Posted on

Homemade tips with hibiscus for the hair care in Telugu – కేశ సౌందర్యానికి మందారం

కేశ సౌందర్యానికి సహజసిధ్ధంగా మేలుచేసే ఔషధం మందారం. మందారం పవిత్ర ఆచార పూజా కార్యక్రమాలలో వాడటం జరుగుతుంది. అంతేకాక మందారం చేసే మేలులెన్నో ఉన్నాయి. అవేంటో చూద్దామా..

1. జుట్టుకు కండిషనర్   మందార ఆకులు మరియు పువ్వు రేకులను పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె ఉపయోగిస్తారు. జుట్టు ముదురు రంగులో మారటానికి మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.

2. చర్మ సంరక్షణ   దీనిలో కాస్మెటిక్ చర్మ సంరక్షణకు ఉపయోగించే గుణాలను కలిగి ఉంది. ముడుతలు వంటి అనేక చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

3. వివిధ దేశాలలో మందార ఆకులతో తయారు చేసిన టీ ని ఔషధ ప్రయోజనాల కొరకు వినియోగిస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి సహజ మూత్రవిసర్జన ప్రేరకంగా సహాయం కొరకు చక్కెర లేకుండా వినియోగిస్తారు.

4. రక్తపోటును తగ్గించటానికి సహాయం   కొన్ని అధ్యయనాల ప్రకారం అధిక రక్తపోటుతో బాధపడుతున్న అనేకమంది ప్రజలు మందార ఆకు టీ సేవించడం వలన రక్తపోటు తగ్గిందని నిరూపించటం జరిగింది. అందువల్ల దీనిని రక్తపోటు తగ్గించడానికి సాధారణ ఆహార వినియోగం కొరకు సిఫార్సు చేయబడింది.

5. గాయాల చికిత్సకు మందార నూనె ఓపెన్ గాయాలు మరియు క్యాన్సర్ కారణంగా వచ్చే గాయాలకు రాయటం కొరకు ఉపయోగిస్తారు.ఇది క్యాన్సర్ ప్రారంభ దశల్లో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఓపెన్ గాయాలను వేగంగా నయం చేయటంలో సహాయపడుతుంది.

6. మందార ఆకు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దాని కంటెంట్ ధమనుల లోపలి భాగంలో పొరలు ఏర్పడకుండా నివారించడంలో సహాయపడుతుంది. తద్వారా మీ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

7. జలుబు మరియు దగ్గు మందార ఆకులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మందార ఆకు టీ మరియు ఇతర పదార్దాల రూపంలో సేవించటం వలన రోగనిరోధక శక్తి పెరిగి తద్వారా జలుబు మరియు దగ్గు తగ్గటానికి సహాయపడుతుంది. మీకు జలుబు చాల త్వరగా తగ్గటానికి సహాయపడుతుంది.

8. బరువు క్షీణత మరియు జీర్ణక్రియ సహజ ఆకలిని తగ్గించి పథ్యసంబంధమైన బరువు తగ్గటానికి సహాయం చేస్తుంది. మందార ఆకు టీ త్రాగటం వలన మీ శరీరంలో అనవసరమైన కొవ్వును తగ్గుతుంది. అంతేకాక ఆహార జీర్ణక్రియకు మరింత సమర్ధవంతంగా సహాయపడుతుంది.

9. యాంటీ వృద్ధాప్యం   మందార ఆకులలో అనేక యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించటానికి సహాయం చేయుట వలన వృద్ధాప్య ప్రక్రియ మందగిస్తుంది. అంతేకాక కొన్ని సందర్భాలలో జీవితం కొనసాగింపు జరుగుతుంది.

10. రెగ్యులర్ ఋతు చక్రం మందార ఆకు టీ రెగ్యులర్ గా వినియోగించుట వలన శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గించడంలో మహిళలకు సహాయపడుతుంది.శరీరంలో సరైన ఋతు చక్రం నియంత్రించటంలో సహాయం మరియు సమతుల్య హార్మోన్ల స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.

Posted on

Remedies for white hair in Telugu – మీకు జుట్టు తెల్లపడుతోందా?

చాలా మందిలో ఇప్పుడు నెలకొని ఉన్న ప్రధాన సమస్య జుట్టు తెల్ల పడటం. ఒకటి తెల్లబడితే చాలు ఏదో కోల్పోయినట్టుగా బాధపడతారు. అయ్యో..! నా వయసు చిన్నదేనే అప్పుడే తెల్ల పడిందేంటి అని తెగ సతమతమవుతారు. అయితే మారుతున్న అహార అలవాట్లు, విశ్రాంతి, అలోచనలు ఇవన్ని మీ జుట్టుపై ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా..20లు దాటకుండానే ఈ సమస్యకు అందరూ దగ్గరపడుతున్నారు.చిన్న వయసు వారే బ్యూటి స్పాల చుట్టూ తిరుగుతున్నారు. జుట్టు ఎందుకు తెల్లబడుతుందో మనం ఈ శీర్షికలో తెలుసుకుందామా..

అయితే వయసుతో పాటు వెంట్రుకలు తెల్లబడటం సహజమే. కాని చిన్నవయసులోనే తల నెరిసిపోవడం అసహజం. ఏ వయసులో అయినా సరే జుట్టు పండిపోవడానికి కారణం వయసుతో పాటు వర్ణకారక పదార్థాన్ని సరఫరా చేసే పొర బలహీనమై చర్యాశీలత తగ్గడమేనని వైద్యుల చెబుతున్నారు..

