Posted on

Tomato skin care tips in Telugu – ఆరోగ్యవంతమైన మరియు తేజోవంతమైన చర్మం కోసం టమటా చెప్పే చిట్కాలు

పార్టీకి వెళ్తున్నాం అందంగా, కనపడాలి అని ఎంతో మంది ఖరీదైన “క్రీంలు” మరియు “ఫేష్యల్స్” వాడతారు, చిత్రమేమిటంటే తెలిసీ తెలియక మన డబ్బుతో మనమే మన చర్మ సౌందర్యాన్ని ఎంతో ప్రమాదకరమైన “కేమికల్స్” కు  గురి చేసి పాడు చేసుకుంటున్నాము. సరిగా గమనిస్తే తాజా పండ్లు మన చర్మాన్ని ఎంతో అందంగా మరియు కాంతివంతంగా తయారు చేసి మంచి సం రక్షణను చేకూరుస్తాయి.  టమాటా మన అపురూపమైన చర్మాన్ని కాపాడు కోవడానికి, ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మన చర్మ రంద్రాలను శుద్ది చేస్తూ చర్మ రక్షణకై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.

 • సహజమైన, కాంతివంతమైన చర్మం కోసం టమాట “ఫేస్ ప్యాక్స్”……  . మీరు చేయవలసిందల్లా  ముందుగా కొన్ని టమాటాలు తీస్కొండి, గుజ్జుగా చేసి, కొంచెం ఓట్స్ (బియ్యపు పిండి), ఒక స్పూన్ పెరుగు కలిపి,  మీ ముఖమునకు, మెడకు పట్టించి కొన్ని నిమిషాల తర్వాత శుబ్రం చేసుకుంటే మీ చర్మాని నల్లగా చేసే పదార్దాలు తొలగిపొయి, చర్మం ఎంతో కాంతివంతంగాను మరియు మ్రుదువుగా తయారవుతుంది.
 • గుజ్జుగా చేసిన టమాటాలు, నిమ్మకాయలోని సగం తీసుకుని, నిమ్మరసాన్ని, టమాట గుజ్జుని కలిపి ముఖమునకు, మెడకు పట్టించుకొని అది పొడిగా అయ్యేవరకు వేచి ఉండాలి కొన్ని నిమిషాల తర్వాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మీ చర్మాని నల్లగా చేసే పదార్దాలు తొలగిపొయి మంచి ఉపసమనాన్ని పొందుతారు.
 • మి ముఖాన్ని నల్లమచ్చలు  ఇబ్బంది పెడుతుంటే “ముల్తానీ మట్టీ “, టమాటా గుజ్జు కలిపి ముఖానికి రాసుకుని మెల్లగా రుద్దాలి, ఎక్కువగ రుద్దినను ప్రమదమే, శరీరం ముడతలు పడిపొతుంది.15 నిమిషాల తరువాత గొరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని ఆస్వాదించవచ్చు.
 • మంచి అందమైన కాంతివంతమైన చర్మం కోసం గంధం పొడిని టమాట గుజ్జుతో కలిపి కొంచెం నిమ్మరసం వేసి ఆ పేస్ట్ ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ప్రభావం చూపిస్తుంది.
 • బిజీ సమయంలో, టైము లేదు అనుకుంటే టమాటాల గుజ్జుని 2 Tbsp పాలతో కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా, ప్రకాసిస్తుంది.
Posted on

Glowing skin tips in Telugu – మెరిసే చర్మం కోసం సహజ పద్దతులతో కూడిన జాగ్రత్తలు

ఈ ఆదునిక ప్రపంచంలో అందాన్ని కాడుకోవటం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, మార్కెట్లో దొరికే ఎన్నో వస్తువుల్ని కొనుగోలు చేసి వాడుట వల్ల మన అందానికి వచ్చే ఫలితం ఎమీ లేకపోగా మన జేబులు ఖాళీ ఔతున్నాయి. ఎందుకంత ఖర్చు పెట్టడం, మీరు సరిగ్గా గమనిస్తే , మన ఇంట్లోనే ఖర్చు లేకుండా మన అందాన్ని కాపాడుకునేవి ఎన్నో ఉన్నాయి, ఇవి ఎంతో సహజమైనవి మరియు ఆరోగ్యానికి, చెర్మానికి హాని కలిగించనివి. ఖర్చు లేకుండా మీ చర్మ రక్షణ కై ఈ 10 సూత్రాలు పాటించండి

మీ చర్మ రక్షణకై ఉత్తమమైన 10 సూత్రాలు ఇవే:

 • కొంచెం వెనిగర్, కొంచెం నీరు తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడ భాగానికి పట్టించి కాసేపటి తరువాత మెత్తని గుడతో కాని, లేదా కాటన్ తో తుడిస్తె మంచి ఫలితాన్నిస్తుంది
 • రోజ్ వాటర్ లో కర్పూరాన్ని కలిపి మెత్తని గుడ్డతో ముఖాన్ని రోజుకి 3-4 సార్లు తుడుచుకుంటే మంచి ఉపయోగం ఉంతుంది
 • ఇంకా తేలికైన చిట్కా ఎమిటంటే  నిమ్మ రసాన్ని మీ ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.
 • 4 Tbsp రోజ్ వాటర్ లో 1\3 Tbsp పటికను, 100గ్రాం గ్లిసరిన్, బాగా కలిపి ముఖానికి పట్టించి  10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం  చేసుకోవాలి.
 • కీరా దోసకాయని  తీసుకుని అర కప్పు పెరుగులో కలిపి 5-10 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.
 • ఆపిల్ ని ఒక 1 Tbsp తేనె తో కలిపి మీ ముఖానికి పట్టించి 5-10 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మము ఎంతో తాజాగా మరియూ కాంతివంతమవుతుంది.
 • చమోమిలే టీ బ్యాగ్ ని 100మి నీటిలో వేడి చేసి ముఖంపై ఆ నీటిని రాసుకుని 20 నిమిషాల తరువాత చలని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మము ఎంతో తాజాగా ఉంటుంది.
 • మీ ముఖాన్ని ముందుగా శుబ్రం చేసుకుని  కోడి గుడ్డు లోని తెల్ల సొనని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకోవాలి
 • 1\4 Tbsp నూనెలో 1\4 XXX నిమ్మ రసం, 1 Tbsp తేనె  కలిపి మీ ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి వెచ్చనినీటితో శుబ్రం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.
 • 1 Tbsp పాలు, 1 Tbsp తేనె, 1 కోడి గుడ్డు కలిపి మీ ముఖానికి పట్టించి 10-15 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే చర్మము ఎంతో తాజాగా మరియూ కాంతివంతమవుతుంది.
Posted on

Banana face packs in Telugu – సహజ పద్దతులతో తయారు చేసుకునే “అరటి ఫేస్ ప్యాక్స్”

అధిక శాతంలో విటమిన్లు, పొటాషియం కలిగి ఉండడం వల్ల అరటి అనేది, సహజమైన మరియు ఆరోగ్యకరమైన శరీరానికి ఎంతో మేలును చేకూరుస్తుంది. కరేబియన్ దీవులు,మరియు దక్షిణ అమెరికాలోని స్త్రీలు ఈ మెత్తగా, గుజ్జులా చేసిన అరటిని వారి యొక్క శరీరాన్ని పొడిగా ఉంచుకోవడం కొసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ అరటి పండు  ఫేస్ ప్యాక్స్ అనేవి మీ శరీరాన్న్ని మ్రుదువుగా, మరియు ఎంతో కోమలంగా ఉంచుతాయి.పొడి బారిన, ఎంతో సున్నితమైన సరీరం కొసం ఈ సహజ పద్దతులు ఎంతో మంచి ఫలితాల్ని ఇస్తాయి.

అవకాడొ-ఆరటి  ఫేస్ ప్యాక్:

కావలసినవి:

గుజ్జుగా చేసిన 1\2 అవకాడో పండు మరియు 1\2 అరటి పండు

పై రెండిటి మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

అరటి ఫేస్ ప్యాక్

మనం చెప్పుకుంటున్నట్లుగా అరటి పండు మీ చర్మాన్ని సున్నితమైనదిగా, కోమలంగా చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.  మీ ముఖాన్ని నీటితో కడగాలి,

అరటి పండు మిశ్రమాన్ని బాగా మెత్తగా పేస్ట్ తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

అరటి మరియు తేనెతో కూడిన ఫేస్ ప్యాక్:

కావలసినవి:1 Tbsp తేనె, 1\2 అరటి పండు

పై రెండిటి మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

మొటిమలు, మచ్చల నివారణకు అరటి ఫేస్ ప్యాక్:

అరటితో మీ ముఖము పై అద్భుతాలు చేయవచ్చు.

కావలసినవి:

1 అరటి పండు, 1 Tbsp తేనె , 1 Tbsp నిమ్మ రసం.

పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

పొడి బారిన చర్మానికి అరటి సూత్రాలు  :

కావలసినవి: గుజ్జుగా చేసిన 1\2 అరటి పండు,ఉడక పెట్టిన ఓట్స్(బియ్యపు పిండి),1 Tbsp పంచదార, 1 Tbsp గుడ్డులోని పచ్చ సొన.

పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

జిడ్డు బారిన చర్మానికి అరటి సూత్రాలు  :

కావలసినవి: గుజ్జుగా చేసిన 1\2 అరటి పండు, 1 Tbsp తేనె,1 Tbsp పెరుగు

పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత వెచ్చటి నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

నల్లని మచ్చలు, ముఖము పై ముడతలు పోవడానికి అరటి సూత్రాలు  :

కావలసినవి: గుజ్జుగా చేసిన 1\2 అరటి పండు,1 Tbsp తేనె, 1 Tbsp గుడ్డులోని పచ్చ సొన.

పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత వెచ్చటి నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

దీనిని కనీసం వారానికి 2 రోజులు చేస్తే మచ్చలు మరియు ముడతలు లేని చర్మాన్ని పొందవచ్చు

అరటి మరియు పాలతో కుడిన ఫేస్ ప్యాక్:

కావలసినవి: గుజ్జుగా చేసిన 1\2 అరటి పండు,1 Tbsp తేనె, 1 Tbsp పాలు.

పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో మెల్లగా శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

ఆరటి మరియు ఓట్స్(బియ్యపు పిండి)ఫేస్ ప్యాక్:

పొడి బారిన చర్మాన్ని పొందాలంటే ఈ ఫేస్ ప్యాక్ ఎంతో ఉపయోగపడుతుంది:

కావలసినవి :

గుజ్జుగా చేసిన 1\2 అరటి పండు,1 Tbsp తేనె, ఓట్స్(బియ్యపు పిండి)మరియు గుడ్డులోని పచ్చని సొన:

పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో మెల్లగా శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

Posted on

Telugu tips for oily skin – జిడ్డు రహితమైన చర్మానికి ఇంట్లోనే చేసుకునే “ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్”

జిడ్డుగల చర్మమ ఉండటం వల్ల ఎన్నో చర్మ సంబంధిత సమస్యలు అనగా మొటిమలు, నల్లటి మచ్చలకు దారితీస్తుంది. పండ్లు ఎంతో ఆరోగ్యకరమైనవి రోజు వారి భోజనంలో పండ్లు కలిపి తీసుకున్నట్లైతే చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. అనేక చర్మ ప్రయోజనాలు అందించే అనేక పండ్లు ఉన్నాయి, మీయొక్క చర్మం రకం బట్టి మీరు తీసుకునే పండ్లు మీ చర్మ సమస్యలపై పొరాట పటిమను ప్రదర్శిస్తాయి .

