితే మీ చర్మంలో ఉన్న క్రిములని నాశనం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
 కావలసినవి:
1 టేబుల్ స్పూన్ పసుపు
2 టేబుల్ స్పూన్ లు గంధం పొడి
3 టేబుల్ స్పూన్ లు తేనె
 తాయారుచేసుకునే విధానం:
పైన సూచించిన వన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలిపి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి.మంచి సువాసనతో పరిమళించే ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ, మీ శరీరం అంతా పట్టించుకోవచ్చు, 20 నిమిషాల తరువాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుబ్రం చేసుకుంటే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.
Posted on

Telugu tips for pimples and black spots – మొటిమలు, నల్ల మచ్చల నిర్మూలన కోసం సహజమైన పద్దతులు

పసుపు – చర్మాన్ని సం రక్షించే పదార్దాలలో, పసుపు ఎంతో ముఖ్యమైనది. ఇది మన చర్మంలోని జిడ్డు తనాన్ని తొలగించి, దద్దుర్లు, మొటిమల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది మన చర్మాన్ని నిగారింపచేసి ఎంతో అందంగా మరియు మృదువుగా మారుస్తుంది.

పసుపులోని గుణాలు చర్మాన్ని శుబ్రపరిచి, పనికిరాని అంటే సరిగా లేని చర్మాన్ని తోలగించి కొత్తగా, అందమైన మరియు, ఎంతో మృదువైన చర్మాన్ని ఇస్తుంది.

ఈ పసుపుతో చేసిన “ఫేస్ ప్యాక్” మొటిమల్ని నిర్మూలించి, చర్మాన్ని ఎంతో కాంతివంతంగా చేస్తుంది. ఇది మీ శరీరంలోని మలినాలని, దుమ్ము, ధూళిని, మరియు బ్యాక్టీరియా ని తొలగించి యాంటీ బాక్టీరియల్ గా  పనిచేస్తుంది.

పసుపు మీ చర్మంలోని జీవం కోల్పోయిన కణాలని తొలగించి, శుబ్రపరిచి, ఎంతో కాంతివంతమైన, మరియు తేజోవంతమైన చర్మాన్ని ఇస్తుంది. మన చర్మం లోని రంద్రాలని దుమ్ము మరియు మలినాల నుండి శుబ్రపరిచి, సహజత్వంతో కూడిన చర్మాన్ని ఇస్తుంది.

పసుపు మరియు ఓట్స్ పిండితో తయారు చేసిన “ఫేస్ ప్యాక్”

కావలసినవి :

పసుపు: 2 చిటికెలు (కొద్దిగా),

ఓట్స్ పిండి: 4-5 స్పూన్లు,

తేనె: 3-4 స్పూన్లు,

పచ్చి పాలు: 4-5 స్పూన్లు

తయారుచేసుకునే విధానం :

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి రాసుకుని  15-20 నిమిషాల తరువాత  గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, పాలు తేనే మన ముఖంలోని తేమను కాపాడతాయి, పసుపు మన ముఖం పై ఉన్న మచ్చలు, మోటిమలను శుబ్రం చేసి, ఎంతో కాంతివంతమైన చర్మాన్ని ఇస్తుంది.

ఈ చిట్కా పొడిగల చర్మం ఉండి మొటిమలతో బాధపడేవారికి ఎంతో మంచి ఫలితాలని ఇస్తుంది.

పసుపు & పెరుగుతో తయారు చేసిన “ఫేస్ ప్యాక్”

కావలసినవి :

పసుపు: 3-4 చిటికెలు (కొద్దిగా),

పెరుగు: 1\2 కప్పు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి రాసుకుని  15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే,సుర్యుని వేడి వల్ల మాడిన, లేదా రంగు మారిన చర్మం అందంగా మారుతుంది, ఈ మిశ్రమాన్ని ముఖానికే కాకుండా కాళ్ళు, చేతులకు కూడా రాసుకుని 15-20 నిమిషాల తర్వాత శుబ్రపరుచుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

పసుపు మరియు గంధముతో (sandal) తయారు చేసిన “ఫేస్ ప్యాక్”

కావలసినవి :

పసుపు: 3-4 చిటికెలు (కొద్దిగా),

గంధపు పొడి (sandal wood powder) 1-2 టేబుల్ స్పూన్లు,

పాలు: 1-2 స్పూన్లు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి రాసుకుని  10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే,మీ చర్మంలోని నల్లదనం మొత్తం పోయి ఎంతో కాంతివంతమైన, మృదువైన చర్మం  మీ సొంతం అవుతుంది.

