Posted on

Hair growth tips in Telugu – Hair loss control tips

ప్రతి ఒక్కరి లోనూ తలపై వెంట్రుకలు ఒక అందమైన భాగం. ఎన్నో సందర్భాలలో మన అలంకరణకు తగిన విధంగా హెయిర్ స్టైల్ చేసుకోవటం వలన మన ముఖంలో అదనపు గ్లో కనిపిస్తుంది. గతంలో ఆడువారు మాత్రమే హెయిర్ స్టైల్ చేసుకునే వాళ్ళు.

కానీ కాలం మారే కొద్ది పురుషులు కూడా ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో మనకు తెలియకుండానే అనేక కెమికల్స్ మరియు అజాగ్రత్తల వలన అనేక హెయిర్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. అందులో ఒకటి ఈ హెయిర్ ఫాల్ సమస్య.

ఈ సమస్య యొక్క ప్రధాన కారణాలు మరియు నివారణ పద్ధతుల గురించి ఈ వ్యాసంలో చూద్దాం.

హెయిర్ గ్రోత్ యొక్క దశల

వెంట్రుకలు ఒక క్రమ పద్ధతిలో ఎదుగుతూ, ఆగుతూ, రాలిపోతూ ఉంటాయి. ఇది మూడు దశలుగా సాగుతుంది.

 • ఎదిగే (అనాజెన్) దశ : ఇది 3-6 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఇందులో వెంట్రుకల కుదుళ్లలోని కణాలు చాలా వేగంగా వృద్ధి చెందుతుంటాయి.
 • స్తబ్ధ (కెటాజెన్) దశ : సుమారు 2-3 వారాల పాటు సాగే ఈ దశలో వెంట్రుకలు పెరగటం ఆగిపోతుంది.
 • విశ్రాంతి (టిలోజెన్) దశ : ఇది దాదాపు 100 రోజుల వరకు కొనసాగుతుంది. వెంట్రుకలు రాలిపోయేది ఈ దశలోనే. సుమారు 6 నుండి 8% జుట్టు ఈ దశలో ఊడుతుంది.

ఇదంతా ఒక చక్రంలా అత్యంత సహజంగా, నిరంతరంగా సాగిపోయే ప్రక్రియ. మగవారికి సుమారు లక్ష, ఆడవారికి లక్షన్నర వెంట్రుకలు ఉంటాయి. వాటిలో రోజుకు 50-100 వరకు వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఒకవైపు రాలేవి రాలుతున్నా పెరిగేవి పెరుగుతుండటం వల్ల పెద్ద తేడా కనిపించదు. కొందరికి రోజూ కాకుండా వారానికి సరిపడా ఒకరోజే ఊడిపోవచ్చు.

దీంతో ఏదో అయిపోయిందని, బట్టతల వచ్చేస్తోందని భయపడిపోతుంటారు. అలాంటి భయాలేవీ అవసరం లేదు. విశ్రాంతి దశ తర్వాత ఊడిపోయిన వెంట్రుకలు తిరిగి మొలుస్తాయి. వెంట్రుకల ఎదుగుదల, విశ్రాంతి దశలు అస్తవ్యస్తమైతే మాత్రం జుట్టు ఎక్కువగా రాలిపోవటం మొదలెడుతుంది.

హెయిర్ ఫాల్ కారణాలు

మెడికల్ పరంగా హెయిర్ ఫాల్ సమస్యకు సోరియాసిస్, రింగ్ వార్మ్, క్యాన్సర్ చికిత్స, థైరాయిడ్, అలోపీసీయా వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఇటువంటి ఆరోగ్యపరమైన సమస్యల వలన కలిగే హెయిర్ ఫాల్ ని గుణపరిచేందుకు వైద్యుల సహాయం పొందుట మంచిది. మెడికల్ పరంగానే కాకుండా మన నిర్లక్ష్యం వలన కలిగే హెయిర్ ఫాల్ సమస్యలకు కారణాలు మరియు వాటి నివారణ పద్ధతుల గురించి కూడా చూద్దాం.

 • పోషకాల లోపం : మీ హెయిర్ ఫాల్ కి ప్రధాన కారణం సరైన పోషక ఆహారాలను తీసుకోక పోవటం. మనదేశంలో పోషకాల లోపం ముఖ్యంగా ఐరన్ లోపం ఎక్కువ. బి విటమిన్లు, విటమిన్ డి లోపాలు సైతం తరచూ కనిపిస్తుంటాయి. ఇందు కారణంగా కూడా వెంట్రుకలు పలుచబడొచ్చు. బరువు తగ్గటానికి ఆహార నియమాలు పాటించేవారిలో, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నవారిలోనూ పోషకాల లోపం వలన క్రమంగా జుట్టు ఊడిపోవచ్చు (క్రానిక్ టిలోజెన్ ఎఫ్లూవియమ్).
 • బిగువైన హెయిర్ స్టైల్స్గట్టిగా జడ బిగించటం (ట్రాక్షన్ అలోపీషియా): కొందరు జడను ఎంతో గట్టిగా బిగించి వేస్తుంటారు. అందువలన కూడా జుట్టు ఊడిపోవచ్చు.
 • స్ప్లిట్‌ ఎండ్స్ వలన కూడా హెయిర్ ఫాల్ సమస్య రావచ్చు.
 • డాండ్రఫ్ : డాండ్రఫ్ వలన తలపై నూనె ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వలన దురద తలెత్తుతుంది. అంతేకాదు ఫంగస్, బ్యాక్టీరియా వృద్ధి చెందొచ్చు. ఫలితంగా వెంట్రుకలు ఊడిపోవచ్చు.
 • వేడి నీటితో తల స్నానం కూడా కుదుళ్లు బలహీనం కావడానికి ఒక కారణం.
 • తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రభావం.
 • ఒత్తిడి: మానసిక ఒత్తిడి అధికంగా ఉన్న వారి యొక్క జుట్టు పలుచగా అవుతుంటుంది (డిఫ్యూజ్ హెయిర్లాస్). ఒకేచోట కాకుండా తలంతా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. జ్వరం, కాన్పు, సర్జరీల వంటివి శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తాయి. అందుకే కొందరికి జ్వరం తగ్గాక, మహిళల్లో కాన్పు అయ్యాక రెండు మూడు నెలల తర్వాత జుట్టు ఊడిపోతుంటుంది (అక్యూట్ టిలోజెన్ ఎఫ్లూవియమ్). ఈ కారణాల వలన రాలిన జుట్టు కొన్ని రోజుల తరువాత తిరిగి పెరిగే అవకాశం ఉంది. ఇందుకు ప్రత్యేకించి చికిత్స అవసరం లేదు.
 • మద్యపానం సేవించటం, ధూమపానం వంటి అలవాట్లు ఉన్న వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన కూడా జుట్టు అధికంగా రాలిపోయే అవకాశాలు ఉన్నాయి.
 • ఎక్కువగా ఎండలో తిరగటం వలన జుట్టు డ్రై గా మారి రాలిపోవచ్చును.
 • వైద్య పరిస్థితులుమందులు : కొన్ని రకాల మందుల కారణంగా కూడా జుట్టు రాలిపోవచ్చు. క్యాన్సర్తో మామూలుగానే జుట్టు ఊడిపోతుంటుంది. కీమోథెరపీ మందులతోనూ వెంట్రుకలు ఊడిపోవచ్చు. కొన్నిరకాల మానసిక సమస్యల వలన కలిగే నొప్పి మరియు అధిక రక్తపోటు తగ్గటానికి రోగనిరోధక శక్తిని అణచి పెట్టటానికి వేసుకునే మందుల కారణంగా కూడా జుట్టు రాలిపోవచ్చు.
 • వాతావరణ కాలుష్యం – ప్రస్తుత కాలంలో అధిక శాతం హెయిర్ ఫాల్ కు కారణం కాలుష్యం.
 • హెయిర్ స్టైల్ చేసుకునే సమయంలో ఉపయోగించే కెమికల్స్సౌందర్య సాధనాలు: కొందరు వెంట్రుకలను స్ట్రైటనింగ్ చేయటానికి వేడిని పుట్టించే పరికరాలతో ఐరన్ చేస్తుంటారు. దీంతో జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. కర్ల్స్ వంటివి చేయటం వలన కూడా వెంట్రుకలు ఊడిపోవచ్చు.
 • హార్మోన్ల మార్పులు : థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువైనా, తక్కువైనా వెంట్రుకలు పెరిగే ప్రక్రియ దెబ్బతిని, రాలిపోవచ్చు. ఆడవారిలో పీసీఓడీ సమస్య మూలంగా టెస్టోస్టీరాన్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది ఒకవైపు తల మీద జుట్టు రాలిపోయేలా చేస్తే మరోవైపు శరీరంలోని మిగతా భాగాల్లో వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది. పీసీఓడీకి చికిత్స తీసుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది. ఇటీవల జిమ్‌కు వెళ్లేవారు ప్రోటీన్ వంటివి వాడుకోవటం ఎక్కువైంది. దీంతో టెస్టోస్టీరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇందు కారణంగా కూడా హెయిర్ ఫాల్ కలగవచ్చు.
 • ఫంగస్ ఇన్‌ఫెక్షన్ : చిన్న పిల్లల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఇదే. పిల్లలు తరగతిలో దగ్గర దగ్గరగా కూర్చుంటారు. ఒకరినొకరు తాకుతుంటారు. ఇతరుల దువ్వెనలనూ వాడే అవకాశం వుంది. వారిలో ఎవరికైనా ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీంతో జుట్టు ఊడిపోవచ్చు (టీనియా క్యాపిటస్). యాంటీ ఫంగల్ మందులతో ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమైపోతుంది. జుట్టు తిరిగి వస్తుంది.
 • పేను కొరుకుడు (అలోపీషియా ఏరియేటా):  ఇందులో అక్కడక్కడా గుండ్రంగా జుట్టు ఊడిపోయి, నున్నగా అవుతుంది. పేలు కొరకటం వల్ల ఇది వస్తుందని భావిస్తుంటారు. కానీ నిజానికి పేలు వెంట్రుకలను కొరకవు. దీనికి మూలం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం. దీంతో వెంట్రుకల కుదుళ్లు దెబ్బతిని, రాలిపోతాయి. థైరాయిడ్ సమస్యలు, ఎండు గజ్జి, మధుమేహం, మానసిక ఒత్తిడి గలవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కొందరికి దీని మూలంగా పెద్ద మొత్తంలోనూ జుట్టు ఊడిపోవచ్చు (అలోపీషియా టోటాలిస్). ఇటువంటి వారిలో కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోతాయి. పేను కొరుకుడుతో రాలిపోయిన వెంట్రుకలు మూడు, నాలుగు నెలల తర్వాత తిరిగి మొలుస్తాయి.
 • జుట్టు లాగటం (ట్రైకో టిల్లోమేనియా): కొందరు పిల్లలు వెంట్రుకలను గట్టిగా పట్టుకొని లాగేస్తుంటారు. అలా చేయటం హెయిర్ ఫాల్ కి దారితీస్తుంది. దీనికి మూలం మానసిక సమస్యలు. అలా చేయటం వలన వెంట్రుకలు మధ్యలో తెగిపోతాయి. కొన్ని పొడుగ్గా, కొన్ని చిన్నగా కనిపిస్తాయి. అక్కడక్కడా వెంట్రుకలు ఊడి పోతాయి.
 • చర్మ సమస్యలు: చర్మం మీద మచ్చ (స్కార్) పడేలా చేసే చర్మ సమస్యల వలన కూడా జుట్టు ఊడిపోతుంది. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డిస్కాయిడ్ ల్యూపస్ ఎరీథెమటోసస్, లైకెన్ ప్లేనస్ పైలారిస్ మరియు సార్కాయిడోసిస్ జుట్టుకు వచ్చే దీర్ఘకాల ఇన్ఫెక్షన్లు. వీటి కారణంగా కుదుళ్లు మొత్తంగా ఊడిపోతాయి. అందువల్ల వెంట్రుకలు తిరిగి రావటమనేది జరగదు.

హెయిర్ ఫాల్ తగ్గించేందుకు గృహ నివారణ పద్ధతులు

హెయిర్ ఫాల్ సమస్యకు ఎన్నో వైద్య చికిత్సలు ఉన్నప్పటికీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యను తొలగించేందుకు ఉత్తమ మార్గం ఇంటి నివారణ పద్దతులను అనుసరించటం. కొన్ని సులభమైన మరియు ప్రభావితమైన హోమ్ రెమెడీలను చూద్దాం.

ఆమ్ల

ఆమ్లా తో అనేక రకాలైన ప్యాక్‌లను తయారు చేసి మీ కురులపై ఉపయోగించవచ్చు.

 • కొబ్బరి నూనెలో లేదా బాదాం నూనెలో కొన్ని ఆమ్లా ముక్కలను వేసి వేడి చేయండి. రెండు మూడు నిమిషాల తరువాత వెచ్చని నూనెని మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి ఒకటి లేదా రెండు గంటలు ఉంచి తల స్నానం చేయండి.
 • ఆమ్లా జ్యూస్ మరియు నిమ్మరసంను కలిపి షాంపూలాగా ఉపయోగించవచ్చు.
 • రెండు టేబుల్ స్పూన్ యూకలిప్టస్ నూనెలో ఆమ్లా ముక్కలను రాత్రంతా నానబెట్టండి. ఒక మందపాటి పేస్ట్ సిద్ధం చేయడానికి గుడ్డు మరియు పెరుగును ఈ మిశ్రమంలో కలుపుకోండి. ఈ పేస్ట్‌ని మీ స్కాల్ప్ మరియు జుట్టుపై పూర్తిగా అప్‌లై చేసి ఆరిపోయే వరకు వదిలివేయండి. ఆ తరువాత తేలిక పాటు షాంపూతో కడగాలి.

ఆవాల నూనె

ఆవాల నూనె మరియు హెన్నా ఆకులను కలిపి ఉడికించిన మిశ్రమం హెయిర్ ఫాల్ ని ఆపడానికి ఉపయోగపడుతుంది. 125 మి.లి ఆవాల నూనె మరియు 30 గ్రాముల గోరింటాకులను కలిపి బాగా వేడి చేయండి. చల్లారిన తరువాత నూనెని వడకట్టి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి.

ఈ నూనెతో రెగ్యులర్గా మసాజ్ చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది, అంతే కాదు మీ కురులు పెరుగుదలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

కలబంద

కలబంద హెయిర్ ఫాల్ ని తగ్గించి డాండ్రఫ్ ని తొలగిస్తుంది. మీ స్కాల్ప్ లో PH లెవెల్స్ ని కూడా రీస్టోర్ చేస్తుంది. కలబంద జెల్ ని డైరెక్ట్ గా మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి ఒక గంట సేపు తరువాత తల స్నానం చేయండి. ఇలా వారానికి 3 లేదా 4 సార్లు ఉపయోగించటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

కొబ్బరి పాలు

హెయిర్ ఫాల్ ని ఆపడానికి తలపై కొబ్బరి పాలను రాయడం ఒక ఉత్తమమైన హోమ్ రెమిడీ.

 • కొబ్బరి ముక్కలను బాగా రుబ్బి వాటి నుండి పాలను తీయండి. మీ స్కాల్ప్ మీద మరియు వెంట్రుకల మూలకాల పై అప్లై చేసి ఐదు నుండి పది నిమిషాలు మసాజ్ చేయండి. ఇది కేశాలకు పోషణ అందించి ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
 • నిమ్మరసంతో కలిపిన కొబ్బరి నూనెని స్కాల్ప్ మరియు కురులపై రాయటం వలన హెయిర్ ఫాల్ తగ్గి కురులు పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది.

కొత్తిమీర ఆకులు

కొత్తిమీర ఆకులను రుబ్బి వీటి రసాన్ని రెగ్యులర్గా స్కాల్ప్ పై రాయటం వలన హెయిర్ ఫాల్ తగ్గి మీ కేశాలు ఒత్తుగా పెరుగుతాయి. వారానికి మూడు సార్లు ఈ రసాన్ని ఉపయోగించవచ్చు.

ఆయిల్ మసాజ్

ఆరోగ్యకరమైన, బలమైన జుట్టుని పొందటానికి ఇది అత్యంత ప్రసిద్ధమైన గృహ నివారణలలో ఒకటి. సాధారణ కొబ్బరి నూనె, బాదం నూనె, ఆవాలు నూనె, లావెండర్ నూనె, రోజ్మేరీ వంటి అనేక చమురులు ఉన్నాయి.

ప్రతి నూనె కి దాని స్వంత ప్రయోజనం ఉంటుంది. మీ జుట్టుని ప్రతి రోజూ వీటిలో ఏదో ఒక నూనెతో మసాజ్ చేయండి. ఇది మీ కురులకు సంబంధించిన అనేక సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తుంది.

జీలకర్ర విత్తనాలు

జీలకర్ర పేస్ట్ తయారు చేయడానికి కొన్ని గింజలను రుబ్బి అందులో కొబ్బరి నూనెని కలపి ఒక పేస్ట్ ను తయారు చేసుకోండి. దానితో చక్కగా మీ స్కాల్ప్ పై మసాజ్ చేసుకోండి. సుమారు 15 నిమిషాల తరువాత, షాంపూతో తలస్నానం చేయండి.

ఎగ్ వైట్

గుడ్డు ప్రోటీన్ యొక్క ఉత్తమ మూలం. ఇది మీ జుట్టు యొక్క కోల్పోయిన షైన్ ని తిరిగి తెస్తుంది. పొడవాటి, బలమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం, మీ కురులపై గుడ్డు యొక్క తెల్ల సొనను పూసి కొద్ది సేపు తరువాత తల స్నానం చేయండి. వారానికి ఒకసారి ఈ ప్రక్రియను అనుసరించండి.

వేపాకు

మీ జుట్టుకు కావలసిన అన్ని పోషకాలు వేపాకులో ఉంటాయి. దీని లోని యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక లక్షణాలు మీ జుట్టులో స్ప్లిట్‌స్ ఏర్పడకుండా చేస్తుంది మరియు మీ స్కాల్ప్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొన్ని తాజా వేప ఆకులను నీటిలో వేసి బాగా ఉడికించండి.

నీరు సగానికి సగం ఇంకిపోయే వరకు ఉడికించండి. ఈ నీటిని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకొని మంచి ఫలితాల కోసం ప్రతి రోజూ మీ స్కాల్ప్ పై దరఖాస్తు చేయండి.

హెన్నా

హెన్నా యొక్క లక్షణాల గురించి అందరికీ తెలిసిందే. హెయిర్ ఫాల్, స్ప్లిట్‌ ఎండ్స్, డ్రైనెస్ వంటి అనేక హెయిర్ ప్రాబ్లమ్స్ ని తొలగించటంలో సహాయపడుతుంది. హెన్నా పేస్ట్ ని ప్రతి వారం వాడవచ్చు.

మీరు తాజా హెన్నా పేస్ట్ తో 2 టేబుల్ స్పూన్లు ఆమ్ల రసంను మరియు కొద్దిగా నీరు జోడించి అద్భుతమైన హెయిర్ ప్యాక్‌ని తయారుచేయవచ్చు.

ఒక బ్రష్‌ను ఉపయోగించి మీ జుట్టు మరియు స్కాల్ప్ పై ఈ పేస్ట్ ని దరఖాస్తు చేయండి. సుమారు ఒక గంట అలాగే ఉంచి మైల్డ్ షాంపూతో బాగా కడగాలి. ఈ పద్ధతిని వారానికి మూడుసార్లు ఫాలో చేయండి.

గమనిక : తెల్ల జుట్టు ఉన్నవారు హెన్నా పేస్ట్ ని వాడినట్లయితే మీ జుట్టు మెరూన్ రంగుకు మారుతుంది.

పెరుగు

పెరుగు జుట్టు రాలడాన్ని ఆపడం మాత్రమే కాదు మీ కేశాలను సిల్కీ, మెరిసే, మృదువైనవిగా కూడా చేస్తుంది. కర్డ్ ప్యాక్ తయారు చేయడానికి, పెరుగుని కొద్దిగా ఆవాల పేస్ట్‌తో కలపండి. పెరుగును హెన్నా ప్యాక్లలో కూడా ఉపయోగిస్తారు.

వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ ని ఉపయోగించవచ్చు. ఉపయోగించిన తర్వాత ఒక షాంపూతో తల స్నానం చేయటం మర్చిపోకండి.

ఆపిల్ సీడర్ వినిగర్

ఆపిల్ సీడర్ వినిగర్ ని కొద్దిగ నీలతో డైల్యూట్ చేసుకొని ప్రతి సారి మీరు తల స్నానం చేసే ముందు మీ కురులపై మరియు స్కాల్ప్ పై రాయండి. ఆపిల్ సీడర్ వినిగర్ యొక్క వాసనను తొలగించాలనుకుంటే కొద్దిగా రోజ్ మేరీ నూనెని కలుపుకోవచ్చు.

ద్రాక్ష గింజల నూనె

ఈ నూనె హెయిర్ ని కండీషన్, బలంగా చేస్తుంది. అంతే కాదు చుండ్రు, హెయిర్ ఫాల్ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. ద్రాక్ష విత్తనాల నూనెని తయారుచేయడానికి నీటిలో విత్తనాలను వేసి బాగా ఉడికించండి. ఇలా నీటిని మరిగించడం ద్వారా నూనెని సేకరించవచ్చు.

షికాకై

మార్కెట్లో షాపులు మరియు సబ్బులు అందుబాటులో లేని రోజుల్లో అందరూ షికాకైనే ఉపయోగించేవారు. వీటిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు పైగా కురులకు కావాలసిన అన్ని పోషకాలను అందిస్తుంది. దీని వలన మీ జుట్టు మందంగా పెరుగుతుంది. కనుక కెమికల్స్ తో కూడిన షాంపూలకు బదులుగా షికకైని ఉపయోగించటానికి ప్రయత్నించండి.

ఉల్లిపాయ రసం

మనలో చాలా మందికి ఇప్పటికీ ఉల్లిపాయ యొక్క ప్రయోజనాల గురించి తెలియదు. ఉల్లిపాయ నుండి రసంను తీసి, మీ జుట్టు మీద దరఖాస్తు చేసుకోవచ్చు. రాసిన 30 నిమిషాల తరువాత తల స్నానం చేయండి. ఇది మీ జుట్టు, స్కాల్ప్ మరియు జుట్టు వేర్లపై కూడా రాయండి.

ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి వెంట్రుకల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది చాలా ప్రభావితమైన ఒక రెమిడీ.

గ్రీన్ టీ

గ్రీన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందని అందరికీ తెలుసు. అలాగే హెయిర్ ఫాల్ ని తగ్గించడానికి గ్రీన్ టీ ని మీ జుట్టు మీద దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ మూలికా టీ జుట్టు యొక్క పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉత్తమమైన పదార్ధాలను కలిగి ఉంటుంది. మీరు గ్రీన్ టీ ఉపయోగించి జుట్టుని కడగవచ్చు లేదా ఈ టీ ని మీ జుట్టుకు మాస్క్ లాగా వాడవచ్చు.

ఆమ్లా, కలబంద, వేప

ఈ పదార్థాలు మీ హెయిర్ ఫాల్ ని తగ్గించడం మాత్రమే కాదు చుండ్రులను కూడా తొలగిస్తుంది. స్కాల్ప్ పై చికాకు మరియు దురదను కూడా తగ్గిస్తుంది.

అన్ని పదార్ధాలనూ సమాన భాగాలుగా తీసుకొని బాగా రుబ్బుకోవాలి. ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని తలపై రాసి ఒక గంట సేపు తరువాత తల స్నానం చేయండి. సమర్థవంతమైన ఫలితాల కోసం నెలకు రెండుసార్లు ఉపయోగించండి.

మెంతులు

మెంతులలో నికోటినిక్ ఆమ్లం మరియు జుట్టు పెరుగుదలకు కావలసిన ప్రోటీన్లు ఉంటాయి. మీ వెంట్రుకలను మృదువుగా చేయడానికి రాత్రిపూట విత్తనాలను నీటిలో నానబెట్టి ఉదయం పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ని మీ జుట్టు మీద రాసి ఒక గంటసేపు తర్వాత నీటితో కడగండి. సమర్ధమైన ఫలితాలకు వారానికి రెండుసార్లు ఉపయోగించండి.

లైకోరైస్ వేర్లు

ఇది హెయిర్ ఫాల్ ని తగ్గించడంతో పాటు స్కాల్ప్ ని మృదువుగా చేస్తుంది. పాలు లో లైకోరైస్ వేర్లను రాత్రంతా నానపెట్టి ఉదయం ఒక పేస్ట్ లా తయారు చేసుకొని మీ తలపై రాసి గంట తరువాత తలస్నానం చేయండి. ఈ పేస్ట్ ని రాత్రంతా తలపై ఉంచి ఉదయం కూడా కడగవచ్చు, లేదా మీరు మార్కెట్ లో దొరికే లికోరైస్ root టాబ్లెట్స్ ను కూడా ఉపయోగించవచ్చు.

మందార ఆకులు మరియు పువ్వులు

హైబ్బిస్కస్ ఆకులు హెయిర్ ఫాల్ ని నివారించడానికి మరియు జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. ఇది స్ప్లిట్‌ ఎండ్స్ మరియు చుండ్రుని కూడా నివారిస్తుంది.

 • కొంచం కొబ్బరి నూనెలో 12-15 మందార పువ్వులను వేసి బాగా వేడి చేయండి. చల్లారిన తరువాత ఈ నూనెని వడకట్టి రాత్రి  పడుకునే ముందు తలపై రాసి ఉదయం కడగాలి.
 • మందార ఆకులను రుబ్బి తల స్నానం చేసే ఒక గంట ముందు స్కాల్ప్ మరియు కురులపై రాయండి.

హెయిర్ ఫాల్ తగ్గడానికి తప్పకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

జుట్టు యొక్క ఆరోగ్యం కేవలం బాహ్య అనువర్తనాలపై ఆధారపడి ఉండదు, సరైన ఆహారం చాలా అవసరం. పోషకాలు, ప్రోటీన్లు మరియు విటమిన్లు కలిగి ఉన్న ఆహారాన్ని మీ డైట్ లో జోడించండి. విత్తనాలు, గింజలు, పండ్లు మరియు కూరగాయలు నుండి తయారు చేసిన ఆహారం జుట్టు పెరుగుదలకు ముఖ్యమైన పోషకాలు మరియు ప్రోటీన్లను అందిస్తుంది.

పాలు, ఈస్ట్, కాలేయం, తేనె, కూరగాయల నూనెలు, గోధుమ బీజాలు మరియు గుడ్లు వంటివి జుట్టు పెరుగుదలను పెంచుతాయి.

అవిసె గింజలు

ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇది మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు హెయిర్ ఫాల్ ని ఆపుతుంది. ఒక గ్లాసు నీటితో ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ ని తీసుకోండి. సూప్, స్మూతీస్ మరియు సలాడ్లలో కూడా దీన్ని చేర్చుకోవచ్చు.

బీట్ రూటు రసం

ఇందులో ఫాస్ఫరస్, కాల్షియం, ప్రోటీన్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు మరియు విటమిన్ బి మరియు సి సమృద్ధిగా ఉంటుంది. ఈ పోషకాలు జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. మీరు ప్రతిరోజూ బీట్ రూటు జ్యూస్ని త్రాగవచ్చు మరియు ఈ కూరగాయని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు

ఐరన్ రిచ్ ఆహారాలు హెయిర్ ఫాల్ ని తగ్గించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. శరీరంలో ఐరన్ లేకపోవడం అధిక హెయిర్ ఫాల్ కు కారణమవుతుంది. మీ రోజువారీ ఆహారంలో నల్లజాతి ముల్లంగి, ఆకుకూరలు, జీడి, డ్రై ఫ్రూట్స్, అత్తి పండ్లను మరియు బెర్రీలను చేర్చుకోండి. మాంసం మరియు పౌల్ట్రీ లో కూడా ఐరన్ ఉంటుంది.

పాలకూర

పాలకూరని ఉపయోగించి జుట్టు రాలడాన్ని నిరోధించవచ్చు. బచ్చలి కూర మరియు పాలకూర నుండి ఒక అర లీటర్ జ్యూస్ ని తయారు చేసి ప్రతి రోజూ త్రాగండి. ఇది మీ కురుల పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

ఒతైన కురుల కొరకు కొన్ని టిప్స్

 • చాలా సందర్భాలలో మన కురులలో స్ప్లిట్‌ ఎండ్స్ ఉండటం గమనించి ఉంటాము. కనుక ప్రతి 6 నుండి 8 వారాలకు ఒకసారి, మీ జుట్టు యొక్క టిప్స్ భాగాలను కత్తిరించాలి (ట్రిమ్ చేయాలి). స్ప్లిట్‌ ఎండ్స్ ని తొలగించటం ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది.
 • వేడి నీటి స్నానం వలన మీ జుట్టు యొక్క తంతువులు డీహైడ్రేట్ కావచ్చు. ఇది మీ స్కాల్ప్ నుండి సహజ నూనెలను తొలగిస్తుంది, మరియు మీ జుట్టు పొడిగా అవుతుంది. జుట్టుని శుభ్రపరచడానికి వెచ్చని నీటిని లేదా సాధారణ నీటిని ఉపయోగించండి.
 • తడిగా ఉన్నప్పుడు మీ జుట్టుని ఎప్పుడూ దువ్వ కూడదు. జుట్టు ఆరే వరకు ఆగి ఆ తరువాత మీకు కావలసిన హెయిర్ స్టైల్ చేసుకోండి.
 • ఈ రోజుల్లో మనం జుట్టు మీద సాధారణ నూనె రాయటం గురించి పూర్తిగా మర్చిపోయాము. కానీ జుట్టుకు నూనె రాయటం అవసరం. మనము జీవించటానికి ఆహారాన్ని తినే విధంగా;
 • మన జుట్టు మనుగడకు కూడా ఆహారం అవసరం. ఈ నూనె ప్రతి జుట్టు యొక్క మూలాలు లోకి వెళ్లి పోషణను అందిస్తుంది. కొబ్బరి, బాదం లేదా ఆలివ్ నూనెలు వంటి సహజ నూనెలను ఉపయోగించవచ్చు.
 • వారానికి రెండు సార్లు తప్పకుండా తల స్నానం చేయండి. ముఖ్యంగా ఎండా కాలంలో.
 • మీ హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ను సందర్శించండి.
 • యోగా మరియు మెడిటేషన్ చేయటం వలన హెయిర్ ఫాల్ కి కారణమైన మీ ఒత్తిడి తగ్గుతుంది.

హెయిర్ ఫాల్ సమస్యను నివారించే యోగాసనాలు

శరీరాన్ని ముందుకు వంచి చేసే యోగాసనాలు తల భాగానికి రక్తప్రసరణను అధికరిస్తుంది. దీని వలన జుట్టు కుదుళ్లు క్రమంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ క్రింది ఆసనాలు తప్పక ప్రయత్నించండి:

అదోముఖ శవాసనం

తలకు, రక్తప్రసరణను బాగా పెంచే ఈ ఆసనం సైనస్ వ్యాధికి, జలుబుకు కూడా మంచిది. హెయిర్ ఫాల్ సమస్యకు ముఖ్య కారణం అయిన మానసిక అలసట, వ్యాకులత, నిద్ర లేమిని తగ్గించటంలో కూడా సహాయపడుతుంది.

ఉత్థానాసనం

ఈ ఆసనం అలసటను తగ్గించటంలో సహాయపడుతుంది. స్త్రీలకు మెనోపాజ్ సమస్యలను తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

వజ్రాసనం

మిగిలిన ఆసనాలకు భిన్నంగా ఈ వజ్రాసనాన్ని భోజనం చేసిన తరువాత కూడా వేయవచ్చు. ఈ ఆసనం హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయటంతో పాటు మూత్రాశయంలో సమస్యలను పరిష్కరిస్తుంది. బరువు తగ్గటంలో సహాయపడటంతోపాటు జీర్ణవ్యవస్థను మెరుగు పరిచి కడుపులో గ్యాస్ ను తగ్గిస్తుంది.

అపానాసనం

జీర్ణవ్యవస్థలో ఉండే ప్రాణశక్తికి అపానం అని పేరు. అపానాసనం మన శరీరంలోని విషాలను తొలగించటంలో సహాయపడుతుంది. బుద్ధికి స్పష్టత చేకూరుస్తుంది. మలబద్ధకంనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

పవనముక్తాసనం

కడుపులో వాయువును (గ్యాస్ ను) తగ్గిస్తుంది, జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వెన్నెముక క్రిందిభాగంలోని కండరాలు శక్తివంతం అవుతాయి. ఉదర భాగంలో, పిరుదులలోని కొవ్వును తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగు పరిచి హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తుంది.

సర్వాంగాసనం

థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా ఊపిరితిత్తులు, అన్నవాహిక, జననేంద్రియాలు, నాడీ వ్యవస్థలు ఆరోగ్యంగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.

కపాలభాతి ప్రాణాయామం

కపాలభాతి ద్వారా మెదడులోని కణాలకు మరింత ప్రాణవాయువు అందుతుంది. ఆ విధంగా ఇది నాడీ వ్యవస్థకు చాలా మంచిది. శరీరంలోని విషపదార్థాలను నిర్మూలించి, స్థూలకాయం, మధుమేహాలను తగ్గించటంలో సహాయపడుతుంది.

భస్త్రిక ప్రాణాయామం

శరీరంలో అధికంగా ఉన్న వాత, పిత్త, శ్లేష్మాలను తొలగించటం ద్వారా నాడీవ్యవస్థను శుద్ధి చేస్తుంది. తద్వారా అనేక వ్యాధులను నివారిస్తుంది.

నాడీశోధన ప్రాణాయామం

గుండె సంబంధిత వ్యాధులను, ఆస్త్మా, కీళ్ల నొప్పులు, కుంగుబాటు, మైగ్రెయిన్, మానసిక ఒత్తిడి, కంటి, చెవులకు సంబంధించిన వ్యాధులను తగ్గించటంలో సహాయపడుతుంది.

Posted on

Onion juice for hair growth in Telugu – బట్ట తల పై జుట్టు పెరుగుటకు ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలి?

జుట్టు పాపడి వద్ద పలుచబడుతోందా? మీ మాడు పై బట్టతల ప్యాచెస్ ఏర్పడుతున్నాయా? ఒక వయసు తరువాత (వృధాప్యంలో) ఇలాంటి సమస్యలు ఏర్పడితే పెద్ద సమస్యగా అనిపించదు కానీ యవ్వనంలోనే ఇలాంటి సమస్యలు ఎదురైతే! వీటితో పాటు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. పబ్లిక్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

బాల్డ్ ప్యాచెస్ కనపడకుండా ఉండేందుకు మరియు పలుచబడిన జుట్టు ఒత్తుగా కనిపించేలా చేసేందుకు ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ ని ట్రై చేస్తాము. అంతేకాదు, ఈ సమస్యను ట్రీట్ చేసేందుకు ఎన్నో ఖరీదైన నూనెలను మరియు ట్రీట్‌మెంట్లను ట్రై చేసి ఉంటాము.

కానీ ఎక్కువ ఖర్చు లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొన్ని ఉత్తమ హోమ్ రెమిడీస్ ని ఉపయోగించి ఈ సమస్యను క్యూర్ చేయవచ్చు. మరి ఈ సమస్యలకు కారణాలు ఏంటి? ఈ సమస్యలను ట్రీట్ చేసేందుకు ఉల్లిపాయతో తయారు చేసుకొనే ఉత్తమ హోమ్ రెమిడీస్ గురించి తెలుసుకుందాం. మరియు బట్టతల యొక్క  వైద్య చికిత్సల గురించి కూడా ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

బట్టతల

బట్టతల వంశపారంపర్యంగా వచ్చే సమస్య. జన్యు ప్రభావాలతో హార్మోన్లు అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. అందుకే దీన్ని ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అని అంటారు. ఒకప్పుడు 40 ఏళ్ల తర్వాత మొదలయ్యే బట్టతల సమస్య ప్రస్తుత కాలంలో 20 ఏళ్లలోనే మొదలవుతోంది. జన్యువులు త్వరగా వ్యక్తీకరణ కావటం ఇందుకు దోహదం చేస్తోంది.

మన ఆహార అలవాట్లు మారటం, పెరుగుతున్న కాలుష్యం లాంటి విషయాలు దీనికి పురికొల్పుతున్నాయి. తండ్రి, తాతలకు బట్టతల ఉంటేనే తర్వాతి తరానికి వస్తుందని కొందరు భావిస్తుంటారు. తల్లి, అమ్మమ్మలకు బట్టతల ఉన్నా వారి వంశావళిలోని వారసులకు రావొచ్చు.

తండ్రికి, తల్లికి ఇద్దరికీ బట్టతల ఉంటే మరింత త్వరగా వచ్చే అవకాశముంది. సాధారణంగా బట్టతల మగవారికే వస్తుందని భావిస్తుంటారు, కానీ ఆడవారికి కూడా వస్తుంది. కాకపోతే వేరుగా ఉంటుంది. మగవారిలో ఆయా భాగాల్లో జుట్టు మొత్తం ఊడిపోతే, ఆడవారిలో మధ్యమధ్యలో వెంట్రుకలు ఊడిపోయి, జుట్టు పలుచగా అవుతుంది.

మగవారిలో కణతల దగ్గర్నుంచి వెంట్రుకలు ఊడిపోవటం మొదలై క్రమంగా నుదురు మీది వరకు ‘ఎం’ ఆకారంలో వెంట్రుకలు రాలిపోతుంటాయి. కొందరికి కేవలం మాడు మధ్యలో గుండ్రంగా జుట్టు మొత్తం పోవచ్చు. తల వెనక భాగంలోని వెంట్రుకలు బలంగా ఉంటాయి. ఇవి త్వరగా ఊడిపోవు. అందుకే చాలామందిలో తల వెనక గుర్రపు నాడా ఆకారంలో జుట్టు రాలిపోకుండా ఉంటుంది.

బాల్డ్ ప్యాచెస్ మరియు థిన్ హెయిర్ సమస్య యొక్క కారణాలు

 • వీటికి ముఖ్య కారణం ఐరన్, సల్ఫర్ మరియు విటమిన్ ల యొక్క లోపం.
 • ఇన్ఫెక్షన్ లేదా జన్యు కారణాల వాళ్ళ కూడా కావచ్చు.
 • ప్రస్తుత కాలంలో అధికరిస్తున్న కాలుష్యం కూడా ఒక ముఖ్య కారణం. కాలుష్యం మరియు చెమట వలన స్కాల్ప్ పై మురికి పేరుకుపోయి హెయిర్ ఫాల్ కి దారి తీస్తుంది.
 • అధిక ఒత్తిడి మరియు మారిపోయిన జీవనశైలి.

హెయిర్ గ్రోత్ మరియు బాల్డ్ హెడ్ చికిత్సకు ఉల్లిపాయలు ఎలా ఉపయోగపడతాయి?

మనకు ఇష్టమైన వంటకాల్లో ఉల్లిపాయలను చేర్చుకుంటాం. ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు గురించి మన అందరికీ బాగా తెలుసు. కానీ ఉల్లిపాయలు జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుందన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకు కారణం ఉల్లిపాయ యొక్క వాసన. ఉల్లిపాయల యొక్క వాసన నచ్చనందున బ్యూటీ టిప్స్ కి దీన్ని చాలా అరుదుగా ఉపయోగిస్తారు.

2002 లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ లో ప్రచురించబడిన ఒక పత్రికలో ‘అలోపీశియా ఏరియేట’ అనే ఒక రకమైన బట్ట తలను పోగొట్టడంలో ఉల్లిపాయ యొక్క సామర్థ్యం రుజువైంది. దీనిపై తదుపరి పరిశోధనలు కూడా ఉన్నాయి, అన్ని పరిశోధనలూ దీని ప్రభావాన్ని గుర్తించాయి.

ఉల్లిపాయ ఒక యాంటీ బాక్టీరియల్, యాంటీ పారాసిటిక్ మరియు యాంటీ ఫంగల్ ఏజెంట్. ఇది స్కాల్ప్ పై ఎలాంటి సంక్రమణం కూడా ఏర్పడకుండా శుభ్రంగా ఉంచడానికి అత్యంత ప్రభావితంగా పనిచేస్తుంది. చుండ్రుని కూడా తొలగిస్తుంది. వాటితో పాటు జుట్టు మూలాలను శుభ్రపరచి మాడును ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.

మన శరీరంలో ముఖ్యమైన ఆధార మూలకాల్లో ఒకటి సల్ఫర్. వెంట్రుకలు, గోర్లు మరియు చర్మంలో సల్ఫర్ ప్రధానంగా ఉంటాయి. ఉల్లిపాయలలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది స్కాల్ప్ పై వాపు మరియు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది మరియు జుట్టు ఫోలికల్స్ ని ఉత్తేజ పరుస్తుంది.

జుట్టు మూలాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ చేరడం ద్వారా సంభవించే ఆక్సిడేటివ్ ఒత్తిడి తరచుగా జుట్టు సన్నబడటానికి కారణమవుతుంది మరియు సహజమైన యాంటీ ఆక్సిడెంట్లను తగ్గించి అకాలంలో తెల్ల జుట్టు వచ్చేలా చేస్తుంది. ఉల్లిపాయ రసం స్కాల్ప్ పై కెటలాస్ (ఒక రకమైన ఎంజైమ్) స్థాయిని పెంచుతుంది, ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ సన్నాహాన్ని నియంత్రిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఉల్లిపాయలు హెయిర్ ఫోలికల్స్ కు పోషణను అందించగలుగుతుంది కనుక పురుషులలో జన్యుపరమైన కారణాల వలన ఏర్పడిన బాల్డ్ ప్యాచెస్ ని కూడా ట్రీట్ చేసేందుకు సహాయపడుతుంది.

జుట్టు సమస్యలను నివారించడంలో ఉల్లిపాయల యొక్క ఉపయోగాలను తెలుసున్నారు కదా! మరి ఎలా ఉపయోగించాలి అన్న వివరాలను తెలుసుకుందాం రండి.

ఉల్లిపాయ రసం ని తయారు చేసే విధానం

మీ కురులకు సరిపడేన్ని ఉల్లిపాయలను తీసుకొని తోలు తీసి శుభ్రమైన నీళ్లతో కడగాలి. ఆ తరువాత ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్ లో వేసి 2 నిమిషాల పాటు రుబ్బాలి. కావల్సినంత నీళ్లను చేర్చుకొని రుబ్బుకోవచ్చు.

రుబ్బిన ఉల్లిపాయలను ఫిల్టర్ లో లేదా శుభ్రమైన కాటన్ వస్త్రంలో గాని వేసి పిండితే ఉల్లిపాయ రసం రెడీ అవుతుంది. లేదా ఉల్లిపాయను గ్రేట్ చేసి వాటిని పిండి కూడా రసం తయారు చేసుకోవచ్చు. జుట్టుపై వాడేటప్పుడు ఎల్లప్పుడూ తాజా ఉల్లిపాయ రసం ని మాత్రమే ఉపయోగించాలి.

ఉల్లిపాయ రసం తయారు చేసుకున్న తరువాత హెయిర్ ఫాల్ మరియు బాల్డ్ ప్యాచెస్ ని తొలగించేందుకు క్రింద చెప్పిన అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.

ఉల్లిపాయ రసంను ఉపయోగించే సులభమైన పద్ధతులు

వట్టి ఉల్లిపాయ రసం

అవును, వట్టి ఉల్లిపాయ రసాన్ని మీ స్కాల్ప్ పై డైరెక్ట్ గా అప్‌లై చేయవచ్చు. మీ చేతి వేలతో స్కాల్ప్ పై రాసి ఆ తరువాత జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పూర్తిగా రాయండి. బాల్డ్ ప్యాచెస్ మరియు థిన్ హెయిర్ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో గ్యాప్ లేకుండా రాయాలి. బాగా రాసిన తరువాత గంట సేపు ఉంచి నీటితో లేదా మైల్డ్ షాంపూ తో కడగాలి.

గమనిక : ఉల్లిపాయ రసం ఉపయోగించిన తర్వాత కెమికల్స్ అధికంగా ఉండే షాంపూ ను ఉపయోగించకండి. మైల్డ్ లేదా హెర్బల్ షాంపూ ను ఉపయోగిస్తే మంచిది.

ఉల్లిపాయ రసం మరియు తేనె

తేనెలో అనేక ఔషధ గుణాలున్నాయని మన అందరికీ తెలిసిందే. ఇది చర్మం మరియు కేశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించటానికి కూడా సహాయపడుతుంది.

ఒక కప్పు ఉల్లిపాయ రసం లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి స్కాల్ప్ మరియు కురుల పై రాయండి. రాసిన తరువాత స్కాల్ప్ పై 10 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి మంచి నీటితో లేదా మైల్డ్ షాంపూ తో తల స్నానం చేయండి.

ఉల్లిపాయ రసం మరియు కలబంద

జుట్టు పెరుగుదలను ప్రేరేపించేందుకు మరియు జుట్టు రాలడాన్ని నియంత్రించేందుకు కలబంద ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తాజాగా తయారు చేసిన ఒక కప్పు ఉల్లిపాయ రసం లో ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జుని కలిపి స్కాల్ప్ మరియు కురులపై రాయండి. బాగా అప్‌లై చేసినట్టు నిర్ధారించుకోండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి మంచి నీటితో లేదా తేలిక పాటు షాంపూ తో తల స్నానం చేయండి.

ఉల్లిపాయ రసం మరియు ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ ని జోడించడం వలన ఉల్లిపాయ రసం యొక్క ప్రభావాన్ని అధికరిస్తుంది. ఒక కప్పు ఉల్లిపాయ రసం లో రెండు టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెని కలిపి స్కాల్ప్ మరియు కురుల పై రాయండి. రాసిన తరువాత మాడు పై 10 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి నీటితో లేదా తేలిక పాటు షాంపూ తో తల స్నానం చేయండి.

ఉల్లిపాయ రసం మరియు రోస్ మేరీ ఆయిల్

రోస్ మేరీ ఆయిల్ హెయిర్ ఫాల్ ని నియంత్రించి కురులు ధృఢంగా పెరిగేందుకు సహాయపడుతుంది. మీకు ఉల్లిపాయల వాసన నచ్చకపోతే ఈ రెమిడీ ని ఫాలో అవ్వండి. ఒక కప్పు ఉల్లిపాయ రసం లో 10-15 చుక్కల రోస్ మేరీ నూనెని వేసి బాగా కలపండి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై రాసి బాగా మర్దన చేయండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి నీటితో లేదా తేలిక పాటు షాంపూ తో తల స్నానం చేయండి. రోస్ మేరీ ఆయిల్ ఉల్లిపాయల యొక్క వాసనను తగ్గిస్తుంది.

ఉల్లిపాయ మరియు రమ్

ఉల్లిపాయ యొక్క వాసన నచ్చని వారికి ఈ రెమిడీ ఎంతో ఉత్తమంగా ఉంటుంది. ఒక ఉల్లిపాయ తోలు వొలిచి చిన్న ముక్కలుగా చేసుకొని ఒక కప్పు రమ్ము లో నానబెట్టండి. ఈ మిశ్రమాన్ని ఒక గట్టి కంటైనర్ లో మూసి ఒక రోజంతా రూమ్ టెంపరేచర్ లో నానబెట్టండి. ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.

ఒక రోజు తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టి స్కాల్ప్ పై రాసి మసాజ్ చేసి గంట తరువాత తల స్నానం చేయండి. ఉల్లిపాయల యొక్క శాతం ఇందులో తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మిశ్రమాన్ని ఉపయోగించటం వలన హెయిర్ సమస్యలపై ప్రభావం తక్కువగానే ఉంటుంది.

హెయిర్ ఫాల్‌ను నియంత్రించడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉల్లిపాయ రసం యొక్క సామర్ధ్యం మన అందరికీ బాగా తెలిసిందే. జుట్టు సమస్యల నుండి మీరు బాధ పడుతున్నట్లయితే పై చెప్పిన రెమిడీస్ ని ప్రయత్నించండి.

అయితే, వాటి యొక్క ఫలితాలు వ్యక్తిగత శారీరక స్వభావాన్ని బట్టి ఉంటుంది. కనుక రెగ్యులర్ గా ఆనియన్ రెమిడీస్ ని ఉపయోగించినప్పటికీ వెంటనే ఫలితాలు కనిపించకపోతే నిరాశ చెందకండి. ఈ రెమిడీలను కనీసం వారానికి 3 సార్లు 2 నెలల పాటు ఉపయోగిస్తే తప్పుకుంటా మీ జుట్టు పెరుగుదలలో మార్పులను చూడవచ్చు.

బట్టతల సమస్యకు చికిత్సలు

బట్టతల సమస్య కారణాలను తెలుసుకునేందుకు ముందుగా జుట్టు తీరు తెన్నులను, ఇతరత్రా సమస్యలను విశ్లేషించి సమస్యలను గుర్తిస్తారు. అవసరమైతే టైక్రోగ్రామ్ పరీక్ష చేస్తారు. చిన్న చర్మం ముక్క తీసి పరీక్షిస్తారు (బయాప్సీ). ఫంగస్ ఆనవాళ్లను తెలుసుకోవటానికి స్క్రేపింగ్ చేస్తారు. సమస్యను గ్రహించిన తరువాత సమస్యను బట్టి క్రింది చికిత్సలలో ఒక దానిని చేస్తారు.

మందులు

మామూలు సమస్యలతో  జుట్టు ఊడుతున్న వారికి సమస్యకు తగిన లోషన్లతో పాటు ఐరన్, బి విటమిన్లు, విటమిన్ డి3 ని అందిస్తారు. ఈ చికిత్స కొరకు తీసుకునే మందులను డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి.

ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ

ఇందులో ఆయా వ్యక్తుల రక్తాన్ని తీసి, ప్లేట్లెట్లు అధికంగా ఉండే ప్లాస్మా ద్రవాన్ని వేరు చేసి, ఇంజెక్షన్ సాయంతో మాడుపై ఎక్కిస్తారు. ప్లేట్లెట్లలోని వృద్ధి కారకాలు వెంట్రుకలు పెరిగేలా చేస్తాయి.

మూలకణ చికిత్స

ఇందులో వెంట్రుకల కుదుళ్లను ప్రయోగశాలలో వృద్ధి చేసి మూలకణాలను సేకరిస్తారు. ఆ తరువాత వీటిని తలపై ప్రవేశపెడతారు. దీంతో వెంట్రుకలు వృద్ధి చెందుతాయి.

స్వల్ప లేజర్ కాంతి చికిత్స

లేజర్ కాంతితో వెంట్రుకల వృద్ధి కారకాలు ఉత్తేజితం అవుతాయి. దీంతో వెంట్రుకలు పెరుగుతాయి.

బట్ట తలకు శాశ్వత పరిష్కారం – జుట్టు మార్పిడి!

బట్టతలకు ఇతరత్రా చికిత్సలు, పద్ధతులేవైనా తాత్కాలికమే. ఉత్తమమైన, శాశ్వతమైన పరిష్కారం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఇందులో తలలో ఒక చోట ఉన్న వెంట్రుకలను తీసి బట్టతల ఉన్న భాగంలో నాటుతారు. సాధారణంగా తల వెనక ఉన్న వెంట్రుకలను నాటుతారు.

అవసరమైతే గడ్డం, ఛాతీ వంటి భాగాల నుంచి తీసి తలపై అమర్చొచ్చు. బట్టతల మామూలుగా ఉన్నట్టయితే ఒక రోజులోనే ప్రక్రియ పూర్తవుతుంది. మరీ ఎక్కువగా ఉంటే నెల తర్వాత మరోసారి నాటాల్సి ఉంటుంది. మన వెంట్రుకలు ఒక వైపునకు వాలి ఉంటాయి.

నాటేటప్పుడూ అలాగే అమర్చుతారు. దీంతో సహజంగా కనిపిస్తుంది. తల వెనుక భాగంలో జుట్టు ఎంతో బలంగా ఉంటుంది కనుక అక్కడ నుండి తీసి నాటిన చోట కూడా జుట్టు బలంగా పెరుగుతుంది. చికిత్స అనంతరం జుట్టు త్వరగా, మందంగా పెరగటానికి మందులను ఉపయోగించాల్సి ఉంటుంది.

ట్రాన్స్‌ప్లాంటేషన్ యొక్క పద్ధతులు

స్ట్రిప్ (ఎఫ్యూటీ) పద్ధతి

ఇందులో ఒక్కొక్క వెంట్రుకను తీసి బట్టతల మీద నాటుతారు. తల వెనక ఆక్సిపిటల్ భాగంలో వెంట్రుకలు ఉన్నచోట సుమారు 5-15 సెంటీమీటర్ల చర్మం ముక్కను కత్తిరించి, పక్కన పెడతారు. కుట్లు వేసి కోతను మూసేస్తారు. తర్వాత పక్కన పెట్టిన చర్మంలోని వెంట్రుకలను ఒక్కొక్కటిగా తీసుకొని బట్టతల ఉన్న చోట నాటుతారు.

ఎఫ్యూఈ (ఫాలిక్యులార్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్) పద్ధతి

వెంట్రుకల కుదుళ్లను విడివిడిగా నాటడం దీని ప్రత్యేకత. మన వెంట్రుకల కుదుళ్లలో 2-5 వెంట్రుకలు గుంపుగా ఉంటాయి. ఇలాంటి గుంపులను అక్కడక్కడ్నుంచి తీసి, ప్రత్యేక ద్రవంలో భద్రపరుస్తారు. అనంతరం బట్టతల ఉన్న చోట అమరుస్తారు.

ఇందులో చర్మాన్ని కత్తిరించటమనేది ఉండదు. అందువల్ల మచ్చ పడదు. నొప్పి తక్కువ. ప్రస్తుతం రోబోటిక్ పద్ధతిలోనూ దీన్ని చేస్తున్నారు. అవసరమైతే కొందరికి ఈ రెండు పద్ధతులతోనూ వెంట్రుకలను నాటుతారు.

Posted on

Benefits of neem oil in Telugu – అందం కోసం వేప నూనె ని ఎలా ఉపయోగించాలి?

ప్రతి ఒక్కరూ అందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. అందం మరియు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి వ్యక్తిగత సంరక్షణ చాలా అవసరం. రోజువారీ సంరక్షణ అనగానే మనకు తోచే మొదటి విషయం ఆయుర్వేదం. మన భారతదేశం ఆయుర్వేదం లో ఎంతో ప్రఖ్యాతి చెందిన దేశం. ఎన్నో మూలికలు లభించే దేశమిది. ప్రతి చెట్టు, వాటి యొక్క ఆకులూ మరియు కొమ్మల్లో ఉండే ఔషధ గుణాలు తెలిసిన వాళ్ళు ఎందరో ఉండే వారు. ఇంగ్లీష్ మందులు సులభంగా లభించటం వలన కాలం మారే కొద్ది ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. కానీ అటువంటి పరిస్థితులు మారి ప్రస్తుత జనరేషన్ లోని యువతీ యువకులు మన ప్రాచీన పద్ధతులను అనుసరించటం మల్లీ మొదలు పెట్టారు.

మన ఆయుర్వేదంలో ఆరోగ్యం కొరకు అలాగే సౌందర్యం కొరకు ప్రసిద్ధి చెందిన మూలికల్లో ఒకటి ‘వేప’. అమ్మమ్మలు తాతయ్యలు ఉన్న కాలంలో వేప చెట్టు లేని వీధి ఉండేది కాదు. ప్రస్తుత కాలంలో కూడా ఎన్నో గ్రామాలలో వీధికి కనీసం ఒక వేప చెట్టుని చూస్తూనే ఉంటాము. మన తెలుగు సంప్రదాయంలో వేపాకు చెట్టు అనగానే గుర్తొచ్చేది ఉగాది. ఉగాది పచ్చడి చేసేందుకు వేప పూలను ఉపయోగిస్తాం. మన పూర్వీకులు వేప పూలనే కాదు వేప ఆకులూ మరియు చిన్న చిన్న వేప కాడలను కూడా ఉపయోగించేవారు. వీటిని ఉపయోగించటం వలన ఎంతో ధృఢంగా ఆరోగ్యంగా మరియు అందంగా ఉండేవారు. వేపాకులను ఇన్ఫెక్షన్, అమ్మోరు వంటి అనేక వైద్యాలకు ఉపయోగిస్తారన్న విషయం మన అందరికీ తెలిసిందే. వేప నుండి తయారు చేసిన నూనె ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తోంది. మరి మన ఆరోగ్యం మరియు అందం యొక్క సంరక్షణ కొరకు వేప చమురు ఎలా ఉపయోగపడుతుందో ఈ వ్యాసం లో వివరంగా తెలుసుకుందాం.

అందం సంరక్షణ కోసం వేప నూనె

 1. బ్లాక్ హెడ్స్ తొలగించేందుకు : వేప నూనె ని రెగ్యులర్ గా ఉపయోగిస్తే బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ను తొలగించి, తిరిగి రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
  ప్రక్రియ : కొంత నీటిలో కొన్ని చుక్కల వేప నూనె ని కలిపి డైల్యూట్ చేసుకోవాలి. మృదువైన చర్మం పొందేందుకు రోజుకు ఒకసారి బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ పై రాయండి.
 2. వేప నూనె తో మొటిమలు తగ్గించండి : వేప నూనె లో ఫ్యాటీ ఆసిడ్స్ మరియు ఆస్పిరిన్ సమ్మేళనాలు ఉంటాయి. అవి మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి.
  ప్రక్రియ : మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకొని కొన్ని చుక్కల వేప నూనెని మీ ముఖంపై దరఖాస్తు చేసుకోండి. మొటిమలను తగ్గించడానికి రోజుకు రెండు సార్లు రాసుకోవచ్చు.
 3. హైపర్-పిగ్మెంటేషన్ ని తగ్గించేందుకు వేప నూనె : చర్మంలో నలుపు రంగును ఉత్పత్తి చేసే మెలనిన్ యొక్క ఉత్పత్తిని వేప నూనె ఆపుతుంది. తద్వారా హైపర్-పిగ్మెంటేషన్ ని తొలగిస్తుంది.
  ప్రక్రియ : ముఖాన్ని శుభ్రం చేసుకుని వేప నూనెని క్రమం తప్పకుండా రాయటం వలన హైపర్-పిగ్మెంటేషన్ పై మెరుగైన ప్రభావం చూపుతుంది.
 4. ముడతలను వదిలించుకోడానికి వేప : చర్మం పై ఏర్పడే ముడతలను తొలగించటానికి వేప నూనె సహాయ పడుతుంది. ఇది చర్మం యొక్క రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
  ప్రక్రియ : ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు వేప నూనెని ముడతలపై రాయటం మర్చిపోకండి.
 5. యాంటీ ఏజింగ్ సీరం : చర్మం యొక్క సౌందర్యాన్ని కాపాడి మడతలు మొదలైన ఏజింగ్ లక్షణాలను తగ్గించేందుకు అవసరమైన సమ్మేళనాలు వేప నూనె లో ఉంటాయి.
  ప్రక్రియ : మీరు ఉత్తమ ఫలితాన్ని పొందేందుకు ప్రతి రోజు వేప నూనెని నైట్ క్రీం వలే ఉపయోగించండి.

చర్మ సంరక్షణ కోసం వేప నూనె

 1. రింగ్ వార్మ్ చికిత్స : వేప నూనె లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ వల్ల సంభవించే తమర చికిత్సకు ఒక అద్భుతమైన పరిహారం. ఈ చికిత్స కొరకు వేప నూనెతో పాటు వేప గింజలు మరియు ఆకుల సారాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు.
  ప్రక్రియ : కొన్ని చుక్కల వేప నూనె లేదా ఆకులు మరియు విత్తనాల యొక్క సారం ని పత్తి సాయంతో ప్రభావిత ప్రాంతంపై రోజుకు 2-3 సార్లు దరఖాస్తు చేయండి.
 2. ఇన్ఫెక్షన్ గల గోరులను క్యూర్ చేసేందుకు : ఒరేగానో నూనెతో పాటు వేప నూనెని ఉపయోగించటం వలన ఇన్ఫెక్షన్ సోకిన గోర్లు లేదా దురదగా ఉండే కాలి వేళ్ళు నయం అవుతాయి.
  ప్రక్రియ : వేప నూనె మరియు ఒరేగానో నూనె ని సమాన భాగాలుగా కలుపుకోండి. బాగా కలిపిన తరువాత ఇన్ఫెక్షన్ సోకిన చర్మం మరియు గొర్ల పై దరఖాస్తు చేసుకోవాలి. ఇలా రోజుకు 2-3 సార్లు రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
 3. ఫైన్ లైన్స్ తగ్గించేందుకు వేప నూనె : చర్మం పై ఫైన్ లైన్స్ ని తగ్గించి, మృదువైన, ఆకర్షణీయమైన చర్మాన్ని పొందటానికి వేప నూనెని ఉపయోగించవచ్చు.
  ప్రక్రియ : రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల వేప నూనెని చర్మం పై రాసి మసాజ్ చేయండి. ప్రతి రోజు ఈ నూనెని రాయటం వలన మంచి ఫలితం ఉంటుంది.
 4. చర్మ వ్యాధుల చికిత్స కొరకు వేప నూనె : వేప నూనె లో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి కనుక ఇది దాదాపు అన్ని రకాల చర్మ సమస్యలతో పోరాడుతుంది.
  ప్రక్రియ : ఎలాంటి చర్మ సమస్యనైనా గుణ పరిచేందుకు ప్రతి రోజు వేప నూనెని రాయండి. పూర్తిగా నయం అయ్యే వరకు రోజుకు కనీసం 2 సార్లు రాయండి.
 5. గజ్జిని తగ్గించేందుకు వేప నూనె : వేప నూనె సహాయంతో మీ గజ్జి సమస్యను తగ్గించగలరు.
  ప్రక్రియ : గజ్జి ఉన్న ప్రాతంపై వేప నూనెని రోజుకు కనీసం 2-3 సార్లు రాయండి.
 6. చర్మం యొక్క ఎలాస్టిసిటీ ని మెరుగుపర్చేందుకు వేప నూనె :  విటమిన్ ఇ మరియు ఫ్యాటీ ఆసిడ్స్ అనే రెండు ప్రధాన పదార్ధాలు నీమ్ ఆయిల్ లో ఉన్నాయి. ఇది చర్మం యొక్క ఎలాస్టిసిటీ ని పెంచి మాయిశ్చర్ ని రీటైన్ చేస్తుంది.
  ప్రక్రియ : మంచి ఫలితాలను చూడడానికి వేప నూనె లేదా వేపాకు యొక్క సారం ని రోజుకు రెండు సార్లు రాయండి.
 7. చర్మం పై చిన్న గాయాలకు చికిత్స చేయడానికి : వేప నూనెలో లభించే క్రిమినాశక మరియు శోథనిరోధక లక్షణాలు చర్మ గాయాలను చికిత్స చేయడానికి సహాయపడుతుంది.
  ప్రక్రియ : గాయమైన చర్మంపై వేప నూనె లేదా నున్నటి వేపాకు పేస్ట్ ని అప్‌లై చేయండి. రోజుకు రెండుసార్లు రాయటం వలన మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు సంరక్షణ కోసం వేప నూనె

ప్రతి ఒక్కరూ అందమైన, ఆరోగ్యమైన మెరిసే కురులు పొందాలని ఆరాటపడతారు. అలాంటి అందమైన కేశాలను పొందేందుకు వేప నూనె ఎంతో సహాయ పడుతుంది. మరి వేప నూనెని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

 1. అకాలంలో వెంట్రుకలు నెరవడాన్ని ఆపుతుంది : హార్మోన్ల మార్పుల వలన ఏర్పడే తెల్ల జుట్టుని గమనిస్తే వేప నూనెని ఉపయోగించి ఉపశమనం పొందగలరు.
  ప్రక్రియ : ప్రతి రోజు వేప నూనెని రాయటం అలవాటు చేసుకోండి. ఈ నూనెని రాయటం వలన తెల్ల జుట్టుని నివారించి పోషణ అందిస్తుంది.
 2. స్కాల్ప్ కి పోషణ అందించేందుకు వేప నూనె : నీమ్ ఆయిల్ లో మీ స్కాల్ప్ కి పోషణ అందించి కురులు ఆరోగ్యంగా మరియు మృదువుగా పెరగటానికి సహాయపడే ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి.
  ప్రక్రియ : వేప నూనెతో మీ స్కాల్ప్ ని మసాజ్ చేయండి మరియు జుట్టు మొత్తం రాసి రాత్రంతా వదిలేయండి. ఉదయం తేలికపాటు షాంపూతో తల స్నానం చేయండి.
 3. దురద నుండి ఉపశమనం కొరకు వేప నూనె : డాండ్రఫ్ వలన స్కాల్ప్ పై దురద మరియు మంట ఏర్పడుతుంది. వేప నూనెని ఉపయోగించి దురద చర్మాన్ని వ్యవహరించడం మంచిది.
  ప్రక్రియ : వేప చమురును మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి తల స్నానం చేయొచ్చు. లేదా వారానికి రెండు సార్లు రాత్రి పడుకునే ముందు తలపై రాసి ఉదయం తల స్నానం చేయండి. వేపాకుతో తయారు చేసుకునే హెయిర్ ప్యాక్ ని కూడా స్కాల్ప్ మరియు జుట్టు పై రాసి గంట సేపు తరువాత తల స్నానం చేయొచ్చు.

చర్మం, జుట్టు, అందం మరియు ఆరోగ్యం వంటి పలు సమస్యలను నివారించగల సామర్ధ్యం వేపలో ఉంటుంది. అన్ని రకాల సమస్యలను తొలగించేందుకు వేప యొక్క సారాన్ని ఉపయోగించి తయారు చేసే ఉత్పత్తులను కూడా మీరు ఉపయోగించవచ్చు. పై చెప్పినటువంటి ప్రయోగాలకు వేప నూనె లేదా వేపాకు సారాన్ని లేదా వేప ఉత్పత్తులను ఉపయోగించి మంచి ఫలితాలను పొందండి.

Posted on

Telugu tips to get black hair – సహజమైన నల్లని వెంట్రుకల కొరకు హోం రెమెడీస్

కురులు అనగానే మనకు గుర్తుకు వచ్చే రంగు నలుపు. నల్లని కురులు ఒక ప్రత్యేకమైన అందం కలిగి ఉంటుంది. నల్లని రంగుతో పాటు మీ జుట్టు సిల్కీగా ఉంటే ఇక ఏమాత్రం సందేహం లేదా మీ జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉన్నట్లే. ప్రతి ఒక్కరి కళ్లూ మీ కేశాలపైనే.

కొందరికి బ్రౌన్ లేదా తెలుపు అని వివిధ రంగులలో జుట్టు ఉంటుంది. అలాంటి వారు కూడా నల్లని రంగు జుట్టు కోసం వివిధ రకాల డై ని ఉపయోగిస్తూ ఉంటారు. మీరు డై ని ఉపయోగిస్తున్నట్లయితే ఒక విషయం మీరు గ్రహించాలి. ఎలాంటి బ్రాండ్ డై ని మీరు ఉపయోగించినా అది మీ కురులలోని నేచురల్ పిగ్మెంట్స్ ని నాశనం చేస్తుంది. అంతే కాదు మీ కురులలో ఉన్న కొద్దిపాటి నల్లధనాన్ని కూడా పూర్తిగా పోగొడుతుంది. అవి మీ చర్మానికి మరియు కంటికి కూడా మంచిది కాదు.

మరి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజమైన నలుపు రంగును పొందలేమా? సహజ పదార్థాలను ఉపయోగించి సహజమైన పద్ధతుల ద్వారా నల్లని కురులను పొందవచ్చు. కానీ, కొన్ని విషయాలను మీరు గుర్తుంచుకోవాలి.

 • మీకు గోధుమ రంగు కురులు ఉన్నట్లయితే నేచురల్ రెమెడీస్ ద్వారా సులభంగా నల్లని రంగును పొందవచ్చు.
 • మీకు ఇప్పుడిప్పుడే తెల్లగా మారుతున్న కురులు ఉన్నట్లయితే మరియు మీరు ఇదివరకు డై ని ఉపయోగించనట్లయితే నేచురల్ రెమెడీస్ ద్వారా సులభంగా నల్లని రంగును తిరిగి పొందవచ్చు.
 • మీరు ఇప్పటికే డై ని అధికంగా ఉపయోగించి ఉన్నట్లయితే, మీ కురుల యొక్క నేచురల్ పిగ్మెంట్స్ 90% డామేజ్ అయ్యుంటాయి. కనుక వాటిని సహజ పద్ధతుల ద్వారా తిరిగి నల్లగా అయ్యేటట్లు చేయటం సాధ్యపడక పోవచ్చు.

తెల్లని జుట్టు యొక్క కారణాలు

మన తాతలు అమ్మమ్మలు తెల్లని జుట్టుతో ఉండటం మనం చూసే ఉంటాము. నెరసిన జుట్టు ఉన్నప్పటికీ వాళ్ళు అందంగానే ఉండేవారు. అందుకు కారణం వారి వయసు. ఒక ఏజ్ తరువాత నెరసిన జుట్టయినా అందంగానే ఉంటుంది. కానీ మరి చిన్న వయసులోనే అనగా యవ్వనంలోనే తెల్లని వెంట్రుకలు వస్తే? ఎంతో ఆందోళనగా ఉంటుంది. పబ్లిక్ లోకి వెళ్లలేము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, ఎంతో అవమానంగా ఉంటుంది. మరి యవ్వనంలోనే తెల్ల వెంట్రుకలు రావటానికి కారణం ఏమిటి? ఇందుకు ముఖ్య కారణాలు :

 • పొల్యూషన్
 • ఒత్తిడి
 • మనం వాడే బ్యూటీ ప్రాడక్ట్స్ లోని కెమికల్స్
 • అన్నింటికంటే ముఖ్యమైన కారణం మనం తీసుకునే ఆహారాలలో పోషక లోపాలు. లైఫ్ స్టైల్ మారే కొద్ది ఆహార పద్ధతులు కూడా మారుతున్నాయి. అందు వలనే ముఖ్యంగా యవ్వనంలోనే జుట్టు నెరవడం మొదలవుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లోనే ఎంతో మంది ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి డై వేసుకోవటం ప్రారంభిస్తారు. పైన చెప్పిన విధంగా ఇవి వాడటం వలన మీ కేశాల యొక్క సహజమైన తత్వాలను కోల్పోతారు. ఒక్క సారి డై వాడటం మొదలు పెడితే చివరి వరకు వాడాల్సిందే. ఎందుకంటే అవి మీ నల్లని జుట్టుని కూడా తెల్లగా మార్చేస్తుంది.

మరి మీరు మీ సహజ నల్లని వెంట్రుకలను తిరిగి పొందాలనుకుంటే ఇలాంటి ప్రాడక్ట్స్ ను ప్రారంభ దశలోనే వదిలేసి సహజ పద్ధతులకు మారండి. ఈ పద్ధతుల ద్వారా మీరు నల్లని కురులను పొందేందుకు కొంత సమయం పడుతుంది. కానీ ఇది సహజమైన నలుపు మరియు మృదువైన కురులను మీ సొంతం చేస్తుంది. మీకు కావలసిందల్లా ఓపిక మాత్రమే.

మరి సహజమైన నల్లని కురులను పొందేందుకు కొన్ని నేచురల్ రెమెడీస్ ని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

సహజమైన నల్లని జుట్టు కొరకు హోం రెమెడీస్

 1. హెన్నా, సోప్ నట్ మరియు షికాకై హెయిర్ ప్యాక్: ఇది ఒక హెర్బల్ హెన్నా డై. ఒక బౌల్ లో ఒక కప్పు హెన్నా రెండు టేబుల్ స్పూన్ ఉసిరి పొడి ఒక టేబుల్ స్పూన్ షికాకై ఒక టేబుల్ స్పూన్ సోప్ నట్ పొడి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్ పెరుగు 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మరియు 1/2 స్పూన్ వినిగర్ ని వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ ప్యాక్ ని మీ కురులపై వేర్ల నుండి మొనల దాకా రాసి 1-2 గంటలు ఉంచాలి. ఆ తరువాత మాములు నీటితో కడగాలి. ఇలా నెలకు 2-3 సార్లు చేయటం వలన సహజమైన నల్లని కురులు మీ సొంతం అవుతాయి.
 2. ఉసిరి మరియు మందార పువ్వు హెయిర్ ప్యాక్: మందార పువ్వు ఒక ముఖ్యమైన పువ్వు మరియు మలేషియా లో ఇది నేషనల్ ఫ్లవర్. ఈ పువ్వులను అందమైన కేశాలను పొందేందుకు ఉపయోగిస్తారు. అంతే కాదు ఈ చెట్టు యొక్క ఆకులను కూడా సోప్ నట్స్ తో కలిపి వెంట్రుకలకు అప్‌లై చేసుకుంటారు. ఇలా చేయటం వలన మీ కురులు బలంగా మరియు షైనీ గా అవుతుంది. ఇది మీ డాండ్రఫ్ ని తొలగించి కురులను నల్లగా చేస్తుంది.
  మారో విధానం – ఒక ఉసిరి కాయను తీసుకొని బాగా మాష్ చేసి పల్ప్ లాగా చేసుకోవాలి. ఇందులో మందార పువ్వు యొక్క రసాన్ని కలిపి కురులపై బాగా అప్‌లై చేయాలి. పూర్తిగా రాసిన తరువాత 30 నిమిషాలు ఉంచి నార్మల్ వాటర్ తో కడిగితే కురులు నల్లగా అందంగా మారుతాయి.
 3. బ్లాక్ టీ స్ప్రే : కొత్తగా వస్తున్న తెల్లని వెంట్రుకలను నల్లగా మార్చే పదార్థాలలో ప్రసిద్ధి చెందినది బ్లాక్ టీ. బ్లాక్ టీ ని వాడటం వలన ఎలాంటి సందేహం లేకుండా మీ కురులు కచ్చితంగా నల్లగా అవుతాయి. కొన్ని బ్లాక్ టీ బాగ్స్ ని నీటిలో వేసి నీటిని బాగా ఉడికించండి. ఆ నీటిని వడగట్టి జుట్టు మరియు స్కాల్ప్ పై రాయండి. 20-30 నిమిషాల తరువాత చల్లని నీటితో తలస్నానం చేయండి. ఈ నీటిలోని యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పెళుసైన జుట్టు గ్రీవములను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియను కనీసం వారానికి రెండు సార్లు రిపీట్ చేయాలి.
 4. సేజ్ ఆకుల హెయిర్ ప్యాక్ : చేతి నిండుగా సేజ్ ఆకులను తీసుకొని నీటిలో నానపెట్టాలి. ఆ తరువాత ఆకులతో కూడిన ఈ నీటిని బాగా ఉడికించి వడగట్టండి. సేజ్ ఆకులతో పాటు రోజ్ మేరీ ఆకులను కూడా జోడించవచ్చు. ఈ నీటిని ఒక స్ప్రే బాటిల్ లో స్టోర్ చేసుకొని మీ కురులపై స్ప్రే చేయండి. 10-15 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ ఆకులలో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది హెయిర్ ఫాల్ ని మరియు జుట్టు నెరవడాన్ని తగ్గించి ఆరోగ్యమైన కురులు పెరగటానికి సహాయపడుతుంది.
 5. హెన్నా మరియు కాఫీ పొడి హెయిర్ ప్యాక్ : ఇది ఒక పురాతన పద్దతి. ఇది మీకు నల్లని మరియు పొడుగైన జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. హెన్నా మరియు కాఫీ పొడిని ఉపయోగించి హెయిర్ ప్యాక్ ని తయారు చేయవచ్చు. ఒక స్టీల్ బౌల్ లో ఒక స్పూన్ హెన్నా పొడి, రెండు స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం, ఒక స్పూన్ కటేచు(catechu) పొడి మరియు ఒక స్పూన్ ఉసిరి పొడి ని వేసి బాగా కలపాలి. ఒక చిక్కని పేస్ట్ లా చేసుకొని వెంట్రుకలపై రాయాలి. బాగా ఆరిన తరువాత 30-60 నిమిషాల తరువాత తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
 6. ఎర్త్ వాటర్ హెయిర్ ట్రీట్‌మెంట్ : వినటానికి వింతగా ఉండవచ్చు. కానీ ఈ పద్దతి కూడా ప్రీ మెచ్యూర్ వైట్ హెయిర్ ని నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. మీ గార్డెన్ లో ఏదైనా ఒక ప్రదేశంలో మట్టిని తవ్వి ఒక బౌల్ లో తీసుకోండి. ఈ మట్టిని నీటితో లేదా జెల్లడను ఉపయోగించి చిన్న పురుగు లేదా మురికిని శుభ్రపరచండి. ఆ తరువాత ఈ మృదువైన మట్టిని కొంత నీటిలో కలిపి పేస్ట్ లా చేసుకొని కురులపై అప్‌లై చేయండి. 15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో తల స్నానం చేయండి. ఈ పద్దతిని క్రమంగా పాటించటం వలన నల్లని జుట్టు పొందటం మాత్రమే కాదు, నిద్ర లేమి మరియు తలనొప్పి వంటి అనారోగ్యాలను కూడా సరిచేస్తుంది.
 7. నువ్వు గింజలు హెయిర్ ప్యాక్ : మార్కెట్ లో నల్లని నువ్వు గింజలు లభించినట్లయితే వాటిని ఉపయోగించి నల్లని కురులను మీ సొంతం చేసుకోవచ్చు. తెల్ల నువ్వు గింజలు కూడా ఉపయోగించవచ్చు కానీ నల్ల నువ్వు గింజలలో అధిక పోషకాలు మరియు విటమిన్లు ఉంటాయి. కనుక ఫలితాలను తొందరగా ఇస్తుంది. ఒక కప్పు నువ్వు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి మిక్సీలో వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ ని మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి 30 నిమిషాల తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ ని క్రమంగా ఉపయోగించటం వలన బలమైన మరియు నల్లని జుట్టుని పొందుతారు.
 8. నెయ్యి మరియు ములెతి1 KG కాచిన నెయ్యి, 250 గ్రాముల ములెతి మరియు 1 లీటరు ఉసిరి రసం ను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాలని వేడి చేసి బాగా మరిగించాలి. బాగా మరిగిన తరువాత ఒక సీసాలో స్టోర్ చేసుకోవాలి. ప్రతి సారి తలస్నానం చేసే 15-20 నిమిషాల ముందు మీ తలకు రాసుకోవాలి. ఇలా క్రమంగా చేయటం వలన నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.
 9. మామిడి పండు మరియు మామిడి ఆకుల హెయిర్ ప్యాక్ : కొన్ని మామిడి ఆకులు మరియు పచ్చి మామిడి పైన పచ్చని తొక్కను తీసుకుని మిక్సీలో రుబ్బి పేస్ట్ లాగా చేసుకోవాలి. నీటికి బదులుగా ఈ పేస్ట్ కొరకు ఏదైనా నూనెని వాడాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చాలా సమయం ఎండలో ఎండబెట్టాలి. అలా బాగా ఎండిన మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి శుభ్రం చేసుకుంటే జుట్టు ఊడిపోయే సమస్య తగ్గి అందంగా సహజమైన నల్లని జుట్టు పొందవచ్చు.
 10. మామిడి నూనె : నల్లని వెంట్రుకల కొరకు మామిడి ఆయిల్ ని కూడా ఉపయోగించవచ్చు. ఈ నూనెని క్రమంగా వాడటం వలన తెల్ల వెంట్రుకలు పూర్తిగా నల్లబడతాయి మరియు డాండ్రఫ్ సమస్య కూడా తొలగిపోతుంది.
 11. నారింజ పీల్ హెయిర్ ప్యాక్ : ఒక నారింజ పండు యొక్క తోలుని బాగా మాష్ చేసి పల్ప్ లాగా చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ ఆమ్లా పొడిని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుపై రాసి 20-30 నిమిషాల తరువాత తల స్నానం చేయండి.
 12. కొబ్బరి నూనె మరియు నిమ్మరసం : మీ కురులకు సరిపడే కొబ్బరి నూనెని ఒక బౌల్ లో తీసుకొని వేడి చేయండి. నూనె వెచ్చగా అయిన తరువాత అందులో సగం నిమ్మపండు లోని రసాన్ని పిండాలి. ఇప్పుడు ఈ వెచ్చని ఆయిల్ ని మీ స్కాల్ప్ మరియు వెంట్రుకలపై రాసి కొంత సేపు మసాజ్ చేయండి. 20-30 నిమిషాల తరువాత తల స్నానం చేయండి. ఈ పద్దతిని రెగ్యులర్గా ఫాలో చేయటం వలన నల్లని జుట్టుని పొందటంతో పాటు డాండ్రఫ్ సమస్య కూడా తొలగిపోతుంది.
 13. ఉసిరి మరియు నిమ్మరసం హెయిర్ ప్యాక్ : ఒక బౌల్ నీటిలో రెండు చెంచాల ఉసిరి పొడి మరియు నిమ్మకాయని సగంగా కోసి ఒక ముక్కలోని రసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని కురులు మరియు స్కాల్ప్ పై రాసి మృదువుగా మసాజ్ చేయాలి. కొంత సమయం మసాజ్ చేసిన తరువాత 20-30 నిమిషాలు ఉంచి తలస్నానం చేయండి. ఇలా రెగ్యులర్గా వీలైతే ప్రతి రోజూ చేస్తే అతి తక్కువ సమయంలో అందమైన నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.
 14. ఉల్లిపాయ హెయిర్ ప్యాక్ : సహజమైన నల్లని కురులను పొందేందుకు ఉల్లిపాయ ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉల్లిపాయను సగంగా కట్ చేసి డైరెక్ట్ గా స్కాల్ప్ పై మసాజ్ చేయొచ్చు. లేదా ఉల్లిపాయను కోసి మిక్సీలో వేసి జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ ని వెంట్రుకలు మరియు స్కాల్ప్ పై పూర్తిగా రాయాలి. రాసిన 30 నిమిషాల తరువాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మంచి ఫలితాలను పొందుతారు.
 15. బ్లాక్ టీ, బ్రింగారాజ్ పొడి మరియు గుడ్డు హెయిర్ ప్యాక్ : ఒక బౌల్ లో బ్రింగారాజ్ పొడి, బ్లాక్ టీ, హెన్నా పౌడర్ మరియు నిమ్మరసం ను సమాన మోతాదుల్లో వేసుకొని ఒక గుడ్డు ను కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి చిక్కని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంత వెచ్చని నీటిని కలిపి మృదువైన పేస్ట్ లా చేసి కురులు మరియు స్కాల్ప్ పై రాయాలి. రాసిన 2 గంటల తరువాత చల్లని నీటితో తల స్నానం చేయాలి.
 16. నిమ్మ మరియు ఆల్మండ్ ఆయిల్ : ఆల్మండ్ ఆయిల్ లో అధిక విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన తెల్ల జుట్టుని తొందరగా నివారిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ మరియు కొంత నిమ్మరసం ని కలిపి స్కాల్ప్ మరియు జుట్టుకు అప్‌లై చేసి 30 నిమిషాల తరువాత తలస్నానం చేయండి.
 17. కరివేపాకు మరియు కొబ్బరి నూనె హెయిర్ ప్యాక్ : ఒక కప్పు కొబ్బరినూనెలో ఒక చేతి నిండు కరివేపాకులను వేసి స్టవ్ మీద ఉంచి 10 నిమిషాలు వేడి చేయాలి. ఆకులు నల్లగా మారిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ నూనెని రాత్రి పడుకునే ముందు మీ కురులపై మరియు స్కాల్ప్ పై రాసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయండి. కరివేపాకులో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇది కురులు నల్లగా కావటానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనె జుట్టుకు పోషకాలను అందిస్తుంది. వారానికి 2-3 సార్లు ఈ నూనెని ఉపయోగించేందుకు ప్రయత్నించండి.
 18. బీరకాయ థెరఫీ : వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా బీరకాయలు కేశాలకు ఎంతో మేలు చేస్తుంది. అర కప్పు బీరకాయ ముక్కలు తీసుకొని సన్నగా కట్ చేసి ఎండబెట్టాలి. తర్వాత వాటిని అర కప్పు కొబ్బరి నూనెలో వేసి 4-5 రోజులు బాగా నానబెట్టాలి. ఆ తర్వాత ముక్కలతో పాటు నూనెని మరిగించాలి. బీరకాయ ముక్కలు నల్లగా మారే వరకూ మరిగించి వడగట్టుకోవాలి. గోరు వెచ్చగా మారిన తర్వాత తలకు అప్‌లై చేసి 30 నిమిషాల తరువాత తల స్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
 19. నువ్వులు మరియు కాస్టర్ నూనె : మీ కురుల యొక్క పొడుగును బట్టి మీకు కావాల్సినంత నువ్వుల నూనె మరియు కాస్టర్ ఆయిల్ ని సమాన మోతాదుల్లో ఒక బౌల్ లో కలుపుకొని ఆ బౌల్ ని వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత వెచ్చని నూనెని రాత్రి పడుకునే ముందు తలంతా అప్‌లై చేసుకోవాలి. ఉదయం వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్గా చేయటం వలన అందమైన నల్లని కురులు మీ సొంతం అవుతాయి.
 20. ఆముదం : ఆముదం నూనెలో యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ప్రీ మెచ్యుర్ గ్రే హెయిర్ ను నివారిస్తాయి మరియు బట్టతల రాకుండా సహాయపడుతుంది. ఆముదం నూనెని స్కాల్ప్ మరియు వెంట్రుకలకు పట్టించి మసాజ్ చేయాలి. మీకు వీలైనంత సమయం కనీసం 30 నిమిషాల వరకు ఉంచుకొని ఆ తరువాత తల స్నానం చేయాలి. దీన్ని వారంలో కనీసం రెండు సార్లు ఉపయోగిస్తే మంచిది.
 21. మెంతులు : రాత్రిపూట కొన్ని మెంతుల్ని నీటిలో నానబెట్టి ఉదయం పేస్టు చేసి జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మృదువుగా కూడా అవుతుంది.
 22. క్యారెట్ మరియు నువ్వుల నూనె థెరఫీ : అర టీస్పూన్ క్యారెట్ ఆయిల్ ను 4 చెంచాల నువ్వుల నూనెలో మిక్స్ చేసి స్కాల్ప్ మరియు కురులపై అప్‌లై చేసి మసాజ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు రాదు మరియు హెయిర్ కు నేచురల్ బ్లాక్ కలర్ వస్తుంది.
Posted on

Telugu tips for scalp pimples / acne – స్కాల్ప్ పింపుల్స్ చికిత్సకు హోమ్ రెమెడీస్

మనం సాధారణంగా ముఖంపై మొటిమలతో బాధపడుతున్నవారిని ఎందరినో చూస్తూ ఉంటాము. వాటిని తొలగించేందుకు నేచురల్ హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. మరి ఈ పింపుల్స్ తలపై స్కాల్ప్ లో కూడా వస్తుందంటే మీరు నమ్మగలరా? అవును, కొందరికి మొటిమలు స్కాల్ప్ లో కూడా ఏర్పడతాయి. ముఖంపై వస్తేనే ఎంతో చిరాకుగా ఉంటుంది, మేరీ స్కాల్ప్ పై వస్తే? స్కాల్ప్ ఎర్రగా మారటంతో పాటు చిరాకుగా, నొప్పిగా మరియు గోకుతూ ఉండాలని అనిపిస్తుంది.

మరి ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే తగిన చికిత్సలు మరియు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆర్టికల్లో స్కాల్ప్ పై మొటిమలు రావటానికి కారణాలేంటి, తగిన డైట్ మరియు హోమ్ రెమిడీస్ ని చూద్దాం.

స్కాల్ప్ పై పింపుల్స్ రావటానికి కారణాలు

పింపుల్స్ యొక్క అత్యంత సాధారణ కారణాలు చర్మంలో అధిక ఆయిల్ ఉత్పత్తి కావటం, మూసుకుపోయిన చర్మ రంధ్రాలు మరియు చర్మంపై పేరుకుపోయిన మురికి. వీటి వలన ముందుగా స్కాల్ప్ పై బాయిల్స్ లా ఏర్పడి పింపుల్స్ గా మారుతాయి.

చనిపోయిన చర్మ కణాలు మరియు సీబం చర్మాన్ని తడిగా ఉంచినప్పుడు బ్యాక్టీరియా చర్మ రంధ్రాలలోకి ప్రవేశిస్తుంది. ఇందువలన చర్మ కణాలు రంధ్రాల నుండి బయటకు పోలేవు, ఇవి వివిధ రకాలైన మొటిమలకు దారి తీస్తుంది. మొటిమలు చాలా వరకు తీవ్రమైన బాక్టీరియాలు కలిగి ఉంటాయి.

చర్మ రంధ్రాలు మూసుకుపోవటానికి  ముఖ్య కారణాలు

 • హెయిర్ స్ప్రే లేదా జెల్ వంటి హెయిర్ ప్రాడక్ట్స్.
 • రెగ్యులర్గా తల స్నానం చేయకపోవటం వలన పేరుకుపోయి మురికి.
 • వ్యాయామం చేసిన తర్వాత చాలా సమయం మీ జుట్టుని కడగకుండా ఉండటం.
 • స్కాల్ప్ పై అధిక ఫ్రిక్షన్ కలిగించేటువంటి టోపీలు లేదా తలపాగాలు వాడటం.

స్కాల్ప్ పై మొటిమలను మరియు బాయిల్స్ ను నివారించడానికి గృహ నివారణలు

మెంతులు మరియు మెంతాకులు

ఈ రెండింటి లో మొటిమలను తొలగించే ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. స్కాల్ప్ పై మొటిమలను తగ్గించేందుకు కూడా ఈ పదార్థాలను ఉపయోగించవచ్చు.

మెంతాకులను ఉపయోగిస్తున్నట్లయితే కొంత నీటిని జోడించి ఆకులను బాగా రుబ్బి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని స్కాల్ప్ మొటిమల పై రాసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. బాగా ఆరిన తరువాత నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి.

మెంతులను ఉపయోగిస్తున్నట్లయితే కొన్ని మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, రుబ్బి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని స్కాల్ప్ పై ఉన్న పింపుల్స్ పై రాసి 30 నుండి 40 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒక సారి లేదా రెండు సార్లు ఈ రెమెడీని ఉపయోగించటం వలన మంచి ఫలితం ఉంటుంది.

ఆలీ వేరా మరియు పుదీనా ఆకులు

ఈ రెండు పదార్థాలు చర్మ మొటిమలు మరియు బాయిల్స్ ని తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పదిహేను పుదీనా ఆకులను నీటిలో వేసి బాగా ఉడికించండి. నీటి శాతం 15% తగ్గే వరకు ఉడికించండి. తరువాత, కలబంద జెల్ ను ఈ పుదీనా నీటిలో కలపండి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాలని స్కాల్ప్ పై రాయండి. ఈ మిశ్రమాన్ని రాయగానే చర్మంపై చల్లని అనుభూతిని పొందుతారు. ఇలా ప్రతి రోజూ చేయటం వలన ఒకటి లేదా రెండు వారాల్లో ఫలితాలను చూస్తారు.

అల్లం

అల్లంను చిన్న ముక్కలుగా కోసి వాటి నుండి రసం తీసి స్కాల్ప్ పై మొటిమలను నివారించేందుకు ఉపయోగించవచ్చు. అల్లంలో బ్యాక్టీరియాతో పోరాడే ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి కనుక స్కాల్ప్ పై మొటిమలు చాలా వేగంగా నయమవుతాయి.

బేకింగ్ సోడా

స్కాల్ప్ పై మొటిమలను తగ్గించే మరో మూల వస్తువు బేకింగ్ సోడా. బేకింగ్ సోడాను కొంత నీటిలో కలిపి స్కాల్ప్ పై రాసి కొంత సేపు మసాజ్ చేసి ఆరిన తరువాత నీటితో శుభ్రం చేయండి. స్కాల్ప్ పై ఉన్న చర్మ రంధ్రాలు జిడ్డు, మురికి మరియు చనిపోయిన చర్మ కణాలచే మూసుకుపోవటం వలన పింపుల్స్ ఏర్పడ్తాయి. బేకింగ్ సోడా ఉపయోగించటం వలన రంధ్రాలు శుభ్రం అవుతాయి మరియు పింపుల్స్ క్యూర్ అవుతాయి.

తేనె మరియు పుల్లని పెరుగు

తేనె మరియు పెరుగును సమాన మొత్తాల్లో కలుపుకొని ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై ఉన్న మొటిమలపై రాయాలి. బాగా ఆరిన తరువాత వెచ్చని నీటితో కడగండి. తేనె మరియు పెరుగు స్కాల్ప్ లోని తేమ పదార్థాన్ని బాలన్స్ చేస్తుంది. ఈ పదార్థాలను ఎంచుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్ లో లభించే మాములు తేనె కాకుండా ఒరిజినల్ తేనెని ఉపయోగించాలి. అలాగే మార్కెట్ లో లభించే తియ్యని పెరుగు కాకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న పుల్లని పెరుగును ఉపయోగించండి.

పసుపు

మొండి మొటిమలు మరియు మచ్చలను తొలగించడంలో పసుపు చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కొబ్బరి నూనెని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై ఉన్న మొటిమల పై రాయండి.

పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇంఫ్లమేటరి మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది స్కాల్ప్ లోని PH లెవల్స్ ని బాలన్స్ చేస్తుంది మరియు జుట్టు ఫాలికల్స్ కు కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

ఆపిల్ సీడర్ వినిగర్

ఆపిల్ సీడర్ వినిగర్ లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నందున ఇది చర్మంపై మొటిమలు మరియు మచ్చలను తొలగించటంలో మరియు హెయిర్ ఫాలికల్స్ ని శుభ్రపరచటంలో ఉపయోగపడుతుంది. తల స్నానం చేసిన తరువాత ఒక స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్ ని వెచ్చని నీటిలో కలిపి స్కాల్ప్ ని శుభ్రపరచండి. ఇలా చేయటం వలన ఆపిల్ సీడర్ వినిగర్ స్కాల్ప్ పై ఉన్న బాక్టీరియా మరియు క్రిములతో పోరాడుతుంది. మంచి ఫలితాల కోసం వారానికి రెండు సార్లు ఈ మిశ్రమాన్ని వాడండి.

ఆపిల్ సీడర్ వినిగర్ మీ జుట్టును కలుషితాల నుండి కాపాడుతుంది. స్కాల్ప్ లోకి చొచ్చుకుపోయి మొటిమలకు కారణం అయిన బాక్టీరియా మరియు అధిక జిడ్డును తొలగిస్తుంది.

కలబంద

కలబంద లో యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇంఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలు మరియు మచ్చలను తొలగించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద ఆకు నుండి జెల్ ని తీసి స్కాల్ప్ పై ఉన్న మొటిమల పై రాయండి. జెల్ ఆరే వరకు అనగా 15-20 నిమిషాల వరకు ఉంచి ఆ తరువాత వెచ్చని నీటితో కడగండి. వట్టి కలబంద జెల్ కు బదులుగా అర స్పూన్ జెల్ ని 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసంలో కలిపి కూడా ఉపయోగించవచ్చు.

వేపాకు

ఈ సహజ హర్బ్ యొక్క అద్భుతమైన లక్షణాలు తామర, సోరియాసిస్, రింగ్ వార్మ్స్ మరియు మొటిమలు వంటి దీర్ఘకాలిక చర్మ పరిస్థితులతో సహా అనేక చర్మ మరియు జుట్టు సమస్యలను తొలగిస్తుంది. ఇందులో క్రిమినాశక మరియు యాంటీ బయాటిక్ లక్షణాలు మొటిమలను వేగంగా మరియు సమర్థవంతంగా నయం చేయటానికి సహాయపడుతుంది.

కొన్ని వేపాకులను నీటిలో వేసి ఉడికించి ఆ తరువాత నున్నటి పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఆ తరువాత మీ చర్మం యొక్క ప్రభావిత ప్రాంతాలలో ఈ పేస్ట్ ని రాసి 10-15 నిమిషాల పాటు వదిలేయండి. ఆ తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయండి.

మరో విధంగా కూడా వేపను ఉపయోగించవచ్చు. వేపాకు నూనెని కొంత కొబ్బరి నూనెని కలిపి మీ స్కాల్ప్ పై మసాజ్ చేయండి. ఆ తరువాత రాత్రంతా అలాగే ఉంచి ఉదయం మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయండి.

తేనె మరియు దాల్చిన చెక్క

ఒక స్పూన్ దాచిన చెక్క పొడిలో రెండు స్పూన్ తేనెని కలిపి ఒక పేస్ట్ లా చేసి మీ స్కాల్ప్ పై ఉన్న పొక్కు పై రాయండి. వీలైతే కొన్ని చుక్కల ఆర్గన్ ఆయిల్ ని కూడా చేర్చుకోవచ్చు. ఈ మిశ్రమం బాగా ఆరిన తరువాత వెచ్చని నీటితో కడగండి.

తేనె లో యాంటీ బయోటిక్ లక్షణాలు ఉంటాయి మరియు ఇది చర్మంలోని తేమను బాలన్స్ చేస్తుంది. దాల్చిన చెక్కలోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు బ్యాక్టీరియాని నాశనం చేసి పింపుల్స్ రాకుండా నివారిస్తుంది.

బొప్పాయి పల్ప్

బొప్పాయిని ముక్కలుగా కోసుకొని మిక్సీ లో వేసి నున్నటి గుజ్జులా చేసుకోండి. రెండు టేబుల్ స్పూన్ గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు మరియు కావల్సినంత తేనెని కలిపి ఒక పేస్ట్ లా చేసుకోండి. ఈ పేస్ట్ ని స్కాల్ప్ పై ఉన్న పొక్కు పై రాసి 20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

బొప్పాయి స్కాల్ప్ లోని జిడ్డును మరియు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. ఇది మీ స్కాల్ప్ లోపలి వరకు చొచ్చుకుపోయి వాపు మరియు మచ్చలను తొలగిస్తుంది.

జాజికాయ పొడి

ఒక జాజికాయను పొడి చేసి, ఈ పౌడర్ లో నాలుగు టేబుల్ స్పూన్ల పాలను కలిపి పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ని స్కాల్ప్ పై ఉన్న బాయిల్స్ మరియు పింపుల్స్ పై రాసి గంట సేపు తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయండి.

వెల్లుల్లి

ఒక చిన్న వెల్లుల్లిని మాష్ చేసి స్కాల్ప్ పై ఉన్న పొక్కు పై కొన్ని సెకండ్స్ రాయండి. ఇది పింపుల్స్ వలన కలిగే నొప్పి నుండి కూడా తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణం అయినా ఫాక్టర్స్ తో పోరాడుతుంది. టీ ట్రీ ఆయిల్ మరియు ఆలివ్ నూనెని సమాన మొత్తాలలో కలపండి. స్కాల్ప్ పై రాసి మసాజ్ చేయండి. ఒక గంట లేదా రెండు గంటల తరువాత మైల్డ్ షాంపూ తో తల స్నానం చేయండి.

లావెండర్ నూనె

దురదగా ఉండే స్కాల్ప్ మరియు మొటిమల నుండి ఉపశమనం పొందేందుకు లావెండర్ ఆయిల్ సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ లావెండర్ ఆయిల్ ని ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె మరియు 3-4 టేబుల్ స్పూన్ టీ ట్రీ ఆయిల్ తో కలపాలి. ఈ మూడు పదార్ధాలను బాగా కలిపి స్కాల్ప్ పై రాసి గంట సేపు తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయండి.

టమోటా

బాగా పండిన టమోటాతో మీ స్కాల్ప్ పై కొన్ని నిమిషాలు మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తరువాత ఒక గంట సేపు ఆరనివ్వండి. ఆ తరువాత చల్లని నీటితో తలస్నానం చేయండి. ఇది చాలా సింపుల్ రెమిడి అయినప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

స్కాల్ప్ పై మొటిమలు రాకుండా నివారించేందుకు కొన్ని చిట్కాలు

 • రోజ్ వాటర్ : మొటిమల వలన కలిగే నొప్పి మరియు దురద నుండి తక్షణ ఉపశమనం కోసం రోజ్ వాటర్ ని ఉపయోగించవచ్చు.
 • ఎక్కువ జిడ్డుగా ఉండే హెయిర్ ప్రాడక్ట్స్ ని ఉపయోగించకండి. ఎందుకంటే ఇవి చర్మపు రంధ్రాలను మూసి అధిక మురికి మరియు డెడ్ సెల్స్ పేరుకుపోవడానికి కారణం అవుతుంది.
 • వీలైనంత వరకు హెయిర్ జెల్, వాక్స్ మరియు హెయిర్ స్ప్రే ను ఉపయోగించకూడదు.
 • రెగ్యులర్గా వ్యాయామాలు చేయటం వలన స్కాల్ప్ పై మురికి మరియు చెమట పేరుకు పోతుంది. కనుక క్రమం తప్పకుండా తల స్నానం చేయాలి.
 • అధిక మాయిశ్చర్ మరియు జిడ్డు వలనే పింపుల్స్ ఏర్పడ్తాయి. కనుక తల స్నానం చేసిన తరువాత తేమను పూర్తిగా తుడిచి స్కాల్ప్ ని ఎప్పుడు డ్రై గా ఉంచుకోవాలి.

స్కాల్ప్ మొటిమల కొరకు డైట్ పరిమితులు

స్కాల్ప్ పై మొటిమలు ఉన్నట్లయితే వాటిని తొలగించేందుకు తగిన డైట్ ప్లాన్ కూడా అవసరం.

అవాయిడ్ చేయాల్సినవి

 • అధిక ఆయిల్ గల ఫుడ్స్ ని తీసుకున్నట్లయితే అధిక సీబం ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు. కనుక వీటిని సరైన మోతాదులలో తీసుకోవాలి.
 • మొటిమలు అధికంగా జిడ్డు చర్మం ఉన్న వారికే వస్తుంది. కనుక జిడ్డును తగ్గించేందుకు ఉపయోగపడేటువంటి డైట్ ని ప్లాన్ చేసుకోవడం అవసరం.
 • ముఖ్యంగా పిజ్జా లాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి, ఇందులోని అధిక చీస్ మరియు ఆయిల్స్ చర్మాన్ని మరింత జిడ్డుగా చేసి పింపుల్స్ అధికరించడానికి కారణం అవుతుంది.
 • పాల ఉత్పత్తులను తీసుకొనేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించాలి. ఆర్గానిక్ పాల ఉత్పత్తులనే ఉపయోగించాలి.

స్కాల్ప్ పై పింపుల్స్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

 • ప్రూనే : ఇందులో అధిక ఐరన్ ఉండటం వలన జుట్టుని మెరుగు పరుస్తుంది.
 • గ్రీన్ టీ : ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పాలీఫెనోల్స్ అధికంగా ఉండటం వలన డాండ్రఫ్ మరియు పింపుల్స్ ని నివారించేందుకు సహాయపడుతుంది.
 • క్యారట్లు : ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది మీ కంటి చూపును మెరుగుపరచటంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇది మీ జుట్టుని బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడుతుంది.
 • సాల్మన్ : ఈ చేపలో విటమిన్ డి మరియు ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటుంది. ఇది మీ స్కాల్ప్ మరియు జుట్టుని హైడ్రేట్ చేస్తుంది.
Posted on

చుండ్రును త్వరగా తొలగించుకోవాలంటే? – Telugu tips for dandruff

మన చర్మం(Skin) నిరంతరం కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేస్తుంది మరియు ఆరోగ్యంగా ఉండటానికి పాత కణాలను వదిలిపెడుతుంది. చర్మాన్ని పునరుద్ధరించడం వేగవంతం అయినప్పుడు చుండ్రు/డాండ్రఫ్(Dandruff) సంభవిస్తుంది. స్కాల్ప్(Scalp) పొడిగా లేదా జిడ్డుగా మారటం వలన ఏర్పడే డెడ్ స్కిన్(Dead skin) రేకులను డాండ్రఫ్ అని అంటారు. దీని యొక్క సైంటిఫిక్‌ పేరు సోబోర్హెమిక్ డెర్మటైటిస్‘. ఇది ఒక దీర్ఘకాలిక పరిస్థితి. ఈ చర్మపు పొరలు తలపై మరియు భుజాలపై ఎక్కువగా కనపడుతుంది. ఇది హానికరమైన పరిస్థితి కానప్పటికీ చాలా ఇబ్బంది కలిగిస్తుంది. వీటి వలన కొందరికి స్కాల్ప్ దురదగా(Itching scalp) కూడా ఉంటుంది. ఈ సమస్యకు కారణాలు మరియు ఇంటి నివారణ పద్ధతుల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

డాండ్రఫ్ యొక్క కారణాలు (Causes of dandruff in Telugu)

చుండ్రు/డాండ్రఫ్ ఏర్పడటానికి అసలైన కారణం తెలియనప్పటికీ చర్మం యొక్క కొన్ని పరిస్థితుల వలన ఈ సమస్య ఏర్పడుతుంది.

 • పొడి బారిన చర్మం ఉన్నవారికి డాండ్రఫ్ సమస్య ఏర్పడవచ్చు.
 • కొన్ని రకాలైన షాంపూలు మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్(Skin care products) డాండ్రఫ్ ని ప్రేరేపించవచ్చు.
 • స్కాల్ప్ పై ఫంగల్ ఇన్ఫెక్షన్(Fungal infection) లేదా రింగ్ వార్మ్(Ringworm) సమస్య వలన చుండ్రు ఏర్పడవచ్చు.
 • ఎలర్జీ వలన కలగచ్చు.
 • సోరియాసిస్ సమస్య ఉన్నవారికి డాండ్రఫ్(Dandruff) ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
 • ఈ సమస్య ఉన్న వాళ్ళు తరచూ తల స్నానం చేయకపోవటం వలన పరిస్థితి తీవ్రం అవుతుంది.
 • స్ట్రెస్(Stress) మరియు చల్లని వాతావరణం వలన డాండ్రఫ్ అధికరించవచ్చు.
 • సరైన పోషక ఆహారాలను(Nutritional foods) తీసుకోక పోవటం వలన కూడా చుండ్రు సమస్య ఏర్పడవచ్చు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి (Consult doctor for dandruff in Telugu)

సాధారణంగా చుండ్రు సమస్యకు వైద్యులను సంప్రదించవలసిన అవసరం ఉండదు. కానీ క్రింద చెప్పినటువంటి పరిస్థితులలో సందర్శించడం మంచిది.

 • మీ డాండ్రఫ్ చాలా తీవ్రంగా మరియు మీ చర్మం చాలా దురదా ఉంటే.
 • మీ స్కాల్ప్ పై ఎరుపు లేదా వాపు ఉన్నట్లయితే.
 • మీ ఇమ్యూన్ సిస్టం(Immune system) చాలా బలహీనంగా ఉన్నట్లయితే.

మనం ఉపయోగించే షాంపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Telugu precautions to take in the shampoo we use)

డాండ్రఫ్ తొలగించాలీ అని అనుకున్న వెంటనే మనకు తోచే మొదటి విషయం షాంపూ. డాండ్రఫ్ ని తొలగించగలిగే బెస్ట్ షాంపులకోసం మనం మార్కెట్ లో వెతుకుతుంటాం. మనం ఉపయోగించే షాంపూ చుండ్రుని తొలగించగలదా లేదా అని మనం ఎలా తెలుసుకోవటం? డాండ్రఫ్ ని తొలగించే కొన్ని ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ సారి మీరు కొనే షాంపులో ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా అని చూసి కొనండి.

 • కేటోకానజోల్ : ఇది ఒక సమర్థవంతమైన యాంటీ ఫంగల్ ఇంగ్రిడియెంట్. ఈ పదార్ధాన్ని కలిగి ఉన్న షాంపూలు ఏ వయస్సులోనైనా ఉపయోగించవచ్చు.
 • సెలీనియం సల్ఫైడ్ : ఇది స్కాల్ప్ గ్రంధములచే సహజ నూనెల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది డాండ్రఫ్ చికిత్సలో ప్రభావితంగా పనిచేస్తుంది.
 • జింక్ పైర్థియోన్ : ఇది ఈస్ట్ యొక్క పెరుగుదలను తగ్గిస్తుంది.
 • టీ-ట్రీ ఆయిల్ : అనేక షాంపూలలో ఇప్పుడు ఈ పదార్ధాన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని ఎంతో కాలంగా యాంటీ ఫంగల్, యాంటి బయోటిక్ మరియు యాంటి సెప్టిక్ గా ఉపయోగిస్తున్నారు. కొంత మందికి ఇది అలెర్జీ కలిగించవచ్చు.

చుండ్రును తొలగించుకునేందుకు కొన్ని గృహ నివారణ పద్ధతులు (Telugu remedies for dandruff)

బంతి, కొబ్బరి నూనె

ముందుగా 50 గ్రాముల బంతి ఆకుల్ని 250 మి.లి కొబ్బరి నూనెలో కలిపి వేడి చేయాలి. అందులో 2 చిటికెల కర్పూరం వేసి 15 నిముషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత బాగా ఆరబెట్టి ఈ నూనెని రెగ్యులర్గా ఉపయోగించవచ్చు. కర్పూరం లోను ఔషధ గుణాలు ఫంగస్ ని తొలగించి చుండ్రు సమస్యను క్రమంగా తగ్గిస్తుంది.

మెంతులు

మెంతులు చుండ్రుని తొలగించటంలో సహాయపడతాయి. రెండు టేబుల్ స్పూన్ మెంతుల్ని రాత్రింతా నీటిలో నానపెట్టాలి. ఉదయం వాటిని గ్రైండ్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వెనిగర్‌ను కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై రాసి ఆరిన తరువాత తలస్నానం చేయండి. ఆపిల్ సీడర్ వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు. మరో రెమెడీ – మెంతుల గింజలను బాగా రుబ్బి పెరుగుతో కలిపి స్కాల్ప్ పై రాసి గంట తరువాత కడగండి.

పారిజాత గింజలు

పారిజాత గింజలను సేకరించి నీటితో రుబ్బి ఒక పేస్ట్ లా తయారు చేసుకొని స్కాల్ప్ పై రాయండి. ఒక గంట తరువాత తల స్నానం చేయండి.

పెసరపప్పులు, ఆలివ్ ఆయిల్

2 టేబుల్ స్పూన్ పెసరపప్పు పేస్ట్, 4 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను ఒక బౌల్ లో వేసుకుని కలుపుకోవాలి. తర్వాత తలకు పట్టించాలి. 15 నిముషాల పాటు ఉంచి చల్లని నీటితో కడగాలి. ఇవి మన కిచెన్ లో లభించే వస్తువులే కనుక తరచూ ఈ మిశ్రమాన్ని ఉపయోగించండి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. డాండ్రఫ్ తొలగించటంలో ఇది ప్రభావితంగా పనిచేస్తుంది. 2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ నీటిని మిక్స్ చేసి తలకు పట్టించి మసాజ్ చేసి రెండు లేదా మూడు నిమిషాల తరువాత తలస్నానం చేయండి. బేకింగ్ సోడా వల్ల తలపై ఉన్న చుండ్రు మొత్తం రాలిపోతుంది. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితాలను పొందుతారు.

నిమ్మరసం మరియు ముల్తాని మట్టి

నిమ్మకాయ ఓ మంచి దివ్య ఔషధం. ఇందులో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి తలపై చుండ్రు ఎక్కువగా ఉండి దురద మిమ్మల్ని బాధిస్తే 3 టేబుల్ స్పూన్ నిమ్మరసంలో 1 టేబుల్ స్పూన్ ముల్తాని మట్టిని కలిపి స్కాల్ప్ పై రాయండి, బాగా ఆరిన తరువాత నీటితో కడగండి. ఇలా వారానికి ఒకసారి రాయటం ఎంతో మంచిది.

ఆపిల్ సీడర్ వెనిగర్

3 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వెనిగర్ లో 3 టేబుల్ స్పూన్ మంచినీటిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై రాయండి. బాగా ఆరిన తరువాత నీటితో కడగండి. మీరు ఉపయోగించే షాంపులో కూడా కొన్ని చుక్కల వినిగర్ ని చేర్చుకొని తల స్నానం చేయవచ్చు.

కలబంద

మీ తలలో చుండ్రు వల్ల బాగా దురద వస్తే దానికి కలబంద ఒక మంచి పరిష్కారం. కలబంద జెల్ ను స్కాల్ప్ పై రాసుకోవాలి. కొంత సేపు తర్వాత వాష్ చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ మీ చుండ్రుని తొలగించటంలో ప్రధాన పాత్ర పోషించగలదు. ఆలివ్ ఆయిల్ ను రాసుకుని మృదువుగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత వెచ్చని టవల్‌ను తలకు చుట్టుకొని కొన్ని నిమిషాల తరువాత తల స్నానం చేయండి.

కొబ్బరినూనె

కొబ్బరిలో యాంటీ ఫంగల్ తత్వాలున్నాయి. ఇవి చుండ్రుపై అద్భుతంగా పని చేస్తుంది. రోజూ తలకు పట్టించిన తర్వాత మసాజ్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేయటం వల్ల చుండ్రు తగ్గిపోతుంది. మరో పద్దతి – కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి స్కాల్ప్ పై పట్టించి గంట తరువాత సీకాయతో తల స్నానం చేయండి.

పెరుగు

బాగా పులియబెట్టిన పెరుగు చుండ్రుని తొలగించగలదు. కనుక పెరుగును స్కాల్ప్ కు పట్టించి 20 నిముషాల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎండిన నారింజ తొక్క, ఉసిరికాయ పెచ్చులు, కుంకుడు కాయలు, సీకాయలను సమంగా తీసుకొని రుబ్బి పొడి చేసి స్టోర్ చేసుకోండి. పెరుగును తలకు పూసినప్పుడల్లా తలస్నానానికి ఈ పొడిని ఉపయోగిస్తే మంచి ఫలితాలను పొందుతారు.

వేపాకు

వేపాకు ఒక యాంటీ ఫంగల్ ప్రాడక్ట్. ఇది స్కాల్ప్ పై ఉన్న ఫంగస్ అలాగే బ్యాక్టీరియాలపై బాగా పనిచేస్తుంది. మీకు ఎక్కువగా దురద ఉంటే వేపాకు నూనెని తలపై రాసి ఒక గంట తరువాత తలస్నానం చేయండి.

మరో పద్దతి – ¼ కప్పు వేపాకు రసం, కొబ్బరి పాలు మరియు బీట్ రూట్ జ్యూస్ మరియు 1 స్పూన్ కొబ్బరి నూనెని ఒక బౌల్లో వేసి మిక్స్ చేయాలి. 20 నిముషాల తర్వాత హెర్బల్ షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్ డాండ్రఫ్ పై చక్కగా పనిచేస్తుంది. లావెండర్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్ ని స్కాల్ప్ పై రాసుకొని సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకుంటే చాలా చక్కగా చుండ్రును తొలగిస్తుంది.

టొమాటో జ్యూస్

టొమాటో జ్యూస్ PH లెవల్స్ ను సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. టమోటా జ్యూస్ ను తలకు పట్టించి చక్కగా మసాజ్ చేసుకోవాలి. ఒక గంట ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.

అల్లం

అల్లం తో నువ్వుల నూనే కలిపి తలకు రాసుకుంటే చుండ్రుని నివారించగలదు. ఇది వెంట్రుకల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది అలాగే హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తుంది. ఆయిల్ ను తలకు పట్టించి మసాజ్ చేసుకొని 15 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.

టీ ట్రీ ఆయిల్

మన పూర్వీకులు టీ ట్రీ ఆయిల్‌ను చర్మ సమస్యలకు వాడేవారు. కాస్మెటిక్స్ తో మీరు విసుగు చెందినట్లయితే టీ ట్రీ ఆయిల్‌ను వాడితే మంచిది. దీనిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీ ఇంఫ్లమ్మెటరి లక్షణాలు చుండ్రుని తొలగిస్తుంది.

గమనిక : కొందరిలో టీ ట్రీ ఆయిల్ ఇర్రిటేషన్ ని కలిగించవచ్చు.

హెన్నా

హెన్నా(గోరింటాకు) చుండ్రుని సమర్ధవంతంగా తొలగించగలదు. ఇది యాంటీ బ్యాక్టీరియా కండీషనర్ గా కూడా పని చేస్తుంది. హెన్నాలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని అలాగే ఆలివ్ ఆయిల్ ను కలిపి తలకు పట్టించుకోవాలి. ఒక గంట పాటు ఉంచుకొని తలస్నానం చేయాలి.

తులసి ఆకులు

తులసి శ్రేష్టమైనది. అందుకే ప్రతీ ఇంటా భక్తి పరంగా లేదా ఓ మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. తులసి ఆకులకు ఒక టేబుల్ స్పూన్ ఉసిరి ఆకుల్ని జోడించి బాగా రుబ్బి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 30 నిముషాల పాటు ఉంచుకొని వాష్ చేసుకోవాలి.

కోడి గుడ్డు

కోడి గుడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది చుండ్రుపై చక్కగా పని చేస్తుంది. ఒక గుడ్డుని పగలగొట్టి దానిని తలకు రాసుకొని ఒక గంట తరువాత వాష్ చేసుకోవాలి. ఇలా ప్రతీ 3 రోజులకు ఒక సారి చేయాలి.

గసగసాలు

గసగసాల గింజలను పాలతో కలిపి పేస్ట్ తయారు చేసుకొని తలపై రాసి 30 నిమిషాల తరువాత తల స్నానం చేయండి.

చందనం

చందన తైలం 1 టేబుల్ స్పూన్ మరియు 3 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని తలపై రాసి ఒక గంటసేపు తరువాత కడగండి.

వాకుడు కాయలు

ముందుగా వాకుడు కాయలను బాగా రుబ్బుకోవాలి. ఒక పాత్రంలో ఈ పేస్ట్ మరియు దానికి 4 రెట్లు నువ్వుల నూనె మరియు 16 రెట్లు నీళ్లను చేర్చుకొని, ద్రవం మొత్తం ఆవిరయ్యేవరకు ఉడికించాలి. ఆరిన తరువాత గుజ్జుని సీసాలో నిల్వ చేసుకోవాలి. రెగ్యులర్గా తలస్నానం చేసే 30 నిమిషాల ముందు ఈ గుజ్జును తలపై రాసుకోండి.

మందార పువ్వులు

మందార పువ్వుల నుండి తైలం తయారు చేసుకొని రెగ్యులర్గా వాడితే చుండ్రు చాలా వరకు తగ్గుతుంది.

రీటా మరియు సోప్ నట్స్

ఇది పురాతన కాలం నుండి బాగా ప్రాచుర్యంలో ఉన్న హోం రెమెడీ. పొడవాటి మరియు స్ట్రాంగ్ హెయిర్ కోసం ట్రెడిషనల్ కాంబినేషన్ లో సీకాయ మరియు కుంకుడుకాయ రెండింటిని జోడించి ఉపయోగించాలి. అంతే కాదు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి కనుక చుండ్రుని నివారిస్తుంది. 10-15 సోప్ నట్స్ (కుంకుడుకాయ)లను నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాతి రోజు ఉదయం నీటిలో నానబెట్టిన సీకాయలను మెత్తగా పేస్ట్ లా చేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడి లేదా ఉసిరికాయ జ్యూస్ మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

దాల్చిన చెక్క మరియు ఆలివ్ ఆయిల్

దాల్చి చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది తలలో ఇన్‌ఫెక్షన్స్ మరియు చుండ్రుని నివారిస్తుంది. కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ లో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు మసాజ్ చేసి కొంత సేపు తరువాత తల స్నానం చేయండి.

Posted on

ఇలా చేస్తే తలలో పేలు వదిలిపోతాయి – Lice tips in Telugu

పిల్లలలో మరియు కొందరు పెద్దలలో తలలో ​​పేన్లు ఉండటం చాలా సాధారణ సమస్య. అవి స్కాల్ప్ లోని రక్తం తినే చిన్న పరాన్నజీవులు. వీటి యొక్క కారణాలు మరియు వీటిని తొలగించే విధానాలను ఈ ఆర్టికల్లో చూద్దాం.

తలలో పేలు రావటానికి కారణాలు

పేన్లు ఎగరలేవు, కనుక ఇవి ముఖ్యంగా పేలు ఉన్న వ్యక్తి యొక్క తలను డైరెక్ట్ గా తాకడం వలన ఒక వ్యక్తి నుండి ఇంకొకరికి వ్యాపిస్తాయి. పేను ఉన్న వ్యక్తుల యొక్క బట్టలను ధరించడం లేదా దువ్వెనలు, టోపీలు, హెడ్ ఫోన్స్, దిండులు మరియు బ్రష్లు పంచుకోవడం వలన కూడా ఇవి వ్యాపిస్తాయి. తలపై ఎక్కువ చెమట రావటం వలన కూడా పేలు పుట్టవచ్చు.

