Posted on

Telugu face packs for glowing skin – ప్రకాశవంతమైన చర్మం కోసం ఆయుర్వేద ఫేస్ ప్యాక్స్

ఆయుర్వేదం అనేది అన్ని వ్యాధులు మరియు చర్మ సమస్యలకు సహజ వైద్యం యొక్క పురాతన ఔషధ వ్యవస్థలలో ఒకటి. ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తులు సహజ మూలికలు, పండ్లు, కూరగాయల ఏక్సట్రాక్ట్స్ తో తయారు చేస్తారు. అవి ముఖం, చర్మం మరియు జుట్టు సంరక్షణ కొరకు సున్నితంగా పనిచేస్తాయి.

ప్రతి స్త్రీ ప్రకాశవంతమైన చర్మాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా, మన శరీరం యొక్క ఇతర భాగాలతో పోల్చినప్పుడు ముఖానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన చర్మం ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో చాలామంది చిన్న వయసులోనే ముడతలతో మరియు నల్లని మచ్చలతో బాధపడుతున్నారు. అందుకు కారణం హానికరమైన కాస్మెటిక్స్ ని ఉపయోగించటమే.

కానీ, ఆయుర్వేద చికిత్సల ద్వారా మీరు మీ సౌందర్యాన్ని తిరిగి పొందవచ్చు. మన ఇంటిలో మరియు పరిసరాలలో కనిపించే సహజ పదార్ధాలు మెరిసే చర్మాన్ని పొందేందుకు సహాయపడతాయి. ప్రకాశవంతమైన చర్మం కొరకు సహజ పదార్థాలతో ఫేస్ ప్యాక్ లను తయారు చేయవచ్చు.

ఈ పద్ధతుల ద్వారా ఫలితాలను పొందేందుకు కొంత సమయం పడుతుంది. కానీ ఇవి శాశ్వత ఫలితాలను అందిస్తాయి. క్రింద చెప్పినటువంటి ఫేస్ ప్యాక్ లలో మీ చర్మానికి సరిపడే ఫేస్ ప్యాక్ ని ఎంచుకొని క్రమం తప్పకుండా ఉపయోగించి అందమైన ప్రకాశవంతమైన సహజ చర్మాన్ని పొందండి.

ప్రకాశవంతమైన చర్మం మరియు ముఖం కోసం కోసం ఆయుర్వేద ఫేస్ ప్యాక్స్

మ్యారిగోల్డ్ ఫేస్ ప్యాక్

బంతి పువ్వు అని పిలవబడే మేరిగోల్డ్ పుష్పం మీ తోటలో సులభంగా లభిస్తుంది. ఈ పువ్వులు భారత మహిళలు దైవ ఆరాధన కొరకు అధికంగా ఉపయోగిస్తారు. కనుక, ఈ పువ్వులు దుకాణంలో అలాగే తోటలో చాలా సులభంగా లభిస్తుంది. కొన్ని తాజా బంతిపువ్వులను తీసుకొచ్చి మెత్తగా పేస్ట్ చేసి అందులో కొంత పచ్చి పాలను, తేనె వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్‌లై చేసి 15 నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మంచి సువాసన కలిగి ఉండటం మాత్రమే కాదు ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మంలోని మొటిమలను మరియు జిడ్డును తొలగిస్తుంది. దీన్ని వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించి మంచి ఫలితాలను పొందండి. జిడ్డు చర్మం ఉన్న వారికీ ఈ ప్యాక్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది.

శనగ పిండి మరియు పసుపు ఫేస్ ప్యాక్

కొంత శనగ పిండి మరియు చిటిక పసుపుని ఒక బౌల్ లో వేసుకొని ఈ మిశ్రమాన్ని డైల్యూట్ చేసేందుకు కొంత పాలు లేదా నీటిని ఉపయోగించండి. ఈ ప్యాక్ ని చర్మంపై రాసి 15 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

చదనం లేదా గంధం ఫేస్ మాస్క్

చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడానికి గంధంను ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. గతంలో ప్రజలు గంధపు చెక్క యొక్క సారం పొందడానికి ఒక రఫ్ సర్ఫేస్ పై రుద్దేవారు. కానీ నేడు శాండిల్ వుడ్ పౌడర్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఫేస్ ప్యాక్ తయారు చేసేందుకు ఈ పొడిని మీరు ఉపయోగించవచ్చు. ఒకటి లేదా రెండు స్పూన్ గంధపు పొడిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్‌లై చేసి 15 నిముషాల తర్వాత నీటితో కడగండి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన ముఖంపై మొటిమలు తగ్గుతాయి మరియు ముఖంలో కాంతి పెరుగుతుంది. స్కిన్ సాప్ట్ గా అవుతుంది. వారంలో 3 లేదా 4 సార్లు ఉపయోగిస్తే మరింత బెటర్ రిజల్ట్ పొందుతారు.

అందమైన చర్మం కోసం సుగంధ ప్యాక్

కొన్ని సహజ పదార్ధాలతో ఈ ప్యాక్ ని తయారు చేయవచ్చు. ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక స్పూన్ లావెండర్ నూనె, ఒక స్పూన్ గంధపు పొడి, రెండు టేబుల్ స్పూన్లు శనగ పిండి, చిటిక పసుపు పొడి, తగినంత వెన్న లేదా తాజా క్రీము లేదా రోజ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపి ముఖంపై రాసి బాగా ఆరిన తరువాత వెచ్చని నీటితో కడగండి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది మరియు చర్మం యవ్వనంగా ప్రకాశవంతంగా అవుతుంది.

తేనె మరియు లెమన్ ఫేస్ ప్యాక్

తేనె మరియు నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ మరియు మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని శుభ్రం చేయడంలో మరియు చర్మాన్ని తేలికపరచడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ హనీ తీసుకుని దీనికి అర చెంచ నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్‌లై చేయాలి. ముఖంలో కళ్లకు తప్పా మిగిలిన భాగాలపై అప్‌లై చేసుకోవాలి. ఈ ప్యాక్ ఆరే వరకు ఆగి 15 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం సాప్ట్ గా మరియు ప్రకాశవంతంగా తయారవుతుంది.

హెర్బల్ ఫేస్ మాస్క్

కొద్దిగా శనగ పిండి, చిటికెడు పసుపు మరియు కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేయాలి. దీనికి పచ్చి పాలు లేదా రోజ్ వాటర్ మిక్స్ చేసి స్మూత్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖం మొత్తం అప్‌లై చేసి 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల స్కిన్ సాప్ట్ గా మరియు స్మూత్ గా ప్రకాశవంతంగా అవుతుంది. ఇది స్కిన్ టాన్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను నివారించేందుకు సహాయపడుతుంది.

ఆయుర్వేద స్క్రబ్

ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి మరియు గంధపు పొడిని మిక్స్ చేయాలి. దీనికి అర చెంచా పాలను మరియు ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి, తగినంత రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ ఆయుర్వేద స్క్రబ్ తో వారంలో ఒకటి లేదా రెండు సార్లు ముఖాన్ని స్క్రబ్ చేయాలి.

అత్తి పండు మరియు గుమ్మడికాయ ఫేస్ ప్యాక్

అత్తి పండులో ఆల్ఫా హైడ్రో ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. రెండు అత్తి పండ్లను మరియు 2 ముక్కల గుమ్మడికాయను మృదువైన పేస్ట్ చేయండి. ఇందులో కొన్ని చుక్కల బాదం నూనె జోడించండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖంపై రాసి బాగా ఆరిన తరువాత నీటితో కడగండి.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్

ఆరెంజ్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్స్ సమృద్ధిగా ఉండటం వలన మనకు ఆరోగ్య ప్రయోజనాలను ఇవ్వటమే కాకుండా చర్మ సంరక్షణంకు కూడా సహాయపడుతుంది. ఆరెంజ్ ఫేస్ పాక్స్ వేసవిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చర్మంపై ఉన్న ట్యాన్, నల్లని మచ్చలు, జిడ్డు తొలగించటానికి చాల సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం కాంతివంతంగా మారటానికి సహాయపడతాయి.

 • ఒక స్పూన్ ఆరెంజ్ రసంలో అర స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మాన్ని పొందుతారు. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తూ మంచి ఫలితం కనపడుతుంది.
 • రెండు స్పూన్ల ఆరెంజ్ రసంలో ఒక స్పూన్ సోర్ క్రీం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ యాంటీ ఏజింగ్ లా పనిచేస్తుంది.
 • మూడు స్పూన్ల ఆరెంజ్ రసంలో ఒక స్పూన్ మజ్జిగ, రెండు స్పూన్ శనగ పిండి, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కలబంద డిటానింగ్ ప్యాక్

కలబంద చర్మంపై టాన్ ని తగ్గించటానికి సహాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ కలబంద జెల్ మరియు ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ లేదా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 15 నిమిషాలు ఉంచి కడగాలి.

ఫుల్లర్స్ ఎర్త్ మరియు కలబంద జెల్

రెండు లేదా మూడు టీ స్పూన్ల అలో వెరా జెల్ ని తీసుకొని 1 టీ స్పూన్  ఫుల్లర్స్ ఎర్త్ మట్టిని కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై రాసి 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

కలబంద లేకపోతే ఫుల్లర్స్ ఎర్త్ ని రెండు స్పూన్ రోజ్ వాటర్ తో కూడా కలిపి అప్‌లై చేసుకోవచ్చు. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

స్పష్టమైన చర్మం కోసం గూస్బెర్రీ

గూస్బెర్రీ చర్మపు రంధ్రాలను చిన్నగా చేసి నల్లని మచ్చలను తొలగిస్తుంది. రెండు లేదా మూడు గూస్బెర్రీలను మాష్ చేయి ఒక స్పూన్ తాజా పెరుగు మరియు ఒక చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 20 నిమిషాల తరువాత కడగాలి.

పుదీనా

పుదీనా చర్మంపై ఉన్న మచ్చలను మరియు పింపుల్స్ ను తొలగిస్తుంది. ఇది మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. కొన్ని పుదీనా ఆకులను నలిపి వాటి రసాన్ని పిండి ముఖంపై రాసి 30 నిమిషాల తరువాత నీటితో కడగండి.

జిడ్డు చర్మం కోసం మెంతులు

మెంతులు చర్మం యొక్క సేబాషియస్ గ్లాండ్స్ ని నియంత్రించడం ద్వారా జిడ్డును తగ్గిస్తుంది. కొన్ని మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి రోజ్ వాటర్ మరియు పుదీనా ఆకులతో కలిపి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత కడగండి.

నువ్వుల గింజలు మరియు పసుపు ఫేస్ ప్యాక్

సెసెమీ గింజలలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ మరియు ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్యాక్ చర్మంపై ఉన్న మొటిమలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇది యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. కొన్ని చుక్కల నువ్వుల నూనె, కొన్ని చుక్కల ఆపిల్ సీడర్ వినిగర్ మరియు నీటిని కలిపి ప్యాక్ ని తయారు చేయండి. ఈ ప్యాక్ ని ముఖంపై రాసి 20 నిమిషాల తర్వాత కడగాలి.

వేప మరియు తేనె ఫేస్ ప్యాక్

మొటిమలను తొలగించి ఆరోగ్యమైన ప్రకాశవంతమైన చర్మం కొరకు వేప ఫేస్ ప్యాక్ ఉత్తమ ఎంపిక. వేపాకులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. వేప ఆకులు, తేనె మరియు పసుపు యొక్క పేస్ట్ తో ఫేస్ ప్యాక్ ని తయారు చేయండి మరియు చర్మంపై రాసి 15-20 నిమిషాల తరువాత కడగండి.

Posted on

Foot blisters tips in Telugu – పాదాల పై బ్లిస్టర్స్ ని క్యూర్ చేసేందుకు హోం రెమెడీస్

బ్లిస్టర్స్ అంటే ఏమిటి?

బ్లిస్టర్స్ శరీరంపై ఒక చిన్న బొబ్బలా ఏర్పడుతుంది. వీటిని పొక్కు అని కూడా అంటారు. ఈ బుడగల యొక్క పరిమాణం మారుతూ ఉంటాయి మరియు వివిధ కారణాల వలన సంభవిస్తాయి. స్కిన్ బర్న్, ఫంగస్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లేదా దోమ కాటు వలన సంభవించవచ్చు. ఏర్పడిన స్థానాన్ని బట్టి, పొక్కు రోజువారీ పనులకు ఆటంకం కలిగించవచ్చు. ఉదాహరణకు, మీరు మీ పాదాలలో పొక్కును కలిగి ఉంటే నడవటానికి, వ్యాయామం, లేదా దీర్ఘకాలం పాటు నిలబడటానికి కష్టంగా ఉంటుంది.

బొబ్బలు సాధారణంగా పాదాలమీద అభివృద్ధి చెందుతాయి. వీటి వలన కలిగే అసౌకర్యం నుండి ఉపశమనం పొందేందుకు అనేక గృహ చికిత్సలు ఉన్నాయి. ఈ చికిత్సలు ఉపశమనం కలిగించి పునరావృతమయ్యే బొబ్బల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

పాదాలపై బొబ్బలు రావటానికి కారణాలు

మీ పాదాలపై బొబ్బలు ఉన్నట్లయితే అందుకు ప్రధాన కారణం ఘర్షణ కావచ్చు. ఎక్కువ సమయం నడవటం లేదా నిలబడటం వలన హీల్స్, అరికాలు మరియు కాలి వేలపై ఒత్తిడి పెరుగుతుంది. వీటి కారణంగా బ్లిస్టర్స్ ఏర్పడతాయి.

అయితే, దీర్ఘకాలం నడిచిన లేదా నిలబడి వున్న ప్రతి ఒక్కరికి బొబ్బలు ఏర్పడవు. అనేక సందర్భాల్లో, ఈ ద్రవంతో నిండిన పొక్కులు సరిగ్గా ఫిట్ అవ్వని బూట్లు వలన ఏర్పడుతుంది. చాలా లూస్ గా లేదా చాలా టైట్ గా ఉండే షూస్ వేసుకోవటం వలన ఘర్షణకు దారితీస్తుంది మరియు దాని ఫలితంగా చర్మంపై పొక్కు ఏర్పడుతుంది.

అధిక తేమ లేదా చెమట బ్లిస్టర్స్ ఏర్పడటానికి కారణం కావచ్చు. స్వెట్ ఫోర్స్ మూసుకుపోయినప్పుడు చిన్న బొబ్బలు ఏర్పడతాయి. చలి కాలంలో ఇది సాధారణంగా అధికంగా ఏర్పడుతుంది.

సన్ బర్న్ వలన కూడా ఇవి ఏర్పడవచ్చు. పాదాలపై బొబ్బలు ఏర్పడటానికి ఇతర కారణాలు

 • ఫ్రాస్ట్-బైట్
 • అలెర్జీ ప్రతిచర్య
 • రసాయన ఎక్స్పోజర్ (కాస్మెటిక్స్ లేదా డిటర్జెంట్లు)
 • ఫంగల్ ఇన్ఫెక్షన్లు
 • చికెన్ పాక్స్
 • బాక్టీరియా సంక్రమణ
 • హెర్పెస్
 • డైసిడ్రిటిక్ తామర

డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి?

ఘర్షణ వల్ల కలిగే పొక్కు సాధారణంగా కొన్ని రోజుల్లో గృహ చికిత్సలతో పరిష్కరించబడుతుంది.

దురదృష్టవశాత్తు, కొన్ని బొబ్బలు గృహ చికిత్సలకు స్పందించవు. కాలక్రమేణా మరింత తీవ్రం అవుతాయి. పొక్కు తీవ్ర నొప్పికి కారణమైతే లేదా వాటి వలన నడవడానికి ఇబ్బందిగా ఉంటే వెంటనే వైద్యుడిని చూడండి. బ్లిస్టర్స్ తో పాటు జ్వరం, వికారం లేదా చలి వంటి సంకేతాలు ఉన్నట్లయితే ఇది సంక్రమణంకు ఒక సంకేతం కనుక డాక్టర్ను సంప్రదించాలి.

మీ వైద్యుడు ఒక శుభ్రమైన సూదిని ఉపయోగించి పొక్కును శుభ్రం చేస్తారు. సంక్రమణ వలన కలిగినట్లయితే కారణాన్ని తెలుసుకునేందుకు వారు ద్రవం యొక్క నమూనాను పరిశీలించవచ్చు.

బొబ్బలను నివారించేందుకు మరియు క్యూర్ చేసేందుకు కొన్ని గృహ నివారణలు

ఒక డియోడ్రన్ట్ ఉపయోగించండి

మీ బూట్లు లేదా చెప్పులను ధరించే ముందు, మీ పాదాలపై డియోడ్రన్ట్ ని రాయండి ఎందుకంటే ఇది మీ పాదాలను తేమగా ఉంచుతుంది. ఇది చాలా ప్రయోజనకరమైన గృహ చికిత్స, ఇది బొబ్బలు బారిన పడకుండా మీ కాళ్లను కాపాడుతుంది.

బ్యాండేజ్ ని ఉపయోగించండి

పొక్కు ఏర్పడిన చోటుపై బ్యాండేజ్ ని ఉపయోగించవచ్చు. ఇది ఘర్షణను తగ్గిస్తుంది. ఘర్షణ వలన బొబ్బలు మరింత తీవ్రమవుతాయి. కనుక బ్యాండేజ్ వేసినట్లయితే ఇన్ఫెక్షన్ కలిగించేటువంటి మురికి మరియు ఘర్షణకు పొక్కు గురవకుండా సురక్షితంగా ఉంచుతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒక పాన్ లో వేడి నీటిలో మూడు గ్రీన్ టీ బాగ్స్ వేసి, కొంత బేకింగ్ సోడాను కలిపి ఆపై నీరు చల్లబడిన తర్వాత బొబ్బలు ఏర్పడిన పదాలను కొంత సేపు ఈ నీటిలో ఉంచండి. ఇలా క్రమంగా చేస్తుండటం వలన కొన్ని రోజుల్లో బ్లిస్టర్స్ క్యూర్ అవుతాయి. ఇది చాలా ప్రయోజనకరమైన గృహ చికిత్స మరియు ఎలాంటి దుష్ప్రభావాలను కలిగి ఉండదు.

ఆపిల్ సీడర్ వినిగర్

ఆపిల్ సీడర్ వినిగర్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కనుక ఇది బ్లిస్టర్స్ ఉబ్బకుండా ఉండేందుకు మరియు ఇన్ఫెక్షన్ కలగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఒక పెద్ద వెస్సల్ లోని నీటిలో అర కప్పు వినిగర్ ని కలిపి కాళ్లను కొద్ది సేపు అందులో నానపెట్టండి. ఆ తరువాత పూర్తిగా తడి లేకుండా మెత్తని టవల్ తో తుడవండి. ఇలా క్రమంగా చేయటం వలన బ్లిస్టర్స్ నయమవుతాయి.

విటమిన్ ఇ

విటమిన్ ఇ ఆయింట్మెంట్ లేదా క్రీములను బొబ్బలపై రాయండి లేదా విటమిన్ ఇ గుళిక యొక్క చుక్కలను నేరుగా పొక్కుపై రాయండి. ఇది వెంటనే ఉపశమనం ఇస్తుంది మరియు మార్కెట్లో సులభంగా లభిస్తుంది.

కాస్టర్ ఆయిల్

ఇది చాలా సమర్థవంతమైన గృహ చికిత్స. రాత్రి పడుకునే ముందు కాస్టర్ ఆయిల్ని మీ చేతులపై మరియు పాదాలపై రాయండి. ఇది మీ చర్మాన్ని చల్లబరుస్తుంది మరియు బొబ్బలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఈ ఆయిల్ ని దరఖాస్తు చేయటం వలన ఇదివరకే ఉన్న బొబ్బలు సులభంగా ఎండిపోతాయి. మంచి ఫలితాల కోసం, కాస్టర్ ఆయిల్ మరియు ఆపిల్ సీడర్ వినిగర్ల మిశ్రమంను ఉపయోగించండి.

విచ్ హాజెల్

ఒక పతిని విచ్ హాజెల్ ద్రవంలో ముంచి బ్లిస్టర్స్ పై రాయండి. ఇది మీ బొబ్బలను బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది మరియు బొబ్బలు ఎండిపోయేలా చేస్తుంది. అంతే కాదు ఇది దురద మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

కలబంద

కలబంద లో శోథనిరోధక లక్షణాలు ఉన్నాయి. కలబంద జెల్ ని డైరెక్ట్ గా పొక్కుపై రాయండి. ఇది రెడ్నస్ ని తగ్గించి నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

బ్లిస్టర్స్ ని తెరిచి ఉంచండి

మీరు స్వచ్ఛమైన వాతావరణంలో ఉన్నట్లయితే బొబ్బల్ని తెరిచి ఉంచాలని వైద్యులు సూచించారు. ఇది మీ బొబ్బలు త్వరగా ఎండిపోవుటకు సహాయపడుతుంది.

ఇంట్లోనే పొక్కును శుభ్రపరచేందుకు పాటించాల్సిన చర్యలు

 • మొదట వెచ్చని నీరు మరియు యాంటీ బాక్టీరియల్ సబ్బుతో మీ చేతులను కడగాలి.
 • పత్తిని ఉపయోగించి ఒక శుభ్రమైన సూదిని రబ్బింగ్ ఆల్కహాల్ తో శుభ్రపరచండి.
 • తరువాత యాంటీ సెప్టిక్ తో పొక్కును శుభ్రపరచండి.
 • సూదితో పొక్కు లో ఒక చిన్న పంక్చర్ చేయండి.
 • పొక్కు నుండి ద్రవం పూర్తిగా తొలగించండి.
 • ఆ తరువాత పొక్కు పై యాంటీ బాక్టీరియల్ ఆయింట్మెంట్ లేదా క్రీమ్ ను వర్తించండి.
 • ఇప్పడు బ్లిస్టర్ ఉన్న చోటుపై ఒక శుభ్రమైన బ్యాండేజ్ ని వేయండి.
 • ప్రతిరోజూ బ్లిస్టర్ ని శుభ్రపరచి యాంటీ బాక్టీరియల్ ఆయింట్మెంట్ ని రాయండి. బ్లిస్టర్ పూర్తిగా పొడిబారే వరకు బ్యాండేజ్ వేసి ఉంచండి.
Posted on

Telugu tips for scalp pimples / acne – స్కాల్ప్ పింపుల్స్ చికిత్సకు హోమ్ రెమెడీస్

మనం సాధారణంగా ముఖంపై మొటిమలతో బాధపడుతున్నవారిని ఎందరినో చూస్తూ ఉంటాము. వాటిని తొలగించేందుకు నేచురల్ హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. మరి ఈ పింపుల్స్ తలపై స్కాల్ప్ లో కూడా వస్తుందంటే మీరు నమ్మగలరా? అవును, కొందరికి మొటిమలు స్కాల్ప్ లో కూడా ఏర్పడతాయి. ముఖంపై వస్తేనే ఎంతో చిరాకుగా ఉంటుంది, మేరీ స్కాల్ప్ పై వస్తే? స్కాల్ప్ ఎర్రగా మారటంతో పాటు చిరాకుగా, నొప్పిగా మరియు గోకుతూ ఉండాలని అనిపిస్తుంది.

మరి ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే తగిన చికిత్సలు మరియు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆర్టికల్లో స్కాల్ప్ పై మొటిమలు రావటానికి కారణాలేంటి, తగిన డైట్ మరియు హోమ్ రెమిడీస్ ని చూద్దాం.

స్కాల్ప్ పై పింపుల్స్ రావటానికి కారణాలు

పింపుల్స్ యొక్క అత్యంత సాధారణ కారణాలు చర్మంలో అధిక ఆయిల్ ఉత్పత్తి కావటం, మూసుకుపోయిన చర్మ రంధ్రాలు మరియు చర్మంపై పేరుకుపోయిన మురికి. వీటి వలన ముందుగా స్కాల్ప్ పై బాయిల్స్ లా ఏర్పడి పింపుల్స్ గా మారుతాయి.

చనిపోయిన చర్మ కణాలు మరియు సీబం చర్మాన్ని తడిగా ఉంచినప్పుడు బ్యాక్టీరియా చర్మ రంధ్రాలలోకి ప్రవేశిస్తుంది. ఇందువలన చర్మ కణాలు రంధ్రాల నుండి బయటకు పోలేవు, ఇవి వివిధ రకాలైన మొటిమలకు దారి తీస్తుంది. మొటిమలు చాలా వరకు తీవ్రమైన బాక్టీరియాలు కలిగి ఉంటాయి.

చర్మ రంధ్రాలు మూసుకుపోవటానికి  ముఖ్య కారణాలు

 • హెయిర్ స్ప్రే లేదా జెల్ వంటి హెయిర్ ప్రాడక్ట్స్.
 • రెగ్యులర్గా తల స్నానం చేయకపోవటం వలన పేరుకుపోయి మురికి.
 • వ్యాయామం చేసిన తర్వాత చాలా సమయం మీ జుట్టుని కడగకుండా ఉండటం.
 • స్కాల్ప్ పై అధిక ఫ్రిక్షన్ కలిగించేటువంటి టోపీలు లేదా తలపాగాలు వాడటం.

స్కాల్ప్ పై మొటిమలను మరియు బాయిల్స్ ను నివారించడానికి గృహ నివారణలు

మెంతులు మరియు మెంతాకులు

ఈ రెండింటి లో మొటిమలను తొలగించే ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. స్కాల్ప్ పై మొటిమలను తగ్గించేందుకు కూడా ఈ పదార్థాలను ఉపయోగించవచ్చు.

మెంతాకులను ఉపయోగిస్తున్నట్లయితే కొంత నీటిని జోడించి ఆకులను బాగా రుబ్బి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని స్కాల్ప్ మొటిమల పై రాసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. బాగా ఆరిన తరువాత నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి.

మెంతులను ఉపయోగిస్తున్నట్లయితే కొన్ని మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, రుబ్బి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని స్కాల్ప్ పై ఉన్న పింపుల్స్ పై రాసి 30 నుండి 40 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒక సారి లేదా రెండు సార్లు ఈ రెమెడీని ఉపయోగించటం వలన మంచి ఫలితం ఉంటుంది.

ఆలీ వేరా మరియు పుదీనా ఆకులు

ఈ రెండు పదార్థాలు చర్మ మొటిమలు మరియు బాయిల్స్ ని తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పదిహేను పుదీనా ఆకులను నీటిలో వేసి బాగా ఉడికించండి. నీటి శాతం 15% తగ్గే వరకు ఉడికించండి. తరువాత, కలబంద జెల్ ను ఈ పుదీనా నీటిలో కలపండి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాలని స్కాల్ప్ పై రాయండి. ఈ మిశ్రమాన్ని రాయగానే చర్మంపై చల్లని అనుభూతిని పొందుతారు. ఇలా ప్రతి రోజూ చేయటం వలన ఒకటి లేదా రెండు వారాల్లో ఫలితాలను చూస్తారు.

అల్లం

అల్లంను చిన్న ముక్కలుగా కోసి వాటి నుండి రసం తీసి స్కాల్ప్ పై మొటిమలను నివారించేందుకు ఉపయోగించవచ్చు. అల్లంలో బ్యాక్టీరియాతో పోరాడే ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి కనుక స్కాల్ప్ పై మొటిమలు చాలా వేగంగా నయమవుతాయి.

బేకింగ్ సోడా

స్కాల్ప్ పై మొటిమలను తగ్గించే మరో మూల వస్తువు బేకింగ్ సోడా. బేకింగ్ సోడాను కొంత నీటిలో కలిపి స్కాల్ప్ పై రాసి కొంత సేపు మసాజ్ చేసి ఆరిన తరువాత నీటితో శుభ్రం చేయండి. స్కాల్ప్ పై ఉన్న చర్మ రంధ్రాలు జిడ్డు, మురికి మరియు చనిపోయిన చర్మ కణాలచే మూసుకుపోవటం వలన పింపుల్స్ ఏర్పడ్తాయి. బేకింగ్ సోడా ఉపయోగించటం వలన రంధ్రాలు శుభ్రం అవుతాయి మరియు పింపుల్స్ క్యూర్ అవుతాయి.

తేనె మరియు పుల్లని పెరుగు

తేనె మరియు పెరుగును సమాన మొత్తాల్లో కలుపుకొని ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై ఉన్న మొటిమలపై రాయాలి. బాగా ఆరిన తరువాత వెచ్చని నీటితో కడగండి. తేనె మరియు పెరుగు స్కాల్ప్ లోని తేమ పదార్థాన్ని బాలన్స్ చేస్తుంది. ఈ పదార్థాలను ఎంచుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్ లో లభించే మాములు తేనె కాకుండా ఒరిజినల్ తేనెని ఉపయోగించాలి. అలాగే మార్కెట్ లో లభించే తియ్యని పెరుగు కాకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న పుల్లని పెరుగును ఉపయోగించండి.

పసుపు

మొండి మొటిమలు మరియు మచ్చలను తొలగించడంలో పసుపు చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కొబ్బరి నూనెని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై ఉన్న మొటిమల పై రాయండి.

పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇంఫ్లమేటరి మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది స్కాల్ప్ లోని PH లెవల్స్ ని బాలన్స్ చేస్తుంది మరియు జుట్టు ఫాలికల్స్ కు కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

ఆపిల్ సీడర్ వినిగర్

ఆపిల్ సీడర్ వినిగర్ లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నందున ఇది చర్మంపై మొటిమలు మరియు మచ్చలను తొలగించటంలో మరియు హెయిర్ ఫాలికల్స్ ని శుభ్రపరచటంలో ఉపయోగపడుతుంది. తల స్నానం చేసిన తరువాత ఒక స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్ ని వెచ్చని నీటిలో కలిపి స్కాల్ప్ ని శుభ్రపరచండి. ఇలా చేయటం వలన ఆపిల్ సీడర్ వినిగర్ స్కాల్ప్ పై ఉన్న బాక్టీరియా మరియు క్రిములతో పోరాడుతుంది. మంచి ఫలితాల కోసం వారానికి రెండు సార్లు ఈ మిశ్రమాన్ని వాడండి.

ఆపిల్ సీడర్ వినిగర్ మీ జుట్టును కలుషితాల నుండి కాపాడుతుంది. స్కాల్ప్ లోకి చొచ్చుకుపోయి మొటిమలకు కారణం అయిన బాక్టీరియా మరియు అధిక జిడ్డును తొలగిస్తుంది.

కలబంద

కలబంద లో యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇంఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలు మరియు మచ్చలను తొలగించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద ఆకు నుండి జెల్ ని తీసి స్కాల్ప్ పై ఉన్న మొటిమల పై రాయండి. జెల్ ఆరే వరకు అనగా 15-20 నిమిషాల వరకు ఉంచి ఆ తరువాత వెచ్చని నీటితో కడగండి. వట్టి కలబంద జెల్ కు బదులుగా అర స్పూన్ జెల్ ని 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసంలో కలిపి కూడా ఉపయోగించవచ్చు.

వేపాకు

ఈ సహజ హర్బ్ యొక్క అద్భుతమైన లక్షణాలు తామర, సోరియాసిస్, రింగ్ వార్మ్స్ మరియు మొటిమలు వంటి దీర్ఘకాలిక చర్మ పరిస్థితులతో సహా అనేక చర్మ మరియు జుట్టు సమస్యలను తొలగిస్తుంది. ఇందులో క్రిమినాశక మరియు యాంటీ బయాటిక్ లక్షణాలు మొటిమలను వేగంగా మరియు సమర్థవంతంగా నయం చేయటానికి సహాయపడుతుంది.

కొన్ని వేపాకులను నీటిలో వేసి ఉడికించి ఆ తరువాత నున్నటి పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఆ తరువాత మీ చర్మం యొక్క ప్రభావిత ప్రాంతాలలో ఈ పేస్ట్ ని రాసి 10-15 నిమిషాల పాటు వదిలేయండి. ఆ తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయండి.

మరో విధంగా కూడా వేపను ఉపయోగించవచ్చు. వేపాకు నూనెని కొంత కొబ్బరి నూనెని కలిపి మీ స్కాల్ప్ పై మసాజ్ చేయండి. ఆ తరువాత రాత్రంతా అలాగే ఉంచి ఉదయం మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయండి.

తేనె మరియు దాల్చిన చెక్క

ఒక స్పూన్ దాచిన చెక్క పొడిలో రెండు స్పూన్ తేనెని కలిపి ఒక పేస్ట్ లా చేసి మీ స్కాల్ప్ పై ఉన్న పొక్కు పై రాయండి. వీలైతే కొన్ని చుక్కల ఆర్గన్ ఆయిల్ ని కూడా చేర్చుకోవచ్చు. ఈ మిశ్రమం బాగా ఆరిన తరువాత వెచ్చని నీటితో కడగండి.

తేనె లో యాంటీ బయోటిక్ లక్షణాలు ఉంటాయి మరియు ఇది చర్మంలోని తేమను బాలన్స్ చేస్తుంది. దాల్చిన చెక్కలోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు బ్యాక్టీరియాని నాశనం చేసి పింపుల్స్ రాకుండా నివారిస్తుంది.

బొప్పాయి పల్ప్

బొప్పాయిని ముక్కలుగా కోసుకొని మిక్సీ లో వేసి నున్నటి గుజ్జులా చేసుకోండి. రెండు టేబుల్ స్పూన్ గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు మరియు కావల్సినంత తేనెని కలిపి ఒక పేస్ట్ లా చేసుకోండి. ఈ పేస్ట్ ని స్కాల్ప్ పై ఉన్న పొక్కు పై రాసి 20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

బొప్పాయి స్కాల్ప్ లోని జిడ్డును మరియు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. ఇది మీ స్కాల్ప్ లోపలి వరకు చొచ్చుకుపోయి వాపు మరియు మచ్చలను తొలగిస్తుంది.

జాజికాయ పొడి

ఒక జాజికాయను పొడి చేసి, ఈ పౌడర్ లో నాలుగు టేబుల్ స్పూన్ల పాలను కలిపి పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ని స్కాల్ప్ పై ఉన్న బాయిల్స్ మరియు పింపుల్స్ పై రాసి గంట సేపు తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయండి.

వెల్లుల్లి

ఒక చిన్న వెల్లుల్లిని మాష్ చేసి స్కాల్ప్ పై ఉన్న పొక్కు పై కొన్ని సెకండ్స్ రాయండి. ఇది పింపుల్స్ వలన కలిగే నొప్పి నుండి కూడా తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణం అయినా ఫాక్టర్స్ తో పోరాడుతుంది. టీ ట్రీ ఆయిల్ మరియు ఆలివ్ నూనెని సమాన మొత్తాలలో కలపండి. స్కాల్ప్ పై రాసి మసాజ్ చేయండి. ఒక గంట లేదా రెండు గంటల తరువాత మైల్డ్ షాంపూ తో తల స్నానం చేయండి.

లావెండర్ నూనె

దురదగా ఉండే స్కాల్ప్ మరియు మొటిమల నుండి ఉపశమనం పొందేందుకు లావెండర్ ఆయిల్ సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ లావెండర్ ఆయిల్ ని ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె మరియు 3-4 టేబుల్ స్పూన్ టీ ట్రీ ఆయిల్ తో కలపాలి. ఈ మూడు పదార్ధాలను బాగా కలిపి స్కాల్ప్ పై రాసి గంట సేపు తరువాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయండి.

టమోటా

బాగా పండిన టమోటాతో మీ స్కాల్ప్ పై కొన్ని నిమిషాలు మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తరువాత ఒక గంట సేపు ఆరనివ్వండి. ఆ తరువాత చల్లని నీటితో తలస్నానం చేయండి. ఇది చాలా సింపుల్ రెమిడి అయినప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

స్కాల్ప్ పై మొటిమలు రాకుండా నివారించేందుకు కొన్ని చిట్కాలు

 • రోజ్ వాటర్ : మొటిమల వలన కలిగే నొప్పి మరియు దురద నుండి తక్షణ ఉపశమనం కోసం రోజ్ వాటర్ ని ఉపయోగించవచ్చు.
 • ఎక్కువ జిడ్డుగా ఉండే హెయిర్ ప్రాడక్ట్స్ ని ఉపయోగించకండి. ఎందుకంటే ఇవి చర్మపు రంధ్రాలను మూసి అధిక మురికి మరియు డెడ్ సెల్స్ పేరుకుపోవడానికి కారణం అవుతుంది.
 • వీలైనంత వరకు హెయిర్ జెల్, వాక్స్ మరియు హెయిర్ స్ప్రే ను ఉపయోగించకూడదు.
 • రెగ్యులర్గా వ్యాయామాలు చేయటం వలన స్కాల్ప్ పై మురికి మరియు చెమట పేరుకు పోతుంది. కనుక క్రమం తప్పకుండా తల స్నానం చేయాలి.
 • అధిక మాయిశ్చర్ మరియు జిడ్డు వలనే పింపుల్స్ ఏర్పడ్తాయి. కనుక తల స్నానం చేసిన తరువాత తేమను పూర్తిగా తుడిచి స్కాల్ప్ ని ఎప్పుడు డ్రై గా ఉంచుకోవాలి.

స్కాల్ప్ మొటిమల కొరకు డైట్ పరిమితులు

స్కాల్ప్ పై మొటిమలు ఉన్నట్లయితే వాటిని తొలగించేందుకు తగిన డైట్ ప్లాన్ కూడా అవసరం.

అవాయిడ్ చేయాల్సినవి

 • అధిక ఆయిల్ గల ఫుడ్స్ ని తీసుకున్నట్లయితే అధిక సీబం ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు. కనుక వీటిని సరైన మోతాదులలో తీసుకోవాలి.
 • మొటిమలు అధికంగా జిడ్డు చర్మం ఉన్న వారికే వస్తుంది. కనుక జిడ్డును తగ్గించేందుకు ఉపయోగపడేటువంటి డైట్ ని ప్లాన్ చేసుకోవడం అవసరం.
 • ముఖ్యంగా పిజ్జా లాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి, ఇందులోని అధిక చీస్ మరియు ఆయిల్స్ చర్మాన్ని మరింత జిడ్డుగా చేసి పింపుల్స్ అధికరించడానికి కారణం అవుతుంది.
 • పాల ఉత్పత్తులను తీసుకొనేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించాలి. ఆర్గానిక్ పాల ఉత్పత్తులనే ఉపయోగించాలి.

స్కాల్ప్ పై పింపుల్స్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

 • ప్రూనే : ఇందులో అధిక ఐరన్ ఉండటం వలన జుట్టుని మెరుగు పరుస్తుంది.
 • గ్రీన్ టీ : ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పాలీఫెనోల్స్ అధికంగా ఉండటం వలన డాండ్రఫ్ మరియు పింపుల్స్ ని నివారించేందుకు సహాయపడుతుంది.
 • క్యారట్లు : ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది మీ కంటి చూపును మెరుగుపరచటంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇది మీ జుట్టుని బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడుతుంది.
 • సాల్మన్ : ఈ చేపలో విటమిన్ డి మరియు ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటుంది. ఇది మీ స్కాల్ప్ మరియు జుట్టుని హైడ్రేట్ చేస్తుంది.
Posted on

Skin tightening face packs in Telugu – స్కిన్‌ టైటనింగ్ ఫేస్ ప్యాక్స్

చర్మ సంరక్షణ పద్ధతిలో స్కిన్‌ టైటనింగ్ ఒక ముఖ్యమైన భాగం. ఇందుకొరకు మన ఇంట్లోనే లభించే పదార్థాలతో అద్భుతమైన ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకోవచ్చు. ఈ పాక్స్ ని రెగ్యులర్గా వాడటం వలన చర్మం యొక్క ఎలాస్టిసిటీ ని నిలబెట్టుకోవడానికి సహాయపడుతుంది.

మన ఇంటిలోనే సులభంగా లభించే పదార్ధాలతో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ లను ఈ ఆర్టికల్ లో వివరించాము. ఇవి మీ చర్మాన్ని టైట్ గా, మృదువు గా మరియు ప్రకాశవంతంగా అయ్యేందుకు సహాయపడుతుంది. వీటిని రెగ్యులర్గా వాడి మంచి ఫలితాలను పొందండి.

గమనిక : మీకు జిడ్డు చర్మం అయితే, క్రింద చెప్పినటువంటి ప్యాక్ లలో ఆయిల్స్ ని అవాయిడ్ చేయండి.

మంచి ఫలితాల కోసం ఈ ప్యాక్ లను రాసుకున్నప్పుడు డ్రై అయ్యే వరకు ముఖాన్ని కదలించకుండా రిలాక్స్ అవ్వండి.

ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్

గుడ్డును పగలగొట్టి అందులోని తెల్లసొన మాత్రమే ముఖంపై రాయండి. బాగా ఆరే వరకు ఉంచి వెచ్చని నీటితో కడగండి. ఈ ప్యాక్ చాలా సులభమైనది కనుక మీరు ఎప్పుడైనా ప్రయత్నించవచ్చు, అధిక సమయం కూడా అవసరం లేదు.

ఎగ్ వైట్ మరియు పుల్లర్స్ ఎర్త్/ముల్తాని మట్టి ప్యాక్

ఒక గుడ్డు లోని తెల్ల సొన, రెండు టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, కొన్ని చుక్కల గ్లిజరిన్ మరియు ఒక టేబుల్ స్పూన్ తేనెని ఒక బౌల్లో వేసుకొని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ని ముఖం పై రాసి 20 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత వెచ్చని నీటితో కడగండి.

మీకు జిడ్డు చర్మం ఉన్నట్లయితే గ్లిజరిన్ వాడకుండా మిగతా పదార్థాలతో ప్యాక్ ని సిద్ధం చేసి ఉపయోగించండి. అలాగే చాలా డ్రై చర్మం అయితే ముల్తాని మట్టి ని అవాయిడ్ చేయండి. ఇది అధిక జిడ్డును మరియు సన్ టాన్ ని తొలగిస్తుంది.

క్యాబేజీ మరియు బియ్యం పిండి ఫేస్ ప్యాక్

2 లేదా 3 క్యాబేజీ ఆకులను బాగా రుబ్బి మెత్తని పేస్ట్ లా చేసుకోండి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి మరియు కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ ని వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 15 నుండి 20 నిమిషాలు ఉంచండి. బాగా ఆరిన తరువాత వెచ్చని నీటితో కడగండి.

క్యాబేజీ ముడతల్ని తగ్గిస్తుంది మరియు చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. బాదం నూనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మీకు జిడ్డు చర్మం అయితే ఆయిల్ ని కలప వద్దు.

క్యాబేజీ మరియు పెరుగు ఫేస్ ప్యాక్

2 లేదా 3 క్యాబేజీ ఆకులను బాగా రుబ్బి పేస్ట్ లా చేసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు కొన్ని చుక్కల ఆల్మండ్ లేదా ఆలివ్ ఆయిల్ ని వేసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 15 నుండి 25 నిమిషాల పాటు ఉంచాలి. బాగా ఆరిన తరువాత వెచ్చని నీటితో కడగండి.

పాలు తో ఫేస్ మాస్క్

అర కప్పు పాల పొడిలో కావల్సినంత నీటిని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖంపై రాసి పూర్తిగా ఆరే వరకు ఉంచాలి. ఆ తరువాత వెచ్చని నీటితో కడగాలి. ఈ ప్యాక్ ని 2 లేదా 3 సార్లు వాడగానే మీ చర్మం మృదువుగా మారటం గమనించవచ్చు.

బనానా మాస్క్

బాగా పండిన మీడియం సైజ్ అరటి పండును గుజ్జులా చేసి ముఖం మరియు మెడ భాగాలపై రాయండి. 15 – 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి. ఈ ప్యాక్ ని ఇంకా ప్రభావితంగా చేయటానికి ఇందులో కొంత తేనె మరియు పెరుగు కూడా చేర్చుకోవచ్చు. అరటి పండు మీ చర్మానికి కావలసిన మాయిశ్చర్ ను అందించటం ద్వారా చర్మాన్ని మృదువుగా మరియు బిగుతుగా చేస్తుంది.

పెరుగు తో ఫేస్ మాస్క్

వట్టి పెరుగును కూడా ఫేస్ ప్యాక్ లా వాడవచ్చు. కావల్సినంత పెరుగును ముఖంపై రాసి, కనీసం 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత చల్లని నీటితో కడగాలి. పెరుగు మీ చర్మానికి పునరుత్తేజాన్ని అందిస్తుంది. చర్మపు రంధ్రాలను శుభ్ర పరిచి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

పెరుగు, ఆరంజ్ మరియు కలబంద జెల్

ఒక ఆరంజ్ పండు ముక్క లోని 1/4th భాగం మరియు ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ ను కూడా పెరుగులో కలిపి పై చెప్పిన విధంగా ఉపయోగించవచ్చు.

మయోన్నైస్ ఫేస్ మాస్క్

హోల్ ఎగ్ మయోన్నైస్ ని ముఖంపై రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తరువాత 20 నిమిషాల పాటు ఉంచి చల్లని నీటితో కడగండి. ఇది మీ చర్మాన్ని శుభ్రపరచి స్మూత్ గా చేస్తుంది.  

వోట్మీల్ ఫేస్ ప్యాక్

అర కప్పు వెచ్చని నీటిలో 1/3 కప్పు వోట్మీల్ ని వేసి 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తరువాత అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ తేనె మరియు ఒక ఎగ్ వైట్ వేసి మిక్సీ లో బాగా బ్లెండ్ చేయాలి. ఒక చక్కని పేస్ట్ లా తయారవుతుంది. ఈ పేస్ట్ ని ముఖంపై రాసి 10-15 నిమిషాల పాటు ఉంచి వెచ్చని నీటితో కడగండి. ఈ మాస్క్ మీ చర్మంలోని మురికి, టాక్సిన్స్ మరియు చనిపోయిన చర్మ కణాలను తొలగించి మృదువుగా మరియు బిగుతుగా చేస్తుంది.

శనగ పిండి ఫేస్ ప్యాక్

ఒక బౌల్లో శనగ పిండి, ఎగ్ వైట్ మరియు ముల్తాని మట్టిని మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖంపై మరియు మెడపై అప్‌లై చేసి మసాజ్ చేయాలి. 30 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయండి.

బియ్యం పిండి మరియు పాలతో ఫేస్ ప్యాక్

2-3 టేబుల్ స్పూన్ బియ్యం పిండిలో 2 స్పూన్ పాలు కలిపి ఒక పేస్ట్ లా చేసుకోవాలి.  ఈ ప్యాక్ ని ముఖంపై రాసి 15 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. బియ్యం పిండి సాగిన చర్మంను టైట్ చేస్తుంది దాంతో యవ్వనంగా కనబడతారు. బియ్యం పిండిలో కొద్దిగా పాలు మిక్స్ చేయడం వల్ల చర్మానికి మరింత గ్లో వస్తుంది. చర్మం యొక్క కాంతి మెరగవుతుంది ఇంకా డెడ్ స్కిన్‌ సెల్స్ తొలగిపోతాయి.

ఓట్స్ అండ్ పెరుగు ప్యాక్

2-3 స్పూన్ ఓట్స్ పొడిని రెండు స్పూన్ పెరుగులో వేసి మిక్స్ చేసి ముఖానికి పట్టించి 5 నిమిషాలు సర్కులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి బాగా ఆరిన తరువాత వెచ్చని నీటితో కడగండి. ఈ ప్యాక్ మీ చర్మంను ఎక్స్-ఫ్లోయేట్ చేస్తుంది మరియు డెడ్ స్కిన్‌ సెల్స్ ను నివారిస్తుంది. పెరుగు చర్మానికి పోషణ అందిస్తుంది మరియు చర్మం మెరిసేలా చేస్తుంది.

బొప్పాయి మరియు నిమ్మరసం

2-3 ముక్కల బొప్పాయి మరియు 2 స్పూన్ నిమ్మరసం ను స్మాష్ చేసి ముఖం పై అప్‌లై చేయాలి. బాగా ఆరిన తరువాత చల్లని నీటితో కడగండి. ఇది మీ చర్మంను సాఫ్ట్ గా చేస్తుంది మరియు యంగ్ అండ్ గ్లోయింగ్ గా మార్చుతుంది. ఇందులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్స్ మరియు పెపైన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల డెడ్ స్కిన్‌ సెల్స్ తొలగిపోతాయి.

Posted on

Telugu tips for thick eyebrows – దట్టమైన కనుబొమ్మలను పొందటం ఎలా?

ప్రతి స్త్రీ ముఖంలో అత్యంత ముఖ్యమైన ఫీచర్ లో కనుబొమ్మలు ఒకటి. మీ అందాన్ని హైలైట్ చేసే ముఖ అంశాలలో ఇది ఒకటి. ఈ రోజుల్లో ఎంతో మంది అమ్మాయిలు ప్రతి నెలా త్రెడింగ్ చేసుకోడానికి బ్యూటీ పార్లర్ కు వెళ్తుండటం మనం గమనించే ఉంటాము. త్రెడింగ్ చేసుకోవటం వలన కనుబొమ్మలు అద్భుతమైన ఆకారంలోకి మారుతాయి.

సన్నని మరియు తక్కువ వెంట్రుకలు ఉండే కనుబొమ్మలు ముఖానికి డల్ మరియు ఏజ్డ్ లుక్ ని ఇస్తుంది. కనుబొమ్మలను కత్తిరించడం, థ్రెడింగ్ మరియు వ్యాక్సింగ్ ఎక్కువగా చేయటం వలన అవి తిన్ గా అయ్యే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు వృద్ధాప్యం, పోషకాహార లోపాలు, కాస్మెటిక్స్ మరియు కొన్ని థైరాయిడిజం వంటి వైద్య పరిస్థితులు కూడా కనుబొమ్మలు సన్నబడటానికి కారణమవుతాయి. కీమోథెరపీ మరియు రేడియేషన్ వంటి చికిత్సలు కూడా కనుబొమ్మలకు హానికరం.

ఖచ్చితమైన మందపాటి కనుబొమ్మలు మీ ముఖాన్ని మరింత అందంగా చేస్తుంది. మందపాటి కనుబొమ్మలు ఉన్నట్లయితే మీరు దానిని ఏ పద్ధతిలోనైనా రూపొందించవచ్చు. కానీ, అనేక సందర్భాల్లో, కనుబొమ్మలలో తగినంత వెంట్రుకలు ఉండవు. ఈ సమస్యను కొన్ని ఇంటి నివారణల సహాయంతో సులభంగా పరిష్కరించవచ్చు. ఆ చిట్కాలు మరియు రెమిడీస్ ఏంటో చూద్దాం రండి.

మందపాటి కనుబొమ్మలు పెరగడానికి ఇంటి నివారణలు

ఆముదము

కాస్టర్ ఆయిల్ ఒక పాత కాలపు పద్దతి. ఈ టెక్నిక్ని చాలా మంది ప్రయత్నించారు. ఇది మందపాటి కనుబొమ్మలను ఇవ్వగలదని రుజువైంది. మీరు ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు మీ కనుబొమ్మల మీద ఆముదాన్ని రాయండి. ఈ నూనె జుట్టు యొక్క వేర్ల వరకు వెళ్ళడానికి బాగా మసాజ్ చేయండి. ఇది కనుబొమ్మల పెరుగుదలను అడ్డుకునే సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. స్కిన్ తామర, సూక్ష్మజీవుల దాడి మొదలైనవి కనుబొమ్మల పెరుగుదలను దెబ్బతీసే కొన్ని కారణాలు. మీరు ప్రతి రోజూ కాస్టర్ ఆయిల్‌ను క్రమ పద్ధతిలో దరఖాస్తు చేసుకోగలిగినట్లయితే, మీ కనుబొమ్మలు వేగంగా పెడుతాయి.

కలబంద జెల్

అలో వెరా జెల్ కనుబొమ్మ పెరుగుదలను ప్రోత్సహించే ఒక నేచురల్ జెల్. ఇది మీ వెంట్రుకల పుష్టిని మరియు జుట్టు పెరుగుదలను అధికరిస్తుంది. ఇది వెంట్రుకల పెరుగుదలతో పాటు డామేజ్ అయిన జుట్టుని కూడా సరి చేస్తుంది. ప్రతిరోజు ఈ జెల్ ని మీ కనుబొమ్మలపై రాసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి.

పాలు

పాలు జుట్టు పై సహజ కండీషనర్ లా పనిచేస్తుంది. మీ కనుబొమ్మలు మందంగా పెరగడానికి పాలు ఉపయోగించవచ్చు. చిన్న గిన్నెలో కొద్దిగా పాలను తీసుకోండి. ఒక పత్తిని పాలలో ముంచి దానితో మీ కనుబొమ్మలపై మసాజ్ చేయండి. మీకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఈ పద్దతిని ప్రయత్నించండి. మరో పద్దతి పాలులో నిమ్మరసం కలపవచ్చు. పాలు ఒక గిన్నెలో తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం చేర్చండి. బాగా కలిపి పత్తితో కనుబొమ్మల మీద దరఖాస్తు చేసుకోండి. 15 నిమిషాల తరువాత నీటితో కడగండి. ఇది మీకు దట్టమైన కనుబొమ్మలను ఇస్తుంది.

ఆలివ్ నూనె

ఆలివ్ ఆయిల్ లోని పోషక గుణాలు అందరికి తెలిసిందే. ప్రస్తుతం ప్రతి ఒక్కరి వంట గదిలోనూ ఈ ఆయిల్ ని ఉపయోగిస్తున్నారు. కనుక, మీ ఇంటి కిచెన్లో ఈ నూనె ఉన్నట్లయితే కొంత ఆయిల్ ని బౌల్ లో తీసుకొని పత్తిని ముంచి మీ కనుబొమ్మల మీద దరఖాస్తు చేసుకోండి. కానీ, ఆలివ్ నూనెతో ప్రతి రోజు మీ కనుబొమ్మలను మసాజ్ చేయటం చాలా ముఖ్యం. ముప్పై-నలభై నిమిషాల తరువాత నీటిలో లేదా ఏదైనా క్లేన్సర్ తో తొలగించవచ్చు.