పసుపు మరియు తేనెతో తయారు చేసిన “ఫేస్ ప్యాక్”

కావలసినవి :

పసుపు: 2 చిటికెలు (కొద్దిగా),

తేనె 2-3 టేబుల్ స్పూన్లు

పన్నీరు 1-2 టేబుల్ స్పూన్లు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి, మెడకి రాసుకుని  10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మీ ముఖం పై ఉన్న ముడతలు పోయి మృదువైన చర్మాన్ని పొందుతారు.

పసుపు మరియు నిమ్మరసంతో తయారు చేసిన “ఫేస్ ప్యాక్”

కావలసినవి:

పసుపు 1 టేబుల్ స్పూన్

నిమ్మరసం 1-2 టేబుల్ స్పూన్లు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి, మెడకి రాసుకుని  10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, ఈ మిశ్రమం ఒక  బ్లీచింగ్ లా ఉపయోగపడి మీ ముఖానికి  కాంతినిస్తుంది.

పైన సూచించినవి అన్నీ మీ చర్మ సౌందర్యాన్ని కాపడటానికి  ఎంతో ఉపయోగపడతాయి, అందమైన చర్మం పొందాలంటే పైన సూచించిన పాటించండి, మెరుగైన ఫలితాలు పొందుతారు.

Posted on

Telugu tips for pimples and pimple marks – మొటిమ‌లు పోవాలంటే

మిమ్మల్ని మొటిమలు వేదిస్తున్నాయ, ఎన్ని రకములుగా ప్రయత్నించినా ఫలితం లేక ఇబ్బంది పడుతున్నరా, మీ చర్మం మొటిమ రహితంగా కావాలంటే ఈ సహజ పద్దతులు పాటించండి మంచి ఫలితాలతో పాటు అందమైన, సొగసైన చర్మాన్ని పొందుతారు. సహజ పద్దతులంటే పండ్లు, మూలికలతో మీ సమస్యని  దూరం చేసి మీ శరీరం పై మంచి ప్రభావాన్ని చూపించి మీ ముఖం పై మచ్చలు లేకుండా అందంగా మారుస్తుంది. ఈ పద్దతులు శరీరం పై ఏ దుష్ప్రబావం లేకుండా మొటిమలపై పోరాట పటిమను ప్రదర్శిస్తాయి, మొటిమల నిర్మూలన కోసం చర్మ వైద్య నిపుణులు సూచించిన కొన్ని సహజ పద్దతులు మీకోసం

“కలబంద మరియు పసుపు” ప్యాక్:

కలబందలోని ఎంజయ్మ్స్(enzymes) అయిన పోలీసచ్చరిడ్స్(Polysaccharides) మరియూ న్యూట్రీన్లు,  యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ (antibacterial & antifungal) గా పోరాడి ప్రతిభను ప్రదర్శిస్తాయి. ఇది సహజ టాక్సిన్స్ వ్యతిరేకంగా పోరాడి చర్మాన్ని మృదువుగా, కోమలంగా ఉంచుటలో సహాయపడుతుంది .

పసుపు మహాద్బుతంగా చర్మాన్ని కాపాడే ప్రక్రియలొ సహాయపడుతుంది. మీ చర్మానికి మంట కలిగే ప్రదేశాలని చల్లగా చేసి, మచ్చలని తొలగించి, వాపు వచ్చిన ప్రదేశాలలో వాపుని కరిగించుటలో సహాయ పడుతుంది. మీ చర్మ చాయని పెంచి కోమలంగా మరియూ తేజోవంతంగా చేస్తుంది.

“ఫసుపు, తేనే, పాల”  ప్యాక్:

1 1 చెంచ పసుపు, తేనె, పన్నిరు, మరియు కలబంద కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే, మచ్చ మరియు మొటిమ రహితమైన చర్మం పొందుతారు.

“సిట్రస్ పండ్లు” ప్యాక్ :

సిట్రస్ పండ్లు నిమ్మ, నారింజ, అనేవి రక్త స్రావ లక్షణాలు కలిగి, చర్మంలోని “బ్యాక్టీరియ”ను తుడిచేసి చర్మాన్ని తేజోవంతంగా, మరియు అందంగా ఉంచుతుంది.

ఈ పండ్ల యొక్క గుజ్జుని ముఖమునకు రాసుకుని, 15 నిమిషాలు అలాగే ఉంచాలి, అంతేకాకుండా నిమ్మరసాన్ని ముల్తాని మట్టీ,నీరు కలిపి కూడా ఉపయోగించుకోవచ్చు, ముల్తాని మట్టి వల్ల మొటిమల పెరుగుదలని అణచి వేస్తుంది, ఈ విధముగా ముఖమునకు రాసుకుని కాసేపటి తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రపరచాలి.

ముందు మీ చర్మం యొక్క తత్వాన్ని అర్దం చేసుకోండి :

ఈ సహజ పద్దతులు అన్నీ ఎంతో మంచి ఫలితాలని ఇచ్చేవే, కాకపోతే మీ శరీర యొక్క తత్వాన్ని అర్దం చేసుకుని వాడుట ఎంతో శ్రేయస్కరం.

సాదారణ చర్మం :

ఒకవేళ మీ చర్మం సాధారణ రకం అయితే మీ చర్మం యొక్క కణాలు అ విదమైన జిడ్డుని విడువవు. సాధారణ చర్మం అతి స్వల్ప సమస్యాత్మక శరీరం.

పొడి చర్మం:

ఒకవేళ మీది పొడి చర్మం అయితే కాగితం చాల పొడిగా ఉండి తీసినవెంటనే మీ చర్మం గట్టిగా, పొడిగా, పొరలుగా అనిపిస్తుంది.

జిడ్డు చర్మం:

మీది జిడ్డు చర్మం అయితే కాగితం, మీ ముఖ భాగంలోని  బుగ్గలు, ముక్కు, మరియు నుదురు సంబంధిత ప్రదేశాలలో, జిడ్డుని గ్రహిస్తుంది. ఈ చర్మం, ఎంతో సమస్యాత్మకమైనది, ఇది పేలగ, మందముగా కనిపిస్తుంది.అందువల్ల మోటిమలు పెరిగే అవకాసం ఎక్కువ.

కలయిక చర్మం:

చాల మంది స్త్రీలలో ఈ కలయిక చర్మం ఎక్కువగా ఉంటుంది. ఈ చర్మం పై కాగితం ముక్కు, నుదురు పై తప్పితే బుగ్గలపై జిడ్డు గ్రహించదు.

సున్నితమైన చర్మం:

సున్నితమైన చర్మం సాధారణంగా చాలా పొడి ఉండి గట్టి అనుభూతినిస్తుంది. ఎక్కువగా వాపు రావడం, చిరాకు కలగడం,దురద పుట్టడం, చర్మం ఎర్రగ అవడం,చివరకు ముఖం పై చిన్న చిన్న మచ్చలకు దారితీస్తుంది

పాలు: పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల, ఇది పొడి చర్మానికి చాలా ఉపయోగపడుతుంది, జిడ్డు చర్మాన్ని పాలకు దూరంగా ఉంచడం చాల అవసరం ఎందుకంటే పాలలో ఉన్న కొవ్వు వల్ల జిడ్డు చర్మం మరింత జిడ్డుగా మారే ప్రమాదం ఉంది.

సిట్రస్ పండ్లు: ఇది పొడి చర్మం పై ఉపయోగిస్తే, తేమని తొలగించి మరింత పొడిగా మారుస్తుంది.అందుకే జిడ్డు చర్మం పై ఉపయోగిస్తే జిడ్డుని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. సాదారణ చర్మం కలవారు బాగా సాంద్రత తగ్గిన నిమ్మ రసాన్ని కూడా ఉపయోగించవచ్చు

తేనె: ఇది సాదారణంగా తేమను తగ్గించేదిగా పని చేస్తుంది, అందువల్ల అన్ని రకముల చర్మాలకు ఉపయోగించుకోవచ్చు .

Posted on

Potato skin beauty tips in Telugu – మీ అందమైన చర్మం కోసం బంగాళ దుంపలు చెప్పే చిట్కాలు