వెంట్రుకలు త్వరగా నెరిసి పోవడానికి అనేక కారణాలున్నయి.

వెంట్రుకలు తెల్లబడటానికి కారణాలు

1. మనం తినే ఆహారపు అలవాట్లూ, మన చేసే అశ్రద్ధ వల్ల లోపాలు, వ్యాధులు ముఖ్యంగా జీర్ణ సంబంధ వ్యాధుల తాకిడి వల్లే తల తొందరగా తెల్లబడుతుందని నిపుణులు చెబుతున్నారు.

2. వంశపారంపర్యంగా వచ్చే ఆల్బిజం వంటి వ్యాధుల వలన ఈ సమస్య రవచ్చు.

3. కొన్ని రకాల విషజ్వరాలతో బాధ పడేటప్పుడు కూడా తల నెరిసిపోవచ్చు.

4. శరీరంలోని పిట్యూటరీ గ్రంధి, థైరాయిడ్ గ్రంధి తగినంత హార్మోనులను ఉత్పత్తి చేయకపోతే చిన్నప్పుడే వెంట్రుకలు తెల్లబడతాయి.

5. ఇంకా సరైన పోషకాహారం తీసుకోనివారిలోను, వ్యాధులతో ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలతో బాధపడేవారిలో తల తొందరగా తెల్లబడుతుంది.

6. ఇలాకాక సరైన పోషకాహారం తీసుకోనివారిలోను, వ్యాధులతో ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలతో బాధపడేవారిలో తల తొందరగా తెల్లబడుతుంది.

జుట్టు తెల్లబడడం అంటూ ఒకసారి మొదలయిందంటే ఇక అది అలాగే ఉండిపోతుంది. వ్యాధి వల్ల జుట్టు నెరవడం జరిగితే సకాలంలో వ్యాధికి చికిత్స పొందిన సందర్భాల్లో మాత్రమే జుట్టు కొద్దిగా అయినా నల్లబడే అవకాశాలుంటాయి.

వెంట్రుకలు తెల్లబడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • రోజూ తీసుకునే తిండిలో మల్టీ విటమినులు, బి కాంప్లెక్స్ విటమినులు తీసుకునే ఆహారం లో ఉండేట్టు చూసుకోవాలి.
 • తెల్లబడిన తల తిరిగి నల్లబడటానికి తగిన మందులు, చికిత్సా పద్ధతులు ప్రస్తుతానికి లేవు. మిగతా వెంట్రుకలు కూడా తెల్లబడకుండా ఉండాలంటే తినే తిండి విషయమై జాగ్రత్త తీసుకోవాలి.

3. ఆఫ్ఫీస్ నుంచీ రాగానేనో, తల బాగా నొప్పిగా ఉందనో ఉపశమనం కోసం సెలూన్లకు వెళ్ళో, స్పాలకు వెల్లో మర్దన పేరిట తల వెంట్రుకల కుదుళ్లను మరింత బలహీనం చేయడమే తప్ప ఏ ప్రయోజనం ఉండదు. రకరకాల తైలాలు వాడటం, ఏ చిట్కాలను ఆశ్రయించినా ఆశించినంత ఫలితం రాకపోగా మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి.

ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, పాల తయారీలు, మాంసం, గ్రుడ్లు ఎక్కువగా వాడాలి. ఆకుకూరలను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది.ఆరోగ్యమే మహా భాగ్యం అన్నరు పెద్దలు. ఆ ఆరోగ్యమే బాగుంటే తల నెరవటం జరుగదు, జుట్టు ఊడే పరిస్తితి మీకు రాదు. అరోగ్య సమతుల్యత సాధించాలంటే పోషకాహారాన్ని చక్కగా తినాలి. ఆలోచనలకు స్వస్తి పలకండి. ఎందుకంతే ఆలోచనలెక్కువ ఉన్నవారికి అందోళన కూడా సహజంగా ఉంటుంది.కాబట్టి ఆందోళనలకు టాటా చెప్పండి. నిగనిగలాడే జుట్టును

Posted on

Home remedies to control the hair fall, hair loss in Telugu – మీ జుట్టు ఊడిపోతుందా?మీ అందమైన జుట్టు రక్షణకు సహజమైన చిట్కాలు చుద్దామా

అనేక ఏళ్ళుగా ఎందరో, కాదు కాదు దాదాపుగా అందరూ ఎదుర్కునే ఏకైక సమస్య ఈ జుట్టు ఊడిపోవడం, అసలు జుట్టు ఊడిపోవడం అనేది మనం అనుకునే అంత పెద్ద సమస్య కాదు అనుకోవడానికి లేదు, ఇది సాధారణంగా ఒత్తిడి వల్ల,సరియైన ఆహరం తీసుకోకపోవడం వల్ల, దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధాప్యం, వంశపారంపర్య, కాలుష్యం ఎలా అనేక సమస్యల వల్ల ఈ సమస్య మనల్ని పట్టి పీడిస్తుంది. అయితే భయపడవలసిన అవసరం లేదు. దీనిని అత్యంత పొషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా,సరియైన జుట్టు సంరక్షణ పదార్దాలు అంటే, నూనే లాంటివి వాడడం ద్వారా నిర్మూలించవచ్చు.

 • కొబ్బరి, మీ జుట్టు సం రక్షణలో అన్నిటికంటే, మొదటిగా, మరియు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోబ్బరి గురించే, దీనిలో ఉత్పన్న లక్షణాలు మీ జుట్టుని ఊడిపోకుండా కాపాడడంలో ఎంతగానో సహాయపడతాయి, అయితే కొబ్బరి కాయని చిన్న చిన్న ముక్కలుగా చేసి రుబ్బితే
  అందులో ఉండే కొబ్బరి పాలు, మీ జుట్టు రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి.
 • రాత్రి పడుకునే ముందు మీ జుట్టు కు జొజోబా ఆయిల్ పట్టించి, మరుసటి రోజు తలస్నానం చేస్తే మంచి ప్రభావం చూపిస్తుంది.
 • ఒక్కోసారి తగినంత పోషక ప్రోటీన్లు లేకపోవడం కారణంగా మీ జుట్టు ఎక్కువగా ఊడిపోవడం జరుగుతుంది,అందుకే ఈ పోషక ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం,రోజు వారి ఆహారంలో “హైడ్రోక్లోరిక్ ఆమ్లం టాబ్లెట్(Hydrochloric Acid)” ఒకటి
  తీసుకోవడం మంచిది.
 • ఒక కోడి గుడ్డు తీసుకుని దానిలోని తెల్ల సొనని ఆలీవ్ ఆయిల్ లో కలిపి, ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించాలి,20నిమిషాల తరువాత చల్లని నీటితో,షాంపూతో తల స్నానం చేస్తే గుడ్డులో అదికంగా ఉండే సెలీనియం, ఐరన్, ఫాస్ఫరస్ మీ జుట్టుకు పట్టి మంచి ప్రబావం
  చూపిస్తాయి.
 • ఉసిరి మీ జుట్టుని రక్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది.ఇందులో ఉండే “యాంటీ ఆక్సిడంట్స్(Anti Oxidents)”,”Vitamin C”మీ జుట్టుకి బలాన్ని చేకూర్చడంలో ఎంతగానో సహాయపడుతుంది.2 స్పూన్లు ఉసిరి పొడి, 2 స్పూన్లు నిమ్మ రసం కలిపి మీ జుట్టికి పట్టించి
  20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.
 • మీ ఇంట్లో దొరికే పదార్దాలలో తేనె,ఆలీవ్ నూనె,దాల్చిన చెక్క కలిపిన మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.
 • ఒక కోడి గుడ్డు తీసుకుని,దానిలోని సోనను,గోరింటాకు పొడిని,కొంచెం పెరుగు కలిపి, ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి కాసేపటి తరువాత వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.
 • మీకు తెల్ల జుట్టు పెరగ కుండా ఉండాలన్న,జుట్టు ఊడిపోకుండా ఉండాలన్నా, మందార పువ్వులు తీసుకుని పొడిగా చేసి అందులో కొబ్బరి నూనె కలిపి, ఆ పేస్ట్ ని మీ తలకు పట్టించి 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఉపసమనం
  కలుగుతుంది.
 • 10-12 గోరింట ఆకులు తీసుకుని, ఆవాల నూనెలో కలిపి, మరగ పెట్టాలి,తరువాత ఈ మిశ్రమంలో ఆకులన్ని తొలగించి, దానిని ఒక సీసాలో ఉంచుకుని రోజూ మీ సాధారణ నూనెలా ఉపయోగించుకుంటే మంచిది.
Posted on

Oily scalp and oily hair tips in Telugu – జిడ్డుగల జుట్టుకు పరిష్కారాలు, సహజమైన పద్దతులలో ఉత్తమమైన మార్గాలు

అందమైన జుట్టుకోసం అంతులేని మార్గాలు ఉన్న ఈ కాలంలో వారానికి 3-4 సార్లు తలస్నానం చేసినా ఎప్పుడైన మీ జుట్టు జిడ్డుగా మారిపోవడం గమనించారా, పోనీ అలా ఎందుకు అయిపొతుందో తెలుసుకున్నారా, ముఖ్యంగా, మీరు ప్రొద్దున్న చేసిన తలస్నానం మిమ్మల్ని ఎంతో ఫ్రెష్ గా ఉంచుతుంది, కాని సాయంత్రానికి అది మీ జుట్టిని వదిలేస్తుంది, దీనికి కారణం “శబం(Sebum)”అనే కొవ్వుతో కూడిన పదార్దం సరియైన రీతిలో ఉత్పత్తికాకపోవడమే.ఈ “శబం (Sebum)” వల్ల మన జుట్టు ఎంతో కోమలంగా, మరియు పొడిబారకుండా ఉంటుంది.

ఈ జిడ్డు గల జుట్టు వల్ల, మీ జుట్టుకే కాకుండా మీ చర్మానికి కూడా హాని కలిగే ప్రమాదం ఉంది.ఈ జుడ్డుగల జుట్టు 2 రకాలు, మొదటిది మీ జుట్టు యొక్క మొదలు భాగం నుంచి చివరి భాగం వరకు జిడ్డుగా ఉండడం, రెండొవది మీ జుట్టు మొదలు భాగం జిడ్డుగా ఉండి, చివరి భాగం పొడిబారిపోవడం. అయితే చింతించవలసిన అవసరం లేదు.

జిడ్డుగల జుట్టుని నిర్మూలించి, జుట్టుని రక్షించే మార్గాలు

1.రోజూ తలస్నానం చేసే అప్పుడు మీ షాంపూతో మీ జుట్టుని శుబ్రముగా రుద్దండి, దానివల్ల మీ జుట్టుకి పట్టిన దుమ్ము, ధూళి వదిలి మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

2.మంచి “కండీషనర్” తయారు చేసుకోండి, కొంచెం కలబంద రసం, ఒక స్పూన్ ఆపిల్ కలిపిన వెనిగర్, నిమ్మరసం తీసుకుని మీ జుట్టు కి పట్టించి శుబ్రం చేసుకుంటే ఎంతో మంచిది

3. ప్రత్యేకంగా జిడ్డుగల జుట్టుతో పోరాడే షాంపూని వాడతం ఏంతో మంచిది,సాదారణంగా షాంపూలోని “PH” శాతం 4-7 వరకు ఉండగా, జిడ్డుగల జుట్టుకి, మరింత ఎక్కువ శాతం ఉండేది అవసరం.

4. మా షాంపూని మీరే తయారుచేసుకోండి, అందులో కొంచెం కలబంద రసం, 2 టేబుల్ స్పూన్లు నిమ్మ రసం కలిపి ఫ్రిజ్లో పెట్టి కావాల్సినపుడు ఉపయోగించుకోవచ్చు.

5. మీది జిడ్డుగల జుట్టు అయితే సాద్యమైనంత వరకు “కండీషనర్”లు వాడకపోవడం మంచిది. ఒకవేళ వాడాల్సి వస్తే మీ జుట్టు చివరి భాగాలకు పట్టించి శుబ్రం చేసుకోవడం మంచిది.

6. మీరు ఎక్కువగా జుట్టు దువ్వుకునేవారైతే, మీకు జుట్టూ ఊడిపొయే ప్రమాదం ఎక్కువ, అందుకే తగ్గించి దువ్వుకోవడం మంచిది.

7. మీ జిడ్డుగల చర్మంతో పోరాడడానికి నిమ్మ సారం, టీ,పళ్లరసం,వినెగార్ ఎంతో ఉపయోగపడతాయి, కాని ఇవి వాడిన తరువాత మీ జుట్టుని చల్లని నీటితో శుబ్రం చేసుకోండి, లేదంటే వాటిలోని రసాయన తత్వం మీ జుట్టుకి హాని కలిగించే ప్రమాదం ఉంది.

8. కోడి గుడ్డు సొన తీసుకుని కొంచెం సున్నం కలిపి మీ జుట్టుకి పట్టించి శుబ్రం చేసుకుంటే, మంచి ప్రభావం చూపిస్తుంది.

 

ఇంకెందుకు ఆలోచన, పైన సూచించిన వాటిలో అన్నీ మన ఇంట్లో ఉండేవే, జుట్టు పై బెంగ పోవాలంటే ఒక్కసారి ట్రై చేసేయండి.

Posted on

Monsoon hair care tips in Telugu – వర్షాకాలంలో మీ జుట్టుకి తీసుకోవలసిన జాగ్రత్తలు..

వర్షాకాలం అంటే ఎంతోమందికి ఇస్టం అయినది, సరదాగా తడచి హాట్, హాట్ కాఫీ తాగితే ఆ మజాయే వేరు, కాకపోతే ఎంత సరదానో అంతే ఇబ్బందులు కూడా ఉంటాయి, అవి ఏమిటంటారా, రండి చూసేద్దాం.

 • వర్షాకాలం అనేది అన్ని ఋతువులలో కల్లా ఎంతో ప్రత్యేకమైనది, అంతే కాకుండా ఎన్నో ప్రత్యేకతలతో కూడినది, ఈ కాలంలో తడితనం అంటే తేమ ఎక్కువగా ఉంటుంది.దీని వల్ల మీ జుట్టుకి చుండ్రు పట్టే అవకాశాలు ఎక్కువ.ఈ చుండ్రు వల్ల మన జుట్టే కాదు మంచి అందం కుడా పాడైపోతుంది.
 • వర్షాకాలంలో వర్ష శాతం ఎక్కువగా ఉండడం వల్ల మీ జుట్టుని తడవనివ్వకండి,ఎక్కువగా తడిస్తే మీ జుట్టూ పాడైపోయే ప్రమాదం ఉంటుంది.మీ జుట్టుని కాపాడుకోవడానికి “గొడుగులు”,”Caps” ఉపయోగించండి.
 • ఒకవేళ అనుకోని పరిస్తితుల్లో మీ జుట్టూ తడిచిపొయినట్లయితే వీలైనంత త్వరగా తుడుచుకుని ఆరబెట్టుకోండి.
 • వారంలో 2-3 సార్లు తలస్నానం చేయండి, అలా చేయడం వల్ల మీ జుట్టు మొదళ్ళు శుబ్రముగా వుండి, ఏరకమైన జుట్టుకి సంబందించిన వ్యాదులు(చుండ్రు,ఫంగస్”)  సోకవు.
 • మీ జుట్టుని సాద్యమైనంతవరకు తడిగా ఉండనివ్వరాదు,అలా ఉన్నప్పుడు గట్టిగా కట్టకూడదు.
 • అందమైన, మెరిసే జుట్టు కోసం “హెయిర్  కండిషనర్లు” ఉపయోగించండి.
 • ఎక్కువ శాతం నీరు,పళ్ళ రసములు తాగడం మంచిది.
 • ఈ కాలంలో కొద్ది కొద్దిగా జుట్టు వూడిపోవడం సహజం, కంగారుపడనవసరం లేదు, “హెయిర్ కర్లింగ్”,మొదలగు విధానాలు మానుకోవడం మంచిది, వీటి వల్ల జుట్టు పాడైపొయే అవకాశం ఎక్కువ.
 • ఒకవేళ మీకు  తీవ్రమైన సమస్యలు తలెత్తితే, చర్మానికి లేదా జుట్టుకి సంబందించిన వైద్యుల్న్ని (dermatologist or trichologist)సంప్రదించడం ఎంతో మంచిది.

చేయవల్సినవి:

 • వారానికి 2-3 సార్లు తలస్నానం చేయండి.
 • తలస్నానం చేసే ముందు జుట్టుకి నూనె పెట్టుకుని తరువాత చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 • విటమిన్ “E” కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకొండి.

చేయకుడనివి:

 • మీ జుట్టుని తడిగా ఉంచరాదు.
 • తడిగా ఉన్నప్పుడు దువ్వరాదు.
 • వర్షాకాలంలో “Dryers” ఉపయోగించకపోవడం మంచిది.

పైన సూచించినవన్నీ మీ అందమైన, మరియు ఆరోగ్యవంతమైన జుట్టుకోసమే, పాటించండి.

Posted on

Hibiscus flower beauty benefits in Telugu – సౌందర్యానికి ‘మందారం’

నేటి ప్రపంచంలో అదీ ఈ యాంత్రిక జీవనంలో ఆహారానికి పెడుతున్న ఖర్చు కంటే సౌందర్యానికి పెడుతున్న ఖర్చు అంతా ఇంతా కాదు. ఇక కేశ సమ్రక్షణ కోసం మరింత ఖర్చే పెడుతున్నారు. అయితే సౌందర్యాన్ని కాపాదుకునేందుకు, పోషణకు మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులున్నప్పటికీ సహజంగా లభించేవాటిలో సౌందర్య పరిరక్షణ చేసుకోవడం సులువే కాక ఖర్చు తక్కువ కూడా.

అలాంటి కోవకు చెందిన వాటిలో ఎంతో మేలైనది మందారం.మందారం ఉపయోగలను తెలుసుకుందమా..

మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌదర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పడతాయి.ఈ మొక్క నుంచి నూనె తీస్తారు.మందార నూనెతో తలవెంట్రుకలను  పరిరక్షించుకోవటమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.మందార నూనెలో తేమ ఉంటుంది కనుక చర్మానికి, కేశాలకు మృదువుగా ఉందేందుకు తోడ్పడుతుంది.మందార నూనె కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలు మరింతగా మెరిసి అందానీ, మెరుపుని ఇస్తుంది.ఈ నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు నివారించవచ్చు.జుట్టు రాలటం తగ్గతమే కాకుందా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కేశాలు తెల్లబడకుండా ఉందేందుకు ఉపకరిస్తుంది.అంతేకాక దృఢంగా ఉండేందుకు మెరుపుతో ఉందేందుకు ఈ నూనె ఉపయోగపడుతుంది.కేశాలకు వృధప్య చాయలు దరి చేరకుండ చూస్తుంది.చర్మం నునుపుగ ఉండెల చూస్తుంది.చర్మం లో మృత కణజాలం లేకుండా చూస్తుంది.స్నానానికి వెల్లేముందు మందార నూనె నీటిలో వేయటం వల్ల శరీరం అందంగా ఉండటమేకాక సుగంధభరితంగా ఉంటుంది.పాదాల సంరక్షణలోనూ తన ఉనికి కాపాడుకుంతోంది.పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మసాజ్ ఇస్తే మంచి ఫలితాలొస్తాయి.అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేమంటే మందారం అన్నిచోత్ల విరివిగా దొరకుతుంది.

Posted on

Lemon juice for beauty care in Telugu – మీ అందం, చర్మం, జుట్టు మరియు గోళ్ళ సంరక్షణకు నిమ్మరసం చెప్పే చిట్కాలు

నిమ్మకాయని అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు,ఇది “సిట్రస్ పండ్ల”రకమునకు చెందినది, దీనిలో “విటమిన్ సి”ఉంటుంది, ఈ విటమిన్ మన చర్మంలోనికి చొచ్చుకుపోయి, దుమ్ము, ధూళి, మలినాలతో మూసుకుపొయిన రంద్రాలను శుబ్రం చేసి చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది.

చర్మం మరియు జుట్టు సంరక్షణకి నిమ్మరసం ఎలా పని చేస్తుందో చుద్దామా….

కాంతివంతమైన చర్మం కోసం నిమ్మరసం ఎల ఉపయోగపడుతుందంటే:

కొంచెం నిమ్మరం తీసుకుని, మీరు స్నానం చేసే నీటిలో కలపాలి,దీనివల్ల మీ చర్మంలో ఉన్న మలినాలు అన్ని పొయి, మీ చర్మంపై రంద్రాలు శుబ్రముగా అవుతాయి,

మీ కాళ్ళను నీటిలో ముంచి 10-15 నిమిషాల తరువాత తీస్తే, మీ చర్మం పై ఉన్న చనిపొయిన, పనికిరాని కణాలు తొలగిపొయి, మీ చర్మం కాంతివంతముగా ప్రకాశిస్తుంది.

దీనిలోని  సిట్రిక్ యాసిడ్ లక్షణము మీ ముఖం పై ఉన్న నల్ల మచ్చలను తొలగించుటలో ఎంతగానో సహయపడుతుంది.

కాంతివంతమైన చర్మం కోసం:

2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్లు వైన్, 2 టేబుల్ స్పూన్లు నీరు తీసుకుని, బాగా కలిపి మీ ముఖానికి పట్టించాలి, కాసేపటి తరువాత మీ ముఖాన్ని శుబ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

చెడు చర్మ నిర్మూలనకు:

మీ చర్మం పై ఉన్న మలినాన్ని శుబ్రం చేసుకోవాలంటే నిమ్మ కాయ ముక్కని తీసుకుని చక్కెరలో ముంచి దానిని మీ ముఖం పై రుద్దాలి, ఒకవేళ చక్కెర తరిగిపోతే మళ్ళీ  ముంచి రుద్దడం వల్ల, మీ చర్మం పై మంచి మెరుగు వచ్చి, కాంతివంతంగా ప్రకాశిస్తుంది.

నిమ్మ “మాయిశ్చురైజర్”(తేమను కలిగించే పదార్దం)”లా ఎలా ఉపయోగపడుతుంది.

సాదారణంగా మీ చర్మం పొడిబారిపోతే,  1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకొని బాగా కలపండి, ఈ మిశ్రమాన్ని పొడి బారిన చర్మంపై పట్టించి 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో   శుబ్రం చేసుకోండి, ఇది మీ చర్మంలో తేమను పుట్టించి మంచి ఫలితాలను ఇస్తుంది.

నల్లని మచ్చల నిర్ములనలో:

మీ అందమైన చర్మం పై నల్ల మచ్చలు బాధిస్తుంటే,వాటిపై కొంచెం నిమ్మ రసాన్ని రుద్దండి,10-15 నిమిషాల తరువాత శుబ్రం చేసుకోండి, ఇది మీ చర్మం పై ఉన్న నల్ల మచ్చలకు కారణమైన మీ చర్మ రంధ్రాలని శుబ్రం చేసి, మీ చర్మాన్ని మచ్చలు లేకుండా చేస్తుంది.

మీ జుట్టు సంరక్షణ కోసం నిమ్మకాయ ఎలా ఉపయోగపడుతుంది:

నిమ్మరసం మీ జుట్టు సంరక్షణకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది, ఇది మీ జుట్టుకోని చుండ్రుని తగ్గించి మంచి “జుట్టు కండీషనర్”గా పనిచేస్తుంది.1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్,1 టేబుల్ స్పూన్ తేనె, 3టేబుల్ స్పూన్లు నిమ్మ రసం,బాగా కలిపి మీ జుట్టుకి పట్టించండి, 30 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే మంచి మార్పు వస్తుంది.

మీ గోళ్ళు సంరక్షణ కోసం నిమ్మరసం ఎలా పనిచేస్తుంది:

నిమ్మరసాన్ని ఒక గిన్నెలోకి పిండి, మీ గోళ్ళని 10 నిమిషాలు అందులో ఉంచండి, తరువాత బయటకు తీసి బ్రష్ తో శుబ్రముచేసుకోవాలి.మంచి ఫలితాల కోసం నిమ్మరసం కు వెనిగర్ను జోడించండి.ఇది మీ గోళ్ళను అందంగా,గట్టిగా చేస్తుంది.

Posted on

Beauty benefits of rose water in Telugu – పన్నీరు తో జుట్టు, కంటి రక్షణ, మరియు చర్మం యొక్క సంరక్షణ ఎలా?

పన్నీరుకి మన అందానికి ఎంతో మంచి సంబందం కలదు,సమాన్యంగా మన భారత దేశంలో, ప్రతీ ఇల్లు పన్నీరు కలిగి ఉంటుంది అనడంలో సందేహమే లేదు.

మీ కంటి సం రక్షణకు చిట్కాలు:

 • మీ కళ్ళు చల్లగా, మరియు, ప్రశాంతంగా ఉండడానికి కొంచెం “దూదె”(కాటన్ బాల్)తీసుకుని,పన్నీరులో ముంచి మీ కళ్ళ పై పెట్టుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.
 • ఈ పన్నీరుని “ఐ డ్రాప్స్”గా కూడా ఉపయోగించుకోవచ్చు, ఎలా అంటే, మీ కళ్ళు మంటలు పుడుతున్నా, ఎర్రగా ఉన్నా, 2-3 చుక్కలు మీ కంటిలో వేసుకుని 10-15 నిమిషాలు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంటే చల్లగా,ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
 • మీరు కళ్ళ కింద నల్లని మచ్చలతో బాధపడుతున్నారా, ఐతే కొంచెం పన్నీరు తీసుకుని, “దూదె” (కాటన్ బాల్) తో మచ్చలపై పన్నీటిని రాయండి,చనిపొయిన మీ చర్మ కణాలని తొలగించి,మలినాలతో మూసుకుపొయిన మీ చర్మంలోని రంద్రాలని శుబ్రం చేసి, మచ్చలని తొలగిస్తుంది.
 • పన్నీటితో ప్రయత్నించి విసిగిపొయి ఉన్నారా, ఐతే కొంచెం గంధం పొడిని పన్నీటిలో కలిపి ఆ మిశ్రమాన్న్ని మీ కంటి రెప్పలపై పట్టించుకుని 10-15 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

మీ చర్మ సం రక్షణకు చిట్కాలు:

 • కొంచెం పన్నీరు తీసుకుని, కొంచెం “దూదె”తో (కాటన్ బాల్) తీసుకుని, మీ ముఖాన్ని పన్నీటితో శుబ్రం చేసుకోవాలి, అలా చేస్తే మీ ముఖంలోని దుమ్ము, ధూళి అంతా పోయి,చాలా తాజాగా అనిపిస్తుంది, ఇలా ఉదయాన్నే, మరియు రాత్రి పడుకునే ముందు చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది.
 • అంతే కాకుండా ఈ పన్నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకుంటే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.పన్నీటి సుగంధ పరిమళం(వాసన)మీ చర్మంలోని ఒత్తిడిని తగ్గించి ఎంతో తాజాగా మరియు ప్రశాతంగా ఉంచుతుంది.
 • మీరు మొటిమలు, నల్ల మచ్చలతో బాధపడుతూ ఉంటే, కొంచెం పన్నీరు తీసుకుని, ఆ మచ్చలపై రాస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది.

జుట్టు సం రక్షణలో పన్నీరు ఎలా ఉపయోగపడుతుంది:

 • అందమైన మీ జుట్టు కోసం కొంచెం పన్నీరుని, మీ షాంపూతో కలిపి జుట్టుకి పట్టించండీ,పన్నీటి సుగంధ పరిమళం(వాసన)మీ యొక్క జుట్టుకి పట్టి, మీ జుట్టుకి మంచి సువాసన లబిస్తుంది.
 • అంతేకాకుండా ఈ పన్నీరు మీ జుట్టు రక్షణకై “హెయిర్ కండీషనర్”గా కూడా ఉపయోగపడుతుంది.
 • ఒక వేళ మీ జుట్టూ రాలిపొతుంది(ఊడిపోతుంది) అని చింతిస్తున్నారా, ఐతె కొంచెం పన్నీరుని మీ అరచేతిలోకి తీసుకుని మీ వేళ్ళతో మీ జుట్టు యొక్క మొదళ్ళకు పట్టిస్తే, మంచి ఫలితాలు పొందవచ్చు.
 • మీరు చుండ్రుతో బాదపడుతున్నరా, ఐతే కొంచెం మెంతుపొడి, పన్నీరు కలిపి, మీ జుట్టుకు పట్టించి, 10-15 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మీ  చుండ్రు మాయామౌతుంది.
 • మీ జుట్టుకి నూనె బదులు ఈ పన్నీరు రాసుకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది.
Posted on

Telugu black hair tips – అందమైన నల్లని జుట్టు మీ సొంతం కావాలంటే?

మీరు మీ జుట్టుని అందంగా, నల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారా,తెల్ల జుట్టు వస్తే “హేయిర్ డయర్” వాడాలేమో అని భయపడుతున్నారా. ఐతే ఇంకెందుకు ఆలస్యం, అతి తక్కువ ఖర్చుతో, మీ ఇంట్లోనే, సహజమైన పద్దతులతో మీ జుట్టుని కాపడుకోవడం ఎలాగో తెలుసుకుందాం రండి.

పొడవైన,అందమైన,తళ, తళ లాడే జుట్టు మీ సొంతం కావాలంటే ఇలా చేస్తే సరి:

 • అరలీటరు నీరులో రెండు చెంచాల ఉసిరిపొడి కలపండి,నిమ్మకాయని సగంగా కోసి,ఒక ముక్కలోని రసాన్ని ఆ నీటిలో కలపండి,ఈ మిశ్రమాన్ని రోజూ మీ తలకు రాసుకుని తలస్నానం చేస్తే అతి తక్కువ సమయంలో, అందమైన నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.
 • 1 KG కాచిన వెన్న (నెయ్యి)తీసుకుని, 250 గ్రాములు ” liquorice(muleatia)” [దీనిని ఎక్కువగా మందులు మరియు స్వీట్స్ తయారిలో ఉపయోగిస్తారు] తీసుకుని, 1 లీటరు ఉసిరి రసం కలిపి, వేడి చేసి ఒక సీసాలో ఉంచుకోవాలి, తలస్నానం చేసే ముందు, మీ తలకు రాసుకుని, చేస్తే సులభంగా నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.
 • కొన్ని మామిడి ఆకులు తీసుకుని వాటిని పేస్ట్ లాగా చేసుకుని, తలకు పట్టించాలి, 15-20 నిమిషాల తరువాత, చల్లని నీటితో శుబ్రంచేసుకుంటే, అది మీ జుట్టు పెరుగుదలకే కాక అందమైన నల్లని జుట్టుని మీ సొంతం చేస్తుంది.
 • కొన్ని మామిడి ఆకులు, పచ్చి మామిడి పైన పచ్చని తొక్కను తీసుకుని,వాటిని పేస్ట్ లాగా చేసి,నూనెతో కలిపి ఎండలో ఎండబెట్టాలి,ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి శుబ్రం చేసుకుంటే జుట్టు ఊడిపోయే సమస్య తగ్గి అందంగా సహజమైన నల్లని జుట్టు పొందవచ్చు.
 • మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చికోవాలి అనుకున్న, లేదా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రాకుండా ఉండాలన్నా మామిడి యొక్క రసాన్ని తీసుకుని తలకి పట్టిస్తే మంచి ఫలితాన్నిస్తుంది, జుట్టు రాలిపోవడం,చుండ్రు సమస్యల నుంచి కూడా మంచి విముక్తి లభిస్తుంది.
Posted on

Telugu hair combing tips for women – ఆరోగ్యకరమైన జుట్టు కోసం మీ జుట్టుని ఇలా దువ్వుకోండి!

మన జుట్టు సాధారణంగా పొడవుగా ఉండాలన్నా, అందంగా ఏరకమైన పగుళ్ళు లేకుండా ఉండాలన్నా, మంచి బలమైన జుట్టుని పొందాలన్నా, అందరికీ తెలిసిందే అయినా ఎంతో మంది గమనించని చిట్కా ఏమిటంటే “సరియైన పద్దతిలో జుట్టు దువ్వుకోవడమే”.

 • ఆరోగ్యకరమైన, నిగ నిగ లాడే జుట్టు పొందాలంటే సరియైన పద్దతిలో జుట్టు దువ్వుకుంటే సరిపోతుంది.
 • మొట్టమొదటిగా మంచి బ్రష్ ని ఉపయోగించండి,మీ బ్రష్ యొక్క పళ్ళు పొడవుగా,విశాలమైనవి గా ఉండటం మంచిది. దీని వల్ల మీరు మీ బ్రష్ ని మీ వేళ్ళతో నొక్కినప్పుడు మీ జుట్టు పై మంచి ప్రభావం చూపిస్తుంది.ఈ పద్దతి మంచి పొడువైన జుట్టుకి బాగా ఉపయోగపడుతుంది.
 • మీ జుట్టుని మధ్యలో నుంచి 2 భాగాలుగా చేయండి, ఒకటి కుడి భుజం పైకి,మరొకటి 2వ భుజం పైకి. మీ జుట్టు మొదలు నుంచి చివరి వరకు మెల్లగ దువ్వుకుంటే మధ్యలో చిక్కులు ఉన్నా, జుట్టూ పగిలినా,అటువంటి ఇబ్బందులని నివారించవచ్చు.
 • పొడవైన జుట్టు కోసం ఇంకొక చిట్కా ఏమిటంటే మీ జుట్టులోని చిక్కులు అన్నీ తీసేసిన తరువాత, మెల్లగా మీ నడుం పై వంగి మీ జుట్టుని మీ మెడ భాగంలో మొదలు పెట్టి చివరి వరకూ దువ్వుకోండి,దీని వల్ల మీ జుట్టు పొడవుగా ఎదగడానికి మంచి బలం\ఉత్తేజం లబిస్తుంది.
 • ముఖ్యమైనది, గమనించవలసినది ఏమిటంటే మీ జుట్టు తడిగా ఉన్నప్పుడు, దువ్వకండి, ఎందుకంటే తడిగా ఉండే సమయంలో మీ జుట్టు సాగుతుంది దానివల్ల జుట్టు యొక్క మొదళ్ళు విరిగిపొయి, జుట్టు ఊడిపోయే ప్రమాదం ఎక్కువ అందుకే, పొడిగా మార్చి దువ్వుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఒకవేళ చిక్కులు తీసి దువ్వుకోవాలంటే, మంచి పొడవైన పళ్ళు ఉన్న దువ్వెనని ఉపయోగించండి.
 • రోజూ పడుకునే ముందు మీ జుట్టుని సరియైన పద్దతిలో దువ్వుకోండి, ఏమైన చిక్కులు ఉంటే తొలగిపోతాయి, ముందు జుట్టు చివరి భాగంలో మొదలుపెట్టి, మెల్లగా జుట్టు మొదళ్ళు వరకూ చిక్కులు ఎమైన ఉంటే తొలగించాలి, అంతా అయిపొయినతరువాత, మొత్తంగా ఒక్కసారి మీ జుట్టుని దువ్వుకోండి.
 • కొంచెం నూనె రాసుకుని చివరివరకూ 100 సార్లు చిక్కులు పొయేంతవరకు దువ్వుకుంటే,నిద్రపోయేటప్పుడు చిక్కులు లేకుండా, మరుసటి రోజు చిక్కులులేని అందమైన జుట్టుని పొందవచ్చు. ఈ పద్దతివల్ల బలహీనంగా ఉన్న మీ జుట్టుకి మంచి బలాన్ని ఇచిన వారౌతారు.
 • మీ జుట్టుని దువ్వుకునేప్పుడు చాల జాగ్రత్తగా ఉండాలి, కంగారుపడకుండా మెల్లగా, చిక్కులని తొలగించుకుంటూ దువ్వుకోవడం వల్ల జుట్టు విరిగిపొయే ప్రమాదం తప్పుతుంది.

అందమైన, పొడవైన జుట్టు కావాలంటే ఈ పద్దతులుతో పాటు సరియైన సమయంలో నూనెని రాస్తూ ఉండాలి. మీ అందం మీ చేతుల్లోనే….పైన చెప్పినవి పాటించండి…ఆనందంగా జీవించండి.