Posted on

Telugu remedies for muscle cramps – కండరాల నొప్పిని నివారించే హోం రెమెడీస్

ప్రస్తుత కాలంలో కండరాల నొప్పి ప్రతి ఒక్కరికి వచ్చే ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది ప్రధానంగా యువకులలో లేదా వృద్ధులలో అధికంగా సంభవిస్తుంది. కొన్నిసార్లు కండరాల నొప్పి భారీ వ్యాయామం వలన కలగచ్చు లేదా అధిక సమయం ఒకే పొజిషన్ లో కూర్చొని ఉండటం లేదా నిలబడి ఉండటం వలన కాళ్లు, చేతులు లేదా వెన్నెముక కండరాలలో నొప్పి పుట్టవచ్చు. దాదాపు ప్రతి ఒక్కరూ జీవితంలో కండరాల నొప్పిని అనుభవించే ఉంటారు. ముఖ్యంగా రన్నర్, అథ్లెట్లు లేదా సైక్లిస్టుల వంటి క్రీడాకారులకు ఇది ఒక సాధారణ సమస్య. వారి చేతి, కాళ్లు, వీపు, కడుపు మరియు ఇతర భాగాలలో కండరాల నొప్పి ఏర్పడుతుంది. ఇది కాకుండా ఒత్తిడి లేదా చిన్న దెబ్బల వలన కూడా కండరాలలో నొప్పి పుడుతుంది.

కండరాలలో తిమ్మిరి

కండరాల క్రామ్ప్స్ అనగా తిమ్మిరి అకస్మాత్తుగా వివిధ కండరాలలో సంభవించే అసంకల్పిత సంకోచాలు. ఈ సంకోచాలు చాలా బాధాకరమైనవి మరియు వివిధ కండరాల సమూహాలను ప్రభావితం చేయవచ్చు. సాధారణంగా కాళ్ల వెనుక భాగంలో, తొడ వెనుక భాగం మరియు ముందు భాగాలలో క్రామ్ప్స్ ఏర్పడవచ్చు. అంతేకాదు ఉదరం, చేతులు, మరియు పాదాలలో కూడా తిమ్మిరి ఏర్పడవచ్చు.

నిద్రలో ఉన్నప్పుడు తిమ్మిరి ఏర్పడితే వాటి యొక్క తీవ్రమైన నొప్పి వలన మీరు నడవలేక పోతారు. ఆకస్మిక మరియు పదునైన క్రామ్ప్స్ యొక్క ప్రభావం కొన్ని సెకండ్స్ నుండి 15 నిమిషాల వరకు ఉంటుంది. ఇది కండరాల నొప్పి యొక్క అత్యంత సాధారణ లక్షణం. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో కండరాలు ఉబ్బడం కూడా జరుగుతుంది.

కండరాలలో తిమ్మిరి ఏర్పడటానికి కారణాలు

కండరాల తిమ్మిరికి అనేక కారణాలున్నాయి. కొన్ని తిమ్మిరి మీ కండరాల మితిమీరిన వాడుక వలన వస్తుంది. మీరు వ్యాయామం చేసేటప్పుడు ఇది అధికంగా సంభవిస్తుంది.

కండరాలలో గాయాలు మరియు నిర్జలీకరణ కూడా తిమ్మిరిని ప్రేరేపించగలవు. కాల్షియం, పొటాషియం, సోడియం మరియు మెగ్నీషియం వంటి కండరాల ఆరోగ్యానికి కావలసిన ఖనిజాలు తక్కువ స్థాయిలో ఉండటం వలన కూడా తిమ్మిరి ఏర్పడుతుంది.

మీ కాళ్లు మరియు పాదాలకు తక్కువ రక్త సరఫరా అవ్వటం వలన మీరు వ్యాయామం లేదా భౌతిక పనులు చేసేటప్పుడు క్రామ్ప్స్ ఏర్పడవచ్చు.

కొన్ని సందర్భాల్లో వైద్య పరిస్థితులు కూడా కండరాల తిమ్మిరికి కారణమవుతుంది. ఉదాహరణకు: మద్యం సేవించటం, గర్భిణిగా ఉన్నప్పుడు, మూత్రపిండ వైఫల్యం మరియు హైపో థైరాయిడిజం.

కండరాలలో నొప్పి మరియు తిమ్మిరికి గృహ చికిత్స

మజిల్స్ లో కలిగే నొప్పి మరియు క్రామ్ప్స్ ని తగ్గించేందుకు కొన్ని ఉత్తమ హోమ్ రెమెడీస్ ఉన్నాయి. వీటిని అనుసరించటం వలన నొప్పి నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు. కొన్ని తీవ్రమైన పరిస్థితులలో వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. తరచూ నొప్పి పుట్టడం, క్రామ్ప్స్ యొక్క వాపు తగ్గక పోవడం, దీర్ఘకాలిక నొప్పి వంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించటం మంచిది. కానీ ఇటు వంటి సందర్భాల్లో కూడా ఈ హోమ్ రెమెడీస్ ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. మరి వాటి వివరాలను చూద్దాం.

 1. ఎప్సోమ్ సాల్ట్స్ : కండరాల నొప్పి మరియు క్రామ్ప్స్ నుండి ఉపశమనం పొందేందుకు ఎప్సోమ్ సాల్ట్స్ ఒక మంచి రెమెడీ. వెచ్చని నీటిలో ఒక కప్పు ఎప్సోమ్ సాల్ట్స్ ని వేసుకొని బాగా కలపాలి. ఈ నీటిలో ఒక నాప్‌కిన్ లేదా టవల్ ని ముంచి నొప్పిగా ఉన్న ప్రాంతంపై కంప్రెస్ చేయండి. ఇలా రోజుకు 2-3 సార్లు చేయటం వలన క్రమంగా నొప్పి తగ్గుతుంది. గమనిక : ఈ ప్రక్రియకు వెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. చాలా వేడిగా ఉన్న నీటిని ఉపయోగిస్తే చర్మం పొడిబారుతుంది. మీకు గుండె వ్యాధి, బిపి లేదా డయాబెటిస్ వండి వ్యాధులు ఉన్నట్లయితే ఈ ట్రీట్‌మెంట్ చేయ కూడదు. వేరే మార్గాలను ప్రయత్నించండి.
 2. చల్లని లేదా వేడి కంప్రెస్ : వెచ్చని నీటితో స్నానం చేయటం వలన మీ కండరాలు రిలాక్స్ అవ్వటంతో నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. వెచ్చని నీటి వలన మీకు మంట కలుగుతున్నట్లయితే చల్లని నీటితో లేదా ఐస్ ప్యాక్ తో నొప్పిగా ఉన్న చోటు పై కంప్రెస్ చేయండి. ఐస్ కంప్రెస్ చేసేటప్పుడు ఐస్ ముక్కలను డైరెక్ట్ గా ఉపయోగించకుండా ఒక క్లాత్ లో చుట్టి ఒత్తిడిని పెట్టవచ్చు. ఐస్ ముక్కలను డైరెక్ట్ గా ఉపయోగించినట్లయితే నొప్పి ప్రభావం అధికరించవచ్చు. ఈ పద్దతులను రెగ్యులర్గా పాటించటం వలన క్రమంగా నొప్పి తగ్గటం మీరు గమనించవచ్చు.
 3. ఆపిల్ సీడర్ వినిగర్ : కండరాల నొప్పి మరియు క్రామ్ప్స్ నుండి ఉపశమనం పొందేందుకు వినిగర్ ఒక ఉత్తమమైన మందు. ఒక గ్లాస్ నీటిలో 1-2 స్పూన్ ల వినిగర్ ని కలుపుకొని త్రాగండి. లేదా వినిగర్ ని డైరెక్ట్ గా నొప్పిగా ఉన్న ప్రాంతాలపై రాసి మసాజ్ చేయండి. ఇది కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.
 4. ఎసెన్షియల్ ఆయిల్ : కండరాల నొప్పిని తొలగించడంలో ఎసెన్షియల్ ఆయిల్ చాలా ప్రభావితమైన నూనె. వీటి యొక్క సమ్మేళనం కండరాల నొప్పిని తగ్గించటంలో చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. లెమన్ గ్రాస్, మార్జోరం, డీప్ బ్లూ, బేసిల్, రోమన్ వంటి సమ్మేళనాలు ఉపయోగించండి. ఈ నూనెలను నొప్పిగా ఉన్న ప్రాంతాలపై రాసి కొంత సేపు మర్దన చేయండి. ఇలా ప్రతి రోజూ 2-3 వారాల పాటు రాయటం వలన మంచి ఉపశమనం పొందుతారు.
 5. పసుపు పేస్ట్ : పసుపులో నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించే గుణగణాలు పుష్కలంగా ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. పసుపులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి వాపు, నొప్పి ఉన్న ప్రదేశంలో అప్‌లై చేస్తే వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
 6. బాదం ఆయిల్ మరియు గార్లిక్ ఆయిల్ : ఇక టీస్పూన్ గార్లిక్ మరియు ఒక టీస్పూన్ బాదం ఆయిల్ ను ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా వేడి చేయాలి. నొప్పి ఉన్న మరియు సలుపు వున్న కండరల ప్రాంతంలో అప్‌లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. మజిల్ పెయిన్ నివారించడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.
 7. ఆముదం : ఆముదం నూనెని వేడి చేసి కాటన్ ప్యాడ్ మీద వేసి నొప్పి ఉన్న కండరాల మీద అప్‌లై చేస్తూ సున్నితమైన మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తక్షణ ఉపశమనం పొందుతారు.
 8. యూకలిప్టస్ ఆయిల్ మరియు రోజ్మెరీ ఆయిల్ : కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ మరియు కొద్దిగా రోజ్మెరీ ఆయిల్ మిక్స్ చేసి సలుపు వున్న కండరాల మీద మసాజ్ చేయాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
 9. హార్స్ చెస్ట్ నట్ : కండరాల యొక్క నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ నుండి ఉపశమనం కలిగించడంలో మరియు కండరాల గాయాలను మాన్పడంలో ఈ మూలిక సహాయపడుతుంది. వీటిలో ఎసిన్ అనే నయం చేసే గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల వీటితో తయారు చేసిన జ్యూస్ ని అప్‌లై చేస్తే వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందుతారు.
 10. లైమ్ లీవ్స్ పౌడర్ మరియు తేనె : నిమ్మ ఆకులను పేస్ట్ లేదా పౌడర్ చేసి దీనికి కొద్దిగా తేనె మిక్స్ చేసి నొప్పి మరియు సలుపు ఉన్న కండరాల మీద అప్‌లై చేస్తే తక్షణం వాపు మరియు నొప్పి తగ్గిస్తుంది.
 11. ఉల్లిపాయ పేస్ట్ : ఉల్లిపాయను పేస్ట్ చేసి మందపాటి కాటన్ క్లాత్ లో వేసి నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టులా కట్టుకోవడం వల్ల త్వరగా వాపు మరియు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 12. పార్ల్సీ : పార్ల్సేను పేస్ట్ గా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో నేరుగా అప్‌లై చేస్తే తక్షణం ఉపశమనం కలుగుతుంది. కండరాల వాపు మరియు నొప్పిని నివారించడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.
 13. థైమ్ ఆయిల్ : కొన్ని చుక్కల థైమ్ ఆయిల్ ను నీటిలో వేసి మిక్స్ చేసి ఈ నీటితో కండరాల నొప్పి ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయడం వల్ల నొప్పి మరియు వాపు నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. థైమ్ ఆయిల్ కు కొద్దిగా బాదం ఆయిల్ మిక్స్ చేసి కూడా మసాజ్ చేసుకోవచ్చు.
 14. కొంత ఎత్తులో ఉంచాలి : గాయం అయిన లేదా కండరాల పట్టివేతకు గురైనప్పుడు ఆ భాగం కొంత ఎత్తులో ఉండే విధంగా కాళ్ల క్రింద పిల్లో(దిండు)ను అమర్చు కోవడం ఉత్తమం.

కండరాలలో నొప్పి మరియు తిమ్మిరిని నివారించేందుకు ఉత్తమ ఆహారం

కండరాల నొప్పిని క్రమంగా తగ్గించేందుకు కొన్ని ఉత్తమమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని రెగ్యులర్ గా మీ డైట్ లో చేర్చుకోవటం వలన కండరాల నొప్పిని అవాయిడ్ చేయవచ్చు మరియు ఇదివరకే నొప్పి ఉన్నట్లయితే క్రమంగా నొప్పి తగ్గటానికి కూడా సహాయ పడుతుంది.

 1. దాల్చిన చెక్క : దాల్చిన చెక్కలు బాగా ప్రసిద్ధి చెందిన మసాలా దినుసులు. ఇందులో అనాల్జేసిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు హీలింగ్ లక్షణాలు ఉండటం వలన ఇది కండరాల నొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది. ఒక గ్లాస్ వెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి మరియు ఒక స్పూన్ తేనె కలిపి త్రాగటం వలన నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. అంతే కాదు ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
 2. అరటి పండ్లు : అరటి పండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. కండరాలు మరియు నాడీ వ్యవస్థ యొక్క సరైన పనితీరుకు పొటాషియం చాలా అవసరం. పొటాషియం యొక్క లోపం వలన కూడా కండరాలలో నొప్పి పుట్టవచ్చు. ప్రతిరోజూ 3-4 అరటి పండ్లను తినటం వలన మీ శరీరానికి కావలసిన పొటాషియం ని అందించగలుగుతారు. ఇది క్రమంగా నొప్పి మరియు క్రామ్ప్స్ ని పూర్తిగా తొలగిస్తుంది.
 3. విటమిన్లు : శరీరం ఫిట్ గా ఉంచేందుకు విటమిన్లు కీలక పాత్రను వహిస్తాయి. విటమిన్ బి1, ఇ మరియు డి యొక్క లోపం వలన కండరాలు డామేజ్ అవటం, బలహీనం కావటం మరియు నొప్పి ఏర్పడుతుంది. మీ కడుపు నొప్పి మరియు క్రామ్ప్స్ ని నిరోధించడానికి మీ రోజువారీ ఆహారంలో అన్ని ముఖ్యమైన పోషకాలనూ చేర్చుకోవడం చాలా అవసరం. మీ ఆహారంలో అవసరమైన అన్ని పోషకాలను అందించే పదార్థాలను ముఖ్యంగా విటమిన్లను చేర్చుకున్నారని నిర్ధారించుకోండి.
 4. మెగ్నీషియం : మీ శరీరం లో మెగ్నీషియం స్థాయి తక్కువగా ఉంటే కండరాల నొప్పి లేదా క్రామ్ప్స్ కలగచ్చు. ఇందుకొరకు చాలామంది మెగ్నీషియం సప్లిమెంట్స్ ను తీసుకుంటారు. కానీ మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ మార్గం. అవిసె గింజలు, పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, నల్ల బీన్స్, కోకో పౌడర్, జీడి పప్పులు మరియు స్విస్ ఛార్డ్ వంటి మార్కెట్లో లభించే అనేక పదార్థాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. కనుక వీటిని మీ డైట్లో చేర్చుకోండి.
  • బీన్స్ మరియు పప్పు ధాన్యాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు వండిన పప్పు ధాన్యాలలో, 71 mg మెగ్నీషియం కలిగి ఉంటే, ఒక కప్పు వండిన బ్లాక్ బీన్స్ లో అంతకు రెట్టింపు (120 mg) మెగ్నీషియం ఉంటుంది. అంతేకాక, వాటిలో ఋతు స్రావ సమయంలో కలిగే నొప్పులను తగ్గించడానికి సహాయపడే పీచుపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి.
  • పప్పు ధాన్యాల వలే, గింజలు మరియు విత్తనాలలో కూడా మెగ్నీషియం నిలువలు అధికంగా ఉంటాయి. 1 ఔన్స్ (28.3 g) కాల్చిన పొద్దుతిరుగుడు విత్తనాలలో 37 mg మెగ్నీషియం ఉంటుంది. 1 ఔన్స్ కాల్చిన బాదం గింజలలో మెగ్నీషియం పరిమాణం రెట్టింపుగా ఉంటుంది. ఇతర గింజలలో కూడా కాల్షియం మరియు మెగ్నీషియం ఉంటాయి. కనుక మీ ఆహారంలో వీటిని తప్పకుండా భాగంగా చేసుకోండి.
  • పాలకూర మరియు బ్రోకలీ వంటి ఆకుకూరలలో, కాల్షియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మీ ఆహారంలో వాటిని భాగం చేరుకోవడం వలన కండరాల నొప్పిని నిరోధించడానికి సహాయపడతాయి. ఈ ఆకుకూరలు ఋతు క్రమ సమయంలో కలిగే నొప్పులను కూడా తగ్గించడానికి సహాయపడతాయి.
 5. బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ : చాలా కొంత మందికి మాత్రమే మొలాసిస్ గురించి తెలుసు. ఇందులో మెగ్నీషియం స్థాయి చాలా అధికంగా ఉంటుంది. కండరాల నొప్పికి ఇది ఒక గొప్ప నివారిణి. ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ ని ఒక కప్పు కాఫీ లో కలిపి ప్రతి రోజు ఉదయం త్రాగండి. రెండు వారాలలో నొప్పిలోని మార్పుని మీరు చూడగలుగుతారు.
 6. కొబ్బరి నూనె : కొబ్బరి ఒక న్యూట్రిషన్ ఆహారం. దీని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నూనె కండరాల నొప్పిని తగ్గించటంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజు వంటలో 2-3 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెని ఉపయోగించటం వలన మజిల్ పెయిన్‌ క్రమంగా తగ్గుతుంది.
 7. అల్లం : మజిల్ పెయిన్ నివారించు కోవడంలో అల్లం సహాయపడుతుంది. ఇది సోర్ మజిల్స్ ను నివారించడానికి కూడా సహాయపడుతుంది. అల్లంలో జింజరోల్స్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ నొప్పిని తగ్గిస్తుంది. కనుక కండరాల నొప్పితో బాధపడుతున్న వారు అల్లం టీ ని రెగ్యులర్గా త్రాగండి. మీ ఆహారంలో కూడా అల్లం ను చేర్చుకోండి.
 8. దానిమ్మ : దానిమ్మలో వివిధ రకాల హీలింగ్ పవర్స్ ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మజిల్ డ్యామేజ్ ను నివారిస్తాయి. ఇంకా రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దాంతో కండరాల నొప్పి తగ్గించుకోవచ్చు.
 9. బ్లూ బెర్రీస్ : బ్లూ బెర్రీస్ లో ఉండే ఫైటో కెమికల్స్ మజిల్స్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తాయి. బ్లూ బెర్రీస్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ మరియు ఎలాజిక్ యాసిడ్స్ కండరాల సలుపును తగ్గిస్తాయి. బ్లూ బెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేక వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతాయి.
 10. పైనాపిల్ జ్యూస్ : పైనాపిల్లో బ్రొమోలిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. త్వరగా నొప్పులను నివారించుకోవాలంటే పైనాపిల్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి. కండరాల లో క్రామ్ప్స్ కి కూడా తక్షణ ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
 11. చెర్రీస్ : చెర్రీ జ్యూస్ తాగడం వల్ల మీ కండరాలు పునరుత్తేజం పొందుతాయి. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక ఒక గ్లాసు చెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల కండరాల నెప్పి మరియు ఇన్ఫ్లమేషన్ ని నివారించవచ్చు.
 12. బొప్పాయి : తక్షణ శక్తి పొందటానికి బొప్పాయి సహాయపడుతుంది. కేవలం ఒక్క బొప్పాయిలో పొటాషియం 16% అనగా 781 mg ఉంటుంది. తక్కువ కొవ్వు ఉన్న పెరుగు వంటి ప్రోటీన్ సహిత పదార్ధంతో పాటుగా తీసుకున్నప్పుడు ఇది ఎలెక్ట్రోలైట్స్ ను భర్తీ చేస్తూ కండరాలలో కలిగే ఇబ్బందులను సరిచేస్తుంది.
 13. గుడ్లు : ప్రోటీన్లు పుష్కలంగా లభించే గుడ్డులో కండరాల నిర్మాణానికి అవసరమైన ల్యూసిన్అనే అమైనో ఆమ్లం కూడా అధిక మొత్తంలో ఉంటుంది. సెలీనియం మరియు ల్యూటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నందున గుడ్లు శరీరంలో వాపు మరియు నొప్పిని తగ్గించడంలో తోడ్పడతాయి.
 14. పాలు : తక్కువ కొవ్వు కలిగిన పాలు, పెరుగు మరియు ఇతర పాల ఉత్పత్తులలో ఎముకల యొక్క ఆరోగ్యానికి చాలా అవసరమైన కాల్షియం నిల్వలు అధికంగా ఉంటాయి. కండరాల సంకోచ వ్యాకోచాలకు కాల్షియం అత్యవసరం. ఇది కనుక లోపిస్తే కండరాలలో నొప్పులు అధికంగా కలుగుతాయి. అందువలన, మీరు సహజ పద్ధతులలో కండరాల నొప్పిని తగ్గించాలనుకుంటే పాలు మరియు పెరుగును తీసుకోండి.
 15. పైనాపిల్ జ్యూస్ : పైనాపిల్లో బ్రొమోలిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. త్వరగా నొప్పులను నివారించుకోవాలంటే పైనాపిల్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి. కండరాల క్రామ్ప్స్ నుండి కూడా తక్షణ ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
Posted on

Telugu tips to make hips smaller – హిప్ సైజ్ ని తగ్గించటం ఎలా? – వ్యాయామాలు మరియు హోమ్ రెమెడీస్

స్త్రీలు అందంగా కనపడాలంటే ఆకర్షణీయమైన ముఖ సౌందర్యంతో పాటు అందమైన ఆకారం కూడా ఉండాలి. ఇటీవల కాలంలో జీరో సైజ్ అని వినే ఉంటాము. అలాంటి ఆకారం పొందేందుకు ఎన్నో ప్రయత్నాలను కూడా చేస్తూ ఉంటాము. అందులో ఒక భాగమే ఈ హిప్ సైజుని తగ్గించటం.

మన ముందు జనరేషన్లో మన అమ్మ మరియు అమ్మమ్మ పనులు ఎక్కువ చేసేవారు కాబట్టి ఎలాంటి వ్యాయామాలు చేయకపోయినా ఆరోగ్యంగా మరియు మంచి శారీరక ఆకారంతో ఉండేవారు. కానీ కాలం మారే కొద్ది జీవన శైలిలో మార్పులు ఏర్పడటం వలన ఆరోగ్యము మరియు శారీరక ఫిట్‌నెస్ కూడా తగ్గిపోయింది.

ప్రస్తుత కాలంలో ముఖ్యంగా అమ్మాయిలు మోడ్రన్ దుస్తులు వేసుకోవాలని ఆశపడతారు. కానీ సరైన ఫిట్‌నెస్ లేకపోతే కొన్ని దుస్తులను ధరించ లేరు. ముఖ్యంగా సన్నటి నడుము ఉండాల్సిందే. మరి సన్నటి నడుమును పొందటం ఎలా? ఆహార పద్దతులను మార్చుకుంటే సరిపోతుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఆహారంలో మార్పులు అవసరమే, కానీ కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. అప్పుడే మంచి ఆకారంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది.

శరీరంలో ఎలాంటి మార్పులను పొందాలన్నా సరైన ఆహారం అనగా సరైన డైట్, వ్యాయామం, జీవనశైలిలో కొన్ని మార్పులు మరియు కొన్ని హోమ్ రెమెడీస్ ని పాటించక తప్పదు. మరి నాజూకైన నడుమును పొందేందుకు మీరు చేయాల్సిన వ్యాయామాలు మరియు హోమ్ రెమెడీస్ ని ఈ ఆర్టికల్ లో చూద్దాం.

నాజూకైన నడుమును పొందేందుకు వ్యాయామాలు

 1. స్క్వాట్స్ : సరైన ఆకృతి గల నడుమును పొందేందుకు స్క్వాట్స్ ఒక మంచి వ్యాయామం. మీ పాదాలను భుజాల వెడల్పు దూరంలో ఉంచి మోకాళ్లను వంచండి. ఇలా చేసేటప్పుడు మీ చేతులను జోడించి ఛాతికి దగ్గరగా ఉంచండి. ఈ పొజిషన్లో 2 సెకండ్లు ఉండి నార్మల్ పొజిషన్‌కి రావాలి. ఇలా 5 సార్లు చేసి కొంత గ్యాప్ తీసుకొని మల్లి చేయాలి. ఇలా 3 సెట్స్ గా చేయాలి.
 2. వన్ లెగ్ స్క్వాట్స్ : పిస్తోల్ స్క్వాట్స్ అని కూడా పిలువబడే వన్ లెగ్ స్క్వాట్స్ హిప్ కండరాలను టోన్ చేయడానికి చాలా ప్రభావితమైనది. అయితే కొత్తగా వ్యాయామం చేయటం ప్రారంభించిన వారికి ఇది సాధ్యం కాదు. కనుక కొన్ని రోజుల తరువాత ఈ వ్యాయామాన్ని ప్రయత్నించండి. నేరుగా మీ కాళ్లపై నిలబడి మీ చేతులు ముందుకు చాచి ఒక కాలిని నేరుగా చెప్పండి. ఇప్పుడు మీరు నిలబడి వున్న కాలిని వీలైనంత వరకు వంచండి మరియు నడుమును కొద్దిగా వెనక్కు నెట్టేందుకు ప్రయత్నించండి. ఇలా కొన్ని సెకండ్స్ బాలన్స్ చేయండి. తిరిగి స్ట్రెయిట్ పొజిషన్‌కి  వచ్చి ఇదే పద్దతిని మరో కాలుతో ప్రయత్నించండి. ఇలా మూడు సార్లు చేసి గ్యాప్ తీసుకొని మల్లీ రిపీట్ చేయాలి. మొదట్లో కనీసం 3 సెట్లు, ప్రతి సెట్లో 3 సార్లు చేయండి. క్రమంగా నంబర్ ఆఫ్ సెట్స్ ని పెంచుకోండి.
 3. ఫార్వర్డ్ లంగ్స్ : మీ తొడ మరియు నడుము లోని కండరాలను టోన్ చేసేందుకు ఇది ఒక మంచి వ్యాయామం. మీ కాళ్లపై నేరుగా నిలబడి ఒక పాదంను ముందుకు పెట్టి మోకాలు రెండింటినీ నెమ్మదిగా వంచాలి. మీ వెన్నెముకను నేరుగా ఉంచి అలా 5 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత నార్మల్ పొజిషన్‌కి రావాలి. ఇదే విధంగా మరో కాలును కూడా ముందుకు పెట్టి ప్రాసెస్ ని రిపీట్ చేయాలి. ఇలా 5 సార్లు చేసి గ్యాప్ తీసుకొని మరో 5 సార్లు చేయాలి. మొత్తం 4 సెట్లుగా చేయటం ప్రారంభించి క్రమంగా అధికరించండి.
 4. సైడ్ లంగ్స్ : ఈ వ్యాయామం కూడా మీ నడుము మరియు తొడ కండరాలను టోన్ చేసి కొవ్వును తగ్గిస్తుంది. కాళ్లను వెడల్పుగా ఉంచి నేరుగా నిలబడండి. ఇప్పుడు ఒక మోకాలిని వంచి ఒక వైపు శరీరాన్ని మొత్తం వీలైనంతగా స్ట్రెచ్ చేయాలి. ఈ పొజిషన్లో కొన్ని సెకండ్స్ బాలన్స్ చేసి ఆ తరువాత మరో వైపు కూడా ఇలాగే చేయాలి. ఇలా 5 సార్లు 4 సెట్స్ గా ప్రారంభించి క్రమంగా అధికరించండి.
 5. సైడ్ స్టెప్ అప్ : ఈ వ్యాయామం చేయటానికి ఒక ఎతైన మరియు బరువైన బెంచ్ కావాలి. బెంచు యొక్క ఎత్తు మీకు తగట్టుగా అమర్చుకోవచ్చు. మీకు ఎడమ వైపు బెంచ్ ని ఉంచి వ్యాయామం ప్రారంభించండి. ఎడమ కాలిని బెంచ్ మీద ఉంచి శరీరాన్ని పైకి లేపి మరో కాలిని గాలిలో ఉంచి 2 సెకండ్స్ బాలన్స్ చేయండి. ఆ తరువాత తిరిగి నార్మల్ పొజిషన్‌కి రండి. ఇప్పుడు ఇలాగే కుడి కాలితో కూడా చేయాలి.
 6. సైడ్ ప్లాంక్ : సైడ్ ప్లాంక్ పొజిషన్లో పడుకొని ఒక కాలిని మాత్రం మెల్లగా పైకి లేపి 2 సెకండ్స్ తరువాత స్టార్టింగ్ పొజిషన్ కి రావాలి. ఇలా 6-8 సార్లు చేసిన తరువాత మరో వైపు తిరిగి ఇదే ప్రాసెస్ ని రిపీట్ చేయాలి.
 7. కార్డియో వ్యాయామాలు : కార్డియో వ్యాయామాలు చేయటం వలన మంచి ఆకారం మరియు సరైన రూపంను పొందుతారు. ఇది స్వయంచాలకంగా మీ నడుము ట్రిమ్ అవటానికి సహాయం చేస్తుంది. ప్రతి రోజు 20-30 నిమిషాల వరకు కార్డియో వ్యాయామాలను చేయండి.
 8. రన్నింగ్ : రన్నింగ్ కూడా ఒక మంచి వ్యాయామం. ఈ వ్యాయామం మీ శరీరం మొత్తం ఉన్న కొవ్వును తగ్గించి కాళ్లు మరియు నడుము కండరాలను టోన్ చేస్తుంది.
 9. సైక్లింగ్ : మీ హిప్ లోని అదనపు కొవ్వును కరగించటానికి మరియు కండరాలను టోన్ చేయడానికి సైక్లింగ్ చాలా ప్రభావితమైన వ్యాయామం.

మరి కొన్ని వ్యాయామాలు

 • నిటారుగా నిలబడి రెండు కిలోల వెయిట్స్‌ ని చేతుల్లోకి తీసుకొని, కుడి మరియు ఎడమ వైపుకి శరీరాన్ని వంచాలి. ఇలా రెండు వైపులా 20 సార్లు చేయాలి.
 • వెల్లకిలా పడుకొని రెండు కాళ్లనూ వంచి పైకి లేపాలి. పొట్టను లోపలికి పీల్చి చేతులు రెండు గాల్లోకి లేపి 20 అంకెలు లెక్కపెట్టి రిలాక్స్‌ అవ్వాలి.
 • ముందు చెప్పిన భంగిమలోనే ఉండి కాళ్లని, చేతుల్ని మడిచి కుడి మోచేయి, ఎడమ మోకాలిని తాకేలా వంగాలి. ఇలా రెండో వైపు కూడా చేయాలి.
 • ట్విస్టర్‌ మీద నిలబడి సాధ్యమైనంత మేరకు శరీరాన్ని అటూ, ఇటూ తిప్పాలి. ఇలా తిప్పేటప్పుడు శరీర కిందిభాగం మాత్రమే కదిలేలా చూసుకోవాలి. ఇలా 50 రిపిటిషన్స్‌ చేయాలి.

గమనిక : వ్యాయామాలను మొదటి సారి ప్రయత్నించే వారు తగిన గైడెన్స్ తో ప్రారంభించాలి. ప్రతి వ్యాయామం యొక్క పొజిషన్స్ మరియు విధానాలను పూర్తిగా అర్థం చేసుకొన్న తరువాతే చేయాలి.

సన్కని నడుము కొరకు హోమ్ రెమెడీస్

 1. ఆపిల్ సీడర్ వినిగర్ : ఆపిల్ సీడర్ వినిగర్ స్మూత్ మరియు సిల్కీ హెయిర్ కోసం ఉపయోగిస్తారని అందరికి తెలుసు. కానీ ఇది శరీరంలోని కొవ్వును తగ్గించటానికి కూడా ఉపయోగపడుతుంది. ఆపిల్ సీడర్ వినిగర్ తో 20 నుంచి 30 నిముషాల పాటు మీ నడుముపై మసాజ్ చేయండి. వట్టి ఆపిల్ సీడర్ వినిగర్ కాకుండా కొంత ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెతో 1 స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్‌ను కలిపి ఉపయోగించవచ్చు. మసాజ్ చేసిన తరువాత ఒక హాట్ ప్యాక్ ని అప్‌లై చేసి శుభ్రం చేసుకోండి. ఇలా రోజుకు రెండు సార్లు చేయండి.
 2. బ్రౌన్ షుగర్ తో కాఫీ : కాఫీ శరీరంలోని కొవ్వుని తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్‌ ని మెరుగు పరుస్తుంది. తద్వారా ఇది నడుము సన్నగా అవ్వటానికి సహాయపడుతుంది. రెండు స్పూన్ కాఫీ ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ మరియు ఒక స్పూన్ తేనెని కలిపి ఒక స్క్రబ్ ని తయారు చేయాలి. ఈ స్క్రబ్ తో మీ నడుం భాగంపై 6-8 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తరువాత 10 నిమిషాలు అలాగే ఉంచి నీటితో కడగండి. ఇలా వారానికి 4-5 సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
 3. సీ సాల్ట్ మరియు కొబ్బరి నూనె : సీ సాల్ట్ లో అనేక ఖనిజాలు ఉన్నాయి. ఉప్పుని కొబ్బరి నూనెతో కలిపి ఉపయోగించినప్పుడు ఇది కొవ్వును కరిగించి కండరాలను టోన్ చేస్తుంది. రెండు స్పూన్ కొబ్బరి నూనె మరియు 1 టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి ఈ మిశ్రమంతో చర్మంపై 15 నిముషాల పాటు మసాజ్ చేయండి. తరువాత వేడి నీటి టవల్‌తో హాట్ కంప్రెస్ చేయండి. మరొక 10 నిముషాల తరువాత నీటితో కడిగి శుభ్రం చేయండి.

నడుము చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్ కరిగించటానికి బెస్ట్ ఫుడ్స్ / విస్ట్ స్లిమ్మింగ్ ఫుడ్స్

 1. నిమ్మ మరియు తేనె : ఒక గ్లాస్ వెచ్చని నీటిలో ఒక నిమ్మరసం మరియు రెండు స్పూన్ తేనె వేసి బాగా కలిపి త్రాగాలి. ఇది ఉదయం వట్టి కడుపుతో త్రాగితే మంచి ఫలితాలను ఇస్తుంది.
 2. అల్లం : అల్లంలో ఉన్న ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. అనారోగ్య సమస్యలనే కాదు, అధిక ఫ్యాట్ ని కరిగించడంలో కూడా అల్లం బాగా పనిచేస్తుంది. అల్లంలో ఉండే జింజరాల్ అనే పదార్థం శరీరంలో ఉన్న అధిక నీటిని బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే పొట్టలో పిహెచ్ లెవెల్స్ పెంచడంలోనూ అల్లం సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు మెటబాలిక్ రేట్ ని పెంచడానికి సహాయపడుతుంది. ఒక గ్లాస్ నీటిని తీసుకొని ఉడికించాలి. ఒక ముక్క అల్లం తీసుకొని శుభ్రం చేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మరుగుతున్న నీటిలో కలపాలి. మరో 5 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. ఆ నీటిని చల్లార్చి వడకట్టి తాగాలి.
 3. ఓట్స్ బ్రాన్ : ఓట్స్ బ్రాన్ లో 18 గ్రాముల ఫైబర్, 20 గ్రాముల ప్రోటీన్స్ ఉన్నాయి. లోఫ్యాట్ మిల్క్ లో ఓట్స్ బ్రాన్ కలిపి ఉదయం అల్పాహారంలో తీసుకోవచ్చు. ఇది చెడు కొవ్వును తొలగిస్తుంది.
 4. స్వీట్ పొటాటో : స్వీట్ పొటాటోలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఆలస్యంగా జీర్ణమవుతాయి. దాంతో ఎక్కువ సమయం ఆకలి లేకుండా చేస్తుంది. కనుక దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా చేర్చుకోండి.
 5. గోధుమ : నడుము చుట్టు పేరుకున్న కొవ్వును కరిగించుకోడానికి గోధుమ సహాయపడుతుంది. తృణధాన్యాలతో తయారుచేసే ఆహారాలు తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఫైబర్ కొవ్వుని కరిగించడానికి సహాయపడతాయి.
 6. బ్లాక్ రైస్ : బ్లాక్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ ఇ ఎక్కువగా మరియు షుగర్స్ తక్కువగా ఉంటుంది. కనుక ఫ్యాట్ ని కరిగించటానికి సహాయపడుతుంది.
 7. వైట్ టీ : వైట్ టీ లిపోలిసిస్ ను పెంచుతుంది. ఇది ఫ్యాట్ ను కరిగిస్తుంది. కొవ్వు చేరడానికి కారణమయ్యే ఫ్యాట్ సెల్స్ ని కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది కొవ్వును శక్తిగా మార్చడంతో కాలేయం పనితీరును వేగవంతం చేస్తుంది.
 8. బ్లాక్ బీన్స్ : బ్లాక్ బీన్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వుని కరిగించడంలో కూడా సహాయపడుతుంది.
 9. అవొకాడో : అవొకాడోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవొకాడో ని సలాడ్స్ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
 10. చిక్ పీస్ : ఇందులో ప్రోటీన్స్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. పాస్తాలో కంటే ఇందులో ఫైబర్ నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. కొవ్వును తగ్గించి కండరాలను బిల్డ్ చేయడంలో ఇది ఒక బెస్ట్ డైట్ గా పనిచేస్తుంది.
 11. పచ్చి బఠానీలు : ఇవి క్రంచీ స్నాక్స్. ఒక కప్పు పచ్చి బఠానీలలో 7 గ్రాముల ప్రోటీన్స్, 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. స్నాక్స్ గా దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిస్తుంది.
 12. డార్క్ చాక్లెట్ : డార్క్ చాక్లెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బరువుని తగ్గిస్తుంది. ఇందులో ఆరోగ్యాన్ని పెంచే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఎక్కువ.
 13. బాదంలు : బాదంలలో డైటరీ ఫైబర్ ఎక్కువ. ఒక కప్పు బాదంలో 20 మిల్లీగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. ఇంకా వీటిలో మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్స్ అధికం.
 14. గ్రేప్ ఫ్రూట్ : గ్రేప్ ఫ్రూట్ బాడీ ఫ్యాట్ ని బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఇందులో్ ఫైటో కెమికల్స్ అధికంగా ఉన్నాయి.
 15. చియా సీడ్స్ : చియా సీడ్స్ లో ఉండే ప్రోటీన్ ఎక్కువ సమయం ఆకలి కాకుండా పొట్ట ఫుల్ గా ఉండే ఫీలింగ్ ను కలిగిస్తుంది. దాంతో వేరే ఇతర ఆహారాలు తినకుండా కంట్రోల్ చేస్తుంది.
 16. హాట్ పెప్పర్ : హాట్ పెప్పర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల 25 శాతం మెటబాలిజం రేటు పంచుతుంది ఇది శరీరంలో క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది. తక్కువ ఆకలిని కలిగిస్తుంది.
 17. సెలరీ : ఫ్యాట్ టమ్మీని కరిగించి నడుము నాజూగ్గా మార్చే ఆహారాల్లో సెలరీ ఒకటి. దీన్ని తప్పనిసరిగా ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాల్సిందే. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్లో క్యాలరీలు తక్కువ. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని స్లిమ్ గా మార్చడంతో పాటు ఫిట్ గా చేస్తుంది. ఇది ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.
 18. పెరుగు : మీరు విస్ట్ స్లిమ్మింగ్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవాల్సిన వాటిలో మరో హెల్తీ ఫుడ్ పెరుగు. దీన్ని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని, రెగ్యులర్ గా తినాలి. ఫ్లేవర్డ్ యోగర్ట్ ను నివారించి, నేచురల్ గా ఇంట్లో తయారు చేసుకొన్న పెరుగును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల విస్ట్ లైన్ తగ్గుతుంది.

