Posted on

పొత్తికడుపుపై వెంట్రుకలు పోవాలంటే చిట్కాలు – Telugu tips to remove abdominal hair

పొత్తి కడుపుపై వెంట్రుకలు ఆడవారికీ, మగవారికీ సాధారణమైన సమస్య. మగవారిలో ఈ వృధ్ధి ఎక్కువ శాతంలో ఉంటుంది. అయితే ఈ సమస్యని మగవారు అంతగా పట్టించుకోరు. కానీ ఆడవారులోనూ ఈ పెరుగుదల ఎక్కువగనే ఉన్నా, ఆడవారు మాత్రం దీని నుంచీ బయటపడాలనుకుంటారు. కానీ కొందరు ఆడవారు మగవారిలా వీటిని తీసెయ్యకుండా అలాగే వదిలేస్తారు. దీనినే హిర్స్యుటిస్మ్ అని అంటారు. ఆడవారిలో పొత్తికడుపై ఈ వెంట్రుకలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రత్యేకంగా వారు స్విం సూట్స్, బికినీలు వేసుకోవాలంటే అప్పుడు పొత్తికడుపు కనపడుతుంది కాబట్టి అప్పుడు ఈ వెంట్రుకలు కనిపించే అవకాశం ఉంది.
ఇది సాధారణమైనది కాదు., అయితే ఈ సమస్యను పూర్థిగా నివారించటానికి కొన్ని శాశ్వతమైన మార్గాలు, లేదా వీటి వృధ్ధి ఎక్కువ జరగకుండా కొన్ని మార్గాలు సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా ఉన్నాయి. ఈ సమస్య కొన్ని తాత్కాలికమైన మార్గాల ద్వారా తీరవచ్చు. షేవింగ్, వాక్సింగ్ మరియు బ్లీచింగ్. ఈ మార్గాలు చర్మానికి హాని కలిగిస్తాయి. కొన్ని సహజసిధ్ధ మార్గాల ద్వారా వీటిని తొలగించటం వల్ల మీ చర్మానికి హాని కలగకుండా ఉండటమే కాక ఆడవారి నడుము పాడవకుండా ఉంటుంది.
ఈ ఫాస్ట్ లైఫ్లో లేసర్ థెరపీ మరియు ఎలెక్ట్రోలసిస్ ఉన్నాయి. అయితే ఈ రెండు చాలా ఎక్కువ ఖర్చుతో కూడి ఉన్నవి. అంతేకాక చాలా సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వస్తాయి.
ఈ పొత్తికడుపు పై వెంట్రుకలు అటు ఆడవారికీ, మగవారికీ ఇద్దరికీ పెద్ద చిక్కు వీడని సమస్య. అయితే మగవారు సున్నితంగా ఈ సమస్య నుంచీ తొలగిపోతే ఆడవారు మాత్రం చాలా ఇబ్బందిగానూ, ఎంతో న్యూన్యతా భావంతోనూ కుమిలిపోతుంటారు. మంచి ఆకర్షణీయమైన చీర తొడిగినప్పుడు ఈ వెంట్రుకలు కనపడుతుంటే ఎంతో అవమానకరంగా ఫీల్ అవుతారు. ఈ సమస్య రోజువారీ జీవితంలో సహజం. అయితే రోజూ బ్యూటీ పార్లర్ కి లేదా స్పాకి వెళ్ళాలంటే అది రోజూ సాధ్యం కాని పని. కాబట్టి సహజసిధ్ధమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవటం ఉత్తమం. మరి ఖర్చుతో కూడిన చికిత్సలు చర్మానికే కాదు శరీరం పై కూడా ప్రభావం చూపుతాయి. ఇక్కడ కొన్ని చర్మ సంబంధితమైన టిప్స్ ని మీకందిస్తున్నాం ప్రత్యేకంగా తెలుగు టిప్స్ ద్వారా మీకోసం

క్షవరం చేసుకోవటం

చాలావరకూ పొత్తికడుపు భాగంలో వెంట్రుకలు చాలా దలసరిగా ఉంటాయి. వీటిని తీయటం చాలా కష్టమే. కాబట్టి వీటిని షేవెర్ తో తొలగించటం మేలు. ఇలా చేయటం వల్ల వెంట్రుకలు చాలా గట్టిగా అవుతాయని కొందరు అంటారు. ఇలాగే చేస్తు ఉంటే చివరికి చర్మం కూడా చాలా గట్టి పడిపోతుందని చెబుతారు. కానీ ఇదే రోజూ చెయాల్సిన పరిస్తితి వస్తే అది మాత్రం చాలా ఇబ్బందికర విషయమే. కానీ ఇలా రోజూ చెయాల్సిన పరిస్తితి వస్తే అది మాత్రం చాలా ఇబ్బందికర విషయమే. కానీ మీ చర్మం షేవ్ చేసుకున్న తర్వాత ఆ ప్రదేశంలో కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం మెత్తగా ఉండటమే కాకుండా మరలా వెంట్రుకలు పెరిగేందుకు సమయం పడుతుంది.

బ్లీచింగ్

కొందరు స్త్రీలలో పొత్తికడుపు కింద అంతగా వెంట్రుకలు ఉండవు. వీళ్ళు ఒకరకంగా అదృష్టవంతులనే చెప్పవచ్చు. అలాంటి తక్కువ వెంట్రుకలు ఉండే స్త్రిలు బ్లీచ్ వాడి తొలగించుకోవచ్చు. మీరు మంచి సున్నితమైన బ్లీచ్ లు వాడటం ఎంతో మంచిది.

వెంట్రుకలు వదిలించే క్రీముల్ని వాడండి

మీ చర్మాన్నే కాకుండా మీ సమయాన్ని అలాగే మీకు ఇబ్బందిని కలిగించని వాటిల్ని వాడండి. మీరు మీ వెంట్రుకల్ని తొలగించుకునేందుకు మార్కెట్లో చాల రకాలైన క్రీములు ఉన్నాయి. గతంలో అంటే 10 సంవత్సరాల క్రితం ఈ క్రీములు కాస్త హానిని కలిగించేవి. అయితే ప్రస్తుతం ఉన్న క్రీములు అంతగా హాని కలిగించేవి కాదు. వీటిని వాడటం మంచిదే. కాకపోతే మీరె మీ చర్మానికి ఎలర్జీ రాకుండా అంటే మీ చర్మానికి పడే క్రీముని మీరే ఎంచుకోవాలి.

వ్యాక్స్

మీకు అవసరమైన ప్రతిసారీ మీరు వ్యాక్స్ కోసం పార్లర్ కి వెళ్ళల్సిన అవసరం లేదు. మీకు ప్రస్తుతం మార్కెట్లో వ్యాక్స్ న్యారో పీసులు బయట దొరుకుతున్నాయి. కాబట్టి మీరు వాటిని వాడవచ్చు. వాటిని సున్నితంగా చింపండి తర్వాత వాటిని వేడి చేయండి. తర్వాత . ఈ విధానం మీ పొత్తికడుపు ప్రాంతానికైతే అది సున్నితంగా ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. కానీ చేతులకు, కాళ్ళకూ చేసుకోరాదు.

ట్వీజింగ్

దీనినే తెలుగులో చిమటా అని అంటారు. కొన్ని చోట్ల అంటే శరీరంలో కొన్ని భాగాలో మిగతా భాగాల కంటే తక్కువగా వెంట్రుకలు పెరుగుతాయి. అటువంటి చోట సున్నితంగా చిమటా వేసుకుంటే చాలు. దీనివల్ల తక్కువగా ఉన్న చోట చిమటా వేసుకుంటే చాలు. ఇందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ అందం కోసం దీనిని వాడవచ్చు.

సహజసిధ్ధమైన మార్గాలు

మీకు రసాయన క్రీముల్ని వాడటం ఇష్టం లేకపోతే మీరు కొన్ని సహజసిధ్ధమైన మార్గాల్ని మీ కిచెన్ లొని పదార్ధ్ధల్నే వాడవచ్చు.
కొంచేం పసుపు తీసుకుని దానికి కొంచెం శనగపిండిని కేవలం ఒక టేబుల్ స్పూన్స్ మాత్రమే రెండిటినీ వేసి కలుపుకోవాలి. మీరు ఈ మిశ్రమాన్ని పాలతోను లేక నీటితోను కలుపుకోవచ్చు.. తర్వాత మీ పొత్తికడుపు పై ఉన్న వెంట్రుకలకు రాసి తర్వాత అవి పోయేలా తీసేయ్యాలి. ఈ సహజసిధ్ధమైన టిప్స్ మీకు ఇబ్బంది లేకుండా తొలగిస్తాయి.
శనగపిండిని, పసుపును మిక్స్ చేసుకోండి. తర్వాత దీనికి పాలు లేదా నీటిని కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి,శరీరానికీ రాసుకోండి. తర్వాత అది ఆరిపోయిన తర్వాత రబ్ చేయండి మీ ముఖం పై, మీ శరీరం పై ఉన్న వెంట్రుకలు తొలగుతాయి.
అగ్ని శిల ను రోజూ స్ననానికి ముందు రాసుకోండి. అది ఒక స్క్రబ్ లా పని చేసి మీ శరీరంపై ఉన్న అవాంచిత రోమాల్ని తొలగిస్తుంది.
రోజూ మంచి ఆహారాన్ని తీసుకోండి. మీ శరీర బరువు తక్కువగా ఉన్న లేక కొవ్వు ఎక్కువగా ఉన్నా మీ శరీరం పై అవాంచిత రోమాలు వస్తాయి. కాబట్టి సమతుల ఆహారాన్ని తీసుకోండి. పాలు, కూరగాయలు, ఆరోగ్యకరమైన ఫ్యాటీ ఆహారపదార్ధ్ధాలు కూడా తినటం మంచిది.

అవాంచిత రోమాలు తొలగించుకునేందుకు గృహ చిట్కాలు

బొప్పాయి

బొప్పాయి అవాంచిత రోమాల పెరుగుదలను నివారించటమే కాక వీటిని తొలగిస్తుంది. బొప్పాయిను ఉపయోగించి శాశ్వతంగా అవాంచిత రోమాల్ని తొలగించుకోవచ్చు.
బొప్పయిను పేస్ట్ చేసుకుని దానికి శనగపిండి, పసుపు, అలొవేరా జెల్ కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీనిని రాసుకుని 20 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.
బొప్పయి పేస్ట్గా చేసుకుని దానికి శనగపిండి, పసుపు, అలోవేరా జెల్, ఆవాల నూనె పేస్ట్ చేసుకుని రాసుకుని 20 నిముషాల పాటు ఉంచుకుని వాష్ చేసుకోవాలి.

పసుపు

అవాంచిత రోమాలను ఇది ఒక తేలికైన మార్గం. పసుపు తీసుకుని దానిలో పాలు కలుపుకోవాలి. తర్వాత దీనిని పొత్తికడుపు పై రాసుకోవాలి. కాసేపు ఆరిపోయేంత వరకు ఉంచుకుని తర్వాత వేడినీటితో కడుగుకోవాలి. ఒకవేళ వెంట్రుకలు ఎక్కువగా ఉంటే దీనికి శనగపిండిని కలుపుకోవాలి.

సుగర్-నిమ్మ మిశ్రమం

పంచదార, నిమ్మ కలుపుకుని రాసుకుంటే చక్కగా పనిచేస్తాయి. నిమ్మ ఒక బ్లీచ్ గా పని చేస్తుంది. పంచదార, నిమ్మ రసం, వాటర్ ను కలిపి పొత్తికడుపు పై రాసుకోవాలి. ఇందులో గమనించాల్సిన విషయమేమంటే వెంట్రుకలు పెరిగే దిశకు రాసుకోవాలి. 15 నిముషాలపాటు ఉంచుకుని తర్వాత శుభ్రం చేసుకోవాలి.

