Posted on

Easy rangoli designs with flowers & petals in Telugu – ఫ్లవర్స్ అండ్ పెటల్స్ తో ఈజీ రంగోలి డిజైన్స్ – ఫ్లోరల్ రంగోలి

రంగోలి మన భారతీయ సంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన భాగం. మాములుగా వీటిని లివింగ్ రూమ్స్ మరియు కోర్ట్ యార్డ్స్ ప్రాంగణాల్లో వేస్తారు, వీటిలో రంగురంగుల పొడులను ఉపయోగిస్తారు. వీటిని పండుగ సంబరాలలో మరియు చాలా పవిత్ర సందర్భాలలో వేస్తారు.

రంగోలి డిజైన్లు కుటుంబాలలో మంచి అదృష్టాన్ని తెస్తుందని నమ్మకం. చాలా సాధారణంగా ఉపయోగించే డిజైన్లలో కొన్ని పువ్వులు మరియు పూ రేకుల రంగోలీలను చూద్దాం.

పూల రేకులతో ఫ్లోరల్ షేప్ రంగోలి

Petals used to make floral-shaped rangoli

ప్రజలు రంగోలి వేయడానికి పూల రేకులను వాడుతారు. వీటితో రంగోలి డిజైన్లను వేయడం చాలా సులభము, అంతే కాదు చూసేందుకు కూడా చాలా అందంగా ఉంటుంది. మీకు కావాలంటే పూల రేకులకు బదులుగా రెగ్యులర్ రంగుల పొడిని కూడా ఉపయోగించవచ్చు.

మొదట వలయ ఆకారం నుండి ప్రారంభించి స్టార్ డిజైన్‌ని వేయండి. దానికి పచ్చని రంగు బార్డర్ వేసి పచ్చని గడ్డితో నింపండి. దీని చుట్టూ పసుపు రంగు పెటల్స్ తో పెద్ద స్టార్ట్ డిజైన్‌ని వేసి చివరి లేయర్‌ను ఊదా మరియు తెలుపు రంగు పెటల్స్ తో నింపండి.

పూల రేకులతో సులభమైన వెడ్డింగ్ రంగోలి

Easy wedding rangoli with petals

వరుడు మరియు వధువు నడిచి వచ్చే దారిలో సెమీ సర్క్యులర్ ఆకారంలో పూల రేకులతో డిజైన్స్ వేయబడ్డాయి. వీటిలో నాలుగు లేయర్లు ఉన్నాయి. మొదటి అర్ధచంద్రాకారంలో గులాబీ రంగు పువ్వులు, బార్డర్ కోసం తెల్లటి పువ్వులు ఉన్నాయి. తరువాతి లేయర్లో ఎరుపు రంగు రోజా పువ్వులతో సెమీ సర్కిల్ డిజైన్ వేయబడినది మరియు తెలుపు రంగులో మరొక బార్డర్ వుంది. ఇది చాలా సులభం మరియు పెళ్లి లాంటి సందర్భాలలో చూసేందుకు మనోహరంగా ఉంటుంది.

నిజమైన పువ్వులు మరియు దీపాలతో దీపావళి రంగోలి

Diwali rangoli with real flowers & diyas

ఇది గులాబీలతో, మేరిగోల్డ్ మరియు అరళితో వేయబడిన ఒక అందమైన దీపావళి రంగోలి. ఈ డిజైన్ మధ్యలో ఒక బౌల్లో నీళ్లు నింపబడియుంది. ఈ నీటిపై పూల రేకులను వేయటం వలన అవి తేలుతూ అందంగా కనబడతాయి. మధ్యలో ఒక దీపమును ఉంచి మేరిగోల్డ్ మరియు గులాబీ రేకలతో చుట్టూ అలంకరించబడి వుంది. మొదటి పొరలో గులాబీ రేకులు ఉన్నాయి మరియు దానికి పసుపు రంగు పూల బోర్డర్ వేయబడి ఉంది. ఔటర్ లేయర్ కోసం మరింత గులాబీ రేకులతో అలంకరించారు. మీ రంగోలీని ప్రకాశవంతం చేయడానికి మరియు పరిపూర్ణం చేయడానికి దీపాలతో అలంకరించండి.

పువ్వులు మరియు పూల రేకులతో పెళ్లి మండపం ఎంట్రన్స్ వద్ద రంగోలి

Wedding rangoli at the entrance with flowers & petals

ఒక గొప్ప భారతీయ వివాహంలో తప్పనిసరిగా పువ్వులతో వేసిన రంగోలి ఉంటుంది! ఈ డిజైన్ నుండి కొన్ని చిట్కాలను తీసుకోండి. ఇది మేరిగోల్డ్ పువ్వులతో ఎగుడుదిగుడు బార్డరు కలిగి ఉంది. మీరు సరైన బార్డర్ కొరకు పువ్వులను కట్టి బార్డర్‌ను వేయాలి. ఆ తరువాత లోపలి భాగంను పూరించేందుకు పూల రేకులను ఉపయోగించండి.

పూల రేకులతో ఫ్లోటింగ్ రంగోలి

 

Star shape rangoli with petals

ఇవి పెద్దగా తెరిచి ఉన్న బౌల్స్ లో వేయబడిన రంగోలి డిజైన్. బౌల్లో ముందుగా నీటిని నింపి ఆ తరువాత పూల రేకులతో డిజైన్‌ని వేయాలి. మధ్యలో గులాబి పువ్వులతో ప్రారంభించండి మరియు ప్రకాశవంతమైన రంగు పువ్వులతో చుట్టూ అలంకరించండి. బంతి పువ్వు మరియు తెలుపు పువ్వుల రేకులను జోడించండి మరియు చివరికి గులాబీ రేకులను సరిహద్దులలో జోడించండి. ఫ్లోటింగ్ రంగోలీని సరిగా సెట్ చేయాలి, తద్వారా అవి నీటిపై తొలగిపోకుండా ఉంటాయి.

పువ్వులు మరియు రేకులతో వెడ్డింగ్ వాక్ వే రంగోలీ

Floating rangoli with petals

వధువు మరియు వరుడి యొక్క వాక్ వే లో ఇది మరొక రంగోలి డిజైన్. ఇది పసుపు పచ్చటి గడ్డి మీద పసుపు రంగులో వేయబడిన అందమైన డిజైన్. ఈ డిజైన్ లో పెద్ద మరియు చిన్న ‘S’ ఆకారపు ప్యాట్రన్‌ను మీరు గమనించవచ్చు. మీరు ఈ చిట్కాలను ఉపయోగించి ఏదైనా రాబోయే ఈవెంట్లో అద్భుతమైన రంగోలి డిజైన్లను వేయవచ్చు.

పుష్పాలతో పండుగలకు ఫ్లోరల్ రంగోలి

Wedding walkway rangoli with flowers and petals

పండుగ సమయంలో అందమైన రంగోలీ డిజైన్లను వేయాల్సి ఉంటుంది. ఈ డిజైన్లో గడ్డి వంటి ఆకుపచ్చ ఆకులతో అందమైన బేస్ ఉంది. దీనిపై పసుపు మరియు నారింజ రంగు పువ్వుల రెక్కలతో త్రిభుజాకారములో అలంకరించబడి వుంది. ఇవి ఒకదానిపై మరొకటి ఓవర్ లాప్ అయ్యి ఉన్నాయి. బాహ్య భాగంలో తెలుపు, నారింజ మరియు పింక్ వంటి వివిధ రేకులు ఉన్నాయి. చివరిగా వలయాకారములో పసుపు రంగు పెటల్స్ తో ఈ డిజైన్ ని పూర్తి చేశారు.

దీపావళి కోసం పూల రేకులతో పెద్దగా వేయబడిన రంగోలి

Big petaled rangoli for diwali

 

పూల రేకులతో పెద్ద పరిమాణాల డిజైన్లను వేయటం చాలా సులభంగా ఉంటుంది మరియు ఇవి చాలా అందంగా కనబడతాయి. తెల్లటి పూలతో ఒక పెద్ద బేస్‌ని తయారు చేసి, ఆపై మధ్య నుండి అలంకరణ ప్రారంభించండి. పింక్ రంగు పువ్వులను బేస్ పై వేసి, పసుపు బంతితో బార్డర్‌ని వేయండి. త్రిభుజాకార భాగాలను ముందుగా చాక్ తో వేసుకొని తరువాత ఎరుపు గులాబీలతో నింపండి. మరొక లేయర్‌ని ఇలాగే వేయవచ్చు లేదా బార్డర్ వేసి ముగించండి. నారింజ రంగు రేకులతో తెల్లటి లేయర్ చుట్టూ బార్డర్‌ని వేయండి. ఆపై పింక్ పువ్వులతో పెద్ద బార్డర్‌ని వేసి ఆకుపచ్చ వజ్రం ఆకృతులను జోడించవచ్చు.

ఆకర్షణీయమైన తామర పువ్వు మరియు పూల రేకులతో పెద్ద రంగోలి డిజైన్

Big rangoli designs with attractive lotuses & petals

ఇది మరొక పెద్ద రంగోలి, ఇది మధ్యలో ఉన్న తామర పువ్వుల కారణంగా ఆకర్షణీయంగా కనబడుతుంది. ఆకుపచ్చ బేస్ తో ప్రారంభించండి, తెల్ల రేకులను మధ్యలో వుంచి, ఆపై అందంగా అలంకరించడానికి తామర మొగ్గలను వాడండి. నారింజ మరియు పసుపు రంగులో ఉండే రంగురంగుల లేయర్స్ తో కొనసాగించండి. ఊదా రేకులు వేసి, నారింజతో చివరి లేయర్‌ను వేయండి.

పూల రేకులు మరియు దీపాలతో పూజా రంగోలి

Puja rangoli with petals & diyas

ఈ రంగోలి డిజైన్ పూజ సమయంకు సరైనది. మీరు మీ ఆఫీస్ లేదా ఇంట్లో ఏదైనా ప్రత్యేక పూజ చేస్తున్నట్లయితే, ఈ డిజైన్‌ని ప్రయత్నించండి. ఇది చాలా సులభమైనది. ఇందులో పసుపు మరియు నారింజ రంగు పువ్వులు, గులాబీలు మరియు తెలుపు రంగు పుష్పాలు ఉన్నాయి. నారింజ రంగు లేయర్ చుట్టూ రెండు లేయర్స్ ఉంటాయి మరియు లోపల వివిధ రంగులతో అలంకరించబడి ఉన్నాయి.

పూల రేకులతో రంగోలి డిజైన్

Floral rangoli with petaled designs

ఇది ఒక ప్రత్యేకమైన రంగోలి, ఎందుకంటే ఇందులో అనేక రంగుల పూల రేకులను ఉపయోగించారు. మీరు ఇంకో కొన్ని రంగురంగుల పూల రేకులను పొందగలిగితే, మీ డిజైన్‌ను ఇంకా మెరుగుపరుచవచ్చు. డిజైన్ వేసేందుకు, ఔటర్ లేయర్‌ని ముందుగా వేసుకొని ఆ తరువాత పూల రేకులతో దాన్ని నింపాలి. వివాహాలు, పూజలు లేదా ఇతర ప్రత్యేక సందర్భాలలో దీనిని ఎంచుకోండి మరియు అలంకరణను మెరుగు పరచండి.

ఒక బౌల్లో పూల మొగ్గల డిజైన్

Flower buds decorative design in a vessel

మార్కెట్లో లభించే పువ్వులను బట్టి, మధ్యలో ఉంచటానికి ఒక పెద్ద పువ్వును మీరు ఎంచుకోవచ్చు. ఇది వీలయినంత ఎక్కువగా బౌల్లో వ్యాపిస్తుంది, తరువాత మిగిలిన చోటుని పువ్వు మొగ్గలతో నింపవచ్చు. స్ఫుటమైన డిజైన్ చేయడానికి, పువ్వులకు తగిన విధంగా ఒక బౌల్‌ని ఎంచుకోండి, ఇందువలన ప్రధాన పువ్వు మరియు జోడించిన పుష్పాలు చెదరకుండా చక్కగా ఉంటాయి.

పువ్వులతో కార్నర్ రంగోలి డిజైన్

Corner rangoli with flowers

ఈ రంగోలి ఆలోచన చాలా వినూత్నమైనది. ఒక ప్రత్యేకమైన కార్నర్‌ని ఎంపిక చేసుకొని ఒక మట్టి పాత్రను ఉంచి డిజైన్‌ని ప్రారంభించండి. మరింత విస్తరణ కొరకు పూల ఆకృతులను చుట్టూ వేయండి. వీటిని ఏకరీతిలో ఉంచడం వలన డిజైన్‌ని ఆకర్షణీయంగా చేస్తుంది. స్థలాన్ని బట్టి పువ్వులతో అలంకరించండి మరియు ఆకర్షణీయంగా ఉందని నిర్ధారించుకోండి.

దీపాలతో ఫ్లవర్ డిజైన్ రంగోలి

Flower design rangoli design with diyas

ఇది చాలా చక్కని రంగోలీ డిజైన్ మరియు మీరు దీనిని చుక్కలు పెట్టి వేయవచ్చు. మధ్యలో ఉన్న సర్కిల్‌తో ప్రారంభించి మరొక సర్కిల్‌ని వేయండి. లేత ఆకుపచ్చ రంగు పెటల్ ప్యాట్రన్‌ను వేసి వాటి సరిహద్దులను గోధుమ రంగుతో వేయండి. తర్వాత గోధుమ రంగు గల సర్కిల్ చుట్టూ 8 కార్నర్స్ ఉన్న స్టార్ ఆకారాన్ని వేసుకోవాలి. మీరు పూల రేకుల లాంటి ఆకృతులను కూడా వేయవచ్చు మరియు వాటిని విభిన్న పచ్చ రంగులతో నింపండి. చివరిగా ఔటర్ లేయర్లో పూల డిజైన్‌ని వేసి ఎరుపు రంగుతో నింపండి. ఈ డిజైన్‌ని ఆకర్షణీయంగా మార్చేందుకు దీపాలతో అలంకరించండి.

దీపాలతో బ్రైట్ పూల డిజైన్ రంగోలి

Bright floral patterns with diya design rangoli with colors

రంగోలి డిజైన్ ఆకర్షణీయంగా కనిపించటానికి ఫాన్సీ డిజైన్స్ అవసరం లేదు. శుభ్రమైన బేస్ మరియు కొన్ని బ్రైట్ రంగులు కావాలి! మధ్యలో వృత్తాకార డిజైన్ వేసి తరువాత ఆకుపచ్చ రేకులను వేయండి. పసుపు రేకులు భిన్నంగా ఉంటాయి, మరియు ఇవి ఈ డిజైన్‌ని ఆకర్షణీయంగా చేస్తుంది. నీలం రేకులు ఆకుపచ్చ రేకుల వలే ఉంటాయి. ఔటర్ లేయర్లో దీపాలను వేయండి.

దీపాలు, నీలం మరియు గులాబీ రంగులతో రంగోలి డిజైన్

Blue and pink floral patterns with diyas and colors

ఇది పైన చూసిన దాని వలే ఉంటుంది. ఈ డిజైన్ మధ్యభాగంలో మరియు రంగులు వేరుగా ఉంటుంది. డిజైన్‌ని మధ్యలో నుండి ప్రారంభించండి. సెంటర్లో వృత్తాకారంలో పూలను ఉంచండి లేదా పిక్చర్ లో ఉన్నట్టు దీపాలతో అలంకరించండి. తరువాతి లేయర్‌ను హార్టీన్ మరియు ఆకుల ఆకారంలో వేసి పింక్ వంటి రంగులతో నింపండి. మీరు డిజైన్‌ను ప్రకాశవంతం చేయడానికి ఖచ్చితంగా దీపాలను మరియు కొన్ని ఆకులను జోడించాలి!

రంగులతో ఇన్నోవేటివ్ పూల రంగోలి

Innovative floral rangoli with colors

ఇది చక్కనైన రంగోలి వేయటానికి ఒక వినూత్న మార్గం. ఇది మీకు కనిపించేంత కష్టం కాదు. ఫ్లోరల్ ప్యాట్రన్‌ని మొదట వేసుకొని, ఆపై మధ్యలో ఉన్న లైన్‌లను చేయడానికి ఒక పదునైన వస్తువుని ఉపయోగించండి. ప్రకాశవంతమైన షేడ్స్ కొరకు బ్రైట్ రంగులను ఉపయోగించండి. ఇది బహుశా లక్ష్మి పూజ సమయంలో వేయవచ్చు, లేదా ఇతర ఉత్సవాల సమయంలో కూడా ప్రయత్నించవచ్చు.

ఓవర్ లాప్ రంగుల ఫ్లోరల్ డిజైన్

Floral patterns overlapping one another with colors

మొదట నీలం రంగు బేస్‌ని వేసుకొని, డిజైన్‌ని ప్రారంభించండి. ఒక చిన్న సర్కిల్‌ని వేసుకొని దాని చుట్టూ రంగులతో నింపండి. బేస్ డిజైన్ల యొక్క సరిహద్దు రంగుల షేడ్స్ తో కప్పబడి ఉంది, మీకు అది సులభంగా ఉంటే మీరు కూడా అలాగే వేయవచ్చు. వృత్తాకార ప్యాట్రన్‌ ఫ్లోరల్ డిజైన్లో కలిసిపోయి మొత్తం రూపకల్పన చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

రంగులతో సులువైన ఫ్లోరల్ ప్యాట్రన్‌ రంగోలీ

Easy to do floral pattern rangoli with colors

ఈ ఫ్లోరల్ డిజైన్ వేసేందుకు మీకు చాలా సులభంగా ఉంటుంది. మీరు మెరూన్ రంగులో ఉన్న రేకులను మొదట వేయాలి. తర్వాత వరుసలో ఉన్న అర్ధ ఆకారపు రేకులను వేయండి. ప్రకాశవంతమైన రంగులతో వాటిని నింపిన తరువాత అన్ని వైపులా ఆకులు జోడించండి. ఇది అందంగా కనిపిస్తుంది, అంతే కాదు వేయటానికి కూడా చాలా సులువు.

రంగులతో వేయబడిన డబల్ బార్డర్ గల సులభమైన ఫ్లోరల్ రంగోలి డిజైన్

Double bordered easy floral pattern rangoli with colors

మీరు మీ డిజైన్‌ను ఆకర్షణీయంగా చేయాలనుకుంటే, కఠినమైన డిజైన్లను వేయకుండా కేవలం ఎక్స్‌ట్రా బార్డర్‌ని జోడించవచ్చు! మొదట పూల ప్యాట్రన్‌ మరియు ఆకులను వేయండి. పసుపు చుక్కలతో హైలైట్ చేయబడిన కొన్ని స్విరల్స్ ప్యాట్రన్‌ని మీరు చూడవచ్చు. ఆకులు ఆకుపచ్చ బార్డర్ కలిగి ఉండడంతో పువ్వులు ఊదా రంగు కలిగి ఉంటాయి. ఈ డిజైన్ అధిక స్థలాన్ని ఆక్రమిస్తుంది, మరియు మీరు దీన్ని చక్కగా వేయగలిగితే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

సులువైన మరియు చక్కనైన రంగోలి

Easy and neat petaled rangoli

తెలుపు పూలతో లేదా తెలుపు రంగోలి బేస్‌తో చదరపు ఆకారం సరిహద్దులను వేయండి. నాలుగు దిశలలో పూల ఆకృతికి వీలయ్యేలా ఒక వృత్తాకార బేస్‌ని వేసి ప్రారంభించండి. ఈ పూల ఆకృతుల మూలల్లో మరిన్ని రేకుల డిజైన్ వేయండి. పీచ్, నీలం, ఎరుపు మరియు పింక్ లాంటి వైబ్రంట్ రంగులతో ఈ రంగోలి ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

చుక్కల రంగోలి డిజైన్

Dotted rangoli design

కొన్నిసార్లు, మనం సులభంగా మరియు చక్కగా రంగోలి డిజైన్ వేయాలని అనుకుంటే చుక్కల రంగోలి డిజైన్లను ఎంచుకోవాలి. ఈ రంగోలి డిజైన్ చదరపు బార్డర్ మరియు పూల రేకుల ప్యాట్రన్‌తో నింపబడి వుంది. మీకు నచ్చిన రంగులను మీకు అనుగుణంగా ఉపయోగించి ఈ డిజైన్‌ను పూరించండి.

పెద్ద ఫ్లోరల్ రంగోలి డిజైన్స్

Big floral rangoli designs

మీరు పెటల్స్ లోపల వేసే రంగులతో మీ డిజైన్‌ని మరింత ఆకర్షణీయంగా చేసుకోవచ్చు. మొదట గులాబీ రంగును వేసి తరువాత మిగిలిన రంగులను వాడండి. ఇతర పెటల్స్ సగం ప్యాట్రన్‌ మాత్రమే ఉన్నాయి మరియు అవి బేస్ డిజైన్‌తో లింక్ అయ్యి ఉన్నాయి. ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండేలా వేయండి. డిజైన్‌ని ఆకర్షణీయంగా చేయడానికి వైబ్రంట్ రంగులను ఉపయోగించండి.

ప్రిట్టీ దీపావళి రంగోలి

Pretty diwali rangoli

ఈ చిత్రంలో మీరు చూస్తున్న రంగుల ‍వంటిదే దీపావళి పండుగ. పింక్, పసుపు, నారింజ, దీపావళిలో సాధారణంగా ఉపయోగించే కొన్ని రంగులు. ఈ రంగులు సాధారణ డిజైన్‌ని కూడా అందంగా కనిపించేలా చేస్తుంది. మీరు బార్డర్లను వేసిన తరువాత రంగులను నింపండి.