ఆహారం మరియు జీవన శైలిలో చేయాల్సిన కొన్ని మార్పులు

 • కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే బంగాళదుంపలు, తీపి పదార్ధాలు, తెల్లటి పిండి తో చేసిన లేదా రిఫైన్ చేసిన బ్రెడ్, పాస్తా వంటివి తినకండి.
 • ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచేందుకు వీలైనంతవరకు రైస్ వంటి కార్బోహైడ్రేట్లను బాగా తగ్గించండి. కార్బోహైడ్రేట్లు ఆరోగ్యమైన బరువు వున్నంతవరకు మంచివే. కాని పొట్ట భాగంలో అధిక కొవ్వు పేరుకుపోయినప్పుడు తగ్గించాల్సిందే.
 • తాజా కూరగాయలు అధికంగా తినండి.
 • పండ్లు, బెర్రీల వంటివి తినండి. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లే మీకు సరిపోతాయి.
 • గుడ్లు, పప్పులు, లీన్ మీట్, చేప, చికెన్ వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాలను తినండి.
 • ఆరోగ్యకరమైన ఆలివ్ నూనె తో వేయించిన కూరలు, చికెన్, ఫిష్ వంటివి తినండి.
 • కొబ్బరి నూనె, ఒమేగా 3 ఉండే చేప నూనె ఉపయోగించండి.
 • ఆఫీస్ లో లేదా అపార్ట్‌మెంట్లలో ఉన్నట్లయితే లిఫ్ట్ కి బదులుగా స్టైర్ కేస్ ని ఉపయోగించండి.
 • మీరు తీసుకునే కేలరీల మొత్తం కనిష్ట స్థాయిలో ఉండాలి. కనుక ఎంత మోతాదులలో తింటున్నారని గమనించండి. అధిక కేలరీలను తీసుకున్నట్లయితే వ్యాయామాల ద్వారా వాటిని కరిగించాలి.
 • ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవటం చాలా ముఖ్యం. నట్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి. అలాగే తక్కువ కేలరీలు ఉన్న పదార్థాలు మరియు ఫైబర్ ఎక్కువగా ఉన్న వాటిని ఎంచుకోవాలి.
 • మీ శరీరం నుండి టాక్సిన్స్ మరియు కొవ్వును ఫ్లష్ చేయటానికి ప్రతి రోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని త్రాగాలి.
 • రోజుకు 2-3 సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుందని డైటీషియన్లు అంటున్నారు.
 • కొవ్వు నియంత్రణలో విటమిన్ డి పాత్ర  చాలా కీలకం. విటమిన్ డి తగ్గితే కొవ్వు కరగడం జరగని పని. కాబట్టి ఉదయాన్నే కొంత సేపు సూర్యరశ్మి తగిలే విధంగా వాకింగ్, సైక్లింగ్, యోగా, బ్రీతింగ్ వంటి వ్యాయామాలు చేయటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
 • నిద్రలేమి వల్ల కూడా కొవ్వు పెరిగే అవకాశాలున్నందున రాత్రి పూట వీలైనంత త్వరగా నిద్ర పోవాలి.
Posted on

Telugu tips to treat shingles – షింగిల్స్ / హెర్పెస్ సోస్టర్ చికిత్సకు హోమ్ రెమిడీస్

చికెన్ పాక్స్(Chickenpox) ని కలిగించే వైరస్(Virus) వరిసెల్ల-జోస్టర్ వలన ఏర్పడే మరొక వైరల్ సంక్రమణ షింగిల్స్(Shingles). శరీరంలో ఎక్కడైనా ఈ ఇన్ఫెక్షన్(Infection) కలగచ్చు, కానీ సాధారణంగా మొండెం మీద కనిపిస్తుంది. ఇది చికెన్ పాక్స్(Chickenpox) యొక్క రెండవ వెల్లడి అని కూడా చెప్తారు. ఈ ఇన్ఫెక్షన్ వలన ప్రాణహాని లేనప్పటికీ బ్లిస్టర్స్(Blisters) ని సరిగా చికిత్స చేయకపోతే తీవ్రంగా బాధిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటి నివారణ పద్ధతుల ద్వారా షింగిల్స్(Shingles) ని నివారించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ యొక్క కారణాలు, సింప్టమ్స్ మరియు నివారణ పద్ధతుల గురించి ఈ ఆర్టికల్లో చూద్దాం.

హెర్పెస్ సోస్టర్ యొక్క కారణాలు (Telugu causes for shingles / herpes zoster)

షింగిల్స్(Shingles) వరిసెల్లా-జొస్టెర్ వైరస్ వలన సంభవిస్తుంది – అదే వైరస్ చికెన్ పాక్స్రావటానికి కూడా కారణం. ఇంతకు ముందు చికెన్ పాక్స్(Chickenpox) కలిగి ఉన్న వారిలో షింగిల్స్ అభివృద్ధి చెందుతుంది. చికెన్ పాక్స్ నుండి మీరు గుణపడిన తరువాత కూడా ఆ వైరస్ మీ నాడీ వ్యవస్థలో చేరి కొన్ని సంవత్సరాలు అలాగే ఉంటాయి.

చివరికి, అది మీ నరాల మార్గాల్లో తిరిగి చర్మంపై చేరి షింగిల్స్ ని ఉత్పత్తి చేస్తుంది. చికెన్ పాక్స్(Chickenpox) వచ్చిన ప్రతి ఒక్కరికీ షింగిల్స్ వస్తుందని కాదు. కొందరిలో మాత్రమే ఈ వైరస్ రీఆక్టివేట్ అవుతాయి.

షింగిల్స్ యొక్క కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ వయోధికులలో మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సంక్రమణం చాలా సాధారణంగా ఏర్పడుతుంది.

ఇది ఒక అంటు వ్యాధి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి షింగిల్స్ వైరస్(Shingles virus) వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరస్ వ్యాపించిన వ్యక్తికి షింగిల్స్ బదులుగా చికెన్ పాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. బ్లిస్టర్స్(Blisters) ని డైరెక్ట్ గా తాకడం వలనే ఈ వైరస్ వ్యాపిస్తుంది.

షింగిల్స్ యొక్క లక్షణాలు (Telugu symptoms for shingles)

సాధారణంగా షింగిల్స్(Shingles) యొక్క మొదటి లక్షణం నొప్పి. కొంత మందిలో బ్లిస్టర్ ఏర్పడిన స్థానాన్ని బట్టి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. మరికొన్ని లక్షణాలు :

 • బర్నింగ్, తిమ్మిరి లేదా జలదరించటం
 • టచ్ చేయడానికి సున్నితత్వం
 • నొప్పి ప్రారంభించిన కొన్ని రోజులలో ఎరుపు దద్దుర్లు ఏర్పడతాయి
 • ఫ్లూయిడ్ తో కూడిన బ్లిస్టర్స్(Blisters)
 • దురద

కొంత మందికి కింది అనుభవం కలగచ్చు :

 • ఫీవర్
 • తలనొప్పి
 • కాంతికి సున్నితత్వం
 • అలసట

ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి (When to consult doctor for shingles)

షింగిల్స్(Shingles) తో పాటు ఈ కింది పరిస్థితులలో ఏవైనా ఏర్పడితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి :

 • కంటి దగ్గర నొప్పి మరియు దద్దుర్లు. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, ఈ సంక్రమణ కంటి చూపుని శాశ్వతంగా డామేజ్ చేస్తుంది.
 • మీ వయస్సు 60 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి, ఎందుకంటే మీ వయస్సు లో ఈ సమస్య తీవ్రం అయ్యే అవకాశాలు ఎక్కువ.
 • మీకు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నట్లయితే
 • దద్దుర్లు విస్తృతమైన మరియు బాధాకరమైనవిగా ఉన్నట్లయితే.

షింగిల్స్ చికిత్సకు ఇంటి నివారణ పద్ధతులు (Telugu remedies for shingles)

చల్ల నీటితో స్నానం

షింగిల్స్(Shingles)  వలన కలిగే దురద మరియు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు చల్లని నీరు ఎంతో సహాయపడుతుంది. నీరు కొంత వరకు మాత్రమే చల్లగా ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే, ఎక్కువగా చల్లగా ఉండే నీరు కూడా నొప్పిని అధికరించవచ్చు. స్నానం చేసిన వెంటనే శరీరాన్ని పూర్తిగా డ్రై చేయాలి. తేమని అలాగే వదిలేస్తే అది బ్లిస్టర్స్ ని ఇంకా అధికరిస్తుంది. ఈ సమస్య కొరకే కాదు, సాధారణంగా మనం ప్రతి రోజు స్నానం చేసిన వెంటనే అంతర్గత భాగాలలో తడి లేకుండా చూసుకోవటం మంచిది.

బ్లిస్టర్స్ ఉన్నట్లయితే ప్రతి రోజు మీ టవల్ ని మార్చండి లేదా బాగా శుభ్రం చేసి ఉపయోగించండి. బ్లిస్టర్స్(Blisters) పై వాడిన టవల్ ని మిగిలిన ప్రాంతంపై వాడినట్లయితే వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కనుక తగిన జాగ్రత్తలను తీసుకోండి.

కూల్ కంప్రెస్

ఇది కూడా చల్ల నీటి స్నానం వలే ఉపశమనాన్ని ఇస్తుంది. నొప్పి మరియు మంటను తగ్గిస్తుంది. ఒక టవల్ ని చల్లని నీటిలో ముంచి, బాగా పిండి, దద్దుర్లపై ఉంచండి. స్మూత్ మరియు శుభ్రమైన టవల్ ని ఉపయోగించండి. ఈ ప్రక్రియకు ఐస్ పాక్స్ ని ఉపయోగించకూడదు. చల్లదనం చాలా ఎక్కువైనా ప్రమాదమే.

లోషన్

మైల్డ్ మరియు మొయిశ్చరైస్ చేసేటువంటి లోషన్స్ లను రాషెస్ పై రాయండి. సెంట్ మరియు పర్ఫుమ్ ఉన్న లోషన్స్ ను ఉపయోగించకూడదు, ఎందుకంటే ఇవి దద్దుర్ల పై మంటను పెంచుతాయి. ఈ బ్లిస్టర్స్(Blisters) పై మీరు లోషన్ వాడిన వెంటనే మీ చేతులను బాగా కడగండి, లేకపోతే వైరస్ వ్యాపించగలదు.

బొబ్బల్ను గిల్ల కూడదు

షింగిల్స్(Shingles) వలన ఏర్పడే దద్దుర్లు చాలా దురదగా ఉంటాయి, మీకు వాటిని గిల్లాలని అనిపిస్తుంది. కానీ అలా చేయకూడదు. వాటిని గిల్లటం వలన అది సెకండరీ ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది మరియు క్యూర్ అవ్వటానికి చాలా ఆలస్యం అవుతుంది.

సరైన ఆహారాన్ని తీసుకోండి

ఈ సమస్యను కలిగించే హెర్ప్స్ కుటుంబానికి చెందిన వైరస్ ని ప్రేరేపించేటువంటి ఆహారాలను తీసుకోకూడదు. విటమిన్ ఎ, బి12, సి, ఇ మరియు అమినో ఆసిడ్ లైసిన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మీట్, చికెన్, గుడ్లు, పచ్చని కూరగాయలు, ఆరంజ్ మరియు యెల్లో ఫ్రూట్స్, హోల్ గ్రైన్స్, చేపలను  మరియు పాల ఉత్పత్తులను తీసుకోండి. నట్స్, బెర్రీస్ మరియు చాక్లెట్లను నివారించండి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా చికెన్ పాక్స్ వలన కలిగే బొబ్బలపై చికాకును మరియు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. బ్లిస్టర్స్ ని డ్రై గా చేసి కొన్ని రోజులలో అవి రాలిపోటానికి సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని కలిపి చర్మంపై రాయండి. 10 నిమిషాల తరువాత నీటితో కడిగి చర్మంపై తడి లేకుండా బాగా తుడవండి. ఈ పద్ధతిని తరచూ ఉపయోగించవచ్చు కనీసం రోజుకు రెండు సార్లు ఇలా చేయండి. ఈ ప్రక్రియ తరువాత బాగా శుభ్రం చేసుకున్న బ్లిస్టర్స్(Blisters) పై ఏదైనా స్మూతింగ్ అండ్ మైల్డ్ క్రీమ్ ని రాయండి. మరో పద్దతి మీరు స్నానం చేసే నీటిలో అర కప్పు బేకింగ్ సోడాని మరియు అర కప్పు ఎప్సమ్ సాల్ట్ ని కలుపుకొని ఆ నీటితో స్నానం చేయవచ్చు.

టీ ట్రీ ఆయిల్

ఇది వైరల్ ఇన్ఫెక్షన్ల పై అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని రకాల పుళ్ళు, బొబ్బలు, పాచెస్ ని నయం చేయడానికి ఈ నూనెని అరోమా థెరపీ లో వాడుతారు. మీరు షింగిల్స్ బ్లిస్టర్స్(Shingles blisters) తో బాధపడుతున్నట్లయితే కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ని దద్దుర్ల పై రాసి వెంటనే ఉపశమనం పొందండి.

కలబంద

కలబంద లోని కూలింగ్ ఎఫెక్ట్ వలన బ్లిస్టర్స్(Blisters) నుండి వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియా మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. కొంత తాజా కలబంద జెల్ ని దద్దుర్ల పై రాసి మృదువుగా మసాజ్ చేయండి. 15-20 నిమిషాల తరువాత కడిగి చర్మాన్ని బాగా డ్రై చేయండి.

నిమ్మరసం

నిమ్మరసంలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది చర్మంలోని PH లెవల్స్ ని బాలన్స్ చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసంలో 2 లేదా 3 స్పూన్ తేనెని కలుపుకొని పతితో బ్లిస్టర్స్(Blisters) పై రాయండి. కొంత సేపు తరువాత కడిగి నీటిని బాగా డ్రై చేయండి.

ఆపిల్ సీడర్ వినిగర్

దురద మరియు మంటను తగ్గించేందుకు ప్రసిద్ధి చెందిన ఉత్తమ పదార్ధాలలో ఆపిల్ సీడర్ వినిగర్ ఒకటి. ఇందులో యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా, ఒక గ్లాసు నీటిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్ ని కలుపుకొని ఒక పత్తి లేదా శుభ్రమైన వస్త్రాన్ని ముంచి చర్మంపై రాయాలి. లేదా వెచ్చని నీటిలో కలుపుకొని తేనెని జోడించి త్రాగవచ్చు.

వోట్మీల్

షింగిల్స్(Shingles) వలన ఏర్పడే చికాకుని తగ్గించడానికి వోట్మీల్ ఉపయోగపడుతుంది. 1 లేదా 2 కప్పుల వోట్మీల్ను పొడి చేసి, స్నానం చేసే నీటిలో కలపండి. మీ శరీరాన్ని ఈ నీటిలో 15-20 నిమిషాల వరకు నానపెట్టి ఆ తరువాత స్నానం చేయండి.

విచ్ హాజెల్

షింగిల్స్ వలన ఏర్పడే దద్దుర్లు, చికాకు, దురద మరియు మంటని తగ్గించేందుకు విచ్ హాజెల్ సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ విచ్ హాజెల్ మరియు రెండు స్పూన్ కాలెందుల పువ్వులను వేసి కవర్ చేసి రాత్రంతా ఉంచండి. ఉదయం దీనిని ఒక మృదువైన పేస్ట్‌లా రుబ్బి షింగిల్స్(Shingles) ప్రభావితం అయిన చర్మంపై రాయండి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజుకు ఒక సరి చేసి మంచి ఫలితాలను పొందండి. విచ్ హాజెల్ క్రీమ్ కూడా మార్కెట్ లో లభిస్తున్నాయి. అవి మీకు లభించినట్లయితే వాటిని దద్దుర్ల పై రాసి తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు.

ధూమపానం వదిలేయండి

ధూమపానం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవు మరియు ఆరోగ్యానికి హానికరం. ధూమపానం మానివేయడం చాలా ముఖ్యం, ఇది క్యాన్సర్ మరియు అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా వృద్ధులలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.

Posted on

Telugu tips to make hips grow bigger – బటక్స్ ను పెద్దగా పెంచటం ఎలా? – వ్యాయామాలు మరియు ఇంటి నివారణలు

పెద్ద నడుము తరచూ స్త్రీల అందం యొక్క చిహ్నంగా భావించబడతాయి మరియు మన అభిమాన నటీనటులలో కొందరు నిజానికి వారి స్థూలమైన బటక్స్ వలనే ప్రసిద్ధి చెందారు. మీరు పెద్ద నడుమును పొందాలనుకుంటే సరైన వ్యాయామాలు మరియు తగిన పోషక ఆహారాలను తీసుకోవాలి. వీటి వివరాలను ఈ ఆర్టికల్లో చూద్దాం.

మీ బటక్స్ (పిరుదులు)ను పెంచేందుకు తగిన డైట్

ప్రోటీన్లు

కండరాలను పెంచేందుకు ప్రోటీన్లు ప్రాథమిక పోషక ఆహారం. పిరుదులను పెద్దగా పెంచాలంటే తప్పనిసరిగా తగిన స్థాయిలో ప్రోటీన్‌లను తీసుకోవాలి. మీరు తినడానికి ఎంచుకున్న ప్రోటీన్ ఆహారాలలోని అమైనో ఆసిడ్స్ యొక్క కాన్ఫిగరేషన్ శరీరానికి సరిపడేట్టు ఉన్నట్లయితే ఇది ప్రోటీన్ల యొక్క త్వరిత శోషణ మరియు కండరాల నిర్మాణంలో సహాయపడుతుంది. అటువంటి ప్రోటీన్ ఆహారాలు చేప, పౌల్ట్రీ పక్షులు, బీన్స్ మరియు గుడ్లు. సరైన వ్యాయామంతో పాటు ఈ ఆహారాలను మీ రోజువారీ డైట్లో తగిన పరిమాణంలో చేర్చుకోండి.

గింజలు

గింజలు ప్రోటీన్ మరియు గుడ్ ఫ్యాట్స్ యొక్క ధనిక మూలాలలో ఒకటి. ఇవి కండరాలను నిర్మించేందుకు యాంటీ ఆక్సిడెంట్స్ తో కూడిన వివిధ రకాల విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తుంది. తద్వారా నడుము యొక్క కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఆకుపచ్చ కూరగాయలు

ఆకుపచ్చ కూరగాయలు శరీరానికి విటమిన్లు మరియు ఖనిజాలను అందించే ప్రాథమిక వనరులు. ఇవి జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని నిర్వహించేందుకు ఫైబర్లను అధిక మోతాదులలో అందిస్తుంది మరియు పోషకాల శోషణమును ప్రోత్సహిస్తుంది. అందువలన మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు సరైన మొత్తాల్లో చేర్చుకోండి.

మీ పిరుదులను పెంచేందుకు వ్యాయామాలు

మీ బటక్స్ పెద్దగా కావాలని మీరు ప్రయత్నిస్తున్నట్లయితే సరైన ఆహారంతో పాటు కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలను ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీలో చేయాలి. రోజూ జిమ్‌కు వెళ్లే అవసరం లేకుండా మీరు ఈ వ్యాయామాలను ఇంటిలోనే చేయగలరు.

స్టాండింగ్ ఓబ్లిక్ ఫ్లెక్షన్

Standing oblique flexion

ఈ వ్యాయామం నడుము మరియు ఉదరంపై పనిచేస్తుంది. ఇది జీవక్రియను నియంత్రించడంలో మరియు శరీర ఆకృతిని మెరుగు పరుచుకోవడంలో సహాయపడుతుంది. ఈ వ్యాయామం చేసే ముందు నేరుగా నిలుచుకొని కుడి చేతిలో డంబెల్స్ పట్టుకోండి. డంబెల్ ఉన్న కుడి వైపుకు వీలైనంత వరకు నడుముపై ఒత్తిడిని పెట్టి వంగండి. ఇలాగే ఎడమ వైపు కూడా చేయాలి. రోజుకు 30 నిమిషాలు ఒక రోజు విడిచి రోజు చేయటం వలన ఇది మీ హిప్ కండరాలను టోన్ చేసి మీకు కావలసిన ఆకారంను ఇస్తుంది.

కార్డియో వర్క్అవుట్

Cardio workout

మీ శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీ మరియు మెటబాలిజంను అధికరించేందుకు కార్డియోవాస్క్యూలార్ వ్యాయామాలను కూడా చేయాలి. ఇది హిప్ వ్యాయామాలను చేసే ముందు వార్మ్ అప్ అవ్వడానికి సహాయపడుతుంది. జుమ్బా లేదా ఏరోబిక్స్, బర్ఫీస్, స్క్వాట్స్ మరియు స్కిప్పింగ్ వంటివి అధిక శక్తికరమైన కార్డియో వ్యాయామాలు, ఇవి మీ రక్త ప్రవాహాన్ని పెంచి మిమ్మల్ని శక్తివంతంగా మరియు చురుకుగా చేస్తుంది.

రషియన్ ట్విస్ట్

Russian twist

మీ నడుము యొక్క కొవ్వును పూర్తిగా తొలగించి మీకు కావలసిన ఆకారంలో ఉంచేందుకు కొన్ని ట్విస్ట్ వ్యాయామాలను కూడా చేయాలి. ఈ వ్యాయామం నడుము మరియు సైడ్ లింబ్స్ పై ప్రభావాన్ని చూపుతుంది. మీరు మ్యూజిక్‌ని ఆన్ చేసుకొని మీ స్నేహితులతో చేరి నడుము భాగాన్ని ట్విస్ట్ చేస్తూ ఈ వ్యాయామాన్ని చేయవచ్చు. ఇది మీ శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీని కూడా పెంచుతుంది.

స్టెప్ అప్

Step up

మీరు నిలుచుకున్న సర్ఫేస్ కన్నా కొద్దిగా ఎతైన ధృఢనిర్మాణంగల సర్ఫేస్ని మీ ముందు ఉంచుకోండి. ఒక కాలు తరువాత మరొక కాలుని ఆ సర్ఫేస్ పై పెట్టి జాగింగ్ ప్రాకారంలో వ్యాయామం చేయండి. ఇది మీ నడుము కండరాలను దృఢంగా నిర్మించడానికి సహాయపడుతుంది.

డాంకీ కిక్

Basic donkey kick

మీ మోకాళ్లు మరియు చేతులను నేలపై ఉంచండి. కళ్లను వంచినట్టే పైకి లేపండి, ఒక కాలుతో 15 సెకండ్లు చేసిన తరువాత రెండవ కాలుతో కూడా చేయండి. ఈ విధంగా చేయటంవలన మీ కాళ్లు మరియు నడుము యొక్క కండరాలు బలపడతాయి. ఈ వ్యాయామం కనీసం వారానికి 3 సార్లు చేయాలి.

యోగా

Yoga

ప్రశాంతమైన మనసు మరియు శరీరం కొరకు యోగాలను ప్రాక్టీస్ చేయండి. యోగా మిమల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచటమే కాకుండా మీ బటక్స్ యొక్క సైజును పెంచటానికి కూడా సహాయపడుతుంది. ఒక కాలుపై నిలబడి మరో కాలుని మరియు ఒక చేతిని నేలకు పార్లల్ గా చాపాలి. ఇలా చేస్తే మీ మొత్తం శరీరం యొక్క బరువు ఒక కాలుపై మరియు నడుముపై ఉండటం వలన కండరాలు ధృఢంగా అవుతాయి.

స్క్వాట్స్

Squats

మీ నడుము కండరాలను పెంచేందుకు స్క్వాట్స్  ఒక మంచి వ్యాయామం. మీ కాళ్లను వెడల్పుగా ఉంచి చేతులను నేరుగా విస్తరించండి. ఇప్పుడు మీ మోకాళ్లను 90 డిగ్రీలు వంచి అలాగే 5 సెకండ్లు ఉండండి. మొదట్లో 3 సెట్లుగా 5 సార్లు చేయటం మొదలుపెట్టి క్రమంగా పెంచండి.

ఫ్రంట్ లుంగ్స్

Front lunges

మీ రెండు చేతులలో ఒక కిలో బరువు ఉన్న డంబెల్స్ ని తీసుకొని నేరుగా నిలుచుకోండి. ఎడమ కాలిని కదిలించకుండా కుడి కాలుని వీలైనంత వెడల్పు ముందుకు చాపి రెండు కాళ్లనూ 90 డిగ్రీలు వంచాలి. 5 సెకండ్ల తరువాత ఇదే ప్రక్రియను ఎడమ కాలుతో చేయాలి. ఇలా 3 సెట్లుగా 5 సార్లు చేయటం మొదలుపెట్టి క్రమంగా పెంచండి.

సైడ్ లుంగ్స్

Side Lunges

సైడ్ లుంగ్స్ లో కాళ్లను ముందుకు చాపకుండా పక్కకు స్ట్రెచ్ చేయాలి. ఇది మీ నడుము కండరాలను పెంచేందుకు అత్యంత ప్రభావితంగా పని చేస్తుంది.

సైడ్ లెగ్ లిఫ్ట్స్

Side leg lifts

ఇది చాలా సులభమైన వ్యాయామం మరియు మీ నడుము యొక్క కండరాలపై ప్రభావితంగా పని చేస్తుంది. కుడి వైపుకు తిరిగి మీ చేతిపై పడుకొని ఎడమ కాలిని పైకి లేపాలి. మీ నడుము కండరాలపై ఒత్తిడి పెరిగినట్టు మీకు అనిపించే వరకు కాలుని లేపి అలా 5 సెకండ్లు ఉండాలి. ఆ తరువాత ఇదే పద్దతిని ఎడమ వైపు తిరిగి చేయండి. ఇలా 3 సెట్లుగా 5 సార్లు చేయటం మొదలుపెట్టి క్రమంగా పెంచండి.

ఫ్రాగ్ జంప్స్

Frog Jumps

ఈ వ్యాయామంలో కప్పలాగా ఎగరాలి. మీ మొత్తం బరువుని నేలపై మోపి పైకి ఎగిరి తిరిగి నేలపై మోపాలి. మీ రెండు చేతులతో మీ బరువుని బాలన్స్ చేయండి. ఇలా 4 సెట్లుగా 4 సార్లు చేయటం మొదలుపెట్టి క్రమంగా పెంచండి.

లెగ్ రైజ్ అండ్ స్ట్రెచ్

Leg raise and stretch

నేలపై నేరుగా పడుకొని మీ రెండు కాళ్లను జోడించి 45 డిగ్రీ పైకి లేపాలి. ఆ తరువాత రెండు కాళ్లనూ విరిచి మీ నడుము యొక్క కండరాలపై ఒత్తిడి పెంచే వరకు స్ట్రెచ్ చేయండి. ఆ తరువాత మల్లి రెండు కాళ్లనూ జోడించి మొదలు పెట్టిన పొజిషన్‌కు తీసుకురండి. ఇలా 3 సెట్లుగా 5 సార్లు చేయటం మొదలుపెట్టి క్రమంగా పెంచండి.

సైడ్ లెగ్ బ్రిడ్జెస్

Single leg bridges

మీ చేతులను నేలపై చాపి పడుకోండి. మీ పాదాలను నేలపై మోపి మోకాళ్లను 90 డిగ్రీలు వంచి మీ శరీరం యొక్క క్రింద భాగాన్ని పైకి లేపండి. ఇప్పుడు మీ శరీరానికి సమానంగా ఒక కాలుని పైకి లేపండి. ఈ పొసిషన్ లో 5 సెకండ్లు ఉండాలి. ఇదే పద్దతిని రెండో కాలుకి కూడా పాటించండి. ఇలా 3 సెట్లుగా 5 సార్లు చేయండి.

మీ పిరుదులను పెంచేందుకు హోం రెమిడీలు

క్రింద చెప్పిన ఇంటి నివారణలు మీ బటక్స్ యొక్క కండరాలను టోన్ చేయడం ద్వారా వాటిని పెంచడంలో ప్రభావితంగా పనిచేస్తుంది. అయినప్పటికీ, వాటి ప్రభావం మీ శరీరంలోని జీవక్రియ మరియు కండరాల నిర్మాణం లాంటి కారకాలపై ఆధారపడి ఉంటుంది. కనుక, ఇవి మీ శరీరంపై పని చేస్తాయో లేదో తెలుసుకోవడానికి వాటిని ప్రయత్నించి చూడండి.

వేడి ఆయిల్ మసాజ్

ఆలివ్ నూనె, కొబ్బరి నూనె మరియు ఆవాల నూనె కండరాలను నిర్మించేందుకు మరియు టోన్ చేసేందుకు ఉత్తమంగా పనిచేస్తాయి. ఈ మూడు నూనెలను తగినంత మరియు సమాన పరిమాణంలో తీసుకొని కొద్దిగా వేడి చేయండి. వేడి నూనె మరింత సులభంగా చర్మంలో చొచ్చుకుపోతుంది మరియు మంచి ఫలితాలను అందిస్తుంది. ఇప్పుడు కనీసం 20 నుండి 30 నిమిషాలు మీ పిరుదులపై ఈ నూనెతో మసాజ్ చేసుకోవాలి, తరువాత కడిగే ముందు 20 నిమిషాలు హాట్ ప్యాక్ ని ఉంచండి. రోజుకు కనీసం రెండుసార్లు ఈ చికిత్సను చేయండి. మీరు పెద్ద పిరుదులను పొందేందుకు ఇది సమర్థవంతమైన గృహ చికిత్స.

సి ఉప్పు మరియు హాట్ బాత్

సముద్రపు ఉప్పులో అధిక పరిమాణంలో ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాలు కొవ్వును తగ్గించడంలో మరియు కండరాలను నిర్మించడంలో ప్రభావితంగా పనిచేస్తుంది. ఒక కప్పు సి ఉప్పుని సగం బకెట్ వేడి నీటిలో కలపండి. ఇప్పుడు ఈ నీటిలో మందపాటి కాటన్ టవల్‌ను ముంచి మీరు పెంచాలని అనుకుంటున్న కండరాలపై ఉంచండి. టవల్ వేడిగా ఉండే వరకు ఉంచి మల్లి ఈ ప్రక్రియను రిపీట్ చేయండి, ఇలా 30 నిమిషాల పాటు చేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. మీ ఆహారంలో వాడుతున్న సాధారణ ఉప్పుకు బదులుగా సి ఉప్పుని వాడటం వలన మీ శరీరంలోని అదనపు కొవ్వును తొలగిస్తుంది.

తేనె మరియు వెచ్చని నీటితో నిమ్మరసం

కొద్దిగా వెచ్చని నీటిలో ఒక నిమ్మపండు రసాన్ని, ఒక స్పూన్ తేనెని కలుపుకొని త్రాగండి. ఉదయం లేచిన వెంటనే ఈ మిశ్రమాన్ని త్రాగాలి. ఇది కొవ్వుని కరిగించి కండరాలను సమర్థవంతంగా టోన్ చేస్తుంది.

ఆపిల్ సీడర్ వినిగర్

1/2 కప్పు వినిగర్ మరియు 1/4 కప్పు ఆలివ్ నూనెని కలుపుకొని మీ బటక్స్ పై 15 నిమిషాలు మసాజ్ చేయండి. తరువాత 30 నిమిషాలు హాట్ ప్యాక్ ని ఉంచండి. ఇలా రోజుకు రెండు సార్లు చేయాలి. ఆపిల్ సీడర్ వినిగర్‌ని మీ ఆహారంలో చేర్చుకోవటం వలన కూడా కొవ్వుని కరిగించి మీ కండరాలను టోన్ చేస్తుంది.

కాఫీ మరియు వాల్నట్ స్క్రబ్

సరైన రీతిలో చర్మంపై స్క్రబ్ చేయటం వలన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ నడుము ప్రాంతంలో రక్త ప్రసరణ పెంచడానికి మరియు కండరాలను టోన్ చేసి వాటిని పెద్దవిగా పెంచడానికి స్క్రబ్ సహాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ కాఫీ పొడి మరియు 2 వాల్నట్ యొక్క షెల్స్ ను పొడిచేసి కలుపుకోండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ తేనెని కలిపి పేస్ట్‌లా చేసుకోండి. ఈ పేస్ట్‌ని చర్మంపై రాసి ఆరిపోయే వరకు 5 నిమిషాలకు ఒకసారి స్క్రబ్ చేసి వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజుకు 2 సార్లు 2 నెలలు చేసి మంచి ఫలితాలను పొందండి.

Posted on

Telugu tips to get slim waist – సన్నని నడుము పొందటం ఎలా?

ప్రతి ఒక్కరు వారి నడుము స్లిమ్ అండ్ ట్రింగా ఉండాలని ఆశిస్తారు. కొందరు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే వారసత్వంగా సన్నటి నడుమును పొందుతారు. కొందరు ఎంతో కష్టపడి ఆకర్షణీయమైన నడుము పొందుతారు.

స్థూలకాయంతో బాధపడుతున్న వారి నడుము చుట్టు కొవ్వు ఎక్కువగా ఉండటం వలన సన్నబడటం చాలా కష్టం. ఎక్కువగా తినటం, వ్యాయామాలు మరియు భౌతిక పనులను చేయకపోవటం వంటి కారణాల వలన స్థూలకాయం ఏర్పడుతుంది.

కడుపులోని కొవ్వును తగ్గించేందుకు కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఈ ఆర్టికల్ లో చెప్పబడి ఉన్నాయి. వాటిని పాటించి సన్నని అందమైన నడుముని పొందండి.

నడుములోని కొవ్వు తగ్గేందుకు కొన్ని చిట్కాలు

 • తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్లు మరియు ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోండి.
 • ఎక్కువగా తినడం మానుకోండి. చిన్న మోతాదులలో భోజనం తీసుకునే ప్రయత్నం చేయాలి.
 • క్లోరిన్ ఉండే ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకోండి.
 • మీ రోజువారీ కార్యకలాపాలలో వ్యాయామం మరియు ఉదయం నడవడం లాంటి అలవాట్లను చేర్చుకోండి.
 • మీకు నచ్చిన క్రీడలను ఎంచుకోని వాటిలో పాల్గొనండి.
 • చల్లటి నీళ్ళకు బదులుగా వెచ్చని నీళ్ళను త్రాగండి.
 • మీ శరీరాన్ని తాజాగా మరియు ఫిట్ గా కనపడేందుకు రోజుకు 10 లేదా 12 గ్లాసుల నీరు త్రాగండి.
 • జంక్ ఫుడ్స్ మీ పొట్ట ఉబ్బటానికి ముఖ్య కారణం, కనుక వీటిని నివారించండి.
 • తగినంత సమయం విశ్రాంతి తీసుకోండి.
 • మనం చిన్న వయసులో ఆడుకునే స్కిప్పింగ్ ఒక వ్యాయామం లాంటిది, ఇది మన బరువు తగ్గటానికి మరియు పొట్టలోని కొవ్వు తగ్గటానికి చాలా ఉపయోగపడుతుంది.
 • భోజనం చేసేటప్పుడు లేదా చేసిన వెంటనే నీటిని త్రాగకూడదు. అలా త్రాగటం వలన కడుపు ఉబ్బుతుంది. కనుక భోజనం చేసిన గంట తరువాత నీళ్లు త్రాగండి. తిన్న వెంటనే కొద్ది సేపు నడవడం చాలా మంచిది.

మీ డైట్ పై దృష్టి పెట్టండి

మీరు రోజువారీ డైట్ పై దృష్టి పెట్టడం చాలా అవసరం. తాజా కూరగాయలు మరియు పండ్లను మీ డైట్ లో చేర్చుకోండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆకు కూరలను తినండి. సిట్రస్ మరియు నీరు ఎక్కువగా ఉండే నారింజ లాంటి పండ్లను తినండి. మీ భోజనంలో మెరుగుపెట్టిన గింజలకన్నా తృణధాన్యాలను ఎక్కువగా చేర్చుకోండి. మెరుగుపెట్టిన(పాలిష్డ్ గ్రైన్స్) గింజలను పూర్తిగా నివారించడం మంచిది. ప్రోటీన్స్ మరియు మంచి ఫ్యాట్స్ కలిగిన పదార్థాలను తినడం కూడా చాలా అవసరం.

పానీయాలు

నీటిని ఎక్కువగా త్రాగండి. చక్కెర మరియు కెఫిన్ ను నివారించండి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

శరీరంలో మంచి ఆకారం పొందేందుకు వ్యాయామం చాలా అవసరం. ఒక రోజు వ్యాయామం చేసి వెంటనే మానేయటం మంచిది కాదు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయటం వలన శరీరం ఆరోగ్యంగా మరియు సన్నగా అవుతుందని నిరూపించబడింది. పొట్టభుజం మరియు తొడ వ్యాయామాలు చేయటం వలన అందమైన శరీర నిర్మాణం పొందుతారు.

మూలాంశం పై దృష్టి పెట్టండి

మీ నడుముని బలపరిచే కార్డియో వ్యాయామాలను చేయటం చాలా ముఖ్యం. దీని వలన మీ వెన్ను నొప్పి కూడా తొలగిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సన్నటి అందమైన నడుమును పొందుతారు.

బాలన్స్ బాల్

బాలన్స్ బాల్ ని ఉపయోగించి వ్యాయామాలను చేయటం వలన సులభంగా సన్నటి నడుమును పొందవచ్చు.

ఆహారం లో మార్పు

ప్రస్తుతం మీరు పాటిస్తున్న డైట్ మీ బరువు తగ్గటానికి తోడ్పడకపోతే, మీ డైట్ ప్లాన్ ని మార్చండి. ఎందుకంటే చాలా మందిలో మార్పులు కలిగించే డైట్ ప్లాన్ కొందరిలో ఎటువంటి మార్పు చూపక పోవచ్చు. కనుక మీకు సరిపడే డైట్ షెడ్యూల్‌ని మీ ట్రైనర్ని సంప్రదించి మార్చుకోండి.

ఆరోగ్యకరమైన అల్పాహారం

మీరు మీ నడుముని తగ్గించాలని అనుకుంటే, మొత్తం శరీర నిర్మాణం తగ్గించటం కూడా చాలా ముఖ్యం. మీరు ఆరోగ్యకరమైన అల్పాహారంతో రోజును ప్రారంభించినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. రాత్రంతా ఏమీ తినకపోవడం వలన ఉదయం మంచి అల్పాహారం తీసుకుంటే రోజంతా శక్తివంతంగా ఉంటారు. ఇది మీ శరీర జీవక్రియను పెంచుతుంది అందువలన సహజంగా మీ నడుము సన్నబడుతుంది.

కేలరీలను తగ్గించుకోవాలి

ఒక కర్వ్ నడుము కోసం కేవలం వ్యాయామం ఒక్కటే సరిపోదు. ప్రతి రోజు మీరు తీసుకునే ఆహారం మీద దృష్టి పెట్టాలి. తక్కువ కేలరీలు కలిగిన ఆహారాలను తీసుకోండి.

Posted on

Telugu tips to reduce stomach bloating – ఉబ్బిన పొట్టను తగ్గించడం ఎలా? – కడుపు ఉబ్బరాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు

కాలేయం లేదా గుండె జబ్బులు వలనే కడుపు ఉబ్బుతుంది. దీనికి ముఖ్య కారణం ప్రేగులోని వాయువు లేదా కణజాలంలో అదనపు ద్రవాలు చేరడం. దీని వలన మీ కడుపు యొక్క పరిమాణం పెరిగి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనిని కడుపు వాపు అని కూడా అంటారు. ఇది ఆహారపు అలవాట్లు లేదా జీవనశైలి మొదలైన కారణాల వలన కలిగే సమస్య. క్రింద చెప్పిన కొన్ని విధానాలను అనుసరించి ఈ సమస్యను సులభంగా తొలగించండి.

ఉబ్బిన కడుపు తగ్గించే ఇంటి చిట్కాలు

పొటాషియం

పొటాషియం శరీరంలోని ద్రవాలను సంతులనంగా ఉంచుతుంది. అరటి పండు, టమోటాలు, బచ్చలి కూర, మామిడి పండు మరియు గింజలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వలన శరీరంలోని అదనపు నీటిని తొలగించి ఉబ్బిన కడుపు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.

అరటి పండ్లు

అరటి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కావున మలబద్ధకం రావటానికి కారణం అయిన వాయువు సమస్యలను తొలగిస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మీ శరీరంలోని ద్రవాల స్థాయులను నియంత్రించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా అరటి పండ్లను తినడం ద్వారా పొట్ట ఉబ్బరం తొలగిపోతుంది.

గాలిని మింగకూడదు

మనం తెలిసో తెలియకనో గాలిని ఎక్కువగా మింగుతాము, దీని మూలంగా కడుపు ఉబ్బుతుంది. ధూమపానం, పళ్ళ రసాలను త్రాగటం, బబుల్ గమ్ నమలడం లాంటి కొన్ని అలవాట్లపై దృష్టి పెట్టండి. తినేటప్పుడు తక్కువ మాట్లాడండి.

సోపు గింజలు

ఇందులోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కడుపు ఉబ్బటం వలన కలిగే మూత్ర విసర్జన నొప్పిని తొలగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థలో కండరాలను సడలిస్తుంది. భోజనం చేసిన తరువాత కొన్ని సోపు గింజలను నమలండి లేదా, ఒక స్పూన్ సోపు గింజలను ఒక కప్పు వేడి నీటిలో వేసి 5-10 నిమిషాల పాటు ఉంచండి. ఈ నీటిని వడి గట్టి రోజుకు 2 లేదా 3 సార్లు త్రాగండి.

స్టార్చ్ ఆహారాలను నివారించండి

పొట్ట ఉబ్బటానికి ముఖ్య కారణం స్టార్చ్ ఆహార పదార్థాలు. కావున వీటిని నివారించండి లేదా తక్కువగా తినండి. నూడుల్స్, వైట్ బ్రెడ్, పాస్టరీస్, కేకులు, పాస్తాలు మొదలైన వాటిలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది.

శారీరక పనులను అనుసరించండి

రోజువారీ శారీరక పనులను చేయడం వలన మీ జీర్ణ శక్తి మెరుగు పొందుతుంది. ఆరోగ్యకరమైన శరీరం కోసం ఎనిమిది గంటలు నిద్ర కూడా అవసరం.

అల్లం

అల్లం శరీరంలోని వాయువును తొలగించి ఉబ్బిన పొట్టను తొలగిస్తుంది. ఇది ప్రేగులలో వాపును మరియు మంటను తగ్గించి ప్రేగు కండరాలను సడలిస్తుంది.5 లేదా 6 ముక్కల అల్లంను ఒక కప్పు ఉడుకు నీటిలో వేసి 10 నిమిషాల పాటు మూసి పెట్టండి. ఆ తరువాత వడి గట్టి కొద్దిగా తేనె మరియు నిమ్మరసం కలిపి రోజుకు 3 సార్లు త్రాగండి.

నివారించవలసిన ఆహార పదార్థాలు

నల్ల మిరియాలు, వెనిగర్, మిరపకాయ, ఆవాలు, ముల్లంగి, ఉల్లిపాయలు, వెల్లుల్లి లాంటి కరమైన ఆహార పదార్థాలను నివారించండి. ఎందుకంటే ఇవి కడుపులో మంటను పుట్టించవచ్చు.

మసాజ్ చేయటం

మీ ఉబ్బిన కడుపులోనీ వాయువును తొలగించేందుకు జీర్ణ వాహిక దిశలో మసాజ్ చేయండి. మీ వేళ్లను నడుము నుండి మొదలు పెట్టి పెద్ద ప్రేగు వరకు నొక్కండి.

కారవే విత్తనాలు

ఇందులో యాంటీ మోక్రోబియాల్, యాంటీ స్పస్మోడిక్ మరియు కర్మినేటివ్ లక్షణాలు ఉన్నాయి. ఇందులోని కార్వోల్ మరియు కార్వెనే అనే రెండు రసాయనాలు జీర్ణ వ్యవస్థ యొక్క కండరాల కణజాలను సున్నితంగా మార్చేందుకు సహాయపడుతుంది. ఈ విత్తనాలు మీ శరీరంలోని వాయువును బహిష్కరించి వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. మీకు తరచూ పొట్ట ఉబ్బే సమస్య ఉన్నట్లయితే ఒక చిటిక కారవే విత్తనాలను రోజంతా నమలండి. లేదా ఈ విత్తనాలను బాగా దంచి నీటిలో వేసి ఉడకబెట్టి టీ లా త్రాగండి.

ఆహారాన్ని నమిలేటప్పుడు జాగ్రత్త వహించండి

సరైన ఆహారాన్ని తీసుకోవటమే కాదు వాటిని తినేటప్పుడు ఎక్కువ సార్లు నమిలి తినాలి. ఆహారాన్ని వేగంగా మరియు సరిగ్గా నమలకుండా తినటం వలన పొట్ట ఉబ్బుతుంది. జీర్ణం కానీ ఆహారం పెద్ద ప్రేగులోనికి ప్రవేశిస్తున్నప్పుడు బాక్టీరియాలు వీటి ద్వారా వాయువును విడుదల చేస్తాయి, ఇది ఉబ్బిన కడుపుకు దారితీస్తుంది.

ఫైబర్

ఫైబర్ ఎక్కువగా తీసుకోవటం లేదా తక్కువగా తీసుకోవటం వలన కూడా కడుపు ఉబ్బుతుంది. కావున ఫైబర్ ఉన్న ఆహారాలను సరైన మోతాదులలో తీసుకోవాలి.

మలబద్ధకం

పొట్ట ఉబ్బటానికి ముఖ్య కారణం మలబద్దకం. సరైన ఫైబర్ ఆహారాలను తీసుకోవటం వలన మీ జీర్ణ వ్యవస్థను నియంత్రిస్తుంది. దీని వలన మలబద్దకం సమస్య తొలగిపోతుంది. తృణధాన్యాలు, చిక్కుళ్ళు, బీన్స్, మొక్కజొన్న, గోధుమ బియ్యం, అవోకాడో, గోధుమ పాస్తా, బటానీలు, ఆర్టిచోకెస్, గోధుమ బ్రెడ్, బ్రోకలీ, ఆపిల్ పండు, బఠానీలు, కోరిందకాయలు మరియు బాదాంలలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఒక వేళా మీకు మలబద్ధకం సమస్య లేనట్లయితే ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువ తినకూడదు, ఎందుకంటే మీ సమస్య మరింత అధికం కావచ్చు. మీకు వాయువు సమస్య ఉన్నట్లయితే ఫైబర్ ఆహారాలను తగ్గించండి.

ఉడికించిన కాయకూరలు

కాయకూరలను ఉడికించేటప్పుడు కడుపు ఉబ్బరం సమస్య కలిగించే కొన్ని ఫైబర్లు మరియు ఎంజైములు తొలగిపోతాయి. అంతే కాదు ఉడికించిన కాయకూరలు సులభంగా జీర్ణం అవుతాయి.

Posted on

Unwanted hair removal tips in Telugu – ఆంతరంగిక భాగాలలో అవాంఛిత రోమాలను తొలగించటం ఎలా?

అనవసరమైన వెంట్రుకలను తొలగించేందుకు వివిధ కారణాలు ఉంటాయి, కొందరు శుభ్రంగా ఉండేందుకు, మరి కొందరు మతపరమైన ధ్యేయం కోసం ఇంకా ఇతర కారణాలు ఉండచ్చు. ఇది చాలా సున్నితమైన విషయం, చాలా మంది దీని గురించిన సలహాలు అడిగేందుకు సిగ్గుపడతారు. ఈ వ్యాసంలో ఆంతరంగ భాగాలలోని అనవసరమైన జుట్టులను తొలగించేందుకు ఉత్తమ పద్ధతులు వివరించబడి ఉన్నాయి.

అంతర్గత భాగాలలో వెంట్రుకలను తొలగించటం అంత సులువైన విషయం కాదు. ఆ భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి, చిన్న పొరపాటు కూడా చాలా హాని కలిగిస్తుంది. ఈ చోటులలోని వెంట్రుకలు చాలా మందమైనది మరియు గరుకుగా ఉంటాయి, కావున చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

క్రింద చెప్పిన విధానాలలో మీ సౌలభ్యం స్థాయికి మరియు చర్మం యొక్క సున్నితత్వానికి సరిపోయే ఒక విధానాన్ని ఎంపిక చేసుకోండి.

క్షవరం

ఎన్నో కొత్త విధానాలు ప్రముఖమవుతున్నప్పటికీ క్షవరం చేయటం చాలా సాధారణమైన పద్ధతి. మామూలుగా క్షవరంకు భద్రతా రేజర్‌లను వాడుతారు, కానీ దీని కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక ఎలక్ట్రిక్ రేజర్ ను వాడటం ఉత్తమం.

ప్రయోజనాలు

 • చౌక: భద్రతా రేజర్లు చాలా చౌకగా లభిస్తాయి. ఎలక్ట్రిక్ రేజర్ ని ఒక్కసారి కొనుగోలు చేస్తే చాలు.
 • త్వరిత: రేజర్‌లను ఉపయోగించి క్షవరం చేయటం ఇతర పద్ధతులతో పోలిస్తే వేగవంతమైనది.
 • సులువు: ఉపయోగించడానికి అనుకూలమైన.
 • నొప్పి కలిగించదు: మీరు జాగ్రత్తగా క్షవరం చేసినట్లయితే ఈ పద్ధతి నొప్పి లేకుండా ఉంటుంది.

లోపాలు

 • పునరావృత్తం: జుట్టు వెంటనే వేగంగా పెరుగుతుంది, అందువలన మీరు తరచూ క్షవరం చేస్తూ ఉండాలి.
 • దురద: షేవింగ్ చేసిన వెంటనే మీ చర్మం దురదగా మరియు అసౌకర్యంగా అవుతుంది.
 • గాటులు: నిర్లక్ష్యంగా ఉపయోగిస్తే గాటులు ఏర్పడవచ్చు.
 • దద్దుర్లు: సున్నితమైన చర్మం ఉన్న వారికి ఈ పద్దతి సరిపడకపోవచ్చు, ఎందుకంటే వీరి చర్మంపై దద్దుర్లు రావచ్చు లేదా చర్మం ఎర్రగా కావచ్చు.

వాక్సింగ్

ఇది అవాంఛిత జుట్టులను తొలగించే మరొక ప్రముఖ పద్ధతి. అందుబాటులో ఉన్న మూడు రకాల వ్యాక్సింగ్లు, బికిని వాక్స్, బ్రెజిలియన్ వాక్స్ మరియు హాలీవుడ్ వాక్స్.

బికిని వాక్స్ బికినీ లైన్ వెంట్రుకలను తొలగిస్తుంది కానీ యోని వెంట్రుకలను తొలగించదు. ఇందువలన చాలా మంది స్త్రీలు బ్రెజిలియన్ వాక్స్ ను ఎంచుకుంటారు.

1980వ శతాబ్దం నుండి ఈ వాక్స్ చాలా ప్రసిద్ధి పొందింది. ఇది ‘ల్యాండింగ్ స్ట్రిప్’ అని పిలువబడే ఒక చిన్న భాగాన్ని విడిచిపెట్టి మిగిలిన ఆంతరంగిక భాగాలలోని రోములను పూర్తిగా తొలగిస్తుంది.

హాలీవుడ్ వాక్స్ కూడా బ్రెజిలియన్ వాక్స్ వలె ఉంటుంది, కానీ ఇది ల్యాండింగ్ స్ట్రిప్ చోటులోని రోమాలను కూడా తొలగిస్తుంది.

ప్రయోజనాలు

 • ఇది జుట్టు యొక్క అన్ని తంతువులనూ తొలగిస్తుంది.
 • 20-40 రోజుల వరకు కొత్త జుట్టు రాకుండా ఉంటుంది.
 • జుట్టు యొక్క కొత్త తంతువులు మృదువుగా ఉంటాయి .
 • క్షౌరముకన్నా చౌకైనది కాకపోవచ్చు కానీ లేజర్ లేదా ఎలెక్ట్రోలిసిస్ పద్ధతులకన్నా చౌక.

లోపాలు

 • ఉపయోగించిన తక్షణమే నొప్పిని కలిగిస్తుంది.
 • సున్నితమైన చర్మానికి హానికరమైనది.
 • రోమాలు ¼ అంగుళం పెరిగిన తరువాతే ఈ ప్రక్రియను మల్లి చేయవచ్చు.
 • దురద మరియు వాపు కలిగే అవకాశాలు ఉన్నాయి, దీని వలన ఇన్ఫెక్షన్ రావచ్చు.
 • జననేంద్రియ ప్రాంతం మృదువుగా ఉన్నందున సులభంగా హాని కలగవచ్చు.
 • గజ్జి, తామర లేదా సోరియాసిస్లతో బాధపడేవారు ఈ పద్దతిని అనుసరించకూడదు. వాక్సింగ్ ఈ పరిస్థితులను పెంచుతుంది.
 • డయాబెటిస్స్ ఉన్నవాళ్లు, గర్భిణీ స్త్రీలు, గర్భ నియంత్రణ మాత్రలు ఉపయోగించే వారు లేదా ఇతర ఔషధాలు తరచుగా వాడే వారు నిపుణుల సలహా తీసుకోవటం మంచిది.

డిపిలేటరీ క్రీమ్లు

మీ బికినీ లైన్ వెంట్రుకలను తొలగించేందుకు మరొక మార్గం డిపిలేటరీ క్రీమ్లు. మీరు మీ భద్రత కోసం మంచి నాణ్యమైన క్రీమును ఎంచుకోవాలి. మీ చర్మం సున్నితమైనది అయితే తక్కువ రసాయనాలు కలిగిన క్రీమును ఉపయోగించండి. కొనే ముందు మరియు ఉపయోగించే ముందు ఆదేశాలు మరియు హెచ్చరికలను చదవండి.

ప్రయోజనాలు

 • ఈ విధానం నొప్పి లేకుండా ఉంటుంది.
 • అనుసరించేందుకు అనుకూలమైనది మరియు త్వరగా ఫలితాన్ని ఇస్తుంది.
 • ఖర్చు తక్కువ.

లోపాలు

 • మీ చర్మంపై ఘాటైన వాసన రావచ్చు.
 • దురద, దద్దుర్లు మరియు మంటని పుట్టించ వచ్చు.
 • సున్నితమైన చర్మం ఉన్నవాళ్లు ఉపయోగించటం మంచిది కాదు.
 • ఇందులో అధిక రసాయనాలు ఉన్నందున మీ చర్మానికి హాని కలిగించవచ్చు. కావున దీర్ఘకాలం ఉపయోగించకూడదు.

లేజర్ చికిత్స

లేజర్ చికిత్స ఒకే సారి మీ సమస్యను తొలగిస్తుంది. వాక్సింగ్ లేదా షేవింగ్‌ను తరచుగా చేయకూడదని అనుకొంటున్నట్లయితే ఈ చికిత్స మీకు ఉపయోగపడుతుంది. లేజర్ చికిత్స మీ జుట్టు మూలంను పతనం చేస్తుంది, అందుచేత మీరు నిరంతర ఖర్చుల గురించి మరియు ప్రతి 4 నుండి 6 వారాలకు ఒకసారి మీ వ్యక్తిగత భాగాలను సరి చేయటం గురించి చింతించ వద్దు.

ప్రయోజనాలు

 • ఇది శాశ్వత చికిత్స.
 • వాక్సింగ్ తో పోల్చుకుంటే తక్కువ ఖరీదైనది.
 • చర్మంపై ఎలాంటి హానీ కలగదు.
 • ముదురు మరియు గరుకు జుట్టుకు ఉత్తమమైన పద్దతి.

లోపాలు

 • ఇది అత్యంత ఖరీదైన పద్ధతి. కానీ ఇది ఒక్కసారి మాత్రమే అయ్యే ఖర్చు.
 • ఈ చికిత్స చేసుకున్న తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
 • ఈ చికిత్స చాలా సమయం పడుతుంది.
 • ఉత్తమ ఫలితం పొందేందుకు ఎక్కువ సెషన్స్ అవసరం కావచ్చు.

గృహ నివారణలు

ఇంట్లో తయారు చేసిన వాక్స్లను ఉపయోగించినప్పటికీ, మీ రోమాలు పూర్తిగా తొలగిపోయే వరకూ మీరు క్షవరం చేయాలి. మీరు ఏదైనా ఒక పద్దతిని అనుసరించే ముందు ఆ పదార్థం వలన ఏదైనా అలర్జీ ఏర్పడుతోందా అని పరిశీలించి ఉపయోగించండి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఇది మీ ఆంతరంగిక శరీర భాగాలలోని రోమాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను నీటిలో కలిపి తక్కువ మంట మీద బాగా ఉడికించాలి. నీళ్లు చల్లబడిన తరువాత మీరు రాత్రి పడుకునే ముందు ఒక పత్తితో ఈ నీటిని వ్యక్తిగత భాగాలపై రాయండి. ఉదయం చల్ల నీటితో కడిగి ఆల్కహాల్ లేని మాయిశ్చరైజర్ని రాయండి. ఇలా వారానికి 3 లేదా 4 సార్లు ఒక నెల పాటు చేసినట్లయితే మీరు కచ్చితమైన ఫలితాలను పొందుతారు.

శనగ పిండి

అనవసరమైన రోమాలను తొలగించేందుకు ఇది చాలా పురాతన మరియు అత్యంత ప్రభావితమైన సహజ నివారిణి. దీనిని పిల్లలు, పెద్దలు మరియు సున్నితమైన చర్మం ఉన్న వారు కూడా వాడవచ్చు. శనగ పిండిని రెండు రక్కలుగా వాడవచ్చు.

 1. కొద్దిగా శనగ పిండిలో చిటికె పసుపు, కొద్దిగా పాలు కలుపుకొని ఒక ముద్దలా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఆంతరంగిక భాగాలపై రాసి క్షవరం చేయండి. ఇది జుట్టును మృదువుగా తొలగించేందుకు మరియు తిరిగి పెరగకుండా నివారించేందుకు సహాయపడుతుంది.
 2. మీరు రోమాలను క్షవరం చేసిన తరువాత, శనగ పిండిలో నీరు మరియు చిటిక ఉప్పును కలపి చర్మంపై రాయండి. ఇది మీ జుట్టు పెరుగుదలను తగ్గించడానికి సహాయ పడుతుంది. ఇది నెమ్మదిగా పని చేస్తుంది, కానీ ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

గుడ్డు

కోడి గుడ్డు యొక్క తెల్లసొనలో మొక్కజొన్న పిండి మరియు ఒక చిటికెడు చక్కెరను వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఒక జిడ్డు పదార్థంలా తయారు అవుతుంది. దీనిని వాడటం వలన మీ చర్మంపై రోమాలను, మలినాలను మరియు చనిపోయిన చర్మ కణాలను కూడా తొలగిస్తుంది. ఈ పేస్ట్‌ను చర్మ రోమాలపై రాసి మృదువుగా తీసివేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.

తెల్ల మిరియాలు మరియు కర్పూరం

తెల్ల మిరియాలను పొడిచేసి కొద్దిగా కర్పూరం కలపండి. ఇందులో కొద్దిగా బాదాం నూనెని కలిపి బంక ముద్దలా చేసుకోవాలి. దీనిని చర్మంపై రాసి 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి.  

గమనిక: ఇది సున్నితమైన చర్మం కల వారు ఉపయోగించవద్దు, ఎందుకంటే ఈ రెండు పదార్థాలు చర్మంపై మంటను పుట్టిస్తుంది.

అరటి పండు మరియు వోట్మీల్

అరటి పండు మీ చర్మాన్ని మృదువుగా చేసి జుట్టులేని చర్మాన్ని ఇస్తుంది. కొన్ని అరటి పండ్లను బాగా చూర్ణం చేసి కొద్దిగా వోట్మీల్ని కలిపి చర్మంపై రాయండి. ఆరిపోయిన తరువాత వెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఇది ఆంతరంగిక భాగాలకే కాదు మీ ముఖం, కాళ్లు లేదా చేతులలోని అనవసరమైన వెంట్రుకలను తొలగించేందుకు కూడా ఉపయోగించవచ్చు.

పటిక పొడి మరియు గులాబి నీళ్లు

ఇది సున్నితమైన చర్మానికి మంచి ఫలితాలు ఇస్తుంది. పటికను పొడి చేసుకొని రోజ్ వాటర్లో కలుపుకొని ఒక పత్తితో ఆంతరంగిక భాగాలపై రాయండి. ఇది అనవసరమైన రోములను వెంటనే తొలగిస్తుంది. మీ చర్మం చాలా సున్నితమైనది అయితే రాసిన 10 నిమిషాల తరువాత కడగండి. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసేందుకు కొద్దిగా నువ్వుల నూనె లేదా ఆలివ్ నూనెని రాయండి.

తులసి మరియు ఉల్లిపాయలు  

అనవసరమైన వెంట్రుకలను తొలగించేందుకు ఇది చాలా పురాతన పద్దతి. ఉల్లిపాయ పొరలను ఒలిచి తులసి ఆకులతో పాటు బాగా దంచాలి. ఒక చిక్కని ముద్దలా చేసుకొని చర్మంపై రాసి 15-20 నిమిషాల తరువాత కడగండి. తులసి ఆకులు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి.

తనకా మరియు కుసుంభా పువ్వు  

మయన్మార్ లో తనకా అనే వృక్షం యొక్క బెరడును చాలా మంది చర్మాన్ని అందంగా ఉంచేందుకు ఉపయోగిస్తారు. ఇది అనవసరమైన రోమాలను తొలగించేందుకు కూడా ఉపయోగపడుతుంది. దీనిని కాస్మెటిక్స్ లో కూడా ఉపయోగిస్తారు. తనకా పొడిని కుసుంభా పువ్వు పేస్ట్ తో బాగా కలిపి చర్మంపై రాయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడగండి. ఇలా వారానికి రెండు సార్లు చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది.

పుదీనా టీ

‘ఆండ్రోజన్స్’ అని పిలువబడే హార్మోన్ ఉత్పత్తి ఫలితంగా అధికమైన జుట్టు పెరుగుతుంది. ఈ పరిస్థితిని ‘హర్సిటిజం’(‘అతి రోమత్వము’) అని అంటారు. ఇటువంటి అనవసరమైన అధిక రోమాలను తొలగించేందుకు పుదీనా టీ ఉపయోగపడుతుంది. కొన్ని పుదీనా ఆకులను ఒక బౌల్ నీటిలో వేసి ఉడికించండి. బాగా ఉడికిన తరువాత వడగట్టి రోజుకు రెండు సార్లు ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు త్రాగండి.

చక్కెర వాక్స్

ఒక బౌల్ లో 3 టేబుల్ స్పూన్ల చక్కెర, ఒక టీ స్పూన్ తేనె మరియు కొద్దిగా నిమ్మరసం వేసుకొని కొద్దిగా నీటిని కలిపి వేడి చేయండి. ఈ మిశ్రమం వెచ్చగా ఉన్నప్పుడే మీ ఆంతరంగిక భాగాలపై రాయండి. ఇది మీ రోమాలను మృదువుగా చేస్తుంది. ఆ తరువాత ఒక వాక్స్ స్ట్రిప్ తో రోమాలను తొలగించండి.

కలబంద వాక్స్

కలబంద మరియు తేనెని కలిపి కొద్దిగా వేడి చేయండి. వెచ్చగా అయిన తరువాత మీ రోమాలపై రాసి ఒక వాక్స్ స్ట్రిప్ తో రోమాలను తొలగించండి. ఇది చాలా సులభమైన మరియు ఆరోగ్యకరమైన వాక్స్.

నిమ్మరసం మరియు తేనె

నిమ్మరసం మరియు తేనెని కలిపి వేడి చేసి ఈ మిశ్రమాన్ని వాక్స్ లా ఉపయోగించండి. మీరు మొదటి సారి రోమాలను తొలగించిన తరువాత ఈ మిశ్రమాన్ని వాడినట్లైతే ప్రభావితంగా పని చేస్తుంది.

తేనె మరియు వోట్మీల్

ఈ మిశ్రమం కూడా ఒక మంచి ఎంపిక. తేనె మరియు వోట్మీల్ ను కలిపి వెచ్చగా చేసి వాక్స్ లా ఉపయోగించి మీ చర్మ రోమాలను తొలగించండి.

బంగాళదుంప మరియు కాయ ధాన్యాలు

ఆయుర్వేదం ప్రకారం, బంగాళదుంపలు సహజంగా చర్మాన్ని బ్లీచ్ చేస్తాయి. బంగాళదుంపతో కాయ ధాన్యాలను కలిపి ఉపయోగిస్తే అనవసరమైన మీ రోమాలను తొలగించగలదు. కాయ ధాన్యాలను రాత్రంతా నీటిలో నానపెట్టండి. ఉదయం దీనిని రుబ్బి ఒక పేస్ట్ లా చేసుకోండి. ఒక బంగాళదుంప చర్మాన్ని ఒలిచి చూర్ణం చేసి కాయ ధాన్యాల పేస్ట్ లో వేసి ఒక టేబుల్ స్పూన్ తేనెని, 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేసి బాగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసి 20 నిమిషాల తరువాత శుభ్రం చేయండి. ఇది మీ అనవసరమైన రోమాలను తొలగిస్తుంది. దీనిని ఉపయోగించిన 7 రోజులకు మరోసారి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

పచ్చని బొప్పాయి పండు

పచ్చని బొప్పాయి పండులో ఉన్న పాపైన్ యొక్క ప్రత్యేక ఎంజైమ్ రోమాల యొక్క ఫోలికల్స్ను తొలగిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను కూడా తగ్గిస్తుంది. ఇది సున్నితమైన చర్మం ఉన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఒక పచ్చని బొప్పాయి పండును బాగా చూర్ణం చేసి అందులో పసుపు వేర్లను తురిమి బాగా కలుపుకోవాలి. దీనిని మీ ఆంతరంగిక భాగాలపై ఉన్న రోమాలపై రాసి మృదువుగా మర్దన చేయండి. 20 నిమిషాలు ఉంచి నీళ్లతో కడగండి. ఇలా చేసిన 2 రోజుల తరువాత మల్లి చేయండి.

పసుపు

ఇది మీ రోమాలను తొలగించటమే కాదు మీ చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం యొక్క మంటను తగ్గించి బాక్టీరియాలతో పోరాడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను కూడా తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ శనగ పిండిని బాగా కలిపి ఇందులో కొద్దిగా నువ్వుల నూనెని పోసి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను మీ చర్మంపై రాసి 30 నిమిషాల తరువాత కొద్ది సేపు రుద్ది వెచ్చని నీటితో కడగండి. ఇలా వారానికి ఒక సారి చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

ఇప్పుడు మీ ఆంతరంగిక భాగాల నుండి అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని మీకు తెలుసు. మీరు ఎంచుకునే పద్ధతి మీ వ్యక్తిగత అవసరాలు మరియు ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. మీరు పూర్తి గోప్యత కోరుకుంటే, క్రీములు లేదా క్షవరం పద్దతులను అనుసరించటం ఉత్తమ ఎంపిక. మీ పద్ధతి మరింత ప్రభావితంగా ఉండాలని మీరు కోరుకుంటే, వాక్సింగ్ కోసం ఒక సెలూన్‌కు వెళ్ళవచ్చు. లేదా ఇంట్లో వాక్స్ తయారు చేసుకొని ఉపయోగించవచ్చు. చివరగా, మరింత శాశ్వత పరిష్కారం కోసం తక్కువ బాధాకరమైన లేజర్ చికిత్సను ఎంచుకోవచ్చు.

Posted on

Telugu tips to reduce breast size – స్త్రీల స్తనాలను శస్త్రచికిత్స(సర్జరీ) చేయకుండా తగ్గించడం ఎలా?

స్త్రీలలో వక్షోజాలు ఒక ముఖ్యమైన అవయవము. ఇవి చాలా పెద్దగా ఉంటే వికారంగా ఉంటుంది. అంతే కాదు వెన్నునొప్పి లాంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులకు కూడా దారితీస్తాయి. వక్షోజాలలో ఎక్కువ కొవ్వు ఉండటం వలన కుంగిపోతాయి.

స్తనాల కొవ్వు అంటే ఏంటి?

ఇది చర్మం క్రింద ఒక పొరలా ఏర్పడే ప్రత్యేక రకం చర్మాంతర్గత కొవ్వు. వీటిని తగ్గించేందుకు సరైన ఆహార పోషణతో పాటు కఠినమైన వ్యాయామం కూడా అవసరం. కొన్ని సార్లు శరీరంలోని హార్మోన్ల మార్పుల వలన కూడా కుచాలు పెద్దగా కావచ్చు. ఉదాహరణకు గర్భిణీ కావటం, పాలు ఇవ్వటం లేదా మందులు వాడటం లాంటివి. జీన్స్ మరియు స్థూలకాయం వీటికి ప్రధాన కారణాలు.

వీటిని తగ్గించేందుకు శస్త్రచికిత్స చేసినట్లయితే అనేక దుష్ప్రభావాలు పెరుగుతాయి.

సర్జరీ(శస్త్రచికిత్స) ద్వారా రొమ్ములను తగ్గించే విధానాన్ని చూదాం.

సర్జరీని చేసేటప్పుడు చర్మాన్ని తీసివేస్తారు. శరీరం పై రెండు మూడు చోట్లలో చర్మాన్ని కోసి చర్మం లోని కొవ్వును తొలగించి కుట్లు వేస్తారు. కొంత మందికి చర్మంలోనే కాకుండా వక్షాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది, అలాంటప్పుడు లిపోసక్షన్ని కూడా చేస్తారు.

ఫలితం

చాలా మందికి ఈ చికిత్స యొక్క ఫలితం అనుకూలంగా ఉండదు. 10 మందిలో 8 మంది స్త్రీలు చాలా నొప్పికి గురి అవుతారు. మిగిలిన వాళ్ళు 2-3 నెలల వరకు కొద్దిగా అసౌకర్యాన్ని ఎదుర్కుంటారు. కొంత మందికి చాలా వారాల వరకు గాయాలు అలాగే వాపు కూడా వస్తుంది. ఇవన్నీ గుణం అయ్యే వరకు శస్త్రచికిత్స బ్రాలనే వాడవలసి ఉంటుంది. ఇందువలన ప్రాకృతిక విధానాలను అనుసరించడం మంచిది.

రొమ్ము పరిమాణం తగ్గించడానికి సహజ మార్గాలు

BMI

మీరు ఎక్కువ బరువు ఉన్నట్లయితే వెంటనే బరువు తగ్గే క్రమాన్ని అనుసరించండి. అనారోగ్యకరమైన ఆహారాలను తిన వద్దు, ఉదాహరణకు ప్రాసెస్ చేసిన పదార్థాలు, నూనెలో వేంచిన ఆహారాలు మరియు తీపి పదార్థాలు. వీటికి బదులుగా పళ్ళు, కూరగాయలు , తృణధాన్యాలు, పింటో బీన్స్, తక్కువ కొవ్వు వున్న పాలు, లీన్ గొడ్డు మాంసం మరియు గింజలను మీ రోజు ఆహారాలలో చేర్చుకోండి.

కుచాల కొవ్వులను తగ్గించే మాత్రలు

కొవ్వును తగ్గించే మూలిక మాత్రలు ఒక సురక్షితమైన ఎంపిక. ఇది ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా రొమ్ములను తగ్గిస్తుంది.

బ్రెస్ట్ ప్రొడక్ట్స్ మరియు లోషన్స్

ఇది మరో ప్రసిద్ధ పద్ధతి. ఈ లోషన్స్ మరియు క్రీమ్స్ ని మీ వక్షోజాలపై రాసినట్లయితే మీరు అందమైన, పరిపూర్ణ పరిమాణం మరియు ఆకారం కలిగిన వృక్షోజాలను పొందవచ్చు.

బాగా కచ్చితమైన బ్రాలు

పెద్ద స్తనాలతో ఉన్న స్త్రీలు ప్రత్యేకమైన కనిష్టీకరణ బ్రాలు ధరించండి. ఇది రొమ్ములను రూపు మారకుండా ఉంచి చిన్నగా కనిపించేలా చేస్తుంది.

గృహ నివారణలు

చాలా సురక్షితమైన కొన్ని ఇంటి నివారణ పద్దతులు ఉన్నాయి. వీటిని పాటించటం వలన మీ కుచాలలోని కొవ్వును తగ్గించి చిన్నగా మరియు అందంగా చేయవచ్చు.

గ్రీన్ టీ

గ్రీన్ టీ తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మాములుగా మన బరువు తగ్గించేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అలాగే ఇది రొమ్ములలోని కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఇందులోని కాటెచిన్ శరీరంలోని కొవ్వును తగ్గించటానికి సహాయపడుతుంది. అంతే కాదు గ్రీన్ టీ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక చెంచా గ్రీన్ టీ ఆకులను వేడి నెలల్లో వేసి 4-5 నిమిషాలు నానపెట్టి ఆ నీటిని త్రాగండి. ఇలా రోజుకు 4-5 సార్లు త్రాగటం వలన మంచి ప్రభావం ఉంటుంది.

నిమ్మపండు, తేనె

ఇది బరువు తగ్గించేందుకు వాడే ప్రాచీన పద్దతి. బరువు మాత్రమే కాదు ఇది త్రాగటం వలన వక్షోజాల కొవ్వుకూడా తగ్గుతుంది. ఒక గ్లాసు వెచ్చని నీటిలో నిమ్మరసాన్ని, ఒక టీస్పూన్ తేనెని కలుపుకొని త్రాగండి. ఇది రోజూ నిద్రలేచిన వెంటనే వట్టి కడుపుతో తాగాలి. ఇది శరీరం లోని చెడు పదార్థాలను(టాక్సిన్స్) తొలగించి జీవక్రియను పెంచి బరువును తగ్గిస్తుంది.

కాఫీ స్క్రైబ్

కాఫీ లోని కెఫిన్ జీవక్రియను పెంచి కొవ్వును తగ్గించేందుకు తోడ్పడుతుంది.2 స్పూన్ల కాఫీ పొడిలో కొద్దిగా తేనెని కలుపుకొని మీ రొమ్ములపై రుద్దండి. ఇలా 10-15 నిమిషాలు రుద్ది కడగండి. ఇలా తరచూ చేయటంవలన కొవ్వు తగ్గుతుంది.

ఫిష్ ఆయిల్

ఫిష్ ఆయిల్ లో ఒమేగా -3 ఫాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా మంచిది మరియు ఈస్ట్రోజెన్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది. అంతే కాదు ఇది జీవక్రియను పెంచి కొవ్వును తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఫిష్ ఆయిల్, సాల్మన్ మరియు ట్యూనా లాంటి చేపలను మీ ఆహారంలో చేర్చుకోండి.

జితచెట్టు (ఆలివ్) నూనె

వృక్షోజాలు పెద్దగా కావటం వలన అవి కుంగిపోతాయి. మసాజ్ చేయటం వలన వీటిని సరైన రూపంలో ఉంచవచ్చు. మసాజ్ నూనెలు బజారులో లభిస్తాయి. వీటిని రాయటం వలన రక్త ప్రసరణను అధికరించి వీటి పరిమాణాలను తగ్గిస్తాయి. వెచ్చని జితచెట్టు నూనెతో రోజుకు రెండుసార్లు మసాజ్ చేయండి. రొమ్ములను తగ్గించే క్రీములను కూడా వాడవచ్చు కానీ ఈ క్రీములను వాడే ముందు వైద్యుడిని సంప్రదించటం మంచిది.

అల్లం

అల్లం మీ రొమ్ముల పరిమాణాన్ని తగ్గిస్తుందంటే నమ్మగలుగుతారు? అవును, ఇవి మీ రొమ్ములను తగ్గించటానికి ఉపయోగపడతాయి. అల్లం శరీరంలో జీవక్రియను పెంచడంవలన కొవ్వును తగ్గిస్తుంది. ఒక చెంచా తురిమిన అల్లంను నీటిలో వేసి 10 నిమిషాల పాటు ఉడికించండి. ఈ నీటిని వడకట్టి తేనెని కలుపుకొని త్రాగండి.

అవిసె గింజలు

అవిసె గింజలలో కూడా ఒమేగా -3 ఫాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ ను తగ్గించి జీవక్రియను పెంచడం ద్వారా శరీరం మరియు రొమ్ములలోని కొవ్వును తగ్గిస్తుంది. రోజూ ఒక చెంచా అవిసె గింజలను తినండి లేదా ఆహారంలో చేర్చుకోండి.

మంజిస్తా వేర్లు

ఇది మన దేశంలో చాలా సులభంగా లభిస్తుంది. ఇది రొమ్ములలో కొవ్వు పెరగటానికి కారణమయిన ఈస్ట్రోజెన్ ని తగ్గించటం వలన స్తనాలు చిన్నగా అవుతాయి. కొన్ని మంజిస్తా వేర్లను నీలల్లో నానపెట్టి తరువాత బాగా ఉడికించండి. ఈ నీటిలో తేనెని లేదా ఈ నీటిని టీ లో కలుపుకొని త్రాగండి.

వక్షోజాలను తగ్గించటానికి మంచి ఆహార పద్ధతులతో పాటు సరైన వ్యాయామం కూడా అవసరం. వక్షోజాలను తగ్గించే వ్యాయామాలు ఎన్నో ఉన్నాయి. ఈ నిత్యకృత్యాలను పాటిస్తే శారీరం యొక్క ఆకారాన్ని మారుస్తుంది. బోటింగ్, జాగింగ్, చురుకైన వాకింగ్ మరియు సైక్లింగ్ లాంటి కార్డియోవాస్క్యూలర్ నిత్యకృత్యాలను కూడా అనుసరించండి. స్తనాలను తగ్గించటానికి కొన్ని వ్యాయామాలను చూద్దాం.

ఏరోబిక్స్

పాటలు వింటూ చాలా ఉత్సాహంగా చేసే వ్యాయామాలను ఏరోబిక్స్ అని అంటారు. ఇది మీ హృదయానికి చాలా మంచిది. రోజుకు 20 నిమిషాలు ఏరోబిక్స్ చేయటంవలన సులభంగా మీ వక్షోజాలలోని కొవ్వును తగ్గించి వాటిని చిన్నగా చేయవచ్చు.

పుష్ అప్స్

పుష్ అప్స్ శరీర పైభాగంలోని కొవ్వును తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇది రొమ్ముల కొవ్వును కూడా తగ్గిస్తుంది. నేలపై బోర్ల పడుకొని మీ అర చేతులు భుజాలకు నేరుగా నెలపై ఉంచి మీ కాళ్లను విస్తరించండి. మొత్తం బరువు మీ చేతుల మీద పట్టి శరీరం యొక్క పై భాగాన్ని పైకి లేపండి. వీలైనంత పైకి లేపిన తరువాత మల్లి క్రిందకు దింపండి, ఇలా చేసేటప్పుడు మీ శరీరం నెలకు తగలకూడదు. మీ వెన్నెముకను వంచకుండా చేయండి. ఇలా ఆపకుండా 3 సార్లు చేయండి, క్రమంగా ఎక్కువ సార్లు చేయటానికి ప్రయత్నించండి.

డంబెల్స్

డంబెల్స్ ను ఉపయోగించి రొమ్ములపై ఒత్తిడిని పెంచటం కూడా ఒక ఉపయోగకరమైన వ్యాయామం. ఇది మీ శరీర పైభాగంలోని కొవ్వును తగ్గించేందుకు మరియు రొమ్ములను బిగువుగా చేసేందుకు తోడ్పడుతుంది. మీ భుజాలను నేలపై ఉంచి, శరీరం యొక్క క్రిందిభాగాన్ని మోకాళ్లను వంచి పైకి లేపండి. రెండు చేతులతో డంబెల్స్ ను పట్టుకొని చేతులను స్ట్రెచ్ చేయండి. ఇలా ప్రారంభంలో 5 సార్లు చేసి క్రమంగా ఎక్కువ సార్లు చేయటానికి ప్రయత్నించండి.

రెసిస్టన్స్ బ్యాండ్

ఈ బ్యాండ్‌ని ఉపయోగించి వ్యాయామం చేయటం వలన కూడా మీ రొమ్ముల కొవ్వును తగ్గించవచ్చు. ఈ బ్యాండ్ని ముందుకు లాగేటప్పుడు మీ చేతులు మాత్రమే ముందుకు వెళ్ళాలి, మీ శరీరం స్థిరంగా ఒక చోటులోనే ఉండాలి. క్రమంగా మీ బ్యాండ్ యొక్క రెసిస్టన్స్ ను పెంచండి. మీరు వివిధ రకాలుగా చేయాలనుకుంటే, ఒక చేతితో బ్యాండ్ ని లాగి రొమ్ము పై ఒత్తిడిని పెంచి ప్రయత్నించవచ్చు.

డిప్స్

స్థానాలలోని కొవ్వును తగ్గించటానికి ఇది ఒక సమర్థవంతమైన వ్యాయామం. డిప్ హాండెల్స్ ను పట్టుకొని మీ నడుం వరకు శరీరాన్ని పైకి ఎత్తండి. ఆ తరువాత మోకాళ్లను వంచి మీ శరీరాన్ని పైకి క్రిందకు పుష్ చేయండి. ఇలా ఆపకుండా 3 సార్లు చేయటం మొదలు పెట్టి క్రమంగా ఎక్కువ సార్లు చేయటానికి ప్రయత్నించండి.

తక్కువ ప్రభావాలు ఉండే హృదయ( కార్డియోవాస్క్యూలర్) వ్యాయామాలు

చాలా పెద్ద స్తనాలు ఉండే ఆడ వాళ్లకు జాగిం, పరిగెత్తడం లాంటి వ్యాయామాలను చేయటం కష్టంగా ఉంటుంది. వీరు సులభమైన వ్యాయామాలను అనుసరించటం ఉచితం. థ్రెడ్ మిల్స్, స్థిర బైకులు(స్టేషనరీ బైక్స్) లాంటి వాటితో వ్యాయామాలు చేయండి. ఇలాంటి వ్యాయామాలద్వారా మీరు ఫలితాన్ని పొందాలంటే ఎక్కువ సేపు మరియు తరచుగా మీరు శ్రమించాలి. క్రమంగా ఈ వ్యాయామాలను కొనసాగిస్తే శరీరంలోని కొవ్వును తగ్గించటం చాలా సులభం.

ఈత(స్విమ్మింగ్)

శరీరంలోని అన్ని నరాలనూ రూపొందించేందుకు స్విమ్మింగ్ ఒక సమర్థవంతమైన వ్యాయామం. రోజుకు ఒక గంటసేపు స్విమ్మింగ్ చేయటం రొమ్ము నరాలను తగ్గించేందుకు బాగా సహాయ పడుతుంది.

మీ వ్యాయామాలను ఇంకా ప్రభావితం చేయటానికి వివిధ రకాలను ప్రయత్నించండి. ఒకే రకమైన వ్యాయామం కాకుండా, వారంలో 3 రోజులు స్విమ్మింగ్, మిగిలిన 4 రోజులు బరువు తగ్గించే వ్యాయామాలు మరియు ఫ్రీ హ్యాండ్ వ్యాయామాలను చేయండి.

గమనిక: వ్యాయామం చేసేటప్పుడు మీకు సరిగ్గా సరిపడేటటువంటి బ్రాలను ధరించండి, లేకపోతే వెన్నెముక నొప్పి రావచ్చు లేదా రొమ్ములు కుంగిపోవచ్చు.

Posted on

Telugu breast enhancement tips – టీనేజ్ అమ్మాయిల రొమ్ముల పరిమాణం పెరగాలంటే?

టీనేజ్ అమ్మాయిలు తరుచుగా తమ రొమ్ములు చిన్నవిగా ఉన్నాయని వాపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో వారి రొమ్ములు ఇంకా పరిపక్వత దశలోనే ఉంటాయి. రొమ్ముల పరిమాణాన్ని పెంచుకోవడానికి బహుళమైన కాస్మోటిక్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి అందరికి సరిపడతాయని చెప్పలేము. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవానికి చెప్పాలంటే టీనేజ్ అమ్మాయిలు వారి ఆహారం మీద దృష్టి పెట్టి వారి శరీరం సహజ పరిపక్వత చెందేవరకు వేచి ఉండటమే ఉత్తమం అని చెప్పవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం రొమ్ముల పరిమాణం మరియు ఆకారం మహిలళలో వారి వయస్సు మరియు హార్మోనుల సమతుల్యత మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అందువల్ల మీరు టీనేజర్ అయితే మరియు మీ రొమ్ములు చిన్న పరిమాణంలో ఉంటే మీరు ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు.

బరువు

మీరు బరువు పెరుగుతున్నట్లయితే మీ రొమ్ములు కూడా పెరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మీ రొమ్ములు చాలా నెమ్మదిగా పెరుగుతున్నట్లయితే మీ డాక్టరుని సంప్రదించి హార్మోనుల స్థాయిలను తనిఖీ చేయించుకోండి. కొన్ని వ్యాయామాలు చేయడం వలన రొమ్ముల పరిమాణంలో వేగవంతమైన మార్పుని చూడవచ్చు. బరువు పెరగడానికి వేరుశనగలు, జున్ను, వెన్న, పెరుగు, అవకాడోలు మరికొన్ని ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలను తీసుకోండి. అంతే కాకుండా జిమ్ కు వెళ్ళడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అక్కడ మీ సూచనదారులు సరియైన వ్యాయామాలను సిఫార్సు చేసి మీకు సహాయం చేస్తారు.

రొమ్ముల పెరుగుదలకు ఛాతి మీద ఒత్తిడి

డంబుల్స్ ఉపయోగించి గానీ లేదా రెండు వైపులా ఏవైనా సమాన భారాలను ఉపయోగించి వాటిని ఎత్తడం ద్వారా ఛాతి మీద ఒత్తిడి కలిగించవచ్చు. ఒక చాప మీద నిటారుగా నిల్చుని మీ మోకాలిని వంచి రెండు వైపులా సమాన బరువు ఉండేలా చూసుకొని నెమ్మదిగా మీ భుజాల ఎత్తు వరకు ఎత్తండి. మళ్లీ యధాస్థానానికి నెమ్మదిగా దించండి. ఇలా ఒక రోజుకి 10 నుండి 15 సార్లు చేస్తూ ఉండడం వలన సులభంగా మార్పుని గమనించగలుగుతారు.

ఛాతి విసరడం

అధిక శ్రమ లేకుండా మీ ఇంటి వద్దనే సులభంగా ఛాతిని విసరడం వంటి వ్యాయామ ప్రక్రియను చేయవచ్చు. ఒక కుర్చీలో కూర్చొని రెండు సమాన భారాలను తీసుకొని మీ చేతులను ఆధారాలతో మీ భుజాల ఎత్తు వరకు నిటారుగా వచ్చినట్లు పైకి లేపండి. తరువాత నెమ్మదిగా ప్రారంభ స్థానానికి దించండి. కిందకి దించే సమయంలో మీ చేతులు దిగువ శరీరానికి ఎదురెదురుగా నిటారుగా ఉండేలా చూసుకోవడం గుర్తుంచుకోండి. ఈ వ్యాయామాన్ని రోజుకు 12 సార్లు మూడు సెట్స్ చొప్పున చేస్తూ ఉండండి. రాత్రి సమయాల్లో బ్రాలను ధరించకండి.

పుష్ అప్ చేయండి

ప్రతిరోజు ఈ వ్యాయామం చేయడం ద్వారా మీకు పుషప్ బ్రా అవసరం ఉండదు. పుష్ అప్స్ రొమ్ములు విస్తరించడానికి మరియు వాటి పరిమాణాన్ని పెంచుకోవడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా మంచి శారీరక ఆకృతిని మరియు శక్తిని కూడా పొందవచ్చు.

ఎసెన్షియల్ ఆయిల్స్ తో రొమ్ములకు మర్దన

రోజువారీగా ఒక పద్ధతి ప్రకారం ఎసెన్షియల్ ఆయిల్స్ తో రొమ్ములను మర్ధనా చేయడం ద్వారా వాటి పరిమాణాన్ని పెంచుకోవడం మరియు వాటిని విస్తరింపజేయవచ్చని శాస్త్రీయంగా రుజువైంది. ఇలా చేయడం వలన రొమ్ముల్లోని రక్త ప్రసరణ అభివృద్ధి చెంది కణజాలం ఉత్పత్తి జరుగుతుంది.ఇందు కొరకు ఆలివ్ ఆయిల్, ఆవనూనె, గెరానియన్ ఆయిల్ మొదలైనవి ఈ మర్దనాలకు సమర్థవంతమైనవి అని చెప్పబడ్డాయి.

వక్షోజాల పరిమాణం పెరుగుదలకు తీసుకోవలసిన ఆహారాలు

కాయధాన్యాలు

రొమ్ముల పరిమాణం సహజ మార్గంలో పెంచుకోవడానికి ప్రోటీన్లను కలిగి ఉన్న ఆహార పదార్థాలు ముఖ్యంగా పరిగణించాల్సినవిగా చెప్పబడ్డాయి. మీ ఆహార పదార్ధాలలో కాయధాన్యాలను తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. మీరు పప్పులను కాయధాన్యాలు తోపాటుగా ఉడికించి తీసుకోవచ్చు. ఇలా ప్రతిరోజూ తీసుకోవడం వలన మీరు సహజ మార్గంలో సులభంగా రొమ్ములను పెంచుకోవచ్చు.

టోఫు

రొమ్ము కండరాలను పంపు చేయడానికి ఇది ఒక అద్భుతమైన ఆహార పదార్థంగా చెప్పబడింది. మీరు ఒక వేళ మీ ఆహార పదార్థాలలో ప్రోటీన్లను తీసుకోలేక పోతున్నట్లు అయితే మీరు టోఫు ని ట్రై చేసి మీ రొమ్ము కండరాలపై శ్రద్ధ ఉంచండి. మీరు మంచి ఆకారం గల రొమ్ములను మంచి పరిమాణంతో పొందుతారు.

రొమ్ములు పెరుగుదలకు విడిచిపెట్టాల్సిన ఆహారాలు

రొమ్ము కణాలను అభివృద్ధి చేయడానికి ఎలాగైతే కొన్ని ఆహార పదార్ధాలు నిర్దేశించబడ్డాయో అలాగే కొన్ని ఆహార పదార్ధాలు రొమ్ముల పెరుగుదలను అడ్డుకునేందుకు ప్రేరేపిస్తాయి. కాబట్టి, మీరు ఒకవేళ టీనేజ్ అమ్మాయి అయితే మరియు మీరు సంపూర్ణ పరిమాణానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు అయితే మీరు కింది పేర్కొన్న కొన్ని ఆహార పదార్ధాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

చక్కెర మరియు కార్బోహైడ్రేటులు

చక్కెర మరియు కార్బోహైడ్రేట్లు మన రోజువారీ ఆహారంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. వాస్తవానికి ప్రతి రుచికరమైన వంటకంలో చక్కెరలు ఎంతో కొంత ఉంటాయి. ఒక సరియైన ఆహారంలో కార్బోహైడ్రేట్లతో పాటుగా కావాల్సిన పరిమాణంలో మాత్రమే చెక్కెర ఉండటం మంచిది. అదనపు కార్బోహైడ్రేట్లు మరియు చక్కెరలు తీసుకోవడం వలన తీవ్రంగా రొమ్ము పరిమాణాన్ని పెరగకుండా అడ్డగిస్తుంది. ఈ ఆహార పదార్థాలు శరీరంలోని టెస్టోస్టిరాన్ హార్మోనులను ప్రేరేపించి వాటి ఉత్పత్తిని పెంచడం వలన ఈస్ట్రోజన్ హార్మోన్ బ్లాకులు ఏర్పడతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ స్త్రీలలో రొమ్ము పరిమాణం పెంచడానికి బాధ్యత కలిగిన ఒక హార్మోన్.

