Posted on

Henna use for hair in Telugu – మన అందమైన జుట్టు కోసం గోరింటాకు చెప్పే చిట్కాలు విందామ

ఎన్నో తరాలనుంచి గోరింటాకు మన జుట్టు అందానికి ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు, ఐతే గోరింటాకు జుట్టుకే కాకుండా, సందర్బాన్నిబట్టి స్త్రీలు వాళ్ళ చేతులు, కాళ్ళకు కూడా ఉపయోగిస్తూఉంటారు. పొడవైన, మృదువైన, మరియు అందమైన జుట్టుని పొందడానికి గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది.

అందరికీ తెలిసినది గోరింటాకు జుట్టు కండీషనర్ గా ఎంతగానో ఉపయోగపడుతుంది అని, కాని ఇది మన జుట్టు నిర్మాణాన్ని పాడుచేస్తుంది అని ఒక తప్పుడి ప్రచారం ఉంది.అసలు నిజం ఏమిటంటే మర్కెట్లో దొరుకేవి అన్నీ ఎంతో ప్రమాదకరమైనవి అందుకే అవి మీ జుట్టుకి ఎంతో హానిని చేకూర్చి జుట్టు నిర్మాణాన్ని పాడుచేస్తాయి.

సహజమైన గోరింటాకులు మీకు అందమైన జుట్టుని ఇవ్వడంలో ఎంతో సహయపడతాయి, అంతేకాకుండా దీనితో టీ ఆకులు, పెరుగు, అండాలు, నిమ్మరసం, మరియు ఉసిరికాయ రసం వంటి ఇతర పదార్ధాలను కలిపి ఉపయోగిస్తే మంచి సత్ఫలితాలు పొందవచ్చు. జుట్టుకి సంబందించినంతవరకు గోరింటాకు మంచి “హెయిర్ కలరింగ్ ఏజెంట్” గానే కాకుండా ఒక మంచి “హెయిర్ కండీషనర్” గా కూడా ఉపయోగ పడుతుంది.

గోరింటాకుని జుట్టుపై ఉపయోగించుకోవడం ఎలా??కావాల్సినవి

మెహంది  పొడి – 2 cups ,

గుడ్లు – 2 లేదా 3

కాఫీ పొడి – 2 టేబుల్ స్పూన్లు

టీ ఆకులు – 4 టేబుల్ స్పూన్లు

కత్త పొడి -1 టేబుల్ స్పూన్

పంచదార 1 / 2 టేబుల్ స్పూన్

పద్దతి 1:

ఒక గిన్నెలో 2 గ్లాసులు నీరు తీసుకొండి,టీ ఆకులు, కాఫీ పొడి కలిపి 5 నిమిషాలు వేడి చేయండి.మరొక గిన్నెలో గోరింటాకు మరియు ఇతర పదార్దాలు తీసుకుని  అన్నీ కలిపి 2-3 గంటలు తరువాత మీ జుట్టూకి పట్టించండి. 1 గంట తరువాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయండి.

పద్దతి2:

మీ జుట్టుని తడిగా చేసి, గోరింటాకు పేస్ట్ ని మీ జుట్టు మూలాలు నుంచి చివరివరకు రాసి, మీ జుట్టుని కవరుతో చుట్టేయాలి.

ఒక 1-4 మంటలు తరువాత తలస్నానం చేసి బాగా ఆరబెట్టాలి, తరువాత నూనె రాసి మరుసటి రోజు చూస్తే మంచి ఫలితం లబిస్తుంది.

ఆరోగ్యవంతమైన జుట్టు కోసం మరికొన్ని చిట్కాలు తెలుసుకుందామా:

 • ఒకవేళ మీరు గోరింటాకుని మొదటిసారిగా ఉపయోగిస్తుంటే రోజూ 4-5 పాటు తలకు పట్టించి, ఇలానే 4-5 రోజులు నుంచి కొన్ని వారాల పాటు చేస్తే మంచి ఫలితాల్ని ఇస్తుంది.
 • ఒకవేళ మీ జుట్టు గిరజాల మరియు ఉంగరాల మాదిరిగా మెలికెలు తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, ఈ గోరింటాకుని కోడి గుడ్డ్లు,పెరుగు కలిపి పట్టిస్తే గిరజాలు, ఉంగరాలు పొయి ఎంతో మృదువుగా అవుతుంది.
 • గోరింటాకు చాలా చల్లదనాన్ని ఇచ్చేది,అందువల్ల జలుబు, దగ్గు,జ్వరము, ఉన్నప్పుడు దానిని ఉపయోగించరాదు.
 • చుండ్రు సమస్యను గోరింటాకు  ద్వారా పరిష్కరించవచ్చు. ఎటువంటి దుష్ప్రబావాలు లేకుండా మంచి ఫలితాల్ని ఇచ్చేది.
 • జుట్టుకి బలాన్ని అందించే పొషక పదార్దాలను ఇచ్చి ఎంతో అందంగా, మృదువుగా,మెరిసేలా చేస్తుంది.అంతేకాకుండా తలనొప్పి మరియు నిద్రలేమిని నయం చేస్తుంది.
 • ఒకవేళ మీరు శాఖాహారులు అయితే గుడ్డు బదులు పెరుగును ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
 • ఒకవేళ మీరు గోరింటాకుని “హెయిర్ కలర్ ఏజంట్”గా కాకుండ హెయిర్ కండీషనర్ గా మత్రమే ఉపయోగించుకోవాలంటే మీ జుట్టుకి నూనె రాసుకుని గోరింటాకు రాసుకుంటే మంచి ఫలితాలని ఇస్తుంది.
 • గోరింటాకు రాసుకున్న తర్వాత అది తడిగా ఉంచడానికి కవర్ చేయాలి, లేదంటే పొడిగా మరిపొయి గట్టిగా అయిపొయి,శుబ్రపరుచుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది,అంతే కాకుండ అనుకున్న ఫలితాలు పొందలేరు.
 • గోరింటాకుని మీ జుట్టు పై ఎక్కువ సేపు ఉంచడం వల్ల పాడైపోయిన జుట్టును బాగు చేసి, అందమైన జుట్టుగా మారుస్తుంది.
Posted on

Telugu tips for white hair – సహజ పద్దతులతో మీ తెల్ల జుట్టు లేదా పొడిబారిన(నిరుత్సాహకరమైన) జుట్టుని వదిలించుకోవటం ఎలా?

మీరు అద్దంలో చుసుకునేటపుడు, మీ జుట్టు పొడిబారిపొయినట్లు అనిపించినా, లేక చిన్న వయసు లోనే మీ జుట్టు తెల్లగా మారినా మిమ్మల్ని ఎంతో బాధిస్తుంది, ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా, చిన్నవారికి కూడా జుట్టు ఊడిపోవడం, తెల్లబడటం, పొడిబారిపోయి,బద్దలవడం జరుగుతుంది, అయితే మీ జుట్టు యొక్క అందాన్ని కాపాడుకోవడానికి, అందమైన, మరియు, మృదువైన జుట్టుని పొందడానికి, కొన్ని చిట్కాలు తెలుసుకుందామా.

సాధారణంగా మన జుట్టు వయస్సు పెరిగే కొద్దీ , రంగు మరియు పటుత్వం కోల్పోయి తెల్లగా మారుతుంది, అంతేకాకుండా, జన్యుపరమైన సమస్యలు ,వంశపారంపర్య కారణాలు, అనారోగ్య కారణాల వల్ల సైతం ఈ ఇబ్బంది కలుగవచ్చు.అతి చిన్న వయస్సులోనే జుట్టు పొడిబారిపొవడం, పొట్లుగా మారిపోవడం ఎంతో బాదకలిగించే మరియూ ఇబ్బందిపెట్టే సమస్య, అయితే బాదపడకుండా, ఆలస్యం చెయకుండా ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుందామా, మీరు చేయవలసిందల్లా

ఉసిరి(భారత దేశపు పండ్లలో ఉన్నతమైనది)

మన జుట్టుకి ఉసిరికాయ ప్రభావం ఎంతో మంచిది అని, ఎన్నో  తరాలనుంచి అందరికి తెలిసిన విషయమే.అయితే ఎండబెట్టిన ఉసిరి ముక్కలని నీటిలో నానబెట్టి, మరుసటి రోజు మీ జుట్టుకి రాసుకుని తలస్నానం చేస్తే,ఎంతో మంచిది. మీ జుట్టు నున్నగా, లేదా మృదువుగా అవ్వాలంటే, ఉసిరి పేస్ట్ ని కాని, లేదా ఉసిరి ఆయిల్ ని కాని తలకు రాసుకుని తలస్నానం చేస్తే ఎంతో మంచిది.

మెంతులు:

మన చర్మ సౌందర్యానికే కాదు, మన జుట్టు సం రక్షణలో కూడా మెంతులు ఎంతో ఉపయోగపడతాయి,

ఈ మెంతుపిండిని, రోజూ తలకు పట్టించుకుని తలస్నానం చేస్తే ఎంతో మృదువైన, అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

నువ్వు గింజలు:

కొంచెం బాధం నూనె తీసుకుని , దానిలో నువ్వులపొడి కలిపి, మీ జుట్టుకి పట్టించండి,20-25 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే మీ జుట్టులో అద్భుతాలు చూడవచ్చు.

నెయ్యి\వెన్న:

మన పెద్దవాళ్ళు చెప్పినట్లు, నెయ్యి మన జుట్టు రక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది,మెరిసే జుట్టు కోసం, వారానికి 2 సార్లు వెన్నని జుట్టుకి పట్టించి తలస్నానం చేస్తే, అందమైన జుట్టును పొందవచ్చు.

ఉల్లిపాయ:

అందమైన జుట్టు కోసం ఉల్లిపాయ రసాన్ని జుట్టుకి పట్టించి, 30 నిమిషాల తరువాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితాల్ని ఇస్తుంది.

క్యారెట్:

ప్రతీ రోజు క్యారెట్ జూస్ తాగితే తెల్ల జుట్టును నివారిస్తుంది.

బ్లాక్ టీ:

పాలు, పంచదార లేని బ్లాక్ టీలో 1 స్పూన్ ఉప్పు కలిపి తలకు పట్టించి 1గంట తరువాత మామూలు నీటితో శుబ్రం చేసుకోండి మంచి ఫలితాలు పొందవచ్చు.

గోరింట:

మన అందరికి తెలిసిందే గోరింట మన జుట్టుని రక్షించడంలో ఎంతగా ఉపయోగపడుతుందో.ఇది సులభంగా దొరకడమే కాకుండా మంచి ఫలితాల్ని ఇస్తుంది.

గోరింట పొడి (2 టేబుల్ స్పూన్లు), పెరుగు (1 టేబుల్ స్పూన్), మెంతులు (1 టేబుల్ స్పూన్), కాఫీ (3టేబుల్ స్పూన్లు), తులసి (2 టేబుల్ స్పూన్లు), మరియు పుదీనా రసం (3టేబుల్ స్పూన్లు) తీసుకోండి.బాగా కలిపి మీ జుట్టుకు పట్టించండి 2-3 గంటల తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.

గోధుమ మొలకలు:

గోధుమ మొలకల జూస్ ని రోజూ తీసుకుంటే, మీ జుట్టుని కాపాడుకోవఛ్ఛు.

చివరిగా ఒక్క మాట,

నిస్సారమైన జుట్టుకు కారణం మన ఆరోగ్యం పట్ల అసమర్దతను తెలియ చేస్తుంది.,అందుకే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే, మీ జుట్టుని కాపాడుకున్నట్లే,

మీరు అందంగా కనిపించాలన్నా, మృదువైన జుట్టు పొందాలన్నా ఈ పై సూచించినవన్నీ పాటించండి.

Posted on

Telugu hair care tips – మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా? మీ జుట్టు బాగా పెరగాలన్నా ఈ చిట్కాలు పాటించండి

మీ జుట్టు రాలకుండా, బలంగా, ఉండడానికి, బాగా పెరగడానికి ఈ చిట్కాలు మీ కోసమే:

జుట్టు రాలిపోవడం అనేది, ఆడవారిలోను, మరియు మగవారిలోను సామన్యంగా కనిపించే అతి పెద్ద సమస్య.సాధారణంగా ఇది మన శరీరంలోని హార్మోన్లు నిలకడగా లేకపోవడం వల్ల, మరియు మన థైరాయిడ్ గ్రంధి చురుకుగా పనిచేయకపోవడం వల్ల పొషక లోపం వల్ల అంటే మన తీసుకునే  ఆహారంలో సరియైన పోషక పదార్దాలు లేకపోవడం, జుట్టు యొక్క మొదళ్ళలో తగినంత రక్త ప్రసరణ లేకపోవడం,వారసత్వం వల్ల కలిగే జన్యుపరమైన మార్పుల వల్ల కూడా వస్తుంది.

మీ జుట్టు రాలకుండా, బలంగా,ఉండడానికి,బాగా పెరగడానికి ఈ  చిట్కాలు మీ కోసమే:

 • మన జుట్టు ఊడిపోవడానికి, సన్నగా అయిపోవడానికి కారణం హార్మోన్లు నిలకడగా లేకపోవడమే కారణం, అందుకే జుట్టూ మొదలి భాగములలో ఎక్కువ శాతం నూనె రాస్తే మంచి ఫలితాల్ని పొందవచ్చు.
 • “పాల్మెట్టో “ ఉన్న మూలికను తీసుకోవడం వల్ల, మగవారిలోని  జుట్టు శాతం పెరిగే అవకాశం ఎక్కువ, ఈ “పాల్మెట్టో” ఉన్న మూలిక జుట్టు పెరుగుదలలో ఒక ప్రత్యామ్నాయ ఔషధంగా ఎంతో ఉపయోగపడుతుంది. 400మిగ్రా “పాల్మెట్టోని” 100మిగ్రా “Beta-Sitosterol” తో కలిపి తీసుకుంటే  మగవారిలోని జుట్టు ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.
 • ఈ పాల్మెట్టో చారిత్రాత్మికంగా మగవారికి, ఆడవారికి సున్నితమైన జుట్టుని ఇవ్వడంలో ఎంతో సహాయపడుతుంది.
 • సరిగా పనిచేయని థైరాయిడ్ గ్రంధి వల్ల కూడా జుట్టు పల్చబడిపోవడం జరుగుతుంది, మీరు తీసుకునే కూరగాయలలో “kelp, nori, dulse, kombu”, మరియూ wakame,కలిగి ఉన్నవి తీసుకుంటే, వీటిలోని “అయోడిన్”మీ జుట్టు సం రక్షణలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
 • మద్యపానం తగ్గించుట ఎంతో శ్రేయస్కరం, ఎందుకంటే ఈ మద్యం నీటిలో  క్లోరిన్ అదనంగా ఉంటుంది, మీరు 100మి.లీ లేదా మి.గ్రా  “herb bladderwrack” తీసుకోవడం జరుగుతుంది.
 • తగినంత కొవ్వుతో కూడిన పదార్దాలు తీసుకోవడం వల్ల మరియు అక్రోటు కాయ,అవెకాడో పండు, చేప, వల్ల చక్కని గిరజాల జుట్టుని పొందే అవకాశం ఎక్కువ.
 • బోయోటిన్ ఆరోగ్యవంతమైన జుట్టును ఇవ్వడమే కాకుండా, దాని పెరుగుదలలో ఎంతో సహాయపడుతుంది.అందుకే కాయలు, బియ్యము, ఓట్స్ కలిగి ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.
 • మన జుట్టూ లోపల ఉన్న ప్రొటీన్ ఎదైతే ఉందో అదే “కెరాటిన్”, దీనిని ఎక్కువ శాతం పెంచుకోవడం వల్ల కూడ మీ జుట్టుని అందంగా ఉంచుకోవచ్చు, అంతే కాకుండా ఇది మీ జుట్టు బలోపితం చేసి,పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది.
 • “బి కాంప్లక్స్” పోషక పదార్దములు తీసుకుండి: వీటిని రోజు 100 మి.గ్రా తీసుకోవడం వల్ల మీ జుట్టు పెరుగుదలలో ఎంతో సహాయపడుతుంది.ఈ “బి కాంప్లక్స్” పోషక పదార్దములు, అయోడిన్,మరియు “బి6” పోషక పదార్దములు కలిగి ఉండడం వల్ల మీ జుట్టులోని రక్త ప్రసరణను పెంచి, జుట్టు సన్నబడటాన్ని  తగ్గించి,6 నెలలలో అందమైన జుట్టిని ఇస్తుంది.
 • మీ గిరజాల జుట్టుని కాపడుకోవాలంటే “కొల్లాజెన్ “ను తీసుకోవాలి. ఇది మీ జుట్టు పగుళ్ళను ఆపుతుంది, రకరకాల మందుల ద్వార కాకుండా,250 గ్రా “విటమిన్ సి” తో కుడిన ఆహారం అంటే సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీ మరియు ఎరుపు మిరియాలు తీసుకోవడం వల్ల “కొల్లాజెన్ ” శాతం పెరిగి, మీ జుట్టు ముడతలు పడకుండా కాపాడుతుంది.
 • మీ జుట్టు పగిలిపోకుండా కాపడుకోవాలంటే “విటమిన్ ఈ” తో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి, ఇది జుట్టు లోపల ఉన్న ప్రొటీన్ ఎదైతే ఉందో అదే “కెరాటిన్” శాతం పెంచి జుట్టు, పగలకుండా,కాపాడుతుంది.
 • ఆకు కూరలు లీక్స్, జీడి, ఎండు ఫలాలను, అత్తి పండ్లను తీసుకోవడం వల్లకూడ మీ జుట్టూ పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.

మీ జుట్టు కి సరియైన పొషక పదార్దాలు ఇవ్వండి:

రోజు మీ అహారంలో 500మి.గ్రా  సిలికా మరియు 30 మి.గ్రా జింక్ తో కూడిన పదార్దాలు తీసుకుంటే మీ రాలిపోతున్న జుట్టూ తిరిగి పెరగడానికి ఎంతో ఉపయోగ పడుతుంది.

రోజ్మేరీ నూనె తో జుట్టు రక్త ప్రసరణను పెంచండి, ప్రతీరోజూ మీ కొబ్బరి నూనెతో పాటూ రోజ్మేరీ నూనెను కూడా కలిపి మీ జుట్టుకి పట్టించుకుంటే,మంచి ఫలితాలు పొందవచ్చు.

మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా?అందమైన జుట్టు మీ సొంతం కావాలన్నా, మీ జుట్టు బాగా పెరగాలన్నా  ఈ చిట్కాలు పాటించండి

Posted on

Beauty secrets with egg in Telugu – అందానికి, ఆరోగ్యానికి, కోడి గుడ్డు చెప్పే సూత్రాలు

ప్రపంచంలోని ప్రతీ ఒక్కరు, తమ చర్మ సౌందర్యం కోసం, జుట్టు సం రక్షణ కోసం ఎంతగానో అలోచిస్తారు. అయితే మీరు కూడా మీ జుట్టు పొడవుగా, అందంగా, ఉండాలని కోరుకుంటు న్నారా, లేదా, మృదువైన చర్మం కోసం ఏమిచేయాలి అని సతమతమవుతున్నారా, అయితే తక్కువ ఖర్చుతో మీ ఇంట్లోనే మీ ప్రశ్నలకు సమాధానం  లబిస్తుంది. అది ఏమిటంటే,

ఈ ప్రశ్నలన్నింటికి కోడి గుడ్డ్లు చెప్పే చిట్కాలు చూద్దామ.

కోడి గుడ్డ్లలోని “లూటిన్” మీ చర్మాన్ని  “ఎలాస్టిక్” గా చేయడానికి,  మరియు “హైడ్రేట్” చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మీ చర్మ కణాలని సుద్దిచేసి, మీ చర్మాన్ని గట్టిగా  చేస్తాయి. అంతేకాకుండా మీ జుట్టుకి బలంతో పాటు , మెరుపుని ఇస్తాయి. వీటిలోని “ప్రొటీన్లు” మనలోని జుట్టు మరియు గోళ్ళు పెరుగుటలో ఎంతో సహాయ పడతాయి.  మీరు అందమైన చర్మం,  సహజమైన జుట్టు పొందాలంటే,  మీరు రోజూ తినే ఆహారంలో కోడి గుడ్డుని కూడా కలిపి తీసుకోండి.  మీ అందం పైన, మీ జుట్టు పైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

మీ చర్మ సౌందర్యం కోసం కోడి గుడ్డ్లు వాటి ప్రయోజనాలు

మీ మెరుగైన చర్మం కోసం:

ఒక గుడ్డు తీసుకుని,దానిలోని సోనని ముఖానికి పట్టించి అది గట్టి పడిన తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, చర్మం గట్టిపడడమే కాకుండా, మంచి కాంతివంతముగా మెరుస్తుంది.

 మీ చర్మం యొక్క గట్టిదనం కోసం:

ఒక గుడ్డు తీసుకుని, దానిలోని పచ్చ సొన, తెల్ల సొన రెండింటిని వేరు చేసి,తెల్లసొనని ఒక గిన్నెలో బాగా కలిపి ముఖానికి పట్టించాలి,  అది గట్టి పడిన తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే అది మన చర్మ కణాలని గట్టి పరచడమే కాకుండా, మొటిమలును తగ్గించేందుకు సహాయపడుతుంది

కళ్ళ కింద సహజత్వం కోల్పోయిన, లేదా ఉబ్బిన చర్మం కోసం:  

మీరు మీ కంటి కింద చర్మం వాపుతోటి బాధపడుతున్నారా,ఎంతో అలసటగా అనిపిస్తుందా అయితే ఒక గుడ్డు తీసుకుని, దానిలోని తెల్ల సొనని ఆ వాచిన ప్రదేశం పై రాసి ఒక 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రపరుచుకుంటే, ఆ వాపులు తగ్గి మంచి సత్ఫలితాన్నిస్తుంది.

కోడి గుడ్లతో తయారు చేసుకునే “ఫేస్ ప్యాక్స్”, వాటి ప్రయోజనాలు:

మీ జిడ్డుగల చర్మం కోసం కోడి గుడ్డు-బియ్యపు పిండి మిశ్రమము:

గుడ్డులోని తెల్ల సొనని తీసుకుని,కొంచెం కొబ్బరి నూనె కలిపి ,బాగా మిక్స్ చేసి మీ ముఖానికి , మెడకి పట్టించాలి, తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి, ఇలా చేస్తే మీ చర్మము జిడ్డు లేకుండా కాంతివంతంగా అవుతుంది, ఈ పద్దతి మీ జిడ్డుని పొగొట్టుకోవడానికి ఎంతో సులభమైనది.

 మీ పొడిబారిన చర్మం కోసం:

గుడ్డులోని పచ్చ సొన, ఆలీవ్ నూనె మిశ్రమం:

గుడ్డులోని పచ్చ సొన తీసి, కొంచెం నిమ్మ రసం,కొంచెం పచ్చి ఆలివ్ నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి,  కాసేపటి తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే,మీ పొడి చర్మం ఎంతో అందంగా మారుతుంది, ఈ పద్దతి పొడి చర్మంతో బాదపడే వారికి ఎంతో ఉపయోగకరం.

మీ మృదువైన, తేజోవంతమైన, మెరిసే చర్మం కోసం:

గుడ్డు, తేనే, రోజ్ వాటర్ మిశ్రమము:

గుడ్డు,ఒక స్పూన్ తేనే, కొంచెం ఆలీవ్ నూనే, 2 స్పూన్లు రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి,20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే, మృదువైన, ఎంతో కాంతివంతమైన చర్మంతో పాటు, నల్ల మచ్చలు సైతం తొలగిపోతాయి.

 మీ మెరిసే చర్మం కోసం:

గుడ్డు, పెరుగు మిశ్రమము:

గుడ్డులోని పచ్చ సొనలో కొంచెం తేనే, పెరుగు కలిపి మీ ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే, మెరిసే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.

మీ చర్మం యొక్క మెరుగైన చాయ కోసం:

గుడ్డు, తేనే  మిశ్రమము :

గుడ్డులోని తెల్ల సొనని తీసుకుని ఒక స్పూన్ తేనె కలిపి మీ ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, నల్ల మచ్చలు పోయి, మీ చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.

అందమైన జుట్టు కోసం కోడి గుడ్డు చిట్కాలు :

గుడ్డు, పెరుగు హయిర్ కండీషనర్:

ఒక గుడ్డు, పెరుగు, 1 స్పూన్ పచ్చి ఆలీవ్ నూనె, కొంచెం బాదం నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని  మీ ముఖానికి పట్టించి 45 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, మిల మిల మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది.

గుడ్డు, నిమ్మరసం హయిర్ కండీషనర్:

కొంచెం నిమ్మరసం తీసుకుని, గుడ్డుని కలిపి మీ జుట్టుకి పూర్తిగా పట్టించాలి, ఒక అరగంట తరువాత మీ షాంపూతో తలస్నానం చేయాలి,ఈ పద్దతి వల్ల మీ జుట్టు బాగ పెరగడమే కాకుండా, ఎంతో మృదువుగా కూడా అవుతుంది.

 అందం కోసం కోడి గుడ్డు చిట్కాలు:

జిడ్డుగల జుట్టు కోసం గుడ్డులోని తెల్ల సొన:

మీ జుట్టు పొడిగా,జిడ్డుగా, నిర్జీవంగా ఉంటుందా, అయితే ఈ చిట్కా మీ కోసమే, గుడ్డులోని తెల్ల సొన తీసుకుని మీ జుట్టుకి పట్టించి, అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో  శుబ్రం చేస్తే, మంచి ఫలితం లబిస్తుంది.

పొడి జుట్టు కొసం గుడ్డు,  వెన్న తీసిన పాల మిశ్రమము: ఒక కప్పు వెన్న తీసేసిన పాలలో గుడ్డు కలిపి, మీ జుట్టికి పట్టించి 30 నిమిషాల తరువాత షాంపూతో స్నానం చేస్తే ఎండిపొయినట్లు, జీవం కోల్పోయినట్లు ఉన్న జుట్టుకి మంచి మెరుపు లభిస్తుంది.

Posted on

Homemade natural conditioners in Telugu – అందమైన, మరియు మృదువైన జుట్టు కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు

 

మనం మన జుట్టుని అందంగా,ఉంచడానికి, మరియూ ఆ అందాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూఉంటాం, మార్కెట్లో లభించే ఎన్నో హెయిర్ కండీషనర్లను ఉపయోగిస్తూ, ఎన్నో ఇబ్బందులు పడుతూఉంటాం, సరిగ్గా గమనిస్తే మన ఇంట్లోనే, మన వంట గదిలోనే మన జుట్టు సం రక్షణకై  ఎన్నో అద్భుతాలు చేయవచ్చు.

ఈ పద్ధతి వల్ల  మన డబ్బు వృధా కాదు అలాగే ,మీ జుట్టుని హానికరమైన మరియు కఠినమైన రసాయన ఆధారిత   ఉత్పత్తుల  బారి నుండి రక్షించడమే కాకుండా మంచి సత్ఫలితాలను పొందవచ్చు  అనడంలో సందేహం లేదు. మీ జుట్టుకి సరియైన పద్దతులతో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి అందం, పొడవు, నాజూకుతనంతో పాటు, మంచి మెరుపు మరియు సిల్కీ హెయిర్ పొందవచ్చు.

మన ఇంట్లోనే సహజ పద్దతులతో తయారుచేసుకునే హెయిర్ కండీషనర్లు గురించి తెలుసుకుందామ

“తేనె” జుట్టు కండిషనర్:

కావలసినవి: కోడి గుడ్డు 1,1 స్పూన్ తేనే ,3-4 స్పూన్ కొబ్బరి నూనె.

ఫద్ధతి: పైన సూచించిన అన్ని పదార్థాలు ఒక గిన్నె లో కలపాలి, మెల్లగా మీ జుట్టుకి పట్టించి, 20-30 నిమిషాల తరువాత గోరు వెచ్చని  నీటితో శుబ్రంచేసుకోవాలి

“అవెకాడో పండు” బలమైన కండిషనర్:

కావలసినవి: 1\2 పండిన అవకాడో(గుజ్జు),1\2 స్పూన్ కొబ్బరి నూనె,3 Tbsp రోజ్మేరీ నూనె లేదా లావెండర్

ఫద్ధతి: పైన సూచించిన అన్ని పదార్థాలు ఒక గిన్నె లో కలపాలి, మెల్లగా మీ జుట్టుకి పట్టించి, 20 నిమిషాల తరువాత నీటితో శుబ్రంచేసుకోవాలి.

“పుదీనా” జుట్టు కండిషనర్:

కావలసినవి: 3 గ్లాసుల నీరు, ఒక చిన్న గిన్నె నిండా పుదీనా ఆకులు

ఫద్ధతి: ముందుగా ఒక గిన్నెలో 2-3 గ్లాసుల నీళ్ళు పోసి పుదీన ఆకులు వేసి మరిగించండి, తరువాత గిన్నెను చల్లార పెట్టండి.మీ షాంపూతో స్నానం చేసిన తరువాత ఈ చల్లారిన మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి శుబ్రం చేసుకుంటే మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది.

అందమైన,మృదువైన, సిల్కీ జుట్టు కోసం “పాలు మరియు అరటి పండు” జుట్టు కండిషనర్:

కావలసినవి:

1 కప్పు పాలు,1 అరటి పండూ,1 Tbsp కొబ్బరి నూనె.

పైన సూచించిన పదార్దాలలో పాలు, అరటి పండుని పేస్ట్ గా చేసి, కొంచెం కొబ్బరి నూనె కలిపి, మీ జుట్టుని తడి చేసుకుని మెల్లగా ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించండి, తరువాత ఒక కవరుతో జుట్టుని కప్పండి.30 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకోండి.

ఇక్కడ గమనించవలసింది ఎమిటంటే ఈ పద్దతి తరువాత తప్పని సరిగా షాంపూతో శుబ్రం చేసుకోవాలి.

“DIY” జుట్టు కండిషనర్ :

కావలసినవి:2 కప్పుల నీరు ,ఆపిల్ పళ్లరసం, 1\2 కప్పు వినెగార్

ఈ పధార్దములు  అన్నీ కలిపి, ఆ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించాలి, 20-30 నిమిషాల తరువాత  మీ వేళ్ళతో జుట్టుని తడమండి, తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి అందమైన జుట్టు పొందడమే కాకుండా రసాయన రహితమైన స్వచ్చమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

ఇక ఎప్పుడైనా “కండిషనర్” కొనడానికి వళ్ళాలి అనుకున్నప్పుడు ఒకటి, రెండు సార్లు ఆలోచించండి, తెలిసి తెలిసీ మీ డబ్బులు వృధా చేసుకుని మీ జుట్టును పాడుచేసుకునే  కన్నా ఈ పైన సూచించిన సహజ పద్దతులు పాటించడం  ద్వారా మీ జుట్టు పై మీకున్న ప్రేమను చూపించండి.