Posted on

Best dark circle removal creams in Telugu – కంటి చుట్టూ నల్లని వలయాలను(డార్క్ సర్కిల్స్) తొలగించేందుకు ఉత్తమ క్రీమ్స్

శరీరంలో అతి పెద్ద అవయవంగా పిలవబడేది చర్మం. మన శరీరం మీద చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. మచ్చలు లేని చర్మం కావాలని కోరుకునే వాళ్లకు కంటి చుట్టూ ఉన్న నలుపు చాలా ఇబ్బంది పెడుతుంది. అలంకరణ సామగ్రుల ద్వారా ఈ నలుపును తెలియకుండా కప్పి వేయవచ్చు, కానీ ఇది పరిష్కారం కాదు. ఎక్కువ కెమికల్స్ ఉన్న అలంకరణ సామగ్రులను వాడటం కూడా అంత మంచిది కాదు.

ఆరోగ్యమైన పద్దతిలో వీటిని తొలగించేందుకు వివిధ రకాల క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీ చర్మానికి సరిపడే క్రీమ్‌ను మీరు ఎంపిక చేసుకోవచ్చు.

దాదాపు 70 శాతం ప్రజలకు కంటి చుట్టూ నలుపు మరియు ముడతలు(వ్రిన్కుల్స్) ఉన్నందున ఈ క్రీమ్స్ ప్రధానంగా మార్కెట్ లో లభిస్తున్నాయి. వీటిలో కొన్ని ఉత్తమ క్రీమ్స్ ను చూద్దాం.

మమ ఎర్త్ అండర్-ఐ క్రీమ్

Mama Earth Under-Eye Cram[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఆధునిక పద్దతిలో తయారు చేయబడిన ఈ అద్వితీయ మైన క్రీమ్ మీ చర్మం లోని సహజ అందాన్ని పునరుజ్జీవింప చేస్తుంది. ఇందులో కెఫీన్,తెల్లని లిల్లీ మరియు దోసకాయలలోని సారం ఉన్నందున ఇది ఒక అద్భుతమైన సుగంధ మిశ్రమం. కంటి చుట్టూ ఉన్న చర్మంలో చమురును ఉత్పత్తి చేసే గ్రంథులు లేనందున ఈ క్రీమ్‌ను రాయటంతో చర్మాన్ని చల్లబరచి, చనిపోయిన చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ఇందులోని విటమిన్ సి వాపు మరియు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని ప్రభావాన్ని మరియు చర్మంపై తేడాను మొదటి సారి రాసినప్పటినుంచే మీరు చూడవచ్చు.

అరోమా ట్రెజర్స్ అలీవెరా క్రీమ్ జెల్

Aroma Treasures Aloe Vera Cream Gel[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

మీ కంటి క్రింద ఉన్న ఉబ్బిన(పఫీనెస్) చర్మాన్ని తొలగించటానికి అరోమా ట్రెజర్స్ యాంటీ ఏజింగ్ క్రీమ్ చాలా సమర్ధవంతమైనది. ఇందులోని కలబంద సారం మీ చర్మం లోని కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ అనే ప్రోటీన్‌లను ఉత్తేజ పరుస్తుంది. ఇది మీ కంటి క్రింద ఉన్న చర్మంలో తేమను(మాయిశ్చర్) పునరుద్ధరింపచేసి సున్నితమైన పొరను రక్షించడం ద్వారా మృదువుగా చేస్తుంది. ఇందులో యాంటీ-బాక్టీరియల్ మరియు యాంటీ-సెప్టిక్ గుణాలు ఉన్నందున అన్ని వయసుల వాళ్లూ దీనిని వాడవచ్చు.

హెర్బలిన్ అండర్ క్రీమ్

Herbline Under Eye Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది కలబంద, తేనె మరియు ఈతచెట్టు మైనం(పామ్ వాక్స్) ల అరుదైన కలయికలతో చేయబడిన ఒక అద్భుతమైన క్రీమ్. ఇందులోని కలబంద చర్మంలో మంటను తగ్గించి ఆరోగ్యంగానూ, యవ్వనంగానూ ఉండేలా చేస్తుంది. ఇది మీ చర్మాన్ని చల్లబరచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ క్రీమ్ లోని పామ్ వాక్స్ మీ చర్మం లోతుల దాకా వెళ్లి పుండులను నివారించి చనిపోయిన చర్మ కణాలను పునరుత్పత్తి చేయటం వలన మీ చర్మం సహజంగా ప్రకాశిస్తుంది. ఇందులోని తేనె మీ చర్మం యొక్క స్థితిస్థాపకతను (ఎలాస్టిసిటీ) పెంచి యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

బ్లిస్స్ ట్రీ అండర్ ఐ క్రీమ్

Bliss Tree Under-Eye Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది ఒక నునుపైన మరియు విలాసవంతమైన సుగంధ మిశ్రమం. ఇది 100 శాతం ప్రాకృతికమైనది, ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ పరాబెన్లు కానీ లేవు. ఇందులో విటమిన్ ఎ, కలబంద, విటమిన్ ఇ, విటమిన్ డి, చేమంతుల సారం, నారింజ నూనె, గ్లిసరిన్ మరియు ప్రోఆంథోసైటిన్ లు ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని పునరుజ్జీవింప చేసి తేమను పునరుద్ధరిస్తుంది. అంతేకాదు ఈ క్రీమ్ మీ చర్మాన్ని నిరంతరం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

ఆర్గానిక్ తెరపి అండర్ ఐ కామింగ్ క్రీమ్

Organic Therapie Under Eye Calming Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఈ క్రీమ్ సువాసన కలిగిన నూనెల (అరోమా ఆయిల్స్) మిశ్రమంతో తయారు చేయబడినది. ఇది మీ కంటి క్రింద ఉబ్బిన(పఫీనెస్) చర్మాన్ని గుణ పరుస్తుంది. ఇందులోని విటమిన్ కె మరియు ప్రో-రెటినోల్ (విటమిన్ ఏ) కంటి చుట్టూ ఉన్న ముడతల్ని తొలగించి సున్నితమైన చర్మాన్ని హైడ్రేట్ చేసి ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది. ఇందులో బంగాళదుంప సారం ఉన్నందున డార్క్ సర్కిల్స్ మరియు ముడతలను వేగంగా తొలగిస్తుంది.

కాసా అండర్ ఐ క్రీమ్ ఫర్ డార్క్ సర్కిల్స్ అండ్ పఫీనెస్

Kasa Under Eye Cream for Dark Circles and Puffiness[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది కలబంద, చామంతి సారం, బాదాం మరియు ములెతీల యొక్క అరుదైన మిశ్రమాలతో తయారు చేయబడినది. డిహైడ్రేషన్ వలన వచ్చిన కంటి నలుపును మరియు వాపును తగ్గిస్తుంది. ఇది కంటి చుట్టూ ఉన్న చర్మానికి కావలసిన మినరల్స్ మరియు విటమిన్లను అందజేసి పోషణ ఇస్తుంది.

VLCC ఆల్మండ్ అండర్ ఐ క్రీమ్

VLCC almond under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

నల్లని వలయాలను తగ్గించేందుకు వాడే ఈ క్రీమ్ 15ml జార్లో కూడా లభిస్తుంది. ఇందులోని ముఖ్య ప్రాకృతిక పదార్థాలు: చామంతి – ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి రాడికల్స్ ను తొలగిస్తుంది. బాదాం – మీ చర్మం యొక్క నాణ్యతను పెంచేందుకు మరియు యవ్వనంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. విటమిన్ ఇ మరియు ఆలివ్ నూనె – ఇది మీ చర్మంపై మాయిశ్చరైజర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ లా పనిచేస్తుంది.

అరోమా మేజిక్ అండర్ ఐ జెల్

Aroma magic under eye gel[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

అరోమా మేజిక్ జెల్ కూడా మీ డార్క్ సర్కిల్స్ కు ఒక పరిష్కారం. ఇందులో యాంటీ- వ్రిన్కుల్ (ముడతలను తగ్గించే) లక్షణాలు ఉన్నాయి. మాములుగా వృద్ధాప్య ప్రక్రియలో ఎక్కువ ఒత్తిడి వలన మరియు సరైన నిద్ర లేకపోవడం వలన మీ కళ్ళు చాలా అలసిపోతాయి. ఇలాంటి సమస్యను తొలగించేందుకు మీరు ఈ అరోమా మేజిక్ జెల్‌ను వాడవచ్చు. ఇది మీ కళ్లలో చైతన్యం నింపుతుంది. అంతేకాదు ఇందులోని ఎస్సెన్షియల్ ఆయిల్స్ మీ కంటి అలసటను, డార్క్ సర్కిల్స్ ను మరియు వాపును తొలగించేందుకు కూడా ఉపయోగ పడుతుంది.

హిమాలయ హేర్బల్స్ అండర్ ఐ క్రీమ్

Himalaya herbals under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

వివిధ రకాలైన మూలికల ఉత్పత్తులను తయారు చేయడంలో హిమాలయ ఒక విష్వశీయమైన బ్రాండ్. వీటిలో అండర్ ఐ క్రీమ్ అన్నింటికంటే ఉత్తమమైన మరియు అద్భుతమైన ప్రభావం కలిగినది. మీ కంటి చుట్టూ విభిన్నమైన నలుపు ఉన్నట్లయితే హిమాలయ అండర్ ఐ క్రీమ్ సమర్ధవంతమైన పరిష్కారం. ఇది మీ నల్లని వలయాలను తొలగించటమే కాకుండా చర్మాన్ని మాయిశ్చరైస్ చేసి ముడతలను కూడా తొలగిస్తుంది. ఈ క్రీమ్‌ను వాడండి కొద్దీ రోజుల్లోనే తేడాను చూడండి.

ఎలైట్ అడ్వాన్స్డ్ డార్క్ సర్కిల్స్ కరెక్టింగ్ ఐ క్రీమ్

Elite advanced dark circles correcting eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది ఇతర క్రీమ్స్ తో పోల్చుకుంటే ఖరీదైనది కావచ్చు, కానీ ఇది వాడడం వలన డార్క్ సర్కిల్స్ ను అతి వేగంగా తగ్గిస్తుంది. ఉదాహరణకు, మిగిలిన క్రీమ్స్ ఒక నెల రోజులలో తగ్గించే నలుపును ఈ ఎలైట్ క్రీమ్ ఒకే వారంలో తగ్గిస్తుంది. ఇది కంటి చుట్టూ నలుపుకు కారణం అయిన వర్ణ ద్రవ్యాలను నిర్మూలిస్తుంది, మీరు మీ చర్మం యొక్క అసలైన రంగును నిశ్చయముగా తిరిగి పొందుతారు. ఇది చర్మం లోని మంటను కూడా తగ్గించి అందంగా చేస్తుంది. ఈ క్రీమ్ అన్ని ఆన్‌లైన్ స్టోర్స్ లో లభిస్తుంది.

షనాస్ హుసైన్ షాస్మూత్ ప్లస్ ఆల్మండ్ అండర్ ఐ క్రీమ్

Shahnaz Husain Shasmooth plus almond under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

మీరు నిజంగా మీ కంటి చుట్టూ ఉన్న నలుపును తొలగించాలని అనుకొంటున్నట్లయితే షనాస్ హుసేన్ యొక్క ఆల్మండ్ అండర్ ఐ క్రీమ్ ను ఉపయోగించండి. ఇందులో బాదాం యొక్క గుణాలు ఉన్నందున ఇది డార్క్ సర్కిల్స్ మరియు వాపును తగ్గించి మీ చర్మాన్ని పోషిస్తుంది. ఇది మీ కంటి చుట్టూ ఉన్న ముడతలను కూడా తొలగిస్తుంది. డార్క్ సర్కిల్స్ ను తొలగించేందుకు ఇది ఒక ఉత్తమ మరియు అత్యంత అధికంగా వాదే క్రీమ్.

బయోటిక్ బయో ఆల్మండ్ సూతింగ్ అండ్ నరిషింగ్ ఐ క్రీమ్

Biotique Bio Almond Soothing and Nourishing Eye Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

బయో ఆల్మండ్ క్రీమ్ ఉపయోగించటం వలన మీ కంటి చుట్టూ ఉన్న నల్లని వలయాలకు ప్రాకృతిక పోషణ ఇవ్వబడుతుంది. ఇందులోని బాదాం లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నందున ఇది మీ చర్మం లోతుల దాకా వెళ్లి మాయిశ్చరైస్ చేస్తుంది. మీ కంటి పఫీనెస్ ను మరియు ముడతలను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.

ఆప్టిమల్స్ వైట్ సీఇంగ్ ఐ క్రీమ్

Oriflame Optimals White Seeing Is Believing Eye Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఓరీఫ్లేమ్ యొక్క ఈ క్రీమ్‌ను స్కిన్ లైటెనింగ్ కాంప్లెక్స్ తో రూపొందించారు. ఇది డార్క్ సర్కిల్స్ ను కొద్ది సమయం లోనే సమర్ధవంతంగా తొలగిస్తుంది. ప్రాకృతిక ప్రకాశవంతమైన చర్మం కోసం ఈ క్రీమ్‌ను ఎంపిక చేసుకోండి. ఈ క్రీమ్ లో హైడ్రేటింగ్ సమ్మేళనాలు మరియు కెఫీన్లు ఉండటం వలన కంటి చుట్టూ వున్న చర్మంలో సూక్ష్మ ప్రసరణను పెంచి డార్క్ సర్కిల్స్ మరియు పఫీనెస్ ను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్ మరియు SPF లు చర్మాన్ని సంరక్షిస్తాయి.

లోరియాల్ పారిస్ డెర్మో ఎక్స్పెర్టైస్ యూత్ కోడ్ ఐ క్రీమ్

L’Oreal Paris dermo expertise youth code eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఈ యూత్ కోడ్ క్రీమ్ విస్తృతమైన పరిశోధన యొక్క ఉత్పత్తి. ఇందులోని సమృద్ధమైన ప్రో-జెన్ TM టెక్నాలజీ మీ కంటి క్రింద ఉన్న చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇందులోని మాయిశ్చరైసింగ్ సూత్రం చర్మాన్ని సున్నితంగా చేసి ప్రాకృతిక ప్రకాశాన్ని ఇస్తుంది. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. ఈ క్రీమ్ ను మీరు రాసుకున్న 10 నిమిషాల్లోనే తేడాను చూడవచ్చు.

ఖాదీ ప్రీమియం హెర్బల్ అండర్ ఐ క్రీమ్

Khadi Premimum herbal under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఈ మూలికల మిశ్రమం మీ కంటి క్రింద ఉన్న చర్మాన్నీ మృదువుగా చేసి నల్లని వలయాలను తొలగించటంలో తోడ్పడుతుంది. ఇందులో బేర్ బెర్రీ, బొప్పాయి, బాదాం మరియు దోసకాయల యొక్క సారం ఉన్నందున చర్మంలోని పిగ్మెంటేషన్ మరియు పఫీనెస్ తగ్గించి ప్రకాశింపచేస్తుంది. దీనిని క్రమంగా వాడటం వలన చర్మంపై ఉన్న ముడతలు, గీతాలు తొలగిపోతాయి.

లోటస్ హెర్బల్స్ నూట్రాఐ రీజువనేటింగ్ అండ్ కరెక్టింగ్ ఐ జెల్

Lotus herbals nutraeye rejuvenating and correcting eye gel[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది ఒక ప్రముఖమైన మూలికల ఉత్పత్తి. ఇందులో జల విశ్లేషణ, గోధుమ ( హైడ్రోలైజ్డ్ వీట్ ) ప్రోటీన్స్ ఉన్నాయి, ఇవి కంటి క్రింద ముడతలను తొలగిస్తుంది. ఇందులోని ‘సొయా బయో పెప్టైడ్స్’ పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది. ఇందులోని బియ్యం తవుడు, విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ లు చర్మాన్ని హైడ్రేట్ చేసి చైతన్యం నింపడంవలన చర్మం యవ్వనంగా ఉంటుంది.

DCR డార్క్ సర్కిల్ రిమూవర్ లోషన్

DCR dark circle remover lotion[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ మరియు ముడతలను తొలగించేందుకు ఇది ఒక ఉత్తమమైన క్రీమ్. ఈ క్రీమ్ వాడటం వలన మీ డార్క్ సర్కిల్స్ ను త్వరగా తొలగించవచ్చు.

వావ్ అల్టిమేట్ అండర్ ఐ అండ్ ఫేషియల్ జెల్

Wow ultimate under eye and facial gel[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇతర క్రీమ్లతో పోల్చుకుంటే ఇది కొంచం ఖరీదైనదిగా ఉండొచ్చు. ఎందుకంటే ఇది అండర్ ఐ క్రీమ్ మాత్రమే కాదు ఫేషియల్ జెల్ కూడా. ఇది మీ చర్మానికి ఎలాంటి హానీ కలిగించని సురక్షితమైన జెల్. సహజమైన అందమైన ముఖం కోసం ఈ జెల్‌ని వాడండి. ఇది ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్ లలో లభిస్తుంది.

డార్క్ అవే డార్క్ సర్కిల్స్ కరెక్టింగ్ క్రీమ్

Dark away dark circles correcting cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

 

ఇది దిగుమతి చేయబడిన క్రీమ్. ఇది రక్తంలో పిగ్మెంటేషన్ వలన వచ్చే డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది. మీ కంటి క్రింద కలిగే మంటను కూడా ఇది తగ్గిస్తుంది. దీనిని వాడటం వలన మీరు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ఈ క్రీమ్‌ను వాడి చూడండి. ఇది మీ డార్క్ సర్కిల్స్ ను తొలగించి సంతృప్తిని కలిగిస్తుంది.

St.బొటానికా అండర్ ఐ క్రీమ్

St.Botanica under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది యాంటీ ఏజింగ్, యాంటీ వ్రిన్కుల్స్ (ముడతలు) మరియు డార్క్ సర్కిల్స్ కు సమర్థవంతమైన క్రీమ్. హైలోరోనిక్ ఆసిడ్, మొరాకన్ అర్గన్ ఆయిల్, విటమిన్ ఇ, విటమిన్ బి3, కలబంద సారం ,అతి మధురపు వేర్ల సారం(లిక్విఓరిస్ రూట్ ఎక్స్ట్రాక్ట్), దోసకాయ సారం, కెఫీన్ లాంటి సమర్ధవంతమైన పదార్థాలతో చేయబడినది. కంటి చుట్టూ ఉన్న చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలకూ ఇది పరిష్కారం. ఇందులోని దోసకాయ సారం చర్మాన్ని మృదువుగా చేసి వాపును తగ్గిస్తుంది. ఇందులోని ‘ప్లాంట్ స్టెమ్ కణాలు’ మరియు ‘పెప్టైడ్స్’ చర్మాన్ని చైతన్యం చేస్తుంది. హైలోరోనిక్ ఆసిడ్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఈ క్రీమ్‌ను కల్లకే కాదు, బుగ్గలపై మరియు నుతుడిపై కూడా రాయవచ్చు.

గార్నియర్ స్కిన్ నాచురల్స్ వైట్ కంప్లీట్ ఐ రోల్-ఆన్

Garnier skin naturals white complete eye roll-on[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

గార్నియర్ లో చాలా రకాల చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ మరియు అలంకరణ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఐ రోల్-ఆన్ డార్క్ సర్కిల్స్ మరియు పఫీనెస్ ను తగ్గిస్తాయని చర్మ శాస్త్రం ప్రకారం నిరూపించబడినది. ఇందులో కెఫీన్ మరియు ప్రో విటమిన్ బి15 లాంటి పదార్థాలు ఉన్నాయి. కెఫీన్ చర్మాన్ని ఉత్తేజ పరిచి అందంగా చేస్తుంది.

వాడి హెర్బల్స్ అండర్ ఐ క్రీమ్

Vaadi herbals under eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

కంటి చుట్టూ ఉన్న చర్మంలో నూనె గ్రంథులు లేనందున ఎక్కువ పోషణ అవసరం. ఎక్కువ సేపు పనిచేయటం వలన, నిద్ర లేక పోవటం వలన సరైన పౌష్టిక ఆహారాలు తీసుకోనందున లేదా ఎక్కువగా ఎండలో తిరగటం వలన కూడా డార్క్ సర్కిల్స్, పఫీనెస్ మరియు ముడతలు వస్తాయి. ఈ హెర్బల్ క్రీమ్ తొలగిస్తుంది. ఇందులో దోసకాయ, రోజా మరియు బాదాంల యొక్క సారం ఉన్నందున ఇది చర్మాన్ని తెల్లగాను ప్రకాశవంతంగాను చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మృదువుగా మరియు యవ్వనంగా చేస్తుంది.

నేచర్స్ ఎసెన్స్ డార్క్ సర్కిల్ అండ్ పఫీనెస్ రెడ్యూస్డ్ ఐ క్రీమ్

Nature’s essence dark circle and puffiness reduced eye cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

డార్క్ సర్కిల్స్ మరియు పఫీనెస్ ను తగ్గించే ఈ క్రీమ్లో ఆల్ఫా హైడ్రాక్సిల్ ఆమ్లాలు, బాదాం నూనె మరియు ఇతర అంశాలు ఉన్నాయి. ఇది మీ చర్మాన్ని మృధువుగా చేసి హైడ్రేట్ చేస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. దీనిని ప్రతి రోజూ పడుకునే ముందు మీ కంటి చుట్టూ పూయండి.

సాత్త్విక్ ఆర్గానిక్స్ ఐ కేర్

Sattvik organics eye care[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఇది ఒక కంటి సంరక్షణ క్రీమ్. ఇందులోని అరోమా నూనెలు చర్మాన్ని చైతన్యవంతంగా మరియు హైడ్రేట్ చేసి డార్క్ సర్కిల్స్ మరియు ముడతలను తొలగిస్తుంది. ఈ క్రీమ్ మీ వృద్ధాప్య లక్షణాలను దూరం చేసి యవ్వనంగా వుంచుతుంది. ఇది రక్త ప్రసరణను ఉత్తేజ పరుస్తుంది. ఈ క్రీమ్‌ని రోజూ రాత్రి కంటి చుట్టూ రాయండి.

ఆర్గానిక్ హార్వెస్ట్ అండర్ ఐ జెల్

Organic harvest under eye gel[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

నిస్తేజ చర్మం, పఫీనెస్ మరియు డార్క్ సర్కిల్స్ లాంటి అనేక సమస్యలు సరైన రక్త ప్రసరణ లేనందున వస్తుంది. ఈ దట్టమైన జెల్ మీ కంటి చుట్టూ రక్త ప్రసరణను మెరుగు చేసి స్కిన్‌ టోన్ మరియు రంగును పెంచుతుంది, ముడతలతో మరియు వృద్ధాప్య లక్షణాలతో పోరాడుతుంది, డార్క్ సర్కిల్‌ను తగ్గిస్తుంది. అనేక చర్మ సమస్యలను వదిలించుకోవడానికి ఆర్గానిక్ హార్వెస్ట్ అండర్ ఐ జెల్ ఉపయోగించవచ్చు.

2N ఐమెడ్ ఆస్ట్రేలియా 15 డేస్ డార్క్ సర్కిల్ రిమూవర్ క్రీమ్

2N EyeMed Australia 15 Days Dark Circle Remover Cream[ఆన్లైన్లో కొనుగోలు చేయండి]

ఈ క్రీమ్‌లోని హాలోక్సయిల్రక్త ప్రసరణను మెరుగు చేసి డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది. ఐశేరాయిల్ చర్మంయొక్క స్థితిస్థాపకతను (ఎలాస్టిసిటీ) పెంచి పఫీనెస్ని తొలగిస్తుంది. రేనోవాజ్ లోని యాంటీ-యేజింగ్ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

Posted on

Telugu tips for pimples – మొటిమల చర్మానికి ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్స్

ఫుల్లర్ ఎర్త్ లేదా ముల్తాని మట్టి ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పవచ్చు. దానిని మీరు మీ చర్మానికి ఉపయోగించినా లేదా జుట్టుకి ఉపయోగించినా, శుభ్రపరచడంలో రెండూ నిజంగా ప్రభావవంతంగా పనిచేస్తాయి. జిడ్డు చర్మం కలిగిన వారిలో ఉండే ప్రధాన సమస్య మొటిమలు. దానికి కారణం చర్మపు బయట పొరలలో ఉండే జిడ్డు. ఇలాంటి సమస్యలను నిర్మూలించడానికే మనము ముల్తాని మట్టిని ఉపయోగించవచ్చు.

ఇప్పుడు మేము మీకు ఫుల్లర్ ఎర్త్ తో తయారు చేసే ముఖ్యమైన కొన్ని ఫేస్ ప్యాక్ లను మీ ముందు ఉంచుతున్నాం. ఇది అధిక జిడ్డు, బ్లాక్ హెడ్స్, చర్మపు రంధ్రాలలో పేరుకుపోయిన మృత కణాలు మరియు మొటిమలతో బాధ పడుతున్న అన్ని రకాల చర్మాలకు ఒకేలా పనిచేస్తుంది. సంవత్సరాలుగా ఈ ముల్తాని మట్టి ప్యాక్ లను మహిళలు ఉపయోగిస్తున్నారు. సౌందర్య చికిత్సలో నిష్ణాతులు అయిన వారు కూడా ఈ సహజ ముల్తాని మట్టితో వివిధ రకాల ప్యాక్ లను చేసి ఉపయోగిస్తున్నారు.

ముల్తాని మట్టి, తేనె, పెరుగు మరియు నిమ్మ రసంతో ఫేస్ ప్యాక్

ముల్తాని మట్టి మృత చర్మ కణాలను మరియు చర్మం మీద ఉన్న రంధ్రాలను తొలగించడంలో చాలా మంచి ఉపయోగకారినిగా పనిచేస్తుంది. ఇందుకోసం ముల్తాని మట్టికి కాస్త తేనె, 1 టేబుల్ స్పూన్ పెరుగు మరియు కాస్త నిమ్మ రసాన్ని వేసి కలపండి. తేనె చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది మరియు పెరుగు చర్మంలో ప్రోటీన్ ల స్థాయిని పెంచుతుంది అలాగే మొటిమలను నివారిస్తుంది.

కలబందతో ముల్తాని మట్టి

ముల్తాని మట్టి చర్మం మీద మొటిమలను తొలగించడంలో అనంతమైన చికిత్సలలో ఒకటి. ముల్తాని మట్టికి కాస్త కలబంద గుజ్జుని జోడించి, ఆ పేస్టుని ముఖానికి రాసుకోండి. ఇది మొటిమలను నివారిస్తుంది. అలాగే మంచి ఫలితాలను కూడా పొందుతారు.

పిండి చేసిన బాదం తో ముల్తాని మట్టి

మీకు బాదం అంటే బాగా ఇష్టం ఉన్నవారు అయితే, అప్పుడు ఈ ఫేస్ ప్యాక్ మీకు సరిగ్గా సరిపోతుంది. ఒక గిన్నెలో కాస్త పిండి చేసిన బాదం మరియు కాస్త ముల్తాని మట్టిని వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని మీ ముఖం మీద వలయాకారంలో రాసుకుని, ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో ఆ ఫేస్ ప్యాక్ ని కడిగేసుకోండి. ఈ ప్యాక్ ను వారంలో ఒకసారి రాసుకోండి.

మొటిమల నివారణకు ముల్తానీ మట్టి

మీరు మొటిమలను ప్రభావితం చేసే చర్మాన్ని కలిగి ఉన్నట్లయితే మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ముల్తానీ మట్టిని ఉపయోగించడమే. దీనితో మీరు సమతలమైన మరియు మృదువైన చర్మాన్ని పొందుతారు. మీరు ముల్తానీ మట్టి స్టోన్ కు సులభంగా నీటిని చేర్చడం ద్వారా ఈ ఫలితాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ముల్తానీ మట్టి పౌడర్కు నీటిని కలపడం ద్వారా పేస్టులాగా తయారుచేసుకుని కూడా ఉపయోగించవచ్చు. ఈ పేస్టుని మొటిమలు ఉన్న చోట రాయడం ద్వారా మొటిమల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.

చర్మ సంరక్షణకు ముల్తానీ మట్టి

చర్మ సంరక్షణకుమార్కెట్లో లభించే వివిధ సంరక్షక ఔషధాలు పొందడం చాలా సులభం. కానీ ఎప్పుడైనా ఉపయోగించారా? ముల్తానీ మట్టి క్లే స్టోన్ రూపంలోనూ మరియు పౌడరు రూపంలోనూ మార్కెట్లో లభిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్నది స్టోన్ అయితే దానిని పగలగొట్టి చిన్న భాగాన్ని వేరు చేసి, ఆ భాగాన్ని చూర్ణంగా ఏర్పడటానికి సరిపడా నీటిలో వేసి ఉంచండి. అది కరిగి పేస్టులాగా ఏర్పడుతుంది. ఇప్పుడు చూర్ణానికి చిటికెడు పసుపు కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను కలపండి. వాటిని బాగా కలిపి ముఖ చర్మం మీద పట్టించండి. 15 నిమిషాల పాటు దానిని ఆరనిచ్చి తర్వాత కడిగేసుకోండి.

చర్మశుద్ధి మరియు చర్మకాంతికి ముల్తానీ మట్టి

మీ చర్మాన్ని శుద్ధి పరుచుకోవడానికి మరియు అసమాన చర్మ వర్ణాన్ని సమ వర్ణంగా చేయుటకు ముల్తానీ మట్టి, బంగాళదుంప యొక్క అద్భుతమైన కలయిక మీకు అవసరం అవుతుంది. ఇందుకోసం మీరు ఒక బంగాళదుంప తీసుకొని తొక్కను తీసి గుజ్జులా చేయండి. రెండు స్పూన్ల బంగాళదుంప గుజ్జును ఒక కప్పులో తీసుకోండి. దానికి కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ను కలపండి. అందులో ఒక స్పూన్ ముల్తానీ మట్టి కూడా వేసి ఈ పదార్థాలను పేస్టు లాగా బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించి కాసేపు దాన్ని ఆరనిచ్చాక నీళ్ళతో కడిగేసుకోండి.

చర్మానికి ముల్తాని మట్టి ప్రయోజనాలు

 • ఇది మొటిమలను మరియు మచ్చలను తొలగిస్తుంది.
 • మీరు మృదువైన మరియు కాంతివంతమైన చర్మాన్ని పొందుతారు.
 • మీ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
 • మెడ మరియు ముఖం మీద ఉన్న ముడతలు తొలగించబడతాయి.
 • మీరు బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ను నిర్మూలించవచ్చు.

ముల్తాని మట్టిని ఉపయోగించి ఫేస్ ప్యాక్లు

నిమ్మతో ముల్తాని మట్టి

మొటిమలు తగ్గిన తరువాత, ఎర్రని చర్మం మాయమవ్వచ్చు కానీ వాటి వలన ఏర్పడిన మచ్చలు చర్మం మీద అలానే ఉండిపోతాయి. నిమ్మ ఒక సహజ సిద్ధమైన బ్లీచ్ గా పనిచేస్తుంది కనుక ఇది ముఖం మీద ఏర్పడిన మచ్చలను నిర్మూలిస్తుంది. అలాగే చర్మం నుండి అధికంగా స్రవించే జిడ్డుని కూడా నిమ్మ తొలగిస్తుంది. ఈ ప్యాక్ కోసం ఒక గిన్నెలో రెండు స్పూన్ల ముల్తానీ మట్టి. ఒక స్పూన్ రోజ్ వాటర్ మరియు 10 నుండి 12 చుక్కల నిమ్మరసం తీసుకొని పేస్టులా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం అంతటా పట్టించండి. ఇది ముఖం మీద ఏర్పడిన మచ్చలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.

వేపతో ముల్తానీ మట్టి

వేప క్రిమినాశక లక్షణాన్ని కలిగిన ఒక సహజ మూలిక. ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్లను లోపలి నుండి చికిత్స చేస్తుంది. అందువలన, ఉదయాన్నే ప్రతిరోజు వేప ఆకులను తీసుకోవడం చాలా ఆరోగ్యకరమైన విషయం. అదేవిధంగా, వేప ఆకులను ముల్తానీ మట్టితో తీసుకుని ప్యాక్ లా తయారు చేసుకొని బాహ్యంగా కూడా ప్రయోజనాలను పొందవచ్చు. ఇందుకోసం వేప ఆకులను ఎండబెట్టి పొడిచేసి ఉంచుకోవాలి. ఒక చెంచా వేప పొడిని, ఒక చెంచా ముల్తానీ మట్టి పొడిని తీసుకొని రెండు చుక్కల తాజా నిమ్మరసాన్ని మరియు రోజ్ వాటర్ ను కలిపి పేస్టులా తయారు చేసుకోండి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోండి. ఇది మీ ముఖాన్ని మృదువుగా మరియు అందంగా మారుస్తుంది.

చందనం మరియు ఫుల్లర్ ఎర్త్

మనం చందనాన్ని దేవుడిని పూజించడానికి ఒక పవిత్రమైన మూలికగా ఉపయోగిస్తుంటాం. ఒక చందనం చక్కని తీసుకొని దానిని ఒక రాయి మీద చిక్కటి పేస్టులా రుద్దండి. రెండు చెంచాల చందనం పేస్టుకి, ఒక చెంచా ఫుల్లర్ ఎర్త్ ని, అరచెంచా శనగపిండి మరియు రోజ్ వాటర్ ను వేసి పేస్టులా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత కడిగేసుకోండి. ఇది మీ ముఖం మీద మొటిమలను తొలగించడమే కాకుండా కాంతివంతమైన ముఖాన్ని ఇస్తుంది.

నారింజ తొక్కతో ముల్తానీ మట్టి

ముఖ చర్మం మీద ఏర్పడిన మొటిమలు బ్యాక్టీరియా కారకం కావచ్చు. నారింజ తొక్క ఇటువంటి సమస్యలకు సహాయపడుతుంది. ఇందుకోసం ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక చెంచా ఎండిన నారింజ తొక్కల పొడి మరియు ఒక చెంచా ముల్తానీ మట్టి అలాగే పచ్చిపాలు వేసి పేస్టులాగా కలపండి. దీనిని మీ ముఖం మీద రాసుకుని కాసేపు ఉంచి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోండి.

ఫుల్లర్ ఎర్త్ తో పసుపు

శోధ నిరోధక లక్షణం కలిగిన పసుపుని ముల్తానీ మట్టితో తీసుకోవడం వలన అందమైన మరియు కాంతివంతమైన ముఖాన్ని పొందవచ్చు. ఇందుకోసం ముల్తానీ మట్టి, చిటికెడు పసుపు మరియు పచ్చి పాలు తీసుకొని పేస్టులా తయారు చేసుకోండి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోండి.

క్యారెట్ తో ముల్తానీ మట్టి

క్యారెట్ కూడా మీ చర్మానికి ఒక మంచి సహజ పదార్థం. నిమ్మరసంతో కలిపిన క్యారెట్ జ్యూస్ తాగడం వలన మొటిమలు, మచ్చలు లేని అందమైన ముఖాన్ని పొందవచ్చు. ఈ క్యారెట్ ని ముల్తానీ మట్టితో కలిపి ప్యాక్ లా కూడా తయారుచేసుకోవచ్చు. దీనికోసం ముల్తానీ మట్టి మరియు 3 నుండి 4 చెంచాల క్యారెట్ జ్యూస్ ని కలిపి పేస్టులా తయారు చేసి ముఖానికి పట్టించండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖం మీద మొటిమలు మరియు మచ్చలను నిర్మూలిస్తుంది.

తేనెతో ముల్తానీ మట్టి

తేనె ఒక సహజ ఉత్పత్తి, ఇది మీ చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారుచేయడానికి మీకు ఒక చెంచా ముల్తానీ మట్టి మరియు ఒకటి నుండి రెండు చెంచాల తేనె అవసరం అవుతాయి. ఈ రెండింటినీ కలిపి మీ ముఖం మీద సున్నితంగా రుద్దండి. పది నిమిషాలు ఉంచి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి.

Posted on

Telugu breast enhancement tips – టీనేజ్ అమ్మాయిల రొమ్ముల పరిమాణం పెరగాలంటే?

టీనేజ్ అమ్మాయిలు తరుచుగా తమ రొమ్ములు చిన్నవిగా ఉన్నాయని వాపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో వారి రొమ్ములు ఇంకా పరిపక్వత దశలోనే ఉంటాయి. రొమ్ముల పరిమాణాన్ని పెంచుకోవడానికి బహుళమైన కాస్మోటిక్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి అందరికి సరిపడతాయని చెప్పలేము. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవానికి చెప్పాలంటే టీనేజ్ అమ్మాయిలు వారి ఆహారం మీద దృష్టి పెట్టి వారి శరీరం సహజ పరిపక్వత చెందేవరకు వేచి ఉండటమే ఉత్తమం అని చెప్పవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం రొమ్ముల పరిమాణం మరియు ఆకారం మహిలళలో వారి వయస్సు మరియు హార్మోనుల సమతుల్యత మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అందువల్ల మీరు టీనేజర్ అయితే మరియు మీ రొమ్ములు చిన్న పరిమాణంలో ఉంటే మీరు ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు.

బరువు

మీరు బరువు పెరుగుతున్నట్లయితే మీ రొమ్ములు కూడా పెరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మీ రొమ్ములు చాలా నెమ్మదిగా పెరుగుతున్నట్లయితే మీ డాక్టరుని సంప్రదించి హార్మోనుల స్థాయిలను తనిఖీ చేయించుకోండి. కొన్ని వ్యాయామాలు చేయడం వలన రొమ్ముల పరిమాణంలో వేగవంతమైన మార్పుని చూడవచ్చు. బరువు పెరగడానికి వేరుశనగలు, జున్ను, వెన్న, పెరుగు, అవకాడోలు మరికొన్ని ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలను తీసుకోండి. అంతే కాకుండా జిమ్ కు వెళ్ళడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అక్కడ మీ సూచనదారులు సరియైన వ్యాయామాలను సిఫార్సు చేసి మీకు సహాయం చేస్తారు.

రొమ్ముల పెరుగుదలకు ఛాతి మీద ఒత్తిడి

డంబుల్స్ ఉపయోగించి గానీ లేదా రెండు వైపులా ఏవైనా సమాన భారాలను ఉపయోగించి వాటిని ఎత్తడం ద్వారా ఛాతి మీద ఒత్తిడి కలిగించవచ్చు. ఒక చాప మీద నిటారుగా నిల్చుని మీ మోకాలిని వంచి రెండు వైపులా సమాన బరువు ఉండేలా చూసుకొని నెమ్మదిగా మీ భుజాల ఎత్తు వరకు ఎత్తండి. మళ్లీ యధాస్థానానికి నెమ్మదిగా దించండి. ఇలా ఒక రోజుకి 10 నుండి 15 సార్లు చేస్తూ ఉండడం వలన సులభంగా మార్పుని గమనించగలుగుతారు.

ఛాతి విసరడం

అధిక శ్రమ లేకుండా మీ ఇంటి వద్దనే సులభంగా ఛాతిని విసరడం వంటి వ్యాయామ ప్రక్రియను చేయవచ్చు. ఒక కుర్చీలో కూర్చొని రెండు సమాన భారాలను తీసుకొని మీ చేతులను ఆధారాలతో మీ భుజాల ఎత్తు వరకు నిటారుగా వచ్చినట్లు పైకి లేపండి. తరువాత నెమ్మదిగా ప్రారంభ స్థానానికి దించండి. కిందకి దించే సమయంలో మీ చేతులు దిగువ శరీరానికి ఎదురెదురుగా నిటారుగా ఉండేలా చూసుకోవడం గుర్తుంచుకోండి. ఈ వ్యాయామాన్ని రోజుకు 12 సార్లు మూడు సెట్స్ చొప్పున చేస్తూ ఉండండి. రాత్రి సమయాల్లో బ్రాలను ధరించకండి.

పుష్ అప్ చేయండి

ప్రతిరోజు ఈ వ్యాయామం చేయడం ద్వారా మీకు పుషప్ బ్రా అవసరం ఉండదు. పుష్ అప్స్ రొమ్ములు విస్తరించడానికి మరియు వాటి పరిమాణాన్ని పెంచుకోవడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా మంచి శారీరక ఆకృతిని మరియు శక్తిని కూడా పొందవచ్చు.

ఎసెన్షియల్ ఆయిల్స్ తో రొమ్ములకు మర్దన

రోజువారీగా ఒక పద్ధతి ప్రకారం ఎసెన్షియల్ ఆయిల్స్ తో రొమ్ములను మర్ధనా చేయడం ద్వారా వాటి పరిమాణాన్ని పెంచుకోవడం మరియు వాటిని విస్తరింపజేయవచ్చని శాస్త్రీయంగా రుజువైంది. ఇలా చేయడం వలన రొమ్ముల్లోని రక్త ప్రసరణ అభివృద్ధి చెంది కణజాలం ఉత్పత్తి జరుగుతుంది.ఇందు కొరకు ఆలివ్ ఆయిల్, ఆవనూనె, గెరానియన్ ఆయిల్ మొదలైనవి ఈ మర్దనాలకు సమర్థవంతమైనవి అని చెప్పబడ్డాయి.

వక్షోజాల పరిమాణం పెరుగుదలకు తీసుకోవలసిన ఆహారాలు

కాయధాన్యాలు

రొమ్ముల పరిమాణం సహజ మార్గంలో పెంచుకోవడానికి ప్రోటీన్లను కలిగి ఉన్న ఆహార పదార్థాలు ముఖ్యంగా పరిగణించాల్సినవిగా చెప్పబడ్డాయి. మీ ఆహార పదార్ధాలలో కాయధాన్యాలను తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. మీరు పప్పులను కాయధాన్యాలు తోపాటుగా ఉడికించి తీసుకోవచ్చు. ఇలా ప్రతిరోజూ తీసుకోవడం వలన మీరు సహజ మార్గంలో సులభంగా రొమ్ములను పెంచుకోవచ్చు.

టోఫు

రొమ్ము కండరాలను పంపు చేయడానికి ఇది ఒక అద్భుతమైన ఆహార పదార్థంగా చెప్పబడింది. మీరు ఒక వేళ మీ ఆహార పదార్థాలలో ప్రోటీన్లను తీసుకోలేక పోతున్నట్లు అయితే మీరు టోఫు ని ట్రై చేసి మీ రొమ్ము కండరాలపై శ్రద్ధ ఉంచండి. మీరు మంచి ఆకారం గల రొమ్ములను మంచి పరిమాణంతో పొందుతారు.

రొమ్ములు పెరుగుదలకు విడిచిపెట్టాల్సిన ఆహారాలు

రొమ్ము కణాలను అభివృద్ధి చేయడానికి ఎలాగైతే కొన్ని ఆహార పదార్ధాలు నిర్దేశించబడ్డాయో అలాగే కొన్ని ఆహార పదార్ధాలు రొమ్ముల పెరుగుదలను అడ్డుకునేందుకు ప్రేరేపిస్తాయి. కాబట్టి, మీరు ఒకవేళ టీనేజ్ అమ్మాయి అయితే మరియు మీరు సంపూర్ణ పరిమాణానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు అయితే మీరు కింది పేర్కొన్న కొన్ని ఆహార పదార్ధాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

చక్కెర మరియు కార్బోహైడ్రేటులు

చక్కెర మరియు కార్బోహైడ్రేట్లు మన రోజువారీ ఆహారంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. వాస్తవానికి ప్రతి రుచికరమైన వంటకంలో చక్కెరలు ఎంతో కొంత ఉంటాయి. ఒక సరియైన ఆహారంలో కార్బోహైడ్రేట్లతో పాటుగా కావాల్సిన పరిమాణంలో మాత్రమే చెక్కెర ఉండటం మంచిది. అదనపు కార్బోహైడ్రేట్లు మరియు చక్కెరలు తీసుకోవడం వలన తీవ్రంగా రొమ్ము పరిమాణాన్ని పెరగకుండా అడ్డగిస్తుంది. ఈ ఆహార పదార్థాలు శరీరంలోని టెస్టోస్టిరాన్ హార్మోనులను ప్రేరేపించి వాటి ఉత్పత్తిని పెంచడం వలన ఈస్ట్రోజన్ హార్మోన్ బ్లాకులు ఏర్పడతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ స్త్రీలలో రొమ్ము పరిమాణం పెంచడానికి బాధ్యత కలిగిన ఒక హార్మోన్.

కెఫిన్

మనమంతా క్రమం తప్పకుండా కాఫీల రూపంలో విరివిగా కెఫిన్ ను తీసుకుంటూ ఉంటాం. మీరు మీ వక్షోజాల పరిమాణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్లయితే, కెఫిన్ తీసుకునే ముందు కాస్త ఆలోచించండి. మీ శరీరంలోని పోషకాలను పీల్చుకోవడం వలన రొమ్ముల పెరుగుదలకు అంతరాయం కలుగుతుంది. అంతేకాకుండా ఈస్ట్రోజెన్ హార్మోన్ యొక్క ఉత్పత్తికి కూడా అడ్డుకట్ట వేస్తుంది. కాబట్టి, కెఫిన్ వినియోగం రొమ్ము పరిమాణం పెంచుకోవాలనుకునే వారికి అంత యోగ్యకరమైనది కాదు.

కృత్రిమ సంరక్షిత మాంసపు ఉత్పత్తులు

ప్రస్తుతం అధిక మంది ప్రజలు త్వరిత మార్గములో మాంసపు ఉత్పత్తులను పెంచుకోవడానికి వాటి మీద హార్మోనులను ప్రయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా బాయిలర్ కోళ్ళు మరియు ఇతర కుత్రిమ సంరక్షిత మాంసపు ఆహార ఉత్పత్తులు మీద వివిధ రకాలైన హార్మోన్ ఇంజెక్షన్లను ప్రయోగించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. అటువంటి మాంసపు ఆహార పదార్ధాలను తీసుకోవడం వలన ఆ హార్మోనులు నేరుగా శరీరంలోకి ప్రవేశించి హార్మోనుల అసమతుల్యతను కలిగిస్తాయి.

టీనేజ్ అమ్మాయిలలో వారి శరీరం పరిపక్వత దశలో ఉండటం వలన హార్మోనుల సమతుల్యత అనేది వారి రొమ్ముల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి హార్మోనుల సమతుల్యతకు భంగం కలిగించేటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం వలన రొమ్ముల పెరుగుదలలో కనిపించే ప్రతికూలతలను చాలా వరకు దూరం చేయవచ్చు.

బొప్పాయి రసం మరియు పాలు

వివిధ పరిశోధనలను అనుసరించి బొప్పాయి రసం మరియు పాలు మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వలన రొమ్ములు పరిమాణం పెంచుకోవడంలో అద్భుతంగా సహాయం చేస్తాయి. బొప్పాయి మరియు పాలు వక్షోజాల పరిమాణాన్ని అభివృద్ధి చేసే విటమిన్లు మరియు ఖనిజాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. మీకు బొప్పాయి రసం తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే బొప్పాయిని అయినా తినవచ్చు. బొప్పాయి మరియు పాలు లాగానే బనానా మిల్క్ షేక్ కూడా మీ రొమ్ము పరిమాణం పెంచుకోవడానికి బాగా సహకరిస్తుంది.

గర్భనిరోధక మాత్రలు

నిజం చెప్పాలంటే, ఇది మీ స్తన పరిమాణం పెంచుకోవడానికి అంత సురక్షితమైన పద్ధతి కాదు. క్రమం తప్పకుండా గర్భనిరోధక మాత్రలు వినియోగం ఎన్నో ప్రతికూల ప్రభావాలను కలిగించవచ్చు. అయితే, ఎవరైతే తప్పనిసరి పరిస్థితులలో వక్షోజాల పరిమాణాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అందుచేత ఇది దాటవేయలేదు.

చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి

ఇది మీరు నమ్మినా నమ్మక పోయినా సరే, చెడు అలవాట్లు కూడా మీ రొమ్ముల పరిమాణానికి అవరోధాలను ఏర్పరుస్తాయి. ఉదాహరణకు పొగ త్రాగడం వలన రొమ్ములు పెరుగుదల నిలిపివేయబడుతుంది. అలాగే మద్యపానం అలవాటు ఉన్నట్లయితే రొమ్ములు వదులుగా మారి సాగుతాయి. అది ఒక్కోసారి రొమ్ము క్యాన్సర్లకు కూడా దారితీస్తుంది. అదే కాకుండా ఎక్కువగా కాఫీ తాగే అలవాటు, మరీ ఎక్కువ పని ఒత్తిడి తీసుకోవడం, ఎక్కువగా పనిచేయడం మరియు గురకపెట్టి నిద్రపోవడం వంటి అలవాట్లు కూడా రొమ్ము పరిమాణం కుంచుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఇటువంటి అలవాట్లు ఉన్నట్లయితే, వెంటనే వీటికి దూరంగా ఉండండి.

రొమ్ములు పరిమాణం పెంచుకోవడానికి చిట్కాలు

 • తరచుగా రొమ్ములను మర్దన చేయండి. ఇది మీ రొమ్ముల పరిమాణం పెరగడానికి మరియు ఆకర్షణీయమైన రూపాన్ని పొందడానికి సహాయం చేస్తుంది
 • టి, కాఫీ, ఆల్కహాల్ వంటి సాఫ్ట్ డ్రింక్స్ వినియోగానికి దూరంగా ఉండండి.
 • జంక్ ఫుడ్ లను తినవద్దు. ఇది రొమ్ముల పెరుగుదలకు అంతరాయం కలిగిస్తుంది.
 • మంచి నీటిని పుష్కలంగా తాగండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
Posted on

Besan face packs for glowing skin in Telugu – మెరిసే చర్మం కోసం ఫేస్ ప్యాక్స్

శనగ పిండి మీ చర్మాన్ని సులభంగా శుభ్రపరచి మృదువుగా మార్చుకునేందుకు ఒక అద్భుతమైన గృహోపకరణం అని చెప్పవచ్చు. శనగ పిండితో చేసిన ఫేస్ ప్యాక్ ను మీ ముఖం మీద అప్లై చేసినపుడు మీ ముఖములో ప్రకాశవంతమైన వెలుగును గమనించవచ్చు. మీరు పొడి చర్మం లేదా జిడ్డు చర్మం కలిగి ఉన్నా, దానిని సరైన పద్ధతిలో నిర్వహించుకోకపోతే సహజమైన సౌందర్యాన్ని కోల్పోతారు. శనగ పిండి వివిధ రకాల ప్రయోజనాలను కలిగి ఉంది. చర్మ చికిత్సలో శనగ పిండిని ఉengపయోగించడం కొత్త పధ్ధతి ఏమీ కాదు. మన పెద్దలు ముఖ్యంగా పూర్వీకులు వారి చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి ఈ శనగ పిండిని ఉపయోగించేవారు.

మీ చర్మపు రకాన్ని బట్టి ఈ క్రింద చెప్పిన వివిధ ఫేస్ ప్యాక్ ల గురించి తెలుసుకోండి.

ప్రకాశవంతమైన చర్మం కోసం ఇంటి నివారణలు

అరటి పండు మరియు శనగ పిండి

3-4 ముగ్గిన అరటి పళ్ళు మరియు 2 టీ స్పూన్ల శనగ పిండిని తీసుకోండి.  ఆ రెండింటినీ కాస్త పాలు లేదా రోజ్ వాటర్ తో కలిపి ఒక పేస్టులా తయారు చేయండి. తరువాత ఈ పేస్టుని ఒక గ్రైండర్ లో వేసి దానికి 2 టేబుల్ స్పూన్ల శనగ పిండిని జోడించి మిక్సీ పట్టండి. అప్పుడు ఆ పేస్టుని ముఖానికి రాసుకుని 15 నిమిషాలు ఉంచుకోండి. ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

గుడ్డు తెల్లసొన మరియు శనగ పిండి

ఒక గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగ పిండి, 1 గుడ్డు తెల్లసొన వేసి కలపండి. దానిలో అర చెంచా తేనె వేసి మరలా బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి.  

గ్రీన్ టీ మరియు శనగ పిండి

ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని గ్రీన్ టీ బాగ్ ని వేయండి. గ్రీన్ టీ నుండి వచ్చే కషాయాన్ని చల్లార్చండి. ఇప్పుడు అందులో కొంత శనగ పిండి వేసి కలపండి. ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటూ ఉంచుకోండి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోండి. ఇది వాడిన తరువాత కొద్ది రోజులలోనే మీరు మార్పుని గమనిస్తారు.  

వేప మరియు శనగ పిండి

ఒక గిన్నెలో కాస్త వేప పొడి, కాస్త శనగ పిండిని తీసుకుని రోజ్ వాటర్ వేసి వాటిని బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి. ఈ ప్యాక్ వేసుకున్న తరువాత మీరు మీ చర్మం మీద మృదుత్వాన్ని గమనిస్తారు.  

బంగాళదుంప మరియు శనగ పిండి

కొన్ని బంగాళదుంపలు తీసుకుని వాటిని గ్రేట్ చేసి దాని నుండి వచ్చే రసాన్ని సేకరించండి. ఇప్పుడు అందులో శనగ పిండి మరియు నిమ్మ రసం వేసి ప్యాక్ లా చేసుకోండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరి వెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి. ఈ ప్యాక్ ఉపయోగించటం వలన కొద్ది వారాల లోనే మీరు మార్పుని గమనిస్తారు.

శనగ పిండి ఉబ్టన్

ఒక గిన్నె తీసుకుని అందులో కాస్త శనగ పిండి, తాజా మీగడ, పచ్చి పాలు, తేనె మరియు పసుపు వేసి కలపండి. ఈ పదార్ధాలు అన్నిటితో ఉబ్టన్ అనే ఒక సంప్రదాయకమైన ఫేస్ ప్యాక్ తయారవుతుంది. దీనిని రోజూ రాసుకోవడం వలన మెరిసే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20-30 నిమిషాల పాటూ ఉంచి ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది.

బొప్పాయి, శనగ పిండి మరియు నారింజ రసం

శనగ పిండి, బొప్పాయి మరియు నారింజ రసం యొక్క కలయిక సమాన చర్మ ఛాయని కలిగి ఉండేలా ఉపయోగపడుతుంది. ఒక బొప్పాయి తీసుకుని దాని తొక్క తీసి గుజ్జులా చేసి పక్కన పెట్టండి. దానికి సుమారు రెండు టేబుల్ స్పూన్ల నారింజ రసం మరియు ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి వేసి బాగా కలపండి. అయితే, ఆ మిశ్రమం మరీ చిక్కగా కాకుండా ఉండేలా చూసుకోండి.

ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకుని 30 నిమిషాల పాటూ ఉంచుకోండి. అది ఆరిన తరువాత ముఖాన్ని శుభ్రపరుచుకోండి. ఈ ప్యాక్ మీ చర్మం మీద పేరుకుపోయిన ట్యాన్ ని తొలగించి మీ ముఖాన్ని కాంతివంతంగా మరియు సమాన మేని ఛాయ కలిగి ఉండేలా చేస్తుంది.

శనగ పిండి మరియు కలబంద

శనగ పిండి మరియు కలబంద తో చేసిన ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా తేమగా ఉంచుతుంది. ఇందుకోసం ఒక టమాటా తీసుకుని గుజ్జులా చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు మరియు 1 టేబుల్ స్పూన్ శనగ పిండి వేసి బాగా కలపండి. ఆ ప్యాక్ ని ముఖానికి రాసుకుని 30 నిమిషాల పాటూ ఉంచి గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వలన ముఖం మీద మచ్చలు, సూర్యరశ్మి కి కందిపోయిన చర్మం మరియు పిగ్మెన్టేషన్ వంటివి తొలగిపోతాయి.

శనగ పిండి, రోజ్ వాటర్ మరియు ఫుల్లర్స్ ఎర్త్ (ముల్తాని మిట్టి)

ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మిట్టి, 2 టేబుల్ స్పూన్ల శనగ పిండి మరియు రోజ్ వాటర్ తీసుకుని పేస్టులా కలపండి. ఈ మిశ్రమం మరీ చిక్కగా లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ని మీ ముఖానికి పట్టించి సరిగ్గా 40 నిముషాలు ఉంచుకోండి. ఆరిన తరువాత వలయాకారంలో రబ్ చేస్తూ గోరు వెచ్చని నీటితో కడిగేసుకోండి. ఇలా వలయాకారంలో మసాజ్ చేస్తూ ఫేస్ ప్యాక్ ని కడుగుతున్నప్పుడు మీ ముఖ చర్మం మీద పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్ మరియు మురికి వంటివి తొలగించబడతాయి. ఈ ఫేస్ ప్యాక్ ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేసుకోవాలి.  

జిడ్డు చర్మానికి శనగ పిండితో ప్యాక్

శనగ పిండి చర్మపు రంధ్రాలలో పేరుకుపోయిన అధిక జిడ్డుని తొలగించే లక్షణాన్ని కలిగి ఉంది. కాబట్టి ఇది వివిధ రకాల ఫేస్ ప్యాక్ లలో ఉపయోగించబడుతుంది.

కావలసిన పదార్ధాలు మరియు తయారు చేయు విధానం

 • రెండు టేబుల్ స్పూన్ల శనగ పిండి
 • కొన్ని చుక్కల రోజ్ వాటర్

రోజ్ వాటర్ ని శనగ పిండిలో వేసి ప్యాక్ లాగా తాయారు చేయండి, దానిని మీ ముఖానికి మరియు మెడకి రాసుకోండి. 15 నిమిషాలు ఉంచుకుని ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి. మీకు కావాలి అనుకుంటే ఆ పేస్టులో పెరుగుని కూడా కలుపుకోవచ్చు. ఈ సులభమైన ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని శుభ్రపరచి తాజా అనుభూతిని ఇస్తుంది.

పొడి చర్మానికి శనగ పిండితో ప్యాక్

శనగ పిండితో ఇంటి వద్దనే అందుబాటులో ఉండే సులభమైన పదార్ధాలను ఉపయోగించి జిడ్డు చర్మాన్ని మాత్రమే కాకుండా పొడి చర్మాన్ని కూడా చికిత్స చేయవచ్చు.

కావలసిన పదార్ధాలు మరియు తయారు చేయు విధానం

 • ఒక టేబుల్ స్పూన్ పాలు
 • ఒక టేబుల్ స్పూన్ తేనె
 • అర టేబుల్ స్పూన్ పసుపు

శనగ పిండి, పాలు, తేనె మరియు పసుపుని తీసుకుని పేస్టులా కలపండి. ఈ ప్యాక్ ని ముఖానికి రాసుకుని 15 నిమిషాలు ఉంచి మామూలు నీటితో కడిగేసుకోండి. ఈ మిశ్రమం లో మోయిశ్చరైజర్ లా పనిచేసే తేనె మరియు పాలు ఉండటం వలన పొడి చర్మం ఉన్న వారికి ఒక అద్భుతమైన ప్యాక్ అని చెప్పవచ్చు.  ఈ ఫేస్ ప్యాక్ ని రోజూ ఉపయోగిస్తే చర్మం పొడిబారకుండా ఉండి మృదువుగా మరియు కాంతివంతంగా మారుతుంది.

మొటిమల చర్మానికి శనగ పిండితో ప్యాక్

శనగ పిండి మొటిమలను సహజంగా తొలగించడానికి పోరాడుతుంది. మీరు మొటిమలతో బాధపడుతున్నట్లైతే మొటిమలు నివారణా శనగ పిండి మాస్క్ ని ఉపయోగించవచ్చు. ఈ పేస్టుని తయారు చేయు విధానం క్రింద ఇవ్వబడినది.

కావలసిన పదార్ధాలు మరియు తయారు చేయు విధానం

 • రెండు టేబుల్ స్పూన్ల శనగ పిండి
 • ఒక టేబుల్ స్పూన్ తేనె
 • ఒక టేబుల్ స్పూన్ చందనం పొడి
 • కొన్ని చుక్కల రోజ్ వాటర్
 • చిటికెడు పసుపు

పైన చెప్పిన పదార్ధాలు అన్నీ ఒక గిన్నెలో తీసుకుని పేస్టులా కలపండి. ఈ ప్యాక్ ని వేసుకునే ముందు ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకుని అప్పుడు రాసుకోండి. 15 నిమిషాల పాటూ ఉంచుకుని ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోండి. మొటిమల బారి నుండి బయట పడటానికి ఈ ప్యాక్ ని తరచుగా ఉపయోగించండి. ఈ ప్యాక్ ని వారానికి కనీసం మూడు సార్లు వాడండి.    

మచ్చలు మరియు తెరిచివున్న రంధ్రాలకు శనగ పిండితో ప్యాక్

మహిళలలో వయసు పెరిగే కొద్దీ మచ్చలు మరియు తెరిచివున్న రంధ్రాలు సర్వసాధారణ సమస్యలు. ఇవి మీ చర్మాన్ని నిస్తేజంగా మార్చడం వలన వయసు పైబడిన వారిలా కనపడతారు. కాబట్టి మచ్చలు మరియు రంధ్రాల సమస్య నివారణకు ఈ క్రింది ఉన్న ప్యాక్ ని ఉపయోగించండి.  

కావలసిన పదార్ధాలు మరియు తయారు చేయు విధానం

 • మూడు టేబుల్ స్పూన్ల శనగ పిండి
 • మూడు టేబుల్ స్పూన్ల కీరదోస పేస్టు

శనగ పిండిని కీరదోస గుజ్జు తో కలిపి పేస్టులా తయారు చేయండి. దీనిని ఒక ఫేస్ మాస్క్ లా వేసుకుని 20 నిమిషాలు ఉంచుకోండి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుని కాటన్ వస్త్రం తో తుడుచుకోండి. ఈ ప్యాక్ ని తరచుగా వాడుతూ ఉండండి. ఇది మీ ముఖంలో రంధ్రాలను మూసుకునేలా చేసి క్రమంగా మొటిమలను కూడా తొలగిస్తుంది.

సూర్యరశ్మి కి నిస్తేజంగా మారిన చర్మానికి శనగ పిండితో ప్యాక్

ఎక్కువ సేపు సూర్యరశ్మి లో ఉండేవారికి ఈ ట్యానింగ్ సమస్య ఎదురవుతుంది. ఫేస్ వాష్ వాడి బయటకి వెళ్ళినప్పటికీ కూడా ఈ సమస్యకు లోనవుతారు. శనగ పిండి ఇందుకు చక్కగా ఉపయోగపడుతుందని రుజువయ్యింది. ఈ గృహ చిట్కా ఉపయోగించి మీ నిస్తేజమైన చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోండి.  

కావలసిన పదార్ధాలు మరియు తయారు చేయు విధానం

 • రెండు టేబుల్ స్పూన్ల శనగ పిండి
 • చిటికెడు పసుపు
 • 4-5 చుక్కల రోజ్ వాటర్
 • కొన్ని చుక్కలు నిమ్మరసం

పైన చెప్పిన పదార్ధాలను ఒక గిన్నెలో తీసుకుని పేస్టులా తయారుచేసి ముఖానికి మరియు మెడకి రాసుకోండి. 20 నిమిషాల పాటూ ఉంచి గోరు వెచ్చని నీటితో కడిగేసుకోండి. ఈ ప్యాక్ ట్యానింగ్ ని తొలగించడమే కాకుండా చర్మాన్ని తెలుపుగా మారుస్తుంది.   

ఇలా వివిధ రకాల పదార్ధాలతో ఇంటి వద్దనే శనగ పిండిని మన సౌందర్యం కోసం కొన్ని పద్ధతులలో ఉపయోగించవచ్చు. ఇది సహజ సిద్ధమైన పదార్ధం కనుక ఎటువంటి చెడు ప్రభావాలు కలగకుండా మన చర్మాన్ని మొటిమలు, మచ్చలు, ట్యానింగ్, జిడ్డు చర్మం, పొడి చర్మం వంటి అన్ని రకాల సమస్యలకు చక్కగా పనిచేస్తుంది.

Posted on

Telugu tips for black spots on face – ముఖంపై నల్లని మచ్చలు పోవాలంటే?

మీరు సహజ మార్గంలో నల్లని మచ్చలను తొలగించుకోవాలి అనుకుంటున్నారా? తెల్లని ఛాయ కలిగిన స్త్రీల అందమైన మొహంలో నల్ల మచ్చలు చాలా స్పష్టంగా ఇబ్బందికరంగా కనిపిస్తాయి. అయితే ముఖం మీద కనిపించే ఈ నల్లని మచ్చలు మీద ప్రభావంతంగా పనిచేసే ఎన్నో రకాల కాస్మొటిక్ ఉత్పత్తులు సులభంగా నేడు లభిస్తున్నాయి. కానీ చాలామంది మార్కెట్ లో లభించే ఈ క్రీములని అధిక మొత్తంలో ఉపయోంచడం వలన చర్మ సమస్యలు ఏర్పడి ఎంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి మీరు కొన్ని గృహ నివారణలు పాటించడం వలన ఎంతో సులభంగా ముఖం మీద నల్లని మచ్చలను తొలగించడానికి చికిత్స చేయవచ్చు. చర్మపు పొరల మీదగా నల్ల మచ్చల వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. కొంతమంది చర్మములో అదనపు మెలానిన్ స్రావాలను కలిగి ఉండటం వలన, మరి కొందరు సూర్య రశ్మిలో ఎక్కువసేపు గడపడం వలన చర్మం ప్రభావితం కాబడినప్పుడు ఇదే సమస్యని పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ ముఖం మీద నల్లని మచ్చలను తొలగించడానికి గొప్ప సహజమైన చిట్కాలను అందిస్తున్నాం. గర్భం దాల్చిన స్త్రీలు అలాగే కొన్ని ప్రత్యేకమైన మందులు వాడుతున్న ప్రజలు కూడా చర్మం మీదగా నల్లని మచ్చలు ఏర్పడి ఇబ్బంది పడుతూ ఉంటారు.

ముఖం మీద నల్లని మచ్చల చికిత్సకు అద్భుతమైన గృహ చిట్కాలు

నిమ్మకాయ మరియు తేనెలతో ఫేస్ ప్యాక్

సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయ పుష్కలమైన విటమిన్ సి మూలకాలను కలిగి తేనెతో అది కలిసినప్పుడు ముఖ చర్మం మీద మొటిమలు, మచ్చలు, కురుపులు వంటి అన్ని రకాల సమస్యలకు అద్భుతమైన నివారిణిగా పనిచేస్తుంది. దీనికోసం మీరు కొన్ని తాజా నిమ్మ చెక్కలను గ్రైండ్ చేసి దానికి ఒక చెంచా తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి రాసుకోండి. దానిని కాసేపు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో కడిగేసుకోండి. ఈ చిట్కాని రోజు తప్పించి రోజు అనుసరించండి.

వేప ఫేస్ ప్యాక్

పురాతన ఆయుర్వేదం వేప యొక్క చర్మ సంరక్షిత అద్భుత లక్షణాలను విశదీకరిస్తుంది. వేప ఆకులు ముఖం మీద మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను అధిగమించడానికి ఎంతో గొప్ప ఉపకరణాలు అని చెప్పవచ్చు. దీనికోసం చేతి నిండా తాజా వేప ఆకులని తీసుకుని దానికి చూర్ణం ఏర్పడడానికి సరిపడా రోజ్ వాటర్ కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి ఒక 15 నిముషాలపాటు ఆరనివ్వాలి. ప్యాక్ పూర్తిగా ఎండిన తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోండి.

కలబంద మరియు మజ్జిగ ఫేస్ ప్యాక్

కలబంద అద్భుతమైన శోథ నిరోధక మరియు క్రిమినాశక మూలికగా పేరుగాంచింది. మజ్జిక చర్మానికి సంభందించిన ఎన్నో లాభాలను తీసుకువస్తుంది. దీనికి మీకు కావాల్సింది ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ , కొన్ని చుక్కల రోజ్ వాటర్, మరియు కలబంద గుజ్జులను కలిపి ఒక చూర్ణంగా తయారు చేసుకోండి. ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకుని దానిని పూర్తిగా రానివ్వండి. తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకోండి.

వేప మరియు పసుపుల ఫేస్ ప్యాక్

పసుపు పొడి మరియు వేప ల మిశ్రమంతో ముఖం మీద మచ్చలు, మొటిమలు వంటి సమస్యలకు మరొక అందమైన నివారిణి అని చెప్పవచ్చు. చేతి నిండా సరిపడే వేప ఆకులను గ్రైండ్ చేసిన తర్వాత దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ లేదా బదులుగా కలబంద గుజ్జుని మరియు ఒక టీ స్పూన్ పసుపు పొడిని కలిపి ఆ ప్యాక్ ని మీ ముఖానికి రాసుకోండి.పూర్తిగా ఆరనిచ్చిన తర్వాత నీళ్లతో శుభ్రపరుచుకోండి. ఈ చిట్కాని వారంలో 2/3 సార్లు అప్లై చేయండి.

కీర దోసకాయ మరియు రోజ్ వాటర్ ప్యాక్

కొన్ని దోస ముక్కలని గ్రైండ్ చేయండి మరియు చూర్ణం కోసం దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ ని కలపండి. ఆ చూర్ణాన్ని ముఖమంతా రాసుకోండి. దానిని బాగా ఆరనివ్వండి. బాగా ఎండిన తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోండి. మీరు ప్రతీ రోజు ఈ చిట్కాని అనుసరించినట్లయితే మీ ముఖంలో కనిపించే చూడముచ్చట మార్పులకు ఎంతగానో సంతోషపడతారు.

మొటిమల మచ్చలకు బొప్పాయి చికిత్స

తొక్క తీసిన బొప్పాయిని తీసుకోండి. దానిని ముక్కలుగా కోయండి. అప్పుడు బొప్పాయిని ఒక చూర్ణం లాగ చేయండి. ఆ చూర్ణాన్ని మీ ముఖానికి రాసుకుని 10-15 నిముషాలపాటు ఆరనివ్వండి. తర్వాత నీళ్లతో కడిగేసుకోండి. బొప్పాయి పాపెయిన్ అనే ఎంజైమ్ ను కలిగి ఉంటుంది. ఇది ముఖం మీద నల్లని మచ్చలను సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది.

నిమ్మ రసం

నిమ్మరసం తీసుకుని నల్లని మచ్చల మీద అప్లై చేయండి. నిమ్మరసం లో ఉండే విటమిన్ సి నల్లని మచ్చలను రంగు మార్చి చర్మం మీద మలినాలను తొలగిస్తుంది. ఒక కాటన్ బంతిని నిమ్మరసంలో ముంచి దానిని నల్ల మచ్చలు కలిగిన ప్రదేశంలో మృదువుగా రుద్దండి. ఒకవేళ మీరు సున్నితమైన చర్మ స్వభావులు అయితే నిమ్మరసానికి కొన్ని నీళ్లు జోడించి ఫలితాలను పొందేవరకు ఉపయోగించండి.

నల్లని మచ్చల నుండి ఉపశమనానికి గంధపు ఫేస్ ప్యాక్

ఒక గంధపు చెక్కను తీసుకుని దాన్ని చూర్ణంగాచేసి మీ ముఖానికి రాయండి. గంధం కూడా ముఖం మీద నల్లని మచ్చలను మరియు మొటిమలను నివారించే లక్షణాలను కలిగి ఉంది.

మొటిమలు మరియు మచ్చలకు కలబంద

కలబంద గుజ్జు నల్లని మచ్చలను తగ్గించే అతి ముఖ్యమైన వాటిలో కలబంద గుజ్జు ప్రధానమైనది. కలబంద గుజ్జుని తీసుకుని నల్ల మచ్చల మీద పూయండి. 20 నిముషాల తర్వాత నీళ్లతో కడిగేసుకోండి.

విటమిన్ ఇ

నల్లని మచ్చలు మరియు మొటిమల మచ్చలు విటమిన్ల లోపం వలన ఏర్పడతాయి. ప్రధాన ప్రత్యక్ష నివారణగా విటమిన్ ఇ మాత్రలను తీసుకోండి. ఆల్మండ్ ఆయిల్ వంటి విటమిన్ ఇ ఆయిల్స్ మొదలైన వాటిని అప్లై చేయండి. అలాగే మీ ఆహారంలో విటమిన్ ఇ ఉండేలా చూసుకోండి.

నల్లని మచ్చల చికిత్సకు పాలు

ఒక కప్పులో పాలను తీసుకోండి. ఒక కాటన్ బాల్ తీసుకుంది అందులో ముంచండి. అప్పుడు కాటన్ బాల్ ను నల్లని మచ్చల ప్రాంతంలో వృత్తాకారంగా రుద్దండి. ప్రతీ రోజు ప్రతీ రోజు 5 నిముషాలపాటు అనుకున్న ఫలితాన్ని పొందేవరకు ఇలా చేయండి. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ ముఖ భాగంలో చర్మ పొరల్ని శుభ్రం చేసి నల్లని మచ్చలేని మీరు చర్మపు రంగులోకి మారుస్తుంది.

ముఖంపై నల్ల మచ్చలు కొరకు బంగాళాదుంపలు

మీరు సహజ మార్గంలో నల్ల మచ్చలు తొలగించుకోవాలని ఆశిస్తున్నట్లయితే అప్పుడు ఒక బంగాళా దుంపని తీసుకుని చక్రాల వలె కోయండి. ఆ చక్రాలను రిఫ్రిజిరేటర్ లో 2-3 గంటల పాటు ఉంచండి. తర్వాత ఈ చక్రాలను తీసుకుని నల్ల మచ్చలమీద రుద్దండి. 5 నిముషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. మరొక మార్గంలో బంగాళా దుంపని చూర్ణం లా చేసి దానికి తేనె కలిపి ఈ చూర్ణాన్ని ఫేస్ మాస్కులాగా అప్లై చేసుకోండి.

ముఖం మీద నల్ల మచ్చల చికిత్సకు ఆముదం

ఒక కప్పులో తాజా ఆముదం నూనెను తీసుకోండి. ఒక కాటన్ బాల్ తీసుకుని అందులో ముంచండి. అప్పుడు కాటన్ బాల్ ను నల్లని మచ్చల ప్రాంతంలో వృత్తాకారంగా రుద్దండి. ఆముదంలో ఉండే ఆమ్లజనక, శోథ నిరోధక లక్షణాలు ముఖ భాగంలో నల్ల మచ్చల్ని తొలగిస్తాయి.

ముఖంలో నల్లని చర్మ భాగాల కొరకు ఉల్లి రసం

మీరు నల్లని మచ్చల నుండి ఉపశమనం పొందాలని చూస్తున్నారా? అయితే ఉల్లిపాయల్ని తీసుకుని బాగా గ్రైండ్ చేయండి. ఆ మిశ్రమాన్ని తీసుకుని ఒక కాటన్ గుడ్డలో వేసి ఒక కప్పులోకి దాని రసాన్ని పిండండి. ఇప్పుడు ఒక కాటన్ బాల్ ను ఆ రసంలో ముంచి నేరుగా నల్లని మచ్చల మీద రాయండి. 5 నిముషాలపాటు వదిలేసి గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోండి.

పైన పేర్కొన్న నివారణోపాయాలు మీరు సహజ పద్దతిలో గృహ చిట్కాలుగా మీ ముఖం మీద నల్లని మచ్చల నివారణకు సహాయపడతాయి. ఒకవేళ మీరు 100% సంపూర్ణ ఫలితాలు పొందలేనట్లయితే 100% ఫలితాలను పొందేందుకు దగ్గరలోని డెర్మటాలజిస్ట్ ను సంప్రదించగలరు.

Posted on

Breast enhancement tips in Telugu – వక్షోజాల పరిమాణం పెరగాలంటే..

మీ స్నేహితుల నడుమ మీ రొమ్ముల పరిమాణం చిన్నదిగా ఉన్నందుకు దిగులు పడుతున్నారా? మీరు మీ శరీర ఆకృతిలో స్త్రీత్వం లోపంచినట్లుగా భావించి కాస్మోటిక్ రొమ్ము విస్తరణ ప్రక్రియలను ఎంచుకోవలసి వస్తుందని భయపడుతూ ఉన్నారా? పైన పేర్కొన్న ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే ఆహారం మరియు వ్యాయామాలతో సులభంగా మీ రొమ్ముల పరిమాణాన్ని పెంచుకునే మార్గాలకోసం మీరు ఈ శీర్షికని చదవండి.

సంపూర్ణమైన రొమ్ములు మీ పూర్తి రూపానికి నిండుతనంతో పాటుగా మానసిక స్థైర్యాన్ని మరియు వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తాయి. చిన్న రొమ్ములు కలిగిన స్త్రీలు తమ మీద తమకి విశ్వాస లోపంతో వారి వారి నైపుణ్య రంగాలలో వెనుకబడుతూ ఉంటారు.

మీరు ధృడంగా మీ రొమ్ముల పరిమాణాన్ని పెంచుకోవాలని కాంక్షిస్తున్నవారు అయితే రొమ్ముల పరిమాణాన్ని పెంచుకునే మాత్రలు వంటివి ఖచ్చితంగా మీకు దుష్పభావాలని కలిగించే అవకాశం ఉంది. అంతే కాకుండా నేడు ఎన్నో రకాల రొమ్ము విస్తరణ క్రీములు మార్కెట్ లో లభిస్తున్నాయి. వాటితో రొమ్ములను మసాజ్ చేయడం వలన రొమ్ములు సంపూర్ణంగా విస్తరించి బిగుతుగా ఉండవచ్చు. కానీ అటువంటి ఉత్పత్తులలో వాస్తవంగా మీకు పని చేసేది ఎదో చెప్పడం కష్టం. సహజ పద్దతిలో రొమ్ముల పరిమాణం పెంచుకునే మార్గం ఉత్తమమైనదని చెప్పవచ్చు. సరైన వ్యాయామంతో పాటు మంచి ఆహారం తీసుకోవడం వలన మరింత పుష్కలమైన రూపాన్ని పొందవచ్చు. అయితే దీని ప్రభావం వ్యక్తికీ వ్యక్తికీ మద్య వేరుగా ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తిగా సహజ పద్దతిలో ఎటువంటి దుష్పభావాలు లేకుండా మీ జీవన విధానాలలో చిన్న చిన్న ఆరోగ్య కరమైన మార్పులతో సులభంగా మీరు కోరుకున్న ఫలితాలను పొందగలగ వచ్చు. కాబట్టి అమ్మాయిలూ, పూర్తిగా చదివి మీరు కోరుకున్న ఫలితాలని త్వరలోనే పొందుతారని ఆశిస్తున్నాం.

సహజమైన రొమ్ము విస్తరణ కోసం ఆహారాలు

సంపూర్ణ వక్షోజాల కోసం ఆహారం

ప్రధాన కారణంగా స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోను లోపించడం వలన తరుచుగా రొమ్ములలో పెరుగుదల లోపిస్తూ ఉంటుంది. ఈస్ట్రోజెన్ అనేది స్త్రీ హార్మోను, అది స్త్రీలలో ఋతు క్రమాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి మీరు చిన్న రొమ్ములను కలిగి ఉన్నట్లయితే మీ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి తక్కువగా ఉన్నట్లు. దీనికోసం మీరు ఈస్ట్రోజెన్ స్థాయిని ప్రేరేపించే కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా అవి సహజంగా మీ శరీరంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా మీ రొమ్ములు అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి. ఇక్కడ సంపూర్ణ రొమ్ములను ప్రోత్సహించే కొన్ని ఆహార పదార్ధాల జాబితా ఇవ్వబడింది.

పాల ఉత్పత్తులు

మీరు మీ రొమ్ముల పరిమాణం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీ రోజూ వారి ఆహారంలో మరిన్ని పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవడం వలన ఎంతో మెరుగైన ఫలితాలని పొందుతారు.

సోయా ఉత్పత్తులు

అమ్మాయిలు తమ రొమ్ములను పెంచుకోవడానికి మంచి ఆహార పదార్ధాల కోసం చూస్తున్నట్లయితే సోయా ఉత్పత్తుల మీద సులభంగా ఆధారపడవచ్చు. సోయా ఉత్పత్తులు అధిక మొత్తంలో ప్రోటీన్లను కలిగి ఉండటమే కాకుండా అందులో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు శరీరాన్ని సాధారణ హార్మోనుల సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడతాయి.

పెద్ద రొమ్ముల కోసం సముద్రపు ఆహారాలు

సముద్రపు ఆహారాలలో ఉండే అధికమైన పోషకాలు మీ స్తనాల పరిమాణం మరింత పెంచడంలో సహాయపడతాయి. రొయ్యలు, సముద్రపు చేపలు, సముద్ర కలుపు మొక్కలు, ఆలుచిప్పలు మొదలైనవన్నీ అధిక కేలరీల ప్రోటీన్లను సమృద్దిగా కలిగి ఉండి సహజమైన గొప్ప మాంగనీసు వనురులగా ఉంటున్నాయి. మాంగనీసు శరీరంలో హార్మోనులను సమతుల్యం చేయడంలో కీలకపాత్ర పోషించే ఒక ముఖ్య ఖనిజము. మీ ఆహారంలో మరిన్ని సముద్రపు ఆహారపదార్ధాలు జతచేస్తే అది స్త్రీ లలో రొమ్ముల పెరుగుదలకు కీలకమైన మరింత ఈస్ట్రోజెన్ హార్మోను ఉత్పత్తికి ఎంతగానో సహాయపడుతుంది.

ఆకు కూరలు

ఆకుకూరలు మీ శరీరానికి ఎంతో ఆరోగ్య వంతమైనవి. పాలకూర, ఆల్ఫల్పా వంటివి అనామ్లజనకాలు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి మరియు శరీరంలో సాధారణ హార్మోన్ల సంతులనాన్ని ప్రోత్సహిస్తాయి. అందువలన మరిన్ని ఆకు కూరలను మీ ఆహారంలో భాగం చేయడం వలన క్రమంగా మీ పూర్తి ఆరోగ్యం అనుకూలంగా మారుతుంది. తద్వారా మీ రొమ్ములు కూడా పుష్టిగా ఉంటాయి.

భారీ వక్షోజాల కోసం విత్తనాలు

అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, సోంపు గింజలు మరియు గుమ్మడికాయ విత్తనాలు మొదలైన అన్నిరకాల విత్తనాలు రొమ్ము కణాల పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి. గింజలు శరీరంలోని ఈస్ట్రోజెన్ యొక్క సహజమైన ఉత్పత్తిని పెంచే ఫైటోఈస్ట్రోజెన్ ను కలిగి ఉంటాయి. మీ రోజువారి ఆహారంలో వివిధ రకాలైన విత్తనాలను చేర్చడం వలన మీరు భారీ స్తనాలను పొందడమే కాకుండా ఆరోగ్యకరమైన శరీరాన్ని కూడా పొందుతారు.

పెద్ద స్తన పరిమాణం కొరకు మెంతులు

మెంతులులలో ఉన్న అధిక ఫైటోఈస్ట్రోజెన్ మూలకాలు శరీరంలో లోపించిన ఈస్ట్రోజెన్ హార్మోనును నింపడానికి సహాయం చేస్తాయి. మెంతులు రొమ్ములలోని క్షీర గ్రంధులను అభివృద్ధి చేయడంలో అత్యధికంగా సహాయపడతాయి.

సహజమైన రొమ్ము విస్తరణ కొరకు గింజలు

బాదం, జీడి పప్పు, పిస్తా మరియు అక్రోటులు మీ రొమ్ము కణాలను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులను మరియు ప్రోటీన్లను అందించడంలో గొప్ప వనరులుగా చెప్పవచ్చు. అవి మీ రొమ్ము పరిమాణాన్ని సహజంగా పెంచడంలో సహకరిస్తాయి.

పెద్ద రొమ్ములు పొందడానికి పండ్లు

స్ట్రా బెర్రీ, పుచ్చకాయ, మేడి పండ్లు మొదలైన పండ్లు ఫైటోఈస్ట్రోజెన్ లతో పూరించబడి ఉంటాయి. అవి రొమ్ము కణాల అభివృద్దికి మీకు సహకరిస్తాయి. ఆపిళ్ళు, చెర్రీ పండ్లు మరియు రేగి పండ్లలో ఉండే ఈస్ట్రోజెన్ సహజంగా మీ రొమ్ము పరిమాణాన్ని విస్తరింపజేయడానికి ప్రోత్సహిస్తాయి. అందువల్ల మరిన్ని ఎక్కువ పండ్లను తీసుకోవడం ద్వార క్రమంగా మీరు కోరుకున్న లక్ష్యానికి చేరగలుగుతారు.

వక్షోజాల సహజ పెరుగుదలకు వ్యాయామాలు

పైన పేర్కొన్న ఆహారాలతో పాటుగా కొన్ని నిర్దిష్ట వ్యాయామాలను మిళితం చేసినపుడు ఫలితాలు మరింత ఉన్నతంగా ఉంటాయి. అటువంటి కొన్ని అద్భుతమైన వ్యాయామాలను సులభంగా మీ స్తన సంపదను అభివృద్ధి చేసుకోవడానికి మీకు ఇక్కడ అందించడం జరిగింది. ఈ వ్యాయామాలు మీ ఛాతి కండరాలతో పాటు ప్రస్తుతం మీ రొమ్ములలో ఉన్న కొవ్వు కణజాలాలను దృడంగా నిర్మించి రొమ్ములను పుష్టిగా మరియు నిండుగా కనిపించేలా చేస్తాయి.

పుష్ అప్స్

Push ups

ఏ ఉపకరణాల సహాయం లేకుండా మీరు మీ ఇంటిలోనే చేయగల సాధారణ, సాంప్రదాయ పుష్ అప్లు మీ వక్షోజాల యొక్క పరిమాణం మరియు ఆకారానికి అద్భుతాలు జోడించగలవని మీకు తెలియకపోవచ్చు. మీ అర చేతులను భుజములకు సమంగా నేలకు ఆన్చండి. మీ బరువుని మీ చేతులు మరియు కాలి వేళ్ళ మీదగా కింది చిత్రంలో వలె ఉంచండి. ఇప్పుడు మీ మోచేతులని వంచుతూ మీ శరీరాన్ని నేల వైపుకు వంచండి. నేలను తాకకుండా వీలైనంత దగ్గరకు వెళ్ళండి. తర్వాత మళ్ళీ చేతులను నిటారుగా వచ్చేలాగ పైకి లేవండి. మీరు 3 సెట్ లతో ప్రారంభించి తర్వాత మీరు వెళ్ళగలిగే వరకు పెంచండి.

పైకెత్తబడిన పుష్ అప్స్

Elevated push ups

ఛాతి కండరాలకు ఒత్తిడి కలిగించడం ద్వార త్వరితంగా పెద్ద స్తనాలను మీరు పొందగలుగుతారు. ఈ వ్యాయామానికి మీరు తక్కువ ఎత్తుగల టేబుల్ లేదా ఒక కుర్చీ సహాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మీ అర చేతులని మీ భుజాలకు సమానంగా నేలకు ఆన్చండి. తరువాత మీ పాదాలను ఎత్తుకొరకు అమర్చిన కుర్చీ లేదా టేబుల్ మీదకు సమతలంగా ఉంచండి. ఇప్పుడు మీ ఎగువ శరీరాన్ని మీ మోచేతులని వంచడం ద్వార నేల వైపుకు వాలండి. కొన్ని నిముషాలపాటు ఆ సస్థితిలో నిలిచి ఉండి మరల ప్రారంభ స్థితికి రండి. ఇలా 3 సెట్స్ తో వ్యాయామాన్ని ప్రారంబించండి.

గోడకు పుష్ అప్స్

Wall push ups

గోడకు పుష్ అప్స్ చేయడం ప్రారంభీకులకి చాల సులభమైన వ్యాయామం. ఇది మీరు శారీరకంగా ధృడంగా లేకపోయినప్పటికీ సులభంగా చేయగలిగే వ్యాయామం. దీనికోసం గోడకు ఎదురుగా అర చేతుల దూరంలో నిటారుగా నిలబడండి. ఇప్పుడు మీ అర చేతులను భుజాలకి సమానంగా గోడపై ఆన్చండి. తర్వాత మీ మోచేతులను వంచుతూ మీ పాదాలు స్థిరంగా ఉంచి మీ శరీర బరువు మీ చేతుల మీద ఉండేలా గోడవైపుకి వాలండి.కొన్ని నిముషాలపాటు ఆ స్థితిలో నిలిచి ఉండి ప్రారంభ స్థితికి వచ్చేయండి. ఇలా 5 సెట్స్ తో ప్రారంభించండి

Posted on

Telugu tips for long hair – జుట్టు పెరగడానికి చిట్కాలు

ప్రతీ మహిళ పొడవాటి, అందమైన కురులు కావాలని కోరుకుంటుంది. కానీ ఈ రోజుల్లో కొన్ని రకాల జుట్టు సంబంధిత సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడం అనేది ఒక సాధారణ విషయంగా మారిపోయింది, అలాగే జుట్టు పూర్తిగా పెరగకుండా ఆగిపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. ఇటువంటి సమస్యలను అరికట్టడానికి చాలా మంది మార్కెట్లలో దొరికే రసాయనాలు మరియు కాస్మెటిక్స్ వంటివి వాడి మరింత బాధకు గురవుతున్నారు. కానీ సహజ సిద్ధమైన చిట్కాలతో ఇంట్లోనే మనము ఈ జుట్టు రాలే సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు.

పొడవాటి, జారువాలే జుట్టు కావాలనే కోరిక మీలో ఉంటే, అప్పుడు మీరు చేయవలసినదల్లా జుట్టుకి మంచి పోషణ కలిపించడమే. అందమైన కురుల కోసం ఆహార అలవాట్లను మార్చుకోవడమే కాకుండా బాహ్యంగా కూడా కొంత రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పొడవాటి, ధృడమైన కురులను పొందడానికి కొన్ని గృహ చిట్కాలు ఇలా ఉన్నాయి.

జుట్టు పొడవుగా పెరుగుటకు సహజ గృహ చిట్కాలు

త్వరిత జుట్టు పెరుగుదలకు ఆవాల పొడితో హెయిర్ ప్యాక్

ఒక టేబుల్ స్పూన్ ఆవాల పొడికి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, ఒక గుడ్డు, కొన్ని చుక్కల నీటిని జోడించి బాగా కలపండి. ఆ పేస్టుని ముఖ్యంగా మీ తల పై భాగ చర్మానికి అలాగే మీ జుట్టు మొత్తానికి పట్టించండి. ఒక షవర్ కేప్ పెట్టుకుని 20 నుండి 30 నిముషాల వరకు ఉంచండి. తరువాత తేలికపాటి షాంపూతో జుట్టుని బాగా శుభ్రపరుచుకోండి. ఆవాలు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది కనుక ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది.

జుట్టు రాలే సమస్యను నివారించుటకు ఆముదము

జుట్టు పెరుగుదలకు ఆముదము ఒక మంచి ఎంపిక. ఆముదం నూనెని జుట్టుకి బాగా పట్టించి రాత్రంతా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రం చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్యని ఆపవచ్చు. ఆముదం నూనెని మరొక పద్ధతిలో కూడా వాడవచ్చు. బాదం నూనెలో ఆముదం నూనెని కలిపి మాడుకి బాగా మసాజ్ చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్యే కాకుండా పల్చని జుట్టు, బట్ట తల వంటి సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది.

మృదువైన కురులకి మెంతులు

మెంతులని ఉపయోగించి మీ జుట్టు పరిమానముని పెంచుకోండి. రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు వాటిని మెత్తని పేస్టులా తయారు చేసుకోండి. మీ మాడుకి మరియు జుట్టుకి ఈ పేస్టుని పట్టించి 30 నుండి 40 నిముషాల వరకు ఉంచండి. తరువాత తేలికపాటి షాంపూతో జుట్టుని బాగా శుభ్రం చేసుకోండి. ఇదే పద్ధతిని నెలల వారీగా వారానికి రెండు సార్లు ఉపయోగించడం వలన జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు. ఇలా చేయడం వలన కురులు మెరుస్తూ మృదువుగా మారుతాయి.

విటమిన్లతో జుట్టు పరిమాణము పెంచడం ఎలా?

జుట్టుకి బాహ్యంగా హెయిర్ ప్యాక్ లు, మసాజ్ లు వంటివి చేయడంతో పాటుగా అంతర్గతంగా కూడా కొన్ని జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యం. తీసుకునే ఆహారంలో విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉండేలా చూసుకోవాలి. ఇవి మన జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడతాయి.

పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు, కేరెట్లు మరియు పెరుగు వంటివి మీ రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఎక్కువగా నూనె పదార్ధాలతో చేసిన ఆహారానికి దూరంగా ఉండండి. ఆహారపు నిర్వహణ చూడటానికి సులువుగా ఉంటుంది. కానీ దానిని పధ్ధతి ప్రకారం పాటించి ఆచరణలో పెడితేనే మంచి ఫలితాలను ఇస్తుంది.

A, C మరియు E విటమిన్లు ఉండే ఆహార పదార్ధాలు తీసుకుంటే కురులు మృదువుగా, జారువాలేలా పెరుగుతాయి. ఫోలిక్ ఆసిడ్ మరియు బయోటిన్ మాత్రలను తీసుకుంటే జుట్టు స్ట్రెయిట్ గా ఉంటుంది. కానీ మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మరియు మీ జుట్టుకు వాడే మందులను గురుంచి ముందుగా మీ డాక్టర్ ను సంప్రదించి సలహాలు తీసుకోండి.

జుట్టు పెరుగుదలకు లోతైన కండీషనింగ్

జుట్టుకి మంచి పోషణ కలిపించడానికి బోల్డన్ని చిట్కాలు ఉన్నాయి. మీ జుట్టుకి పోషణ అందించడానికి ఆలివ్ నూనె, గుడ్డు, తేనె వంటివి వాడి చూడండి. జుట్టుకి కండీషనింగ్ చేయడం వలన మీరు ఆరోగ్యవంతమైన, పొడవాటి, మెరిసే జుట్టుని పొందుతారు.

జుట్టు రాలే సమస్యకు కొబ్బరి నూనె చికిత్స

పలు రకాల జుట్టు సమస్యలకు కొబ్బరి నూనె ఒక అద్భుతమైన సహజ గృహ చికిత్సగా ఎప్పటి నుండో పేరుగాంచింది. మీ జుట్టు పెరుగుదల చాలా తక్కువగా ఉంటే, సహజంగా పొందిన కొబ్బరి నూనెతో మాడుకి మరియు మొత్తం కురులకి బాగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకునే ముందు కొబ్బరి నూనెని కాసేపు వేడి చేసి రాసుకుంటే మరింత అద్భుతంగా పనిచేస్తుంది. మీ చేతి వ్రేళ్ళను ఉపయోగించి మీ జుట్టు పై భాగానికి కొబ్బరి నూనెతో బాగా మసాజ్ చేసుకోండి.

జుట్టు పెరుగుదలకు కురులను ముందుకు వాల్చటం

కొన్ని ఆరోగ్యకరమైన కార్యకలాపాలు కూడా జుట్టు పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. వాటిలో ఒక పధ్ధతి కురులను ముందుకు వాల్చడం. ఇలా చేయడం వలన తల పై భాగ చర్మం మీద రక్తప్రసరణ పెరుగుతుంది. తద్వారా జుట్టు చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. కనుక రోజులో 2 నుండి 3 సార్లు ఇలా జుట్టుని ముందుకి వాల్చి కనీసం 30 సెకనులు అలా ఉంచి తిరిగి జుట్టుని వెనక్కి వేయండి.

జుట్టు పరిమాణము పెంచడానికి గుడ్డు

గుడ్డు ప్రోటీన్లను కలిగి ఉంటుంది. అది మీ జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడుతుంది. ముఖంగా గుడ్డులోని పచ్చ సొన జుట్టు పెరుగుదలకు మరియు దాని పోషకానికి చాలా అవసరం. ఇందుకోసం ఒక గుడ్డుని తీసుకుని పగలగొట్టి ఒక గిన్నెలో తీసుకోండి.  దానికి ఒక చెంచా ఆలివ్ నూనె మరియు సగం చెక్క నిమ్మరసాన్ని జోడించండి. ఇప్పుడు వాటిని బాగా కలిపి మీ జుట్టుకి, మాడుకి పట్టించండి. జుట్టు ఆరెంతవరకూ కాసేపు ఉంచి అప్పుడు చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. పచ్చి గుడ్డు వాడటం వలన కాస్త వాసన రావొచ్చు అందుకని తేలికపాటి షాంపూని ఉపయోగించి జుట్టుని శుభ్రం చేసుకోండి.

Posted on

జుట్టు రాలే సమస్య కు చిట్కాలు – Hair fall control tips

జుట్టు రాలడం అనేది నేడు మనం ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య. దీని పట్ల ఎంతోమంది  నిరాశగా ఉన్నారు.  దువ్వెన ఉపయోగించిన ప్రతీసారీ జుట్టు చాలా మొత్తంలో రాలిపోతూ ఉంటుంది. ఇది నిజంగా ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఈ ధోరణి పురుషుల్లో బట్టతల రావడానికి ముందస్తు చిహ్నంగా చెప్పవచ్చు. నేడు ఈ సమస్య ఒక ప్రత్యేక వయస్సు వారికి మాత్రమే పరిమితమైనది కాదు. వయస్సుతో నిమిత్తం లేకుండా 15 సం. నుండి 50 సం . వరకు ప్రతి ఒక్కరూ చిన్న పెద్దా తారతమ్యాలు లేకుండా ఎదుర్కొంటున్న సమస్యగా మారింది.  మీరు తల స్నానం చేసి వచ్చాక రాలిన మీ జుట్టు స్నానపు గదిలోని నీటి గ్రిల్ చుట్టూ చేరి నీరు అక్కడ స్థంభించిపోవడం చూస్తుంటారు. అదే సమయంలో మీ జుట్టుని ఆరబెట్టడానికి ఉపయోగించే తువ్వాలు మీద ఎంతో జుట్టు రాలి మీకు కనిపిస్తుంది.

జుట్టు రాలటాన్ని నిరోధించడానికి చిట్కాలు

 • మీ జుట్టు విషయంలో మీరు మరింత సాధు స్వభావాన్ని కలిగి ఉండాలి. జుట్టుని ఎంతో సున్నితంగా చూసుకోవాలి. జుట్టు తడిగా ఉండేటప్పుడు దువ్వెన ఉపయోగించడం మానుకోవాలి.
 • మీ జుట్టుకి సరైన పోషకాలు అందించడానికి మీ జుట్టు పైభాగ చర్మం మీద రోజువారీగా  కొంతసేపు మృదువుగా మసాజ్ చేయడం మంచిది.  పైభాగ చర్మం మర్దన చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపరచబడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు కనిపించేటట్లు సహకరిస్తుంది.
 • మీ జుట్టుని స్టైలిష్ గా కనిపించేందుకు దాన్ని బిగుతుగా పట్టి ఉంచేలా చేసే విధానాలకు స్వస్తి చెప్పాలి. ఇది మీ జట్టులోని ప్రతి వెంట్రుక మీద ఎంతో ఒత్తిడిని కలిగిస్తుంది. తద్వారా జుట్టు కుదుళ్ళు పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి.
 • ప్రస్తుత  ప్రజలు తమ జుట్టు స్టైలిష్ గా కనిపించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.  మీరు బాగా కనిపించడానికి  మరియు  సరికొత్తగా మిమ్మల్ని చూపించకోవడానికి ఒక మంచి హెయిర్ స్టైల్ పొందడం అనేది ఎంతో అవసరంగా మారింది. కాబట్టి మీరు ఇంటికి తిరిగి రాగానే మీ జుట్టు నుండి కాస్మొటిక్స్ మరియు వివిధ రకాల జెల్స్ ని తొలగించి నూనె మర్దన ద్వారా తప్పని సరిగా సరైన పోషణలు సమకూర్చాలి. సాధ్యమైనంత వరకు మీ జుట్టుకు తక్కువ ఉష్ణ చికిత్స అందించడం మంచిది.
 • వాతావరణం బయట చాలా చల్లగా ఉన్నప్పటికీ కూడా వేడి నీటితో జుట్టుని తడపకూడదు. జుట్టు రాలిపోవడానికి ఇది మరొక కారణం అవ్వొచ్చు. వేడి నీటి వలన మీ జుట్టు త్వరగా పొడిబారిపోయే అవకాశం ఉంది. తద్వారా మీ జుట్టు కుదుళ్ళు పగిలిపోయి జుట్టు రాలే సమస్యకు దారితీస్తుంది.

జుట్టు రాలే సమస్యను తగ్గించుకొనుటకు గృహ చిట్కాలు

కొబ్బరి పాలు

కొబ్బరి గుజ్జు నుండి సహజంగా సేకరించిన పాలు జుట్టు రాలే సమస్యను నియంత్రించడంలో చాలా గొప్పగా పనిచేస్తుంది. కొబ్బరి పాలు జుట్టుకి పోషణ అందించడంలో సహాయపడుతుంది. కొబ్బరి గుజ్జుని ముక్కలుగా కోసి బాగా మిక్సీ పట్టండి. ఆ ధ్రవాన్ని ఒక మెత్తటి వస్త్రంలో వేసి బాగా పిండి దాని నుండి కొబ్బరి పాలని సేకరించండి. ఇప్పుడు ఆ కొబ్బరి పాలని కుదుళ్ళకి పట్టించి బాగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వలన జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు.

వేప చికిత్స

వేప మొక్క మీ చర్మానికే కాదు జుట్టుకి కూడా మంచిగా పనిచేస్తుంది. ఇది క్రిమినాశకరం మరియు వైరస్ అలాగే బ్యాక్టీరియా ప్రభావాలను నిర్మూలిస్తుంది. కొన్ని తాజా వేప ఆకులను తీసుకుని వాటిని మంచి నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. తీసుకున్న నీటికి సగం అయ్యేంత వరకు మరగపెట్టాలి అలా నీరు పచ్చ రంగు లోకి మారుతుంది. ఇప్పుడు ఆ నీటిని చల్లార్చి మాడుకి బాగా పట్టించి మర్దనా చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఉసిరి

నిస్తేజంగా మరియు బలిహీనంగా ఉండే జుట్టుకు చికిత్స చేయటానికి మహిళలు దశాబ్దాలుగా ఉసిరిని ఉపయోగిస్తున్నారు. ఎండబెట్టిన ఉసిరిని తీసుకుని వాటిని కొబ్బరి నూనెలో మరగబెట్టాలి. ముదురు నల్ల రంగులోకి మారేంత వరకూ దానిని మరగనివ్వాలి. అప్పుడు దానిని చల్లార్చి జుట్టు కుదుళ్ళ నుండి చిగుర్ల వరకు పూర్తిగా పట్టించాలి. ఇది జుట్టు రాలే సమస్యను అరికట్టడానికి మరొక సమర్థవంతమైన చిట్కాలలో ఒకటి.

Posted on

అందం కోసం ముల్తానీ మట్టి – Telugu tips with Multani Matti

అందమైన చర్మం పొందడం కోసం అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. అందానికి ముల్తానీ మట్టి ఎలా ఉపయోగపడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముల్తానీ మట్టిలో అద్భుతమైన లక్షణములు ఉన్నవి. దీనిలో ఖనిజాలు ఎక్కువగా ఉండటం వలన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది చర్మంలోని గరుకుతనాన్ని పోగొట్టి చర్మాన్ని మృధువుగా చేస్తుంది. ముల్తానీ మట్టి చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి కొత్త చర్మ కణాలను ఉత్తేజ పరుస్తుంది.

పురాతన కాలం నుంచి ముల్తానీ మట్టి సహజంగా మొటిమలను తగ్గించుటకు ఉపయోగిస్తున్నారు. ముల్తానీ మట్టి చర్మ రకములన్నింటికి ఉపయోగపడుతుంది. దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

కాంతివంతమైన చర్మం కోసం

 • 2-3 స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, దోసకాయ గుజ్జు మరియు 2-3 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడగాలి.
 • 2 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి, ½ టేబుల్ స్పూన్స్ గంధపు పొడి మరియు చిటికెడు పసుపు తీసుకుని అన్నింటిని బాగా కలిపి, మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్ర పరచాలి. ఇది ఆయిలీ మరియు పొడి చర్మాలకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
 • ముల్తానీ మట్టి, తేనే, పసుపుతో చేసిన ప్యాక్ మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.

పొడి మరియు ఆయిలీ చర్మం కోసం

 • 2-3 స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 స్పూన్ నిమ్మరసం మరియు చిటికెడు పసుపు తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత చల్లని లేక గోరువెచ్చని నీటితో కడగాలి.

చర్మంలో మార్పు కోసం

 • 2-3 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి మరియు 2 టేబుల్ స్పూన్స్ బంగాళదుంప గుజ్జు తీసుకుని బాగా కలపాలి. మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకి అప్లై చేసి, 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.

ఆయిలీ చర్మం కోసం

 • 2-3 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ టమాటో గుజ్జు, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక టేబుల్ స్పూన్ తేనే తీసుకుని పేస్టులా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకి పట్టించి, 20 నిమిషముల తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయండి.

సన్ టాన్ని తొలగించుటకు

 • 2-3 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి, 1 ½ టేబుల్ స్పూన్ కొబ్బరి నీరు మరియు ¼ టేబుల్ స్పూన్ పంచదార తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకి ప్యాక్ వేసుకుని, 15 నిమిషముల తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి.

పొడి చర్మం కోసం

 • 2 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్స్ పాల పొడి, ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, ఒక టేబుల్ స్పూన్ గుడ్డులోని తెల్ల పొర, ఒక టేబుల్ స్పూన్స్ పెరుగు మరియు ఒక టేబుల్ స్పూన్ తేనే తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి.
 • ముల్తానీ మట్టి మరియు బాదం యొక్క పేస్ ప్యాక్ చర్మాన్ని నునుపుగా చేస్తుంది. పాలల్లో ముల్తానీ మట్టి మరియు బాదం కలిపి ప్యాక్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

కొవ్వు చర్మాన్ని తగ్గించుట

 • 2-3 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి మరియు ఒక టేబుల్ స్పూన్ గుడ్డులోని తెల్ల పొర కలిపి పేస్టులా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మొటిమలు వాటి మచ్చలకు

 • 2 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి. మీరు ఊహించని అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.
 • నెల రోజులలో ముల్తానీ మట్టి , రోజ్ వాటర్, బంగాళదుంపతో చేసిన పేస్ ప్యాక్ చర్మాన్ని మచ్చ లేకుండా చేస్తుంది. మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత చల్లని మరియు గోరు వెచ్చని నీటితో కడగాలి.

ఆయిలీ చర్మం మరియు మొటిమలు

 • 2 టేబుల్ స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ వేప పొడి, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని అన్నింటిని బాగా కలిపి పేస్టులాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 30 నిమిషముల తరువాత నీటితో శుభ్రం చేసుకుంటే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. అంతే కాకుండా బాక్టీరియాను దగ్గరకు రానివ్వకుండా చేస్తుంది.

ప్రకాశవంతమైన చర్మం కోసం

 • ముల్తానీ మట్టి మరియు తేనే యొక్క పేస్ ప్యాక్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ముల్తానీ మట్టి, తేనే మరియు రోజ్ వాటర్ తీసుకుని అన్నింటిని బాగా కలిపి, మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

వర్ణక చర్మం కోసం

 • ముల్తానీ మట్టి, క్యారెట్ గుజ్జు మరియు ఆలివ్ ఆయిల్ తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 30 నిమిషముల తరువాత నీటితో వాష్ చేయండి.

టోన్డ్ మరియు ఆయిలీ చర్మం కోసం

 • సమాన మోతాదులో పాలు, ముల్తానీ మట్టి, గంధపు పొడి తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

నల్లని మచ్చల కోసం

 • ముల్తానీ మట్టి, వేప, రోజ్ వాటర్ వాడటం వలన నల్లని మచ్చలు తొలగుతాయి. వీటితో ప్యాక్ తయారు చేసి మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి. మొటిమలతో బాధపడే వారికి ఇది ఒక మంచి చిట్కా.

టాన్ చర్మం కోసం

 • ముల్తానీ మట్టి, తేనే, శనగపిండి మరియు దోసకాయ రసం తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇది టాన్ చర్మాన్ని తొలగించుటకు వేసవిలో ఉపయోగపడుతుంది.

చర్మం స్పష్టమైన రంగుకు మారడం కోసం

 • బొప్పాయి, ముల్తానీ మట్టి, 2 విటమిన్-ఇ టాబ్లెట్స్ తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే మీ చర్మం రంగు మారిందో అక్కడ అప్లై చేసి 20 నిమిషముల తరువాత నీటితో కడగాలి.
Posted on

ఒతైన నల్ల జుట్టు పొందుటకు చిట్కాలు – Telugu tips to get black hair naturally

చాల మంది మహిళలకు నల్లని వొతైన జుట్టు అంటే చాల ఇష్టం. కొన్ని సహజమైన చిట్కాలను పాటించడం వలన మీరు మళ్ళి నల్లని జుట్టుని పొందవచ్చు. ఇంటి చిట్కాల వలన చిన్నతనంలో వచ్చే తెల్లని జుట్టుని నివారించి చాల వొతైన బలమైన జుట్టుని పొందవచ్చు. బయట మార్కెట్లో లభించే హెయిర్ బ్లాక్ కలర్ ప్రొడక్ట్స్ వాడటం వలన జుట్టు బలహీనంగా తయారు అవుతుంది. అందువలన ఇంటి చిట్కాలు ఉపయోగించడం వలన మీ జుట్టు చాల వొత్తుగా నల్లగా అందంగా తయరుఅవుతుంది.

ఈ ఆధునిక జీవనంలో జుట్టు రంగు మారడం అనేది ఒక సమస్యగా మారింది. మేలనిన్ అనే ఒక వర్ణద్రవ్యం లేకపోవడం వలన జుట్టు రంగు మారడం జరుగుతుంది. అలానే జన్యు సంబంధమైన సమస్యలు, శరీరంలో కొన్ని రసాయన చర్యలు జరగడం వలన మరియు పర్యావరణ కాలుష్యం వలన కూడా జుట్టు రంగు మారడం అనేది జరుగుతుంది. అలానే ఎక్కువగా భావోధ్వేగ పరిస్తితిలో ఆందోళన, ఒత్తుడులకు గురికావడం వలన కూడా జుట్టు రంగు మారడం అనేది జరుగుతుంది. రసాయనాలతో కూడిన ఆయిల్స్ షాంపూలు వాడటం వలన కూడా జుట్టు రంగు మారుతుంది. హెర్బల్ నెచురల్ చిట్కాలను వాడటం వలన మీ జుట్టు మరింత వొత్తుగా, నల్లగా మారుతుంది. ఎటువంటి దుష్ప్రభావం లేకుండా మీ జుట్టు అందంగా కన్పిస్తుంది.

మార్కెట్లో లభించే హెయిర్ కలర్ ప్రొడక్ట్స్ వాడటం కంటే సహజ ఇంటి చిట్కాలు వాడటం వలన మీకు మంచి ఫలితం ఉంటుంది. మన వంటగదిలోనే అనేక రకాలైన పదార్ధాలు ఉన్నవి వాటి ద్వారా మీరు మంచి నల్లని, వొతైన జుట్టును పొందగలరు.

భారతీయుల జుట్టు సహజంగా నల్లగా ఉంటుంది కాని వయసు పెరిగేకొద్ది అలానే కొన్ని రకాల కారణాల వలన జుట్టు రంగు మారడం జరుగుతుంది. జుట్టు రంగు మారడం అనేది ఈ రోజుల్లో ఒక పెద్ద సమస్యగా మారింది. ఇది ఎక్కువగా మన పర్యావరణ కాలుష్యం వలన సంభవిస్తుంది. తెల్ల జుట్టు ఎక్కువగా 45-50 సంవస్సరాల వయస్సు దాటిన తరువాత మాత్రమే వస్తుంది దానికన్నా ముందు వస్తే అది ఒక సమస్యగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో ఫాషన్ పెరిగిన తరువాత చాల మంది అనేక రకాల హెయిర్ స్టైల్ మరియు హెయిర్ కలర్స్ వాడుతున్నారు. దాని ద్వారా నల్లజుట్టు తొందరగా తెల్లగా మారుతుంది. మీకు ఇదే మంచి సమయం ఇంటి చిట్కాలను వాడటం అలవాటు చేసుకోవడానికి.

నల్ల జుట్టు కోసం సహజమైన ఇంటి చిట్కాలు

 • అర లీటరు నీటిలోకి ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని మరియు నిమ్మరసాన్ని (సగం నిమ్మ ముక్క) కలపాలి. తలస్నానం చేసే ముందు ఆ నీటిని తలకు అప్లై చేయడం వలన మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.
 • 1 కేజీ నెయ్యిని తీసుకొని దానిలో 150 గ్రాముల తేనే, 1 లీటర్ ఉసిరి రసాన్ని కలిపి బాగా వేడిచేయాలి. దానిలోని నీరు అంతా ఆవిరైపోయే అంత వరుకు వేడి చేస్తూనే ఉండాలి. ఆ ద్రావణం తయారు అయిన తరువాత ఒక గాజు సీసలోకి తీసుకోవాలి. దానిని తలస్నానం చేసే ముందు తలకి రాసుకోవాలి. ఇలా చేయడం వలన మీరు మళ్ళి నల్ల జుట్టుని పొందే అవకాశం ఉంది.
 • కొన్ని మామిడి ఆకులను తీసుకొని వాటిని పేస్టుచేసి జుట్టుకి అప్లై చేసి 15-20 నిమిషముల తరువాత మంచి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన మీకు జుట్టు తొందరగా పెరుగుతుంది అలానే నల్లగా కూడా అవుతుంది.
 • కొన్ని మామిడి ఆకులను మరియు కొన్ని పచ్చిమామిడి తొక్కలను తీసుకొని కలిపి వాటిని ఆయిల్లో వేసి చాల కాలం వరకు సూర్యరశ్మి తగిలేల ఎండలో ఉంచాలి. ఆ ఆయిల్ రాసుకోవడం వలన జుట్టు రాలటాన్ని ఆపి నల్ల జుట్టు వచ్చేలా చేస్తుంది.
 • మామిడి విత్తనం యొక్క నూనెను వాడటం వలన తెల్లజుట్టు నల్లజుట్టుగా మారుతుంది. అలానే జుట్టు రాలటాన్ని ఆపి, చుండ్రు రాకుండా చేస్తుంది.

సహజమైన పద్ధతిలో నల్లజుట్టుని పొందుట

ఉసిరి మరియు గోరింటాకు పేస్టు

3 టేబుల్ స్పూన్స్ తాజా గోరింటాకు పేస్టు, 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని తీసుకొని దానిలోకి కాఫీ పొడి మరియు తగిన మోతాదులో నీటిని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని తలకి అప్లైచేసి 2 గంటలు అలానే ఉంచి ఏదైనా షాంపూతో తలని శుభ్రం చేయాలి. ఇది ఒక ఉత్తమమైన పద్ధతి.

బ్లాక్ టీ

బ్లాక్ టీ చిట్కా అనేది ఒక ఉత్తమమైన పధ్ధతి. బ్లాక్ టీ నీటిని తలకు అప్లైచేసి అరగంట తరువాత ఎటువంటి షాంపూని ఉపయోగించకుండా మంచి నీటితో కడగాలి.

బీరకాయ

ఈ చిట్కా మీకు పోయిన మేలనిన్ అనే ఒక వర్ణద్రవ్యం మళ్ళి పునరుద్ధరించడానికి తోడ్పడుతుంది. ఎండిన బీరకాయ ముక్కలను తీసుకొని దానిని కొబ్బరి నూనెలో మూడు రోజులపాటు నానపెట్టాలి. ఆ ఆయిల్ నల్లరంగు వచ్చే వరకు వేడి చేయాలి. ఈ ఆయిల్ని తలమీద మసాజ్ చేసి ఒక గంట తరువాత కడగాలి.

వేడి ఆయిల్ మసాజ్

వేడి ఆయిల్ మసాజ్ వలన నల్లజుట్టు తిరిగి పొందవచ్చు. కొబ్బరి నూనె లేక బాదం నూనె లేక ఉసిరి నూనె మొదలగునవి వీటిలో ఏదైనా నూనెను వేడి చేసి తలకు రాస్తూ వృత్తాకారంగా చేతులను తిప్పుతూ మసాజ్ చేయాలి.

నల్లజుట్టును అలానే ఉంచుకొనుటకు ప్యాక్

ఈ ప్యాక్ నెలకు రెండుసార్లు వాడటం వలన మీ జుట్టు నల్లగా మరియు కాంతివంతంగా తయారు అవుతుంది. తేమగా ఉండే గోరింటాకు, ఉసిరి పొడి మరియు తేనీరు మద్యం తీసుకొని పేస్టు తయారు చేసి రాత్రి అంతా అలానే ఉంచి ఉదయాన్నే బ్రహ్మిపొడి, బ్రింగ్రాజ్ పొడి, గుడ్డు, పెరుగు మరియు కొంచెం నిమ్మ రసాన్ని కలిపి పేస్టు తయారు చేయాలి. పేస్టుని తలకు మరియు జుట్టుకు అప్లై చేసి 30 నిమిషముల తరువాత కడగవలెను. ఇది జుట్టునల్ల రంగుని అలానే ఉంచి జుట్టు పెరగటానికి తోడ్పడుతుంది. అలానే ఎక్కువ కాంతివంతంగా చేసి చుండ్రును తగ్గిస్తుంది.

దువ్వెనను ఉపయోగించే పద్ధతి

అందమైన జుట్టును కటినంగా దువ్వకూడదు. చక్కగా దూరంగా మృదువుగా వున్న పళ్ళ దువ్వెనతో జుట్టు దువ్వుకోవాలి.

వేడికి దూరంగా ఉండుట

వేడి జుట్టుకి ఎక్కువగా తగలడం వలన జుట్టు పొడిగా తయారు అవుతుంది అందుకు వేడికి దూరంగా ఉండాలి.

జుట్టు పొడవుగా పెరుగుట

జుట్టు క్రిందభాగంలో స్ప్లిట్ ఎండ్స్ ఏర్పడతాయి వాటిని కట్ చేయడం వలన జుట్టు తొందరగా పెరుగుతుంది.

కేరాటిన్ చికిత్స

కేరాటిన్ పునరుద్ధరణ చికిత్స అనేది జుట్టులో ఉండే కేరాటిన్ లెవెల్స్ పెంచి జుట్టుని కాంతివంతంగా చేసి సహజ రంగుని ఇస్తుంది.

నల్లని మరియు వొతైన జుట్టు కోసం ఇంటి వంటలు

కరివేపాకు

మన వంటకాలలో ఎక్కువగా కరివేపాకుని ఉపయోగిస్తారు ఇది కొన్ని బయోకెమికల్ రియాక్షన్ని కలిగిఉంటుంది. దీని వలన జుట్టు మూలాల నుంచి పెరుగుతుంది. కరివేపకుని కొబ్బరి నీటిలో ఉంచి తలకు రాయడం వలన ఒక రకమైన టానిక్గా పనిచేస్తుంది.

నల్లజుట్టు కోసం బుట్టేరింగ్

ఆవుపాల వెన్నతో తెల్లజుట్టును దూరం చేయవచ్చు. ఆవు నెయ్యితో కూడా తెల్లజుట్టుని దూరం చేసి నల్లజుట్టుని పెంపొందించవచ్చు.

బ్లాక్ టీ

ఒక కుండలోకి బ్లాక్ టీని తయారుచేసి చల్లగా చేయవలెను. 15 నిమిషములపాటు బ్లాక్ టీలో జుట్టుని నానపెట్టవలెను. తరువాత నీటితో కడగాలి. ఇలా ఒక రోజులో మీ జుట్టు నల్లగా తయారయే అంత వరకు చేయవచ్చు.

మేల్లెతి మరియు నెయ్యి

1 కేజీ స్వచ్చమైన నెయ్యిని, 1 కేజీ ఉసిరి రసం మరియు 250 గ్రాముల మేల్లెతిని తీసుకొని నీరు అంతా ఆవిరి అయిపోయే వరకు వేడిచేయాలి. ఆ పేస్టుని ఒక గ్లాస్ సీసలో ఉంచి తలస్నానం చేసే ముందు రాయవలెను. ఇది చాల ఉత్తమమైన పద్ధతి బ్లాక్ హెయిర్ని పొందటానికి.

నారింజ రసం

నారింజ రసం ఆరోగ్యవంతమైన మరియు బలమైన హెయిర్ని పొందడంలో సహాయ పడుతుంది. ఉసిరి రసం జుట్టుని మందంగా మరియు నల్లరంగుని ఇవ్వడానికి సహాయ పడుతుంది. నారిజ గుజ్జుని తీసుకొని దానిలోకి ఉసిరి పొడిని కలిపి పేస్టు చేసి తలకి అప్లై చేసి 15 నిమిషముల తరువాత కడగవలెను. ఇది మీ జుట్టుకు నల్లటి రంగును ఇవ్వడానికి సహాయపడుతుంది.