ఉదహరణకు జిడ్డుగల శరీరానికి అరతిపండు, నిమ్మ, నారింజ , స్ట్రాబెర్రీలు వంటివెన్నో  వంటివెన్నో పోషకాల సమూహములతో  మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీరు జిడ్డుగల చర్మం నయం కోసం ఇంట్లోనే చాల సులభంగా, తక్కువ ఖర్చుతో కూడిన సహజమైన పద్దతులతో తయారుచేసుకునే “ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్”  గురించి తెలుసుకుందామ.

మీ జిడ్డైన జిడ్డుగల చర్మం అధిగమించడానికి 4 “ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్” సిద్దంగా ఉన్నాయి

ఫ్రూట్ ఫేస్ ప్యాక్1

బాగా పండిన అరటిపండ్లు మీ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

పండిన అరటి పండును గుజ్జుగా చేసి 1 టేబుల్ స్పూన్ జోడించి ముఖానికి ప్యాక్ లా వేసుకుని అది గట్టిపడేవరకు ఉంచాలి,

తరువాత గోరు వెచ్చని నీటితో కడిగితే మచ్చ రహితమైన మొటిమలు లేని చర్మాన్ని పొందవచ్చు.

ఇంకా మెరుగైన ఫలితాల కోసం నారింజ రసన్ని సిట్రస్ పండు రసాన్ని కలిపి పట్టిస్తే జిడ్డు లేని చర్మాన్ని పొందవచ్చు.

ఫ్రూట్ ఫేస్ ప్యాక్2

స్ట్రాబెర్రీలు:స్ట్రాబెర్రీలు మరియు బ్లూబెర్రీల వంటి పండ్లు జిడ్డు చర్మాన్ని తొలగించడానికి ఎంతో ఉపయొగపడతాయి,

స్ట్రాబెర్రీలు గుజ్జుగా చేసి, కొంచెం నిమ్మరసంలో కలిపి ముఖమునకు పట్టంచి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితాల్ని పొందవచ్చు ,

ఇవి మన చర్మాన్ని ముడతలు రాకుండా కాపాడటంలో ఎంతో ఉపయోగపడుతుంది.

ఫ్రూట్ ఫేస్ ప్యాక్3

నారింజ పండు మన చర్మ సౌందర్యానికి ఎంతో శ్రేయస్కరం,దీనిని గుజ్జుగా చేసి, లేదా పొడిగా చేసి, 2 రకాలుగా ఉపయోగించవచ్చు

నారంజలో ఉన్న విటమిన్ ‘ సి’ చర్మ సంరక్షణ కై ఎంతో ఉపయోగపడుతుంది

ఫ్రూట్ ఫేస్ ప్యాక్4

మనం ఇంట్లో తయరుచేసుకునే ఎన్నో సహజమైన ఫేస్ ప్యాక్స్ నిమ్మ పైనే ఆధారపడి తయారవుతాయి.

నిమ్మలో ఉన్న సిట్రిక్ యాసిడ్ మన చర్మం యొక్క కణాలను శుద్ది చేసి, జిడ్డు తన్నన్ని తగ్గిస్తూ చర్మానికి ఎంతో కాంతిని ఇవ్వడంలో సహాయపడుతుంది.

సహజంగా జిడ్డుగల చర్మం నుండి ఉపశమనం పొందేందుకు పై వాటిని ప్రయత్నించండి.

Posted on

Watermelon face packs in Telugu – మీ చర్మ సౌందర్యానికి ఇంట్లోనే పుచ్చకాయతో తయారుచేసుకునే “ఫేస్ ప్యాక్స్”

 

అందరూ అనుకున్నట్లు పుచ్చకాయ వేసవి తాపాన్ని తేర్చే ఒక జూసీ ఫ్రూట్  మాత్రమే కాదు, మన చర్మ సమ్రక్షణలొ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చర్మ్మాన్ని వేడి నుంచి రక్షిస్తూనే చర్మ వ్యాదులు సోకకుండా ఒక మంచి మందులా ఉపయోగపడుతుంది. ఇందులో 93% నీటి నిల్వలతో పాటుగా  మల్టీవిటమిన్లు విటమిన్ A, విటమిన్ B6 మరియు విటమిన్ C లు సమృద్ధిగా  ఉన్నాయి. ఇది మన చర్మం యొక్క దాహాన్ని తీర్చి శాంత పరచడమే కాకుండా, వేడి వల్ల చర్మంలో చిన్న చిన్న సమస్యలు ఉన్ననూ శుబ్రము చేసి సంరక్షిస్తుంది . మృదువైన, మచ్చలేని మరియు అందమైన చర్మం కోసం ఈ విధంగా ప్రయత్నించండి..

 

పుచ్చకాయ “ఫేస్ ప్యాక్స్” :

 మృదువైన చర్మం కోసం:

 •  1 టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసం మరియు 1 టేబుల్ స్పూన్ సాదా పెరుగు తీస్కోండి.
 • ఈ రెండిటిని బాగా కలపాలి తరువాత మీ ముఖం మరియు మెడ మీద బాగా పట్టించాలి .
 • 10-15 నిమిషాలు ఆగి తర్వాత చల్లని నీటితో కడగండి .
 • పెరుగులో ఉన్న  లాక్టిక్ ఆసిడ్   మరియు  ఎంజైములు, పుచ్చకాయతో కలిసి చర్మాన్ని మ్రుదువుగా, కోమలంగా చేస్తాయి.

 

ముడతల చర్మమానికి:

 • అవకాడో పండుని గుజ్జుగా చేసి ఒక 1 టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసంతో కలపాలి.
 • ఈ మిశ్రమాన్ని మీ ముఖం మరియు మెడ మీద  పట్టించాలి.
 • 20 నిమిషాలు తర్వాత చల్లని నీటితో కడగండి.
 •  అవకాడో పండు సమృద్ధిగా, ఎంతో శక్తివంతమైన 3  ఒమేగా కొవ్వు ఆమ్లాలు, విటమిన్ C, విటమిన్ E  కలిగి ఉండటం వల్ల  చర్మాన్ని పొడిబారకుండా  కాపాడి మంచి ఫలితాల్ని ఇస్తుంది

 

మొటిమ రహితమైన పుచ్చకాయ “ఫేస్ ప్యాక్స్” :

 •  మొటిమ రహితమైన, దుమ్మూ, దూళి రహితమైన చర్మం కోసం అరటి పండుని గుజ్జుగా చేసి ఒక 1 టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసంతో కలపాలి.
 • ఈ పేస్ట్ ని మీ ముఖం మరియు మెడ మీద  పట్టించాలి
 • 20 నిమిషాలు తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి
 •  అరటి పండులో విటమిన్ B2,విటమిన్ B6, విటమిన్ B12 ఉండటం వల్ల  మీరు రంధ్రాల మరియు చర్మం మంటను  తగ్గించి మరియు అదే సమయంలో మీ చర్మం పొడి బారకుండా  మృదువుగా ఉంచుటకు సహాయపడుతుంది.
 • పుచ్చకాయ రసం మీ చర్మం నుండి జిడ్డుని తగ్గించి ఫ్రెష్ గా ఉంచుతుంది.

 పొడిబారిన చర్మం కోసం…

 • 1 టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసంలో 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి.
 • ఈ పేస్ట్ ని మీ ముఖం మరియు మెడ మీద  పట్టించాలి.
 • 20 నిమిషాలు తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి.
 •  తేనె మీ చర్మం యొక్క అంతర్భాగానికి చొచ్చుకుని పొయి సంరక్షిస్తుంది .
 • మరో పక్క పుచ్చకాయ రసం జిడ్డు తత్వాన్ని  దూరం చేసి చర్మాన్ని మ్రుదువుగా ఉంచుతుంది.

 

ఈ పైన సూచించిన పద్దతులన్నీ మిరు కలలు కనే మ్రుదువైన, అందమైన, కోమలమైన చర్మం పొందడంలో సహాయపడతాయి 

 మంచి ఫలితాల కోసం ఈ జాగ్రత్తలు పాతించండి…..

 

Posted on

Nose piercing tips in Telugu – ముక్కు పోగు చేయించుకొనుట – తగు జాగ్రత్తలు

ముక్కు పోగు అనేది ఈ కాలం లో సాంప్రదాయము కన్నా ఎంతో గొప్పగా మరియు ముక్యమైనదిగా ఆడపిల్లలు భావిస్తున్నారు. తూర్పు ఆసియా దేశాలలో ముక్కు పోగు అనేది వారి సంప్రదాయం మరియు సంస్కృతిలో కలిగి ఉన్నప్పటికీ ఈప్పటి యువత దీనిని ఎంతో ఉత్సాహంతో అన్నిటికన్నా ఎక్కువగా భావిస్తున్నారు. ఎంత ఉత్సాహం ఉన్నపటికీ ఈ పద్దతి చాలా నొప్పితో కూడుకున్నది మరియు పూర్తిగా కోలుకొనుటకు 1 లేదా 2 వారాలు పదుతుంది.

ముక్కు పోగు కుట్టించుకొనుట మరియు తీసుకోవలసిన ముందు  జాగ్రత్తలు :

 • ముక్కు పోగు కుట్టించుకొనుట ఎంతో అహ్లాదం లేదా తప్పనిసరి అయినఫ్పుడు కొన్ని చిట్కాలు పాటించడం  చాల అవసరం.
 • ముక్కు పోగు కుట్టించుకునే ముందు  ఈ చిట్కాలు పాటించండి….. మధురానుభూతిని   పొందండి
 • ముందుగా మీరూ Beautician దగ్గరకు కాని ముక్కు పోగు కుట్టుట బాగా తెలిసిన వారి వద్దకే వెళ్ళవలయును. అంతే కానీ తెలిసీ తెలియని వారితో, ఈ పద్దతి తెలియని వారితో చేయించుకొనుట మంచిది కాదు.
 • ముక్కు పోగు కుట్టే సూది మరియు ఇతర పరికరములు శుబ్రమైనవో కావో, ముందుగానె చూసుకోవాలి . ఒకవేళ అవి శుబ్రపరచనిచో అంటువ్యాదులు సోకే ప్రమాదం ఉంటుంది.
 • కుట్టించుకునే ముందే ముక్కు పుడకను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి, లేదంటే ఇబ్బందులు  తలెత్తే ప్రమాదం కలదు.
 • ముక్కు పుడక కుట్టే సమయంలో కళాకారుడు తగు జాగ్రత్తలు, కొన్ని భద్రతా నియమాలు పాటించదం ఎంతో అవ్సరం, ముఖ్యంగా తను ధరించే చేతి తొడుగులు, ఉపయోగించే వస్త్రాలు, పరికరాలు ఎంతో శుబ్రమైనవిగా ఉండాలి.

 ముక్కు పోగు కుట్టించుకున్న తరువాత పాటించవలసిన  తగు జాగ్రత్తలు:

 • ముక్కు పోగు కుట్టించుకున్న తరువాత నొప్పి తగ్గుటకు సాధారణంగా 8-10 రోజుల వరకు పడుతుంది.త్వరిత ఉపసమనం కోసం మరియు వేగవంతంగా నయంకావడానికి ఈ చిట్కాలు పాటించండి.
 • ముక్కు పోగు రంద్ర భాగమును, చుట్టూ ఉన్న ప్రదేశమును  ప్రతీ రోజు స్నానం చేసే అప్పుడు శుబ్రపరుచుకోవలయును.
 • క్రిమి సం హారక పదార్దాలు ఉపయోగించినచో ఏ విదమైన ఇన్ ఫెక్షన్  సోకకుండా కాపాడుతుంది.
 • కుట్టిన ప్రాంతంలో శుభ్రం చేయడానికి ఏ కఠినమైన పదార్థం వాడకండి. మెత్తని టవల్,కాగితం, 100% పత్తి వస్త్రం ఇలాంటివి వాడతం ఎంతో శ్రేయస్కరం    
 • కుట్టిన ప్రాంతంలో లావెండర్ తైలం ఉపయోగించితే నొప్పి మరియు ఎరుపుతనం  తగ్గించేందుకు సహాయం చేస్తుంది.
 • “విటమిన్ B” మరియు  జింక్ తో కూడిన  మందులు వాదుట వలన నొప్పి త్వరగా తగ్గి మంచి మంచి మందులుగా ఉపయోగపడతాయి
 • ఎంతో జాగ్రత్త వహించ వలయును లేదా చిన్న చిన్న బట్టల దారం పట్టడం ద్వారా ఎంతో నొప్పిని పొందుతారు
 • కుట్టిన ప్రదేశంలో కొంచెం వేడితో కూడిన పదార్దాన్ని ఉంచినచో నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది .
 • కుట్లు ఎక్కడా చెరగకుండా తగు జాగ్రత్తలు తేసుకోవడం ఎంతో అవసరం.
 • కుట్లు త్వరగా తగ్గుటకు, వేడి నూనెలో కొంచెం పసుపు కలిపి పట్టించినచో, పసుపులో ఉన్న క్రిమి సంహారకత్వం నొప్పిని త్వరగా తగ్గిస్తుంది.
Posted on

Tips for Red lips in Telugu – అందమైన, మ్రుదువైన ఎర్రని పెదవులు కోసం టిప్స్

ఆందమైన, మ్రుదువైన ఎర్రని మరియు మెత్తని పెదవుల్ని కోరుకోని వారుంటారా, కాని ee ఉరుకుల పరుగుల మెకానికల్ జీవితంలొ పడి మనం ఆ అందాన్ని పట్టిచుకోవడం మానేస్తున్నాం.  చక్కటి, మ్రుదువైన ఎర్రని పెదవుల కోసం ఈరోజు మనం ఇంట్లోనే సహజ పద్దతుల్ని తెలుసుకుందాం…

ఇవి పాటించండి….

 1. ఒక టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ పాల పొడిని కుంకుమ పువ్వుతో కలిపి  ఫ్రిజ్ లో ఉంచి చల్లబడిన తర్వాత మీ పెదవులకు రాసి కాటన్ ప్యాడ్ తో శుబ్రం చేసుకోండి.

 2. ఎర్రటి గులాబీ రేకుల్ని ఒక టేబుల్  స్పూన్ పాలతో కలిపి, పాలు గులాబీ రంగులొ maareeantavaraku కలపాలి, తరువాత గులాబి రేకుల్ని, పాలని వేరుచేసి పాలని 10-15 నిమిషాలు ఫ్రిజ్లొ ఉంచాలి. తరువాత బయటకు తీసి  ఒక టేబుల్ spoon బాధం పొడిని కలిపి 10-15 నిమిషాలు పెదవులకు పట్టించాలి, తరువాత కాటన్ ప్యాడ్ తో శుబ్రం చేసుకుంటే కాంతివంతమైన తళ తళ లాడే ఎర్రటి పెదాలు మీ సొంతం అవుతాయి

 3. గులాబి రేకుల్ని పాలల్లో కలిపి ముద్దగా చేసి పెదాలకు రాసుకుంటే ఊహించని ఫలితాలు పొందవచ్చు, పాలకు బదులు Glycerine ని  కుడా ఉపయోగించవచ్చు 

 4.  ఒక స్పూన్ పాల  మీగడని బీట్రూట్ రసం లేదా దానిమ్మ రసంతో కలపండి, ఈ మిశ్రమాన్ని పగిలిన పెదాలకు పట్టిస్తే మంచి ఫలితాన్నే కాకుండా ఎర్రటి మ్రుదువైన పెదాలని సొంతం చేసుకోవచ్చు.

 5. తేనె అనేది ఎలాంటి చర్మానికైనా ఉపయోగపడుతుంది,1\2 టీ స్పూన్ తేనెను 1\2 టీ స్పూన్ నిమ్మ రసంతో కలిపి పెదాలకు పట్టిస్తే, పగుళ్ళతో జవసత్వం కోల్పోయిన  పెదాలు ఎంతో అందంగా, మ్రుదువుగా, ఎర్రటి గులాబీగా మరిపోతాయి.

 6. కొంచెం పెరుగులో టమాటా పేస్ట్ ని కలిపి పెదాలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.

 7. మరొక ఆయుర్వేద చిట్కా ఏమిటంటే : ఎండుద్రాక్షని రాత్రంతా నీటిలొ నానపెట్టి ఉదయాన్నె ఖాళి కడుపుతో తింటే మంచి సత్ఫలితాల్ని  ఇస్తుంది.

 

చక్కటి పెదవుల కోసం కొన్ని లిప్స్ వ్యాయామం చిట్కాలు:

 •  విటమిన్ “ఈ” కలిగి ఉన్న లిప్ క్రీం ని రోజు నిద్ర పొయే ముందు పెదవులకు రాసుకోవాలి.
 • మీ చూపుడు వేళ్ళతొ మీ పెదవులపై ఉన్న నవ్వు రేఖా భాగాన్ని మసాజ్ చేయాలి.
 • రెండు పెదవుల చివరా మీ చూపుడు వేళ్ళతో మెల్లగా మసాజ్ చెసుకోవాలి 
 • చల్లటి కాటన్ ప్యాడ్ తో పెదాలు శుబ్రపరుచుకుని, సూర్యుడు నుంచి సైతం రక్షణ ఇచ్చే లిప్ బాం ని రాసుకుంటె మంచి ఫలితాలు లభిస్తాయి .
 • చివరిగా మరియు ఖచ్చితంగా పాటించాల్సినది, మీ పెదాలు అందంగా, ఎర్రగా, మ్రుదువుగా ఉండాలంటే చాలా తేలికైనది మరియు ఖర్చులేనిదీ ఎక్కువ శాతం మంచి నీరు తాగడం

మరికొన్ని చిట్కాలు

 • పెదాలకి కొంచెం నూనె రాసి కొన్ని గంటల వరకు ఉంచండి, రాత్రంతా ఉంచితే మరింత మంచి ఫలితాల్ని సాదించవచ్చు
 • కొబ్బరి నూనె, బాధం నూనె సమపాళ్ళలొ కలిపి పెదాలకి పట్టించి రాత్రంతా ఉంచాలి, ఇలా 2 వారాలు చేస్తే మంచి ఫలితాల్ని పొందవచ్చు.
Posted on

Puffy eyes tips in Telugu – బోద కళ్ళు – సమస్యలు – వాటి సహజ నివారణములు

బోద కళ్ళు మరియు కంటి కింద కుంగిపోయిన చర్మం మనకు ఎంతో బాధని మరియు మనపై మనకు వికారంతో పాటు అసహ్యాన్ని కలిగిస్తాయి, ముఖ్యంగా అవి ఎవరికీ కనపడకుండా దాచుకొవాలని ఎంతో ప్రయత్నిస్తారు,  ఈ సమస్యకు కారణం మరియు దోషి ఎవరంటే మన వయస్సు అనే చెప్పుకోవాలి.అదే మన అందం పాలిట శత్రువుగా మారి మనల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది. యవ్వనంలొ ఉన్నప్పుడు మన శరీరం ఎంతో గట్టిగా ఉండి,ఎంతో పోరాట పటిమను చూపిస్తుంది, కానీ కాలానుగుణంగా మన శరీరంలొ వచ్చే మార్పుల్లో ఈ బోద కళ్ళ సమస్య ఒకటి

ఈ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి 

సరియైన, పౌస్టికమైన  ఆహారం తీసుకోకపొవడం, నిద్ర లేమి,  మీ నిద్ర అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, మరియు మరెన్నో ఈ  సమస్యకు కారణాలు

మీ రిఫ్రిజిరేటర్ నుండి:

దోసకాయ అనేది ఈ కంటి వాపులకి మరియు భోదకళ్లకి ఎంతో ఉపయోగపడుతుంది,రిఫ్రిజిరేటర్ నుండి తీసిన దోసకాయ యొక్క చల్లదనం కంటి వాపుని తగ్గిస్తుంది , దోసకాయలో ఉన్న రక్తస్రావ నివారిణి రక్త నాళాలను బిగువుగా చేస్తుంది.గుడ్డు మరియు బంగాళదుంపలు కూడా  మీ  రిఫ్రిజిరేటర్ లొ దాచిపెట్టిన  నిధి వంటివే, ఇవి కూడా కళ్ళకు ఎంతొ ఉపయొగపడతాయి.

మీ సింకు నుండి..

ఉదయం ఈ హడావిడి, గజి బిజి జీవితంలో తయారు కావడానికి  30 నిమిషాలు మాత్రమే ఉన్న సమయంలో ఈ దోసకాయ ముక్కలు మరియు టీ సంచులు సహాయపడవు, ఈ సమయంలో చల్లటి నీళ్ళతొ మన మొహమును శుబ్రపరుచుకుంటె ఆ చల్లదనం మన రక్త నాళాలను బిగువుగా చేసి వాపును తగ్గించడంలో ఎంతో సహాయ పడుతుంది  .

మీ మసాలా రాక్ నుండి:

మీ కళ్ళ వాపులకు ఉపసమనం కావాలి అనుకుంటే అది మీ ఇంట్లోనే దొరుకుతుంది, మీరు చేయవలసిందల్లా కొంచెం ఉప్పుని వెచ్చటి నీటిలొ కలిపి కాటన్ ప్యాడ్స్ తో కంటి రెప్పల పై శుభ్రం చేసుకుంటే అరగంట తరువాత అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

మీ రాక్ నుండి:

మీరు ఎప్పుడైన టీస్పూన్లు మీ కళ్ల పై అద్భుతం చేయడం చూసార, వినడానికి, కొత్తగా, వింతగా ఉన్నా ఇది నిజమే, చల్లటి టీ స్పూన్లు మీ కళ్ళ వాపులను తగ్గిస్తాయి.

ఒక 2 టీ స్పూన్లు ఫ్రిజ్ లొ పెట్టి చల్లబడిన తర్వాత తీసి కంటి కింద ఉన్న వాపుల పై ఉంచుకోవాలి, ఒక స్పూన్ చల్లదనం తగ్గగానే మరొకటి పెట్టుకోవాలీ ఇలా చేస్తే కళ్ళు చల్లబడి ఎంతో ఉపసమనం పొందుతాయి.

ఇవే కాకుండా ఇంకా మీ పరిసరాలను దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి, ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ కళ్ళను గట్టిగా రుద్దవద్దు, మెల్లగా, మెత్తగా సరైన రోజూ మసాజు చేయడం  వల్ల కూడా కళ్ళను కాపాడుకోవచ్చు. 

Posted on

Control body odor tips in Telugu – శరీర దుర్వాసన నియంత్రణకు చిట్కాలు

శరీర దుర్వాసన, చెమట మరియు ఇతర చర్మ స్రవాలు నుంచి తలెత్తు చెడు వాసన.ఈ దుర్వాసనను భరించడం ఎంతో కష్టం, ఇది మిమ్మల్ని స్నేహితుల లేదా ఇతర సమావేశాల నుంచి దూరం చేస్తుంది.మీరు ఎలాంటి కోవకు చెందిన వారైనను, ఈ చెడు వాసన మితో ఉన్నవారినే కాదు మిమల్ని కూడా ఎంతో ఇబ్బందికి  గురిచేసి అసౌకర్యాన్ని కలిపిస్తుంది.

 • ఇది ప్రతి మనిషిలొ ఉండే సమస్య అయినప్పటికి ప్రతీ వ్యక్తి వివిధ రకముల శరీరం కలిగి ఉండటం వల్ల, మనిషికి ఒకరికీ మరొకరికీ మద్య మార్పు ఉంటుంది.
 • ఈ దుర్వాసన మన శరీరంలో  “eccrine” మరియు “apocrine” అనే  గ్రంధుల వల్ల వ్యాపిస్తుంది.
 • మొదటిగా శరీరం అంతటా వ్యాపించి ఉన్ననూ ముఖ్యంగా చేతులు పై, చేతుల కింది భాగము, చంకలు, అరికాళ్ళు, నుదురు పై ప్రభావం చూపిస్తాయి. తరువాత తొడల మధ్య చేరి ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి.
 • మార్కెట్లో ఎన్నో రకముల వివిధ ఉత్పత్తులు ఉన్నను అవి  తాత్కాలిక రక్షణ మాత్రమే ఇస్తాయి, కానీ ఈ సమస్యకు శాస్వత పరిష్కారం ఎంతో అవసరం.
 • Deodorants, perfumes ఈ దుర్వాసనను కొంతవరకు తగ్గించినా శాస్వత పరిష్కారం ఎంతో అవసరం. వ్యక్తి యొక్క మానసిక మరియు భావోద్వేగ  ఒత్తిడి వల్ల కూడా ఈ దుర్వాసన వ్యాపిస్తుంది

చెడు వాసనకు కారణం:

పరిశుభ్రత సమస్య: మనం నివసించే ప్రదేశం శుబ్రంగా లేకపోయినా,స్నానము సరిగా  చెయకపొయినా, పరిశుభ్రమైన బట్టలు వేసుకోకపోయిన, ఎంతో  చిన్నవిగా అనిపించే ఇవి

మన శరీర దుర్వాసనకు కారణం అవుతాయి

చర్మం సమస్య: చెడు వాసనకు కారణములలొ మరొకటి చర్మ సమస్యలు, మీకు “eczema” లేదా “psoriasis” అనే  అలెర్జీలు ఉంటే నిర్దారించుకుని డాక్టరు ని సంప్రదించడం ఎంతో అవసరం.

నివారణ మార్గములు :

ప్రతీ రోజు స్నానం లొ  క్రిమి సం హారిక సబ్బును ఉపయొగించాలి 

కాటన్ దుస్తులు ధరించాలి, ముఖ్యముగా  undergarments, ఇవి మీ చర్మానికి గాలి తగిలేలా చేసి దుర్గందాన్ని దూరం చేస్తాయి.

ఎప్పటికప్పుడు 80% చెమట పట్టిన, మరియు దుర్వాసన కలిగించే ప్రదేశాలని సబ్బుతొ శుబ్రముగా కడుక్కోవాలి.

నేరుగా నాడీ వ్యవస్థను ప్రభావితం మరియు మరింత చెమట ఉత్పత్తికి దారి తీసే టీ,కాఫీలను తీసుకోవద్దు 

రక్త కణాల పై ప్రభావితం చూపి చెమటకు మరియు శరీర దుర్గందానికి కారణం అయ్యే మద్యం కి దూరంగ ఉండటం ఎంతో అవసరం 

మీ రోజు వారి మందులు అనగా గర్భ మాత్రలు, స్టెరాయిడ్ ఆస్త్మా మందులు వల్ల కూడా చెమట వ్యాపించే అవకాశం ఎక్కువ, వీటి పై శ్రద్ద చూపించి సరైన మోతాదులో తీస్కోవాలి.

చెడు వాసనతో పోరాడేందుకు సహజ నివారణలు:

 • మీ స్నానం తర్వాత చివరిగా ఒక టేబుల్ స్పూన్ తేనెను నీటిలో కలిపి స్నానం చేస్తే  ఇది మీ శరీర దుర్వాసనని నియంత్రిస్తుంది
 • మీ స్నానం నీటిలో ఒక టేబుల్ స్పూన్  పటికను జోడించి తీసుకుంటే, ఎంతో తాజా, దుర్వాసన రహితమైన చర్మాన్ని పొందవచ్చు.
 • పొడి రూపంలో ఉన్న బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల అది రసాయనాలను గ్రహించి శరీర దుర్గందాన్ని తగ్గిస్తుంది
 • ఉడికించిన పుదీనా ఆకులు స్నానపు నీటిలొ కలిపి చేస్తే రోజంతా చర్మం ఎంతో తాజాగా ఉంటుంది.
 • సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడ శరీర దుర్వాసనను తగ్గించటానికి ఎంతో సహయపడుతుంది,
 • ముఖ్యముగా మీ ఆహారం 20% మాంసకృత్తులు, 20% నూనెలు మరియు కొవ్వులు కలిగి ఉండి పండ్లు మరియు కూరగాయలు తో  తీసుకొవడం ఎంతో అవసరం 
 • మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకొవడం వలన కూడ ఎంతో అవసరం.
 • ఒక టేబుల్ స్పూన్  సొంపుగింజలను తీసుకొవడం ద్వారా మీ శరీర తాజాతనమునకు ఎంతో ఉపయోగ పడుతుంది .
 • మన జీవన శైలి మన చేతుల్లోనె ఉంటుంది,అదనపు అలసట మరియు ఒత్తిడి  మన మానసిక స్తితిని పాడుచేస్తుంది  అందుకే
 • దుర్వాసన అనేది మి వ్యక్తిత్వానికి మంచిది కాదు, దీని నియంత్రణకు

పైన సూచించిన విధముగా పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

Posted on

Tips for glowing skin in Telugu – అందమైన మరియు ప్రకాశించే కాంతివంతమైన చర్మం కోసం సహజమైన పద్ధతులు