కెఫిన్

మనమంతా క్రమం తప్పకుండా కాఫీల రూపంలో విరివిగా కెఫిన్ ను తీసుకుంటూ ఉంటాం. మీరు మీ వక్షోజాల పరిమాణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్లయితే, కెఫిన్ తీసుకునే ముందు కాస్త ఆలోచించండి. మీ శరీరంలోని పోషకాలను పీల్చుకోవడం వలన రొమ్ముల పెరుగుదలకు అంతరాయం కలుగుతుంది. అంతేకాకుండా ఈస్ట్రోజెన్ హార్మోన్ యొక్క ఉత్పత్తికి కూడా అడ్డుకట్ట వేస్తుంది. కాబట్టి, కెఫిన్ వినియోగం రొమ్ము పరిమాణం పెంచుకోవాలనుకునే వారికి అంత యోగ్యకరమైనది కాదు.

కృత్రిమ సంరక్షిత మాంసపు ఉత్పత్తులు

ప్రస్తుతం అధిక మంది ప్రజలు త్వరిత మార్గములో మాంసపు ఉత్పత్తులను పెంచుకోవడానికి వాటి మీద హార్మోనులను ప్రయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా బాయిలర్ కోళ్ళు మరియు ఇతర కుత్రిమ సంరక్షిత మాంసపు ఆహార ఉత్పత్తులు మీద వివిధ రకాలైన హార్మోన్ ఇంజెక్షన్లను ప్రయోగించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. అటువంటి మాంసపు ఆహార పదార్ధాలను తీసుకోవడం వలన ఆ హార్మోనులు నేరుగా శరీరంలోకి ప్రవేశించి హార్మోనుల అసమతుల్యతను కలిగిస్తాయి.

టీనేజ్ అమ్మాయిలలో వారి శరీరం పరిపక్వత దశలో ఉండటం వలన హార్మోనుల సమతుల్యత అనేది వారి రొమ్ముల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి హార్మోనుల సమతుల్యతకు భంగం కలిగించేటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం వలన రొమ్ముల పెరుగుదలలో కనిపించే ప్రతికూలతలను చాలా వరకు దూరం చేయవచ్చు.

బొప్పాయి రసం మరియు పాలు

వివిధ పరిశోధనలను అనుసరించి బొప్పాయి రసం మరియు పాలు మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వలన రొమ్ములు పరిమాణం పెంచుకోవడంలో అద్భుతంగా సహాయం చేస్తాయి. బొప్పాయి మరియు పాలు వక్షోజాల పరిమాణాన్ని అభివృద్ధి చేసే విటమిన్లు మరియు ఖనిజాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. మీకు బొప్పాయి రసం తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే బొప్పాయిని అయినా తినవచ్చు. బొప్పాయి మరియు పాలు లాగానే బనానా మిల్క్ షేక్ కూడా మీ రొమ్ము పరిమాణం పెంచుకోవడానికి బాగా సహకరిస్తుంది.

గర్భనిరోధక మాత్రలు

నిజం చెప్పాలంటే, ఇది మీ స్తన పరిమాణం పెంచుకోవడానికి అంత సురక్షితమైన పద్ధతి కాదు. క్రమం తప్పకుండా గర్భనిరోధక మాత్రలు వినియోగం ఎన్నో ప్రతికూల ప్రభావాలను కలిగించవచ్చు. అయితే, ఎవరైతే తప్పనిసరి పరిస్థితులలో వక్షోజాల పరిమాణాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అందుచేత ఇది దాటవేయలేదు.

చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి

ఇది మీరు నమ్మినా నమ్మక పోయినా సరే, చెడు అలవాట్లు కూడా మీ రొమ్ముల పరిమాణానికి అవరోధాలను ఏర్పరుస్తాయి. ఉదాహరణకు పొగ త్రాగడం వలన రొమ్ములు పెరుగుదల నిలిపివేయబడుతుంది. అలాగే మద్యపానం అలవాటు ఉన్నట్లయితే రొమ్ములు వదులుగా మారి సాగుతాయి. అది ఒక్కోసారి రొమ్ము క్యాన్సర్లకు కూడా దారితీస్తుంది. అదే కాకుండా ఎక్కువగా కాఫీ తాగే అలవాటు, మరీ ఎక్కువ పని ఒత్తిడి తీసుకోవడం, ఎక్కువగా పనిచేయడం మరియు గురకపెట్టి నిద్రపోవడం వంటి అలవాట్లు కూడా రొమ్ము పరిమాణం కుంచుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఇటువంటి అలవాట్లు ఉన్నట్లయితే, వెంటనే వీటికి దూరంగా ఉండండి.

రొమ్ములు పరిమాణం పెంచుకోవడానికి చిట్కాలు

 • తరచుగా రొమ్ములను మర్దన చేయండి. ఇది మీ రొమ్ముల పరిమాణం పెరగడానికి మరియు ఆకర్షణీయమైన రూపాన్ని పొందడానికి సహాయం చేస్తుంది
 • టి, కాఫీ, ఆల్కహాల్ వంటి సాఫ్ట్ డ్రింక్స్ వినియోగానికి దూరంగా ఉండండి.
 • జంక్ ఫుడ్ లను తినవద్దు. ఇది రొమ్ముల పెరుగుదలకు అంతరాయం కలిగిస్తుంది.
 • మంచి నీటిని పుష్కలంగా తాగండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
Posted on

Breast enhancement tips in Telugu – వక్షోజాల పరిమాణం పెరగాలంటే..

మీ స్నేహితుల నడుమ మీ రొమ్ముల పరిమాణం చిన్నదిగా ఉన్నందుకు దిగులు పడుతున్నారా? మీరు మీ శరీర ఆకృతిలో స్త్రీత్వం లోపంచినట్లుగా భావించి కాస్మోటిక్ రొమ్ము విస్తరణ ప్రక్రియలను ఎంచుకోవలసి వస్తుందని భయపడుతూ ఉన్నారా? పైన పేర్కొన్న ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే ఆహారం మరియు వ్యాయామాలతో సులభంగా మీ రొమ్ముల పరిమాణాన్ని పెంచుకునే మార్గాలకోసం మీరు ఈ శీర్షికని చదవండి.

సంపూర్ణమైన రొమ్ములు మీ పూర్తి రూపానికి నిండుతనంతో పాటుగా మానసిక స్థైర్యాన్ని మరియు వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తాయి. చిన్న రొమ్ములు కలిగిన స్త్రీలు తమ మీద తమకి విశ్వాస లోపంతో వారి వారి నైపుణ్య రంగాలలో వెనుకబడుతూ ఉంటారు.

మీరు ధృడంగా మీ రొమ్ముల పరిమాణాన్ని పెంచుకోవాలని కాంక్షిస్తున్నవారు అయితే రొమ్ముల పరిమాణాన్ని పెంచుకునే మాత్రలు వంటివి ఖచ్చితంగా మీకు దుష్పభావాలని కలిగించే అవకాశం ఉంది. అంతే కాకుండా నేడు ఎన్నో రకాల రొమ్ము విస్తరణ క్రీములు మార్కెట్ లో లభిస్తున్నాయి. వాటితో రొమ్ములను మసాజ్ చేయడం వలన రొమ్ములు సంపూర్ణంగా విస్తరించి బిగుతుగా ఉండవచ్చు. కానీ అటువంటి ఉత్పత్తులలో వాస్తవంగా మీకు పని చేసేది ఎదో చెప్పడం కష్టం. సహజ పద్దతిలో రొమ్ముల పరిమాణం పెంచుకునే మార్గం ఉత్తమమైనదని చెప్పవచ్చు. సరైన వ్యాయామంతో పాటు మంచి ఆహారం తీసుకోవడం వలన మరింత పుష్కలమైన రూపాన్ని పొందవచ్చు. అయితే దీని ప్రభావం వ్యక్తికీ వ్యక్తికీ మద్య వేరుగా ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తిగా సహజ పద్దతిలో ఎటువంటి దుష్పభావాలు లేకుండా మీ జీవన విధానాలలో చిన్న చిన్న ఆరోగ్య కరమైన మార్పులతో సులభంగా మీరు కోరుకున్న ఫలితాలను పొందగలగ వచ్చు. కాబట్టి అమ్మాయిలూ, పూర్తిగా చదివి మీరు కోరుకున్న ఫలితాలని త్వరలోనే పొందుతారని ఆశిస్తున్నాం.

సహజమైన రొమ్ము విస్తరణ కోసం ఆహారాలు

సంపూర్ణ వక్షోజాల కోసం ఆహారం

ప్రధాన కారణంగా స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోను లోపించడం వలన తరుచుగా రొమ్ములలో పెరుగుదల లోపిస్తూ ఉంటుంది. ఈస్ట్రోజెన్ అనేది స్త్రీ హార్మోను, అది స్త్రీలలో ఋతు క్రమాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి మీరు చిన్న రొమ్ములను కలిగి ఉన్నట్లయితే మీ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి తక్కువగా ఉన్నట్లు. దీనికోసం మీరు ఈస్ట్రోజెన్ స్థాయిని ప్రేరేపించే కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా అవి సహజంగా మీ శరీరంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా మీ రొమ్ములు అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి. ఇక్కడ సంపూర్ణ రొమ్ములను ప్రోత్సహించే కొన్ని ఆహార పదార్ధాల జాబితా ఇవ్వబడింది.

పాల ఉత్పత్తులు

మీరు మీ రొమ్ముల పరిమాణం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీ రోజూ వారి ఆహారంలో మరిన్ని పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవడం వలన ఎంతో మెరుగైన ఫలితాలని పొందుతారు.

సోయా ఉత్పత్తులు

అమ్మాయిలు తమ రొమ్ములను పెంచుకోవడానికి మంచి ఆహార పదార్ధాల కోసం చూస్తున్నట్లయితే సోయా ఉత్పత్తుల మీద సులభంగా ఆధారపడవచ్చు. సోయా ఉత్పత్తులు అధిక మొత్తంలో ప్రోటీన్లను కలిగి ఉండటమే కాకుండా అందులో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు శరీరాన్ని సాధారణ హార్మోనుల సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడతాయి.

పెద్ద రొమ్ముల కోసం సముద్రపు ఆహారాలు

సముద్రపు ఆహారాలలో ఉండే అధికమైన పోషకాలు మీ స్తనాల పరిమాణం మరింత పెంచడంలో సహాయపడతాయి. రొయ్యలు, సముద్రపు చేపలు, సముద్ర కలుపు మొక్కలు, ఆలుచిప్పలు మొదలైనవన్నీ అధిక కేలరీల ప్రోటీన్లను సమృద్దిగా కలిగి ఉండి సహజమైన గొప్ప మాంగనీసు వనురులగా ఉంటున్నాయి. మాంగనీసు శరీరంలో హార్మోనులను సమతుల్యం చేయడంలో కీలకపాత్ర పోషించే ఒక ముఖ్య ఖనిజము. మీ ఆహారంలో మరిన్ని సముద్రపు ఆహారపదార్ధాలు జతచేస్తే అది స్త్రీ లలో రొమ్ముల పెరుగుదలకు కీలకమైన మరింత ఈస్ట్రోజెన్ హార్మోను ఉత్పత్తికి ఎంతగానో సహాయపడుతుంది.

ఆకు కూరలు

ఆకుకూరలు మీ శరీరానికి ఎంతో ఆరోగ్య వంతమైనవి. పాలకూర, ఆల్ఫల్పా వంటివి అనామ్లజనకాలు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి మరియు శరీరంలో సాధారణ హార్మోన్ల సంతులనాన్ని ప్రోత్సహిస్తాయి. అందువలన మరిన్ని ఆకు కూరలను మీ ఆహారంలో భాగం చేయడం వలన క్రమంగా మీ పూర్తి ఆరోగ్యం అనుకూలంగా మారుతుంది. తద్వారా మీ రొమ్ములు కూడా పుష్టిగా ఉంటాయి.

భారీ వక్షోజాల కోసం విత్తనాలు

అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, సోంపు గింజలు మరియు గుమ్మడికాయ విత్తనాలు మొదలైన అన్నిరకాల విత్తనాలు రొమ్ము కణాల పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి. గింజలు శరీరంలోని ఈస్ట్రోజెన్ యొక్క సహజమైన ఉత్పత్తిని పెంచే ఫైటోఈస్ట్రోజెన్ ను కలిగి ఉంటాయి. మీ రోజువారి ఆహారంలో వివిధ రకాలైన విత్తనాలను చేర్చడం వలన మీరు భారీ స్తనాలను పొందడమే కాకుండా ఆరోగ్యకరమైన శరీరాన్ని కూడా పొందుతారు.

పెద్ద స్తన పరిమాణం కొరకు మెంతులు

మెంతులులలో ఉన్న అధిక ఫైటోఈస్ట్రోజెన్ మూలకాలు శరీరంలో లోపించిన ఈస్ట్రోజెన్ హార్మోనును నింపడానికి సహాయం చేస్తాయి. మెంతులు రొమ్ములలోని క్షీర గ్రంధులను అభివృద్ధి చేయడంలో అత్యధికంగా సహాయపడతాయి.

సహజమైన రొమ్ము విస్తరణ కొరకు గింజలు

బాదం, జీడి పప్పు, పిస్తా మరియు అక్రోటులు మీ రొమ్ము కణాలను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులను మరియు ప్రోటీన్లను అందించడంలో గొప్ప వనరులుగా చెప్పవచ్చు. అవి మీ రొమ్ము పరిమాణాన్ని సహజంగా పెంచడంలో సహకరిస్తాయి.

పెద్ద రొమ్ములు పొందడానికి పండ్లు

స్ట్రా బెర్రీ, పుచ్చకాయ, మేడి పండ్లు మొదలైన పండ్లు ఫైటోఈస్ట్రోజెన్ లతో పూరించబడి ఉంటాయి. అవి రొమ్ము కణాల అభివృద్దికి మీకు సహకరిస్తాయి. ఆపిళ్ళు, చెర్రీ పండ్లు మరియు రేగి పండ్లలో ఉండే ఈస్ట్రోజెన్ సహజంగా మీ రొమ్ము పరిమాణాన్ని విస్తరింపజేయడానికి ప్రోత్సహిస్తాయి. అందువల్ల మరిన్ని ఎక్కువ పండ్లను తీసుకోవడం ద్వార క్రమంగా మీరు కోరుకున్న లక్ష్యానికి చేరగలుగుతారు.

వక్షోజాల సహజ పెరుగుదలకు వ్యాయామాలు

పైన పేర్కొన్న ఆహారాలతో పాటుగా కొన్ని నిర్దిష్ట వ్యాయామాలను మిళితం చేసినపుడు ఫలితాలు మరింత ఉన్నతంగా ఉంటాయి. అటువంటి కొన్ని అద్భుతమైన వ్యాయామాలను సులభంగా మీ స్తన సంపదను అభివృద్ధి చేసుకోవడానికి మీకు ఇక్కడ అందించడం జరిగింది. ఈ వ్యాయామాలు మీ ఛాతి కండరాలతో పాటు ప్రస్తుతం మీ రొమ్ములలో ఉన్న కొవ్వు కణజాలాలను దృడంగా నిర్మించి రొమ్ములను పుష్టిగా మరియు నిండుగా కనిపించేలా చేస్తాయి.

పుష్ అప్స్

Push ups

ఏ ఉపకరణాల సహాయం లేకుండా మీరు మీ ఇంటిలోనే చేయగల సాధారణ, సాంప్రదాయ పుష్ అప్లు మీ వక్షోజాల యొక్క పరిమాణం మరియు ఆకారానికి అద్భుతాలు జోడించగలవని మీకు తెలియకపోవచ్చు. మీ అర చేతులను భుజములకు సమంగా నేలకు ఆన్చండి. మీ బరువుని మీ చేతులు మరియు కాలి వేళ్ళ మీదగా కింది చిత్రంలో వలె ఉంచండి. ఇప్పుడు మీ మోచేతులని వంచుతూ మీ శరీరాన్ని నేల వైపుకు వంచండి. నేలను తాకకుండా వీలైనంత దగ్గరకు వెళ్ళండి. తర్వాత మళ్ళీ చేతులను నిటారుగా వచ్చేలాగ పైకి లేవండి. మీరు 3 సెట్ లతో ప్రారంభించి తర్వాత మీరు వెళ్ళగలిగే వరకు పెంచండి.

పైకెత్తబడిన పుష్ అప్స్

Elevated push ups

ఛాతి కండరాలకు ఒత్తిడి కలిగించడం ద్వార త్వరితంగా పెద్ద స్తనాలను మీరు పొందగలుగుతారు. ఈ వ్యాయామానికి మీరు తక్కువ ఎత్తుగల టేబుల్ లేదా ఒక కుర్చీ సహాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మీ అర చేతులని మీ భుజాలకు సమానంగా నేలకు ఆన్చండి. తరువాత మీ పాదాలను ఎత్తుకొరకు అమర్చిన కుర్చీ లేదా టేబుల్ మీదకు సమతలంగా ఉంచండి. ఇప్పుడు మీ ఎగువ శరీరాన్ని మీ మోచేతులని వంచడం ద్వార నేల వైపుకు వాలండి. కొన్ని నిముషాలపాటు ఆ సస్థితిలో నిలిచి ఉండి మరల ప్రారంభ స్థితికి రండి. ఇలా 3 సెట్స్ తో వ్యాయామాన్ని ప్రారంబించండి.

గోడకు పుష్ అప్స్

Wall push ups

గోడకు పుష్ అప్స్ చేయడం ప్రారంభీకులకి చాల సులభమైన వ్యాయామం. ఇది మీరు శారీరకంగా ధృడంగా లేకపోయినప్పటికీ సులభంగా చేయగలిగే వ్యాయామం. దీనికోసం గోడకు ఎదురుగా అర చేతుల దూరంలో నిటారుగా నిలబడండి. ఇప్పుడు మీ అర చేతులను భుజాలకి సమానంగా గోడపై ఆన్చండి. తర్వాత మీ మోచేతులను వంచుతూ మీ పాదాలు స్థిరంగా ఉంచి మీ శరీర బరువు మీ చేతుల మీద ఉండేలా గోడవైపుకి వాలండి.కొన్ని నిముషాలపాటు ఆ స్థితిలో నిలిచి ఉండి ప్రారంభ స్థితికి వచ్చేయండి. ఇలా 5 సెట్స్ తో ప్రారంభించండి