Posted on

Swine flu tips in Telugu – స్వైన్ ఫ్లూ – లక్షణాలు, కారణాలు మరియు నివారణ పద్ధతులు

స్వైన్ ఫ్లూ ని H1N1 ఫ్లూ మరియు స్వైన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధిని స్వైన్ ఫ్లూ అని పిలవడానికి కారణం, ఇది గతంలో పందులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నవారికి సోకేది. కానీ కొంత కాలానికి పందులతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా అంటువ్యాధివలే సోకడం ప్రారంభమైంది. ఇటీవలే ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వ్యాప్తి చెందింది. మరి ఈ వ్యాధి యొక్క కారణాలు, లక్షణాలు మరియు నివారణ పద్ధతుల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

స్వైన్ ఫ్లూ అంటే ఏమిటి?

స్వైన్ ఇన్ఫ్లుఎంజా అనేది H1N1 అని పిలవబడే ఇన్ఫ్లుఎంజా టైప్ A వైరస్ వలన కలిగే ఒక అంటువ్యాధి. ఇది సాధారణంగా పందులలో కనబడే వైరస్. గతంలో ఈ వ్యాధి పందులలో మరియు వాటి చుట్టూ అధిక సమయం గడిపే వ్యక్తులలో మాత్రమే కలిగేది. కానీ 2009లో, ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాప్తి చెందటం ప్రారంభమైంది.

స్వైన్ ఫ్లూ యొక్క లక్షణాలు

H1N1 వైరస్ శ్వాస అనారోగ్యాన్ని కలిగిస్తుంది మరియు ఇది ఒక అంటువ్యాధి. H1N1 యొక్క లక్షణాలు కాలానుగుణ ఫ్లూ మాదిరిగానే ఉంటాయి మరియు క్రింద చెప్పినటువంటి మరి కొన్ని లక్షణాలు కలిగి ఉండవచ్చు.

 • జ్వరం
 • ఒళ్లు నొప్పులు
 • ఆకలి లేకపోవటం
 • దగ్గు
 • గొంతు మంట
 • తలనొప్పి
 • అలసట
 • రన్నింగ్‌ నోస్
 • కళ్లలో ఇర్రిటేషన్
 • వాంతులు, వికారం, మరియు అతిసారం

స్వైన్ ఫ్లూ కారణాలు మరియు సోకే విధానాలు

స్వైన్ ఫ్లూ అనేది పైన తెలిపినట్లు ఇన్ఫ్లుఎంజా వైరస్ యొక్క ఒక రకం వలన సంభవిస్తుంది. ఇది సాధారణంగా పందులను మాత్రమే ప్రభావితం చేస్తుంది. కానీ ఇటీవలే ఈ వైరస్ సోకిన వ్యక్తుల నుండి మరొక వ్యక్తికి కూడా సోకుతోంది. స్వైన్ ఫ్లూ రావటానికి పంది మాంసం తినటం కారణం కాదు. మీరు మాంసంను శుభ్రంగా కడగటం మరియు పూర్తిగా వండటం చాలా ముఖ్యం.

ఈ వ్యాధి సలైవా మరియు శ్లేష్మ కణాల ద్వారా వ్యాపిస్తుంది. తుమ్ము, దగ్గు మరియు జెర్మ్స్ ఉన్న సర్ఫేస్ ని తాకిన తర్వాత, కళ్ళు లేదా ముక్కును తాకడం ద్వారా ప్రజలలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.

స్వైన్ ఫ్లూ అధికంగా ఎవరికి సోకుతుంది?

 • గర్భిణి స్త్రీలకు
 • 5 ఏళ్ళ లోపు ఉన్న పసిపిల్లలకు
 • 65 ఏళ్ళ పైగా ఉన్న వృద్దులకు
 • ఆస్త్మా తో భాధ పడుతున్నవారికి
 • దీర్ఘకాలిక ఆస్పిరిన్ థెరపీని పొందుతున్న 19 సంవత్సరాల వయస్సులో ఉన్న యువతలకు మరియు పిల్లలకు
 • రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ప్రజలకు (AIDS వంటి వ్యాధి కారణంగా)
 • మరియు డయాబెటిస్స్ ఉన్న వారికి ఈ వైరస్ సులభంగా సోకే అవకాశాలు ఎక్కువ.

స్వైన్ ఫ్లూ నిర్ధారణ

మీ డాక్టర్ మీ శరీరం నుండి సాంపుల్ ఫ్లూయిడ్ ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చు. వైరస్ యొక్క నిర్దిష్ట రకాన్ని గుర్తించడానికి వివిధ జన్యు మరియు ప్రయోగశాల పద్ధతులను ఉపయోగిస్తారు.

స్వైన్ ఫ్లూ చికిత్స

స్వైన్ ఫ్లూ వలన వైద్య సమస్యలు అభివృద్ధి అయ్యేటట్లు ఉంటేనే తప్పా సాధారణంగా ఈ ఫ్లూ కొరకు అధిక వైద్య చికిత్స అవసరం ఉండదు. మీరు చేయాల్సిందల్లా స్వైన్ ఫ్లూ లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు మరియు H1N1 ఇతర వ్యక్తులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవటం మాత్రమే. వైద్యులు ఇందుకు తగిన యాంటీ వైరల్ డ్రగ్స్ ను సిఫార్సు చేస్తారు.

స్వైన్ ఫ్లూ లక్షణాల నుండి ఉపశమనం పొందుటకు

స్వైన్ ఫ్లూ యొక్క లక్షణాలను నిర్వహించే పద్ధతులు సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉంటాయి:

 • అధిక విశ్రాంతి తీసుకోండి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థకు ఇన్ఫెక్షన్ పై పోరాడటానికి మరియు తగిన దృష్టి సారించడానికి సహాయపడుతుంది.
 • నిర్జలీకరణాన్ని నిరోధించడానికి నీటిని మరియు ఇతర ద్రవ పదార్ధాలను పుష్కలంగా త్రాగాలి. సూప్ మరియు ఫల రసాలు కోల్పోయిన మీ పోషకాలను భర్తీ చేయడంలో సహాయపడుతుంది.

స్వైన్ ఫ్లూ యొక్క తీవ్రమైన కేసులు ప్రాణాంతకం కావచ్చు. HIV లేదా AIDS వంటి దీర్ఘకాలిక వైద్య పరిస్థితులతో బాధపడుతున్న వారిలో చాలా ప్రమాదకరమైన కేసులుగా మారుతాయి. స్వైన్ ఫ్లూ ఉన్న సాధారణ వ్యక్తుల్లో అధికశాతం మంది నివారణ పొంది సాధారణ జీవనమును సాగించవచ్చు.

స్వైన్ ఫ్లూ నివారించే పద్ధతులు

స్వైన్ ఫ్లూ నివారించడానికి ఉత్తమమైన మార్గం ప్రతి సంవత్సరం ఫ్లూ టీకాలు వేయించుకోవటం. స్వైన్ ఫ్లూ నివారించడానికి మరి కొన్ని ఇతర సులభమైన మార్గాలు:

 • తరచుగా సబ్బుతో చేతులు శుభ్రపరచడం.
 • టెలిఫోన్స్ మరియు టాబ్లెట్ వంటి ఉపరితలాల మీద వైరస్ జీవించగలదు, కనుక వీటిని తాకిన వెంటనే మీ ముక్కు, నోరు, లేదా కళ్లను తాకకుండా ఉండటం.
 • మీరు అనారోగ్యానికి గురైనట్లయితే పని లేదా పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం.
 • మీరు ఉన్న ప్రదేశంలో స్వైన్ ఫ్లూ అధికంగా ఉన్నట్లయితే పెద్ద సమావేశాలలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవటం.

స్వైన్ ఫ్లూ తో బాధపడుతున్నప్పుడు మరియు స్వైన్ ఫ్లూ ని నివారించేందుకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

 • గుడ్లు, చేప, పాలు, బీన్స్, నట్స్, సీడ్స్ మరియు సోయా ఆధారిత ఆహారాల వంటి ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహారాలను ప్రతి రోజూ కనీసం 3 సార్లు తీసుకోవటం వలన స్వైన్ ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
 • నారింజ రంగు పండ్లు మరియు కూరగాయలు (క్యారట్లు, గుమ్మడికాయలు, ఆప్రికాట్లు మరియు మామిడి) మరియు ఆకుపచ్చ కూరగాయలు (పాలకూర, బ్రోకలీ మరియు క్యాబేజీ). ఈ ఆహారాలలోని విటమిన్ ఎ శ్వాస పొరలను బలపరుస్తుంది.
 • విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు – మిరియాలు, బచ్చలి కూర, సిట్రస్ పండ్లు, బెర్రీలు, మరియు బటానీలు యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి.
 • గుడ్లు మరియు సీ ఫుడ్ (ముఖ్యంగా పీతలు, గుల్లలు మరియు సార్డినెస్), ఇవి స్వైన్ ఫ్లూ సంక్రమణంతో పోరాడటానికి యాంటీ బాడీస్ ని ఏర్పరచటానికి సహాయపడుతుంది.
 • స్వైన్ ఫ్లూ కి వ్యతిరేకంగా యాంటీ బాడీస్ ని నిర్మించే తృణధాన్యాలు మరియు గుమ్మడికాయ విత్తనాలు.
 • యాపిల్స్, బచ్చలి కూర మరియు ఇతర ఆకుకూరలు – వాటిలో అధిక ఐరన్ ఉంటుంది.
 • లవంగం మరియు వెల్లుల్లి – ఇవి స్వైన్ ఫ్లూకు వ్యతిరేకంగా మరొక రక్షణ.
 • మీ రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి విటమిన్ సి ఒక ముఖ్యమైన పోషకాహారం. మీరు ఫ్లూ కలిగి ఉండగా విటమిన్ సి రిచ్ పండ్లను అల్పాహారంగా తీసుకోండి. స్ట్రా బెర్రీస్, టొమాటోలు, మరియు సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.
 • పెరుగు గొంతు ఉపశమనానికి సహాయపడుతుంది మరియు మీ రోగనిరోధక వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. పెరుగులో ప్రోటీన్ కూడా ఉంది. కాని చక్కెర కలపని పెరుగును తీసుకుంటున్నారని నిర్ధారించుకోండి.
 • హైడ్రాటెడ్ గా ఉండటానికి అధిక మొత్తంలో నీరు, హెర్బల్ టీ, తేనె మరియు నిమ్మ టీ మరియు 100 శాతం స్వచ్ఛమైన ఫల రసాలు.

రోగనిరోధక శక్తిని పెంచటానికి మరియు స్వైన్ ఫ్లూ నివారించడానికి మీ ఆహారంలో ఈ ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు చేర్చడానికి తక్షణ చర్య తీసుకోండి.

స్వైన్ ఫ్లూ తో బాధపడుతున్నప్పుడు నివారించాల్సిన ఆహార పదార్థాలు

ఫ్లూ తో బాధపడుతున్న సమయంలో ఏ ఆహార పదార్థాలను నివారించాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం. మీరు ఫ్లూ వ్యాధికి గురైనప్పుడు, క్రింద వాటిని నివారించండి:

 • మద్యం – ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేస్తుంది మరియు నిర్జలీకరణానికి కారణమవుతుంది.
 • కాఫీ, బ్లాక్ టీ మరియు సోడా వంటి పానీయాలు మీ శరీరాన్ని మరింత డిహైడ్రాట్ చేయగలవు.
 • గట్టిగా ఉండే జంక్ ఫుడ్స్ – చిప్స్, డీప్ ఫ్రై చేసిన ఆహారాలు దగ్గు మరియు గొంతు నొప్పిని అధికరిస్తుంది.
 • ప్రాసెస్ చేసిన ఆహారాలు –  ప్రాసెస్ చేసిన ఆహారాలలో తక్కువ పోషకాలు ఉంటాయి. ఫ్లూ తో బాధపడుతున్నప్పుడు వైరస్ కు వ్యతిరేకంగా పోరాడే శక్తిని మరింత పెంచడాన్ని పూర్తి పోషక ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. కనుక ప్రాసెస్ చేసిన ఆహారాలను పూర్తిగా నివారించాలి.

స్వైన్ ఫ్లూ నివారించడానికి అత్యుత్తమ హోం రెమెడీస్

తులసి ఆకులు

ప్రతి రోజు ఉదయం ఐదు తులసి ఆకులను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇది గొంతు మరియు ఊపిరితిత్తులను క్లియర్ గా ఉంచుతుంది. అలాగే మీ రోగనిరోధక శక్తిని బలపరచి అంటువ్యాధులు రాకుండా సహాయపడుతుంది.

గిలొఐ

దీనిని వైద్య పరంగా టినోస్పోర కార్డిఫోలియా అని అంటారు. సాధారణంగా ఈ మొక్క అనేక ప్రాంతాలలో అందుబాటులో ఉంటుంది. ఒక అడుగు పొడవు గల గిలొఐ కొమ్మ మరియు 5-6 తులసి ఆకులను తీసుకొని 15-20 నిమిషాలు నీటిలో మరిగించి రుచి కోసం కొంత నల్ల మిరియాలు, ఉప్పు కలపండి. ఈ నీరు వెచ్చగా అయిన తరువాత వడగట్టి తాగాలి. ఇది మీ రోగనిరోధక శక్తి కొరకు అద్భుతంగా పని చేస్తుంది. ఈ మొక్క అందుబాటులో లేకపోతే, హందార్ద్ లేదా ప్రోసెస్ చేసిన గిలొఐ పొడిని పొందవచ్చు. ఈ కషాయంను రోజుకు ఒకసారి త్రాగాలి.

కర్పూరం

కర్పూరంను నెలలో ఒక్క సారి కాని రెండు సార్లు కాని తీసుకోవాలి. దీనిని పెద్ద వాళ్ళు నీటితో పాటు మింగవచ్చు. పిల్లలకు దీనిని తినడం కష్టంగా ఉంటుంది కాబట్టి బంగాళదుంపల గుజ్జుతో లేదా అరటితో పాటు తీసుకోవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కర్పూరాన్ని ప్రతిరోజూ తీసుకోకూడదు. కానీ ప్రతి సీజన్లో ఒకసారి లేదా నెలకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి.

వెల్లుల్లి

ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను గోరు వెచ్చని నీటితో పాటు మింగాలి. వెల్లుల్లి కూడా మన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

గోరు వెచ్చని పాలు

పాల అలర్జీ లేని వారు, ప్రతి రోజు రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో పసుపును కలుపుకొని త్రాగాలి.

కలబంద

సాధారణంగా కలబంద అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజూ ఒక టీ స్పూన్ అలీ వేరా జెల్ ని నీటిలో కలుపుకొని త్రాగితే మన చర్మం మరియు కీళ్ల నొప్పుల మీద అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాక రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

వేప

వేపలో ప్రత్యేకమైన గాలి శుద్ధి లక్షణాలు ఉంటాయి. అన్ని రకాల ఫ్లూ తో సహా, గాలి ద్వారా వచ్చే అన్ని రకాల వ్యాధుల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. ప్రతి రోజూ 3-5 తాజా వేప ఆకులను నమిలితే రక్తం శుద్ది అవుతుంది.

విటమిన్ సి

సిట్రస్ పండ్లు,ముఖ్యంగా విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆమ్లా (భారత ఉన్నత జాతి పండు రకము) రసంను తీసుకోవాలి.

ప్రతి రోజు ప్రాణాయామం చేయండి

ప్రతి రోజు ఉదయం రెగ్యులర్ గా జాగింగ్ లేదా వాకింగ్ చేస్తే గొంతు మరియు ఊపిరితిత్తులను మంచి స్థితిలో ఉంచటానికి సహాయం చేస్తుంది. ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తుల మీద దాడి చేయకుండా మరియు అన్ని వ్యాధులకు వ్యతిరేకంగా మీ శరీరం యొక్క ప్రతిఘటన అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాక మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది.