Posted on

జుట్టు రాలే సమస్య కు చిట్కాలు – Hair fall control tips

జుట్టు రాలడం అనేది నేడు మనం ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య. దీని పట్ల ఎంతోమంది  నిరాశగా ఉన్నారు.  దువ్వెన ఉపయోగించిన ప్రతీసారీ జుట్టు చాలా మొత్తంలో రాలిపోతూ ఉంటుంది. ఇది నిజంగా ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఈ ధోరణి పురుషుల్లో బట్టతల రావడానికి ముందస్తు చిహ్నంగా చెప్పవచ్చు. నేడు ఈ సమస్య ఒక ప్రత్యేక వయస్సు వారికి మాత్రమే పరిమితమైనది కాదు. వయస్సుతో నిమిత్తం లేకుండా 15 సం. నుండి 50 సం . వరకు ప్రతి ఒక్కరూ చిన్న పెద్దా తారతమ్యాలు లేకుండా ఎదుర్కొంటున్న సమస్యగా మారింది.  మీరు తల స్నానం చేసి వచ్చాక రాలిన మీ జుట్టు స్నానపు గదిలోని నీటి గ్రిల్ చుట్టూ చేరి నీరు అక్కడ స్థంభించిపోవడం చూస్తుంటారు. అదే సమయంలో మీ జుట్టుని ఆరబెట్టడానికి ఉపయోగించే తువ్వాలు మీద ఎంతో జుట్టు రాలి మీకు కనిపిస్తుంది.

జుట్టు రాలటాన్ని నిరోధించడానికి చిట్కాలు

 • మీ జుట్టు విషయంలో మీరు మరింత సాధు స్వభావాన్ని కలిగి ఉండాలి. జుట్టుని ఎంతో సున్నితంగా చూసుకోవాలి. జుట్టు తడిగా ఉండేటప్పుడు దువ్వెన ఉపయోగించడం మానుకోవాలి.
 • మీ జుట్టుకి సరైన పోషకాలు అందించడానికి మీ జుట్టు పైభాగ చర్మం మీద రోజువారీగా  కొంతసేపు మృదువుగా మసాజ్ చేయడం మంచిది.  పైభాగ చర్మం మర్దన చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపరచబడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు కనిపించేటట్లు సహకరిస్తుంది.
 • మీ జుట్టుని స్టైలిష్ గా కనిపించేందుకు దాన్ని బిగుతుగా పట్టి ఉంచేలా చేసే విధానాలకు స్వస్తి చెప్పాలి. ఇది మీ జట్టులోని ప్రతి వెంట్రుక మీద ఎంతో ఒత్తిడిని కలిగిస్తుంది. తద్వారా జుట్టు కుదుళ్ళు పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి.
 • ప్రస్తుత  ప్రజలు తమ జుట్టు స్టైలిష్ గా కనిపించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.  మీరు బాగా కనిపించడానికి  మరియు  సరికొత్తగా మిమ్మల్ని చూపించకోవడానికి ఒక మంచి హెయిర్ స్టైల్ పొందడం అనేది ఎంతో అవసరంగా మారింది. కాబట్టి మీరు ఇంటికి తిరిగి రాగానే మీ జుట్టు నుండి కాస్మొటిక్స్ మరియు వివిధ రకాల జెల్స్ ని తొలగించి నూనె మర్దన ద్వారా తప్పని సరిగా సరైన పోషణలు సమకూర్చాలి. సాధ్యమైనంత వరకు మీ జుట్టుకు తక్కువ ఉష్ణ చికిత్స అందించడం మంచిది.
 • వాతావరణం బయట చాలా చల్లగా ఉన్నప్పటికీ కూడా వేడి నీటితో జుట్టుని తడపకూడదు. జుట్టు రాలిపోవడానికి ఇది మరొక కారణం అవ్వొచ్చు. వేడి నీటి వలన మీ జుట్టు త్వరగా పొడిబారిపోయే అవకాశం ఉంది. తద్వారా మీ జుట్టు కుదుళ్ళు పగిలిపోయి జుట్టు రాలే సమస్యకు దారితీస్తుంది.

జుట్టు రాలే సమస్యను తగ్గించుకొనుటకు గృహ చిట్కాలు

కొబ్బరి పాలు

కొబ్బరి గుజ్జు నుండి సహజంగా సేకరించిన పాలు జుట్టు రాలే సమస్యను నియంత్రించడంలో చాలా గొప్పగా పనిచేస్తుంది. కొబ్బరి పాలు జుట్టుకి పోషణ అందించడంలో సహాయపడుతుంది. కొబ్బరి గుజ్జుని ముక్కలుగా కోసి బాగా మిక్సీ పట్టండి. ఆ ధ్రవాన్ని ఒక మెత్తటి వస్త్రంలో వేసి బాగా పిండి దాని నుండి కొబ్బరి పాలని సేకరించండి. ఇప్పుడు ఆ కొబ్బరి పాలని కుదుళ్ళకి పట్టించి బాగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వలన జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు.

వేప చికిత్స

వేప మొక్క మీ చర్మానికే కాదు జుట్టుకి కూడా మంచిగా పనిచేస్తుంది. ఇది క్రిమినాశకరం మరియు వైరస్ అలాగే బ్యాక్టీరియా ప్రభావాలను నిర్మూలిస్తుంది. కొన్ని తాజా వేప ఆకులను తీసుకుని వాటిని మంచి నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. తీసుకున్న నీటికి సగం అయ్యేంత వరకు మరగపెట్టాలి అలా నీరు పచ్చ రంగు లోకి మారుతుంది. ఇప్పుడు ఆ నీటిని చల్లార్చి మాడుకి బాగా పట్టించి మర్దనా చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఉసిరి

నిస్తేజంగా మరియు బలిహీనంగా ఉండే జుట్టుకు చికిత్స చేయటానికి మహిళలు దశాబ్దాలుగా ఉసిరిని ఉపయోగిస్తున్నారు. ఎండబెట్టిన ఉసిరిని తీసుకుని వాటిని కొబ్బరి నూనెలో మరగబెట్టాలి. ముదురు నల్ల రంగులోకి మారేంత వరకూ దానిని మరగనివ్వాలి. అప్పుడు దానిని చల్లార్చి జుట్టు కుదుళ్ళ నుండి చిగుర్ల వరకు పూర్తిగా పట్టించాలి. ఇది జుట్టు రాలే సమస్యను అరికట్టడానికి మరొక సమర్థవంతమైన చిట్కాలలో ఒకటి.

Posted on

ఒతైన నల్ల జుట్టు పొందుటకు చిట్కాలు – Telugu tips to get black hair naturally

చాల మంది మహిళలకు నల్లని వొతైన జుట్టు అంటే చాల ఇష్టం. కొన్ని సహజమైన చిట్కాలను పాటించడం వలన మీరు మళ్ళి నల్లని జుట్టుని పొందవచ్చు. ఇంటి చిట్కాల వలన చిన్నతనంలో వచ్చే తెల్లని జుట్టుని నివారించి చాల వొతైన బలమైన జుట్టుని పొందవచ్చు. బయట మార్కెట్లో లభించే హెయిర్ బ్లాక్ కలర్ ప్రొడక్ట్స్ వాడటం వలన జుట్టు బలహీనంగా తయారు అవుతుంది. అందువలన ఇంటి చిట్కాలు ఉపయోగించడం వలన మీ జుట్టు చాల వొత్తుగా నల్లగా అందంగా తయరుఅవుతుంది.

ఈ ఆధునిక జీవనంలో జుట్టు రంగు మారడం అనేది ఒక సమస్యగా మారింది. మేలనిన్ అనే ఒక వర్ణద్రవ్యం లేకపోవడం వలన జుట్టు రంగు మారడం జరుగుతుంది. అలానే జన్యు సంబంధమైన సమస్యలు, శరీరంలో కొన్ని రసాయన చర్యలు జరగడం వలన మరియు పర్యావరణ కాలుష్యం వలన కూడా జుట్టు రంగు మారడం అనేది జరుగుతుంది. అలానే ఎక్కువగా భావోధ్వేగ పరిస్తితిలో ఆందోళన, ఒత్తుడులకు గురికావడం వలన కూడా జుట్టు రంగు మారడం అనేది జరుగుతుంది. రసాయనాలతో కూడిన ఆయిల్స్ షాంపూలు వాడటం వలన కూడా జుట్టు రంగు మారుతుంది. హెర్బల్ నెచురల్ చిట్కాలను వాడటం వలన మీ జుట్టు మరింత వొత్తుగా, నల్లగా మారుతుంది. ఎటువంటి దుష్ప్రభావం లేకుండా మీ జుట్టు అందంగా కన్పిస్తుంది.

మార్కెట్లో లభించే హెయిర్ కలర్ ప్రొడక్ట్స్ వాడటం కంటే సహజ ఇంటి చిట్కాలు వాడటం వలన మీకు మంచి ఫలితం ఉంటుంది. మన వంటగదిలోనే అనేక రకాలైన పదార్ధాలు ఉన్నవి వాటి ద్వారా మీరు మంచి నల్లని, వొతైన జుట్టును పొందగలరు.

భారతీయుల జుట్టు సహజంగా నల్లగా ఉంటుంది కాని వయసు పెరిగేకొద్ది అలానే కొన్ని రకాల కారణాల వలన జుట్టు రంగు మారడం జరుగుతుంది. జుట్టు రంగు మారడం అనేది ఈ రోజుల్లో ఒక పెద్ద సమస్యగా మారింది. ఇది ఎక్కువగా మన పర్యావరణ కాలుష్యం వలన సంభవిస్తుంది. తెల్ల జుట్టు ఎక్కువగా 45-50 సంవస్సరాల వయస్సు దాటిన తరువాత మాత్రమే వస్తుంది దానికన్నా ముందు వస్తే అది ఒక సమస్యగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో ఫాషన్ పెరిగిన తరువాత చాల మంది అనేక రకాల హెయిర్ స్టైల్ మరియు హెయిర్ కలర్స్ వాడుతున్నారు. దాని ద్వారా నల్లజుట్టు తొందరగా తెల్లగా మారుతుంది. మీకు ఇదే మంచి సమయం ఇంటి చిట్కాలను వాడటం అలవాటు చేసుకోవడానికి.

నల్ల జుట్టు కోసం సహజమైన ఇంటి చిట్కాలు

 • అర లీటరు నీటిలోకి ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని మరియు నిమ్మరసాన్ని (సగం నిమ్మ ముక్క) కలపాలి. తలస్నానం చేసే ముందు ఆ నీటిని తలకు అప్లై చేయడం వలన మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.
 • 1 కేజీ నెయ్యిని తీసుకొని దానిలో 150 గ్రాముల తేనే, 1 లీటర్ ఉసిరి రసాన్ని కలిపి బాగా వేడిచేయాలి. దానిలోని నీరు అంతా ఆవిరైపోయే అంత వరుకు వేడి చేస్తూనే ఉండాలి. ఆ ద్రావణం తయారు అయిన తరువాత ఒక గాజు సీసలోకి తీసుకోవాలి. దానిని తలస్నానం చేసే ముందు తలకి రాసుకోవాలి. ఇలా చేయడం వలన మీరు మళ్ళి నల్ల జుట్టుని పొందే అవకాశం ఉంది.
 • కొన్ని మామిడి ఆకులను తీసుకొని వాటిని పేస్టుచేసి జుట్టుకి అప్లై చేసి 15-20 నిమిషముల తరువాత మంచి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన మీకు జుట్టు తొందరగా పెరుగుతుంది అలానే నల్లగా కూడా అవుతుంది.
 • కొన్ని మామిడి ఆకులను మరియు కొన్ని పచ్చిమామిడి తొక్కలను తీసుకొని కలిపి వాటిని ఆయిల్లో వేసి చాల కాలం వరకు సూర్యరశ్మి తగిలేల ఎండలో ఉంచాలి. ఆ ఆయిల్ రాసుకోవడం వలన జుట్టు రాలటాన్ని ఆపి నల్ల జుట్టు వచ్చేలా చేస్తుంది.
 • మామిడి విత్తనం యొక్క నూనెను వాడటం వలన తెల్లజుట్టు నల్లజుట్టుగా మారుతుంది. అలానే జుట్టు రాలటాన్ని ఆపి, చుండ్రు రాకుండా చేస్తుంది.

సహజమైన పద్ధతిలో నల్లజుట్టుని పొందుట

ఉసిరి మరియు గోరింటాకు పేస్టు

3 టేబుల్ స్పూన్స్ తాజా గోరింటాకు పేస్టు, 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని తీసుకొని దానిలోకి కాఫీ పొడి మరియు తగిన మోతాదులో నీటిని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని తలకి అప్లైచేసి 2 గంటలు అలానే ఉంచి ఏదైనా షాంపూతో తలని శుభ్రం చేయాలి. ఇది ఒక ఉత్తమమైన పద్ధతి.

బ్లాక్ టీ

బ్లాక్ టీ చిట్కా అనేది ఒక ఉత్తమమైన పధ్ధతి. బ్లాక్ టీ నీటిని తలకు అప్లైచేసి అరగంట తరువాత ఎటువంటి షాంపూని ఉపయోగించకుండా మంచి నీటితో కడగాలి.

బీరకాయ

ఈ చిట్కా మీకు పోయిన మేలనిన్ అనే ఒక వర్ణద్రవ్యం మళ్ళి పునరుద్ధరించడానికి తోడ్పడుతుంది. ఎండిన బీరకాయ ముక్కలను తీసుకొని దానిని కొబ్బరి నూనెలో మూడు రోజులపాటు నానపెట్టాలి. ఆ ఆయిల్ నల్లరంగు వచ్చే వరకు వేడి చేయాలి. ఈ ఆయిల్ని తలమీద మసాజ్ చేసి ఒక గంట తరువాత కడగాలి.

వేడి ఆయిల్ మసాజ్

వేడి ఆయిల్ మసాజ్ వలన నల్లజుట్టు తిరిగి పొందవచ్చు. కొబ్బరి నూనె లేక బాదం నూనె లేక ఉసిరి నూనె మొదలగునవి వీటిలో ఏదైనా నూనెను వేడి చేసి తలకు రాస్తూ వృత్తాకారంగా చేతులను తిప్పుతూ మసాజ్ చేయాలి.

నల్లజుట్టును అలానే ఉంచుకొనుటకు ప్యాక్

ఈ ప్యాక్ నెలకు రెండుసార్లు వాడటం వలన మీ జుట్టు నల్లగా మరియు కాంతివంతంగా తయారు అవుతుంది. తేమగా ఉండే గోరింటాకు, ఉసిరి పొడి మరియు తేనీరు మద్యం తీసుకొని పేస్టు తయారు చేసి రాత్రి అంతా అలానే ఉంచి ఉదయాన్నే బ్రహ్మిపొడి, బ్రింగ్రాజ్ పొడి, గుడ్డు, పెరుగు మరియు కొంచెం నిమ్మ రసాన్ని కలిపి పేస్టు తయారు చేయాలి. పేస్టుని తలకు మరియు జుట్టుకు అప్లై చేసి 30 నిమిషముల తరువాత కడగవలెను. ఇది జుట్టునల్ల రంగుని అలానే ఉంచి జుట్టు పెరగటానికి తోడ్పడుతుంది. అలానే ఎక్కువ కాంతివంతంగా చేసి చుండ్రును తగ్గిస్తుంది.

దువ్వెనను ఉపయోగించే పద్ధతి

అందమైన జుట్టును కటినంగా దువ్వకూడదు. చక్కగా దూరంగా మృదువుగా వున్న పళ్ళ దువ్వెనతో జుట్టు దువ్వుకోవాలి.

వేడికి దూరంగా ఉండుట

వేడి జుట్టుకి ఎక్కువగా తగలడం వలన జుట్టు పొడిగా తయారు అవుతుంది అందుకు వేడికి దూరంగా ఉండాలి.

జుట్టు పొడవుగా పెరుగుట

జుట్టు క్రిందభాగంలో స్ప్లిట్ ఎండ్స్ ఏర్పడతాయి వాటిని కట్ చేయడం వలన జుట్టు తొందరగా పెరుగుతుంది.

కేరాటిన్ చికిత్స

కేరాటిన్ పునరుద్ధరణ చికిత్స అనేది జుట్టులో ఉండే కేరాటిన్ లెవెల్స్ పెంచి జుట్టుని కాంతివంతంగా చేసి సహజ రంగుని ఇస్తుంది.

నల్లని మరియు వొతైన జుట్టు కోసం ఇంటి వంటలు

కరివేపాకు

మన వంటకాలలో ఎక్కువగా కరివేపాకుని ఉపయోగిస్తారు ఇది కొన్ని బయోకెమికల్ రియాక్షన్ని కలిగిఉంటుంది. దీని వలన జుట్టు మూలాల నుంచి పెరుగుతుంది. కరివేపకుని కొబ్బరి నీటిలో ఉంచి తలకు రాయడం వలన ఒక రకమైన టానిక్గా పనిచేస్తుంది.

నల్లజుట్టు కోసం బుట్టేరింగ్

ఆవుపాల వెన్నతో తెల్లజుట్టును దూరం చేయవచ్చు. ఆవు నెయ్యితో కూడా తెల్లజుట్టుని దూరం చేసి నల్లజుట్టుని పెంపొందించవచ్చు.

బ్లాక్ టీ

ఒక కుండలోకి బ్లాక్ టీని తయారుచేసి చల్లగా చేయవలెను. 15 నిమిషములపాటు బ్లాక్ టీలో జుట్టుని నానపెట్టవలెను. తరువాత నీటితో కడగాలి. ఇలా ఒక రోజులో మీ జుట్టు నల్లగా తయారయే అంత వరకు చేయవచ్చు.

మేల్లెతి మరియు నెయ్యి

1 కేజీ స్వచ్చమైన నెయ్యిని, 1 కేజీ ఉసిరి రసం మరియు 250 గ్రాముల మేల్లెతిని తీసుకొని నీరు అంతా ఆవిరి అయిపోయే వరకు వేడిచేయాలి. ఆ పేస్టుని ఒక గ్లాస్ సీసలో ఉంచి తలస్నానం చేసే ముందు రాయవలెను. ఇది చాల ఉత్తమమైన పద్ధతి బ్లాక్ హెయిర్ని పొందటానికి.

నారింజ రసం

నారింజ రసం ఆరోగ్యవంతమైన మరియు బలమైన హెయిర్ని పొందడంలో సహాయ పడుతుంది. ఉసిరి రసం జుట్టుని మందంగా మరియు నల్లరంగుని ఇవ్వడానికి సహాయ పడుతుంది. నారిజ గుజ్జుని తీసుకొని దానిలోకి ఉసిరి పొడిని కలిపి పేస్టు చేసి తలకి అప్లై చేసి 15 నిమిషముల తరువాత కడగవలెను. ఇది మీ జుట్టుకు నల్లటి రంగును ఇవ్వడానికి సహాయపడుతుంది.

Posted on

వెంట్రుకలు బలంగా పెరిగేందుకు సహజసిధ్ధమైన టిప్స్ – Long & strong hair tips

కొన్ని దశాభ్ధాలకు పూర్వం ఒత్తైన, పొడవైన వెంట్రుకలతో మన పూర్వీకులు ఉండేవారు. వృధ్ధాప్యంలోనూ వారి కేశ సంపద తరిగేది కాదు. రాను..రానూ.. మారుతూ వస్తున్న జనరేషన్ ఆహార అలవాట్లు, వంశపారంపర్యత, వాతావరణ మార్పులు, కాలుష్యం వీటన్నిటి వల్ల కేశ సంపద నష్టానికి గురవుతూ వస్తోంది. దానికి కారణం ఆ రోజుల్లో రసాయనాల వాడకం ఈ రోజుల్ల ఉండేది కాదు. అన్నీ సహజసిధ్ధమైనవే వాడేవారు. అలాగే రోడ్లపై కాలుష్యం అంతే తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తే ఈ రోజు ప్రతివారూ జుట్టు ఒత్తుదనం తగ్గుతోందని, రాలిపోతోందనే సమస్యని చెబుతున్నారు. దీనికి కారణం ప్రస్తుతం వినియోగిస్తున్న కృత్రిమమైన షాంపూలు, క్రీములు, హెయిర్ డ్రైలు. హెయిర్ స్టైలింగ్ లో భాగంగా వాడే ఇనుపవస్తువులు,డ్రైయర్లు వంటి వాటి వల్ల ఒత్తుదనం తగ్గిపోతోంది. కానీ ఈ రోజుల్లో కొన్ని సహజసిధ్ధమైన చిట్కాలు ఉపయోగించటం వల్ల ఈ సమస్య నుంచీ బయటపడవచ్చు.
జుట్టు అందాన్ని ఇనుమడించటంలో ప్రధానమైన అంశం. అది ఆడవారికైనా మగవారికైనా సరే. అందమైన ఒత్తైన జుట్టు మీలోని ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. జుట్టు తరుగుదల మీలో స్ట్రెస్ ని పెంచుతుంది. మార్కెట్లో ఈ రోజు చాలా ప్రోడక్ట్లు జుట్టు రాలకుండా ఉండేందుకు ఉన్నాయి. అయితే జుట్టు ఒత్తుదనం పెరిగేందుకు కొన్ని సహజసిధ్ధమైన చిట్కాలున్నాయి. అవేంటో చూద్దాం..

ఆయిల్ మస్సాజ్

మీ స్కాల్ప్ ని రోజూ మస్సాజ్ చేసుకోండి. మస్సాజ్ వల్ల రక్త ప్రసరణ పెరిగి జుట్టును కాపాడుతుంది. మీ స్కాల్ప్ ని వేడి నూనె తో మస్సాజ్ చేసుకోవాలి. ఈ మస్సాజ్ సర్క్యులర్ పొజిషన్లో చేసుకోవాలి. జొజొబా, కొబ్బరినూనె తో ఈ మస్సాజ్ చేసుకుంటే మంచిది. అదే చుండ్రు తగ్గాలంటే రోజ్ మేరి ఆయిల్ తో చేసుకోవాలి. కొన్ని నిముషాలు మస్సాజ్ చేసుకుని వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత వెచ్చటి టవల్ తో తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసుకోవాలి.

సరైన ఆహారం

జుట్టు రాలటాని తగ్గించుకోవాలంటే మంచి మార్గం మంచి ఆహారం. మీరు మంచి ఆహార అలవాట్లను అలవరచుకుంటే మంచిది. ఉదాహరణకి విటమిన్- సి, విటమిన్-బి, కాపర్, జింక్ మొదలైనవి తీసుకోవటం మంచిది. వీటిలో ఉన్న పోషకాలు, పౌష్టికాలు మీ కేశసంపదను వృధ్ధి చేస్తాయి.ఇంకో మంచి టిప్ ఏంటంటే మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఇది హైడ్రేషన్ అంటే శరీరం లోని వేడిని దూరం చేస్తుంది.

కండీషనింగ్

మంచి కండీషనర్ ను వాడటం మంచిది. ఇది మీ కేశాలకు బలాన్నిస్తుంది. అంతేకాక దీనిని తలస్నానం షాంపూతో చేశాక చేయాలి. మరొక విషయమేమంటే దీనిని స్కాల్ప్ కి దూరంగా పెట్టుకోవాలి. 1-2 అంగుళాలు స్కాల్ప్ కి దూరంగా పెట్టుకోవాలి. ఇది జుట్టుని మృదువుగా, నాజూకుగా ఉంచుతుంది.

అలోవేరా

అలోవేరా ప్రతి ఇంట్లో ఉండే మొక్క. ఇది సహజసిధ్ధమైన ఔషధం. ఇది కేశాలపై బాగా పని చేస్తుంది. దీనిలో ఉన్న పోషకాలు మీ స్కాల్ప్ ని కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. దీనిని స్కాల్ప్ కి రాసుకుని గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల కేశాలు నిగారింపుగా, కాంతివంతంగా ఉంటాయి.

రసాయనాలకు దూరంగా

రసాయనాలు చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి సాధ్యమైనంతవరకూ వీటికి దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో కొన్ని ప్రాడక్ట్లు హెయిర్ స్ట్రైకెనింగ్ కి, కలరింగ్ కి ఉన్నాయి.

కోడిగ్రుడ్డు

మీకు మీ కేశసంపద పెంచుకోవాలంటే ఈ టిప్ ను అనుసరించండి. ఒక గ్రుడ్డును మీ హెయిర్ కి మాస్క్ గా వేసుకోండి. తెల్లసొన తీసుకుని అలాగే పచ్చసొన కలిపి జుట్టుకి పెట్టుకోవాలి. తర్వాత 10 నిముషాల తర్వాత వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. కొద్దిగా తక్కువగా షాంపూ వేసుకుని చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిది.

మెంతులు

ఇవి ప్రతీ వంటింట్లో ఉండేవే. మెంతుల్ని తీసుకుని ముందు రోజు రాత్రి నీటిలో నాన పెట్టుకోవాలి. తర్వాతి రోజు ఉదయానే వాటిని గ్రైండ్ చేసుకుని తలకు పెట్టుకోవాలి. గంట తర్వాత నీటితో కడుగుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితముంటుంది.

బంగాళదుంప జ్యూస్

బంగాళాదుంపలో విటమిన్-ఎ,బి, సి, ఉంటాయి.ఇవి జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. బంగాళాదుంప జ్యూస్ ను తలకు పట్టించి 15 నిముషాలు ఉంచి కడుగుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచిది.

ఆమ్ల

ఆమ్ల అనేది సహజసిధ్ధ ఔషధం. ఇది జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. దీన్ని చాలా హెయిర్ ప్రాడక్టుల్లో వాడుతారు. ఇది ఆనతికాలంలోనే జుట్టు మళ్ళీ పెరిగేలా చేస్తుంది.

హైబిస్కస్ ఫ్లవర్

ఇది జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. వృధ్ధప్యం చాయల్ని దూరం చేస్తుంది. ఒత్తుదనం పెంచుతుంది. దీనితో పాటు కొబ్బరి నూనె కలుపుకుని వాడితే చాలా మంచిది.

హెన్నా

గోరింటాకుతో కూడిన హెన్న చాలా మంచిది. సహజసిధ్ధ ఔషధం గా కూడా పేర్కొనవచ్చు. ఇది కేశాల్ని ఆరోగ్యంగా, అందంగా మారుస్తుంది. హెన్నాను ఒక ఇనుప బౌల్ లో రాత్రంతా నానపెట్టుకోవాలి. పొద్దున్నే తలకు పట్టించాలి. గంట తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. జుట్టు బలంగా తయారవ్తుంది.

స్ట్రెస్ కు దూరంగా

స్ట్రెస్ జుట్టు ఊడటానికి ప్రధాన కారణం. స్ట్రెస్ తగ్గించుకుంటే జుట్టు ఊడకుండా బాగుంటుంది. ఇందుకు రోజూ వ్యాయామం, యోగా లాంటివి చేస్తే మంచిది. స్ట్రెస్ తగ్గుతుంది.

జుట్టు పెరిగేందుకు సహజసిధ్ధ చిట్కాలు

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ జుట్టుకు రాసుకుంటే వెంట్రుకల్ని బలంగా చేస్తుంది. మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. దీనిని తలకు రాసి మస్సాజ్ చేసుకుని 3 నిముషాల పాటు వదిలేసి షాంపూతో వాష్ చేసుకోవాలి.

కాస్పర్ ఆయిల్

ఇది చాలా జిగురుగా ఉండే ఆయిల్. చాలామంది దీనినే వాడి జుట్టు పెరుగుదల చాలా సులభమని అంటున్నారు. అయితే దీనిలో ఫ్యాటీ కంటెంట్ అయిన విటమిన్- ఇ ఉంటుంది. ఇది జుట్టు బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. దీనిని స్కాల్ప్ కి పట్టించిన తర్వాత మస్సాజ్ చేసుకోవాలి.

అవకాడో

ఇది ఒక ఫల చేట్టు. ఇది చాలా మందికి ఈ దేశంలో ఇష్టమైన ఫలం. దీనిలో విటమిన్-ఇ ఉండి అది జుట్టు ఒత్తుదనం, పెరుగుదలకు దోహదం చేస్తుంది. దీనిని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని దానికి గుజ్జు అరటిని కలిపి రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి 30 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.

షాంపూ జాగ్రత్త

షాంపూలు వాడేప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎటువంటి షాంపూలు వాడితే మంచిదో నిపుణుల సలహా మేరకే వాడాలి. మంచివి కానివి వాడితే హెయిర్ రూట్స్ పాడవుతాయి.

ఉల్లి జ్యూస్

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదన్న సామెతలా ఉల్లి చాలా వాటికి ఔషధం. దీనిలో సల్ఫర్ ఉంటుంది. దీనివల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. అంతేకాక సరైన విధ్ధంగా వెంట్రుకలు పెరుగుతాయి.15 నిముషాల పాటు తలకు ఈ జ్యూస్ ఉంచి తర్వాత వాష్ చేసుకోవాలి.

Posted on

వెంట్రుకలు రాలటం తగ్గాలంటే? – Hair fall control tips

తల వెంట్రుకలు రాలుతుంటే ఎంతో బాధగా ఉంటుంది. వెంట్రుకలు రాలటం వల్ల అటు మగవారు ఇటు ఆడవారూ ఎంతో బధకు గురవ్తున్నరు. ఈ రోజుల్లో ఈ సమస్య చాలా సర్వ సాధరణం అయిపోయింది. ఈ సమస్య తో బాధపదేవారు చాలా రకాలైన చికిత్సలు తీసుకుంటూ స్పాల చుట్టు పార్లర్ల చుట్టు తిరుగుతున్నారు. తీరా ఈ సమస్య తీరుతుందా అంటే కొందరిలో మాత్రమే ఫలిస్తుంది. దీనికి కారణాలు అంతేకం. అయితే ఈ సమస్యకు వారి వంశపారంపర్యత కూడా కావచ్చు. అంతేకాక థైరాయిడ్ సమస్య వల్ల కూడా కావచ్చు. అలాగే స్కాల్ప్లో రక్తప్రసరణ జరగకపొవటం, పౌష్టికాహారలోపం, జన్యు పరమైన సమస్యలు కూడా కావచ్చు. ఈ సమస్య నుంచీ బయటపడాలంటే కొన్ని గృహ చిట్కాలు ఉన్నయి. అవేంటో చుద్దామా..

జుట్టు ఊడకుండా ఉండెందుకు గృహ చిట్కాలు (hair loss control tips in Telugu)

మెంతులు

మెంతులు ప్రతీ ఇంటిలో ఉండేవే. కానీ వీటి గొప్పదనం ఎంతో ఉంది. వీటిలో హార్మోన్ యాంటీయాసిడెంట్లు ఉండటమే కాక నికోటినిచ్ ఆసిడ్ ఉండటం వల్ల వెంట్రుకలు ఊడకుండా చేయటమే కాక కుదుళ్ళు గట్టిపడేలా చెసి వెంట్రుకలు రాలకుండా చేయటమేకాక మల్లి జుట్టు మొలిచేలా కూడా చేస్తుంది.
ఇప్పుడు ఇన్ని గుణాలు ఇందులో ఉన్నాయని తెలిసి మీలో దీనిని ఎలా ఉపయోగించాలా అన్న ఉత్సుకత పెరిగే ఉంటుంది. సరే ఇక మెంతుల్ని తీసుకుని వాటిని నీటిలో రాత్రి అంతా నానపెట్టాలి. పొద్దున్నే వాటిని గ్రిండ్ చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని స్కాల్ప్ కు కుడుళ్ళవరకూ పట్టించాలి. తరువాత 30 నిముషాలు ఉంచుకోవాలి. తర్వాత నీటితో కడుగుకోవాలి. దీనికి షాంపూ అవసరం లేదు. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ఆ ఫలితాలు మీరు చూడవచ్చు.

అలోవేర

అలోవెరా కూడా ప్రతి ఇంటిలో ఉండే మొక్కే. కానీ దీనిని ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలియదు. ఈ రోజుల్లో జుట్టు రాలటం అనేది సర్వసాధారణమైన విషయమైపోయింది. ఎంచేతంటే కాలుష్యం వల్ల ఇలా జరుగుతోంది.అలోవేరా జుట్టు సమస్య నుంచీ కాపాడటమే కాక మల్లి జుట్టు పునరభివృధ్ధికి ఎంతో మంచిది. అలోవేరా వాడటం వల్ల ఊడటం తగ్గించటమే కాక దురద లంటి వాటినుంచీ బయటపడేస్తుంది. అంతేకాక పీహెచ్ హెచ్చుతగ్గుల్ని సరిచేస్తుంది. అంతేకాక చుండ్రు నుంచీ బయటపడేస్తుంది కూడా. అలొవేరా ఆకుల్ని తీసుకుని వాటిని గుజ్జుగా చేసి తర్వాత ఆ పేస్ట్ ని జుట్టు కుద్దుళ్ళకు అలాగే స్కాల్ప్ కి పెడితే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా వారానికి 3-4 సార్లు చేస్తే ఆ ఫలితాన్ని మీరే గుర్తించవచ్చు.

ఉల్లి

ఉల్లి చేసే మేలు తల్లి సైతం చేయలేదు అన్న సామెత ముమ్మాటికీ నిజం. మనకు కిచెన్లోనే కాక ఎన్నో చోట్ల ఉపయోగపడుతుంది. అలాగే మీకు జుట్టు బాగా ఊడిపోతోందని బాధపడుతుంటే ఉల్లి ఆ సమస్యని పరిష్కరిస్తుంది. ఉల్లిపాయల్ని తీసుకుని గుజ్జుగా గ్రైండ్ చేసుకుని మీ స్చాల్ప్ కి కుదుళ్ళకి పెట్టుకుని కాసేపాగిన తర్వాత కడుగుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది. ఎందుకంటే ఉల్లి స్కాల్ప్లోని రక్తప్రసరనను సరి చేస్తుంది.

వేడినూనె మస్సాజ్

వేడినూనె తో తలకు మస్సాజ్ చేసుకుంటే రక్తప్రసరణ పెరుగుతుంది. న్యూట్రీషన్ లోపం సమస్య వల్ల జుట్టు రాలుతుంది. మోస్తరు వేడి నూనే తీసుకుని కొన్ని నిముషాలు అలా మర్ధనా చేసుకుంటే రక్త ప్రసరణే కాదు, కురులు చాలా గట్టిపడతాయి. అంతేకాదు మీరు ఆయిల్ వాడటం వల్ల దానిలో ఉన్న విటమిన్-ఇ స్కాల్ప్ పై బాగా పని చేస్తుంది. కొబ్బరి నూనె, ఆల్మండ్, మస్టర్డ్, జొజోబా లాంటి నూనెలు మంచి ఫలితాన్నిస్తాయి. అలాగే మీరు ఆయిల్స్ ని కలిపి మిశ్రమాన్ని పెట్టుకోవచ్చు. ఆయిల్ తీసుకుని దానిని ఇనుప లేదా స్టీల్ బౌల్ లో ఉంచి దానిని వేడి చేసి స్కాల్ప్ పై రాసుకుంటే ఎంతో మంచిది.అలా రాసిన తర్వాత కాసేపు మర్ధన చేసుకోవాలి. రాత్రంతా ఉంచుకుని పొద్దున్నే తలస్నానం చేయాలి.

పెరుగు

పెరుగు కూడా జుట్టు రాలటం సమస్యను తగ్గిస్తుంది. తలపై పెరుగు చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు మృదువుగా జీవంగా కనిపించేలా చేస్తుంది. రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఒక టేబుల్ స్పూన్ తేనె మిశ్రమంగా చేసి స్కాల్ప్ కి పెట్ట్టుకుంటే మంచి ఫలితాలుంటాయి.

గూస్బెర్రి ఆయిల్

భారత దేశంలో ఉన్నత జాతి ఆయిల్గా పేరొందిన గూస్బెర్రి ఆయిల్ ను వాడటం వల్ల స్కాల్ప్ కే కాదు జుట్టు కు కూడా బలం చేకూరుతుంది. జుట్టు రాలటానికి ఒక కారణం విటమిన్ -సి కూడా కారణం . ఈ ఆయిల్ లో అది పుష్కళంగా ఉంటుంది. కొన్ని గింజల్ని తీసుకుని వాటిని గ్రిండ్ చేసుకుని పెట్టుకోవాలి. దీనికి కొన్ని చుక్కలు నిమ్మ ను కలపాలి.లేదా కలపకుండా పెట్టుకోవచ్చు. ఒక గంట ఆగాకా కడుగుకోవాలి.

లికో రైస్ ఆయిల్

లికోరైస్ ఆయిల్ వెంట్రుకల్ని పటుత్వం గా ఉండేలా చేస్తాయి. ఇది స్కాల్ప్ పై వచ్చే పొడల్ని, దురదల్ని, ఇట్చింగ్ నీ తగ్గిచేతుంది. ఒక రాత్రి అంతా లికొరైస్ మూలాల్ని పాలల్లో నానపెట్టాలి. ఆ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుని దానిని తలకు పట్టించి రాత్రంతా ఉంచుకుని పొద్దున్నే స్నానం చేసేయాలి.

మందార పువ్వు

మందార పువ్వు ప్రతీ ఇంట్లో ఉండేదే అయితే మందార ఆకు మందారపువ్వు చాలా బాగ జుట్టు రాలే సమస్యని దూరం చేస్తుంది. అంతేకాక పునర్వృధ్ధికి దోహదం చేస్తుంది. మందార పువ్వు జుట్టు చిట్లతాన్ని కూడా దూరం చేస్తుంది. మందార పువ్వుల్ని 12-13 తీసుకుని కొబ్బరి నూనెతో కలిపి వేడి చేసుకోవాలి. తర్వాత వడగట్టి దానిలో నుంచీ నూనె సారాన్ని తీయాలి. తర్వాత స్కాల్ప్కి అలాగే వెంట్రుకలకి పట్టించాలి. ఒక గంట ఉంచుకుని కడిగేయాలి.

బీట్రూట్

బీట్రూట్ జ్యూస్ జుట్టు రాలే సమస్యని దూరం చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ లో ప్రోటీన్లు,కాల్షియం , పొటాషియం, కార్బో హైడ్రేడ్లు , విటమిన్-బీ ఉంటాయి. అందువల్ల బీట్రూట్ జ్యూస్ చాలా బాగా పని చేస్తుంది. రోజూ మీ ఆహారంతో పాటు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల మీ జుట్టే కాడు సరీరం పై కూడా ఎన్నో విధాలుగా పని చేస్తుంది.

కొబ్బరి పాలు

కొబారి పాలులో కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయి. కొబ్బరి తీసుకుని దానిని గ్రైండ్ చేసుకుంటే దానిలో నుంచీ పాలు వస్తాయి. ఆ పాలను తిన్నగా స్కాల్ప్ కి పట్టిస్తే చాలా బాగా పని చేస్తుంది.

టీ డికాషన్

టీ డికాషన్ జుట్టు రాలటాన్ని ఆపుతుంది. 3 టేబుల్ స్పూన్ల తేయాకుల్ని తీసుకుని నీటిలో బాగా మరగించాలి. ఆ తర్వాత ఆ డికాషన్ ని తలకు పట్టించాలి. అంతేకాక దీనిలో నిమ్మ రసాన్ని కూడా కలపాలి. కాసేపు ఉంచిన తర్వాత షాంపూ వాడకుండా కడుగుకోవాలి.

గుడ్డు

గుడ్డు లో ని తెల్ల సొన జుట్టు రాలే సమస్య నుంచి బయటపడేస్తుంది.తెల్ల సొనను తీసుకుని పేస్ట్లా చేసి తర్వాత తలకు రాసుకోవాలి. ఇలా అరగంటా లేదా గంట ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనెగర్

ఆపిల్ పండుతో తయారయ్యే పదార్ధమే యాపిల్ సైడర్ వెనెగర్. ఈ వినేగర్ వలన ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. వాస్తవానికి ఈ యాపిల్ సైడర్ వినేగర్ వాడకం ఆశ్చర్యకర ఫలితాలనిస్తూ మీలోని అదనపు కొవ్వును కరిగించేస్తుంది. అయితే, యాపిల్ సైడర్ వినేగర్ అనేది ఒక యాసిడ్ అని అధికంగా వాడితే హాని కలిగిస్తుందని కూడా మీరు గుర్తుంచుకోవాలి. దీనిని స్ప్రే బాటిల్ లో వేసుకుని రాసుకోవాలి. తర్వాత 30 నిముషాలకు వాష్ చేసుకోవాలి.

Posted on

కేశ సౌందర్యానికి కొబ్బరి నూనె – Benefits of coconut oil in telugu

మన భారతదేశంలో అనాదిగా కొబ్బరినూనెను వాడటం వస్తోంది. మన పూర్వీకులు సైతం కేశ సౌందర్యానికి కానీ అలాగే తల పరిరక్షణకు గానీ దీనినే సూచించేవారు. అంటే కొబ్బరినూనెలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఇక దీని వాడకం వల్ల కేశాలకు ఒత్తుదనం, అలాగే మృదుత్వం ఇలా ఎన్నో ఆశ్చర్యకరమైన విసేషాలున్నాయ్. ఇక కొబ్బరినూనె విశేషాలను చూడాలంటే ఇక చదవండి..

సహజసిధ్ధ కండీషనర్

ఇది ఒక సహజసిధ్ధ కండీషనర్. మీ జుట్టు పొడిబారినా, బలహీనంగా ఉన్నా ఈ నూనె బాగా జుట్టును మారుస్తుంది. కొన్ని పరిశోధనల ఆధారంగా ఈ నూనె మంచి కండీషనర్ మాత్రమే కాదు అస్సలు సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేని నూనె అని తేల్చారు. కొబ్బరినూనె వల్ల జుట్టు సున్నితంగా, మృదువుగా మారుతుంది. అంతేకాక మాడు నుందీ అంటే స్కాల్ప్ లోపలి వరకూ చేరి కేశాలకు శక్తినిస్తుంది. జుట్టు పదే పదే దువ్వటం వల్ల ఊడిపోయే సమస్యను తీరుస్తుంది. టవల్ తో రుద్దటం వల్ల ఏర్పడే జుట్టు బలహీనపడినప్పుడు ఇది వాటికి శక్తి నిస్తుంది. ఊడకుండా కేశాలకు కుదుళ్ళకు పట్టునిచేలా చేస్తుంది. జుట్టుకు నూతన మెరుపునిస్తుంది.

జుట్టు పెరుగుదలను పెంచటం

కొబ్బరినూనె జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. వెంట్రుకలు ఊడిపోవటం, వెంట్రుకలు చీలిపోవటం, బలహీనపడటాన్ని నిరోధిస్తుంది. ఇది జుట్టుకు సున్నితత్వం, మరలా పెరిగే శక్తినివ్వటం, ఊడటాన్ని ఆపుతుంది. వెంట్రుకలలొ శక్తిని నింపి తల లోపల అంటే కుదుళ్ళలో మరలా బలాన్ని నింపుతుంది.

చుండ్రు పోయేలా చేయటం

కొబ్బరి నూనె రారటం వల్ల చుండ్రును నివారిస్తుంది. సాధారణంగా కేశాలు పొడిబారి అదేవిధంగా కుద్దుళ్ళలో మట్టి చెమట చేరి చుండ్రు వచ్చే అవకాశం ఉంది. కొబ్బరి నూనె జుట్టులో తేమను నింపి చుండ్రును పోయేలా చేస్తుంది. మీరు కనుక చుండ్రుతో ఇబ్బంది పడుతోంటే ఖచ్చితంగా మీరు రోజూ రాత్రిళ్ళు కొబ్బరి నూనెతో మస్సాజ్ చేసుకుని పొద్దున్నే తలస్నానం చేస్తే మంచి పలితముంటుంది. చుండ్రు త్వరగా పోతుంది.

తలలోని అంటువ్యాధుల్ని అరికట్టడం

ఇది కేవలం ఒక్ మంచి కండీషనర్ మాత్రమే కాదు. మంచి ఔషధంల కూడా పని చేస్తుంది. తలలోని అంటువ్యాధుల్ని అరికడుతుంది. చుండ్రును పోగొట్టటం, తలలో వచ్చే కురుపులు లేదా పొక్కులు అలాగే రాషెస్ ను త్వరితగతిన పోగొడుతుంది.

జుట్టు చిక్కు సమస్యకు

జుట్టు చిక్కు సమస్య ఉంటే కొబ్బరినూనె చాలా మంచిది. మీకు గనుక పొడవాటి జుట్టు ఉంటే మీరు కొబ్బరి నూనే వాడటం మంచిది అంతేకాక పొడవాటి జుట్టు ఉన్నవారికి అనుక్షణం చిక్కు సమస్య వేధిస్తుంటుంది. ఆ సమస్యను అధిగమించాలంటే కొబ్బరి నూనె వాడితే సరి. జుట్టుకు రసాయన నూనెలు వాడటం వల్ల సమస్యలు వస్తాయి.  కావాలంటే మీరు మీ చిక్కు పడిన జుట్టు దగ్గర ఒక్క కొబ్బరి నూనె చుక్క వేసి చూడండి. వేసిన వెంటనే జుట్టు పై అది జారి వెంటనే చిక్కు పోయి సరిగ్గా వచ్చేస్తుంది. ఒక్క వెంట్రుక కూడా ఊడకుండా చేస్తుంది.

సహజసిధ్ధ సన్ స్క్రీన్

కొబ్బరినూనె సహజసిధ్ధ సన్ స్క్రీన్ లోషన్ గ ఎంతొ బాగ పని చేస్తుంది. సాధారణంగా సూర్యుని లోని అతి నీలాలోహిత కిరణాలు అంటే అల్ట్రా వైలెట్ రేస్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి చర్మాన్నే కాదు వెంట్రుకలపై ప్రభావం చూపి నిర్జీవం చేస్తాయి. కాబట్టి మీరు బయటికి వెళ్ళలనుకున్నప్పుడు కొబ్బరి నూనె తీసుకుని అలాగే దానికి రోస్ వాటర్ కలిపి రాసుకుని వెల్టే జుట్టు ఎంతో సహజంగా అలాగే ఆరోగ్యంగా ఉంటుంది .ఎందుకంటే మార్కెట్లో దొరికే రసాయన క్రీముల కంటే ఇదే ఉత్తమం. ఎంచేతంటే అవి భవిష్యత్ లో తీవ్ర సమస్యలను తెస్తాయి.
Posted on

Homemade telugu tips for dull and damaged hair – నిర్జీవమైన జుట్టుకు చిట్కాలు

కొందరికి జుట్టు పీచులా తయారయ్యి జీవం లేనట్లు నిర్జీవంగా కనపడుతుంది. జుట్టు పీచులా జీవం లేనట్టు అయ్యిందంటే వెంట్రుకలు ఎక్కువగా చిట్లిపోయి ఉన్నాయని అర్థం. పైగిపోతున్న ఎండలు, కాలుష్యం, షాంపూలు, బ్లో డ్రైయ్యింగ్, స్ట్రెయిటనింగ్, కలరింగ్ … వంటివన్నీ జుట్టును దెబ్బతీసేవే! హెయిర్ స్టైలింగ్‌లోనూ, దువ్వడంలోనూ వెంట్రుకలు సులువుగా దెబ్బతింటాయి. చిట్లిన వెంట్రుకలను బాగుపరచాలన్నా, కళ తప్పని జుట్టుకు జీవం పోయాలఅంటే ఈ టిప్స్ పాటిస్తే సరి. అవేంటో చూసేద్దామా..

 • షాంపూలో సహజసిద్ధమైన గుణాలు ఉన్నవి ఎంచుకోవాలి.
 • రసాయనాలు ఎక్కువగా ఉన్నవి, ఎక్కువసార్లు షాంపూ వాడటం వంటివి చేస్తే వెంట్రుకలు త్వరగా పొడిబారుతాయి.
 • వారానికి మూడుసార్లకన్నా ఎక్కువగా షాంపూను ఉపయోగించకూడదు. రోజు విడిచి రోజు తలస్నానం చేసినా పర్వాలేదు. అయితే వేడినీటిని తలస్నానానికి ఉపయోగించకపోవడం మేలు.
 • జుట్టుకు వేడి ప్రధానమైన శత్రువు. అందుకే తడిగా ఉన్న జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్లు, ప్లాట్ ఐరన్స్ వాడకూడదు. కనీసం వాటిని ఎక్కువసార్లు ఉపయోగించకుండా ఉండటానికి ప్రయత్నించాలి.
 • వేడిని భరించగలిగే హీట్ సిరమ్‌ను ముందుగా జుట్టుకు రాసి, తర్వాత డ్రయ్యర్, స్ట్రెయిటనింగ్  మిషన్స్ వాడాలి. తడి జుట్టును త్వరగా వేడి చేయకుండా చూస్తే వెంట్రుకలు త్వరగా దెబ్బతినడాన్ని నివారించవచ్చు.
 • వెంట్రుకలు చిట్లడాన్ని అరికట్టడానికి మంచి పరిష్కారం ట్రిమ్ చేయడం. 6-8 వారాలకు ఒకసారి వెంట్రుకల చివరలను ట్రిమ్ చేయించుకోవాలి.

గృహ చికిత్స

1. జుట్టు తేమను అందించాలంటే నూనెతో మసాజ్ చేయడం సరైన పద్ధతి. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా బాదం నూనెలను కలిపి మాడుకు పట్టించి, మర్దనా చేయాలి. అరగంట వదిలేసి ఆ తర్వాత ప్రకృతి సిద్ధ గుణాలు ఎక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి.

2. మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, టేబుల్‌స్పూన్ తేనె గుడ్డు సొనలో కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

3. ప్రొటీన్లు ఎక్కువగా గల బొప్పాయి పండును గుజ్జులా చేయాలి. ఈ గుజ్జులో పెరుగు కలిపి తలకు పట్టించాలి. 30 ని.ల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే తేమ కోల్పోయిన వెంట్రుకలకు తిరిగి జీవం లభిస్తుంది.

4. తలస్నానం చేసిన తర్వాత చాలామంది కండిషనర్ వాడుతుంటారు. దానికి బదులుగా వెంట్రుకలకు కండిషనర్‌లా ఉపయోగపడే కప్పు తేనెలో రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీటిని కలిపి తలకు పట్టించాలి. 15 ని.ల తర్వాత నీటితో కడిగేయాలి.

Posted on

Telugu benefits for hair with cooking oils – వంటనూనెలతో కేశసౌందర్యం..

మన సౌందర్యం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనకు చాలా క్లిష్టమైన సమస్య కేశ సౌందర్యం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ విషయంలో మాత్రం ఇబ్బంది పడుతుంటాం. ఏదైనా నివారణా మార్గాన్ని అనుసరిద్దామంటే, అయితే విజయవంతమో లేక వికటించమో జరుగుతుంది.

అందుకే ఎక్కడకు వెళ్ళాలో తెలియక ఎంతో ఖర్చు పెట్టటానికి సైతం సిధపడుతుంటాం. కానీ ఎక్కడికీ వెళ్ళల్సిన అవసరం లేకుండా సహజ సిధ్ధమైన తెరపీలు వాడవచ్చు. ఇంట్లోనే ఉన్న వంట నూనెలతో కేశ సౌందర్యం పెరుగుతుంది. అవేంటో చూసేద్దామా..!

వంట కొరకు కుక్కింగ్ ఆయిల్స్ (వంటనూనెలు)ఉపయోగించడం కూడా ఒక సురక్షితమైన పద్దతి. జుట్టు సంరక్షణ కొరకు కుక్కింగ్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల, జుట్టు చిక్కుబడటం నివారిస్తుంది, జుట్టు రాలడాన్ని అరికడుతుంది, మరియు డ్యామేజ్ అయిన జుట్టును పునరుద్దరిస్తుంది. మరి ఈ సమస్యలన్నింటిని నివారించి కొన్ని కుక్కింగ్ ఆయిల్స్ గురిచి మీ ముందుంచుతున్నాం.

1. ఆలివ్ ఆయిల్ జుట్టు సంరక్షణలో అద్భుతాలను స్రుష్టిస్తుంది. ఇది జుట్టుకు అవసరం అయ్యే తేమను, పోషకాలను అధిస్తుంది మరియు లోతైన కండీషనర్ గాను ఉపయోగపడుతుంది. ఇంకా ఇది కేశాలకు బలాన్ని అధిస్తుంది మరియు చుండ్రును నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి.

2. ఆవనూనె  మందపాటి జుట్టు, నల్లటి జుట్టు పొందాలంటే మస్టర్డ్ ఆయిల్ ను ఉపయోగించవచ్చు. మస్టర్డ్ ఆయిల్ తలలో బ్లడ్ సర్కులేషన్ పెంచి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. దీనిలోలో సెలీనియం, మరియు జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, డి, ఇ మరియు కెలు కూడా ఉన్నాయి.

3. బాదాం నూనెలో విటమిన్-ఇ పుష్కలంగా ఉండటం వల్ల కేశాల పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. ఇది కూడా కొబ్బరి మరియు ఆమ్లా నూనెలు మాదిరే ఉంటుంది. అతి త్వరగా జుట్టు పెరగాలనుకొనే వారు బాదాం నూనెను ప్రతి రోజూ తలకు పట్టించాలి.

4. కొబ్బరి నూనె చర్మం మరియు జుట్టు సంరక్షణలో అద్భుతంగా సహాయపడే కుక్కింగ్ ఆయిల్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనె జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె మీ జుట్టుకు కండీషనర్ గా మాత్రమే కాదు, మీ జుట్టు మందగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో యాంటీ సెప్టిక్ లక్షణాలున్నాయి. అందువల్ల ఇది స్లాప్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

5. నువ్వుల నూనె జుట్టు సంరక్షణలో కుక్కింగ్ ఆయిల్ విషయంలో, నువ్వుల నూనె లేకుండా పట్టిక పూర్తి కాదు. జుట్టు సంరక్షణకు నువ్వులను నూనెను ఎంపిక చేసుకోవడం ఒక మంచి ఎంపిక. నువ్వుల నూనెతో మీ తలకు మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరిగుతుంది మరియు దాంతో జుట్టు పెరుగుదల ప్రారంభమౌతుంది.

6. సన్ ఫ్లవర్ ఆయిల్ ఎమోలియంట్ గా పనిచేస్తుంది, ఇది మీ జుట్టు గల జుట్టుకు కండిషనర్ గా పనిచేస్తుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ జుట్టు పెరుగుదలను పెంచుతుంది మరియు జుట్టు చిట్లతాన్ని నివారిస్తుంది. జుట్టు సంరక్షణలో కుక్కింగ్ ఆయిల్స్ లో కొబ్బరి నూనె తర్వాత అత్యంత ఎఫెక్టివ్ గా పనిచేసే కుక్కింగ్ ఆయిల్ సన్ ఫ్లవర్ ఆయిల్.

7. డ్రై హెయిర్ ఉన్నట్లైతే, అందుకు ఒక మంచి కుక్కింగ్ ఆయిల్ కనోలా ఆయిల్. కనోలా ఆయిల్ చిక్కును తొలగిస్తుంది. పొడి జుట్టును నివారిస్తుంది. జుట్టును స్మూత్ గా మరియు మెరిసేలా చేస్తుంది. అలాగే, జుట్టు చివర్లను అరికడుతుంది, జుట్టు తిరిగి ఊడిపోకుండా రక్షణ కల్పిస్తుంది.

Posted on

Telugu tips to get black hair – నల్లని జుట్టుకు

జుట్టు నల్లగా లేదని చాలా మంది బాధపడటం సహజమే. ఈ జెనరేషన్లో రకరకాల ఆహార నియమాలు పాటించటం, విశ్రాంతి లేమి ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవటంతో జుట్టు నల్లగా కాకా నిర్జీవంగా కనపడుతోంది. ఇక నల్లని జుట్టు కోసం కుర్రకారు కూడా ఎంతో టెన్షన్ పడుతున్నారంటే అతిసయోక్తి కాదేమో. ఇక స్త్రీల విషయంలో ఇది మరీ ఎక్కువగా కనపడుతోంది. నల్లని జుట్టు కోసం ఏ హెయిర్ డై వాడాలో తెలియక సతమతమవ్వాల్సిన అవసరంలేదు. మీ ఇంట్లోనే గృహ చికిత్సలు లభ్యమవుతున్నాయి. అవెంటో చూద్దామా:

1. ఒక కేజి కాచిన వెన్న (నెయ్యి)తీసుకుని, 250 గ్రాములు లిక్కరైజ్ మ్యులీసియా  (దీనిని ఎక్కువగా మందులు మరియు స్వీట్స్ తయారిలో ఉపయోగిస్తారు) తీసుకుని, 1 లీటరు ఉసిరి రసం కలిపి, వేడి చేసి ఒక సీసాలో ఉంచుకోవాలి, తలస్నానం చేసే ముందు, మీ తలకు రాసుకుని, చేస్తే సులభంగా నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.

2. అరలీటరు నీరులో రెండు చెంచాల ఉసిరిపొడి కలపండి,నిమ్మకాయని సగంగా కోసి,ఒక ముక్కలోని రసాన్ని ఆ నీటిలో కలపండి,ఈ మిశ్రమాన్ని రోజూ మీ తలకు రాసుకుని తలస్నానం చేస్తే అతి తక్కువ సమయంలో, అందమైన నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.

3.కొన్ని మామిడి ఆకులు, పచ్చి మామిడి పైన పచ్చని తొక్కను తీసుకుని,వాటిని పేస్ట్ లాగా చేసి,నూనెతో కలిపి ఎండలో ఎండబెట్టాలి,ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి శుబ్రం చేసుకుంటే జుట్టు ఊడిపోయే సమస్య తగ్గి అందంగా సహజమైన నల్లని జుట్టు పొందవచ్చు.

4. కొన్ని మామిడి ఆకులు తీసుకుని వాటిని పేస్ట్ లాగా చేసుకుని, తలకు పట్టించాలి, 15-20 నిమిషాల తరువాత, చల్లని నీటితో శుబ్రంచేసుకుంటే, అది మీ జుట్టు పెరుగుదలకే కాక అందమైన నల్లని జుట్టుని మీ సొంతం చేస్తుంది.

5. మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చికోవాలి అనుకున్న, లేదా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రాకుండా ఉండాలన్నా మామిడి యొక్క రసాన్ని తీసుకుని తలకి పట్టిస్తే మంచి ఫలితాన్నిస్తుంది, జుట్టు రాలిపోవడం,చుండ్రు సమస్యల నుంచి కూడా మంచి విముక్తి లభిస్తుంది.

Posted on

Telugu tips to stop the hair loss and hair fall – జుట్టు రాలకుండా ఉండేందుకు గౄహ చిట్కాలు

ప్రస్తుతం మారుతున్న స్థితిగతులూ, కార్పొరేట్ ఉద్యోగాలు, వ్యాపారంలో టెన్షన్లూ ఇవేకాక మానసిక ఒత్తిడులు అన్నీ కూడా మన జుట్టు ఊడిపోయేలా చేస్తాయి. ఎంత కష్టపడినా మన ఆరోగ్యం అందం దెబ్బతింటుంటే ఎవరికైనా బాధేమరి! ఇందుకోసం రకరకాల షాంపూలను, తెరపీలను వాడుతుంటాం. అవి సరిచేయకపోగా జుట్టు మరింత ఊడేలా చేస్తాయి.

ఈ సమస్యను దాదాపు నూటికి 80 శాతం మంది ఎదుర్కొంటున్నారు. అయినా సరైన పరిష్కారాన్ని అన్వేషించలేకపోతున్నారు. ఏ తెరపీ వాడినా అది సైడ్ ఎఫ్ఫెక్ట్ లేనిదై ఉండాలి. అటువంటి నేచురల్ థెరపీలు మన ఇంట్లోనే ఉన్నాయి అన్నది సత్యం.  వాటిని తెరపీలుగా వాడుకుంటే మనకు సమస్యలు తీరిపోగా మనశ్శాంతి లబిస్తుంది. ఆ గృహ చిట్కాలను మీకందిస్తున్నాం. అవేంటో చూద్దమా..!

1.కొబ్బరి నూనె: గోరువెచ్చగా చేసి తలకు రాసి మర్దన చేయడం వల్లా ఫలితం ఉంటుంది. తలలో రక్త ప్రసరణ సాఫీగా జరిగి, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగని రోజూ నూనె రాసుకోవాలని లేదు. తలస్నానానికి గంటా, రెండు గంటల ముందు నూనె రాసుకుంటే సరిపోతుంది.

2.ఉసిరి : జుట్టు రాలే సమస్యనే కాదు, చుండ్రుని కూడా నివారిస్తుంది. తలలో ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తగ్గేలా చూస్తుంది. అలాంటి సమస్యలున్నప్పుడు పెరుగులో ఉసిరి పొడిని కలిపి తలకు పూతలా వేసుకొని కాసేపయ్యాక కడిగేసుకుంటే సరిపోతుంది.

3.పెరుగు :జుట్టుని మెరిపించడంతో పాటూ ఒత్తుగా పెరిగేలా చేస్తుంది పెరుగు. దీన్ని నేరుగా తలకు రాసుకోవచ్చు. లేదంటే తేనె, నిమ్మరసం లాంటి ఇతర పదార్థాలతో కలిపీ తలకు పట్టించుకోవచ్చు. పెరుగును తలకు రాసుకుని అరగంట తరవాత తలస్నానం చేయాలి.

4.గోరింటాకు : జుట్టు సంరక్షణకు సంబంధించి గోరింటాకు పొడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారం, పదిహేను రోజులకోసారి గోరింటాకు పొడిలో కొద్దిగా నిమ్మరసం, పెరుగూ కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక తలస్నానం చేయాలి.

5.మందారం : జుట్టు విపరీతంగా రాలుతుంటే ఉడికించిన మందాల పువ్వుల్ని వాడితే ఎంతో మార్పు ఉంటుంది. అయితే ఆ పూతను నేరుగా కాకుండా పెరుగు లేదా గుడ్డులో కలిపి రాసుకోవాలి.

6.కొబ్బరిపాలు:కొన్నిసార్లు జుట్టు చిట్లిపోతుంది. పొడి బారడం, తలంతా దురదపెట్టడం వంటి సమస్యలూ తలెత్తుతాయి. వాటిని నివారించాలంటే తలకు కొబ్బరి పాలు రాసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి.

Posted on

Best hair care benefits of onions in Telugu – కేశసౌందర్యానికి ఉల్లి

‘ఉల్లి ‘చేసినంత మేలు ‘తల్లి ‘కూడా చేయదంటారు. నిజమే ఈ సామెత నూటికి నూరుపాళ్ళు నిజం. ఉల్లి లేని వంట లేదంటే ఆశ్చర్యమేమీ లేదు. ఉల్లి అరోగ్యానికే అనుకుంటున్నారా? సౌందర్యోపాసనకు కూడా ఉపయోగ పడుతుంది. మనకు కేశ సంరక్షణ అంతే చాలా ఆశక్తి ఉన్నా, దానిని సరిగ్గా పర్యవేక్షించుకోపోవటంతో కేశాలు ఊడిపోవటం, రాలటం జరుగుతుంటుంది.  కేశ సంరక్షణ జాగ్రత్తలు తీసుకొన్న తర్వాత కూడా అదే విధంగా ఉంటే దానికి కారణం అనారోగ్యకరమైన జీవన శైలి, ఆహారంలో అసమతుల్యత వల్ల చర్మ మరియు జుట్టు మీద చెడు ప్రభావాన్ని చూపుతుంది.

మన వంటగదిలోని చాలా రకాలు వంటకు ఉపయోగించే వస్తువులను హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు తేనె, గుడ్డు, పెరుగు, బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మరసం, మరియు ఉల్లిపాయ వంటివి హోమ్ రెమెడీ హెయిర్ ట్రీట్మెంట్ కు ఉపయోగిస్తుంటారు. ఉల్లిపాయ మన కళ్ళలో నీళ్ళు కారేవింధంగా చేస్తుంది. అలాగే కురుల సమస్యలను కూడా నివారిస్తుంది.

ఈ సమస్యకు ఫుల్ స్టాప్ చెప్పాలంటే ఉల్లి చలవ చాలు. మరి ఉల్లి చేసే మేళ్ళేంటో చూద్దామా! ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా !

1. ఉల్లిపాయలో అధిక శాతంలో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ రక్త ప్రసరణను పెంచి, కురులకు శక్తిని ఇస్తుంది. ఉల్లిపాయను మెత్తగా చేసి తలకు రాయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. దీన్ని అలాగే ఉల్లిపాయ పేస్ట్ తలకు పట్టించడం లేదా ఏదైనా ఇతర హెయిర్ ప్యాక్ లతో ఈ పేస్ట్ ను కూడా కలిపి తలకు పట్టించాలి. ఇలా చేయడానికి అరగంట ముందు తలకు హాట్ ఆయిల్ మసాజ్ చేయాలి.

2. ఉల్లిపాయ రసం తలలో ఇతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ మీ కేశాలను డ్యామేజ్ చేయవచ్చు. అంతే కాదు అది జుట్టు రాలడానికి ముఖ్య కారణం కావచ్చు. కాబట్టి స్లాప్ ఇన్ఫెక్షన్ అరికట్టడానికి ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించండి. ఇంకా హెయిర్ ఫాలీసెల్స్ లో మూసుకు పోయిన రంద్రాలను తెరచుకొనేలా చేస్తుంది.

3.  ఉల్లిపాయ రసంను తలకు పట్టించడం వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరిగి కొత్తగా వెంట్రుకలు మొలవడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ హెయిర్ ఫాల్ ను అరికట్టడమే కాదు, హెయిర్ గ్రోత్ కు కూడా సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని కొబ్బరి నూనెలో కలుపుకొని బాగా మిక్స్ చేసి తల మాడుకు మసాజ్ చేయాలి. చేసిన అరగంట తర్వాత రెగ్యులర్ గా ఉపయోగించే మంచి షాంపుతో, చల్లనీటి తలస్నానం చేసుకోవాలి.

4. హోం రెమడీస్ లలో చుండ్రును వదలగొట్టడానికి ఇదొ అద్బుతమైన చిట్కా. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం వల్ల హెయిర్ లాస్ అరికడుతుంది. అలాగే చుండ్రును నివారిస్తుంది. మీరు రెగ్యులర్ గా తలకు వాడే హెయిర్ ప్యాక్ కి కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని కూడా చేర్చడం వల్ల చుండ్రును నివారించగలుగుతుంది. నిమ్మరసం, పెరుగు, మరియు కొద్దిగా తేనె మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల కూడా చుండ్రును నివారంచవచ్చు.