ఎవరికి ఎక్కువగా వ్యాపిస్తాయి

ప్రీ స్కూల్ మరియు ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థుల తలలో పేలు అత్యధికంగా వ్యాపిస్తాయి. పిల్లలు ఒకరికొకరు దగ్గరగా కలిసి ఆడుకోవటం మరియు వారి తలలను తాకే వస్తువులను పంచుకోవటం వలన ఇవి వ్యాపిస్తాయి. పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉండే కుటుంబ సభ్యులకు కూడా తలలో పేను వచ్చే అవకాశాలు ఎక్కువ. అబ్బాయిలకన్నా అమ్మాయిల్లోనే పేన్లు ఎక్కువగా పెరిగి వ్యాపించే అవకాశాలు ఉంటాయి.

మీ తలపై లైస్ ఉన్నాయని ఎలా తెలుసుకోవటం?

 • వీటి వలన మీ స్కాల్ప్ మీద మరియు చెవుల వెనక భాగాల్లో తరచూ దురదగా ఉంటుంది. ఇది పేలు యొక్క ఎంగిలి వలన కలిగే ఒక అలర్జీ దురద. ఒక వేల మీ తలలో మొదటి సారి పేను వచ్చినట్లయితే 2 నుండి 6 వారాల పాటు ఎటువంటి దురదా ఉండదు.
 • వెంట్రుకలపై లైస్ యొక్క గుడ్ల కనపడతాయి. ఇవి చాలా చిన్నగా ఉన్నప్పటికీ వీటి రంగు వలన ఇవి స్పష్టంగా కనబడతాయి.
 • ఇవి స్కాల్ప్ లోని రక్తాన్ని త్రాగటం వలన ఎక్కువ దురద మరియు ఎర్రటి బొబ్బలు ఏర్పడతాయి.

పేన్లను నివారించే పద్ధతులు

పేన్లు చాలా వేగంగా పెరుగుతాయి కనుక వీటిని తొలగించుకొనుట అంత సులువు కాదు. వీటి కొరకు ఎన్నో రకాల నూనెలు మరియు షాంపూలు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటితో పాటు ఇంటి నివారణ పద్ధతులను కూడా చూద్దాం.

హోమ్ రెమెడీస్

ఇంటి నివారణ పద్దతులను అనుసరించటం ఉత్తమం. ఎందుకంటే వీటిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు కనుక వీటి వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ముఖ్యంగా మీ పిల్లల కొరకు ఈ పద్ధతులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి యొక్క బలమైన వాసన పేనులకు ఊపిరి ఆడకుండా చేసి వాటిని చంపుతుంది.10 లేదా 12 వెల్లుల్లి ముక్కలను మరియు 2 లేదా 3 స్పూన్ల నిమ్మరసంను కలిపి ఒక పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ని జుట్టు మీద రాసి ఒక గంట తర్వాత వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. మరో పద్దతి : ఏదైనా వంట నూనె, నిమ్మరసం, గ్రీన్ టీ మరియు ఏదైనా ఒక షాంపూతో వెల్లుల్లి రసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని తలపై రాసి 30 నిముషాల పాటు టవల్ లేదా షవర్ టోపీతో కవర్ చేయండి. ఆ తరువాత తల స్నానం చేయండి.

బేబీ ఆయిల్

ఈ చికిత్సకు కావలసిన పదార్థాలు బేబీ ఆయిల్, లాండ్రీ డిటర్జెంట్ మరియు తెలుపు వినిగర్. బేబీ ఆయిల్ పేనులను ఊపిరి పీల్చకుండా చేస్తుంది. ముందుగా స్కాల్ప్ పై బేబీ ఆయిల్‌ని రాసి దువ్వెనతో దువ్వండి. ఆ తరువాత వేడి నీరు మరియు లాండ్రీ డిటర్జెంట్ తో జుట్టును కడగండి. రాత్రి పడుకునే ముందు కొద్దిగా వినిగర్‌ను తలపై రాసి టవల్ తో చుట్టండి. ఉదయం సాధారణ షాంపూతో కడగండి. మంచి ఫలితాలను పొందడానికి 3 లేదా 4 రోజులు ఇలా చేయాలి.

ఆలివ్ నూనె

రాత్రి పడుకునే ముందు ఆలివ్ నూనెని తలపై రాసి ఒక టవల్ తో తల కవర్ చేయండి లేదా షవర్ టోపీ ధరించండి. ఉదయం ట్రీ ఆయిల్ కలిగి ఉన్న హెర్బల్ షాంపూతో తల స్నానం చేయండి. మరొక పద్ధతి – లిక్విడ్ సోప్ తో ఒక కప్పు ఆలివ్ నూనెని కలిపి స్కాల్ప్ పై రాసి ఒక గంట తర్వాత కండీషనర్తో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత జుట్టు తడిగా ఉండగానే చనిపోయిన పేనులను దువ్వెనతో దువ్వి తొలగించండి.

ఉప్పు

ఉప్పు మరియు వినిగర్‌ని కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేయండి. దీనిని తలపై స్ప్రే చేయండి. ఆ తరువాత ఒక షవర్ టోపీ ధరించి స్కాల్ప్ ని కవర్ చేయండి. రెండు గంటల తరువాత షాంపూతో తల స్నానం చేయండి.

పెట్రోలియం జెల్లీ

ఇది పేనులకు ఊపిరి ఆడకుండా చేస్తుంది. రాత్రిపూట పెట్రోలియం జెల్లీని మందంగా స్కాల్ప్ పై రాసి ఒక టవల్ తో కప్పాలి. ఉదయం బేబీ ఆయిల్తో తల స్నానం చేసి పెట్రోలియం జెల్లీని తొలగించి దువ్వెన తో దువ్వి చనిపోయిన పేనులను తొలగించండి. కొన్ని రోజులు ఈ ప్రక్రియను రిపీట్ చేయాలి.

ట్రీ టీ ఆయిల్

ఇది పేలు తొలగించేందుకు ప్రభావితమైన నేచురల్ మందు. ట్రీ టీ నూనె, నేచురల్ షాంపూ మరియు కొబ్బరి లేదా ఆలివ్ నూనెని కలిపి ఒక మిశ్రమం తయారు చేయండి. దీనిని మీ స్కాల్ప్ పై రాసి 30 నిమిషాల తర్వాత వేడి నీటితో తల స్నానం చేయండి. చనిపోయిన పేనులను తొలగించడానికి స్కాల్ప్ తడిగా ఉండగానే దువ్వెనతో దువ్వండి.

కొబ్బరి నూనె

ఇది స్కాల్ప్ పై ఉన్న లైస్ యొక్క కదలికను నిలిపి వేస్తుంది. ఆపిల్ సీడర్ వినిగర్‌ను స్కాల్ప్ పై రాసి అది డ్రై అయ్యే వరకు ఆగండి. ఆ తరువాత కొబ్బరి నూనెని రాసి, టవల్ తో కప్పి రాత్రంతా ఉంచండి. ఉదయం తల స్నానం చేసి తడి జుట్టుని దువ్వెనతో దువ్వండి. ఇలా రోజూ చేయటం వలన పేన్లను పూర్తిగా నిర్మూలించవచ్చు.

వైట్ వినిగర్

ఇందులో ఎసిటిక్ ఆసిడ్ ఉంటుంది, ఇది పేనులను నాశనం చేస్తుంది. వినిగర్ మరియు నీటిని కలిపి స్కాల్ప్ పై రాయండి. జుట్టుని ఒక టవల్‌తో కవర్ చేసి రెండు గంటల పాటు ఉంచండి. తరువాత వినిగర్లో దువ్వెనను ముంచి జుట్టుని దువ్వండి.

నువ్వుల నూనె

ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు సహజ క్రిమిసంహారక లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది పేనులను తొలగించేందుకు సహాయపడుతుంది. ఒక 1/4 కప్పు నువ్వుల నూనె, 1/8 కప్పు వేపాకు నూనె, ఒక స్పూన్ టీ ట్రీ ఆయిల్, 1/2 స్పూన్ యూకలిప్టస్ ఆయిల్ మరియు 10 డ్రాప్స్ లావెండర్ నూనెల్ని కలుపుకొని ఒక మిశ్రమాన్ని తయారు చేయండి. ముందుగా ఆపిల్ సీడర్ వినిగర్ తో తలను శుభ్రం చేయండి. జుట్టు బాగా ఆరిన తరువాత ఈ మిశ్రమాన్ని తలపై రాసి టవల్ ని చుట్టి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం చనిపోయిన పేన్లను దువ్వెనతో దువ్వి తల స్నానం చేయండి.

మయోన్నైస్

మయోన్నైస్ లోని విస్కాసిటీ లక్షణాలు పేనులకు ఊపిరి ఆడకుండా చేస్తాయి. స్కాల్ప్ మీద ఫుల్ ఫాట్ మయోన్నైస్ ని మందంగా రాసి టవల్ ని చుట్టి 8 నుండి 10 గంటలు ఉంచండి. ఆ తరువాత తల స్నానం చేసి దువ్వెనతో మిగిలిన పేన్లను తొలగించండి. మంచి ఫలితాల కోసం ఒక వారం పాటు రోజూ ఈ ప్రక్రియను రిపీట్ చేయండి.

వెన్న

రాత్రి పడుకునే సమయంలో స్కాల్ప్ పై వెన్న రాసి, మరుసటి రోజు ఉదయం షాంపూతో కడగండి. తరువాత దువ్వెనతో పేనులను దువ్వండి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా లైస్ ని తొలగించటంలో సమర్థవంతముగా పనిచేస్తుంది. దీనిని ఆలివ్ నూనెలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై రాసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం, తల స్నానం చేసి దువ్వెనతో దువ్వాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు బోరాక్స్

ఇది తలలో పేనులను తొలగించడం కోసం సహజ హోమ్ నివారణలలో ఒకటి. నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను కలపండి. ఇందులో బోరాక్స్ వేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ లో బాగా కలిసే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై బాగా రుద్దాలి. ఒక షవర్ క్యాప్ తో మీ తలను కవర్ చేసి కొన్ని గంటల తరువాత తల స్నానం చేయండి.

డెట్టాల్

ఇది ఒక యాంటి సెప్టిక్ లిక్విడ్ మరియు తలపై పేనులను తొలగించేందుకు గొప్పగా పని చేస్తుంది. స్కాల్ప్ పై డెట్టాల్ రాసి ఒక గంట తర్వాత ఆలివ్ ఆయిల్ రాయండి. దీన్ని రాత్రి పూట అలాగే వదిలేసి ఉదయం షాంపూతో మీ జుట్టుని కడిగి దువ్వెనతో దువ్వండి.

పేనులను తొలగించేందుకు హోమ్ రెమిడీలు చాలా మైల్డ్ గా మరియు నెమ్మదిగా పనిచేస్తాయి. అయినప్పటికీ ఇవి శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తాయి. వీటిలో స్కాల్ప్ కి హాని కలిగించే ఎటువంటి కఠినమైన రసాయనాలూ ఉండవు. వీటిని చిన్న పిల్లలకు కూడా ఉపయోగించవచ్చు.

మార్కెట్ లో లభించే మందులు

లైస్ ని తొలగించేందుకు మార్కెట్ లో లభించే కొన్ని షాంపూలు, నూనెలు మరియు క్రీములను చూద్దాం.

హెయిర్షీల్డ్ యాంటి లైస్ క్రీం వాష్ (30 మిలీ)

Hairshield Anti Lice Cream Wash[Buy it online]

 

హెయిర్షీల్డ్ యాంటీ లైస్ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభావితమైన, సురక్షితమైన మరియు అత్యంత విస్తృతంగా ఉపయోగించబడే యాంటీ లైస్ ఏజెంట్. ఇది పేన్లనే కాదు వాటి గుడ్లపై కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. హెయిర్ షీల్డ్ యాంటీ లైస్ లో పైరత్రుమ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటాయి. ఇది ఒక సహజమైన యాంటీ లైస్ ఏజెంట్. జుట్టు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఇందులో గుల్దాడి, రీథా మరియు షికాకై యొక్క సహజ గుణాలు కూడా ఉన్నాయి. ఇది మీ జుట్టుకు ఆరోగ్యాన్ని అందించి మెరుగుపరుస్తుంది.

ఫాతిమా మెడికర్ యాంటీ – లైస్ ట్రీట్‌మెంట్ విత్ కొకొనట్, నీమ్ & క్యాంఫోర్ షాంపూ 50 మిలి (50 మిలి)

Fathima Mediker Anti-Lice Treatment Shampoo[Buy it online]

పేన్లను పూర్తిగా తొలగించటానికి మెడికర్ షాంపూని నాలుగు వారాల పాటు ప్రతి ఆదివారం ఉపయోగించండి. జుట్టుని తడి చేసి మెడికర్ షాంపూని నురుగు వచ్చేలా రాయండి. సమర్థవంతమైన ఫలితాలకోసం, 4 నిముషాల పాటు నురుగును అలాగే ఉంచండి. తరువాత జుట్టును బాగా కడగండి. జుట్టు తడిగా ఉన్న 30 నిమిషాల లోపల పేన్లను దువ్వెనతో దువ్వాలని గుర్తుంచుకోండి. ఇలా 4 వారాలు చేయండి మరియు పేన్లు లేని ఆరోగ్యమైన జుట్టుని పొందండి.

సుజానిల్ లైసెల్ హెర్బల్ లైస్ కిల్లర్ ఆయిల్ (55 మిలీ) – ప్యాక్ ఆఫ్ 3

Sujanil'S Licel Herbal Lice Killer Oil[Buy it online]

లైసెల్ హెయిర్ ఆయిల్ సహజమైన మూలికలతో తయారు చేయబడినది. ఇది పేను మరియు వాటి గుడ్లను తొలగించేందుకు అత్యంత ప్రభావితమైన హెయిర్ ఆయిల్. ఇది పేన్లను తొలగించటం మాత్రమే కాదు మీ జుట్టును ప్రకాశవంతంగా చేస్తుంది. లైసెల్ ఆయిల్‌ని రాత్రి పడుకునే ముందు జుట్టు యొక్క వేర్లపై పూర్తిగా రాయండి. మరుసటి రోజు ఉదయం చనిపోయిన పేలు మరియు గుడ్లను తొలగించడానికి దువ్వెనను ఉపయోగించండి. ఆ తరువాత జుట్టుపై తాజా నిమ్మరసంను రాసి మంచి షాంపూతో తల స్నానం చేయండి.

గమనిక 

 • మీ పిల్లలకు 2 నెలల వయసు లేదా అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే, మెడిసిన్‌ని వాడకూడదు. మీరు చేతులతోనే లైస్ మరియు వాటి గుడ్లను తీసివేయాలి.
 • ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పేను మందులను వాడకండి.
 • జుట్టు మీద గాసోలిన్ లేదా కిరోసిన్ వంటి రసాయనాలను వాడకండి.
 • చికిత్స ప్రారంభించిన 4 వారాల తర్వాత కూడా మీ పిల్లల తలలో పేను ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించండి.
Posted on

Benefits of castor oil in Telugu – స్కిన్‌ మరియు హెయిర్ సంరక్షణ కోసం కాస్టర్ ఆయిల్‌ని ఎలా ఉపయోగించాలి

కాస్టర్ ఆయిల్ అనేది స్టికీగా ఉండే ఒక చమురు, ఇది ఆరోగ్యానికి మరియు సౌందర్యానికి సంబంధించిన అనేక చికిత్సలకు ఉపయోగిస్తారు. కాస్టర్ ఆయిల్ స్టికీగా ఉన్నపటికీ అది మీ చర్మం మరియు జుట్టుకు అనేక రకాలుగా పరిహారాలను అందిస్తుంది. జుట్టు రాలడం, జుట్టు పెరుగుదల, బట్ట తల మరియు చుండ్రు వంటి సమస్యలకు ఇది అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. చర్మం పొడిబారడం, పింపుల్స్ లాంటి అనేక చర్మ సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది.

కాస్టర్ యొక్క స్కిన్ బెనిఫిట్స్

క్లియర్ స్కిన్‌

ఇది స్కిన్‌ క్లెన్సెర్ గా పనిచేస్తుంది. స్నానానికి 15 నిమిషాల ముందు మీ శరీరంపై కాస్టర్ ఆయిల్ ను రాయండి. తరువాత వేడి నీటితో స్నానం చేయండి. ఇది శరీరంలోని చనిపోయిన కణాలను శుభ్రపరచి చర్మాన్ని స్పష్టంగా మరియు తాజాగా చేస్తుంది.

ఏజ్ స్పాట్స్

వయస్సు వలన కలిగే మచ్చలకు ఉత్తమమైన పరిహారం కాస్టర్ ఆయిల్. మీ మచ్చల మీద ఆముదాన్ని రాసి సున్నితంగా మసాజ్ చేయండి.

పాదాల పగుళ్లు

రాత్రి పడుకునే ముందు పాదాల పగుళ్లపై వేడి చేసిన కాస్టర్ నూనెని రాసి ఉదయాన్నే వేడి నీటితో కడగండి. ఇది పగుళ్ల వలన కలిగే నొప్పిని తొలగిస్తుంది మరియు క్రమంగా వాడటం వలన పగుళ్లను కూడా తొలగిస్తుంది.

ముడతలను తొలగిస్తుంది

ముడతలు ఉన్న చోట్ల పై కాస్టర్ నూనెని రాయండి. చర్మం నూనెని పూర్తిగా పీల్చుకున్న తరువాత వేడి నీటితో కడగండి. ఇలా క్రమంగా చేయటం వలన ముడతలు తొలగిపోతాయి.

మచ్చలను తొలగిస్తుంది

కాస్టర్ నూనెతో బేకింగ్ సోడాని కలుపుకొని చర్మ మచ్చలపై రాయండి. ఇలా క్రమంగా చేయటం వలన మచ్చలు తొలగిపోతాయి.

స్ట్రెచ్ మార్క్స్ చికిత్స

కాస్టర్ ఆయిల్ చర్మపు సాగిన గుర్తులను తొలగిస్తుంది. మీ స్ట్రెచ్ మార్క్స్‌పై ఆముదం నూనెని ఒక నెల పాటు వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

పగుళ్లు ఉన్న గోరులకు మంచిది

ఒక వారం పాటు రోజూ రాత్రి గోరులు మరియు వేళ్ల చివర కాస్టర్ ఆయిల్ రాయటం వలన గోరుపై పగుళ్లని నిరోధిస్తుంది.

మాయిశ్చరైజర్‌

కాస్టర్ ఆయిల్ చర్మంపై మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇందులో లభ్యమయ్యే విటమిన్ ఇ చర్మం యొక్క ఎలాస్టిసిటీని పెంపొందించేందుకు తోడ్పడుతుంది. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడం ద్వారా ముడతలు అలాగే ఫైన్ లైన్స్ సమస్య నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

సన్ బర్న్

వేసవి కాలంలో, సన్ బర్న్స్ అనేక మంది ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యల్లో ఒకటి. కాస్టర్ ఆయిల్ సన్ బర్న్ కొరకు ఒక అద్భుతమైన పరిష్కారం అందిస్తుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ కాస్టర్ ఆయిల్ మరియు కొబ్బరి నూనె తీసుకోండి. దీనిని మీ చర్మంపై ఒక వారం పాటు రాయండి.

మొటిమలు

జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమల సమస్యలు ఎక్కువగా ఉంటుంది. కాస్టర్ ఆయిల్ లో రిసినోలిక్ ఆమ్లం ఉన్నందున ఇది మొటిమల చికిత్సకు సహాయపడుతుంది. దీనిని మీ ముఖం మీద రాయటానికి ఒక విధానం ఉంది. ఈ ప్రక్రియను రాత్రి పడుకునే ముందు చేయాలి. ముందుగా వెచ్చని నీటితో ముఖాన్ని కడగండి, మీ చర్మపు రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇప్పుడు కొద్దిగా కాస్టర్ ఆయిల్ తీసుకొని మీ ముఖం మీద రాసి ఉదయం కడగండి. ఇలా రెగ్యులర్గా చేయటం వలన మొటిమలు తొలగిపోతాయి.

పులిపిర్లు

ఐ లిడ్స్, మెడ, మణికట్టు మరియు అంకల్ లాంటి చోట్లలో పులిపిర్లు సాధారణంగా వస్తుంది. ఇవి హానికరం కానప్పటికీ మన చర్మంపై అసహ్యంగా ఉంటుంది. మీరు ఒక సహజ పద్ధతిలో వీటిని వదిలించుకోవాలనుకుంటే రోజూ దానిపై కాస్టర్ నూనెని రాయండి.

స్కార్స్ ని లైటెన్ చేస్తుంది

కాస్టర్ ఆయిల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్ చర్మం యొక్క కణాల పునరుత్పత్తికి తోడ్పడుతుంది. ముఖంపై కట్స్ వలన అలాగే దెబ్బల వలన ఏర్పడిన మచ్చలను తొలగేందుకు క్యాస్టర్ ఆయిల్ ను ఉపయోగించుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ కాస్టర్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మరియు ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్‌ను ఒక పాత్రలో తీసుకుని బాగా కలపి ఒక మిశ్రమాన్ని తయారుచేయండి. రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ రెమెడీని ప్రతి రోజు పాటిస్తే మెరుగైన ఫలితాన్ని పొందుతారు.

డార్క్ సర్కిల్స్ ని తొలగిస్తుంది

ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్లలో అసమతుల్యం వంటివి డార్క్ సర్కిల్స్ సమస్యకు దారితీస్తుంది. కాస్టర్ ఆయిల్ ఈ సమస్యను నివారించేందుకు తోడ్పడుతుంది. ఒక టీస్పూన్ కాస్టర్ ఆయిల్ ను అలాగే ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్‌ను ఒక బౌల్ లో తీసుకోండి. ఈ మిశ్రమం గడ్డకట్టే వరకు ఫ్రీజ్ చేయండి. తరువాత ఒక క్యూబ్‌ను తీసుకుని కంటి కింద సున్నితంగా మసాజ్ చేయండి. ప్రతి రోజూ ఇలా చేయటం వలన  వేగవంతమైన అలాగే మెరుగైన ఫలితాలను పొందుతారు. కలబంద జెల్ చర్మాన్ని సూత్ చేస్తుంది మరియు చర్మాన్ని లోలోపల నుంచి హైడ్రేట్ చేస్తుంది.

కాస్టర్ యొక్క హెయిర్ బెనిఫిట్స్

జుట్టు మల్లీ పెరిగేందుకు

పాత రోజులలో ఆముదము హెయిర్ ఆయిల్గా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు కొబ్బరి నూనె ఆ స్థానాన్ని తీసుకుంది ఎందుకంటే కాస్టర్ ఆయిల్ ప్రకృతికంగా మందంగా ఉంటుంది మరియు సుగంధంగా ఉండదు. కానీ ఆముదము జుట్టు పెరుగుదలలో చాలా సహాయపడుతుంది. స్కాల్ప్ పై ఆముదాన్ని రాయండి. వేడి చేసిన కాస్టర్ నూనెని ఉపయోగించడం ఉత్తమం. ఒక గంట సేపు తరువాత తల స్నానం చేయండి.

హెయిర్ కండిషనింగ్

ఇది హెయిర్ కండిషనింగ్గా పనిచేస్తుంది. కాస్టర్ నూనెలలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మీ జుట్టును మృదువుగా చేస్తుంది.

స్ప్లిట్‌ ఎండ్స్ ను తొలగిస్తుంది

కురులకు సరైన పోషణ ఇవ్వకపోవటం వలన స్ప్లిట్ ఎండ్స్ సమస్య ఎదురవుతుంది. ఎన్నో జుట్టు సంరక్షణ ఉత్పత్తులు మరియు వివిధ రకాల షాంపులను ఉపయోగించినప్పటికీ ఈ సమస్య తొలగిపోకుండా ఉండొచ్చు. కాస్టర్ ఆయిల్ ఉపయోగించి చూడండి. తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు.

చుండ్రు

మీ జుట్టు చాలా పొడిగా ఉన్నప్పుడు చుండ్రు సమస్య ఏర్పడవచ్చు. దీని వలన మీ స్కాల్ప్ చాలా దురదగా ఉండొచ్చు మరియు చర్మపు రేకులు రాలవచ్చు. కొన్ని చుక్కల కాస్టర్ ఆయిల్‌ని మీ తలపై రాయండి. కాస్టర్ ఆయిల్ మీ చర్మం యొక్క పొడితనాన్ని తొలగిస్తుంది మరియు చర్మాన్ని మాయిశ్చరైస్ చేస్తుంది. మీరు ఒక టేబుల్ స్పూన్ కాస్టర్ ఆయిల్ మరియు నిమ్మరసాన్ని కలుపుకొని మీ జుట్టు మీద రాయటం వలన కూడా చుండ్రుని వదిలించుకోవచ్చు.

ప్రకాశవంతమైన జుట్టు

కాలుష్యం, ఆహారంలో కలుషితం మరియు రసాయనం ఎక్కువగా ఉండే షాంపులను ఉపయోగించడం వలన జుట్టు సహజ ప్రకాశాన్ని కోల్పోతుంది. మీరు మీ జుట్టు యొక్క సహజమైన ప్రకాశాన్ని తిరిగి పొందాలనుకుంటే, కాస్టర్ ఆయిల్ ఒక అద్భుతమైన పరిహారం. దీని కోసం కాస్టర్ ఆయిల్ ని ప్రత్యేకమైన మార్గంలో ఉపయోగించాలి. ఒక గిన్నెలో తగినంత ఆయిల్ ను తీసుకొని దానిని వేడి చేయండి. ఇప్పుడు మీ జుట్టు మరియు జుట్టు మూలాల మీద రాసుకోండి మరియు మీ జుట్టును ఒక టవెల్ తో చుట్టి రాత్రంతా అలాగే ఉంచండి. నిద్ర లేచిన తర్వాత, మీ జుట్టును ఒక మైల్డ్ షాంపుతో కడగండి. ఇది సులభంగా మీ జుట్టు లోపల తేమను లాక్ చేస్తుంది మరియు జుట్టు నిగనిగలాడేలా మరియు అందంగా చేస్తుంది.

హెయిర్ కలర్

మీరు జుట్టు రంగును ఉపయోగిస్తున్నట్లయితే, దానిని సరైన విధంగా నిర్వహించడం చాలా అవసరం. జుట్టుకు రంగును వేసిన తరువాత రెగ్యులర్ గా కాస్టర్ ఆయిల్‌ని రాయండి. ఇది మీ హెయిర్ కలర్ ని టోన్ చేస్తుంది మరియు జుట్టుని సురక్షితంగా ఉంచుతుంది.

కాస్టర్ యొక్క స్కిన్ మరియు హెయిర్ బెనిఫిట్స్

ఫంగల్ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది

చాలా మందికి చర్మం మరియు జుట్టు మీద ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. చుండ్రు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ యొక్క ఒక రూపం. మీ జుట్టు మూలాలు మరియు చర్మం మీద ఆముదాన్ని రాయటం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్ తొలగిపోతుంది.

Posted on

Telugu tips to make your hair thicker – మీ జుట్టు ఒత్తుగా పెరగటానికి చిట్కాలు

వెంట్రుకలు రాలటానికి అనేక కారణాలు ఉన్నాయి, ఉదాహరణకు కాలుష్యం, హార్మోన్ల అసమతౌల్యం, పోషకాహార లోపాలు, వంశానుగత, అలర్జీలు మొదలైనవి. కానీ ఒతైన జుట్టు మీకు ఒక రోజులో లభించదు, అది రోజు మీరు తీసుకునే జాగ్రత్తలు మరియు మీరు ఉపయోగించే ప్రొడక్ట్స్ ను బట్టి పెరుగుతుంది. ఒతైన కురులను పొందేందుకు కొన్ని చిట్కాలను చూద్దాం.

హెయిర్ వాష్

మీకు రోజూ తల స్నానం చేయటం అంటే ఇష్టమా! కానీ అలా చేయటం అంత మంచిది కాదు. రోజు తల స్నానం చేయటం వలన మీ స్కాల్ప్ మరియు వెంట్రుకలను శుభ్రం చేయటం మాత్రమే కాదు మీ వెంట్రుకలను సంరక్షించేందుకు కావలసిన నేచురల్ ఆయిల్‌ని కూడా తొలగిస్తుంది. కనుక, వారానికి 3 లేదా 4 సార్లు మాత్రమే తల స్నానం చేయండి. వేడి నీటితో స్నానం చేయటం వలన మీ జుట్టు పొడిగ మరియు పెళుసుగా అవుతుంది. కనుక చల్ల నీటితో లేదా సాధారణ నీటితో తల స్నానం చేయండి. చల్లని నీళ్లు మీ కేశాలకు హాని కలగకుండా శుభ్రం చేస్తుంది.

జుట్టుని జాగ్రత్తగా ఆరపెట్టండి

తల స్నానం చేసిన వెంటనే మీ జుట్టుని బిగువుగా టవల్ తో కట్టకండి. అలా చేయటం వలన మీ జుట్టు డామేజ్ అవుతుంది. కురులలోని తడిని సున్నితంగా టవల్ తో తొలగించి గాలికి ఆరపెట్టండి. తడిగా ఉన్న జుట్టును ఎప్పుడు కూడా దువ్వకూడదు. మీ కురులు డామేజ్ అవ్వటానికి మరో కారణం మీరు వాడే దువ్వెన. జట్టులోని చిక్కును తొలగించేందుకు వెడల్పు పళ్ళు ఉన్న దువ్వెనలను వాడండి మరియు క్రింద నుండి పైకి దువ్వండి.

హీట్ స్టైలింగ్ టూల్స్ ని నివారించండి

మీరు తొందరగా సిద్దం అయ్యేందుకు హెయిర్ డ్రైయర్ లాంటి యంత్రాలను ఉపయోగిస్తున్నారా! వీటిని తరచుగా వాడటం వలన మీ కురులు మాత్రమే కాదు వాటి వేర్లు కూడా డామేజ్ అవుతాయి. మీ జుట్టు పలుచగా అవ్వటానికి ఇది ఒక ముఖ్య కారణం. కనుక, ఇటువంటి యంత్రాలను ఉపయోగించకుండా మీ జుట్టుని సహజంగా ఆరపెట్టండి.

కఠినమైన కెమికల్స్ ఉండే ఉత్పత్తులను వాడవద్దు

మీకు ఒతైన కురులు కావాలంటే రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తులను వాడకూడదు. ఇవి మీ జుట్టు మరియు స్కాల్ప్ ను డామేజ్ చేస్తాయి. ఉత్పత్తులలో సోడియం లారెల్ మరియు లారెత్ లాంటి కెమికల్స్ ఉన్నట్లయితే వాటిని వెంటనే పారవేయండి. ఎందుకంటే ఇవి కేశాలకు చాలా హాని కలిగిస్తుంది అంతేకాదు ఇటువంటి కెమికల్స్ డిష్ వాషింగ్ డిటర్జెంట్లలో వాడుతారు.

అలాగే మీరు వాడే కండీషనర్లో సిలికాన్స్ ఉన్నట్లయితే వాటిని తొలగించేందుకు మీ జుట్టుని చాలా సార్లు కడగాల్సి ఉంటుంది. ఇందు వలన మీ జుట్టు పలుచగా అవుతుంది.

మీ కేశములు పెరిగేందుకు సహాయపడే పదార్థాలను ఉపయోగించండి

కలబంద, కాస్టర్ ఆయిల్ మరియు అవోకాడో నూనె లాంటి పదార్థాలు ఉన్న షాంపూలను మరియు కండీషనర్లను వాడండి. కలబందతో కూడిన ఉత్పత్తులు వెంట్రుకలు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాస్టర్ ఆయిల్ జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. అవోకాడో నూనె ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు మీ చర్మానికి విటమిన్లను అందిస్తుంది.

ఒత్తిడి తగ్గించుకోవాలి

మీ జుట్టు మందంగా మరియు షైనీగా లేకపోవడానికి ఒత్తిడి కూడా ఒక కారణం. ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల కురులు ఆరోగ్యాంగా మరియు ఒత్తుగా పెరుగుతాయి.

పౌష్టికాహారం

వేళకు భోజనం, పౌష్టికాహారం తీసుకోవడం, సాధ్యమైనంత వరకూ ఎక్కువగా నీళ్ళు త్రాగడం వల్ల జుట్టు వేగంగా మరియు మందంగా పెరుగుతుంది.

తగిన నిద్ర

రోజుకు 7-8 గంటలు నిద్ర తప్పనిసరిగా అవసరం. ప్రతి రోజూ సరైన నిద్రను పొందడం వలన జుట్టు హెల్తీగా పెరుగుతుంది.

Posted on

Telugu tips for long hair – జుట్టు పెరగడానికి చిట్కాలు

ప్రతీ మహిళ పొడవాటి, అందమైన కురులు కావాలని కోరుకుంటుంది. కానీ ఈ రోజుల్లో కొన్ని రకాల జుట్టు సంబంధిత సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడం అనేది ఒక సాధారణ విషయంగా మారిపోయింది, అలాగే జుట్టు పూర్తిగా పెరగకుండా ఆగిపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. ఇటువంటి సమస్యలను అరికట్టడానికి చాలా మంది మార్కెట్లలో దొరికే రసాయనాలు మరియు కాస్మెటిక్స్ వంటివి వాడి మరింత బాధకు గురవుతున్నారు. కానీ సహజ సిద్ధమైన చిట్కాలతో ఇంట్లోనే మనము ఈ జుట్టు రాలే సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు.

పొడవాటి, జారువాలే జుట్టు కావాలనే కోరిక మీలో ఉంటే, అప్పుడు మీరు చేయవలసినదల్లా జుట్టుకి మంచి పోషణ కలిపించడమే. అందమైన కురుల కోసం ఆహార అలవాట్లను మార్చుకోవడమే కాకుండా బాహ్యంగా కూడా కొంత రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పొడవాటి, ధృడమైన కురులను పొందడానికి కొన్ని గృహ చిట్కాలు ఇలా ఉన్నాయి.

జుట్టు పొడవుగా పెరుగుటకు సహజ గృహ చిట్కాలు

త్వరిత జుట్టు పెరుగుదలకు ఆవాల పొడితో హెయిర్ ప్యాక్

ఒక టేబుల్ స్పూన్ ఆవాల పొడికి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, ఒక గుడ్డు, కొన్ని చుక్కల నీటిని జోడించి బాగా కలపండి. ఆ పేస్టుని ముఖ్యంగా మీ తల పై భాగ చర్మానికి అలాగే మీ జుట్టు మొత్తానికి పట్టించండి. ఒక షవర్ కేప్ పెట్టుకుని 20 నుండి 30 నిముషాల వరకు ఉంచండి. తరువాత తేలికపాటి షాంపూతో జుట్టుని బాగా శుభ్రపరుచుకోండి. ఆవాలు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది కనుక ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది.

జుట్టు రాలే సమస్యను నివారించుటకు ఆముదము

జుట్టు పెరుగుదలకు ఆముదము ఒక మంచి ఎంపిక. ఆముదం నూనెని జుట్టుకి బాగా పట్టించి రాత్రంతా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రం చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్యని ఆపవచ్చు. ఆముదం నూనెని మరొక పద్ధతిలో కూడా వాడవచ్చు. బాదం నూనెలో ఆముదం నూనెని కలిపి మాడుకి బాగా మసాజ్ చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్యే కాకుండా పల్చని జుట్టు, బట్ట తల వంటి సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది.

మృదువైన కురులకి మెంతులు

మెంతులని ఉపయోగించి మీ జుట్టు పరిమానముని పెంచుకోండి. రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు వాటిని మెత్తని పేస్టులా తయారు చేసుకోండి. మీ మాడుకి మరియు జుట్టుకి ఈ పేస్టుని పట్టించి 30 నుండి 40 నిముషాల వరకు ఉంచండి. తరువాత తేలికపాటి షాంపూతో జుట్టుని బాగా శుభ్రం చేసుకోండి. ఇదే పద్ధతిని నెలల వారీగా వారానికి రెండు సార్లు ఉపయోగించడం వలన జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు. ఇలా చేయడం వలన కురులు మెరుస్తూ మృదువుగా మారుతాయి.

విటమిన్లతో జుట్టు పరిమాణము పెంచడం ఎలా?

జుట్టుకి బాహ్యంగా హెయిర్ ప్యాక్ లు, మసాజ్ లు వంటివి చేయడంతో పాటుగా అంతర్గతంగా కూడా కొన్ని జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యం. తీసుకునే ఆహారంలో విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉండేలా చూసుకోవాలి. ఇవి మన జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడతాయి.

పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు, కేరెట్లు మరియు పెరుగు వంటివి మీ రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఎక్కువగా నూనె పదార్ధాలతో చేసిన ఆహారానికి దూరంగా ఉండండి. ఆహారపు నిర్వహణ చూడటానికి సులువుగా ఉంటుంది. కానీ దానిని పధ్ధతి ప్రకారం పాటించి ఆచరణలో పెడితేనే మంచి ఫలితాలను ఇస్తుంది.

A, C మరియు E విటమిన్లు ఉండే ఆహార పదార్ధాలు తీసుకుంటే కురులు మృదువుగా, జారువాలేలా పెరుగుతాయి. ఫోలిక్ ఆసిడ్ మరియు బయోటిన్ మాత్రలను తీసుకుంటే జుట్టు స్ట్రెయిట్ గా ఉంటుంది. కానీ మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మరియు మీ జుట్టుకు వాడే మందులను గురుంచి ముందుగా మీ డాక్టర్ ను సంప్రదించి సలహాలు తీసుకోండి.

జుట్టు పెరుగుదలకు లోతైన కండీషనింగ్

జుట్టుకి మంచి పోషణ కలిపించడానికి బోల్డన్ని చిట్కాలు ఉన్నాయి. మీ జుట్టుకి పోషణ అందించడానికి ఆలివ్ నూనె, గుడ్డు, తేనె వంటివి వాడి చూడండి. జుట్టుకి కండీషనింగ్ చేయడం వలన మీరు ఆరోగ్యవంతమైన, పొడవాటి, మెరిసే జుట్టుని పొందుతారు.

జుట్టు రాలే సమస్యకు కొబ్బరి నూనె చికిత్స

పలు రకాల జుట్టు సమస్యలకు కొబ్బరి నూనె ఒక అద్భుతమైన సహజ గృహ చికిత్సగా ఎప్పటి నుండో పేరుగాంచింది. మీ జుట్టు పెరుగుదల చాలా తక్కువగా ఉంటే, సహజంగా పొందిన కొబ్బరి నూనెతో మాడుకి మరియు మొత్తం కురులకి బాగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకునే ముందు కొబ్బరి నూనెని కాసేపు వేడి చేసి రాసుకుంటే మరింత అద్భుతంగా పనిచేస్తుంది. మీ చేతి వ్రేళ్ళను ఉపయోగించి మీ జుట్టు పై భాగానికి కొబ్బరి నూనెతో బాగా మసాజ్ చేసుకోండి.

జుట్టు పెరుగుదలకు కురులను ముందుకు వాల్చటం

కొన్ని ఆరోగ్యకరమైన కార్యకలాపాలు కూడా జుట్టు పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. వాటిలో ఒక పధ్ధతి కురులను ముందుకు వాల్చడం. ఇలా చేయడం వలన తల పై భాగ చర్మం మీద రక్తప్రసరణ పెరుగుతుంది. తద్వారా జుట్టు చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. కనుక రోజులో 2 నుండి 3 సార్లు ఇలా జుట్టుని ముందుకి వాల్చి కనీసం 30 సెకనులు అలా ఉంచి తిరిగి జుట్టుని వెనక్కి వేయండి.

జుట్టు పరిమాణము పెంచడానికి గుడ్డు

గుడ్డు ప్రోటీన్లను కలిగి ఉంటుంది. అది మీ జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడుతుంది. ముఖంగా గుడ్డులోని పచ్చ సొన జుట్టు పెరుగుదలకు మరియు దాని పోషకానికి చాలా అవసరం. ఇందుకోసం ఒక గుడ్డుని తీసుకుని పగలగొట్టి ఒక గిన్నెలో తీసుకోండి.  దానికి ఒక చెంచా ఆలివ్ నూనె మరియు సగం చెక్క నిమ్మరసాన్ని జోడించండి. ఇప్పుడు వాటిని బాగా కలిపి మీ జుట్టుకి, మాడుకి పట్టించండి. జుట్టు ఆరెంతవరకూ కాసేపు ఉంచి అప్పుడు చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. పచ్చి గుడ్డు వాడటం వలన కాస్త వాసన రావొచ్చు అందుకని తేలికపాటి షాంపూని ఉపయోగించి జుట్టుని శుభ్రం చేసుకోండి.