బంగాళ దుంపలు చెప్పే చిట్కాలు

  • కొంచెం బంగాళాదుంప రసం మరియు నిమ్మరసం, సమానముగా తీసుకుని, దానిలో కొంచెం 1\2 Tbsp తేనె కలిపి మీ ముఖానికి పట్టించి 10 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే, ఈ మిశ్రమం మీ చర్మంలోని, జిడ్డు కణాలని, మరియు, జిడ్డు తనాన్ని  తరిమికొట్టి, మిల మిలా మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.”జిడ్డు తనంతో బాధపడుతున్న వారు ఈ పద్దతి పాటిస్తే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు.
  • మీది పొడి చర్మమా, మృదువైన చర్మం కావాలంటే ఈ “ఫేస్ మాస్క్” ఎంతో ఉపయోగకరం: మీరు చేయవలసిందల్లా, 2 Tbsp పాల పౌడర్, 1 Tbsp బాదం నూనె, కొంచెం ఉడికించిన  గసికను కలిపి ముఖానికి పట్టించి 20-25 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మృదువైన, తేజోవంతముగా ప్రకాసించే చర్మం మీ సొంతం.
  • మరొక చిట్కా: మీ ఇంట్లోనే 1\8కప్ బంగాళదుంపల ముక్కలు,1\4కప్ దోసకాయ ముక్కలతో మంచి “ఫేస్ క్లీనర్” తయారుచేసుకోవచ్చు,వాటిపై తోలు తీయకుండా ఉపయోగించాలి.
  • ఒక కోడి గుడ్డు, 1\4కప్ పెరుగు, 1 Tbsp బేకింగ్ సోడాని చిన్న గిన్నెలో కలిపి ముఖానికి పట్టించి 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేయాలి
  • మీరు యవ్వనంతో  అందంగా కనపడాలంటే: 1 బంగాళదుంప, 3 Tbsp “ఆపిల్ సాస్”ని తీసుకుని , ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే  తళ తళ లాడే యవ్వన సౌందర్యం మీ సొంతం .
  • మీరు మోటిమలు లేదా నల్ల మచ్చలతో సతమతమవుతున్నరా ఈ చిట్కా మీకోసమే: కొంచెం బంగాళదుంప రసం, మరికొంచెం నిమ్మ రసం, కొంచెం బంక మట్టి, ఈ 3 కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుని “Moisturaizer” ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
  • బంగాళదుంపల్ని ఫ్రిజ్ లొ పెట్టి 30 నిమిషాల తరువాత కళ్ళపై ఉంచుకుంటే మెత్తని, మరియు చల్లని ఉపసమనాన్ని పొందవచ్చు.
  • కళ్ళ దగ్గర నల్లని మచలు వేదిస్తున్నాయా , అయితె ఇలా చేయండి: బంగాళ దుంపని తొక్క తీసేసి ముక్కలుగా చేసి కళ్ళపై ఉంచుకోండి 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకోండి, బంగాళ దుంపలో ఉన్న “Catalase Enzyme” వల్ల  నల్లని మచ్చలు తొలగిపోయి అందమైన ఆక్రుతిని పొందుతారు
  •  బంగాళ దుంప రసాన్ని ముఖమునకు పట్టించి 15-20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే, దీని వల్ల మన చర్మం పై ఉన్న మచ్చలు, ముడతలు,ఫొడితనం తొలగిపోయి, తేజోవంతమైన రూపం మీ సొంతం అవుతుంది.
  •  ఒక పచ్చి బంగాళదుంపని మీ ముఖం పై రుద్దండి, కాసేపటి తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకోండి,తెల్లని అందమైన మీ చర్మాన్ని చూసి ఆనందం పొందండి, అంతే కాకుండా మీ చర్మంలో ఉన్న ఉబ్బిన ప్రదేశాన్ని కరిగించి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
  •  ఉడక పెట్టిన బంగాళదుంప ముక్కల్ని ముఖం పై  పట్టుకుంటే, కాలిన మరియు వాపులు వంటి సమస్యలు ఉపశమనానికి సహాయపడుతుంది. మంట పుట్టించే రక్త కణాలను శాంత పరిచి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
  • దురద పుట్టుట, దద్దుర్లు వచ్చుట, లేదా పురుగు\ దోమ కుట్టిన ప్రదేశాలలో పచ్చి బంగాళ దుంప ఉంచి, ఇలా రోజుకి  పలుసార్లు చేస్తే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.
  •  మీ జుట్టు వేగంగా మరియు ఎక్కువగా పెరగాలంటే కొంచెం బంగాళ దుంప రసంలో కలబంద, 1 Tbsp  తేనె  కలిపి మీ జుట్టుకి పట్టించి 1-2 గంటల తరువాత శుబ్రం చేయండి
Posted on

Orange face packs in Telugu – అందానికి, చర్మ సౌందర్యానికి “ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్”

మన చర్మ సౌందర్యానికి పండ్ల ఫదార్దములు ఎంతో మేలు చేకూరుస్తున్నయి,అందువల్లనే ఇప్పటికీ ఎంతో మంది ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మం కోసం “కాస్మొటిక్ ప్యాక్స్” కన్నా “ఫ్రూట్ ప్యాక్స్” ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉపయోగిస్తూ ఉంటారు. చర్మ సౌందర్య సం రక్షణను పెంపొందించే పండ్లలో నారింజ ఎంతో ఉపయోగకరమైనది.

నారింజలొ “కాల్షియం” మరియు “విటమిన్ భ్” పుష్కలంగా ఉన్నయీ అనడంలో సందేహం లేదు,ఇవి మనలోని ఎముకల్ని ధ్రుడంగా చేయడంలో ఎంతో సహయపడతాయి.మన శరీర సం రక్షణలో నారింజది ఒక అద్భుతమైన పాత్ర అని చెబితే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఫ్రూట్ జూస్ రూపంలో, గుజ్జు చేసుకుని, పండు పై భాగము అనగ తొక్కని పొడి చెస్కుని ఎలా ఎన్నొ రకాలుగా ఉపయోగపడుతుంది.

“ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్””, వాటి ఉపయోగాలు తెలుసుకుందాం

ఆరెంజ్ ఫేస్ ప్యాక్1:

నారింజని 2 ముక్కలుగా కోసి ఒక ముక్కలోని రసాన్ని పిండి, అందులో 2 Tbsp పెరుగు కలిపి ముఖమునకు పట్టించి 15-20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడిగితే, ముఖమంతా చల్లగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, అంతే కాకుండా జిడ్డుతనం పోయి మ్రుదువుగా మరియు కాంతివంతంగా కూడా అవుతుంది.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్2:

నిమ్మరసాన్ని ఒక గ్రాము పిండిలో కలిపి పేస్ట్ గా మారిన తరువాతా ముఖానికి పట్టించి 20 నిమిషాల అరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే చాలా మ్రుదువైనా, కాంతివంతమైన, కోమలమైన చర్మం లభిస్తుంది.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్3:

2 Tbsp నారింజ రసంలో, 1 Tbsp తేనె, 1 Tbsp నిమ రసం కలిపి ముఖమునకు రాస్తే మొటిమలని నివారించడమే కాకుండా, మచ్చ రహితమైన, అంటే మచ్చలు లేని పరిశుబ్రమైన, తేజోవంతమైన చర్మం లభిస్తుంది

ఆరెంజ్ ఫేస్ప్యాక్4:

నారింజ రసంలో బంక మట్టి, లేదా ముల్తాని మట్టి+పాలు కలిపి ఒక అరగంట సేపు తరువాత ముఖానికి రాసి మరొక 20 నిమిషముల తరువాత గొరు వెచ్చని నేటితో శుబ్రపరుచుకోవాలి.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్5:

నిమ్మ కాయ బయట ఉండే తొక్కని పొడిగా చేసి  అందులో, గంధం పొడిని జతపరిచి, పాలు\నీళ్ళూ\రోజ్ వాటర్ ని కలిపి పేస్ట్ గా అయిన తరువాత  ముఖానికి  పట్టించి పొడిగా మారిన తరువాత అంటే ఒక 30 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి మెత్తటి టవల్ తో శుబ్రం  చెసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.

ఒక వేళ మీది మొటిమలకు గురైన చర్మం అయితే పైన సూచించిన విదానంలో పాలకు బదులు \నీళ్ళూ\రోజ్ వాటర్ ఉపయోగించితే మంచిది

Posted on

Tomato skin care tips in Telugu – ఆరోగ్యవంతమైన మరియు తేజోవంతమైన చర్మం కోసం టమటా చెప్పే చిట్కాలు

పార్టీకి వెళ్తున్నాం అందంగా, కనపడాలి అని ఎంతో మంది ఖరీదైన “క్రీంలు” మరియు “ఫేష్యల్స్” వాడతారు, చిత్రమేమిటంటే తెలిసీ తెలియక మన డబ్బుతో మనమే మన చర్మ సౌందర్యాన్ని ఎంతో ప్రమాదకరమైన “కేమికల్స్” కు  గురి చేసి పాడు చేసుకుంటున్నాము. సరిగా గమనిస్తే తాజా పండ్లు మన చర్మాన్ని ఎంతో అందంగా మరియు కాంతివంతంగా తయారు చేసి మంచి సం రక్షణను చేకూరుస్తాయి.  టమాటా మన అపురూపమైన చర్మాన్ని కాపాడు కోవడానికి, ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మన చర్మ రంద్రాలను శుద్ది చేస్తూ చర్మ రక్షణకై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.

  • సహజమైన, కాంతివంతమైన చర్మం కోసం టమాట “ఫేస్ ప్యాక్స్”……  . మీరు చేయవలసిందల్లా  ముందుగా కొన్ని టమాటాలు తీస్కొండి, గుజ్జుగా చేసి, కొంచెం ఓట్స్ (బియ్యపు పిండి), ఒక స్పూన్ పెరుగు కలిపి,  మీ ముఖమునకు, మెడకు పట్టించి కొన్ని నిమిషాల తర్వాత శుబ్రం చేసుకుంటే మీ చర్మాని నల్లగా చేసే పదార్దాలు తొలగిపొయి, చర్మం ఎంతో కాంతివంతంగాను మరియు మ్రుదువుగా తయారవుతుంది.
  • గుజ్జుగా చేసిన టమాటాలు, నిమ్మకాయలోని సగం తీసుకుని, నిమ్మరసాన్ని, టమాట గుజ్జుని కలిపి ముఖమునకు, మెడకు పట్టించుకొని అది పొడిగా అయ్యేవరకు వేచి ఉండాలి కొన్ని నిమిషాల తర్వాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మీ చర్మాని నల్లగా చేసే పదార్దాలు తొలగిపొయి మంచి ఉపసమనాన్ని పొందుతారు.
  • మి ముఖాన్ని నల్లమచ్చలు  ఇబ్బంది పెడుతుంటే “ముల్తానీ మట్టీ “, టమాటా గుజ్జు కలిపి ముఖానికి రాసుకుని మెల్లగా రుద్దాలి, ఎక్కువగ రుద్దినను ప్రమదమే, శరీరం ముడతలు పడిపొతుంది.15 నిమిషాల తరువాత గొరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని ఆస్వాదించవచ్చు.
  • మంచి అందమైన కాంతివంతమైన చర్మం కోసం గంధం పొడిని టమాట గుజ్జుతో కలిపి కొంచెం నిమ్మరసం వేసి ఆ పేస్ట్ ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ప్రభావం చూపిస్తుంది.
  • బిజీ సమయంలో, టైము లేదు అనుకుంటే టమాటాల గుజ్జుని 2 Tbsp పాలతో కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా, ప్రకాసిస్తుంది.
Posted on