సుగర్, నిమ్మ, తేనె మిశ్రమం

ఇది ఒక సహజసిధ్ధమైన బ్లీచ్. అన్నీ సహజసిధ్ధమైనవి కావటంతో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. తేనె ను వేడి చేసుకుని దానికి సుగర్, నిమ్మను కలిపి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. తర్వాత పొత్తికడుపుపై మొక్కజొన్న గంజి పవ్డర్ ను రాసుకోవాలి. ఈ వెచ్చటి మిశ్రమాన్ని పొట్ట భాగంపై వెంట్రుకలు అభివృధ్ధి కి వ్యతిరేక దిశగా చాకు సాయంతో లేక గరిటిలాంటి దానితో రాసుకోవాలి. వెంటనే దానిపై గుడ్డను కప్పాలి. తర్వాత వాక్సింగ్ చేసే విధంగా చూసుకోవాలి. తర్వాత వెంట్రుకలు అభివృధ్ధి అయ్యే దిశకు వ్యతిరేక దిశలో ఆ గుడ్డను బలంగా లాగాలి. కస్త నొప్పిగా ఉన్న ఓర్చుకుంటే ఆ వెంట్రుకలన్నీ శుభ్రం అవుతాయి.

గుడ్డు మాస్క్

గుడ్డు లోని తెల్ల సొన అలాగే దానికి సుగర్, మొక్కజొన్న గంజి పిండిని కలిపి మిశ్రమం గా చేసుకోవాలి. తర్వాత దానిని అప్లై చేసుకోవాలి. మెల్లగా ఆ మాస్క్ ని తీసివేయాలి. ఈ మాస్క్ కి ఆ వెంట్రుకలు వచ్చేస్తాయి.

బంగాళదుంప, పప్పు

బంగాళదుంప ఒక సహజసిధ్ధమైన బ్లీచ్. దీనితో పాటు పెసరపప్పు కలుపుకోవాలి. పప్పు ను కలుపుకోవటం వల్ల మీ వెంట్రుకలు తొలగించబడతాయి. ఈ పేస్ట్ చేసుకోవాలంటే రాత్రి అంతా పెసరపప్పుని నానపెట్టుకుని ఉదయాన్నే పేస్ట్ చేసుకోవాలి. బంగాళదుంపల్ని మెత్తని పేస్ట్ గా గ్రైండ్ చేస్తుకోవాలి. దీనికి తేనె, నిమ్మరసాన్ని కలుపుకోవాలి. తర్వాత దీనిని అబ్డోమినల్ పై రాసుకోవాలి. తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత వేళ్ళతో రబ్ చేసుకోవాలి. తర్వాత శుభ్రపరచుకోవాలి.

అరటి, ఓట్మీల్

అరటిపండు డ్రై స్కిన్ పై వెంట్రుకల్ని తొలగించేందుకు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. అరటి పండు ,ఓట్మీల్ ను కలిపి రాసుకుంటే తేలికగా వెంట్రుకలు తొలగిపోతాయి.

సుగర్, మొల్లాసెస్

సుగర్, నిమ్మ, మొల్లాసెస్ అవాంచిత రోమాల చికిత్సకు సరియైన చికిత్సా విధానం. ఇవి చక్కగా పనిచేస్తాయి. ముందుగా మైక్రోవేవ్ లో వేడి చేసుకోవాలి. దానిలో మొల్లాసెస్ ను కలిపి, తర్వాత సుగర్ బాగా కరిగిపోయాక దానిలో నిమ్మరసాన్ని వేసి పేస్ట్ గా తయారు చేసుకోవాలి. తర్వాత పొత్తి కడుపుపై అప్ప్లై చేసుకుని, వెంట్రుకలు పెరిగే దిశకు వ్యతిరేక దిశగా తీసివేయాలి. ఇలా అవాంచిత రోమాలు తొలగిపోతాయి.

Posted on

Simple ways to stop armpit odor in Telugu – చంకల్లో దుర్వాసన తొలగించుకోవాలంటే?

చంకల్లో చెమటవాసన వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలన్న ఎంతో బిడియంగా ఉంటుంది..ఆఫీస్ లోనూ..అదేవిధంగా సన్నిహితుల దగ్గరా..ఇలా పలుచోట్ల ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటుంటారు. అయితే ఈ సమస్యకు కాస్త ఉపసమనం కలిగేందుకు..అదే మన పరిభాషలో చెప్పాలంటే కాస్త కవర్ చేసేందుకు ఉండనే ఉన్నయ్ పర్ఫ్యూం లు అలాగే డియోడరెంట్లు అయినా వీటితో పూర్తిగా రోజంతా చంకలలో చెమట వాసనను ఆపగలమా అనే ప్రశ్న వేసుకుంటే సమధానం శూన్యమే..ఈ చమట వాసన కారణంగా మన బంధువులూ, స్నేహితులూ మనల్ని దూరం పెడతారు. ఈ సమస్యకి కారణం బ్యాక్టీరియా..ఈ సమస్యను నుంచీ ఎలా బయటపడాలి అంటే అందుకు కొన్ని సహజసిద్ధ గృహచిట్కాలు ఉన్నాయి..వాటినీ మీకోసం అందిస్తున్నాం.. అవేంటో చూద్దమా..

వంట సోడా

మన ఇంట్లో దొరికే వంటసోడాతో ఈ చమట దుర్వాసన నుంచీ బయటపడవచ్చు. వంటసోడా మిశ్రమాన్ని తీసుకుని దానికి నిమ్మకాయ రసాన్ని కలిపి బాగా మిశ్రమంగా కలుపుకోవాలి. దీనిని డైరెక్ట్గా చంకల్లో రాసుకోవాలి. ఇలా రాసుకున్న 15 నిముషాలకు అది ఆరిపోతుంది. తరువాత నీటితో కడుక్కోవాలి. అలాగే ఈ మిశ్రమానికి కావాలంటే మొక్కజొన్న పిండినీ కలుపుకోవచ్చు.  అంతేకాక నిమ్మకాయ బదులు నీరుని ఉపయోగించుకోవచ్చు. పైన చెప్పిన విధానాన్నే అవలంబించవచ్చు.

నిమ్మకాయ

నిమ్మలో చాలా గుణాలున్నాయ్. అందుకే సహజసిధ్ధమైన యాసిడ్ అంటే నిమ్మ అని చెప్పవచ్చు. ఇది ఎంతటి బ్యాక్టీరియానైనా చంపే శక్తి కలది. అంతేకాక ఈ దుర్వాసనను పోగోట్టగలదు. నిమ్మను రాయటం వల్ల ఎంతో తొందరగా ఈ దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. మీకు నిమ్మ చుక్కలు కర్రెక్ట్ గా చంకలపై పడని పక్షంలో మీరు నిమ్మకాయ రసాన్ని ఓ బౌల్ లో పిండి ఆ రసాన్ని తీసుకుని దూదిని తీసుకుని ఆ రసంలో ముంచి రాసుకోవచ్చు లేదా స్ప్రే బాటిల్ ను ఉపయోగించి రాసుకోవచ్చు. ఆరిపోయాక స్నానం చేస్తే మీకు మంచి తేడా కనపడుతుంది.

రోజ్  వాటర్

రోజ్ వాటర్ దుర్వాసనపై ఎంతో బాగా పనిచేస్తుంది. ఇది దీర్ఘకాలం ఉపయోగించవచ్చు. ఇక అలాగే దీనిని కాటన్ బాల్స్ సాయంతో చంకలలో రాసుకోవాలి. కుదరని పక్షాన స్ప్రే బాటిల్ ద్వారా రాసుకోవచ్చు. అంతే కాక రోజ్ వాటర్ ను బాత్ టబ్లో వేసుకుని స్నానం చేసుకోవచ్చు.

సాండల్వుడ్ పవ్డర్

సాండల్ వుడ్ పవ్డర్ దుర్వాసనను తొలగించేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు చంకలలో దుర్వాసనన రాకుండా ఇది పరిరక్షిస్తుంది. గంధం పొడి సులభంగానే మార్కెట్లో దొరుకుతుంది. గంధమ్ను కొని దానిలో నీటిని కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని చంకలలో రాసుకోవాలి. వెంటనే కడుగ రాదు. కాసేపు అలాగే ఉంచుకోవాలి. తరువాత నీటితో శుభ్రపరచుకోవాలి. సబ్బును వాడవద్దు. ఇంకా బాగా మంచి సత్ఫలితాలు పొందాలంటే ఆ మిశ్రమానికి నీటికి బదులుగా వెనిగర్ ను వాడితే మరింతా బాగా పలితాలొస్తాయి. కానీ ఈ మిశ్రమాన్ని మాత్రం స్నానం అయ్యకే రాసుకోవాలి. తరువాత దుర్వాసన పోయి చక్కని పరిమళం మన శరీరం నుంచీ రావటం మీరు గుర్తిస్తారు.

హెర్బల్ మిశ్రమాలు/ మూలికా మిశ్రమాలు

చంకల్లో దుర్వాసన తొలగించేందుకు చాలా హెర్బల్ మిశ్రమాలు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. వీటిలో వాల్నట్ ఆకులు, యూకలిప్టస్ ఆకులు, టోర్మింటల్ ఆకులు, ఓక్ ఆకులు, లేత గోధుమ రంగు ఆకులు వీటిని బాగుగా కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఈ ఆకుల్ని బ్రేక్ చేయకుండా 5 టీస్పూన్ల మిశ్రమాన్ని రెండు లీటర్ల నీటితో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగుగా 5 నిముషాల పాటు ఉడకపెట్టుకోవాలి. ఈ మిశ్రమం ఖచ్చితంగా చంకల్లో దుర్వాసన పోగెట్టేందుకు ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమాన్ని రోజూ స్నానానికి ముందు చేసుకోవటం చాలా ఉత్తమం.
పైన తెలుపిన సహజసిధ్ధ గృహ చిట్కాల వల్ల ఖచ్చితంగా చంకల్లో దుర్వాసన పోయి సత్ఫలితాలను పొందవచ్చు. వీటివల్ల పూర్వపు దుర్వాసన పోతుంది.
Posted on

Telugu home remedies for cracked heels in winter – మీకు పాదాల పగుళ్ళా..?

పాదాలు పగిలి ఇబ్బంది పడుతున్నారా? డిటర్జెంట్లు పాదాలపై దాడి చేస్తున్నాయా? శరీరంలో విపరీతమైన వేడి వల్ల పాదాల పగుళ్ళు వచ్చి సతమతమవుతున్నారా? అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చికిత్స కు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఈ సమస్యకు చికిత్సలున్నాయి. ఆట్టే ఆశ్చయపోకండి. పాదాల పగుళ్ళతో బాధపడే వారికి మా ఈ తెలుగు టిప్స్ ద్వారా గృహ చికిత్సా విధానాలను ఈ శీర్షికలో ఇస్తున్నాం. మరి అవేంటో చూద్దామా..!

1. పాదాలు తట్టుకునేంత వేడినీటిలో కాస్త ఉప్పు, నిమ్మకాయ రసం చేర్చి పాదాలను ఆ నీటిలో ఉంచి, బ్రష్‌తో పాదాలను రుద్దినట్లైతే బ్యాడ్‌ సెల్స్‌కు చెక్‌ పెట్టవచ్చు.

2. గోరింటాకును బాగా రుబ్బుకుని పగుళ్లు ఉన్న చోట రాసుకుని ఎండిన తర్వాత కడిగితే పగుళ్లకు చెక్‌ పెట్టవచ్చు.

3.బొప్పాయి గుజ్జును పగుళ్లపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. వేపాకు, పసుపులో కాసింత సున్నం కలిపి పేస్‌‌టలా రుబ్బుకుని, ఆముదంలో చేర్చి పగుళ్లకు రాసినట్లైతే ఉపశమనం లభిస్తుంది.

5. అలాగే ఆముదం, కొబ్బరి నూనె సమపాళ్ళలో తీసుకుని అందులో పసుపు పొడి చేర్చి రోజూ పాదాలకు రాస్తే పగుళ్లను దూరం చేసుకోవచ్చు.

6. రాత్ర నిద్రకు ఉపక్రమించే సమయంలో పాదాలను శుభ్రం చేసుకుని కొబ్బరి నూనె రాస్తే పగుళ్లు ఏర్పడవు.

7. ఇంకా నాణ్యత గల స్లిపర్స్‌, షూస్‌ వాడటం ద్వారా పగుళ్లు దరిచేరవు. ఇలాంటి గృహ చిట్కాలను పాటిస్తే మీ పాదాలకు చీకూ చింతా అవసరం ఉండదు.

Posted on

Weight loss tips in Telugu – అదిక బరువును ఎలా తగ్గించుకోవాలి

స్థూలకాయం అనగా అధిక బరువు కలిగి ఉండడం,ఈ సమస్య ఈ కాలంలో వయస్సుతో సంబందం లేకుండా అందరిని ఇబ్బందిపెడుతుంది,అయితే ప్రత్యేకంగా కార్పొరేట్ ఉద్యోగులకు ఎక్కువగా స్థూలకాయం వస్తుంది,ఎందుకంటే వారి ఉరుకుల పరుగుల జీవితంలో,పని ఒత్తిడిలో సరియైన ఆహార నియమాలు పాటించడం మానేసి, ఇష్టం వచ్చినట్లు,ఏది కావాలంటే అది,ఎప్పుడు కావాలంటే అప్పుడు,ఎక్కడ కావాలంటే అక్కడ,జుంక్ ఫుడ్ తింటూ,ఏవిదమైన వ్యాయామం చేయకపోవడం వల్ల,వారి ఆహారంపై నియంత్రణ లేకపోవడం వల్ల దీనికి గురివుతున్నారు.

అదిక బరువును ఎలా తగ్గించుకోవాలి (weight loss tips in Telugu)

 1. రోజూ కనీసం 30 నిమిషాలైన వాకింగ్ చేయడం ఎంతో మంచిది, దీని వల్ల మీరు ఆ రోజు తీసుకున్న క్యాలరీలు తగ్గుతాయి.
 2. ద్రవం రూపంలో ఉన్నవి ఎక్కువగా తీసుకోవాలి,ప్రత్యేకంగా “గ్రీన్ టీ” రోజుకు కనీసం 2 సార్లు అయినా తీసుకుంటే ఎంతో మంచిది, ఇది మీ శరీరంలోని కొవ్వు పదార్దాలను కరిగిస్తుంది.
 3. ఒకవేళ మీకు మంసాహారం అంటే ఇష్టం ఉన్ననూ,ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు, దాని వల్ల మీశరీరంలో కొవ్వు పెరిగే ప్రమాదం ఎక్కువా.
 4. మీ రోజువారి ఆహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉన్న ఆహరం అంటే పాలు, మజ్జిగ ఎల ఎక్కువగా తీసుకుంటే ఎంతో మంచిది.
 5. మీరు తీసుకునే ఆహారంలో “చక్కెర నిల్వలు” ఎక్కువగా ఉంటే దానిని తగ్గించడం ఎంత అవసరం,ఎందుకంటే ఈ చక్కెర నిల్వలు అధిక బరువుకి దారి తీస్తాయి.
 6. అధిక రసం కలిగిన పండ్లను తీసుకోవడం ఎంతో మంచిది, ప్రత్యేకంగా నారింజ, పుచ్చకాయ, పైన్ ఆపిల్ తీసుకుంటే మీ బరువుని ఎంతో సులభంగా తగ్గించుకోవచ్చు.
 7. మీ ఆహారం తీసుకునే పద్దతిని మార్చుకోండి, ఒకవేళ మీరు రోజుకి 3 సార్లు ఆహరం తీసుకుంటున్న్నట్లైతే దానికి నాలుగు సార్లుగా కొంచెం కొంచెం తీసుకోండి.
 8. మీ అధిక బరువు తగ్గించుకోవడానికి వారంలో కనీసం 3 కోడి గుడ్లు అయినా తీసుకోవడం మంచిది,ఎందుకంటే ఈ కోడి గుడ్లలో ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.
 9. సాద్యమైనంత వరకూ ఆకలి వేస్తేనే ఆహారం తీసుకోండి,అంతేకాకుండ ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి లేని సమయంలో కూడా ఆహారం తీసుకోవడం వల్ల మీరు అధిక బరువుకు గురి అయ్యే ప్రమాదం ఉంది.
 10. రోజూ వ్యాయామం చేయండి,అలా చేస్తే మీ శరీరంలోని క్యాలరీలు తగ్గి మీ బరువును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి,వీలుంటే “యోగా” చేయడం ఎంతో శ్రేయస్కరం.
 11. మీరు సరియైన సమయాల్లో నిద్రపోతే మీలోని జీవక్రియ రేటు పెరిగి,మీ అదిక బరువును తగ్గించడంలో సహాయ పడుతుంది.
 12. మీ రోజు వారి ఆహారంలో “సూప్స్” తీసుకుంటే అది మీ అధిక బరువును తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
 13. మీ ఆహారంలో చీజ్, నెయ్యి మరియు వెన్న ఎలాంటి కొవ్వుని కలిగించే పదార్దాలు లేకుండా చూసుకోండి ఎందుకంటే వీటి వల్ల మీ బరువు పెరిగే అవకాశం ఎక్కువ.
 14. నూనెతో చేసిన వస్తువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది,ఎందుకంటే వీటిలో అధిక శాతంలో ఉన్న క్యాలరీలు,మీ బరువు అధికంగా పెంచే అవకాశం ఉంది.
 15. బంగాళ దుంపలలో కేలరీలు మరియు కార్బోహైడ్రేట్ల ఎక్కువగా ఉండడం వల్ల అధిక బరువుకు గురి చేసే ప్రమాదం ఉంది.

బరువు తగ్గించే ద్రవాలు(డ్రింక్స్)

 1. రోజూ కాఫీ తాగడం వల్ల అందుకో ఉండే కెఫిన్ మీ బరువుని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.అయితే ఇందులో కోకో మరియు కోలా గింజలు కలుపుకుంటే మంచి ప్రబావం చూపిస్తాయి.
 2. ఆపిల్ పళ్లరసం వినెగార్,తేనె,చల్లని నీరు కలిపి తీసుకుంటే మీకు మీ శరీరంలోని క్యాలరీలను తగ్గించడమే కాకుండా మీ జీర్ణ సమస్యలకి మంచి ఫలితం లబిస్తుంది.
 3. నిమ్మ,నారింజ వంటి సిట్రస్ పండ్లు జ్యూస్ రోజూ తీసుకుంటే మీ అధిక బరువు సమస్యను తరిమేయవచ్చు.
Posted on

Breast reduction tips for women in Telugu – శస్త్రచికిత్స లేకుండా అధికంగా ఉన్న “చాతి భాగమును(బ్రెస్ట్)” ని తగ్గించుకోవడం ఎలా?

అందానికి మారుపేరు అయిన అమ్మయిలు, ఎన్నో రకముల ఇబ్బందులు పడుతూ ఉంటారు,అందులో ఆరోగ్య సమస్యలు కొన్ని అయితే, మరికొన్ని శారీరక సమస్యలు, అందులో అధిక చాతి భాగం(బ్రెస్ట్) కలిగి ఉన్న స్త్రీలు అందరికి ఆకర్షితులై, ఆకతాయుల పిచ్చి పిచ్చి వ్యాఖ్యలకు నలిగిపోతూ, ఎన్నో ఆటు, పోట్లు అనుభవిస్తూ, ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. అంతేకాకుండా శారీరకంగా కూడా అధిక భరువు కలిగిన చాతి వల్ల నడుము, భుజాలు, మెడ ప్రాంతంలో నొప్పితో బాదపడుతూ ఉంటారు.

ఈ అధికమైన చాతి కలిగి ఉండడం వల్ల మీరు మీకు నచ్చినవి,అందమైన దుస్తులు వేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది అంతే కాకుండా ఇది మీ సౌందర్యం పై కూడా ప్రబావం చూపించి మీరు సరదాగ, బయటకు వెళ్ళాలన్నా, షాపింగ్ కి వెళ్ళాలన్న,ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

అయితే, ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది, అలానే మీ చేతి సమస్యను దూరం చేసి మీరు కూడా అందరిలా సరిసమానమైన చాతితో ఉండాలంటే శస్త్రచికిత్స లేకుండా, మీ ఇంట్లోనే సహజ పద్దతులు కొన్ని ఉన్నాయి, అవి ఎంటో చూసేద్దామా.

రొమ్ము పరిమాణం తగ్గించడానికి సహజ మార్గాలు

మీ శరీర బరువుని “BMI” ప్రకారం ఉండేలా చూసుకోండి

మీ శరీర బరువుని మీ వయస్సు ప్రకారం ఎంత ఉండాలో అంతే ఉండేలా చూసుకోవాలి, ఒకవేళ ఎక్కువ ఉన్నట్లైతే తగ్గించుకోవడానికి పళ్ళు, కూరగాయలు, బీన్స్, తృణధాన్యాలు, కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలు, ఆకు కూరలు,గింజలు తీసుకోవాలి, అలాకాకుండా బాగా వేయించిన ఆహారం, తీపి ఎక్కువగా ఉండే పదార్దాలు తీసుకోవడం మంచిది కాదు.

చాతి పరిమాణాన్ని తగ్గించడానికి మాత్రలు(మెడిసన్)

మీ ఈ చాతి సమస్య నుండి విముక్తి పొందడానికి అనేక మూలికలతో తయరు చేసిన మాత్రలు లభిస్తాయి. అయితే, ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి అయినప్పటికీ ఏరకమైన దుష్ప్రబావాలు కలగకుండా కాపాడతాయి.ఇవి మీ చాతి పరిమాణాన్ని తగ్గించడంలో ఎన్నో అద్భుతాలు చేస్తాయి అనడంలో సందేహం లేదు.

చాతి పరిమాణాన్ని తగ్గించడానికి లోషన్స్ మరియు ఔషద పదార్దాలు

మీ చాతిని సరైన మార్గంలో పెట్టుకోవడానికి, అధిక బరువుని తగ్గించుకోవడానికి అనేక లోషన్స్ మరియు ఔషద పదార్దాలు ఎన్నో ఉన్నాయి,మీరు చేయవలసిందల్ల అవి మీ చాతి భాగం పై రాసుకుని,మసాజ్ చేసుకుంటే మీ చాతి పరిమాణం తగ్గి, మంచి ఆకారం లబిస్తుంది.

సరిగ్గా సరిపొయే బ్రా

మీ చాతి పరిమాణాన్ని రక్షించుకోవడంలో మీరు వేసుకునే బ్రాలు సరియైనవిగా, మీ చాతికి సరిగ్గా సరిపోయేవి తీసుకోవాలి, అలా వేసుకుంటే దాదాపుగా ఒక కప్పు పరిమాణం తగ్గి, మీ చాతి భాగం అందమైన ఆకారంతో కనపడుతుంది.

రొమ్ము తగ్గింపు వ్యాయామాలు

ఖచ్చితంగా అనేక రొమ్ము తగ్గింపు వ్యాయామాలు ఉన్నాయి, అందులో ముఖ్యమైనవి బోటింగ్, జాగింగ్, చురుకైన వాకింగ్,సైక్లింగ్ ఇలా చేస్తే మీ చాతి పరిమాణాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

మీ శరీరాకృతిని చూసి ఆందోళన చెందకుండా ఈ పై సూచించిన వన్నీ ఉపయాగించి ఆనందంగా, ప్రశాంతంగా జీవించండి.

Posted on

Telugu Homemade Body lotions – మీ చర్మ సంరక్షణకు సహజమైన “బాడీ లోషన్స్”

ఈ బాడీ లోషన్స్ అనేవి వాడటం చాల సులభం, అదేవిధంగా తయారుచేసుకోవడం మరింత సులభం, ఒక్క 10-15 నిమిషాలు మీవి కావు అనుకుని చేసుకుంటే అందమైన మీ అందానికి కారణం అయ్యే “బాడీ లోషన్స్”ని మీరు తయారు చేసుకోవచ్చు.అదేవిధంగా వారి వారి కోరిక మేరకు మంచి సుగంధ ద్రవ్యాలు కలుపుకుంటే, మీ చర్మం సుగంధ పరిమళాలను వెదజల్లుతుంది అనడంలో సందేహం లేదు.

మన ఇంట్లోనే, మనకు అందుబాటులో ఉన్న పదార్థాలుతో, చాల సులభంగా తయరుచేసుకోవచ్చు,ముఖ్యంగా కావాల్సినవి అల్లము, చమొమిలె పండు, కొబ్బరి,పనీరు, బాధం నూనె మొదలగునవి, సరికొత్త పరిమళాలు కావాలనుకుంటే  పుదీనా , వనిల్లా, లావెండర్ రుచి వంటి సువాసనలు జోడించవచ్చు.

“బాడీ లోషన్” తయారు చేసుకునే విధానం చుసేద్దామ

ఎవరికి వారు వారికి నచ్చిన విధంగా,వారి శరీరానికి అనుకూలంగా ఈ “బాడీ లోషన్” తయారుచేసుకోవచ్చు, అయితే వీటి తయారీలో ముఖ్యమైనవి కొబ్బరి నూనె , కోకో వెన్న లేదా షియా వెన్న, ని ఉపయోగిస్తే మీ పగిలిన పాదాలను, పొడి చర్మాన్ని  కాపాడుకోవచ్చు.

కావలసిన పదార్దాలు

 • 1/2 కప్పు బాదం (లేదా) ఆలివ్ నూనె
 • 1/4 కప్పు కొబ్బరి నూనె
 • 1/4 కప్పు మైనం

కావాలంటే 1 టీ స్పూన్ విటమిన్ “E”,  కొబ్బరి నూనె , కోకో వెన్న లేదా షియా వెన్న కూడా ఉపయోగించవచ్చు.

తయారు చేసుకునే పద్దతి

పైన సూచించిన వన్నీ కలిపిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి, మరొక గిన్నెలో మీరు పోసి గోరు వెచ్చగా చేసి, అందులో ఈ మిశ్రమాన్ని కలపండి,మీ చర్మానికి పట్టించండి, మంచి ఫలితాలు లభిస్తాయి.

అందమైన చేతులు, శరీరం కోసం క్రీం

మనకు అందుబాటులో ఉన్న వాటితో మన చేతులు, శరీరమును కాపాడుకోవడానికి మంచి క్రీం తయారు చేసుకోవచ్చు,ఇది అన్ని రకముల చర్మానికి ఉపయోగపడుతుంది .

ఈ విదంగా చేయండి

 • 1/4 కప్పు కొబ్బరి నూనె
 • 1/8 కప్ షియా వెన్న
 • 1/8 కప్ కోకో వెన్న
 • 1 టేబుల్ స్పూన్ కలబంద రసం
 • 1 టేబుల్ స్పూన్ నూనె(బాదం, జొజోబా)
 • 5-10 చుక్కల ముఖ్యమైన నూనెలు.

తయారు చేసుకునే పద్దతి

షియా వెన్న, కొబ్బరి నూనె, కోకో వెన్న తీసుకుని వేడి చేసి కరగబెట్టాలి.

పైన మిశ్రమాన్ని కలబంద వేరా మరియు నూనె, కావాల్సిన పదార్దములు కలిపి, ఒక కొత్త మిశ్రమంగా మార్చుకుని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి.

ఈ  షియా వెన్న మీ కఠినమైన చేతుల్ని అందంగా, మృదువుగా, మార్చి మంచి ప్రయోజనం చేకూరుస్తుంది.

మేక పాలు, కలబంద మిశ్రమము

మీ పొడిబారిన, జిడ్డైన చర్మ సం రక్షణకు ఈ మిశ్రమం ఎంతో ఉపయోగపడుతుంది, అంతే కాకుండా దీని వల్ల ఏ రకమైన దుష్ప్రభావాలు ఉండవు.

Posted on

Telugu tips for facial hair – ముఖంపై అవాంచిత రోమాలా?

స్త్రీ ముఖం అనగానే గుర్తొచ్చేది అందం. చంద్రునిపై మచ్చల్లా ఆ అందానికి అవాంచిత రోమాలు తోడైతే ఆడవారి బాధ వర్ణాతీతం. చాలమంది స్త్రీలు ముఖంపై అవాంచిత రోమాలు ఏర్పడటం వల్ల బాధపడుతుంటారు. చక్కని ముఖంపై అవాంచిత రోమాలు ఏర్పడటం వల్ల సహించలేని విధంగా ముఖం తయారవుతుంది. ఈ సమస్య స్త్రీలు ఎదుర్కొనే సమస్యల్లో ముఖ్యమైనది. అయితే అవాంచిత రోమాలు చిన్నగా ప్రారంభమై కొన్ని సమయాల్లో అకస్మాత్తుగా అత్యంత వృద్ది చెందుతాయి.
దీనినే హిర్స్యుటిస్మ్ అని అంటారు. అంటే ఈస్త్రొజెన్ హార్మోనుల అసమతుల్యత వల్ల కారణంగా ఈ అవాంచిత రోమాల స్థాయి పెరుగుతుంది. హిర్స్యుటిస్మ్ సమస్య దీర్ఘకాలికమైనదే అయిన వాక్స్ చేయించతం వల్లో తొలగించటం వల్లనో చికిత్సలు తీసుకోవటం వల్లనో తగ్గకపోగా సమస్య మరింతగా పెరిగే అవకాశముంది. ఈ సమస్య నుంచి తాత్కాలికంగా బయటపడేందుకు ఇంటిలోనే నివారణ మార్గాలు కొన్నింటిని మీకోసం:
 • పసుపు: భారతీయ సంస్కృతిలో పెద్దపీట వేయబడిన పసుపు ప్రతి ఇంటిలోను దొరికే వనమూలిక. అన్నింటా వాడబడే ఈ పసుపు సౌందర్య రహస్యానికి కూడా పని చేస్తుంది. పూర్వం పసుపును చర్మం సున్నితంగా ఉండేందుకు పెంపొందించేందుకు ప్రతిరక్షకం. దీనివల్ల మేని ఛాయ వృద్ది చెంది అవాంచిత రోమలను పోగొడుతుంది.
 • శనగపిండి : భారతీయ సంప్రదాయ పారంపర్యంగా ఎన్నో ఏల్ల నుంచి ఇంటిలో వాదే ఫేస్ మాస్క్ గా వాడబడుతోంది. మృత చర్మం మళ్ళీ ప్రకాశవంతంగా తయారయ్యేల ఇది వృద్ది చేస్తుంది. శనగపిండిని పసుపుతో కలిపి వాడటం వల్ల ఇతర ఫేషియల్స్ కంటే మంచి పలితానిస్తుంది. సహజసిద్దమైన నివారణా మార్గాలు ఎటువంటి దుష్ప్రభావలను ఇవ్వదని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇలా శెనగపిండి, పసుపు వాడటం వల్ల పెరుగుదలను నియంత్రించవచ్చు.
 • చక్కెర మిశ్రమం : ఇది ఇంటిలో ఉపయోగించే ఫెస్వాక్స్. ఏది ఏమైన ఈ ప్రక్రియ చాల మంచి ఫలితాలనే ఇస్తుంది. కాని కొంచెం దీని వల్ల చర్మం ఒత్తిడికి గురవుతుంది. ఎందుకంటే చక్కెర మిశ్రమంలో నిమ్మ, తేనె కలపటం వల్ల కొంచెం నొప్పిని కలిగిస్తుంది. నిమ్మను, తేనెను, చక్కెర మిశ్రమాన్ని ముఖనికి రాయాలి. మామూలు వ్యాక్స్ ప్రక్రియనవలంబించి గుడ్డ సాయంతో తొలగించాలి.
 • గ్రుడ్డు మాస్క్ : కోది గ్రిడ్డులోని తెల్ల సొనను, ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్నను కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖంపై ఆరనివ్వాలి. అవాంచిత రోమాలను కూడా తేలికగా తొలగించవచ్చు.ఈ నివారణా మార్గం చాలా సులువు. ఎందుకంటే ఇందులో కలిపే దినుసులు అన్ని చోట్లా దొరకటం వల్ల ఇది చాలా ప్రభావవంతమైనది. అంతేకాక మంచి ఫలితాలనిస్తుంది.
ఆహారంలో పైటోఈస్ట్రొజన్స్ ఉండేల చూసుకుంటే:
అవాంచిత రోమాల నివారణకు మంచి ఆహారం ఎంతో అవసరం. ఈ సమస్య హార్మోనుల లోపం వల్ల కలుగుతుంది. అయితే ఆహారపు అలవాట్లు నిర్లక్షం కారణంగా కూడా ఇది సంభవిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత కేవలం పైటోఈస్ట్రొజన్ లోపం వల్ల సంభవిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అవిశ గింజలు,సోపు,ఆల్ఫాల్ఫా(రజిక)గోటుకు(ఉత్త్రభారతదేశంలో బ్రహ్మి)పైటో ఈస్ట్రోజన్స్ పెరుగుదలకు తోడ్పడతాయి. హిర్స్యుటిస్మ్ తగ్గేందుకు మనం తీసుకునే ఆహారం ప్రముఖ పాత్రను పోషిస్తుంది.
Posted on

Telugu women body care tips – స్త్రీల శరీరాకృతిని మెరుగుపరుచుకునే చిట్కాలు

మీ శరీరాకృతిని జీవితాంతం ఉంచుకోవడానికి పరిష్కారం కాని అద్భుతమైన మందులు కాని ఎమిలేవు. ఇక్కడ చెప్పాలనుకునే మాట ఎమిటంటే, మీరు మీ శరీరాకృతి కోసం ఎన్నో చేస్తూ ఉంటారు, రాత్రి పూట భోజనం మానేయడం, మధ్యాహ్నం అకలితో పని చేసుకోవడం, వారం అంతా  ట్రెడ్మిల్ యంత్రం పై పరుగులు తీయడం, ఇలా ఎన్నో చేస్తూ అసలు విషయం మరచిపొతూ ఉంటారు.

మనం తెలుసుకోవలసింది, ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పొందాలంటే, మన మానసిక ఆరోగ్యం ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆరోగ్యం మరియు ఫిట్నెస్ అనేవి ఎప్పటికప్పుడు మనం చేసే పనులను చుసే కోణంలో కుడా ఆదారపడి ఉంటుంది.

మెరుగైన అరోగ్యం, శరీరాక్రుతి  పొందాలంటే ఈ చిట్కాలు ఎంతో ఉపయోగకరం:

 •  సాద్యమైనంత వరకూ అధిక కొవ్వు, క్యాలరీలతో కూడిన ఆహారమును దూరంగా ఉంచండి.
 • పాల ఉత్పత్తులు , చాక్లెట్ బార్లు , వెన్న  వంటి పదార్దాలు లేని  ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.
 •  మీ రోజు వారి వ్యాయమంలో సరిసమాన బరువు కలిగి, ఎంతో ఉపయోగకరమైన పరికరాలతోనే  వ్యాయామం చేయడం చాల అవసరం,  రోజుకి 30 నిమిషాలు ప్రత్యేకమైన, ఎంతో  శక్తివంతమైన గుండెకు సంభందించిన వ్యాయం చేస్తే ఉపయోగపడని క్యాలరీలు కరిగి , శరీరంలోని కొవ్వు శాతం తగ్గి గుండెకు ఎంతో మంచిది.
 •  మీరు తీసుకునే భోజనంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం  అవసరం, సమాన్యంగా అన్నింటిలో కొవ్వు,క్యాలరీలు కలిగి ఉండటం వల్ల అవి తీసుకున్నచో మీరు లావుగా మారే ప్రమాదం ఉంది.
 • ఎక్కువగా మంచి ఆహారం తీసుకుంటే మీ శరీరాక్రుతిని కాపడుకోవచ్చు.
 • వ్యాయామం చేయడం చాలా అవసరం.
 •  ఎక్కువ శాతం మంచి నీరు తీసుకోవడం ఎంతో అవసరం, రోజుకి కనీసం 6-8 oz నీరు అవసరం.