మన రోజువారీ జీవితంలొ స్క్రబ్బింగ్  అనేది అలవాట్లలో ఒక భాగంగా మార్చుకొవాలి. ఏ దుమ్మ,ధూళి కణాలు లోపించిన, మరియు అధిక జిడ్డు లేని ముఖాన్ని ఎర్పరుచుకొవడం అనేది మన సౌందర్యం యొక్క రహస్యమె అని చెప్పుకోవాలి .  స్క్రబ్బింగ్  ను మీ  చర్మం యొక్క  రకాన్ని బట్టి వారానికి ఒకసారి తీసుకోవాలి. ఎన్నొ వివిధ రకముల కెమికల్స్ మార్కెట్ లో లభిస్తునాయి, వీటిలొ రసాయనాల అధిక కంటెంట్ లో ఉండడం వల్ల చర్మం మరియు మీ లుక్ హానికరం అయ్యె  అవకాశాలు ఉన్నాయి.

మీరు నిజంగా మీ చర్మం యొక్క నాణ్యత  కొరుకునేవారైతె, ఈ కెమికల్స్  కి దూరంగా   ఉంటూ  ఎంతో సహజ సిద్దమైన సహజ మార్గాలు ఎల్లప్పుడూ పాటిస్తూ ఉండండి,

చర్మ రక్షణకై తక్షణ ఫలితాలు ఇచ్చే ఎన్నో వివిధ సహజ మార్గాలు ఉన్నాయి .

 

*నిమ్మ-తేనె మిశ్రమము :

నిమ్మ అనేది ప్రకృతి మనకు ఇచ్చిన వరం లాంటిది, ఇది ఆమ్ల మరియు ఒక గొప్ప సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా ఎంతో ఉపయోగ పడుతుంది.

నిమ్మను తేనెతొ కలిపి ముఖానికి పట్టిస్తే కాంతివంతమైన మరియు ఎంతొ అందమైన చర్మాని ఇస్తుంది అనడంలొ సందేహం లేదు, మరియు ఈ మిస్రమము మన చర్మం పై ఎంతొ ప్రభావాన్ని చూపిస్తుంది.

సహజ సౌందర్యం కొల్పొయిన మరియు, ఒడిలిపొయిన చర్మాన్ని మళ్ళీ కాంతివంతంగా మార్చాలంటే 2 టేబుల్ స్పూన్లు తేనెను, 1 టేబుల్ స్పూన్  నిమ్మరసంను,1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెను మరియు ఒకటిన్నర  చక్కెరను కలిపి ముఖనికి రాసుకుని  కొంత సేపటి  తర్వాత నీటితొ శుభ్రం  చేసుకోవాలి .

 

*ఉప్పు, నిమ్మ మరియు చక్కెర మిశ్రమము:

మీరు మీ  చర్మం యొక్క ఛాయను పెంచుకోవాలన్నా,మీ చర్మాన్ని ఉత్తమ మార్గంలో ఉంచుకోవాలన్నా  ఈ పద్దతి ఎంతో శ్రేయస్కరం మరియు సులభం,

2 టేబుల్స్పూన్లు ఉప్పు,అరనిమ్మకాయ రసం,మరియు  చక్కెర కలిపి మీ ముఖానికి  పట్టిస్తే ఈ మిశ్రమం సహజ మార్గంలో స్క్రబ్బింగ్ తర్వాత చర్మం సరైన టోన్ పొందడానికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

 

*జిడ్డుగల చర్మం కోసం అవెకాడో పండు మరియు ఓట్ మీల్(oatmeal):

ఆరోగ్యవంతమైన మరియు తేమ తో కూడిన చర్మం కొసం 2 టీస్పూన్ల ఓట్ మీల్ పౌడర్,  1 టీస్పూన్  తేనె, మరియు 1 టీస్పూన్ అవెకాడో పండు కలిపి ఒక గిన్నెలొ పేస్ట్ లాగా చేసుకుని  ముఖం పై రాసుకుని నీటితొ శుభ్రం చేసుకుంటె మంచి ఫలితాన్నిస్తుంది.

బేకింగ్ సోడా బ్లాక్  హెడ్ స్క్రబ్బింగ్   ఈ స్క్రబ్బింగ్ చర్మంలో  ఉన్న బాక్టీరియాను  తొలగించి నల్ల మచ్చలను దూరం చేసి  చర్మాన్ని ఎంతో కాంతివంతంగా చేస్తుంది.

1 టేబుల్ స్పూన్ చక్కెర పొడినీ, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడానీ, 2 టేబుల్ స్పూన్లు నీటిని, కలిపి చర్మం పై రాసి మసాజ్ చేయాలి, తరువాత వెచ్చని నీటితో కడగాలి .

 

* అరటి మరియు పంచదార మిశ్రమము :

అరటి పండు  వివిధ పోషకాలతొ నిండి ఉంది, మీ చర్మ సౌందర్యాన్ని కాపడుకోవాలంటె 1 పచ్చి  అరటి పండు  1\4 కప్పు పొడి చక్కెర , 1\4 కప్పు పొడి బెల్లము, వీటన్నింటిని ఒక గిన్నెలో పేస్ట్ గా  చేసి చర్మం పై రాసుకుని మసాజు చేయాలి.

10-15 నిమిషాలు అది ఉంచి వెచ్చని నీటితొ శుబ్రం చేసుకొవాలి

 

*నారింజ రసం మరియు తేనె మిశ్రమము:

ఆరొగ్యవంతమైన మరియు తేజోవంతమైన చర్మం కొసం 3 కప్పుల నారింజ రసం మరియు 1\2 కప్పు వెచ్చని తేనె కలిపి ముఖం పై రాసుకుని అరగంట తరువాత వెచని నీటి తొ కడిగి వేయలి .