Banana face packs in Telugu – సహజ పద్దతులతో తయారు చేసుకునే “అరటి ఫేస్ ప్యాక్స్”

అధిక శాతంలో విటమిన్లు, పొటాషియం కలిగి ఉండడం వల్ల అరటి అనేది, సహజమైన మరియు ఆరోగ్యకరమైన శరీరానికి ఎంతో మేలును చేకూరుస్తుంది. కరేబియన్ దీవులు,మరియు దక్షిణ అమెరికాలోని స్త్రీలు ఈ మెత్తగా, గుజ్జులా చేసిన అరటిని వారి యొక్క శరీరాన్ని పొడిగా ఉంచుకోవడం కొసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ అరటి పండు  ఫేస్ ప్యాక్స్ అనేవి మీ శరీరాన్న్ని మ్రుదువుగా, మరియు ఎంతో కోమలంగా ఉంచుతాయి.పొడి బారిన, ఎంతో సున్నితమైన సరీరం కొసం ఈ సహజ పద్దతులు ఎంతో మంచి ఫలితాల్ని ఇస్తాయి.

అవకాడొ-ఆరటి  ఫేస్ ప్యాక్:

కావలసినవి:

గుజ్జుగా చేసిన 1\2 అవకాడో పండు మరియు 1\2 అరటి పండు

పై రెండిటి మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

అరటి ఫేస్ ప్యాక్

మనం చెప్పుకుంటున్నట్లుగా అరటి పండు మీ చర్మాన్ని సున్నితమైనదిగా, కోమలంగా చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.  మీ ముఖాన్ని నీటితో కడగాలి,

అరటి పండు మిశ్రమాన్ని బాగా మెత్తగా పేస్ట్ తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

అరటి మరియు తేనెతో కూడిన ఫేస్ ప్యాక్:

కావలసినవి:1 Tbsp తేనె, 1\2 అరటి పండు

పై రెండిటి మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

మొటిమలు, మచ్చల నివారణకు అరటి ఫేస్ ప్యాక్:

అరటితో మీ ముఖము పై అద్భుతాలు చేయవచ్చు.

కావలసినవి:

1 అరటి పండు, 1 Tbsp తేనె , 1 Tbsp నిమ్మ రసం.

పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

పొడి బారిన చర్మానికి అరటి సూత్రాలు  :

కావలసినవి: గుజ్జుగా చేసిన 1\2 అరటి పండు,ఉడక పెట్టిన ఓట్స్(బియ్యపు పిండి),1 Tbsp పంచదార, 1 Tbsp గుడ్డులోని పచ్చ సొన.

పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

జిడ్డు బారిన చర్మానికి అరటి సూత్రాలు  :

కావలసినవి: గుజ్జుగా చేసిన 1\2 అరటి పండు, 1 Tbsp తేనె,1 Tbsp పెరుగు

పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత వెచ్చటి నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

నల్లని మచ్చలు, ముఖము పై ముడతలు పోవడానికి అరటి సూత్రాలు  :

కావలసినవి: గుజ్జుగా చేసిన 1\2 అరటి పండు,1 Tbsp తేనె, 1 Tbsp గుడ్డులోని పచ్చ సొన.

పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత వెచ్చటి నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

దీనిని కనీసం వారానికి 2 రోజులు చేస్తే మచ్చలు మరియు ముడతలు లేని చర్మాన్ని పొందవచ్చు

అరటి మరియు పాలతో కుడిన ఫేస్ ప్యాక్:

కావలసినవి: గుజ్జుగా చేసిన 1\2 అరటి పండు,1 Tbsp తేనె, 1 Tbsp పాలు.

పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో మెల్లగా శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

ఆరటి మరియు ఓట్స్(బియ్యపు పిండి)ఫేస్ ప్యాక్:

పొడి బారిన చర్మాన్ని పొందాలంటే ఈ ఫేస్ ప్యాక్ ఎంతో ఉపయోగపడుతుంది:

కావలసినవి :

గుజ్జుగా చేసిన 1\2 అరటి పండు,1 Tbsp తేనె, ఓట్స్(బియ్యపు పిండి)మరియు గుడ్డులోని పచ్చని సొన:

పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో మెల్లగా శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

Posted on

Telugu tips for oily skin – జిడ్డు రహితమైన చర్మానికి ఇంట్లోనే చేసుకునే “ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్”

జిడ్డుగల చర్మమ ఉండటం వల్ల ఎన్నో చర్మ సంబంధిత సమస్యలు అనగా మొటిమలు, నల్లటి మచ్చలకు దారితీస్తుంది. పండ్లు ఎంతో ఆరోగ్యకరమైనవి రోజు వారి భోజనంలో పండ్లు కలిపి తీసుకున్నట్లైతే చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. అనేక చర్మ ప్రయోజనాలు అందించే అనేక పండ్లు ఉన్నాయి, మీయొక్క చర్మం రకం బట్టి మీరు తీసుకునే పండ్లు మీ చర్మ సమస్యలపై పొరాట పటిమను ప్రదర్శిస్తాయి .

ఉదహరణకు జిడ్డుగల శరీరానికి అరతిపండు, నిమ్మ, నారింజ , స్ట్రాబెర్రీలు వంటివెన్నో  వంటివెన్నో పోషకాల సమూహములతో  మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీరు జిడ్డుగల చర్మం నయం కోసం ఇంట్లోనే చాల సులభంగా, తక్కువ ఖర్చుతో కూడిన సహజమైన పద్దతులతో తయారుచేసుకునే “ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్”  గురించి తెలుసుకుందామ.

మీ జిడ్డైన జిడ్డుగల చర్మం అధిగమించడానికి 4 “ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్” సిద్దంగా ఉన్నాయి

ఫ్రూట్ ఫేస్ ప్యాక్1

బాగా పండిన అరటిపండ్లు మీ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

పండిన అరటి పండును గుజ్జుగా చేసి 1 టేబుల్ స్పూన్ జోడించి ముఖానికి ప్యాక్ లా వేసుకుని అది గట్టిపడేవరకు ఉంచాలి,

తరువాత గోరు వెచ్చని నీటితో కడిగితే మచ్చ రహితమైన మొటిమలు లేని చర్మాన్ని పొందవచ్చు.

ఇంకా మెరుగైన ఫలితాల కోసం నారింజ రసన్ని సిట్రస్ పండు రసాన్ని కలిపి పట్టిస్తే జిడ్డు లేని చర్మాన్ని పొందవచ్చు.

ఫ్రూట్ ఫేస్ ప్యాక్2

స్ట్రాబెర్రీలు:స్ట్రాబెర్రీలు మరియు బ్లూబెర్రీల వంటి పండ్లు జిడ్డు చర్మాన్ని తొలగించడానికి ఎంతో ఉపయొగపడతాయి,

స్ట్రాబెర్రీలు గుజ్జుగా చేసి, కొంచెం నిమ్మరసంలో కలిపి ముఖమునకు పట్టంచి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితాల్ని పొందవచ్చు ,

ఇవి మన చర్మాన్ని ముడతలు రాకుండా కాపాడటంలో ఎంతో ఉపయోగపడుతుంది.

ఫ్రూట్ ఫేస్ ప్యాక్3

నారింజ పండు మన చర్మ సౌందర్యానికి ఎంతో శ్రేయస్కరం,దీనిని గుజ్జుగా చేసి, లేదా పొడిగా చేసి, 2 రకాలుగా ఉపయోగించవచ్చు

నారంజలో ఉన్న విటమిన్ ‘ సి’ చర్మ సంరక్షణ కై ఎంతో ఉపయోగపడుతుంది

ఫ్రూట్ ఫేస్ ప్యాక్4

మనం ఇంట్లో తయరుచేసుకునే ఎన్నో సహజమైన ఫేస్ ప్యాక్స్ నిమ్మ పైనే ఆధారపడి తయారవుతాయి.

నిమ్మలో ఉన్న సిట్రిక్ యాసిడ్ మన చర్మం యొక్క కణాలను శుద్ది చేసి, జిడ్డు తన్నన్ని తగ్గిస్తూ చర్మానికి ఎంతో కాంతిని ఇవ్వడంలో సహాయపడుతుంది.

సహజంగా జిడ్డుగల చర్మం నుండి ఉపశమనం పొందేందుకు పై వాటిని ప్రయత్నించండి.

Posted on

Watermelon face packs in Telugu – మీ చర్మ సౌందర్యానికి ఇంట్లోనే పుచ్చకాయతో తయారుచేసుకునే “ఫేస్ ప్యాక్స్”

 

అందరూ అనుకున్నట్లు పుచ్చకాయ వేసవి తాపాన్ని తేర్చే ఒక జూసీ ఫ్రూట్  మాత్రమే కాదు, మన చర్మ సమ్రక్షణలొ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చర్మ్మాన్ని వేడి నుంచి రక్షిస్తూనే చర్మ వ్యాదులు సోకకుండా ఒక మంచి మందులా ఉపయోగపడుతుంది. ఇందులో 93% నీటి నిల్వలతో పాటుగా  మల్టీవిటమిన్లు విటమిన్ A, విటమిన్ B6 మరియు విటమిన్ C లు సమృద్ధిగా  ఉన్నాయి. ఇది మన చర్మం యొక్క దాహాన్ని తీర్చి శాంత పరచడమే కాకుండా, వేడి వల్ల చర్మంలో చిన్న చిన్న సమస్యలు ఉన్ననూ శుబ్రము చేసి సంరక్షిస్తుంది . మృదువైన, మచ్చలేని మరియు అందమైన చర్మం కోసం ఈ విధంగా ప్రయత్నించండి..

 

పుచ్చకాయ “ఫేస్ ప్యాక్స్” :

 మృదువైన చర్మం కోసం:

  •  1 టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసం మరియు 1 టేబుల్ స్పూన్ సాదా పెరుగు తీస్కోండి.
  • ఈ రెండిటిని బాగా కలపాలి తరువాత మీ ముఖం మరియు మెడ మీద బాగా పట్టించాలి .
  • 10-15 నిమిషాలు ఆగి తర్వాత చల్లని నీటితో కడగండి .
  • పెరుగులో ఉన్న  లాక్టిక్ ఆసిడ్   మరియు  ఎంజైములు, పుచ్చకాయతో కలిసి చర్మాన్ని మ్రుదువుగా, కోమలంగా చేస్తాయి.

 

ముడతల చర్మమానికి:

  • అవకాడో పండుని గుజ్జుగా చేసి ఒక 1 టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసంతో కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని మీ ముఖం మరియు మెడ మీద  పట్టించాలి.
  • 20 నిమిషాలు తర్వాత చల్లని నీటితో కడగండి.
  •  అవకాడో పండు సమృద్ధిగా, ఎంతో శక్తివంతమైన 3  ఒమేగా కొవ్వు ఆమ్లాలు, విటమిన్ C, విటమిన్ E  కలిగి ఉండటం వల్ల  చర్మాన్ని పొడిబారకుండా  కాపాడి మంచి ఫలితాల్ని ఇస్తుంది

 

మొటిమ రహితమైన పుచ్చకాయ “ఫేస్ ప్యాక్స్” :

  •  మొటిమ రహితమైన, దుమ్మూ, దూళి రహితమైన చర్మం కోసం అరటి పండుని గుజ్జుగా చేసి ఒక 1 టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసంతో కలపాలి.
  • ఈ పేస్ట్ ని మీ ముఖం మరియు మెడ మీద  పట్టించాలి
  • 20 నిమిషాలు తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి
  •  అరటి పండులో విటమిన్ B2,విటమిన్ B6, విటమిన్ B12 ఉండటం వల్ల  మీరు రంధ్రాల మరియు చర్మం మంటను  తగ్గించి మరియు అదే సమయంలో మీ చర్మం పొడి బారకుండా  మృదువుగా ఉంచుటకు సహాయపడుతుంది.
  • పుచ్చకాయ రసం మీ చర్మం నుండి జిడ్డుని తగ్గించి ఫ్రెష్ గా ఉంచుతుంది.

 పొడిబారిన చర్మం కోసం…

  • 1 టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసంలో 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి.
  • ఈ పేస్ట్ ని మీ ముఖం మరియు మెడ మీద  పట్టించాలి.
  • 20 నిమిషాలు తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి.
  •  తేనె మీ చర్మం యొక్క అంతర్భాగానికి చొచ్చుకుని పొయి సంరక్షిస్తుంది .
  • మరో పక్క పుచ్చకాయ రసం జిడ్డు తత్వాన్ని  దూరం చేసి చర్మాన్ని మ్రుదువుగా ఉంచుతుంది.

 

ఈ పైన సూచించిన పద్దతులన్నీ మిరు కలలు కనే మ్రుదువైన, అందమైన, కోమలమైన చర్మం పొందడంలో సహాయపడతాయి 

 మంచి ఫలితాల కోసం ఈ జాగ్రత్తలు పాతించండి…..