కొబ్బరి నూనె

ప్రతి ఇంట్లోనూ సులభంగా లభించే నూనె కొబ్బరి నూనె. దట్టమైన కనుబొమ్మలను అందించే ఇంగ్రీడియెంట్స్ లో ఇది కూడా ఒకటి. మీ కనుబొమ్మలు చాలా సన్నగా ఉన్నట్లయితే కొబ్బరి నూనె ఒక ఉపయోగకరమైన సహజ నివారిణి. కొన్ని చుక్కల కొబ్బరి నూనెని కనుబొమ్మలపై ప్రతి రోజు రాయండి. మీ కనుబొమ్మలు నల్లగా మరియు మందంగా పెరుగుతాయి.

నిమ్మరసం

జుట్టు పెరుగుదలలో నిమ్మరసం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. తాజా నిమ్మరసం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, నిమ్మరసం మీ అందాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది. కొన్ని చుక్కల నిమ్మరసాన్ని మీ కనుబొమ్మలపై రాసి మృదువుగా మసాజ్ చేసి 10-15 నిమిషాల తరువాత నీటితో కడగండి. మీ కనుబొమ్మలను నిమ్మపండు ముక్కలతో కూడా డైరెక్ట్ గా రుద్దవచ్చు.

ఉల్లిపాయ రసం

ఇది కనుబొమ్మ వెంట్రుకల వేగమైన మరియు దట్టమైన పెరుగుదలలో సహాయపడుతుంది. ఉల్లిపాయలలోని సల్ఫర్ రసం జుట్టు పెరుగుదలకు మరియు హెయిర్ ఫోలిక్స్ ని బలపరచుకోవటానికి అవసరమైన కొల్లాజెన్ కణజాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఐదు నిమిషాలు కనుబొమ్మల మీద ఉల్లిపాయ రసాన్ని మసాజ్ చేయండి మరియు డ్రై అయ్యే వరకు వదిలేయండి. ఆ తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా కనీసం ఒక నెల రోజులు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

గుడ్డు యొక్క పచ్చసొన

కనుబొమ్మల జుట్టు కెర్టిన్ ప్రోటీన్‌తో పెంచబడతాయి. గుడ్డు ప్రోటీన్ యొక్క ఉత్తమ మూలం కనుక గుడ్డు కనుబొమ్మల జుట్టు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుడ్డు యొక్క పచ్చసొనను మందపాటి క్రీములా అయ్యే వరకు బాగా బీట్ చేయాలి. ఆ తరువాత కనుబొమ్మలపై రాసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి 2 సార్లు కొన్ని నెలల పాటు చేయండి.

మెంతులు

ఇందులో ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం మరియు లెసిథిన్లు పుష్కలంగా ఉన్నందున జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది హెయిర్ ఫాలికల్స్ ను పునర్నిర్మాణం చేయడంలో కూడా సహాయపడుతుంది. మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఒక పేస్ట్ లా రుబ్బుకొని అందులో కొబ్బరి నూనెని జోడించండి. రాత్రి పడుకునే ముందు కనుబొమ్మలపై రాసి రాత్రంతా అలాగే వదిలేయండి. ఉదయం వెచ్చని నీటితో కడగండి. ఇలా 2 నెలల పాటు వారానికి 3 సార్లు చేయండి.

బాదం నూనె

ఇందులో విటమిన్ ఏ, బి మరియు ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు పోషకాలను అందించి పెరుగుదలను ప్రేరేపిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఈ నూనెతో కనుబొమ్మలను మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడగాలి.

విటమిన్ ఇ నూనె

విటమిన్ ఇ నూనె కనుబొమ్మల వెంట్రుకల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. విటమిన్ ఇ క్యాప్సూల్ నుండి నూనెని పిండి, రాత్రి పడుకోబోయే ముందు కనుబొమ్మలకు పూసుకోండి. రాత్రంతా ఉంచి ఉదయం మేకప్ రిమూవర్ తో తొలగించండి. తరువాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇలా వారానికి అయిదారు సార్లు చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా ఎదుగుతాయి.

ఆరోగ్యకరమైనవి ఆహారాన్ని తీసుకోండి

మందపాటి కనుబొమ్మల పెరుగుదలకు ఆరోగ్యకరమైన ఆహారం కూడా చాలా అవసరం. రెడ్ పెప్పర్స్, తియ్యని బంగాళదుంపలు మరియు క్యారెట్లు వంటి విటమిన్ ఎ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. రోజువారీ ఆహారంలో బాదం, వేరుశనగలు, బాసిల్, బచ్చలి కూర, ఆలివ్ వంటి విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని జోడించండి. నిమ్మకాయలు, మిరియాలు, బ్రోకలీ, బొప్పాయి మరియు నారింజ వంటి విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోండి. పాల ఉత్పత్తులు, బీన్స్ మరియు కాయ ధాన్యాలు వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాలను మీ డైట్ లో చేర్చండి. అవకాడొలు, వాల్నట్స్, ఆలివ్ నూనె మరియు సాల్మొన్ వంటి ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు మరియు చేపలు, ఆకుపచ్చ కూరగాయలు, లీన్ మీట్ వంటి ఐరన్ రిచ్ ఆహారాలను అధికంగా తీసుకోండి.

గుర్తుంచుకోవాల్సిన కొన్ని టిప్స్

 • పై చెప్పిన ఆయిల్స్ లేదా జెల్స్ ని మీరు ఉపయోగించేటప్పుడు వాటితో కనుబొమ్మలను బాగా మసాజ్ చేయాలి. అప్పుడే రక్త ప్రసరణ మెరుగు పొంది ఫలితాలను తొందరగా పొందుతారు.
 • కనుబొమ్మలు డ్రై కాకుండా తేమగా ఉండేందుకు రోజుకు మూడు సార్లు పెట్రోలియం జెల్ ని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మీ కనుబొమ్మలలో బలమైన వెంట్రుకలు పెరగటానికి సహాయపడుతుంది.
 • తరచూ వాక్సింగ్, ట్వీజింగ్ మరియు థ్రెడింగ్ చేయకూడదు. వీటిని అతిగా చేయటం వలన కనుబొమ్మలు తిన్ గా అవుతాయి.
Posted on

Telugu tips to treat shingles – షింగిల్స్ / హెర్పెస్ సోస్టర్ చికిత్సకు హోమ్ రెమిడీస్

చికెన్ పాక్స్(Chickenpox) ని కలిగించే వైరస్(Virus) వరిసెల్ల-జోస్టర్ వలన ఏర్పడే మరొక వైరల్ సంక్రమణ షింగిల్స్(Shingles). శరీరంలో ఎక్కడైనా ఈ ఇన్ఫెక్షన్(Infection) కలగచ్చు, కానీ సాధారణంగా మొండెం మీద కనిపిస్తుంది. ఇది చికెన్ పాక్స్(Chickenpox) యొక్క రెండవ వెల్లడి అని కూడా చెప్తారు. ఈ ఇన్ఫెక్షన్ వలన ప్రాణహాని లేనప్పటికీ బ్లిస్టర్స్(Blisters) ని సరిగా చికిత్స చేయకపోతే తీవ్రంగా బాధిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటి నివారణ పద్ధతుల ద్వారా షింగిల్స్(Shingles) ని నివారించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ యొక్క కారణాలు, సింప్టమ్స్ మరియు నివారణ పద్ధతుల గురించి ఈ ఆర్టికల్లో చూద్దాం.

హెర్పెస్ సోస్టర్ యొక్క కారణాలు (Telugu causes for shingles / herpes zoster)

షింగిల్స్(Shingles) వరిసెల్లా-జొస్టెర్ వైరస్ వలన సంభవిస్తుంది – అదే వైరస్ చికెన్ పాక్స్రావటానికి కూడా కారణం. ఇంతకు ముందు చికెన్ పాక్స్(Chickenpox) కలిగి ఉన్న వారిలో షింగిల్స్ అభివృద్ధి చెందుతుంది. చికెన్ పాక్స్ నుండి మీరు గుణపడిన తరువాత కూడా ఆ వైరస్ మీ నాడీ వ్యవస్థలో చేరి కొన్ని సంవత్సరాలు అలాగే ఉంటాయి.

చివరికి, అది మీ నరాల మార్గాల్లో తిరిగి చర్మంపై చేరి షింగిల్స్ ని ఉత్పత్తి చేస్తుంది. చికెన్ పాక్స్(Chickenpox) వచ్చిన ప్రతి ఒక్కరికీ షింగిల్స్ వస్తుందని కాదు. కొందరిలో మాత్రమే ఈ వైరస్ రీఆక్టివేట్ అవుతాయి.

షింగిల్స్ యొక్క కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ వయోధికులలో మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సంక్రమణం చాలా సాధారణంగా ఏర్పడుతుంది.

ఇది ఒక అంటు వ్యాధి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి షింగిల్స్ వైరస్(Shingles virus) వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరస్ వ్యాపించిన వ్యక్తికి షింగిల్స్ బదులుగా చికెన్ పాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. బ్లిస్టర్స్(Blisters) ని డైరెక్ట్ గా తాకడం వలనే ఈ వైరస్ వ్యాపిస్తుంది.

షింగిల్స్ యొక్క లక్షణాలు (Telugu symptoms for shingles)

సాధారణంగా షింగిల్స్(Shingles) యొక్క మొదటి లక్షణం నొప్పి. కొంత మందిలో బ్లిస్టర్ ఏర్పడిన స్థానాన్ని బట్టి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. మరికొన్ని లక్షణాలు :

 • బర్నింగ్, తిమ్మిరి లేదా జలదరించటం
 • టచ్ చేయడానికి సున్నితత్వం
 • నొప్పి ప్రారంభించిన కొన్ని రోజులలో ఎరుపు దద్దుర్లు ఏర్పడతాయి
 • ఫ్లూయిడ్ తో కూడిన బ్లిస్టర్స్(Blisters)
 • దురద

కొంత మందికి కింది అనుభవం కలగచ్చు :

 • ఫీవర్
 • తలనొప్పి
 • కాంతికి సున్నితత్వం
 • అలసట

ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి (When to consult doctor for shingles)

షింగిల్స్(Shingles) తో పాటు ఈ కింది పరిస్థితులలో ఏవైనా ఏర్పడితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి :

 • కంటి దగ్గర నొప్పి మరియు దద్దుర్లు. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, ఈ సంక్రమణ కంటి చూపుని శాశ్వతంగా డామేజ్ చేస్తుంది.
 • మీ వయస్సు 60 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి, ఎందుకంటే మీ వయస్సు లో ఈ సమస్య తీవ్రం అయ్యే అవకాశాలు ఎక్కువ.
 • మీకు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నట్లయితే
 • దద్దుర్లు విస్తృతమైన మరియు బాధాకరమైనవిగా ఉన్నట్లయితే.

షింగిల్స్ చికిత్సకు ఇంటి నివారణ పద్ధతులు (Telugu remedies for shingles)

చల్ల నీటితో స్నానం

షింగిల్స్(Shingles)  వలన కలిగే దురద మరియు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు చల్లని నీరు ఎంతో సహాయపడుతుంది. నీరు కొంత వరకు మాత్రమే చల్లగా ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే, ఎక్కువగా చల్లగా ఉండే నీరు కూడా నొప్పిని అధికరించవచ్చు. స్నానం చేసిన వెంటనే శరీరాన్ని పూర్తిగా డ్రై చేయాలి. తేమని అలాగే వదిలేస్తే అది బ్లిస్టర్స్ ని ఇంకా అధికరిస్తుంది. ఈ సమస్య కొరకే కాదు, సాధారణంగా మనం ప్రతి రోజు స్నానం చేసిన వెంటనే అంతర్గత భాగాలలో తడి లేకుండా చూసుకోవటం మంచిది.

బ్లిస్టర్స్ ఉన్నట్లయితే ప్రతి రోజు మీ టవల్ ని మార్చండి లేదా బాగా శుభ్రం చేసి ఉపయోగించండి. బ్లిస్టర్స్(Blisters) పై వాడిన టవల్ ని మిగిలిన ప్రాంతంపై వాడినట్లయితే వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కనుక తగిన జాగ్రత్తలను తీసుకోండి.

కూల్ కంప్రెస్

ఇది కూడా చల్ల నీటి స్నానం వలే ఉపశమనాన్ని ఇస్తుంది. నొప్పి మరియు మంటను తగ్గిస్తుంది. ఒక టవల్ ని చల్లని నీటిలో ముంచి, బాగా పిండి, దద్దుర్లపై ఉంచండి. స్మూత్ మరియు శుభ్రమైన టవల్ ని ఉపయోగించండి. ఈ ప్రక్రియకు ఐస్ పాక్స్ ని ఉపయోగించకూడదు. చల్లదనం చాలా ఎక్కువైనా ప్రమాదమే.

లోషన్

మైల్డ్ మరియు మొయిశ్చరైస్ చేసేటువంటి లోషన్స్ లను రాషెస్ పై రాయండి. సెంట్ మరియు పర్ఫుమ్ ఉన్న లోషన్స్ ను ఉపయోగించకూడదు, ఎందుకంటే ఇవి దద్దుర్ల పై మంటను పెంచుతాయి. ఈ బ్లిస్టర్స్(Blisters) పై మీరు లోషన్ వాడిన వెంటనే మీ చేతులను బాగా కడగండి, లేకపోతే వైరస్ వ్యాపించగలదు.

బొబ్బల్ను గిల్ల కూడదు

షింగిల్స్(Shingles) వలన ఏర్పడే దద్దుర్లు చాలా దురదగా ఉంటాయి, మీకు వాటిని గిల్లాలని అనిపిస్తుంది. కానీ అలా చేయకూడదు. వాటిని గిల్లటం వలన అది సెకండరీ ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది మరియు క్యూర్ అవ్వటానికి చాలా ఆలస్యం అవుతుంది.

సరైన ఆహారాన్ని తీసుకోండి

ఈ సమస్యను కలిగించే హెర్ప్స్ కుటుంబానికి చెందిన వైరస్ ని ప్రేరేపించేటువంటి ఆహారాలను తీసుకోకూడదు. విటమిన్ ఎ, బి12, సి, ఇ మరియు అమినో ఆసిడ్ లైసిన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మీట్, చికెన్, గుడ్లు, పచ్చని కూరగాయలు, ఆరంజ్ మరియు యెల్లో ఫ్రూట్స్, హోల్ గ్రైన్స్, చేపలను  మరియు పాల ఉత్పత్తులను తీసుకోండి. నట్స్, బెర్రీస్ మరియు చాక్లెట్లను నివారించండి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా చికెన్ పాక్స్ వలన కలిగే బొబ్బలపై చికాకును మరియు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. బ్లిస్టర్స్ ని డ్రై గా చేసి కొన్ని రోజులలో అవి రాలిపోటానికి సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని కలిపి చర్మంపై రాయండి. 10 నిమిషాల తరువాత నీటితో కడిగి చర్మంపై తడి లేకుండా బాగా తుడవండి. ఈ పద్ధతిని తరచూ ఉపయోగించవచ్చు కనీసం రోజుకు రెండు సార్లు ఇలా చేయండి. ఈ ప్రక్రియ తరువాత బాగా శుభ్రం చేసుకున్న బ్లిస్టర్స్(Blisters) పై ఏదైనా స్మూతింగ్ అండ్ మైల్డ్ క్రీమ్ ని రాయండి. మరో పద్దతి మీరు స్నానం చేసే నీటిలో అర కప్పు బేకింగ్ సోడాని మరియు అర కప్పు ఎప్సమ్ సాల్ట్ ని కలుపుకొని ఆ నీటితో స్నానం చేయవచ్చు.

టీ ట్రీ ఆయిల్

ఇది వైరల్ ఇన్ఫెక్షన్ల పై అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని రకాల పుళ్ళు, బొబ్బలు, పాచెస్ ని నయం చేయడానికి ఈ నూనెని అరోమా థెరపీ లో వాడుతారు. మీరు షింగిల్స్ బ్లిస్టర్స్(Shingles blisters) తో బాధపడుతున్నట్లయితే కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ని దద్దుర్ల పై రాసి వెంటనే ఉపశమనం పొందండి.

కలబంద

కలబంద లోని కూలింగ్ ఎఫెక్ట్ వలన బ్లిస్టర్స్(Blisters) నుండి వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియా మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. కొంత తాజా కలబంద జెల్ ని దద్దుర్ల పై రాసి మృదువుగా మసాజ్ చేయండి. 15-20 నిమిషాల తరువాత కడిగి చర్మాన్ని బాగా డ్రై చేయండి.

నిమ్మరసం

నిమ్మరసంలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది చర్మంలోని PH లెవల్స్ ని బాలన్స్ చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసంలో 2 లేదా 3 స్పూన్ తేనెని కలుపుకొని పతితో బ్లిస్టర్స్(Blisters) పై రాయండి. కొంత సేపు తరువాత కడిగి నీటిని బాగా డ్రై చేయండి.

ఆపిల్ సీడర్ వినిగర్

దురద మరియు మంటను తగ్గించేందుకు ప్రసిద్ధి చెందిన ఉత్తమ పదార్ధాలలో ఆపిల్ సీడర్ వినిగర్ ఒకటి. ఇందులో యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా, ఒక గ్లాసు నీటిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్ ని కలుపుకొని ఒక పత్తి లేదా శుభ్రమైన వస్త్రాన్ని ముంచి చర్మంపై రాయాలి. లేదా వెచ్చని నీటిలో కలుపుకొని తేనెని జోడించి త్రాగవచ్చు.

వోట్మీల్

షింగిల్స్(Shingles) వలన ఏర్పడే చికాకుని తగ్గించడానికి వోట్మీల్ ఉపయోగపడుతుంది. 1 లేదా 2 కప్పుల వోట్మీల్ను పొడి చేసి, స్నానం చేసే నీటిలో కలపండి. మీ శరీరాన్ని ఈ నీటిలో 15-20 నిమిషాల వరకు నానపెట్టి ఆ తరువాత స్నానం చేయండి.

విచ్ హాజెల్

షింగిల్స్ వలన ఏర్పడే దద్దుర్లు, చికాకు, దురద మరియు మంటని తగ్గించేందుకు విచ్ హాజెల్ సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ విచ్ హాజెల్ మరియు రెండు స్పూన్ కాలెందుల పువ్వులను వేసి కవర్ చేసి రాత్రంతా ఉంచండి. ఉదయం దీనిని ఒక మృదువైన పేస్ట్‌లా రుబ్బి షింగిల్స్(Shingles) ప్రభావితం అయిన చర్మంపై రాయండి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజుకు ఒక సరి చేసి మంచి ఫలితాలను పొందండి. విచ్ హాజెల్ క్రీమ్ కూడా మార్కెట్ లో లభిస్తున్నాయి. అవి మీకు లభించినట్లయితే వాటిని దద్దుర్ల పై రాసి తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు.

ధూమపానం వదిలేయండి

ధూమపానం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవు మరియు ఆరోగ్యానికి హానికరం. ధూమపానం మానివేయడం చాలా ముఖ్యం, ఇది క్యాన్సర్ మరియు అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా వృద్ధులలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.

Posted on

చుండ్రును త్వరగా తొలగించుకోవాలంటే? – Telugu tips for dandruff

మన చర్మం(Skin) నిరంతరం కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేస్తుంది మరియు ఆరోగ్యంగా ఉండటానికి పాత కణాలను వదిలిపెడుతుంది. చర్మాన్ని పునరుద్ధరించడం వేగవంతం అయినప్పుడు చుండ్రు/డాండ్రఫ్(Dandruff) సంభవిస్తుంది. స్కాల్ప్(Scalp) పొడిగా లేదా జిడ్డుగా మారటం వలన ఏర్పడే డెడ్ స్కిన్(Dead skin) రేకులను డాండ్రఫ్ అని అంటారు. దీని యొక్క సైంటిఫిక్‌ పేరు సోబోర్హెమిక్ డెర్మటైటిస్‘. ఇది ఒక దీర్ఘకాలిక పరిస్థితి. ఈ చర్మపు పొరలు తలపై మరియు భుజాలపై ఎక్కువగా కనపడుతుంది. ఇది హానికరమైన పరిస్థితి కానప్పటికీ చాలా ఇబ్బంది కలిగిస్తుంది. వీటి వలన కొందరికి స్కాల్ప్ దురదగా(Itching scalp) కూడా ఉంటుంది. ఈ సమస్యకు కారణాలు మరియు ఇంటి నివారణ పద్ధతుల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

డాండ్రఫ్ యొక్క కారణాలు (Causes of dandruff in Telugu)

చుండ్రు/డాండ్రఫ్ ఏర్పడటానికి అసలైన కారణం తెలియనప్పటికీ చర్మం యొక్క కొన్ని పరిస్థితుల వలన ఈ సమస్య ఏర్పడుతుంది.

 • పొడి బారిన చర్మం ఉన్నవారికి డాండ్రఫ్ సమస్య ఏర్పడవచ్చు.
 • కొన్ని రకాలైన షాంపూలు మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్(Skin care products) డాండ్రఫ్ ని ప్రేరేపించవచ్చు.
 • స్కాల్ప్ పై ఫంగల్ ఇన్ఫెక్షన్(Fungal infection) లేదా రింగ్ వార్మ్(Ringworm) సమస్య వలన చుండ్రు ఏర్పడవచ్చు.
 • ఎలర్జీ వలన కలగచ్చు.
 • సోరియాసిస్ సమస్య ఉన్నవారికి డాండ్రఫ్(Dandruff) ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
 • ఈ సమస్య ఉన్న వాళ్ళు తరచూ తల స్నానం చేయకపోవటం వలన పరిస్థితి తీవ్రం అవుతుంది.
 • స్ట్రెస్(Stress) మరియు చల్లని వాతావరణం వలన డాండ్రఫ్ అధికరించవచ్చు.
 • సరైన పోషక ఆహారాలను(Nutritional foods) తీసుకోక పోవటం వలన కూడా చుండ్రు సమస్య ఏర్పడవచ్చు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి (Consult doctor for dandruff in Telugu)

సాధారణంగా చుండ్రు సమస్యకు వైద్యులను సంప్రదించవలసిన అవసరం ఉండదు. కానీ క్రింద చెప్పినటువంటి పరిస్థితులలో సందర్శించడం మంచిది.

 • మీ డాండ్రఫ్ చాలా తీవ్రంగా మరియు మీ చర్మం చాలా దురదా ఉంటే.
 • మీ స్కాల్ప్ పై ఎరుపు లేదా వాపు ఉన్నట్లయితే.
 • మీ ఇమ్యూన్ సిస్టం(Immune system) చాలా బలహీనంగా ఉన్నట్లయితే.

మనం ఉపయోగించే షాంపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Telugu precautions to take in the shampoo we use)

డాండ్రఫ్ తొలగించాలీ అని అనుకున్న వెంటనే మనకు తోచే మొదటి విషయం షాంపూ. డాండ్రఫ్ ని తొలగించగలిగే బెస్ట్ షాంపులకోసం మనం మార్కెట్ లో వెతుకుతుంటాం. మనం ఉపయోగించే షాంపూ చుండ్రుని తొలగించగలదా లేదా అని మనం ఎలా తెలుసుకోవటం? డాండ్రఫ్ ని తొలగించే కొన్ని ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ సారి మీరు కొనే షాంపులో ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా అని చూసి కొనండి.

 • కేటోకానజోల్ : ఇది ఒక సమర్థవంతమైన యాంటీ ఫంగల్ ఇంగ్రిడియెంట్. ఈ పదార్ధాన్ని కలిగి ఉన్న షాంపూలు ఏ వయస్సులోనైనా ఉపయోగించవచ్చు.
 • సెలీనియం సల్ఫైడ్ : ఇది స్కాల్ప్ గ్రంధములచే సహజ నూనెల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది డాండ్రఫ్ చికిత్సలో ప్రభావితంగా పనిచేస్తుంది.
 • జింక్ పైర్థియోన్ : ఇది ఈస్ట్ యొక్క పెరుగుదలను తగ్గిస్తుంది.
 • టీ-ట్రీ ఆయిల్ : అనేక షాంపూలలో ఇప్పుడు ఈ పదార్ధాన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని ఎంతో కాలంగా యాంటీ ఫంగల్, యాంటి బయోటిక్ మరియు యాంటి సెప్టిక్ గా ఉపయోగిస్తున్నారు. కొంత మందికి ఇది అలెర్జీ కలిగించవచ్చు.

చుండ్రును తొలగించుకునేందుకు కొన్ని గృహ నివారణ పద్ధతులు (Telugu remedies for dandruff)

బంతి, కొబ్బరి నూనె

ముందుగా 50 గ్రాముల బంతి ఆకుల్ని 250 మి.లి కొబ్బరి నూనెలో కలిపి వేడి చేయాలి. అందులో 2 చిటికెల కర్పూరం వేసి 15 నిముషాల పాటు ఉడికించాలి. ఆ తరువాత బాగా ఆరబెట్టి ఈ నూనెని రెగ్యులర్గా ఉపయోగించవచ్చు. కర్పూరం లోను ఔషధ గుణాలు ఫంగస్ ని తొలగించి చుండ్రు సమస్యను క్రమంగా తగ్గిస్తుంది.

మెంతులు

మెంతులు చుండ్రుని తొలగించటంలో సహాయపడతాయి. రెండు టేబుల్ స్పూన్ మెంతుల్ని రాత్రింతా నీటిలో నానపెట్టాలి. ఉదయం వాటిని గ్రైండ్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వెనిగర్‌ను కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై రాసి ఆరిన తరువాత తలస్నానం చేయండి. ఆపిల్ సీడర్ వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు. మరో రెమెడీ – మెంతుల గింజలను బాగా రుబ్బి పెరుగుతో కలిపి స్కాల్ప్ పై రాసి గంట తరువాత కడగండి.

పారిజాత గింజలు

పారిజాత గింజలను సేకరించి నీటితో రుబ్బి ఒక పేస్ట్ లా తయారు చేసుకొని స్కాల్ప్ పై రాయండి. ఒక గంట తరువాత తల స్నానం చేయండి.

పెసరపప్పులు, ఆలివ్ ఆయిల్

2 టేబుల్ స్పూన్ పెసరపప్పు పేస్ట్, 4 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను ఒక బౌల్ లో వేసుకుని కలుపుకోవాలి. తర్వాత తలకు పట్టించాలి. 15 నిముషాల పాటు ఉంచి చల్లని నీటితో కడగాలి. ఇవి మన కిచెన్ లో లభించే వస్తువులే కనుక తరచూ ఈ మిశ్రమాన్ని ఉపయోగించండి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. డాండ్రఫ్ తొలగించటంలో ఇది ప్రభావితంగా పనిచేస్తుంది. 2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ నీటిని మిక్స్ చేసి తలకు పట్టించి మసాజ్ చేసి రెండు లేదా మూడు నిమిషాల తరువాత తలస్నానం చేయండి. బేకింగ్ సోడా వల్ల తలపై ఉన్న చుండ్రు మొత్తం రాలిపోతుంది. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితాలను పొందుతారు.

నిమ్మరసం మరియు ముల్తాని మట్టి

నిమ్మకాయ ఓ మంచి దివ్య ఔషధం. ఇందులో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి తలపై చుండ్రు ఎక్కువగా ఉండి దురద మిమ్మల్ని బాధిస్తే 3 టేబుల్ స్పూన్ నిమ్మరసంలో 1 టేబుల్ స్పూన్ ముల్తాని మట్టిని కలిపి స్కాల్ప్ పై రాయండి, బాగా ఆరిన తరువాత నీటితో కడగండి. ఇలా వారానికి ఒకసారి రాయటం ఎంతో మంచిది.

ఆపిల్ సీడర్ వెనిగర్

3 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వెనిగర్ లో 3 టేబుల్ స్పూన్ మంచినీటిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై రాయండి. బాగా ఆరిన తరువాత నీటితో కడగండి. మీరు ఉపయోగించే షాంపులో కూడా కొన్ని చుక్కల వినిగర్ ని చేర్చుకొని తల స్నానం చేయవచ్చు.

కలబంద

మీ తలలో చుండ్రు వల్ల బాగా దురద వస్తే దానికి కలబంద ఒక మంచి పరిష్కారం. కలబంద జెల్ ను స్కాల్ప్ పై రాసుకోవాలి. కొంత సేపు తర్వాత వాష్ చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ మీ చుండ్రుని తొలగించటంలో ప్రధాన పాత్ర పోషించగలదు. ఆలివ్ ఆయిల్ ను రాసుకుని మృదువుగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత వెచ్చని టవల్‌ను తలకు చుట్టుకొని కొన్ని నిమిషాల తరువాత తల స్నానం చేయండి.

కొబ్బరినూనె

కొబ్బరిలో యాంటీ ఫంగల్ తత్వాలున్నాయి. ఇవి చుండ్రుపై అద్భుతంగా పని చేస్తుంది. రోజూ తలకు పట్టించిన తర్వాత మసాజ్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేయటం వల్ల చుండ్రు తగ్గిపోతుంది. మరో పద్దతి – కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి స్కాల్ప్ పై పట్టించి గంట తరువాత సీకాయతో తల స్నానం చేయండి.

పెరుగు

బాగా పులియబెట్టిన పెరుగు చుండ్రుని తొలగించగలదు. కనుక పెరుగును స్కాల్ప్ కు పట్టించి 20 నిముషాల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎండిన నారింజ తొక్క, ఉసిరికాయ పెచ్చులు, కుంకుడు కాయలు, సీకాయలను సమంగా తీసుకొని రుబ్బి పొడి చేసి స్టోర్ చేసుకోండి. పెరుగును తలకు పూసినప్పుడల్లా తలస్నానానికి ఈ పొడిని ఉపయోగిస్తే మంచి ఫలితాలను పొందుతారు.

వేపాకు

వేపాకు ఒక యాంటీ ఫంగల్ ప్రాడక్ట్. ఇది స్కాల్ప్ పై ఉన్న ఫంగస్ అలాగే బ్యాక్టీరియాలపై బాగా పనిచేస్తుంది. మీకు ఎక్కువగా దురద ఉంటే వేపాకు నూనెని తలపై రాసి ఒక గంట తరువాత తలస్నానం చేయండి.

మరో పద్దతి – ¼ కప్పు వేపాకు రసం, కొబ్బరి పాలు మరియు బీట్ రూట్ జ్యూస్ మరియు 1 స్పూన్ కొబ్బరి నూనెని ఒక బౌల్లో వేసి మిక్స్ చేయాలి. 20 నిముషాల తర్వాత హెర్బల్ షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్ డాండ్రఫ్ పై చక్కగా పనిచేస్తుంది. లావెండర్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్ ని స్కాల్ప్ పై రాసుకొని సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకుంటే చాలా చక్కగా చుండ్రును తొలగిస్తుంది.

టొమాటో జ్యూస్

టొమాటో జ్యూస్ PH లెవల్స్ ను సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. టమోటా జ్యూస్ ను తలకు పట్టించి చక్కగా మసాజ్ చేసుకోవాలి. ఒక గంట ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.

అల్లం

అల్లం తో నువ్వుల నూనే కలిపి తలకు రాసుకుంటే చుండ్రుని నివారించగలదు. ఇది వెంట్రుకల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది అలాగే హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తుంది. ఆయిల్ ను తలకు పట్టించి మసాజ్ చేసుకొని 15 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.

టీ ట్రీ ఆయిల్

మన పూర్వీకులు టీ ట్రీ ఆయిల్‌ను చర్మ సమస్యలకు వాడేవారు. కాస్మెటిక్స్ తో మీరు విసుగు చెందినట్లయితే టీ ట్రీ ఆయిల్‌ను వాడితే మంచిది. దీనిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీ ఇంఫ్లమ్మెటరి లక్షణాలు చుండ్రుని తొలగిస్తుంది.

గమనిక : కొందరిలో టీ ట్రీ ఆయిల్ ఇర్రిటేషన్ ని కలిగించవచ్చు.

హెన్నా

హెన్నా(గోరింటాకు) చుండ్రుని సమర్ధవంతంగా తొలగించగలదు. ఇది యాంటీ బ్యాక్టీరియా కండీషనర్ గా కూడా పని చేస్తుంది. హెన్నాలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని అలాగే ఆలివ్ ఆయిల్ ను కలిపి తలకు పట్టించుకోవాలి. ఒక గంట పాటు ఉంచుకొని తలస్నానం చేయాలి.

తులసి ఆకులు

తులసి శ్రేష్టమైనది. అందుకే ప్రతీ ఇంటా భక్తి పరంగా లేదా ఓ మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. తులసి ఆకులకు ఒక టేబుల్ స్పూన్ ఉసిరి ఆకుల్ని జోడించి బాగా రుబ్బి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 30 నిముషాల పాటు ఉంచుకొని వాష్ చేసుకోవాలి.

కోడి గుడ్డు

కోడి గుడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది చుండ్రుపై చక్కగా పని చేస్తుంది. ఒక గుడ్డుని పగలగొట్టి దానిని తలకు రాసుకొని ఒక గంట తరువాత వాష్ చేసుకోవాలి. ఇలా ప్రతీ 3 రోజులకు ఒక సారి చేయాలి.

గసగసాలు

గసగసాల గింజలను పాలతో కలిపి పేస్ట్ తయారు చేసుకొని తలపై రాసి 30 నిమిషాల తరువాత తల స్నానం చేయండి.

చందనం

చందన తైలం 1 టేబుల్ స్పూన్ మరియు 3 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని తలపై రాసి ఒక గంటసేపు తరువాత కడగండి.

వాకుడు కాయలు

ముందుగా వాకుడు కాయలను బాగా రుబ్బుకోవాలి. ఒక పాత్రంలో ఈ పేస్ట్ మరియు దానికి 4 రెట్లు నువ్వుల నూనె మరియు 16 రెట్లు నీళ్లను చేర్చుకొని, ద్రవం మొత్తం ఆవిరయ్యేవరకు ఉడికించాలి. ఆరిన తరువాత గుజ్జుని సీసాలో నిల్వ చేసుకోవాలి. రెగ్యులర్గా తలస్నానం చేసే 30 నిమిషాల ముందు ఈ గుజ్జును తలపై రాసుకోండి.

మందార పువ్వులు

మందార పువ్వుల నుండి తైలం తయారు చేసుకొని రెగ్యులర్గా వాడితే చుండ్రు చాలా వరకు తగ్గుతుంది.

రీటా మరియు సోప్ నట్స్

ఇది పురాతన కాలం నుండి బాగా ప్రాచుర్యంలో ఉన్న హోం రెమెడీ. పొడవాటి మరియు స్ట్రాంగ్ హెయిర్ కోసం ట్రెడిషనల్ కాంబినేషన్ లో సీకాయ మరియు కుంకుడుకాయ రెండింటిని జోడించి ఉపయోగించాలి. అంతే కాదు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి కనుక చుండ్రుని నివారిస్తుంది. 10-15 సోప్ నట్స్ (కుంకుడుకాయ)లను నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాతి రోజు ఉదయం నీటిలో నానబెట్టిన సీకాయలను మెత్తగా పేస్ట్ లా చేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడి లేదా ఉసిరికాయ జ్యూస్ మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

దాల్చిన చెక్క మరియు ఆలివ్ ఆయిల్

దాల్చి చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది తలలో ఇన్‌ఫెక్షన్స్ మరియు చుండ్రుని నివారిస్తుంది. కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ లో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు మసాజ్ చేసి కొంత సేపు తరువాత తల స్నానం చేయండి.

Posted on

Tan removal scrubs in Telugu – హోంమేడ్ సన్ టాన్ రిమూవల్ స్క్రబ్స్

ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొను సమస్య చర్మంపై ఏర్పడే టాన్(Tan). ఎండలో ఎక్కువగా తిరిగి పని చేయవలసిన వాళ్ళు స్కార్ఫ్ కట్టుకోవటం, ఫుల్ స్లీవ్స్ ఉన్న దుస్తులను ధరించటం లాంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సన్ రేస్ నుండి తప్పించుకోలేరు. ఎంతోకొంత చర్మం టాన్ అవుతూనే ఉంటుంది. అంతే కాదు డిహైడ్రాషన్ సమస్య కూడా ఎదురవుతుంది. శరీరంలోని మాయిశ్చర్ స్థాయి తగ్గటం వలన చర్మం కూడా పొడిగా నల్లగా అవుతుంది.

మార్కెట్లో సన్ టాన్ ను తొలగించేందుకు ఎన్నో రసాయనాలతో కూడిన ఇన్స్టంట్ టాన్ రిమూవర్స్(Instant tan removers) లభిస్తున్నాయి. ఇవి ఉపయోగించిన వెంటనే మీ చర్మం తెల్లగా మెరుస్తునట్లు కనిపిస్తుంది. కానీ వీటి వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే వాటిని చాలా పవర్ఫుల్ కెమికల్స్ తో తయారు చేస్తారు. వాటిలోని స్టెరాయిడ్స్ మీ చర్మాన్ని చాలా తొందరగా డామేజ్ చేస్తాయి. కనుక మన చర్మంపై ఏర్పడే టాన్ ను తొలగించేందుకు ఉత్తమమైన మార్గం ఇంట్లో మన వంట గదిలో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించి పాక్స్ లేదా స్క్రబ్స్ ను తయారు చేసుకోవటం.

ఇంట్లోనే మనం చేసుకునే పాక్స్ మరియు స్క్రబ్స్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరియు ఇవి చాలా ప్రభావితంగా పనిచేస్తాయి. ఎండలోకి వెళ్ళేటప్పుడు మీరు ఇదివరకే తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైనా ఉంటే వాటిని మానకూడదు. వాటితో పాటు మేము చెప్పబోయే ప్యాక్స్ మరియు స్క్రబ్స్ ని కూడా ఉపయోగించండి. సన్ టాన్(Sun tan)ని తొలగించేందుకు కొన్ని ఫేస్ టాన్ రిమూవల్ స్క్రబ్స్(Face tan removal scrubs) ని ఇంట్లోనే తయారు చేసుకోవటం ఎలా అని ఈ ఆర్టికల్లో చూద్దాం.

ఫేస్ రిమూవల్ స్క్రబ్స్ (Tan removal scrubs in Telugu)

పసుపు మరియు శనగ పిండి

రెండు టేబుల్ స్పూన్ శనగ పిండి, ఒక టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ ఆరంజ్ పీల్ మరియు ఒక చిటిగా పసుపుని ఒక బౌల్ లో వేసి బాగా కలుపుకోండి. ఇందులో కొంత నీటిని జోడించి ఒక పేస్ట్‌లా చేసుకోండి. ఈ పేస్ట్‌ని ముఖంపై రాసి బాగా మసాజ్ చేయండి. ఇందులోని ఆరంజ్ పీల్ గ్రాన్యూల్స్ స్క్రబ్ లా పనిచేస్తుంది. ముఖంపై రాసిన ఈ పేస్ట్ ఆరిన తరువాత నీటిని చల్లి మరోసారి స్క్రబ్ చేస్తూ కడగండి.

టమోటా మరియు పెరుగు

టమోటో ఒక ప్రభావితమైన టాన్ రిమూవర్(Tan remover). పెరుగు చర్మాన్ని లైటెన్ చేస్తుంది. ఈ రెండింటి యొక్క మిశ్రమం మన చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల టమోటా, కొంత పెరుగు మరియు ఒక స్పూన్ నిమ్మరసం బాగా కలిపి ముఖంపై రాయండి. బాగా ఆరిన తరువాత నీటితో కడగండి. టమోటా జ్యూస్ ని రాసినప్పుడు మొదట్లో కొద్దిగా ఇచింగ్ సెన్సేషన్ కలగచ్చు. కానీ ఆరిన తరువాత తగ్గిపోతుంది. ఈ ప్యాక్ మీ చర్మంపై ఉన్న కఠినమైన టాన్ ను కూడా తొలగిస్తుంది.

మజ్జిగ మరియు ఓట్స్

ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో ఓట్స్ ని రెడీగా ఉంచుకుంటారు. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఓట్స్ ని మజ్జిగలో కలుపుకొని మీ చర్మంపై రాయటం వలన టాన్ ను తొలగిస్తుంది. ఓట్స్ ని రవ లాగా రుబ్బుకొని మజ్జిగలో కలుపుకొని చర్మంపై రాసి 15 లేదా 20 నిమిషాల పాటు స్క్రబ్ చేయండి. ఓట్స్ నలుపును తొలగిస్తుంది మరియు మజ్జిగ మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

పొటాటో ఫేస్ ప్యాక్ మరియు స్క్రబ్బర్

బంగాళదుంపను బాగా తురిమి మీ చర్మంపై రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగండి. లేదా బంగాళదుంపను రుబ్బి ఒక పల్ప్ లాగా చేసుకొని కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి ముఖంపై రాసి 35-40 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి. పొటాటో ఉపయోగించటం వలన మీ చర్మంలోని తేడాని వెంటనే గమనించవచ్చు.

మిల్క్ క్రీమ్ మరియు కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వు చర్మంపై నలుపు మరియు మొటిమలను తొలగిస్తుంది. వీటిని తరచూ గర్భిణి స్త్రీలు శిశువు యొక్క చర్మపు రంగు కోసం తీసుకుంటారు. మిల్క్ క్రీమ్లో కొంత కుంకుమ పువ్వును రాత్రంతా నానపెట్టాలి. ఉదయం కుంకుమ పువ్వు మృదువుగా అయిన తరువాత ఆ క్రీములో బాగా కలిపి ముఖంపై రాయండి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగి తేడాను చూడండి.

కార్న్ మీల్

ఓట్ మీల్ లానే కార్న్ మీల్ కూడా చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని లైటెన్ చేస్తుంది. మీకు జిడ్డు చర్మం మరియు టాన్ సమస్య ఉన్నట్లయితే కార్న్ మీల్ ఒక అద్భుతమైన రెమిడీ. రెండు స్పూన్ల కార్న్ మీల్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక టేబుల్ స్పూన్ పెరుగును బాగా కలిపి ముఖంపై రాసి 20 నిమిషాల తరువాత నీటితో తడి చేసి స్క్రబ్ చేస్తూ కడగండి. ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేయటం వలన అనవసరమైన చర్మ కణాలు తొలగిపోతాయి. ఆ తరువాత కొంత వెచ్చని నీటితో శుభ్రంగా కడగండి. వారానికి రెండు సార్లు ఈ రెమెడీ ని ఉపయోగించటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

నిమ్మరసం, చక్కెర మరియు రోజ్ వాటర్

ఒక స్పూన్ చక్కెర, సగం నిమ్మపండు యొక్క జ్యూస్ మరియు ఒక స్పూన్ రోజ్ వాటర్‌ని బాగా కలుపుకొని ముఖంపై రాసి స్క్రబ్ చేయండి. 10-15 నిమిషాల పాటు స్క్రబ్ చేసిన తరువాత నీటితో శుభ్రం చేయండి. చక్కెర డెడ్ సెల్స్ ని తొలగిస్తుంది, నిమ్మరసం టాన్ ను నుతొలగిస్తుంది మరియు రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా చేసి గ్లో ని అందిస్తుంది.

గంధపు చెక్క ప్యాక్

గంధంలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి, ఇది మీ చర్మానికి అదనపు గ్లో ని అందిస్తుంది. ఒక బౌల్లో రెండు స్పూన్ల పాలు, అర స్పూన్ గంధపు పొడి మరియు ఒక చిటిక పసుపుని వేసి బాగా కలుపుకోండి. ఈ పేస్ట్ ని ముఖంపై రాసి 15-20 నిమిషాల తరువాత నీటితో కడగండి.

చక్కెర మరియు గ్లిసరిన్

ఒక స్పూన్ చక్కెర మరియు ఒక స్పూన్ గ్లిసరిన్ ని కలుపుకోండి. ఈ మిశ్రమం చాలా గట్టిగా ఉన్నట్లయితే కొంత రోజ్ వాటర్ జోడించవచ్చు. ఈ పేస్ట్‌తో ముఖంపై మృదువుగా స్క్రబ్ చేయండి. 10-15 నిమిషాలు స్క్రబ్ చేయటం వలన డెడ్ సెల్స్ మరియు టాన్ తొలగిపోయి చర్మంలో గ్లో వస్తుంది. ఆ తరువాత నీటితో కడగండి.

దోసకాయ, రోజ్ వాటర్ మరియు నిమ్మరసం

సన్ టాన్(Sun tan)ని  తొలగించేందుకు ఇది ఒక బెస్ట్ ఫేస్ ప్యాక్. నిమ్మరసంలోని విటమిన్ సి మరియు సిట్రిక్ ఆసిడ్ చర్మాన్ని బ్లీచ్ చేసి స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుంది. ఈ రసాన్ని దోసకాయ మరియు రోజ్ వాటర్‌తో కలిపి వాడటం వలన టాన్ తొలగిపోతుంది మరియు చర్మం చాలా మృదువుగా గ్లో అవుతుంది. ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ దోసకాయ గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని ముఖంపై రాసి 10 నిమిషాల తరువాత నీటితో కడగండి.

బొప్పాయి మరియు తేనె

బొప్పాయి పండులోని పపైన్ అనే ఎంజైమ్ టాన్ ని తొలగించడానికి సహాయపడుతుంది. తేనె చర్మాన్ని మొయిశ్చరైస్ చేస్తుంది. అర కప్పు పండిన బొప్పాయి పండును ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి గుజ్జులాగా చేసుకోవాలి. దీన్ని మీ ముఖంపై రాసి 30 నిమిషాల తరువాత నీటితో కడగండి.

ఎరుపు పప్పు, కలబంద మరియు టమోటా

కలబంద చర్మాన్ని సూత్ చేసి టాన్ ని తొలగిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఎరుపు పప్పులను 20 నిమిషాలు నీటిలో నానబెట్టి ఒక గట్టి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్లో కొంత కలబంద జెల్ మరియు ఒక టేబుల్ స్పూన్ టమోటా జ్యూస్ కలుపుకొని ముఖం మరియు మెడపై రాయండి. 20 నిమిషాల తరువాత నీటితో కడగండి.

ఫుల్లర్స్ ఎర్త్ మరియు కలబంద

ఇర్రిటేషన్ మరియు దద్దుర్లు వంటి సమస్యలను ఫుల్లర్స్ ఎర్త్ తొలగించి ఉపశమనాన్ని ఇస్తుంది. రెండు టేబుల్ స్పూన్ ఫుల్లర్స్ ఎర్త్ మరియు ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ ని కలుపుకొని అవసరమైతే కొంత రోజ్ వాటర్‌ని జోడించి ఒక పేస్ట్‌ని తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ని ముఖంపై రాసి 30 నిమిషాల తరువాత నీటితో కడగండి.

ఆరెంజ్ పీల్ మరియు మిల్క్ స్క్రబ్

బాగా ఎండిన ఆరెంజ్ తొక్కను పౌడర్ చేసి కొద్దిగా పాలు మిక్స్ చేసి స్మూత్ పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని టాన్ ఉన్న చర్మంపై రాసి పూర్తిగా డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆరెంజ్ తొక్క స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది, పాలు మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.

బేకింగ్ సోడా మరియు వాటర్ స్క్రబ్

ఆయిల్ స్కిన్ కలవారు మైల్డ్ స్క్రబ్ ను ఉపయోగించాలి. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నీటిని మిక్స్ చేసి ముఖంపై అప్‌లై చేసి ఆరిన తరువాత నీటితో కడగండి. దీన్ని రెగ్యులర్గా వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

గమనిక

నిమ్మరసంతో కూడిన ప్యాక్స్ ను ఉపయోగించినప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఈ ప్యాక్స్ లేదా స్క్రబ్ ను వాడిన వెంటనే ఎండలోకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళవలసిన అవసరం ఉన్నట్లయితే తప్పకుండా SPF వున్న సన్ స్క్రీన్ లోషన్‌ని ఉపయోగించాలి. ఎందుకంటే నిమ్మరసం యొక్క అసిడిక్ నేచర్ మీ చర్మాన్ని చాలా సెన్సిటివ్‌గా చేస్తుంది. వాటిని వాడిన వెంటనే సూర్య కిరణాలు చర్మంపై పడితే UV రేస్ వలన మీ చర్మం మరింత డామేజ్ అవుతుంది. కనుక వీలైనంత వరకు లెమన్ ప్యాక్స్ ని రాత్రి పడుకునే ముందు ఉపయోగించండి లేదా సన్ స్క్రీన్ ని ఉపయోగించండి.

Posted on

ఇలా చేస్తే తలలో పేలు వదిలిపోతాయి – Lice tips in Telugu

పిల్లలలో మరియు కొందరు పెద్దలలో తలలో ​​పేన్లు ఉండటం చాలా సాధారణ సమస్య. అవి స్కాల్ప్ లోని రక్తం తినే చిన్న పరాన్నజీవులు. వీటి యొక్క కారణాలు మరియు వీటిని తొలగించే విధానాలను ఈ ఆర్టికల్లో చూద్దాం.

తలలో పేలు రావటానికి కారణాలు

పేన్లు ఎగరలేవు, కనుక ఇవి ముఖ్యంగా పేలు ఉన్న వ్యక్తి యొక్క తలను డైరెక్ట్ గా తాకడం వలన ఒక వ్యక్తి నుండి ఇంకొకరికి వ్యాపిస్తాయి. పేను ఉన్న వ్యక్తుల యొక్క బట్టలను ధరించడం లేదా దువ్వెనలు, టోపీలు, హెడ్ ఫోన్స్, దిండులు మరియు బ్రష్లు పంచుకోవడం వలన కూడా ఇవి వ్యాపిస్తాయి. తలపై ఎక్కువ చెమట రావటం వలన కూడా పేలు పుట్టవచ్చు.

ఎవరికి ఎక్కువగా వ్యాపిస్తాయి

ప్రీ స్కూల్ మరియు ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థుల తలలో పేలు అత్యధికంగా వ్యాపిస్తాయి. పిల్లలు ఒకరికొకరు దగ్గరగా కలిసి ఆడుకోవటం మరియు వారి తలలను తాకే వస్తువులను పంచుకోవటం వలన ఇవి వ్యాపిస్తాయి. పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉండే కుటుంబ సభ్యులకు కూడా తలలో పేను వచ్చే అవకాశాలు ఎక్కువ. అబ్బాయిలకన్నా అమ్మాయిల్లోనే పేన్లు ఎక్కువగా పెరిగి వ్యాపించే అవకాశాలు ఉంటాయి.

మీ తలపై లైస్ ఉన్నాయని ఎలా తెలుసుకోవటం?

 • వీటి వలన మీ స్కాల్ప్ మీద మరియు చెవుల వెనక భాగాల్లో తరచూ దురదగా ఉంటుంది. ఇది పేలు యొక్క ఎంగిలి వలన కలిగే ఒక అలర్జీ దురద. ఒక వేల మీ తలలో మొదటి సారి పేను వచ్చినట్లయితే 2 నుండి 6 వారాల పాటు ఎటువంటి దురదా ఉండదు.
 • వెంట్రుకలపై లైస్ యొక్క గుడ్ల కనపడతాయి. ఇవి చాలా చిన్నగా ఉన్నప్పటికీ వీటి రంగు వలన ఇవి స్పష్టంగా కనబడతాయి.
 • ఇవి స్కాల్ప్ లోని రక్తాన్ని త్రాగటం వలన ఎక్కువ దురద మరియు ఎర్రటి బొబ్బలు ఏర్పడతాయి.

పేన్లను నివారించే పద్ధతులు

పేన్లు చాలా వేగంగా పెరుగుతాయి కనుక వీటిని తొలగించుకొనుట అంత సులువు కాదు. వీటి కొరకు ఎన్నో రకాల నూనెలు మరియు షాంపూలు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటితో పాటు ఇంటి నివారణ పద్ధతులను కూడా చూద్దాం.

హోమ్ రెమెడీస్

ఇంటి నివారణ పద్దతులను అనుసరించటం ఉత్తమం. ఎందుకంటే వీటిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు కనుక వీటి వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ముఖ్యంగా మీ పిల్లల కొరకు ఈ పద్ధతులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి యొక్క బలమైన వాసన పేనులకు ఊపిరి ఆడకుండా చేసి వాటిని చంపుతుంది.10 లేదా 12 వెల్లుల్లి ముక్కలను మరియు 2 లేదా 3 స్పూన్ల నిమ్మరసంను కలిపి ఒక పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ని జుట్టు మీద రాసి ఒక గంట తర్వాత వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. మరో పద్దతి : ఏదైనా వంట నూనె, నిమ్మరసం, గ్రీన్ టీ మరియు ఏదైనా ఒక షాంపూతో వెల్లుల్లి రసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని తలపై రాసి 30 నిముషాల పాటు టవల్ లేదా షవర్ టోపీతో కవర్ చేయండి. ఆ తరువాత తల స్నానం చేయండి.

బేబీ ఆయిల్

ఈ చికిత్సకు కావలసిన పదార్థాలు బేబీ ఆయిల్, లాండ్రీ డిటర్జెంట్ మరియు తెలుపు వినిగర్. బేబీ ఆయిల్ పేనులను ఊపిరి పీల్చకుండా చేస్తుంది. ముందుగా స్కాల్ప్ పై బేబీ ఆయిల్‌ని రాసి దువ్వెనతో దువ్వండి. ఆ తరువాత వేడి నీరు మరియు లాండ్రీ డిటర్జెంట్ తో జుట్టును కడగండి. రాత్రి పడుకునే ముందు కొద్దిగా వినిగర్‌ను తలపై రాసి టవల్ తో చుట్టండి. ఉదయం సాధారణ షాంపూతో కడగండి. మంచి ఫలితాలను పొందడానికి 3 లేదా 4 రోజులు ఇలా చేయాలి.

ఆలివ్ నూనె

రాత్రి పడుకునే ముందు ఆలివ్ నూనెని తలపై రాసి ఒక టవల్ తో తల కవర్ చేయండి లేదా షవర్ టోపీ ధరించండి. ఉదయం ట్రీ ఆయిల్ కలిగి ఉన్న హెర్బల్ షాంపూతో తల స్నానం చేయండి. మరొక పద్ధతి – లిక్విడ్ సోప్ తో ఒక కప్పు ఆలివ్ నూనెని కలిపి స్కాల్ప్ పై రాసి ఒక గంట తర్వాత కండీషనర్తో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత జుట్టు తడిగా ఉండగానే చనిపోయిన పేనులను దువ్వెనతో దువ్వి తొలగించండి.

ఉప్పు

ఉప్పు మరియు వినిగర్‌ని కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేయండి. దీనిని తలపై స్ప్రే చేయండి. ఆ తరువాత ఒక షవర్ టోపీ ధరించి స్కాల్ప్ ని కవర్ చేయండి. రెండు గంటల తరువాత షాంపూతో తల స్నానం చేయండి.

పెట్రోలియం జెల్లీ

ఇది పేనులకు ఊపిరి ఆడకుండా చేస్తుంది. రాత్రిపూట పెట్రోలియం జెల్లీని మందంగా స్కాల్ప్ పై రాసి ఒక టవల్ తో కప్పాలి. ఉదయం బేబీ ఆయిల్తో తల స్నానం చేసి పెట్రోలియం జెల్లీని తొలగించి దువ్వెన తో దువ్వి చనిపోయిన పేనులను తొలగించండి. కొన్ని రోజులు ఈ ప్రక్రియను రిపీట్ చేయాలి.

ట్రీ టీ ఆయిల్

ఇది పేలు తొలగించేందుకు ప్రభావితమైన నేచురల్ మందు. ట్రీ టీ నూనె, నేచురల్ షాంపూ మరియు కొబ్బరి లేదా ఆలివ్ నూనెని కలిపి ఒక మిశ్రమం తయారు చేయండి. దీనిని మీ స్కాల్ప్ పై రాసి 30 నిమిషాల తర్వాత వేడి నీటితో తల స్నానం చేయండి. చనిపోయిన పేనులను తొలగించడానికి స్కాల్ప్ తడిగా ఉండగానే దువ్వెనతో దువ్వండి.

కొబ్బరి నూనె

ఇది స్కాల్ప్ పై ఉన్న లైస్ యొక్క కదలికను నిలిపి వేస్తుంది. ఆపిల్ సీడర్ వినిగర్‌ను స్కాల్ప్ పై రాసి అది డ్రై అయ్యే వరకు ఆగండి. ఆ తరువాత కొబ్బరి నూనెని రాసి, టవల్ తో కప్పి రాత్రంతా ఉంచండి. ఉదయం తల స్నానం చేసి తడి జుట్టుని దువ్వెనతో దువ్వండి. ఇలా రోజూ చేయటం వలన పేన్లను పూర్తిగా నిర్మూలించవచ్చు.

వైట్ వినిగర్

ఇందులో ఎసిటిక్ ఆసిడ్ ఉంటుంది, ఇది పేనులను నాశనం చేస్తుంది. వినిగర్ మరియు నీటిని కలిపి స్కాల్ప్ పై రాయండి. జుట్టుని ఒక టవల్‌తో కవర్ చేసి రెండు గంటల పాటు ఉంచండి. తరువాత వినిగర్లో దువ్వెనను ముంచి జుట్టుని దువ్వండి.

నువ్వుల నూనె

ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు సహజ క్రిమిసంహారక లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది పేనులను తొలగించేందుకు సహాయపడుతుంది. ఒక 1/4 కప్పు నువ్వుల నూనె, 1/8 కప్పు వేపాకు నూనె, ఒక స్పూన్ టీ ట్రీ ఆయిల్, 1/2 స్పూన్ యూకలిప్టస్ ఆయిల్ మరియు 10 డ్రాప్స్ లావెండర్ నూనెల్ని కలుపుకొని ఒక మిశ్రమాన్ని తయారు చేయండి. ముందుగా ఆపిల్ సీడర్ వినిగర్ తో తలను శుభ్రం చేయండి. జుట్టు బాగా ఆరిన తరువాత ఈ మిశ్రమాన్ని తలపై రాసి టవల్ ని చుట్టి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం చనిపోయిన పేన్లను దువ్వెనతో దువ్వి తల స్నానం చేయండి.

మయోన్నైస్

మయోన్నైస్ లోని విస్కాసిటీ లక్షణాలు పేనులకు ఊపిరి ఆడకుండా చేస్తాయి. స్కాల్ప్ మీద ఫుల్ ఫాట్ మయోన్నైస్ ని మందంగా రాసి టవల్ ని చుట్టి 8 నుండి 10 గంటలు ఉంచండి. ఆ తరువాత తల స్నానం చేసి దువ్వెనతో మిగిలిన పేన్లను తొలగించండి. మంచి ఫలితాల కోసం ఒక వారం పాటు రోజూ ఈ ప్రక్రియను రిపీట్ చేయండి.

వెన్న

రాత్రి పడుకునే సమయంలో స్కాల్ప్ పై వెన్న రాసి, మరుసటి రోజు ఉదయం షాంపూతో కడగండి. తరువాత దువ్వెనతో పేనులను దువ్వండి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా లైస్ ని తొలగించటంలో సమర్థవంతముగా పనిచేస్తుంది. దీనిని ఆలివ్ నూనెలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై రాసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం, తల స్నానం చేసి దువ్వెనతో దువ్వాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు బోరాక్స్

ఇది తలలో పేనులను తొలగించడం కోసం సహజ హోమ్ నివారణలలో ఒకటి. నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను కలపండి. ఇందులో బోరాక్స్ వేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ లో బాగా కలిసే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై బాగా రుద్దాలి. ఒక షవర్ క్యాప్ తో మీ తలను కవర్ చేసి కొన్ని గంటల తరువాత తల స్నానం చేయండి.

డెట్టాల్

ఇది ఒక యాంటి సెప్టిక్ లిక్విడ్ మరియు తలపై పేనులను తొలగించేందుకు గొప్పగా పని చేస్తుంది. స్కాల్ప్ పై డెట్టాల్ రాసి ఒక గంట తర్వాత ఆలివ్ ఆయిల్ రాయండి. దీన్ని రాత్రి పూట అలాగే వదిలేసి ఉదయం షాంపూతో మీ జుట్టుని కడిగి దువ్వెనతో దువ్వండి.

పేనులను తొలగించేందుకు హోమ్ రెమిడీలు చాలా మైల్డ్ గా మరియు నెమ్మదిగా పనిచేస్తాయి. అయినప్పటికీ ఇవి శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తాయి. వీటిలో స్కాల్ప్ కి హాని కలిగించే ఎటువంటి కఠినమైన రసాయనాలూ ఉండవు. వీటిని చిన్న పిల్లలకు కూడా ఉపయోగించవచ్చు.

మార్కెట్ లో లభించే మందులు

లైస్ ని తొలగించేందుకు మార్కెట్ లో లభించే కొన్ని షాంపూలు, నూనెలు మరియు క్రీములను చూద్దాం.

హెయిర్షీల్డ్ యాంటి లైస్ క్రీం వాష్ (30 మిలీ)

Hairshield Anti Lice Cream Wash[Buy it online]

 

హెయిర్షీల్డ్ యాంటీ లైస్ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభావితమైన, సురక్షితమైన మరియు అత్యంత విస్తృతంగా ఉపయోగించబడే యాంటీ లైస్ ఏజెంట్. ఇది పేన్లనే కాదు వాటి గుడ్లపై కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. హెయిర్ షీల్డ్ యాంటీ లైస్ లో పైరత్రుమ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటాయి. ఇది ఒక సహజమైన యాంటీ లైస్ ఏజెంట్. జుట్టు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఇందులో గుల్దాడి, రీథా మరియు షికాకై యొక్క సహజ గుణాలు కూడా ఉన్నాయి. ఇది మీ జుట్టుకు ఆరోగ్యాన్ని అందించి మెరుగుపరుస్తుంది.

ఫాతిమా మెడికర్ యాంటీ – లైస్ ట్రీట్‌మెంట్ విత్ కొకొనట్, నీమ్ & క్యాంఫోర్ షాంపూ 50 మిలి (50 మిలి)

Fathima Mediker Anti-Lice Treatment Shampoo[Buy it online]

పేన్లను పూర్తిగా తొలగించటానికి మెడికర్ షాంపూని నాలుగు వారాల పాటు ప్రతి ఆదివారం ఉపయోగించండి. జుట్టుని తడి చేసి మెడికర్ షాంపూని నురుగు వచ్చేలా రాయండి. సమర్థవంతమైన ఫలితాలకోసం, 4 నిముషాల పాటు నురుగును అలాగే ఉంచండి. తరువాత జుట్టును బాగా కడగండి. జుట్టు తడిగా ఉన్న 30 నిమిషాల లోపల పేన్లను దువ్వెనతో దువ్వాలని గుర్తుంచుకోండి. ఇలా 4 వారాలు చేయండి మరియు పేన్లు లేని ఆరోగ్యమైన జుట్టుని పొందండి.

సుజానిల్ లైసెల్ హెర్బల్ లైస్ కిల్లర్ ఆయిల్ (55 మిలీ) – ప్యాక్ ఆఫ్ 3

Sujanil'S Licel Herbal Lice Killer Oil[Buy it online]

లైసెల్ హెయిర్ ఆయిల్ సహజమైన మూలికలతో తయారు చేయబడినది. ఇది పేను మరియు వాటి గుడ్లను తొలగించేందుకు అత్యంత ప్రభావితమైన హెయిర్ ఆయిల్. ఇది పేన్లను తొలగించటం మాత్రమే కాదు మీ జుట్టును ప్రకాశవంతంగా చేస్తుంది. లైసెల్ ఆయిల్‌ని రాత్రి పడుకునే ముందు జుట్టు యొక్క వేర్లపై పూర్తిగా రాయండి. మరుసటి రోజు ఉదయం చనిపోయిన పేలు మరియు గుడ్లను తొలగించడానికి దువ్వెనను ఉపయోగించండి. ఆ తరువాత జుట్టుపై తాజా నిమ్మరసంను రాసి మంచి షాంపూతో తల స్నానం చేయండి.

గమనిక 

 • మీ పిల్లలకు 2 నెలల వయసు లేదా అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే, మెడిసిన్‌ని వాడకూడదు. మీరు చేతులతోనే లైస్ మరియు వాటి గుడ్లను తీసివేయాలి.
 • ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పేను మందులను వాడకండి.
 • జుట్టు మీద గాసోలిన్ లేదా కిరోసిన్ వంటి రసాయనాలను వాడకండి.
 • చికిత్స ప్రారంభించిన 4 వారాల తర్వాత కూడా మీ పిల్లల తలలో పేను ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించండి.
Posted on

Fairness tips for men in Telugu – పురుషుల కోసం ఫెయిర్నెస్ టిప్స్ – ఫెయిర్ స్కిన్ పొందటం ఎలా?

ఈ రోజుల్లో మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా వారి లుక్స్ పై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సొసైటీలో వారు అన్ని విధాలుగా మర్యాదస్తులుగా కనిపించాలని అనుకుంటారు.  ఖచ్చితమైన లుక్స్ ని పొందటానికి చర్మం యొక్క రంగు కూడా ఒక ముఖ్యమైన అంశం. మార్కెట్లో అనేక ఫెయిర్నెస్ క్రీములు మరియు లోషన్లు అందుబాటులో ఉన్నాయి కానీ అవి మీ చర్మానికి మంచిది కాదు.

మీకు సున్నితమైన చర్మం ఉన్నట్లయితే, మీరు చేయాల్సిందల్లా బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగించటం ఆపాలి మరియు ఇంటి నివారణ పద్దతులను అనుసరించాలి. ఈ పద్ధతుల వలన మీరు పొందే రంగు ప్రభావితంగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఎటువంటి కాస్మెటిక్స్ ఉండవు. పురుషుల కొరకు కొన్ని సమర్థవంతమైన చిట్కాలను చూద్దాం.

పురుషుల కొరకు ఇంటి చిట్కాలు

మగవాళ్లు అందరూ అలంకరణ చేసుకోక పోయినప్పటికీ దుమ్ము, ధూళి మరియు అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు వంటి ఇతర కారకాల వలన చర్మవ్యాధి మరియు ముదురు చర్మం లాంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఈ సమస్యలను సహజంగా తొలగించేందుకు కొన్ని హోం రెమెడీస్ గురించి చూద్దాం.

కలబంద జ్యూస్ మరియు నారింజ జ్యూస్

ఎన్నో ఉత్పత్తుల్లో కలబంద చాలా ముఖ్యమైన అంశంగా ఉండటానికి కారణం ఇందులో ఎన్నో చర్మ సంరక్షణ లక్షణాలను ఉన్నాయి. ఇది మొటిమలను, హైపర్ పిగ్మెంటేషన్ని కూడా తొలగిస్తుంది. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేసి ఈవెన్ స్కిన్ టోన్‌ని ఇస్తుంది. దీని యొక్క కూలింగ్ ఎఫెక్ట్ వలన డామేజ్ అయిన కణజాలంను రిపేర్ చేస్తుంది.

కలబంద జెల్‌ని డైరెక్ట్ గా మీ ముఖం మీద రాయవచ్చు. దీనిని రెగ్యులర్గా ఉపయోగించటం వలన మీ చర్మాన్ని మృదువుగా మరియు హైడ్రేటెడ్ గా చేస్తుంది. ఇందులో కొద్దిగా నారింజ జ్యూస్ని కూడా చేర్చుకోవచ్చు ఎందుకంటే నారింజలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. సమాన మొత్తాల్లో అనగా 1: 1 రేషియోలో కలబంద జెల్ మరియు నారింజ రసం కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేయండి. మీ ముఖం మీద దీనిని రాసి 20 నిమిషాల తరువాత నీటితో కడగండి.

పాలు మరియు నిమ్మరసం

పాలు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మ రంగు మరియు టోన్‌ని పెంచుతుంది. నిమ్మరసం శరీరంలో కొల్లాజెన్ స్థాయిని పెంచుతుంది మరియు ఇందులో విటమిన్ సి ఉన్నందున మీరు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందుతారు.

ఒక స్పూన్ పాలు మరియు ఒక స్పూన్ నిమ్మరసంను కలుపుకోండి. ఇందులో కొద్దిగా బియ్యం పిండిని కూడా జోడించవచ్చు. దీనిని ముఖంపై రాసి కొద్ది సేపు తరువాత నీటితో కడగండి.

పెరుగు మరియు అరటిపండు ప్యాక్

ఎల్లప్పుడూ ముఖంపై ఫేషియల్ చేసేటప్పుడు పెరుగును ఉపయోగిస్తారు. మరోవైపు, మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు తాజాగా ఉంచుకోవడానికి అవసరమైన విటమిన్లు అరటి పండులో పుష్కలంగా ఉంటాయి.

ఒక కప్పు పెరుగులో ఒక అరటి పండుని చూర్ణం చేసి బాగా కలపండి. దీనిని మీ చర్మంపై రాసి 20 నిముషాలు ఉంచి, నీటితో కడగండి. ఇలా ఒక వారం చేసిన తరువాత, మీ చర్మం తెల్లబడటం చూస్తారు.

చక్కెర మరియు తేనె ప్యాక్

హనీ మీ ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది మరియు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. దీనిని చక్కెరతో కలిపి పురుషుల ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. స్త్రీలతో పోల్చుకుంటే పురుషులకు గరుకైన చర్మం ఉంటుంది. కనుక చక్కెర చనిపోయిన చర్మ కణాలను తొలగించి, చర్మాన్ని శుభ్రపరచేందుకు సహాయపడుతుంది.

రెండు టీ స్పూన్ల తేనె మరియు ఒక టీ స్పూన్ చక్కెరను కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేయండి. దీనిని ముఖంపై రాసిన 10 నిమిషాల తరువాత, నీటితో కడగండి. ఈ పదార్ధాలు బ్లాక్ హెడ్స్ ని తొలగించడంలో కూడా ప్రభావితంగా పనిచేస్తుంది.

ఉసిరి మరియు తేనె ప్యాక్

ఆమ్లా మీ చర్మంలో చైతన్యం నింపుతుంది. వీటిని తినటం వలన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇది మొటిమలు మరియు మచ్చలను కూడా తొలగిస్తుంది. తేనె మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.

ఉసిరి రసం మరియు తేనెని బాగా కలిపి మీ ముఖంపై రాయండి. ఆరిన తరువాత నీటితో కడగండి. మీరు ఆమ్లా జ్యూస్ని త్రాగవచ్చు. ఇది మీ చర్మాన్ని లోపలి నుండి మెరుగు పరుస్తుంది.

పసుపు మరియు టొమాటో పేస్ ప్యాక్

పసుపులో హెర్బల్ మరియు యాంటీ సెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. టమోటా చర్మంపై ఏర్పడిన టాన్ ని తొలగిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ టమోటా రసం మరియు కొద్దిగా పసుపును బాగా కలుపుకొని మీ ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత నీటితో కడగండి. ఈ ప్యాక్‌ని రెగ్యులర్గా వాడటం వలన అందమైన మచ్చలు లేని చర్మాన్ని పొందుతారు.

ఆరంజ్, నిమ్మకాయి మరియు పెరుగు ప్యాక్

ఆరంజ్ మరియు నిమ్మరసం మీ చర్మంలో యాంటీ ఆక్సిడెంట్స్ ని నింపుతుంది. పెరుగు మీ చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా చేస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ ఆరంజ్ జ్యూస్ మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంను ఒక కప్ పెరుగులో కలపండి. బాగా కలిపి ఒక పేస్ట్‌లా చేసి మీ ముఖంపై రాయండి. ఆరిన తరువాత కడగండి. ఇలా రెగ్యులర్గా చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

ఆముదము

అందరికీ సాధారణంగా వచ్చే సమస్య వయసు వలన చర్మంపై ఏర్పడే ముడతలు. కాస్టర్ ఆయిల్ ఈ సమస్యను తొలగిస్తుంది.

కొన్ని చుక్కల ఆముదములో కొద్దిగా పసుపును కలిపి మీ కంటి చుట్టూ రాసి మసాజ్ చేయండి. ఇది మీ చర్మాన్ని టైటనింగ్ చేస్తుంది మరియు మృదువుగా చేస్తుంది. మీకు చాలా సున్నితమైన చర్మం ఉన్నట్లయితే పసుపును కలపకుండా ఆముదం నూనెని మాత్రమే రాయండి.

గ్రీన్ టీ వాటర్ మరియు తేనె

గ్రీన్ టీ బాగ్స్ ని మీ కళ్లపై వాడటం వలన డార్క్ సర్కిల్స్ ని తొలగిస్తుంది. రెగ్యులర్గా గ్రీన్ టీని త్రాగటం వలన మీ చర్మం మృదువుగా మరియు క్లియర్ గా అవుతుంది.

ఒక కప్పు గ్రీన్ టీ నీటిలో రెండు స్పూన్ బియ్యం పిండి మరియు అర స్పూన్ తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై రాసి 20 నిమిషాలు ఉంచండి. కడిగే ముందు వలయ ఆకారంలో మసాజ్ చేస్తూ కడగండి. ఇలా చేయటం వలన చనిపోయిన చర్మ కణాలను తొలగిపోతాయి.

పెరుగు మరియు పసుపు

పెరుగు మీ చర్మాన్ని హైడ్రేటెడ్గా మరియు క్లియర్‌గా చేస్తుంది. పసుపు మొటిమలను నల్లని మచ్చలను తొలగిస్తుంది.

ఒక స్పూన్ పెరుగులో కొద్దిగా పసుపుని కలుపుకొని ముఖంపై రాసి 20 నిమిషాలు ఉంచండి. తరువాత నీటితో కడగండి.

పసుపు మరియు నిమ్మరసం

లెమన్ ఒక యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది మీ చర్మంపై టాన్ ని తొలగిస్తుంది. పసుపు క్రిములను మరియు ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది.

కొద్దిగా శనగ పిండి, పసుపు, నిమ్మరసం మరియు పాలను కలుపుకొని ఒక పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ని ముఖంపై మసాజ్ చేసి 20 నిమిషాల తరువాత కడగండి. ఈ ప్యాక్ ని రెగ్యులర్గా వాడటం వలన మీరు శుభ్రమైన మరియు క్లియర్ స్కిన్‌ ని పొందుతారు.

పెరుగు మరియు నిమ్మరసం

పెరుగు మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది మరియు ప్రకాశవంతంగా చేస్తుంది. నిమ్మరసం డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక టేబుల్ స్పూన్ పెరుగును బాగా కలిపి మీ ముఖంపై రాసి ఎండిన తరువాత కడగండి. మీ చర్మం చాలా సెన్సిటివ్ అయితే వట్టి పెరుగును కూడా మీ చర్మంపై రాసుకోవచ్చు.

పాలు, నిమ్మరసం మరియు తేనె

ఈ మిశ్రమం ఒక మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక టేబుల్ స్పూన్ తేనెని బాగా కలిపి ముఖంపై రాయండి. 20 నిమిషాల తరువాత కడగండి.

పాలు మరియు కుంకుమ పువ్వు

సాఫ్రాన్ మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని పాలతో కలిపి ఉపయోగిస్తే ఇంకా ఎక్కువ ప్రకాశాన్ని ఇస్తుంది. రెండు లేదా 3 టేబుల్ స్పూన్ పచ్చి పాలలో కొద్దిగా కుంకుమ పువ్వును కలిపి 3 నుండి 4 గంటల వరకు నానపెట్టండి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 20 నిమిషాలు ఉంచి కడగండి. లేదా వట్టి పాలను ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత నీటితో కడగండి.

ఆలివ్ నూనె మరియు సి సాల్ట్ స్క్రబ్

ఈ స్క్రబ్ని వాడటం వలన మీ చర్మంపై ఉండే మురికి పదార్థాలను తొలగిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె మరియు ఒక టేబుల్ స్పూన్ సి సాల్ట్ ని కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోండి. దీనితో మీ ముఖాన్ని కొన్ని నిమిషాల పాటు స్క్రబ్ చేసి కడగండి.

కొబ్బరి పాలు

కొబ్బరి పాలు చర్మాన్ని వైటెన్ చేస్తుంది. రెగ్యులర్గా వాడటం వలన చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు హైడ్రేట్ చేస్తుంది. కొబ్బరి నుండి కొబ్బరి పాలను పిండి ముఖంపై రాయండి. ఆరిన తరువాత కడగండి. ఇది మీ పెదాలకు కూడా చాలా మంచిది.

ఆల్మండ్ పేస్ట్

బాదాం చర్మంలో విటమిన్ కంటెంట్ ని అధికరిస్తుంది. 5 లేదా 6 బాదాం ను రాత్రంతా పాలలో నానబెట్టి ఒక స్మూత్ పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖంపై రాసి 30 నిమిషాల తరువాత కడగండి.

నిమ్మరసం మరియు పుదీనా రసం

నిమ్మరసం నేచురల్ బ్లీచ్ గా పనిచేస్తుంది. పుదీనా చర్మంపై ఇర్రిటేషన్ను తగ్గిస్తుంది.1/2 స్పూన్ నిమ్మరసం మరియు 2 స్పూన్ పుదీనా రసాన్ని కలిపి ముఖంపై రాయండి. ఆరిన తరువాత నీటితో కడగండి.

శనగ పిండి, బొప్పాయి మరియు పసుపు పేస్ ప్యాక్

ఈ రెమెడీని ఎన్నో ఏళ్లుగా తెల్లని చర్మాన్ని పొందేందుకు ఉపయోగిస్తున్నారు. కొన్ని శనగలు మరియు ఎరుపు కాయ ధాన్యాలను పొడిచేయండి. లేదా నీళ్లను కలుపుకొని బాగా రుబ్బండి. ఇందులో కొద్దిగా పసుపు మరియు అర స్పూన్ బొప్పాయి గుజ్జును కలపండి. ఈ పేస్ట్‌ని మీ ముఖంపై మాస్క్ లాగా రాసి 15 నుండి 20 నిమిషాల తరువాత నీటితో కడగండి. ఇలా వారానికి 3 సార్లు చేయండి.

ఓట్స్ మరియు పసుపు పేస్ ప్యాక్

ఇది ఇన్స్టంట్ ఫెయిర్నెస్ ని ఇస్తుంది. రెండు టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక చిటిక పసుపుని కలుపుకొని ఒక మృదువైన మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీనిని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత నీటితో కడగండి.

నారింజ రసం మరియు పసుపు

నారింజ రసం చనిపోయిన చర్మ కణాలను మరియు టాన్ ని తొలగిస్తుంది. రెండు  టేబుల్ స్పూన్ నారింజ రసం మరియు ఒక చిటిక పసుపును కలుపుకొని ముఖంపై రాసి 20 నిమిషాల తరువాత నీటితో కడగండి. ఈ ప్యాక్‌ని రోజూ వేసుకోవటం వలన కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలను పొందుతారు.

నారింజ తొక్క మరియు పెరుగు

నారింజ జ్యూస్ లానే నారింజ తొక్క కూడా చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.

రెండు టేబుల్ స్పూన్  నారింజ తొక్క యొక్క పొడిని ఒక టేబుల్ స్పూన్ పెరుగుతో కలిపి పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత నీటితో కడగండి. ఈ ప్యాక్‌ని వారానికి 2 సార్లు ఉపయోగించి మంచి ఫలితాలను పొందండి.

ఫుల్లెర్స్ ఎర్త్ (ముల్తాని మిట్టి)

చర్మాన్ని లైటెన్ చేసేందుకు మరియు మెరిసే చర్మం కొరకు ఎర్త్ ఫుల్లెర్స్ ని ఉపయోగించటం చాలా పాత పద్దతి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మంలో చైతన్యం నింపుతుంది.

దీనిని ముల్తాని మిట్టి అని కూడా అంటారు. రెండు స్పూన్ల ముల్తాని మిట్టిని రోజ్ వాటర్ లో కలుపుకొని ముఖంపై రాయండి. బాగా ఆరిన తరువాత నీటితో కడగండి.

శనగ పిండి, పసుపు మరియు పాలు

ఈ రెమెడీ డార్క్ స్పాట్స్, మొటిమలు, పిగ్మెంటేషన్ మరియు ఇతర చర్మ సమస్యలను తొలగిస్తుంది. పసుపులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మాన్ని క్రిములనుండి కాపాడుతుంది మరియు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.

రెండు స్పూన్ శనగ పిండి, చిటిక పసుపు మరియు కొద్దిగా పాలను కలుపుకొని ఒక పేస్ట్‌ను తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ని ముఖంపై మరియు మెడపై రాసి 20 నిమిషాల తరువాత నీటితో కడగండి. మీరు పసుపు మరియు పచ్చి పాలను మాత్రమే ఉపయోగించి కూడా ముఖంపై రాయవచ్చు. కొద్దిగా పచ్చి పాలలో చిటిక పసుపును వేసుకొని ముఖమై రాసి 10 నుండి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి.

తేనె మరియు దాల్చిన చెక్క

తేనెలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నందున మొటిమలు మరియు మచ్చలను తొలగిస్తుంది. ఇది మీ చర్మాన్ని మృధువుగా చేస్తుంది. తేనె మరియు దాల్చిన చెక్క పొడిని కలుపుకొని ముఖంపై రాసి 15 నిమిషాల తరువాత నీటితో కడగండి.

నిమ్మరసం మరియు టమాటో పేస్ట్

ఈ మిశ్రమం టాన్ ని తొలగిస్తుంది. బాగా పండిన టొమాటోని చూర్ణం చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఒక పేస్ట్‌లా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి ఆరిన తరువాత నీటితో కడగండి. పురుషుల చర్మం చాలా గరుకుగా ఉండటం వలన వారానికి 2 లేదా 3 సార్లు ఈ పేస్ట్‌ని రాయండి.

దోసకాయ

దోసకాయ కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ని తొలగించి మీ చర్మాన్ని అందంగా చేస్తుంది. ఒక దోసకాయ తోలును తీసి చిన్న ముక్కలుగా కోసి గ్రైండర్లో వేసుకొని జ్యుసీ పల్ప్ చేయండి. దీనిని మీ ముఖంపై రాయండి.15 నిముషాల పాటు వదిలి, చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు దోసకాయను తినటం వలన కూడా మీ చర్మం తాజాగా ఉంటుంది.

శనగ పిండి, పసుపు మరియు ముల్తాని మిట్టి

పసుపు, శనగ పిండి మరియు ముల్తాని మిట్టి యొక్క కలయిక మీ ముఖం మీద తెలుపురంగుని తిరిగి తెచ్చేందుకు బాగా పనిచేస్తుంది. ఒక బౌల్ లో శనగ పిండి మరియు ముల్తాని మిట్టిని సమాన మోతాదులలో వేసుకొని ఒక చిటిక పసుపుని జోడించి రోజ్ వాటర్‌తో పేస్ట్‌లా కలుపుకోండి. ఈ ప్యాక్‌ని ముఖంపై రాసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి.

బంగాళదుంప

ఈ ప్రత్యేకమైన కూరగాయ ఫెయిర్ స్కిన్ టోన్ని పొందడానికి అద్భుతంగా పనిచేస్తుంది. బంగాళదుంపలో విటమిన్ సి ఉన్నందున, ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రొడక్ట్స్ కన్నా ప్రభావితంగా పనిచేస్తుంది. కనుక, పురుషులు ఫెయిర్ స్కిన్ టోన్ కొరకు బంగాళదుంపను ఉపయోగించవచ్చు.

బంగాళదుంపను ముక్కలుగా కట్ చేసి వాటితో చర్మంపై మసాజ్ చేయండి.  లేదా బంగాళదుంపల నుండి పల్ప్ తయారు చేసుకొని చర్మంపై రాసి 15 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

పండిన బొప్పాయి మరియు చక్కెర

బొప్పాయి పండుని బాగా చూర్ణం చేసుకోవాలి. ఈ గుజ్జులో ఒక స్పూన్ చక్కెర కలుపుకొని చర్మంపై రాయండి. నెమ్మదిగా మసాజ్ చేయండి. మసాజ్ చేసిన 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి.

ఐస్ మసాజ్

పురుషుల చర్మంపై గ్లో పెంపొందించే మార్గాలలో ఒకటి, ఐస్ క్యూబ్తో చర్మాన్ని మసాజ్ చేయటం. ఒక ఐస్ క్యూబ్‌ని 20 నుండి 30 సార్లు ముఖంపై రాయండి.  దీని వలన ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు. ఇది చాలా సులభమయిన పద్దతి.

పైనాపిల్, స్ట్రాబెర్రీ మరియు బొప్పాయి

ఈ మూడు పండ్లను కలిపి గుజ్జులా చూసుకొని ముఖంపై రాసి కొద్ది సేపు మసాజ్ చేయండి. వీటి రసం చర్మంలోనికి బాగా చొచ్చుకుపోయి మరియు శోషించబడిన తరువాత నీటితో కడగండి.

చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి

పై చెప్పిన ప్యాక్‌లను ఉపయోగించటమే కాకుండా రోజువారీ జాగ్రత్తలను తీసుకోవటం కూడా చాలా ముఖ్యం.

క్లెన్సింగ్

మీరు మీ చర్మాన్ని క్రమంగా శుభ్రపరచాలి. ఒక మంచి క్లెన్సెర్ని ఉపయోగించి  రోజుకు రెండుసార్లు ఉదయం మరియు సాయంత్రం మీ ముఖాన్ని శుభ్రం చేయండి. కలబంద కలిగి ఉన్న క్లెన్సెర్ను ఉపయోగించటం ఉత్తమం.

చర్మ రక్షణ

మీ చర్మం యొక్క సహజ మాయిశ్చర్‌ని కోల్పోకుండా ఉండేందుకు రెగ్యులర్గా మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి. ఫెయిర్నెస్ క్రీములను కూడా ఉపయోగించవచ్చు. మీరు ఎండలో వెళ్ళేముందు SPF లోషన్‌లను రాసుకోండి. కఠినమైన సూర్య కిరణాల నుండి మరింత రక్షణ కోసం పూర్తి స్లీవ్స్ ఉన్న చొక్కాలను, టోపీ మరియు సన్ గ్లాస్‌ను ధరించండి.

మలినాలను తొలగించడం

మీ శరీరం మరియు ముఖం నుండి చనిపోయిన చర్మ కణాలను శుభ్రపరచడం వలన చర్మం యవ్వనంగా మరియు మృదువుగా కనిపిస్తుంది. ఎన్నో రకాల ఫేస్ స్క్రబ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి, వాటి నుంచి మీ చర్మానికి తగిన వాటిని ఎంచుకోండి. మీరు స్క్రబ్ చేయడానికి ముందు మీ ముఖానికి ఆవిరి పట్టండి. ఇది చర్మం యొక్క లోతైన రంధ్రాల నుండి మురికి మరియు జిడ్డును తొలగించేందుకు తోడ్పడుతుంది.

ఆహారం, వ్యాయామం మరియు నీరు

ధ్యానం మరియు సరైన వ్యాయామాలు మీ చర్మం నుండి అదనపు జిడ్డుని దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. మీరు సరైన ఆహారం తీసుకొని, మీ శరీరం నుండి టాక్సిన్ ను విడుదల చేయడానికి తగిన నీరు త్రాగాలి. జ్యూసీగా మరియు తాజాగా ఉండే పండ్లు మీ శరీరం లోని తేమను నిలబెట్టుకోవటానికి మరియు పోషించుటకు సహాయం చేస్తుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నూనె పదార్థాలను తక్కువగా తీసుకోండి. యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సిఇ  మీ చర్మానికి మంచిది.

పురుషులు మృదువైన మరియు క్లియర్ చర్మం పొందడానికి ఇతర మార్గాలు

మీ చెడ్డ అలవాట్లను వదులుకోండి

ధూమపానం మరియు ఆల్కహాల్ మీ వయస్సును అధికంగా కనిపించేలా చేస్తుంది. మీరు మంచి చర్మం కావాలనుకుంటే మీ వ్యసనాలను తగ్గించడానికి మరియు నిష్క్రమించడానికి ప్రయత్నించండి.

మీ నిద్ర సమయాన్ని అధికరించండి

తగిన నిద్ర లేకపోవడం వలన మీ చర్మం నిస్తేజంగా మరియు పొడిగా అవుతుంది. చనిపోయిన చర్మ కణాలు మరియు డార్క్ సర్కిల్స్ అధికరిస్తాయి. సరైన సమయంలో తగినంత నిద్రను పొందటం వలన మీ స్కిన్ టోన్ మెరుగు పొందుతుంది.

ఎక్కువ నీళ్లు త్రాగండి

నీరు మీ చర్మాన్నీ హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. దీని ఫలితంగా  ప్రకాశవంతమైన మరియు స్పష్టమైన చర్మం లభిస్తుంది.

పై చెప్పిన చిట్కాలను ఉపయోగించండి, ఫెయిర్ అండ్ హ్యాండ్సం చర్మాన్ని పొందండి.