Posted on

Telugu tips for menstrual pain – నెలసరి సమయంలో నొప్పి నివారణకు హోం రెమిడీస్

స్త్రీలలో ప్రతి నెల జరిగే రక్తస్రావం ని ఋతు చక్రం అని అంటారు. ఋతు చక్రాన్ని నెలసరి అని కూడా అంటారు. ఇది గర్భాశయంలోని ఎండోమెట్రియమ్ అనే లోపలి పొర ఒక నిర్దిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్తగా తయారు అవుతుంది. ఈ విధంగా విసర్జించబడిన స్రావాల్ని ఋతు స్రావం అని అంటారు.

ఈ ఋతు స్రావం సమయంలో ఏర్పడే ఇబ్బందులు ఒక వైపు, నొప్పులు మరో వైపు. వీటినే ‘పీరియడ్ క్రామ్ప్స్’ అని కూడా అంటారు. నెలసరుల సమయంలో శరీరంలో ఏర్పడే అనేక మార్పులతో పాటు నోపి కూడా ఏర్పడినట్లయితే ఎంతో బాధాకరంగా ఉంటుంది.

ఈ నొప్పిని తగ్గించేందుకు మందులు లభిస్తున్నప్పటికీ వాటిని తరచుగా వాడటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇటువంటి సమయంలో మన ఇంట్లోనే లభించే ఆహార పదార్థాలను ఉపయోగించి కొన్ని హోమ్ రెమిడీస్ ని తయారు చేసుకోవచ్చు. వాటిని ఉపయోగించటం ద్వారా నొప్పి నుండి త్వరిత ఉపశమనం పొందవచ్చు మరియు వాటి వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మరి కొన్ని హోమ్ రెమెడీస్ గురించి ఈ వ్యాసం లో తెలుసుకుందాం రండి.

రుతుస్రావం సమయంలో తిమ్మిరిని తగ్గించేందుకు సహాయపడే టాప్ సహజ నివారణలు

  1. బ్లాక్స్ట్రాప్ మొలాసిస్ : ఋతు స్రావం సమయంలో ఏర్పడే తిమ్మిరికి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. మొలాసిస్ లో మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ బి6 మరియు సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు సహాయపడుతుంది మరియు రుతుస్రావం సమయంలో తిమ్మిరి నుండి ఉపశమనం అందించడానికి గర్భాశయం యొక్క గోడలలో కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఒక కప్పు వెచ్చని పాలలో ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ మొలాసిస్ ని కలుపుకొని త్రాగితే తిమ్మిరి యొక్క నొప్పి నుండి నివారణ అందిస్తుంది. మీ అవసరాన్ని బట్టి ఈ మిశ్రమాన్ని తీసుకోండి. మాకు లాక్టోస్ అసహనంగా ఉంటే, బాదం పాలు ప్రయత్నించండి.
  2. చమోమిలే టీ : చమోమిలే టీ మీ నెలసరుల సమయంలో నొప్పికి దారితీసే సంకోచాలను తగ్గించడానికి మరియు గర్భాశయ గోడల కండరాలను సడలించడానికి సహాయపడే యాంటిస్పోస్మోడిక్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండే ఒక అద్భుతమైన పానీయం. ఒక కప్పు వేడి నీటిలో చమోమిలే టీ బ్యాగ్ వేసి 10-15 నిమిషాల వరకు కప్పుని కవర్ చేసి ఉంచండి. ఆ తరువాత బ్యాగులను తీసేసి అవసరమైతే కొంత తేనె లేదా నిమ్మరసం జోడించుకొని త్రాగండి. మీ నెలసరుల సమయంలో మరియు ఒక వారం ముందు నుంచి రోజుకు 2 కప్పుల చమోమిలే టీ త్రాగండి.
  3. పార్స్లీ : పీరియడ్స్ ని ఉత్తేజ పరచటంలో మరియు తిమ్మిరి యొక్క తీవ్రతను తగ్గించడంలో మరియు ఋతు చక్రం యొక్క అసమానతను నియంత్రించడంలో సహాయపడే మిరిస్టిసిన్ మరియు అఫియోల్ అనే పదార్థాలు పార్స్లీ లో ఉన్నాయి. తాజా పార్స్లీ ని చిన్న ముక్కలు చేసుకొని 1/4 వ కప్పు పార్స్లీ ఆకులను ఒక టీ బాగ్ లో వేయాలి. ఒక కప్పు వేడి నీటిలో ఒక బాగ్ ని 5 నిమిషాలు ఉంచండి. ఆ తరువాత కావాలంటే కొంత తేనెని చేర్చుకొని త్రాగండి. ఈ టీ ని పీరియడ్స్ సమయంలో రోజుకు రెండు సార్లు త్రాగండి. నొప్పి నుండి నివారణను అందించి శరీరం మరియు మెదడుని శాంత పరుస్తుంది.
  4. అవిసె గింజలు : మీ తిమ్మిరి యొక్క తీవ్రతను నియంత్రించడంలో అవిసె గింజలు సహాయపడుతుంది మరియు శరీరంలోని ప్రొజెస్టెరోన్ ని స్థిరీకరించడంలో ఉపయోగకరమైన అత్యవసర ఫ్యాటీ ఆసిడ్స్ కలిగి ఉంటుంది. ఈ విత్తనం మీ మొత్తం గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు సహాయపడుతుంది మరియు సంతానోత్పత్తి యొక్క అవకాశాలను పెంచుతుంది. మీరు తిమ్మిరి నుండి బాధ పడుతున్నట్లయితే, సలాడ్లు, పెరుగు, తృణధాన్యాలు లేదా స్మూతీ లో కూడా 1-2 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ చేర్చుకోవచ్చు. అవిసె గింజలను నిమ్మరసంలో కలిపి కొంత పెప్రికా జోడించి స్నాక్స్ లా కూడా తీసుకోవచ్చు.
  5. లెవెండర్ నూనె : లెవెండర్ ఆయిల్ అద్భుతమైన పరిమళం ఉన్న ఆయిల్ మాత్రమే కాదు, మానసిక ఒత్తిడి మరియు కాలానుగుణంగా వచ్చే ఆందోళనను తగ్గించేందుకు కూడా సహాయం చేస్తుంది. మీకు విశ్రాంతిని కలిగించి బాగా నిద్ర పోయేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా, లెవెండర్‌ యొక్క యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు నొప్పి-ఉపశమన లక్షణాలు కూడా గర్భాశయ కండరాలను సడలించడానికి సహాయపడతాయి. మీరు ఒక్క స్పూన్ జొజోబా లేదా కొబ్బరి నూనె తో 3-4 చుక్కల లెవెండర్‌ నూనె కలిపి ఉదరం యొక్క వెనుక బాగం మరియు క్రింద భాగంలో అప్‌లై చేయండి. ఇలా రోజుకు రెండుసార్లు రాయటం వలన మంచి ఉపశమనం పొందుతారు.
  6. గ్రీన్ టీ : గర్భాశయ తిమ్మిరిని శాంతింపజేయడానికి సహాయపడే అద్భుతమైన మెడిసిన్ గ్రీన్ టీ. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల యొక్క అద్భుతమైన మూలాలయిన ‘ఫ్లేవనాయిడ్లు’ మరియు ‘కాటెచిన్స్’ గ్రీన్ టీ లో పుష్కలంగా ఉంటుంది. ఇందులో నొప్పి నివారించడానికి సహాయపడే అనాల్జేసిక్ (నొప్పి నివారణ) మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ టీ ఆకులను వేసి 3-5 నిమిషాల పాటు బాగా ఉడికించి వడగట్టాలి. టీ వెచ్చగా అయిన తరువాత రుచి కోసం కొంత తేనె జోడించి త్రాగండి. ఇలా రోజుకు 3 లేదా 4 సార్లు త్రాగటం వలన మంచి ఉపశమనం పొందుతారు.
  7. హాట్ బ్యాగ్ ఉపయోగించండి : మీ పొత్తికడుపు మరియు నడుము వద్ద కొంచెం వేడితో కాపడం పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇలా చేస్తే కండరాలు వ్యాకోచించి శరీరానికి సులువుగా అనిపిస్తుంది. ఒక హాట్ వాటర్ బ్యాగ్ లో వేడి నీరు నింపి లేదా స్టోన్ పిల్లో తో గాని నొప్పి ఉన్న చోట కాపడం పెట్టండి. స్టోన్ పిల్లో లో చిన్నచిన్న రాళ్లు మాదిరిగా ఉంటాయి. దానితో మర్దన చేసుకుంటే నొప్పి తగ్గుతుంది.

పీరియడ్స్ సమయంలో నొప్పి నివారణ కోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

  1. మొలకలు : మొలకల్లో పోషక విలువలు, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీనులు ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్స్ పీరియడ్స్ లో నొప్పిని తగ్గిస్తాయి. ప్రోటీనులు బలహీనతను పోగొడుతుంది.
  2. సూప్స్ : చికెన్ మరియు వెజిటేబుల్ సూప్స్ పీరియడ్స్ లో నొప్పులను మరియు అలసటను తగ్గిస్తాయి. అలాగే యుట్రస్ లో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది.
  3. శక్తిని అందించే ఆహార పదార్థాలు : జీడి పప్పు, వాల్ నట్స్, డేట్స్ మొదలగు వాటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి పీరియడ్స్ సమయంలో ఇతర వ్యతిరేఖ లక్షణాలను నివారిస్తాయి.
  4. తాజా పండ్లు : ఆపిల్, ఆరెంజ్, బొప్పాయి, అరటి పండు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న ఇతర తాజా పండ్లు తినడం వల్ల యుటేరెస్ ఇన్ఫ్లమేషన్ మరియు అలసటను తగ్గుతుంది.
  5. ఆకు కూరలు, కూరగాయలు : ఆకుపచ్చగా, తాజాగా ఉండే కూరల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది ఎఫెక్టివ్ గా రుతుస్రావ నొప్పులను తగ్గిస్తుంది.
  6. పచ్చి బఠానీలు : పచ్చి బఠానీలలో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఒక చిన్న గిన్నెలో పచ్చి బఠానీల సలాడ్ తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించి, నొప్పులు, తిమ్మిరులను పోగొడుతుంది. పచ్చి బఠానీలు శక్తిని కూడా పెంచుతుంది.
  7. పాలు : రుతుక్రమ సమయంలో పాలు తాగడం చాలా మంచిది. వీటిలో ప్రోటీన్స్, క్యాల్షియం మరియు పొటాషియం అధికంగా ఉంటుంది.
  8. డార్క్ చాక్లెట్ : ప్రతి మహిళకు చాక్లెట్స్ తినడం అంటే మహా ఇష్టం. రుతుక్రమ సమయంలో మహిళలు చాక్లెట్స్ ను ఎందుకు తినాలంటే, ఇందులో మెగ్నీషియం ఉన్నందున మీ రుతుక్రమ సమయాన్ని రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది.
  9. పీచుపదార్థాలు, విటమిన్లు, ఐరన్ మరియు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. బొప్పాయి, బాదం పప్పు, గుమ్మడి విత్తనాలు, బ్రొకొలి, వాల్నట్, ఆలివ్ ఆయిల్, ఆకుకూరలు, బ్రౌన్ రైస్, అవిసె గింజలు, చేపలు మరియు కోడి మాంసంలో ఇవన్నీ ఉంటాయి. తేలికైన శాకాహారం అన్నిటి కన్నా మంచి ఎంపిక.

పీరియడ్స్ సమయంలో తీసుకోకూడని ఆహార పదార్థాలు

  1. పీరియడ్స్ సమయంలో కడుపుబ్బరం మరియు శరీరంలో నీరు నిలుపుదల చేసే ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది.
  2. కార్బనేటెడ్ పానీయాలు, కెఫీన్, కొవ్వు పదార్థాలు, అధిక ఉప్పు ఉన్న ఆహారం తీసుకోకూడదు.
  3. మద్యం సేవించక పోవడం ఉత్తమం.
  4. రక్తంలో చక్కెర స్థాయిని అధికరించే పదార్థాలు నొప్పులను ఇంకా ఎక్కువగా చేస్తుంది. కనుక వాటిని కూడా అవాయిడ్ చేయండి.
  5. ఈ సమయంలో జంక్ ఫుడ్ ని అస్సలు తినకూడదు.
Posted on

Best days to get pregnant in Telugu – సరిగ్గా నెలసరుల ముందు గర్భవతి అయ్యే అవకాశాలు ఉన్నాయా?

రుతుస్రావం ముగిసిన ఒక రోజు తరువాత గర్భవతి కావటం సాధ్యపడదు కానీ కొన్ని సందర్భాల్లో అవకాశాలు ఉన్నాయి. మీరు గర్భవతి అయ్యే అవకాశాలను మీ ఋతు చక్రం యొక్క కాల పొడవు నిర్ణయిస్తుంది.

మామూలుగా రుతుస్రావం 28 రోజులకు ఒక సారి ఏర్పడుతుంది. ఋతు చక్రం ప్రారంభించిన 14వ రోజు, మీ అండాశయాలు ఒక గుడ్డుని విడుదల చేస్తుంది మరియు ఈ గుడ్డు యొక్క అండోత్సర్గం వలన రక్తస్రావం మొదలవుతుంది. రక్తస్రావం మొదలైన రోజు నుండి ఋతు చక్రం లెక్కించబడుతుంది. మీ ఋతు చక్రం యొక్క కాలం 28 రోజులు అయితే 11 నుండి 16 రోజుల మధ్యలో అండోత్సర్గం ఏర్పడవచ్చు. ఈ మధ్య కాలంలో గుడ్డు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ గుడ్డు యొక్క పరిపక్వతను బట్టి అండోత్సర్గం జరుగుతుంది.

మీ ఋతు చక్రం 28 రోజులకు ఒకసారి జరుగుతున్నట్లయితే 14 వ రోజున అండోత్సర్గం జరుగుతుంది. ఒక వేళ మీ ఋతు చక్రం యొక్క కాలం 22 రోజులు అయితే మీ నెలసరులు ముగిసిన వెంటనే అండోత్సర్గం జరిగే అవకాశం ఉంది. ఋతు చక్రం యొక్క కాలం (22 రోజులు) తక్కువగా ఉండి రుతుస్రావం 7 రోజుల వరకూ ఉన్నట్లయితే అప్పుడు కూడా రుతుస్రావం ముగిసిన వెంటనే అండోత్సర్గం జరిగే అవకాశాలు ఉన్నాయి. పురుషుల యొక్క స్పెర్మ్ స్త్రీ యొక్క శరీరంలో 6-7 రోజుల పాటు ఆక్టివ్ గా ఉంటుంది కనుక ఆ సమయంలో గర్భం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

స్పెర్మ్ యొక్క జీవితం 2-3 రోజుల నుండి 6-7 రోజులు ఉండొచ్చు. సారవంతమైన సెర్వికల్ ఫ్లూయిడ్ తక్కువగా ఉన్నట్లయితే స్పెర్మ్ యొక్క జీవిత కాలం మరింత తక్కువ కావచ్చు. అండోత్సర్గం జరిగిన రోజు లేదా దానికి ఐదు రోజుల లోపల లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లయితే గర్భవతి కాగలరు. ఒక గుడ్డు అండోత్సర్గము జరిగిన 24 గంటలలో ఫలదీకరణం జరగినట్లయితే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది.

గర్భం ధరించే మరి కొన్ని అవకాశాల గురించి తెలుసుకుందాం

  1. స్త్రీలలో అండోత్సర్గం ప్రక్రియ జరుగుతున్న సమయం ముగిసి, గర్భాశయంలో ఆరోగ్యవంతమైన అండం ఉండి ఉన్నట్లయితే గర్భం ధరించే అవకాశాలు ఎక్కువ.
  2. పురుషుడు ఉత్పత్తి చేసే శుక్రకణం ఆరోగ్యవంతమైనదై ఉండి, యోని ముఖద్వారం నుండి గర్భాశయం వరకు ప్రయాణం చేసే సామర్థ్యం కలిగి ఉన్నట్లయితే గర్భం ధరించగలరు.
  3. పురుషుని వీర్యంలో ఉండే కొన్ని కోట్ల శుక్రకణాలు, ఫెలోపియన్ ట్యూబ్యుల్స్ ద్వారా అండాశయం వరకు ప్రయాణించే సామర్ధ్యం కలిగి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో అంగ ప్రవేశం జరగనప్పటికీ, గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఇందుకు కారణం లైంగిక సంబంధం కలిగి ఉన్న సమయంలో చేసే కొన్ని చేష్టలు. ఇందు వలన కూడా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. పురుషులలో ఉత్పత్తి అయ్యే శుక్రకణంకు, స్త్రీ యొక్క ప్రత్యుపత్తి వ్యవస్థ గుండా ప్రయాణం చేసి, అండాన్ని ఫలదీకరించే అసామాన్యమైన శక్తి ఉంటుంది.
  4. శుక్రకణంకు ఉన్న ఇంకొక విశిష్టత ఏమిటంటే, ఇది అనుకూల పరిస్థితులలో, ఐదు రోజుల వరకు జీవించి ఉంటుంది. కనుక యోని పరిసరాల్లో ఎక్కడ స్కలించినా, శరీరం యొక్క ఉష్ణోగ్రత వలన శుక్రకణం జీవించి ఉండి అండం వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ విధంగా కూడా ప్రెగ్నెంట్ కావచ్చు.
  5. వొవ్యులేషన్ కిట్ ని ఉపయోగించటం వలన గర్భం ధరించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఈ కిట్ లు మార్కెట్ లో సులభంగా లభిస్తున్నాయి. ఈ కిట్ లో యూరిన్ టెస్ట్ స్ట్రిప్స్ ఉంటాయి. వాటి ద్వారా అండోత్సర్గం యొక్క తేదిని సులభంగా కనిపెట్టవచ్చు. మారి ఆ సమయంలో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లయితే తొందరగా గర్భం ధరించవచ్చు.

సరిగ్గా నెలసరుల ముందు గర్భవతి అయ్యే అవకాశాలు ఉన్నాయా?

నెలసరులకు ముందు అనగా పీరియడ్స్ వచ్చే రోజూ రెండు రోజుల ముందు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మీ రుతు చక్రం 28-30 రోజులు అయితే గుడ్ల అండోత్సర్గం 11 నుండి 21 రోజు లోపు జరుగుతుంది. శుక్రకణం 3-6 రోజుల వరకు ఆక్టివ్ గా ఉన్నప్పటికీ గుడ్డు ఒక రోజు (12 నుండి 24 గంటలు) మాత్రమే ఉంటుంది.

కనుక నెలసరులకు ఒక రోజు లేదా రెండు రోజుల ముందు గర్భం ధరించలేరు. ఆ రోజుల్లో దంపతుల లైంగిక సంబంధం ఎంతో సురక్షితం. మరి గర్భం ధరించాలని కోరుకునే వారు రుతు చక్రం యొక్క 11 నుండి 21 రోజుల మధ్య లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లయితే సులభంగా గర్భం ధరించవచ్చు.

Posted on

Telugu tips for early periods – ఎర్లీ పీరియడ్స్ నివారణ చిట్కాలు

ఒక మహిళ యొక్క శరీరంలో జరిగే మార్పులే ఋతు చక్రం. గర్భం ప్రారంభించడానికి ఎటువంటి ఫలదీకరణ గుడ్డు లేనప్పుడు ఋతు రక్తస్రావం జరుగుతుంది. ఈ చక్రం యవ్వన దశ నుండి మొదలవుతుంది మరియు 50 ఏళ్ళ వయస్సు వరకు కొనసాగుతుంది. ఋతుస్రావం యొక్క సైకిల్ 28 రోజులకు ఒక సారి జరుగుతుంది. వీటిని పీరియడ్స్ లేదా నెలసరులు అని కూడా అంటారు.

నెలసరులు స్త్రీ జీవితంలో సాధారణమైనది, అయితే పీరియడ్స్ ఆలస్యంగా రావటం వలన ఆందోళనలకు గురవుతారు. గర్భధారణ వల్ల లేదా పునరుత్పత్తి వ్యవస్థలో కొన్ని రోగాల వల్ల పీరియడ్స్ ఆలస్యం కావచ్చు.

ఎర్లీ పీరియడ్స్

చాలామంది స్త్రీలకు ఏదో ఒక సమయంలో ఋతుస్రావం తొందరగా ఏర్పడుతుంది. ఏ వయస్సులోనైనా ఇలా జరగచ్చు. కానీ మెనోపాజ్ వయస్సులో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి అధికంగా ఏర్పడుతుంది.

ఇలా ఎర్లీ నెలసరుల వలన రక్తహీనత వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. సాధారణంగా 28 రోజులకు ఒకసారి ఋతుస్రావం జరుగుతుంది. కానీ ఎర్లీ ఋతుస్రావం 23 రోజుల్లోపే ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితులు మరింత క్లిష్టంగా మారక ముందే సమస్యను నివారించడానికి మీ డాక్టర్తో స్పష్టంగా చర్చించడం మంచిది.

ఎర్లీ  పీరియడ్స్ కు కారణాలు

ఎర్లీ పీరియడ్స్ కారణాలను రెండు విభాగాలుగా విభజించవచ్చు – భౌతిక మరియు మానసిక సంబంధమైనవి.

  • సైకలాజికల్ – మానసిక కారణాలు : ఒత్తిడి, ఆందోళన, అలసట మరియు సాధారణ బలహీనత కావచ్చు, ఈ కారకాలు హార్మోన్ల యొక్క అంతర్గత సంతులనంలో భంగం కలిగించి పీరియడ్స్ తొందరగా రావటానికి కారణం అవుతాయి.
  • శారీరక కారణాలు : ఈస్ట్రోజెన్ మరియు ప్రొజస్టెరాన్ హార్మోన్లు మెదడులోని హైపోథాలమస్, అండాశయాలలో, మరియు పిట్యూటరీలో స్రవిస్తాయి. ఈ హార్మోన్లు రెగ్యులర్గా పీరియడ్స్ రావటానికి సహాయపడతాయి. అధిక వ్యాయామం, బరువు నష్టం లేదా బరువు పెరుగుట వంటి కారణాల వాళ్ళ హార్మోన్లు అధిక వేగంగా స్రవిస్తుంది మరియు ఇది ఎర్లీ ఋతుస్రావంకు కారణం అవుతుంది.

పీరియడ్స్ ని నియంత్రించటానికి కొన్ని విధానాలు

చాలా సందర్భాలలో అకాలంలో వచ్చే ఋతు స్రావం వలన ఎటువంటి పెద్ద సమస్యలు కలగవు. కొన్ని నెలల్లో స్వయంచాలకంగా సరి అవుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. సహజమైన గృహ నివారణలు మరియు జీవనశైలిలో మార్పులతో మంచి ఫలితాలను పొందవచ్చు.

  • జీవన శైలిలో మార్పు : నెలసరులు తొందరగా రావటానికి ముఖ్య కారణం ఒత్తిడి మరియు ఆతురత. వీటిని తొలగించేందుకు యోగా మరియు ధ్యానం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి.
  • ఆహారంలో మార్పులు : సేంద్రీయ ఆహారం, బియ్యం, గోధుమ, బెర్రీలు మరియు సోయ్ వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఈస్ట్రోజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఫాస్ట్ ఫుడ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించండి.
  • బ్లాక్ కోహోష్ లో మొక్కల నుండి ఉద్భవించిన ఈస్ట్రోజెన్ ఉంటుంది. నెలసరులను నియంత్రించడానికి ఇది ఒక మంచి చికిత్స.
  • జాతి పండు మరియు బార్బెర్రీలు కూడా నెలసరులను నియ్యంత్రించడానికి సహాయపడుతాయి.
  • విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయులు పెరగటానికి సహాయపడుతుంది.
  • వేడి నీటి స్నానం లేదా హాట్ పాక్ ఋతుచక్రం ని వేగవంతం చేస్తుంది.
  • ఋతు చక్రం ని నియంత్రించడానికి ఉత్తమ పరిష్కారం ధ్యానం మరియు యోగాతో ఒత్తిడిని తగ్గించి మనసును ఆరోగ్యంగా ఉంచుకోవటం మరియు వ్యాయామాలను చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం.

గమనిక : కొన్ని సందర్భాలలో ఋతు చక్రం వేగవంతం కావడానికి కొన్ని మందుల ప్రభావం, అండాశయ లోపము, హార్మోన్ల అసమతుల్యత లేదా యోని యొక్క నిర్మాణంలో సమస్య వంటి ఇతర కారణాలు కావచ్చు. ఈ పరిస్థితులకు తగిన చికిత్స అవసరమవుతుంది.

Posted on

Foods for regular periods in Telugu – నెలసరికి ఈ పదార్థాలు ‘సరి’..

నెలసరి సమయంలో స్త్రీలకు చాలా ఇబ్బందికరంగా మరియు అసౌకర్యంగా ఉంటుంది. ఆ సమయంలో నీరసంగా మరియు బలహీనంగా ఉంటారు. అంతే కాదు ఏమీ తినాలని తోచదు లేదా ఏమీ చేయడానికి తోచదు. కొందరిలో వికారం మరియు తిమ్మిరి లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇది మీ ఆరోగ్యం మరియు మీ శరీరానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. అలాగే ఋతు స్రావం సరైన సమయానికి రాకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇర్రెగులర్ పీరియడ్స్ కి కారణాలు ఏమైనా వాటిని సరి చేయడానికి మన ఆహారంలో మార్పులు తప్పకుండా చేసుకోవాలి. అలాగే పీరియడ్స్ సమయంలో కూడా సరైన ఆహారాలను తీసుకోవటం వలన మంచి శక్తిని పొందుతారు మరియు అవయవాల యొక్క మృదువైన కార్యాచరణకు సహాయపడుతుంది.

ఈ ఆర్టికల్లో పీరియడ్స్ సమయంలో మరియు ఇర్రెగులర్ పీరియడ్స్ ని సరిచేసేందుకు ఉత్తమ ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

నెలసరులు / ఋతుస్రావం సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు

కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు

చాలా ఉపయోగకరంగా ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను ఋతుస్రావం సమయంలో మీ డైట్ లో చేర్చుకోండి. పండ్లు, తృణధాన్యాలు, ఆకు పచ్చని కూరగాయలను జోడించండి. శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రించడానికి నారింజ, క్యారట్లు, రేగు పండ్లను కూడా చేర్చుకోండి.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్లు తినడానికి నెలసరుల సమయం ఖచ్చితమైనది. డార్క్ చాక్లెట్లు మీ మానసిక స్థితిని నియంత్రించే విధంగా పనిచేసే సెరోటోనిన్అనే హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

విటమిన్ ఆధారిత ఆహారాలు

విటమిన్లు లేని ఆహారాలతో రాజీపడకండి. వాస్తవానికి ప్రతి స్త్రీ వారి పీరియడ్స్ సమయంలో విటమిన్లు మరియు ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. సిట్రస్ పండ్లు, బెర్రీలు, ద్రాక్షాల నుండి విటమిన్ సి ను పొందండి, ఇవి రీప్రొడ్కటివ్ సిస్టమ్ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. గుడ్లు మరియు అవోకాడోల నుండి విటమిన్ ఇ లభిస్తుంది. విటమిన్ ఇ PMS సిండ్రోమ్ నుండి ఉపశమనం అందిస్తుంది. బంగాళదుంపలలో లభించే విటమిన్ బి6 ని కూడా తీసుకోండి.

ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్

పీరియడ్స్ సమయంలో అనేక మంది స్త్రీలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలలో ఒకటి కడుపులో తిమ్మిరి. ఈ తిమ్మిరికి కారణం హార్మోన్ల యొక్క హెచ్చుతగ్గులు. అవసరమైన ఫ్యాటీ ఆసిడ్స్ ని తీసుకోవడం ద్వారా వాటిని నియంత్రించవచ్చు. గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు మరియు పొద్దుతిరుగుడు విత్తనాలను మీ ఆహారంలో చేర్చుకోండి, వీటిలో అవసరమైన ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. వీటిలో గర్భాశయ కండరాలను రిలాక్స్ చేసేందుకు సహాయపడే లినోలెనిక్ఆసిడ్ కూడా ఉంటుంది.

ఐరన్ రిచ్ ఫుడ్

ఋతు స్రావం సమయంలో రక్తం కోల్పోవడం ఒక సాధారణ విషయం కనుక మహిళలు తగినంత ఐరన్ రిచ్ ఫుడ్స్ ని తీసుకోవాలి. అంతేకాదు ఐరన్ ఎక్కువగా తీసుకోవటం వలన మీ రక్తహీనత (అనీమియా) లక్షణాలతో కూడా పోరాడవచ్చు. బలహీనతని తగ్గించడానికి కూడా ఐరన్ సహాయపడుతుంది. కనుక ఎండిన బీన్స్, ఆకు కూరలు మరియు మొలాసిస్ వంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ ని తీసుకోండి.

నీళ్ళు

మీరు నీళ్ళు పుష్కలంగా తాగాల్సిన సమయం ఇది. నీరు శరీరంలోని అన్ని టాక్సిన్స్ ని తొలగిస్తుంది. శరీరాన్ని తాజాగా మరియు ఆక్టివ్ గా ఉంచుతుంది. ఋతుస్రావం సమయంలో నీటి వినియోగంతో చాలా సాధారణమైన అనుభూతి చెందుతారు. కనుక నీటిని ఎక్కువగా త్రాగండి.

చేప

సాల్మోన్ మరియు ట్యూనా వంటి ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలను మీ డైట్ లో చేర్చుకోండి. ఇవి మీ కండరాలను రిలాక్స్ చేస్తుంది మరియు క్రామ్ప్స్ రాకుండా ఉండేందుకు సహాయ పడుతుంది.

అరటి పండు

అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఋతుస్రావం సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో బి6 మరియు ఇతర రకాల విటమిన్లు ఉంటాయి. మలబద్ధకం లాంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. పీరియడ్స్ రోజులలో డయేరియా వంటి సమస్యలను తొలగిస్తుంది.

రాస్ బెర్రీస్

ఇందులో ఫైబర్ మరియు ఫైటో-కెమికల్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. పీరియడ్స్ సమయంలో తిమ్మిరి వంటి సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.

పీరియడ్స్ సమయంలో నివారించాల్సిన ఆహారాలు

కెఫిన్

పీరియడ్స్ సమయంలో మీరు నివారించాల్సిన ఆహారాల్లో ప్రధానమైనది కెఫిన్. కెఫిన్ వల్ల రక్తనాళాలు బిగుతుగా తయారవుతాయి. పీరియడ్స్ సమయంలో అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల మీ శరీరం డీహైడ్రేషన్ కు కూడా గురి అవుతుంది. ఇవి నొప్పిని కలిగించే ఆమ్లాలను కడుపులో ఎక్కువగా సెక్రీట్ అయ్యేలా చేస్తాయి. దీని వలన తలనొప్పి మరియు భయాందోళన పెరుగుతాయి. కాబట్టి పీరియడ్స్ సమయంలో కాఫీ, కెఫిన్ తో తయారుచేసిన డ్రింక్స్ మరియు చాక్లెట్స్ వంటివి నివారించాలి. కాఫీకి బదులుగా ఒక కప్పు టీ ప్రయత్నించండి.

అధికంగా షుగర్ తో తయారుచేసిన ఆహారాలు

పీరియడ్స్ సమయంలో పంచదారతో తయారుచేసిన క్యాండీ బార్స్, సోడా లేదా కన్ఫెక్షనరీస్ తీసుకోకూడదు. వీటివల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతుంది. దీని వలన మీ చికాకు పెరిగి మిమల్ని నీరసంగా చేస్తాయి.

ప్రాసెస్డ్ ఫుడ్స్

డబ్బాల్లో నిల్వ చేసిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలను మీ రుతుక్రమ సమయంలో నివారించాలి. ఎందుకంటే ఈ ఆహారాల్లో అధిక సోడియం ఉంటుంది. ఇది మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.

రెడ్ మీట్

రెడ్ మీట్ వంటి ఫుడ్స్ లో సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. లేదంటే, మొటిమలు, కడుపుబ్బరం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. మాంసాన్ని తినాలని మీకు అనిపిస్తే, ఫిష్ లేదా స్కిన్ లెస్ చికెన్ వంటి లీనర్ మీట్స్ ని ప్రయత్నించవచ్చు.

ఆల్కహాల్

నెలసరి సమయంలో ఆల్కహాల్ కి దూరంగా ఉండండి. కొద్ది మొత్తంలో తీసుకుంటే ఇబ్బంది లేదనుకుంటే మీ అభిప్రాయం తప్పు. పీరియడ్స్ సమయంలో ఆల్కహాల్ ని తీసుకుంటే నెలసరి సమస్యలు మరింత ఎక్కువవుతాయి.

డైరీ ప్రాడక్ట్స్

పాలు, వెన్న, జున్ను వంటి వాటిని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. ఇది మీకు ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. అయితే, వీటిని అవాయిడ్ చేయడమే మంచిది. వీటిలో ఉండే అరకిడోనిక్యాసిడ్ నెలసరి నొప్పులను పెంచుతుంది. వీటికి బదులుగా మజ్జిగను తీసుకుంటే నెలసరి నొప్పులు తగ్గుతుంది.

ఫ్యాటీ ఫుడ్స్

బర్గర్స్, చిప్స్, ఫ్రైస్ వంటి ఫుడ్స్ ని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. వీటిని తీసుకుంటే నెలసరి నొప్పులు అధికమవుతాయి. తద్వారా, మీకు చికాకు ఎక్కువవుతుంది. వీటి వలన డీహైడ్రేషన్ సమస్య కూడా ఎదురవుతుంది.

రిఫైన్డ్ గ్రైన్స్

బ్రెడ్, పిజ్జా, సెరల్స్, టోర్టిల్లా వంటి ఫుడ్స్ ని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. వీటి వలన బ్లోటింగ్ తో పాటు మలబద్దకం సమస్య తలెత్తుతుంది. వీటికి బదులు తృణధాన్యాలను తీసుకోవడం మేలు.

స్పైసీ ఫుడ్స్

నెలసరి సమయంలో స్పైసీ ఫుడ్స్ ని తీసుకోవడం వలన హాట్ ఫ్లాషెస్ సమస్య ఎదురవుతుంది. కొన్ని సార్లు నెలసరి వాయిదా పడటం జరుగుతుంది. అలాగే చర్మంపై మొటిమలతో పాటు రాషస్ కూడా వస్తాయి. స్పైసీ ఫుడ్స్ ని తీసుకోవడం వలన స్టమక్ లైనింగ్ తో పాటు ఇంటస్టైన్స్ దెబ్బతింటాయి. అందువలన, ఎసిడిటీతో పాటు నెలసరి సమస్యలు మరింత తీవ్రం అవుతాయి.

ఇర్రెగులర్ పీరియడ్స్ ని నియంత్రించడానికి సారైన ఆహారాలు

బెల్లం

బెల్లం యొక్క వార్మింగ్ ఎఫెక్ట్ ఋతుస్రావం నియంత్రించడంలో సహాయపడుతుంది. కొన్ని నువ్వుల విత్తనాలను వేయించి బెల్లంతో పాటు రుబ్బి ఒక స్పూన్ పొడిని ప్రతిరోజూ తీసుకోండి.

సోంపు/సోపు

రాత్రి పడుకునే ముందు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఫెన్నెల్ విత్తనాల నానపెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి త్రాగండి. మంచి ఫలితాలను పొందే వరకు ప్రతి రోజు త్రాగండి.

కలబంద

కలబంద కూడా మీ పీరియడ్స్ ని నియంత్రించడానికి సహాయపడుతుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ కలబంద జ్యూస్ త్రాగండి. లేదా కలబంద యొక్క జెల్ లో ఒక స్పూన్ తేనె కలుపుకొని ప్రతి రోజు అల్పాహారం తినడానికి ముందు తీసుకోండి. ఫలితాలను పొందే వరకు లేదా రెండు నెలల పాటు ఈ నివారణను అనుసరించండి. గమనిక : మీ ఋతుస్రావం సమయంలో ఈ చికిత్సను అనుసరించకూడదు.

ముల్లంగి విత్తనాలు

కొన్ని ముల్లంగి గింజలలో కొంత నీటిని జోడించి రుబ్బండి. ఈ పేస్ట్ ని మజ్జిగలో కలుపుకొని క్రమ పద్ధతిలో త్రాగండి. మీరు సానుకూల ఫలితాలను చూడాలనుకుంటే, ఈ రసాన్ని ప్రతి రోజూ త్రాగండి.

పసుపు

పసుపులో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇంఫ్లమ్మెటరి లక్షణాలు ఉన్నాయి. ఇది మీ ఋతుచక్రాన్ని నియంత్రించడంతో పాటు ఋతుస్రావం సమయంలో నొప్పిని తగ్గిస్తుంది. ఒక క్వార్టర్ టీస్పూన్ పసుపు, కొద్దిగా తేనె, బెల్లం మరియు పాలను కలుపుకొని ప్రతిరోజు తాగండి.

విటమిన్ సి

ఋతుచక్రాన్ని నియంత్రించేందుకు ఆపిల్, బెర్రీస్, నారింజ మరియు టమోటాల వంటి విటమిన్ సి అధికంగా ఉండే పళ్ళు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోండి.

బొప్పాయి

పండని బొప్పాయిని తినటం వలన మీ ఇర్రెగులర్ పీరియడ్స్ ని నయం చేస్తుంది. ఒక నెల రోజుల పాటు ప్రతి రోజూ ఒక గ్లాస్ బొప్పాయి రసంని తీసుకోడానికి ప్రయత్నించండి. ఇది మీ ఋతుస్రావం ని సులభంగా నియంత్రిస్తుంది.

బాదం

నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు శరీరానికి కావల్సిన పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. ఇంకా ఇందులో ఉండే ఫైబర్ మరియు ప్రోటీనులు హార్మోనులను బ్యాలెన్స్ చేసి పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి సహాయం చేస్తుంది.

గుడ్డు

బాగా ఉడికించిన గుడ్డులో అధిక శాతంలో ప్రోటీనులు, క్యాల్షియం మరియు విటమిన్స్ ఉంటాయి. గుడ్డులో ఉండే అధిక ప్రోటీనులు రుతు క్రమ సమస్యలను నివారించడానికి బాగా సహాయపడతాయి.

పుదీనా

సగం టేబుల్ స్పూన్ తేనె మరియు ఒక టేబుల్ స్పూన్ పుదీనా పౌడర్ ని కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోండి.

బ్రొకోలీ

రుతుక్రమాన్ని క్రమబద్ధం చేయడంలో ఈ గ్రీన్ వెజిటేబుల్ చాలా పవర్ ఫుల్. సరైన రుతుక్రమాన్ని మెయింటైన్ చేయడానికి ఈ బ్రొకోలీని మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

ఆపిల్ సీడర్ వినిగర్

1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వినిగర్ ని ప్రతిరోజూ ఒక కప్పు నీటిలో కలుపుకొని భోజనం చేసే ముందు తాగండి.

నువ్వుల గింజలు

మీ ఇర్రేగులర్ పీరియడ్స్ ని సరిచేయడానికి ఒక మంచి మార్గం నువ్వుల గింజలను తినటం. మరింత పోషకాలను చేర్చడానికి తేనెతో కలుపుకొని సెసమి గింజలు మరియు జీలకర్ర విత్తనాలను తీసుకోవచ్చు.

పండ్లు మరియు కూరగాయలు

శరీరంలో పోషకాలు మరియు ప్రోటీన్ల స్థాయి తక్కువగా ఉండటం వలనే ఇర్రేగులర్ పీరియడ్స్ సమస్య ఏర్పడుతుంది. న్యూట్రిషన్ స్థాయులు పెంచడానికి తాజా పండ్ల రసాలను త్రాగండి. పండ్లతోపాటు కూరగాయలను కూడా మీ డైట్ లో చేర్చుకోండి. ద్రాక్షలు, ఫిగ్ మరియు క్యారట్ జ్యూస్ లను రోజు తీసుకోండి.

టీ మరియు మూలికలు

మీరు టీ తయారు చేసుకొనేటప్పుడు దాల్చిన చెక్క, అల్లం, కొత్తిమీర వంటి మూలికలను ఉపయోగించండి. మీ ఆహారాలలో కూడా వీటిని చేర్చుకోండి.

పార్స్లీ

మీ నెలసరుల సమస్యను సరిదిద్దడానికి పార్స్లీ ఒక సులభమైన పరిష్కారం. ఇర్రెగులర్ పీరియడ్స్ ని సరిచేయడానికి ప్రతి రోజూ ఒక గ్లాస్ పార్స్లీ రసాన్ని త్రాగండి.

కాకరకాయ

మీకు కాకరకాయ వేర్లు దొరికినట్లయితే, వాటిని ఐదు నుండి పది నిమిషాలు నీటిలో ఉడికించి, వెచ్చగా అయిన తరువాత వడగట్టి త్రాగండి. లేదా కాకరకాయ జ్యూస్ ని 2 నుండి 3 వారాల పాటు రోజుకు రెండుసార్లు త్రాగండి.

మర్రి చెట్టు వేర్లు

మర్రి చెట్టు వేర్లను పది నిమిషాలు నీటిలో ఉడికించి రెండు టేబుల్ స్పూన్ ఆవు పాలను జోడించండి. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఈ నీటిని త్రాగండి.

అత్తి చెట్టు వేర్లు

అత్తి చెట్టు వేర్లను పది నిమిషాలు నీటిలో ఉడికించి వడగట్టి త్రాగండి.

కొత్తిమీర

కొత్తిమీరను కొన్ని నిమిషాలు నీటిలో ఉడికించి వడగట్టి త్రాగండి. ఇర్రెగులర్ పీరియడ్స్ ని నియంత్రించేందుకు ప్రతి రోజూ మూడు సార్లు త్రాగండి.

చెరకు రసం

చెరకు రసం కూడా మీ నెలసరులను నియంత్రిస్తుంది. ఇది ఋతుస్రావం తొందరగా రావటానికి కూడా ఉపయోగపడుతుంది.

రెడ్ గ్రేప్ (ఎర్రని ద్రాక్ష)

సహజ పద్దతుల ద్వారా రుతుక్రమ సమస్యలను నివారించుకోగలిగే ఒక మంచి ఆహారం ద్రాక్ష. ప్రతి రోజూ ఎర్రని లేదా పచ్చని ద్రాక్ష రసం త్రాగడం చాలా ఆరోగ్యకరం.

టోఫు

పన్నీర్ కు ప్రత్యామ్నాయ ఆహారం టోఫు. ఇది ఆరోగ్యకరమే కాకుండా లోఫ్యాట్ కలిగి ఉంటుంది. టోఫు క్యాల్షియం రిచ్ ఫుడ్. ఇది పీరియడ్స్ క్రమంగా వచ్చేలా చేస్తుంది.

Posted on

Telugu tips to delay periods – నా పీరియడ్స్ ని ఎలా డిలే చేయాలి?

ఒక మహిళ తన నెలసరులను ఆలస్యం చేయాలని కోరుకునేందుకు వివిధ కారణాలు ఉండవచ్చు. ఇందుకోసం చాలా మంది అమ్మాయిలు టాబ్లెట్స్ ను ఎంపిక చేసుకుంటారు. ఋతు స్రావాన్ని పోస్ట్ చేసే టాబ్లెట్స్ చాలా మటుకు హార్మోనల్ టాబ్లెట్స్ అయ్యుంటాయి. ఇవి శరీరంలోని సహజ హార్మోన్ల సంతులనంకు అంతరాయం కలిగిస్తాయి. అంతేకాక, ఈ మాత్రలు కడుపులో వికారం పుట్టించడం, వాంతులు, తలనొప్పి, వేడిని తగ్గించటం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ని కలిగిస్తాయి. కనుక, ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుండి తప్పించుకోటానికి సహజ నివారణలను పాటించటం మంచిది. కొన్ని గృహ నివారణలను అనుసరించడం ద్వారా మీ ఋతు స్రావంను సమర్ధవంతంగా వాయిదా వేయవచ్చు. కాబట్టి, మీరు మీ పీరియడ్స్ ని వాయిదా వేయాలని కోరుకుంటునట్లయితే, సహజమైన ప్రభావాలను పొందడానికి, మాత్రలకు బదులుగా ఈ సహజ నివారణలను ప్రయత్నించండి.

మీ డైట్ నుండి మసాలా మరియు కారమైన ఆహారాన్ని మినహాయించండి

సామాన్యంగా కారమైన ఆహారాలు ఋతు స్రావాన్ని వేగవంతం చేస్తుందని నమ్మకం. మిరియాలు, మిరప, వెల్లుల్లి మరియు పప్రికా వంటి స్పైసస్ శరీర వేడిని పెంచుతాయి, అందువలన ఋతు చక్రంను వేగవంతం చేస్తుంది. కనుక, మీరు మీ నెలసరులను వాయిదా వేయాలని కోరుకుంటే పీరియడ్స్ వచ్చే 15-20 రోజుల ముందు నుండి కారమైన పదార్థాలను తినకండి. పసుపు కూడా ఇదే ప్రభావాన్ని చూపుతుంది. కనుక, పచ్చి పసుపుని మీ ఆహారంలో చేర్చుకోకూడదని నిర్ధారించుకోండి.

శనగ కాయ ధాన్యాలు

పురాతన కాలం నుండి శనగ కాయ ధాన్యాలు ఋతు స్రావం వాయిదా వేయడానికి ఒక ఔషధంగా ఉపయోగించబడ్డాయి. కొన్ని శనగ కాయ ధాన్యాలను ఫ్రై చేసి, రుబ్బి పొడి చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పు పొడిని వెచ్చని నీటిలో కలిపి ఒక సూప్‌లా చేసుకోండి. ఈ సూప్‌ని ఉదయం ఖాళీ కడుపుతో మరియు మధ్యాహ్నం మరియు రాత్రి ఆహారం తీసుకోవటానికి ముందు త్రాగాలి. ఫలితాలను పొందడానికి మీకు పీరియడ్స్ వస్తుందని మీరు ఊహించిన తేదీకి కనీసం ఒక వారం ముందు నుండి ఈ రొటీన్‌ని ప్రారంభించాలి.

వినిగర్

వినిగర్ నెలసరులను ఆలస్యం చేయటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది తిమ్మిరి వంటి వివిధ ఋతు లక్షణాలను తగ్గించేందుకు కూడా ఉపయోగిస్తారు. నీటిలో 3 లేదా 4 స్పూన్ల వినిగర్‌ని కలిపి ఉదయం, మధ్యాహ్నం మరియు రాత్రి ఆహారం తీసుకోవటానికి ముందు త్రాగాలి. వినిగర్ సరైన పద్ధతిలో తీసుకుంటే ఇది ఋతు స్రావాన్ని ఆలస్యం చేస్తుంది మరియు అధిక బ్లీడింగ్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కనుక, మీకు పీరియడ్స్ సమయంలో అధిక ప్రవాహం ఉన్నట్లయితే, వినిగర్‌ని ఉపయోగించవచ్చు.

చాస్ట్ బెర్రీ

శరీరంలోని ప్రొజెస్టెరాన్ యొక్క స్థాయి ఋతు చక్రాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చాస్ట్ బెర్రీ శరీరంలోని ప్రొజెస్టెరాన్ మరియు ప్రొలాక్టిన్ యొక్క బాలన్స్ ను నార్మలైజ్ చేస్తుంది. తద్వారా పీరియడ్స్ ని ఆలస్యం చేస్తుంది. ఇది తేలిక పాటు ప్రవాహంతో తక్కువ కాలం ఋతు చక్రాన్ని పొందేందుకు కూడా సహాయపడుతుంది.

జెలాటిన్

ఋతు స్రావం ఆలస్యంగా వచ్చేలా చేయటానికి జెలాటిన్ చాలా ప్రభావితమైన పరిహారం. కానీ, ఈ పరిహారం కేవలం అత్యవసర పరిస్థితిలో మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది పీరియడ్స్ ని కొన్ని గంటలు మాత్రమే ఆలస్యం చేయగలుగుతుంది. రెండు టేబుల్ స్పూన్లు జెలటిన్ ని వెచ్చని నీటిలో కలిపి ఈ మిశ్రమాన్ని ఒకేసారి త్రాగండి.

అధిక వ్యాయామం

ఇది మీ నెలసరులను ఆలస్యం చేసే ఒక సహజ మార్గం. మీరు పీరియడ్స్ ని ఆలస్యం చేయాలనుకుంటే, అధికంగా వ్యాయామాలను చేయడం ప్రారంభించండి; ఇది మీ శరీరంపై ఒత్తిడిని పెంచి పీరియడ్స్ ని వాయిదా వేస్తుంది.

తేనె తో పార్స్లీ ఆకులు

పార్స్లీ అనేది రోజువారీ ఆహారంలో మనం ఉపయోగించే ఒక పోషక విలువైన ఆకు కూర. విటమిన్లతో పాటు పార్స్లీ ఆకులలో ఎన్నో వోలటైల్ ఆయిల్స్ మరియు ఫ్లెవనాయిడ్లు ఉన్నాయి. తేనెతో పార్స్లీ ఆకులను కలిపి తయారు చేసిన మిశ్రమం సహజంగా ఋతు స్రావాన్ని వాయిదా వేయడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. రెండు కప్పుల నీటిలో శుభ్రం చేయబడిన పార్స్లీ ఆకులను వేసి బాగా ఉడికించండి. నీళ్లు బాగా మరిగి సగం అయిన తరువాత వడగట్టి, 1 స్పూన్ తేనెని కలిపి వేడిగా త్రాగండి. పీరియడ్స్ వస్తుందని మీరు ఊహించిన ఒక వారం ముందు నుంచి ఈ మిశ్రమాన్ని రోజుకు 2 లేదా 3 సార్లు త్రాగండి.

Posted on

Telugu tips to know about vomiting in babies – మీరు పసి పిల్లలలో వాంతులు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

శిశువు యొక్క వాంతులకు చాలా కారణాలు ఉండవచ్చు. చాలా సందర్భాలలో పిల్లలలో వాంతులు ప్రమాదకరం కావు మరియు ఏ మందులనూ ఉపయోగించకుండా గుణపరచవచ్చు. కొన్ని సార్లు వాంతులు ఇతర అనారోగ్యం వలన కావచ్చు, అటువంటప్పుడు ప్రత్యేకమైన చికిత్స చేయవలసి ఉంటుంది. పిల్లలలో వాంతుల గురించి మరియు వాటిని ఎలా వ్యవహరించాలన్న ముఖ్యమైన సమాచారాలను తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ని చదవండి.

పసి పిల్లల వాంతులకు కారణాలు

ఆహారం వలన సమస్యలు

పిల్లల్లో వాంతుల యొక్క అతి సాధారణ కారణం ఆహార సమస్యలు. ఫార్ములా పాలు లేదా రొమ్ము పాలను ఎక్కువగా ఇవ్వటం వలన లేదా వాటి అలర్జీ వలన వాంతులు అవుతాయి. శిశువుకు సరైన మార్గంలో పాలు ఇవ్వక పోవడం కూడా వాంతులు రావడానికి కారణమవుతుంది. మీ శిశువు ఆహారాన్ని తీసుకున్న వెంటనే కక్కినట్లయితే, అది సరైన రీతిలో పాలు ఇవ్వక పోవటం వలనే అవుతుంది.

కొత్త ఆహార పదార్థాలకు అలవాటు పుడుతున్నప్పుడు: పసి పిల్లల శరీరం కొత్త ఆహార పదార్థాలకు అలవాటు పడటానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అటువంటి దశలలో, మీ శిశువు ఆహారానికి ఇమడ్చుకోలేక వాంతులు చేసుకోవచ్చు. ఈ రకమైన వాంతి గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఇన్ఫెక్షన్

పిల్లలు తరచుగా వాంతులు చేసుకోటానికి శరీరంలోని వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒక మూల కారణం. శ్వాస మార్గంలో ఇన్ఫెక్షన్, గొంతులో రద్దీ లాంటి ఏదైనా కారణాలు పిల్లలలో వాంతిని ప్రేరేపించగలవు. మీ శిశువుకు జలుబు లేదా ఇటీవల ఫ్లూ నుండి కోలుకొని ఉంటే, వాంతులు చాలా సాధారణంగా అవుతాయి. కడుపులో ఇన్ఫెక్షన్ వలన కూడా కావచ్చు. మీ శిశువుకు తరచుగా వాంతులతో పాటు డయేరియా, ఉదరంలో నొప్పి లేదా ఆకలి లేకపోవటం లాంటివి ఉన్నట్లయితే, దీనికి ప్రధాన కారణం కడుపులో ఇన్ఫెక్షన్. చెవి ఇన్ఫెక్షన్, మూత్ర నాళాల సంక్రమణం లేదా గొంతు నొప్పి కూడా పిల్లలలో తరచూ వాంతులకు కారణం అవుతుంది.

మోషన్ అనారోగ్యం

మీ పిల్లలు కారులో లేదా బస్సులో ప్రయాణించేటప్పుడు లేదా ప్రయాణం ముగిసిన వెంటనే వాంతులు చేసుకుంటే అది కేవలం మోషన్ అనారోగ్యం వలనే. మీ ప్రయాణం ముగిసిన తరువాత మంచి విశ్రాంతి పొందితే స్వయంచాలకంగా ఈ సమస్య నుండి బయటికి వస్తారు. వయస్సు పెరిగే కొద్ది, ఈ పరిస్థితి తొలగిపోతుంది.

ఏడవటం

చాలా సేపు ఏడ్చే పిల్లలలో గాగ్ రిఫ్లెక్స్ ప్రేరేపించటం ద్వారా వాంతులు చేసుకుంటారు. ఏమైనప్పటికీ, ఈ కారణం వలన వంతుల గురించి చింతించవలసిన అవసరం లేదు. చాలా సందర్భాలలో, వారు ఆరు గంటల లోపలే ఉపశమనం పొంది ఏడుపును ఆపేస్తారు . అందువలన, ఇది మీ చిన్నారికి ఏ విధంగా కూడా దీర్ఘకాలిక ఆరోగ్య నష్టం కలిగించదు.

పాయిజనస్ పదార్థాలను తీసుకోవటం వలన కూడా తరచూ వాంతులు అవుతాయి. ఈ పరిస్థితిని పిలోరిక్ స్టెనోసిస్ అని అంటారు. కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది.

వాంతులు మరియు ఉమ్మి వేయడం మధ్య వ్యత్యాసం తెలుసుకోండి

కొత్త తల్లులకు వాంతులు మరియు ఉమ్మి వేయడం మధ్య వ్యత్యాసం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే రెండూ ఒకేలా కనిపిస్తాయి. ఉమ్మి వేయడం పిల్లలలో చాలా సాధారణమైనది మరియు మీరు దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

ఉమ్మినప్పుడు, బిడ్డకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారాలు బయటికి వస్తాయి మరియు మీరు దానిని గమనించక పోవచ్చు. కడుపులోని ఆహారాన్ని గొంతులో గాగుల్ చేయటం కూడా ఉమ్మడానికి ఒక సాధారణ కారణం. తినేటప్పుడు శిశువు గాలిని మింగడం మరియు గాలి తేపు వలె బయటికి వస్తున్నప్పుడు, కొంత ద్రవం దానితో పాటు బయటకు వస్తుంది. భోజనమైన వెంటనే ఉమ్మి వేయడం మరింత సాధారణమైనది.

మరోవైపు, వాంతుల సమయంలో, ఆహారాన్ని కడుపు కండరాలు బలవంతంగా బయటకు తోస్తాయి. దీని వలన మీ శిశువు ఏడవడం మొదలుపెడతారు లేదా అలసిపోతారు. వాంతి మొత్తాలు కూడా ఎక్కువగా ఉంటుంది.

మీ శిశువు వాంతులు చేసుకుంటే ఏమి చేయాలి?

మీ శిశువు వాంతులు చేసుకుంటే, చాలా సందర్భాలలో మీరు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. అదంతట అదే ఆగి పోతుంది మరియు పిల్లలు వాటికి చాలా అలవాటు పడి ఉంటారు. అయితే, మీ శిశువు సౌకర్యంగా ఉందని నిర్ధారించుకోడానికి మీరు ఈ క్రింద విషయాలను గుర్తుంచుకోవాలి. పిల్లలు వాంతి చేస్తున్నప్పుడు, వారిని నిటారుగా నిల్చోబెట్టడం ఉత్తమమైనది. ఎందుకంటే, బయటికి వచ్చే ఆహారం మరింత సులభంగా వస్తుంది మరియు వాంతి చేసుకొనేటప్పుడు ఆహారం ఇరుక్కునే అవకాశం కూడా తగ్గుతుంది.

తరువాత ఒక ఫ్లాట్ సర్ఫేస్ పై పడుకోబెట్టండి, తలపై మరియు మెత్తలో ఏ ఎత్తులూ లేకుండా, ఒక ఫ్లాట్ సర్ఫేన్ పై శిశువుని నిద్రపుచ్చండి. మీ శిశువు సాలిడ్ ఆహారాలను తీసుకోవడం ప్రారంభించినట్లయితే, తదుపరి 24 గంటలు పాపకు సాలిడ్ ఆహారం ఇవ్వకండి. వాంతుల సమయంలో ద్రవాలు మాత్రమే ఇవ్వాలని నిర్ధారించుకోండి.

వాంతుల తరువాత పిల్లలలో డీహైడ్రేషన్ ను నిరోధించడం ఎలా?

మీ పిల్లలకు తరచుగా వాంతులు అవుతున్నప్పటికీ నిర్జలీకరణ లక్షణాలను చూపక పోవచ్చు. కనుక, మీ శిశువు తరచుగా వాంతులు చేస్తే, తగినంత ద్రవాలను ఇవ్వాలని గుర్తుంచుకోండి. సాదా నీటిని ఇవ్వడానికి బదులుగా, డీహైడ్రేషన్ చికిత్సకు చాలా ఉపయోగకరంగా ఉండే ఎలక్ట్రోలైట్ లాంటి ద్రవాన్ని ఇవ్వండి. ఎలక్ట్రోలైట్ ఎలా ఇవ్వాలని మరియు ఎంత ఇవ్వాలని వైద్యుడిని సంప్రదించి తెలుసుకోవటం మంచిది. వాంతి చేసుకున్న వెంటనే బిడ్డకు ఎలక్ట్రోలైట్ ద్రవాన్ని ఇవ్వకూడదు. 10 నుండి 15 నిమిషాల విశ్రాంతి తరువాత ఇవ్వండి. అలాగే, మొత్తం ఎలక్ట్రోలిట్ సొల్యూషన్ ని ఒకే సారి ఇవ్వకూడదు, ఒక స్పూన్ తో చిన్న మొత్తాలలో తరచూ ఇవ్వండి.

ఒక వేళ మీ శిశువుకు తీవ్రమైన నిర్జలీకరణ సమస్య ఉన్నట్లయితే ఇనాక్టివ్ గా ఉంటారు, నోరు ఎండిపోతుంది, కన్నీళ్లు లేకుండా ఏడుస్తారు, మూత్రవిసర్జన తగ్గిపోతుంది, పెదవులు పొడిగా ఉంటాయి. అటువంటప్పుడు వెంటనే అత్యవసర చికిత్స చేయాలి.

వాంతి నుండి మరియు డీహైడ్రేషన్ ను నివారించడానికి పండ్ల రసాలను ఇవ్వడం మంచిది కాదు, ఇది కడుపును అప్‌సెట్ చేసి తరచూ వాంతులు రావటానికి కారణమవుతుంది.

పిల్లలను వాంతులు లేదా ఉమ్మడం నుండి నిరోధించడం ఎలా

మనం పిల్లలలో వాంతికి కారణాలను ఎల్లప్పుడూ నిరోధించలేనప్పటికీ, ఉమ్మివేయడాన్ని నివారించవచ్చు. మీ శిశువుకు నెమ్మదిగా మరియు చిన్న మొత్తాలలో ఆహారాన్ని ఇవ్వటం ద్వారా పిల్లలు ఉమ్మడాన్ని ప్రివెంటి చేయవచ్చు. తిన్న తరువాత తేపు వచ్చేలా చేయటం వలన కూడా ఉమ్మటాన్ని వాంత్ చేయవచ్చు. తిన్న వెంటనే శిశువును నిద్రపుచ్చకూడదు.

మీ శిశువుకు మోషన్ అనారోగ్యం కారణంగా వాంతులు అవుతున్నట్లయితే, మీ ప్రయాణంలో కొన్ని విరామాలను తీసుకోండి. ఇది వాంతులను తగ్గిస్తుంది.

నా శిశువు వాంతిలో రక్తం ఉంది, ఇది తీవ్రమైన సమస్యనా?

మీ శిశువు యొక్క వాంతిలో ఒక రక్తపు బొట్టు లేదా పైత్య రసం ఉన్నప్పటికీ మీరు దిగులు చెందనక్కర్లేదు. వాంతి చేసుకొనే సమయంలో అన్నవాహిక లైనింగ్ యొక్క కొన్ని చిన్న రక్త నాళాలు సులభంగా చినిగి కొద్దిగా రక్తం బయటికి వస్తుంది. గత ఆరు గంటల్లో నోటిలో ఏదైనా కట్స్ వలన లేదా ముక్కు రక్తస్రావం నుండి వచ్చిన రక్తాన్ని మింగినట్లయితే మీ శిశువు యొక్క వాంతిలో కొంత రక్తం ఉండొచ్చు. అయినప్పటికీ, రక్తపోటు పదేపదే లేదా రక్తం యొక్క మొత్తాన్ని వాంతితో అధికరించటం లాంటి సూచనలు ఉన్నట్లయితే, వెంటనే అత్యవసర చికిత్స చేయండి.

డాక్టర్ ని ఎప్పుడు పిలవాలి?

పిల్లలలో వాంతులు సాధారణంగా హాని కలిగించినప్పటికీ కొన్ని సందర్భాల్లో తక్షణ వైద్య సహాయం పొందాలి.

  • మీ బిడ్డ 24 గంటల కన్నా ఎక్కువ తరచుగా వాంతులు చేస్తుంటే, ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను పిలవండి.
  • మీ శిశువుకు 3 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, జ్వరం (100.4 డిగ్రీల ఫేరన్‌హీట్ యొక్క మల ఉష్ణోగ్రత) మరియు పదేపదే వాంతులు అవుతుంటే, వీలైనంత త్వరగా వైద్య సహాయం పొందండి.
  • డీహైడ్రేషన్ యొక్క లక్షణాలు కనిపించినప్పుడు, ఒత్తిడిగా ఉన్నప్పుడు లేదా నీరసంగా ఉన్నప్పుడు వెంటనే వైద్య సహాయం పొందడం ముఖ్యం.
Posted on

Telugu tips to calculate the most fertile days in women – మహిళల్లో అత్యంత ఫర్టిలిటీ రోజులను లెక్కించే విధానాలు

మీరు గర్భవతి అవ్వటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే మీరు ఉత్తమ సంతానోత్పత్తి సమయం ఎప్పుడని తెలుసుకోవడం చాలా అవసరం. మీరు అండోత్సర్గం క్యాలెండర్‌ను మరియు గర్భధారణ అవకాశాలు పెంచడానికి లైంగిక సంబంధాలకు మంచి సమయాలను లెక్కించాలి. మీరు చేయవలసిందల్లా మీ ఋతు చక్రంను సరిగ్గా ట్రాక్ చేయాలి.

మీ పీరియడ్స్ యొక్క అత్యంత ఫర్టిలిటీ రోజులను తెలుసుకోండి

మీకు మీ ఋతు చక్రం సరిగ్గా ఉన్నప్పటికీ గర్భవతి కాలేకపోతున్నారా! సరైన సమయంలో నెలసరులు వస్తున్నప్పటికీ ప్రెగ్నెన్సీ సమస్యను ఎదుర్కొనుట సహజమయిన విషయమే. ఋతు స్రావం సమయంలో మహిళలు గర్భవతి అవుతారని ప్రజలు నమ్ముతుంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఋతు చక్రాల రోజులలో సంతానోత్పత్తి ప్రక్రియ జరగదు. అండోత్సర్గం సంభవిస్తేనే మీరు గర్భవతి కాగలుగుతారు. అండోత్సర్గము జరిగే ముందు కూడా గర్భం ధరించవచ్చు. అండోత్సర్గము అంటే ఒక పరిపక్వ గుడ్డు మీ అండాశయం లోనికి ప్రవేశిస్తుంది మరియు ఆ గుడ్డు స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చేయబడుతుంది. ఇప్పుడు, మీ ఫర్టిలిటీ రోజులు ఏమిటో అది మీరు ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం.

మందమైన లైనింగ్ యొక్క తొలగింపు

మీ గర్భాశయం నుండి మీ యోని ద్వారా బయటకి వచ్చిన మందమైన లైనింగ్‌ని మీరు గమనిస్తునట్లయితే అది మీ ఫర్టిలిటీకి ఉత్తమ సమయం అని తెలుసుకోవచ్చు. మరియు ఇది మీ ఋతు స్రావ సమయంలో 3 నుండి7 రోజులు రక్తస్రావానికి కారణమవుతుంది. ఫొలికల్స్ లో గుడ్డు ఉంటుంది మరియు దాని పెరుగుదల 13 నుండి 14 రోజుల ఫోలిక్యులర్ ఫేస్లో జరుగుతుంది.

లూటినీజింగ్ హార్మోన్

లూటినీజింగ్ హార్మోన్ స్థాయి పెరుగినప్పుడు అండోత్సర్గము ఏర్పడుతుంది. ఇది చాలా చిన్న దశ, కేవలం 16 నుండి 32 గంటలు మాత్రమే కొనసాగుతుంది. శరీరం నుండి ఒక గుడ్డును విడుదల చేయడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది.

మితవాద (లుటీల్) పరిస్థితి

ఇది అండోత్సర్గము తర్వాత ప్రారంభమవుతుంది మరియు మీ తరువాతి పీరియడ్స్ వరకు కొనసాగుతుంది. ఇది గుడ్డు ఫలదీకరణం చేయబడినప్పుడు మరియు గర్భాశయ గోడలో అమర్చబడే సమయంలో గర్భాశయంను సిద్ధం చేయడానికి బాగా సహాయపడుతుంది.

గర్భం ధరించడానికి ఉత్తమ సమయం తెలుసుకోండి

మీరు ప్రెగ్నెన్ట్ కావడానికి మీ భాగస్వామితో సంపర్కం కలిగి ఉండేందుకు ఉత్తమ సమయం తెలుసుకోవాలి. మీ భాగస్వామితో సెక్స్ చేయడం ద్వారా గర్భవతి అవ్వడానికి ఋతు చక్రం సమయంలో చాలా అవకాశాలు ఉంటాయి. చాలామంది మహిళలకు ఆరు రోజులు చాలా సాధారణ సంతానోత్పత్తి రోజులు.

ఆ రోజులలో లైంగిక సంబంధం కలిగి ఉండటం వలన గర్భవతి అవుతారని భరోసా ఉండదు, కానీ గర్భవతి కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

మీరు ఒక విషయాన్ని మర్చిపోకూడదు, ఏమిటంటే అండోత్సర్గము ముందు లేదా అండోత్సర్గము జరిగిన 24 గంటల తరువాత గర్భవతి అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి.

మీ పీరియడ్స్ యొక్క క్రమబద్ధతను తెలుసుకోండి

ప్రతి మహిళకు ఋతు చక్రం వేరుగా ఉంటుంది, అది ఒత్తిడి వంటి కొన్ని కారణాల వలన కూడా మార్పు చెందుతుంది. మీరు మూడు నుండి నాలుగు నెలల పాటు మీ ఋతు స్రావం ఎంతకాలం కొనసాగుతోంది మరియు ప్రతి నెలా అదే సమయంలో సంభవిస్తోందా అని గమనించాలి.

మీ నెలసరులు సంభవించినప్పుడు తేదీని ప్రారంభించి మీ తదుపరి నెలసరి సంభవించే వరకు రోజులను లెక్కించండి. ఋతు చక్రం యొక్క సాధారణ వ్యవధి 28 రోజులు లేదా 21 నుండి 35 రోజుల వరకు ఉంటుంది.

ఇర్రెగులర్ పీరియడ్స్ సమస్య ఉందా?

మీరు మీ నెలసరులను మూడు నుండి నాలుగు నెలలు ట్రాక్ చేయాలి. ఒకవేళ క్రమంగా లేనట్టు కనుగొంటే, మీకు ఇర్రేగులర్ పీరియడ్స్ ఉన్నట్టు. ఎక్కువ శారీరక కార్యకలాపాలు, వైద్య సమస్యలు, ఒత్తిడి మరియు బరువు తగ్గటం వంటి కారణాల వలన ఇర్రెగులర్ పీరియడ్స్ కలుగుతాయి. ఇటువంటప్పుడు తీవ్రమైన వైద్య సమస్యలను నివారించడానికి మీ డాక్టర్ను సంప్రదించండి. క్రమరహిత నెలసరులలో గర్భధారణ కలగవచ్చు, అయితే దీనికి కొద్దిగా సమయం పడుతుంది మరియు కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.

మీకు మూడు నెలల వరకు పీరియడ్స్ రాకపోయినా మరియు మీరు కన్సీవ్ కాకపోయినా మీకు వైద్య సహాయం అవసరం. హార్మోన్ల రుగ్మత క్రమరాహిత్యమైన ఋతు స్రావానికి కారణమవుతుంది. మీ పునరుత్పత్తి అవయవాలలో ఇన్ఫెక్షన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యల వలన కూడా ఇర్రేగులర్ పీరియడ్స్ కలగవచ్చు.

మీ ఫర్టిలిటీ కాలాన్ని తెలుసుకోండి

మీకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నట్లయితే గర్భవతి కావటం చాలా సులభం. మీరు మీ నెలసరుల ఆధారంగా మీ సంతానోత్పత్తికి తగిన కాలాన్ని తెలుసుకోవచ్చు. మీ అండోత్సర్గము ప్రారంభం అయినప్పటి నుండి మీ సంతానోత్పత్తి విండో ప్రారంభమవుతుందిఅండోత్సర్గము జరిగిన రోజుతో సహా మొత్తం ఆరు రోజులు. మీ ఋతు చక్రం కాలాన్ని ఉపయోగించి మీ ఫర్టిలిటీ రోజులను తెలుసుకోవచ్చు. ఋతు చక్రం యొక్క సమయం నుండి 14 రోజులు తీసివేయాలి.

  • మీ ఋతు చక్రం 28 రోజుల పాటు కొనసాగినట్లయితే ఋతు చక్రం యొక్క 14వ రోజు అండోత్సర్గము జరుగుతుంది. 14వ రోజు మీకు అత్యంత సారవంతమైనది మరియు 12, 13 రోజులు కూడా సారవంతమైనవి.
  • మీ ఋతు చక్రం 21 రోజుల పాటు ఉన్నట్లయితే అండోత్సర్గము 7వ రోజు జరుగుతుంది. 7వ రోజుతో పాటు, 5 మరియు 6 వ రోజులు కూడా మరింత సారవంతమైనవి.
  • మీ ఋతుచక్రం 35 రోజుల పాటు కొనసాగినట్లయితే, మీ ఋతు చక్రం యొక్క 21 వ రోజున అండోత్సర్గము జరుగుతుంది. 21 అలాగే 19 మరియు 20వ రోజు కూడా సారవంతమైన రోజులు.
Posted on

Telugu tips to care pregnant women in first trimester – ప్రెగ్నెన్సీ యొక్క మొదటి త్రైమాసికంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రెగ్నెన్సీ ఒక అద్భుతమైన అనుభూతి. గర్భం యొక్క కాలం సుమారు 40 వారాల పాటు ఉంటుంది, ఇది మూడు త్రైమాసికంగా విభజించబడింది. గర్భం యొక్క మొదటి మూడు నేలలను, మొదటి త్రైమాసికం అని అంటారు. మొదటి త్రైమాసికంలో మీ శిశువు యొక్క మెరుగైన మరియు ఆరోగ్యకరమైన పెరుగుదల కొరకు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.

అదనపు పోషకాలను తీసుకోండి

మీరు మాములుగా తీసుకునే పోషక ఆహారాలకు రెండు రేట్లు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే, మీ శిశువు యొక్క పెరుగుదల మరియు ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయటానికి ఎక్కువ పోషకాలు అవసరం అవుతాయి.

పాలు, గుడ్లు మరియు టూనా, సాల్మన్ లాంటి ఆహారాల నుండి లభించే విటమిన్ డి ని మీరు అవసరమైన మోతాదులలో పొందుతున్నారు అని నిర్ధారించుకోండి. కాల్షియమ్ మరియు ఫాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను లేదా సప్లిమెంట్స్ ను మీ డైట్ లో చేర్చుకోండి. ఇవి మీ శిశువు పెరుగుదలకు కావలసిన ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్స్ ను అందిస్తుంది.

ఈ జాగ్రత్తలతో పాటు వైద్యుల వద్ద మీరు రెగ్యులర్గా చేసుకోవాల్సిన పరీక్షలను కూడా క్రమం తప్పకుండా చేయండి.

ధూమపానం మానుకోండి

ధూమపానం ఆరోగ్యానికి హానికరం, కనుక మీకు ఈ అలవాటు ఉన్నట్లయితే మీ ఆరోగ్యం కొరకు మరియు మీ శిశువు యొక్క ఆరోగ్యం కొరకు ఈ అలవాటుని మానుకోండి. ప్రెగ్నెన్సీ సమయంలో ధూమపానం వలన మీ శిశువు యొక్క పెరుగుదలలో లోపం, డెలివరీ సమయంలో తక్కువ బరువు ఉండటం, రోగ నిరోధక శక్తి లేకపోవటం మరియు ఇతర అంటువ్యాధి లాంటి సమస్యలు ఎదురవుతాయి.

మద్యం సేవించకూడదు

ధూమపానం లాగా మద్యం సేవించటం కూడా మీ ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు, మద్యం సేవించటం వలన శిశువు యొక్క పెరుగుదలలో సమస్యలు ఎదురవుతాయి. దీని వలన శిశువు అనేక ఆరోగ్య లోపాలతో పుట్టే ప్రమాదం ఉంది.

మందులు

మీరు ఏదైనా ఆరోగ్య సమస్య కొరకు మందులను వాడుతున్నట్లయితే మీ గర్భధారణ సమయంలో శిశువుకు ఎలాంటి హానీ కలగకుండా ఉండేందుకు ఒక వైద్యుడిని సంప్రదించి మందులను సరిచూడండి.

మంచి అలవాట్లను పెంచుకోండి

మీ గర్భంలో సమస్యలను నివారించేందుకు మొదటి త్రైమాసికంలో కొన్ని మంచి అలవాట్లను పెంచుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి.

మీ బరువును పరిశీలించండి

మీ మొదటి త్రైమాసికంలో ఎన్నో పదార్థాలను తినాలన్న కోరిక పుడుతుంది. వాటిని తినేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. మీ శరీరానికి కావలసిన కేలరీలను బట్టి ఆహారాలను తీసుకోవాలి. లేకపోతే మీ ఆరోగ్యం మరియు శిశువు యొక్క ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

మీరు మామూలుగా తీసుకునే ఆహారంకన్న రోజుకు 300 కేలరీలు మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి. మీ బరువుని క్రమం తప్పకుండా చెక్ చేయండి, మొత్తం గర్భధారణ సమయంలో 30 నుండి 35 పౌండ్ల బరువు మాత్రమే పెరగాలి. ఒక వేళ గర్భిణీ స్త్రీ అండర్ వెయిట్ అయితే 35 నుండి 45 పౌండ్లు పెరగచ్చు, ఓవర్ వెయిట్ అయితే 10 నుండి 20 పౌండ్ల వరకు పెరగచ్చు.

ఒత్తిడిని నిరోధించండి

ఒత్తిడి మరియు ఆందోళనను నివారించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఒత్తిడి వలన శిశువు తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకుండానే శిశువు జన్మించటం మరియు ఇతర సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడిని తొలగించేందుకు మీకు నచ్చిన పనులను లేదా కార్యకలాపాలను చేయండి. యోగా, ధ్యానం, బ్రీతింగ్ వ్యాయామాలను కూడా చేయవచ్చు.

Posted on

Causes of menopause in Telugu – మెనోపాస్ అంటే ఏమిటి? మహిళల్లో మెనోపాస్ లక్షణాలు మరియు కారణాలు

వయస్సుతో పాటు మహిళలు తమ శరీరంలో కొన్ని మార్పులను పొందుతారు. 10-12 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకూ ప్రతి మహిళలో ఋతు చక్రం చాలా సాధారణం. 50 సంవత్సరాలు దాటిన తరువాత ఋతు చక్రం ఆగిపోతుంది. ఈ దశను మెనోపాస్ (ముట్లుడుగు కాలం) అని పిలుస్తారు. దీనిని ‘రజోనివృత్తి’ అని కూడా అంటారు. ఇది వ్యాధి కాదు. ఇది ఒక వయస్సు తరువాత ప్రతి మహిళా ఎదుర్కునే సహజ స్థితి. ఋతు చక్రం ఆగిన తరువాత గర్భవతి కావటం అసాధ్యం.

మహిళలలో మెనోపాస్ సమయంలో అనేక లక్షణాలు కనపడతాయి. క్రింద చెప్పిన వివిధ భౌతిక మరియు మానసిక మార్పులను ఎదుర్కుంటారు.

  • తలనొప్పి
  • నిద్రలేమి
  • అలసట
  • కీళ్లు మరియు కండరాల నొప్పి
  • మానసిక కల్లోలం
  • చిరాకు
  • మూత్రాశయ నియంత్రణలో సమస్యలు
  • డిప్రెషన్
  • గుండె వేగంగా కొట్టుకోవటం
  • యోని పొడిబారటం
  • సెక్స్ డ్రైవ్ తగ్గటం

మెనోపాస్ యొక్క కారణాలు

జీవశాస్త్ర ప్రకారం, ప్రతి మహిళ పుట్టేటప్పుడు పరిమిత సంఖ్యలో గుడ్లు కలిగి ఉంటారు. ఈ గుడ్లు అండాశయాలలో ఉంటాయి. ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ హార్మోన్ల తయారీలు అండాశయాలలోనే జరుగుతుంది. అండోత్సర్గము మరియు ఋతు స్రావం సరైన నియంత్రణలో ఉండేందుకు ఈ హార్మోన్లు సహాయపడతాయి. ఋతు చక్రం ఆగినప్పుడు స్త్రీ యొక్క అండాశయము గుడ్లను విడుదల చేయదు. దీనిని మెనోపాస్ అని అంటారు. మెనోపాస్ అందరికీ ఒకే వయస్సులో జరగదు. కొంతమంది మహిళలు 60 సంవత్సరాల వరకు ఋతు చక్రం కలిగి ఉంటారు. మరి కొందరికి చాలా చిన్న వయస్సులోనే మెనోపాస్ ఏర్పడుతుంది.

40 ఏళ్ళ తరువాత సహజంగా రుతు స్రావం ఆగిపోతే అది సాధారణ ప్రక్రియ. కానీ అండాశయంలో సమస్య ఏర్పడి సర్జరీ చేయటం లేదా కాన్సర్ వలన కీమోథెరపీ చికిత్స చేయటం లాంటి కారణాల వలన ఋతు చక్రం అసహజంగా అగిపోతుంది.

ఋతు చక్రం ఆగే దశలు

ప్రాకృతికంగా మెనోపాస్ మూడు దశలలో జరుగుతుంది.

మొదటి దశ: పెరి మెనోపాస్.

ఇది మెనోపాస్ కాలానికి కొద్ది సంవత్సరాల ముందు స్త్రీలు ఎదుర్కొను దశ. ఈ దశలో మీ అండాశయములో తక్కువ ఈస్ట్రోజెన్ ఉత్పత్తి అవుతాయి మరియు గుడ్లు అరుదుగా విడుదల అవుతాయి. అంతే కాదు గర్భం ధరించే అవకాశాలు కూడా తక్కువ. మెనోపాస్ కలిగే రెండు సంవత్సరాల ముందు నుండి ఈస్ట్రోజెన్ వేగంగా తగ్గడం మొదలవుతుంది.

రెండవ దశ: మెనోపాస్

ఈ దశలో ఋతు చక్రం పూర్తిగా ఆగిపోతుంది. ఒక సంవత్సరం వరకు ఋతు స్రావం జరగకపోతే మీరు మెనోపాస్ దశలో ఉన్నట్టు తెలుసుకోవచ్చు. ఈ దశలో అండాశయం నుండి గుడ్లు విడుదల పూర్తిగా ఆగిపోతుంది మరియు ఈస్ట్రోజన్ని పూర్తిగా కోల్పోతుంది. ఈ దశలో మహిళలు గర్భవతి అయ్యే అవకాశం లేదు.

మూడవ దశ: పోస్ట్ మెనోపాస్

మెనోపాస్ తరువాత కొన్ని సంవత్సరాలు ఈ దశలో మహిళలు మానసికంగా ప్రభావితులవుతారు.

అకాల మెనోపాస్

చాలా మంది మహిళలు అకాల మెనోపాస్ తో బాధపడుతుంటారు. ఇందుకు కారణాలు ప్రతిఒక్కరికి వేరుగా ఉంటుంది.

  • అండాశయములోనే ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ హార్మోన్లు తయారు అవుతాయి, కనుక అండాశయం నుండి గుడ్లు ఉత్పత్తి కాకపోతే ఈ పరిస్థితి ఏర్పడవచ్చు.
  • ఏదైనా ఆరోగ్యసమస్య వలన శరీరం నుండి అండాశయం తీసివేయటం వలన కూడా మెనోపాస్ ఏర్పడుతుంది.

గర్భాశయంలో కాన్సర్ మరియు కీమోథెరఫీ రేడియేషన్ వలన కూడా ప్రీమెచూర్ మెనోపాస్ కలగవచ్చు.

Posted on

Telugu tips for pregnant women with thyroid problems – థైరాయిడ్ సమస్యలు ఉన్న గర్భిణీ స్త్రీలు – కారణాలు మరియు చికిత్సలు

స్త్రీలకు గర్భం ధరించడం ఒక వరం. ప్రతి గర్భిణీ ఈ సమయంలో ఎంతో ఆనందాన్ని పొందుతుంది. కానీ గర్భిణిగా ఉన్నప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు కలగచ్చు, థైరాయిడ్ సమస్య అందులో ఒకటి. థైరాయిడ్ ని అవటుగ్రంథిమరియు కాకళగ్రంథి అని అంటారు.

థైరాయిడ్ గ్రంథులు జీవక్రియను సమతుల్యంగా ఉంచేందుకు కావలసిన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో ఈ గ్రంథులు ఎక్కడ ఉంటాయో మీకు తెలుసా? మీ మెడలో ఆడమ్స్ ఆపిల్ క్రింద ఒక సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథులు ఎక్కువగా పనిచేయటం లేదా సరిగ్గా పనిచేయక పోవటం వలన సమస్యలు కలగవచ్చు.

థైరాయిడ్ గురించి కొన్ని వివరాలను చూద్దాం

థైరాయిడ్ గ్రంథులు కొన్ని సార్లు ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది మరి కొన్ని సార్లు చాలా తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే హైపర్ థైరాయిడిజం అని అంటారు. తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే హైపో థైరాయిడిజం అని అంటారు.

గర్భిణి స్త్రీలు తెలుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు థైరాయిడ్ సమస్య ఉన్నప్పటికీ మీకు ప్రసవించే శిశువుకు ఎలాంటి ఆరోగ్య సమస్యా కలగకుండా చూసుకోవచ్చు. ఇందుకు మీరు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్సను పొందాలి. మీ వైద్యుడు సూచించిన మందులను సరైన సమయాలకు వేసుకోవటం మర్చిపోకూడదు.

గర్భిణి స్త్రీలలో థైరాయిడ్ యొక్క ముఖ్యత్వం

శిశువు యొక్క మెదడు పెరుగుదల మరియు నాడీ వ్యవస్థ యొక్క పెరుగుదల మీ థైరాయిడ్ హార్మోన్ల మీద ఆధారపడి ఉంటుంది. మొదటి 3 నెలల్లో ప్లాసెంటా మూలంగా శిశువుకు కావలసిన హార్మోన్లు మీ నుండి సరఫరా అవుతుంది.18-20 వారాల తరువాత మీ శిశువు యొక్క థైరాయిడ్ పని చేయటం మొదలుపెడుతుంది.

థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువ కావటానికి లేదా తక్కువ కావటానికి కారణం ఈస్ట్రోజెన్మరియు హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్‘ (HCG) అనే రెండు హార్మోన్లు. మీరు కొద్దిగా అధిక బరువు ఉన్నట్లయితే మీ గర్భధారణ సమయంలో థైరాయిడ్ పెరుగుతుంది. కానీ ఈ మార్పులను కనుక్కోవటం మీ వైద్యులకు అంత సులువు కాదు. ఎందుకంటే, థైరాయిడ్ రుగ్మత వలన మాత్రమే కాదు ప్రెగ్నెన్సీ వలన కూడా థైరాయిడ్ హార్మోన్లలో మార్పులు కలుగుతుంది. కావున కొన్ని లక్షణాలను బట్టే ఈ సమస్యను కనుక్కోగలుగుతారు.

థైరాయిడ్ యొక్క లక్షణాలను చూద్దాం

హైపర్ థైరాయిడిజం

నీరసంగా ఉండటం, హృదయ స్పందన వేగంగా ఉండటం మరియు క్రమంగా లేకపోవటం, సరిగ్గా నిద్ర పట్టక పోవటం, ఎక్కువ దిగులుగా ఉండటం, బరువు తగ్గటం లేదా ఎక్కటం, వాంతులు లేదా తీవ్రమైన వికారం కలగటం, వణుకు పుట్టడం వంటి లక్షణాలను చూపుతుంది.

హైపో థైరాయిడిజం

బరువు పెరగటం, తీవ్రమైన అలసట కలగటం, ఏకాగ్రత లేక పోవటం లేదా విషయాలను తొందరగా మరిచిపోవటం, మలబద్ధకం, చలిని తట్టుకోలేక పోవటం మరియు తిమ్మిరి వంటి లక్షణాలను చూపుతుంది.

గర్భధారణ సమయంలో థైరాయిడ్ వ్యాధికి కారణాలు ఏమిటి?

హైపర్ థైరాయిడిజం కలగటానికి కారణం ఆటో ఇమ్యూన్ డిసార్డర్. శరీరంలో గ్రేవ్స్ వ్యాధిఅనే ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కలిగినప్పుడు థైరాయిడ్ – స్టిములేటింగ్ ఇమ్యునోగ్లోబిన్ (TSI)’ అనే యాంటీ బాడీఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

హైపో థైరాయిడిజం కలగటానికి కారణం హషిమోటోస్ థైరాయిడిటిస్అనే ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. దీని వలన మీ థైరాయిడ్కు కావలసిన కణాలు అందకుండా పోతుంది. కావున తక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు థైరాయిడ్ వ్యాధికి ఎలా చికిత్స చేయాలి?

ఈ వ్యాధి యొక్క లక్షణాల బట్టి, భౌతిక పరీక్షల బట్టి మరియు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లు (TSH), థైరాయిడ్ హార్మోన్లు T4 మరియు హైపర్ థైరాయిడిజం T3 లను కనుకొనే కొన్ని రక్త పరీక్షలను బట్టి మీ థైరాయిడ్ సమస్యను సులభంగా నిర్ధారించ వచ్చు.

మీకు హైపర్ థైరాయిడిజం ఉందని గుర్తించబడితే, సమస్యను పరిష్కరించడానికి యాంటీ థైరాయిడ్ మందులను ఉపయోగించవచ్చు. కొన్ని తీవ్రమైన సందర్భాలలో, శస్త్రచికిత్సలు సహాయపడతాయి. హైపో థైరాయిడిజం ను T4 హార్మోన్‌లకు సమానమైన లెవోథైరోక్సిన్ తో చికిత్స చేయవచ్చు.

ఈ ఆర్టికల్ మీకు సహాయపడిందని ఆశిస్తున్నాము. జాగ్రత్తగా ఉండండి మరియు పై చెప్పబడిన ఏదైనా లక్షణాలు మీలో కనపడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్సను పొందండి. ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉండండి.