Posted on

Best days to get pregnant in Telugu – సరిగ్గా నెలసరుల ముందు గర్భవతి అయ్యే అవకాశాలు ఉన్నాయా?

రుతుస్రావం ముగిసిన ఒక రోజు తరువాత గర్భవతి కావటం సాధ్యపడదు కానీ కొన్ని సందర్భాల్లో అవకాశాలు ఉన్నాయి. మీరు గర్భవతి అయ్యే అవకాశాలను మీ ఋతు చక్రం యొక్క కాల పొడవు నిర్ణయిస్తుంది.

మామూలుగా రుతుస్రావం 28 రోజులకు ఒక సారి ఏర్పడుతుంది. ఋతు చక్రం ప్రారంభించిన 14వ రోజు, మీ అండాశయాలు ఒక గుడ్డుని విడుదల చేస్తుంది మరియు ఈ గుడ్డు యొక్క అండోత్సర్గం వలన రక్తస్రావం మొదలవుతుంది. రక్తస్రావం మొదలైన రోజు నుండి ఋతు చక్రం లెక్కించబడుతుంది. మీ ఋతు చక్రం యొక్క కాలం 28 రోజులు అయితే 11 నుండి 16 రోజుల మధ్యలో అండోత్సర్గం ఏర్పడవచ్చు. ఈ మధ్య కాలంలో గుడ్డు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ గుడ్డు యొక్క పరిపక్వతను బట్టి అండోత్సర్గం జరుగుతుంది.

మీ ఋతు చక్రం 28 రోజులకు ఒకసారి జరుగుతున్నట్లయితే 14 వ రోజున అండోత్సర్గం జరుగుతుంది. ఒక వేళ మీ ఋతు చక్రం యొక్క కాలం 22 రోజులు అయితే మీ నెలసరులు ముగిసిన వెంటనే అండోత్సర్గం జరిగే అవకాశం ఉంది. ఋతు చక్రం యొక్క కాలం (22 రోజులు) తక్కువగా ఉండి రుతుస్రావం 7 రోజుల వరకూ ఉన్నట్లయితే అప్పుడు కూడా రుతుస్రావం ముగిసిన వెంటనే అండోత్సర్గం జరిగే అవకాశాలు ఉన్నాయి. పురుషుల యొక్క స్పెర్మ్ స్త్రీ యొక్క శరీరంలో 6-7 రోజుల పాటు ఆక్టివ్ గా ఉంటుంది కనుక ఆ సమయంలో గర్భం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

స్పెర్మ్ యొక్క జీవితం 2-3 రోజుల నుండి 6-7 రోజులు ఉండొచ్చు. సారవంతమైన సెర్వికల్ ఫ్లూయిడ్ తక్కువగా ఉన్నట్లయితే స్పెర్మ్ యొక్క జీవిత కాలం మరింత తక్కువ కావచ్చు. అండోత్సర్గం జరిగిన రోజు లేదా దానికి ఐదు రోజుల లోపల లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లయితే గర్భవతి కాగలరు. ఒక గుడ్డు అండోత్సర్గము జరిగిన 24 గంటలలో ఫలదీకరణం జరగినట్లయితే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది.

గర్భం ధరించే మరి కొన్ని అవకాశాల గురించి తెలుసుకుందాం

  1. స్త్రీలలో అండోత్సర్గం ప్రక్రియ జరుగుతున్న సమయం ముగిసి, గర్భాశయంలో ఆరోగ్యవంతమైన అండం ఉండి ఉన్నట్లయితే గర్భం ధరించే అవకాశాలు ఎక్కువ.
  2. పురుషుడు ఉత్పత్తి చేసే శుక్రకణం ఆరోగ్యవంతమైనదై ఉండి, యోని ముఖద్వారం నుండి గర్భాశయం వరకు ప్రయాణం చేసే సామర్థ్యం కలిగి ఉన్నట్లయితే గర్భం ధరించగలరు.
  3. పురుషుని వీర్యంలో ఉండే కొన్ని కోట్ల శుక్రకణాలు, ఫెలోపియన్ ట్యూబ్యుల్స్ ద్వారా అండాశయం వరకు ప్రయాణించే సామర్ధ్యం కలిగి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో అంగ ప్రవేశం జరగనప్పటికీ, గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఇందుకు కారణం లైంగిక సంబంధం కలిగి ఉన్న సమయంలో చేసే కొన్ని చేష్టలు. ఇందు వలన కూడా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. పురుషులలో ఉత్పత్తి అయ్యే శుక్రకణంకు, స్త్రీ యొక్క ప్రత్యుపత్తి వ్యవస్థ గుండా ప్రయాణం చేసి, అండాన్ని ఫలదీకరించే అసామాన్యమైన శక్తి ఉంటుంది.
  4. శుక్రకణంకు ఉన్న ఇంకొక విశిష్టత ఏమిటంటే, ఇది అనుకూల పరిస్థితులలో, ఐదు రోజుల వరకు జీవించి ఉంటుంది. కనుక యోని పరిసరాల్లో ఎక్కడ స్కలించినా, శరీరం యొక్క ఉష్ణోగ్రత వలన శుక్రకణం జీవించి ఉండి అండం వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ విధంగా కూడా ప్రెగ్నెంట్ కావచ్చు.
  5. వొవ్యులేషన్ కిట్ ని ఉపయోగించటం వలన గర్భం ధరించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఈ కిట్ లు మార్కెట్ లో సులభంగా లభిస్తున్నాయి. ఈ కిట్ లో యూరిన్ టెస్ట్ స్ట్రిప్స్ ఉంటాయి. వాటి ద్వారా అండోత్సర్గం యొక్క తేదిని సులభంగా కనిపెట్టవచ్చు. మారి ఆ సమయంలో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లయితే తొందరగా గర్భం ధరించవచ్చు.

సరిగ్గా నెలసరుల ముందు గర్భవతి అయ్యే అవకాశాలు ఉన్నాయా?

నెలసరులకు ముందు అనగా పీరియడ్స్ వచ్చే రోజూ రెండు రోజుల ముందు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మీ రుతు చక్రం 28-30 రోజులు అయితే గుడ్ల అండోత్సర్గం 11 నుండి 21 రోజు లోపు జరుగుతుంది. శుక్రకణం 3-6 రోజుల వరకు ఆక్టివ్ గా ఉన్నప్పటికీ గుడ్డు ఒక రోజు (12 నుండి 24 గంటలు) మాత్రమే ఉంటుంది.

కనుక నెలసరులకు ఒక రోజు లేదా రెండు రోజుల ముందు గర్భం ధరించలేరు. ఆ రోజుల్లో దంపతుల లైంగిక సంబంధం ఎంతో సురక్షితం. మరి గర్భం ధరించాలని కోరుకునే వారు రుతు చక్రం యొక్క 11 నుండి 21 రోజుల మధ్య లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లయితే సులభంగా గర్భం ధరించవచ్చు.

Posted on

Telugu tips to calculate the most fertile days in women – మహిళల్లో అత్యంత ఫర్టిలిటీ రోజులను లెక్కించే విధానాలు

మీరు గర్భవతి అవ్వటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే మీరు ఉత్తమ సంతానోత్పత్తి సమయం ఎప్పుడని తెలుసుకోవడం చాలా అవసరం. మీరు అండోత్సర్గం క్యాలెండర్‌ను మరియు గర్భధారణ అవకాశాలు పెంచడానికి లైంగిక సంబంధాలకు మంచి సమయాలను లెక్కించాలి. మీరు చేయవలసిందల్లా మీ ఋతు చక్రంను సరిగ్గా ట్రాక్ చేయాలి.

మీ పీరియడ్స్ యొక్క అత్యంత ఫర్టిలిటీ రోజులను తెలుసుకోండి

మీకు మీ ఋతు చక్రం సరిగ్గా ఉన్నప్పటికీ గర్భవతి కాలేకపోతున్నారా! సరైన సమయంలో నెలసరులు వస్తున్నప్పటికీ ప్రెగ్నెన్సీ సమస్యను ఎదుర్కొనుట సహజమయిన విషయమే. ఋతు స్రావం సమయంలో మహిళలు గర్భవతి అవుతారని ప్రజలు నమ్ముతుంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఋతు చక్రాల రోజులలో సంతానోత్పత్తి ప్రక్రియ జరగదు. అండోత్సర్గం సంభవిస్తేనే మీరు గర్భవతి కాగలుగుతారు. అండోత్సర్గము జరిగే ముందు కూడా గర్భం ధరించవచ్చు. అండోత్సర్గము అంటే ఒక పరిపక్వ గుడ్డు మీ అండాశయం లోనికి ప్రవేశిస్తుంది మరియు ఆ గుడ్డు స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చేయబడుతుంది. ఇప్పుడు, మీ ఫర్టిలిటీ రోజులు ఏమిటో అది మీరు ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం.

మందమైన లైనింగ్ యొక్క తొలగింపు

మీ గర్భాశయం నుండి మీ యోని ద్వారా బయటకి వచ్చిన మందమైన లైనింగ్‌ని మీరు గమనిస్తునట్లయితే అది మీ ఫర్టిలిటీకి ఉత్తమ సమయం అని తెలుసుకోవచ్చు. మరియు ఇది మీ ఋతు స్రావ సమయంలో 3 నుండి7 రోజులు రక్తస్రావానికి కారణమవుతుంది. ఫొలికల్స్ లో గుడ్డు ఉంటుంది మరియు దాని పెరుగుదల 13 నుండి 14 రోజుల ఫోలిక్యులర్ ఫేస్లో జరుగుతుంది.

లూటినీజింగ్ హార్మోన్

లూటినీజింగ్ హార్మోన్ స్థాయి పెరుగినప్పుడు అండోత్సర్గము ఏర్పడుతుంది. ఇది చాలా చిన్న దశ, కేవలం 16 నుండి 32 గంటలు మాత్రమే కొనసాగుతుంది. శరీరం నుండి ఒక గుడ్డును విడుదల చేయడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది.

మితవాద (లుటీల్) పరిస్థితి

ఇది అండోత్సర్గము తర్వాత ప్రారంభమవుతుంది మరియు మీ తరువాతి పీరియడ్స్ వరకు కొనసాగుతుంది. ఇది గుడ్డు ఫలదీకరణం చేయబడినప్పుడు మరియు గర్భాశయ గోడలో అమర్చబడే సమయంలో గర్భాశయంను సిద్ధం చేయడానికి బాగా సహాయపడుతుంది.

గర్భం ధరించడానికి ఉత్తమ సమయం తెలుసుకోండి

మీరు ప్రెగ్నెన్ట్ కావడానికి మీ భాగస్వామితో సంపర్కం కలిగి ఉండేందుకు ఉత్తమ సమయం తెలుసుకోవాలి. మీ భాగస్వామితో సెక్స్ చేయడం ద్వారా గర్భవతి అవ్వడానికి ఋతు చక్రం సమయంలో చాలా అవకాశాలు ఉంటాయి. చాలామంది మహిళలకు ఆరు రోజులు చాలా సాధారణ సంతానోత్పత్తి రోజులు.

ఆ రోజులలో లైంగిక సంబంధం కలిగి ఉండటం వలన గర్భవతి అవుతారని భరోసా ఉండదు, కానీ గర్భవతి కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

మీరు ఒక విషయాన్ని మర్చిపోకూడదు, ఏమిటంటే అండోత్సర్గము ముందు లేదా అండోత్సర్గము జరిగిన 24 గంటల తరువాత గర్భవతి అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి.

మీ పీరియడ్స్ యొక్క క్రమబద్ధతను తెలుసుకోండి

ప్రతి మహిళకు ఋతు చక్రం వేరుగా ఉంటుంది, అది ఒత్తిడి వంటి కొన్ని కారణాల వలన కూడా మార్పు చెందుతుంది. మీరు మూడు నుండి నాలుగు నెలల పాటు మీ ఋతు స్రావం ఎంతకాలం కొనసాగుతోంది మరియు ప్రతి నెలా అదే సమయంలో సంభవిస్తోందా అని గమనించాలి.

మీ నెలసరులు సంభవించినప్పుడు తేదీని ప్రారంభించి మీ తదుపరి నెలసరి సంభవించే వరకు రోజులను లెక్కించండి. ఋతు చక్రం యొక్క సాధారణ వ్యవధి 28 రోజులు లేదా 21 నుండి 35 రోజుల వరకు ఉంటుంది.

ఇర్రెగులర్ పీరియడ్స్ సమస్య ఉందా?

మీరు మీ నెలసరులను మూడు నుండి నాలుగు నెలలు ట్రాక్ చేయాలి. ఒకవేళ క్రమంగా లేనట్టు కనుగొంటే, మీకు ఇర్రేగులర్ పీరియడ్స్ ఉన్నట్టు. ఎక్కువ శారీరక కార్యకలాపాలు, వైద్య సమస్యలు, ఒత్తిడి మరియు బరువు తగ్గటం వంటి కారణాల వలన ఇర్రెగులర్ పీరియడ్స్ కలుగుతాయి. ఇటువంటప్పుడు తీవ్రమైన వైద్య సమస్యలను నివారించడానికి మీ డాక్టర్ను సంప్రదించండి. క్రమరహిత నెలసరులలో గర్భధారణ కలగవచ్చు, అయితే దీనికి కొద్దిగా సమయం పడుతుంది మరియు కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.

మీకు మూడు నెలల వరకు పీరియడ్స్ రాకపోయినా మరియు మీరు కన్సీవ్ కాకపోయినా మీకు వైద్య సహాయం అవసరం. హార్మోన్ల రుగ్మత క్రమరాహిత్యమైన ఋతు స్రావానికి కారణమవుతుంది. మీ పునరుత్పత్తి అవయవాలలో ఇన్ఫెక్షన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యల వలన కూడా ఇర్రేగులర్ పీరియడ్స్ కలగవచ్చు.

మీ ఫర్టిలిటీ కాలాన్ని తెలుసుకోండి

మీకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నట్లయితే గర్భవతి కావటం చాలా సులభం. మీరు మీ నెలసరుల ఆధారంగా మీ సంతానోత్పత్తికి తగిన కాలాన్ని తెలుసుకోవచ్చు. మీ అండోత్సర్గము ప్రారంభం అయినప్పటి నుండి మీ సంతానోత్పత్తి విండో ప్రారంభమవుతుందిఅండోత్సర్గము జరిగిన రోజుతో సహా మొత్తం ఆరు రోజులు. మీ ఋతు చక్రం కాలాన్ని ఉపయోగించి మీ ఫర్టిలిటీ రోజులను తెలుసుకోవచ్చు. ఋతు చక్రం యొక్క సమయం నుండి 14 రోజులు తీసివేయాలి.

  • మీ ఋతు చక్రం 28 రోజుల పాటు కొనసాగినట్లయితే ఋతు చక్రం యొక్క 14వ రోజు అండోత్సర్గము జరుగుతుంది. 14వ రోజు మీకు అత్యంత సారవంతమైనది మరియు 12, 13 రోజులు కూడా సారవంతమైనవి.
  • మీ ఋతు చక్రం 21 రోజుల పాటు ఉన్నట్లయితే అండోత్సర్గము 7వ రోజు జరుగుతుంది. 7వ రోజుతో పాటు, 5 మరియు 6 వ రోజులు కూడా మరింత సారవంతమైనవి.
  • మీ ఋతుచక్రం 35 రోజుల పాటు కొనసాగినట్లయితే, మీ ఋతు చక్రం యొక్క 21 వ రోజున అండోత్సర్గము జరుగుతుంది. 21 అలాగే 19 మరియు 20వ రోజు కూడా సారవంతమైన రోజులు.
Posted on

Telugu tips to care pregnant women in first trimester – ప్రెగ్నెన్సీ యొక్క మొదటి త్రైమాసికంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రెగ్నెన్సీ ఒక అద్భుతమైన అనుభూతి. గర్భం యొక్క కాలం సుమారు 40 వారాల పాటు ఉంటుంది, ఇది మూడు త్రైమాసికంగా విభజించబడింది. గర్భం యొక్క మొదటి మూడు నేలలను, మొదటి త్రైమాసికం అని అంటారు. మొదటి త్రైమాసికంలో మీ శిశువు యొక్క మెరుగైన మరియు ఆరోగ్యకరమైన పెరుగుదల కొరకు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.

అదనపు పోషకాలను తీసుకోండి

మీరు మాములుగా తీసుకునే పోషక ఆహారాలకు రెండు రేట్లు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే, మీ శిశువు యొక్క పెరుగుదల మరియు ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయటానికి ఎక్కువ పోషకాలు అవసరం అవుతాయి.

పాలు, గుడ్లు మరియు టూనా, సాల్మన్ లాంటి ఆహారాల నుండి లభించే విటమిన్ డి ని మీరు అవసరమైన మోతాదులలో పొందుతున్నారు అని నిర్ధారించుకోండి. కాల్షియమ్ మరియు ఫాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను లేదా సప్లిమెంట్స్ ను మీ డైట్ లో చేర్చుకోండి. ఇవి మీ శిశువు పెరుగుదలకు కావలసిన ఐరన్ మరియు ఫోలిక్ ఆసిడ్స్ ను అందిస్తుంది.

ఈ జాగ్రత్తలతో పాటు వైద్యుల వద్ద మీరు రెగ్యులర్గా చేసుకోవాల్సిన పరీక్షలను కూడా క్రమం తప్పకుండా చేయండి.

ధూమపానం మానుకోండి

ధూమపానం ఆరోగ్యానికి హానికరం, కనుక మీకు ఈ అలవాటు ఉన్నట్లయితే మీ ఆరోగ్యం కొరకు మరియు మీ శిశువు యొక్క ఆరోగ్యం కొరకు ఈ అలవాటుని మానుకోండి. ప్రెగ్నెన్సీ సమయంలో ధూమపానం వలన మీ శిశువు యొక్క పెరుగుదలలో లోపం, డెలివరీ సమయంలో తక్కువ బరువు ఉండటం, రోగ నిరోధక శక్తి లేకపోవటం మరియు ఇతర అంటువ్యాధి లాంటి సమస్యలు ఎదురవుతాయి.

మద్యం సేవించకూడదు

ధూమపానం లాగా మద్యం సేవించటం కూడా మీ ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు, మద్యం సేవించటం వలన శిశువు యొక్క పెరుగుదలలో సమస్యలు ఎదురవుతాయి. దీని వలన శిశువు అనేక ఆరోగ్య లోపాలతో పుట్టే ప్రమాదం ఉంది.

మందులు

మీరు ఏదైనా ఆరోగ్య సమస్య కొరకు మందులను వాడుతున్నట్లయితే మీ గర్భధారణ సమయంలో శిశువుకు ఎలాంటి హానీ కలగకుండా ఉండేందుకు ఒక వైద్యుడిని సంప్రదించి మందులను సరిచూడండి.

మంచి అలవాట్లను పెంచుకోండి

మీ గర్భంలో సమస్యలను నివారించేందుకు మొదటి త్రైమాసికంలో కొన్ని మంచి అలవాట్లను పెంచుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి.

మీ బరువును పరిశీలించండి

మీ మొదటి త్రైమాసికంలో ఎన్నో పదార్థాలను తినాలన్న కోరిక పుడుతుంది. వాటిని తినేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. మీ శరీరానికి కావలసిన కేలరీలను బట్టి ఆహారాలను తీసుకోవాలి. లేకపోతే మీ ఆరోగ్యం మరియు శిశువు యొక్క ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

మీరు మామూలుగా తీసుకునే ఆహారంకన్న రోజుకు 300 కేలరీలు మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి. మీ బరువుని క్రమం తప్పకుండా చెక్ చేయండి, మొత్తం గర్భధారణ సమయంలో 30 నుండి 35 పౌండ్ల బరువు మాత్రమే పెరగాలి. ఒక వేళ గర్భిణీ స్త్రీ అండర్ వెయిట్ అయితే 35 నుండి 45 పౌండ్లు పెరగచ్చు, ఓవర్ వెయిట్ అయితే 10 నుండి 20 పౌండ్ల వరకు పెరగచ్చు.

ఒత్తిడిని నిరోధించండి

ఒత్తిడి మరియు ఆందోళనను నివారించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఒత్తిడి వలన శిశువు తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకుండానే శిశువు జన్మించటం మరియు ఇతర సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడిని తొలగించేందుకు మీకు నచ్చిన పనులను లేదా కార్యకలాపాలను చేయండి. యోగా, ధ్యానం, బ్రీతింగ్ వ్యాయామాలను కూడా చేయవచ్చు.

Posted on

Telugu tips for pregnant women with thyroid problems – థైరాయిడ్ సమస్యలు ఉన్న గర్భిణీ స్త్రీలు – కారణాలు మరియు చికిత్సలు

స్త్రీలకు గర్భం ధరించడం ఒక వరం. ప్రతి గర్భిణీ ఈ సమయంలో ఎంతో ఆనందాన్ని పొందుతుంది. కానీ గర్భిణిగా ఉన్నప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు కలగచ్చు, థైరాయిడ్ సమస్య అందులో ఒకటి. థైరాయిడ్ ని అవటుగ్రంథిమరియు కాకళగ్రంథి అని అంటారు.

థైరాయిడ్ గ్రంథులు జీవక్రియను సమతుల్యంగా ఉంచేందుకు కావలసిన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో ఈ గ్రంథులు ఎక్కడ ఉంటాయో మీకు తెలుసా? మీ మెడలో ఆడమ్స్ ఆపిల్ క్రింద ఒక సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథులు ఎక్కువగా పనిచేయటం లేదా సరిగ్గా పనిచేయక పోవటం వలన సమస్యలు కలగవచ్చు.

థైరాయిడ్ గురించి కొన్ని వివరాలను చూద్దాం

థైరాయిడ్ గ్రంథులు కొన్ని సార్లు ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది మరి కొన్ని సార్లు చాలా తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే హైపర్ థైరాయిడిజం అని అంటారు. తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే హైపో థైరాయిడిజం అని అంటారు.

గర్భిణి స్త్రీలు తెలుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు థైరాయిడ్ సమస్య ఉన్నప్పటికీ మీకు ప్రసవించే శిశువుకు ఎలాంటి ఆరోగ్య సమస్యా కలగకుండా చూసుకోవచ్చు. ఇందుకు మీరు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్సను పొందాలి. మీ వైద్యుడు సూచించిన మందులను సరైన సమయాలకు వేసుకోవటం మర్చిపోకూడదు.

గర్భిణి స్త్రీలలో థైరాయిడ్ యొక్క ముఖ్యత్వం

శిశువు యొక్క మెదడు పెరుగుదల మరియు నాడీ వ్యవస్థ యొక్క పెరుగుదల మీ థైరాయిడ్ హార్మోన్ల మీద ఆధారపడి ఉంటుంది. మొదటి 3 నెలల్లో ప్లాసెంటా మూలంగా శిశువుకు కావలసిన హార్మోన్లు మీ నుండి సరఫరా అవుతుంది.18-20 వారాల తరువాత మీ శిశువు యొక్క థైరాయిడ్ పని చేయటం మొదలుపెడుతుంది.

థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువ కావటానికి లేదా తక్కువ కావటానికి కారణం ఈస్ట్రోజెన్మరియు హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్‘ (HCG) అనే రెండు హార్మోన్లు. మీరు కొద్దిగా అధిక బరువు ఉన్నట్లయితే మీ గర్భధారణ సమయంలో థైరాయిడ్ పెరుగుతుంది. కానీ ఈ మార్పులను కనుక్కోవటం మీ వైద్యులకు అంత సులువు కాదు. ఎందుకంటే, థైరాయిడ్ రుగ్మత వలన మాత్రమే కాదు ప్రెగ్నెన్సీ వలన కూడా థైరాయిడ్ హార్మోన్లలో మార్పులు కలుగుతుంది. కావున కొన్ని లక్షణాలను బట్టే ఈ సమస్యను కనుక్కోగలుగుతారు.

థైరాయిడ్ యొక్క లక్షణాలను చూద్దాం

హైపర్ థైరాయిడిజం

నీరసంగా ఉండటం, హృదయ స్పందన వేగంగా ఉండటం మరియు క్రమంగా లేకపోవటం, సరిగ్గా నిద్ర పట్టక పోవటం, ఎక్కువ దిగులుగా ఉండటం, బరువు తగ్గటం లేదా ఎక్కటం, వాంతులు లేదా తీవ్రమైన వికారం కలగటం, వణుకు పుట్టడం వంటి లక్షణాలను చూపుతుంది.

హైపో థైరాయిడిజం

బరువు పెరగటం, తీవ్రమైన అలసట కలగటం, ఏకాగ్రత లేక పోవటం లేదా విషయాలను తొందరగా మరిచిపోవటం, మలబద్ధకం, చలిని తట్టుకోలేక పోవటం మరియు తిమ్మిరి వంటి లక్షణాలను చూపుతుంది.

గర్భధారణ సమయంలో థైరాయిడ్ వ్యాధికి కారణాలు ఏమిటి?

హైపర్ థైరాయిడిజం కలగటానికి కారణం ఆటో ఇమ్యూన్ డిసార్డర్. శరీరంలో గ్రేవ్స్ వ్యాధిఅనే ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కలిగినప్పుడు థైరాయిడ్ – స్టిములేటింగ్ ఇమ్యునోగ్లోబిన్ (TSI)’ అనే యాంటీ బాడీఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

హైపో థైరాయిడిజం కలగటానికి కారణం హషిమోటోస్ థైరాయిడిటిస్అనే ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. దీని వలన మీ థైరాయిడ్కు కావలసిన కణాలు అందకుండా పోతుంది. కావున తక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు థైరాయిడ్ వ్యాధికి ఎలా చికిత్స చేయాలి?

ఈ వ్యాధి యొక్క లక్షణాల బట్టి, భౌతిక పరీక్షల బట్టి మరియు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లు (TSH), థైరాయిడ్ హార్మోన్లు T4 మరియు హైపర్ థైరాయిడిజం T3 లను కనుకొనే కొన్ని రక్త పరీక్షలను బట్టి మీ థైరాయిడ్ సమస్యను సులభంగా నిర్ధారించ వచ్చు.

మీకు హైపర్ థైరాయిడిజం ఉందని గుర్తించబడితే, సమస్యను పరిష్కరించడానికి యాంటీ థైరాయిడ్ మందులను ఉపయోగించవచ్చు. కొన్ని తీవ్రమైన సందర్భాలలో, శస్త్రచికిత్సలు సహాయపడతాయి. హైపో థైరాయిడిజం ను T4 హార్మోన్‌లకు సమానమైన లెవోథైరోక్సిన్ తో చికిత్స చేయవచ్చు.

ఈ ఆర్టికల్ మీకు సహాయపడిందని ఆశిస్తున్నాము. జాగ్రత్తగా ఉండండి మరియు పై చెప్పబడిన ఏదైనా లక్షణాలు మీలో కనపడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్సను పొందండి. ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉండండి.

Posted on

Post pregnancy Diet in Telugu – డెలివరీ తర్వాత తినకూడని ఆహార పదార్థాలు

శిశువు పుట్టిన తరువాత చాలా మంది బాలింతలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవటం మానేస్తారు. సరైన పోషక ఆహారం తినకపోవడం వలన ఎక్కువ బీపీ మరియు డయాబెటిస్స్ లాంటి సమస్యలు ఎదురవుతాయి. అంతే కాదు బాలింతలు తినకూడని కొన్ని ఆహారపదార్థాలు కూడా ఉన్నాయి. వాటి వివరాలను చూద్దాం.

నివారించవలసిన ఆహారాలు

వేయించిన పదార్థాలు

నూనెలో బాగా వేయించిన పదార్థాలలో ఎక్కువ కేలరీలు ఉంటాయి ఇవి కొవ్వును పెంచి శరీరం లావు అయ్యేందుకు కారణం అవుతాయి.

ప్రాసెస్స్ చేయబడిన ఆహార పదార్థాలు

మనం మార్కెట్లో ఎన్నో ఆహార పదార్థాలను ప్రాసెస్స్ చేసి ప్యాక్ చేసి అమ్మడం చూసే ఉంటాము, ముఖ్యంగా మాసం మరియు చేపలు. ఇవి తొందరగా చెడిపోకుండా ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ ని మరియు సోడియంను ఎక్కువగా కలుపుతారు. ఇవి చాలా హానికరమైనవి, వీటిని తినడం వలన బీపీ అధికరిస్తుంది మరియు మీ శరీరం యొక్క హోమియోస్టాసిస్ పై ప్రభావం చూపుతుంది.

ఆల్కహాల్

బాలింతలు మద్యం సేవించకూడదు. ఇది మీ శరీరానికి హాని కలిగించటమే కాకుండా శిశువుకు మీరు ఇచ్చే పాలలో చేరి వారి పెరుగుదలపై ప్రభావం చూపుతుంది.

పాలు

పాలు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ బాలింతలు తక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది మీరు శిశువుకు ఇచ్చే పాలలో చేరి మీ శిశువు యొక్క శరీరంలో లాక్టోజ్ అసహనాన్ని పెంచగలదు. పాలకు బదులుగా తక్కువ కొవ్వు కలిగిన పెరుగును తీసుకోండి.

కెఫీన్

కెఫీన్ మీకే కాదు మీ శిశువు యొక్క నిద్రను కూడా భంగ పరుస్తుంది, అంతే కాదు శిశువుకు చిరాకు మరియు ఒత్తిడిని కలిగిస్తుంది.

కారమైన ఆహార పదార్థాలు

బాలింతల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో కారమైన మరియు క్యాప్సైసిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణం అవటం చాలా కష్టం. ఇది మీ శరీరం యొక్క ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. అంతే కాదు మీరు ఇచ్చే పాల ద్వారా ఈ సమస్యలు శిశువుకు కూడా కలగచ్చు. వారికి అనేక కడుపు నొప్పి సమస్యలు కూడా రావచ్చు.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

  • బాలింతలు రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు త్రాగాలి.
  • శిశువు పుట్టిన తరువాత శరీరం యొక్క బరువు మెల్లగా తగ్గుతుంది, కావున సహనంతో ఉండాలి. తొందరగా తగ్గాలని ఎక్కువ శ్రమకరమైన వ్యాయామాలను చేయకూడదు.
  • కొద్దిగా వ్యాయామాలతో పాటు సరైన డైట్ ని కూడా పాటించండి.
  • ఎక్కువగా పచ్చని కూరగాయలు మరియు ఆకు కూరలను తినండి. కానీ కాలీఫ్లవర్ లాంటి వాయువును పంచే ఆహారాలను నిరోధించండి.
Posted on

Bleeding during pregnancy in Telugu – గర్భధారణ సమయంలో రక్తస్రావం యొక్క కారణాలు

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు రక్తస్రావం ఏర్పడితే మీకు భయం కలగచ్చు. కానీ గర్భం ధరించిన మొదటి మూడు త్రైమాసికంలో ఇది చాలా సాధారణం మరియు ఎలాంటి అపాయము కలిగించదు. పరిశోధన ప్రకారం 25% గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయంలో మొదటి త్రైమాసికంలో రక్తస్రావం సాధారణంగా ఏర్పడుతుంది, వీరిలో కొందరికి మాత్రమే భారీ రక్తస్రావం మరియు అపాయం కలుగుతుంది. ఇది కేవలం మూడు రోజులు లేదా అంతకంటే తక్కువ రోజులు ఉంటుంది.

రక్తస్రావం యొక్క కారణాలు

ఎగ్ ఇంప్లాంటేషన్

గుడ్డు ఫలదీకరణ గర్భాశయం యొక్క పొరల్లో జరిగినప్పుడు రక్తస్రావం ఏర్పడుతుంది. చాలామంది మహిళలు ఈ రక్తస్రావాన్ని తమయొక్క సాధారణ ఋతు స్రావం అని అనుకుంటారు.

హార్మోన్ల ప్రభావాలు

మీరు గర్భిణిగా ఉన్నప్పుడు రక్తస్రావాన్ని ఆప గలిగే హార్మోన్ల అసమతుల్యత వలన బ్రేక్‌త్రూ రక్తస్రావం కలుగుతుంది. ఇది మీకు ఎలాంటి హానీ కలిగించదు ఎందుకంటే మీ అండాశయం నుండి ప్లాసెంటా ఈ హార్మోన్లను ఉత్పత్తి చేసి రక్తస్రావాన్ని ఆపుతుంది. కొందరికి ఈ రక్తస్రావం గర్భధారణ సమయం మొత్తం ఉండొచ్చు. వీటి యొక్క లక్షణాలు మీ మామూలు ఋతు స్రావం సమయంలో కలిగేటువంటి తిమ్మిరి మరియు వెన్నునొప్పి లాంటివి. దీని వలన చాలా మంది మహిళలు మొదటి త్రైమాసికంలో దీనిని నెలసరి ఋతు స్రావం అని అనుకుంటారు.

సెక్స్

గర్భం ధరించిన తరువాత సెక్స్ వలన రుతుస్రావం ఏర్పడుతుంది. ఇది ఎలాంటి హాని కలిగించదు. సెక్స్ తరువాత మీ గర్భాశయమునకు ఎక్కువ రక్తం సరఫరా అవటం వలన మరియు మీ గర్భాశయం మృదువుగా అవటం వలన ఈ రక్తస్రావం ఏర్పడుతుంది. మీ వైద్యులతో ఈ విషయం గురించి చెప్పండి, మీరు సెక్స్ ఆపవలసిన అవసరం ఉన్నట్లయితే వారు తెలియచేస్తారు. మీకు ఏదైనా ఆరోగ్య సమయాలు లేదా గర్భస్రావం లాంటి సమస్యలు ఉన్నట్లయితే సెక్స్‌ను తాత్కాలికంగా ఆపడం మంచిది.

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ

గుడ్డు యొక్క ఫలదీకరణ గర్భాశయం బయట అనగా ఫెలోపియన్ ట్యూబ్ (అండాశయము నుండి గర్భకోశమునకు గల నాళ మార్గము) లో జరిగినప్పుడు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కలుగుతుంది. వీటి యొక్క లక్షణాలు : కడుపులో వికారం అనిపించటం, మీ ఉదరంలో క్రామ్ప్స్ రావటం, నొప్పి మరియు మైకము. ఈ నొప్పి తగ్గిపోయినట్టు అనిపించినప్పటికీ ట్యూబ్ లో చీలికలు ఏర్పడితే మల్లి నొప్పి పుట్టవచ్చు. ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఇది ఫెలోపియన్ ట్యూబ్ చీల్చి అంతర్గత రక్తస్రావానికి(ఇంటర్నల్ బ్లీడింగ్) దారితీస్తుంది. ఇటువంటి ఎమర్జెనీ సమయంలో మీకు తరచుగా వైద్య సంరక్షణ అవసరం. మీ గర్భంతో పాటు చీలిపోయిన మీ ఫెలోపియన్ ట్యూబ్‌ని కూడా తీసివేయవలసి ఉంటుంది.

అసాధారణమైన ప్లాసెంటా

గర్భాశయంలోని ప్లాసెంటాలు తక్కువగా ఉన్నప్పుడు ఈ రక్తస్రావం ఏర్పడుతుంది. కొన్ని సార్లు స్వయంచాలకంగా ప్లాసెంటాలు సెట్ రైట్ అవుతాయి. దీనిని ప్లాసెంటా ప్రైవియ అని అంటారు. ఇది చాలా అరుదైన పరిస్థితి. ఈ ప్లాసెంటా ప్రైవియ మీ రెండవ త్రైమాసికంలో రక్తస్రావాన్ని కలిగించవచ్చు. దీనిని కనుకొనేందుకు వైద్యులను సంప్రదించండి. ఈ పరిస్థితి ఉన్నట్లయితే శిశువుకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు మీకు చాలా విశ్రాంతి అవసరం.

ప్లాసెంటాల్ విభజన

ప్లాసెంటాల్ అబ్రప్షన్ అనగా మీ గర్భాశయం గోడలపై ఉన్న ప్లాసెంటా వేరు చేయబడటం. గర్భధారణ సమయంలో రక్తస్రావం కలగటానికి ఇది కూడా ఒక కారణం. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. వీటి యొక్క లక్షణాలు: ఎక్కువ రక్తస్రావం మరియు విపరీతమైన నొప్పి.

దీని యొక్క కారణాలు: ధూమపానం, రక్తపోటు, మూత్రపిండం సమస్యలు, లేదా ప్రీ-ఎక్లంప్సియా. ఈ పరిస్థితికి వైద్య సంరక్షణ వెంటనే అవసరం.

గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లు

ఫైబ్రాయిడ్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఇవి నార వంటి కండరాలు. ఇవి గర్భాశయ గోడల వెలుపల మరియు బయట కనిపిస్తాయి. ఇవి సమస్యాత్మకమైనది కావచ్చు లేదా సమస్య కలిగించక పోవచ్చు. వీటి యొక్క పెరుగుదల, అది పెరిగే స్థానాన్ని బట్టి ఉంటుంది. గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లు ఎక్టోపిక్ గర్భానికి దారి తీయవచ్చు, భారీ రక్తస్రావం, గర్భస్రావం కూడా కలిగించవచ్చు. కొన్నిసార్లు ఎటువంటి సమస్యలూ కలిగించవు, కానీ ముందు జాగ్రత్త కోసం ఒక వైద్యుడిని సంప్రదించటం మంచిది.

గర్భస్రావం

గర్భస్రావం అనేకమంది మహిళలకు గర్భవతి అని కూడా గుర్తించని మొదటి త్రైమాసికంలో జరుగుతుంది. ఇలా జరగటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. గర్భంలోని శిశువుకు హాని కలగడం: స్త్రీ యొక్క శరీరానికి గర్భాన్ని ధరించే శక్తి లేనప్పుడు గర్భస్రావం కలుగుతుంది. మీ మొదటి త్రైమాసికం పూర్తి అయిన తరువాతే మీరు గర్భవతి అని ఖచ్చితంగా నిర్ణయించవచ్చు.

వీటి యొక్క లక్షణాలు: రక్త స్రావం, వెన్నునొప్పి, క్రామ్ప్స్ మరియు కడుపు నొప్పి.

Posted on

Pregnancy stretch marks removal tips in Telugu – ఇంటి నివారణ పద్ధతుల ద్వారా ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ తొలగించటం ఎలా?

స్ట్రెచ్ మార్క్స్ అనేవి ప్రసవం తరువాత ప్రతి మహిళా ఎదుర్కునే సమస్య. గర్భంగా ఉన్నప్పుడు, మీ బరువు పెరగి చర్మం సాగడం వలన ఈ చారలు ఏర్పడతాయి. పొట్ట భాగంలో, తొడల మీద ఇలా చాలా సున్నితమైన ప్రదేశాలలో సాగిన చర్మపు గుర్తులు ఏర్పడతాయి.

స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించడం ఎలా?

స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు కొన్ని సర్జరీల గురించి మీరు వినే ఉంటారు. వాస్కులర్ లేజర్, టంమ్నీ టక్స్ మరియు ఫ్రాక్షనల్ లేజర్ చికిత్స లాంటివి. వీటి వలన అనేక ప్రమాదాలు కలగవచ్చు, కనుక గృహ నివారణలు వాడటమే మంచిది. ఈ మార్క్స్‌ను నిర్మూలించడానికి క్రింద చెప్పిన కొన్ని నివారణ పద్దతులను పాటించండి.

స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు ప్రాకృతిక గృహ నివారణలు

కలబంద

కలబంద గుజ్జును చారల మీద పూసి మృదువుగా మర్దన చేయండి. 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇలా రోజూ చేయడంవలన కొద్ది రోజుల్లోనే చారలు తొలగిపోయి అందమైన మరియు మృదువైన చర్మం పొందుతారు.

తేనె

ఇందులోని యాంటీసెప్టిక్ గుణాలు స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు తోడ్పడతాయి. ఒక వస్త్రంపై తేనె రాసి, ఈ వస్త్రంను చారలపై ఉంచండి. తేనె ఆరిన తరువాత, వెచ్చని నీటితో కడగండి. దీనిని స్క్రబ్ లా కూడా ఉపయోగించవచ్చు. తేనె, ఉప్పు మరియు గ్లిసెరిన్ ను కలిపి చారలపై మృదువుగా మర్దన చేయండి. 5 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి.

షియా వెన్న (షీ బట్టర్)

మీరు షియా వెన్న కలిగి ఉన్న లోషన్‌లను చూసే ఉంటారు. ఇవి మార్కెట్లో లభిస్తాయి. ఈ వెన్న నేచురల్ షెల్ నుండి తయారు చేయబడినందున అద్భుతమైన వైద్య లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ లోషన్‌ను క్రమం తప్పకుండా వాడటం వలన చర్మంపై ఉన్న చారలను తొలగించి స్థితిస్థాపకతను పెంచుతుంది.

చక్కెర

చర్మపు చారలను తొలగించేందుకు చక్కెర ఒక ఉత్తమ సహజ నివారిణి. స్నానం చేసే ముందు ఒక చెంచా చక్కెరను కొద్దిగా బాదాం నూనె మరియు నిమ్మరసంలో కలుపుకొని, చారలపై రాసి కొన్ని నిమిషాలపాటు మర్దన చేయండి. ఇలా ఒక నెల రోజులు చేయటం వలన మీ స్ట్రెచ్ మార్క్స్ తగ్గడాన్ని గమనించవచ్చు.

నూనెలు

స్ట్రెచ్ మార్క్స్ రాకుండా నివారించేందుకు మీరు ఈ పద్దతిని అనుసరించండి. మీరు గర్భిణీ అయ్యే మూడు నెలల ముందు నుంచే నూనెలను మీ కడుపుపై, తొడలపై మరియు రొమ్ములపై రాసి కొద్ది సేపు మృదువుగా మర్దన చేయండి. ఇది మీ చర్మంపై చారలు రాకుండా ఆపుతుంది. మీరు అనేక రకమైన నూనెలను వాడవచ్చు. ఉదాహరణకు ఆముదము, బాదం నూనె, కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, విటమిన్ ఇ నూనె మరియు సుగంధ నూనెలు.

నిమ్మరసం

నిమ్మరసం సహజమైన అసిడిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది మీ చర్మ మొటిమలను, నల్లని మచ్చలను మరియు చారలను తొలగించేందుకు సహాయపడుతుంది. ఒక నిమ్మపండును తీసుకొని సగంగా కోసి, చారలపై మృదువుగా వృత్తాకార కదలికలో రాయండి.10 నిమిషాలు ఉంచి వెచ్చని నీటితో కడగండి. లేదా దోసకాయ రసం మరియు నిమ్మరసాన్ని సమాన మోతాదులలో కలిపి చారలపై పూయవచ్చు.

సుగంధపు నూనెలు

ఒక స్పూన్ జెర్మేనియం, లావెండర్, రోజ్, మైర్ లేదా హెలిచ్రిసం లాంటి ఏదైనా ఒక సుగంధ నూనెని బాదం లేదా కొబ్బరి నూనెలో కలుపుకొని సాగిన చర్మపు గుర్తులపై రాయండి. 30 నిమిషాలపాటు మృదువుగా మర్దన చేయండి. ఇలా కొన్ని రోజులు చేయటం వలన ఇది మీ చర్మ లోతుల్లోకి ప్రవేశించి చారలను పూర్తిగా తొలగిస్తాయి.

నీళ్లు

స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు మరియు ఇతర చర్మపు సమస్యలను తొలగించేందుకు మనం చర్మాన్ని ఉత్తమ హైడ్రేషన్ స్థాయిలలో ఉంచుకోవాలి. రోజూ కొన్ని లీటర్ల నీటిని త్రాగటం వలన చర్మం నిర్జలీకరణ లేదా నిర్విషీకరణ కాకుండా ఉంటుంది. ఇది మీ చర్మంలోని స్థితిస్థాపకతను పునరుద్ధరిస్తుంది. రోజుకు 8-10 గ్లాసుల నీటిని త్రాగటం చాలా మంచిది. అంతే కాదు నీళ్లు మీ చర్మం మృదువుగా ఉండేందుకు తోడ్పడుతుంది. కాఫీ, టీ లేదా సోడా లాంటి పానీయాలను నివారించేందుకు ప్రయత్నించండి.

మాయిశ్చరైజర్

చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచేందుకు మాయిశ్చరైజర్ను వాడండి. మీ చర్మం యొక్క నిర్మాణాన్ని బట్టి మాయిశ్చరైజర్ను ఎంపిక చేసుకోండి. పొడి బారిన చర్మం అయితే కోకో గింజలతో చేసిన మాయిశ్చరైజర్ను వాడండి. జిడ్డు చర్మం అయితే కలబంద లేదా బంక మట్టితో చేసిన మాయిశ్చరైజర్ను వాడండి. మీరు సహజమైన మాయిశ్చరైజర్ను తయారు చేయాలనుకుంటే క్రింద చెప్పిన విధంగా చేయండి.

గోధుమ బీజ చమురు, కలబంద గుజ్జు మరియు ఆలివ్ నూనెలను సమాన మోతాదులలో కలుపుకోండి. మీకు జిడ్డు చర్మం ఉన్నట్లయితే ఇందులో బంక మట్టిని కూడా చేర్చుకోవచ్చు. ఈ మిశ్రమంలో ఎలాంటి రసాయనాలు లేనందున భవిష్యతులో ఎలాంటి సమస్యలు రావు.

గ్లైకోలిక్ యాసిడ్

గ్లైకోలిక్ యాసిడ్ ఒక ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లా, ఇది చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచి సాగిన చర్మపు గుర్తులను తొలగిస్తుంది. ఔషధ దుకాణంలో గ్లైకోలిక్ యాసిడ్ గుళికలు లభిస్తాయి. వీటిని వాడే ముందు ఒక వైద్యుడిని సంప్రదించటం మంచిది.

విటమిన్ ఇ నూనె

చర్మపు చారలను తొలగించేందుకు ఒక అద్భుతమైన విటమిన్, విటమిన్ . విటమిన్ ఇ నూనెని ఏదైనా ఒక మాయిశ్చరైజర్ లో కలుపుకొని స్ట్రెచ్ మార్క్స్ పై రాయండి. దీనిని క్రమంగా వాడటం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

అప్రికోట్ (నేరేడు పండు)

మీరు నేరేడు పండు స్క్రబ్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేరేడు పండు నుండి విత్తనాలను తీసివేసి, దీనిని బాగా చూర్ణం చేసి ఒక ముద్దలా చేసుకోవాలి. తరువాత చారలపై రాసి 15-20 నిమిషాలు ఉంచి వెచ్చని నీటితో కడగండి.

కోడి గుడ్డు యొక్క తెల్లసొన

తెల్లసొనలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. చారలను తొలగించి మీ చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఇది సమర్థవంతమైన పరిష్కారం. రోజుకు 1-3సార్లు మీ చర్యలపై తెల్లసొనను రాయండి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా చేసి చైతన్యం నింపుతుంది. క్రమంగా సాగిన చర్మపు గుర్తులను కూడా తొలగిస్తుంది.

బంగాళదుంప

మీ చర్మం యొక్క స్ట్రెచ్ మార్క్స్‌ను తొలగించేందుకు బంగాళదుంప సమర్ధవంతంగా పని చేస్తుంది. దీనిపై ఉన్న చర్మాన్ని తీసివేసి, చిన్న ముక్కలుగా కోసి, చూర్ణం చేయండి. దీనిని ఒక గుజ్జులా చేసి మీ చర్మంపై పూయండి, లేదా దీని రసాన్ని పిండి చర్మంపై రాయండి. 5-10 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడగండి. ఇందులో పాలీఫెనోల్స్, ఫైటోకెమికల్స్ మరియు కెరోటినాయిడ్లు ఉన్నందున దీనిని కొన్ని నెలలు వాడటం వలన చారలు తొలగిపోతాయి.

డైట్ పరిశీలన

గర్భిణిగా ఉండే సమయంలో సరైన పోషక ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. దీని వలన శిశువు యొక్క ఆరోగ్యం మెరుగు పరచటమే కాదు మీ చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఆపవచ్చు. జింక్, ఐరన్, విటమిన్ కె మరియు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇవి మీ చర్మాన్ని మృదువుగా ఉంచటం వలన చారలు రాకుండా నివారిస్తాయి. గింజలు, లీన్ ప్రోటీన్లు, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను కూడా తినండి.

వ్యాయామాలు

మీరు గర్భిణిగా ఉండే సమయంలో అధిక వ్యాయామాలను చేయలేక పోవచ్చు, కానీ డెలివరీ తరువాత క్రమం తప్పకుండా వ్యాయామాలను అనుసరించడం మంచిది. ఇది సాగిపోయిన మీ చర్మాన్ని ధృఢంగా చేసి, స్థితిస్థాపకతను పెంచేందుకు సహాయ పడుతుంది, ముందుగా మీ కడుపుపై ఉన్న స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గించి తరువాత వీటిని వేర్ల నుండి పూర్తిగా తొలగిస్తుంది.

పసుపు మరియు గంధం

పసుపు మరియు గంధంను మన దేశంలో కొన్ని శతాబ్దాలుగా చర్మ సంరక్షణంకు వాడుతున్నాము. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఈ మిశ్రమాన్ని కొంత కాలం పాటు ఉపయోగించటం వలన చర్మపు చారలు కూడా తొలగిపోతాయి. ముందుగా గంధపు చెక్కను ఇసుక రాయిపై రుద్ది ఒక స్పూన్ పేస్ట్‌ను తయారు చేయండి. రెండు అంగుళాల పసుపు వేరును చూర్ణం చేసి,గంధపు ముద్దలో కలపండి. ఈ మిశ్రమాన్ని చర్యలపై రాసి, 60 శాతం ఎండిన తరువాత మర్దన చేయండి. ఇలా రోజుకు ఒక సారి 6 నెలల పాటు చేయటం వలన స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోతాయి.

పాలు, చక్కెర మరియు పచ్చ కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లను క్రమంగా వాడితే చర్మంపై ఏ రకమైన మచ్చలైనా తొలగిపోతాయి. రెండు స్పూన్ల పచ్చి పాలలో కొన్ని చుక్కల దోసకాయ రసం, కొన్ని చుక్కల నిమ్మరసం మరియు 1/2 స్పూన్ చక్కెరను కలుపుకొని ఒక స్క్రబ్ ను తయారు చేసుకోండి. దీనిని చారలపై రాసి నెమ్మదిగా వృత్తాకారంలో కొద్ది సేపు మర్దన చేసి నీటితో కడగండి. ఈ స్క్రబ్ వారానికి 3 సార్లకన్నా ఎక్కువగా వాడకూడదు.

నీటితో కడిగిన తర్వాత, చర్మాన్ని ఆరపెట్టి తాజా పచ్చ కొబ్బరి నీళ్లను మీ చారలపై పూయండి. ఇది ఎండిన తరువాత కలబంద జెల్ లేదా షీ వెన్నను రాయండి. కొబ్బరి నీళ్లతో మీ చర్మ చారలను రోజుకు 2-3 సార్లు కడగవచ్చు. ఇది ఎలాంటి హాని కలిగించదు.

Posted on

Early signs of miscarriage in Telugu – గర్భస్రావానికి ప్రారంభ సంకేతాలు

మీకు గర్భస్రావం జరిగి ఉండవచ్చు అని తెలుసుకునే సంకేతాల మీద అవగాహన చాలా అవసరం. గర్భస్రావానికి కారణాలు, గర్భస్రావం వలన శారీరకంగా మీలోజరిగే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తల్లి బిడ్డల మధ్య ఉన్న బంధం అనన్యమైనది.  ఒక స్త్రీ ఈ ప్రపంచంలోకి ఒక కొత్త శిశువును ఎంతో ప్రేమ మరియు సంరక్షణలతో స్వాగతిస్తుంది. అది ఎంతో ప్రశంసనీయమైనది. కానీ, ప్రమాదాలు ఎప్పుడూ మీ తలుపు తట్టి రావు ఒక్కోసారి తలక్రిందులౌతాయి. గర్భినిగా ఉన్న కొన్ని నెలలలోపే బిడ్డను కోల్పోకుండా ఉండేందుకు రాబోయే సంకేతాల  మీద అవగాహన కలిగి శరీర ధర్మాలను తెలుసుకుని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

గర్భస్రావం అంటే ఏమిటి?

మీరు సంకేతాల కోసం చూసే ముందు, గర్భస్రావం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక స్త్రీ కడుపులోని పిండము స్వతంత్రంగా మనుగడ సాగటానికి ముందుకు సాగలేకపోతే దానిని గర్భస్రావం అని పిలుస్తారు. ఇది ఒక మహిళ గర్భంతో ఉన్నప్పుడు మొదటి ఇరవై వారాలలోపు ఎక్కువగా గర్భ స్రావం  సంభవిస్తుంది.

అధిక శాతం గర్భిణీ స్త్రీలు తన గర్భస్థ శిశువును కోల్పోయే మొదటి త్రైమాసికంలో, రక్తము గడ్డకట్టిన రూపంలో లేదా కణజాలం రూపంలో యోని నుండి బయటకు ప్రవహిస్తుంది.

గర్భస్రావం జరగరడానికి గల దానికి గల కారణాలు

గర్భిణీ స్త్రీలలో ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల గర్భస్థ శిశువు తరచుగా గర్భాధారణకాలంలో జీవించడంలో విఫలమౌతుంది. అటువంటి కొన్ని ముఖ్యమైన కారణాలను ఇప్పుడు చూద్దాం.

  • మీరు ధూమపానం లేదా మద్యపానం చేస్తూ ఉన్నా, లేదా గర్భిణి స్త్రీ ధూమపాన పొగ ప్రభావానికి గురయినా గర్భస్రావం జరగవచ్చు.
  • మీ వయస్సు వలన కూడా కావచ్చు. తల్లిదండ్రుల వయస్సు 35 సంవత్సరాల వయస్సు కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఆమె గర్భస్రావంను ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయి.
  • మధుమేహం, థైరాయిడ్, అధిక రక్తపోటు మరియు అధిక బరువు వంటి వైద్య పరిస్థితులు కూడా కారణం కావచ్చు.
  • అసాధారణతలు. క్రోమోజోముల అసాధారణతలు పిండాన్ని బలహీనం చేయవచ్చు.
  • యోని ప్రాంతంలో అంటువ్యాధులు ప్రభావితం చేస్తే అది గర్భస్రావంనకు దారితీస్తుంది.
  • కొందరు మహిళలు యాంటీఫస్ఫోలిపిడ్ ప్రతిరక్షక సిండ్రోమ్ కారణంగా గర్భస్రావంతో బాధపడుతున్నారు.
  • స్త్రీ గర్భాశయ గోడలలో సమస్య ఉన్నప్పుడు అది గర్భస్రావం సమస్యకు దారితీయవచ్చు.

గర్భాధారణ సమయంలో కొన్ని ప్రమాదకర సంకేతాలు

మీరు భూమిపైకి మరో ప్రాణాన్ని తీసుకువచ్చే సామర్ధ్యంతో మీరు సిద్దంగా ఉంటే ఈ  ప్రపంచంలోనే అది ఉత్తమమైన అనుభూతి. ఆ జీవితం మీకు మీ భాగస్వామికి మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను అందిస్తుంది. కానీ, తరచూ కొన్ని కుటుంబాలు ఇంత అందమైన భావోద్వేగాన్ని కోల్పోతారు. ఎందువల్ల? ఎందుకంటే ప్రారంభ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే జరుగుతుంది. మీరు గర్భానికి నష్టం కలిగించే సంకేతాలు మీరు తప్పక తెలుసుకోవాలి.

నొప్పి

మీకు మీ వెనుక నరాల రాపిడి వలన నొప్పి రావచ్చు. మీరు అనుకుంటున్నట్లు ఇది సాధారణం కాదు.

రక్తం

మీ యోని నుండి  రక్తము స్రవించడం  మంచి సంకేతం కాదు. దీని వలన రక్తం భారీగా స్రవించడం  లేదా కొన్ని చుక్కలుగా స్రవించడం జరుగుతుంది. అలాంటి సందర్భాలలో మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి. అలాంటి సంఘటనల తరువాత కూడా మహిళలకు ఆరోగ్యకరమైన గర్భం ఉండవచ్చు.  కానీ మీరు దానిని నిర్లక్ష్యం చేయకూడదు.

తిమ్మిరి

మీకు పీరియడ్ సమయంలో పొట్ట భాగంలో తిమ్మిరిలు ఉన్నట్లయితే  అప్పుడు మీరు గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి. గర్భం ప్రారంభంలో లేదా చివరి నెలలలో ఈ విధమైన నొప్పిని కలిగి ఉండటం ఆరోగ్యకరమైనది కాదు.

రంగు

మీ విసర్జన రంగు కూడా మీ గర్భానికి సంభందించిన సంకేతాలను సూచిస్తుంది. అది ముదురు ఎరుపు రంగులో, గులాబీ లేదా గోధుమ రంగులో ఉన్నట్లయితే సమస్యాత్మకమైనది.

కుదుపులు

మీకు గర్భధారణ ప్రారంభ దశలలో కుదుపులు అంతగా గమనించలేరు. కుదుపులు సంభవించిన తర్వాత ఆ సమయాన్ని గమనించడానికి ప్రయత్నించండి. మీకు ప్రతి అయిదు నుండి ఇరవై నిమిషాల తరువాత కుదుపులు ఉండి, ఏదైనా పనిచేసినప్పుడు బాధాకరంగా ఉన్నట్లయితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

కణజాలు

బూడిద రంగులో వున్న కణజాలం యోని నుండి బయటకు వెళ్లిపోతుంది? ఇది చాలా ప్రమాదకరం.

బరువు

గర్భధారణ సమయంలో మీరు బరువును కోల్పోకూడదు. మీరు అలాంటి విషయాన్ని ఎదుర్కొంటుంటే, మీ డాక్టర్ కు కాల్ చేసి, అపాయింట్మెంట్ ను తీసుకోండి.

శ్లేష్మం

శ్లేష్మం మీ మొదటి త్రైమాసికంలో ఉండటం మంచిది కాదు. ఇది కొంచెం పింక్ రంగులో ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు.

భావన

అవును, మీరు గర్భవతిగా ఉన్నప్పుడు ఆ  భావన మీకు సహజంగా ఉంటుంది. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ మీరు గర్భిణీ అన్న భావన మీలో లోపిస్తూ ఉన్నట్లయితే, ఇది చిన్న విషయం కాదు. మీ గైనకాలజిస్ట్ను సంప్రదించండి మరియు మీరు మీ ప్రతి ఆందోళన గురించి అతనికి / ఆమెకు చెప్పండి.

మీరు మీ గర్భం గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు మీ జీవితంలో మంచి సమయాలు మొదలవుతాయి. మీరు భావోద్వేగాలు మరియు భావాలకు అత్యున్నత స్థానంలో ఉంటారు. మీకంటూ మీ స్వంత కుటుంబాన్ని ప్రారంభించే ఆలోచన, మీ శిశువు ఒక అద్భుతమైన వ్యక్తిగా పెరగాలని కోరుకుంటారు. కాబట్టి, మీకు మీరు ఏ విధమైన ప్రమాదాలు లేకుండా మీరు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

Posted on

Pregnancy symptoms in telugu – గర్భధారణ ప్రారంభ సంకేతాలు మరియు లక్షణాలు

మీరు మీ పీరియడ్ ను మిస్ అయ్యారా? మీకు అలసట వంటి సంకేతాలు కనిపిస్తున్నాయా? దీని అర్థం మీరు గర్భవతి కావచ్చనా? పీరియడ్ తప్పినప్పుడు గర్భ పరీక్షలు మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షల ద్వారా మీరు గర్భవతి అవునో, కాదో నిర్ధారిస్తారు. ఏదేమైనప్పటికీ, సంకేతములు మరియు లక్షణాలు ఒక వారములోనే గుర్తించబడతాయి. మీరు నిజంగా గర్భవతి కావచ్చు అనే జీవనసంబంధమైన సూచన వస్తుంది. ఒక స్త్రీ తాను గర్భం దాల్చినప్పుడు కలిగే 10 ప్రధాన లక్షణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇవి మీకు ప్రాధమికంగా సహాయపడతాయి మరియు మార్గదర్శకంగా పనిచేస్తాయి.

పీరియడ్ మిస్ అవ్వడం

గర్భం గుర్తించడానికి ఇది అత్యంత స్పష్టమైన మరియు అనుభవమైన మార్గం. మీరు ఇదివరకు క్రమం తప్పని రుతుక్రమాలను కలిగి ఉన్నవాళ్లు అయితే ఎప్పుడూ సంభవించని జాప్యం మీ ఋతు క్రమంలో ఏర్పడిందా? అయితే అది మీరు గర్భ పరీక్ష చేయడానికి ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా మీకు వేరొక రకంగా వికారం, అలసట మరియు తరచూ బాత్ రూమ్ కి వెళ్ళడం వంటి సూచనలు కనిపిస్తూ కూడా ఉండవచ్చు.

అలసట

ఇది గర్భం యొక్క సాధారణ లక్షణం. దీనికి కారణం ప్రొజెస్టెరాన్ హార్మోన్ యొక్క స్థాయి పెరిగడం. ఈ హార్మోన్ మంచి మోతాదులో ఉండటం వలన మిమ్మల్ని నిద్రలో ఉంచుతుంది.

ముందు జాగ్రత్త – మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మొదటి కొన్ని వారాలు మీరు మంచి నిద్ర మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుదలకు అనుగుణంగా బెడ్ రూమ్ ను చల్లగా ఉంచడం చాలా ముఖ్యం. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు అండోత్సర్గము తరువాత నుండి రెండు వారాల పాటు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.

రొమ్ములు మృదువుగా మారి ఉబ్బటం

హార్మోన్ల మార్పులు కారణంగా మీరు కొన్ని వారాల లోపల రొమ్ములు మృదువుగా మరియు ఉబికినట్లు ఉండటం గమనించవచ్చు. ఈ హార్మోన్లు మీ రొమ్ములు పెరగడానికి కారణమవుతాయి మరియు స్తనములు తిమ్మిరిగా ఉండి భారీగా అనిపిస్తాయి. చనుమొనలో మార్పులు సంభవించి స్తన పరివేషంలో రంగు మరియు పరిమాణంలో మార్పులు గమనించవచ్చు.

ముందు జాగ్రత్త – ఉబికిన మృదు రొమ్ముల కోసం ప్రసూతి బ్రా లను ధరించడం ఎల్లప్పుడూ సూచించదగినది. ఇవి లోపలి నిరోధక తీగలు లేకుండా సౌకర్యవంతంగా ఉంది విస్తరించేందుకు వీలుగా ఉంటుంది.

బ్లీడింగ్ లేదా స్పాటింగ్

గర్భాధారణ జరిగిన 10-14 రోజుల్లో కొద్దిగా బ్లీడింగ్ లేదా స్పాటింగ్ ఉండవచ్చు. ఇది సాధారణమైనది అని అనుకోవద్దు. ఇది ఎండోమెట్రియం (గర్భాశయ అంతర్గత లైనింగ్) లోకి ఫలదీకరణం చేసిన గుడ్డు యొక్క అమరిక వలన సంభవిస్తుంది. ఇది సుమారు మూడు రోజుల పాటు కొనసాగుతుంది మరియు దీనికి చికిత్స అవసరం లేదు.

మూర్ఛ మరియు మైకం

మీరు గర్భం దాల్చినట్లయితే మీ రక్తపోటు హెచ్చుతగ్గులకు గురవుతుంది మరియు విస్తరించిన రక్త నాళాల ఫలితంగా మీరు మైకమును పొందవచ్చు. కళ్ళు తిరగడం, నీరసం కమ్మడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు.

ముందు జాగ్రత్త – మీ వైద్యుడిని సంప్రదించండి మరియు మీ రక్తపోటు స్థాయిని క్రమంగా ట్రాక్ చేయండి. ఆహార ప్రణాళికను అనుసరించండి మరియు నీరు పుష్కలంగా త్రాగడానికి ప్రయత్నించండి. గర్భానికి అనుకూలంగా స్వల్ప వ్యాయామం లేదా యోగ చేయడం మంచిది.

వికారం

వాంతులు, వికారం లేదా ఉదయం లేవగానే నలతగా ఉండటం ఇలాంటి సమస్యలు గర్భిణీ స్త్రీలకు మొదటి రెండు వారాలు లేదా నెల రోజుల తర్వాత ప్రారంభమవుతాయి. దీనిని మార్నింగ్ సిక్నెస్ అని పిలుస్తారు. ఇది రోజులో ఏ సమయంలో అయినా సంభవించవచ్చు. ఈస్ట్రోజెన్ స్థాయిలు కడుపులో వేగంగా పెరగడం వలన సాధారణంగా వాంతులు వంటి భావన ఏర్పడుతుంది. సుగంధ పరిమళాల వాసన, సువాసనలు, ఆహార వాసన మరియు సిగరెట్ల యొక్క వాసన ఎక్కువగా పొందడం వలన వికారం మరియు వాంతుల భావనను మీరు కలిగి ఉండవచ్చు.

ముందు జాగ్రత్త – మీరు వికారం కారణంగా తినలేకపోతే, బలవంతంగా తినకండి. నీటిని పుష్కలంగా త్రాగి మరియు హైడ్రేటెడ్ గా ఉండండి. ఏదైనా ఇబ్బందిగా ఉంటే డాక్టర్ ను సంప్రదించండి.

మలబద్ధకం

కడుపులో ప్రొజెస్టెరాన్ పెరుగుదల వలన ఆలస్యంగా ఆహరం అరుగుదల జరుగుతుంది. కారణంగా జీర్ణ వ్యవస్థ ప్రక్రియలు ఆలస్యంగా జరగడం వలన ఈ పరిస్థితి మలబద్ధకంకు కారణమవుతుంది.

మానసిక కల్లోలాలు

శరీరంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరోన్ యొక్క ప్రవాహ స్థాయి పెరిగిన కారణంగా, మీరు మానసిక కల్లోలంను అనుభవిస్తారు మరియు ఇది గర్భవతి మహిళల్లో చాలా సాధారణ సంఘటన. వేర్వేరు మహిళలు ఈ మార్పులకు భిన్నంగా స్పందిస్తారు. మానసిక భావోద్వేగాల భ్రమణంలో కొన్ని భావోద్వేగాలు మంచివి కావచ్చు లేదా చెడు కావచ్చు, మరికొందరు వీటికి పూర్తి భిన్నమయిన భావోద్వేగాలను కలిగి ఉండవచ్చు.

ముందు జాగ్రత్త – మీరు దుఃఖం, ఆత్రుత, కుమిలిపోవడం లేదా రోజువారీ చర్యలను ఎదుర్కోలేకపోవడం మరియు ఏకాగ్రత సాధ్యం కాకపోతే, వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. ఇది దీర్ఘకాలంలో మీకు మరియు శిశువుకు కూడా సహాయపడవచ్చు.

తరచుగా మూత్ర విసర్జన

హార్మోన్ల మార్పు ఫలితంగా గర్భధారణ సమయంలో మీ మూత్రపిండాలు ద్వారా రక్తం ప్రవహిస్తుంది. అందువల్ల, మూత్రపిండము సాధారణమైన దాని కన్నా ఎక్కువ ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల పిత్తాశయంలో ఎక్కువ ద్రవాలను ప్రేరేపిస్తుంది. అందువల్ల, బాత్‌రూమ్ కు మీరు తరచూ వెళ్ళాలని కోరుకుంటారు.

పెరిగిన హృదయ స్పందన రేటు

గర్భధారణ జరిగి సుమారు రెండు నెలల తరువాత మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. గుండె వేగంగా మరియు క్లిష్టంగా రక్తంను పంపు చేస్తుంది.

ముందు జాగ్రత్త – మీకు ఏవైనా గుండె జబ్బులు లేదా ఇతర హృదయ సంబంధ వ్యాధులు ఉన్నట్లయితే, మీ వైద్యుడిని సంప్రదించండి.

ఇవన్నీ మీరు గర్భవతా లేదా అని నిర్ధారించడానికి సహాయపడే కొన్ని సంకేతాలు. హార్మోన్ల మార్పుల వలన తరచుగా వచ్చే తేలికపాటి తలనొప్పులు కూడా ఇతర సంకేతాలుగా ఉంటాయి. మీరు మీ చర్మం తేమగా లేదా జిడ్డుగా ఉండటం గమనించవచ్చు. ఇది హార్మోన్ల మార్పుల ఫలితం మరియు దీని వలన మోటిమలు విచ్ఛిన్నం కావచ్చు. మొదటి మూడు నెలల తర్వాత ఈ లక్షణాలు చాలా వరకూ తగ్గుతాయని గుర్తుంచుకోండి. ఈ క్రమంలో తగిన అవగాహనా కలిగి పైన పేర్కొన్న సూచనలన్నింటినీ మీరు అనుభవించినట్లయితే, గర్భ పరీక్ష చేయించుకోండి మరియు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Posted on

Symptoms of baby boy during pregnancy in Telugu – మగ బిడ్డ అయితే గర్భవతి లక్షణాలు

అవును ఈ టైటిల్ చదువుతుంటే చాలా ఉత్తేజంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు మీ కడుపులో మోస్తున్న మీ ఆనందాల మూటకు  సంబంధించిన ఎన్నో మధుర అనుభూతులు మిమ్మల్ని ఎంతగానో మైమరపిస్తున్నాయా? అయితే ఈ శీర్షిక మీ ఆనందాలను రెట్టింపు చేస్తూ మీ ఇంట్లో తప్పటడుగులు వేయబోయే మీ ముద్దుల శిశువు రాకకు సంభందించిన కొన్ని ముఖ్యమైన సంకేతాలను మీకు అందిస్తుంది.  

తల్లి కాబోయే ప్రతీ ఒక్క స్త్రీ రాబోయే తమ వారసుల కొరకు ఎంతో ఉత్తేజకరమైన సందర్భాలను తలచుకుంటూ మనసులో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతారు. దానికి  కారణం మరేదో కాదు. రాబోయే తన ముద్దుల బిడ్డ యువరాజు అయి ఉంటాడా లేదా యువరాణి అయి ఉంటుందా అని తెలుసుకోవాలని చిన్న కుతూహలం చాలా సాధారణ విషయం. అయితే దీనిని దగ్గరగా అంచనా వేయడానికి ఇక్కడ మేము మగ శిశువుకి కాబోయే తల్లికి గల కొన్ని లక్షణాలను పొందిపరిచాము. ఇవన్నీ కొందరి విషయంలో మాత్రమే పని చేసే కొన్ని నమ్మకాలు మాత్రమే, ఇవి అందరికీ పనిచేయకపోవచ్చు. కాబట్టి కేవలం వీటిని మాత్రమే పరిగణలోనికి తీసుకోవద్దని అభ్యర్ధన. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని సంతోషంగా మీ కుటుంబం లోనికి మరింత ఆరోగ్యవంతులయిన యువరాణి లేదా యువరాజును హృదయపూర్వకంగా ఆహ్వానించండి.

అధికంగా విశ్వసించే కొన్ని నమ్మకాల వైపు ఇప్పుడు పయనిద్దాం.

గర్భంలో శిశువు స్థానం

తల్లి తన శిశువుని గర్భంలో మోసే స్థితి కూడా శిశువు యొక్క లింగం కొరకు నిర్ధారణ చేస్తుంది. కాబట్టి తల్లి ఒకవేళ గర్భస్థ శిశువుని దిగువ ఉదర స్థానముగా కలిగి ఉన్నట్లయితే అప్పుడు ఆ  శిశువు మగ శిశువు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఉదయకాల అనారోగ్యం

గర్భిణీ స్త్రీ ఉదయకాలాలలో ఎటువంటి తరుచు అనారోగ్యాలు లేకుండా ఉన్నట్లయితే పండంటి మగ బిడ్డకి జన్మనిస్తుందని చెబుతూ ఉంటారు. ఇది ఎక్కువగా గర్భధారణ సమయంలో హార్మోనుల మార్పులవల్ల సంభవిస్తుంది. ఇది మహిళకి మహిళకి మధ్య వేరుగా ఉంటుంది.

గర్భం దాల్చిన సమాయంతో వయస్సు లెక్కింపు

మీ వయస్సుని మీరు గర్భం దాల్చిన నెల సంఖ్యకు జత చేస్తే ఫలితంగా వచ్చే సంఖ్య సరి సంఖ్య అయినట్లయితే  పుట్టబోయే బిడ్డ మగ బిడ్డ .

ఆహార కోరికలు

మీకు తీపి పదార్ధాలకు బదులుగా ఇంపైన కారంగా ఉండే పదార్ధాలపై ప్రీతి కలిగి ఉన్నట్లయితే ఈ లక్షణాలు మగ బిడ్డకు ఆస్కారం కల్పిస్తున్నాయి.

శిశువు యొక్క హృదయ స్పందన వేగం

మీరు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం వెళ్ళినప్పుడు, మీ శిశువు యొక్క హృదయ స్పందన నిమిషానికి 140 సార్లు కంటే తక్కువగా ఉన్నట్లయితే  మీరు ఒక మగ శిశువుని పొందబోతున్నట్లు భావించబడుతుంది.

వాంతులు

మీకు  మొదటి 5 నెలలు భారీగా వాంతులు అవుతూ ఉంటే ఇది కూడా మగ శిశువుని కలిగిన తల్లి యొక్క లక్షణంగా పేర్కొంటారు.  

ముఖంలో కాంతి

మీ ముఖంలో కాంతి తగ్గినట్లు అనిపిస్తే మీరు మగ  బిడ్డకి జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మూత్రం రంగు

స్పష్టంగా హార్మోన్ల ప్రభావం కారణంగా గర్భధారణ సమయంలో మూత్రం యొక్క రంగు మార్పు చెందుతుంది. కానీ ఒకవేళ అది ముదురు పసుపు రంగు ఉంటే అప్పుడు మీ  జూనియర్ మాష్టర్ కు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉండండి.

రొమ్ము పరిమాణం

సాధారణంగా ఎడమ వైపు రొమ్ము యొక్క పరిమాణం ఎప్పుడూ కుడి వైపు కంటే పెద్దదిగా ఉంటుంది. కానీ మీ గర్భధారణ సమయంలో ఎడమ వైపు కంటే కుడి వైపు రొమ్ము పెద్దదిగా ఉన్నట్లయితే ఒక మగ పిల్లవాడిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి!

చల్లటి పాదాలు

మీ పాదాలు చాలా చల్లగా ఉన్నట్లు భావిస్తే  అది మీరు ఒక మగ పిల్లవాడిని పొందే లక్షణం కలిగి ఉన్నారని మన పెద్దవాళ్ళు అంచనా వేస్తారు.

పొడి చేతులు

ఇది వినడానికి కొత్తగా ఉంది కదూ! కానీ అవును,  మీరు చల్లని పాదాలతో పాటు మీ చేతులు పొడిగా ఉన్నట్లయితే, అది ఒక మగ శిశువు అని భావించబడుతుంది.

బరువు పెరగడం

మీ కడుపు చుట్టూ మాత్రమే బరువు పెరుగుతున్నట్లయితే, మీరు ఒక బోసినవ్వుల మగ బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దపడుతున్నారని తెలియజేస్తుంది.

ఇవన్నీ చాలా మంది స్త్రీలు ఎక్కువగా నమ్ముతున్న విశ్వాశాలు. అయితే పైన పేర్కొన్న మార్పులు గర్భాధారణ సమయంలో చాలా సాధారంగా ప్రతీ మహిళకూ కనిపించే లక్షణాలు. అది వారి శరీర తత్వం మరియు హార్మోనుల మార్పుల కారణంగా సంభవిస్తూ ఉంటాయి. ఇది ఒక్కో స్త్రీ విషయంలో ఒక్కోలా ఉండవచ్చు. కాబట్టి ఈ అంచనాలు అన్ని వేలలా పని చేయకపోవచ్చు. కాబట్టి అందమైన తల్లులంతా ఊహిస్తూనే ఉండండి. మీ ఊహలు నిజమయ్యేవరకు వేచియుండండి. వేచి ఉండటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి. మీ బిడ్డ వచ్చే క్షణాలకోసం నిరీక్షణకు ప్రతిఫలంగా ఆ రోజు త్వరలోనే వస్తుంది. స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి.