
వీక్ ఎండ్ లో స్పెషల్ రెసిపీ ని చేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ ఆశ్చర్యపరచాలనుకుంటున్నారా? మరైతే ఈ ‘ఆలూ కోఫ్తా’ సబ్జీ ని ట్రై చేయండి. దీనిని చపాతీ, రోటి, ఫుల్కా లేదా నాన్ కి సైడ్ డిష్ గా నంచుకు తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఈ స్పెషల్ వంట యొక్క తయారీ విధానాన్ని చూద్దాం.
కావలసిన పదార్థాలు
- తరిగిన ఉల్లిపాయలు – 2
- జీడిపప్పులు – 10
- వెల్లుల్లి – 4
- తరిగిన అల్లం
- నూనె
- రెడ్ చిల్లీ పౌడర్ – 1 టీ స్పూన్
- ధనియాల పొడి – 1 టీ స్పూన్
- కసూరి మేతి – 1 టీ స్పూన్
- టమోటా ప్యూరీ – 1 కప్పు
- ఉప్పు
- పాలు – 1/2 కప్పు
- ఫ్రెష్ క్రీం – 1/2 కప్పు
- తేనె – 1 టీ స్పూన్
- పంచదార – 1 టీ స్పూన్
- బంగాళదుంపలు – 3
- తరిగిన పచ్చి మిర్చులు – 2
- చీస్ – 2 టీ స్పూన్
- కార్న్ ఫ్లార్ – 2 టీ స్పూన్
తయారీ విధానం
- ఒక మిక్సీ జార్ లో 2 తరిగిన ఉల్లిపాయలు, 10 జీడిపప్పులు, 4 వెల్లుల్లిలు, తరిగిన అల్లం వేసుకొని తిక్ పేస్ట్ లా రుబ్బుకోవాలి.
- ఆ తరువాత స్టవ్ పై ప్యాన్ ని ఉంచి 4 టీ స్పూన్ నూనెను పోసి రుబ్బుకున్న పేస్ట్ ని, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 కప్పు టమోటా ప్యూరీ, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు కుక్ చేయాలి.
- ఆ తరువాత మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించాలి.
- ఇప్పుడు అందులో 1/2 కప్పు పాలు, 1/2 కప్పు ఫ్రెష్ క్రీం, 1 టీ స్పూన్ తేనె వేసి 10 నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి.
- మరో సారి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి.
- మిశ్రమం బాగా ఉడికిన తరువాత అందులో 1 టీ స్పూన్ పంచదార వేసి బాగా కలిపి బౌల్ లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు 3 బంగాళదుంపలను కుక్కర్ లో వేసి ఉడికించుకొని తోలు తీసి మ్యాష్ చేసుకోవాలి.
- బాగా మ్యాష్ చేసుకున్న బంగాళదుంపలో చిన్నగా తరిగిన పచ్చి మిర్చీలు 2, 2 టీ స్పూన్ చీస్, 2 టీ స్పూన్ జొన్న పిండి, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
- ఆ తరువాత ఈ మిశ్రమాన్ని కట్లెట్ లాగా రౌండ్ షేప్స్ లో చేసుకొని ఒక ప్లేట్ లో ఉంచుకోవాలి.
- స్టవ్ పై ఒక ప్యాన్ ని ఉంచి 4 టీ స్పూన్ నూనె పోసుకొని, నూనె వేడెక్కిన తరువాత కట్లెట్ లా చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి.
- గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం ఇంతకు ముందే తయారు చేసి పక్కకు పెట్టుకున్న ఉల్లిపాయ జీడిపప్పుల మిశ్రమంలో వేసుకుంటే ఎంతో రుచికరమైన ‘ఆలూ కోఫ్తా’ తయారు!