Posted on

Dengue fever symptoms, causes & treatment in Telugu

అమ్మో... డెంగ్యూనా అని ప్రతి ఒక్కరూ భయపడుతున్న వ్యాధి డెంగ్యూ. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల దేశాలలో మరియు ఉపఉష్ణమండల దేశాలలో ఈ వ్యాధి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రజలను గడగడలాడిస్తున్న రోగాలలో ఇది ఒకటి. ఈ వ్యాధి యొక్క కారణాలు, లక్షణాలు మరియు ఇతర వివరాలను చూద్దాం.

డెంగ్యూ అంటే ఏమిటి?

డెంగ్యూ అనేది దోమల వలన కలిగే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది తీవ్రమైన చలి జ్వరం లేదా  కొన్ని సార్లు తీవ్రమైన డెంగ్యూ అని చెప్పబడే ప్రాణాంతకమైన అవలక్షణాలను కలిగిస్తుంది.

సెంటర్ అఫ్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్యొక్క అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 400 మిలియన్ డెంగ్యూ కేసులు వస్తున్నాయి. ఉష్ణమండల ప్రాంతాలు భారీగా ప్రభావితమయ్యాయి. ఈ సంక్రమణ వలన ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు:

 • సబ్-సహారా ఆఫ్రికా
 • సెంట్రల్ అమెరికా
 • మెక్సికో
 • కరేబియన్
 • పసిఫిక్ ఐలాండ్స్
 • దక్షిణ అమెరికా (అర్జెంటీనా, చిలీ మరియు పరాగ్వే మినహా)
 • సౌత్ ఈస్ట్ ఆసియా (ముఖ్యంగా థాయిలాండ్, సింగపూర్)
 • దక్షిణ చైనా
 • తైవాన్
 • ఆస్ట్రేలియా యొక్క ఉత్తర భాగాలు

తీవ్రమైన డెంగ్యూను డెంగ్యూ హెమోర్రేజిక్ జ్వరం అని పిలుస్తారు. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలతో పాటు, రెండవ సారి లేదా తదుపరి డెంగ్యూ సంక్రమణ వలన డెంగ్యూ హెమోర్రేజిక్ జ్వరం అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ ఇన్ఫెక్షన్లకు కారణమయిన వైరస్ మరియు దోమల గురించి చూద్దాం.

వైరస్

డెంగ్యూ రావటానికి కారణం అయిన వైరస్లు నాలుగు రకాలు. ఇవి ఫ్లవివిరిడే అనే కుటుంబానికి చెందినవి. వీటిలో ఏదైనా ఒక వైరస్ వలన మీకు డెంగ్యూ ఫీవర్ వచ్చినట్లయితే, మీ జీవితాంతం ఆ వైరస్ ని ఎదుర్కొను రోగనిరోధక శక్తి మీ శరీరంలో అభివృద్ధి చెందుతుంది.

కనుక, ఒక సారి సోకిన వైరస్ మల్లీ రెండోసారి సోకదు. కానీ, ఇతర మూడు వైరస్ల వలన మీకు మళ్ళీ డెంగ్యూ ఫీవర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితకాలంలో మొత్తం నాలుగు డెంగ్యూ వైరస్ల వలన ఈ ఇన్ఫెక్షన్ కలిగే అవకాశాలు ఉన్నాయి.

డెంగ్యూ ని వ్యాపించే దోమలు

ఏడేస్ ఏజిప్టిఅనే దోమ డెంగ్యూ కలిగించే వైరస్‌లను ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది ఒక ఆడ దోమ. డెంగ్యూ వైరస్ సోకిన ఏడేస్ ఏజిప్టిదోమ కాటుల ద్వారా మనుషులలో ఈ వైరస్ వ్యాపిస్తుంది.

డెంగ్యూ ఫీవర్ యొక్క లక్షణాలు

ఈ వైరస్ సోకిన మొదటి 2 నుండి 4 రోజుల వరకు ఇది మన రక్తంలో ప్రవహిస్తూ క్రమంగా క్రింద చెప్పిన కొన్ని లక్షణాలను చూపుతుంది.

 • అకస్మాత్తుగా, అధిక జ్వరం (38°C/ 100°F): డెంగ్యూ వచ్చిన వాళ్ళకి జ్వరం వచ్చి పోతూ ఉంటుంది. ఒక్కసారిగా జ్వరం 104 డిగ్రీల ఫారన్ హీట్ వరకు వెళ్తుంది. ఇలా తరచూ ఉంటే వెంటనే వైదున్ని కలవాలి. ఎందుకంటే ఆ జ్వరం డెంగ్యూ కావచ్చు 
 • తీవ్రమైన తలనొప్పి: డెంగ్యూ జ్వరం లక్షణాల్లో ప్రధమమైనది తల నొప్పి. డెగ్యూ వచ్చిన వారికి విపరీతంగా తల నొప్పి ఉంటుంది. తల బరువుగా ఉంటుంది.
 • కళ్ల వెనుక నొప్పి
 • తీవ్రమైన కీళ్ల మరియు కండరాల నొప్పి: ఈ వ్యాధి వస్తే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు అధికంగా వస్తాయి.
 • అలసట
 • వికారం, వాంతులు: డెంగ్యూ జ్వరం వస్తే నోరు ఎండిపోతుంది. ఊరికే దాహం వస్తుంటుంది . కడుపులో కాస్త నొప్పిగా, వికారంగా ఉండటం.. వాంతి అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది.
  ఒక వేళ పై లక్షణాలు గనుక ఎవరికైనా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు. వ్యాధి ఉందో.. లేదో నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే డెంగ్యూ వస్తే ప్లేట్లెట్లు సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అలా ఐతే ప్రాణానికి హాని జరగొచ్చు. 
 • శోషరస వ్యవస్థ చెడిపోవటం
 • రక్తప్రసరణ వ్యవస్థ యొక్క వైఫల్యం
 • చర్మపు దద్దుర్లు : ఇవి జ్వరం ప్రారంభమయిన రెండు నుండి ఐదు రోజుల తర్వాత కనిపిస్తాయి
 • స్వల్ప రక్తస్రావం : ముక్కు రక్తస్రావం, చిగుళ్లలో రక్తస్రావం లాంటివి
 • రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. 

చాలా మందిలో ఈ వ్యాధి యొక్క లక్షణాలు చాలా తేలిక పాటుగా ఉంటాయి, కనుక అది కేవలం మామూలు జ్వరం అని లేదా వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ అని పొరపాటుపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదిడెంగ్యూ హెమోర్రేజిక్ జ్వరంఅనే పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. ఇది భారీ రక్తస్రావం, షాక్ మరియు మరణానికి దారితీయవచ్చు. దీనిని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (DSS)’ అని అంటారు.

పై చెప్పిన లక్షణాలు మీలో కనిపించినట్లయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. డెంగ్యూ వ్యాధిని కనుగొనేందుకు వైద్యులు రక్త పరీక్షలు చేస్తారు.

డెంగ్యూ చికిత్స

డెంగ్యూ జ్వరంకు ప్రత్యేకమైన చికిత్స ఇంకా కనుగొన లేదు. రోగులు వైద్య సలహాలను తీసుకుంటూ, విశ్రాంతి తీసుకోవాలి మరియు పుష్కలంగా ద్రవాలను త్రాగాలి. తీవ్రమైన డెంగ్యూ జ్వరం వచ్చినట్లయితే పూర్తిగా నయం అయ్యే వరకు వైద్యులు మరియు నర్సులచే పూర్తి వైద్య సంరక్షణ తీసుకోండి.

డెంగ్యూ నివారణ పద్ధతులు

డెంగ్యూని నిరోధించడానికి ఇంకా టీకాలను కనుగొన లేదు. దీనికి ఒక ఉత్తమమైన పద్దతి దోమల కాటులను నివారించడం మరియు దోమల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలను చేయండి.

పర్యావరణ నిర్వహణ

మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి రోజు ఇంటిలోని చెత్తను డిస్పోజ్ చేయాలి. ఎక్కడా చెత్త చేరకుండా చూసుకోవాలి. చిన్న చిన్న తొట్లలో లేదా పాత్రలలో నీరు చేరకుండా చూసుకోవాలి. నీటిని సరఫరా చేసే పద్దతులను మార్చాలి. ప్రతి చోటా పైపులను బిగించి వాటి ద్వారా నీటిని సరఫరా చేయాలి. ఇలా చేయటం వలన దోమల ఉత్పత్తి తగ్గుతుంది.

జీవ నియంత్రణ

దోమల యొక్క ఉత్పత్తిని తగ్గించేందుకు నీటిలో చేపలను వదలండి. ఎందుకంటే ఈ చేపలు దోమల యొక్క గుడ్లను తినడం ద్వారా వాటి సంఖ్యను తగ్గించడంలో తోడ్పడుతుంది.

కెమికల్ స్ప్రే

కెమికల్ స్ప్రే ను ఉపయోగించి కూడా దోమలను అరికట్టవచ్చు. కానీ వీటికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ కెమికల్స్ ని మనం తినే ఆహారాలపై ఉపయోగించ కూడదు. ఇవి నిరంతర రక్షణ ఇవ్వనప్పటికీ తక్షణ పరిష్కారాలను ఇస్తాయి.

ఇంటి లోపల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • వీలైనంత వరకు, భారీ నివాస ప్రాంతాల నుండి దూరంగా ఉండండి.
 • ఇంట్లో కూడా మస్కిటో రెపెలెంట్స్ ఉపయోగించండి.
 • బయటకి వెళ్ళేటప్పుడు, పొడవైన స్లీవ్ చొక్కాలు మరియు పొడవైన ప్యాంటులను ధరించాలి.
 • ఇంట్లో ఉన్నప్పుడు, ఎయిర్ కండిషనింగ్‌ను వాడండి.
 • కిటికీ మరియు తలుపు తెరలు సురక్షితంగా మరియు రంధ్రాలు లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోండి.
 • పడుకొనేటప్పుడు దోమ తెరలను ఉపయోగించండి.